
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ సెమీస్ పోరులో 4 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించిన భారత్.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. భారత విజయంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి కీలక పాత్రపోషించాడు.
లక్ష్య చేధనలో కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 98 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. అతడితో పాటు కేఎల్ రాహుల్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 28) సత్తాచాటారు.
ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్, జంపా రెండు వికెట్లు పడగొట్టగా.. బెన్ ద్వార్షుయిస్, కొన్నోలీ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆలౌటైంది. భారత బౌలర్లలలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(96 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ తో 73) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అలెక్స్ కేరీ(61) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
టీమిండియా ప్రపంచ రికార్డు..
ఇక ఈ విజయంతో టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఈ విజయంతో టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో వరుసగా మూడుసార్లు (2013, 2017, 2025) ఫైనల్లోకి ప్రవేశించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.
గతంలో ఆస్ట్రేలియా 2006 2009లో బ్యాక్-టు-బ్యాక్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఆడింది. అదేవిధంగా ఐసీసీ టోర్నీలలో అత్యధికంగా ఫైనల్‌కు చేరుకున్న జట్టుగా టీమిండియా రికార్డులకెక్కింది. భారత్ ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు చేరడం ఇది 14వ సారి కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ రికార్డు వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా(13) పేరిట ఉండేది. తాజా విజయంతో ఆసీస్ ఆల్‌టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది.
చదవండి: ఆఖరి వరకు ఏమీ చెప్పలేం.. వారిద్దరి వల్లే ఈ విజయం: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment