india vs australia
-
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది చివర్లో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు అక్టోబర్ 19న ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది హోం సమ్మర్ షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా నిన్న (మార్చి 30) విడుదల చేసింది. ఈసారి హోం సమ్మర్లో ఆస్ట్రేలియా ప్రతి రాష్ట్రాన్ని, టెరిటరీని కవర్ చేస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.భారత్‌తో సిరీస్‌లకు ముందు ఆస్ట్రేలియా సౌతాఫ్రికాకు ఆతిథ్యమివ్వనుంది. సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాతో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఆగస్ట్ 10న ఈ సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్‌లతో డార్విన్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం పునఃప్రారంభం కానుంది. 17 ఏళ్ల క్రితం ఈ గ్రౌండ్లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. 2008లో ఈ మైదానం బంగ్లాదేశ్‌ను హోస్ట్ చేసింది. డార్విన్‌లో ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో తొలి రెండు టీ20లు ఆడనుంది. ఆతర్వాత మూడో టీ20, తొలి వన్డే కెయిన్స్‌లో జరుగనున్నాయి. చివరి రెండు వన్డేలు మెక్‌కేలో జరుగుతాయి.సౌతాఫ్రికాతో సిరీస్‌ల తర్వాత ఆసీస్ భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతుంది. ఈ రెండు సిరీస్‌లకు మధ్య దాదాపు రెండు నెలల గ్యాప్ ఉంది. భారత్‌తో సిరీస్‌ల అనంతరం ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే విడుదల చేశారు. నవంబర్ 21న తొలి యాషెస్ టెస్ట్ పెర్త్‌లో జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా, భారత్‌లతో టీ20 సిరీస్‌లను ప్లాన్ చేసింది.ఆస్ట్రేలియాలో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్..ఆగస్ట్ 10- తొలి టీ20- డార్విన్ఆగస్ట్ 12- రెండో టీ20- డార్విన్ఆగస్ట్ 16- మూడో టీ20- కెయిన్స్ఆగస్ట్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- కెయిన్స్ఆగస్ట్ 22- రెండో వన్డే (డే అండ్ నైట్)- మెక్కేఆగస్ట్ 24- మూడో వన్డే (డే అండ్ నైట్)- మెక్కేఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్‌అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్‌అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్‌బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్‌నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్‌నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్ -
BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
ఆటగాళ్ల కుటుంబ సభ్యులను విదేశీ పర్యటనలకు అనుమతించే విషయంలో తమ నిర్ణయం మారదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పష్టం చేసింది. జట్టుతో పాటు బోర్డుకు కూడా ఇదే మంచిదని పేర్కొంది. ఈ విషయంలో ఆటగాళ్లకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని.. అయితే, తాము జట్టు ప్రయోజనాల కోసం కఠినంగా వ్యవహరించక తప్పదని తెలిపింది.ఈ మేరకు బోర్డు తరఫున.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) తమ స్పందన తెలియజేశారు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్ గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. 3-1తో ఓడి ఇంటిబాటపట్టింది.ఈ పరాభవం తర్వాత.. విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై బీసీసీఐ కఠిన నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నలభై ఐదు రోజుల్లోపు విదేశీ పర్యటనలో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కుటుంబ సభ్యులను వారం రోజులు మాత్రమే అనుమతిస్తారు.విరాట్ కోహ్లి ఘాటు విమర్శలుఅంతకు మించి పర్యటన కొనసాగితే రెండు వారాల పాటు సన్నిహితులకు అక్కడే ఉండే వెసలుబాటు ఉంటుంది. అయితే, ఈ విషయంలో టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సన్నిహితులే సగం బలమని.. ఆటగాడి విజయం వెనుక కుటుంబ సభ్యుల పాత్రను అందరికీ వివరించలేమని పేర్కొన్నాడు.మైదానంలో దిగని వాళ్లు, అక్కడ ఏం జరుగుతుందో తెలియని వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిరాశ కలిగించిందని కోహ్లి ఘాటుగా విమర్శించాడు. ప్రతి ఆటగాడు తన కుటుంబ సభ్యులు వెంట ఉంటే మరింత బాధ్యతగా ఆడతారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ విషయంలో యూటర్న్ తీసుకోనుందనే వార్తలు వచ్చాయి.బీసీసీఐకి, దేశానికి ఇదే మంచిదిఅయితే, అలాంటిదేమీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా కొట్టిపడేశారు. ‘‘మేము ప్రవేశపెట్టిన నిబంధనలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు చేయడం లేదు. బీసీసీఐకి, వ్యవస్థకి, జట్టుకు, దేశానికి ఇదే మంచిది.ఈ అంశంలో ఆటగాళ్ల నుంచి భిన్నాభిప్రాయాలు, మిశ్రమ స్పందన వస్తుందని తెలుసు. ఇక్కడంతా ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి.. ఎవరైనా తమ గొంతును వినిపించవచ్చు. తమ భావాలను నిర్భయంగా పంచుకోవచ్చు.అయితే, ఈ నిబంధన విషయంలో అందరు ఆటగాళ్లూ సమానమే. జట్టులోని ప్రతి సభ్యుడు, కోచ్‌లు, మేనేజర్లు, సహాయక సిబ్బంది.. ఇలా అందరికీ రూల్స్ వర్తిస్తాయి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం.రాత్రికి రాత్రే హడావుడిగా ఈ విధానాన్ని మేము ప్రవేశపెట్టలేదు. దశాబ్దాలుగా జరుగుతున్న విషయాలను పరిగణనలోకి తీసుకుని మా అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఈ పాలసీ తీసుకువచ్చారు. నిజానికి గతంతో పోలిస్తే విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై మేము ఆటగాళ్లకు చాలా వరకు మినహాయింపులు ఇచ్చాం. అయితే, ఇప్పుడు ఈ రూల్ కాస్త కఠినంగా అనిపించినా.. తప్పక అమలు చేస్తాం’’ అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ -
‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’: గావస్కర్ ఫైర్.. రిపీట్ చేసిన పంత్!
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఐపీఎల్ -2025 (IPL 2025)కి సన్నద్ధమవుతున్నాడు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) సారథిగా బరిలోకి దిగనున్నాడు. ఈ ఉత్తరాఖండ్ ఆటగాడి కోసం లక్నో ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది.సమతూకంగాతద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన క్రికెటర్‌గా పంత్ నిలిచాడు. ఇక ఈ సీజన్లో తాము రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగబోతున్నామన్న పంత్.. సీనియర్లు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అందుబాటులో ఉండటం తమకు సానుకూలాంశమని పేర్కొన్నాడు. ‘‘జట్టులోని ప్రతి ఒక్కరు తమ నైపుణ్యాలను ప్రదర్శరించే విధంగా.. తమలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికి తీసేలా.. అందుకు తగ్గట్లుగా డ్రెసింగ్ రూమ్ వాతావరణం ఉండేలా మేము చూసుకుంటున్నాం. మా మేనేజ్మెంట్ అన్ని రకాలుగా ఆటగాళ్లకు అండగా ఉంటుంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు నిక్కీ, మార్క్రమ్, మిల్లర్ ఉండటం మాకు కలిసి వస్తుంది’’ అని పంత్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో తమ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.Oh Captain… My Captain! 💙 pic.twitter.com/Qkite1n4bh— Lucknow Super Giants (@LucknowIPL) March 17, 2025 ఇదిలా ఉంటే.. ఓ బ్రాండ్ షూట్లో భాగంగా రిషభ్ పంత్ వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ తనను ఉద్దేశించి విమర్శించిన మాటలను పునరావృతం చేస్తూ పంత్ వ్యాఖ్యానించడంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియా గడ్డ మీద రిషభ్ పంత్‌కు మంచి రికార్డు ఉన్న విషయం తెలిసిందే. అయితే, గతేడాది కంగారూ దేశ పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పంత్ తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. 'ముఖ్యంగా మెల్బోర్న్ టెస్టులో అతడు అవుటైన తీరు విమర్శలకు దారి తీసింది. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో పంత్ వికెట్ పారేసుకున్న తీరుపై కామెంటేటర్ గావస్కర్ తీవ్ర స్థాయిలో అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’ అంటూ పంత్ తీరును విమర్శించాడు.రీక్రియేట్ చేసిన పంత్ఇప్పుడు అదే మూమెంట్‌ను పంత్ రీక్రియేట్ చేశాడు. తనదైన శైలిలో.. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ‘‘ఎన్నోసార్లు నిన్ను సమర్థించి, నీకు మద్దతుగా నిలిచిన గావస్కర్ సార్నే ఇలా ఇమిటేట్ చేసి అవమానిస్తావా?’’ అంటూ కొంత మంది కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఐకానిక్ మూమెంట్‌ను పంత్ క్యాష్ చేసుకుంటున్నాడు. ఇందులో గావస్కర్‌ను అవమానించిట్లు ఏమీ లేదు’’ అని పంత్‌కు సపోర్టు చేస్తున్నారు.Rishabh Pant recreating the 'Stupid, Stupid, Stupid!' of Sunil Gavaskar. 🤣pic.twitter.com/JhrK34luWh— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2025 కాగా గతేడాది ఐపీఎల్లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 446 పరుగులు చేశాడు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. జట్టును ఆరో స్థానంలో నిలిపి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఇక ఈసారి మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌తో పంత్ తన కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. చదవండి: అతడిపై నిషేధం.. బీసీసీఐ నిర్ణయం సరైందే: మొయిన్ అలీ -
బుమ్రా ఒక అద్బుతం.. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం: ఆసీస్ క్రికెటర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (2024-25)ని 3-1 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో భారత్ ఓటమి పాలైనప్పటికి.. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అతడి బౌలింగ్ ప్రదర్శనకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు.బుమ్రా.. ఓవరాల్‌గా 32 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. తాజాగా టీమిండియా పేస్ గుర్రంపై ఆస్ట్రేలియా యువ బ్యాటర్ నాథన్ మెక్‌స్వీని ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా అద్భుతమైన బౌలర్ అని అతడు కొనియాడాడు. అదేవిధంగా బుమ్రా బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఈ ఆసీస్ యువ క్రికెటర్ వెల్లడించాడు."బుమ్రాను ఎదుర్కొవడం చాలా కష్టం. బీజీటీలో అతడి నుంచి నాకు కఠిన సవాలు ఎదురైంది. అతడు బౌలింగ్‌ను ఆర్ధం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాను. బుమ్రా ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. ఈ విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఎప్పుడూ అతనిని ఎదుర్కోలేదు.బహుశా నేను విఫలమవడానికి ఇదొక కారణం కావచ్చు. బుమ్రాకు అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. బంతిని ఏ ప్రాంతంలో సంధిస్తే బ్యాటర్ ఇబ్బంది పడతాడో అతడికి బాగా తెలుసు. అందుకే అతడిని ఎదుర్కొవడం అంత సులువు కాదు. ఈ సిరీస్‌లో నేను ఒక్కడినే కాదు మా జట్టులోని ఇతర ఆటగాళ్లూ సైతం బుమ్రాపై పైచేయి సాధించలేకపోయారు. నాకు అదికాస్త ఆత్మవిశ్వాసం ఇచ్చింది అని విల్లో టాక్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెక్‌స్వీనీ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌లో మెక్‌స్వీనిని మూడు టెస్టుల్లో 4 సార్లు బుమ్రానే ఔట్ చేశాడు. ఇక ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టులో బుమ్రా వెన్ను గాయం తిరగబెట్టింది. దీంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు దూరమయ్యాడు. ప్రస్తుతం ఏన్సీఎలో ఉన్న జస్ప్రీత్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IPL 2025: రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్.. సంజూ ఇంకా బెంగళూరులోనే? -
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త. ఆ జట్టు యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఫిట్నెస్ సాధించాడు. జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాడు.ఈ క్రమంలో నితీశ్ రెడ్డి ఆదివారం సన్‌రైజర్స్ జట్టుతో చేరనున్నాడు. కాగా గతేడాది ఐపీఎల్లో సత్తా చాటి ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచాడు ఈ విశాఖపట్నం కుర్రాడు. రైజర్స్ తరఫున బరిలోకి దిగిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ 13 మ్యాచ్‌లలో కలిపి 303 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుఇందులో రెండు అర్ధ శతకాలు ఉండటం విశేషం. అదే విధంగా.. మూడు వికెట్లు కూడా తీశాడు ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్. ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన నితీశ్ రెడ్డి గతేడాది అక్టోబరులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఈ 21 ఏళ్ల ఆటగాడు.. అనూహ్య రీతిలో అదే ఏడాది టెస్టుల్లోనూ రంగప్రవేశం చేశాడు.కంగారూ గడ్డపై శతకంతో..ఏకంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కించుకున్న నితీశ్ రెడ్డి.. కంగారూ గడ్డపై అదరగొట్టాడు. ముఖ్యంగా సీనియర్లంతా విఫలమైన వేళ మెల్బోర్న్లో శతకం సాధించి క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. అయితే, ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన నితీశ్.. దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు.18.1 పాయింట్లుపక్కటెముకల నొప్పి కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన నితీశ్ రెడ్డి.. ఇప్పటి వరకు మైదానంలో దిగలేదు. ఈ క్రమంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందిన అతడు.. యో-యో టెస్టు పాస్ అయ్యాడు. బెంగళూరులోని NCAలో నిర్వహించిన పరీక్షలో నితీశ్ 18.1 పాయింట్లు సాధించాడు. ఈ క్రమంలో క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందిన అతడు ఆదివారం సన్‌రైజర్స్ శిబిరంలో చేరనున్నాడు.కాగా తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడిన నితీశ్ రెడ్డి.. 298 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తీశాడు. అదే విధంగా నాలుగు టీ20లలో కలిపి 90 రన్స్ చేసిన నితీశ్.. మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లలో కలిపి 303 పరుగులు సాధించడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు.రన్నరప్ఇదిలా ఉంటే.. గతేడాది ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ టైటిల్ పోరులో మాత్రం ఓడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈ ఏడాది మార్చి 23న సొంతమైదానం ఉప్పల్‌లో రైజర్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌తో తమ ఐపీఎల్-2025లో ప్రయాణం మొదలుపెట్టనుంది. కాగా కోల్‌కతా- బెంగళూరు మధ్య పోరుతో మార్చి 22 నుంచి తాజా ఎడిషన్ ఆరంభం కానుంది.చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టులు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? -
బుమ్రా ఇకపై మరింత తెలివిగా వ్యవహరించాలి: ఆసీస్ దిగ్గజం వార్నింగ్
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah )ను ఉద్దేశించి ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ కీలక సూచనలు చేశాడు. గాయాలతో సావాసం చేస్తున్న ఈ రైటార్మ్ బౌలర్.. కెరీర్ పొడిగించుకోవాలంటే జిమ్‌లో మరింతగా కష్టపడాలన్నాడు. రోజురోజుకు వయసు పెరుగుతున్న కారణంగా మునుపటిలా త్వరగా కోలుకునే అవకాశాలు తక్కువ.. కాబట్టి గాయాల బారిన పడకుండా తనను తాను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా పేస్ దళ భారం మొత్తాన్ని బుమ్రా తన భుజాలపై మోసిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (Border- Gavaskar Trophy)లో ఐదు టెస్టులకు గానూ.. రెండింటిలో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా అదనపు భారం వల్ల బుమ్రాకు వెన్నునొప్పి తిరగబెట్టింది.ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లకూ దూరంఫలితంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) మొత్తానికి బుమ్రా దూరమయ్యాడు. అయితే, ప్రధాన బౌలర్ లేకపోయిన్పటికీ.. ఈ వన్డే టోర్నీలో టీమిండియా దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడిన కారణంగా స్పిన్నర్లను ఎక్కువగా ఉపయోగించుకుని విజయవంతమైంది. ఈ మెగా ఈవెంట్లో చాంపియన్‌గా అవతరించింది.ఇదిలా ఉంటే.. బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోనేట్లు సమాచారం. ఈ క్రమంలో ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. బుమ్రా ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. స్పష్టంగా ఏ రోజు నుంచి, ఏ మ్యాచ్‌కు అతడు ఆడేది చెప్పనప్పటికీ.. ఏప్రిల్ రెండో వారంలో బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వారం, వచ్చే నెల మొదటి వారం రోజుల్లో జరిగే ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లకు బుమ్రా గైర్హాజరు కానున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పునరావాస శిబిరంలో ఉన్న పేసర్ వెన్నుగాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో ఆసీస్ దిగ్గజ పేసర్ గ్లెన్ మెగ్రాత్ మాట్లాడుతూ.. ‘‘మిగతా పేసర్లతో పోలిస్తే బుమ్రా తన శరీరాన్ని ఎక్కువగా కష్టపెడతాడు. శరీరాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాడు. అయితే, దానిని ఎలా మేనేజ్ చేసుకోవాలో అతడికి బాగా తెలుసు. కానీ దురదృష్టవశాత్తూ అన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు.ఇకపై మరింత తెలివిగా వ్యవహరించాలిగతంలో చాలాసార్లు గాయాల నుంచి అతడు బయటపడి.. సరికొత్త ఉత్సాహంతో పునరాగమనం చేశాడు. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది.. జిమ్‌లో ఎంతగా కష్టపడాలి అనే విషయాలపై అతడికి స్పష్టత ఉంది. కానీ రోజురోజుకూ వయసు పెరుగుతున్న కారణంగా.. ఫిట్నెస్ కాపాడుకునేందుకు అతడు ఇంకాస్త కఠినంగా శ్రమించాలి.మైదానం వెలుపలా కష్టపడాలి. మరింత స్మార్ట్‌గా ఉండాలి. ఫాస్ట్ బౌలర్ నడిచే కార్ లాంటివాడైతే.. అందులో ఇంధనం ఉన్నంత వరకే ముందుకు వెళ్తుంది. నిజానికి బుమ్రాతో పోలిస్తే నా ఫ్యూయల్ ట్యాంకు పెద్దది. ఎందుకంటే.. అతడిలా నేను అతి వేగంతో బౌలింగ్ చేయను.ముందుగా చెప్పినట్లు.. బుమ్రా తన శరీరాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాడు కాబట్టే.. పనిభారాన్ని తగ్గించుకోవడం కూడా ముఖ్యం. అతడు లేకుంటే టీమిండియా అనుకున్న ఫలితాలు రాబట్టలేదు. కాబట్టి బుమ్రాను కాపాడుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ కూడా ఉంది’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాంగ్ కూడా బుమ్రా గురించి ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. -
టీమిండియాకు అదనపు ప్రయోజనం.. ఆ విమర్శలతో ఏకీభవిస్తా: స్టార్క్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో టీమిండియా ఒకే వేదికపై ఆడటంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, మైకేల్ ఆథర్టన్ తదితరులు భారత జట్టుకు అదనపు ప్రయోజనాలు చేకూరాయని వ్యాఖ్యానించారు. ‘హోం అడ్వాంటేజ్’మరోవైపు.. రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓటమి తర్వాత ప్రొటిస్ స్టార్ డేవిడ్ మిల్లర్ (David Miller) కూడా ఇదే మాట అన్నాడు. ఈ సందర్భంగా తాను ఫైనల్లో న్యూజిలాండ్‌కే మద్దతు ఇస్తానని కూడా మిల్లర్ పేర్కొన్నాడు. తాజాగా.. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ‘హోం అడ్వాంటేజ్’పై స్పందించాడు. మిగతా జట్లతో పోలిస్తే రోహిత్ సేనకు కొంతమేర లాభం చేకూరిందని.. ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియాకు మేలు జరిగిందన్న వాదనలతో తాను ఏకీభవిస్తానని తెలిపాడు. న్యాయంగానే గెలిచారుఅదే సమయంలో.. భారత జట్టు ఈ టోర్నీలో ఎలాంటి మోసానికీ పాల్పడలేదని.. న్యాయంగానే వాళ్లు గెలిచారని స్టార్క్ వ్యాఖ్యానించడం విశేషం. ‘‘ఒకే స్టేడియంలో తమ మ్యాచ్‌లన్నీ ఆడటం వల్ల కలిగే లాభాల గురించి రోజూ చర్చ జరుగుతూ ఉంది. అయితే, ఇండియా మాత్రం దుబాయ్ తమకు తటస్థ వేదిక అని వాదించేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది.ఏదేమైనా టీమిండియా నిజాయితీగా ఈ టోర్నీలో గెలిచింది. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలోనూ సుదీర్ఘకాలంగా వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. అయితే, ఈ టోర్నీ విషయంలో వాళ్లపై వస్తున విమర్శలు సబబే అనిపిస్తోంది. సెమీ ఫైనల్ ఆడేందుకు న్యూజిలాండ్ పాకిస్తాన్‌కు వెళ్లింది.ఆ తర్వాత వెంటనే ఫైనల్ కోసం దుబాయ్‌కు వచ్చింది. పాకిస్తాన్ ఆతిథ్య దేశమే అయినప్పటికీ వాళ్లూ టీమిండియాతో ఆడేందుకు దుబాయ్‌కు రావాల్సి వచ్చింది. డేవిడ్ మిల్లర్ కూడా ఈ విషయంపై మాట్లాడాడు. అప్పటికప్పుడు విమాన ప్రయాణం చేయడం సులువు కాదని.. తమకు కలిగిన అసౌకర్యం గురించి చెప్పాడు.ఆ విమర్శలతో ఏకీభవిస్తాఏదేమైనా ఒక జట్టు ఎలాంటి ప్రయాణాలు లేకుండా.. ఒకే చోట ఉండి ఆడటం వల్ల కచ్చితంగా లాభపడుతుంది. కాబట్టి.. నేను ఈ విషయంలో టీమిండియాపై వ్యక్తమవుతున్న అభిప్రాయాలతో కచ్చితంగా ఏకీభవిస్తా’’ అని స్టార్క్ ఫెంటాస్టిక్స్టీవీతో పేర్కొన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. బీసీసీఐ మాత్రం భారత జట్టును అక్కడకు పంపేందుకు నిరాకరించింది.భద్రతా కారణాల వల్ల తమకు తటస్థ వేదికపై ఆడే అవకాశం ఇవ్వాలని ఐసీసీని కోరగా.. ఇందుకు సమ్మతి లభించింది. ఈ నేపథ్యంలో దుబాయ్‌లోనే రోహిత్ సేన తమ మ్యాచ్‌లన్నీ ఆడింది. అయితే, టీమిండియాతో మ్యాచ్‌ల కోసం ఇతర జట్లు దుబాయ్- పాకిస్తాన్ మధ్య ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఇక ఈ వన్డే టోర్నమెంట్లో భారత్ గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసింది.సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. చాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా అవతరించింది. ఇక ఈ టోర్నీలో భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ విజయం సాధించడం విశేషం.ఆ సత్తా భారత్‌కు మాత్రమే ఉందిఈ నేపథ్యంలో స్టార్క్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. భారత్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు చాలా మంది ఉన్నారని, రిజర్వ్ పూల్ సత్తా అసాధారణమని ప్రశంసించాడు. ఒకేరోజు టీ20, వన్డే, టెస్టు మ్యాచ్‌లను ఆడే సత్తా భారత్‌కే ఉందని చెప్పాడు. ‘మూడు వేర్వేరు ఫార్మాట్లలో మూడు జట్లను ఒకేరోజు మైదానంలో దింపగలిగే సామర్థ్యం ప్రపంచ క్రికెట్లో ఒక్క భారత దేశానికి మాత్రమే ఉంది.ఆసీస్‌తో టెస్టు, ఇంగ్లండ్‌తో వన్డే, దక్షిణాఫ్రికాతో టీ20 ఆడగలదు. ఇదేదో ఆషామాషీగా కాదు! అంతర్జాతీయ క్రికెట్ పోటీకి ఏమాత్రం తగ్గకుండా మూడు టీమిండియా జట్లు ఆడగలవు. ఈ సామర్థ్యం, సత్తా మరే దేశానికి లేదు’ అని స్టార్క్ పేర్కొన్నాడు. ప్రపంచ లీగ్ క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అగ్రగామిగా వెలుగొందడం వల్లే ఇంతటి అనుకూలతలు వచ్చాయా అన్న ప్రశ్నకు స్టార్క్ ఆసక్తికర సమాధానమిచ్చాడు.కేవలం ఐపీఎల్ వల్ల కాదు..ఇండియన్ ప్రీమియర్ ‘ఒక్క ఐపీఎల్ వల్లే ఈ సానుకూలతలని నేననుకోను. మేమంతా (క్రికెటర్లందరూ) కూడా ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్‌లు ఆడుతున్నాం. కానీ భారత క్రికెటర్లు మాత్రం ఒక్క ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న సంగతి మరవొద్దు. ఇక్కడ చూడాల్సింది అనుకూలతలు కావు. రిజర్వ్ బెంచ్ సత్తా. భారత క్రికెట్లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడే బలగం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.రోజు రోజుకీ పోటీ క్రికెటర్లు దీటుగా తయారవుతున్నారు. ఐపీఎల్ ఒక పెద్ద టోర్నీ. కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ అంతకుమించిన ప్రతిభ కూడా ఉంది. అదే భారత క్రికెట్ బలగం అవుతోంది’ అని చెప్పాడు. మిగతా క్రికెటర్లు ఏడాదికి ఐదారు లీగ్‌లు ఆడుతున్నారని, మరి వారి దేశాల్లోనూ, ఆయా దేశాల్లోనూ లీగ్‌లు జరుగుతున్నప్పటికీ ఒక్క ఐపీఎల్‌కు పరిమితమైన దేశంలోనే పెద్ద సంఖ్యలో క్రికెటర్లు వెలుగులోకి రావడం గొప్ప విశేషమని స్టార్క్ వివరించాడు.చదవండి: BGT: ‘నేను జట్టులో ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ’ -
BGT: ‘నేను ఆడితే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలిచిన టీమిండియా దాదాపు రెండున్నర నెలల విరామం తర్వాత మైదానంలో దిగనుంది. ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్‌లో వెళ్లనున్న ఈ టూర్లో భాగంగా ఇంగ్లిష్ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది.వరుస ఓటములుకెప్టెన్గా రోహిత్ శర్మ(Rohit Sharma)కు, హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌కు ఇది విషమ పరీక్ష కానుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ అత్యుత్తమంగా కొనసాగుతున్నా.. కొంతకాలంగా టెస్టుల్లో మాత్రం తేలిపోతోంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్ కావడం.. ఆస్ట్రేలియా గడ్డపై ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో ఓడిపోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో సత్తా చాటితేనే రోహిత్- గంభీర్ జోడీకి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమని చెప్పాడు. అంతేకాదు.. ఆసీస్‌తో టెస్టుల్లో తాను ఆడి ఉంటే హ్యాట్రిక్ కొట్టేవాళ్లమని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘క్రికెటర్‌గా జాతీయ జట్టుకు ఆడాలని నాకూ ఉంటుంది. ఇంగ్లండ్‌తో తదుపరి టెస్టు సిరీస్‌కు నేనైతే సిద్ధంగానే ఉన్నాను. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తూనే ఉన్నాను.ఒకవేళ జట్టుకు నా అవసరం ఉంటే.. కచ్చితంగా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతా. దేశవాళీ క్రికెట్లో నేను విరామం లేకుండా ఆడుతూనే ఉన్నాను. అంతేకాదు.. గత రెండేళ్లుగా కౌంటీల్లోనూ ఆడుతున్నా. భారీ స్థాయిలో పరుగులు రాబడుతున్నా.నేను ఆడితే కచ్చితంగా గెలిచేవాళ్లంకాబట్టి నాకు గనుక ఈసారి అవకాశం వస్తే కచ్చితంగా.. దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటా’’ అని పుజారా రెవ్‌స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక దశాబ్దకాలం తర్వాత టీమిండియా ఆసీస్‌కు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోవడం గురించి ప్రస్తావన రాగా.. ‘‘అవును.. నేను నమ్మకంగా చెప్పగలను.. ఒకవేళ నేను జట్టులో ఉంటే కచ్చితంగా మేము హ్యాట్రిక్ కొట్టేవాళం. ఇందులో సందేహమే లేదు’’ అని పుజారా పేర్కొన్నాడు.ఇక సొంతగడ్డపై ఆడటం ఇంగ్లండ్‌కు సానుకూల అంశమే అయినా ఈసారి టీమిండియాకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పుజారా అభిప్రాయపడ్డాడు. ‘‘ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ రిటైర్ అయిన తర్వాత ఆ జట్టు బలహీనపడింది. వారిద్దరు తుదిజట్టులో లేకుంటే ప్రత్యర్థి జట్టుకు మంచిదే కదా! ఈసారి టీమిండియా కచ్చితంగా మంచి స్కోర్లతో విజయం సాధిస్తుంది’’ అని పుజారా ధీమా వ్యక్తం చేశాడు.కాగా విదేశీ గడ్డపై ముఖ్యంగా ఆసీస్‌లో టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్ నెగ్గడంలో ఛతేశ్వర్ పుజారాది కీలక పాత్ర. అయితే, వరుస వైఫల్యాల నేపథ్యంలో ఈ ‘నయా వాల్’కు అవకాశాలు తగ్గిపోయాయి. చివరగా అతడు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో టీమిండియాకు ఆడాడు. ఆస్ట్రేలియాతో నాటి పోరులో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత పుజారా దేశీ, కౌంటీ క్రికెట్‌కు పరిమితమయ్యాడు.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? -
CT 2025: రికార్డులు బద్దలు.. సరికొత్త చరిత్ర! ఏకంగా 11 వేల కోట్లకు పైగా..
భారత్‌లో క్రికెట్ ఓ ‘మతం’ లాంటిది.. వేదిక ఏదైనా టీమిండియా ఆడుతోందంటే అందరూ టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఆ వెసలుబాటు లేని వాళ్లకు డిజిటల్ మీడియా రూపంలో ప్రత్యామ్నాయం ఉండనే ఉంది. ఇక ఇటీవల జరిగిన మెగా ఐసీసీ ఈవెంట్ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జియోహాట్‌స్టార్(JioHotstar)లో ప్రత్యక్ష ప్రసారం అయిన విషయం తెలిసిందే.11 వేల కోట్ల నిమిషాలకు పైగాఈ నేపథ్యంలో తాజాగా ఈ టోర్నమెంట్ వ్యూయర్‌షిప్‌నకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ వన్డే టోర్నీకి 540.3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక వాచ్ టైమ్ ఏకంగా 11 వేల కోట్ల నిమిషాలకు పైగా నమోదు కావడం విశేషం. అంతేకాదు.. ఓవరాల్‌గా 6.2 కోట్ల మంది వ్యూయర్స్ ఈ మెగా ఈవెంట్‌ను వీక్షించినట్లు బ్రాడ్‌కాస్టర్ వెల్లడించింది.కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించారు. నాటి ఫైనల్లో టీమిండియాపై గెలిచి పాకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకుంది. అయితే, అప్పటి నుంచి సుదీర్ఘకాలం పాటు ఈ టోర్నీని వాయిదా వేశారు. ఈ క్రమంలో 2025లో తిరిగి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్(Pakistan) ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల వల్ల దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడింది.కాగా పాకిస్తాన్లో 1996 తర్వాత ఓ ఐసీసీ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇక ఫిబ్రవరి 19న పాకిస్తాన్లో మొదలైన ఈ వన్డే ఈవెంట్ మార్చి 9న భారత్- న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా ఫైనల్‌తో ముగిసింది. హిట్‌మ్యాన్ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ఇక ఈ టోర్నమెంట్లో రోహిత్ సేన ఆది నుంచి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్... సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.తద్వారా హిట్‌మ్యాన్ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేరింది. మరోవైపు.. ఈ వన్డే టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టును చిత్తు చేసి గెలుపు నమోదు చేయడం విశేషం. ఇక వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆసీస్‌పై రన్నరప్ టీమిండియా ప్రతీకారం తీర్చుకోవడం కూడా హైలైట్‌గా నిలిచింది.ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చాంపియన్స్ ట్రోఫీ-2025ని కోట్లాది మంది వీక్షించడంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 540 కోట్లకు పైగా వ్యూస్ రావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్' 18 నెట్‌వర్క్‌లో టీవీలో ప్రసారాలు జరుగగా.. జియోహాట్‌స్టార్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. అత్యధిక వ్యూస్ ఆ మ్యాచ్కేకాగా మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌కు అత్యధిక వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ పోరుకు ఏకంగా 124.2 కోట్ల వీక్షణలు వచ్చాయి.కాగా మొత్తంగా చాంపియన్స్ ట్రోఫీకి వచ్చిన వ్యూయర్షిప్లో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి 38 శాతం మేర వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఇక వైఫై సాయంతో మ్యాచ్ వీక్షించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు ఉంది. కాగా 16 మాధ్యమాల్లో చాంపియన్స్ ట్రోఫీని ప్రసారం చేశారు. తొమ్మిది భాషల్లో కామెంట్రీ ఇచ్చారు.ఇక ఈ మెగా టోర్నీలో గెలవడం ద్వారా భారత్ ఖాతాలో ఏడో ఐసీసీ టైటిల్ చేరింది. 1983 వన్డే వరల్డ్‌కప్, 2002లో శ్రీలంకతో కలిసి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచకప్, 2025 చాంపియన్స్ ట్రోఫీలను భారత్ గెలుచుకుంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పాల్గొన్నాయి. దుబాయ్‌తో పాటు కరాచీ, లాహోర్, రావల్పిండి ఇందుకు వేదికలు.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? -
అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లే: కివీస్ మాజీ పేసర్ వార్నింగ్
న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్( Shane Bond) భారత క్రికెట్ జట్టు యాజమాన్యానికి కీలక సూచన చేశాడు. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పై పనిభారం తగ్గించాలని సూచించాడు. లేదంటే ప్రపంచకప్ నాటికి అతడు అందుబాటులో ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా క్రికెటర్లలో గాయాల బెడద ఎక్కువగా ఉండేది ఫాస్ట్‌బౌలర్లకే.బుమ్రా కూడా ఇందుకు అతీతం కాదు. గతంలో చాలాసార్లు అతడు వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2022 వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు దూరమయ్యాడు. ఏడాది పాటు జట్టు అతడి సేవలను కోల్పోయింది. అనంతరం వన్డే వరల్డ్‌కప్-2023 నాటికి తిరిగి జట్టుతో చేరిన బుమ్రా.. టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.తాత్కాలిక కెప్టెన్‌గా ఆ తర్వాత కూడా జట్టుతో కొనసాగిన ఈ రైటార్మ్ పేసర్.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మరోసారి గాయపడ్డాడు. కంగారూ దేశ టూర్లో భాగంగా తొలి టెస్టుకు, ఆఖరి టెస్టుకు బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలో చివరిదైన ఐదో టెస్టులో భాగంగా వెన్నునొప్పితో విలవిల్లాడిన బుమ్రా ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకున్నాడు.ఇక ఈ టూర్ ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా బుమ్రా కోలుకోలేదు. ఫిట్నెస్ సాధించని కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి దూరమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో కివీస్ మాజీ పేసర్ షేన్ బాండ్ మాట్లాడుతూ... ‘‘అతడొక విలువైన బౌలర్. వచ్చే వరల్డ్‌కప్‌లో అతడి పాత్ర కీలకం.అయితే, త్వరలోనే టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడబోతోంది. నేను గనుక టీమిండియా మేనేజ్మెంట్ స్థానంలో ఉంటే.. అతడిని వరుసగా రెండు టెస్టుల్లో ఆడించను. ఐపీఎల్ తర్వాత వెనువెంటనే వరుస టెస్టులు ఆడించడం పెద్ద రిస్క్.అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లేఅలా కాకుండా మధ్యలో కాస్త విశ్రాంతినిస్తే అతడు ఫిట్‌గా ఉండేందుకు అవకాశం ఉంది. మిగతా ఫార్మాట్లలోనూ ఆడగలుగుతాడు. జట్టులోని ప్రధాన, అత్యుత్తమ బౌలర్ ప్రతిసారి గాయం వల్ల ప్రతిష్టాత్మక ఈవెంట్లకు దూరం కావడం మంచిదికాదు.ఒకవేళ అతడు మరోసారి ఇదే తరహాలో గాయపడితే మాత్రం.. కెరీర్‌కే ఎండ్‌కార్డ్ పడే ప్రమాదం ఉంది. కాబట్టి అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకేచోట పదే పదే గాయమైతే సర్జరీ చేసినా ఉపయోగం ఉండదు’’ అని టీమిండియా యాజమాన్యాన్ని హెచ్చరించాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో షేన్ బాండ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా చివరగా ఆసీస్‌తో టెస్టుల్లో టీమిండియా తరఫున బరిలోకి దిగిన బుమ్రా.. ఐదు మ్యాచ్‌లలో కలిపి 32 వికెట్లు తీశాడు. అయితే, ఈ సిరీస్‌లో భారత్ 3-1తో కంగారూల చేతిలో ఓడిపోయింది. ఇదిలా ఉంటే.. బుమ్రా లేకుండానే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. దుబాయ్‌లో ఐదుగురు స్పిన్నర్లతో రంగంలోకి దిగి విజేతగా అవతరించింది. ఇక బుమ్రా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా.. -
ఏకైక ‘శత్రువు’ను అతడు జయించేశాడు: భారత మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్(KL Rahul)పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడాడని.. భారత్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలవడంలో అతడి పాత్ర మరువలేనిదని కొనియాడాడు. తన ‘శత్రువు’ని జయించి రాహుల్ తన విలువేమిటో మరోసారి చాటుకున్నాడని ప్రశంసించాడు.వికెట్ కీపర్ బ్యాటర్‌గా సేవలు అందిస్తున్న కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా, మిడిలార్డర్లో నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా యాజమాన్యం చెప్పినట్లుగా నడుచుకునే క్రమంలో ఎప్పుడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుందో అతడికే తెలియని పరిస్థితి.కూల్‌గా, పక్కా ప్రణాళికతోముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా అతడి సేవలను వాడుకున్న తీరు దారుణమని నవజ్యోత్ సింగ్ సిద్ధు లాంటి వాళ్లు బీసీసీఐని విమర్శించడం గమనార్హం. అయితే, కేఎల్ రాహుల్ మాత్రం తాను ఏ స్థానంలో ఆడినా కూల్‌గా, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో భారత్ విజయం సాధించడానికి.. విరాట్ కోహ్లితో పాటు ఈ కర్ణాటక బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్ కూడా ప్రధాన కారణం. సెమీస్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో వచ్చి 34 బంతుల్లో 42 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక న్యూజిలాండ్‌తో ఫైనల్లోనూ అతడు అదరగొట్టాడు. 33 బంతుల్లో 34 పరుగులు సాధించి.. మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. నిజానికి వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో రాహుల్ రాణించాడు.అయితే, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాటి ఫైనల్లోనూ అర్ధ శతకం సాధించాడు. అయితే, 107 బంతుల్లో కేవలం 66 పరుగులే చేయడంతో.. భారత్ ఓటమికి అతడి స్లో ఇన్నింగ్స్ కూడా ఓ కారణమని కొంతమంది విమర్శించారు. అయితే, చాంపియన్స్ ట్రోఫీలో అతడు తన శైలిని మార్చుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తూ సరైన షాట్ల ఎంపికతో పరుగులు రాబట్టి.. టీమిండియా గెలుపుల్లో భాగమయ్యాడు.ఏకైక ‘శత్రువు’ను అతడు జయించేశాడుఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడాడు.‘‘వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ నుంచి రాహుల్ ‘స్లో ఇన్నింగ్స్’ భారం మోస్తున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి అతడు మాట్లాడుతూ.. ఆ ఇన్నింగ్స్ తాలూకు చేదు అనుభవం తనను వేటాడుతూ.. పదే పదే పాత గాయాన్ని గుర్తు చేస్తుందని చెప్పాడు.ఇక ఇప్పుడు సెమీస్, ఫైనల్లో అతడి ప్రదర్శన వల్ల కచ్చితంగా సంతృప్తి పడి ఉంటాడు. నిజానికి కేఎల్ రాహుల్‌కు బౌలర్లు ‘శత్రువులు’ కారు. అతడికి ఉన్న ఏకైక ‘శత్రువు’ అతడి మెదడే. తన ఆలోచనా విధానం వల్లే అతడు ఒత్తిడిలో కూరుకుపోయి ఉంటాడు.అయితే, ఇప్పుడు ఆ భారాన్ని జయించి.. సంయమనం పాటిస్తూ చక్కటి షాట్లతో అలరించాడు. అతడి ప్రయాణం గొప్పగా సాగుతోంది’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో కేఎల్ రాహుల్ ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఇన్నింగ్స్ ఆడి 140 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేటు 97.90. ఐసీసీ ప్రకటించిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లేయింగ్ ఎలెవన్‌లోనూ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం సంపాదించాడు.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు View this post on Instagram A post shared by ICC (@icc) -
ఎక్కడైనా టీమిండియాదే గెలుపు!.. ఇచ్చిపడేసిన పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్
టీమిండియాపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం(Wasim Akram) ప్రశంసలు కురిపించాడు. వేదిక ఏదైనా రోహిత్ సేనకు తిరుగులేదని.. అద్భుత ప్రదర్శనతో విజయాలు సాధిస్తున్న తీరు అమోఘమని కొనియాడాడు. ఎల్లవేళలా తమ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌లకు సంపూర్ణ మద్దతు ప్రకటించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అనుకున్న ఫలితాన్ని రాబట్టగలిగిందని ప్రశంసించాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులు దక్కించుకోగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌లపై గెలిచి టైటిల్ సాధించింది.బీసీసీఐ అనుసరించిన విధానాల వలనే..అయితే, ఒకే వేదికపై ఆడటం భారత్‌కు సానుకూలంగా మారిందనే విమర్శల నేపథ్యంలో పాక్ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ వసీం అక్రం తనదైన శైలిలో స్పందించాడు. బీసీసీఐ అనుసరించిన విధానాలే టీమిండియా జైత్రయాత్రకు కారణమని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘ప్రస్తుత భారత జట్టు ప్రపంచంలోని ఏ వేదికపై ఆడినా కచ్చితంగా గెలుస్తుంది.ఒక్క ఓటమి కూడా లేకుండాదుబాయ్లో ఆడినందుకు టీమిండియా లాభపడిందని చాలా మంది అంటున్నారు. కానీ పాకిస్తాన్లో ఆడినా రోహిత్ సేన టైటిల్ గెలిచేది. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత జట్టు కూడా అన్ని టీమ్స్ మాదిరే వివిధ వేదికలకు ప్రయాణాలు చేసింది. మరి అజేయంగానే చాంపియన్‌గా నిలిచింది కదా! ఒక్క ఓటమి కూడా లేకుండా ట్రోఫీని ముద్దాడింది.ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టుకు నిలకడకు ఇది నిదర్శనం. రోహిత్ శర్మ నాయకత్వ పటిమకు ఇదో కొలమానం. న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీమిండియా టెస్టు సిరీస్‌లో కనీవినీ ఎరుగని రీతిలో 3-0తో వైట్‌వాష్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో.. పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.అంతకు ముందు శ్రీలంకకు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. ఇలాంటి సమయాల్లో బోర్డుపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కెప్టెన్, కోచ్‌లను తొలగించాలనే డిమాండ్లు వస్తాయి. అయితే, బీసీసీఐ మాత్రం తమ సారథికి, శిక్షకుడికి అన్ని వేళలా పూర్తి మద్దతుగా నిలిచింది. అందుకు తగ్గ ఫలితాన్ని చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్‌గా నిలవడం ద్వారా పొందింది’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.మూడోసారి ఈ ఐసీసీ టైటిల్‌ను కైవసంకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మూడోసారి(2002, 2013, 2025) ఈ ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దుబాయ్‌లో ఆదివారం రాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(40 బంతుల్లో 53 నాటౌట్) రాణించడం ద్వారా నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో రెండు, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకం(83 బంతుల్లో 76)తో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక్క విజయం కూడా లేకుండా నిష్క్రమించడం గమనార్హం.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ TEAM INDIA ARE CHAMPIONS AGAIN! 🏆🇮🇳#ChampionsTrophyOnJioStar #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/Uh6EZWFfSL— Star Sports (@StarSportsIndia) March 9, 2025 -
Mohammed Shami: ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు!
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami)కి అతడి చిన్ననాటి కోచ్ బదరుద్దీన్ సిద్దిఖీ(Badaruddin Siddiqui) అండగా నిలిచాడు. షమీ సరైన దారిలోనే వెళ్తున్నాడని.. అన్నింటి కంటే దేశమే ముఖ్యమని అతడికి తెలుసునని వ్యాఖ్యానించాడు. భారత్ కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ షమీ ఏకాగ్రత దెబ్బతినేలా ఎవరూ మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశాడు.కాగా ఆల్ ఇండియా ముస్లి జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వి షమీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవిత్ర రంజాన్ మాసంలో ‘రోజా’(Roza) పాటించకుండా షమీ పెద్ద నేరం చేశాడని ఆయన ఆరోపించారు. అతడు ఇలాంటి తప్పు చేయకుండా ఉండాల్సిందని.. షరియత్ (చట్టం) దృష్టిలో అతడొక పెద్ద నేరగాడని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో అతడు దేవుడికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.అత్యంత ముఖ్య విధి.. అతడో నేరగాడు‘రోజా’లో ఉపవాసం పాటించడమే అత్యంత ముఖ్య విధి అని.. కానీ దానిని విస్మరించడం మహిళలకైనా, పురుషులకైనా మంచిదికాదని షహబుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా ప్రఖ్యాత క్రికెటర్ అయి ఉండి.. మ్యాచ్ మధ్యలో నీళ్లు లేదంటే వేరే ఏదో డ్రింక్ తాగడం సరికాదని విమర్శించారు.ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మౌలానా ఖలీద్ రషీద్ ఫరాంగి మాహిల్ మాత్రం షమీకి అండగా నిలిచారు. రోజా పాటించాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు రోజా పాటించాలని ఖురాన్లో ఉందని.. అయితే, ప్రయాణాలు చేస్తున్నపుడు కొంతమందికి ఇది సాధ్యం కాదు కాబట్టి మినహాయింపు ఉంటుందని తమ పవిత్ర గ్రంథంలోనే ఉందని తెలిపారు. షమీ తప్పు చేశాడంటూ వేలెత్తి చూపే హక్కు ఎవరికీ లేదని ఖలీద్ స్పష్టం చేశారు.షమీ చేసినదాంట్లో తప్పేమీ లేదుఈ క్రమంలో షమీ టీమిండియా బౌలర్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన చిన్ననాటి కోచ్ బదరుద్దీన్ సిద్ధిఖీ సైతం అతడికి మద్దతు పలికారు. ‘‘షమీ చేసినదాంట్లో తప్పేమీ లేదు. ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు.దేశానికే మొదటి ప్రాధాన్యం బయట నుంచి వచ్చే విమర్శలను పక్కనపెట్టి.. షమీ ఫైనల్ మ్యాచ్‌పై దృష్టి పెట్టాల్సి ఉంది. అతడు ఎలాంటి నేరమూ చేయలేదు. దేశం కోసం అతడు ఆడుతున్నాడు. వ్యక్తిగత విషయాల కంటే దేశానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సరైంది. షమీ కూడా అదే చేస్తున్నాడు. దయచేసి ఎవరూ కూడా అతడి ఏకాగ్రత దెబ్బతినేలా మాట్లాడవద్దు’’ అని బదరుద్దీన్ విజ్ఞప్తి చేశారు.చాంపియన్స్ ట్రోఫీతో బిజీకాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షమీ ప్రస్తుతం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025తో బిజీగా ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్.. తదుపరి చీలమండ గాయం వల్ల ఏడాదికి పైగా జట్టుకు దూరమయ్యాడు.ఇటీవల ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన షమీ.. చాంపియన్స్ ట్రోఫీలోనూ రాణిస్తున్నాడు. గ్రూప్ దశతో తొలుత బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో చెలరేగిన షమీ.. ఆస్ట్రేలియాతో కీలక సెమీస్ మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 48 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మెగా వన్డే టోర్నీలో ఫైనల్‌కు చేరిన టీమిండియా ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో టైటిల్ పోరులో తలపడనుంది. అయితే, ఆసీస్‌తో మ్యాచ్ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతున్న దృశ్యాలు వైరల్ కావడంతో అతడిపై విమర్శలు వచ్చాయి.చదవండి: IND vs NZ: ఇది సరికాదు!.. టీమిండియాపై కివీస్ గెలవాలి: మిల్లర్ -
షమీ పెద్ద నేరం చేశాడు.. అతనో క్రిమినల్.. ముస్లిం మత పెద్ద సంచలన వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవిత్ర రంజాన్ మాసంలో షమీ పెద్ద నేరం చేశాడని ఆరోపించాడు. షమీ ఓ క్రిమినల్ అని సంభోదించాడు. షమీపై రజ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దూమారం రేపుతున్నాయి. అసలేం జరిగిందంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతూ కనిపించాడు. దీనిపై ముస్లిం మత పెద్ద రజ్వీ తీవ్రంగా స్పందించాడు. #WATCH | Bareilly, UP: President of All India Muslim Jamaat, Maulana Shahabuddin Razvi Bareilvi says, "...One of the compulsory duties is 'Roza' (fasting)...If any healthy man or woman doesn't observe 'Roza', they will be a big criminal...A famous cricket personality of India,… pic.twitter.com/RE9C93Izl2— ANI (@ANI) March 6, 2025పవిత్ర రంజాన్ మాసంలో షమీ రోజా (ఉపవాసం) పాటించకుండా పెద్ద నేరం చేశాడని అన్నాడు. రంజాన్ మాసంలో ఆరోగ్యకరమైన వ్యక్తి రోజా పాటించకపోతే నేరస్థుడవుతాడని తెలిపాడు. రంజాన్ మాసంలో ముస్లింలంతా రోజా పాటిస్తుంటే షమీ ఇలా చేయడమేంటని ప్రశ్నించాడు. రోజా పాటించకుండా షమీ ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని పంపుతున్నాడని అన్నాడు. రోజా పాటించనందుకు షమీని క్రిమినల్‌తో పోల్చాడు. ఇలా చేసినందుకు షమీ దేవునికి సమాధానం చెప్పాలని ఓ వీడియో రిలీజ్ చేశాడు. షమీపై రజ్వీ చేసిన వ్యాఖ్యలపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. మతాన్ని క్రీడలతో ముడిపెట్టకూడదని అంటున్నారు. షమీ దేశం కోసం ఆడుతూ రోజా ఉండలేకపోయాడని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ముస్లిం సమాజంతో పాటు యావత్ దేశం షమీకి మద్దతుగా నిలుస్తుంది. షమీ ఈ విషయాన్ని పక్కన పెట్టి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌పై దృష్టి పెట్టాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో షమీ 48 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అనంతరం పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌ల్లో షమీ వికెట్లు తీయలేకపోయాడు. సెమీస్‌లో ఆసీస్‌పై విజయం సాధించి భారత్ ఫైనల్‌కు చేరింది. మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. 2000 ఎడిషన్ (ఛాంపియన్స్ ట్రోఫీ) తర్వాత భారత్, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో భారత్‌తో తలపడిన రెండు సందర్భాల్లో న్యూజిలాండే విజేతగా నిలిచింది. 2000 ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ, 2019-2021 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ భారత్‌పై జయకేతనం ఎగురవేసి ఐసీసీ టైటిళ్లు ఎగరేసుకుపోయింది. -
అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారు: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు(Navjot Singh Sidhu) మండిపడ్డాడు. అందరు ఆటగాళ్లను సమానంగా చూడాలని.. అభ్రతా భావంతో కుంగిపోయేలా చేయకూడదని హితవు పలికాడు. భారత తుదిజట్టులో కేఎల్ రాహుల్(KL Rahul)ను స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారంటూ సిద్ధు ఘాటు విమర్శలు చేశాడు.ఆరంభంలో ఓపెనర్‌గా కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆరంభంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తర్వాత మిడిలార్డర్‌కు డిమోట్ చేశారు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ ఓపెనర్‌గా పంపారు.టీ20లకు దూరంఇక వన్డే జట్టులో వికెట్ కీపర్‌గా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా రాహుల్ సేవలు వినియోగించుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. టీ20ల నుంచి పూర్తిగా అతడిని పక్కనపెట్టింది. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాహుల్‌కు కలిసివచ్చిన ఐదో స్థానంలో అక్షర్ పటేల్‌ను ప్రమోట్ చేసి.. ఆరో స్థానంలో అతడిని ఆడించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఇదే కొనసాగించింది.మారుస్తూనే ఉన్నారుఅయితే, తాను ఏ స్థానంలో వచ్చినా చాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ మాత్రం అదరగొడుతున్నాడు. గ్రూప్ దశలో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 47 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను ఐదు, అక్షర్‌ను ఆరో స్థానంలో పంపగా.. రాహుల్‌కు ఆడే అవకాశం రాలేదు.ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మళ్లీ రాహుల్‌ను ఆరో స్థానంలో పంపగా.. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 29 బంతుల్లో 23 రన్స్ చేశాడు. అయితే, ఆస్ట్రేలియాతో కీలకమైన సెమీ ఫైనల్లో మాత్రం ఈ కర్ణాటక స్టార్ అదరగొట్టాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆరో స్థానంలో వచ్చిన రాహుల్ 34 బంతుల్లోనే 42 పరుగులతో అజేయంగా నిలిచి.. సిక్సర్‌తో జట్టు విజయాన్ని ఖరారు చేశాడు.అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారుఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్‌పై ప్రశంసలు కురుస్తున్నా... జట్టులో తనకంటూ సుస్థిర స్థానం లేకపోవడం పట్ల నవజ్యోత్ సింగ్ సిద్ధు సానుభూతి వ్యక్తం చేశాడు. ‘‘కేఎల్ రాహుల్... మీకు తెలుసా?.. అదనంగా మన దగ్గర పెట్టుకునే టైర్ కంటే కూడా అధ్వాన్నంగా, దారుణంగా అతడిని మేనేజ్మెంట్ వాడుకుంటోంది.ఓసారి వికెట్ కీపర్‌గా మాత్రమే ఆడిస్తారు, ఓసారి ఓపెనర్‌గా రమ్మంటారు.. మరోసారి ఐదు.. ఆరు స్థానాలు.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ వస్తే.. మూడో నంబర్లో ఆడమంటారు. మీ రెగ్యులర్ ఓపెనర్లు అందుబాటులో లేకుంటే మళ్లీ ఇన్నింగ్స్ ఆరంభించమంటారు.వన్డేల్లో ఓపెనర్‌గా రావడం సులువే. కానీ టెస్టుల్లో మాత్రం కష్టం. ఏదేమైనా జట్టు కోసం అతడు నిస్వార్థంగా తన స్థానాన్ని త్యాగం చేస్తూనే ఉన్నాడు’’ అని భారత జట్టు మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.కాగా కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 58 టెస్టులు, 84 వన్డేలు, 72 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఎనిమిది శతకాల సాయంతో 3257 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో ఏడు సెంచరీలు కొట్టి 3009 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇక టీ20లలోనూ రెండు శతకాలు నమోదు చేసిన రాహుల్ ఖాతాలో 2265 పరుగులు ఉన్నాయి.చదవండి: ‘లాహోర్‌లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్ -
మాట్లాడుకుంటూనే ఉండండి: రోహిత్-రాహుల్‌పై జడ్డూ అసహనం!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో జైత్రయాత్ర కొనసాగించిన భారత క్రికెట్ జట్టు.. ఫైనల్లోనూ గెలిచి విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. సమిష్టి ప్రదర్శనతో గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచిన రోహిత్ సేన సెమీస్‌లోనూ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో గత కొంతకాలంగా భారత్‌కు చేదు అనుభవాలను మిగిల్చిన ఆస్ట్రేలియా(India vs Australia)ను ఓడించింది.కంగారూ జట్టును ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేసి చిరస్మరణీయ విజయంతో టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సరదా సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాట్లాడుకున్న మాటలు స్టంప్ మైకులో రికార్డు కాగా.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.264 పరుగులకు ఆసీస్ ఆలౌట్‌కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి సెమీస్‌లో భాగంగా భారత్ మంగళవారం ఆసీస్ జట్టును ఢీకొట్టింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ క్రమంలో ఓపెనర్ కూపర్ కన్నోలి(0)ని డకౌట్ చేసి మహ్మద్ షమీ టీమిండియాకు శుభారంభం అందించగా.. విధ్వంసకర ఓపెనర్ ట్రవిస్ హెడ్(39)ను వరుణ్ చక్రవర్తి స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్(73)తో ఆకట్టుకోగా.. అలెక్స్ క్యారీ(61)అతడికి సహకరించాడు. అయితే, మిగతా వాళ్లు స్థాయికి తగ్గట్లు రాణించకపోవడంతో ఆసీస్ 49.3 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. 264 పరుగులు స్కోరు చేసింది.టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి రెండు, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. అయితే, జడ్డూ బౌలింగ్ చేసే సమయంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మాములుగా తనకు ఇచ్చిన సమయంలోపే ఓవర్లు ముగిస్తాడని జడేజాకు పేరుంది.జడేజా అసహనంఅయితే, కెప్టెన్ రోహిత్ , వికెట్ కీపర్ రాహుల్ వల్ల ఆలస్యం అవుతుందేమోనని జడ్డూ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. స్టంప్ మైకులో రికార్డైన సంభాషణ ప్రకారం.. జడేజా..‘‘బంతి అంతగా టర్న్ అవటం లేదు’’ అనగా.. రోహిత్ ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇంకో మూడు బాల్స్ వేయాల్సి ఉంది కదా. స్లిప్ తీసుకో. బంతి స్పిన్ అవ్వచ్చు’’ అని పేర్కొన్నాడు.మీరు చర్చలు జరుపుతూనే ఉండండిఇంతలో కేఎల్ రాహుల్ జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇప్పటి వరకు ఒక్క బంతి మాత్రమే టర్న్ అయింది’’ అని పేర్కొన్నాడు. వీళ్ల చర్చలతో చిర్రెత్తిపోయిన జడేజా.. ‘‘మీరిద్దరు ఇలా మట్లాడుతూనే ఉండండి. ఈ వ్యవధిలోనే నేను మిగిలిన నా మూడు బంతులు వేసేస్తా’’ అని కౌంటర్ వేశాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్ విధించిన 265 పరుగుల లక్ష్య ఛేదనను భారత్ మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. విరాట్ కోహ్లి అర్ధ శతకం(84)తో అదరగొట్టగా.. శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42 నాటౌట్) రాణించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 28) కూడా తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 48.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన టీమిండియా.. ఆసీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో టైటిల్ పోరులో తలపడుతుంది.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు!Jab tak baat hogi, ek aur over hojayegi! 🤣That’s the speed of #Jadeja – blink, and the over’s done! Some on field stump mic gold!#ChampionsTrophyOnJioStar 👉 🇮🇳🆚🇦🇺 LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!📺📱 Start Watching FREE on… pic.twitter.com/nsIpsZyAbb— Star Sports (@StarSportsIndia) March 4, 2025 -
‘లాహోర్‌లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్
టీమిండియా విజయాలను తక్కువ చేసే విధంగా మాట్లాడేవారికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) నిర్ణయానుసారమే భారత్ దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతోందన్నారు. గెలుపు కోసం పిచ్‌లపై ఆధారపడే దుస్థితిలో టీమిండియా లేదని.. వేదిక ఒకటే అయినా వేర్వేరు పిచ్‌లపై ఆడుతున్న విషయాన్ని గమనించాలని శుక్లా పేర్కొన్నారు.అజేయంగా ఫైనల్కుఅదే విధంగా చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ఫైనల్ లాహోర్‌లో జరిగితే బాగుండేదన్న పాకిస్తాన్ జర్నలిస్టు ప్రశ్నకు రాజీవ్ శుక్లా ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాక్ పంపేందుకు బీసీసీఐ నిరాకరించగా.. ఐసీసీ జోక్యంతో తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడేలా రోహిత్ సేనకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-ఎ నుంచి పోటీపడిన టీమిండియా అజేయంగా ఫైనల్‌కు చేరింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. కానీ, ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియాకు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని ఇంగ్లండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు ప్రముఖంగా గళం వినిపించారు.ఐసీసీ నిబంధన ప్రకారమేఈ క్రమంలో లాహోర్‌లో జరిగిన సౌతాఫ్రికా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన రాజీవ్ శుక్లా పైవిధంగా స్పందించారు. అదే విధంగా.. భారత్- పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘భారత ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటాము. పాక్ క్రికెట్ బోర్డు కూడా వారి ప్రభుత్వం చెప్పినట్లే చేస్తుంది.ఇరుజట్లు.. ఒకరి దేశంలో మరొకరు ఆడితే చూడాలని భారత్- పాక్ అభిమానులు కోరుకుంటున్నారని మాకు తెలుసు. అయితే, పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఐసీసీలో ఒక నిబంధన ఉంది. ప్రభుత్వాల సమ్మతితోనే బోర్డులు ముందుకు వెళ్లాలి. బీసీసీఐ, పీసీబీ ఆ నిబంధనను పాటిస్తున్నాయి.అయితే, భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లకు ఉన్న ఆదరణ దృష్ట్యా ప్రతీ దేశం దాయాదుల పోరుకు ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా సుదీర్ఘకాలం తర్వాత పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇదొక శుభపరిణామం. టోర్నీ సజావుగా సాగేలా చేశారు’’ అని రాజీవ్ శుక్లా పీసీబీని ప్రశంసించారు.ఆసీస్ ఓడిపోయింది కదా!ఇక లాహోర్‌లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగితే బాగుండేది కదా అని ఓ పాకిస్తాన్ జర్నలిస్తు రాజీవ్ శుక్లాను ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరన్నట్లు జరగాలంటే ఆస్ట్రేలియా గెలిచి ఉండాల్సింది. కానీ వాళ్లు ఓడిపోయారు కద! అందుకే ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లోనే జరుగబోతోంది’’ అని రాజీవ్ శుక్లా కౌంటర్ ఇచ్చారు.ఇక ఆసియా కప్ షెడ్యూలింగ్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఆసియా క్రికెట్ మండలి నిర్ణయాల ప్రకారం అంతా జరుగుతుంది. ఆసియా కప్ గురించి చర్చించేందుకు కూడా నేను ఇక్కడకు వచ్చాను. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఐసీసీ చైర్మన్ జై షా కూడా ఈ విషయంలో సహకరిస్తున్నారు’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్... గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడగా.. భారత్- న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా సెమీస్ చేరాయి. అయితే, తొలి సెమీ ఫైనల్లో ఆసీస్‌ను భారత్.. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను కివీస్ ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాయి.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు! -
Steve Smith: కోహ్లికి ముందే తెలుసు!
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికి.. తన అకస్మాత్ నిర్ణయంతో అభిమానులకు షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఆసీస్ పరాజయం అనంతరం స్మిత్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే, యాభై ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకొన్నా... టెస్టులు, టీ20ల్లో కొనసాగాలనుకుంటున్నట్లు 35 ఏళ్ల స్మిత్ వెల్లడించాడు.అయితే, స్మిత్ తన రిటైర్మెంట్(ODI Retirement) నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే కంటే ముందే.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli)కి ఈ విషయం గురించి చెప్పినట్లు తెలుస్తోంది. సెమీ ఫైనల్లో ఆసీస్‌పై భారత్ విజయానంతరం ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకుంటున్న వేళ స్మిత- కోహ్లి ముఖాలు దిగాలుగా కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇదే చివరి మ్యాచా?ఈ క్రమంలో.. ‘‘ఇదే చివరి మ్యాచా?’’ అని కోహ్లి అడుగగా.. ‘అవును’ అంటూ స్మిత్ సమాధానమిచ్చాడని.. వారి మధ్య జరిగిన సంభాషణ ఇదేనంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మైదానంలో ప్రత్యర్థులే అయినా కోహ్లి- స్మిత్ మధ్య వ్యక్తిగతంగా ఉన్న స్నేహబంధానికి ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు. కొన్నిసార్లు చిలిపిగా వ్యవహరించినా క్రీడా స్ఫూర్తిని చాటడంలో.. ఆటగాళ్లకు తగిన గౌరవం ఇవ్వడంలో కింగ్‌కు మరెవరూ సాటిరారని కోహ్లిని కొనియాడుతున్నారు.నాడు స్మిత్‌కు కోహ్లి మద్దతుకాగా నవతరం ఫ్యాబ్ ఫోర్(కోహ్లి, విలియమ్సన్, స్మిత్, రూట్)లో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. మైదానంలో నువ్వా- నేనా అన్నట్లుగా తలపడే ఈ ఇద్దరు పరస్పరం ప్రశంసలు కురిపించుకోవడంలోనూ ముందే ఉంటారు. కోహ్లి వంటి గొప్ప ఆటగాడిని తాను చూడలేదని.. అతడంటే తనకు ఎంతో గౌరవమని స్మిత్ పలు సందర్భాల్లో వెల్లడించాడు.ఇక వరల్డ్ కప్-2019లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ సమయంలో స్మిత్‌ను ప్రేక్షకులు ‘చీటర్’ అంటూ గేళి చేయగా.. బ్యాటింగ్ చేస్తున్న కోహ్లి బౌండరీ వద్దకు వచ్చి అలా చేయవద్దని వారించాడు. అంతేకాదు.. స్మిత్ భుజంపై చేయి వేసి మద్దతు పలికాడు. దీంతో ప్రేక్షకులు కూడా సంయమనం పాటించారు.5,800 పరుగులుఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో... చాంపియన్స్ ట్రోఫీలో అతడి స్థానంలో స్మిత్ కంగారూ జట్టుకు సారథ్యం వహించాడు. 2010లో వెస్టిండీస్‌పై వన్డే అరంగేట్రం చేసిన స్మిత్... కెరీర్లో ఇప్పటి వరకు 170 మ్యాచ్‌లాడి 43.28 సగటుతో 5,800 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 35 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. గొప్ప ప్రయాణంఇక 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడైన స్మిత్... బంతితో 28 వికెట్లు పడగొట్టాడు. లెగ్‌స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన స్టీవ్ స్మిత్... ఆ తర్వాత నెమ్మదిగా ఆల్‌రౌండర్‌గా... ఆపై టాపార్డర్ బ్యాటర్‌గా... అటు నుంచి స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు. ‘ఇది చాలా గొప్ప ప్రయాణం. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించా. ఈ ఫార్మాట్లో ఎన్నో అద్భుత జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు ప్రపంచకప్‌లు గెలవడం ఎప్పటికీ మరవలేను. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడా’ అని స్మిత్ పేర్కొన్నాడు.అందుకే రిటైర్ అయ్యానుకాగా 2027 వన్డే ప్రపంచకప్‌నకు జట్టును సిద్ధం చేసుకునేందుకు టీమ్ మేనేజ్మెంట్కు తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘ఇంకా నాలో చాలా క్రికెట్ మిగిలే ఉంది. అయితే మరో రెండేళ్లలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో జట్టును సిద్ధం చేసుకునేందుకు మేనేజ్మెంట్కు సమయం దక్కుతుంది. టెస్టులు, టీ20ల్లో అవకాశం కల్పిస్తే తప్పక జట్టు విజయాల కోసం కృషి చేస్తా’ అని స్మిత్ అన్నాడు. చదవండి: అదే మా కొంపముంచింది... లేదంటే విజయం మాదే: స్టీవ్ స్మిత్YOU MISS, I HIT! 🎯Shami strikes big, sending the dangerous Steve Smith back to the pavilion with a stunning delivery! 🤯#ChampionsTrophyOnJioStar 👉 #INDvAUS | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!📺📱 Start Watching FREE on… pic.twitter.com/cw9RB77Ech— Star Sports (@StarSportsIndia) March 4, 2025 -
వాట్సన్, డంక్ విధ్వంసకర శతకాలు.. టీమిండియాపై ఆస్ట్రేలియా అతి భారీ స్కోర్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్-2025లో భాగంగా ఇవాళ (మార్చి 5) ఇండియా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్ తలపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అతి భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షేన్ వాట్సన్ (52 బంతుల్లో 110 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ బెన్ డంక్ (53 బంతుల్లో 132 నాటౌట్; 12 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర శతకాలతో విరుచకుపడ్డారు. ఫలితంగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 269 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. వాట్సన్, డంక్ ప్రతి ఒక్క భారత బౌలర్‌ను ఎడాపెడా వాయించారు. వీరిద్దరి దెబ్బకు ప్రతి భారత బౌలర్ 10కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. వినయ్ కుమార్ 4 ఓవర్లలో 73,అభిమన్యు మిథున్ 4 ఓవర్లలో 46, పవన్ నేగి 3 ఓవర్లలో 34 (ఒక వికెట్), రాహుల్ శర్మ 4 ఓవర్లలో 42, ఇర్ఫాన్ పఠాన్ 2 ఓవర్లలో 31, గుర్కీరత్ సింగ్ మాన్ ఒక ఓవర్లో 15, స్టువర్ట్ బిన్నీ 2 ఓవర్లలో 28 పరుగులు సమర్పించుకున్నారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో షాన్ మార్ష్ 22 పరుగులకు ఔటయ్యాడు. వాట్సన్‌కు ఈ టోర్నీలో ఇది రెండో సెంచరీ. ఈ సీజన్లో వెస్టిండీస్ మాస్టర్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో కూడా వాట్సన్ శతక్కొట్టాడు. ఆ మ్యాచ్‌లో కూడా వాట్సన్ 52 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు.కాగా, ఈ టోర్నీలో భారత మాస్టర్స్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనలు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్లో భారత్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించింది. ఆసీస్ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాల్లో ఉండగా.. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిన ఇంగ్లండ్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ ఏడాదే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో 6 దేశాలకు (భారత్, శ్రీలంక. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్) చెందిన దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. భారత్‌కు సచిన్, శ్రీలంకకు సంగక్కర, వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహిస్తున్నారు.భారత మాస్టర్స్ జట్టులో సచిన్‌తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు తదితర మాజీ స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. -
ఒకడే ఒక్కడు మొనగాడు
ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ ఎప్పుడూ రసవత్తరంగా సాగుతుంది. అదీ నాకౌట్ దశలో ఆడే మ్యాచ్ మరింత క్లిష్టతరంగా ఉంటుంది. ఇందుకు చివరివరకూ పోరాడే ఆస్ట్రేలియా నైజం, వారి పోరాట తత్త్వం ప్రధాన కారణాలు. సాధారణముగా ఈ విషయం లో భారత్‌పై ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా దే పైచేయిగా నిలిచింది. ముఖ్యంగా భారత్‌లో జరిగిన 2023 వరల్డ్ కప్ ఫైనల్ , అదే సంవత్సరం ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఒక నిదర్శనం. ఈ రెండిటిని లోనూ ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రధాన భూమిక వహించాడు.కోహ్లీ విభిన్నమైన ఇన్నింగ్స్అయితే, మంగళవారం దుబాయ్ వేదిక పై జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇందుకు భిన్నమైనిది. అందుకు ప్రధాన కారణం 36 ఏళ్ల భారత్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఆడిన తీరు భారత్ క్రికెట్ అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కోహ్లీ లో అసాధారణ పరిణతి కనిపించింది. ఎక్కడా తడబాటు లేదు. పెద్ద షాట్లు కొట్టి ఆస్ట్రేలియా వాళ్లకి అవకాశం ఇవ్వకూడదనే దృఢ సంకల్పంతో సింగిల్స్ కోసం చిన్నపిల్లల వాడిలాగా పరిగెడుతూనే ఉన్నాడు.ఎక్కడా అలసట లేదు. అలసత్వం లేదు. ఇక్కడ ముఖ్యంగా గమినించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైనది కోహ్లీ వయ్యస్సు. కోహ్లీ దుబాయ్ ఎండలో మధ్యానమంతా ఫీల్డింగ్ చేసాడు. ఇక కోహ్లీ ఫీల్డ్ లో ఎలా ఉంటాడో చెప్పనవసరం లేదు. ఒక మెరుపు తీగలాగా, పాదరసం లాగా మైదానమంతా కళయదిరగడం, తోటి ఆటగాళ్ళని ఉత్సహాబారచడం కోహ్లీ కి అలవాటు.కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కీలక భాగస్వామ్యం265 పరుగుల విజయ లక్ష్యం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కొద్దిగా దూకుడుగా ఆడినా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు శుభ్‌మాన్ గిల్ త్వరితగతిన ఔటవ్వడంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 55/2తో ఉంది. ఆ దశలో జత కలిసిన కోహ్లీ మరియు శ్రేయాస్ అయ్యర్ 91 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చాలా పరిణతితో ఆడారు. ఎక్కడా ఆస్ట్రేలియా బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియా ఫీల్డ్ ప్లేసిమెంట్లను జల్లెడ పట్టారు. గాప్స్ లో కొడుతూ ప్రధానంగా సింగిల్స్ పైనే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా బౌలర్లకు ఎలాంటి అవకాశం రాలేదు. బ్యాటర్ తప్పిదాలు చేస్తేనే కదా ప్రత్యర్థికి అవకాశం.అలాంటిది షాట్లు కొట్టకుండా నిబ్బరంగా ఆడుతుంటే ఆస్ట్రేలియా బౌలర్లకు ఒక దశలో ఏమి చేయాలో తెలియకుండా పోయింది. భారత్ మాత్రం విజయం దశగా పరుగు తీసింది. ఈ మ్యాచ్ కోహ్లీ మాస్టర్ స్ట్రోక్ కి మచ్చు తునక గా నిలిచిపోతుంది.సచిన్ టెండూల్కర్ రికార్డుబ్రేక్అవసరమైన పక్షంలో విజృన్భించి ఆడగల బ్యాటర్ జట్టులో ఉన్నందునే కోహ్లీకి ఈ అవకాశం దక్కిందండంలో సందేహం లేదు. తెలివైన స్ట్రైక్ రొటేషన్ మరియు సకాలంలో బౌండరీలతో కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ భారత్ ఇన్నింగ్స్‌ను స్థిరపరిచారు. 25వ ఓవర్లో కోహ్లీ తన అర్ధ సెంచరీని సాధించాడు. విరాట్ కోహ్లీ, 98 బంతుల్లో 84 పరుగులు చేసి ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఇప్పుడు కోహ్లీ ఖాతాలో 24 అర్థసెంచరీలు ఉండగా, సచిన్ సాధించిన 23 అర్థసెంచరీల మైలురాయి ని అధిగమించాడు.కోహ్లీ క్రూయిజ్ మోడ్ బ్యాటింగ్కోహ్లీ ఇన్నింగ్స్ ఒక విషయాన్నీ స్పష్టం చేసింది. వన్డే ఫార్మాట్లో అతని నైపుణ్యం ఒక దశకు చేరుకుంది. కోహ్లీ ఇప్పుడు ఎటువంటి అనవసరమైన ఒత్తిడి లేకుండా హైవే పై పరుగు తీసే క్రూయిజ్ మోడ్ లో ఉండే కారు లాగా సునాయాసంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. "నేను ఎక్కడా తొందరపడలేదు. చాల ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాను. ఒక్క సింగిల్స్ తో ఇన్నింగ్స్ ని అలా నిర్మించడం నాకు చాలా సంతోషకరంగా ఉంది" అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఇప్పుడు 106 ఇన్నింగ్స్‌లలో 5999 పరుగులు చేసి భారత్ విజయలక్ష్య సాధన లో పరుగులు సాధించిన బ్యాటర్లలో అగ్రస్థానంలో నిలిచాడు.ఈ మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించాడు. " కోహ్లీ మరో సారి తన ప్రతిభని చాటి చెప్పాడు. పరిస్థితులను అద్భుతంగా అంచనా వేశాడు. ఒక క్లాస్ ప్లేయర్ అయిన అతనికి తన జట్టుకు ఏమి అవసరమో మరియు మ్యాచ్ ని గెలవడానికి సరిగ్గా ఎలా ఆడాలో దిశా నిర్దేశం చేసాడు. ముందుండి జట్టుని నడిపించాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సాధించిన సెంచరీ తో ఈ విషయం స్పష్టమైంది. మళ్ళీ కోహ్లీ అదే ఇన్నింగ్స్ ని పునరావృతం చేసాడు. వన్డేలలో మొనగాడని మరోసారి నిరూపించుకున్నాడు’’ అని క్లార్క్ విరాట్ కోహ్లీని ప్రశంసించాడు.చదవండి: కోహ్లి పైపైకి.. పడిపోయిన రోహిత్ శర్మ ర్యాంకు -
కోహ్లి పైపైకి.. పడిపోయిన రోహిత్ శర్మ!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ముందుకు దూసుకువచ్చాడు. ఆరు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకాడు. మరోవైపు.. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన మూడో ర్యాంకు కోల్పోయాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా అదరగొడుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించి గ్రూప్-‘ఎ’ టాపర్‌గా సెమీ ఫైనల్‌కు చేరింది భారత్. దుబాయ్‌లో మంగళవారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకువెళ్లింది.నిరాశపరిచిన రోహిత్ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma- 28) నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం అద్భుత అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 98 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 84 పరుగులు చేసి జట్టు విజయానికి బాటలు వేశాడు. మిగతా వాళ్లలో శ్రేయస్ అయ్యర్(45), వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(42 నాటౌట్) రాణించారు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.నాలుగో స్థానానికిఇదిలా ఉంటే.. ఆసీస్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కారణంగా.. ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో కోహ్లి అదరగొట్టాడు. 747 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇక టీమిండియా మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆసీస్‌తో మ్యాచ్‌లో విఫలమైనా(8) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు.. రోహిత్ మూడు నుంచి ఐదో ర్యాంకుకు పడిపోయాడు.ఇదిలా ఉంటే.. ఐసీసీ మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ అక్షర్ పటేల్ దుమ్ములేపాడు. ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకు సాధించాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్‌లో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా స్పిన్ బౌలర్ కేశవ్ మహరాజ్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. న్యూజిలాండ్ స్టార్ మ్యాట్ హెన్రీ మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకులో నిలిచాడు.ఐసీసీ మెన్స్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే1. శుబ్‌మన్ గిల్(ఇండియా)- 791 రేటింగ్ పాయింట్లు2. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 770 రేటింగ్ పాయింట్లు3. హెన్రిచ్ క్లాసెన్(సౌతాఫ్రికా)- 760 రేటింగ్ పాయింట్లు4. విరాట్ కోహ్లి(ఇండియా)- 747 రేటింగ్ పాయింట్లు5. రోహిత్ శర్మ(ఇండియా)- 745 రేటింగ్ పాయింట్లు.చదవండి: శుబ్‌మన్ గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే.. -
సూపర్ ఫామ్‌లో టీమిండియా స్టార్.. ‘ఐటం సాంగ్’తో సోదరి బాలీవుడ్ ఎంట్రీ
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన ఈ ముంబై బ్యాటర్.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో అదే జోరును కొనసాగిస్తున్నాడు. విలువైన ఇన్నింగ్స్ ఆడుతూ భారత్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు.ఈ వన్డే టోర్నమెంట్లో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ కాస్త నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులే చేసి నిష్క్రమించాడు. అయితే, సెమీస్ చేరాలంటే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో కీలకమైన మ్యాచ్‌లో మాత్రం హాఫ్ సెంచరీతో మెరిశాడు. 67 బంతుల్లో 56 పరుగులు చేసి విరాట్ కోహ్లి(100 నాటౌట్) మంచి భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించడంలో భాగమయ్యాడు.ఆకాశమే హద్దుగాఆ తర్వాత గ్రూప్ దశలో ఆఖరుగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 98 బంతులు ఎదుర్కొని 79 పరుగులతో టీమిండియా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లోనూ శ్రేయస్ అయ్యర్ రాణించాడు. జట్టు విజయానికి పునాది వేసే క్రమంలో 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో జయభేరి మోగించిన టీమిండియా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.‘ఐటం’ సాంగ్‌తో బాలీవుడ్లో ఎంట్రీఇదిలా ఉంటే.. భారత్- ఆసీస్ మధ్య మ్యాచ్ చూసేందుకు శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్(Shresta Iyer) కూడా దుబాయ్ స్టేడియానికి వచ్చింది. తన తమ్ముడిని ఉత్సాహపరుస్తూ కెమెరాల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో శ్రేష్టకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. కొరియోగ్రాఫర్, ప్రొఫెషనల్ డాన్సర్ అయిన శ్రేష్ట.. ఓ ‘ఐటం’ సాంగ్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.ఒకరేమో టీమిండియా స్టార్.. మరొకరు బాలీవుడ్ స్టార్‘సర్కారీ బచ్చా’ అనే సినిమాలో ‘అగ్రిమెంట్ కర్లే’ అంటూ సాగే పాటకు జోష్‌గా స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘ఒకరేమో టీమిండియా స్టార్.. మరొకరు బాలీవుడ్ స్టార్’’ అంటూ అక్కాతమ్ముళ్ల ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఇక ఆసీస్‌పై భారత్ విజయానంతరం శ్రేష్ట మ్యాచ్ వీక్షిస్తున్న ఫొటోలతో పాటు.. సెలబ్రిటీలతో దిగిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.కాగా ముంబైలో 1994లో జన్మించిన శ్రేయస్ అయ్యర్ 2017లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 14 టెస్టులు, 68 వన్డేలు, 51 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 811, 2752, 1104 పరుగులు సాధించాడు. మరోవైపు.. శ్రేయస్ అక్క శ్రేష్ట అయ్యర్ 1990లో జన్మించింది. వీరి తండ్రి సంతోష్ అయ్యర్- కేరళకు చెందినవారు కాగా.. తల్లి రోహిణి అయ్యర్ స్వస్థలం మంగళూరు. వీరు ముంబైలో స్థిరపడ్డారు. ఇక అక్కాతమ్ముళ్లు శ్రేష్ట- శ్రేయస్‌లకు ఒకరంటే మరొకరి ఎనలేని ప్రేమ. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ఇద్దరూ బయటపెడుతుంటారు. చదవండి: శుబ్‌మన్ గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే.. View this post on Instagram A post shared by Panorama Music (@panoramamusic) -
గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత జట్టు అజేయంగా ఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా(India vs Australia)తో మంగళవారం నాటి సెమీస్‌లో సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ క్రికెటర్లలో అత్యధిక మంది టీమిండియాకు చేసిన ప్రధాన సూచన.. ఆసీస్ విధ్వంసకర వీరుడు ట్రవిస్ హెడ్‌ను వీలైనంత త్వరగా అవుట్ చేయాలనే!!...ఎందుకంటే.. రోహిత్ సేన సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023(ODI World Cup) గెలవకుండా అడ్డుపడి.. ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత అతడి సొంతం. అందుకే ‘తలనొప్పి’ తెచ్చిపెట్టే ఈ బ్యాటర్‌పైనే ముందుగా దృష్టి సారించాలని సంజయ్ మంజ్రేకర్, హర్భజన్ సింగ్, దినేశ్ కార్తిక్ తదితరులు భారత బౌలర్లకు సూచించారు. అందుకు తగ్గట్లుగానే మంగళవారం హెడ్‌ను టీమిండియా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపించింది.టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి హెడ్ అవుటయ్యాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి నిష్క్రమించాడు. ‘అతి’ ఆనందంఅయితే, హెడ్ ఇచ్చిన క్యాచ్ పట్టిన తర్వాత గిల్ చేసిన తప్పిదం టీమిండియా కొంపముంచేది. హెడ్ క్యాచ్ పట్టినప్పుడు శుబ్‌మన్ గిల్ ప్రదర్శించిన ‘అతి’ ఆనందం అంపైర్ నుంచి హెచ్చరికకు గురయ్యేలా చేసింది. క్యాచ్ అందుకోగానే కొద్ది సేపయినా తన చేతిలో ఉంచకుండా గిల్ బంతిని గాల్లోకి విసిరేశాడు.నిజానికి క్యాచ్ పట్టడంలో అతడు ఎక్కడా తడబడలేదు. అయితే బాల్‌ను ఎంతసేపు చేతిలో ఉంచుకోవాలనే విషయంలో నిబంధనలు సరిగ్గా లేకపోయినా... కనీసం 2–3 సెకన్ల పాటు ఫీల్డర్ బంతిని తన నియంత్రణలో ఉంచుకోవాలి.క్లీన్’గా ఉన్నా.. వార్నింగ్ ఎందుకు?ఇదే విషయాన్ని అంపైర్ ఇల్లింగ్‌వర్త్ ప్రత్యేకంగా గిల్‌కు వివరించాడు. ఇలాంటి సందర్భాల్లో అవుట్/నాటౌట్ ఇచ్చే విషయంలో అంపైర్‌కు విచక్షణాధికారం ఉంటుంది. ఒకవేళ ఇల్లింగ్‌వర్త్ గనుక గిల్ వెనువెంటనే బంతిని విసిరేయడాన్ని సీరియస్‌గా తీసుకుని నాటౌట్ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఒక్కసారి లైఫ్ లభిస్తే హెడ్‌ను ఆపటం అంత తేలికేమీ కాదు. అందుకే గిల్ చర్య విమర్శలకు దారి తీసింది.ఇదిలా ఉంటే.. ఓపెనర్ హెడ్ అవుటైన తర్వాత కెప్టెన్ , వన్‌డౌన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. మార్నస్ లబుషేన్(29) మరో ఎండ్ నుంచి సహకారం అందించగా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.నిజానికి అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అనూహ్యం చోటు చేసుకుంది. స్మిత్ డ్రైవ్ చేయగా బంతి అతడి ప్యాడ్ల మీదుగా స్టంప్స్‌ను తాకింది. అయితే బెయిల్స్ పడకపోవడంతో స్మిత్ బతికిపోయాడు. ఆపే ప్రయత్నం చేస్తే తన కాలితోనే స్టంప్స్ పడిపోతాయని భావనతో కావచ్చు స్మిత్ అలా కూడా చేయలేదు. ఆ సమయంలో అతని స్కోరు 23 పరుగులు. అతని స్కోరు 36 వద్ద ఉన్నప్పుడు షమీ బౌలింగ్‌లో బలంగా షాట్ కొట్టగా... తన ఎడమ చేత్తో క్యాచ్ పట్టే ప్రయత్నం చేసిన షమీ విఫలమయ్యాడు. అయితే ఇది చాలా కఠినమైన క్యాచ్. ఏదేమైనా స్మిత్ 73 పరుగుల చేసి షమీ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా.. అలెక్స్ క్యారీ అర్ధ శతకం(61) కారణంగా ఆసీస్ 264 పరుగులు చేయగలిగింది.వరల్డ్ చాంపియన్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించిఅయితే, లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆరంభించిన టీమిండియా ఆ తర్వాత తడబడ్డప్పటికీ విరాట్ కోహ్లి(98 బంతుల్లో 84) అద్భుతం చేశాడు. అతడికి తోడుగా శ్రేయస్ అయ్యర్(45), వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(34 బంతుల్లో 42) రాణించారు. గ్లెన్ మాక్స్వెల్ బౌలింగ్‌లో రాహుల్ కొట్టిన సిక్సర్‌తో టీమిండియా విజయం ఖరారైంది. ఫలితంగా వరల్డ్ చాంపియన్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి రోహిత్ సేన ఫైనల్‌కూ దూసుకెళ్లింది.చదవండి: #Steve Smith: భారత్ చేతిలో ఓటమి.. స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం -
రోహిత్ గురించి ప్రశ్న.. ఇచ్చి పడేసిన గంభీర్! నాకన్నీ తెలుసు...
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్లో గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన రోహిత్ సేన.. సెమీస్‌లోనూ అదరగొట్టింది. దుబాయ్‌లో ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకువెళ్లింది.ఈ నేపథ్యంలో.. ఓవైపు భారత జట్టుపై ప్రశంసలు కురుస్తుండగా.. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్, భవిష్యత్తు గురించి చర్చలు నడుస్తున్నాయి. ఇటీవలి కాలంలో టెస్టులు, వన్డేల్లో ఫామ్‌లేమితో సతమతమైన హిట్‌మ్యాన్.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇంకెంతకాలం ఆడతాడు?ఈ క్రమంలో ఆసీస్‌పై టీమిండియా విజయానంతరం హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మీడియాతో మాట్లాడగా.. ఇందుకు సంబంధించి ప్రశ్న ఎదురైంది. ‘‘రోహిత్ ఫామ్ సంగతేంటి? అతడు ఇంకెంతకాలం ఆడతాడని మీరనుకుంటున్నారు’’ అని ఓ విలేకరి ప్రశ్నించారు.ఇందుకు గంభీర్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడబోతున్నాం. ఇలాంటి సమయంలో మీ ప్రశ్నకు నేనెలా బదులివ్వగలను. మా కెప్టెన్ వేరే లెవల్ టెంపోతో బ్యాటింగ్ చేస్తూ సహచర ఆటగాళ్లలో సరికొత్త ఉత్సాహం నింపుతూ.. భయం లేకుండా, దూకుడుగా ఆడాలని చెబుతూ ఉంటే నేను ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వగలను?ఇచ్చి పడేసిన గంభీర్!మీరంతా పరుగులు, సగటు గురించే మాట్లాడతారు. అయితే, కోచ్‌గా నేను కెప్టెన్ ప్రభావం జట్టుపై ఎలా ఉందనేది చూస్తాను. జర్నలిస్టులు, నిపుణులకు గణాంకాలు మాత్రమే కావాలి. కానీ మా కెప్టెన్ జట్టుకు ఆదర్శంగా ఉంటూ.. డ్రెస్సింగ్‌రూమ్‌లో సానుకూల వాతావరణం నింపుతుంటే మాకు ఇంకేం కావాలి’’ అని గంభీర్ సదరు విలేకరి ప్రశ్నపై ఒకింత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రోహిత్ శర్మ అభిమానులు గౌతం గంభీర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన కోచ్ ఇలాగే ఉంటాడని.. 37 ఏళ్ల రోహిత్ 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు కొనసాగుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.264 పరుగులు చేసి ఆలౌట్ఇక సెమీస్ మ్యాచ్ విషయానికొస్తే.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ట్రవిస్ హెడ్(39) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్(73), అలెక్స్ క్యారీ(61) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ షమీ(3/48), స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(2/49), రవీంద్ర జడేజా (2/40) రాణించగా.. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రాణించిన కోహ్లి, అయ్యర్, రాహుల్ఆస్ట్రేలియా విధించిన లక్ష్యాన్ని 48.1 ఓవర్లలోనే టీమిండియా పూర్తి చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(28) దూకుడుగా ఆడగా.. విరాట్ కోహ్లి అద్భుత అర్ధ శతకం సాధించాడు. శ్రేయస్ అయ్యర్(45)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్ది 84 పరుగులు సాధించాడు. ఇక కేఎల్ రాహుల్ 34 బంతుల్లోనే 42 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చగా.. హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 28) ధనాధన్ దంచికొట్టాడు.ఈ క్రమంలో ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన భారత్ ఆసీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. విరాట్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.చదవండి: కుల్దీప్ యాదవ్‌పై మండిపడ్డ కోహ్లి, రోహిత్!.. గట్టిగానే తిట్టేశారు -
భారత్ చేతిలో ఓటమి.. స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌కు స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓటమి అనంతరం స్మిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆసీస్ పరాజయం పాలైంది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్‌గా స్మిత్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్మిత్ తెలిపాడు."వన్డేల్లో నా ప్రయాణాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అద్బుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులో భాగంగా ఉండడం నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఎంతోమంది సహచరలతో కలిసి నా క్రికెట్ జర్నీని కొనసాగించాను. 2027 వన్డే ప్రపంచకప్‌కు యువ ఆటగాళ్లను సిద్దం చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాను.అందుకే వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్దమయ్యాను. ముఖ్యంగా అత్యున్నతస్ధాయిలో క్రికెట్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించడం ఎల్లప్పుడూ నాకు గర్వకారణమే. ఎల్లో జెర్సీ ధరిస్తే కలిగే ఆ ఆనుభూతిని వర్ణించలేం. నా ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియాకు, సహచరులు, అభిమానులకు ధన్యవాదాలు.ఇకపై టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ స్మిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా 2015, 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ జట్టులో స్మిత్ సభ్యునిగా ఉన్నాడు. -
నేను ఎంతగానో చెప్పాను.. అయినా నా మాట కోహ్లి వినలేదు: రాహుల్
భారత క్రికెట్ జట్టు రెండో సారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఆసీస్ నిర్ధేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. కాగా భారత్ విజయంలో విరాట్ కోహ్లి కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. తృటిలో తన 52వ వన్డే సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 98 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 84 పరుగులు చేసిన కోహ్లి.. జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించాడు.అప్పటివరకు ఆచితూచి ఆడుతున్న కోహ్లి అనూహ్యంగా ఔట్ అవ్వడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కేఎల్ రాహుల్ సైతం నిరాశచెందాడు. నేను కొడుతున్నా కదా భయ్యా అన్నట్లు రాహుల్ రియాక్షన్ ఇచ్చాడు. అయితే దీనిపై మ్యాచ్ అనంతరం రాహుల్ స్పందించాడు."నేను క్రీజులోకి వచ్చాక పది పన్నేండు బంతులు ఆడాక కోహ్లి వద్దకు వెళ్లి కాసేపు మాట్లాడాను. ఆఖరి వరకు క్రీజులోనే ఉండాలని తనకు చెప్పాను. నేను రిస్క్ తీసుకుని షాట్లు ఆడుతాను, ఏదో ఒక ఓవర్‌ను టార్గెట్ చేస్తాను అని చెప్పా. ఎందుకుంటే ఆ సమయంలో మాకు ఓవర్‌కు 6 పరుగులు మాత్రమే అవసరం. కానీ ఈ వికెట్‌పై ఓవర్‌కు ఎనిమిది పరుగులు సులువగా సాధించవచ్చు అన్పించింది. ఓవర్‌కు ఒక్క బౌండరీ వచ్చినా చాలు. కాబట్టి ఆ రిస్క్ నేను తీసుకుంటూ, నీవు కేవలం స్ట్రైక్ రోటేట్ చేస్తే చాలు అని చెప్పాను. కానీ కోహ్లి నా మాట వినలేదు. భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. బహుశా బంతి స్లాట్‌లో ఉందని భావించి ఆ షాట్ ఆడిండవచ్చు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో మైదానం వీడాల్సి వచ్చింది" అని రాహుల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: అదే మా కొంపముంచింది... లేదంటే విజయం మాదే: స్టీవ్ స్మిత్ -
అదే మా కొంపముంచింది... లేదంటే విజయం మాదే: స్టీవ్ స్మిత్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆస్ట్రేలియా పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన భారత్‌తో జరిగిన మొదటి సెమీఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఆసీస్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆలౌటైంది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్( 73) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అలెక్స్ కేరీ(61) హాఫ్ సెంచరీతో రాణించాడు.భారత బౌలర్లలో హ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. దీంతో ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. ఓటమి పాలైనప్పటికి తమ బౌలర్లు అద్భుతంగా పోరాడరని స్మిత్ కొనియాడాడు."ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. విజయం కోసం చివరివరకు తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా స్పిన్నర్లు మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకొచ్చారు. ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంతసులువు కాదు. ఆరంభంలో పరుగులు సాధించడం, స్టైక్ రొటేట్ చేయడం చాలా కష్టమైంది.మా జట్టులోని ప్రతీ ఒక్కరూ విజయం సాధించేందుకు చాలా కష్టపడ్డారు. పిచ్ మేము ఊహించినదాని కంటే చాలా భిన్నంగా ఉంది. ఈ వికెట్‌కు కొంతవరకు స్పిన్నర్లకు బాగానే అనుకూలించింది. స్పిన్ అవ్వడంతో పాటు స్కిడ్ అయ్యింది. పేసర్లకు కూడా కొంచెం కష్టంగానే ఉంది. దుబాయ్ వికెట్ కొంచెం గమ్మత్తుగా ఉంది. అందుకే భారీ స్కోర్లు ఈ వికెట్‌పై సాధించలేకపోతున్నారు. మేము కీలక సమయంలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయాం. నేను ఔటైన వెంటనే మాక్స్వెల్ కూడా తన వికెట్‌ను కోల్పోయాడు. అక్కడే మేము రిథమ్‌ను కోల్పోయాము. మేం 280 పైగా రన్స్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. మిడిల్ ఓవర్లలో ఒక్క భారీ భాగస్వామ్యం నెలకొల్పి ఉండింటే మేము అనుకున్న లక్ష్యానికి చేరువయ్యే వాళ్లం. అప్పుడు ప్రత్యర్ధిపై ఒత్తిడి ఉండేది. ఈ టోర్నీలో మా కుర్రాళ్లు బాగా రాణించారు. ముఖ్యంగా మా బౌలింగ్ ఎటాక్‌లో ఒక్క అనుభవం ఉన్న బౌలర్ లేడు. అయినప్పటికి టోర్నీ ఆసాంతం వారు అద్బుతంగా రాణించారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని కూడా చేధించాము. మా జట్టులోని కొంతమంది కుర్రాళ్లు భవిష్యత్తులో కచ్చితంగా అత్యుత్తమ క్రికెటర్లగా ఎదుగుతారు" అని స్మిత్ పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పేర్కొన్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
గెలిపించినందుకు థాంక్యూ భయ్యా.. రాహుల్‌ను హగ్ చేసుకున్న ఫ్యాన్ (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ సెమీస్ పోరులో 4 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించిన భారత్.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. భారత విజయంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి కీలక పాత్రపోషించాడు.లక్ష్య చేధనలో కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 98 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. అతడితో పాటు కేఎల్ రాహుల్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 28) సత్తాచాటారు.ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్, జంపా రెండు వికెట్లు పడగొట్టగా.. బెన్ ద్వార్షుయిస్, కొన్నోలీ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆలౌటైంది. భారత బౌలర్లలలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(96 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ తో 73) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అలెక్స్ కేరీ(61) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.టీమిండియా ప్రపంచ రికార్డు..ఇక ఈ విజయంతో టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఈ విజయంతో టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో వరుసగా మూడుసార్లు (2013, 2017, 2025) ఫైనల్లోకి ప్రవేశించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.గతంలో ఆస్ట్రేలియా 2006 2009లో బ్యాక్-టు-బ్యాక్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఆడింది. అదేవిధంగా ఐసీసీ టోర్నీలలో అత్యధికంగా ఫైనల్‌కు చేరుకున్న జట్టుగా టీమిండియా రికార్డులకెక్కింది. భారత్ ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు చేరడం ఇది 14వ సారి కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ రికార్డు వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా(13) పేరిట ఉండేది. తాజా విజయంతో ఆసీస్ ఆల్‌టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది.చదవండి: ఆఖరి వరకు ఏమీ చెప్పలేం.. వారిద్దరి వల్లే ఈ విజయం: రోహిత్ శర్మ -
రికార్డుల కంటే జట్టు గెలవడమే నాకు ముఖ్యం: విరాట్ కోహ్లి
ప్రపంచ క్రికెట్లో అతడొక రారాజు. తన ముందు ఉన్న ఎంతటి లక్ష్యమున్న వెనకడుగేయని ధీరుడు. కొండంత లక్ష్యాన్ని అలోవకగా కరిగించే ఛేజ్ మాస్టర్. ఐసీసీ టోర్నమెంట్లు అంటే పరుగులు వరద పారించే రన్ మిషన్ అతడు. అతడే టీమిండియా లెజెండ్ విరాట్ కోహ్లి. ఐసీసీ ఈవెంట్లలో తనకు ఎవరూ సాటి రారాని కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో కోహ్లి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 264 పరుగుల లక్ష్యచేధనలో పవర్ ప్లేలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో కింగ్ కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయం దిశగా నడ్పించాడు.అయితే భారత్ విజయానికి మరో 39 పరుగులు కావాల్సిన దశలో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు. 98 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. అతడి అద్బుత ఇన్నింగ్స్ ఫలితంగా ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో భారత్ ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.జస్ట్ సెంచరీ మిస్..కాగా కేవలం 16 పరుగుల దూరంలో తన 52వ వన్డే సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్ కోహ్లి కోల్పోయాడు. అయితే కోహ్లి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోవడంతో తన సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులు నిరాశచెందారు.ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే తనకు ముఖ్యమని కోహ్లి చెప్పుకొచ్చాడు. "పాకిస్తాన్‌పై ఎలా లక్ష్యాన్ని ఛేదించామో ఇది కూడా దాదాపు అదే తరహాలో సాగింది. అప్పుడు సెంచరీ చేసినా ఏడు ఫోర్లే కొట్టాను. పరిస్థితులను అర్థం చేసుకోవడమే అన్నింటికంటే ముఖ్యం. దాని ప్రకారమే నా వ్యూహం సాగుతుంది. స్ట్రయిక్ రొటేట్ చేయడం కూడా అలాంటిదే.ఇలాంటి పిచ్‌పై భాగస్వామ్యాలు నెలకొల్పడం కీలకం. బౌండరీలతో వేగంగా ఆటను ముగించే ప్రయత్నంలో నేను వెనుదిరిగా. కొన్నిసార్లు అనుకున్న ప్రణాళికలు పని చేయవు. క్రీజులో పరుగుల కోసం నేను తొందరపడలేదు. అదే నా ఇన్నింగ్స్‌లో నాకు నచ్చిన విషయం. సింగిల్స్ తీయడాన్ని కూడా ప్రాధాన్యతగా భావిస్తేనే మంచి క్రికెట్ ఆడుతున్నట్లు లెక్క. ఇక ఎలాంటి ఒత్తిడి లేదు. లక్ష్యం దిశగా వెళుతున్నామని అప్పుడే అర్థమవుతుంది. ఇలాంటి నాకౌట్ మ్యాచ్‌లలో చేతిలో వికెట్లు ఉంటే ప్రత్యర్థి కూడా ఒత్తిడిలో సునాయాసంగా పరుగులు ఇచ్చేస్తుంది. అప్పుడు మన పరిస్థితి మరింత సులువవుతుంది. ఓవర్లు, చేయాల్సిన పరుగుల గురించి స్పష్టత ఉంటే చాలు. రన్‌రేట్ ఆరు పరుగులకు వచ్చినా సమస్య ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో వికెట్లు తీస్తేనే ప్రత్యర్ధులకు అవకాశం దక్కుతుంది తప్ప నిలదొక్కుకున్న బ్యాటర్లను వారు అడ్డుకోలేరు. ఈ దశలో మైలురాళ్లు నాకు ఏమాత్రం ముఖ్యం కాదు. సెంచరీ సాధిస్తే మంచిదే. లేకపోతే విజయం దక్కిన ఆనందం ఎలాగూ ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు ఉంటాయి. ఏం చేసినా ఒదిగి ఉండి మళ్లీ సాధన చేయడం, జట్టును గెలిపించేందుకు మళ్లీ కొత్తగా బరిలోకి దిగడమే నాకు తెలిసింది. ఇప్పటికీ అదే చేస్తున్నాను" అని ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు.చదవండి: ఆఖరి వరకు ఏమీ చెప్పలేం.. వారిద్దరి వల్లే ఈ విజయం: రోహిత్ శర్మ -
ఆఖరి వరకు ఏమీ చెప్పలేం.. వారిద్దరి వల్లే ఈ విజయం: రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత క్రికెట్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో మట్టికర్పించిన టీమిండియా.. ఐదోసారి ఈ మెగా టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ విజయంతో వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. ఈ సెమీస్ పోరులో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.తొలుత బౌలర్లు సత్తాచాటగా.. అనంతరం బ్యాటర్లు సమిష్టగా రాణించారు. 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లి(Virat Kohli) మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ వికెట్లు కోల్పోయినప్పటికి విరాట్ మాత్రం తన క్లాస్‌ను చూపించాడు.మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి స్కోర్‌బోర్డును ముందుకు నడిపించాడు. అయ్యర్(45) ఔటయ్యాక అక్షర్ పటేల్‌తో కూడా కోహ్లి భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే విజయానికి మరో 39 పరుగులు కావల్సిన దశలో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు. 98 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. కేవలం 16 పరుగుల దూరంలో తన 52వ వన్డే సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్ కోహ్లి కోల్పోయాడు. ఆఖరిలో కేఎల్ రాహుల్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్, జంపా రెండు వికెట్లు పడగొట్టగా.. బెన్ ద్వార్షుయిస్, కొన్నోలీ చెరో వికెట్ పడగొట్టారు. ఇక అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) స్పందించాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్‌కు చేరడం చాలా సంతోషంగా ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు."ఆటలో ఆఖరి బంతి పడే వరకు ఏమీ చెప్పలేం. ఆసీస్ ఇన్నింగ్స్ ముగిశాక ఇది మరీ చిన్న స్కోరేమీ కాదని, విజయం కోసం మేం చాలా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఎందుకంటే సెకెండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మనం అంచనా వేయలేం. పిచ్‌పై ఎక్కువ దృష్టి పెట్టకుండా మా ఆటనే నమ్ముకున్నాం. కానీ పిచ్ కూడా కాస్త మెరుగ్గా అనిపించింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ కంటే ఈ రోజు పిచ్ చాలా బెటర్‌గా ఉంది.ఈ మ్యాచ్‌లో మా బ్యాటర్లు అద్బుతంగా రాణించారు. మేము 48 ఓవర్ వరకు గేమ్‌ను తీసుకుండొచ్చు. కానీ మా ఛేజింగ్‌లో ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా టార్గెట్‌ను ఫినిష్ చేశాము. మాకు అదే ముఖ్యం. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించిడంతోనే ఈ విజయం సాధ్యమైంది. జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు.ఇక తుది జట్టు కూర్పు ఎప్పుడూ సవాల్‌గానే ఉంటుంది. ఆరు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు, ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగలవారు ఉండాలని మేం కోరుకున్నాం. దానిని బట్టే జట్టును ఎంపిక చేశాం. ఇప్పుడు ఆ ఆరుగురు బౌలర్లను సమర్థంగా వాడుకున్నాం.విరాట్ కోహ్లి మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఎన్నో ఏళ్లుగా ఇదే తరహాలో జట్టును గెలిపిస్తూ వస్తున్నాడు. పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత మాకు ఓ పెద్ద భాగస్వామ్యం కావాలనుకున్నాం. శ్రేయస్ అయ్యర్, కోహ్లి మాకు ఆ భాగస్వామ్యం అందించారు. కేఎల్(రాహుల్), హార్దిక్ పాండ్యా కూడా ఆఖరిలో అద్భుతంగా ఆడారు. ఫైనల్‌కు ముందు ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉంటే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం లేదు. సమయం వచి్చనప్పుడు అంతా సరైన రీతిలో స్పందిస్తారు అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు. కాగా ఆదివారం జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికా లేదా న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.చదవండి: కుల్దీప్ యాదవ్‌పై మండిపడ్డ కోహ్లి, రోహిత్!.. గట్టిగానే తిట్టేశారు! -
IND Vs AUS: ఆస్టేలియాను కొట్టేశారు... ఫైనల్లో భారత్
కంగారేమీ లేదు... అంతా మన నియంత్రణలోనే సాగింది... ఆస్ట్రేలియాతో ఐసీసీ నాకౌట్ మ్యాచ్ అనగానే పెరిగే ఉత్కంఠ, ఒత్తిడి అన్నింటినీ టీమిండియా అధిగమించేసింది... ఎప్పటిలాగే టాస్ ఓడిపోవడం మినహా 11 బంతుల ముందే మ్యాచ్ ముగించే వరకు భారత్ అన్ని విధాలుగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముందు పదునైన బౌలింగ్‌తో... ఆపై చక్కటి బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను పడగొట్టి చాంపియన్స్ ట్రోఫీలో ఆఖరి సమరానికి అర్హత సాధించింది.265 పరుగుల లక్ష్యం... చాంపియన్స్ ట్రోఫీ గత రెండు మ్యాచ్‌లలో భారత్ ఛేదించిన స్కోర్లతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. బ్యాటింగ్ సాగుతున్నకొద్దీ పిచ్ నెమ్మదిస్తోంది. అయితేనేమి... కోహ్లి తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో క్లాస్ ఆటతీరుతో అలవోకగా పరుగులు రాబడుతూ జట్టును నడిపించాడు. ఆరంభంలో రోహిత్, ఆపై అయ్యర్, రాహుల్, పాండ్యా... ఇలా అంతా అండగా నిలవడంతో గెలుపు భారత్ దరిచేరింది. ఆసీస్ ఆట సెమీఫైనల్లోనే ముగిసింది. 2017 చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరిన భారత్ తుది పోరులో పాకిస్తాన్ చేతిలో ఓడింది. ఆ తర్వాత మూడు ఐసీసీ వన్డే టోర్నీల్లోనూ కనీసం సెమీస్ లేదా ఫైనల్‌కు చేరి తమ స్థాయిని చూపించింది. మధ్యలో గెలిచిన టి20 వరల్డ్ కప్ దీనికి అదనం. ఇప్పుడు మరో టైటిల్ వేటలో టీమిండియా ప్రత్యర్థి ఎవరో నేడు తేలనుంది. ఇదే జోరు కొనసాగిస్తే 2013 తరహాలోనే అజేయ ప్రదర్శనతో మళ్లీ మనం చాంపియన్స్ కావడం ఖాయం! దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి భారత్ ఫైనల్ చేరింది. గత టోర్నీ రన్నరప్ అయిన టీమిండియా ఈసారి అజేయ ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (96 బంతుల్లో 73; 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ కేరీ (57 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. షమీ 3 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లకు 267 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (98 బంతుల్లో 84; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 45; 3 ఫోర్లు), కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం దుబాయ్‌లోనే జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. రాణించిన స్మిత్... హెడ్ మరోసారి భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ‘సున్నా’ వద్ద ఇచి్చన రిటర్న్ క్యాచ్‌ను షమీ అందుకోలేకపోవడంతో అతను బతికిపోగా, మరో ఎండ్‌లో కూపర్ కనోలీ (9 బంతుల్లో 0) విఫలమయ్యాడు. పాండ్యా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన హెడ్, షమీ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. దాంతో ఆరో ఓవర్లోనే భారత్ స్పిన్నర్ కుల్దీప్ను బౌలింగ్‌కు దింపింది. మరో మూడు ఓవర్ల తర్వాత భారత్ అసలు ఫలితం సాధించింది.వరుణ్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ షాట్ ఆడబోయి హెడ్ లాంగాఫ్‌లో గిల్‌కు క్యాచ్ ఇవ్వడంతో జట్టు ఊపిరి పీల్చుకుంది. మరోవైపు స్మిత్ సాహసాలకు పోకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. అతనికి కొద్దిసేపు లబుషేన్ (36 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. 68 బంతుల్లో స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే తక్కువ వ్యవధిలో లబుషేన్, ఇన్‌గ్లిస్ (12 బంతుల్లో 11)లను అవుట్ చేసి జడేజా దెబ్బ కొట్టాడు. ఈ దశలో స్మిత్, కేరీ భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. వీరిద్దరు కలిసి స్కోరును 200 వరకు తీసుకొచ్చారు. ఈ భాగస్వామ్యం బలపడుతున్న దశలో షమీ ఆటను మలుపు తిప్పాడు. అతని బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడబోయిన స్మిత్ బౌల్డయ్యాడు. మ్యాక్స్‌వెల్ (5 బంతుల్లో 7; 1 సిక్స్) విఫలం కాగా, ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో కేరీ దూకుడుతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. కీలక భాగస్వామ్యాలు... ఛేదనలో ఆరంభంలోనే శుబ్‌మన్ గిల్ (11 బంతుల్లో 8; 1 ఫోర్) వెనుదిరగ్గా... క్రీజ్‌లో ఉన్నంత సేపు రోహిత్ శర్మ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. అయితే ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కోహ్లి, అయ్యర్ భాగస్వామ్యంతో జట్టు సురక్షిత స్థితికి చేరింది. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేసిన వీరిద్దరు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా టీమ్‌ను విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో 53 బంతుల్లో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి కాగా, అయ్యర్ దానిని చేజార్చుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 18.3 ఓవర్లలో 91 పరుగులు జోడించారు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (30 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), రాహుల్‌లతో కోహ్లి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 51 వద్ద మ్యాక్స్‌వెల్ క్యాచ్ వదిలేయడం కూడా కోహ్లికి కలిసొచ్చింది. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న అతను టోర్నీలో మరో శతకం అందుకునేలా కనిపించాడు. అయితే విజయానికి 40 పరుగుల దూరంలో భారీ షాట్‌కు ప్రయత్నించి విరాట్ అవుటయ్యాడు. ఈ స్థితిలో హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ ఛేదనను సులువు చేసింది. 20 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండగా కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే జంపా ఓవర్లో పాండ్యా రెండు వరుస సిక్సర్లు బాదగా... అతను అవుటైన తర్వాత మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో రాహుల్ మ్యాచ్‌ను ముగించాడు. 1 చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో వరుసగా మూడుసార్లు (2013, 2017, 2025) ఫైనల్లోకి ప్రవేశించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. 7 ఐసీసీ వన్డే టోర్నీలలో కోహ్లికి లభించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (10), రోహిత్ శర్మ (8) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 14 ఐసీసీ టోర్నీలలో అత్యధికంగా 14 సార్లు ఫైనల్ చేరుకున్న జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియా (13)ను భారత్ వెనక్కి నెట్టింది. 746 చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి (746 పరుగులు) రెండో స్థానానికి చేరాడు. తొలి స్థానంలో క్రిస్ గేల్ (791 పరుగులు), మూడో స్థానంలో జయవర్ధనే (742) ఉన్నారు. గిల్‌కు అంపైర్ వార్నింగ్ హెడ్ క్యాచ్ పట్టినప్పుడు శుబ్‌మన్ గిల్ ప్రదర్శించిన ‘అతి’ ఆనందం అంపైర్ నుంచి హెచ్చరికకు గురయ్యేలా చేసింది. క్యాచ్ అందుకోగానే కొద్ది సేపయినా తన చేతిలో ఉంచకుండా అతను బంతిని గాల్లోకి విసిరేశాడు. నిజానికి క్యాచ్ పట్టడంలో అతను ఎక్కడా తడబడలేదు. అయితే ఎంతసేపు అనే విషయంలో నిబంధనలు సరిగ్గా లేకపోయినా... కనీసం 2–3 సెకన్ల పాటు ఫీల్డర్ బంతిని తన నియంత్రణలో ఉంచుకోవాలి. ఇదే విషయాన్ని అంపైర్ ఇల్లింగ్‌వర్త్ ప్రత్యేకంగా గిల్‌కు వివరించాడు. ఇలాంటి సందర్భాల్లో అవుట్/నాటౌట్ ఇచ్చే విషయంలో అంపైర్‌కు విచక్షణాధికారం ఉంటుంది.స్మిత్ అదృష్టం అక్షర్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అనూహ్యం చోటు చేసుకుంది. స్మిత్ డ్రైవ్ చేయగా బంతి అతడి ప్యాడ్ల మీదుగా స్టంప్స్‌ను తాకింది. అయితే బెయిల్స్ పడకపోవడంతో స్మిత్ బతికిపోయాడు. ఆపే ప్రయత్నం చేస్తే తన కాలితోనే స్టంప్స్ పడిపోతాయని భావనతో కావచ్చు స్మిత్ అలా కూడా చేయలేదు. ఆ సమయంలో అతని స్కోరు 23 పరుగులు. అతని స్కోరు 36 వద్ద ఉన్నప్పుడు షమీ బౌలింగ్‌లో బలంగా షాట్ కొట్టగా... తన ఎడమ చేత్తో క్యాచ్ పట్టే ప్రయత్నం చేసిన షమీ విఫలమయ్యాడు. అయితే ఇది చాలా కఠినమైన క్యాచ్. రోహిత్‌కు లైఫ్కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగుల ఇన్నింగ్స్‌లో కూడా రెండుసార్లు అదృష్టం కలిసొచి్చంది. 13 పరుగుల వద్ద బ్యాక్వర్డ్ పాయింట్లో అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కనోలీ వదిలేయగా... 14 వద్ద కాస్త కష్టసాధ్యమైన క్యాచ్‌ను లబుషేన్ అందుకోలేకపోయాడు. పాకిస్తాన్‌పై ఎలా లక్ష్యాన్ని ఛేదించామో ఇది కూడా దాదాపు అదే తరహాలో సాగింది. అప్పుడు సెంచరీ చేసినా ఏడు ఫోర్లే కొట్టాను. పరిస్థితులను అర్థం చేసుకోవడమే అన్నింటికంటే ముఖ్యం. దాని ప్రకారమే నా వ్యూహం సాగుతుంది. స్ట్రయిక్ రొటేట్ చేయడం కూడా అలాంటిదే. ఇలాంటి పిచ్‌పై భాగస్వామ్యాలు నెలకొల్పడం కీలకం. బౌండరీలతో వేగంగా ఆటను ముగించే ప్రయత్నంలో నేను వెనుదిరిగా. కొన్నిసార్లు అనుకున్న ప్రణాళికలు పని చేయవు. క్రీజులో పరుగుల కోసం నేను తొందరపడలేదు. అదే నా ఇన్నింగ్స్‌లో నాకు నచ్చిన విషయం. సింగిల్స్ తీయడాన్ని కూడా ప్రాధాన్యతగా భావిస్తేనే మంచి క్రికెట్ ఆడుతున్నట్లు లెక్క. ఇక ఎలాంటి ఒత్తిడి లేదు. లక్ష్యం దిశగా వెళుతున్నామని అప్పుడే అర్థమవుతుంది. ఇలాంటి నాకౌట్ మ్యాచ్‌లలో చేతిలో వికెట్లు ఉంటే ప్రత్యర్థి కూడా ఒత్తిడిలో సునాయాసంగా పరుగులు ఇచ్చేస్తుంది. అప్పుడు మన పరిస్థితి మరింత సులువవుతుంది. ఓవర్లు, చేయాల్సిన పరుగుల గురించి స్పష్టత ఉంటే చాలు. రన్‌రేట్ ఆరు పరుగులకు వచ్చినా సమస్య ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో వికెట్లు తీస్తేనే ప్రత్యర్థికి అవకాశం దక్కుతుంది తప్ప నిలదొక్కుకున్న బ్యాటర్లను వారు అడ్డుకోలేరు. ఈ దశలో మైలురాళ్లు నాకు ఏమాత్రం ముఖ్యం కాదు. సెంచరీ సాధిస్తే మంచిదే. లేకపోతే విజయం దక్కిన ఆనందం ఎలాగూ ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు ఉంటాయి. ఏం చేసినా ఒదిగి ఉండి మళ్లీ సాధన చేయడం, జట్టును గెలిపించేందుకు మళ్లీ కొత్తగా బరిలోకి దిగడమే నాకు తెలిసింది. ఇప్పటికీ అదే చేస్తున్నాను. –విరాట్ కోహ్లి ఆటలో ఆఖరి బంతి పడే వరకు ఏమీ చెప్పలేం. ఆసీస్ ఇన్నింగ్స్ ముగిశాక ఇది మరీ చిన్న స్కోరేమీ కాదని, విజయం కోసం మేం చాలా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఇవాళ మా బ్యాటింగ్ అన్ని రకాలుగా బాగుంది. పిచ్ కూడా మెరుగ్గా అనిపించింది. అయితే పిచ్‌పై ఎక్కువ దృష్టి పెట్టకుండా మా ఆటనే నమ్ముకున్నాం. ఆరు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు, ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగలవారు ఉండాలని మేం కోరుకున్నాం.దానిని బట్టే జట్టును ఎంపిక చేశాం. ఇప్పుడు ఆ ఆరుగురు బౌలర్లను సమర్థంగా వాడుకున్నాం. కోహ్లి ఎన్నో ఏళ్లుగా ఇదే తరహాలో జట్టును గెలిపిస్తూ వస్తున్నాడు. ఫైనల్‌కు ముందు ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉంటే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం లేదు. సమయం వచి్చనప్పుడు అంతా సరైన రీతిలో స్పందిస్తారు. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ 4 ఐసీసీ ఈవెంట్లు... వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లలో భారత్‌ను ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 336 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న భారతీయ ఫీల్డర్‌గా కోహ్లి ఘనత వహించాడు. 334 క్యాచ్‌లతో రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును కోహ్లి సవరించాడు. వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న రెండో ఫీల్డర్‌గానూ కోహ్లి (161 క్యాచ్‌లు) నిలిచాడు. శ్రీలంక ప్లేయర్ మహేళ జయవర్ధనే (218 క్యాచ్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) గిల్ (బి) వరుణ్ 39; కనోలీ (సి) రాహుల్ (బి) షమీ 0; స్మిత్ (బి) షమీ 73; లబుషేన్ (ఎల్బీ) (బి) జడేజా 29; ఇన్‌గ్లిస్ (సి) కోహ్లి (బి) జడేజా 11; కేరీ (రనౌట్) 61; మ్యాక్స్‌వెల్ (బి) అక్షర్ 7; డ్వార్షూయిస్ (సి) అయ్యర్ (బి) వరుణ్ 19; జంపా (బి) పాండ్యా 7; ఎలిస్ (సి) కోహ్లి (బి) షమీ 10; తన్విర్ సంఘా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 264. వికెట్ల పతనం: 1–4, 2–54, 3–110, 4–144, 5–198, 6–205, 7–239, 8–249, 9–262, 10–264. బౌలింగ్: షమీ 10–0–48–3, హార్దిక్ పాండ్యా 5.3–0–40–1, కుల్దీప్ యాదవ్ 8–0–44–0, వరుణ్ చక్రవర్తి 10–0–49–2, అక్షర్ పటేల్ 8–1–43–1, రవీంద్ర జడేజా 8–1–40–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) కనోలీ 28; గిల్ (బి) డ్వార్షూయిస్ 8; కోహ్లి (సి) డ్వార్షూయిస్ (బి) జంపా 84; అయ్యర్ (బి) జంపా 45; అక్షర్ (బి) ఎలిస్ 27; రాహుల్ (నాటౌట్) 42; పాండ్యా (సి) మ్యాక్స్‌వెల్ (బి) ఎలిస్ 28; జడేజా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (48.1 ఓవర్లలో 6 వికెట్లకు) 267. వికెట్ల పతనం: 1–30, 2–43, 3–134, 4–178, 5–225, 6–259. బౌలింగ్: డ్వార్షూయిస్ 7–0–39–1, ఎలిస్ 10–0–49–2, కనోలీ 8–0–37–1, జంపా 10–0–60–2, సంఘా 6–0–41–0, మ్యాక్స్‌వెల్ 6.1–0–35–0, హెడ్ 1–0–6–0. -
Rohit Sharma: చరిత్రలో ఒకే ఒక్కడు
దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 4) జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా వరుసగా మూడోసారి (2013, 2017, 2025), మొత్తంగా ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ గెలుపుతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నాలుగు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు చేరిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా 2023 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్.. తాజాగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ చేరింది. ప్రపంచంలో ఏ ఇతర కెప్టెన్ ఈ నాలుగు ఐసీసీ టోర్నీల్లో తన జట్టును ఫైనల్స్‌కు చేర్చలేదు. ప్రస్తుతం ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే.ప్రతీకారం తీర్చుకున్న భారత్తాజాగా గెలుపుతో భారత్ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. 2023 వరల్డ్‌కప్ ఫైనల్స్ తర్వాత వన్డేల్లో భారత్ ఆసీస్‌ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. హ్యాట్రిక్ విజయాలుఇతర టోర్నీలో భారత్ పాలిట కొరకరాని కొయ్యగా ఉన్న ఆస్ట్రేలియా.. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకపోతుంది. ఈ టోర్నీలో భారత్ ఆసీస్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇరు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్‌లో మూడుసార్లు ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో టీమిండియానే జయకేతనం ఎగురవేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్‌లో భారత్, ఆస్ట్రేలియా తొలిసారి 1998 ఎడిషన్ క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. తర్వాత 2000 ఎడిషన్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఇరు జట్లు రెండో సారి ఢీకొన్నాయి. ఈసారి భారత్ 20 పరుగుల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. తాజాగా 2025 ఎడిషన్ సెమీస్‌లో గెలుపుతో భారత్ ఆసీస్‌పై హ్యాట్రిక్ విజయాలు (ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్‌లో) నమోదు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో విరాట్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (84) ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (8) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డ్వార్షుయిస్, కన్నోలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, రేపు (మార్చి 5) జరుగబోయే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతతో భారత్ మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడుతుంది. -
Champions Trophy 2025: విరాట్ అదరహో.. సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్ భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 4) జరిగిన తొలి సెమీస్‌లో టీమిండియా ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి (మొత్తంగా ఐదోసారి) ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో (షమీ) బరిలోకి దిగినప్పటికీ ఆసీస్‌ను ఆలౌట్ చేయడంలో సఫలమైంది.ఛేదనలో విరాట్ (84) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (8) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డ్వార్షుయిస్, కన్నోలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ వన్డే ఈవెంట్లలో ఆసీస్ నిర్దేశించిన అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.కాగా, రేపు (మార్చి 5) జరుగబోయే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతతో భారత్ మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడుతుంది. -
IND Vs AUS Photos: ఆసీస్‌పై ఘన విజయం.. ఫైనల్లో టీమిండియా (ఫొటోలు)
-
CT 2025, IND Vs AUS 1st Semis: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న తొలి సెమీఫైనల్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 265 పరుగుల ఛేదనలో విరాట్ 98 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 84 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ చరిత్రపుట్లోకెక్కాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లి-1003రోహిత్ శర్మ-808రికీ పాంటింగ్-731ఈ మ్యాచ్‌లో విరాట్ మరో రికార్డు కూడా సాధించాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (24) చేసిన ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (23) పేరిట ఉండేది. తాజా హాఫ్ సెంచరీతో విరాట్ తన పేరిట ఉండిన మరో రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఐసీసీ నాకౌట్స్‌లో విరాట్ తన హాఫ్ సెంచరీల సంఖ్యను 10కి పెంచుకున్నాడు. ఐసీసీ నాకౌట్స్‌లో సచిన్, స్టీవ్ స్మిత్ తలో ఆరు అర్ద సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం విరాట్ కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ (84) ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. -
CT 2025, IND VS AUS 1st Semis: రోహిత్, విరాట్ ఇలాంటి నిర్ణయం ఎందుకు?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో భారత్ లక్ష్యం దిశగా పయనిస్తుంది. 33 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 167/3గా ఉంది. శుభ్‌మన్ గిల్ (8), రోహిత్ శర్మ (28), శ్రేయస్ అయ్యర్ (45) ఔట్ కాగా.. విరాట్ కోహ్లి (64), అక్షర్ పటేల్ (20) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 17 ఓవర్లలో మరో 98 పరుగులు చేయాలి. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్‌కు.. శ్రేయస్ అయ్యర్ వికెట్ ఆడమ్ జంపాకు దక్కింది.pic.twitter.com/9zGKhnuFuP— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 4, 2025రోహిత్, విరాట్ చెత్త నిర్ణయంకాగా, భారత్ బ్యాటింగ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఓ చెత్త నిర్ణయం తీసుకున్నారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ చివరి బంతికి కూపర్ కన్నోలీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ అయినట్లు ఫీల్డ్ అంపైర్ ప్రకటించాడు. రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయినట్లు సుస్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయం రోహిత్‌తో పాటు నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లి కూడా తెలుసు. అయినప్పటికీ రోహిత్, కోహ్లితో చర్చించి రివ్యూ వెళ్లడం అభిమానులను విస్మయానికి గురి చేసింది. వికెట్ల ముందు దొరికిపోయినట్లు క్లియర్‌గా తెలుస్తున్నా రోహిత్, కోహ్లి రివ్యూకి వెళ్లడమేంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మ్యాచ్‌లో చాలా దూరం ప్రయాణించాల్సి ఉండగా అనవసరంగా రివ్యూ వేస్ట్ చేశారని దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, కన్నోలీ సంధించిన ఫుల్ లెంగ్త్ బంతిని స్వీప్ చేయబోయి రోహిత్ వికెట్ల ముందు ఈజీగా దొరికిపోయాడు. -
CT 2025, IND VS AUS 1st Semis: 97 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్లో తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్ భారత్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచింది. 49.3 ఓవర్లలో ఆ జట్టు 264 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో భారత్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ 8, రోహిత్ శర్మ 28 పరుగులు చేసి ఔటయ్యారు. విరాట్ కోహ్లి (26 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (29 నాటౌట్) భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 19 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 93/2గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 31 ఓవర్లలో 172 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్‌కు దక్కింది.97 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా..!ఈ మ్యాచ్‌లో భారత్ ఆసక్తికర రీతిలో జట్టును సమీకరించింది. కేవలం ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో (మహ్మద్ షమీ) బరిలోకి దిగింది. 97 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్ ఓ ఐసీసీ ఈవెంట్ సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఇలా ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి.మొత్తంగా ఐసీసీ వన్డే సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఓ జట్టు ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగడం ఇదే నాలుగో సారి మాత్రమే. తొలి రెండు సందర్భాలు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి రెండు ఎడిషన్లలో (1998, 2000) చోటు చేసుకోవడం విశేషం. 1998 ఎడిషన్ ఫైనల్లో సౌతాఫ్రికా, 2000 ఎడిషన్ సెమీస్‌లో పాకిస్తాన్ జట్లు ఇలానే ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగాయి. మూడో సందర్భం 2011 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో చోటు చేసుకుంది. నాడు శ్రీలంక న్యూజిలాండ్‌పై ఒకే ఒక పేసర్‌ను బరిలోకి దించి విజయం సాధించింది. 14 ఏళ్ల అనంతరం భారత్ తిరిగి ఓ ఐసీసీ ఈవెంట్ సెమీస్‌లో ఒకే ఒక పేసర్‌ను బరిలోకి దించి పెద్ద సాహసమే చేసింది.ఐసీసీ ఈవెంట్ల సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగిన జట్లు..సౌతాఫ్రికా (1998 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్)- వెస్టిండీస్‌పై గెలుపుపాకిస్తాన్ (2000 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్)- న్యూజిలాండ్ చేతిలో ఓటమిశ్రీలంక (2011 వన్డే వరల్డ్‌కప్ సెమీస్)- న్యూజిలాండ్‌పై గెలుపుభారత్ (2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్) -
‘ఎందుకింత నిర్లక్ష్యం?’.. కుల్దీప్పై మండిపడ్డ కోహ్లి, రోహిత్!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy).. సెమీ ఫైనల్ మ్యాచ్.. అసలే ఆస్ట్రేలియా.. ఏమాత్రం అవకాశం ఇచ్చినా మ్యాచ్‌ను లాగేసుకునే ఆటగాళ్లకు ఆ జట్టులో కొదువలేదు. అలాంటి ప్రత్యర్థితో తలపడుతున్నపుడు ఒళ్లంతా కళ్లు చేసుకోవాలి. ముఖ్యంగా ఫీల్డింగ్ చేస్తున్నపుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కీలక మ్యాచ్‌లలో ప్రతీ పరుగు ఎంతో విలువైనది. సింగిలే కదా అని వదిలేస్తే అదే మన పాలిట శాపంగా మారవచ్చు. అందుకే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli).. భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేసిన తప్పిదాన్ని సహించలేకపోయారు. మైదానంలోనే అతడిపై ఈ ఇద్దరు తిట్ల దండకం అందుకున్నారు.ఎందుకింత నిర్లక్ష్యం? మండిపడ్డ దిగ్గజాలు‘ఎందుకింత నిర్లక్ష్యం’ అన్నట్లుగా గుడ్లు ఉరిమి చూస్తూ కుల్దీప్ యాదవ్‌పై ‘విరాహిత్’ ద్వయం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్ సందర్భంగా 32వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మిడ్ వికెట్ మీదుగా బంతిని బాది.. అలెక్స్ క్యారీతో సమన్వయం చేసుకుని సింగిల్ కోసం వెళ్లాడు.ఈ క్రమంలో వేగంగా కదిలిన విరాట్ కోహ్లి వెంటనే బంతిని కలెక్ట్ చేసుకుని నాన్- స్ట్రైకర్ ఎండ్ దగ్గర ఉన్న కుల్దీప్ వైపు వేశాడు. అయితే, కుల్దీప్ మాత్రం బంతిని అందుకునే ప్రయత్నం కూడా చేయకుండా.. బాల్ దూరంగా వెళ్తున్నపుడు అలాగే చూస్తుండిపోయాడు. కనీసం దానిని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. బహుశా బంతి వికెట్లను తాకుతుందని అతడు అలా చేసి ఉంటాడు.అయితే, అలా జరుగలేదు. ఇంతలో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ వచ్చి వెంటనే బంతిని ఆపి.. ఆసీస్‌కు అదనపు పరుగు రాకుండా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ వైపు చూస్తూ అతడిపై మండిపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 264 పరుగులకు ఆసీస్ ఆలౌట్‌కాగా దుబాయ్ వేదికగా ఈ సెమీస్ మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాను 264 పరుగులకు కట్టడి చేయగలిగింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ(3/48), వరుణ్ చక్రవర్తి(2/49), రవీంద్ర జడేజా (2/40) రాణించగా.. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ నిరాశపరిచాడు. ఎనిమిది ఓవర్ల బౌలింగ్‌లో 44 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.సెమీస్‌లో ఈ నాలుగుఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఎనిమిది జట్లు భాగంగా ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్‌తో పాటు బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లను నాకౌట్ చేసి గ్రూప్-‘ఎ’ నుంచి టీమిండియా, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ చేరగా.. గ్రూప్-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్లను ఇంటికి పంపి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌లో అడుగుపెట్టాయి. భారత్ మంగళవారం దుబాయ్ వేదికగా.. ఆసీస్‌ను నాలుగు వికె ట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. విరాట్ కోహ్లి(84), శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42) రాణించారు. సౌతాఫ్రికా- న్యూజిలాండ్ లాహోర్‌లో బుధవారం అమీతుమీ తేల్చుకుంటాయి. చదవండి: NZ vs PAK: రిజ్వాన్, బాబర్‌లపై వేటు.. పాక్ కొత్త కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్Chuldeep😭😭 https://t.co/KNa6yFug5e pic.twitter.com/fHfGsRl8iD— S A K T H I ! (@Classic82atMCG_) March 4, 2025😂😂😂 https://t.co/r5K5MJW6XX pic.twitter.com/iVansWOhAv— Ayush. (@Ayush_vk18) March 4, 2025 -
CT 2025, IND VS AUS: సిక్సర్ల శర్మ.. హిట్‌మ్యాన్ ఖాతాలో మరో రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో మరో రికార్డు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఓ సిక్సర్ బాదిన రోహిత్.. ఐసీసీ వన్డే ఈవెంట్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరించాడు. రోహిత్ ఐసీసీ వన్డే టోర్నీల్లో ఇప్పటివరకు 42 ఇన్నింగ్స్‌ల్లో 65 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు రోహిత్, క్రిస్ గేల్ పేరిట సంయుక్తంగా ఉండేది. గేల్ 51 ఇన్నింగ్స్‌ల్లో 64 సిక్సర్లు బాదాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాస్-5 ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.రోహిత్ శర్మ-65 సిక్సర్లు (42 ఇన్నింగ్స్‌లు)క్రిస్ గేల్-64 (51 ఇన్నింగ్స్‌లు)గ్లెన్ మ్యాక్స్‌వెల్-49 (30 ఇన్నింగ్స్‌లు)డేవిడ్ మిల్లర్-45 (30 ఇన్నింగ్స్‌లు)సౌరవ్ గంగూలీ-42 (32 ఇన్నింగ్స్‌లు)మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ 29 బంతుల్లో 3 బౌండరీలు, ఓ సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ టోర్నీలో రోహిత్‌కు మరోసారి మంచి ఆరంభం లభించినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు. రోహిత్ తక్కువ స్కోర్‌కే ఔట్ కావడం టీమిండియా విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. 265 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా తక్కువ స్కోర్‌కే (8) ఔటయ్యాడు. రోహిత్ ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 43/2గా ఉంది. విరాట్ కోహ్లి (5), శ్రేయస్ అయ్యర్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్‌కు దక్కింది.ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలు చేసి ఆసీస్‌కు ఫైటింగ్ స్కోర్ అందించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
IND vs AUS: ఛేదించేశారు..
ఆస్ట్రేలియా(India vs Australia)తో సెమీ ఫైనల్లో టీమిండియా బౌలర్లు రాణించారు. కంగారూ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేశారు. 49.3 ఓవర్లలోనే స్మిత్ బృందాన్ని ఆలౌట్ చేశారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో తొలి సెమీ ఫైనల్లో గ్రూప్-‘ఎ’ టాపర్ భారత్- గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా తలపడుతున్నాయి.దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే ఓపెనర్ కూపర్ కన్నోలి(0) వికెట్ కోల్పోయిన ఆసీస్ ఇన్నింగ్స్‌ను మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ చక్కదిద్దారు. హెడ్ 33 బంతుల్లో 39 పరుగులు చేయగా.. వరుణ్ చక్రవర్తి అద్భుత బంతితో అతడిని పెవిలియన్‌కు పంపాడు.స్మిత్, క్యారీ హాఫ్ సెంచరీలుఇక అర్ధ శతకం పూర్తి చేసుకుని ప్రమాదకారిగా మారిన స్మిత్ ఆటను మహ్మద్ షమీ కట్టించాడు. 73 పరుగుల వద్ద ఉన్న సమయంలో స్మిత్‌ను అతడు బౌల్డ్ చేశాడు. మిగతా వాళ్లలో మార్నస్ లబుషేన్ ఫర్వాలేదనిపించగా.. అలెక్స్ క్యారీ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 57 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అయితే, మైదానంలో పాదరసంలా కదిలిన శ్రేయస్ అయ్యర్ అతడిని రనౌట్ చేశాడు.షమీకి మూడు వికెట్లుఇదిలా ఉంటే.. గ్లెన్ మాక్స్వెల్(7)నున అక్షర్ పటేల్ బౌల్డ్ చేయగా.. బెన్ డ్వార్షుయిస్(19), ఆడం జంపా(7), నాథన్ ఎల్లిస్(10), తన్వీర్ సంఘా(1 నాటౌట్) కనీస పోరాటం చేయలేదు. ఫలితంగా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ షమీ అత్యధికంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక వికెట్ దక్కించుకున్నాడు. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి రెండు, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.ఛేదిస్తే చరిత్రే..కాగా ఐసీసీ టోర్నమెంట్లలో 2011 తర్వాత టీమిండియా నాకౌట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాను ఓడించలేకపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆసీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదిస్తే సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ లేదా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లలో ఆస్ట్రేలియా విధించిన అత్యధిక లక్ష్య ఛేదనను పూర్తి చేసిన ఏకైక జట్టు టీమిండియానే.వన్డే ప్రపంచకప్-2011 టోర్నీలో అహ్మదాబాద్ వేదికగా క్వార్టర్ ఫైనల్లో ఆసీస్ ఇచ్చిన 261 పరుగుల టార్గెట్‌ను నాడు ధోని సేన పూర్తి చేసింది. ఇక తాజాగా ఆస్ట్రేలియా 265 పరుగుల లక్ష్యాన్ని విధించింది. దీనిని ఛేదిస్తే ఆస్ట్రేలియాపై తమకున్న రికార్డును తామే బద్దలుకొట్టినట్లవుతుంది. అప్డేట్: విరాట్ కోహ్లి(84), శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42) రాణించడంతో భారత్ ఆసీస్ ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేసి నాలుగు వికె ట్ల తేడాతో గెలుపొందింది.చాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీస్- తుదిజట్లు ఇవేటీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.ఆస్ట్రేలియా కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.చదవండి: రోహిత్ శర్మ ‘చెత్త’ రికార్డు! -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్లో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఈసారి విరాట్ బ్యాటర్‌గా కాకుండా ఫీల్డర్‌గా ఓ ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న మ్యాచ్‌లో జోస్ ఇంగ్లిస్ క్యాచ్ పట్టుకున్న విరాట్.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న ఫీల్డర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లిస్ క్యాచ్‌కు ముందు ఈ రికార్డు విరాట్, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్లో చెరి 334 క్యాచ్‌లు పట్టారు. ఇంగ్లిస్ క్యాచ్‌తో విరాట్ సోలోగా ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లు) ఇప్పటివరకు 657 ఇన్నింగ్స్‌ల్లో పాల్గొని 335 క్యాచ్‌లు అందుకోగా.. రాహుల్ ద్రవిడ్ 571 ఇన్నింగ్స్‌ల్లో 334 క్యాచ్‌లు పట్టాడు. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్, ద్రవిడ్ తర్వాత మహ్మద్ అజహరుద్దీన్ (261), సచిన్ టెండూల్కర్ (256) ఉన్నారు.ఓవరాల్‌గా చూస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌ల రికార్డు మహేళ జయవర్దనే పేరిట ఉంది. జయవర్దనే 768 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో 440 క్యాచ్‌లు పట్టాడు. ఈ జాబితాలో జయవర్దనే తర్వాత రికీ పాంటింగ్ (364), రాస్ టేలర్ (351) జాక్ కల్లిస్ (338) ఉన్నారు. విరాట్ 335 క్యాచ్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు.భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ విషయానికొస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ తొలి సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కూపర్ కన్నోలిని షమీ డకౌట్ చేశాడు. ఆతర్వాత కొద్ది సేపు ట్రవిస్ హెడ్ మెరుపులు మెరిపించాడు. హెడ్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్ కొద్ది సేపటి వరకు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. అనంతరం రవీంద్ర జడేజా లబూషేన్‌ను (29) బోల్తా కొట్టించాడు. ఆతర్వాత వచ్చిన జోస్ ఇంగ్లిస్ (11) కొద్ది సేపే క్రీజ్‌లో నిలబడి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇంగ్లిస్ తర్వాత బరిలోకి దిగిన అలెక్స్ క్యారీ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టాస్తున్నాడు. స్టీవ్ స్మిత్, క్యారీ ఐదో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. స్టీవ్ స్మిత్ 71, క్యారీ 38 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 36 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ 195/4గా ఉంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 2, షమీ, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. -
రోహిత్ శర్మ ‘చెత్త’ రికార్డు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన సారథుల జాబితాలోకి హిట్‌మ్యాన్ చేరాడు. నెదర్లాండ్స్ మాజీ కెప్టెన్ పీటర్ బారెన్ పేరిట ఉన్న రికార్డును అతడు సమం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్ తొలి సెమీ ఫైనల్లో టీమిండియా- ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య మ్యాచ్సందర్భంగా రోహిత్ ఖాతాలో ఈ ఫీట్ నమోదైంది.టాపర్‌గా నిలిచిన టీమిండియాకాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలైన ఈ వన్డే టోర్నీలో టీమిండియా మాత్రం దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతోంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత బంగ్లాదేశ్, పాకిస్తాన్లను ఓడించి సెమీస్ చేరిన రోహిత్ సేన.. గ్రూప్ దశలో ఆఖరిదైన న్యూజిలాండ్ మ్యాచ్‌లోనూ గెలిచి టాపర్‌గా నిలిచింది. అయితే, ఈ మూడు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడం గమనార్హం.తాజాగా ఆస్ట్రేలియాతో మంగళవారం నాటి సెమీస్ మ్యాచ్‌లోనూ రోహిత్‌ను మరోసారి దురదృష్టం పలకరించింది. టాస్ గెలిస్తే తమకు నచ్చిన విధంగా మ్యాచ్‌లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, గత పదకొండు సందర్భాల్లోనూ రోహిత్ టాస్ ఓడి ప్రత్యర్థి జట్టుకే మొదటి ఛాయిస్ ఇచ్చేశాడు. వరుసగా పదకొండుసార్లు టాస్ ఓడిపోయాడు.ఇక వన్డే ఇంటర్నేషనల్స్‌లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్‌గా బ్రియన్ లారా ముందున్నాడు. అతడి తర్వాతి స్థానంలో పీటర్ బారెన్, రోహిత్ శర్మ కొనసాగుతున్నారు.వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లు👉బ్రియన్ లారా- వెస్టిండీస్ మాజీ సారథి- అక్టోబరు 1998- మే 1999 వరకు- 12 సార్లు టాస్ ఓడిపోయాడు.👉పీటర్ బారెన్- నెదర్లాండ్స్ మాజీ కెప్టెన్- మార్చి 2011 నుంచి ఆగష్టు 2013👉రోహిత్ శర్మ- ఇండియా కెప్టెన్- నవంబరు 2023- మార్చి 2025*గ్రూప్ దశలోనే ఆ జట్ల ఇంటిబాటకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో మొత్తం ఎనిమిది జట్లు భాగమయ్యాయి. ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా పాకిస్తాన్ అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్-2023లో అదరగొట్టిన ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌లతో పాటు ఇంగ్లండ్ టోర్నీలో అడుగుపెట్టాయి.ఈ క్రమంలో వీటిని రెండు గ్రూపులుగా విభజించగా గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి. పాక్, బంగ్లాదేశ్‌లతో పాటు.. అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. భారత్, న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. దుబాయ్‌లో మార్చి 4న తొలి సెమీస్‌లో భారత్- ఆసీస్.. లాహోర్ మార్చి 5న రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా-న్యూజిలాండ్ తలపడేలా షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IND vs AUS: ఆ ఒక్కడే కాదు.. వాళ్లంతా ప్రమాదకరమే.. మేము గెలవాలంటే: స్మిత్ -
IND vs AUS: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే: సురేశ్ రైనా
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా టీమిండియా- ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ గురించే చర్చ. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) కీలక పోరులో విజయం సాధించే జట్టుపై మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మెజారిటీ మంది భారత్‌వైపే మొగ్గుచూపుతున్నారు. ఒకే వేదికపైనే తమ మ్యాచ్‌లన్నీ ఆడటం టీమిండియాకు సానుకూలంగా మారిందని అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకునే ఆటగాడిపై తన అంచనా తెలియజేశాడు. భారత్- ఆసీస్ మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఈ అవార్డు గెలుచుకుంటాడని జోస్యం చెప్పాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడేఅదే విధంగా.. ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో కెప్టెన్ రోహిత్ శర్మ శతకం బాదితే టీమిండియా గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. అయితే, ఫీల్డింగ్, క్యాచ్‌ల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా మొదటికే మోసం వస్తుందని రోహిత్ సేనను రైనా హెచ్చరించాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆసీస్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలుస్తాడు. ఇక ఈ ఐసీసీ టోర్నీలో శ్రేయస్ అయ్యర్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం.కోహ్లి అయితే వికెట్ల మధ్య పరిగెడుతున్న తీరు అబ్బురపరుస్తోంది. రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్ శుభారంభం అందిస్తే మనకు తిరుగు ఉండదు. అయితే, కేఎల్ రాహుల్ కూడా బ్యాట్ ఝులిపించాడు. అతడు కూడా ఫామ్‌లోకి వస్తే జట్టుకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. రోహిత్ గనుక సెంచరీ చేశాడంటే విజయం మనదే.అయితే, ఫీల్డింగ్‌లో నిర్లక్ష్యం వద్దు. క్యాచ్‌లు మిస్ చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి’’ అని సురేశ్ రైనా టీమిండియాకు సూచనలు ఇచ్చాడు. కాగా ఆస్ట్రేలియాతో ఐసీసీ టోర్నమెంట్లలో 2011 నుంచి టీమిండియాకు పరాభవాలే ఎదురవుతున్నాయి. కీలక మ్యాచ్‌లలో ఆసీస్ చేతిలో ఓడిపోతోంది. అయితే, దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో మాత్రం టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది.ఇక దుబాయ్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా ఫీల్డింగ్ చేస్తోంది. ఆసీస్ తుదిజట్టులో రెండు మార్పులు చేయగా.. భారత్ కివీస్‌తో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగింది.సెమీ ఫైనల్ 1- తుదిజట్లు ఇవేభారత్రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.ఆస్ట్రేలియా కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.చదవండి: CT 2025: కివీస్‌తో సెమీస్.. సఫారీలకు గాయాల బెడద! జట్టులోకి స్టార్ ప్లేయర్ -
Champions Trophy 2025: ఆసీస్‌పై ఘన విజయం.. ఫైనల్లో టీమిండియా
ICC Champions Trophy 2025- India vs Australia, 1st Semi-Final: 4 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్48.1వ ఓవర్: మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. భారత్ 4 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులు చేయగా.. భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో విరాట్ కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ (84) ఆడి భారత్‌ను గెలిపించాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అంతుకుముందు స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.84 పరుగుల వద్ద విరాట్ కోహ్లి ఔట్42.4 ఓవర్: 225 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్‌లో డ్వార్షుయిస్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (84) ఔటయ్యాడు.కేఎల్ రాహుల్‌కు (31) జతగా హార్దిక్ పాండ్యా క్రీజ్‌లోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా34.5వ ఓవర్: నాథన్ ఇల్లిస్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (27) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 35 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 178/4గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 90 బంతుల్లో 87 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. విరాట్‌కు (68) జతగా కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి వచ్చాడు. మూడో వికెట్ కోల్పోయిన భారత్26.2వ ఓవర్: ఆడమ్ జంపా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (45) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్‌కు (51) జతగా అక్షర్ పటేల్ క్రీజ్‌లోకి వచ్చాడు. టీమిండియా స్కోర్ 134/3గా ఉంది.హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్24.5వ ఓవర్: ఆడమ్ జంపా బౌలింగ్‌లో బౌండరీ బాది విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్ ఈ ఇన్నింగ్స్‌లో 53 బంతులు ఎదుర్కొని 4 బౌండరీలు సాధించాడు. విరాట్‌కు జతగా మరో ఎండ్‌లో శ్రేయస్ (43) ఉన్నాడు. 25 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 131/2గా ఉంది.రోహిత్ శర్మ అవుట్7.5: రోహిత్ శర్మ(29 బంతుల్లో 28) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆసీస్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కూపర్ కన్నోలి బౌలింగ్‌లో రోహిత్ లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి ఐదు పరుగులతో ఉండగా.. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 43-2(8)గిల్ అవుట్4.6: శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. డ్వార్షుయిస్ బౌలింగ్‌లో గిల్ బౌల్డ్ అయ్యాడు. పదకొండు బంతులు ఎదుర్కొని 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. కోహ్లి క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 21 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 30-1 ఆసీస్ ఆలౌట్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఆడం జంపా బౌల్డ్అయ్యాడు. ఏడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. టీమిండియాకు 265 పరుగుల లక్ష్యాన్ని విధించింది. భారత బౌలర్లలో పేసర్లు మహ్మద్ షమీ మూడు వికెట్లు , హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆసీస్నాథన్ ఇల్లిస్(10) రూపంలో ఆసీస్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి అతడు అవుటయ్యాడు. ఆసీస్ స్కోరు: 262-9(49). తన్వీర్సంఘా క్రీజులోకి వచ్చాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. క్యారీ ఔట్47.1వ ఓవర్: 249 పరుగుల వద్ద ఆసీస్ ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. అలెక్స్ క్యారీ (61) స్ట్రయిక్ తన వద్దే ఉంచుకునేందుకు లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో క్యారీని రనౌట్ చేశాడు. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్45.1 ఓవర్: 239 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో బెన్ డ్వార్షుయిస్ (19) పెవిలియన్‌కు చేరాడు. అలెక్సీ క్యారీకి (54) జతగా ఆడమ్ జంపా క్రీజ్‌లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్యారీ42.2 ఓవర్: కీలకమైన తరుణంలో అలెక్స్ క్యారీ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. క్యారీ 48 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 45 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ 240/6గా ఉంది. క్యారీ 54, బెన్ డ్వార్షుయిష్ 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌కు బిగ్ షాక్37.3:ఆసీస్ బిగ్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను అనూహ్య రీతిలో అక్షర్ బౌల్డ్ చేశాడు. ఐదు బంతుల్లో ఏడు పరుగులు చేసి మాక్సీ నిష్క్రమించాడు. క్యారీ 39 పరుగులతో ఉండగా.. డ్వార్షుయిస్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 205/6 (37.3)ఎట్టకేలకు స్మిత్ అవుట్36.4: భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఇబ్బంది పెట్టిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు అవుటయ్యాడు. షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అయి 73 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. స్కోరు: 198/5 (36.5). మాక్స్వెల్ క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్26.6: రవీంద్ర జడేజా బౌలింగ్ జోష్ ఇంగ్లిస్ విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఫలితంగా ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 బంతులు ఎదుర్కొన్న ఇంగ్లిస్ 11 పరుగులు చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. స్మిత్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అలెక్స్ క్యారీ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 144-4మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్22.3: లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా అతడు వెనుదిరిగాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. జోష్ ఇంగ్లిస్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 111/3 (22.4)వంద పరుగుల మార్కు దాటేసిన కంగారూలు20 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు: 105/2స్మిత్ 36, లబుషేన్ 24 రన్స్‌తో ఉన్నారు.పద్నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు: 72/2లబుషేన్ 4, స్మిత్ 23 పరుగులతో ఉన్నారు.8.2: ట్రవిస్ హెడ్ అవుట్ఆసీస్కు భారీ షాక్ తగిలింది. హార్డ్ హిట్టర్, ఓపెనర్ ట్రవిస్ హెడ్ అవుటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. మార్నస్ లబుషేన్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 54/2 (8.2) కన్నోలీ డకౌట్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. మూడు ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓపెనర్ కూపర్ కన్నోలీ డకౌట్ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చిన కూపర్ డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. 3 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 4/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో హెడ్, స్మీత్ కొనసాగుతున్నారు. టాస్ గెలిచిన ఆసీస్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌కు నగారా మోగింది. దుబాయ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ పొడిగా ఉంది. ఇక్కడ మేము రెండు సెషన్ల పాటు ప్రాక్టీస్ చేశాం. బ్యాటింగ్ చేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం.బంతి స్పిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా బలమైన జట్టు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో రెండు మార్పులు చేశాం. మాథ్యూ షార్ట్ స్థానంలో కూపర్ కన్నోలి వచ్చాడు. స్పెన్సర్ జాన్సన్‌స్థానాన్ని తన్వీన్ సంఘా భర్తీ చేశాడు’’ అని తెలిపాడు.అదే జట్టుతో భారత్మరోవైపు టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘పిచ్ స్వభావం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. గత మూడు మ్యాచ్‌లలో మేము రాణించాం. కివీస్‌తో ఆడిన జట్టుతోనే మరోసారి ముందుకు వెళ్తున్నాం’’ అని పేర్కొన్నాడు. కాగా గత మ్యాచ్‌లో పేసర్ హర్షిత్ రాణాపై వేటు వేసి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఆడించగా.. అతడు ఐదు వికెట్లతో మెరిశాడు. ఇక సెమీస్‌లోనూ స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నడుమ భారత్‌తో పాటు ఆసీస్ కూడా వారివైపే మొగ్గు చూపింది.తుదిజట్లు ఇవేభారత్రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.ఆస్ట్రేలియా కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా. -
IND vs AUS: అతడిలో ప్రత్యేక ప్రతిభ ఉంది: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియా(India vs Australia)తో సెమీ ఫైనల్లో తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశాడు. నలుగురు స్పిన్నర్లతో ఆడాలా? వద్దా? అనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నామన్నాడు. పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా తమ వ్యూహాలు మార్చుకుంటామని స్పష్టం చేశాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) తొలి సెమీస్ మ్యాచ్‌లో రోహిత్ సేన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.దుబాయ్ వేదికగా మంగళవారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇక ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో గత కొన్నేళ్లుగా కంగారూల చేతిలో తమకు ఎదురవుతున్న చేదు అనుభవాలకు ఈ మ్యాచ్‌తో సమాధానం చెప్పాలని భారత్ ఎదురుచూస్తోంది.ఇక ఈ వన్డే టోర్నీ లీగ్ దశలో మూడింటికి మూడూ గెలిచి హ్యాట్రిక్ విజయాలతో రోహిత్ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుండగా.. ఇంగ్లండ్, ఆసీస్ మాజీ క్రికెటర్లు మాత్రం ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియాకు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు.విమర్శకులకు రోహిత్ కౌంటర్ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. ‘‘ఒకే నగరంలో ఉంటూ ఒకే వేదికపై అన్ని మ్యాచ్‌లు ఆడటం పట్ల మాపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఇదేమీ మాకు అదనపు ప్రయోజనం కలిగించడం లేదు.ప్రతీసారి పిచ్ కొత్త సవాళ్లు విసురుతోంది. మూడు మ్యాచ్లలోను పిచ్ భిన్నంగా స్పందించింది. ఇది మా సొంత మైదానం కాదు. దుబాయ్‌లో మేం తరచుగా మ్యాచ్‌లు ఆడం. మాకు కూడా ఇది కొత్తగానే ఉంది’’ అని కౌంటర్ ఇచ్చాడు.అతడిలో ప్రత్యేక ప్రతిభఅదే విధంగా.. ‘‘ఆస్ట్రేలియా ఎప్పుడైనా బలమైన ప్రత్యర్థే. మైదానంలో సహజంగానే కొంత ఉత్కంఠ ఖాయం. అయితే గెలవాలనే ఒత్తిడి మాపైనే కాదు వారిపైనా ఉంది. కీలక ఆటగాళ్లు లేకపోయినా ఆ జట్టులో పోరాటపటిమకు లోటు ఉండదు.కాబట్టి మా వ్యూహాలు, ప్రణాళికలకు అనుగుణంగా మేం బాగా ఆడటం ముఖ్యం. వరుణ్ చక్రవర్తిలో ప్రత్యేక ప్రతిభ ఉంది. అతడి ఎంపికపై కొన్ని విమర్శలు వచ్చినా సరే, జట్టు ప్రయోజనాల కోసం ప్రత్యేక ఆటగాడిగా చూస్తూ అతడికి సరైన సమయంలో అవకాశం ఇవ్వడం ముఖ్యం. మా నమ్మకాన్ని అతడు నిలబెట్టుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లోనూ నలుగురు స్పిన్నర్లను ఆడించాలనేలా పిచ్ ఊరిస్తోంది. కానీ ఆఖరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు’’ అని రోహిత్ శర్మ తమ తుదిజట్టులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చే అంశం గురించి ప్రస్తావించాడు.కాగా గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో ఒకే జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆఖరిగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మాత్రం అదనపు స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తిని బరిలోకి దింపింది. కివీస్‌తో మ్యాచ్‌లో అతడు ఏకంగా ఐదు వికెట్లు తీయడంతో ఆసీస్‌తో మ్యాచ్‌లో తుదిజట్టు కూర్పు భారత్‌కు తలనొప్పిగా మారింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో ఆడిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.న్యూజిలాండ్‌తో ఆడిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.చదవండి: షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది.. అతడి పని పట్టాల్సిందే..: టీమిండియా దిగ్గజం -
అతడికి కొత్త బంతిని ఇవ్వండి.. హెడ్‌కు చుక్కలు చూపిస్తాడు: అశ్విన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో దుబాయ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ సెమీస్ పోరు కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు ఆర్హత సాధించాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక సూచన చేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశమివ్వాలని అశ్విన్ సూచించాడు. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి సంచలన ప్రదర్శన కనబరిచాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తన కెరీర్లో రెండో వన్డే ఆడిన వరుణ్.. 5 వికెట్లు పడగొట్టి భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు."ట్రావిస్ హెడ్‌ను అడ్డుకోవాలంటే పవర్‌ప్లేలో బౌలింగ్ వరుణ్ చక్రవర్తితో చేయించాలి. హెడ్‌కు స్టంప్స్ దిశగా బౌలింగ్ చేయమని వరుణ్‌కు చెప్పండి. అప్పుడు హెడ్ స్టంప్స్‌ను విడిచిపెట్టి ఓవర్ ది ఫీల్డ్ షాట్ ఆడే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో బంతి మిస్స్ అయ్యి స్టంప్స్‌ను తాకే అవకాశముంది.అంతేకాకుండా బౌలింగ్ తగ్గట్టు ఫీల్డ్ సెట్ చేస్తే హెడ్ దొరికిపోయే ఛాన్స్ ఉంది. వరుణ్ చక్రవర్తి కొత్త బంతితో భారత్‌కు మంచి అరంభాన్ని అందించగలడు. వరుణ్ బౌలింగ్‌లో హెడ్ నెమ్మదిగా ఆడుతాడని నేను అనుకోను. అతడు కచ్చితంగా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. వరుణ్ బౌలింగ్‌లో షాట్లు ఆడటం అంత సులువు కాదు. కాబట్టి వరుణ్ బౌలింగ్‌లో హెడ్ ఔటయ్యే అవకాశముంది. ఏదేమైనప్పటికి ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి,ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షియస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్చదవండి: మాపై ఒత్తడి లేదు.. ఇది సాధారణ మ్యాచ్ మాత్రమే: శ్రేయస్ అయ్యర్ -
మాపై ఒత్తిడి లేదు.. ఇది సాధారణ మ్యాచ్ మాత్రమే: శ్రేయస్ అయ్యర్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుమ్ములేపుతున్న భారత జట్టు మరో కీలక సమరానికి సిద్దమైంది. ఈ మెగా టోర్నీ తొలి సెమీఫైనల్లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తాడోపేడో తెల్చుకోనుంది. ఐసీసీ టోర్నీల్లో తమకు కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియాను ఈసారి ఎలాగైనా ఓడించి ముందుకు వెళ్లాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది.డబ్ల్యూటీసీ ఫైనల్-2023 ఫైనల్‌తో పాటు అదే ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లోనూ భారత్‌ను ఆసీస్ ఓడించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. టీమిండియా ప్రస్తుతం అన్ని విభాగాల్లో పటిష్టం కన్పిస్తోంది. లీగ్ స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ అద్భుత ప్రదర్శనతో విజయ భేరి మోగించింది.అదే జోరును సెమీస్‌లోనూ కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలో ఆసీస్‌తో మ్యాచ్‌కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. అదేవిధంగా గతేడాదిగా తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురుంచి కూడా అయ్యర్ మా"కష్టం కాలం ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. నాలాంటి వాడికి ఇటువంటి కఠిన దశలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. కష్ట కాలంలో మనల్ని ఎవరూ ఆదుకోరు. అటువంటి సమయాల్లో మనల్ని మనం నమ్ముకుంటే ఫలితం ఉంటుంది. ఎవరిపైనా ఆధారపడకుండా ఎలా నడుచుకోవాలో గతేడాది కాలం నాకు నేర్పించింది. ఇక సెమీస్ ఫైనల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. మాపై ఎటువంటి ఒత్తడి లేదు. ఇది ఒక సాధరణ మ్యాచ్ మాత్రమే. ఈ మ్యాచ్‌లో గెలవాలనే కోరిక మరింత రెట్టింపు అయింది" అంటూ బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయ్యర్ పేర్కొన్నాడు. కాగా దేశీవాళీ క్రికెట్లో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించడంతో అయ్యర్ తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు.అయితే ఆ తర్వాత తన మనసు మార్చకుని రంజీల్లో ఆడడంతో అయ్యర్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. తన పునరాగమనంలో అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు శ్రేయస్ సాధించాడు.చదవండి: అతడితో మనకు తల నొప్పి.. తొందరగా ఔట్ చేయండి: భారత మాజీ క్రికెటర్ -
అతడితో మనకు తల నొప్పి.. తొందరగా ఔట్ చేయండి: భారత మాజీ క్రికెటర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. మంగళవారం(మార్చి 4) దుబాయ్ వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి గత వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.ఈ నేపథ్యంలో ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ పోరులో హెడ్ నుంచి భారత్‌కు భారీ ముప్పు పొంచి ఉందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రత్యర్ధి భారత్ అంటేనే చాలు ట్రావెస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2023 నుంచి హెడ్ ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు కొరకరాని కోయ్యగా మారాడు.ఆస్ట్రేలియాతో సెమీస్‌లో ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసేందుకు భారత్ ప్రత్యేక వ్యూహాలను రచించాలి. అతడిని వీలైనంత త్వరగా ఔట్ చేసి డ్రెస్సింగ్ రూమ్‌కి పంపించాలి. అప్పుడే నాతో పాటు భారత అభిమానులంతా ఊపిరిపీల్చుకుంటారు. అతడు ఎక్కువ సమయం క్రీజులో ఉంటే ఏమి చేయగలడో మనందరికి తెలుసు అని ESPNCricinfoకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.వన్డే ప్రపంచకప్-2023లో భారత్‌పై హెడ్(137 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. అంతకుముందు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్‌పై సెంచరీతో మెరిశాడు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికి.. హెడ్ మాత్రం(76 పరుగులు) విధ్వంసం సృష్టించాడు. ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో హెడ్ పరుగుల వరద పారించాడు.టీమిండియాపై వన్డేల్లో ట్రావిస్ హెడ్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత్‌పై 9 వన్డేలు ఆడిన హెడ్.. 43.12 సగటుతో 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 137 పరుగులుగా ఉంది. టెస్టుల్లో భారత్‌పై 27 మ్యాచ్‌లు ఆడి 46.52 సగటుతో 1163 పరుగులు సాధించాడు.చదవండి: Champions Trophy: సెమీస్‌లో విజయం టీమిండియాదే.. ఐరెన్ లెగ్ అంపైర్ లేడు!? -
సెమీస్‌లో విజయం టీమిండియాదే.. ఐరెన్ లెగ్ అంపైర్ లేడు!?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తొలి సెమీఫైనల్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. దుబాయ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. లీగ్ దశలో ఆజేయంగా నిలిచిన భారత జట్టు.. అదే జోరును సెమీస్ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా ఎలాగైనా భారత్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టాలని పట్టుదలతో ఉంది.కాగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన అఫిషయల్స్ జాబితాను ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఈ సెమీస్ పోరుకు ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ వ్యవహరించనున్నారు. అదేవిధంగా థర్డ్ అంపైర్‌గా మైకేల్ గాఫ్ .. నాలుగో అంపైర్‌గా అడ్రియన్ హోల్డ్‌స్టాక్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ ఎంపికయ్యాడు.ఐరెన్ లెగ్ అంపైర్ లేడు? కాగా ఈ మ్యాచ్ అఫిషయల్స్ జాబితాలో ఐరెన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో లేకపోవడం భారత అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 2014 నుంచి అతడు అంపైర్‌గా ఉన్న ఏ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ రిచర్డ్ కెటిల్‌బరోను ఐరెన్ లెగ్ అంపైర్‌గా పిలుస్తుంటారు. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్స్‌లో కూడా కెటిల్‌బరో ఫీల్డ్ అంపైర్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి పాలైంది. అంతకుముందు 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్, ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్, 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ భారత్ ఓటమి చవిచూసింది. మరోవైపు న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్‌కు కుమార్ ధర్మసేన, పాల్ రీఫిల్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉండనున్నారు.ఆసీస్‌దే పైచేయి..వన్డే క్రికెట్లో భారత్‌పై ఆస్ట్రేలియా పూర్తి అధిపత్యం చెలాయించింది. ఇప్పటివరకు ఇరు జట్లు 151 వన్డేల్లో తలపడ్డాయి. 57 మ్యాచ్‌ల్లో భారత్... 84 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలిచాయి. 10 మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం భారత్‌దే పైచేయిగా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్, ఆ్రస్టేలియా ముఖాముఖిగా నాలుగుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు భారత్ (1998లో ఢాకాలో 44 పరుగుల తేడాతో; 2000లో నైరోబిలో 20 పరుగుల తేడాతో) నెగ్గింది. ఒకసారి ఆ్రస్టేలియా గెలిచింది (2006లో మొహాలిలో 6 వికెట్ల తేడాతో). 2009లో దక్షిణాఫ్రికాలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వన్డే టోర్నమెంట్లలో (వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ) భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరుసార్లు నాకౌట్ దశ మ్యాచ్‌లు జరిగాయి. మూడుసార్లు భారత్ (1998, 2000 చాంపియన్స్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో; 2011 వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్లో)... మూడుసార్లు ఆ్రస్టేలియా (2003 వరల్డ్‌కప్ ఫైనల్, 2015 వరల్డ్‌కప్ సెమీఫైనల్, 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్) గెలిచి 3–3తో సమంగా ఉన్నాయి.చదవండి: WPL 2025: మూనీ విధ్వంసం.. యూపీని చిత్తు చేసిన గుజరాత్ -
IND vs AUS: ఆ ఒక్కడే కాదు.. వాళ్లంతా ప్రమాదకరమే.. గెలవాలంటే: స్మిత్
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) టీమిండియా స్పిన్ దళంపై ప్రశంసలు కురిపించాడు. సెమీ ఫైనల్లో తమకు భారత స్పిన్నర్లతోనే ప్రధానంగా పోటీ ఉండబోతోందని పేర్కొన్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) దూరం కాగా.. స్మిత్ తాత్కాలిక సారథిగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు భాగం కాగా.. గ్రూప్-‘ఎ’లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఎలిమినేట్ చేసిన భారత్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి. మరోవైపు.. గ్రూప్-‘బి’లో అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్లను నాకౌట్ చేసి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో తొలి సెమీస్ మ్యాచ్‌లో భారత్- ఆస్ట్రేలియా, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్- సౌతాఫ్రికా పోటీపడనున్నాయి.వరుణ్ చక్రవర్తి ఒక్కడితోనే కాదు.. ఇక దుబాయ్ వేదికగా టీమిండియా- ఆసీస్ మధ్య మంగళవారం మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత స్పిన్ దళం మొత్తం పటిష్టంగా ఉంది. అందుకే వరుణ్ చక్రవర్తి ఒక్కడితోనే కాదు.. ఆ జట్టులోని మిగతా స్పిన్నర్లతోనూ మాకు ప్రమాదం పొంచి ఉంది.ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటామన్న విషయంపైనే ఈ మ్యాచ్‌లో మా గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం అత్యంత కష్టతరమైనది. అదే మాకు అతిపెద్ద సవాలు కాబోతోంది. అయితే, మేము వారిపై ఎదురుదాడికి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం’’ అని స్మిత్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు.కాస్త సమయం చిక్కిందిఇక టీమిండియాతో మ్యాచ్ సన్నాహకాల గురించి మాట్లాడుతూ.. ‘‘రెండు రోజుల ముందుగానే దుబాయ్‌కు చేరుకోవడం మాకు సానుకూలాంశం. ప్రాక్టీస్‌కు కావాల్సినంత సమయం దొరికింది. భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితం వచ్చేంత వరకు మేము ఏ వేదిక మీద ఆడాల్సి వస్తుందో తెలియని పరిస్థితి.అయితే, అదృష్టవశాత్తూ మేము ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. లేదంటే.. న్యూజిలాండ్ స్థానంలో మేము పాకిస్తాన్ విమానం ఎక్కాల్సి వచ్చేది. ఏదేమైనా దుబాయ్ పిచ్‌ను అర్థం చేసుకునేందుకు మాకు కాస్త సమయం చిక్కింది’’ అని 35 ఏళ్ల స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుండగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లలేదు. తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇక రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్ బుధవారం తలపడనున్నాయి. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఇందుకు వేదిక.వరుణ్ మాయాజాలంచాంపియన్స్ ట్రోఫీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా వరుణ్ చక్రవర్తి వన్డేల్లో అరంగేట్రం చేశాడు. బట్లర్ బృందాన్ని 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతకు ముందు టీ20 సిరీస్‌లోనూ అదరగొట్టాడు. ఈ క్రమంలోనే చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టుకు ఎంపికైన వరుణ్.. తొలి రెండు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమయ్యాడు.అయితే, న్యూజిలాండ్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో మాత్రం ఈ మిస్టరీ స్పిన్నర్ దుమ్ములేపాడు. తనకు చెత్త రికార్డు ఉన్న దుబాయ్ మైదానంలో అద్భుత ప్రదర్శనతో ఆ అపవాదు చెరిపేసుకున్నాడు. పది ఓవర్ల కోటా పూర్తి చేసిన వరుణ్ 42 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. విల్ యంగ్(22), గ్లెన్ ఫిలిప్స్(12), మైఖేల్ బ్రాస్‌వెల్(2), కెప్టెన్ మిచెల్ సాంట్నర్(28), మ్యాట్ హెన్రీ(2) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తదుపరి ఆసీస్‌తో వరుణ్ చక్రవర్తి ఆడటం దాదాపు ఖాయం కాగా.. స్మిత్ పైవిధంగా స్పందించాడు. కాగా వరుణ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఈ జట్టులో ఉన్నారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.ఆస్ట్రేలియాజేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ క్యారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, తన్వీర్ సంఘా, కూపర్ కన్నోలి.చదవండి: BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ -
షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది.. ఇక..: టీమిండియా దిగ్గజం
ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) మూడు కీలక సూచనలు చేశాడు. కంగారూలకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకూడదని.. గత మూడు మ్యాచ్‌ల ఫలితాన్నే ఇక్కడా పునరావృతం చేయాలని కోరాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్ గ్రూప్-ఎ టాపర్‌గా నిలిచింది.ఈ మెగా టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. దుబాయ్(Dubai)లో తమ మ్యాచ్‌లు ఆడుతున్న టీమిండియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. తొలుత బంగ్లాదేశ్‌ను.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)ను.. అనంతరం ఆఖరి మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్ జట్టును ఓడించింది. ఈ క్రమంలో ఈ వన్డే టోర్నమెంట్ తొలి సెమీ ఫైనల్లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.అయితే, ఐసీసీ టోర్నీల్లో 2011 తర్వాత నాకౌట్ మ్యాచ్‌లలో ఆసీస్‌దే పైచేయిగా ఉన్న నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రోహిత్ సేనకు పలు సూచనలు చేశాడు. ముందుగా ట్రవిస్ హెడ్ ఆట కట్టించాలని.. ఆ తర్వాత గ్లెన్ మాక్స్వెల్ లాంటి వాళ్ల పనిపట్టాలని భారత బౌలర్లకు సూచించాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ..షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది కదా..‘‘ముందుగా ట్రవిస్ హెడ్ గురించి మీ మెదళ్లలో గూడు కట్టుకున్న భయాన్ని తీసేయండి. వీలైనంత త్వరగా అతడిని అవుట్ చేయడం మంచిది. షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది కదా.. హెడ్‌కు ఎక్కువ పరుగులు చేసే అవకాశం అస్సలు ఇవ్వద్దని గుర్తుపెట్టుకోండి.ఇక నా రెండో సూచన ఏమిటంటే.. గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్ వంటి హార్డ్ హిట్టర్లు ఆస్ట్రేలియా జట్టులో ఉన్నారు. వాళ్లు అలవోకగా సిక్సర్లు, ఫోర్లు బాదుతారు. ఫాస్ట్ పేస్‌లో వాళ్లకు ఎక్కువగా పరుగులు చేసే అవకాశం ఇవ్వకండి.మూడోది.. ముఖ్యమైన సూచన.. ఇది నాకౌట్ మ్యాచ్ అన్న విషయాన్ని మీరు పూర్తిగా మర్చిపోండి. సాధారణ మ్యాచ్ మాదిరిగానే దీనిని భావించండి’’ అని భజ్జీ రోహిత్ సేనకు సలహాలు ఇచ్చాడు. ఈ మూడు బలహీనతలను అధిగమిస్తే విజయం కచ్చితంగా టీమిండియానే వరిస్తుందని అభిప్రాయపడ్డాడు.విధ్వంసకరవీరుడు.. చితక్కొట్టాడుకాగా ట్రవిస్ హెడ్‌కు టీమిండియాపై మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో మ్యాచ్ టీమిండియా చేజారడానికి ప్రధాన కారణం ఈ విధ్వంసకరవీరుడు. నాడు అహ్మదాబాద్ మ్యాచ్‌లో భారత స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా.. బౌలింగ్‌ను చితక్కొట్టాడు. కేవలం 120 బంతుల్లోనే 137 పరుగులు సాధించి ఆసీస్ ఆరోసారి విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే భజ్జీ హెడ్‌ను టార్గెట్ చేయాలని భారత బౌలర్లకు చెప్పాడు.టీమిండియాదే గెలుపుఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రోహిత్ సేనకు మద్దతు పలికాడు.‘‘గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టు ఇది. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ కూడా దాదాపుగా వీళ్లే ఆడారు. ఏ రకంగా చూసినా మన జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ప్రత్యర్థి జట్టు ఏదైనా దానిని ఓడించగల సత్తా టీమిండియాకు ఉంది’’ అని పేర్కొన్నాడు. సెమీ ఫైనల్లో భారత్ ఆసీస్‌ను ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2025: కొత్త కెప్టెన్ పేరును ప్రకటించిన కేకేఆర్ -
కొత్త తలనొప్పి.. వరుణ్ చక్రవర్తిని సెమీ ఫైనల్లో ఆడిస్తారా?
న్యూజిలాండ్(India vs New Zealand) తో ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ(_ICC Champions Trophy)లోని ఆఖరి లీగ్ మ్యాచ్ భారత్‌కి ఒక కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. అదే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రూపం లో సెలక్షన్ బెడద. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఆడిన తీరుపై అభినందించక తప్పదు. బ్యాటింగ్‌లో ప్రారంభంలో కొంత తడబాటు కనిపించినా తర్వాత శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer), అక్షయ్ పటేల్, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఆదుకోవడంతో భారత్ భారీ స్కోర్ కాకపోయినా (249/9) కొద్దిగా మెరుగైన స్కోర్ చేసింది.తర్వాత న్యూజిలాండ్ వంతు వచ్చింది. సీనియర్ బ్యాటర్ కేన్ విల్లియమ్స్ నిలకడగా పడుతుండటం తో ఒక దశలో మెరుగ్గానే కనిపించింది. ఈ తరుణంలోనే వరుణ్ చక్రవర్తి వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ మలుపు తిప్పాడు.చక్రం తిప్పిన వరుణ్నిజానికి దుబాయ్ వేదిక పై వరుణ్ కి గతంలో ఎన్నడూ అదృష్టం కలిసి రాలేదు. గతం లో 2021 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా వరుణ్ ఇదే వేదిక పై మూడు మ్యాచ్ లలో ఆడాడు. ఈ మూడు మ్యాచ్ ల లో వరుణ్ గణాంకాలు 11-0-71-0 . ఈ గణాంకాలు బట్టి చూస్తే వరుణ్ ఈ వేదిక పై ఆడటం కష్టమే అనిపిస్తుంది. పాకిస్తాన్‌తో వరుణ్ ఈ వేదికపై వరుణ్ ఆడిన మ్యాచ్ పెద్ద పీడకల లాగా నిలిచిపోతుంది.పాకిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఆ మ్యాచ్ లో వరుణ్ 33 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేక పోయాడు. గత రికార్డులను చూస్తే వరుణ్ ని దుబాయ్ వేదికపై ఆడించడం పెద్ద సాహసమే అని చెప్పాలి. ఇందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, భారత్ చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ లను అభినిందించక తప్పదు.ఆ రోజుల్లో వరుణ్ చక్రవర్తి అసలు అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధంగా ఉన్నాడా లేదా అని వాదించిన వారూ ఉన్నారు. ఈ నేపధ్యం లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఖచ్చితత్వంతో వైవిధ్యాలను చూపించిన వరుణ్ చివరికి 10-0-42-5 గణాంకాల తో తన ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్రంలో అద్భుతంగా రాణించిన బౌలర్లలో ఒకడిగా రికార్డ్ నెలకొల్పాడు. “మాకు 2021 ఐసీసీ టి20 ప్రపంచ కప్ పెద్దగా కలిసి రాలేదు (భారత్ గ్రూప్ దశల్లోనే ఓడిపోయింది). వ్యక్తిగతంగా కూడా నేను ఆ టోర్నమెంట్ లో పెద్దగా రాణించలేక పోయాను. కానీ నేను అప్పుడు నిబద్దతతోనే బౌలింగ్ చేశానని భావిస్తున్నాను. కానీ ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా అంతా బాగానే కనిపిస్తోంది. టీమ్ ఇండియా కూడా బాగా రాణిస్తోంది. మా కాంబినేషన్లు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి, కాబట్టి ఇప్పుడు అంతా బాగా కలిసి వస్తోంది’’ అని వరుణ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న తర్వాత చెప్పాడు.కంగారు పడ్డ వరుణ్2021ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో వికెట్ పడగొట్టడంలో విఫలమైన వరుణ్ ఆ తర్వాత 2024 అక్టోబర్ వరకు భారత జట్టులో కనిపించకుండా పోయాడు. అందుకే ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు, వరుణ్ తొలుత కంగారు పడ్డాడు. అతను బౌలింగ్ చేసిన మొదటి బంతిలోనే బౌండరీ ఇచ్చాడు.“నా మొదటి స్పెల్‌లో, నేను కొంచెం భయపడ్డాను ఎందుకంటే గత విషయాలు, భావోద్వేగాలు, ఈ మైదానంలో గత మూడు సంవత్సరాలలో జరిగిన ప్రతిదీ నా మనస్సులో కదిలాడాయి. నేను దానిని అదుపులో ఉంచడానికి, నియంత్రించడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. విరాట్ (కోహ్లీ) భాయ్, రోహిత్ మరియు హార్దిక్ (పాండ్యా) నాకు ప్రశాంతంగా ఉండు' అని చెప్పారు. అది నిజంగా ఏంతో సహాయపడింది" అని వరుణ్ అన్నాడు.వరుణ్ అసాధారణ బౌలింగ్ మంగళవారం జరిగే సెమీ-ఫైనల్‌కు ముందు కెప్టేన్ రోహిత్ తన సీమర్ల పనిభారాన్ని తగ్గించడానికి బాగా సహాయపడింది. అంతే కాకుండా చివరికి ఆస్ట్రేలియాతో జరిగే పోరులో భారత్‌కు వరుణ్ రూపం లో కొత్తరకమైన తలనొప్పి తెచ్చిపెట్టింది. నలుగురు స్పిన్నర్లను ఆడించాలా లేదా ముగ్గురు-ఇద్దరు కాంబోలోకి తిరిగి వెళ్లాలా? అలా అయితే, ఎవరిని వదిలివేయాలి? వరుణ్‌ను తొలగించడం మాత్రం ఇప్పుడు సాధ్యపడదు!చదవండి: BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ -
Ind vs Aus: ఆసీస్ గొప్ప జట్టు.. కానీ..: రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా టైటిల్ రేసులో ముందుకు దూసుకుపోతోంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించి.. మూడింట మూడు విజయాలతో టాపర్‌గా నిలిచింది. ఇదే జోరులో సెమీ ఫైనల్లోనూ గెలుపొంది టైటిల్ పోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంది.నాకౌట్ మ్యాచ్‌లలో..అయితే, సెమీస్‌లో గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా(India vs Australia) రూపంలో పటిష్టమైన ప్రత్యర్థి జట్టు రోహిత్ సేనకు సవాలుగా మారింది. ద్వైపాక్షిక సిరీస్‌ల సంగతి పక్కనపెడితే.. 2011 తర్వాత ఐసీసీ టోర్నమెంట్ల నాకౌట్ మ్యాచ్‌లలో కంగారూ జట్టు చేతిలో టీమిండియాకు పరాభవాలు తప్పడం లేదు. సొంతగడ్డపై లక్షలకు పైగా ప్రేక్షకుల నడుమ వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో భారత్ కమిన్స్ బృందం చేతిలో ఓడిన తీరును అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలో మంగళవారం దుబాయ్‌లో ఆసీస్‌తో జరిగే సెమీస్ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్లు సైతం గత చేదు అనుభవాలను మరిపించేలా రోహిత్ సేన ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆసీస్ గొప్ప జట్టు.. కానీ..‘‘ఆసీస్ పటిష్ట జట్టు. మాకు గొప్ప ప్రత్యర్థి. అయితే, సెమీస్‌తో మ్యాచ్‌లో మా విధానం మారదు. గత మూడు మ్యాచ్‌ల మాదిరే మా ప్రణాళికలు ఉంటాయి. అయితే, ఆసీస్ జట్టును బట్టి వ్యూహాల్లో కొన్ని మార్పులు చేసుకుంటాం.ఇక సెమీ ఫైనల్ అంటే మా మీద మాత్రమే ఒత్తిడి ఉంటుందని అనుకోకూడదు. ఆస్ట్రేలియా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అయితే, జట్టుగా ఎలా రాణించాలన్న అంశం మీదే మేము ఎక్కువగా దృష్టి సారించాం. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణిస్తే మాకు తిరుగే ఉండదు. సుదీర్ఘకాలంగా ఆస్ట్రేలియా గొప్ప జట్టుగా కొనసాగుతోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, మేము కూడా తక్కువేమీ కాదు. ప్రత్యర్థి ముందు అంత తేలికగా తలవంచే రకం కాదు.ఇరుజట్లకు ఈ మ్యాచ్ అత్యంత ముఖ్యమైంది. మేము అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నాం. ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే.. అనుకున్న ఫలితం అదే వస్తుంది. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌పై విజయం తర్వాత పీటీఐతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.ఆస్ట్రేలియా జట్టుజేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ క్యారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, తన్వీర్ సంఘా, కూపర్ కన్నోలి.చదవండి: ఇదేం పని జడ్డూ? ఆటగాడు ఇలా చేయొచ్చా?: కివీస్ మాజీ క్రికెటర్ ఫైర్ -
ఆసీస్‌తో సెమీఫైనల్.. భారత్‌కు మరోసారి 'హెడ్' ఏక్ తప్పదా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూపు స్టేజిలో ఆజేయంగా నిలిచిన భారత జట్టు.. ఇప్పుడు కీలక సమరానికి సిద్దమైంది. ఈ మెగా టోర్నీ తొలి సెమీఫైనల్లో మంగళవారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి వన్డే ప్రపంచకప్-2023 ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన కసితో ఉంది. అందుకు తగ్గట్టు తమ ఆస్తశాస్త్రాలను భారత జట్టు సిద్దం చేసుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా టీమిండియాను మరోసారి మట్టికర్పించాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నీకి సీనియర్ ప్లేయర్లు దూరమైనప్పటికి స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆసీస్ జట్టు అదరగొడుతోంది. దీంతో మరోసారి ఆసీస్-భారత్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయమన్పిస్తోంది.మరోసారి 'హెడ్' ఏక్ తప్పదా?అయితే తొలి సెమీఫైనల్ నేపథ్యంలో అందరి కళ్లు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్‌పైనే ఉన్నాయి. ప్రత్యర్ధి భారత్ అయితే చెలరేగిపోయే హెడ్.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతాడో అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. వన్డే ప్రపంచకప్-2023లో ఫైనల్లో అతడి చేసిన విధ్వంసం సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోరు.ఈ డేంజరస్ బ్యాటర్ ఒంటి చేత్తో మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకున్నాడు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికి.. హెడ్ మాత్రం అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 43 బంతుల్లో 76 పరుగులు చేసి తన జట్టును గెలిపించే అంత పనిచేశాడు. అంతకుముందు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్‌పై సెంచరీతో మెరిశాడు. ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో హెడ్ పరుగుల వరద పారించాడు. అందుకే ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే భారత అభిమానులు భయపడుతున్నారు. మరి హెడ్‌ను అడ్డుకునేందుకు భారత్ ఎటువంటి వ్యూహాలు రచిస్తుందో మరో 24 గంటలు వేచి చూడాలి.భారత్‌పై హెడ్ రికార్డు..టీమిండియాపై వన్డేల్లో ట్రావిస్ హెడ్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత్‌పై 9 వన్డేలు ఆడిన హెడ్.. 43.12 సగటుతో 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 137 పరుగులుగా ఉంది. టెస్టుల్లో భారత్‌పై 27 మ్యాచ్‌లు ఆడి 46.52 సగటుతో 1163 పరుగులు సాధించాడు.భారత్‌దే పైచేయి..కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్‌పై భారత్‌దే పై చేయిగా ఉంది. ఇరు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. భారత్ రెండింట, ఆసీస్ కేవలం ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. మరో మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. చదవండి: Champions Trophy: అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన కోహ్లి.. వీడియో వైరల్ -
టీమిండియాతో సెమీఫైనల్.. ఆసీస్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. మంగళవారం(మార్చి 4) దుబాయ్ వేదికగా సెమీఫైనల్-1లో భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్ గాయం కారణంగా కీలకమైన సెమీఫైనల్‌కు దూరమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో షార్ట్ తొడకండరాలు పట్టేశాయి.దీంతో అతడికి విశ్రాంతి అవసరమని క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం సూచించారు. తద్వారా అతడు సెమీఫైనల్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని యువ ఆల్‌రౌండర్ కూపర్ కొన్నోలీతో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉన్న కొన్నోలీ.. ఇప్పుడు ప్రధాన జట్టులోకి వచ్చాడు. కొన్నోలీకి అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఇటీవలే జరిగిన బిగ్‌బాష్ లీగ్-2025 సీజన్లో కూపర్ దుమ్ములేపాడు. అదేవిధంగా ఈ యువ ఆల్‌రౌండర్ ఆస్ట్రేలియా తరపున ఇప్పటివరకు ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అందులో మూడు వన్డేలు ఉన్నాయి. అయితే తుది జట్టులో మాత్రం టాప్-ఆర్డర్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ లేదా కొన్నోలీకి చోటు దక్కే అవకాశముంది. అదనపు స్పిన్ అప్షన్ కావాలని ఆసీస్ మెనెజ్‌మెంట్ భావిస్తే కొన్నోలీకే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం ఖాయం.ఇక సెమీస్ పోరు కోసం ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న కంగారులు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు ఆర్హత సాధించాలని స్మిత్ సేన భావిస్తోంది. మరోవైపు భారత్ మాత్రం వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని కసితో ఉంది.సెమీస్‌కు ఆసీస్ జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంగాచదవండి: Champions Trophy: వరుణ్ ‘మిస్టరీ’ దెబ్బ -
'భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న భారత జట్టు.. తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.అనంతరం రోహిత్ సేన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియాతో తలపడే అవకాశముంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలుస్తుందని క్లార్క్ జోస్యం చెప్పాడు."ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడతాయని భావిస్తున్నాను. ఆసీస్ ఛాంపియన్స్‌గా నిలవాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కానీ టీమిండియాకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంటుంది నేను అనుకుంటున్నాను. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ 1 వన్డే జట్టుగా ఉంది. వారిని ఓడించడం అంత ఈజీ కాదు. భారత్, ఆసీస్ మధ్య తుది పోరు హోరహోరీగా జరుగుతుంది. కానీ టీమిండియా ఒక్క పరుగు తేడాతో విజయం సాధిస్తుంది" అని రేవ్ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లార్క్ పేర్కొన్నాడు. అదే విధంగా ఈ మెగా టోర్నీ టాప్ స్కోరర్‌గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిలుస్తాడని క్లార్క్ అంచనా వేశాడు."రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతడు కటక్‌లో భారీ సెంచరీ సాధించాడు. అద్భుతమైన షాట్లతో అందరిని అలరించాడు. అతడు ఈ మెగా ఈవెంట్లో కూడా మంచి టచ్‌లో కన్పిస్తున్నాడు. రోహిత్ భారత్‌కు కీలకంగా మారనున్నాడు. అతడు తన దూకుడును కొనసాగించాలి. పవర్ ప్లేలో పరుగులు రాబట్టాలన్న అతడి ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేదు. రోహిత్ అద్భుతమైన ఆటగాడు. రోహిత్ శర్మ టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచిన ఆశ్చర్యపోనవసరం లేదు" అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్‌పై 40 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. పాకిస్తాన్ 20 పరుగులతో క్విక్ ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: జోస్ బట్లర్ రాజీనామా.. ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ అతడే!? -
CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్‌గా అతడే: ఆసీస్ మాజీ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ఎనిమిది జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆతిథ్య వేదికలకు చేరుకుని ఐసీసీ టోర్నమెంట్‌కు సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఇక ఈ మెగా ఈవెంట్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్(Pakistan) దక్కించుకోగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్(Dubai)లో తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది.ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ సెమీ ఫైనలిస్టులు, ఫైనలిస్టులు, విజేతపై తమ అంచనాలు తెలియజేశారు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ టీమిండియాను టైటిల్ ఫేవరెట్‌గా పేర్కొనగా.. పాకిస్తాన్ లెజెండరీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ ఈసారి కూడా భారత్- పాక్ ఫైనల్లో తలపడతాయని జోస్యం చెప్పాడు.ఇక ఓవరాల్‌గా మెజారిటీ మంది భారత్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా టాప్-4కు చేరతాయని అంచనా వేశారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్(Michael Clarke) సైతం ఈ ఐసీసీ ఈవెంట్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025లో అత్యధిక పరుగుల, వికెట్ల వీరులు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, టోర్నీ విజేతపై తన అంచనాలు తెలియజేశాడు.టాప్ రన్ స్కోరర్, లీడింగ్ వికెట్ టేకర్‌గా వారే‘‘ఈసారి టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవబోతోంది. వాళ్ల కెప్టెన్ ఫామ్‌లోకి వచ్చాడు. అంతేకాదు.. ఈసారి అతడే చాంపియన్స్ ట్రోఫీలో టాప్ రన్‌స్కోరర్ కాబోతున్నాడు. అతడు మునుపటి లయను అందుకోవడం సంతోషంగా ఉంది. టీమిండియాకు అతడి సేవలు అవసరం.ఇక ఈసారి ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలవబోతున్నాడు. అయితే, ఇంగ్లండ్ జట్టు ప్రదర్శనపై మాత్రం నేను ఎక్కువగా అంచనాలు పెట్టుకోలేదు. అయితే, ఆర్చర్ మాత్రం ఓ సూపర్‌స్టార్. అందుకే అతడే ఈసారి లీడింగ్ వికెట్ టేకర్ అని చెప్పగలను.‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా హెడ్ఇక ఈ టోర్నమెంట్లో ట్రవిస్ హెడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవుతాడు. ప్రస్తుతం అతడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో గతేడాది అదరగొట్టాడు. ఇటీవల టెస్టుల్లోనూ దుమ్ములేపాడు. అయితే, శ్రీలంక పర్యటనలో కాస్త వెనుకబడినట్లు అనిపించినా మళ్లీ త్వరలోనే బ్యాట్ ఝులిపించగలడు.అయితే, ట్రవిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ స్థాయిలో ప్రదర్శన ఇచ్చినా.. ఈసారి ఆస్ట్రేలియా మాత్రం ఫైనల్లో ఓడిపోతుందని అనిపిస్తోంది. ఏదేమైనా హెడ్ మాత్రం హిట్టవ్వడం ఖాయం. నిజానికి అతడి బౌలింగ్ కూడా బాగుంటుంది. కానీ.. బౌలింగ్‌లో అతడి సేవలను ఆస్ట్రేలియా ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదు’’ అని మైకేల్ క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో అతన అభిప్రాయాలు పంచుకున్నాడు. క్లార్క్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా.. విరాట్ కోహ్లి అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈసారి కింగ్ కోహ్లినే టాప్ రన్‌స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలుస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ పాల్గొంటున్నాయి.చదవండి: ఐపీఎల్ 2025లో SRH షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లు ఇవే..! -
CT 2025: సెమీస్, ఫైనల్ చేరే జట్లు ఇవే!.. కానీ ఆ టీమ్‌తో జాగ్రత్త!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్ రూపంలో మరో మెగా ఈవెంట్ క్రికెట్ ప్రేమికుల ముందుకు రానుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ టోర్నీకి తెరలేవనుంది. ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ ఇండియాతో పాటు.. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ టోర్నీకి అర్హత సాధించాయి.మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. ఈవెంట్ ఆరంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే ఆయా దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి(Ravi Shastri), ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్(Ricky Ponting) చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేశారు.సెమీస్, ఫైనల్ చేరే జట్లు ఇవే!ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా.. టీమిండియా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. ఇందుకు పాంటింగ్ బదులిస్తూ.. ‘‘ఇండియా- ఆస్ట్రేలియాను దాటుకుని వేరే జట్లు పైకి వెళ్లడం ఈసారీ కష్టమే.ఎందుకంటే.. ప్రస్తుతం ఇరు దేశాల జట్లలో నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాళ్లు మెండుగా ఉన్నారు. ఇటీవల ఐసీసీ ఈవెంట్లలో ఈ జట్లు సత్తా చాటిన తీరే ఇందుకు నిదర్శనం. కాబట్టి ఈ రెండు ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది’’ అని అంచనా వేశాడు.కానీ పాకిస్తాన్‌తో జాగ్రత్తఅయితే, ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌ను కూడా తక్కువ అంచనా వేయవద్దని రిక్కీ పాంటింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ‘‘ఇటీవలి కాలంలో నిలకడగా ఆడుతున్న జట్టు ఏదైనా ఉందంటే.. అది పాకిస్తాన్. వన్డే క్రికెట్లో ప్రస్తుతం వారి ప్రదర్శన అద్బుతంగా ఉంది.ఐసీసీ వంటి ప్రధాన టోర్నమెంట్లలో వారి ఆటతీరు ఒక్కోసారి అంచనాలకు భిన్నంగా ఉంటుంది. ఈసారి మాత్రం ప్రతికూలతలన్నీ అధిగమించే అవకాశం ఉంది’’ అని రిక్కీ పాంటింగ్ మిగతా జట్లను హెచ్చరించాడు. కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరిగింది. నాటి ఫైనల్లో టీమిండియాను ఓడించి పాకిస్తాన్ టైటిల్ గెలిచింది.ఇదిలా ఉంటే.. ఈ ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియా రెండుసార్లు చాంపియన్‌గా నిలిచింది. రిక్కీ పాంటింగ్ సారథ్యంలో 2006, 2009లొ ట్రోఫీని కైవసం చేసుకుంది. మరోవైపు.. టీమిండియా 2013లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.ఇక పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లడం లేదు. ఐసీసీ అనుమతితో హైబ్రిడ్ విధానంలో దుబాయ్ వేదికగా తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న రోహిత్ సేన.. తదుపరి ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం.. మార్చి రెండున న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి. -
Rohit-Virat: నేను సిద్ధమే.. వాళ్లు రెడీగా ఉండాలి కదా!: టీమిండియా కొత్త కోచ్
టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) పూర్తి ఫిట్నెస్తోనే ఉన్నాడని భారత బ్యాటింగ్ కొత్త కోచ్ సితాన్షు కొటక్(Sitanshu Kotak) వెల్లడించాడు. అయితే, ఇంగ్లండ్‌తో మూడో టీ20లో అతడు ఆడతాడా? లేదా? అన్న అంశంపై మాత్రం స్పష్టతనివ్వలేదు.కాగా ఏడాది తర్వాత.. ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా షమీ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, బట్లర్ బృందంతో తొలి రెండు టీ20లో మాత్రం అతడికి భారత తుదిజట్టులో చోటు దక్కలేదు.ఈ నేపథ్యంలో షమీ ఫిట్‌నెస్‌పై మరోసారి ఊహాగానాలు వచ్చాయి. జట్టు ప్రయోజనాల దృష్ట్యా మేనేజ్మెంట్ అతడిని పక్కనపెడుతోందని కొంతమంది భావిస్తుండగా.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు షమీపై అదనపు భారం పడకుండా చూస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తుది నిర్ణయం వాళ్లదేఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందిస్తూ.. షమీకి ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవన్నాడు. అతడు వందశాతం మ్యాచ్ ఫిట్నెస్తో ఉన్నాడని అయితే తుదిజట్టులో ఆడించే అంశంపై కెప్టెన్ సూర్యకుమార్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లే నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు.కాగా.. 2023 నవంబర్‌లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత షమీ మళ్లీ టీమిండియా తరఫున ఆడలేకపోయాడు. కొన్నాళ్లు విశ్రాంతి, ఇంకొన్నాళ్లు గాయాలతో సతమతమైన 34 ఏళ్ల వెటరన్ బెంగాల్ సీమర్‌ను తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపికచేశారు. దీంతో 15 నెలల తర్వాత జట్టులో చోటు దక్కింది కానీ ఆడేందుకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో కోల్‌కతా టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా.. చెన్నై మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా మంగళవారం మూడో టీ20 జరుగుతుంది. రోహిత్, కోహ్లిలకోసం ప్రత్యేకంగా ఏమైనా..?ఇటీవలి కాలంలో టెస్టుల్లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli) గురించి విలేకరులు సితాన్షు కొటక్ వద్ద ప్రస్తావన తీసుకువచ్చారు. బ్యాటింగ్ కోచ్‌గా వారికోసం ఏవైనా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారా అని అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘రోహిత్, విరాట్ చాలా సీనియర్ ఆటగాళ్లు.అయినా.. ఈరోజుల్లో ప్రతి ఒక్క ఆటగాడు తన ఆట గురించి తానే అంచనా వేసుకోగలుగుతున్నాడు. ఇతరులతో తన ప్రణాళికల గురించి పంచుకుంటూ ..లోపాల్ని సరిచేసుకుంటున్నారు. అలాంటి వారికి మనవంతుగా ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వగలగడం గొప్ప విషయమే. సలహాలిస్తే తీసుకోవాలి కదా!నిజంగా నా సలహాల వల్ల రోహిత్, కోహ్లిల ఆట కనీసం రెండు నుంచి ఐదు శాతం మెరుగుపడినా అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అయినా వాళ్లిద్దరు ఇప్పటికే ఎన్నో గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. అయినా సరే నా నుంచి కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే.. అందుకు వారు సిద్ధంగా ఉండాలి. తద్వారా ఎప్పటికపుడు ఆటను మెరుగుపరచుకోవచ్చు’’ అని సితాన్షు కొటక్ వెల్లడించాడు.కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ పూర్తిగా విఫలం కాగా.. విరాట్ కోహ్లి కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రోహిత్ ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 31 పరుగులే చేశాడు.ఇక కోహ్లి పదకొండు ఇన్నింగ్స్ ఆడి 191 పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కంగారూ జట్టుకు కోల్పోయింది. ఇందుకు ప్రధాన కారణం ‘విరాహిత్’ ద్వయం వైఫల్యమేనని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఇద్దరూ రంజీ బరిలోకి వచ్చారు.చదవండి: U19 T20 WC 2025: భారత్‌తో పాటు సెమీస్ చేరిన జట్లు ఇవే.. షెడ్యూల్ వివరాలు -
‘గంభీర్‌కు ఏం అవసరం?.. ఎవరి పని వాళ్లు చేస్తేనే బాగుంటుంది’
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీసుకువచ్చిన ‘పది సూత్రాల’(BCCI 10-point policy) విధానాన్ని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శించాడు. ఇందులో మరీ కొత్త విషయాలేమీ లేవని.. అయినా.. హెడ్‌కోచ్‌కు వీటితో ఏం అవసరం అని ప్రశ్నించాడు. గౌతం గంభీర్(Gautam Gambhir) ఆటగాళ్ల విషయంలో అతిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశాడు.గంభీర్ సూచనల మేరకు!కాగా స్టార్లు... సీనియర్లు... దిగ్గజాలు... ఇలా జట్టులో ఎంత పేరు మోసిన క్రికెటర్లున్నా సరే... ఇకపై అంతా టీమిండియా సహచరులే! పెద్దపీటలు, ప్రాధామ్యాలంటూ ఉండవు. అందరూ ఒక జట్టే! ఆ జట్టే భారత జట్టుగా బరిలోకి దిగాలని బలంగా బోర్డు నిర్ణయించింది. హెడ్‌కోచ్ గంభీర్ సూచనల్ని పరిశీలించడమే కాదు... అమలు చేయాల్సిందేనని కృతనిశ్చయానికి వచ్చిన బీసీసీఐ ఇకపై ‘పటిష్టమైన జట్టుకు పది సూత్రాలు’ అమలు చేయబోతోంది. ఈ సూత్రాలను పాటించని క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి మ్యాచ్ ఫీజుల్లో కోత లేదంటే కాంట్రాక్ట్ స్థాయిల్లో మార్పులు, చివరగా ఐపీఎల్లో పాల్గొనకుండా దూరం పెట్టేందుకూ వెనుకాడబోమని బీసీసీఐ హెచ్చరించింది.పది సూత్రాలు ఇవేదేశవాళీ మ్యాచ్‌లు ఆడటం తప్పనిసరి చేసిన బీసీసీఐ.. టోర్నీలు జరుగుతుంటే బ్రాండ్–ఎండార్స్మెంట్లు కుదరవని కరాఖండిగా చెప్పింది. అదే విధంగా ప్రతి ఆటగాడు జట్టుతో పాటే పయనం చేయాలని సూచించింది. వ్యక్తిగత సిబ్బందికి కట్టుబాట్లు విధించడంతో పాటు.. ‘అదనపు’ లగేజీ భారాన్ని ప్లేయర్లపైనే మోపాలని నిర్ణయించింది. అంతేకాదు.. ఆటగాళ్లు కలసికట్టుగా ప్రాక్టీస్‌కు రావాలని, బోర్డు సమావేశాలకు కూడా తప్పక అందుబాటులో ఉండాలని పేర్కొంది.ఇక మ్యాచ్‌లు ముగిసిన తర్వాత కూడా ఇష్టారీతిన కాకుండా.. కలిసికట్టుగానే హోటల్ గదులకు వెళ్లాలని.. గదుల్లోనూ కలిసిమెలిసే బస చేయాలని చెప్పింది. కుటుంబసభ్యుల అనుమతికీ పరిమితులు విధించింది. అప్పుడూ ఇలాంటి నిబంధనలే ఉన్నాయిఈ నేపథ్యంలో దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘‘బీసీసీఐ ట్రావెలింగ్ పాలసీ(Travel Policy) గురించి మీడియాలో వచ్చిన కథనాలు చూసినప్పుడు.. నాకేమీ కొత్త విషయాలు కనిపించలేదు.సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్‌గా నేను టీమిండియాకు ఆడుతున్న సమయంలోనూ ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. బీసీసీఐ చెప్పినట్లుగా భావిస్తున్న పది సూత్రాలలో తొమ్మిది అప్పట్లోనే ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల అనుమతి, ఒకే హోటల్లో బస చేయడం, ప్రాక్టీస్ అంశం.. ఇలా అన్నీ పాతవే. మరి వీటిని ఎప్పుడు ఎవరు మార్చారు?కొత్తవి అని మళ్లీ ఎందుకు చెబుతున్నారు. ఈ అంశంపై కచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందే. అయినా, మేము టీమిండియాకు ఆడేటపుడు సెలవు లేదంటే మరేదైనా విషయంలో అనుమతి కావాల్సి వచ్చినపుడు బీసీసీఐకి నేరుగా మెయిల్ చేసేవాళ్లం. లేదంటే.. నేరుగానే పర్మిషన్ కోసం అర్జీ పెట్టుకునే వాళ్లం.ఎవరి పని వారు చూసుకుంటే మంచిదిఅయినా.. హెడ్‌కోచ్ ఈ విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నాడు? అతడి పని ఇది కాదు కదా! కేవలం మైదానంలో ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారన్న అంశం మీదే అతడి దృష్టి ఉండాలి. మన జట్టులో ఇప్పుడు అదే లోపించింది. అడ్మినిస్ట్రేషన్ విషయాలను బీసీసీఐలో ఉన్న సమర్థులైన వ్యక్తులకు అప్పగించి.. ఎవరి పని వారు చూసుకుంటే మంచిది’’ అని భజ్జీ గంభీర్‌కు చురకలు అంటించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో ఓటమి విషయం.. ఇలాంటి చర్చల ద్వారా పక్కకు తప్పించాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నాడు.చదవండి: ఫామ్‌లో ఉన్నా కరుణ్ నాయర్‌ను సెలక్ట్ చేయరు.. ఎందుకంటే: డీకే -
అతడి కెరీర్‌ను నాశనం చేస్తారా?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన సందర్భంగా భారత్ డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగింది. భారత్ జట్టు సుదీర్ఘ విదేశీ పర్యటనకు వెళ్ళిన సమయంలో ఇలాంటి వార్తలు రావడం సహజమే.అదీ భారత్ జట్టు వరసగా పరాజయం పాలవడం, కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు పేలవమైన ఫామ్‌తో విఫలం కావడం, చివరి మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా తప్పుకోవడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. అయితే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు తలెత్తినట్టు వచ్చిన వార్తలు బయటికి పొక్కడానికి.. ఒక యువ క్రికెటర్ కారణమని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. స్వయంగా భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి తెలియజేసాడని కూడా వార్తలు వచ్చాయి.కానీ.. నిజంగా గంభీర్ ఈ విషయాన్నీ బీసీసీఐకి తెలియజేసాడా అంటే.. దీని గురించి బీసీసీఐ అధికారులు ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. మరి భారత డ్రెస్సింగ్ రూమ్ నుండి ఇలాంటి లీకులకు భాద్యులు ఎవరు? ఈ విషయాన్నీ బీసీసీఐ స్పష్టం చేయాలి. గంభీర్ పేలవమైన రికార్డుగౌతమ్ గంభీర్‌ను భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించిన తర్వాత నుంచి భారత్ జట్టు వరుసగా పరాజయాల్ని చవిచూస్తోంది. గత జూలైలో శ్రీలంక జట్టు భారత్ పర్యటనకు రావడానికి ముందు గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా నియమించారు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో భారత్ 3-0 విజయంతో గంభీర్ కోచ్‌గా తన ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఆ తరువాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో 0-2తో భారత్ జట్టు ఓటమి చవిచూసింది. ఆ తరువాత బంగ్లాదేశ్‌పై 2-0 టెస్ట్ సిరీస్ విజయంతో జట్టు కొద్దిగా పుంజుకున్నట్టు కనిపించినా న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 0-3 తో కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో 3-1 తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్‌కు ముందు గంభీర్ సీనియర్ ఆటగాళ్లను మందలించాడని వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు భారత్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కొత్త వివాదాన్ని రేకెత్తించాడు. ఈ లీకులు భారత్ జట్టు నుంచి మాత్రమే కాక భారత్ బోర్డు నుంచి కూడా వస్తున్నాయని చోప్రా ఎత్తి చూపడమే కాక ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించాడు. అతడి కెరీర్ నాశనం చేస్తారా? లీకులకు బాధ్యులు ఎవరు?తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన వీడియోలో, ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. లీకుల ఆధారంగా వచ్చే కథనాలు ఒక ఆటగాడి కెరీర్‌కు హాని కలిగిస్తాయని పేర్కొన్నాడు. యువ ఆటగాడి భవిష్యత్తును ప్రమాదంలో పడేసే లీక్ అయిన వాదనలను వ్యాప్తి చేయకుండా ఉండాలని అతను బీసీసీఐని, క్రికెట్ అభిమానుల్ని కోరాడు."ఇలాంటి లీకులు ఒక యువ ఆటగాడి క్రికెట్ కెరీర్ ను ప్రమాదంలో పడేశాయి. ఈ లీకులు వాస్తవమే అని మరో లీకు ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. ఇది ఆ అతగాడి కెరీర్ కు ఎంత ప్రమాదమో ఆలోచించారా" అని ప్రశ్నించాడు. బుమ్రా మంచి పనిచేశాడుఅదే వీడియోలో జస్ప్రీత్ బుమ్రా కు సంబంధించిన మరో సంఘటనని చోప్రా ఉదహరించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ చివర్లో, మళ్ళీ రెండవ ఇన్నింగ్స్‌లో బుమ్రా వెన్నునొప్పి కారణంగా బౌలింగ్ చేయలేకపోయాడు.అయితే బుమ్రా తనకు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు సలహా ఇచ్చారని అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు సరికాదని బుమ్రా స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా ఖండించాడని చోప్రా ఎత్తి చూపాడు. బుమ్రా ఈ ట్వీట్ చేయని పక్షంలో దాన్ని నిజమని నమ్మేవారు. ఇలాంటి వార్తలను జట్టుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ ఖండించాలి అని చోప్రా సూచించాడు.బీసీసీఐ జాగ్రత్త పడాలిఅయితే భారత్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా సీతాన్షు కోటక్ నియమించబోతున్నారని కూడా వార్త బీసీసీఐ అధికారిక ప్రకటనకు ముందే మీడియా లో రావడాన్ని ఇక్కడ ఉదహరించాడు. మీడియాకు ఈ వార్త తెలియకముందే బీసీసీఐ ముందస్తుగా వ్యవహరించి వారి నియామకాలను ముందుగానే ప్రకటించాలని చోప్రా సూచించాడు. "భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సీతాన్షు కోటక్ నియమిస్తున్నారనేది పెద్ద వార్త. ఈ విషయాన్నీ బీసీసీఐ అధికారికంగా ప్రకటించవచ్చు కదా. మీరు ముందస్తుగా చెప్పడం ప్రారంభిస్తే.. లీకులకు స్వస్తి చెప్పే అవకాశం ఉంటుంది’’ అని చోప్రా సూచించాడు. మరి బోర్డు అధికారులు ఈ విషయాన్ని గ్రహిస్తారో లేదో చూడాలి.చదవండి: ఫామ్‌లో ఉన్నా కరుణ్ నాయర్‌ను సెలక్ట్ చేయరు.. ఎందుకంటే: డీకే -
ఇలాంటి కెప్టెన్‌ను చూడలేదు: రోహిత్‌పై టీమిండియా స్టార్ కామెంట్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత పేస్ బౌలర్ ఆకాశ్ దీప్(Akash Deep) ప్రశంసలు కురిపించాడు. తన కెరీర్లో ఇలాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదన్నాడు. అతడి సారథ్యంలో అరంగేట్రం చేయడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియాలో తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేనన్న ఆకాశ్ దీప్.. నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపాడు.ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రంబిహార్కు చెందిన ఆకాశ్ దీప్ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్. దేశవాళీ క్రికెట్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆకాశ్.. గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇంగ్లిష్ జట్టుతో నాలుగో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 28 ఏళ్ల ఈ పేస్ బౌలర్.. మూడు వికెట్లు తీశాడు.అనంతరం న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ ఆకాశ్ దీప్ పాల్గొన్నాడు. ఆఖరి రెండు టెస్టులాడి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే జట్టుకు ఆకాశ్ దీప్ ఎంపికయ్యాడు. పెర్త్, అడిలైడ్‌లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో అతడికి ఆడే అవకాశం రాలేదు.బ్యాట్‌తోనూ రాణించిఅయితే, బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో మాత్రం మేనేజ్మెంట్ ఆకాశ్ దీప్‌నకు పిలుపునిచ్చింది. ఈ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. పదకొండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 31 పరుగులు చేసి.. ఫాలో ఆన్ గండం నుంచి టీమిండియాను తప్పించాడు.ఇక మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో ఆకాశ్ దీప్.. రెండు వికెట్లతో సరిపెట్టుకున్నాడు. అనంతరం గాయం కారణంగా సిడ్నీలో జరిగిన ఐదో టెస్టుకు దూరమయ్యాడు. కాగా ఈ సిరీస్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో 3-1తో ఓడిపోయి.. ట్రోఫీని చేజార్చుకున్న విషయం తెలిసిందే.ఇందుకు ప్రధాన కారణం బ్యాటర్‌గా విఫలం కావడంతో పాటు కెప్టెన్‌గానూ సరైన వ్యూహాలు అమలుచేయలేకపోవడమే అంటూ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే అతడు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగి.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ దీప్ రోహిత్ శర్మ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇలాంటి కెప్టెన్‌ను చూడలేదు‘‘రోహిత్ శర్మ సారథ్యంలో ఆడే అవకాశం రావడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. అతడి నాయకత్వ లక్షణాలు అద్భుతం. ప్రతి విషయాన్ని సరళతరం చేస్తాడు. ఇప్పటి వరకు నేను ఇలాంటి కెప్టెన్‌ను చూడలేదు’’ అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు. ఇక హెడ్‌కోచ్ గౌతం గంభీర్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘గంభీర్ సర్ కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తూనే.. ఆటగాళ్లను మోటివేట్ చేస్తారు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా చేస్తారు’’ అని ఆకాశ్ దీప్ చెప్పుకొచ్చాడు.సంతృప్తిగా లేనుఅదే విధంగా.. ఆస్ట్రేలియా పర్యటన గురించి మాట్లాడుతూ.. ‘‘నేను అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇండియాలో టెస్టు క్రికెట్ ఆడటం వేరు. ఇక్కడ పేసర్ల పాత్ర అంత ఎక్కువగా ఏమీ ఉండదు. కానీ.. ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలర్‌గా మానసికంగా, శారీరకంగా మనం బలంగా ఉంటేనే రాణించగలం. అక్కడ ఎక్కువ ఓవర్ల పాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ టూర్లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేను. నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవడంపైనే ప్రస్తుతం నా దృష్టి ఉంది’’ అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు.చదవండి: IND Vs IRE 3rd ODI: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్ -
BCCI: అసంతృప్తి వెళ్లగక్కిన గంభీర్!.. వారి మ్యాచ్ ఫీజులలో కోత?!
టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆటగాళ్ల పట్ల కఠిన వైఖరి అవలంబించనున్నట్లు తెలుస్తోంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) ఇచ్చిన నివేదిక మేరకు కఠినమైన నిబంధనలు తిరిగి ప్రవేశపెట్టేందుకు సిద్దమైనట్లు సమాచారం.ముఖ్యంగా ఆటలో భాగంగా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కుటుంబాన్ని వెంట తీసుకువెళ్లడం, టూర్ ఆసాంతం వారిని అట్టిపెట్టుకుని ఉండటం ఇకపై కుదరదని తేల్చి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న భారత జట్టు.. వన్డే, టెస్టుల్లో మాత్రం ఇటీవలి కాలంలో ఘోర పరాభవాలు చవిచూసింది.ఘోర ఓటములుశ్రీలంక పర్యటనలో భాగంగా గతేడాది వన్డే సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. అనంతరం.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌లోనూ 3-1తో ఓటమిపాలైంది. తద్వారా పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆసీస్‌కు కోల్పోవడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో ఇంటాబయట టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆసీస్ టూర్ తర్వాత బీసీసీఐ హెడ్‌కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.క్రమశిక్షణ లేదు.. అసంతృప్తి వెళ్లగక్కిన గంభీర్!ఈ రివ్యూ మీటింగ్‌లో చర్చకు వచ్చిన అంశాల గురించి బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం.. ‘‘సమీక్షా సమావేశం(BCCI Review Meeting)లో గౌతం గంభీర్ ప్రధానంగా.. ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యం గురించి ప్రస్తావించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ సమయంలో డ్రెసింగ్‌రూమ్‌లో అసలు సానుకూల వాతావరణం కనిపించలేదు. అందుకే.. ప్రి-కోవిడ్ నిబంధనలను తిరిగి తీసుకురానున్నారు. ఇకపై విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు.. వారితో కేవలం రెండు వారాలు మాత్రమే గడిపే వీలుంటుంది. 45 రోజుల పాటు టూర్ సాగినా వారు రెండు వారాల్లోనే తిరిగి స్వదేశానికి వచ్చేయాలి. ఈ విషయంలో ఆటగాళ్లతో పాటు కోచ్‌లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.వారి మ్యాచ్ ఫీజులలో కోత?ఇక ఓ సీనియర్ ఆటగాడు కూడా గంభీర్, అగార్కర్‌తో కలిసి రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నాడు. మ్యాచ్ ఫీజులను వెంటనే ఆటగాళ్లకు పంచేయకూడదని అతడు ఓ సలహా ఇచ్చాడు. ప్రదర్శన ఆధారంగానే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును చెల్లించాలని సూచించాడు.కొంతమంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌తో పాటు.. జాతీయ జట్టు విధుల పట్ల కూడా నిబద్ధత కనబరచడం లేదన్న విషయాన్ని తాను గమనించినట్లు తెలిపాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. కాగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు.. ప్రధాన బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా విఫలమయ్యాడు. వీరిద్దరి వరుస వైఫల్యాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో రోహిత్ తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ముంబై తరఫున రంజీ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, కోహ్లి మాత్రం రంజీల్లో ఆడే విషయమై ఇంత వరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌కు సమాచారం ఇవ్వలేదు. మరోవైపు.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై తరఫున, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఢిల్లీ తరఫున దేశీ క్రికెట్ ఆడేందుకు సమాయత్తమవుతున్నారు.చదవండి: IND Vs IRE 3rd ODI: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్ -
టీమిండియాకు బ్యాడ్‌న్యూస్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ముందు టీమిండియాకు చేదువార్త!.. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఈ ఐసీసీ టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్‌కు అతడు అందుబాటులోకి రావడం కష్టమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.అంతా తానై నడిపించిన బుమ్రాఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పితృత్వ సెలవుల కారణంగా తొలి టెస్టుకు దూరం కాగా బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బౌలర్‌గా, కెప్టెన్‌గా రాణించి టీమిండియాకు 295 పరుగుల భారీ తేడాతో విజయం అందించాడు.ఇక ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో.. ఫామ్‌లేమి దృష్ట్యా రోహిత్ శర్మ ఆఖరిదైన సిడ్నీ మ్యాచ్‌కు దూరం కాగా బుమ్రా మరోసారి జట్టు పగ్గాలు తీసుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా అతడు వెన్నునొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలో ఆస్పత్రికి తీసుకువెళ్లి స్కానింగ్ చేయించుకున్న తర్వాత బుమ్రా మళ్లీ మైదానంలో దిగి బౌలింగ్ చేశాడు. 32 వికెట్లతో కానీ దురదృష్టవశాత్తూ జట్టును గెలిపించలేకపోయాడు. ఈ క్రమంలో 3-1 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన టీమిండియా.. పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఏదేమైనా అద్బుత ప్రదర్శనతో ఈ సిరీస్‌లో అదరగొట్టిన బుమ్రా 32 వికెట్లతో లీడింగ్ వికెట్‌టేకర్‌గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా తదుపరి ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20, వన్డేలు ఆడనుంది. అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనాల్సి ఉంది. అయితే, బుమ్రా వెన్నునొప్పి నుంచి ఇంకా కోలుకోలేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు ఇంగ్లండ్‌తో వన్డేలతో పాటు.. చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లకు కూడా దూరమవుతాడని తొలుత వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. అతడు నాకౌట్ దశకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది.బెడ్ రెస్ట్ అవసరం‘‘బుమ్రా వచ్చేవారం బీసీసీఐకి చెందిన, బెంగళూరులో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్టు చేయాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన తేదీ ఖరారు కాలేదు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కండరాల నొప్పితో పాటు వాపు కూడా ఉంది.కాబట్టి వైద్యులు అతడిని ఇంటి వద్ద బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఇది నిజంగా జట్టుకు ఎదురుదెబ్బలాంటిదే. డిస్క్ బాహ్య పొర ఉబ్బినట్లు తేలినా, కండరాల వాపు ఎక్కువగా ఉన్నా మరింత కష్టమే. అతడొక విలువైన ఆటగాడు. కాబట్టి అతడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్పై ఉంది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.అవే కీలకంఅదే విధంగా.. టీమిండియా మాజీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ రాంజీ శ్రీనివాసన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఎడిమా(శరీర కణజాలాల్లో ఫ్లూయిడ్స్) ఫామ్ అయితే.. వాపు వస్తుంది. అయితే, గాయం, నొప్పి తీవ్రత ఆధారంగా ఓ వ్యక్తి ఎన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలనే అంశాన్ని నిర్ణయిస్తారు. ఆ వ్యక్తి శరీరతత్వం, వైద్యుల పర్యవేక్షణ, వాడే మందులు.. అన్నీ ఇందులో కీలకం’’ అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. కాగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.చదవండి: అందుకే ఐదు సెంచరీలు కొట్టినా అతడిని పక్కన పెడుతున్నారా?: భజ్జీ -
అతడు ‘జట్టు’లో లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనదే: అశ్విన్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ‘గేమ్ ఛేంజర్’ ఎవరన్న అంశంపై తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ఓ స్టార్ పేసర్ పేరు చెప్పాడు. అతడు గనుక ఆస్ట్రేలియా జట్టులో లేకపోయి ఉంటే.. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని భారత్ కైవసం చేసుకునేదని ఈ మాజీ ఆల్‌రౌండర్ అభిప్రాయపడ్డాడు. 3-1తో గెలిచి పదేళ్ల తర్వాతఏదేమైనా ఈసారి బీజీటీ ఆద్యంతం ఆసక్తిగా, పోటాపోటీగా సాగిందని అశూ హర్షం వ్యక్తం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophyబీజీటీ)లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. పెర్త్‌లో గెలుపొంది శుభారంభం అందుకున్న టీమిండియా.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టులో ఓడి.. అనంతరం బ్రిస్బేన్‌లో మూడో టెస్టు డ్రా చేసుకున్న భారత్.. మెల్బోర్న్, సిడ్నీల్లో మాత్రం చేతులెత్తేసింది.తద్వారా రోహిత్ సేనను 3-1తో ఓడించిన కమిన్స్ బృందం.. పదేళ్ల తర్వాత బీజీటీని సొంతం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వైఫల్యం కారణంగానే టీమిండియాకు ఇంతటి ఘోర పరాభవం ఎదురైంది. ఇక బ్రిస్బేన్ టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. తాజాగా ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్‌పై ప్రశంసలు కురిపించాడు.అతడు లేకుంటే.. ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం‘‘ప్యాట్ కమిన్స్(Pat Cummins)కు ఇదొక గొప్ప సిరీస్ అని చాలా మంది అంటున్నారు. నిజానికి ఈ పేస్ బౌలర్ ఎడమచేతి వాటం బ్యాటర్లను ఎదుర్కోవడంలో చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. అయితే, అదృష్టవశాత్తూ స్కాట్ బోలాండ్ జట్టులోకి రావడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది. ఒకవేళ బోలాండ్ గనుక ఈ సిరీస్‌లో ఆడకపోయి ఉంటే.. టీమిండియానే ట్రోఫీ గెలిచేది.అయితే, ఇక్కడ నేను జోష్ హాజిల్‌వుడ్ నైపుణ్యాలను తక్కువ చేసి మాట్లాడటం లేదు. అతడు కూడా అద్భుతమైన బౌలర్. అయితే, భారత్‌తో సిరీస్‌లో మాత్రం హాజిల్‌వుడ్‌ను కొనసాగిస్తే.. విజయం మనదే అయ్యేది. అయితే, బోలాండ్ మనల్ని అడ్డుకున్నాడు. ముఖ్యంగా లెఫ్డాండర్లకు రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయడం ప్రభావం చూపింది’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా గాయం కారణంగా జోష్ హాజిల్‌వుడ్ దూరం కాగా.. అతడి స్థానంలో నాలుగో టెస్టు నుంచి బోలాండ్ బరిలోకి దిగాడు. ఈ సిరీస్‌లో ఆడింది కేవలం రెండు టెస్టులే ఆడినా 16 వికెట్లు పడగొట్టి.. సిరీస్‌లో మూడో లీడింగ్ వికెట్ టేకర్‌గా బోలాండ్ నిలిచాడు. భారత కీలక బ్యాటర్ విరాట్ కోహ్లిని అనేకసార్లు అవుట్ చేసి.. టీమిండియాను దెబ్బకొట్టాడు. తద్వారా ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక వికెట్ల వీరుడిగా బుమ్రాఇదిలా ఉంటే.. టీమిండియా పేస్ దళనాయకుడు జస్ప్రీత్ బుమ్రా బీజీటీ 2024-25లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఐదు టెస్టుల్లో కలిపి 32 వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అదే విధంగా.. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్(డిసెంబరు)గా కూడా బుమ్రా ఎంపికయ్యాడు. ఇక ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం కాగా.. బుమ్రా సారథ్యం వహించి భారీ విజయం అందించాడు. ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ తప్పుకోగా.. మరోసారి కెప్టెన్సీ చేపట్టిన బుమ్రా.. ఈసారి మాత్రం గెలిపించలేకపోయాడు.చదవండి: పాకిస్తాన్‌కు వెళ్లనున్న రోహిత్ శర్మ!.. కారణం?పంత్ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలా: డీడీసీఏ ఆగ్రహం -
‘రోహిత్ శర్మ ఖేల్ ఖతం.. అందులో మాత్రం భవిష్యత్తు ఉంది’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కెరీర్ గురించి ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్(Brad Hogg) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో హిట్‌మ్యాన్ పనైపోయిందని.. ఇక అతడు రిటైర్మెంట్ ప్రకటించడమే తరువాయి అన్నాడు. గత ఆరేడు నెలలుగా అతడి విఫలమవుతున్న తీరు.. కెరీర్ ముగింపునకు వచ్చిందనడానికి సంకేతం అని పేర్కొన్నాడు.అయితే, వన్డే(ODI Cricket)ల్లో మాత్రం రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉందని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. కాగా గత కొంతకాలంగా భారత సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ టెస్టుల్లో దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా అతడికి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.వరుస వైఫల్యాలుతొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో తేలిపోయిన ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ.. తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరిచాడు. గత పదకొండు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆసీస్‌తో తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ.. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు సందర్భంగా మళ్లీ జట్టుతో చేరాడు.అయితే, తొలి టెస్టులో ఓపెనింగ్ జోడీగా యశస్వి జైస్వాల్- కేఎల్ రాహుల్ హిట్ కావడంతో.. రోహిత్ తప్పనిసరి పరిస్థితుల్లో మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, అనవసరపు షాట్లకు పోయి వికెట్ పారేసుకున్నాడు. అనంతరం మూడో టెస్టులోనూ అదే స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. తన రెగ్యులర్ స్థానమైన ఓపెనింగ్‌లోనూ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు.ఈ క్రమంలో పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. రోహిత్ శర్మ ఆఖరిదైన సిడ్నీ టెస్టుకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా విశ్రాంతి పేరిట తనంతట తానుగా జట్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో ఆరంభంలో అదరగొట్టిన టీమిండియా.. తర్వాత చతికిల పడి ఓటమిపాలైంది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ చేతిలో 3-1తో ఓడి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.రోహిత్ ఖేల్ ఖతంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ మాట్లాడుతూ.. ‘‘టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ పనైపోయిందనే అనుకుంటున్నా. ఇక అతడు ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడమే మంచిది. గత ఆరు- ఏడు నెలలుగా అతడి ఫామ్ అంత గొప్పగా ఏమీ లేదు.వికెట్ పారేసుకున్న తీరు మరీ ఘోరంఅంతేకాదు అతడు బౌల్డ్ అయ్యాడు. లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ)గా వెనుదిరిగాడు. ఒక ఓపెనర్ అయి ఉండి ఇలా అవుట్ కావడం సరికాదు. ముఖ్యంగా అతడు ఎల్బీడబ్ల్యూ కావడం మరీ ఘోరం’’ అని విమర్శలు గుప్పించాడు. అయితే, ఐదో టెస్టు నుంచి రోహిత్ శర్మ స్వయంగా తప్పుకోవడాన్ని బ్రాడ్ హాగ్ ప్రశంసించాడు.‘‘రోహిత్ శర్మ ఫామ్‌లో లేకపోవడం నిరాశాజనకం. అయితే, సిడ్నీలో అతడు తీసుకున్న నిర్ణయం సరైంది. కానీ అంతకంటే ముందే.. అంటే మెల్బోర్న్ టెస్టు సందర్భంగానే అతడు తుదిజట్టు నుంచి తప్పుకొంటే ఇంకా బాగుండేది. తన స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు ఆడించి ఉంటే మేలు జరిగేది’’ అని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.వన్డేల్లో రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉందిఇక 37 ఏళ్ల రోహిత్ శర్మ వన్డే కెరీర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘టెస్టుల సంగతి ఎలా ఉన్నా.. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉంది. ఈ ఫార్మాట్లో కాస్త దూకుడుగా.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, వయసు మీద పడుతున్న దృష్ట్యా అతడు కాస్త జాగ్రత్తగా ఆడితేనే ఇంకొన్నాళ్లు కొనసాగగలుగుతాడు.ఇప్పటి వరకు అతడి వన్డే కెరీర్ అత్యద్భుతం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని భావిస్తున్నా’’ అని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వరకు రోహిత్ శర్మనే టీమిండియాకు ముందుకు నడిపిస్తాడని అభిప్రాయపడ్డాడు.చదవండి: సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే! -
'ముమ్మాటికీ కోహ్లిదే తప్పు.. అతడిపై నిషేధం పడాల్సింది'
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli), ఆస్ట్రేలియా యువ బ్యాటర్ సామ్ కొన్‌స్టాస్ మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు సందర్భంగా కొన్‌స్టాస్ పిచ్‌పై నడుస్తుండగా కోహ్లి వచ్చి భుజాన్ని ఢీకొట్టడంతో వివాదం మొదలైంది. దీంతో కోహ్లి తీరును చాలా మంది తప్పుబట్టారు.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా కోహ్లిపై సీరియస్ అయింది. కోహ్లి మ్యాచ్ ఫీజులో ఐసీసీ 20 శాతం కోత విధించింది. అయితే తాజాగా ఈ వివాదంపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ హార్మిసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముమ్మాటికి కోహ్లిదే తప్పు అని, అతడు తృటిలో నిషేధం నుంచి తప్పించుకున్నాడని హార్మిసన్ అభిప్రాయపడ్డాడు. "ఆడిలైడ్‌లో యువ ఆటగాడు కాన్స్టాస్ పట్ల విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు సరికాదు. ఆ సమయంలో విరాట్ మితిమీరి ప్రవర్తించినట్లు అన్పించింది. అతడు చేసిన పనికి నిషేధం విధించి ఉండాల్సింది. విరాట్ కోహ్లి అంటే నాకు కూడా ఎంతో ఇష్టం. అతడు జెంటిల్‌మేన్ గేమ్‌కు ఎంతో వన్నె తెచ్చాడు. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అది మీరి ప్రవర్తించకూడదు. ఇక కాన్స్టాస్ అద్బుతంగా ఆడుతున్నాడు.నిజంగా అతడి స్కూప్ షాట్లు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే హిట్టింగ్ వరకు సరే కానీ, అతడి వద్దా డిఫెన్సివ్ టెక్నిక్ ఉందా లేదా గుర్తించాలి. టెస్టు క్రికెట్లో డిఫెన్స్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యం. డేవిడ్ వార్నర్ వారసుడిగా అతడు నిరూపించుకోవాలి. సామ్‌కు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. అతడికి ఇంకా కేవలం 19 సంవత్సరాలు మాత్రమే అని టాక్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్మిసన్ పేర్కొన్నాడు.ఆసీస్ గడ్డపై విఫలం..ఇక కోహ్లి గత కొంతకాలంగా టెస్టు క్రికెట్లో పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో తీవ్ర నిరాశపరిచిన విరాట్.. అదే తీరును ఆస్ట్రేలియా పర్యటనలో సైతం కనబరిచాడు.తొలి టెస్టులో సెంచరీ చేసిన కోహ్లి.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పూర్తిగా తేలిపోయాడు. సిరీస్ అసాంతం ఆఫ్‌సైడ్ బంతులను వెంటాడి తన వికెట్‌ను కోహ్లి కోల్పోయాడు. కోహ్లి ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటన దృష్టిలో పెట్టుకుని కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే.చదవండి: SA T20: ఐపీఎల్ వద్దంది.. కట్ చేస్తే! అక్కడ కేన్ మామ విధ్వంసం -
అతడి డిఫెన్స్ అద్భుతం.. 200 బంతులు కూడా ఆడగలడు: అశ్విన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూకుడైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఫార్మాట్ ఏదైనా పంత్ బ్యాటింగ్ స్టైల్ ఒకటే. క్రీజులో వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడడం రిషబ్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈ ఢిల్లీ చిచ్చరపిడుగులో దూకుడైన బ్యాటింగ్‌తో పాటు అద్భుతమైన డిఫెన్స్ స్కిల్స్‌ను కూడా టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తించాడు.ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న అశ్విన్ తన సహచరుడి బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. పంత్ డిఫెన్స్ అభేద్యమని, అతను పట్టుదలగా నిలబడితే ఎన్ని బంతులైనా ఆడగలడని అశ్విన్ కొనియాడాడు.పంత్ డిఫెన్స్ అద్భుతం..‘రిషభ్ పంత్‌లో అన్ని రకాల షాట్లు ఆడే సామర్థ్యం ఉంది. అయితే అతడి నుంచి మనం ఏం ఆశిస్తున్నామో అతనికి స్పష్టంగా చెప్పాలి. అతడి డిఫెన్స్ కూడా ఎంత బాగుంటుందంటే 200 బంతులు కూడా ఆడగలడు. ప్రపంచంలోనే అద్బుతంగా డిఫెన్స్ ఆడే బ్యాటర్లలో రిషబ్ ఒకడు.తన బలమేంటో తనకే పూర్తిగా తెలీదు. మిడిల్ గేమ్‌లో పరిస్థితికి తగినట్లుగా ఆడటం అలవాటు చేసుకుంటే ప్రతీ మ్యాచ్‌లో పంత్ సెంచరీ కొట్టగలడు. డిఫెన్స్ ఆడుతూ అతను అవుట్ కావడం చాలా అరుదు. నెట్స్‌లో నేను ఎన్నోసార్లు అతనికి బౌలింగ్ చేశాను.అతడు ఎల్బీడబ్ల్యూగా లేదా బంతి ఎడ్జ్ తీసుకుంటూ ఎప్పుడూ అవుట్ కాలేదు. గత కొన్నేళ్లుగా టెస్టుల్లో బ్యాటింగ్ చాలా కష్టంగా మారిపోయింది. అలాంటి సమయంలో పంత్ ఆడుతున్నాడు. సిడ్నీలో అతడి ఆడిన ఇన్నింగ్స్‌లు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.ఒకే ఒకే గేమ్‌లో రెండు వేర్వేరు నాక్‌లు ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో డిఫెన్స్ ఆడితే, రెండో ఇన్నింగ్స్‌లో తన విశ్వరూపం చూపించాడు’ అని అశ్విన్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టులో భారత్ ఓటమి పాలైనప్పటికి పంత్ మాత్రం తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులతో సూపర్ నాక్ ఆడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మొత్తం 9 ఇన్నింగ్స్‌లో పంత్.. 28.33 సగటుతో 255 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 43 టెస్టులు ఆడిన పంత్.. 42.11 సగటుతో 2948 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఆరు సెంచరీలు చేశాడు.చదవండి: క్రికెట్ ‘మనసు’ చదివింది! -
వామిక, అకాయ్‌లతో బృందావనంలో విరాట్- అనుష్క! వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) మరోసారి ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయాడు. సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma), పిల్లలు వామిక(Vamika), అకాయ్(Akaay)లతో కలిసి ప్రేమానంద్ మహరాజ్ ఆశీస్సులు తీసుకున్నాడు. కాగా గత కొంతకాలంగా కెరీర్ పరంగా కోహ్లి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ విఫలంముఖ్యంగా టెస్టుల్లో నిలకడలేమి ఆట తీరు, వరుస వైఫల్యాల కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నాడు కోహ్లి. తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తేలిపోయిన ఈ ‘రన్‌మెషీన్’.. తనకు ఘనమైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియాలోనూ చేతులెత్తేశాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రధాన కారణమయ్యాడు కోహ్లి. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో శతకం బాదడం మినహా.. మిగతా మ్యాచ్‌లలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. అంతేకాదు.. ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి.. ఒకే రీతిలో వికెట్ పారేసుకున్నాడు.అంతేకాదు.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ప్రతిసారి బోల్తా పడి వికెట్ సమర్పించుకున్నాడు ఇక ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. అంతేకాదు.. ఈ పరాజయం కారణంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ రేసు నుంచి కూడా భారత జట్టు నిష్క్రమించింది.ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్లుతదుపరి ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. జనవరి 22 నుంచి ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ మొదలుకానున్నాయి. ఆ తర్వాత వెంటనే చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ టోర్నీలో తలపడాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి కోహ్లి భారత్‌కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మానసిక ప్రశాంతతకై ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో ఉన్న ప్రేమానంద్ మహరాజ్ దర్శనం చేసుకున్నాడు. ఆ సమయంలో భార్య అనుష్కతో పాటు.. కుమార్తె వామిక, చిన్నారి కుమారుడు అకాయ్ కూడా కోహ్లి వెంట ఉన్నారు.అనుష్క వల్లే కోహ్లి ఇలాఈ సందర్భంగా అనుష్క ప్రేమానంద్ మహరాజ్‌తో మాట్లాడుతూ.. ‘‘గతంలో ఇక్కడికి వచ్చినపుడు నా మనసులోని కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్నలు వేరే వాళ్లు అడిగేశారు. ఈసారి ఇక్కడికి వచ్చినపుడు మాత్రం నా మనసులోని సందేహాలకు సమాధానం పొందాలని భావించాను. అయితే, ఈసారి కూడా వేరేవాళ్ల వల్ల నా ప్రశ్నలకు జవాబు దొరికింది. ఇప్పుడు మాకు కేవలం మీ ఆశీస్సులు ఉంటే చాలు’’ అని పేర్కొంది.ఇక విరుష్క దంపతులు తన ముందు ప్రణమిల్లడం చూసి భావోద్వేగానికి గురైన ప్రేమానంద్ మహరాజ్.. ‘‘మీరు చాలా ధైర్యవంతులు. ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు సంపాదించిన తర్వాత కూడా దేవుడి పట్ల ఇంత అణకువగా ఉండటం అందరికీ సాధ్యం కాదు,.భక్తి మార్గంలో నడుస్తున్న అనుష్క ప్రభావమే కోహ్లి మీద కూడా ఉంటుందని మేము అనుకుంటూ ఉంటాం. విరాట్ కోహ్లి తన ఆటతో దేశం మొత్తానికి సంతోషాన్ని పంచుతాడు. అతడు గెలిస్తే దేశమంతా సంతోషంగా ఉంటుంది. అంతలా ప్రజలు అతడిని ప్రేమిస్తున్నారు’’ అంటూ కోహ్లిపై ప్రశంసలు కురిపించారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇందులో వామిక, అకాయ్‌ల ముఖాలు కనిపించకుండా విరుష్క జోడీ జాగ్రత్తపడింది. కాగా ఈ జంట ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే.చదవండి: భార్యను భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు: గుత్తా జ్వాల ఫైర్Virat Kohli and Anushka Sharma with their kids visited Premanand Maharaj. ❤️- VIDEO OF THE DAY...!!! 🙏 pic.twitter.com/vn1wiD5Lfc— Mufaddal Vohra (@mufaddal_vohra) January 10, 2025 -
నితీశ్ రెడ్డికి వైజాగ్‌లో ఘన స్వాగతం.. ఓపెన్‌టాప్ జీపులో! వీడియో
టీమిండియా యువ సంచలనం, ఆంధ్ర స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తన టెస్టు అరంగేట్ర సిరీస్‌లోనే అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు క్రికెట్లో అడుగు పెట్టిన నితీశ్.. తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.తొలిసారి ఆసీస్ గడ్డపై అడినప్పటికి నితీశ్‌లో కొంచెం కూడా భయం కన్పించలేదు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట ఈ ఆంధ్ర కుర్రాడు సత్తాచాటాడు. మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని తన అంతర్జాతీయ సెంచరీని కూడా నితీశ్ అందుకున్నాడు. మెల్బోర్న్లో అతడి చేసిన సెంచరీ తన కెరీర్లో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ బీజీటీ సిరీస్‌లో ఐదు టెస్టుల్లో నితీశ్ ఐదు టెస్టుల్లో 37.25 సగటుతో 298 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెడ్డి రెండో స్ధానంలో నిలిచాడు. బౌలింగ్‌లోనూ 5 వికెట్లతో మెరిశాడు.వైజాగ్‌లో గ్రాండ్ వెలకమ్..ఇక ఆస్ట్రేలియా గడ్డపై సత్తాచాటిన నితీష్ కుమార్ రెడ్డి తన స్వస్థలమైన విశాఖకు గురువారం చేరుకున్నాడు. విమానాశ్రయంలో ఈ తెలుగు తేజానికి ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో ముంచెత్తారు. పలువురు అభిమానులు ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ఇంటికి ర్యాలీగా వెళ్లారు. ఓపెన్ టాప్ జీపులో ముందు సీట్లో నితీశ్ రెడ్డి కూర్చోగా.. వెనుక ఆయన తండ్రి ముత్యాలరెడ్డి ఉన్నారు. అభిమానులతో గాజువాక వీధులు కిక్కిరిసిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.చదవండి: SA T20: జూనియర్ ఏబీడీ విధ్వంసం.. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చిత్తునితీష్ శనివారం అకాడమిలో శిక్షణకు వెళ్లనున్నాడు. ఈనెల 22 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20లు, వన్డే మ్యాచ్‌లకు ఎంపికయ్యే అవకాశం ఉంది. కాగా నితీశ్ ఇప్పటికే టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేశాడు. గతేడాది ఆక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నితీశ్ రెడ్డి డెబ్యూ చేశాడు.బంగ్లాతో సిరీస్‌లో కూడా అతడు అద్బుతంగా రాణించాడు. అయితే టీ20, టెస్టుల్లో భారత్ తరపున అరంగేట్రం చేసిన ఈ వైజాగ్ కుర్రాడు.. ఇప్పుడు వన్డేల్లో కూడా డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు 21 ఏళ్ల నితీశ్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.అతడు అక్కడ తన సత్తాచాటితే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా పరిగణలోకి తీసుకునే అవకాశముంది. ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 22న ఈడెన్ గార్డెన్స్‌తో జరగనున్న తొలి టీ20తో ఇంగ్లండ్ భారత పర్యటన ప్రారంభం కానుంది. ఐదు టీ20 అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ కూడా ప్రారంభం కానుంది.చదవండి: 'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్ India allrounder Nitish Kumar Reddy received a grand welcome at the Vizag airport upon his homecoming after a successful tour of Australia, where he scored a maiden Test 💯 at the MCG ##BGT2025 pic.twitter.com/jt0AqTDTXK— Gaurav Gupta (@toi_gauravG) January 9, 2025 -
'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఘోర వైఫల్యం తర్వాత భారత జట్టు ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం కాస్త ఘాటుగా స్పందించాడు. భారత జట్టులో "సూపర్ స్టార్ సంస్కృతిని వీడాలని, కేవలం ప్రదర్శన ఆధారంగా మాత్రమే భవిష్యత్తు సిరీస్‌లకు ఎంపిక చేయాలని బీసీసీఐకి భజ్జీ సూచించాడు.ఈ క్రమంలో హర్భజన్ సింగ్ తాజాగా మరో క్రిప్టిక్ స్టోరీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘మార్కెట్లో ఏనుగు నడిచి వెళ్తుంటే డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది. దీంతో ఈ మాజీ క్రికెటర్ ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టాడా అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.బీజీటీ ఓటమి తర్వాత భజ్జీ ఏమన్నాడంటే?"ప్రస్తుతం భారత క్రికెట్లో సూపర్ స్టార్ సంస్కృతి బాగా పెరిగింది. జట్టుకు పేరు ప్రఖ్యాతుల ఉన్న వాళ్లు కాదు, బాగా ప్రదర్శన చేసేవారు కావాలి. సూపర్ స్టార్లు కంటే బాగా ఆడేవారు ఉంటేనే జట్టు విజయ పథంలో ముందుకు వెళ్తుంది. సూపర్ స్టార్ కావాలనుకునే వారు ఇంట్లోనే ఉండి క్రికెట్ ఆడాలి.మరో ఆరు నెలలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇప్పటి నుంచే ఇంగ్లండ్ టూర్‌కు ఎవరు వెళ్తారు? ఎవరికి చోటు దక్కదు? అన్న చర్చ మొదలైంది. ఇది సాధారణంగా ఎప్పుడూ జరిగేదే. నావరకు అయితే బాగా ఆడే వారే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలి. అప్పట్లోనే కపిల్‌దేవ్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాళ్లనే జట్టు నుంచి తప్పుకోవాలని సెలక్టర్లు సూచించారు.కాబట్టి ఇప్పుడు కూడా బీసీసీఐ, సెలక్టర్లు అదే పనిచేయాలి. ముఖ్యంగా సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. భారత్ సూపర్‌స్టార్ సంస్కృతిని వదిలిపెట్టాలి. ఆటగాళ్లను వారి ప్రదర్శన బట్టి ఎంపిక చేయాలి"భజ్జీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.విరాట్ కోహ్లి, రోహిత శర్మ వంటి స్టార్ ప్లేయర్లను ఉద్దేశించే హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు తెగ చర్చించుకున్నారు. అంతలోనే తాజా పోస్ట్‌తో భజ్జీ మరోసారి వార్తలోకెక్కాడు. కాగా బోర్డర్ ట్రోఫీని 3-1 తేడాతో టీమిండియా కోల్పోయింది. బీజీటీని భారత్ చేజార్చుకోవడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దారుణ ప్రదర్శన కనబరిచారు.కోహ్లి ఓ సెంచరీ చేసినప్పటికి, రోహిత్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అటు కెప్టెన్సీ, ఇటు వ్యక్తిగత ప్రదర్శన పరంగా తీవ్ర నిరాశపరిచాడు. దీంతో ఈ సీనియర్ ద్వయం టెస్టు క్రికెట్‌కు విడ్కోలు పలకాలని చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.అయితే భారత్ తదుపరి టెస్టు పర్యటనకు మరో ఆరు నెలలు ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. కోహ్లి, రోహిత్ టెస్టుల్లో కొనసాగుతారా లేదా అన్నది తెలియాలంటే మరో 6 నెలలు ఆగక తప్పదు.చదవండి: SA T20: జూనియర్ ఏబీడీ విధ్వంసం.. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చిత్తు -
BGT 2024-25: సిడ్నీ పిచ్‌పై ఆస్ట్రేలియన్ల మౌనమేల..?
భారత్‌లో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆడలేక గగ్గోలు పెట్టే ఆస్ట్రేలియన్లు.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్‌లో పేస్ బౌలింగ్ కి అనుకూలించిన పిచ్ పై మాత్రం మౌనం వహించారు. గత ఆదివారం ముగిసిన ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పరాజయంపాలవ్వడంతో 1-3 తేడాతో ఆసీస్‌కు సిరీస్‌ను కోల్పోయింది.ఈ నేపథ్యంలో ఓ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గళమెత్తడం అభినందనీయం. ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్ టిమ్ పెయిన్ సిడ్నీ పిచ్ ని దుమ్మెత్తి పోయడం విశేషం."ఈ టెస్ట్ రెండున్నర రోజుల్లోనే ముగిసింది. ఏ జట్టూ 200 పరుగుల మార్కును చేరుకోలేదు. ఈ మ్యాచ్ కి ఉపయోగించిన పిచ్ ఉపరితలం బాగానే ఉంది. కానీ పగుళ్లు రావడంతో అస్థిరమైన బౌన్స్ తో బ్యాట్స్‌మన్ ఇబ్బంది పడ్డారు.ఈ పిచ్‌పై బ్యాట్స్మన్లు వ్యక్తిగత నైపుణ్యం కంటే అదృష్టంపై ఎక్కువగా ఆధారపడినట్లు స్పష్టమైంది. ఈ పిచ్ కి అంతర్జాతీయ క్రికెట్ అధికారులు సంతృప్తికరమైన రేటింగ్ ఇచ్చినప్పటికీ, నేను మాత్రం దానికి సాధ్యమైనంత తక్కువ రేటింగ్ ఇస్తాను. వాళ్ళు మళ్ళీ ఇలాంటి పిచ్ ని రూపొందించినట్టయితే చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించేవాడ్ని.ఇలాంటి హెచ్చరిక వల్ల సిడ్నీ అధికారులు భవిష్యత్తులో ఇలాంటి పిచ్ ని తయారు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. దీనివల్ల వాళ్ళు అలాంటి పిచ్ ని రూపొందించినట్టయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని కనీసం భయపడతారు" అని పెయిన్ తన కాలమ్‌లో రాశాడు."గతంలో ఐసిసి సిడ్నీ పిచ్ కు ‘సంతృప్తికరంగా’ రేటింగ్ ఇచ్చింది. ఇది రెండో అత్యధిక రేటింగ్ . సిడ్నీ పిచ్ అరిగిపోయి స్పిన్ బౌలింగ్ కి అనుకూలంగా మారే ముందు కొద్దిగా బౌన్స్ అవుతుంది. అయితే ఈ పిచ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకు ఉత్తేజకరమైన ముగింపును అందించింది. ఇది వచ్చే సీజన్ లో జరిగే యాషెస్ సిరీస్ కి శుభసూచకమని," క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ ఆపరేషన్స్ అండ్ షెడ్యూలింగ్ హెడ్ పీటర్ రోచ్ అన్నారు.స్వదేశం లో సిరీస్ లు జరిగినప్పుడు ఆతిధ్య జట్లు పిచ్ లు తమ బౌలర్లకు అనుకూలంగా రూపాందించుకోవడం ఆనవాయితీ. అయితే విదేశీ పర్యటనలకు వచినప్పుడు మాత్రం వాళ్ళ ఆటగాళ్లు విఫలమైనప్పుడు ఆతిధ్య జట్టు పై దుమ్మెత్తి పోయడం మాత్రం సరికాదు. ఇది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లు గుర్తుంచుకోవాలి! -
‘కొన్‌స్టాస్ పది టెస్టులు కూడా ఆడలేడు.. అతడి బలహీనత అదే!’
ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) భవిష్యత్తుపై ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిన్సన్(Steve Harminson) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టీనేజర్ పట్టుమని పది టెస్టులు కూడా ఆడలేడని పేర్కొన్నాడు. కాగా డేవిడ్ వార్నర్(David Warner) రిటైర్మెంట్ తర్వాత ఆసీస్ ఓపెనింగ్ స్థానంలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసే క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా తొలుత నాథన్ మెక్‌స్వీనీ వైపు మొగ్గుచూపింది.మెక్‌స్వీనీపై వేటు.. టీనేజర్‌కు పిలుపుటీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అతడిని జట్టుకు ఎంపిక చేసింది. అయితే, ఓపెనర్‌గా 25 ఏళ్ల మెక్‌స్వీనీ పూర్తిగా విఫలమయ్యాడు. పెర్త్ టెస్టులో అరంగేట్రం చేసిన అతడు రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 10, 0 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో(39, 10 నాటౌట్)నూ పెద్దగా రాణించలేకపోయాడు. మూడో టెస్టులో(9, 4)నూ పూర్తిగా విఫలమయ్యాడు.అరంగేట్రంలోనే అర్ధ శతకంఈ క్రమంలో మెక్‌స్వీనీపై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. 19 ఏళ్ల కుర్రాడైన సామ్ కొన్‌స్టాస్‌ను భారత్‌తో మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేసింది. మెల్బోర్న్ టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కొన్‌స్టాస్.. అరంగేట్రంలోనే అర్ధ శతకం(60)తో దుమ్ములేపాడు. సిడ్నీలోనూ రాణించిన ఈ కుడిచేతివాటం బ్యాటర్.. మొత్తంగా రెండు టెస్టుల్లో కలిపి 113 పరుగులు సాధించాడు.కోహ్లి, బుమ్రాలతో గొడవఇక బ్యాట్ ఝులిపించడమే కాకుండా.. టీమిండియా సూపర్స్టార్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలతో గొడవ ద్వారా కూడా కొన్‌స్టాస్ మరింత ఫేమస్ అయ్యాడు. తదుపరి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న పదహారు మంది సభ్యుల ఆసీస్ జట్టులోనూ అతడు స్థానం సంపాదించాడు.డిఫెన్సివ్ టెక్నిక్ లేదుఈ నేపథ్యంలో స్టీవ్ హార్మిన్సన్ మాట్లాడుతూ.. ‘‘నాకైతే కొన్‌స్టాస్ కనీసం పది టెస్టులు కూడా ఆడలేడని అనిపిస్తోంది. అలా అని అతడి భవిష్యత్తుపై నేనిప్పుడే తీర్పునిచ్చేయడం లేదు. కానీ.. ఈ పిల్లాడు గనుక ఒక్కసారి లయ అందుకుంటే సూపర్‌స్టార్ స్థాయికి ఎదగగలడు. ఇండియాతో సిరీస్‌లో అతడు ర్యాంప్ షాట్లు, స్కూప్ షాట్లు ఆడాడు.కానీ.. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో తలపడుతున్నపుడు వికెట్ కాపాడుకోవాల్సిన అంశంపై మాత్రం దృష్టి పెట్టలేదు. టెస్టుల్లో ఓపెనర్‌గా రాణించాలంటే డిఫెన్సివ్ టెక్నిక్ ముఖ్యమైనది. అయితే, కొన్‌స్టాస్ ఈ విషయంలో బలహీనంగా ఉన్నాడు.మరో డేవిడ్ వార్నర్ కావాలని కొన్‌స్టాస్ భావిస్తున్నట్లున్నాడు. అయితే, ఈ టీనేజర్‌కు వార్నర్‌కు ఉన్న టెక్నిక్‌లు లేవు. ఏదేమైనా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో కొన్‌స్టాస్ ఆడితే నాకూ సంతోషమే’’ అని పేర్కొన్నాడు. కాగా కొన్‌స్టాస్‌పై హార్మిన్సన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.ఆస్ట్రేలియాదే బోర్డర్- గావస్కర్ ట్రోఫీప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా సొంతగడ్డపై టీమిండియాను 3-1తో ఓడించింది. తద్వారా దశాబ్ద కాలం తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతేకాదు.. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు కూడా అర్హత సాధించింది.డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా మ్యాచ్ బరిలో దిగనున్న కమిన్స్ బృందం.. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇక డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో ఆఖరిగా శ్రీలంకతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: IND vs ENG: విరాట్ కోహ్లి కీలక నిర్ణయం -
టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో ఈ రైటార్మ్ బౌలర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడని కొనియాడాడు. కెప్టెన్‌గానూ బుమ్రా జట్టును ముందుకు నడిపించిన తీరు తనను ఆకట్టుకుందన్నాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా పరిణతి గల నాయకుడిగా మెప్పించాడని పేర్కొన్నాడు.ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణించికాగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పితృత్వ సెలవుల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో వైస్ కెప్టెన్ బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణించి పెర్త్‌లో టీమిండియాకు 295 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం అందించాడు.వెన్నునొప్పి వేధిస్తున్నాఆ తర్వాత మరో మూడు టెస్టులకు సారథిగా వ్యవహరించిన రోహిత్ శర్మ.. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా వైఫల్యం చెందినందున ఆఖరి టెస్టు నుంచి తప్పుకొన్నాడు. జట్టు ప్రయోజనాల కోసం విశ్రాంతి పేరిట తానే స్వయంగా దూరంగా ఉన్నాడు. ఫలితంగా మరోసారి పగ్గాలు బుమ్రా చేతికి వచ్చాయి. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో జట్టును గెలిపించేందుకు అతడు గట్టిగానే శ్రమించాడు.పేస్ దళ భారాన్ని మొత్తం తానే మోశాడు. ఈ క్రమంలో వెన్నునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి వచ్చి మరీ బరిలోకి దిగాడు. అయినప్పటికీ సిడ్నీలో ఓటమిపాలైన టీమిండియా 1-3తో ఓటమిపాలై.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని ఆసీస్‌కు చేజార్చుకుంది. అయితే, జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా బుమ్రాకు మాత్రం ఈ టూర్లో మంచి మార్కులే పడ్డాయి. ఐదు టెస్టుల్లో కలిపి మొత్తం 32 వికెట్లు పడగొట్టిన ఈ రైటార్మ్ పేసర్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.నాయకుడిగా మంచి పేరుఈ పరిణామాల నేపథ్యంలో సునిల్ గావస్కర్ బుమ్రాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!.. నా అభిప్రాయం ప్రకారం కచ్చితంగా అతడే పగ్గాలు చేపడతాడు. జట్టును ముందుండి నడిపించడంలో బుమ్రా తనకంటూ ప్రత్యేకశైలిని ఏర్పరచుకున్నాడు.నాయకుడిగా అతడికి మంచి పేరు వచ్చింది. సారథిగా ఉన్నా సహచర ఆటగాళ్లపై ఒత్తిడి పెంచేరకం కాదు. కొన్నిసార్లు కెప్టెన్లు తామే ఒత్తిడిలో కూరుకుపోయి.. పక్కవాళ్లనూ అందులోకి నెట్టేస్తారు. కానీ బుమ్రా ఏ దశలోనూ అలా చేయలేదు. తనపని తాను చేసుకుంటూనే.. జట్టులో ఎవరి విధి ఏమిటో అర్థమయ్యేలా చక్కగా తెలియజెప్పాడు.నిజంగా అతడొక అద్భుతంఈ క్రమంలో ఎవరిపైనా అతడు ఒత్తిడి పెట్టలేదు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లను డీల్ చేసిన విధానం బాగుంది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తూనే.. సహచరులకు అన్ని వేళలా మార్గదర్శనం చేశాడు. నిజంగా అతడొక అద్భుతం. అందుకే టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే అని నేను బలంగా నమ్ముతున్నాను’’ అని గావస్కర్ 7క్రికెట్‌తో పేర్కొన్నాడు.కాగా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, గాయం కారణంగా బుమ్రా ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.చదవండి: ‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’ -
అన్ని ఫార్మాట్లలో బుమ్రానే బెస్ట్ బౌలర్: ఆసీస్ మాజీ కెప్టెన్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా కోల్పోయినప్పటికి.. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన అద్బుత ప్రదర్శనతో ప్రత్యర్ధిలను సైతం ఆకట్టుకున్నాడు. పెర్త్ నుంచి సిడ్నీ వరకు మొత్తం 5 టెస్టుల్లోనూ బుమ్రా సత్తాచాటాడు. ఈ సిరీస్‌లో చాలా సందర్భాల్లో బుమ్రా తన పేస్ బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు.బుమ్రా మొత్తం 5 టెస్టుల్లో 13.06 సగటుతో 32 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. బుమ్రా మరో రెండు వికెట్లు సాధించి ఉంటే, ఆస్ట్రేలియాలో ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పర్యాటక బౌలర్‌గా రికార్డులెక్కెవాడు.ప్రస్తుతం ఈ రికార్డు ఇంగ్లండ్ బౌలింగ్ దిగ్గజం సిడ్నీ బర్న్స్ పేరిట ఉంది. బర్న్స్ 1911-12 సిరీస్‌లో ఏకంగా 34 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆల్ ఫార్మాట్లలో బుమ్రాను మించిన బౌలర్ లేడని క్లార్క్ కొనియాడాడు."బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తర్వాత బుమ్రా ప్రదర్శన గురించి నేను ఆలోచించాను. నా వరకు అయితే అన్ని ఫార్మాట్లలో బుమ్రానే అత్యుత్తమ బౌలర్. చాలా మంది గొప్ప ఫాస్ట్ బౌలర్లు నాకు తెలుసు. కర్ట్లీ ఆంబ్రోస్, గ్లెన్ మెక్‌గ్రాత్ దిగ్గజ బౌలర్లు ఉన్నా, వారు టీ20 క్రికెట్ ఆడలేదు.కాబట్టి బుమ్రాను ఆల్‌ఫార్మాట్ బెస్ట్ బౌలర్‌గా ఎంచుకున్నాను. ఆడే ఫార్మాట్, కండీషన్స్‌తో సంబంధం లేకుండా బుమ్రా అద్బుతంగా రాణించగలడు. అదే అతడి అత్యుత్తమ బౌలర్‌గా మార్చింది. సిడ్నీ టెస్టులో భారత్ మరో 20 పరుగులు ఎక్కువగా చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది.బుమ్రా జట్టులో ఉంటే సిడ్నీ టెస్టు భారత్ గెలుస్తుందని నేను అనుకున్నాను. జట్టులోని ఇతర బౌలర్ల కంటే బుమ్రా చాలా బెటర్‌గా ఉన్నాడు" అని క్లార్క్ ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. అతడు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. బుమ్రా తిరిగి మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం? -
బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి డౌటే.. కానీ: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు సందర్భంగా అతడి గాయం తిరగబెట్టింది. వెంటనే బుమ్రాను ఆట మధ్యలోనే స్కానింగ్‌కు తరలించారు.ఈ క్రమంలో అతడు రెండు ఇన్నింగ్స్ మొత్తానికి దూరమయ్యాడు. కీలకమైన మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే ఛాంపియన్స్ ట్రోపీ 2025కు ముందు బుమ్రా గాయం భారత సెలక్టర్లను తెగ ఆందోళన కలిగిస్తోంది. అస్సలు ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడుతాడా? లేదా అని అభిమానులు సైతం టెన్షన్ పడుతున్నారు. కాగా బుమ్రా గాయంపై ఇంకా స్పష్టత రాలేదు.అతడి గాయం తీవ్రత ఏ స్ధాయిలో ఉందో కూడా తెలియదు. ఒకవేళ అతడి గాయం గ్రేడ్ 1 కేటగిరీలో ఉంటే, ఈ స్టార్ పేసర్ దాదాపు 5 నుంచి ఆరు వారాల పాటు ఆటకు దూరం ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అతడు ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లను కోల్పోవలసి ఉంటుంది.అయితే బీసీసీఐ మాత్రం బమ్రా గాయంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను జనవరి 12 నాటికి ఐసీసీకి సమర్పించాలి. దీంతో బుమ్రా గాయంపై ఒకట్రెండు రోజుల్లో అప్డేట్ వచ్చే అవకాశముంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడేది అనుమానమే అని అలీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బుమ్రా గాయంపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఆడే అవకాశాలు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నాయని తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.కాగా జస్ప్రీత్ భారత జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ బుమ్రా అదరగొట్టాడు. మొత్తం 5 మ్యాచ్‌లో 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా జస్ప్రీత్ నిలిచాడు. ఈ సిరీస్‌లో మొత్తం 150 ఓవర్లకు పైగా బౌలింగ్ చేయడం విశేషం.టాప్‌లోనే బుమ్రా..ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పటికే 907 రేటింగ్ పాయింట్లతో భారత్ నుంచి అత్యుత్తమ రేటింగ్ సాధించిన బౌలర్‌గా నిలిచిన బుమ్రా... ఇప్పుడు మరో పాయింట్ సాధించి 908 పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలిచాడు.ఈ జాబితాలో కమిన్స్ (841) రెండో స్థానంలో కొనసాగుతుండగా... భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఒక స్థానం మెరుగుపర్చుకొని 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్ తన 4వ స్థానాన్ని నిలబెట్టుకోగా... సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు అర్ధసెంచరీ సాధించిన రిషభ్ పంత్ మూడు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో జడేజా నంబర్‌వన్‌గానే కొనసాగుతున్నాడు.చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్.. -
'రోహిత్ నిర్ణయం సరైనది కాదు.. ఇక వీడ్కోలు పలికితే బెటర్'
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. అటు కెప్టెన్సీ, ఇటు బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ పూర్తిగా తేలిపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.ఈ సిరీస్‌లో అతడు సారథ్యం వహించిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ రెండింట ఓటమి.. ఓ మ్యాచ్‌ను డ్రా ముగించింది. తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్‌మ్యాన్.. ఆఖరి టెస్టుకు పేలవ ఫామ్ కారణంగా తనంతట తనే తప్పుకున్నాడు.అయితే ఐదో టెస్టు నుంచి వైదొలగాలని రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ తప్పుబట్టాడు. డూ ఆర్‌డై మ్యాచ్‌లో రోహిత్ జట్టును ముందుండి నడిపించి ఉంటే బాగుండేదని కైఫ్ అభిప్రాయపడ్డాడు."సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ ఆడి ఉండాల్సింది. అతడు జైశ్వాల్‌తో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పి సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించి ఉంటే బాగుండేది. రోహిత్ శర్మ రెగ్యూలర్ కెప్టెన్. పరుగులు సాధించికపోయినా జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతడిపై ఉంది.ఈ సిరీస్‌లో రోహిత్ ఒక్కడే కాదు, స్టార్ ప్లేయర్లు ఎవరూ ఫామ్‌లో లేరు. కోహ్లి, ఖవాజా వంటి ప్లేయర్లు కూడా తమ స్ధాయికి తగ్గట్టు రాణించలేకపోయారు. అయినప్పటికి వారు జట్టులో కొనసాగారు. లబుషేన్, స్మిత్‌లు కూడా కాస్త ఆలస్యంగా తమ ఫామ్‌ను తిరిగి పొందారు.ఈ సిరీస్‌లో ప్రతీ ఒక్క బ్యాటర్ కష్టపడ్డారు. కేఎల్ రాహుల్ ఆరంభంలో రాణించినప్పటికి, తర్వాత మాత్రం విఫలమయ్యాడు. కాబట్టి ఒక నాయకుడిగా రోహిత్ శర్మ జట్టు నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయం కాదు. ఏదైనా జట్టులో ఉండి సాధించాలి.కీలకమైన మ్యాచ్‌లోనే ఆడనప్పుడు, అతడు ఇక టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటే బెటర్. ఐదో టెస్టులో రోహిత్ లేని లోటు కన్పించింది. బుమ్రా గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. ఆ సమయంలో రోహిత్ ఉండి ఉంటే బాగుండేదని ప్రతీ ఒక్కరికి అన్పించింది" అని తన యూట్యూబ్ ఛానల్లో కైఫ్ పేర్కొన్నాడు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. చదవండి: IND vs AUS: సిడ్నీ పిచ్‌పై ఐసీసీ రేటింగ్.. -
IND vs AUS: సిడ్నీ పిచ్‌పై ఐసీసీ రేటింగ్..
భారత్, ఆ్రస్టేలియా మధ్య ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’(Border Gavaskar Trophy)లో భాగంగా చివరి టెస్టు జరిగిన సిడ్నీ పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సానుకూల నివేదిక ఇచ్చింది. ఈ పిచ్‌ను ‘సంతృప్తికరం’ అనే రేటింగ్‌ను ఇచ్చింది. సీమ్ బౌలింగ్‌కు విపరీతంగా స్పందించడంతో పాటు అనూహ్య బౌన్స్‌తో కనిపించిన ఈ పిచ్‌పై పేస్ బౌలర్లు చెలరేగారు. గ్రౌండ్స్‌మన్ ఈ టెస్టు కోసం కొత్త తరహా పచ్చికను ఉపయోగించారు. ఫలితంగా సిడ్నీలో తక్కువ సమయంలో ముగిసిన టెస్టుల జాబితాలో (బంతుల పరంగా) ఈ మ్యాచ్ మూడో స్థానంలో నిలిచింది. మ్యాచ్‌లో రెండు అర్ధసెంచరీలు మాత్రమే నమోదయ్యాయి.ఐసీసీ ఇచ్చిన నివేదిక వల్ల మున్ముందు ఇలాంటి ‘సంతృప్తికర’ పిచ్‌లను రూపొందించేందుకు తాము సిద్ధమవుతామని ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు (సీఏ) స్పందించింది. మరో వైపు తొలి నాలుగు టెస్టులు జరిగిన పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ మైదానాలు ‘చాలా బాగున్నాయి’ అనే రేటింగ్‌తో ఐసీసీ కితాబునిచ్చింది.సిడ్నీలో ఘోర ఓటమి.. కాగా ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. ఈ సిరీస్‌తో పాటు భారత్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు కూడా గల్లంతయ్యాయి.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ తర్వాతి మ్యాచ్‌ల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా ఈ సిరీస్‌లో భారత్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది.ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లి సైతం ఈసారి సత్తాచాటలేకపోయాడు. ఇక సిరీస్ ఓటమి అనంతరం భారత జట్టు గురువారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. అనంతరం జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌లకు టీమిండియా సిద్దం కానుంది.చదవండి: ‘అమెరికన్ల ఆటగా మార్చడమే లక్ష్యం’ -
BCCI: గంభీర్‌పై వేటు?.. రోహిత్, కోహ్లిలు మాత్రం అప్పటిదాకా..!
దశాబ్ద కాలం తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా ముందు తలవంచింది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని కంగారూ జట్టుకు సమర్పించుకుంది. ఆసీస్ గడ్డపై 3-1 తేడాతో సిరీస్ ఓడిపోయి ఈ అపఖ్యాతిని మూటగట్టుకుంది. అంతేకాదు.. వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాన్నీ చేజార్చుకుంది.భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్(Gautam Gambhir) హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియాకు ఎదురైన మూడో ఘోర పరాభవం ఇది. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలగగా.. గంభీర్ ఆ బాధ్యతలను స్వీకరించాడు. గతేడాది శ్రీలంక పర్యటన సందర్భంగా కోచ్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టాడు.మాయని మచ్చలుగతంలో ఏ స్థాయిలోనూ కోచ్‌గా పనిచేయని గంభీర్‌కు శిక్షకుడిగా తొలి ప్రయత్నం(టీ20 సిరీస్)లో విజయం వరించినా.. వన్డే సిరీస్‌లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక చేతిలో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత వన్డే సిరీస్‌లో భారత్ ఓడిపోయింది. అనంతరం సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో మునుపెన్నడూ లేని పరాభవం చవిచూసింది. స్వదేశంలో ప్రత్యర్థితో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టుగా గంభీర్ మార్గదర్శనంలోని రోహిత్ సేన నిలిచింది.అనంతరం.. ఆస్ట్రేలియాలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశాజనక ఫలితమే వచ్చింది. తద్వారా కోచ్‌గా గంభీర్ కెరీర్లో ఆరంభంలోనే ఈ మూడు మాయని మచ్చలుగా నిలిచిపోయాయి. ఆటగాళ్ల వైఫల్యం.. ముఖ్యంగా బ్యాటర్ల చెత్త ప్రదర్శన కారణంగానే ఈ మూడు సిరీస్‌లలో టీమిండియా ఓటమిపాలైనా.. కోచ్‌గా గౌతీ కూడా విమర్శలు ఎదుర్కోకతప్పదు.గంభీర్‌పై వేటు వేయాలంటూ డిమాండ్లు!ఈ నేపథ్యంలో ఇప్పటికే గంభీర్ కోచ్ పదవికి సరిపోడని.. జట్టును సరైన దిశలో నడిపించే సామర్థ్యం అతడికి లేదంటూ టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. రవిశాస్త్రి, ద్రవిడ్ హయాంలో భారత జట్టు సాధించిన విజయాలను గుర్తుచేస్తూ.. గంభీర్‌ను వెంటనే తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.రోహిత్- కోహ్లిల సంగతేంటి?ఇక గౌతం గంభీర్ సంగతి ఇలా ఉంటే.. సీనియర్ ఆటగాళ్లు, దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితి కూడా ఇంతకంటే మెరుగ్గా ఏమీలేదు. తొలుత కివీస్‌తో టెస్టుల్లో.. అనంతరం ఆసీస్ గడ్డపై ఈ ఇద్దరూ విఫలం కావడం వల్లే ఇంతటి చేదు అనుభవాలు ఎదురయ్యాయనడంలో సందేహం లేదు. తమ ఆట తీరుతో యువకులకు మార్గదర్శకులుగా ఉండాల్సిన విరాహిత్ ద్వయం.. నిర్లక్ష్యపు షాట్లతో వికెట్ పారేసుకున్న తీరు అభిమానులకు సైతం కోపం తెప్పించింది.ఈ నేపథ్యంలో గంభీర్‌తో పాటు.. రోహిత్, కోహ్లిలపై కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కఠిన చర్యలకు సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర అవమానం నేపథ్యంలో టెస్టుల్లో రోహిత్, కోహ్లి భవిష్యత్తుపై మేనేజ్మెంట్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు.. గంభీర్‌తో పాటు అతడి సహాయ సిబ్బంది అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డష్కటేలకు కూడా ఇప్పటికే గట్టిగానే చివాట్లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయాల గురించి బీసీసీఐ వర్గాలు స్పందన మాత్రం భిన్నంగా ఉంది. IANSతో మాట్లాడుతూ.. ‘‘అవును.. రివ్యూ మీటింగ్ కచ్చితంగా ఉంటుంది.గంభీర్ కోచ్‌గా కొనసాగుతాడు.. ఇక రోహిత్, కోహ్లిఅయినా.. ఒక సిరీస్‌లో బ్యాటర్లు వైఫల్యం చెందిన కారణంగా కోచ్‌పై వేటు వేస్తారా?.. అలా జరగనే జరుగదు. గౌతం గంభీరే ఇక ముందు కూడా కోచ్‌గా కొనసాగుతాడు. అదే విధంగా విరాట్, రోహిత్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆడతారు. ప్రస్తుతం టీమిండియా దృష్టి చాంపియన్స్ ట్రోఫీపైనే కేంద్రీకృతమై ఉంది’’ అని పేర్కొన్నాయి.కాగా టీమిండియా జనవరి 22 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ మొదలుపెట్టనుంది. తొలుత ఇరుజట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్.. అనంతరం మూడు వన్డేలు జరుగనున్నాయి. ఆ తర్వాత భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది. ఫిబ్రవరి 19- మార్చి 9 వరకు ఈ ఐసీసీ టోర్నీ జరుగనుంది.ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇక దాయాది పాకిస్తాన్‌ను ఫిబ్రవరి 23న ఢీకొట్టనుంది. అయితే, చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.చదవండి: బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్.. కోహ్లి చాలా మంచోడు.. అతడితో ఎందుకు గొడవపడ్డానంటే.. -
అశ్విన్ రిటైర్మెంట్కు కారణమిదే?.. ఆసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 మధ్యలోనే టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అతడి నిర్ణయం యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిన వెంటనే అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.ఈ సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ అడిలైడ్ వేదికగా జరిగిన పింక్-బాల్ టెస్టులో మాత్రమే భాగమయ్యాడు. ఆ మ్యాచ్‌లో 29 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచ్(మూడో టెస్టు)కు తుది జట్టు నుంచి అతడిని టీమ్‌మెనెజ్‌మెంట్ తప్పించింది.ఆ మ్యాచ్ తర్వాతే అశ్విన్ ఇంటర్ననేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తాజాగా అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బీజీటీ సిరీస్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటుదక్కకపోవడంతోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు."టీమిండియా సరైన గేమ్ ప్లాన్‌తో ఆస్ట్రేలియా పర్యటనకు రాలేదు. వారు తమ మొదటి మూడు టెస్టుల్లో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లకు అవకాశమిచ్చారు. సరైనా గేమ్ ప్లాన్ లేదని అప్పుడే ఆర్ధమైంది. అయితే అశ్విన్ సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. తొలి టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కపోవడంతో అతడు నిరాశచెందినట్లు ఉన్నాడు. బహుశా అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించాలని డిసైడ్ అయినట్లు అన్పిస్తోంది. వరల్డ్ క్రికెట్లో అశ్విన్ నంబర్ 1 స్పిన్నర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అతడి రికార్డు అత్యద్భుతంగా ఉంది. అశ్విన్ లాంటి ఆటగాళ్లు ఎవరూ కూడా బెంచ్‌కే పరిమితం కావాలనుకోరు. కచ్చితంగా అతడు నిరాశకు లోనై ఉంటాడు. అందుకే సిరీస్ మధ్యలోనే తన కెరీర్‌ను ముగించాడని" హాడిన్ విల్లో టాక్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా అశ్విన్ రిటైర్మెంట్పై అతడి తండ్రి రవిచంద్రన్ సైతం ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. తన కొడుకు చాలాకాలంగా అవమానాలకు గురవుతున్నాడని, అందుకే ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.టెస్టు క్రికెట్లో అశ్విన్ మార్క్..అశ్విన్ తన అంతర్జాతీయ కెరీర్లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 537, 156, 72 వికెట్లు తీశాడు. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 3503 పరుగులు కూడా సాధించాడు. ఇందులో ఆరు శతకాలు. 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం. అశ్విన్ కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడనున్నాడు.చదవండి: బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్.. కోహ్లి చాలా మంచోడు.. అతడితో ఎందుకు గొడవపడ్డానంటే.. -
బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్.. కోహ్లి చాలా మంచోడు
అరంగేట్రంలోనే అద్భుత అర్ధ శతకంతో దుమ్ములేపాడు ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్(Sam Konstas). బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో మెల్బోర్న్ టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఈ టీనేజర్. వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగి.. తొలి మ్యాచ్‌లో 60 పరుగులతో సత్తా చాటాడు.అనంతరం.. సిడ్నీ టెస్టులోనూ సామ్ కొన్‌స్టాస్ మెరుగ్గా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 45 పరుగులు చేశాడు. అయితే, భారత్‌తో ఆఖరిదైన ఈ టెస్టు మ్యాచ్‌లో కొన్‌స్టాస్.. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తో వాగ్వాదానికి దిగాడు. సిడ్నీలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి రోజు ఆటలో భాగంగా 185 పరుగులకు ఆలౌట్ అయింది.బుమ్రాతో గొడవ పడిన కొన్స్టాస్అదే రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలుపెట్టగా.. బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో.. ఆఖరి బంతి వేసే సమయానికి ఖవాజా తనకు కాస్త సమయం కావాలని అడగ్గా.. బుమ్రా విసుక్కున్నాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కొన్‌స్టాస్ బుమ్రాతో గొడవకు సిద్ధమయ్యాడు. ఇందుకు బుమ్రా కూడా గట్టిగానే బదులివ్వగా.. అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పాడు.టైమ్ వేస్ట్ చేయాలని చూశానుఅయితే, ఆఖరి బాల్‌కు ఖవాజా వికెట్ పడగొట్టిన బుమ్రా... కొన్‌స్టాస్ వైపు చూస్తూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లంతా కూడా కొన్‌స్టాస్‌ను ఇక వెళ్లు అన్నట్లుగా సైగ చేస్తూ చుట్టుముట్టారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన కొన్‌స్టాస్.. ‘‘నాకు ప్రత్యర్థులతో పోటీ పడటం అంటే ఇష్టం.అయితే, టీమిండియాతో సిరీస్ నాకెన్నో విషయాలు నేర్పించింది. నిజానికి ఆరోజు నేను బుమ్రా సమయం వృథా చేయాలని ప్రయత్నించాను. టీమిండియాకు మరో ఓవర్ వేసే అవకాశం ఇవ్వకూడదని భావించాను. కానీ.. ఆఖరికి అతడే పైచేయి సాధించాడు.బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్ఏదేమైనా అతడొక ప్రపంచ స్థాయి బౌలర్. ఈ సిరీస్‌లో ఏకంగా 32 వికెట్లు తీశాడు’’ అని బుమ్రా నైపుణ్యాలను కొనియాడాడు. అదే విధంగా.. మెల్బోర్న్ టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లి(Virat Kohli)తో గొడవ గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘మ్యాచ్ పూర్తైన తర్వాత నేను కోహ్లితో మాట్లాడాను. నాకు అతడే ఆదర్శం అని చెప్పాను.నా ఆరాధ్య క్రికెటర్‌కు ప్రత్యర్థిగా బరిలో దిగడం నిజంగా నాకు దక్కిన గౌరవం. అతడు చాలా నిరాడంబరంగా ఉంటాడు. మంచి వ్యక్తి. అతడు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. శ్రీలంక పర్యటనకు గనుక ఎంపికైతే బాగా ఆడాలని నన్ను విష్ చేశాడు’’ అని 19 ఏళ్ల సామ్ కొన్‌స్టాస్ చెప్పుకొచ్చాడు. కాగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. జూనియర్ రిక్కీ పాంటింగ్‌గా పేరొందాడు.ఫైనల్‌కు ఆసీస్.. టీమిండియా ఇంటికిఇదిలా ఉంటే.. ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-3తో చేజార్చుకుంది. తద్వారా పదేళ్ల తర్వాత తొలిసారి కంగారూ జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతేకాదు.. టీమిండియాను వెనక్కినెట్టి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది. ఇక టీమిండియా తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లిష్ జట్టుతో తలపడనుంది. -
'అదొక చెత్త నిర్ణయం'.. ఐసీసీపై విండీస్ గ్రేట్ ఫైర్
టెస్టు క్రికెట్‌కు ఆదరణను మరింత పెంచే దిశగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అడుగులు వేస్తోంది. సంప్రదాయ ఫార్మాట్‌ను రెండు శ్రేణుల్లో( 2- Tier Test cricket) నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.ఈ క్రమంలోనే అగ్ర శ్రేణి జట్లైనా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మరిన్ని ఎక్కువ సిరీస్‌లను నిర్హహించాలని ఐసీసీ యోచిస్తోంది. ఇదే విషయంపై ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐ ప్రతినిధులు, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు, ఈసీబీ చీఫ్ ఈ నెలాఖరులో సమావేశం కానున్నారని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.విండీస్ గ్రేట్ ఫైర్..కాగా టెస్టుల్లో ఈ రెండంచెల విధానం ప్రతిపాదనపై వెస్టిండీస్ గ్రేట్ క్లైవ్ లాయిడ్ మండిపడ్డాడు. "ఐసీసీ నిజంగా టెస్టుల్లో 2 టైర్ విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తుంటే, అది కచ్చితంగా భయంకరమైన నిర్ణయమవుతోంది. టెస్టు క్రికెట్ హోదా పొందేందుకు కష్టపడుతున్న చిన్న జట్ల పట్ల శాపంగా మారనుంది. ఇకపై లోయర్ డివిజన్లో మిగతా జట్లు వాళ్లతో వాళ్లే ఆడుకుంటారు. దీంతో టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరగడం కాదు మరింత తగ్గుతోంది. చిన్న జట్లను అగ్ర జట్లతో ఎక్కువగా ఆడేలా చేయడంపై ఐసీసీ దృష్టి సారించాలి. అంతే తప్ప ఎటువంటి చెత్త నిర్ణయాలు తీసుకోకూడదు అని 80 ఏళ్ల క్లైవ్ లాయిడ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.వెస్టిండీస్ జట్టును రద్దు చేసి విడివిడిగా ఆడాలన్న ఐసీసీ మాజీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే సూచనపై కూడా లాయిడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. " వరల్డ్ క్రికెట్లో వెస్టిండీస్ జట్టుకు గొప్ప చరిత్ర ఉంది. అలాంటి జట్టును విడదీయాలని మాట్లాడుతున్నారు. అది సరైన పద్దతి కాదు. వెస్టిండీస్‌తో సహా ఇన్ని జట్లకు సమంగా డబ్బులిస్తే సౌకర్యాలను మెరుగుపరుచుకుంటారు. వారు తమ క్రికెట్‌ను మరింత మెరుగుపరచుకునేందుదు మెరుగైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటారు అని లాయిడ్ వ్యాఖ్యనించారు.చదవండి: 'రాహుల్ కోసం అతడిని పక్కన పెట్టేశారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సింది' -
'రాహుల్ కోసం అతడిని పక్కన పెట్టేశారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సింది'
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం అందుకున్న భారత జట్టు.. తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో దారుణ ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా భారత్ ఘోరంగా విఫలమైంది. గెలవాల్సిన మ్యాచ్‌ల్లో కూడా బ్యాటర్ల తప్పిదాల వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది.దీంతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాలను కూడా భారత్ చేజార్చుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన భారత మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు ఈ సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. కేఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో మొత్తం ఐదు మ్యాచ్‌లకు సర్ఫారాజ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సర్ఫారాజ్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ఇవ్వకపోవడాన్ని మంజ్రేకర్ తప్పుబట్టాడు. "కేఎల్ రాహుల్ రాహుల్ కోసం సర్ఫరాజ్ ఖాన్‌ను పూర్తిగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు. ఈ విషయం గురించి మొదటి టెస్టు సమయంలోనే మేము కామెంటేటరీ బాక్స్‌లో చర్చించాము. సర్ఫరాజ్‌కు టీమ్ మేనేజ్మెంట్ మరి కొన్ని అవకాశాలు ఇవ్వాల్సింది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ఆ కారణంగానే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతర్జాతీయ స్ధాయిలో కూడా సత్తాచాటాడు. అతడు కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడి మూడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు.ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమయ్యాడు. దీంతో అతడిని ఆసీస్ సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికి తుది జట్టులోకి మాత్రం తీసుకోలేదు. సర్ఫరాజ్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశమివ్వాల్సింది. అప్పటికీ అతడు రాణించకపోయింతే పక్కన పెట్టాల్సింది. ఇది నావరకు అయితే సరైన నిర్ణయం కాదని అన్పిస్తోంది. మరోవైపు అభిమన్యు ఈశ్వరన్ వార్మాప్ మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడని అతడిని తుది జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు. కేవలం వార్మాప్ మ్యాచ్‌లతోనే వారి ఆటతీరును అంచనా వేయకూడదు. అతడికి కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా మంచి రికార్డు ఉంది.ఓ మ్యాచ్‌లో ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌లో రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడని భావించయారు. కానీ పెర్త్ టెస్టుకు రోహిత్ శర్మ గైర్హజారీలో భారత ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. ఆ తర్వాతి మ్యాచ్‌లలోనూ టాపార్డర్‌లోనే కొనసాగాడు.చదవండి: సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం.. పాకిస్తాన్‌కు మరో షాక్ -
నితీశ్ రెడ్డి ఆ స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!
టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసే అవకాశం రావడమే గొప్ప అనుకుంటే.. తన ఆట తీరుతో అతడు అద్భుతాలు చేశాడని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2024 ద్వారా వెలుగులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి.బంగ్లాతో సిరీస్ సందర్భంగా..సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన 21 ఏళ్ల నితీశ్ రెడ్డి.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే, తనకున్న అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాల కారణంగా అనతికాలంలోనే టెస్టు జట్టుకూ ఎంపికయ్యాడు. ఏకంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు నితీశ్ రెడ్డి. అంతేకాదు తుదిజట్టులోనూ స్థానం సంపాదించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో బ్యాట్ ఝులిపించి సత్తా చాటాడు.మెల్బోర్న్లో గుర్తుండిపోయే శతకంఇక మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా నితీశ్ రెడ్డి ఏకంగా శతకంతో చెలరేగాడు. రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి విఫలమైన చోట.. 114 పరుగులతో దుమ్ములేపి.. తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి ఆట తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. టీమిండియాకు దొరికిన మరో ఆణిముత్యం అంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు అతడి నైపుణ్యాలను కొనియాడారు.కాగా ఆసీస్‌తో ఐదు టెస్టుల్లో కలిపి తొమ్మిది ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన నితీశ్ రెడ్డి.. 298 పరుగులు చేశాడు. అదే విధంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, నితీశ్ రెడ్డి ఈ సిరీస్‌లో ఎక్కువగా ఎనిమిదో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడం మామూలు విషయం కాదు.ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!మనలో చాలా మంది నితీశ్ రెడ్డి సెంచరీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నిజానికి.. అతడు సిరీస్ ఆసాంతం 40 పరుగుల మార్కును అందుకున్నాడు. ఏదేమైనా.. అతడు శతకం బాదిన తర్వాత.. చాలా మంది.. టీమిండియాకు ఎనిమిది లేదంటే ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే ఆల్‌రౌండర్ దొరికాడని సంతోషపడ్డారు.నిజానికి ఒకవేళ ఆరో స్థానంలో గనుక అతడిని ఆడిస్తే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అతడికి ఆ సత్తా ఉంది. టీమిండియా విధ్వంసకర ఆటగాడిగా అతడు ఎదగగలడు. దీర్ఘకాలం పాటు ఆరో నంబర్ బ్యాటర్‌గా సేవలు అందించగల యువ క్రికెటర్ అతడు’’ అని పేర్కొన్నాడు.ఐదో బౌలర్‌గానూఅదే విధంగా.. విదేశీ గడ్డపై పేస్ దళంలో ఐదో బౌలర్‌గానూ నితీశ్ రెడ్డి రాణించగలడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ‘‘తొలి మూడు ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి బౌలర్‌గా విఫలమయ్యాడు. అయినప్పటికీ.. ఆస్ట్రేలియా గడ్డ మీద అతడి బౌలింగ్ ప్రదర్శన సంతృప్తికరంగానే ఉంది. బౌలింగ్ నైపుణ్యాలకు ఇంకాస్త మెరుగులు దిద్దుకుంటే.. ఐదో బౌలర్‌గా అతడు అందుబాటులో ఉండగలడు’’ అని పేర్కొన్నాడు.చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ -
BGT: ఆస్ట్రేలియా నిజంగానే గొప్పగా ఆడిందా?
ఆద్యంతం ఆసక్తి రేపిన భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను రోహిత్ సేన 1-3తో ఓడి పరాజయంతో ముగించింది. తద్వారా పదేళ్ల తర్వాత కంగారూ జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar)ని తమ సొంతం చేసుకుంది. అయితే, స్వదేశంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల అద్భుత ప్రదర్శన కారణంగానే ఇది సాధ్యమైందా? అంటే.. నిజంగా లేదనే చెప్పాలి. భారత్ బ్యాటర్ల తప్పిదాల వల్లే ఆసీస్ జట్టుకు సుదీర్ఘ విరామం తర్వాత ఈ విజయం దక్కిందని చెప్పక తప్పదు.ఈ సిరీస్ లో భారత్ తరుఫున పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడు మాత్రమే అద్భుతంగా ఆడాడు. నిజానికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ సైతం ఈ విషయాన్నిఅంగీకరించరు. వాస్తవానికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ బుమ్రా ని ఎదుర్కొనడానికి భయపడ్డారనేది చేదు నిజం.'బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా?'మెల్బోర్న్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ సైతం బుమ్రా పై ప్రశంసలు కురిపించడం విశేషం. "బుమ్రా ఒక్కడూ వేరే గ్రహం నుంచి వచ్చినట్టు ఆడుతున్నాడు" అని గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. గిల్‌క్రిస్ట్ మాత్రమే కాకుండా అనేక మంది ఇతర మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ల సైతం బుమ్రాని ప్రశంసలతో ముంచెత్తారు. బుమ్రాని వాళ్ళు వెస్టిండీస్ దిగ్గజాలతో పోల్చడం విశేషం. ఆదివారం సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా మైదానంలోకి రాకపోవడంతో భారత్ ఓటమి ఖాయమైపోయింది. ఈ మ్యాచ్ కి ముందు బుమ్రా హావభావాలను భారత్ ఆటగాళ్లకన్నా ఆస్ట్రేలియా క్రికెటర్లు, వాళ్ళ అభిమానులు, కామెంటేటర్లు ఎక్కువగా నిశితంగా పరిశీలించాలంటే అతని ప్రాముఖ్యమేమిటో అర్ధమౌతుంది.ముఖ్యంగా మెల్బోర్న్లో నాలుగో రోజు బుమ్రా భారత్ ని గెలిపించేందుకు బాగా శ్రమించడంతో అతని శరీరం తట్టుకోలేకపోయింది. దీని ఫలితంగా, ఈ సిరీస్‌లో ఏకంగా 32 వికెట్లు సాధించి.. ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పినప్పటికీ భారత్ పరాజయంతో వెనుదిరగాల్సి వచ్చింది.ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ అంతంతమాత్రమేఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ మెరుగ్గా ఆడారనడం సరికాదు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ కన్నా భారత్ బ్యాటింగ్ లైనప్‌లో అస్థిరత వారిని గెలిపించిందంటే సబబుగా ఉంటుందేమో. ఈ సిరీస్ లో భారత్ బ్యాటర్ల టాప్ ఆర్డర్ (1 నుండి 7) వరకు సగటు 24.67తో పోలిస్తే.. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ సగటు 28.79 మాత్రమే. టీమిండియా బ్యాటర్ల రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో పోలిస్తే.. ఇక్కడ ఆస్ట్రేలియా బ్యాటర్ల నాలుగు సెంచరీలు, ఎనిమిది అర్ధసెంచరీలతో కాస్త పైచేయి సాధించారు.ఇక తొమ్మిదో స్థానం నుంచి పదకొండో స్థానాల బ్యాటర్ల ఆట తీరును పరిగణనలోకి తీసుకుంటే.. భారత్ సగటు 9.64తో కాగా ఆస్ట్రేలియా సగటు 15గా నమోదైంది. ఇక ఈ సిరీస్‌లో బుమ్రా తర్వాత మరో సానుకూలాంశం యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్. అతడు 43.44 సగటుతో 391 పరుగులు సాధించి ఈ సిరీస్‌లో భారత్ తరఫున అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి అడపాదడపా మెరుపులు మెరిపించారు కానీ నిలకడగా రాణించలేదు.ఇక రిషబ్ పంత్ చివరి మ్యాచ్ లో అబ్బురపరిచాడు. అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున ప్రధానంగా వైఫల్యం చెందినది మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని చెప్పక తప్పదు.రోహిత్ శర్మ అయిదు ఇన్నింగ్స్‌లలో 6.20 సగటు కేవలం 31 పరుగులు సాధించగా, కోహ్లీ ఎనిమిది ఇన్నింగ్స్ ల్లో 23.75 సగటుతో 190 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉండటం విశేషం.మేనేజ్మెంట్ తప్పిదాలు కూడామొత్తం మీద భారత్ బ్యాటర్ల వైఫల్యం.. టీమ్ మేనేజ్మెంట్ తప్పిదాలే టీమిండియా కొంపముంచాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మెల్బోర్న్ నాలుగో రోజు ఆటముగిసేలోగా ఆస్ట్రేలియా బ్యాటర్లని ఆలౌట్ చేయడంలో వైఫల్యం.. అదే రోజు యశస్వి జైస్వాల్ వరుసగా క్యాచ్‌లు జారవిడవడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక మెల్బోర్న్లో గెలుపొంది ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. అదే ఆత్మవిశ్వాసం తో సిడ్నీలో గెలిచి పదేళ్ల తర్వాత సిరీస్ దక్కించుకుంది. -
నేను ముందే చెప్పా.. అతడిపై అంచనాలు పెట్టుకోవడం వేస్ట్: శ్రీకాంత్
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే పదేళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు భారత్ సమర్పించుకుంది. ఈ సిరీస్‌లో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ సైతం తీవ్ర నిరాశపరిచాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 18.60 సగటుతో కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు.అందులో 31 పరుగులు అతడి అత్యధిక స్కోర్‌గా ఉంది. సొంతగడ్డపై బ్యాట్ ఝూలిపించే శబ్‌మన్.. విదేశాల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. 2021లో అరంగేట్రం చేసినప్పటి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లలో 18 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌లలో అతడి అత్యధిక స్కోర్ కేవలం 36 పరుగులు మాత్రమే కావడం గమానర్హం.ఈ క్రమంలో గిల్‌పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. గిల్ ఒక ఓవర్రేటెడ్ క్రికెటర్ అని శ్రీకాంత్ ఫైరయ్యాడు."శుబ్‌మన్ గిల్ ఒక ఓవర్రేటెడ్ క్రికెటర్. అతడిపై ఎక్కువగా అంచనాలు పెట్టుకోవద్దని నేను ముందు నుంచి చెబుతునే ఉన్నా. కానీ ఎవరూ నా మాట వినలేదు. అతడిని ఆకాశానికెత్తేశారు. గిల్‌కు చాలా అవకాశాలు లభిస్తున్నాయి.పది ఛాన్స్‌లలో వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విఫలమై ఆఖరి మ్యాచ్‌లో పరుగులు సాధిస్తున్నాడు. దీంతో అతడు జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకుంటున్నాడు. అంతే తప్ప స్పెషల్ టాలెంట్ ఏమీ లేదు.భారత పిచ్‌లపై ఎవరైనా పరుగులు సాధిస్తారు. సేనా దేశాల్లో పరుగులు సాధించడం గొప్ప విషయం. ఈ విషయంలో కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు తమను తాము నిరూపించుకున్నారు అని ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు.చదవండి: ఆసీస్ గడ్డపై ఎంతో నేర్చుకున్నాను.. మళ్లీ బలంగా పైకి లేస్తాం: జైస్వాల్ -
మళ్లీ బలంగా పైకి లేస్తాం: జైస్వాల్
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా తీవ్ర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. దీంతో పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ చేజారిపోయింది.అయితే ఈ సిరీస్‌లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన యశస్వి.. మిచెల్ స్టార్క్, కమ్మిన్స్, హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించాడు.మొత్తం ఐదు మ్యాచ్‌లలో ఓ సెంచరీ, 2 అర్ధసెంచరీలు సహా అతను 43.44 సగటుతో 391 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ (448) తర్వాత ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైశ్వాల్ రెండో స్ధానంలో నిలిచాడు. తాజాగా తన తొలి ఆస్ట్రేలియా పర్యటనపై జైశ్వాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.‘ఆ్రస్టేలియా గడ్డపై ఎంతో నేర్చుకున్నాను. దురదృష్టవశాత్తూ మేం ఆశించిన ఫలితం రాలేదు. అయితే మున్ముందు మరింత బలంగా పైకి లేస్తాం. మీ అందరి మద్దతు ఎంతో ప్రోత్సాహించింది’ అని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యశస్వి ఈ పోస్ట్ చేశాడు. కాగా జైశ్వాల్ పోస్ట్‌పై ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా స్పందించాడు. నీ పనిని ప్రేమించు బ్రదర్ అంటూ ఖావాజా కామెంట్ చేశాడు.చదవండి: PAK vs SA: రెండో టెస్టులో పాకిస్తాన్ చిత్తు.. దక్షిణాఫ్రికాదే సిరీస్ View this post on Instagram A post shared by Yashasvi Jaiswal (@yashasvijaiswal28) -
కమిన్స్ డబుల్ సెంచరీ.. చరిత్రలో తొలి ప్లేయర్
ఆస్ట్రేలియా సారధి పాట్ కమిన్స్ (Pat Cummins) ఎవరికీ సాధ్యం కానీ మైలురాయిని అందుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో కమిన్స్ ఈ ఫీట్‌ను సాధించాడు. వాషింగ్టన్ సుందర్ డబ్ల్యూటీసీలో కమిన్స్‌కు 200వ వికెట్.డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ తర్వాతి స్థానాల్లో నాథన్ లియోన్ (196 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (195), మిచెల్ స్టార్క్ (165), జస్ప్రీత్ బుమ్రా (156) ఉన్నారు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను ఆస్ట్రేలియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన ఆసీస్.. రెండు, నాలుగు, ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. తాజాగా ముగిసిన ఐదో టెస్ట్‌లో (సిడ్నీ) ఆసీస్ ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ సిరీస్ ఆధ్యాంతం అద్బుతంగా రాణించిన కమిన్స్ 25 వికెట్లు తీసి ఆసీస్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 32 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కమిన్స్ ఈ సిరీస్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 19.88 సగటున 159 పరుగులు చేశాడు.బ్యాటింగ్‌లో హెడ్ టాప్తాజాగా ముగిసిన బీజీటీలో ఆసీస్ చిచ్చరపిడుగు ట్రవిస్ హెడ్ అత్యధిక పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన హెడ్ 56 సగటున 448 పరుగులు చేశాడు. భారత యువ కెరటం యశస్వి జైస్వాల్ 10 ఇన్నింగ్స్‌ల్లో 43.44 సగటున 391 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.బీజీటీ 2024-25లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆటగాళ్లు..ట్రవిస్ హెడ్-448యశస్వి జైస్వాల్-391స్టీవ్ స్మిత్-314నితీశ్ కుమార్ రెడ్డి-298కేఎల్ రాహుల్-276రిషబ్ పంత్-255మార్నస్ లబూషేన్-232అలెక్స్ క్యారీ-216విరాట్ కోహ్లి-190ఉస్మాన్ ఖ్వాజా-184బీజీటీ 2024-25లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు..బుమ్రా-32కమిన్స్-25బోలాండ్-21సిరాజ్-20స్టార్క్-18నాథన్ లియోన్-9జోష్ హాజిల్‌వుడ్-6ప్రసిద్ద్ కృష్ణ-6ఆకాశ్‌దీప్-5నితీశ్ కుమార్ రెడ్డి-5చెలరేగిన బోలాండ్ఐదో టెస్ట్‌లో ఆసీస్ స్పీడ్‌స్టర్ స్కాట్ బోలాండ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో బోలాండ్ 10 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన బోలాండ్, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 10 వికెట్ల ప్రదర్శనకు గానూ బోలాండ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం ఆసీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన బుమ్రాను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది.డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్భారత్పై ఐదో టెస్ట్ గెలుపుతో ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆసీస్ రెండో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడతాయి. 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో ఆస్ట్రేలియా మరో రెండు మ్యాచ్‌లు (శ్రీలంకతో) ఆడాల్సి ఉంది. -
ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు..
