Pat Cummins
-
IPL 2025: మా ఓటమికి ప్రధాన కారణం అదే: ప్యాట్ కమిన్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు మారలేదు. ఐపీఎల్-2025 (IPL 2025)లో తమ ఆరంభ మ్యాచ్‌లో మురిపించిన కమిన్స్ బృందం.. ఆ తర్వాత పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్.. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో ఓడి హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసింది.ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్.. ఐపీఎల్-2024 రన్నరప్ సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ఆరంభంలో బాగానే రాణించింది. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ కేకేఆర్ క్రమంగా పుంజుకుంది.దుమ్ములేపిన కేకేఆర్ బ్యాటర్లుకెప్టెన్ అజింక్య రహానే (38), అంగ్క్రిష్ రఘువన్షీ(32 బంతుల్లో 50), వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 60), రింకూ సింగ్ (17 బంతుల్లో 32 నాటౌట్).. ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins), మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.Lighting up Eden Gardens with some fireworks 💥 Sit back and enjoy Rinku Singh and Venkatesh Iyer's super striking 🍿👏5⃣0⃣ up for Iyer in the process!Updates ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/AAAqnOsRy8— IndianPremierLeague (@IPL) April 3, 2025 మూకుమ్మడిగా విఫలంఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (4), అభిషేక్ శర్మ(2).. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్(2) మూకుమ్మడిగా విఫలమయ్యారు. నితీశ్ కుమార్ రెడ్డి (19), కమిందు మెండిస్ (27), హెన్రిచ్ క్లాసెన్ (33) కూడా నిరాశపరిచారు.ఫలితంగా కేకేఆర్ చేతిలో 80 పరుగుల భారీ తేడాతో రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ‘‘వికెట్ బాగానే ఉంది. కానీ మేమే సరిగ్గా ఆడలేకపోయాం.తొలుత క్యాచ్‌లు వదిలేశాం. ఆఖర్లో పరుగులు సమర్పించుకున్నాం. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం. ఇప్పటికైనా పొరపాట్లు సరిచేసుకోవాలి. సమీక్ష నిర్వహించి .. మరింత మెరుగైన ఆప్షన్ల కోసం ప్రయత్నించాలి.ఫీల్డింగ్ తప్పిదాల వల్లే ఓటమిమా బ్యాటర్లు అత్యుత్తమ ప్రదర్శనతో ఎన్నోసార్లు విజయాలు సాధించారు. కానీ ఈసారి మాత్రం అలా జరుగలేదు. అయితే, ఫీల్డింగ్ తప్పిదాల వల్లే మేము భారీ మూల్యం చెల్లించాం. ఓవరాల్‌గా చూస్తే బౌలింగ్ మాత్రం ఫర్వాలేదు.ఆరంభంలో క్యాచ్‌లు వదిలేయడం తీవ్ర ప్రభావం చూపింది. మేము కేవలం మూడు ఓవర్లే స్పిన్ వేశాం. బంతిపై మాకు అంతగా గ్రిప్ దొరకలేదు. అందుకే ఆడం జంపాను ఆడించలేదు. వరుస ఓటములు నిరాశపరిచాయి.అయితే, ఈ విషయాన్ని తలచుకుని కుంగిపోవాల్సిన పనిలేదు. తదుపరి సొంత మైదానంలో ఆడబోతున్నాం. అది మాకు సానుకూలాంశం’’ అని కమిన్స్ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. కాగా సీజన్ ఆరంభంలో రాజస్తాన్ రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో గెలిచిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత లక్నో చేతిలో ఐదు వికెట్ల తేడాతో, ఢిల్లీ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.ఐపీఎల్-2025: కేకేఆర్ వర్సెస్ సన్‌రైజర్స్👉కేకేఆర్ స్కోరు: 200/6 (20)👉సన్‌రైజర్స్ స్కోరు: 120 (16.4)👉ఫలితం: సన్‌రైజర్స్‌పై 80 పరుగుల తేడాతో కేకేఆర్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వైభవ్ అరోరా (3/29).చదవండి: IPL 2025: గుజరాత్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన రబాడ -
SRH: వాళ్లిద్దరు కలిసి 217 పరుగులు ఇచ్చారు.. ఇలా అయితే కష్టమే!
ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్‌ను ఘనంగా ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. అదే జోరును కొనసాగించలేకపోతోంది. తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను 44 పరుగుల తేడాతో ఓడించిన కమిన్స్ బృందం.. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది.ఉప్పల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిన రైజర్స్.. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో గురువారం తలపడనున్న సన్‌రైజర్స్.. గత సీజన్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉంది.వాళ్లిద్దరు కలిసి 217 పరుగులు ఇచ్చారుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్‌రైజర్స్ ప్రధాన బౌలర్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ ధారాళంగా పరుగులు ఇవ్వడం ఆందోళనకరంగా పరిణమించిందని పేర్కొన్నాడు.కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు మాట్లాడుతూ.. ‘‘సన్‌రైజర్స్‌కు ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య ఇదే. మహ్మద్ షమీ, ప్యాట్ కమిన్స్.. ఇప్పటి వరకు సంయుక్తంగా 18 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 217 పరుగులు ఇచ్చుకున్నారు.దీనిని బట్టి ప్రత్యర్థి బ్యాటర్లు వీరిద్దరి బౌలింగ్‌లో ఎంతలా చితక్కొడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. షమీ, కమిన్స్ బౌలింగ్ మెరుగుపడితేనే సన్‌రైజర్స్ పరిస్థితి బాగుంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.అదే విధంగా.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. ‘‘జట్టులో ఒక స్పిన్నర్‌కే ఛాన్స్ ఇస్తారనిపిస్తోంది. సిమర్జీత్ పునరాగమనం చేస్తాడు.అయితే, గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన జీషన్ అన్సారీని మాత్రం తుదిజట్టు నుంచి పక్కనపెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో సిమర్జీత్ ఆడొచ్చు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.గత మ్యాచ్‌లో (ఢిల్లీ క్యాపిటల్స్) సన్‌రైజర్స్ తుదిజట్టు ఇదేట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ.కేకేఆర్దీ అదే పరిస్థితిఇదిలా ఉంటే.. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా పరిస్థితి కూడా రైజర్స్ కంటే భిన్నంగా ఏమీలేదు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఏడు వికెట్ల తేడాతో రహానే సేన ఓటమి పాలైంది. అనంతరం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో గెలిచిన కేకేఆర్.. అదే జోరును కొనసాగించలేకపోయింది. చివరగా ముంబై ఇండియన్స్‌తో తలపడి ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఇప్పుడు సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.చదవండి: నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించింది: సెహ్వాగ్ ప్రశంసలుTrust the process 🔄💪#PlayWithFire | #KKRvSRH | #TATAIPL2025 pic.twitter.com/pvVEwjV95c— SunRisers Hyderabad (@SunRisers) April 3, 2025 -
అదే మా కొంపముంచింది.. లేదంటే విజయం మాదే: ఎస్ఆర్హెచ్ కెప్టెన్
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై విజయం సాధించిన ఎస్ఆర్హెచ్.. ఆ తర్వాత వరుసగా రెండు ఓటములను చవిచూసింది. తాజాగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆరెంజ్ ఆర్మీ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్(32), హెడ్(22) పరుగులతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం బౌలింగ్‌లోనూ సన్‌రైజర్స్ తేలిపోయింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(38), అభిషేక్ పోరెల్(34) రాణించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫలమ్యే తమ ఓటమికి కారణమని కమ్మిన్స్ చెప్పుకొచ్చాడు."మేము అన్ని విభాగాల్లో విఫలమయ్యాము. తొలుత స్కోర్ బోర్డులో తగనన్ని పరుగులు ఉంచలేకపోయాము. కొన్ని తప్పు షాట్లు ఆడి మా వికెట్లను కోల్పోయాము. డీప్‌లో క్యాచ్‌లు అందుకోవడం ఈ ఫార్మాట్లో సర్వ సాధారణమే. ఇదే మా ఓటమికి కారణమని నేను అనుకోను. గత రెండు మ్యాచ్‌ల్లో మాకు ఏదీ కలిసి రాలేదు. కచ్చితంగా ఈ ఓటములపై సమీక్ష చేస్తాము. మాకు అందుబాటులో ఉన్న అప్షన్స్ను పరిశీలిస్తాము. అనికేత్ వర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నమెంట్‌కు కూడా డొమాస్టిక్ క్రికెట్లో అతడు తన ప్రదర్శనతో అందరని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను ఇక్కడ కొనసాగిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా అతడు తన బ్యాటింగ్‌తో మైమరిపించాడు. ఈ రెండు ఓటములపై మేము పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఈ టోర్నీలో మాకు ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌ల్లో తిరిగి పుంజుకుంటామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. -
SRH: ‘రోడ్ల’ మీద బౌలింగ్ చేయించడం మానుకోండి: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ (Michael Vaughan) కీలక సూచనలు చేశాడు. ‘రోడ్ల’పై బౌలింగ్ చేయించే వైఖరికి స్వస్తి పలకాలని.. బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదని హితవు పలికాడు. మేటి బౌలర్లు జట్టులో ఉన్నా.. బౌలింగ్ కోసం స్పెషలిస్టు బ్యాటర్ల మీద ఆధారపడాల్సిన దుస్థితి ఇందుకు నిదర్శమని పేర్కొన్నాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో సన్‌రైజర్స్ తమ ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. సొంత మైదానం ఉప్పల్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై 286 పరుగులు స్కోరు చేసింది. అయితే, రాయల్స్ కూడా అంత తేలికగ్గా తలవంచలేదు. 242 రన్స్ చేసింది.రైజర్స్‌కు చేదు అనుభవంఇక రెండో మ్యాచ్‌లో మాత్రం రైజర్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో ఉప్పల్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో కమిన్స్ బృందం 190 పరుగులకే కుప్పకూలింది. మరోవైపు.. రైజర్స్ బ్యాటింగ్ పవర్ రుచిని వారికే చూపిస్తూ.. ఆట అంటే ఇట్టా ఉండాలి అన్నట్లుగా లక్నో స్టార్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఈ పవర్ హిట్టర్‌ను కట్టడి చేయాలని రైజర్స్ బౌలర్లు ఎంతగా కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. 26 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. ఆఖరికి కమిన్స్ అద్భుత బంతితో అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఎట్టకేలకు సన్‌రైజర్స్‌కు బ్రేక్ దొరికింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 16.1 ఓవర్లలోనే లక్నో లక్ష్యాన్ని ఛేదించింది.Raining sixes in Hyderabad... but by #LSG 🌧Nicholas Pooran show guides LSG to 77/1 after 6 overs 👊Updates ▶ https://t.co/X6vyVEvxwz#TATAIPL | #SRHvLSG | @LucknowIPL pic.twitter.com/K2Dlk5AXQw— IndianPremierLeague (@IPL) March 27, 2025 400కు పైగా పరుగులుఇక తొలి రెండు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ బ్యాటర్ల గురించి పక్కనపెడితే.. బౌలర్లు మాత్రం బాధితులుగా మిగిలిపోయారు. మహ్మద్ షమీ, కమిన్స్, హర్షల్ పటేల్, ఆడం జంపా.. ఇలా జట్టులోని బౌలింగ్ విభాగం అంతా కలిసి ఇప్పటికే 400 (242, 193)కు పైగా పరుగులు సమర్పించుకున్నారు.కాగా లక్నోతో మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కూడా బౌలింగ్‌కు రావడం గమనార్హం. అతడు ఒకే ఒక్క బంతి వేయగా ప్రత్యర్థి బ్యాటర్ ఫోర్ బాదాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ మైకేల్ వాన్ మాట్లాడుతూ.. ‘‘ఎస్ఆర్హెచ్ ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి.తమ బౌలర్లు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్లు రోడ్లమీద బౌలింగ్ చేస్తున్నారు. జంపా ఆటను నాశనం చేశారు. షమీ ఓవర్‌కు 12 పరుగుల చొప్పున ఇచ్చాడు. అందుకే సన్‌రైజర్స్ జాగ్రత్త పడాలి.రోడ్ల మీద బౌలింగ్ చేయించడం మానుకోండిసొంత మైదానంలో రోడ్ల మీద బౌలింగ్ చేయించే పనులు మానుకోవాలి. ఇది ఇలాగే కొనసాగితే వేరే వేదికలపై మీ బౌలర్లు రాణించలేరు. అప్పటికే వాళ్లు ఆత్మవిశ్వాసం కోల్పోయి.. వేరే చోట బౌలింగ్ చేయాలంటే భయపడిపోయే స్థితికి వస్తారు’’ అని వాన్ చురకలు అంటించాడు.ఇక లక్నోతో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌తో బ్యాటింగ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘నాకు తెలిసి కమిన్స్‌కు కొత్త బౌలర్ దొరికి ఉంటాడు. వాళ్లు సొంత గ్రౌండ్లో ఐదో మ్యాచ్ ఆడే సరికి ఇషాన్ కిషన్ మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వస్తదేమో!.. ఎందుకంటే మిగతా బౌలర్లు ..‘ఈ రోడ్ల మీద మేము బౌలింగ్ చేయలేము అని చేతులెత్తేస్తారు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. క్రిక్‌బజ్ షోలో ఈ మేరకు వాన్ వ్యాఖ్యలు చేశాడు.చదవండి: BCCI: అతడికి ఈసారి టాప్ గ్రేడ్.. తొలిసారి వీళ్లకు వార్షిక కాంట్రాక్టులు! -
అది ప్రపంచంలోనే బెస్ట్ వికెట్.. వాళ్లు అద్భుతంగా ఆడారు: కమిన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తొలి ఓటమి ఎదురైంది. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన కమిన్స్ బృందం.. రెండో మ్యాచ్‌లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరిచింది. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది.ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) మాట్లాడుతూ.. ఉప్పల్ పిచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మొన్నటికి.. ఇప్పటికి వికెట్ వేరుగా ఉంది. నిజానికి మేము మరికొన్ని పరుగులు చేయాల్సింది.ప్రపంచంలోనే అత్యుత్తమ పిచ్గత మ్యాచ్‌లోని పిచ్ ప్రపంచంలోనే అత్యుత్తమ పిచ్. ఇక ఈ మ్యాచ్‌లో మేము 190 పరుగులు చేయగలడం సానుకూల అంశమే. ఈరోజు వికెట్ బాగానే ఉంది. దీనిని రెండో అత్యుత్తమ పిచ్‌గా చెప్పవచ్చు’’ అని పేర్కొన్నాడు.కాగా సొంతమైదానం ఉప్పల్‌లో తొలుత రాజస్తాన్ రాయల్స్‌తో తలపడిన సన్‌రైజర్స్.. 286 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో రాయల్స్‌ను 242 పరుగులకే కట్టడి చేసి.. 44 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. కానీ గురువారం సీన్ రివర్స్ అయింది.లక్నోతో మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ప్రత్యర్థి జట్టు బౌలర్ల ధాటికి రైజర్స్ 190 పరుగులకే పరిమితమైంది. ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 47), నితీశ్ రెడ్డి (28 బంతుల్లో 32), క్లాసెన్ (17 బంతుల్లో 26), కమిన్స్ (4 బంతుల్లో 18) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. యువబ్యాటర్ అనికేత్ వర్మ (Aniket Verma) మాత్రం అద్భుత ఇన్నింగ్స్(13 బంతుల్లో 36) ఆడాడు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఉత్తమంగా (4/34) రాణించాడు. 3⃣6⃣ runs5⃣ massive sixes 🔥Aniket Verma's explosive cameo gave #SRH the much-needed late flourish 🧡Updates ▶ https://t.co/X6vyVEvxwz#TATAIPL | #SRHvLSG | @SunRisers pic.twitter.com/21gh3f2jZR— IndianPremierLeague (@IPL) March 27, 2025 ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నోను రైజర్స్ బౌలర్ల కట్టడి చేయలేకపోయారు. ఆరంభంలోనే ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్(1)ను అవుట్ చేసినా.. మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52), నికోలస్ పూరన్(26 బంతుల్లో 72)ల దూకుడుకు కళ్లెం వేయలేకపోయారు. వీరి అద్భుత అర్ధ శతకాల కారణంగా లక్నో 16.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి గెలుపొందింది.లక్నో బ్యాటర్లు అద్భుతంగా ఆడారుఈ క్రమంలో ఓటమి తర్వాత ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘లక్నో బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. వాళ్ల బౌలర్లు కూడా రాణించారు. ఏదేమైనా మేము 190 పరుగులు స్కోరు చేయడం మంచి విషయమే. ప్రతి మ్యాచ్ సరికొత్తగానే ఉంటుంది. గత మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ శతకంతో చెలరేగాడు.ఈసారి అతడు డకౌట్ అయ్యాడంటే.. అది లక్నో బౌలర్ల ప్రతిభ వల్లే. వారు మాకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. ఇలాంటివి ఆటలో సహజం. దీనికే మేము కుంగిపోవాల్సిన పనిలేదు. మా జట్టులో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. వారిలో ఒకరో ఇద్దరో కచ్చితంగా ప్రభావం చూపిస్తారు. అయితే, ఈరోజు మేము మరింత గొప్పగా ఆడాల్సింది.తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెడతాంటోర్నీలో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. ఈ పరాజయం నుంచి త్వరగా కోలుకుని.. తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెడతాం’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కమిన్స్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో పాటు.. కీలకమైన మార్ష్, పూరన్‌ల వికెట్లను దక్కించుకున్నాడు. ఇక తదుపరి సన్‌రైజర్స్ ఆదివారం (మార్చి 30) ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఇందుకు ఢిల్లీ సెకండ్ హోం గ్రౌండ్ విశాఖపట్నంలోని డాక్టర్ వైస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక.చదవండి: BCCI: అతడికి ఈసారి టాప్ గ్రేడ్.. తొలిసారి వీళ్లకు వార్షిక కాంట్రాక్టులు! -
మా బెస్ట్ ఇవ్వలేకపోయాం.. గెలిచినందుకు సంతోషం: పంత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరైన రైజర్స్‌కే షాకిస్తూ.. సొంతమైదానంలోనే కమిన్స్ బృందానికి చుక్కలు చూపించింది. బిగ్ రిలీఫ్ఇటు బౌలర్లు.. అటు బ్యాటర్లు.. సమిష్టి ప్రదర్శనతో రాణించగా.. లక్నో కెప్టెన్‌గా టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌కు తొలి గెలుపు దక్కింది. ఈ నేపథ్యంలో విజయానంతరం పంత్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘నిజంగా మాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే ఫలితం ఇది. గెలిచినప్పుడు పొంగిపోయి.. ఓడినపుడు కుంగిపోయే రకం మేము కాదు. జట్టుగా మా నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెడతాం. మా మెంటార్ ప్రతిసారీ ఇదే చెబుతారు. మన పరిధిలో ఉన్న అంశాల గురించి మాత్రమే ఆలోచించాలని.. వాటి ద్వారా లబ్ది పొందేందుకు అత్యుత్తమ మార్గాలు అన్వేషించాలని అంటారు. ఈరోజు నేను అదే చేశాను.మా బెస్ట్ ఇవ్వలేకపోయాం.. పర్లేదు గెలిచాంమా బౌలర్లు ప్రిన్స్, ఠాకూర్ అద్భుతంగా ఆడారు. ఇక పూరన్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడిని మూడో స్థానంలో ఆడిస్తే బాగుంటుందని అనుకున్నాం. తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఈరోజు అతడు అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.మా జట్టు మొత్తం రాణించింది. మా స్థాయికి తగ్గ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాం. అయినప్పటికీ గెలుపొందినందుకు సంతోషంగా ఉంది’’ అని రిషభ్ పంత్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో లక్నో తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. విశాఖపట్నంలో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. వికెట్ కీపర్‌గా పంత్ చేసిన తప్పిదం కారణంగా భారీ మూల్యమే చెల్లించుకుంది.రైజర్స్ దూకుడుకు లక్నో బౌలర్ల కళ్లెం ఈ నేపథ్యంలో తాజాగా తదుపరి సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ఆడిన లక్నో ఉప్పల్ మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. సొంత గ్రౌండ్లో రైజర్స్ బ్యాటింగ్ సత్తా ఏమిటో తెలిసీ పంత్ ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే, కెప్టెన్ నమ్మకాన్ని లక్నో బౌలర్లు నిలబెట్టారు.రైజర్స్ పవర్ హిట్టర్లు అభిషేక్ శర్మ(6), ఇషాన్ కిషన్(0)లను శార్దూల్ ఠాకూర్ వెనువెంటనే పెవిలియన్‌కు పంపగా.. ప్రమాదకర బ్యాటర్లు ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 47)ను అవుట్ చేసిన ప్రిన్స్ యాదవ్.. హెన్రిచ్ క్లాసెన్(26)ను రనౌట్‌గా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో అనికేత్ వర్మ(13 బంతుల్లో 36) మెరుపులు మెరిపించగా.. దిగ్వేశ్ రాఠీ అతడిని అవుట్ చేశాడు.అయితే, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి స్కోరును 200 దాటించే ప్రయత్నం చేయగా.. ఆవేశ్ ఖాన్ అతడి దూకుడుకు కళ్లెం వేశాడు. ఈ క్రమంలో రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో శార్దూల్ (4/34) నాలుగు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నికోలస్ పూరన్ తుపాన్ ఇన్నింగ్స్‌ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52) లక్నోకు శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్(1) మరోసారి విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్ తుపాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం 26 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో డేవిడ్ మిల్లర్ (7 బంతుల్లో 13), అబ్దుల్ సమద్ (8 బంతుల్లో 22) ధనాధన్ బ్యాటింగ్‌తో అజేయంగా నిలిచి లక్నోను విజయతీరాలకు చేర్చారు.ఐపీఎల్-2025: సన్‌రైజర్స్ వర్సెస్ లక్నో👉వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్👉టాస్: లక్నో.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 190/9 (20)👉లక్నో స్కోరు: 193/5 (16.1)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై లక్నో గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శార్దూల్ ఠాకూర్ (4/34).చదవండి: IPL 2025: 13 బంతుల్లో విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ నయా హీరో! ఎవరీ అనికేత్? Hyderabad conquered ✅Win secured ✅#LSG get their first 𝐖 of #TATAIPL 2025 with a comfortable victory over #SRH 💙Scorecard ▶ https://t.co/X6vyVEvxwz#SRHvLSG | @LucknowIPL pic.twitter.com/7lI4DESvQx— IndianPremierLeague (@IPL) March 27, 2025 -
300 సాధ్యమే.. లక్నో బ్యాటింగ్ ఆర్డర్ కూడా ప్రమాదకరమైందే: SRH కోచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో తమ ఆరంభ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిన ఈ జట్టు.. రాజస్తాన్ రాయల్స్‌పై 286 పరుగుల స్కోరు నమోదు చేసింది. ఇక తదుపరి మ్యాచ్‌లో భాగంగా గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో రైజర్స్ తలపడనుంది.ఈ నేపథ్యంలో సొంతమైదానం ఉప్పల్ చెలరేగి ఆడే సన్‌రైజర్స్.. 300 పరుగుల మార్కును అందుకుంటుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ విషయంపై సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ (James Franklin) స్పందించాడు.300 సాధ్యమే.. ‘‘ఇలా జరగదని.. నేను ఎన్నటికీ చెప్పను. ఈ సీజన్లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో 230, 240 స్కోర్లు దాటాయి. కాబట్టి తాజా ఎడిషన్‌లో 300 పరుగుల మార్కు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మా జట్టు ఈ స్కోరుకు దగ్గరగా వచ్చింది. కాబట్టి.. 300 స్కోరు అనే మాటను కొట్టిపారేయలేం’’ అని రైజర్స్- లక్నో మ్యాచ్‌కు ముందు ఫ్రాంక్లిన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.లక్నో బ్యాటింగ్ ఆర్డర్ కూడా ప్రమాదకరమైందేఅదే విధంగా లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి ప్రస్తావన రాగా... ‘‘ఎల్ఎస్జీ బ్యాటింగ్ విభాగం ప్రమాదకరమైనది. ఆ జట్టులో టాపార్డర్ బ్యాటర్లు అద్భుతమైన ఆటగాళ్లు. వారిని ఎదుర్కోవాలంటే మూస తరహా వ్యూహాలు సరిపడవు. మేము కాస్త సృజనాత్మకంగా ఆలోచించాల్సి ఉంటుంది. వారి బ్యాటర్లను కట్టడి చేయడానికి మా బౌలింగ్ విభాగం బాగానే కష్టపడాల్సి ఉంటుంది’’ అని జేమ్స్ ఫ్రాంక్లిన్ చెప్పుకొచ్చాడు.కాగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు టీమిండియా స్టార్ మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, సిమ్రన్‌జిత్ సింగ్‌లతో సన్‌రైజర్స్ పేస్ దళం పటిష్టంగా ఉంది. మరోవైపు లక్నో జట్టులో ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, కెప్టెన్ రిషభ్ పంత్, డేవిడ్ మిల్లర్ రూపంలో పవర్ హిట్టర్లు ఉన్నారు.ఇక ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలుపొందగా.. లక్నో మాత్రం పరాజయాన్ని చవిచూసింది. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క వికెట్ తేడాతో పరాజయం పాలైంది.ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ జట్టుట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, సచిన్ బేబి, జయదేవ్ ఉనాద్కట్, జీషన్ అన్సారీ, ఆడం జంపా, వియాన్ ముల్దర్, రాహుల్ చహర్, కమిందు మెండిస్, అథర్వ టైడే, ఈషన్ మలింగలక్నో సూపర్ జెయింట్స్ జట్టుఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, రిషభ్ పంత్(కెప్టెన్/వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి, మణిమరన్ సిద్ధార్థ్, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, ఆర్ఎస్ హంగ్రేకర్, ఆకాశ్ మహరాజ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, యువరాజ్ చౌదరి, మయాంక్ యాదవ్.చదవండి: ‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా? ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు’ -
ఐపీఎల్లో నేడు (మార్చి 27) సన్‌రైజర్స్ మ్యాచ్.. 300 చూడగలమా..?
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 27) ఆసక్తికర సమరం జరుగనుంది. అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వై నాట్ 300 అని టార్గెట్ పెట్టుకున్న తమ జట్టు ఈ మ్యాచ్‌లో తప్పక టార్గెట్‌ను రీచ్ అవుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. సన్‌రైజర్స్ ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్‌లోనే టార్గెట్ 300ను దాదాపుగా రీచ్ అయినంత పని చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 286 పరుగులు చేసింది.తొలి మ్యాచ్‌లో మిస్ అయిన టార్గెట్ 300ను నేటి మ్యాచ్‌లో తప్పక రీచ్ అవ్వాలని ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు కూడా పట్టుదలగా ఉన్నారు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ జట్టు 300 పరుగులు చేయలేదు. ఐపీఎల్లో టాప్-3 అత్యధిక స్కోర్లు (287, 286, 277) సన్‌రైజర్స్ ఖాతాలోనే ఉన్నాయి. ఈ సీజన్లో సన్‌రైజర్స్ తప్పక 300 మార్కును తాకుతుందని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు. దీని కోసమే సన్‌రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్‌ను అభిమానులు ఫాలో అవుతున్నారు.నేడు మ్యాచ్ జరుగబోయే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. ప్రస్తుతం సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే.. నేటి మ్యాచ్‌లో మరోసారి పరుగుల వరద పారడం ఖాయమని తెలుస్తుంది. నాలుగు రోజుల క్రితం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 286 పరుగులు చేయగా.. ఛేదనలో రాయల్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా 242 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ 44 పరుగుల తేడాతో ఓడినా అద్భుతంగా పోరాడింది.రాయల్స్ మ్యాచ్‌తో సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మిగతా సన్‌రైజర్స్ ఆటగాళ్లు కూడా 200పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించారు. హెడ్ అర్ద సెంచరీ చేశాడు. అభిషేక్, క్లాసెన్ తమదైన శైలిలో ఉన్న కాసేపు విధ్వంసం సృష్టించారు. నితీశ్ రెడ్డి కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.ఐపీఎల్లో సన్‌రైజర్స్, లక్నో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో లక్నో మూడు గెలువగా.. సన్‌రైజర్స్ కేవలం ఒకే మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్సే విజయం సాధించింది. గత సీజన్లో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ తొలి అర్ద భాగంలోనే ఛేదించి, 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ సీజన్లో సన్‌రైజర్స్, లక్నో రెండూ బలంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో విధ్వంసకర వీరులున్నారు. సన్‌రైజర్స్‌లో అభిషేక్, హెడ్, ఇషాన్, క్లాసెన్, నితీశ్ ఉంటే.. లక్నోలో మిచెల్ మార్ష్, పూరన్, మార్క్రమ్, మిల్లర్, పంత్ ఉన్నారు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడినా లక్నో బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మార్ష్, పూరన్ సుడిగాలి అర్ద శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్లు కూడా రాణించారు. అయితే ప్రత్యర్ధి ఆటగాళ్లు అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. గత మ్యాచ్‌తో పోలిస్తే నేటి మ్యాచ్‌లో లక్నో బౌలింగ్ మరింత బలపడనుంది. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఆవేశ్ ఖాన్ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగవచ్చు.తుది జట్లు (అంచనా)..సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ , అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్లక్నో: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, మణిమారన్ సిద్దార్థ్ -
జట్టు స్వరూపమే మారిపోయింది.. కావ్యా మారన్‌కు ఇంతకంటే ఏం కావాలి?
గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లో కొన్ని కీలక మార్పులు చేసింది. అందులో మొదటిది ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్, పేస్ బౌలర్ పాట్ కమిన్స్ (Pat Cummins)కి నాయకత్వ బాధ్యతలను అప్పగించడం.. రెండోది ఆస్ట్రేలియాకే చెందిన ఓపెనర్, టీమిండియాకు ‘తలనొప్పి’ తెప్పించే ట్రావిస్ హెడ్ (Travis Head)ని అభిషేక్ శర్మకి జతగా ఓపెనింగ్‌కి పంపాలని నిర్ణయించడం. ఈ రెండు నిర్ణయాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్వరూపాన్నే మార్చేశాయి.పవర్ ప్లే అంటే ప్రత్యర్థికి దడేఅంతవరకూ ఎప్పుడూ విజయం కోసం ఎదురు చూసిన జట్టు.. ఇప్పుడు ప్రత్యర్థులను భయపెట్టే స్థాయికి చేరిపోయింది. మ్యాచ్ తొలి ఓవర్లలో, ముఖ్యంగా పవర్ ప్లే లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల ద్వయం ప్రత్యర్థి బౌలర్ల పై విరుచుకుపడి విధ్వంసకర బ్యాటింగ్ తో వారి రిథమ్‌ని దెబ్బతీశారు. ఫలితంగా పరుగుల వెల్లువ ప్రవహించింది. వీరిద్దరూ ఐపీఎల్ అత్యధిక స్కోర్ రికార్డులను తిరగరాశారు. ఈ ఫార్ములా అద్భుతంగా పనిచేసింది. గత సంవత్సరం ఫైనల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్‌కు చేరువగా రావడంలో బ్యాటర్లదే కీలక పాత్ర.సన్‌రైజర్స్ ఫార్ములాకి అప్‌గ్రేడ్ కిషన్ఇంత అద్భుత ఫలితాల్నిచ్చిన ఫార్ములాను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకుఉంటుందా? అందుకే అదే ఫార్ములాను అప్‌గ్రేడ్ చేసింది. భారత్ జట్టులో స్థానం కోల్పోయి అవకాశం కోసం ఎదురు చేస్తున్న ఇషాన్ కిషన్ ని మునుపటి నంబర్ 3 బ్యాటర్ రాహుల్ త్రిపాఠి స్థానం లో తీసుకొచ్చింది. ఈ నేపధ్యం లో సొంతగడ్డ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ తన సత్తా మరోసారి ప్రదర్శించింది.ఇందుకు రాజస్థాన్ రాయల్స్ కూడా సన్‌రైజర్స్ కి తన వంతు సహకారం అందించింది. ఎందుకంటే అలాంటి ఊపు మీదున్న సన్‌రైజర్స్ బ్యాట్స్‌మన్ కి టాస్ గెలిచినప్పటికీ ముందుగా బ్యాటింగ్ కి ఆహ్వానించడం రాయల్స్ చేసిన పెద్ద తప్పిదనం. ఇందుకు భారీ మూల్యమే చెల్లించాల్సివచ్చింది.రాయల్స్ కొంపముంచిన టాస్రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న తర్వాత సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆ జట్టు బౌలర్ల పై విరుచుకు పడ్డారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మొదటి ఆరు ఓవర్లలో 94 పరుగులు చేయడంతో స్కోర్ రాకెట్ వేగంతో ముందుకు పోయింది. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత ఇషాన్ కిషన్ నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి అదే ఊపును కొనసాగించాడు.గతంలో ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహించిన కిషన్ 47 బంతుల్లో 11 బౌండరీలు, ఆరు సిక్సర్లుతో అజేయంగా నిలిచి 106 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ కి ఐపీఎల్ లో ఇది మొదటి సెంచరీ. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేసి మరోసారి సత్తా చాటింది. గత సంవత్సరం బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో బెంగుళూరు తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల నష్టానికి 287 పరుగుల ఐపీఎల్ స్కోర్ ని ఒక్క పరుగుతో వెనుక పడింది.చివరి వరకూ పోరాడిన రాయల్స్ఇంత అత్యధిక లక్ష్యాన్ని సాధించడం ఏ జట్టుకైనా కష్టమే. అయితే నిజానికి రాయల్స్ చివరి వరకూ పోరాడింది. ప్రారంభంలోనే భారత్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరియు కెప్టెన్ రియాన్ పరాగ్‌ల వికెట్లను కోల్పోయినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించింది. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్సమన్ సంజు సామ్సన్, మరియు ధ్రువ్ జురెల్ రాయల్స్‌ను జట్టుకి ఆత్మవిశ్వాసం కలిగించే రీతిలో ఆడారు.నాల్గవ వికెట్‌కు వారిద్దరు 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సామ్సన్ 66 పరుగులు చేయగా, జురెల్ 70 పరుగులు చేశాడు. చివర్లో షిమ్రాన్ హెట్‌మైర్, శుభం దూబే వచ్చి స్కోర్ ని పరుగు పెట్టించినప్పటికీ ఫలితం లేకపోయింది. హెట్‌మైర్ 44 పరుగులు సాధించగా దూబే 32 పరుగులు చేయడంతో రాయల్స్ స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి 242 కి చేరింది. కావ్యా మారన్ కళ్లలో ఆనందంఈ మ్యాచ్ లో చివరికి రాయల్స్ 44 పరుగుల తేడాతో పరాజయం చవిచూసినప్పటికీ ముందు జరిగే మ్యాచ్ లకు కొండంత ఆత్మ విశ్వాసాన్నిచిదనడంలో సందేహంలేదు. ఇక క్లాసెన్, ఇషాన్ కిషన్ ప్ర్యతర్థి జట్టు బౌలింగ్‌ను చితక్కొడుతుంటే.. రైజర్స్ జట్టు యజమాని కావ్యా మారన్ పలికించిన హావభావాలు, భావోద్వేగానికి గురైన తీరు జట్టు ప్రదర్శన పట్ల ఆమె ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పేందుకు నిదర్శనాలుగా నిలిచాయనడంలో అతిశయోక్తి లేదు.చదవండి: మా వాళ్లకు అస్సలు బౌలింగ్ చేయను.. అతడొక అసాధారణ బ్యాటర్: కమిన్స్An epic run-fest goes the way of @SunRisers 🧡The Pat Cummins-led side registers a 4️⃣4️⃣-run win over Rajasthan Royals 👏Scorecard ▶ https://t.co/ltVZAvInEG#TATAIPL | #SRHvRR pic.twitter.com/kjCtGW8NdV— IndianPremierLeague (@IPL) March 23, 2025 -
మా వాళ్లకు అస్సలు బౌలింగ్ చేయను.. అతడొక అసాధారణ బ్యాటర్: కమిన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తాజా ఎడిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) అద్భుత విజయంతో ఆరంభించింది. గత సీజన్ తాలుకు విధ్వంసకర బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ ఉప్పల్ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించింది. తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను 44 పరుగుల తేడాతో చిత్తు చేసింది.‘పాకెట్ డైనమైట్’ సెంచరీస్టార్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ (31 బంతుల్లో 67) తనదైన శైలిలో చెలరేగగా.. జట్టులోకి కొత్తగా వచ్చిన ఇషాన్ కిషన్ (Ishan kishan) ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. ఈ పాకెట్ డైనమైట్ రాజస్తాన్ బౌలింగ్‌ను చితకొట్టి.. అజేయ అద్భుత శతకం సాధించాడు. కేవలం 47 బంతుల్లోనే 11 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 106 పరుగులు సాధించాడు.𝙄.𝘾.𝙔.𝙈.𝙄 🔥Ishan Kishan dealt in sixes on his way to a magnificent maiden #TATAIPL 💯 😮 👊Updates ▶ https://t.co/ltVZAvHPP8#SRHvRR | @SunRisers | @ishankishan51 pic.twitter.com/9PjtQK231J— IndianPremierLeague (@IPL) March 23, 2025 ఇక హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో ఉన్నది కాసేపే అయినా ధనాధన్ ఇన్నింగ్స్ (14 బంతుల్లో 34)తో దుమ్ములేపాడు. ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో రైజర్స్ 286 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ 242 పరుగులకే పరిమితం కావడంతో జయకేతనం ఎగురువేసింది.మా వాళ్లకు అస్సలు బౌలింగ్ చేయనుఈ నేపథ్యంలో విజయానంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు బ్యాటర్లకు పొరపాటున కూడా బౌలింగ్ చేయబోనంటూ సహచర ఆటగాళ్ల దూకుడును ప్రశంసించాడు. ఇషాన్ కిషన్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. ‘‘నమ్మశక్యం కాని బ్యాటింగ్ ఇది. నేను మా వాళ్లకు అస్సలు బౌలింగ్ చేయను.బాబోయ్.. భయపెట్టేశారుప్రత్యర్థి జట్టు బౌలర్లను భయపెట్టేశారు. ఇలాంటి బ్యాటర్లు ఉంటే బౌలర్లకు చుక్కలే. వికెట్ తీయడం గురించి కాకుండా.. పరుగులను ఎలా నియంత్రించాలన్న అంశం మీదే ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. మేము గత వైభవాన్ని కొనసాగించాలని ఫిక్సయ్యాం. అసాధారణ ఇన్నింగ్స్ గతంలో ఆడిన ఒకరిద్దరు ప్లేయర్ల సేవలను ఈసారి మేము కోల్పోయాం. అయితే, వారి స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలని.. ఆటను పూర్తిగా ఆస్వాదించాలని అతడు భావించాడు. మైదానంలో ఆ పని చేసి చూపించాడు.ప్రాక్టీస్‌లో మా బాయ్స్ కష్టపడ్డారు. అద్భుత రీతిలో మ్యాచ్‌కు సన్నద్ధమయ్యారు. ఇక మా కోచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. వారంతా అద్భుతం. గత మూడు- నాలుగు వారాలుగా మాతో పాటు ఉన్నారు. ఏదేమైనా మా వాళ్లు తమ భీకర బ్యాటింగ్‌తో సీజన్‌కు బ్లూప్రింట్లాంటిది తయారు చేశారు. మా బ్యాటర్లను ఎంత ప్రశంసించినా తక్కువే’’ అని కమిన్స్ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.ఐపీఎల్-2025: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు👉వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, ఉప్పల్, హైదరాబాద్👉టాస్: రాజస్తాన్ రాయల్స్.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 286/6 (20)👉రాజస్తాన్ స్కోరు: 242/6 (20)👉ఫలితం: 44 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై సన్‌రైజర్స్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఇషాన్ కిషన్చదవండి: IPL 2025 RCB Vs KKR: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఒకే ఒక్కడు -
#IPL2025 : ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్లు.. (ఫోటోలు)
-
కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెమినిదవ ఎడిషన్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో శనివారం (మార్చి 22) ఐపీఎల్-2025కి తెరలేవనుంది. ఇక ఈ సీజన్‌కు ముందు మెగా వేలం జరగడంతో జట్లలో చాలా మార్పులే చోటుచేసుకున్నాయి.చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్ప.. మిగిలిన ఐదు జట్లు తమ కెప్టెన్లను కూడా మార్చేశాయి. లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) కోసం రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు ఖర్చు చేసి.. అతడిని తమ సారథిగా నియమించుకుంది.మరోవైపు.. పంజాబ్ కింగ్స్ కూడా ఈసారి కెప్టెన్ కోసం భారీగానే ఖర్చుపెట్టింది. భారత జట్టు మిడిలార్డర్ స్టార్, ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మరి మిగిలిన జట్ల కెప్టెన్లు, వారి జీతాలు ఈసారి ఎలా ఉన్నాయో చూద్దామా?కోల్‌కతా నైట్ రైడర్స్2012, 2014 2024లో చాంపియన్‌గా నిలిచిన జట్టు. గతేడాది తమకు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను వదులుకున్న కేకేఆర్.. ఈసారి అనూహ్య రీతిలో ఓ వెటరన్ ప్లేయర్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది.మెగా వేలం-2025లో తొలి రౌండ్లో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అజింక్య రహానేను రూ. 1.5 కోట్లకు కొని.. పగ్గాలు అప్పగించింది. అతడికి డిప్యూటీగా యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు బాధ్యతలు ఇచ్చింది. ఐపీఎల్-2025 కెప్టెన్లలో అతి తక్కువ జీతం అందుకున్న కెప్టెన్ రహానేనే కావడం గమనార్హం. అన్నట్లు వెంకటేశ్ అయ్యర్ జీతం రూ.23.75 కోట్లు.సన్‌రైజర్స్ హైదరాబాద్గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఈసారీ తమ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్‌ను కొనసాగించింది. అయితే, గతేడాది అతడికి రూ. 20.50 కోట్ల మేర ముట్టజెప్పిన ఫ్రాంఛైజీ.. ఈసారి రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకోవడం గమనార్హం.రాజస్తాన్ రాయల్స్ఐపీఎల్ తొట్టతొలి విజేతగా చరిత్ర సృష్టించిన రాజస్తాన్ రాయల్స్ గత కొన్నేళ్లుగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ సామ్సన్ను తమ కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. ఈసారి కూడా ‘పింక్’ జట్టును సంజూ ముందుండి నడిపించనున్నాడు. ఇందుకోసం రూ. 18 కోట్ల జీతం అందుకుంటున్నాడు.చెన్నై సూపర్ కింగ్స్మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఏకంగా ఐదు ట్రోఫీలు గెలిచిన చెన్నై.. గతేడాది నుంచి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆడుతోంది. ఈసారీ అతడినే కెప్టెన్‌గా కొనసాగించిన సీఎస్కే.. ఇందుకోసం అతడిని రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఢిల్లీ క్యాపిటల్స్ఈసారి కెప్టెన్‌ను మార్చిన ఫ్రాంఛైజీల జాబితాలో ఢిల్లీ ఒకటి. గతేడాది రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఆడిన ఢిల్లీ.. ఈసారి టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. ఇందుకోసం తమ కెప్టెన్‌కు రూ. 16.50 కోట్ల మేర చెల్లిస్తోంది.గుజరాత్ టైటాన్స్అరంగేట్ర సీజన్లో తమకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా జట్టును వీడిన తర్వాత.. అంటే గతేడాది టీమిండియా నయా సూపర్ స్టార్ శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించింది. వేలానికి ముందు గిల్‌ను రూ. 16.5 కోట్లకు రిటైన్ చేసుకున్న గుజరాత్ ఈసారీ అతడినే సారథిగా కొనసాగిస్తోంది.ముంబై ఇండియన్స్ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కాదని.. గతేడాది హార్దిక్ పాండ్యాను ఏరికోరి కెప్టెన్‌ను చేసిన ముంబై ఘోర పరాభవం చవిచూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారీ అతడికి మరో అవకాశం ఇచ్చిన అంబానీల యాజమాన్యంలోని ముంబై... పాండ్యాను రూ. 16.35 కోట్లకు రిటైన్ చేసుకుంది.రాయల్ చాలెంజర్స్ బెంగళూరుఎంత క్రేజ్ ఉన్నా ఒక్క టైటిల్ కూడా గెలవని జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. ఈసారి ఊహించని రీతిలో రజత్ పాటిదార్‌ను సారథిగా నియమించింది. విరాట్ కోహ్లి మరోసారి పగ్గాలు చేపడతాడనే ప్రచారం జరిగగా.. బెంగళూరు ఫ్రాంఛైజీ ప్రకటనతో అది జరగదని తేలింది. అన్నట్లు వేలానికి ముందు రూ. 11 కోట్లకు పాటిదార్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఐపీఎల్-2025 కెప్టెన్లలో రహానే తర్వాత తక్కువ జీతం ఆర్సీబీ సారథికే!చదవండి: వాళ్లను చూస్తేనే చిరాకు.. బుమ్రా, రబడ మాత్రం వేరు: డేల్ స్టెయిన్ -
IPL 2025: అందరూ ఇండియన్సే.. ప్యాట్ కమ్మిన్స్ ఒక్కడే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) కి రంగం సిద్ధమైంది. మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ క్యాష్‌రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. ఈ ఏడాది సీజన్ కోసం మొత్తం పది ఫ్రాంచైజీలు తమ కెప్టెన్ల వివరాలను ప్రకటించాయి. ఇప్పటివరకు మొత్తం తొమ్మిది ఫ్రాంచైజీలు తమ సారధులను ఖారారు చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కటే బ్యాలెన్స్ ఉండేది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తమ కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్ పేరును ప్రకటించడంతో అభిమానుల నిరీక్షణకు తెరపడింది.కమ్మిన్స్ ఒక్కడే..కాగా ఐపీఎల్-2025లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఏడాది సీజన్లో మొత్తం పది జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. అందులో తొమ్మిది జట్ల కెప్టెన్లగా భారత్ ఆటగాళ్లు వ్యవహరించనుండగా.. ఒక్క సన్‌రైజర్స్ హైదరాబాద్‌కే విదేశీ ఆటగాడు సారథిగా ఉండనున్నాడు. టోర్నమెంట్ మొత్తం ఎడిషన్‌లో ఏకైక విదేశీ కెప్టెన్‌గా కమ్మిన్స్ నిలిచాడు. గతసీజన్లో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఎస్ఆర్హెచ్లకు విదేశీ కెప్టెన్లు ఉన్నారు. కాగా కమ్మిన్స్ గత సీజన్లో కూడా ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.అతడి సారథ్యంలో సన్‌రైజర్స్ అద్బుతాలు సృష్టించింది. అయితే అనూహ్యంగా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. గత కొన్ని రోజులగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ఈ ఆస్ట్రేలియా కెప్టెన్ ఐపీఎల్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అతడు త్వరలోనే సన్‌రైజర్స్ బృందంలో చేరనున్నాడు.ఐపీఎల్-2025లో కెప్టెన్లు వీరే..చెన్నై సూపర్ కింగ్స్- రుతురాజ్ గైక్వాడ్ ఢిల్లీ క్యాపిటల్స్- అక్షర్ పటేల్ గుజరాత్ టైటాన్స్- శుబ్‌మన్ గిల్ కోల్‌కతా నైట్ రైడర్స్- అజింక్య రహానే లక్నో సూపర్ జెయింట్స్- రిషబ్ పంత్ ముంబై ఇండియన్స్- హార్దిక్ పాండ్యపంజాబ్ కింగ్స్- శ్రేయాస్ అయ్యర్రాజస్థాన్ రాయల్స్- సంజు సామ్సన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రజత్ పాటిదార్ సన్‌రైజర్స్ హైదరాబాద్- ప్యాట్ కమ్మిన్స్చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ -
IPL 2025: సన్‌రైజర్స్ జట్టులోకి సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టులోకి కొత్త క్రికెటర్ వచ్చాడు. సౌతాఫ్రికాకు చెందిన వియాన్ ముల్దర్(Wiaan Muldar)కు రైజర్స్ స్వాగతం పలికింది. ఈ ప్రొటిస్ ఆల్‌రౌండర్‌ను తమ జట్టులోకి చేర్చుకున్నట్లు హైదరాబాద్ ఫ్రాంఛైజీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గాయం కారణంగా దూరమైన బ్రైడన్ కార్సే స్థానాన్ని ముల్దర్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది.ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా స్టార్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్(రూ. 23 కోట్లు), ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(రూ. 18 కోట్లు), టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ(రూ. 14 కోట్లు), నితీశ్ కుమార్ రెడ్డి(రూ. 6 కోట్లు ), ఆసీస్ హార్డ్ హిట్టర్ ట్రావిస్ హెడ్(రూ. 14 కోట్లు)లను రైజర్స్ యాజమాన్యం అట్టిపెట్టుకుంది.ఈ క్రమంలో రూ. 45 కోట్ల పర్సు వాల్యూతో ఐపీఎల్-2025 మెగా వేలం బరిలో దిగిన సన్‌రైజర్స్.. ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, రాహుల్ చహర్ వంటి భారత స్టార్లతో పాటు ఆడం జంపా, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ రూపంలో విదేశీ క్రికెటర్లను కూడా కొనుగోలు చేసింది.బొటనవేలికి గాయం.. సీజన్ మొత్తానికి దూరంఅయితే, ఇంగ్లండ్ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ బ్రైడన్ కార్సే ఇటీవల గాయపడ్డాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లో భాగంగా ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా.. కార్సే బొటనవేలికి గాయమైంది. ఫలితంగా అతడు ఈ వన్డే టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైనట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతడి స్థానంలో రెహాన్ అహ్మద్‌ను తీసుకువచ్చింది.ఇక ఐపీఎల్ నాటికి కూడా కార్సే కోలుకునే పరిస్థితి లేకపోవడంతో 18వ సీజన్ మొత్తానికి అతడు దూరమైనట్లు సన్‌రైజర్స్ ప్రకటించింది. అతడి స్థానంలో వియాన్ ముల్దర్‌ను రూ. 75 లక్షలకు జట్టులోకి తీసుకుంది. త్వరలోనే ఈ ఆల్‌రౌండర్ సన్‌రైజర్స్‌తో చేరనున్నాడు. ఆఖరిగా సెమీస్లోకాగా 27 ఏళ్ల వియాన్ ముల్దర్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. కుడిచేతం వాటం బ్యాటర్ అయిన అతడు.. రైటార్మ్ మీడియం పేసర్. చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడిన ఈ ప్రొటిస్ ప్లేయర్ చివరగా న్యూజిలాండ్‌తో సెమీస్‌లో మాత్రం నిరాశపరిచాడు. కేన్ విలియమ్సన్(102) రూపంలో కీలక వికెట్ తీసినా.. బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 13 బంతులు ఎదుర్కొన్న ముల్దర్ కేవలం ఎనిమిది పరుగులే చేసి.. మైకైల్ బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇక సౌతాఫ్రికా తరఫున 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ముల్దర్ ఇప్పటి వరకు 18 టెస్టులు, 24 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 589, 268, 105 పరుగులు చేయడంతో పాటు... 30, 21, 8 వికెట్లు కూల్చాడు. టెస్టుల్లో అతడి ఖాతాలో ఓ శతకం కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ గతేడాది కమిన్స్ కెప్టెన్సీలో ఫైనల్ చేరింది.. కానీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్‌ను చేజార్చుకుంది.ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుహెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, అభినవ్ మనోహర్, ఆడం జంపా., సిమర్జీత్ సింగ్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనాద్కట్, కమిందు మెండిస్, జీషాన్ అన్సారీ, అనికేత్ వర్మ, అథర్వ టైడే.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. టీమిండియాపై ఒత్తిడి పెంచాం.. మరోసారి: సాంట్నర్ వార్నింగ్ Welcome onboard 🧡The all-rounder from 🇿🇦 is now a RISER 🔥#PlayWithFire pic.twitter.com/we4AfNuExc— SunRisers Hyderabad (@SunRisers) March 6, 2025 -
