ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సారథిగా, బ్యాటర్‌గా రోహిత్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్‌మ్యాన్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు.
కానీ తన కెప్టెన్సీ మార్క్‌ను మాత్రం చూపించలేకపోయాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రోహిత్ 5 ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. అటు కెప్టెన్‌గా అడిలైడ్, మెల్‌బోర్న్‌లో రోహిత్ ఘోర ఓటములను చవిచూశాడు.
అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్‌లోనూ రోహిత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. అతడి సారథ్యంలోని టీమిండియా కివీస్ చేతిలో 3-0 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. ఇప్పుడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ అదే తీరును కనబరుస్తుండండంతో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
రోహిత్ శర్మపై వేటు..
ఈ క్రమంలో సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరగనన్న ఆఖరి టెస్టుకు రోహిత్ శర్మను పక్కన పెట్టాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సిడ్నీ టెస్టుకు ముందు విలేకరుల సమావేశంలో పాల్గోన్న భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది.
సిడ్నీ టెస్టులో రోహిత్ ఆడనున్నాడా? అని ఓవిలేకరి ప్రశ్నించాడు. అందుకుకు బదులుగా" రేపు(శుక్రవారం) ఉయదం పిచ్ చూసిన తర్వాత మా ప్లేయింగ్ ఎలెవన్‌పై నిర్ణయం తీసుకుంటామని" గంభీర్ సమాధనమిచ్చాడు. కాగా ఐదో టెస్టుకు ముందు రోహిత్ శర్మపై వేటు పడడం దాదాపు ఖాయమైనట్లగా అన్పిస్తోంది.
ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పాల్గోకపోవడం, స్లిప్ క్యాచింగ్ ప్రాక్టీస్‌లో కూడా రోహిత్ పాల్గోకపోవడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. అంతేకాకుండా ప్రాక్టీస్ సెషన్‌లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, గంభీర్‌లు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో సిడ్నీ టెస్టులో భారత జట్టు పగ్గాలు బుమ్రా చేపట్టే సూచనలు కన్పిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ దూరమైతే శుబ్‌మన్ గిల్ తిరిగి తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
చదవండి: IND vs AUS: భారత డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన గంభీర్
Comments
Please login to add a commentAdd a comment