టీమిండియా వరుస వైఫల్యాలపై భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) హెడ్‌కోచ్‌గా ఉన్నంతకాలం అంతా బాగానే ఉందని.. కానీ గత ఆరునెలల కాలంలో జట్టు ఇంతగా దిగజారిపోవడం ఏమిటని ప్రశ్నించాడు. మ్యాచ్ విన్నర్లుగా అభివర్ణిస్తూ జట్టుకు భారమైనా కొంతమందిని ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు.ట్రోఫీ గెలిచిన తర్వాత ద్రవిడ్ గుడ్బైఇప్పటికైనా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలని భజ్జీ సూచించాడు. సూపర్‌స్టార్ ఆటిట్యూడ్ ఉన్నవారిని నిర్మొహమాటంగా పక్కనపెట్టాలని సలహా ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. ద్రవిడ్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ బ్యాటర్ గౌతం గంభీర్ హెడ్‌కోచ్ పదవిని చేపట్టాడు.ఘోర పరాభవాలుఅయితే, గౌతీ మార్గదర్శనంలో టీమిండియా ఇప్పటి వరకు చెప్పుకోగదగ్గ విజయాలేమీ సాధించకపోగా.. ఘోర పరాభవాలు చవిచూసింది. శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు కోల్పోవడంతో పాటు.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది.కంగారూల చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని ఆసీస్‌కు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఇంటా.. బయటా వైఫల్యాల పరంపర కొనసాగిస్తున్న టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు. ‘స్టార్ల’ కోసం అభిమన్యు ఈశ్వరన్(Abhimanyu Easwaran) వంటి వాళ్లను బలిచేయవద్దని హితవు పలికాడు.ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేదిఈ మేరకు.. ‘‘గత ఆరు నెలల్లో.. టీమిండియా శ్రీలంక చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై 3-1తో సిరీస్ ఓటమిని చవిచూసింది. రాహుల్ ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేది.అతడి మార్గదర్శనంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. కానీ... ఆ తర్వాత అకస్మాత్తుగా ఏమైంది? ప్రతి ఒక్క ఆటగాడికి తనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఒకవేళ కొంతమందిని మ్యాచ్ విన్నర్లుగా భావిస్తూ తప్పక ఆడించాలనుకుంటే.. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలను కూడా జట్టులోకి తీసుకోండి. ఎందుకంటే.. భారత క్రికెట్లో వాళ్ల కంటే పెద్ద మ్యాచ్ విన్నర్లు ఎవరూ లేరు.అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడించాల్సిందిఇప్పటికైనా బీసీసీఐ సెలక్టర్లు కఠిన వైఖరి అవలంభించాలి. సూపర్‌స్టార్ ఆటిట్యూడ్‌ను పక్కనపెట్టండి. అభిమన్యు ఈశ్వరన్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకువెళ్లారు. కానీ.. ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. ఒకవేళ అతడికి అవకాశం ఇచ్చి ఉంటే.. కచ్చితంగా సత్తా చాటేవాడు.సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. తదుపరి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు ఆడాల్సి ఉంది. అప్పుడు మాత్రం ప్రదర్శన బాగున్న ఆటగాళ్లనే ఎంపిక చేయండి. కీర్తిప్రతిష్టల ఆధారంగా సెలక్షన్ వద్దు’’ అంటూ హర్భజన్ సింగ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా ఆసీస్‌తో సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టులో ఓడిన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. తదుపరి 2025-27 సీజన్లో తొలుత ఇంగ్లండ్ టూర్లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.చదవండి: CT 2025: శుబ్‌మన్ గిల్‌పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్? -
CT 2025: శుబ్‌మన్ గిల్‌పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్?
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది టీమిండియా. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగా దాదాపు దశాబ్దం తర్వాత ఈ టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి రిక్తహస్తాలతో స్వదేశానికి పయనమైంది.బౌలర్‌గా, కెప్టెన్‌గా రాణించిఇక ఆసీస్‌తో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచిందంటే అందుకు కారణం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)నే. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గైర్హాజరీలో ఈ ఫాస్ట్‌బౌలర్ భారత జట్టును ముందుకు నడిపించాడు. పేసర్‌గా, కెప్టెన్‌గా రాణించి ఆసీస్ గడ్డపై టీమిండియాకు అతిపెద్ద టెస్టు విజయం(295 పరుగుల తేడాతో) అందించాడు.వెన్నునొప్పి వేధించినాఅయితే, ఆ తర్వాత రోహిత్ శర్మ తిరిగి వచ్చినా టీమిండియా ఇదే జోరును కొనసాగించలేకపోయింది. బ్యాటర్‌గా, సారథిగా రోహిత్ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి అతడు స్వచ్చందంగా తప్పుకోగా.. బుమ్రా మరోసారి పగ్గాలు చేపట్టాడు. వెన్నునొప్పి వేధించినా జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాడు.కానీ సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియాకు భంగపాటు తప్పలేదు. మ్యాచ్‌తో పాటు సిరీస్‌లోనూ ఓటమిని చవిచూసింది. బుమ్రా లేకపోయి ఉంటే.. టీమిండియా ఆసీస్ చేతిలో 5-0తో వైట్‌వాష్‌కు గురయ్యేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడంటే.. ఈ సిరీస్‌లో అతడి ప్రాధాన్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా?ఈ నేపథ్యంలో ఇప్పటికే పేస్ దళ నాయకుడిగా ఉన్న బుమ్రా.. త్వరలోనే పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. వన్డేల్లోనూ రోహిత్ వారసుడిగా బుమ్రా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గిల్‌పై వేటు.. బుమ్రాకు ప్రమోషన్?ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా రోహిత్ శర్మకు బుమ్రా డిప్యూటీగా వ్యవహరించనున్నట్లు సమాచారం. కాగా శ్రీలంక పర్యటన 2024 సందర్భంగా వన్డే, టీ20లలో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). అయితే, ఏదేని కారణాల వల్ల రోహిత్ దూరమైతే.. గిల్ ఇప్పటికప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించే పరిణతి సాధించలేదని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకొన్న తర్వాత.. వన్డే కెప్టెన్సీకి అతడు దూరం కానున్నాడనే వదంతులు వచ్చాయి. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాలు వినిపించాయి.ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్లుకాగా చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రా దూరంగా ఉండనున్నట్లు సమాచారం. వెన్నునొప్పి కారణంగా అతడు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది. పాకిస్తాన్ ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో జరుగుతాయి. హైవోల్టేజీ పోరు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.చదవండి: 13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. రషీద్ ఖాన్ మాయాజాలం.. అఫ్గన్ సరికొత్త చరిత్ర -
గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి: టీమిండియా దిగ్గజం
టెస్టు క్రికెట్లో వరుస పరాభవాలు ఎదుర్కొన్న టీమిండియాపై విమర్శల వర్షం కురుస్తోంది. తొలుత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైన రోహిత్ సేన.. ఆస్ట్రేలియా గడ్డపై కూడా రాణించలేకపోయింది. కంగారూ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. తద్వారా దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని తొలిసారి ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది.పేలవ ప్రదర్శన.. ఇక ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు కీలక బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) పూర్తిగా విఫలం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. యువ ఆటగాళ్లకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ఈ ఇద్దరు దిగ్గజాలు పేలవ ప్రదర్శనతో తేలిపోయారు. రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్ వంటి స్టార్లు కూడా కీలక సమయంలో చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో.. ఇంటా బయట పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా ప్లేయర్లకు... క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చురకలు అంటించాడు. భారత ఆటగాళ్లందరూ దేశవాళీల్లో ఆడాలని, ఏ ఒక్కరికీ మినహాయింపు ఇవ్వకుండా అందరూ రంజీ ట్రోఫీలో ఆడేలా చూడాలని సన్నీ సూచించాడు. ఎవరికీ మినహాయింపు వద్దు‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు ఓటమి అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ నెల 23 నుంచి రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత భారత జట్టులో నుంచి ఎంతమంది ఆటగాళ్లు అందులో పాల్గొంటారో చూడాలి. ఏ ఒక్కరికీ మినహాయింపు లేకుండా అందరూ దేశవాళీ టోర్నీలో పాల్గొనాలి.గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలిరంజీ ట్రోఫీకి అందుబాటులో లేని ఆటగాళ్ల విషయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. తాజా ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌పై కూడా భారత ఆటగాళ్ల ప్రదర్శన గొప్పగా లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాలు ఎలాగూ లేవు. ఈ సమయంలో తదుపరి టోర్నీ కోసం అయినా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి. తమను తాము నిరూపించుకోవాలనే తపన ఉన్న ఆటగాళ్లు ముఖ్యం. రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌ల సమయంలోనే ఇంగ్లండ్‌తో భారత జట్టు టీ20 సిరీస్ ఆడనుంది. మరి దానికి ఎంపిక కాని వారిలో ఎంతమంది దేశవాళీ ట్రోఫీలో పాల్గొంటారో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.గంభీర్దీ అదే మాటవరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా భారత స్టార్లు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా. అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా రంజీ మ్యాచ్‌లు ఆడాల్సిందే. దేశవాళీ మ్యాచ్‌లకు ప్రాధాన్యత ఇవ్వకపోతే జాతీయ జట్టు తరఫున టెస్టు క్రికెట్ ఆడే ఆసక్తి లేనట్లే.ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంకా చాలా సమయం ఉంది. జట్టులోని ఏ ఒక్కరి భవిష్యత్ గురించి ఇప్పుడే నేను మాట్లాడలేను. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యం గురించి కూడా ఏమీ చెప్పలేను. అయితే వారిలో పరుగులు సాధించాలనే కసి ఇంకా ఉంది. జట్టులో అందరూ సమానమే. అందరితో ఒకే రీతిన వ్యవహరిస్తా. చివరిదైన సిడ్నీ టెస్టు నుంచి తప్పుకోవాలని రోహితే నిర్ణయించుకున్నాడు. దీంతో జట్టులో ప్రతి ఒక్కరికీ జవాబుదారీతనం ఉండాలని రోహిత్ చాటాడు’’ అని సిరీస్ ఓటమి తర్వాత గంభీర్ వ్యాఖ్యానించాడు.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే? స్టార్ ప్లేయర్‌కు ఛాన్స్! -
చరిత్ర సృష్టించిన ప్యాట్ కమ్మిన్స్.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా తమ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. చివరగా 2014-15లో మైఖల్ క్లార్క్ ఆసీస్‌కు బీజీటీ టైటిల్‌ను అందించగా.. మళ్లీ ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో కంగారుల కలనేరవేరింది.సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా.. 3-1 తేడాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. బీజీటీతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్‌ను ఆసీస్ ఖారారు చేసుకుంది. కాగా ఈ సిరీస్ విజయంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ది కీలక పాత్ర.సిరీస్ అసాంతం కమ్మిన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 2021లో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కమ్మిన్స్.. తన జట్టును వరుసగా రెండు సార్లు వరల్డ్‌టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేర్చాడు.కమ్మిన్స్ అరుదైన ఘనత..ఈ క్రమంలో ప్యాట్ కమ్మిన్స్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 20 మ్యాచ్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా డబ్లూటీసీ సైకిల్స్(2021-23, 2023-25)లో కమ్మిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 33 మ్యాచ్‌లు ఆడగా 20 గెలిచింది.కమ్మిన్స్ తర్వాతి స్ధానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉన్నాడు. స్టోక్స్ సారథ్యంలో 29 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఆడగా.. 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడో స్ధానంలో 14 విజయాలతో విరాట్ కోహ్లి ఉన్నాడు. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే? స్టార్ ప్లేయర్‌కు ఛాన్స్! -
టీమిండియాతో ఎప్పుడూ సవాలే.. కానీ కలిసికట్టుగా పోరాడం: కమ్మిన్స్
సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా పదేళ్ల తర్వాత తిరిగి బీజీటీని రిటైన్ చేసుకుంది.చివరగా 2014-15లో మైఖల్ క్లార్క్ సారథ్యంలో ఆసీస్ విజేతగా నిలవగా.. మళ్లీ ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీ బీజీటీ టైటిల్‌ను కంగారులు దక్కించుకున్నారు. కాగా ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో సత్తాచాటిన కమ్మిన్స్ సేన.. బ్యాటింగ్‌లో కూడా దుమ్ములేపింది. భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఆస్ట్రేలియా ఖారారు చేసుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు."బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తిరిగి చేజిక్కించుకోవడం ఆనందంగా ఉంది. మా జట్టులో చాలా మంది ఇంతవరకు ఈ ట్రోఫీ నెగ్గలేదు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చ లేకపోయాం. ఆ తర్వాత కలిసికట్టుగా రాణించడం బాగుంది.జట్టులోని ప్లేయర్ల మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ సిరీస్ ద్వారానే అరంగేట్రం చేసిన ముగ్గురు కొత్త ఆటగాళ్లు విభిన్న పరిస్థితుల్లో మెరుగైన ఆటతీరు కనబర్చారు. నా కెరీర్లో ఇది చాలా ఇష్టమైన ట్రోఫీ. సిరీస్ కోసం బాగా సన్నద్ధమయ్యా. భారత్ వంటి ప్రత్యర్ధితో తలపడటం ఎప్పుడూ సవాలే" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
ఈ ఆరు నెలల్లో మీరేం చేశారు.. కోచ్‌లను మారిస్తే బెటర్: సునీల్ గవాస్కర్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT)ను ఆసీస్‌కు టీమిండియా సమర్పించుకుంది. బీజీటీ ట్రోఫీతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ అవకాశాలను సైతం రోహిత్ సేన చేజార్చుకుంది.ఈ విజయంతో ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భారత జట్టుపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. ప్లేయర్స్‌తో పాటు జట్టు మేనేజ్మెంట్ కూడా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ గంభీర్ అండ్ కో పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు."అస్సలు కోచ్‌లు ఏం చేస్తున్నారు? న్యూజిలాండ్‌పై కేవలం 46 పరుగులకు ఆలౌట్ అయ్యాం. జట్టు బ్యాటర్ల పరిస్థితి ఎలా ఉందో అప్పుడే ఆర్దం చేసుకోవచ్చు. కాబట్టి ఆస్ట్రేలియా సిరీస్‌కు సరైన ప్రణాళికలతో వెళ్లాల్సింది. కానీ కోచ్‌లు ఎటువంటి బాధ్యత తీసుకోలేదు. ఎందుకు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా బ్యాటర్ల ఆట తీరు మెరుగు పడలేదు? కచ్చితంగా ఈ ప్రశ్నకు కోచ్‌లే సమాధనమివ్వాలి. ఆటగాళ్లతో పాటు కోచ్‌ల పనితీరును కూడా అంచనా వేయాలి. మంచి బౌలర్లను ఎలా ఉపయోగించుకోవాలో కోచ్‌లు ప్లాన్ చేయలేదు. ఇష్టం వచ్చినట్లు బ్యాటింగ్‌ను ఆర్డర్‌ను మార్చారు. ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌కు బదులుగా కోచ్‌లను మారిస్తే బెటర్ అన్పిస్తోంది.ప్రతీ ఒక్కరూ బ్యాటర్లను మాత్రమే తప్పుబడుతున్నారు. కానీ కోచ్‌లను కూడా ప్రశ్నించాలన్నది నా అభిప్రాయం. ఈ ఆరు నెలల్లో వారేమి చేశారో నాకు ఆర్ధం కావడం లేదు. దీనికి వారే సమాధానం చెప్పాలి" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ ఫైరయ్యాడు. గంభీర్ నేతృత్వంలో పది టెస్టులు ఆడిన భారత్ ఆరింట ఓటమి చవిచూసింది. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో సిరీస్‌లను కోల్పోయింది.చదవండి: ధోని కెప్టెన్సీలో ఎంట్రీ.. కట్ చేస్తే! రిటైర్మెంట్తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్ -
ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఘోర అవమానం ఊహించిందే..!
సిడ్నీ టెస్ట్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఓటమితో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలను జారవిడుచుకుంది.డబ్ల్యుటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే సిడ్నీ టెస్టులో భారత్ గెలవాల్సి ఉండింది. అయితే టాపార్డర్ బ్యాటర్ల ఘోర వైఫల్యం కారణంగా భారత్ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.భారత్ ఆధిపత్యానికి తెరపడింది ఈ సిరీస్‌లో భారత్ వైఫల్యం ఊహించిందే. భారత్ పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం బాధాకరం. 2018-19 మరియు 2021-22లో ఆస్ట్రేలియా గడ్డ పై వరుసగా రెండు సార్లు అద్భుతమైన ప్రదర్శనలతో చాలా కాలం పాటు ఈ ట్రోఫీ పై తన ఆధిపత్యాన్ని కొనసాగించడం భారత్ క్రికెట్‌కు ఏంతో గర్వకారణం. అయితే ఇలా ఓటమి చెందడం భారత్ క్రికెట్ అభిమానులకి ఒకింత బాధాకరమే.అయితే స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 0-3తో ఘోర ఓటమి చవిచూసిన అనంతరం జరిగిన ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుతాలు చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. గతంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వరుసగా రెండుసార్లు ఓటమి చవిచూడటం, గత కొంత కాలంగా టెస్టుల్లో భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయి లో లేదనేది వాస్తవం. ఇది భారత్ క్రికెట్ అభిమానులు అంగీకరించక తప్పదు. ఈ నేపథ్యంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ అద్భుతంగా రాణిస్తుందని భావించడం హాస్యాస్పదమే.భారత్ బ్యాటర్ల ఘోర వైఫల్యం క్రికెట్లోని పాత నానుడిని భారత్ అభిమానులు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. " బ్యాటర్లు మ్యాచ్‌లను గెలిపిస్తారు. బౌలర్లు సిరీస్‌లను గెలిపిస్తారు" అనేది ఈ సిరీస్ లో మరో మారు నిజమైంది. హేమాహేమీలైన భారత్ బ్యాటర్లు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమవడంతో భారత్ టాపార్డర్ బ్యాటర్లు చతికిలపడ్డారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అడపా దడపా మెరుపులు మెరిపించినా , ప్రతీసారి లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆడతారని భావించడం సరైన పద్దతి కాదు. భారత్ టాపార్డర్ బ్యాటర్లు అదీ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఎడమ చేతి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ భాగస్వామ్యం మినహాయిస్తే, భారత్ బ్యాటర్లు ఏ దశలోనూ నిలకడగా నిలదొక్కుకొని ఆడినట్టు కనిపించ లేదు. ఆస్ట్రేలియా వంటి ఏంతో ప్రతిష్టాత్మకమైన సిరీస్ లో ఈ రీతిలో బ్యాటింగ్ చేస్తే భారత్ జట్టు గెలుస్తుందని ఆశించడం కూడా తప్పే!బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియాఈ సిరీస్ మొత్తం పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా అన్న రీతిలో సాగింది. బుమ్రా ఈ సిరీస్ లో ఒంటి చేత్తో భారత్ జట్టుని నడిపించాడు. తన అద్భుత ప్రదర్శన తో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ కి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్ లో మొత్తం 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ సిరీస్ లో అధిగమించడం విశేషం. గాయంతో బుమ్రా చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ ముందు వైదొలగడంతో ఈ సిరీస్ ని కనీసం డ్రా చేయాలన్న భారత్ ఆశలు అడుగంటాయి. బుమ్రా లేని భారత్ బౌలింగ్ అనేకమంది హేమాహెమీలున్న ఆస్ట్రేలియా జట్టును సొంత గడ్డపై తక్కువ స్కోరు కి ఆలౌట్ చేస్తుందని భావించడం అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఉండదు! -
గౌతమ్ గంభీర్‌పై వేటు..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తొమ్మిదేళ్ల ఆధిపత్యానికి తెర పడింది. బీజీటీ 2024-25ని భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. ఇవాళ (జనవరి 5) ముగిసిన చివరి టెస్ట్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి టెస్ట్ ఓటమితో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి కూడా ఎలిమినేట్ అయ్యింది. భారత్ తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయింది.డబ్ల్యూటీసీ ఓటమి నేపథ్యంలో పలువురు సీనియర్ ఆటగాళ్లతో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మెడపై కత్తి వేలాడుతుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్‌ను తక్షణమే తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గంభీర్ ఓ చెత్త కోచ్ అని భారత క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. గంభీర్ వచ్చి టీమిండియాను నాశనం చేశాడని వారంటున్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన గంభీర్.. చెత్త వ్యూహాలతో టీమిండియాను భ్రష్ఠుపట్టించాడని అభిప్రాయపడుతున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వరుస వైఫల్యాలకు గంభీరే పరోక్ష కారణమని మండిపడుతున్నారు.కాగా, గంభీర్ రాక ముందు టీమిండియా ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలతో దూసుకుపోతూ ఉండింది. రాహుల్ ద్రవిడ్ ఆథ్వర్యంలో భారత్ 2024 టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. ఆ వెంటనే గంభీర్ ద్రవిడ్ నుంచి కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. గంభీర్ హెడ్ కోచ్‌గా టీమిండియా తొలి సిరీస్‌లో గెలిచింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడి నుంచి గంభీర్ వైఫల్యాలకు బీజం పడింది. గంభీర్ ఆథ్వర్యంలో భారత్ రెండో సిరీస్‌నే కోల్పోయింది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది.ఆతర్వాత భారత్ బంగ్లాదేశ్‌పై టెస్ట్, టీ20 సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. అనంతరం టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-3 తేడాతో కోల్పోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఇంత చిత్తుగా ఓడటం భారత్‌కు ఇదే మొదటిసారి. కివీస్ చేతిలో ఘోర పరాభవాన్ని మరిచిపోయేలోపే భారత్ బీజీటీలో బొక్కబోర్లా పడింది. బీజీటీలో తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా మధ్యలో ఓ మ్యాచ్‌ను డ్రాగా ముగించుకుని మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది.ఇదిలా ఉంటే, సిడ్నీ టెస్ట్‌లో భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే చాపచుట్టేసింది. బ్యూ వెబ్‌స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో మూడు వికెట్లు తీశారు.నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 157 పరుగులకే ఆలౌటై దారుణంగా నిరాశపర్చింది. రిషబ్ పంత్ (61) అర్ద సెంచరీ చేయకపోయుంటే భారత్ కనీసం మూడంకెల స్కోర్‌ను కూడా చేయలేకపోయేది. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా 41, ట్రవిస్ హెడ్ 34, బ్యూ వెబ్‌స్టర్ 39 పరుగులు చేశారు. -
కోహ్లి ఇప్పట్లో రిటైర్ కాడు..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన అనంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. కోహ్లి టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. సొంత అభిమానులు సైతం కోహ్లిని ఎండగడుతున్నారు. తాజాగా ముగిసిన బీజీటీలో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ సాయంతో 190 పరుగులు మాత్రమే చేశాడు. బీజీటీ 2024-25 ద్వారా కోహ్లికి ఉన్న ఓ వీక్ పాయింట్ ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఈ సిరీస్‌లో కోహ్లి ఆఫ్ స్టంప్ ఆవల పడ్డ బంతులను ఎదుర్కోలేక నానా అవస్థలు పడ్డాడు. తొమ్మిదింట ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఇలాంటి బంతులకే ఔటయ్యాడు. కోహ్లి ప్రస్తుత ఫామ్ నేపథ్యంలో రిటైర్మెంట్పై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కోహ్లి అతి త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని పీటీఐ నివేదిక కొట్టిపారేస్తుంది. కోహ్లికి ఇప్పట్లో రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని సదరు నివేదిక పేర్కొంది. కోహ్లి తనకు తాను లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకున్నాడని తెలిపింది. కింగ్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు ప్రణాళికలు సెట్ చేసుకున్నాడని పేర్కొంది.ఇదిలా ఉంటే, కోహ్లి సహా రోహిత్ శర్మను త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల నుంచి తప్పిస్తారని తెలుస్తుంది. రో-కోను ఏ ప్రాతిపదికన ఇంగ్లండ్‌తో పరిమత సిరీస్‌లకు ఎంపిక చేయాలని సెలెక్టర్లు ప్రశిస్తున్నట్లు సమాచారం. రోహిత్, కోహ్లి దేశవాలీ క్రికెట్ ఆడి ఫామ్‌లోకి రావాలని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఫామ్ నిరూపించుకున్నాకే వారు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని గవాస్కర్ పేర్కొన్నాడు. విశ్లేషకుల అంచనా మేరకు, రోహిత్‌తో పోలిస్తే కోహ్లికి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. రోహిత్‌కు అవకాశాలు రాకపోవడానికి అతని ఫామ్ లేమితో పాటు వయసు కూడా ప్రధాన అంశమే. వయసులో కోహ్లి రోహిత్ కంటే సంవత్సరం చిన్నవాడు. ఫామ్ ప్రకారం చూస్తే కోహ్లి రోహిత్ కంటే చాలా మెరుగ్గా ఉన్నాడు. బీజీటీ.. అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో కోహ్లి సెంచరీలు చేశాడు. రోహిత్ పరిస్థితి అలా లేదు. అతను ఫార్మాట్లకతీతంగా దారుణంగా విఫలమయ్యాడు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షిస్తే.. కోహ్లి కంటే ముందే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. కోహ్లికి ఇప్పట్లో రిటైరయ్యే ఉద్దేశమే లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది.కాగా, బీజీటీలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్ట్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే చాపచుట్టేసింది. బ్యూ వెబ్‌స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో మూడు వికెట్లు తీశారు. నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 157 పరుగులకే ఆలౌటై దారుణంగా నిరాశపర్చింది. రిషబ్ పంత్ (61) అర్ద సెంచరీ చేయకపోయుంటే భారత్ కనీసం మూడంకెల స్కోర్‌ను కూడా చేయలేకపోయేది. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా 41, ట్రవిస్ హెడ్ 34, బ్యూ వెబ్‌స్టర్ 39 పరుగులు చేశారు. ఈ గెలుపుతో ఆసీస్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకుంది. -
ఆటగాళ్ల భవిష్యత్తుపై నేనేమి మాట్లాడను: గౌతం గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్(Gautam Gambhir)కు మరో ఘోర పరాభవం ఎదురైంది. అతడి నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో కోల్పోయింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చూవిచూసిన భారత జట్టు.. 10 ఏళ్ల తర్వాత బీజీటీని టైటిల్‌ను ప్రత్యర్ధికి సమర్పించుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరే అవకాశాలను సైతం భారత్ చేజార్చుకుంది. ఇక సిడ్నీ టెస్టులో ఓటమి అనంతరం భారత ప్రధాన కోచ్ గౌతం గంభీర్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లి భవిష్యత్తులపై కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో ఆడాలా లేదా అన్నది వారి ఇష్టం, నిబద్ధతపై ఆదారపడి ఉంటుందని గౌతీ చెప్పుకొచ్చాడు."నేను ఏ ఆటగాళ్ల భవిష్యత్తు గురించి మాట్లడాలని అనుకోవడం లేదు. అది వారి ఇష్టం. వారికి ఆటపై తపన, నిబద్ధత ఉన్నాయి. వారు భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి చేయగలిగినదంతా చేస్తారని నేను ఆశిస్తున్నాను గంభీర్ పేర్కొన్నాడు. కాగా పేలవ ఫామ్ కారణంగా ఐదో టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. దీంతో అతడు టెస్టులకు విడ్కోలు పలకనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ఈ టెస్టు రెండో రోజు ఆట సందర్బంగా ఇప్పటిలో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన తనకు లేదని రోహిత్ స్పష్టం చేశాడు.దేశవాళీ క్రికెట్లో అందరూ ఆడాలిఅదే విధంగా దేశవాళీ క్రికెట్లో సీనియర్ ప్లేయర్లు ఆడటంపై కూడా గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. "ప్రతీ ఒక్క ప్లేయర్ దేశవాళీ క్రికెట్లో ఆడాలని నేను ఎప్పుడూ సూచిస్తాను. అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరూ రెడ్ బాల్ క్రికెట్లో తమ రాష్ట్ర జట్ల తరుపన ఆడాలి. డొమాస్టిక్ క్రికెట్లో ఆడితేనే అంతర్జాతీయ స్ధాయిలో మెరుగ్గా రాణించగలము" అని గంభీర్ వ్యాఖ్యనించాడు.ఇంగ్లండ్ సిరీస్‌కు కోహ్లి ఎంపిక అవుతాడా?ఇంగ్లండ్ సిరీస్‌కు విరాట్ కోహ్లిని ఎంపిక చేస్తారా అన్న ప్రశ్న కూడా గంభీర్‌కు ఎదురైంది. "ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంకా ఐదు నెలల సమయం ఉంది. అందుకు తగ్గట్టు మేము ప్లాన్ చేసుకుంటాము. ఈ విషయం గురించి మాట్లాడానికి ఇది సరైన సమయం కాదు. క్రీడల్లో చాలా విషయాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ముందుగానే మనం అంచనా వేయలేమని గంభీర్ బదులిచ్చాడు.చదవండి: Jasprit Bumrah: చాలా బాధగా ఉంది.. కానీ కొన్నిసార్లు తప్పదు -
చాలా బాధగా ఉంది.. కానీ కొన్నిసార్లు తప్పదు: జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఘోర పరాజయంతో ముగించింది. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో టీమిండియా కోల్పోయింది.162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు డిఫెండ్ చేసుకోలేకపోయింది.మూడో రోజు ఆటకు స్టాండింగ్ కెప్టెన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో భారత బౌలింగ్ యూనిట్ తేలిపోయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక ఈ ఓటమిపై టీమిండియా తత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఈ సిరీస్‌లో ఓడిపోయినప్పటికి తమ జట్టు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచందని బుమ్రా చెప్పుకొచ్చాడు."కీలక మ్యాచ్‌లో ఓడిపోవడం తీవ్ర నిరాశపరిచింది. అంతేకాకుండా గాయంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయకపోవడం కాస్త అసహనానికి గురి చేసింది. కానీ కొన్నిసార్లు మన శరీరానికి ప్రధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.మన శరీరంతో మనం పోరాడలేం.ఈ సిరీస్‌లోనే బాగా బౌలింగ్‌కు అనుకూలించిన వికెట్‌పై బౌలింగ్ చేసే అవకాశాన్ని కోల్పవడం బాధగా ఉంది. మొదటి ఇన్నింగ్స్ నా సెకెండ్ స్పెల్ సమయంలోనే కాస్త అసౌకర్యంగా అనిపించింది. దీంతో మా కుర్రాళ్లతో చర్చించి బయటకు వెళ్లిపోయాను. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా ఒక బౌలర్ లోటుతోనే ఆడాము. అయినప్పటకి మిగితా బౌలర్లు బాధ్యత తీసుకుని అద్బుతంగా రాణించారు. ఈ రోజు ఉదయం కూడా మా బౌలర్లతో మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశాను. ఆఖరి ఇన్నింగ్స్‌లో కూడా అదనపు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అని వారితో చెప్పాను. ఏదమైనప్పటికి ఆస్ట్రేలియాకు మేము గట్టిపోటీ ఇచ్చాము. సిరీస్ మొత్తం హోరాహోరీగా సాగింది. ఈ సిరీస్ ఏకపక్షంగా సాగలేదు. మేము ఆఖరి వరకు అద్బుతంగా పోరాడాము. టెస్టు క్రికెట్ అంటే ఇలానే ఉంటుంది.గేమ్‌లో ఉండాలంటే ప్రత్యర్ధిపై ఒత్తిడికి గురిచేయడం, పరిస్థితికి అనుగుణంగా ఆడటం వంటివి చాలా ముఖ్యమైనవి. ఈ సిరీస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాము. భవిష్యత్తులో అవి కచ్చితంగా ఉపయోగపడతాయి. మా జట్టులో చాలా మంది కుర్రాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఇదే తొలిసారి.వారు కూడా లా అనుభవాన్ని పొందారు. ఈ సిరీస్‌తో టీమ్‌లో టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని ప్రపంచానికి చూపించాము. కుర్రాళ్లు గెలవలేదని నిరాశతో ఉన్నారు. కానీ ఈ ఓటమిని నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకుంటారు. ఇక విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు అభినందనలు. వారు కూడా అద్బుతంగా పోరాడరని" పోస్ట్‌మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో బుమ్రా పేర్కొన్నాడు. He was devastating at times, so it's no surprise to see Jasprit Bumrah named the NRMA Insurance Player of the Series. #AUSvIND pic.twitter.com/7qFlYcjD2d— cricket.com.au (@cricketcomau) January 5, 2025 -
డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా! తొలిసారి భారత్ మిస్
టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్-2025 ఫైనల్(WTC Final) ఆశలు ఆడియాశలు అయ్యాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ నిష్క్రమించింది.టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. 2019-21 సైకిల్లో టీమిండియా 70 విన్నింగ్ శాతంతో తొట్ట తొలి సీజన్లో భారత్ ఫైనల్‌కు ఆర్హత సాధించింది. కానీ విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో కివీస్ చేతిలో ఓటమి చవిచూసింది.ఆ తర్వాత సైకిల్(2021-23)లో కూడా అద్బుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఫైనల్‌కు క్వాలిఫై అయింది. కానీ డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో మాత్రం తమ ఆధిపత్యాన్ని భారత్ కొనసాగించలేకపోయింది. ఈ సీజన్లో 19 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 9 విజయాలు, 8 ఓటములను చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో 50 విన్నింగ్ శాతంతో మూడో స్ధానానికే రోహిత్ సేన పరిమితమైంది.ఫైనల్లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియాఇక ఈ విజయంతో ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హతసాధించింది. డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో 17 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్.. 11 విజయాలు, 4 ఓటములును నమోదు చేసింది. పాయింట్లపట్టికలో ఆస్ట్రేలియా 63.73 విన్నింగ్ శాతంతో రెండో స్ధానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.మరోవైపు దక్షిణాఫ్రికా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టింది. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ప్రోటీస్ ఆర్హత సాధించడం ఇదే తొలిసారి. ఇక జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా అమీతుమీ తెల్చుకోనున్నాయి.చదవండి: IND vs AUS: సిడ్నీ టెస్టులో ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ ఔట్ -
సిడ్నీ టెస్టులో ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ ఔట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా(Teamindia) ఓటమితో ముగించింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా బీజీటీ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకుంది.అంతేకాకుండా ఈ ఓటమితో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి భారత్ నిష్క్రమించింది. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా రెండోసారి.ఇక మ్యాచ్‌లో భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆసీస్ విజయం సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖావాజా(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ట్రావిస్ హెడ్(34), వెబ్‌స్టర్ ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ సాధించాడు. కాగా సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఫీల్డింగ్‌కు రాలేదు. బుమ్రా లేని లోటు స్పష్టంగా కన్పించింది.నిప్పులు చెరిగిన బోలాండ్.. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 157 పరుగులకు ఆలౌటైంది. 141/6 పరుగుల ఓవర్ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. అదనంగా కేవలం 16 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించిం భారత్ బ్యాటర్లలో రిషబ్ పంత్(61) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ నిప్పులు చెరిగాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మొత్తంగా 10 వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు. దీంతో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా బోలాండ్ నిలిచాడు. అదే విధంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 32 వికెట్లు పడగొట్టి సత్తాచాటిన భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు దక్కింది. -
అసలేం చేస్తున్నారు.. అది క్షమించరాని నేరం: గవాస్కర్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 27 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆసీస్ చేధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కంగారులు సొంతం చేసుకున్నారు. కాగా టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గాయం కారణంగా మూడో రోజు ఫీల్డింగ్‌కు దిగలేదు. బుమ్రా లేని లోటు భారత బౌలింగ్ ఎటాక్‌లో స్పష్టంగా కన్పించింది.తొలి రెండో ఓవర్లలోనే భారత పేసర్లు ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నారు. అందులో 12 పరుగులు ఎక్స్‌ట్రాస్ రూపంలో వచ్చినవే కావడం గమనార్హం. ముఖ్యంగా భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన రిథమ్‌ను కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు.తొలి ఓవర్ వేసిన సిరాజ్ 13 పరుగులిచ్చాడు. ఈ నేపథ్యంలో సిరాజ్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శల వర్షం కురిపించాడు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోవడంలో భారత బౌలర్ల తీరు నిరాశకు గురిచేసిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు."తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తన రిథమ్‌ను కోల్పోయాడు. చాలా అదనపు పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తం 15 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం ఆమోదయోగ్యం కాదు. ఈ స్థాయిలో ఆడుతున్నప్పుడు బౌలర్లు నో బాల్స్‌ను నియంత్రించగలగాలి.నో బాల్స్ వేయడం క్షమించరాని నేరం. ప్రొఫెషనల్ క్రికెటర్లు ఎప్పుడూ నో బాల్స్ వేయకూడదు. కొన్ని సార్లు నో బాల్‌లు, వైడ్లే గెలుపోటములు నిర్ణయిస్తాయి. మన వేగంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నించి వైడ్లు వేస్తున్నారు. కొంచెం లైన్ లెంగ్త్‌పై దృష్టి పెట్టాలి" అని గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: Jasprit Bumrah: 3 ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడు.. ఆ ఒక్కడిపైనే భారం! -
India vs Aus 5th test: సిడ్నీ టెస్టులో భారత్ చిత్తు.. బీజీటీ ఆసీస్‌దే
IND vs Aus 5th Test Day 3 Live updates and Highlights: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. అంతేకాకుండా ఈ ఓటమితో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి భారత్ నిష్క్రమించింది. ఇక మ్యాచ్‌లో భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 27 ఓవర్లలో4 వికెట్లు కోల్పోయి ఆసీస్ విజయం సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖావాజా(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ట్రావిస్ హెడ్(34), వెబ్‌స్టర్ ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.ఓటమి దిశగా భారత్..సిడ్నీ టెస్టులో టీమిండియా ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. 162 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా 25 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి ఇంకా 15 పరుగులు కావాలి.ఆసీస్ నాలుగో వికెట్ డౌన్.. ఖావాజా ఔట్ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన ఉస్మాన్ ఖావాజా.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆసీస్ విజయానికి ఇంకా 58 పరుగులు కావాలి.15 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 81/3ఆస్ట్రేలియా లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. 15 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(26 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్(8 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 91 పరుగులు కావాలి.లంచ్ బ్రేక్‌కు ఆసీస్ స్కోరంతంటే?లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(19 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్(5 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 91 పరుగులు కావాలి.ఆసీస్ మూడో వికెట్ డౌన్..ప్రస్దిద్ద్ కృష్ణ భారత్‌కు మరో వికెట్ అందించాడు. 4 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్.. జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 65/3. లబుషేన్ ఔట్..ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి స్టీవ్ స్మిత్ వచ్చాడు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 52/2. ఆసీస్ తొలి వికెట్ డౌన్సామ్ కాన్స్టాస్ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన కాన్స్టాస్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/1. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(5), మార్నస్ లబుషేన్ ఉన్నారు.భారత్‌కు భారీ షాక్..కాగా మూడో రోజులో ఆటలో బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. బౌలింగ్‌కు మాత్రం దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా బ్యాటింగ్ అనంతరం బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు.భారత్ ఆలౌట్..టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకు ఆలౌటైంది. 141 పరుగుల ఓవర్ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. అదనంగా కేవలం 16 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.దీంతో ఆస్ట్రేలియా ముందు 161 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఉంచగల్గింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 6 వికెట్లు పడగొట్టగా... కమ్మిన్స్ మూడు వికెట్లు తీశాడు. ఇక భారత్ బ్యాటర్లలో రిషబ్ పంత్(61) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.సుందర్ క్లీన్ బౌల్డ్..భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.భారత్ ఏడో వికెట్ డౌన్.. జడేజా ఔట్రవీంద్ర జడేజా రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన జడేజా.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 35 ఓవర్లకు భారత్ స్కోర్: 148/7మూడో రోజు ఆట ఆరంభం..సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది.ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌ను ప్యాట్ కమ్మిన్స్ ప్రారంభించాడు. భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. క్రీజులో రవీంద్ర జడేజా(8), వాషింగ్టన్ సుందర్(6) పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. మూడో రోజు ఆటలో పింక్ జెర్సీతో భారత్ బరిలోకి దిగింది. -
BGT: మూడు ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!
జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)... ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. దిగ్గజ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అందరూ ఇదే మాట చెబుతారనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా టీమిండియా పేస్ దళ నాయకుడిగా కొనసాగుతున్న బుమ్రా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 సిరీస్‌లోనూ భారమంతా తానే మోస్తున్నాడు. గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రాఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సారథిగా భారత్‌కు భారీ విజయం అందించిన బుమ్రా.. సిడ్నీ టెస్టు సందర్భంగా మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులంతా బుమ్రా నామసర్మణ చేస్తున్నారు. ఆసీస్‌తో ఆఖరి టెస్టు గండాన్ని గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రా మాత్రమే అని విశ్వసిస్తున్నారు. నిజానికి.. స్వదేశంలో జరిగే సిరీస్‌లలో టీమిండియా స్పిన్నర్లదే పైచేయి గా నిలుస్తుంది. కానీ విదేశీ గడ్డపై జరిగే సిరీస్‌లలో అక్కడి పిచ్‌లకు అనుగుణంగా పేస్ బౌలర్లు ప్రధాన పాత్ర వహిస్తారు. అయితే ఇక్కడే టీమిండియా మేనేజ్మెంట్ ముందు చూపుతూ వ్యవహరించడంలో విఫలమైందని చెప్పవచ్చు.షమీ ఉంటే బుమ్రాపై భారం తగ్గేదిఆస్ట్రేలియా వంటి ఎంతో ప్రాముఖ్యం గల సిరీస్ ముందుగా పేస్ బౌలర్లని పదును పెట్టడంలో బోర్డు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి గాయంతో దూరం కావడం భారత్ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. షమీ ఎంతో అనుభవజ్ఞుడు. పైగా ఆస్ట్రేలియాలో గతంలో రాణించి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. షమీ అండగా ఉన్నట్లయితే బుమ్రా పై ఇంతటి ఒత్తిడి ఉండేది కాదన్నది వాస్తవం.గతంలో బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ వంటి బౌలర్లు జట్టులో ఉన్నప్పుడు భారత్ పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండేది. మహమ్మద్ సిరాజ్ చాల కాలంగా జట్టులో ఉన్నప్పటికీ, నిలకడగా రాణించడం లో విఫలమయ్యాడనే చెప్పాలి.యువ బౌలర్లకు సరైన మార్గదర్శకత్వం ఏది?ఈ నేపధ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంతోమంది యువ బౌలర్లు రంగ ప్రవేశం చేస్తున్నప్పటికీ వారికి సరైన తర్ఫీదు ఇవ్వడంలోనూ.. సీనియర్ బౌలర్లు గాయాల బారిన పడకుండా వారిని సరైన విధంగా మేనేజ్ చేయడంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు విఫలమైంది. ఐపీఎల్ పుణ్యమా అని భారత్ క్రికెట్‌కు ప్రస్తుతం పేస్ బౌలర్ల కొరత లేదు. కానీ ఉన్నవారికి సరైన తర్ఫీదు ఇచ్చి వారు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో రాణించే విధంగా తీర్చిదిద్దడం కచ్చితంగా బోర్డుదే బాధ్యత. ఇటీవల కాలంలో ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్, నవదీప్ సైనీ, శార్దూల ఠాకూర్, అర్షదీప్ సింగ్, వరుణ్ ఆరోన్, టి నటరాజన్ వంటి అనేక మంది యువ బౌలర్లు ఐపీఎల్ క్రికెట్ లో రాణిస్తున్నారు. వారికి భారత్ క్రికెట్ జట్టు అవసరాలకి అనుగుణంగా సరైన రీతిలో తర్ఫీదు ఇస్తే బాగుంటుంది.వాళ్లకు అనుభవం తక్కువఇక తాజా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు బుమ్రా, సిరాజ్‌లతో పాటు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఎంపికయ్యారు. అయితే, ఈ ముగ్గురూ అదనపు పేసర్లుగా అందుబాటులో ఉన్నప్పటికీ బుమ్రా, సిరాజ్‌లపైనే భారం పడింది. అయితే, సిరాజ్ నిలకడలేమి కారణంగా బుమ్రా ఒక్కడే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.నిజానికి.. బుమ్రా ఈ సిరీస్ లో సంచలనం సృష్టించాడు. ఒంటి చేత్తో తొలి టెస్టులో భారత జట్టుకి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్‌లో ఇంతవరకు 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.మూడు మార్లు ఐదు కన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్‌లో అధిగమించడం విశేషం. అయితే, ఆఖరిదైన సిడ్నీ టెస్టులో భాగంగా శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. అయితే, మైదానం నుంచి నిష్క్రమించే ముందు బుమ్రా కీలకమైన ఆస్ట్రేలియన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ని అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు.చివరి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌పై అనిశ్చితి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరుగుతున్న ఐదవ మరియు చివరి టెస్టులో రెండో రోజు ఆటలో అసౌకర్యానికి గురైన బుమ్రా మ్యాచ్ మధ్యలో వైదొలిగాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. మ్యాచ్ అనంతరం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ బుమ్రా పరిస్థితిపై వివరణ ఇచ్చాడు. బుమ్రా పరిస్థితిని భారత వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నాడు. "జస్ప్రీత్ బుమ్రాకు వెన్నునొప్పి ఉంది. వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది" అని వ్యాఖ్యానించాడు.3 ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడునిజానికి 2024 నుంచి ఇప్పటి దాకా(జనవరి 4) టెస్టుల్లో అత్యధిక బంతులు బౌల్ చేసింది బుమ్రానే. ఏకంగా 367 ఓవర్లు అంటే.. 2202 బాల్స్ వేసింది అతడే!.. ఈ విషయంలో బుమ్రా తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్(1852 బాల్స్) ఉన్నాడు.ఇక బుమ్రా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 908 బంతులు వేశాడు. అంటే 151.2 ఓవర్లు అన్నమాట. ఇది ఐపీఎల్ మూడు సీజన్లలో ఒక బౌలర్ వేసే ఓవర్లకు దాదాపు సమానం. ఐపీఎల్లో 14 లీగ్ మ్యాచ్‌లు ఆడి.. ప్రతి మ్యాచ్‌లోనూ నాలుగు ఓవర్ల కోటాను బౌలర్ పూర్తి చేశాడంటే.. మూడు సీజన్లు కలిపి అతడి ఖాతాలో 168 ఓవర్లు జమవుతాయి. అదే.. 13 మ్యాచ్‌లు ఆడితే 156 ఓవర్లు. అదీ సంగతి. ఇంతటి భారం పడితే ఏ పేసర్ అయినా గాయపడకుండా ఉంటాడా? ఇందుకు బోర్డు బాధ్యత వహించనక్కర్లేదా?!చదవండి: నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా -
నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ప్రశంసలు కురిపించాడు. నిజమైన, దిగ్గజ నాయకుడు అంటూ హిట్‌మ్యాన్‌ను కొనియాడాడు. జట్టు ప్రయోజనాల కోసం తనంతట తానుగా తప్పుకోగలిగిన నిస్వార్థపరుడంటూ రోహిత్ శర్మకు కితాబులిచ్చాడు.ఐదు టెస్టుల సిరీస్స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన రోహిత్ సేన.. తదుపరి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. అయితే, పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ దూరం కాగా.. అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) కెప్టెన్‌గా వ్యవహరించాడు.ఈ మ్యాచ్‌లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే, రెండో టెస్టు నుంచి జట్టుతో చేరిన రోహిత్ శర్మ.. బ్యాటర్‌గా, సారథిగా విఫలమయ్యాడు. అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ టెస్టుల్లో కలిపి కేవలం 31 పరుగులే చేసిన రోహిత్.. వీటిలో ఒక్క మ్యాచ్‌లోనూ టీమిండియాను గెలిపించలేకపోయాడు. ఫలితంగా సిరీస్‌లో భారత జట్టు 1-2తో వెనుకబడింది.చావో రేవో తేల్చుకునేందుకుఈ క్రమంలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఐదో టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే సిరీస్‌ను డ్రా చేసుకోవడం సహా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2025 అవకాశాలను భారత్ సజీవం చేసుకోగలుగుతుంది.ఇంతటి కీలక మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్టులో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఫామ్‌లేమి దృష్ట్యా స్వయంగా తుదిజట్టు నుంచి తప్పుకొని.. శుబ్‌మన్ గిల్‌కు లైన్ క్లియర్ చేశాడు. ఈ విషయం గురించి తాత్కాలిక కెప్టెన్ బుమ్రా మాట్లాడుతూ.. జట్టు ప్రయోజనాల కోసమే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు.డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఇక జట్టులో స్థానం లేకపోయినా.. సిడ్నీ టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ డగౌట్లో చురుగ్గా కనిపించాడు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఆటగాళ్ల దగ్గరికి వచ్చి వ్యూహాల గురించి చర్చించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సురేశ్ రైనా షేర్ చేస్తూ.. రోహిత్ శర్మ వ్యక్తిత్వాన్ని కొనియాడాడు.నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్‘‘తన నిజాయితీ, నిస్వార్థగుణం ద్వారా నాయకుడంటే ఎలా ఉండాలో రోహిత్ శర్మ నిరూపిస్తున్నాడు. వ్యక్తిగతంగా కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలోనూ.. జట్టు విజయానికే అతడు మొదటి ప్రాధాన్యం ఇచ్చాడు. అవసరమైన సమయంలో స్వయంగా తానే తప్పుకొన్నాడు.టీమిండియా జోరుఈ టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ భారత జట్టు సక్సెస్ కోసం కనబరుస్తున్న అంకిత భావం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆటలో అతడొక నిజమైన దిగ్గజం’’ అని సురేశ్ రైనా రోహిత్ శర్మను ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టులో టీమిండియా జోరు కనబరుస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బుమ్రా సేన.. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో ఆసీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, నితీశ్ రెడ్డి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఇక శనివారం నాటి రెండో రోజు పూర్తయ్యేసరికి తమ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలిపి ఆసీస్ కంటే 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజు గనుక కాస్త ఓపికగా ఆడి.. కనీసం మరో వంద పరుగులు జమచేస్తే ఆతిథ్య జట్టు ముందు మెరుగైన లక్ష్యం ఉంచగలుగుతుంది. రెండో రోజు ఆట ముగిసేసరికి క్రీజులో ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా(8*), వాషింగ్టన్ సుందర్(6*)లపైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది.చదవండి: IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'Rohit Sharma exemplifies leadership through honesty and selflessness. Despite personal challenges, he prioritizes team success, stepping aside when necessary. His leadership in the current Test series reflects his unwavering dedication to India’s success. A true legend of the… pic.twitter.com/L3rPlMlRT6— Suresh Raina🇮🇳 (@ImRaina) January 4, 2025 -
దిగ్గజ క్రికెటర్ సరసన పంత్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇద్దరు మాత్రమే..!