టీమిండియాపై SRH కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
-
భారత్ పటిష్ట జట్టు.. ఆ అడ్వాంటేజ్ కూడా ఉండటం వల్ల..: కమిన్స్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో జయభేరి మోగించిన రోహిత్ సేన.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ దశలో భాగంగా ఆఖరిగా నామమాత్రపు మ్యాచ్‌లో న్యూజిలాండ్(India vs New Zealand)ను ఢీకొట్టనుంది. ఇక కివీస్ కూడా ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. ఇరుజట్లకు నాకౌట్ స్టేజ్ కోసం ఇదొక సన్నాహక మ్యాచ్‌గా ఉండబోతోంది.ఇదిలా ఉంటే.. ఈ మెగా వన్డే టోర్నమెంట్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ఆమోదంతో తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లన్నీ ఆడుతోంది.భారత్ పటిష్ట జట్టు.. ఆ అడ్వాంటేజ్ కూడా ఉండటం వల్ల..ఈ నేపథ్యంలో ఒకే వేదికపై ఆడటం భారత జట్టుకు అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ‘‘టోర్నీ సజావుగా సాగిపోతోంది. అయితే, ఒకే మైదానంలో ఆడటం వల్ల టీమిండియాకు కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.అయినా ఆ జట్టు ఎంతో పటిష్టంగా ఉంది. అద్భుతంగా ఆడుతున్నారు. ఒకే వేదికపై ఆడటం మాత్రం అదనంగా ఎంతో కొంత లాభం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు’’ అని యాహూ స్పోర్ట్‌తో కమిన్స్ పేర్కొన్నాడు. కాగా చీలమండ నొప్పి కారణంగా ప్యాట్ కమిన్స్ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆసీస్ ఈ వన్డే టోర్నీ బరిలో దిగింది. గ్రూప్-బిలో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడ్డ కంగారూ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయంతో టోర్నీని ఆరంభించిన స్మిత్ బృందం.. తదుపరి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో నెగ్గి సెమీస్ చేరాలనే పట్టుదలతో ఉంది.ఐపీఎల్‌తో రీఎంట్రీఇదిలా ఉంటే.. కమిన్స్ ఐపీఎల్-2025 ద్వారా పునరాగమనం చేయనున్నాడు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ... ‘‘చీలమండ గాయానికి చికిత్స తీసుకుంటున్నాను. ఏదేమైనా ఇంట్లో ఉండటం, కుటుంబ సభ్యులతో సమయం గడపటం సంతోషంగా ఉంది. వచ్చే వారం నుంచి బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెడతాను.వచ్చే నెల నుంచి ఐపీఎల్ ఆరంభం కాబోతోంది. తదుపరి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటన.. ఇలా రానున్న ఆరు నెలలు బిజీబిజీగా గడువబోతోంది’’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. కాగా కమిన్స్ ఇటీవలే రెండోసారి తండ్రయ్యాడు. కుమార్తె ఈదికి అతడి భార్య జన్మనిచ్చింది. కాగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్ మెగర్క్, తన్వీర్ సంఘా.చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్ -
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్..
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త అందింది. కాలి మడమ గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్, ఎస్ఆర్హెచ్ సారథి ప్యాట్ కమ్మిన్స్(Pat Cummins).. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభసమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించనున్నట్లు తెలుస్తోంది.ఈ గాయం కారణంగానే కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం కమ్మిన్స్ దూరమయ్యాడు. అయితే త్వరలోనే తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమ్మిన్స్ స్పష్టం చేశాడు."చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నాను. ఇదేమి మరీ అంత పెద్ద గాయమేమి కాదు. నా గాయం గురించి బయట వినిపిస్తున్న వార్తలు ఏవీ నిజం కాదు. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి ఆరు వారాల సమయం అవసరం లేదు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి కాస్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్నాను. త్వరలోనే బౌలింగ్ ప్రాక్టీస్‌ను మొదలు పెడతాను. ఐపీఎల్ సమయానికి సిద్దంగా ఉంటాను. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్, తర్వాత జరిగే టెస్ట్ మ్యాచ్ లకు ఐపీఎల్ చాలా మంచి సన్నాహకంగా ఉంటుంది అని కమ్మిన్స్ పేర్కొన్నాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి ప్రారంభం కానుంది.తొలి సీజన్లోనే అదుర్స్..కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో కమ్మిన్స్‌ను రూ. 20.5 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం కమ్మిన్స్ చేశాడు. గతేడాది సీజన్లో అతడి సారథ్యంలోని ఎస్ఆర్హెచ్ రన్నరప్‌గా నిలిచింది. కమ్మిన్స్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా రాణించాడు.దీంతో ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు, ఫ్రాంచైజీ కమ్మిన్స్‌ను రూ.18 కోట్లకు ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న హైదరబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.ఐపీఎల్-2025కు ఎస్ఆర్హెచ్ జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఎషాన్ మలింగ, సచిన్ బేబీచదవండి: గిల్ సెంచరీ కోసం హాఫ్ సెంచరీని త్యాగం చేసిన రాహుల్.. అదే హార్దిక్ అయ్యుంటే..! -
ఐపీఎల్ 2025లో SRH షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లు ఇవే..!
ఐపీఎల్ 2025 షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఫిబ్రవరి 16) విడుదల చేసింది. 65 రోజుల పాటు జరిగే ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 13 వేదికల్లో మెగా లీగ్ నిర్వహించబడుతుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది.ఇదే ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫయర్-2 (మే 23) మరియు ఫైనల్ మ్యాచ్‌లు (మే 25) జరుగనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో క్వాలిఫయర్-1 (మే 20) మరియు ఎలిమినేటర్ (మే 21) మ్యాచ్‌లు జరుగుతాయి.మార్చి 23న జరిగే సీజన్ రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ను ఎస్ఆర్హెచ్ తమ సొంత మైదానమైన ఉప్పల్ స్టేడియంలో ఆడుతుంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 14 మ్యాచ్‌లు ఆడుతుంది (ప్లే ఆఫ్స్ కాకుండా). ఇందులో ఏడు మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. వీటితో పాటు క్వాలిఫయర్-1 (మే 20) మరియు ఎలిమినేటర్ (మే 21) మ్యాచ్‌లు కూడా హైదరాబాద్‌లోనే జరుగుతాయి.విశాఖపట్నంలో రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో ఒకటి సన్‌రైజర్స్ ఆడే మ్యాచ్ కాగా.. రెండోది ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (మార్చి 24) మ్యాచ్.ఈ సీజన్లో సన్‌రైజర్స్.. ఢిల్లీ, కేకేఆర్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. రాజస్థాన్, ఆర్సీబీ, పంజాబ్, సీఎస్కేతో తలో మ్యాచ్ ఆడుతుంది. ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్‌లు..మార్చి 23 (ఆదివారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్)మార్చి 27 (గురువారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (హైదరాబాద్)మార్చి 30 (ఆదివారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (వైజాగ్)ఏప్రిల్ 3 (గురువారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ (కోల్‌కతా)ఏప్రిల్ 6 (ఆదివారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (హైదరాబాద్)ఏప్రిల్ 12 (శనివారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (హైదరాబాద్)ఏప్రిల్ 17 (గురువారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఏప్రిల్ 23 (బుధవారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)ఏప్రిల్ 25 (శుక్రవారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ సీఎస్కే (చెన్నై)మే 2 (శుక్రవారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (అహ్మదాబాద్)మే 5 (సోమవారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (హైదరాబాద్)మే 10 (శనివారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ (హైదరాబాద్)మే 13 (మంగళవారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ (బెంగళూరు)మే 18 (ఆదివారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో (లక్నో)ఐపీఎల్ 2025 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు..అథర్వ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, కమిందు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమ్రన్‌జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేశ్ ఉనద్కత్, బ్రైడన్ కార్స్ -
ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆస్ట్రేలియా జట్టులోకి యువ సంచలనాలు!?
మెల్బోర్న్: ప్రధాన ఆటగాళ్ల గాయాలకు తోడు... ఆల్‌రౌండర్ స్టొయినిస్ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నెల 19 నుంచి పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ) వేదికగా చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుండగా... క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఈ టోర్నీ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించింది. కాగా... ఇందులో రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు మరో పేసర్ జోష్ హాజల్‌వుడ్ గాయాల కారణంగా అధికారికంగా టోర్నీ దూరం కాగా... పేస్ ఆల్‌రౌండర్ మిచిల్ మార్ష్ వెన్ను నొప్పి కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక మరో పేస్ ఆల్‌రౌండర్ స్టొయినిస్ అనూహ్యంగా వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఈ నెల 12 వరకు జట్లలో మార్పులు చేసుకునేందుకు ఐసీసీ గడువు ఇవ్వగా... ఆ్రస్టేలియా జట్టు దాదాపు కొత్త జట్టును ఎంపిక చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్లో ఒకరు ఆసీస్ జట్టుకు సారథ్యం వహిస్తారని సీఏ వెల్లడించింది.‘కమిన్స్, హాజల్‌వుడ్, మార్ష్, అనుకోకుండా.. టోర్నీకి దూరమయ్యారు. ఐసీసీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఆ్రస్టేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది’ అని ఆ్రస్టేలియా జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ అన్నాడు.జట్టులోకి యువ ఆటగాళ్లు..ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గరపడుతుండడంతో టోర్నీకి దూరమైన ఆటగాళ్ల స్ధానాలను భర్తీ చేసే పనిలో క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ పడింది. కమ్మిన్స్, హాజిల్‌వుడ్ స్ధానాల్లో యువ పేసర్లు జేవియర్ బార్ట్లెట్, స్పెన్సర్ జాన్సన్ పేర్లను జార్జ్ బెయిలీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకున్నారు. ఆసీస్ తరపున కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బార్టలెట్ 8 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు జాన్సన్ కూడా ఆసీస్ తరపున రెండు వన్డేలు ఆడి వికెట్ ఏమీ సాధించలేదు. కానీ టీ20ల్లో మాత్రం అతడి పేరిట 14 వికెట్లు ఉన్నాయి. అదేవిధంగా మిచెల్ మార్ష్, స్టోయినిష్ స్ధానాల్లో కాపర్ కొన్నోలీ, బ్యూ వెబ్స్టర్లను ఎంపిక చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కాపర్ కొన్నోలీకి అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేనప్పటికి దేశవాళీ క్రికెట్లో మాత్రం అద్బుతమైన రికార్డు ఉంది. ఇటీవలే ముగిసిన బిగ్‌బాష్ లీగ్‌లోనూ కొన్నోలీకి చోటు దక్కింది. అతడికి బ్యాట్, బంతితో రాణించే సత్తాఉంది.మరోవైపు తన టెస్టు అరంగేట్రంలోనే ఆకట్టుకున్న బ్యూ వెబ్స్టెర్ను కూడా ఈ మెగా టోర్నీకి ఎంపిక చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మీడియం పేస్ ఆల్‌రౌండర్ భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో సత్తాచాటాడు. ఆ తర్వాత బిగ్‌బాష్ లీగ్‌లోనూ దుమ్ములేపాడు.ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా అప్డెటెడ్ జట్టు(అంచనా)అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జేవియర్ బార్ట్లెట్, ఆడమ్ జంపా, కాపర్ కొన్నోలీ, బ్యూ వెబ్స్టర్చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు.. -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు వరుస ఎదురుదెబ్బలు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు (Champions Trophy 2025) ముందు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు (Australia) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా మెగా టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు. తొలుత మిచెల్ మార్ష్ (Mitchel Marsh).. తాజాగా ఫాస్ట్ బౌలర్లు కమిన్స్ (Pat Cummins), జోష్ హాజిల్‌వుడ్ (Josh Hazzlewood) ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. ఈ మధ్యలో ఆస్ట్రేలియాకు మరో ఊహించని షాక్ కూడా తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis) అనూహ్యంగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా మొత్తం నలుగురు ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. ఈ నలుగురికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ప్రకటించాల్సి ఉంది. రేసులో కూపర్ కన్నోలీ, బ్యూ వెబ్‌స్టర్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్ ముందువరసలో ఉన్నారు.కాగా, ఆస్ట్రేలియా ప్రస్తుతం రెండు టెస్ట్‌లు, రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో ఇదివరకే తొలి టెస్ట్ పూర్తి కాగా.. ఇవాళే (ఫిబ్రవరి 6) రెండో టెస్ట్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీ విరామం సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (11), దిముత్ కరుణరత్నే (36), ఏంజెలో మాథ్యూస్ (1), కమిందు మెండిస్ (13), ధనంజయ డిసిల్వ (0) ఔట్ కాగా.. దినేశ్ చండీమల్ (70), కుసాల్ మెండిస్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 3, మిచెల్ స్టార్క్, ట్రవిస్ హెడ్ తలో వికెట్ పడగొట్టారు.తొలి టెస్ట్‌లో ఆసీస్ భారీ విజయంతొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ (102), స్టీవ్ స్మిత్ (141) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ (247 ఆలౌట్) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.ఫిబ్రవరి 12 నుంచి వన్డేలు.. ఆతర్వాత నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీకే..!ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్‌కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఆసీస్.. ఇంగ్లండ్‌తో తలపడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఆసీస్ జట్టు (ముందుగా ప్రకటించింది)పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
‘చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ కెప్టెన్సీకి నేను సిద్ధం’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్లో ఆస్ట్రేలియాను ముందుండి నడిపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్టీవ్ స్మిత్(Steve Smith) ప్రకటించాడు. ప్యాట్ కమిన్స్(Pat Cummins) అందుబాటులోకి రాకపోతే కెప్టెన్సీ చేపట్టేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నాడు. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.అయితే, ఈ మెగా ఈవెంట్‌కు ముందు ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌తో పాటు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయాల బారిన పడగా.. కెప్టెన్ కమిన్స్ కూడా చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ ముగ్గురు ఐసీసీ టోర్నీకి అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ స్వయంగా ధ్రువీకరించాడు.చారిత్రాత్మక విజయంకాగా టీమిండియాతో స్వదేశంలో ప్రతిష్టాత్మ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో చారిత్రాత్మక విజయం అందుకున్నాడు ప్యాట్ కమిన్స్. పదేళ్ల తర్వాత ఈ సిరీస్ గెలిచి తన కెప్టెన్సీ రికార్డులలో ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నాడు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైన కమిన్స్... చీలమండ గాయానికి చికిత్స చేయించుకుంటున్నాడు. అదే విధంగా తన భార్య తమ రెండో సంతానానికి జన్మనివ్వనున్న నేపథ్యంలో శ్రీలంక పర్యటనకు కూడా దూరంగా ఉన్నాడు.ఈ నేపథ్యంలో కమిన్స్ స్థానంలో మాజీ సారథి స్మిత్ లంక టూర్లో ఆస్ట్రేలియా జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. కమిన్స్ ఇంకా కోలుకోలేదని హెడ్‌కోచ్ మెక్‌డొనాల్డ్ బుధవారం వెల్లడించాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అసాధ్యం‘కమిన్స్ పూర్తిగా కోలుకోలేదు. ఇప్పటి వరకు ఇంకా శిక్షణ కూడా మొదలు పెట్టలేదు. ఇలాంటి స్థితిలో అతడు నేరుగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అసాధ్యం. మరోవైపు.. పేసర్ హాజల్‌వుడ్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు’ అని మెక్‌డొనాల్డ్ తెలిపాడు.ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీలో స్టీవ్ స్మిత్ లేదంటే ట్రవిస్ హెడ్ ఆస్ట్రేలియా సారథులుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ విషయంపై స్పందించిన స్మిత్ మెగా టోర్నీలో నాయకుడిగా ఉండేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మనసులోని మాటను వెల్లడించాడు. ‘‘ఈ విషయం గురించి నేను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.సారథిగా ఉండటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాఅయితే, జట్టు గురించి పూర్తి అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం నేను టెస్టు సిరీస్ మీద దృష్టి సారించాను. ఈ సిరీస్ గెలిచిన తర్వాత వన్డేలపైకి దృష్టి మళ్లిస్తాం. క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్సీ చేయడం నాకు మరింత ఇష్టం.ఆటపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్న విషయంపై స్పష్టత ఉంది. పరిస్థితులకు తగ్గట్లుగా పావులు కదపడాన్ని నేను ఎంతగానో ఇష్టపడతా. సారథిగా ఉండటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తా’’ అని స్టీవ్ స్మిత్ తెలిపాడు.కాగా శ్రీలంక పర్యటనలో భాగంగా తొలుత టెస్టు సిరీస్ జరుగుతోంది. గాలెలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య లంక జట్టును ఆస్ట్రేలియా ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో స్మిత్ అద్భుత శతకం(141)తో మెరిశాడు.ఇక ఇరుజట్ల మధ్య అదే వేదికపై గురువారం ఆఖరిదైన రెండో టెస్టు మొదలైంది. అనంతరం లంక- ఆసీస్ మధ్య రెండు వన్డేలు జరుగుతాయి. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది.చాంపియన్స్ ట్రోఫీకి ఆసీస్(ప్రాథమిక) జట్టు..పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.చదవండి: Rohit Sharma: బుమ్రా గాయంపై అప్డేట్.. వరుణ్ చక్రవర్తి పోటీలో ఉంటాడు! -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు అతి భారీ షాక్..