
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలన్నీ పచ్చి అబద్ధాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పదేళ్ల పాలనలో ఆయన సర్కారు సాధించిందేమీ లేకపోవడం వల్లే ఇలా జనం దృష్టి మళ్లించేందుకు ప్రయతి్నస్తున్నారని విమర్శించారు. ‘‘కాంగ్రెస్‌పై పసలేని ఆరోపణలు, విమర్శలు తప్ప మంగళ, బుధవారాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో ఆయన చేసిన ప్రసంగంలో మరేమీ లేదు.
ఎన్డీఏ అంటేనే నో డేటా అవేలబుల్ (ఏ గణాంకాలూ అందుబాటులో లేవు)! రాజ్యాంగంపై నమ్మకమే లేని వ్యక్తులు దేశ స్వాతంత్య్రం కోసం ముందుండి పోరాడిన కాంగ్రెస్‌కు దేశభక్తి గురించి నీతులు చెబుతున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. అసమర్థ పాలనతో అన్ని రంగాల్లోనూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ మోదీపై నిప్పులు చెరిగారు. యూపీఏ హయాంలోని అభివృద్ధికి క్రెడిట్ కొట్టేస్తున్నారు.