టీమిండియా డైనమిక్ బ్యాటర్ రిషబ్ పంత్ వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ సరసన చేరాడు. సిడ్నీ టెస్ట్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన పంత్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 160 ప్లస్ స్ట్రయిక్‌రేట్‌తో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్‌ల్లో పంత్, రిచర్డ్స్ చెరో రెండు సార్లు 160 ప్లస్ స్ట్రయిక్‌రేట్‌తో హాఫ్ సెంచరీలు చేశారు. టెస్ట్ క్రికెట్లో మరే ఇతర బ్యాటర్ ఈ స్థాయి స్ట్రయిక్‌రేట్‌తో రెండు హాఫ్ సెంచరీలు చేయలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. సహచర ఆటగాళ్లు ఒక్కో పరుగు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న చోట పంత్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ రాణించకపోయుంటే టీమిండియా పరిస్థితి ఘోరంగా ఉండేది. పంత్ సునామీ ఇన్నింగ్స్ పుణ్యమా అని భారత్ ఓ మోస్తరు లక్ష్యాన్ని అయినా ఆసీస్ ముందుంచగలుగుతుంది.రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (22), కేఎల్ రాహుల్ (13), శుభ్‌మన్ గిల్ (13), విరాట్ కోహ్లి (6), రిషబ్ పంత్ (61), నితీశ్ కుమార్ రెడ్డి (4) ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (8), వాషింగ్టన్ సుందర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. పాట్ కమిన్స్, బ్యూ వెబ్‌స్టర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ప్లేయర్ బ్యూ వెబ్‌స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించగా.. స్టీవ్ స్మిత్ (33), సామ్ కొన్‌స్టాస్ (22), అలెక్స్ క్యారీ (21), పాట్ కమిన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. ఉస్మాన్ ఖ్వాజా (2), లబూషేన్ (2), ట్రవిస్ హెడ్ (4), మిచెల్ స్టార్క్ (1), బోలాండ్ (9) విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. పంత్ (40) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో బుమ్రా (22) కూడా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (20), యశస్వి జైస్వాల్ (10), విరాట్ కోహ్లి (17), రవీంద్ర జడేజా (26), వాషింగ్టన్ సుందర్ (14) రెండంకెల స్కోర్లు చేయగా.. కేఎల్ రాహుల్ (4), నితీశ్ కుమార్ రెడ్డి (0), ప్రసిద్ద్ కృష్ణ (3) సింగిల్ డిజిట్ స్కోర్లకే నిష్క్రమించారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, ప్టార్క్ 3, కమిన్స్ 2, లియోన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) బీభత్సం సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో టీ20ను తలపించేలా బ్యాటింగ్ చేశాడు. భారత్ 59 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్.. ఎదురుదాడికి దిగాడు.ప్రత్యర్ధి బౌలర్లను ఈ ఢిల్లీ ఆటగాడు ఉతికారేశాడు. కేవలం 33 బంతులు ఎదుర్కొన్న పంత్ 184.85 స్ట్రైక్ రేట్‌తో 61 పరుగులు సాధించి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ప్రస్తుతం టీమిండియా 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేసిన పంత్‌పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కష్టమైన వికెట్‌పై రిషబ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడని సచిన్ కొనియాడు."సిడ్నీలో రిషబ్ పంత్ విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ కఠినమైన వికెట్‌పై మిగితా బ్యాటర్లు 50 కంటే తక్కువ స్ట్రైక్ రేటుతో ఆడితే.. పంత్ మాత్రం ఏకంగా 184 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. ఇది నిజంగా నమ్మశక్యం కానిది. తొలి బంతి నుంచే ఆస్ట్రేలియా బౌలర్లను అతడు టార్గెట్ చేశాడు. పంత్ ఎప్పుడూ తన బ్యాటింగ్‌తో అందరిని అలరిస్తూ ఉంటాడు. అతడు ఇన్నింగ్స్ ఎంతో ప్రభావం చూపుతోందని" సచిన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ సహా యాజమాని పార్ధ్ జిందాల్ సైతం రిషబ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తుమ టెస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అని అతడు ప్రశంసించాడు.కాగా ఐపీఎల్లో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ వరకు ఢిల్లీకే ప్రాతినిథ్యం వహించిన పంత్.. ఈ సారి లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడనున్నాడు. రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో పంత్‌ను సొంతం చేసుకుంది. On a wicket where majority of the batters have batted at a SR of 50 or less, @RishabhPant17's knock with a SR of 184 is truly remarkable. He has rattled Australia from ball one. It is always entertaining to watch him bat. What an impactful innings!#AUSvIND pic.twitter.com/rU3L7OL1UX— Sachin Tendulkar (@sachin_rt) January 4, 2025 Introducing to you the greatest Indian test wicketkeeper batsman in our history come on @RishabhPant17 come on India!— Parth Jindal (@ParthJindal11) January 4, 2025 -
వారెవ్వా!.. యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు
సిడ్నీ టెస్టు సందర్భంగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన భారత్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)తో టీమిండియా ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో గెలిచిన భారత్.. అనంతరం అడిలైడ్‌లో ఓడి, బ్రిస్బేన్‌లో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అనంతరం మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. 1-2తో వెనుకబడింది.ఈ క్రమంలో చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా ఆసీస్‌తో ఈ సిరీస్‌లో ఆఖరిదైన ఐదో టెస్టు శుక్రవారం మొదలుపెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కంగారూలను 181 పరుగులకే కట్టడి చేసి.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.స్టార్క్‌కు చుక్కలు చూపించిన జైసూఇక వచ్చీ రావడంతో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)కు చుక్కలు చూపించాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన అతడి బౌలింగ్‌లో చితకబాదాడు. మొదటి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయిన జైసూ.. తర్వాత వరుసగా మూడు బంతులను బౌండరీకి తరలించాడు. తద్వారా పన్నెండు పరుగులు పించుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఐదో బంతిని వదిలేశాడు.మళ్లీ ఓవర్లో ఆఖరి బంతికి మాత్రం జైస్వాల్ తన ప్రతాపం చూపించాడు. వైడ్ ఆఫ్ దిశగా వచ్చిన బంతిని ఎక్స్ ట్రా కవర్ వేదికగా ఫోర్ బాదాడు. ఈ క్రమంలో మొదటి ఓవర్లోనే జైస్వాల్ పదహారు పరుగులు రాబట్టాడు. తద్వారా టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు(ఆరు బంతుల్లో 16 పరుగులు) చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్అంతకుముందు 2005లో వీరేంద్ర సెహ్వాగ్ తొలి ఓవర్లో 13 పరుగులు రాబట్టాడు. అనంతరం.. 2023లో రోహిత్ శర్మ సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా జైస్వాల్ వీరిద్దరి పేరిట సంయుక్తంగా ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు జైస్వాల్. టెస్టుల్లో తొలి ఓవర్లోనే నాలుగు ఫోర్లు బాదిన క్రికెటర్‌గా మైకేల్ స్లాటర్, క్రిస్ గేల్ సరసన నిలిచాడు.టెస్టుల్లో తొలి ఓవర్లోనే అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్లుగా ప్రపంచ రికార్డు👉మైకేల్ స్లాటర్- 2001లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- బర్మింగ్‌హామ్- నాలుగు ఫోర్లు- 18 పరుగులు👉క్రిస్ గేల్- 2012లో వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, ఆంటిగ్వా- నాలుగు ఫోర్లు- 16 పరుగులు👉యశస్వి జైస్వాల్- 2024లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, సిడ్నీ- నాలుగు ఫోర్లు- 16 పరుగులు.పంత్ దూకుడు.. రెండో రోజు పరిస్థితి ఇదీఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి టీమిండియా 32 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన నాలుగు పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఓవరాల్‌గా 145 పరుగుల లీడ్‌లో ఉంది. జైస్వాల్ 35 బంతుల్లో 22 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్(13), శుబ్‌మన్ గిల్(13), విరాట్ కోహ్లి(6) మరోసారి విఫలమయ్యారు.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న రిషభ్ పంత్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 29 బంతుల్లోనే యాభై పరుగులతో మెరుపు అర్ధ శతకం సాధించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 61 పరుగులు చేశాడు. కమిన్స్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.ఇక పంత్ అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ నెమ్మదించింది. నితీశ్ రెడ్డి నాలుగు పరుగులకే నిష్క్రమించగా.. రవీంద్ర జడేజా(39 బంతుల్లో 8), వాషింగ్టన్ సుందర్(17 బంతుల్లో 6) పరుగులతో అజేయంగా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, కమిన్స్, బ్యూ వెబ్‌స్టర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: IND vs AUS: పంత్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డుSometimes JaisWall, sometimes JaisBall! 🔥Another #YashasviJaiswal 🆚 #MitchellStarc loading? 🍿👀#AUSvINDOnStar 👉 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/W4x0yZmyO9— Star Sports (@StarSportsIndia) January 4, 2025 -
మొదట్లో అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు: భారత మాజీ క్రికెటర్
యువ పేసర్ ప్రసిద్ కృష్ణ సేవలను ఉపయోగించుకోవడంలో టీమిండియా యాజమాన్యం విఫలమైందని భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ అన్నాడు. ఫామ్‌లో ఉన్న బౌలర్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని మూర్ఖపు చర్యగా అభివర్ణించాడు. వేరొకరిని తుదిజట్టులో ఆడించడం కోసం ప్రసిద్‌ను పక్కనపెట్టడం సరికాదని పేర్కొన్నాడు. కాగా 2023లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు 28 ఏళ్ల ప్రసిద్(Prasidh Krishna).షమీ లేకపోవడంతోకర్ణాటకకు చెందిన ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చి.. రెండు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ టెస్టు జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. అయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)కి సీనియర్ పేసర్ మహ్మద్ షమీ దూరమైన కారణంగా ప్రసిద్‌కు మరోసారి టెస్టు జట్టులో చోటు దక్కింది.పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో పాటు యువ ఆటగాళ్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్‌లతో కలిసి ఫాస్ట్ బౌలర్ల విభాగంలో ప్రసిద్ స్థానం సంపాదించాడు. అయితే, బుమ్రా, సిరాజ్‌లతో పాటు హర్షిత్ రాణాకు మేనేజ్మెంట్ ప్రాధాన్యం ఇచ్చింది. పెర్త్ వేదికగా అతడికి అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. ఫలితంగా ప్రసిద్ కృష్ణకు మొండిచేయి ఎదురైంది.ఆకాశ్ దీప్ గాయం కారణంగాఇక ఆసీస్‌తో తొలి టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన హర్షిత్ రాణా.. అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో మాత్రం తేలిపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలో హర్షిత్‌పై వేటు వేసిన యాజమాన్యం.. తర్వాతి రెండు టెస్టుల్లో ఆకాశ్ దీప్‌ను ఆడించింది. దీంతో మరోసారి ప్రసిద్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.అయితే, కీలకమైన ఐదో టెస్టుకు ముందు ఆకాశ్ గాయపడటంతో ప్రసిద్ కృష్ణకు ఎట్టకేలకు తుదిజట్టులో చోటు దక్కింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ ఆఖరి టెస్టులో ప్రసిద్ మెరుగ్గా రాణించాడు. స్టీవ్ స్మిత్(33), అలెక్స్ క్యారీ(21), బ్యూ వెబ్‌స్టర్(57) రూపంలో మూడు కీలక వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు.అనధికారిక సిరీస్‌లోనూ సత్తా చాటిమొత్తంగా 15 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 42 పరుగులే ఇచ్చి ఇలా విలువైన వికెట్లు తీసి.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 181 పరుగులకే ఆలౌట్ చేయడంలో ప్రసిద్ తన వంతు పాత్ర పోషించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. తన సత్తా ఏమిటో చాటుకోగలిగాడు. అంతేకాదు.. అంతకు ముందు భారత్-‘ఎ’ తరఫున ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో అనధికారిక సిరీస్‌లోనూ ప్రసిద్ కృష్ణ పది వికెట్లతో మెరిశాడు.తప్పు చేశారుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కర్ణాటకకు చెందిన దొడ్డ గణేశ్ స్పందిస్తూ.. ‘‘టెస్టు సిరీస్ మొదలుకావడానికి ముందు భారత్-‘ఎ’ తరఫున అతడి ప్రదర్శన ఎలా ఉందో చూసిన తర్వాత కూడా.. ప్రసిద్‌ను కాదని హర్షిత్ రాణాను ఎంపిక చేయడం బుర్రలేని పని. ప్రసిద్ మంచి రిథమ్‌లో ఉన్నాడు. అయినా సరే.. సిరీస్ ఆరంభం నుంచి అతడిని తుదిజట్టులోకి తీసుకోకుండా మేనేజ్మెంట్ తప్పుచేసింది’’ అని పేర్కొన్నాడు.కాగా సిడ్నీ వేదికగా శుక్రవారం మొదలైన ఐదో టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లొ 185 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఆసీస్‌ను 181 పరుగులకే కుప్పకూల్చి నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. అనంతరం శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 32 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి బారత్ 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకొని ఆసీస్ కంటే 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: IND vs AUS: పంత్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు -
అస్సలు ఏమైంది కోహ్లి నీకు..? మళ్లీ అదే బంతికి ఔట్! వీడియో
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శనతో ముగించాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టు(ఐదో టెస్టు)లోనూ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 17 పరుగులు మాత్రమే చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తీరును కనబరిచాడు.కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కింగ్ కోహ్లి మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి దొరికిపోయాడు. విరాట్ కోహ్లి వీక్నెస్ను బోలాండ్ మళ్లీ క్యాష్ చేసుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన బోలాండ్ తొలి బంతిని కోహ్లి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి సంధించాడు.ఆ బంతిని హార్డ్ హ్యాండ్స్‌తో కోహ్లి డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో సెకెండ్ స్లిప్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ ఈజీ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో విరాట్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ సిరీస్‌లో కోహ్లి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకు ఔట్ కావడం ఇది ఎనిమిదో సారి కావడం గమనార్హం. కాగా ఒకప్పుడు ఆఫ్ సైడ్ బంతులను అద్భుతంగా ఆడే కోహ్లి.. ఇప్పుడే అదే బంతులకు తన వికెట్‌ను కోల్పోతుండడం అభిమానులను నిరాశపరుస్తోంది. ఏమైంది కోహ్లి నీకు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.కాగా ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన టెస్టు రికార్డు ఉన్న విరాట్.. ఈసారి మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. కేవలం 190 పరుగులు చేశాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన కోహ్లి.. తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లోనూ తీవ్ర నిరాశపరిచాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: Bumrah-Konstas: పిచ్చి పనులు మానుకోండి: రోహిత్ శర్మ ఆగ్రహంThe Scott Boland show is delivering at the SCG!He's got Virat Kohli now. #AUSvIND pic.twitter.com/12xG5IWL2j— cricket.com.au (@cricketcomau) January 4, 2025 -
పంత్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) తన విశ్వరూపాన్ని చూపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోశాడు. అప్పటివరకు నిప్పులు చెరిగిన ఆసీస్ ఫాస్ట్ బౌలర్ల దూకుడుకు పంత్ కళ్లేం వేశాడు.తన ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన పంత్.. ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ అభిమానుల అలరించాడు. ఈ క్రమంలో కేవలం 29 బంతుల్లోనే ఈ ఢిల్లీ డైనమెట్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా 33 బంతులు ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా భారత టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇది రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. కాగా ఈ జాబితాలో రిషబ్‌నే తొలి స్ధానంలో ఉన్నాడు. 2022లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పంత్ కేవలం 28 బంతుల్లో ఆర్ధ శతకం సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన పంత్.. ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.తొలి ప్లేయర్‌గా రికార్డు..ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన పర్యాటక బ్యాటర్‌గా రిషబ్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రాయ్ ఫ్రెడెరిక్స్ పేరిట ఉండేది. వీరిద్దరూ ఆస్ట్రేలియాలో 33 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. తాజా మ్యాచ్‌తో ఈ దిగ్గజాల ఆల్‌టైమ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 26 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 132 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది. Aate hi RISHABH-PANTI shuru! 🔥When @RishabhPant17 steps in, the entertainment level goes 𝗨𝗽&𝗨𝗽 📈#AUSvINDOnStar 👉 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/tiJiuBOEDO— Star Sports (@StarSportsIndia) January 4, 2025 -
Bumrah-Konstas: పిచ్చి పనులు మానుకోండి: రోహిత్ శర్మ ఫైర్
టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ఎంతో హుందాగా ఉంటారని కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అన్నాడు. కానీ అదే పనిగా సహనాన్ని పరీక్షిస్తే మాత్రం ప్రత్యర్థులకు చేదు అనుభవం తప్పదని పేర్కొన్నాడు. తమ జోలికి వచ్చిన వాళ్లకు సరైన రీతిలో బదులివ్వడంలో ఎలాంటి తప్పులేదని బుమ్రా సేనను సమర్థించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతున్న విషయం తెలిసిందే.ఈ సిరీస్‌లో ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఓడిపోయి, ఒక టెస్టు డ్రా చేసుకున్న టీమిండియా.. 1-2తో వెనుకబడి ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం సిడ్నీ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు మొదలైంది. గెలిస్తేనే కనీసం డ్రాఇందులో గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను కనీసం డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఫామ్‌లేమి, వరుస ఓటముల నేపథ్యంలో రోహిత్ శర్మ విశ్రాంతి పేరిట తనంతట తానే సిడ్నీ టెస్టు నుంచి తప్పుకొన్నాడు.ఈ నేపథ్యంలో పెర్త్‌లో తొలి టెస్టుకు టీమిండియాకు సారథ్యం వహించిన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మరోసారి పగ్గాలు చేపట్టాడు. ఇక ఐదో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆటలో భాగంగా 185 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26), జస్ప్రీత్ బుమ్రా(22), శుబ్‌మన్ గిల్(20) రాణించారు.బుమ్రాపైకి దూసుకు వచ్చిన ఆసీస్ బ్యాటర్ఈ క్రమంలో తొలిరోజే ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలుపెట్టగా యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) కాస్త అతి చేశాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనే సమయంలో కాస్త ఆగమని చెప్పాడు. ఇందుకు బుమ్రా కాస్త అసహనంగా కదలగా.. కొన్‌స్టాస్ ఏంటీ అన్నట్లుగా బుమ్రా వైపు దూసుకువచ్చాడు. దీంతో బుమ్రా కూడా బదులిచ్చేందుకు సిద్ధం కాగా.. అంపైర్ జోక్యం చేసుకుని నచ్చజెప్పాడు.అనంతరం బౌలింగ్ చేసిన బుమ్రా ఖవాజా వికెట్ తీసి .. కొన్‌స్టాస్‌తో.. ‘‘చూశావా? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటదో?’’ అన్నట్లు తన ముఖకవళికల ద్వారా మనసులోని భావాలను కాస్త దూకుడుగానే వ్యక్తం చేశాడు. అలా ఆఖరి బంతికి వికెట్ తీసి టీమిండియా తొలిరోజు ఆట ముగించింది.ఈ ఘటనపై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. బ్రాడ్కాస్టర్లతో మాట్లాడుతున్న సమయంలో బుమ్రా- కొన్‌స్టాస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘మా వాళ్లు నిర్ణీత సమయం వరకు ఓపికపడతారు. కానీ సహనాన్ని పరీక్షించాలని చూస్తే మాత్రం ఊరుకోరు.పిచ్చి పనులు మానుకోండిఅనవసరంగా గొడవ పెట్టుకోవాలని చూస్తే.. అంతే ధీటుగా బదులిస్తారు. మేము ఇక్కడకు వచ్చింది క్రికెట్ ఆడటానికి మాత్రమే’’ అని బుమ్రా చర్యను సమర్థించాడు. అంతేకాదు.. ‘‘దయచేసి ఇలా చెత్తగా వ్యవహరించకండి. పిచ్చి పనులు మానుకోండి. ఇలాంటివి చూడటానికి అస్సలు బాగోదు’’ అంటూ కంగారూలకు రోహిత్ కౌంటర్ ఇచ్చాడు.అదే విధంగా.. ‘‘మా వాళ్లు క్లాసీగా ఉంటారు. ఆటపైనే వారి దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది. ఇక శుక్రవారం ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచడంలో సఫలమై వికెట్ తీయడం సంతోషకరం’’ అని రోహిత్ శర్మ తమ జట్టును అభినందించాడు. చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. 46 ఏళ్ల రికార్డు బద్దలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) తన అద్బుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులోనూ బుమ్రా సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను మరోసారి దెబ్బతీశాడు.అయితే గాయం కారణంగా బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. తొడ కండరాల పట్టేయడంతో ఆట మధ్యలోనే బుమ్రా మైదానాన్ని వీడాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను ఔట్ చేసిన బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.46 ఏళ్ల రికార్డు బద్దలు..ఆస్ట్రేలియా గడ్డపై ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో బుమ్రా ఇప్పటివరకు 32 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ పేరిట ఉండేది.1977/78 సీజన్లో ఆసీస్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో బేడీ 31 వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్‌తో బేడీ 46 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.చదవండి: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన.. -
టీమిండియాకు భారీ షాక్.. ఆస్పత్రికి జస్ప్రీత్ బుమ్రా
సిడ్నీ టెస్టులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టాండింగ్ కెప్టెన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. రెండో రోజు ఆటలో బుమ్రా తొడ కండరాలు పట్టేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు.అంతేకాకుండా ప్రాక్టీస్ జెర్సీ ధరించి స్కానింగ్ కోసం సిబ్బందితో కలిసి స్కానింగ్ కోసం ఆస్పత్రికి జస్ప్రీత్ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో భారత అభిమానుల ఆందోళన నెలకొంది.ఒకవేళ స్కానింగ్ రిపోర్ట్‌లో అతడి గాయం తీవ్రమైనదిగా తేలితే భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. అతడి గైర్హజరీలో విరాట్ కోహ్లి స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రెండో రోజు ఆట ఆరంభంలోనే లబుషేన్ వికెట్ పడగొట్టి భారత్‌కు బుమ్రా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.ఆసీస్ 181కు ఆలౌట్..ఇక సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 181 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.ఇక ఆసీస్ బ్యాటర్లలో వెబ్‌స్టర్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్(33), సామ్ కొన్‌స్టాస్(23) పరుగులతో రాణించారు. అంతకుముందు టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.చదవండి: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన.. -
రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన..
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) వైదొలగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఫామ్ లేమి కారణంగా రోహిత్ తనంతటతానే తప్పుకున్నాడని స్టాండింగ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ సమయంలో చెప్పుకొచ్చాడు.అయినప్పటికి జట్టు మెనెజ్‌మెంట్ కావాలనే రోహిత్‌పై వేటు వేసిందని, సిడ్నీ టెస్టు తర్వాత అతడు రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. స్వచ్ఛందంగా తనంతట తనే తప్పుకున్నాని రెండో రోజు లంచ్ సమయంలో బ్రాడ్క్రాస్టర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ చెప్పుకొచ్చాడు.బ్రాడ్ కాస్టర్లు: రోహిత్ మీరు సిడ్నీ టెస్టుకు దూరంగా ఉండడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మీరు విశ్రాంతి తీసుకున్నారని కొన్ని రిపోర్టులు చెబుతుండగా.. మరి కొన్ని నివేదికలు మిమ్మల్ని జట్టు నుంచి తప్పించారని పేర్కొంటున్నాయి. ఇందులో ఏది నిజం?రోహిత్ శర్మ: నన్ను జట్టు నుంచి తప్పించారని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. ఇది పూర్తిగా నా సొంత నిర్ణయమే. ప్రస్తుతం నేను పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాను. నేను ఫామ్‌లో కూడా లేను. ఫామ్‌లో లేని ఆటగాళ్లు జట్టుకు భారం కాకుడదు. సిడ్నీ టెస్టు మాకు చాలా కీలకం. కాబట్టి ఇన్ ఫామ్ బ్యాటర్‌కు అవకాశమివ్వాలనుకున్నాను.ఇదే విషయం కోచ్, చీఫ్ సెలెక్టర్‌తో చర్చించాను. ఆ తర్వాతే జట్టును ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. అదే విధంగా తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలపై కూడా హిట్‌మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు."ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నంత మాత్రాన నేను రిటైర్మెంట్ ఇస్తున్నట్లు కాదు. ప్రస్తుతానికి రిటైర్మెంట్ ఆలోచన నా మనసులో లేదు. ప్రస్తుతం పరుగులు సాధించడానికి ఇబ్బంది పడుతున్నా. అంతమాత్రాన ఎప్పటికి ఇదే ఫామ్ కొనసాగదు కాదా? తిరిగి కమ్‌బ్యాక్ ఇస్తాన్న నమ్మకం నాకు ఉంది .అంతే తప్ప ఎవరో బయట కూర్చోని నా రిటైర్మెంట్ను డిసైడ్ చేయలేరు. నేను ఇద్దరి పిల్లల తండ్రిని, స్వంతంగా నా నిర్ఱయాలు తీసుకోగలను" అని రోహిత్ చెప్పుకొచ్చాడు. -
India vs Aus 5th test: ముగిసిన రెండో రోజు ఆట.. 145 పరుగుల లీడ్‌లో భారత్
India vs Aus 5th test day 2 live updates and highlights: సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది.ముగిసిన రెండో రోజు ఆట.. 145 పరుగుల లీడ్‌లో భారత్సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో రవీంద్ర జడేజా(8), వాషింగ్టన్ సుందర్(6) నాటౌట్‌గా ఉన్నారు.అంతకుముందు రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లోనే 61 పరుగులు చేసి పంత్ ఔటయ్యాడు. ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, వెబ్‌స్టర్ తలా వికెట్ సాధించారు. కాగా ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియానితీశ్ రెడ్డి(21 బంతుల్లో 4) రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. బోలాండ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ పెవిలియన్ చేరాడు. వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి రాగా.. జడేజా రెండు పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 129/6 (27.4). ఆసీస్ కంటే 133 పరుగుల ఆధిక్యంలో టీమిండియా.రిషబ్ పంత్ ఔట్..రిషబ్ పంత్ ధనధాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. కేవలం 31 బంతుల్లోనే 61 పరుగులు చేసిన పంత్.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 23 ఓవర్లకు భారత్ స్కోర్ 125-5. క్రీజులో జడేజా(2), నితీశ్ కుమార్ రెడ్డి(1) ఉన్నారు. భారత్ ప్రస్తుతం 129 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ..టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. పంత్ 61 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 22 ఓవర్లకు భారత్ స్కోర్: 124/2. టీమిండియా ప్రస్తుతం 128 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.దూకుడుగా ఆడుతున్న పంత్..టీమిండియా వరుస క్రమంలో వికెట్లు పడతున్నప్పటికి రిషబ్ పంత్ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 18 బంతుల్లోనే 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 97/4. భారత్ ప్రస్తుతం 101 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.భారత్ నాలుగో వికెట్ డౌన్..శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన గిల్..వెబ్‌స్టర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు. 16 ఓవర్లకు భారత్ స్కోర్: 78/4భారత్ మూడో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి కోహ్లి ఔటయ్యాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ఆఫ్ సైడ్ బంతిని వెంటాడి మరి కోహ్లి ఔటయ్యాడు. 14 ఓవర్లకు భారత్ స్కోర్ 68/3. క్రీజులో గిల్(13), రిషబ్ పంత్(7) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన టీమిండియాబోలాండ్ మరోసారి టీమిండియాను దెబ్బకొట్టాడు. తొలుత ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను బౌల్డ్ చేసిన ఈ పేస్ బౌలర్.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(22)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 47/2 (9.5). గిల్ ఐదు పరుగులతో ఉన్నాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. టీమిండియా స్కోరు: 42/1 (7.3). శుబ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్ 22 పరుగులతో ఉన్నాడు.ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా స్కోరు: 36/0 (6)జైస్వాల్ 21, కేఎల్ రాహుల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.జైశ్వాల్ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్లో 16 పరుగులుభారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లో జైశ్వాల్ ఏకంగా 16 పరుగులు రాబట్టాడు.181 పరుగులకు ఆసీస్ ఆలౌట్..సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. భారత బౌలర్ల దాటికి ఆసీస్ తమ తొన్నింగ్స్‌లో 181 పరుగులకు కుప్పకూలింది. 9/1 ఓవర్ నైట్‌స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. అదనంగా 172 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఆసీస్ బ్యాటర్లలో వెబ్‌స్టర్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్(33), సామ్ కొన్‌స్టాస్(23) పరుగులతో రాణించారు.ఆసీస్ తొమ్మిదో వికెట్ డౌన్.. వెబ్‌స్టర్ ఔట్ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన వెబ్‌స్టర్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 48 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 170/9ఆసీస్ ఎనిమిదో వికెట్ డౌన్.. ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన స్టార్క్.. నితీశ్‌కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆసీస్ ఏడో వికెట్ డౌన్..ప్యాట్ కమ్మిన్స్ రూపంలో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన కమ్మిన్స్.. నితీశ్‌కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి మిచెల్ స్టార్క్ వచ్చాడు. 46 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 163/7. ప్రస్తుతం క్రీజులో వెబ్‌స్టర్(56 నాటౌట్), స్టార్క్(1) ఉన్నారు.ఆరో వికెట్ డౌన్.. క్యారీ ఔట్ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వచ్చాడు.నిలకడగా ఆడుతున్న వెబ్‌స్టర్, క్యారీ..లంచ్ బ్రేక్ అనంతరం వెబ్‌స్టర్, క్యారీ నిలకడగా ఆడుతున్నారు. 36 ఓవర్లు ముగిసే 5 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వెబ్‌స్టర్(37), క్యారీ(5) ఉన్నారు.లంచ్ బ్రేక్‌కు ఆసీస్ స్కోరంతంటే?రెండో రోజు లంచ్ విరామానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. క్రీజులో వెబ్‌స్టర్(28), క్యారీ(4) పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ డౌన్..ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన స్మిత్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అలెక్స్ క్యారీ వచ్చాడు.సిరాజ్ ఆన్ ఫైర్..మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బ తీశాడు. 12 ఓవర్ వేసిన సిరాజ్ రెండో బంతికి సామ్ కాన్స్టాస్ను ఔట్ చేయగా.. ఐదో బంతికి డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను పెవిలియన్‌కు పంపాడు. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/4. క్రీజులో వెబ్‌స్టర్(0), స్మిత్(4) ఉన్నారు.ఆసీస్ రెండో వికెట్ డౌన్..రెండో రోజు ఆట ఆరంభంలోనే ఆసీస్‌కు బిగ్ షాక్ తగిలింది. మార్నస్ లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన లబుషేన్.. బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 25/2. క్రీజులో సామ్ కాన్స్టాస్(18), స్మిత్(4) ఉన్నారు.రెండో రోజు ఆట ఆరంభం..సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత బౌలింగ్ ఎటాక్‌ను మహ్మద్ సిరాజ్ ప్రారంభించాడు. తొలి రోజు ఆట మగిసే సమయానికి ఆసీస్ వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది. -
తీరు మార్చుకోని కోహ్లికి రిటైర్మెంట్ తప్పదా..?
భారత్ బ్యాటర్లు తమ తప్పిదాల నుంచి పాఠం నేర్చుకుంటున్నట్టు లేదు. అదే పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఆస్ట్రేలియా బౌలర్ల అనాధిపత్యానికి తలొగ్గుతున్నారు. అత్యంత ప్రతిష్టాకరమైన చివరి టెస్ట్ లోనూ భారత్ బ్యాటర్లు మరోసారి చతికిలబడి మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌటయ్యారు. పేలవమైన ఫామ్ తో వరుసగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి వైదొలగి విశ్రాంతి తీసుకోగా మిగిలిన బ్యాటర్లు అదే తరహాలో బాధ్యతారహితంగా ఆడి తొలి రోజు నే తమ ప్రత్యర్థులకు ఆధిక్యాన్ని కట్టబెట్టారు.రోహిత్ శర్మ వైదొలిగినా భారత్ బ్యాటర్ల ఆటతీరుతో ఎలాంటి మార్పు రాలేదు. పిచ్‌ని అర్థం చేసుకొని నిలదొక్కుకొని ఆడేందుకు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇందుకు మాజీ కెప్టెన్, జట్టులోని సీనియర్ బాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ఎలాంటి మినహాయింపు లేదు. మ్యాచ్ కి ముందు చెమటోడ్చి ప్రాక్టీస్ చేసే కోహ్లీ, బ్యాటింగ్ దిగిన వెంటనే తన పాత పంధా నే అనుసరిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ప్రతిసారి అతను ఒకే తరహాలో ఔట్ కావడం నమ్మశక్యంగాని చేదు నిజం.ఎంతో అనుభవజ్ఞుడైన కోహ్లీ కూడా తన బ్యాటింగ్ లోపాలను సరిచేసుకునే ప్రయత్నం చేయకపోవడం శోచనీయం. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ అవుటైన తీరు చూస్తే టెస్ట్ క్రికెట్ లో ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల శకం ముగిసినట్లే అనిపిస్తోంది. ఎడమచేతి వాటం ఓపెనర్ యశస్వి జైస్వాల్ పది పరుగులు మాత్రం చేసి వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కోహ్లీ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినట్టు కనబడలేదు.కోహ్లీ మొదటి బంతికే వెనుదిరగాల్సింది. పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ పట్టుకొనే ప్రయత్నం లో విఫలమై గాల్లో విసిరివేయగా దానిని మార్నస్ లబుషేన్ పట్టుకున్నప్పటికీ మూడో అంపైర్ జోయెల్ విల్సన్ బంతి నేలను తాకినట్లు తేల్చాడు. ప్రారంభంలోనే ఈ అవకాశం లభించినా కోహ్లీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.69 బంతుల్లో కేవలం 17 పరుగులు చేసిన అనంతరం బోలాండ్ బౌలింగ్ లోనే ఆఫ్ స్టంప్ కి దూరంగా వెళ్తున్న బంతిని బాధ్యతారహితమైన షాట్ కొట్టబోయి మరో సారి స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 36 ఏళ్ళ కోహ్లీ ఈ తరహా లో ఔటవ్వడం ఇది ఆరోసారి. కోహ్లీ ఔటైన అనంతరం మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక రిటైర్ అవ్వడమే మేలని విమర్శకులు దుమ్మెత్తిపోశారు.రోహిత్ స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ ప్రారంభం లో బాగానే బ్యాటింగ్ చేసాడు. అయితే లంచ్‌కి ముందు చివరి బంతికి స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్ లో స్లిప్ల్స్ లో 20 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఈ సిరీస్ లో గిల్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు 20 పరుగులకి చేరుకున్నాడు. కానీ ఒక్కసారి కూడా 31 స్కోర్ ని దాటలేదు.వికెట్ కీపర్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఐదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ కి చేరుకోగలిగింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో ఉస్మాన్ ఖవాజా ని కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. భారత్ ని ఈ టెస్ట్‌లో గట్టికించే బాధ్యత మరో సారి బుమ్రా భుజస్కందాలపై ఉంది. -
భేష్.. ప్రాణం పెట్టి మరీ ఆడాడు: పంత్‌పై ప్రశంసలు
టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. ప్రాణం పెట్టి మరీ సిడ్నీ టెస్టులో జట్టును పటిష్ట స్థితిలో నిలిపేందుకు కృషి చేశాడని కొనియాడాడు. పదునైన బంతులు శరీరానికి గాయం చేస్తున్నా పట్టుదలగా నిలబడ్డ తీరు ప్రశంసనీయమని పేర్కొన్నాడు.చావో రేవోకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే 1-2తో వెనుకబడి ఉన్న భారత్.. చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా శుక్రవారం ఆఖరిదైన ఐదో టెస్టు మొదలుపెట్టింది.ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) సారథ్యంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు త్వరత్వరగానే పెవిలియన్ చేరారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4) పూర్తిగా విఫలం కాగా.. శుబ్‌మన్ గిల్(20) ఫర్వాలేదనిపించాడు.;పంత్ పోరాటంఅయితే, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి(17) మాత్రం మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant).. రవీంద్ర జడేజాతో కలిసి పోరాడే ప్రయత్నం చేశాడు. ఆసీస్ బౌలర్ల నుంచి దూసుకువస్తున్న బంతుల కారణంగా శరీరానికి గాయాలవుతున్నా.. పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 98 బంతులు ఎదుర్కొన్న పంత్ మూడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు.అయితే, దురదృష్టవశాత్తూ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో పంత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మిగిలిన వాళ్లలో జడ్డూ 26 పరుగులు చేయగా.. నితీశ్ రెడ్డి డకౌట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 14, ప్రసిద్ కృష్ణ 3, కెప్టెన్ బుమ్రా 22, సిరాజ్ 3* పరుగులు చేశారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది.అనంతరం ఆసీస్ బ్యాటింగ్‌కు దిగి ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి కేవలం తొమ్మిది పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. పంత్ పోరాట పటిమను ప్రశంసించాడు. ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ఆడాడు‘‘రిషభ్ పంత్ ఆట గురించి మనం చాలానే మాట్లాడేశాం. అయితే, ఐదో టెస్టులో మాత్రం అతడి అద్భుత, కీలకమైన ఇన్నింగ్స్‌ను కొనియాడకతప్పదు. అలాంటి పరిస్థితుల్లో అంతసేపు బ్యాటింగ్ చేయడం సులువుకాదు. భారత బ్యాటర్లలో ఒక్కరూ కనీసం 30 పరుగుల మార్కును చేరుకోలేదు. పంత్ ఒక్కడు మాత్రం 40 రన్స్‌తో టాప్ స్కోరర్ అయ్యాడు. పదే పదే బంతులు అతడి శరీరానికి తగిలాయి.అయినా.. సరే పంత్ వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటికే అతడిపై మానసికంగా ఒత్తిడి ఉంది. ఈ రోజు మ్యాచ్‌లో శరీరం కూడా గాయపడింది. అయినా అద్బుతంగా పోరాడాడు. అత్యద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ కొనియాడాడు. రోహిత్ దూరంకాగా ఆసీస్‌తో తొలి నాలుగు టెస్టుల్లో పంత్ నిరాశపరిచాడు. కుదురుకుంటాడనుకున్న సమయంలో నిర్లక్ష్యపు రీతిలో వికెట్ పారేసుకుని విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే, సిడ్నీ టెస్టులో మాత్రం అద్భుత పోరాటం కనబరిచాడు. ఈ మ్యాచ్‌కు విశ్రాంతి పేరిట రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! -
టీమిండియాతో ఐదో టెస్ట్.. స్కాట్ బోలాండ్ రికార్డు
సిడ్నీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ ఓ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టిన బోలాండ్ టెస్ట్‌ల్లో 50 వికెట్ల మైలురాయిని తాకాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో అతి పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. బోలాండ్ 35 ఏళ్ల 267 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. న్యూజిలాండ్‌కు చెందిన బెవాన్ కాంగ్‌డాన్ 37 ఏళ్ల 10 రోజుల వయసులో 50 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. బోలాండ్ 50వ టెస్ట్ వికెట్ నితీశ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో బోలాండ్ జోష్ హాజిల్‌వుడ్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చాడు. ఈ సిరీస్‌లో బోలాండ్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 15.46 సగటున 15 వికెట్లు పడగొట్టాడు. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ టెస్ట్‌లో బోలాండ్ ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బీజీటీలో బోలాండ్ ఐదో లీడింగ్ వికెట్‌టేకర్‌గా ఉన్నాడు. బోలాండ్ తన టెస్ట్ కెరీర్లో 13 మ్యాచ్‌లు ఆడి 50 వికెట్లు తీశాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది.సిడ్నీ టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. బోలాండ్ 4, మిచెల్ స్టార్క్ 3, పాట్ కమిన్స్ 2, నాథన్ లియోన్ ఓ వికెట్ తీసి టీమిండియా భరతం పట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రవీంద్ర జడేజా 26, జస్ప్రీత్ బుమ్రా 22, శుభ్‌మన్ గిల్ 20, విరాట్ కోహ్లి 17, వాషింగ్టన్ సుందర్ 14, యశస్వి జైస్వాల్ 10, కేఎల్ రాహుల్ 4, నితీశ్‌కుమార్ రెడ్డి 0, ప్రసిద్ద్ కృష్ణ 3, మహ్మద్ సిరాజ్ 3 (నాటౌట్) పరుగులు చేశారు. జస్ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్ చివర్లో మెరుపు ప్రదర్శన ఇవ్వడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (2) తొలి రోజు ఆటలో చివరి బంతికి ఔటయ్యాడు. సామ్ కొన్‌స్టాస్ (7) క్రీజ్‌లో ఉన్నాడు. ఖ్వాజా వికెట్ బుమ్రాకు దక్కింది. -
సిడ్నీలో భారత మాజీ క్రికెటర్‌కు అరుదైన గౌరవం.. మామగారి ‘స్వెటర్’తో వచ్చిన కోడలు(ఫొటోలు)
-
తప్పుడు నిర్ణయం.. రోహిత్‌నే పక్కన పెడతారా?
సిడ్నీ టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను తప్పించడం పట్ల భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సారథినే పక్కనపెట్టడం ద్వారా మేనేజ్మెంట్ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు ఇస్తోందని పేర్కొన్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇలాంటి సంఘటన మునుపెన్నడూ జరుగలేదంటూ బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో కంగారూ జట్టుతో తొలి టెస్టుకు పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ దూరమయ్యాడు. అతడి స్థానంలో భారత జట్టును ముందుండి నడిపించిన బుమ్రా.. పెర్త్ టెస్టులో విజయాన్ని అందించాడు.రోహిత్ శర్మ తిరిగి వచ్చిన తర్వాత అయితే, రెండో టెస్టు నుంచి రోహిత్ శర్మ తిరిగి వచ్చిన తర్వాత టీమిండియా వరుసగా వైఫల్యాలే ఎదురయ్యాయి. అడిలైడ్‌లో ఓడిపోయిన భారత్.. బ్రిస్బేన్‌లో డ్రా చేసుకున్నా.. మెల్బోర్న్లో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఫలితంగా సిరీస్‌లో 1-2తో వెనుకబడింది.బ్యాటర్‌గానూ విఫలంఇక బ్యాటర్‌గానూ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఐదు ఇన్నింగ్స్ ఆడి మొత్తంగా కేవలం 31 పరుగులే చేశాడు. ముఖ్యంగా అనవసరపు షాట్లకు పోయి అతడు వికెట్ పారేసుకున్న తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఆసీస్‌తో ఆఖరిదైన ఐదో టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఈ విషయం గురించి తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మాట్లాడుతూ.. జట్టు ప్రయోజనాల కోసం విశ్రాంతి పేరిట రోహిత్ స్వయంగా తప్పుకొన్నాడని తెలిపాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునిల్ గావస్కర్ వంటి వాళ్లు రోహిత్ నిర్ణయాన్ని సమర్థించగా.. నవజ్యోత్ సింగ్ సిద్ధు మాత్రం భిన్నంగా స్పందించాడు.తప్పుడు నిర్ణయం.. రోహిత్‌నే పక్కన పెడతారా?‘‘ఇది చాలా ఆశ్చర్యకరంగా, వింతగా ఉంది. ఎందుకంటే భారత క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అతడిని కెప్టెన్‌ను ఎందుకు చేశారు?.. అయినా సారథిగానే కాకుండా కీలక ఆటగాడిగా భారత క్రికెట్‌కు అతడు ఇప్పటికే ఎంతో సేవ చేశాడు.అలాంటి ఆటగాడి ఫామ్ బాగున్నా.. లేకున్నా అదేమీ పెద్ద విషయం కాదు. ఎందుకంటే అతడు కెప్టెన్. జట్టు ప్రయోజనాల కోసం తనను తాను బెంచ్‌కే పరిమితం చేసుకోవడం ఏమిటి? ఇలా చేయడం ద్వారా టీమిండియా మేనేజ్మెంట్ తప్పుడు సంకేతాలు ఇస్తోంది.అతడిపై వేటు వేయడమో.. లేదంటే తనకు తానుగా తప్పుకొనేలా చేయడమో సరికాదు. జట్టును నిర్మించిన సారథి అతడు. యువ ఆటగాళ్లలో చాలా మంది అతడిని తమ తండ్రి సమానుడిలా భావిస్తారు. వాళ్ల నుంచి అతడు అంతటి గౌరవాన్ని పొందాడు. ఏ కెప్టెన్ అయినా నౌకను మధ్యలోనే వీడి వెళ్లిపోడు. అది మునిగిపోతుందని తెలిసినా గట్టెక్కించే ప్రయత్నమే చేస్తాడు గానీ.. తానే ముంచేయాలని చూడడు. అతడొక గౌరవప్రదమైన వ్యక్తి. కానీ మీరు మాత్రం అతడి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ పట్ల గౌరవంగా వ్యవహరించాల్సింది. అతడిపై నమ్మకం ఉంచాల్సింది’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. సిడ్నీలో తొలి రోజు ముగిసిందిలాకాగా ఆసీస్‌తో సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా ఫర్వాలేదనిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్‌కు ఆదిలోనే షాకిచ్చింది. శుక్రవారం నాటి తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టానికి ఆసీస్ తొమ్మిది పరుగులు చేసింది.చదవండి: కొన్‌స్టాస్ ఓవరాక్షన్.. బుమ్రా ఆన్ ఫైర్!.. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది! -
కొన్‌స్టాస్ ఓవరాక్షన్.. వైల్డ్ ఫైర్‌లా బుమ్రా!.. నాతోనే పెట్టుకుంటావా..?
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు తొలిరోజు ఆట రసవత్తరంగా సాగింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఇరుజట్ల క్రికెటర్లు పోటీపడ్డారు. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతికి చోటు చేసుకున్న పరిణామాలు టీమిండియా అభిమానులకు మాంచి కిక్కిచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?!బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) 2024-25లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్‌లో బుమ్రా కెప్టెన్సీలో గెలిచిన టీమిండియా.. అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలో అడిలైడ్‌లో ఓడిపోయి.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకుంది.రోహిత్ లేకుండానేఅయితే, మెల్బోర్న్ టెస్టులో కనీసం డ్రా చేసుకునే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేక ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విఫలమైన రోహిత్ శర్మ(ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 31 రన్స్) ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.ఇక ఆసీస్‌తో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బుమ్రా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, టాపార్డర్ విఫలమైన కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయలేకపోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4)తో పాటు శుబ్‌మన్ గిల్(20), విరాట్ కోహ్లి(17) నిరాశపరిచారు.పంత్ పోరాటం.. బుమ్రా మెరుపులుమిడిలార్డర్లో రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) రాణించగా.. నితీశ్ రెడ్డి(0) పూర్తిగా విఫలమయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్(14), ప్రసిద్ కృష్ణ(3) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. పదో స్థానంలో వచ్చిన బుమ్రా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 22 పరుగులు సాధించాడు.185 పరుగులకు ఆలౌట్ఇక బుమ్రా మెరుపుల కారణంగానే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, మిచెల్ స్టార్క్ మూడు, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు కూల్చగా.. నాథన్ లియాన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.కొన్‌స్టాస్ ఓవరాక్షన్ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. సిడ్నీలో శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి మూడు ఓవర్లలో వికెట్ నష్టానికి తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతి పడటానికి ముందు ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) ఓవరాక్షన్ చేశాడు.బుమ్రా బౌలింగ్‌కు వస్తున్న సమయంలో క్రీజులో ఉన్న మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కాస్త ఆగమన్నట్లుగా సైగ చేయగా.. బుమ్రా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. దీంతో నాన్- స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కొన్‌స్టాస్ బుమ్రాను చూస్తూ ఏదో అనగా అతడు సీరియస్ అయ్యాడు. వైల్డ్ ఫైర్‌లా బుమ్రా.. ఓ రేంజ్లో టీమిండియా సంబరాలుఈ క్రమంలో కొన్‌స్టాస్ అతి చేస్తూ బుమ్రా వైపు రాగా.. బుమ్రా కూడా అంతే ధీటుగా బదులిచ్చాడు. దీంతో అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పాడు. అయితే, ఈ సంఘటన జరిగిన వెంటనే తన అద్భుత బంతితో ఖవాజా(2)ను అవుట్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో ఖవాజా ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టగానే టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ‘‘నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది’’ అన్నట్లుగా బుమ్రా కొన్‌స్టాస్ వైపునకు రాగా.. అక్కడే ఉన్న యువ పేసర్ ప్రసిద్ కృష్ణ కూడా కొన్‌స్టాస్‌కు కౌంటర్ ఇచ్చాడు. దీంతో ముఖం మాడ్చుకున్న 19 ఏళ్ల ఈ టీనేజర్ ఆట ముగిసిన నేపథ్యంలో నిరాశగా మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆఖరి బంతికి అద్భుతం చేశావు భయ్యా అంటూ టీమిండియా ఫ్యాన్స్ బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కొన్‌స్టాస్‌కు ఇలాంటి ఓవరాక్షన్ కొత్తేం కాదు. మెల్బోర్న్లో తన అరంగేట్ర టెస్టులో కోహ్లితో గొడవ పెట్టుకున్న కొన్‌స్టాస్‌కు.. బుమ్రా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఈసారి తనతో నేరుగా పెట్టుకున్నందుకు.. ఆసీస్‌ను దెబ్బతీసేలా వికెట్‌తో బదులిచ్చాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే!Fiery scenes in the final over at the SCG! How's that for a finish to Day One 👀#AUSvIND pic.twitter.com/BAAjrFKvnQ— cricket.com.au (@cricketcomau) January 3, 2025 -
రిషబ్ పంత్ సూపర్ సిక్సర్... నిచ్చెనెక్కి బంతిని తీశారు! వీడియో
సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా(India-Australia) మధ్య ఐదో టెస్టు రసవత్తరంగా ప్రారంభమైంది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రవీంద్ర జడేజా(26), జస్ప్రీత్ బుమ్రా(22) రాణించారు.భారత బౌలర్లలో ఆసీస్ బౌలర్లలో బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు, నాథన్ లియాన్ ఒక వికెట్ సొంతం చేసుకున్నారు. ఇక ఆసీస్‌కు తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే జస్ప్రీత్ బుమ్రా బిగ్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఆసీస్ స్టార్ ప్లేయర్ ఉస్మాన్ ఖావాజాను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.పంత్ భారీ సిక్సర్..ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్(Rishabh Pant) విరోచిత పోరాటం కనబరిచాడు. విరాట్ కోహ్లి ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ల నుంచి బంతులు బుల్లెట్లా తన శరీరానికి తాకుతున్నప్పటకి పంత్ మాత్రం తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.ఈ క్రమంలో ఆసీస్ అరంగేట్ర ఆటగాడు వెబ్‌స్టర్ బౌలింగ్‌లో రిషబ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. అతడు కొట్టిన షాట్ పవర్ బంతి ఏకంగా సైడ్స్క్రీన్పై చిక్కుకుపోయింది. దీంతో ఆ బంతిని తీసేందుకు గ్రౌండ్ స్టాఫ్ రంగంలోకి దిగారు. నిచ్చెనను తీసుకువచ్చి మరి ఆ బంతిని కిందకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: స్మిత్, లబుషేన్ మైండ్‌గేమ్.. ఇచ్చిపడేసిన గిల్! కానీ మనోడికే.. A six so big the ground staff needed a ladder to retrieve it!#AUSvIND pic.twitter.com/oLUSw196l3— cricket.com.au (@cricketcomau) January 3, 2025 -
స్మిత్, లబుషేన్ మైండ్‌గేమ్.. ఇచ్చిపడేసిన గిల్! కానీ మనోడికే..
సిడ్నీ టెస్టులోనూ టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్ల దూకుడు కారణంగా భారత ఓపెనర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. కేఎల్ రాహుల్ 14 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు.పట్టుదలగా నిలబడ్డ గిల్, కోహ్లిఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 26 బంతుల్లో పది పరుగులు చేసి స్కాట్ బోలాండ్కు వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్(Shubman Gill).. నాలుగో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి(Virat Kohli)తో కలిసి ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. అయితే, కంగారూ జట్టు స్పిన్నర్ నాథన్ లియాన్ ఈ జోడీని విడదీశాడు. మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న గిల్ రెండు ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.నిజానికి తన ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు పన్నిన వ్యూహంలో చిక్కిన గిల్.. ఒత్తిడిలోనే వికెట్ కోల్పోయాడని చెప్పవచ్చు. భారత తొలి ఇన్నింగ్స్ 25వ ఓవర్‌ను బోలాండ్ వేశాడు. ఐదో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి గిల్ విఫలమయ్యాడు. గిల్‌ను స్లెడ్జ్ చేసిన స్మిత్, లబుషేన్అనంతరం గిల్ పిచ్ మధ్యలోకి వచ్చి బ్యాట్‌ను టాప్ చేస్తూ కాస్త అసహనం ప్రదర్శించాడు. ఈ క్రమంలో మార్నస్ లబుషేన్.. ఈజీ.. ఈజీగానే క్యాచ్ పట్టేయవచ్చు అని పేర్కొన్నాడు. ఇందుకు స్టీవ్ స్మిత్ స్పందిస్తూ.. ‘బుల్షిట్.. ఆట మొదలుపెడితే మంచిది’ అని గిల్‌ను ఉద్దేశించి అన్నాడు. ఇచ్చి పడేసిన గిల్!ఇందుకు బదులిస్తూ.. ‘‘నీ టైమ్ వచ్చినపుడు చూసుకో స్మితీ.. నీ గురించి ఇప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదే’’ అని గిల్ పేర్కొనగా.. ‘‘నువ్వైతే ఆడు’’ అని స్మిత్ గిల్‌తో అన్నాడు.కానీ మనోడికే భంగపాటుదీంతో 25వ ఓవర్లో ఆఖరి బంతిని ఎదుర్కొనేందుకు గిల్ సిద్ధం కాగా.. అప్పటికే మాటలు మొదలుపెట్టిన లబుషేన్.. ‘‘స్మిత్.. నీ టైమ్ వచ్చింది చూడు’’ అని అరిచాడు. ‘‘నేను అలాగే చేస్తాను చూడు’’ అని చెప్పిన స్మిత్.. గిల్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. అలా శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గిల్ అవుటైన కాసేపటికే కోహ్లి(69 బంతుల్లో 17) కూడా నిష్క్రమించగా.. రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) కాసేపు పోరాటం చేశారు. బుమ్రా మెరుపులుఆఖర్లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మెరుపు ఇన్నింగ్స్(17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్) కారణంగా టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్లు బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు వికెట్లు దక్కించుకోగా.. స్పిన్నర్ నాథన్ లియాన్ ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. వరుస వైఫల్యాల నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్‌తో ఆఖరిదైన ఐదో టెస్టుకు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో బుమ్రా సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) -
'రోహిత్ నిజంగా చాలా గొప్ప కెప్టెన్.. అది అతడి సొంత నిర్ణయమే'
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు రోహిత్ తనంతటతానే దూరంగా ఉండాలని నిర్ణయించకున్నాడని టాస్ సమయంలో స్టాండింగ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పేర్కొన్నాడు.రోహిత్ స్దానంలో తుది జట్టులోకి శుబ్‌మన్ గిల్(Shubman gill) వచ్చాడు. రోహిత్ గత కొంత కాలంగా టెస్టుల్లో పేలవ ఫామ్‌తో సతమతవుతున్నాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో నిరాశపరిచిన హిట్‌మ్యాన్.. ఆస్ట్రేలియా గడ్డపై అదే తీరును కనబరుస్తున్నాడు.ఈ సిరీస్‌లో రోహిత్ మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ వైదగొలగాలని నిర్ణయించుకున్నాడు. వైదొలగాలని రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసించారు"పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ స్వచ్చందంగా తానుకు తానే సిడ్నీ టెస్టు నుంచి తప్పుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో చర్చించాకే రోహిత్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు.ఇది పూర్తిగా అతని సొంత నిర్ణయమే అనిపిస్తుంది. ఒక కెప్టెన్‌గా రోహిత్ తీసుకున్న నిజంగా ప్రశంసనీయం. రోహిత్ భవిష్యత్తు కెప్టెన్లకు రోల్‌మోడల్‌గా నిలుస్తాడు" అని గవాస్కర్ పేర్కొన్నారు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! -
IND Vs AUS: పంత్ మోచేతికి గాయం.. అయినా సరే! వీడియో వైరల్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh pant) అద్బుతమైన పోరాటం కనబరిచాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు బౌన్సర్లతో ముప్పుతిప్పులు పెడుతున్నప్పటికీ.. పంత్ మాత్రం తన విరోచిత ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన ఓ బంతి పంత్ మోచేతికి బలంగా తాకింది. దెబ్బకు మోచేతిపై కాస్త వాపు వచ్చింది. వెంటనే ఫిజియోలు వచ్చి అతడికి చికిత్స అందించారు. నొప్పిని భరిస్తూనే ఆసీస్ బౌలర్లను రిషబ్ చాలాసేపు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.ఈ ఒక్కటే కాకుండా తర్వాత చాలా బంతులు పంత్ శరీరానికి బలంగా తాకాయి. అయినప్పటకి రిషబ్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ 40 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు.తుది జట్లుఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ చదవండి: IND vs AUS: మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్ Rishabh Pant facing some serious punishment from the Australian bowlers. Taking some heavy blows. #AUSvIND #Rishabpant #BorderGavaskarTrophy #ToughestRivalry https://t.co/QiLSnpRbYE— 𝕊𝕙𝕒𝕙𝕚𝕕 𝕌𝕝 𝕀𝕤𝕝𝕒𝕞 (@Shahid_shaban) January 3, 2025 -
మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆట తీరు ఏ మాత్రం మారలేదు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కోహ్లి.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోలేకపోయాడు.మరోసారి కోహ్లి వీక్నెస్ను ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ సొమ్ము చేసుకున్నాడు. 31 ఓవర్లో బోలాండ్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని వెంటాడి మరి తన వికెట్‌ను కోహ్లి కోల్పోయాడు. ఆ ఓవర్లో మూడో బంతిని బోలాండ్.. విరాట్‌కు ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని కోహ్లి ఆఫ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో థర్డ్ స్లిప్‌లో ఉన్న ఆసీస్ అరంగేట్ర ఆటగాడు వెబ్‌స్టర్ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో చేసేదేమి లేక కోహ్లి(17) నిరాశతో మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ సిరీస్‌లో కోహ్లి ఆఫ్‌సైడ్ బంతులకు కోహ్లి ఔట్ కావడం ఇది ఏడో సారి కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. 43 ఓవర్లు ముగిసే భారత్ 4 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. Virat Kohli wicket. 😞#INDvsAUS #AUSvIND #ViratKohli pic.twitter.com/mqCMNWMdA3— Tanveer (@tanveermamdani) January 3, 2025 -
రోహిత్‌ను కావాలనే పక్కన పెట్టారా?.. కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే?
అంతా ఊహించిందే జరిగింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టుకు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) దూరమయ్యాడు. అతడి స్దానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న రోహిత్ విశ్రాంతి తీసుకున్నాడని టాస్ సమయంలో బుమ్రా తెలిపాడు."ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ తనంతటతానే విశ్రాంతి తీసుకుని తన గొప్పతానాన్ని చాటుకున్నాడు. ఈ పరిణామం జట్టులో చాలా ఐక్యత ఉందని చూపిస్తుంది. టీమిండియాలో స్వార్దం అనే పదానికి తావు లేదు. అందరూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.రోహిత్ విశ్రాంతి తీసుకోగా, ఆకాష్ దీప్ గాయం కారణంగా దూరమయ్యాడు. రోహిత్ స్ధానంలో గిల్ జట్టులోకి రాగా.. ఆకాష్ స్ధానంలో ప్రసిద్ద్ కృష్ణ ఎంట్రీ ఇచ్చాడని" బుమ్రా పేర్కొన్నాడు. కాగా సిడ్నీ టెస్టుకు రోహిత్ దూరం కానున్నాడనే వార్తలు ముందు నుంచే వినిపించాయి.దానికితోడు రోహిత్ ప్రాక్టీస్ సెషన్లో కన్పించకపోవడం, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గంభీర్ బుమ్రాతో సుదీర్ఘమైన చర్చలు జరపడంతో హిట్‌మ్యాన్ బెంచ్‌కే పరిమితం కానున్నడన్న విషయం అర్దం అయిపోయింది. అంతా అనుకున్నట్లే ఆఖరి టెస్టుకు ఈ ముంబైకర్ దూరమయ్యాడు.కాగా ఈ సిరీస్‌లో రోహిత్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. తన ట్రేడ్‌మార్క్ ఫ్రంట్ పుల్ షాట్ ఆడటంలో కూడా రోహిత్ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.తుది జట్లుఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్చదవండి:లంక పర్యటనకు కమిన్స్ దూరం -
బుమ్రా కెప్టెన్ ఇన్నింగ్స్.. వికెట్‌తో తొలిరోజు ముగించిన భారత్
India vs Aus 5th test day 1 live updates and highlights: సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది. శుబ్‌మన్ గిల్(20), రవీంద్ర జడేజా(26) ఫర్వాలేదనిపించగా.. రిషభ్ పంత్(40), కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(17 బంతుల్లో 22) రాణించారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు, నాథన్ లియాన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.వికెట్ తీసిన బుమ్రాఅనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు బుమ్రా ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(2)ను సింగిల్ డిజిట్‌కే పరిమితం చేశాడు. సిడ్నీలో శుక్రవారం నాటి మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి ఆసీస్ మూడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. సామ్ కొన్‌స్టాస్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నాడు.185 పరుగులకు టీమిండియా ఆలౌట్..సిడ్నీ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరి కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(22) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరితో పాటు జడేజా(26) పర్వాలేదన్పించాడు. ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లతో సత్తాచాటగా.. మిచెల్ స్టార్క్ మూడు, కమ్మిన్స్ రెండు, లియోన్ ఒక్క వికెట్ సాధించారు.తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ప్రసిద్ కృష్ణ(3) తొమ్మిదో వికెట్‌గా వెనునదిరిగాడు. సామ్ కొన్‌స్టాస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వరుస ఫోర్లు కొట్టి బుమ్రా 12 పరుగులతో క్రీజులో ఉండగా.. సిరాజ్ ప్రసిద్ స్థానంలో వచ్చాడు. భారత్ స్కోరు: 168/9 (68.2).సుందర్ ఔట్..టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు. 66 ఓవర్లకు భారత్ స్కోర్: 149/8భారత్ ఏడో వికెట్ డౌన్..రవీంద్ర జడేజా రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన జడేజా.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు.ఆరో వికెట్ కోల్పోయిన భారత్పంత్ స్థానంలోక్రీజులోకి వచ్చిన నితీశ్ రెడ్డి తొలి బంతికే అవుటయ్యాడు. బోలాండ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా నిష్క్రమించాడు. దీంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 120/6 (57) ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియాపంత్(40) రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బోలాండ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ పెవిలియన్ చేరాడు. నితీశ్ కుమార్ రెడ్డిక్రీజులోకి వచ్చాడు.56 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా స్కోరు: 119/4 (56) .జడ్డూ 14, పంత్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.టీ బ్రేక్‌కు భారత్ స్కోర్: 107/4టీ విరామానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(10), రిషబ్ పంత్(26) ఉన్నారు.48 ఓవర్లకు భారత్ స్కోర్: 100/4రవీంద్ర జడేజా(10), రిషబ్ పంత్(26) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 28 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 48 ఓవర్లకు భారత్ 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.నిలకడగా ఆడుతున్న రిషబ్ పంత్..విరాట్ కోహ్లి ఔటయ్యాక టీమిండియా బ్యాటర్లు రిషబ్ పంత్(19 నాటౌట్), రవీంద్ర జడేజా(4 నాటౌట్) ఆచితూచి ఆడుతున్నారు. 44 ఓవర్లకు భారత్ స్కోర్: 87/4టీమిండియా నాలుగో వికెట్ డౌన్..విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో వెబ్‌స్టర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి(17) ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు. 35 ఓవర్లకు భారత్ స్కోర్: 76/4నిలకడగా ఆడుతున్న కోహ్లి, పంత్లంచ్ అనంతరం తొలి రోజు ఆట ప్రారంభమైంది. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. 30 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 67/3. క్రీజులో పంత్(7)తో పాటు విరాట్ కోహ్లి(14) పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ డౌన్.. గిల్ ఔట్‌శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. లంచ్ విరామానికి ముందు లియోన్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ ఔటయ్యాడు. లంచ్ బ్రేక్‌కు భారత్ స్కోర్: 57/3నిలకడగా ఆడుతున్న కోహ్లి, గిల్..శుబ్‌మన్ గిల్, కోహ్లి నిలకడగా ఆడుతున్నారు. ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 50/2జైశ్వాల్ ఔట్..టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. అద్బుతమైన ఫామ్‌లో ఉన్న జైశ్వాల్ ఈ మ్యాచ్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు.రాహుల్ ఔట్..కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రాహుల్.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శుబ్‌మన్ గిల్ వచ్చాడు. 7 ఓవర్లకు భారత్ స్కోర్: 14/1రోహిత్ ఔట్.. గిల్ ఇన్సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు భారత జట్టు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఆఖరి టెస్టులో టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు.రోహిత్‌తో పాటు గాయం కారణంగా ఆకాష్ దీప్ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. రోహిత్ స్ధానంలో శుబ్‌మన్ గిల్ తుది జట్టులోకి రాగా.. ఆకాష్ స్ధానంలో ప్రసిద్ద్ కృష్ణ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. మిచెల్ మార్ష్ స్ధానంలో వెబ్‌స్టర్‌కు చోటు దక్కింది.తుది జట్లుఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ -
Ind vs Aus: అతడు లేని లోటు సుస్పష్టం.. సిడ్నీలో భారత్ రికార్డు?
