
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించి ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాట్ కమిన్స్ కెప్టెన్‌గా తన తొలి వరల్డ్‌కప్ సాధించి, ఓ వినూత్న ఘనత సాధించాడు. పెళ్లైన మరుసటి ఏడాదే వన్డే ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్‌గా దిగ్గజాల సరసన చేరాడు. గతంలో రికీ పాంటింగ్ (2003), మహేంద్ర సింగ్ ధోని (2011), ఇయాన్ మోర్గన్‌లు (2019) పెళ్లైన మరుసటి ఏడాదే ప్రపంచకప్ సాధించిన ఆటగాళ్లుగా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా కమిన్స్ వీరి సరసన చేరి అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
Who should get married in 2026?🤔 pic.twitter.com/RtVJ8PGUuf
— CricTracker (@Cricketracker) November 20, 2023
కాగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్‌లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్‌కు గెలుపును దూరం చేశాడు.
వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు.