
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్‌లో ఓటమి భయం నెలకొందని, అందువల్లే పోలీసుల సాయంతో బీజేపీ నాయకులపై దాడు లుచేయిస్తున్నారని బీజేపీ నేత తరుణ్ ఛుగ్ ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువల గురించి ప్రసంగాలు చేసే కేసీఆర్, తెలంగాణలో మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ ప్రభు త్వానికి గుడ్‌బై చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఛుగ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని తన నివా సంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బండి పాదయాత్ర ఆగదని, త్వరలో నాలుగు, ఐదో విడత యాత్ర చేపడ్తామని, ప్రతి గ్రామానికి వెళ్లి, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.