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ చివరి దశకి చేరుకుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభం కానున్న ఐదో టెస్టు ఈ సిరీస్‌లో ఆఖరిది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆసీస్‌తో సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించాలని భారత్ ఆశిస్తోంది.సిడ్నీలో టీమిండియా రికార్డు ఎలా ఉంది?అయితే, సిడ్నీలో భారత్ రికార్డు అంతగా ఆత్మవిశ్వాసాన్ని కలిగించే రీతిలో లేదు. ఈ వేదిక మీద భారత్ ఇంతవరకు పదమూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఒక్కసారి మాత్రమే గెలుపొందింది. ఏడు సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించగా.. మిగిలిన అయిదు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.ప్రస్తుత సిరీస్‌లో పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్ తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. భారత్ సెలెక్టర్లని ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ని ఆస్ట్రేలియాకి పంపించాల్సిందిగా కోరినట్టు వార్తలు వచ్చాయి. మెల్బోర్న్లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ టెస్టులో ఆసీస్ చేతిలో 184 పరుగుల తేడాతో పరాజయం చవిచూసిన నేపథ్యంలో భారత్ జట్టులో ఐకమత్యం లోపించిందని వాటి సారాంశం.అతడు లేని లోటు సుస్పష్టంఈ సంగతిని పక్కనపెడితే.. ప్రస్తుతం టీమిండియాలో పుజారా వంటి బ్యాటర్లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. టెస్టులో పుజారా రికార్డ్ అటువంటిది మరి. ఆస్ట్రేలియాలో 47.28 సగటుతో 11 మ్యాచ్‌లలో అతడు.. 993 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు సింహస్వప్నంగా నిలిచాడు.అంతేకాదు.. సిడ్నీ వేదిక పైన పుజారా 2018-19 టెస్ట్‌లో ఏకంగా 193 పరుగులు సాధించి టెస్టును డ్రాగా ముగించాడు. ప్రస్తుత భారత్ జట్టులో అటువంటి పోరాట పటిమ కలిగిన బ్యాటర్లు ఒక్కరూ కన్పించడం లేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసినా పట్టించుకోకుండా పుజారా నిబ్బరంగా బ్యాటింగ్ చేసి ఏకంగా 1258 బంతులని ఎదుర్కొన్నాడు.పుజారాతో కలిసి పంత్ కూడాజట్టులోని ప్రధాన ఆటగాడు అంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే, మిగిలిన ఆటగాళ్లందరిలో అదే ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. నాటి ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 169 పరుగులు సాధించి అజేయంగా నిలవడం ఇందుకు నిదర్శనం. పుజారా తో కలిసి అతడు 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనార్హం.భారత జట్టు పుజారా బ్యాటింగ్ నుంచి నేర్చుకోవాల్సి ఎంతో ఉంది. టెస్టు మ్యాచ్‌లలో బ్యాటింగ్ చాలా భిన్నంగా ఉంటుంది. పుజారా లాగా ప్రత్యర్థి బౌలర్లను నిబ్బరంగా ఎదుర్కొనే ధైర్యం ప్రస్తుత భారత్ బ్యాటర్లలో కొరవడిందని నిర్వివాదాంశం. ఏది ఏమైనా ప్రస్తుత భారత్ జట్టులో పుజారా వంటి బ్యాటర్ లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇదే ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోరుకునేది.కనీసం డ్రా అయినాకెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పేలవమైన ఫామ్.. టీమిండియా మేనేజ్మెంట్ చేసిన తప్పిదాలు ఆస్ట్రేలియాకి బాగా కలిసి వచ్చాయి. కనీసం చివరి టెస్టులోనైనా భారత ఆటగాళ్లు తమ తడబాటు ధోరణి తగ్గించుకొని టెస్ట్ మ్యాచ్‌కి అనుగుణంగా బ్యాటింగ్ చేస్తే.. ఈ సిరీస్‌ని డ్రా చేసుకున్న తృప్తి అయినా మిగులుతుంది.చదవండి: కెప్టెన్ కంటే బెటర్.. అతడిని మాత్రం తప్పించకండి: భారత మాజీ క్రికెటర్ -
సిడ్నీ టెస్టుకు భారత తుదిజట్టు ఇదే! అతడి ఎంట్రీ ఫిక్స్!
ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టులో రెండు మార్పులు చేటుచేసుకున్నట్లు సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విశ్రాంతి పేరిట ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని భావించగా.. శుబ్‌మన్ గిల్‌కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఆకాశ్ దీప్ స్థానంలో యువ పేసర్మరోవైపు.. ఆకాశ్ దీప్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. ఓ యువ పేసర్ ఏడాది కాలం తర్వాత పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ప్రధాన పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టు.. ఈసారి మాత్రం అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపుతోంది. కోహ్లి, రోహిత్ విఫలంఆసీస్తో ఐదు టెస్టుల్లో భాగంగా ఇప్పటికి నాలుగు పూర్తి కాగా.. తొలి మ్యాచ్‌లో శతకం సాధించడం మినహా కోహ్లి పెద్దగా రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో పదే పదే తప్పుల్ని పునరావృతం చేస్తూ వికెట్ పారేసుకుంటున్నాడు.మరోవైపు.. రోహిత్ సారథిగా, బ్యాటర్‌గా విఫలమవుతున్నాడు. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టుతో జట్టులోకి వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి మరీ దారుణంగా31 పరుగులే చేశాడు. ఇక అతడి సారథ్యంలో రెండో టెస్టులో ఓడిన భారత్, బ్రిస్బేన్ టెస్టును డ్రాగా ముగించగలిగింది. అయితే, మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.సిడ్నీ టెస్టు నుంచి వైదొలిగిన రోహిత్!ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఆసన్నమైందని.. అతడు వెంటనే తప్పుకొని యువకులకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆసీస్‌తో ఆఖరి టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తనకు తానుగా సిడ్నీ టెస్టు నుంచి వైదొలగాలని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో యశస్వి జైస్వాల్‌తో ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ మరోసారి బరిలోకి దిగనుండగా.. శుబ్‌మన్ గిల్(Shubhman Gill) మూడో స్థానంలో ఆడనున్నట్లు సమాచారం. అదే విధంగా గాయపడిన పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ కృష్ణ తుదిజట్టుకు ఎంపికైనట్లు తెలుస్తోంది. రెండే మార్పులుఈ రెండు మార్పులు మినహా.. పాత జట్టుతోనే భారత్ సిడ్నీ టెస్టుకు సన్నద్ధమైనట్లు సమాచారం. కాగా శుక్రవారం నుంచి మంగళవారం(జనవరి 3-7) వరకు ఆసీస్- భారత్ మధ్య ఐదో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గెలిస్తేనే టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. అదే విధంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 అవకాశాలు కూడా సజీవంగా ఉంటాయి.ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టుకు భారత తుదిజట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: కెప్టెన్ కంటే బెటర్.. అతడిని మాత్రం తప్పించకండి: భారత మాజీ క్రికెటర్ -
కెప్టెన్ కంటే బెటర్.. ప్లీజ్.. అతడిని తప్పించకండి: భారత మాజీ క్రికెటర్
‘‘రిషభ్ పంత్(Rishabh Pant) ఎక్కువగా రివర్స్ స్లాప్ షాట్లు ఆడతాడు. అదే అతడి బలం. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌లో పంత్ కచ్చితంగా ప్రభావం చూపుతాడు. కాబట్టి అతడిని కట్టడి చేస్తే మా పని సగం పూర్తయినట్లే’’- టీమిండియాతో టెస్టులకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు.గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)సిరీస్‌ను టీమిండియానే దక్కించుకున్న విషయం తెలిసిందే. 2020-21 పర్యటన సందర్భంగా భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తొలిసారి కంగారూ గడ్డపై సత్తా చాటాడు. నాడు అద్భుత రీతిలోసిడ్నీ టెస్టులో 97 పరుగులతో రాణించి.. సిరీస్ ఆశలను సజీవం చేశాడు. నాడు ఆఖరిగా గబ్బాలో జరిగిన టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి.. భారత్‌ను గెలిపించాడు. తద్వారా సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పూర్తి చేశాడు.అందుకే ఈసారి ఆసీస్ గడ్డపై బీజీటీ నేపథ్యంలో పంత్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కమిన్స్ కూడా అతడి గురించి పైవిధంగా స్పందించాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు బీజీటీ 2024-25లో నాలుగు టెస్టులు పూర్తి కాగా.. పంత్ సాధించిన పరుగులు 154 మాత్రమే. స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్ఏ ఆటగాడికైనా ఒక్కోసారి ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదురవడం సహజమే అయినా.. పంత్ వికెట్ పారేసుకుంటున్న తీరు విమర్శలకు దారితీసింది. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అయితే పంత్‌ను ఉద్దేశించి.. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. నువ్వు భారత జట్టు డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లనే కూడదు’’ అంటూ మండిపడ్డాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.తుదిజట్టులో చోటు ఉంటుందా? లేదా?ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగనున్న ఆఖరి టెస్టులో పంత్ తుదిజట్టులో చోటు దక్కించుకోవడంపై సందేహాలు నెలకొన్నాయి. అతడిపై వేటు వేసి యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తాజాగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘రిషభ్ పంత్‌ను జట్టు నుంచి తప్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోందా? రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించి.. శుబ్‌మన్ గిల్‌ను మళ్లీ జట్టులోకి తీసుకువస్తారా? దయచేసి అలా మాత్రం చేయకండి. సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోకుండా తక్షణ పరిష్కారం కోసం వెతకకండి.కెప్టెన్ కంటే బెటర్.. ప్లీజ్.. అతడిని తప్పించకండిరిషభ్ పంత్ ఈ సిరీస్‌లో ఎక్కువగా పరుగులు సాధించలేదన్న వాస్తవాన్ని నేనూ అంగీకరిస్తాను. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ కంటే అతడు బాగానే ఆడుతున్నాడు. అంతేకాదు.. అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యాలు కూడా అద్భుతం. అతడికి ఆసీస్ గడ్డపై మంచి రికార్డు ఉంది.పంత్.. ఒక్కసారి విఫలమైనంత మాత్రాన పక్కనపెట్టేంత విలువలేని ఆటగాడు కాదు. కాబట్టి దయచేసి అతడిని జట్టు నుంచి తప్పించకండి. ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకశైలి ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఎంత జాగ్రత్తపడినా.. ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి.పిచ్ పరిస్థితులు కూడా గమనించాలి. మ్యాచ్ స్వరూపం ఎలా ఉందన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి కీలక విషయాలను పట్టించుకోకపోతే కష్టమే. ఏదేమైనా.. పంత్ ఒక్కసారి తన లోపాలు సరిదిద్దుకుంటే అతడికి తిరుగు ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా పంత్‌ను సమర్థించాడు.సిడ్నీలో ఐదో టెస్టుఇదిలా ఉంటే.. ఆసీస్‌తో రెండో టెస్టు నుంచి జట్టుతో కలిసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు మొత్తం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక భారత్- ఆసీస్ మధ్య శుక్రవారం నుంచి ఐదో టెస్టు సిడ్నీలో మొదలుకానుంది.చదవండి: NZ vs SL: కుశాల్ పెరీరా ‘ఫాస్టెస్ట్ సెంచరీ’.. ఉత్కంఠ పోరులో ఆఖరికి! -
రోహిత్, బుమ్రా కాదు!.. సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్ అతడే!
ఆస్ట్రేలియాతో టీమిండియా ఆఖరి టెస్టుకు సమయం ఆసన్నమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో శుక్రవారం ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఇందుకోసం ఇరుజట్లు ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. సిడ్నీలో గెలిచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోవాలని భారత్ భావిస్తోంది.మరోవైపు.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని తామే కైవసం చేసుకోవాలని ఆసీస్ పట్టుదలగా ఉన్నాయి. ఫలితంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మరింత రసవత్తరంగా మారనుంది. అయితే, ఈ కీలక టెస్టుకు ముందు టీమిండియా డ్రెసింగ్‌రూమ్‌లో విభేదాలు తలెత్తాయనే వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి.హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు సమన్వయం కుదరడం లేదని.. అదే విధంగా ఆటగాళ్ల తీరు పట్ల కోచ్ అసంతృప్తితో ఉన్నాడనే వదంతులు వచ్చాయి. అయితే, గౌతీ మాత్రం ఇవన్నీ అబద్దాలేనని కొట్టిపారేశాడు. అయినప్పటికీ, టీమిండియా కెప్టెన్ మార్పు అంశం మీద మాత్రం ఊహాగానాలు ఆగటం లేదు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదో టెస్టుకు ముందు కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అతడి గైర్హాజరీలో పెర్త్‌లో టీమిండియాను గెలిపించిన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) పగ్గాలు చేపట్టడం లాంఛనమేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, బెంగాల్ మాజీ క్రికెటర్, ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన శ్రీవత్స్ గోస్వామి మాత్రం భిన్నంగా స్పందించాడు.సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్ అతడే!‘‘టీమిండియాలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే.. సిడ్నీ టెస్టులో గిల్ కెప్టెన్‌గా వ్యవహరించునున్నాడని అనిపిస్తోంది. తదుపరి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్ కోసం మేనేజ్మెంట్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదెంతో ఆసక్తికరంగా ఉంది’’ అని శ్రీవత్స్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.సరైన నాయకుడు బుమ్రానేఅయితే, మెజారిటీ మంది నెటిజన్లు మాత్రం శ్రీవత్స్ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. గిల్‌కు తుదిజట్టులోనే చోటు దక్కనపుడు కెప్టెన్ ఎలా అవుతాడని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో గిల్‌కు పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని.. ఇప్పుడు మాత్రం బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు ప్రస్తుత పరిస్థితుల్లో బుమ్రానే సరైన నాయకుడు అని పేర్కొంటున్నారు. ఏదేమైనా శుక్రవారం సిడ్నీ టెస్టు మొదలైన తర్వాతే ఈ ఊహాగానాలకు చెక్ పడుతుంది.ఇదిలా ఉంటే.. ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియాకు సానుకూల ఫలితాలు రావడం లేదు. పెర్త్‌లో గెలిచిన భారత జట్టు.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో వర్షం వల్ల డ్రాతో గట్టెక్కగలిగింది. అయితే, మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.రోహిత్ వైఫల్యాల వల్లే ఇలాఈ బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆసీస్ చేతిలో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. సిరీస్‌లో 1-2తో వెనుకబడింది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ సారథిగా, బ్యాటర్‌గా విఫలం అవుతుండటంతో అతడు వెంటనే రాజీనామా చేసి.. రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త కెప్టెన్ అంశం తెరమీదకు వచ్చింది.చదవండి: లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా -
రోహిత్ శర్మ అందుకు సిద్ధంగానే ఉన్నాడు: రవిశాస్త్రి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఉద్దేశించి మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. సిడ్నీ టెస్టు ముగిసిన వెంటనే హిట్‌మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందన్నాడు. రోజురోజుకీ రోహిత్ వయసు పెరుగుతోందని.. కాబట్టి తనకు తానుగా రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగానే ఉన్నాడని అభిప్రాయపడ్డాడు.బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా వైఫల్యాలుకాగా గత కొంతకాలంగా రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా ఘోర పరాభవాలు చవిచూస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీప్.. తాజాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ వైఫల్యాలు రోహిత్‌ను వేధిస్తున్నాయి.ఆసీస్ పర్యటనలో రెండో టెస్టు నుంచి జట్టుతో చేరిన రోహిత్ శర్మ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. ఇప్పటి వరకు కంగారూ జట్టుతో ముగిసిన మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్ ఆడిన అతడు.. కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ సారథ్యంలో ఈ మూడు మ్యాచ్‌లలో రెండింటిలో ఓడిన టీమిండియా.. ఒకటి మాత్రం డ్రా చేసుకోగలిగింది.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలి, కెప్టెన్సీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరగా అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ అందుకు సిద్ధంగానే ఉన్నాడుఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ తన కెరీర్ గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడనిపిస్తోంది. సిడ్నీ టెస్టు తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే.. రోజురోజుకీ అతడేమీ యువకుడు కావడం లేదు కదా! శుబ్‌మన్ గిల్ (Shubman Gill)వంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు జట్టులో సుస్థిర స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది సగటున 40 పరుగులు చేసిన గిల్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదు. ప్రతిభ ఉన్న యువకులను బెంచ్‌కే పరిమితం చేయడం తెలివైన నిర్ణయం అనిపించుకోదు. కాబట్టి రోహిత్ వైదొలుగుతాడనే అనిపిస్తోంది. ఒకవేళ సిడ్నీలో టీమిండియా గెలిచి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరినా.. చేరకపోయినా రోహిత్ మాత్రం తుది నిర్ణయం వెల్లడిస్తాడని.. అందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికితే యువకులకు మార్గం సుగమమవుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.సిడ్నీలో గెలిస్తేనేకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతున్న టీమిండియా.. ఆతిథ్య జట్టు చేతిలో 2-1తో వెనుకబడి ఉంది. పెర్త్‌లో గెలిచిన భారత్.. అడిలైడ్‌లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకుంది. అయితే, మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఇరుజట్ల మధ్య జనవరి 3-7 మధ్య సిడ్నీ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు జరుగుతుంది. ఇందులో గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి.చదవండి: లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా -
రోహిత్ శర్మపై వేటు.. భారత కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!?
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సారథిగా, బ్యాటర్‌గా రోహిత్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్‌మ్యాన్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు.కానీ తన కెప్టెన్సీ మార్క్‌ను మాత్రం చూపించలేకపోయాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రోహిత్ 5 ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. అటు కెప్టెన్‌గా అడిలైడ్, మెల్బోర్న్లో రోహిత్ ఘోర ఓటములను చవిచూశాడు. అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్‌లోనూ రోహిత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. అతడి సారథ్యంలోని టీమిండియా కివీస్ చేతిలో 3-0 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. ఇప్పుడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ అదే తీరును కనబరుస్తుండండంతో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తున్నాయి.రోహిత్ శర్మపై వేటు..ఈ క్రమంలో సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరగనన్న ఆఖరి టెస్టుకు రోహిత్ శర్మను పక్కన పెట్టాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సిడ్నీ టెస్టుకు ముందు విలేకరుల సమావేశంలో పాల్గోన్న భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది.సిడ్నీ టెస్టులో రోహిత్ ఆడనున్నాడా? అని ఓవిలేకరి ప్రశ్నించాడు. అందుకుకు బదులుగా" రేపు(శుక్రవారం) ఉయదం పిచ్ చూసిన తర్వాత మా ప్లేయింగ్ ఎలెవన్‌పై నిర్ణయం తీసుకుంటామని" గంభీర్ సమాధనమిచ్చాడు. కాగా ఐదో టెస్టుకు ముందు రోహిత్ శర్మపై వేటు పడడం దాదాపు ఖాయమైనట్లగా అన్పిస్తోంది.ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పాల్గోకపోవడం, స్లిప్ క్యాచింగ్ ప్రాక్టీస్‌లో కూడా రోహిత్ పాల్గోకపోవడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. అంతేకాకుండా ప్రాక్టీస్ సెషన్లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, గంభీర్‌లు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో సిడ్నీ టెస్టులో భారత జట్టు పగ్గాలు బుమ్రా చేపట్టే సూచనలు కన్పిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ దూరమైతే శుబ్‌మన్ గిల్ తిరిగి తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs AUS: భారత డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన గంభీర్ -
భారత డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన గౌతం గంభీర్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 తుది అంకానికి చేరుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 3-1 సొంతం చేసుకోవాలని ఆతిథ్య ఆసీస్ భావిస్తుంటే.. మరోవైపు సిడ్నీలో ప్రత్యర్ధిని ఓడించి సిరీస్‌ను డ్రా చేయాలని భారత్ పట్టుదలతో ఉంది.అందుకు తగ్గట్టే భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ తమ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. ఈ క్రమంలో భారత తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన పట్ల హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఇకపై జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గౌతీ హెచ్చరించినట్లు వినికిడి. ఈ క్రమంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతవారణం వేడెక్కిందని, సెలక్షన్ కమిటీ, కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్‌కు విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై గౌతం గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎటువంటి గొడవలు జరగడం లేదని, అవన్నీ రూమర్సే అని గౌతీ కొట్టి పారేశాడు."డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్, ఆటగాళ్ల మధ్య చాలా చర్చలు జరుగుతాయి. అవి అక్కడి వరకే పరిమితం కావాలన్నది నా అభిప్రాయం. డ్రెసింగ్ రూమ్ వాతవారణం చాలా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి విభేదాలు.బయట వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తవం. వీటిపై స్పందించాల్సిన అవసరం లేదు. మనం నిజాయితీగా ఉన్నామా లేదన్నది ముఖ్యం. నిజాయతీ కలిగిన వ్యక్తులు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నంత వరకుభారత క్రికెట్ సురక్షితంగానే ఉంటుంది.డ్రెసింగ్ రూమ్‌లో ఆటగాళ్ల ప్రదర్శన, మ్యాచ్‌లు ఎలా గెలవాలన్న విషయాల గురించే చర్చిస్తాము. విరాట్ కోహ్లితో కూడా ప్రత్యేకంగా ఎటువంటి చర్చలు జరపలేదు. ప్రస్తుతం మా దృష్టింతా సిడ్నీ టెస్టుపైనే ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS 5th Test: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం -
IND Vs AUS: భారత్‌తో ఐదో టెస్టు.. ఆసీస్ తుది జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్‌పై వేటు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25పై ఆతిథ్య ఆస్ట్రేలియా కన్నేసింది. సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టులో గెలిచి సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకోవాలని ఆసీస్ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో సిడ్నీ టెస్టుకు తమ తుది జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైన స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌పై జట్టు ఆసీస్ టీమ్ మెనెజ్‌మెంట్ వేటు వేసింది. అతడి స్ధానంలో బ్యూ వెబ్‌స్టర్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్‌తో వెబ్‌స్టర్ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు.వెబ్‌స్టర్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 93 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన బ్యూ వెబ్‌స్టర్ 5297 పరుగులతో పాటు 148 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడికి తుది జట్టులో చోటు ఇచ్చారు.మరోవైపు నాలుగో టెస్టులో పక్కటెముకల నొప్పితో బాధపడ్డ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తిరిగి తన ఫిట్నెస్ సాధించాడు. దీంతో ఐదో టెస్టులో కూడా స్టార్క్ ఆడనున్నాడు. ఈ ఒక్క మార్పు మినహా మిగితా ఆసీస్ జట్టులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఆసీస్ ఉంది. ఆఖరి టెస్టులో ఆసీస్ గెలిస్తే సిరీస్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.చదవండి: IND vs AUS 5th Test: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మరో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. సిడ్నీ వేదికగా శుక్రవారం(జనవరి 3) నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న ఐదో టెస్టులో భారత్ అమీ తుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. సిడ్నీ టెస్టుకు యువ పేసర్ ఆకాష్ దీప్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ఆకాష్ దీప్ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఆకాష్ కేవలం 43 ఓవర్ల బౌలింగ్ మాత్రమే చేశాడు. దీంతో అతడికి ఆఖరి టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించిందంట.ఆకాష్ స్ధానంలో కర్ణాటక స్పీడ్ స్టార్ ప్రసిద్ద్ కృష్ణ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా-ఎతో జరిగిన అనాధికరిక టెస్టుల్లో కృష్ణ అద్భుతంగా రాణించాడు.ఈ క్రమంలోనే తొలి రెండు టెస్టులు ఆడిన హర్షిత్ రానాను కాదని ప్రసిద్ద్‌కు చాన్స్ ఇవ్వాలని గంభీర్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గత రెండు మ్యాచ్‌ల్లో బుమ్రా తర్వాత అత్యుత్తమ బౌలర్‌గా నిలిచిన ఆకాష్ దీప్.. సిడ్నీ టెస్టుకు దూరమైతే భారత్‌కు నిజంగా గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.బ్రిస్బేన్ టెస్టు డ్రా ముగియడంలో దీప్ది కీలక పాత్ర. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైతే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది.చదవండి: బుమ్రా లేకుంటే బీజీటీ ఏకపక్షమే: గ్లెన్ మెక్‌గ్రాత్ -
బుమ్రా లేకుంటే వార్ వన్ సైడే: గ్లెన్ మెక్‌గ్రాత్
భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా లేకుండా ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ ఏకపక్షంగా సాగేదని ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు. పరిస్థితులను అర్థం చేసుకొని అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచించడంలో బుమ్రా బుర్ర చురుకైందని మెక్‌గ్రాత్ కితాబిచ్చాడు.ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ముగియగా... టీమిండియా 1–2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు విఫలమైనా... బుమ్రా ఒంటి చేత్తో జట్టును పోటీలో నిలిపాడని మెక్‌గ్రాత్ ప్రశంసించాడు. ‘బుమ్రా లేకుండా సిరీస్ మరింత ఏకపక్షం అయ్యేది. అతడు టీమిండియాకు ప్రధాన బలం. అతడి బౌలింగ్‌కు నేను పెద్ద అభిమానిని. భారత జట్టు అతడిని జాగ్రత్తగా చూసుకోవాలి.భారత్‌లో క్రికెట్‌కు చాలా క్రేజ్ ఉంది. గత 12 ఏళ్లుగా ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ తరఫున భారత్‌లో పనిచేస్తున్నా. మా సంస్థ ద్వారా ప్రసిధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్ వంటి వాళ్లు ఎందరో లబ్ధి పొందారు. క్రికెట్లోని అన్నీ ఫార్మాట్లలో టెస్టులే అత్యుత్తమం. మెల్బోర్న్ టెస్టును ఐదు రోజుల్లో కలిపి 3,70,000 మంది వీక్షించడం ఆనందాన్నిచి్చంది. ఇది టెస్టు క్రికెట్‌కున్న ఆదరణను వెల్లడిస్తుంది’ అని మెక్‌గ్రాత్ అన్నాడు.చదవండి: బుమ్రా ఎడమ చేత్తో బౌలింగ్ చేయాలని చట్టం తెస్తాం -
ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్.. ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన బుమ్రా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేసే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ ఆల్‌టైమ్ రికార్డు ఊరిస్తుంది. సిడ్నీ టెస్ట్‌లో బుమ్రా మరో ఆరు వికెట్లు తీస్తే.. ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.ప్రస్తుతం ఈ రికార్డు స్పిన్ దిగ్గజం బీఎస్ చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్ 1972-73లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 35 వికెట్లు తీశారు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో 12.83 సగటున 30 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు ఐదు వికెట్లు ఘనతలు ఉండగా..రెండు నాలుగు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..1. బీఎస్ చంద్రశేఖర్ - 35 (ఇంగ్లండ్‌పై)2. వినూ మన్కడ్ - 34 (ఇంగ్లండ్‌పై)3. శుభాష్చంద్ర గుప్తా - 34 (న్యూజిలాండ్‌పై)4. రవిచంద్రన్ అశ్విన్ - 32 (ఇంగ్లాండ్‌పై)5. హర్భజన్ సింగ్ - 32 (ఆస్ట్రేలియాపై)6 .కపిల్ దేవ్ - 32 (పాకిస్థాన్‌పై)7. రవిచంద్రన్ అశ్విన్ - 31 (దక్షిణాఫ్రికాపై)8. బిషన్ సింగ్ బేడీ - 31 (ఆస్ట్రేలియాపై)9. జస్ప్రీత్ బుమ్రా - 30 (ఆస్ట్రేలియాపై)కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో నాలుగు టెస్ట్‌ల అనంతరం ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆతర్వాత అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా కాగా.. తాజాగా మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ 184 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. -
టీమిండియాతో ఆఖరి టెస్ట్.. ఆస్ట్రేలియా తుది జట్టులో రెండు మార్పులు..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగబోయే చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగనుందని తెలుస్తుంది. ఫామ్‌లో లేని మిచెల్ మార్ష్‌పై వేటు పడే అవకాశం ఉందని సమచారం. పక్కటెముకల సమస్యతో బాధపడుతున్న స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌కు విశ్రాంతినిస్తారని తెలుస్తుంది. మ్యాచ్ సమయానికి స్టార్క్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే తుది జట్టులో ఉంటాడు. లేదంటే అతని స్థానంలో జై రిచర్డ్సన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. రిచర్డ్సన్ గాయపడిన హాజిల్‌వుడ్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. మార్ష్ విషయానికొస్తే.. అతను ఫామ్ లేమితో పాటు ఫిట్నెస్ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మార్ష్ ఎక్కువగా బ్యాటింగ్‌కే పరిమితమయ్యాడు. అతను పెద్దగా బౌలింగ్ చేయలేదు. మార్ష్ ఈ సిరీస్ 10.43 సగటున కేవలం 73 పరుగులు మాత్రమే చేశాడు. మిడిలార్డర్లో మార్ష్ ఆసీస్‌కు పెద్ద సమస్యగా మారాడు. అందుకే అతనిపై వేటు పడనుందని తెలుస్తుంది. ఆఖరి టెస్ట్‌లో మార్ష్ స్థానంలో బ్యూ వెబ్‌స్టర్ తుది జట్టులోకి వస్తాడని సమాచారం. పై రెండు మార్పులతో ఆసీస్ చివరి టెస్ట్ బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత్‌తో ఐదో టెస్ట్‌కు ఆసీస్ తుది జట్టు (అంచనా)..ఉస్మాన్ ఖ్వాజా, సామ్ కొన్‌స్టాస్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్ (ఫిట్‌గా ఉంటేనే) లేదా జై రిచర్డ్సన్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో నాలుగు టెస్ట్‌ల అనంతరం ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి టెస్ట్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభమవుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆతర్వాత అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా కాగా.. తాజాగా మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ 184 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. -
నితీశ్ రెడ్డి ఒక్కడే కాదు.. అతడూ జట్టులో ఉండాలి!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్ ముంగిపునకు వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా తమ చివరి టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టి.. ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తి చేసుకుంది.పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో గెలిచి శుభారంభం చేసిన టీమిండియా.. తదుపరి అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం ఓడిపోయింది. అనంతరం బ్రిస్బేన్‌లో మూడో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న భారత జట్టు.. మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో దారుణంగా విఫలమైంది. ఆతిథ్య జట్టు చేతిలో 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంఫలితంగా ఆసీస్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో నిలవగా.. రోహిత్ సేన డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే సౌతాఫ్రికా టైటిల్ పోరుకు అర్హత సాధించగా.. ఆస్ట్రేలియాకు మార్గం సుగమమైంది. ఏదేమైనా ఆసీస్‌లో టీమిండియా వైఫల్యం కొనసాగుతున్నప్పటికీ ఓ ఆణిముత్యం లాంటి ఆటగాడు దొరకడం సానుకూలాంశం.నితీశ్ రెడ్డి.. ఆణిముత్యం లాంటి ఆటగాడు అతడు మరెవరో కాదు.. నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy). ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తొలి టెస్టు నుంచే బ్యాట్ ఝులిపిస్తున్నాడు. మెల్బోర్న్ టెస్టులో ఏకంగా శతకం(114)తో సత్తా చాటాడు. తద్వారా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో అత్యంత పిన్న వయసులోనే సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా 21 ఏళ్ల నితీశ్ రెడ్డి చరిత్ర సృష్టించాడు.ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ రెడ్డి టీమిండియా టెస్టు జట్టుతో పాతుకుపోవడం ఖాయమంటూ భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో టెస్టుల తర్వాత.. టీమిండియా 2025లో తొలుత ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది.నితీశ్ రెడ్డితో పాటు అతడినీ ఎంపిక చేయండి!అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి చేసుకుని.. జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నితీశ్ రెడ్డితో పాటు ఇంగ్లండ్ టూర్‌కు మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేయాలని మేనేజ్మెంట్కు సూచించాడు.‘‘మెల్బోర్న్ టెస్టు భారత క్రికెట్‌కు అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్‌ను ఇచ్చింది.. అతడి పేరు నితీశ్ కుమార్ రెడ్డి. ఐపీఎల్లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ తరఫున అదరగొట్టడం ద్వారా భారత క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన ఈ కుర్రాడు.. నిజానికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అంత గొప్ప ఏమీ ఆడలేదు. క్రెడిట్ మొత్తం వారికేఅయినప్పటికీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. అతడి బృందం నితీశ్ రెడ్డిపై నమ్మకం ఉంచినందుకు వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. సెలక్టర్ల నమ్మకాన్ని ఈ అబ్బాయి నిలబెట్టుకున్నాడు. ఇక మరో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer)పై కూడా సెలక్టర్లు దృష్టి సారించాలి.అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం మరో సానుకూలాంశం. అయితే, బౌలింగ్ నైపుణ్యాలను కాస్త మెరుగుపరచుకోవాలి. అతడికి ఇప్పటికే ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉంది. కాబట్టి అక్కడ అతడు టెస్టుల్లో రాణించగలడు’’ అని సునిల్ గావస్కర్ స్పోర్ట్స్ స్టార్‌కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.కౌంటీల్లో ఆడిన వెంకటేశ్కాగా 2024లో ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా లంకాషైర్‌కు ప్రాతినిథ్యం వహించాడు వెంకటేశ్ అయ్యర్. మూడు మ్యాచ్‌లు ఆడి 116 పరుగులు చేశాడు. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు తొమ్మిది టీ20లు, రెండు వన్డేలు ఆడిన వెంకటేశ్ అయ్యర్.. ఆయా ఫార్మాట్లలో 133, 24 పరుగులు చేశాడు. అదే విధంగా అంతర్జాతీయ టీ20లలో ఐదు వికెట్లు తీయగలిగాడు.చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? -
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ
కొత్త సంవత్సరం వచ్చేసింది. నవ వసంతాన్ని తెచ్చింది. చేదు జ్ఞాపకాలను వదిలేసి.. మధురానుభూతులను పదిలం చేసుకుంటూ ముందుకు సాగిపొమ్మంటోంది. ఇక నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు అక్కడే కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. ఐదో టెస్టు కోసం మంగళవారమే సిడ్నీకి చేరుకుని న్యూ ఇయర్‌కి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది.అనుష్కతో విరాట్ఇక భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మ(Viat Kohli- Anushka Sharma)తో పాటు దేవ్‌దత్ పడిక్కల్, ప్రసిద్ కృష్ణతో కలిసి కొత్త సంవత్సర వేడులకు హాజరయ్యాడు. మరోవైపు.. యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ తదితరులు కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రోహిత్ శర్మఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 2024కు భావోద్వేగ వీడ్కోలు పలికాడు. ‘‘ఎన్నో ఎత్తు-పళ్లాలు.. అయినప్పటికీ ప్రతి ఒక్కటి గుర్తుండిపోతుంది. థాంక్యూ 2024’’ అంటూ గతేడాదికి సంబంధించిన జ్ఞాపకాలను వీడియో రూపంలో షేర్ చేశాడు.టీ20 ప్రపంచకప్ గెలిచిన సారథిగాకాగా 2024 రోహిత్ శర్మకు ఎన్నో ఆనందాలతో పాటు కొన్ని చేదు జ్ఞాపకాలను ఇచ్చింది. కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్-2024 గెలవడం రోహిత్ కెరీర్లోనే అత్యంత గొప్ప విషయం. అయితే, ఈ మెగా టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలవగానే హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు.ఐపీఎల్లో మాత్రం పరాభవంఇక అంతకంటే ముందే.. అంటే ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడిన రోహిత్ బ్యాటర్‌గా ఆకట్టుకోలేకపోయాడు. జట్టు కూడా పాయింట్ల పట్టికలో అట్టడుగన పదో స్థానంలో నిలిచి ఘోర పరాభవం చవిచూసింది. అయితే, ఆ తర్వాత ప్రపంచ కప్ గెలుపు రూపంలో రోహిత్‌కు ఊరట దక్కింది.అదొక మాయని మచ్చగాఅనంతరం.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్ కావడం రోహిత్ శర్మ కెప్టెన్సీ కెరీర్లోనే ఓ మాయని మచ్చగా మిగిలింది. సొంతగడ్డపై ఇంతకు మునుపెన్నడూ భారత టెస్టు జట్టు ప్రత్యర్థి చేతిలో ఇలా 3-0తో వైట్‌వాష్ కాలేదు. అలా అత్యంత చెత్త కెప్టెన్సీ రికార్డు 2024లో రోహిత్ పేరిట నమోదైంది.కుమారుడి రాకఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలోనూ రోహిత్ శర్మకు 2024 మరుపురానిదిగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. గతేడాదే రోహిత్- రితికా జంట తమ రెండో సంతానం కుమారుడు అహాన్ శర్మకు జన్మనిచ్చారు. ఇక ఈ శుభవార్త తర్వాత ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్ శర్మకు అక్కడ మాత్రం గడ్డు పరిస్థితులే ఎదురయ్యాయి. బ్యాటర్‌గా, సారథిగానూ అతడు విఫలమయ్యాడు.అడిలైడ్ పింక్‌బాల్ టెస్టులో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకున్నా.. మెల్బోర్న్లో నాలుగో టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఇక ఆఖరిదైన సిడ్నీ టెస్టు(జనవరి 3-7)లో గెలిస్తేనే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 ఫైనల్ అవకాశాలను సజీవం చేసుకుంటుంది. చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
BGT: చాలానే చేశారు.. ఇక చాలు.. మండిపడ్డ గంభీర్!
టీమిండియా ఆటగాళ్ల తీరుపట్ల హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమైనందుకు అందరికీ చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా చేశారని.. ఇకముందైనా జాగ్రత్తగా ఉండాలని గౌతీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు వస్తున్నాయి.కాగా గంభీర్ ప్రధాన కోచ్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత వన్డే, టీ20లలో బాగానే రాణిస్తున్న టీమిండియా.. టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవాలు ఎదుర్కొంటోంది. గౌతీ మార్గదర్శనంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయడం మినహా ఇంత వరకు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతోంది.దారుణ వైఫల్యాలుసొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో వైట్‌వాష్ కావడం.. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) చేజార్చుకునే స్థితికి చేరడం విమర్శలకు దారి తీసింది. ఆసీస్‌తో తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. ఆ తర్వాత మాత్రం దారుణమైన ప్రదర్శనతో ఓటములు చవిచూస్తోంది.స్టార్ బ్యాటర్ల వైఫల్యంముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ వంటి స్టార్ బ్యాటర్ల వైఫల్యం కారణంగా భారీ మూల్యం చెల్లిస్తోంది. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో ఆసీస్ గడ్డపై నాలుగు టెస్టులు పూర్తి కాగా భారత జట్టుపై కంగారూలు 2-1తో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఆఖరిదైన ఐదో టెస్టులో గెలిస్తేనే రోహిత్ సేనకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.అదే విధంగా.. ఐదు టెస్టుల సిరీస్‌ను కూడా టీమిండియా 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. లేదంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ చేజారడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి. ఈ నేపథ్యంలో.. పరిస్థితి ఇంతదాకా తీసుకువచ్చిన టీమిండియా ఆటగాళ్లతో పాటు కోచ్‌లపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.చాలా ఎక్కువే చేశారుఇదిలా ఉంటే.. ఇప్పటికే భారత జట్టు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న గంభీర్.. డ్రెసింగ్‌రూమ్‌లో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘కోచ్‌గా నాకు కావాల్సినంత దక్కింది.. చాలా ఎక్కువే చేశారు’’ అంటూ అతడు మండిపడినట్లు తెలిపాయి. కాగా వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియాలో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు తర్వాత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడాన్ని ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. గంభీర్‌తో రోహిత్‌కు సమన్వయం కుదరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆసీస్- భారత్ మధ్య సిడ్నీలో జనవరి 3న ఐదో టెస్టు మొదలుకానుంది. ఇందులో గనుక విఫలమైతే రోహిత్ కెప్టెన్సీతో పాటు.. టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? -
టీమిండియా ప్లేయర్లు అబద్దాల కోరులు: భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సురీందర్ ఖన్నా(Surinder Khanna) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ సేనను ‘అబద్దాల కోరు’గా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేశాడు. సరిగ్గా ఆడటం చేతగాకే సాకులు వెదుక్కొంటూ.. వివాదాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.శుభారంభం చేసినా..భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులో ఆడుతోంది. అయితే, పెర్త్‌లో 295 పరుగుల తేడాతో గెలిచి.. శుభారంభం చేసినా.. తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది.అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో ఓడిపోయిన టీమిండియా.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకుంది. మెల్బోర్న్ వేదికగా ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. కాస్త కష్టపడినా కనీసం డ్రా చేసుకోగలిగే మ్యాచ్‌లో 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.జైస్వాల్ అవుటైన తీరుపై వివాదంఇక ఈ మ్యాచ్‌లో చక్కటి ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుట్((Yashasvi Jaiswal’s controversial dismissal) జరిగిందంటూ) కావడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో జైసూ.. లెగ్‌సైడ్ దిశగా షాట్ ఆడేందుకు యత్నించాడు. అయితే, బంతి వెళ్లి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది.ఈ నేపథ్యంలో ఆసీస్ అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర్ స్పందించలేదు. దీంతో కంగారూలు రివ్యూకు వెళ్లగా.. చాలాసార్లు రీప్లేలో చూసినా స్పష్టత రాలేదు. స్నీకో మీటర్లోనూ బంతి బ్యాట్‌ను లేదంటే గ్లౌవ్‌ను తాకినట్లుగా శబ్దం రాలేదు. అయినప్పటికీ విజువల్ ఎవిడెన్స్ కారణంగా.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ తారుమారు చేస్తూ.. జైస్వాల్‌ను అవుట్‌గా ప్రకటించారు.కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయిఫలితంగా కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయిన టీమిండియా ఓటమికి బాటలు పడ్డాయి. అయితే, తాను అవుట్ కాలేదని టెక్నాలజీ(స్నీకో) చెబుతున్నా అవుట్‌గా ప్రకటించడం పట్ల జైస్వాల్ అంపైర్ల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయినప్పటికీ వాళ్లు అతడిని మైదానం వీడాల్సిందిగా కోరగా.. ఈ విషయమై వివాదం చెలరరేగింది.మండిపడ్డ సన్నీఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్‌తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. జైస్వాల్ స్పష్టంగా నాటౌట్ అని తెలుస్తున్నా.. ఆసీస్‌కు అనుకూలంగా ఎలా వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సురీందర్ ఖన్నా మాత్రం ఈ విషయంలో భిన్నంగా స్పందించాడు. నిజాయితీ ఆడటం నేర్చుకోండి‘‘ఇందులో వివాదం సృష్టించడానికి తావులేదు. నాలుగు కోణాల్లో పరిశీలించిన తర్వాత బంతి బ్యాటర్ గ్లౌవ్‌ను తాకి.. అలెక్స్ క్యారీ చేతుల్లో పడినట్లు తేలింది. ఆకాశ్ దీప్ కూడా ఇలాగే.. తాను క్యాచ్ అవుట్ అయినా.. మైదానం వీడకుండా ఫిర్యాదులు చేస్తూ ఉండిపోయాడు.వీళ్లంతా అబద్దాల కోరులు. ముందు నిజాయితీ ఆడటం నేర్చుకోండి. అప్పుడే మీరు గెలుస్తారు. అయినా, బ్యాట్ మన చేతుల్లోనే ఉన్నపుడు.. అది బంతిని లేదంటే గ్లౌవ్‌ను తాకిందా లేదా స్పష్టంగా తెలుస్తుంది కదా!అందుకే ఓడిపోయాంమనం చెత్తగా ఆడాం కాబట్టే ఓడిపోయాం. ఇంత చెత్తగా ఎవరైనా బ్యాటింగ్ చేస్తారా? రండి వచ్చి ఐపీఎల్లో పరుగులు సాధించండి. మరీ దూకుడుగా ఆడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. సానుకూల దృక్పథంతో ఆడండి.కనీసం కొత్త సంవత్సరంలో అయినా టీమిండియాను అదృష్టం వరిస్తుందో చూడాలి’’ అంటూ సురీందర్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేశాడు. వార్తా సంస్థ IANSతో మాట్లాడుతూ ఈ మేర వ్యాఖ్యానించాడు. కాగా ఢిల్లీకి చెందిన సురీందర్ ఖన్నా 1979- 84 మధ్య టీమిండియా తరఫున 10 వన్డేలు ఆడి.. 176 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్- టీమిండియా మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు సిడ్నీలో జరుగనుంది. జనవరి 3-7 మధ్య ఈ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? -
అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు?
టెస్టుల్లో టీమిండియా పరిస్థితి దారుణంగా తయారైంది. వరుస వైఫల్యాల కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. గత తొమ్మిది టెస్టుల్లో భారత క్రికెట్ జట్టు కేవలం మూడే విజయాలు సాధించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన.. ఆ తర్వాత చేదు అనుభవాలు చవిచూసింది.స్వదేశంలో ఘోర పరాభవంస్వదేశంలోనే న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై తొలిసారి ఇంతటి ఘోర పరాభవం చవిచూసిన జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఈ పరాభవాన్ని మరిపించేలా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో రాణించాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది.ఆసీస్‌లో శుభారంభం చేసినా..ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో ఆసీస్‌ను ఎదుర్కొన్న టీమిండియా.. 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తిరిగి ఫామ్‌లోకి వచ్చిందనే సంకేతాలు ఇచ్చింది. కానీ.. రోహిత్ శర్మ జట్టుతో చేరిన తర్వాత మళ్లీ పాత కథే పునరావృతమైంది.వరుస ఓటములతోఆసీస్తో అడిలైడ్ టెస్టులో ఓడిన టీమిండియా.. బ్రిస్బేన్‌లో వర్షం వల్ల మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. అయితే, మెల్బోర్న్ టెస్టులో మాత్రం చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుని.. 184 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు వదిలేయాలని.. గంభీర్ టెస్టు జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలగాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి.ఈ నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూం వాతావరణం కూడా హీటెక్కినట్లు సమాచారం. రోహిత్, గంభీర్‌పై చర్యలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపక్రమించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.అతడి కోసం పట్టుబట్టిన గంభీర్..ఆసీస్ పర్యటనకు టీమిండియా వెటరన్ బ్యాటర్, టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ను ఎంపిక చేయాలని గంభీర్ సూచించినట్లు సమాచారం. అయితే, సెలక్టర్లు మాత్రం అతడి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. పెర్త్ టెస్టు తర్వాత అయినా.. పుజారాను పిలిపిస్తే బాగుంటుందని గంభీర్ సూచించినా.. మేనేజ్మెంట్ మాత్రం అతడి మాటను పట్టించుకోలేదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.ఆసీస్ గడ్డపై ఘనమైన చరిత్రకాగా పుజారాకు ఆసీస్ గడ్డపై ఘనమైన చరిత్ర ఉంది. 2018-19 బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో పుజారా 1258 బంతులు ఎదుర్కొని.. 521 పరుగులు చేశాడు. తద్వారా భారత్ తరఫున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచి.. టీమిండియా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2020-21 సీజన్లోనూ రాణించాడు. ఇక ఓవరాల్‌గా కంగారూ గడ్డపై పుజారా పదకొండు మ్యాచ్‌లు ఆడి 47.28 సగటుతో 993 పరుగులు చేశాడు.ఇక ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో భాగంగా ఆఖరిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన పుజారా.. 14, 27 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో 36 ఏళ్ల ఈ సౌరాష్ట్ర బ్యాటర్ ఆ తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్ కౌంటీల్లో, దేశీ రంజీల్లో రాణిస్తున్నాడు. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు?ఈ నేపథ్యంలోనే పుజారా గురించి గంభీర్ ప్రస్తావించగా.. సెలక్టర్లు మాత్రం అతడి పేరును పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి గౌతీ మాట చెల్లడం లేదని.. త్వరలోనే అతడిపై వేటు తప్పదనే వదంతులు వ్యాపిస్తున్నాయి.చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
పంత్ జట్టు అవసరాలని గుర్తించాల్సిన అవసరం ఉంది: రోహిత్
ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ ఎప్పుడూ కొత్త సవాళ్లను విసురుతుంది. అదీ ఆస్ట్రేలియా గడ్డ పై జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో పోటీ ఎప్పుడూ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. భారత్ ఆటగాళ్ల క్రీడా జీవితానికి ఇది ఎప్పుడూ కఠిన పరీక్ష గా నిలుస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఈ సిరీస్ కి సన్నద్ధమయ్యే తీరు. ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ గడ్డ పై జరిగే టెస్ట్ సిరీస్ కి అత్యున్నత స్థాయిలో సిద్దమౌవుతారు. అదే స్థాయిలో పోటీ పడతారు. అందుకు భిన్నంగా భారత్ ఆటగాళ్లు ఈ సిరీస్ కి ముందు చాల పేలవంగా ఆడి సొంత గడ్డ పై న్యూజిలాండ్ చేతిలో వరసగా రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమై పరాజయాన్ని చవిచూసారు.అయితే ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ లో జట్టుకి నాయకత్వం వహించిన జస్ప్రీత్ బుమ్రా ఎనిమిది వికెట్లు పడగొట్టి ఒంటిచేత్తో భారత్ ని గెలిపించాడు. అయితే తొలి టెస్ట్ కి వ్యకిగత కారణాల వల్ల దూరమైన రోహిత్ శర్మ రెండో టెస్ట్ లో పునరాగమనం భారత జట్టు సమతుల్యాన్ని దెబ్బతీసింది. ఇందుకు ప్రధాన కారణం రోహిత్ శర్మ పేలవమైన ఫామ్. రోహిత్ శర్మ కి జోడీగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అదే స్థాయిలో ఘోరంగా విఫలవడంతో ప్రస్తుత వారి టెస్ట్ క్రికెట్ జీవితం కొనసాగించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ బాధ్యతారహితమైన షాట్ ల పై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం రిషబ్ పంత్ నాలుగో టెస్ట్ లో చివరి రోజున కొట్టిన దారుణమైన షాట్. టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా పయనిస్తున్న సమయంలో రిషబ్ (104 బంతుల్లో ౩౦ పరుగులు) ఒక చెత్త షాట్ కొట్టి ఆస్ట్రేలియా బౌలర్లకు కొత్త ఉత్సాహాన్ని అందించాడు. దీంతో భారత్ వికెట్లు వడి వడి గా పడిపోవడంతో జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ రిషబ్ పంత్ కొట్టిన షాట్ ఆటలో భాగంగా జరిగిందనీ చెబుతూ అతన్ని హెచ్చరించాడు. పంత్ జట్టు అవసరాలకు అనుగుణంగా తన షాట్ లు కొట్టేందుకు ప్రయత్నించాలి, అని రోహిత్ వ్యాఖ్యానించాడు. "పంత్ జట్టు అవసరాలని గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే అతని హై-రిస్క్ పద్ధతులు గతంలో జట్టుకు అద్భుతమైన విజయాల్ని అందించాయని అంగీకరించాడు. అయితే పంత్ అవుటైన తీరును బాధాకరం అంటూనే అతను జట్టు అవసరాలకి అనుగుణంగా బ్యాటింగ్ చేయాలని సూచించాడు. "రిషబ్ పంత్ స్పష్టంగా జట్టు కి తన నుంచి ఎలాంటి అవసరమో ఉందో అర్థం చేసుకోవాలి," అని రోహిత్ వ్యాఖ్యానించాడు.అయితే పంత్ ని భారత్ మాజీ స్పిన్నర్ దిలీప్ దోషి సమర్ధించాడు. "పంత్ తన ఆటతీరును మార్చడానికి ప్రయత్నించకూడదు. అతను సహజంగానే అద్భుతమైన ఆటగాడు. తన సహజ సిద్ధమైన ఆటతీరుతో జట్టుని చాల సార్లు గెలిపించాడు. కానీ అప్పుడప్పుడు అనుచిత షాట్లతో జట్టుని నిరాశపరుస్తాడు," అని దోషి వ్యాహ్యానించాడు. మెల్బోర్న్ టెస్ట్ ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లతో పాటు రిషబ్ పంత్, హైదరాబాద్ మీడియం పేసర్ మహ్మద్ సిరాజ్ లు సైతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే జట్టులో పంత్ స్థానానికి ప్రస్తుతం ఢోకా లేకపోవచ్చు కానీ అతని బ్యాటింగ్ తీరు పై నిఘా నేత్రం ఉంటుందనేది స్పష్టం. -
సిగ్గుపడాలి!.. భారత్‌కు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) ఘాటు విమర్శలు చేశాడు. గత ఐదేళ్లుగా టెస్టుల్లో ఈ ఢిల్లీ బ్యాటర్ పూర్తిగా నిరాశపరుస్తున్నాడని.. అతడికి బదులు యువ ఆటగాడిని జట్టులోకి తీసుకున్నా బాగుండేదని పేర్కొన్నాడు. కోహ్లి సగటున సాధిస్తున్న పరుగులు చూస్తుంటే.. ఇప్పడిప్పుడే జట్టులోకి వచ్చిన యంగ్ ప్లేయర్లను తలపిస్తున్నాడని విమర్శించాడు.ఆ సెంచరీ మినహా..శతకాల వీరుడు, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి గత కొన్నేళ్లుగా టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)తో బిజీగా ఉన్న కోహ్లి.. పెర్త్ టెస్టులో శతకం మినహా మిగిలిన మూడు టెస్టుల్లో విఫలమయ్యాడు. కంగారూ గడ్డపై గొప్ప చరిత్ర ఉన్న ఈ రన్‌మెషీన్ ఈసారి మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు.ఇప్పటి వరకు ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లో కోహ్లి వరుసగా 5, 100(నాటౌట్), 7, 11, 3, 36, 5 పరుగులు చేశాడు. ఇక ఆసీస్‌తో సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడటంతో.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జట్టుకు భారంగా మారాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు కోహ్లి.భారత క్రికెట్‌కు ఇలాంటి ఆటగాడు అవసరమా?ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్, కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికి ఐదేళ్లు గడిచాయి. ఇలాంటి గొప్ప ఆటగాడి సగటు మరీ 28కి పడిపోతే ఎలా?.. భారత క్రికెట్‌కు ఇలాంటి ఆటగాడు తగునా?ఆ గణాంకాలు చూసి నిజంగా సిగ్గుపడాల్సిందేతమ అత్యుత్తమ ఆటగాడి బ్యాటింగ్ సగటు 28కి దగ్గరగా ఉండటం సబబేనా?.. కచ్చితంగా కానేకాదు. జట్టుకు ఇంతకంటే గొప్పగా ఆడే బ్యాటర్ అవసరం ఉంది. అక్టోబరు 2024 నుంచి అతడి బ్యాటింగ్ సగటు మరీ 21గా ఉంది. టీమిండియాకు ఇలాంటి వాళ్లు అవసరం లేదు.యువ ఆటగాడు కూడా సగటున 21 పరుగులు చేయగలడు. విరాట్ నుంచి మనం కోరుకునేది ఇది కాదు కదా!.. ఓ ఆటగాడి కెరీర్లో సగటు 50 కంటే తక్కువగా ఉందంటే.. ఆ గణాంకాలు చూసి నిజంగా సిగ్గుపడాల్సిందే’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.పదే పదే అదే తప్పు.. తెలివైన వారు అలా చేయరు!కాగా 2020 నుంచి 2024 వరకు కోహ్లి 38 టెస్టుల్లో కలిపి సగటున 31.32తో 2005 పరుగులు మాత్రమే చేశాడు. గత ఏడు టెస్టుల్లో కోహ్లి మరీ దారుణంగా 260 పరుగులకే పరిమితమయ్యాడు. సగటు 21.67. ఇక ఆసీస్‌తో టెస్టుల్లో ఒకే తరహాలో కోహ్లి అవుట్ కావడం పట్ల కూడా ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు చేశాడు.ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడే క్రమంలో ఓసారి విఫలమైనా.. పదే పదే అదే తప్పు పునరావృతం చేశాడని పఠాన్ విమర్శించాడు. తెలివైన ఆటగాళ్లు ఇలా ఒకే రకమైన తప్పులు చేయరంటూ పరోక్షంగా కోహ్లికి చురకలు అంటించాడు. కాగా ఆసీస్- భారత్ మధ్య సిడ్నీలో ఐదో టెస్టు(జనవరి 3-7) జరుగనుంది. రోహిత్ పరిస్థితి మరీ దారుణంఈ మ్యాచ్‌లో రాణిస్తేనే కోహ్లి టెస్టు భవితవ్యం బాగుంటుంది. లేదంటే.. రిటైర్మెంట్ ప్రకటించి.. యువ ఆటగాళ్లకు న్యాయం చేయాలనే డిమాండ్లు మరింత ఎక్కువవుతాయి. కోహ్లి పరిస్థితి ఇలా ఉంటే.. రోహిత్ శర్మ మరీ దారుణంగా ఆడుతూ.. పెద్ద ఎత్తున విమర్శల పాలవుతున్నాడు. వెంటనే అతడు టెస్టులకు గుడ్‌బై చెప్పాలంటూ సూచనలు, సలహాలు ఎక్కువయ్యాయి.చదవండి: Rohit On Pant Batting: నిర్లక్ష్యపు షాట్లతో భారీ మూల్యం.. అతడికి నేనేం చెప్పగలను -
నితీశ్ రెడ్డికి అరుదైన గౌరవం.. బీసీసీఐ వీడియో వైరల్
టీమిండియా నయా సంచలనం, ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)కి అరుదైన గౌరవం దక్కింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(Melbourne Cricket Ground) హానర్స్ బోర్డులో అతడికి చోటు లభించింది. భారత జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా కూడా మరోసారి ఈ గౌరవం దక్కించుకోగా.. ఈ ఇద్దరి పేర్లను బోర్డుపై చేర్చుతున్న సమయంలో నితీశ్ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యాడు.వీడియో షేర్ చేసిన బీసీసీఐఈ ప్రత్యేకమైన క్షణాలను ఫోన్ కెమెరాలో బంధిస్తూ మధురజ్ఞాపకాలను పోగు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ఐదు వికెట్ల హాల్... ప్రత్యేకమైన సెంచరీ... వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తో పాటు నితీశ్ కుమార్ రెడ్డి పేర్లు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ హానర్స్ బోర్డులో చేరిన వేళ’’ అంటూ క్యాప్షన్ జతచేసింది.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. తొలి టెస్టులో భారత్, రెండో టెస్టులో ఆసీస్ గెలుపొందగా.. మూడో టెస్టు డ్రా అయింది. ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టు జరిగింది.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విఫలమైన చోట ఈ బాక్సింగ్ డే మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి శతకంతో చెలరేగాడు. సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విఫలమైన చోట 114 పరుగులతో దుమ్ములేపాడు. చిన్న వయసులోనే ఎంసీజీలో శతకంతద్వారా ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో అత్యంత పిన్న వయసులో భారత్ తరఫున శతకం బాదిన క్రికెటర్‌గా.. 21 ఏళ్ల నితీశ్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ హానర్స్ బోర్డులో నితీశ్ రెడ్డి పేరును లిఖించారు. బుమ్రా మరోసారిఇక ఇదే టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. సామ్ కొన్‌స్టాస్(8), ట్రవిస్ హెడ్(1), మిచెల్ మార్ష్(0), అలెక్స్ క్యారీ(2), నాథన్ లియాన్(41) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో ఐదు వికెట్ల ప్రదర్శన(5/57) నమోదు చేసినందుకు గానూ బుమ్రా పేరు కూడా హానర్స్ బోర్డులో రాశారు. కాగా 2018లోనూ బుమ్రా ఇలాంటి ఘనత సాధించి.. తొలిసారి హానర్స్ బోర్డులోకెక్కాడు. ఇక 2020లో అజింక్య రహానే 112 పరుగులు చేసి తన పేరు(మొత్తంగా రెండుసార్లు)ను లిఖించుకున్నాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ విరాట్ కోహ్లి, ఛతేశ్వర్ పుజారా తదితరులు కూడా ఈ గౌరవం దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. మెల్బోర్న్ టెస్టులో టీమిండియా ఆసీస్ చేతిలో 184 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని చవిచూసింది. ఆఖరి టెస్టు గెలిస్తేనేఫలితంగా ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ అవకాశాలను మెరుగుపరచుకుంది. ఇక ఇరుజట్ల మధ్య సిడ్నీ వేదికగా జనవరి 3న ఈ సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవడంతో పాటు.. శ్రీలంకతో సిరీస్‌లో ఆసీస్ టెస్టు ఫలితాలపై భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.చదవండి: Rohit On Pant Batting: నిర్లక్ష్యపు షాట్లతో భారీ మూల్యం.. అతడికి నేనేం చెప్పగలను Magnificent 5️⃣-wicket haul 🤝 Special Maiden 💯Vice Captain Jasprit Bumrah and Nitish Kumar Reddy's names are etched on the Honours Board of Melbourne Cricket Ground ✍️ 👏#TeamIndia | #AUSvIND | @Jaspritbumrah93 | @NKReddy07 pic.twitter.com/4tat5F0N6e— BCCI (@BCCI) December 31, 2024