
సాక్షి, చిత్తూరు: దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని ఎమ్మెల్యే రోజా సవాలు విసిరారు. శనివారం ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తన స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు దురాలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. భావితరాల భవిష్యత్ కోసం సీఎం జగన్ ఆలోచిస్తున్నారని రోజా పేర్కొన్నారు.