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు (Champions Trophy) ముందు ఆస్ట్రేలియాకు (Australia) అతి భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) మెగా టోర్నీకి దూరం కానున్నాడని సమాచారం. ఈ విషయాన్ని ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ పరోక్షంగా వెల్లడించాడు. కమిన్స్ కాలి మడమ సమస్యతో బాధపడుతున్నట్లు మెక్‌డొనాల్డ్ చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరమైన పక్షంలో ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఆసీస్ కెప్టెన్సీ రేసులో ఉంటారని మెక్‌డొనాల్డ్ అన్నాడు. కమిన్స్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ పాల్గొనడం లేదు. అతని భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనందున లంక సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. టెస్ట్ జట్టులో లేని సభ్యులు లంకతో వన్డే సిరీస్ కోసం ఇవాళ ఆస్ట్రేలియా నుంచి బయల్దేరాల్సి ఉంది. ఈ బృందంలో కమిన్స్ లేడు. మరోవైపు మెక్‌డొనాల్డ్ మరో ఆసీస్ పేసర్ గాయంపై కూడా కీలక అప్డేట్ ఇచ్చాడు. గాయం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే వైదొలిగిన జోష్ హాజిల్‌వుడ్ ఫిట్నెస్ సాధించేందుకు పోరాడుతున్నాడని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి హాజిల్‌వుడ్ కూడా అనుమానమే అని మెక్‌డొనాల్డ్ పరోక్షంగా వెల్లడించాడు. కొద్ది రోజుల ముందే ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి వైదొలిగాడు. ఇప్పుడు కమిన్స్, హాజిల్‌వుడ్ కూడా మెగా టోర్నీకి దూరమైతే ఆ జట్టు విజయావకాశాలు పూర్తి స్థాయిలో దెబ్బతింటాయి. మార్ష్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా ప్రకటించలేదు. బ్యూ వెబ్‌స్టర్ మార్ష్‌కు బదులు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో యాడ్ అవుతాడని కోచ్ మెక్‌డొనాల్డ్ అన్నాడు. పై ముగ్గురితో పాటు ఆసీస్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్న మరికొందరు ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారని తెలుస్తుంది. ఆల్‌రౌండర్లు మార్కస్ స్టోయినిస్, ఆరోన్ హార్డీ గాయాల బారిన పడ్డ ఆటగాళ్ల జాబితాలో ఉన్నారని సమాచారం.కాగా, ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం రెండు టెస్ట్‌లు, రెండు వన్డేల సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో తొలుత టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందటే తొలి టెస్ట్ ముగిసింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాలో ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లో ఆసీస్‌కు స్టీవ్ స్మిత్ సారథ్యం వహిస్తున్నాడు (కమిన్స్ గైర్హాజరీలో). తొలి టెస్ట్‌లో స్మిత్ కెప్టెన్సీలో సత్తా చాటడమే కాకుండా వ్యక్తిగతంగానూ రాణించాడు. ఈ మ్యాచ్‌లో స్మిత్ (141) సెంచరీతో మెరిశాడు. ఇదే మ్యాచ్‌లో ఆసీస్ వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ తన అరంగేట్రం టెస్ట్‌లోనే శతక్కొట్టి శభాష్ అనిపించుకున్నాడు. ఆసీస్, శ్రీలంక మధ్య రెండో టెస్ట్ రేపటి నుంచి (ఫిబ్రవరి 6) ప్రారంభమవుతుంది. అనంతరం ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్‌కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఇంగ్లండ్‌తో తలపడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఆసీస్ జట్టు..పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
ICC టెస్టు జట్టు ప్రకటన.. భారత్ నుంచి ముగ్గురు.. కెప్టెన్ ఎవరంటే?
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) 2024 ఏడాదికిగానూ పురుషుల అత్యుత్తమ టెస్టు(ICC Men’s Test Team of the Year 2024) జట్టును శుక్రవారం ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా నలుగురికి స్థానం దక్కింది. ఇక ఈ జట్టుకు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథిగా ఎంపికయ్యాడు.ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2024లో ఓపెనర్లుగా టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ చోటు దక్కించుకోగా.. వన్డే బ్యాటర్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) స్థానం సంపాదించాడు.లంక నుంచి అతడుఇక మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఇంగ్లండ్ మాజీ సారథి, టెస్టు క్రికెట్ వీరుడు జో రూట్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. ఐదో స్థానంలో ఇంగ్లండ్ నూతన వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్.. ఆరో స్థానంలో శ్రీలంక శతకాల ధీరుడు కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు. ఇక వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేమీ స్మిత్ ఎంపిక కాగా.. ఆల్‌రౌండర్‌గా టీమిండియా స్పిన్ స్టార్ రవీంద్ర జడేజాకు స్థానం దక్కింది. ఇక ఈ జట్టులో ఏకంగా ముగ్గురు పేసర్లకు ఐసీసీ చోటిచ్చింది. కెప్టెన్ కమిన్స్‌తో పాటు.. న్యూజిలాండ్ రైటార్మ్ బౌలర్ మ్యాట్ హెన్రీ.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ జాబితాలో ఉన్నారు. కోహ్లి- రోహిత్‌లకు దక్కని చోటుఇటీవలి కాలంలో వరుస వైఫల్యాల కారణంగా టీమిండియా ప్రధాన బ్యాటర్లు విరాట్ కోహ్లి- రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే, రోహిత్ ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్ మాత్రం గతేడాది అత్యుత్తమంగా రాణించాడు.జైసూ, బుమ్రా హిట్ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో భారీ శతకం(161) బాదడం అతడి ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మూడు ఫార్మాట్లలో కలిపి 2024లో జైసూ 1771 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా సైతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధికంగా 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.మరోవైపు.. జడేజా సైతం స్థాయికి తగ్గట్లుగా రాణించి.. ఈ జట్టుకు ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే... ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2024ను కూడా శుక్రవారం ప్రకటించారు. ఇందులో టీమిండియా నుంచి ఒక్కరికి కూడా స్థానం దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టులో శ్రీలంక క్రికెటర్లు హవా చూపించారు.ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024: చరిత్ అసలంక (శ్రీలంక- కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్(అఫ్గనిస్తాన్), పాతుమ్ నిసాంక(శ్రీలంక), కుశాల్ మెండిస్ (శ్రీలంక- వికెట్‌కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్(వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), వనిందు హసరంగ(శ్రీలంక), షాహీన్ షా అఫ్రిది(పాకిస్తాన్), హరీస్ రౌఫ్(పాకిస్తాన్), అల్లా ఘజన్ఫర్(అఫ్గనిస్తాన్).చదవండి: రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్ -
CT 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. తొలిసారిగా ఆ ఇద్దరు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేసినట్లు సోమవారం వెల్లడించింది. అయితే, గాయం కారణంగా దూరమవుతాడనుకున్న ప్యాట్ కమిన్స్(Pat Cummins) సారథ్యంలోనే ఆస్ట్రేలియా ఈ ఈవెంట్లో పాల్గొననుంది.తొలిసారిగా ఆ ఇద్దరికి చోటుఇక బ్యాటర్ మాథ్యూ షార్ట్‌తో పాటు ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ(Aaron Hardie) తొలిసారిగా ఐసీసీ టోర్నమెంట్లో ఆడే అవకాశం దక్కించుకున్నారు. మరోవైపు.. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించిన నాథన్ ఎల్లిస్ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటికే రిటైర్ అయిన డేవిడ్ వార్నర్, గాయం వల్ల జట్టుకు దూరమైన కామెరాన్ గ్రీన్, పేసర్ సీన్ అబాట్ స్థానాల్లో మాథ్యూ, హార్డీ, ఎల్లిస్ ఈ జట్టులోకి వచ్చారు.మోకాలి గాయంకాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కమిన్స్ బృందం 3-1తో గెలిచి పదేళ్ల తర్వాత ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ మెగా సిరీస్ నేపథ్యంలో కెప్టెన్, స్టార్ పేసర్ కమిన్స్ గాయపడినట్లు వార్తలు వచ్చాయి.శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడే జట్టుకు కమిన్స్దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ అతడి గాయాన్ని ధ్రువీకరిస్తూ మోకాలి నొప్పితో కమిన్స్ బాధపడుతున్నట్లు తెలిపాడు. దీంతో అతడు చాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాజా ప్రకటనతో అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది.వన్డే ప్రపంచకప్-2023 విజేతఇదిలా ఉంటే.. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాను చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. ఫైనల్లో టీమిండియాను ఓడించి.. కంగారూ జట్టుకు టైటిల్ అందించాడు. ఈ క్రమంలో ఏకంగా ఆరోసారి వన్డే వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా.. మరో వన్డే మెగా టోర్నీ చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది.వరల్డ్‌కప్ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ కూడా ఈ టోర్నమెంట్లో ఆడేందుకు క్వాలిఫై అయ్యాయి. అయితే, 2017లో చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్తాన్ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టింది.గ్రూప్- ‘బి’లోఇదిలా ఉంటే.. వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించగా... దుబాయ్ వేదికగా రోహిత్ సేన తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా.. అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. ఇక గ్రూప్-‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఆడనున్నాయి. కాగా ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న లాహోర్ వేదికగా తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుప్యాట్ కమిన్స్(కెప్టెన్), అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, ఆడం జంపా.చదవండి: IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే? -
ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం?
‘కెప్టెన్‌గా టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవలేకపోవడమే నాకున్న అతిపెద్ద లోటు.. ఈసారి ఎలాగైనా ఆ పని పూర్తిచేస్తాను’.. భారత్‌తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అనుకున్నట్లుగానే ఈసారి కంగారూ జట్టుకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని అందించాడు ఈ స్టార్ పేసర్.సుదీర్ఘ నిరీక్షణకు తెరబౌలర్గా, కెప్టెన్‌గా తనదైన వ్యూహాలతో 3-1తో టీమిండియాను ఓడించి.. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. అంతేకాదు.. తన కెప్టెన్సీలో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేర్చాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌తో పాటు కమిన్స్‌పై కూడా తీవ్రమైన భారం పడింది.స్కాట్ బోలాండ్, స్టార్క్ నుంచి సహకారం అందినా.. కమిన్స్ కూడా వీలైనన్ని ఎక్కువ ఓవర్లు బౌల్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కమిన్స్ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. శ్రీలంక పర్యటనకు టెస్టు జట్టును ప్రకటించిన సందర్భంగా ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ ఈ విషయాన్ని వెల్లడించాడు.చీలమండ గాయంకాగా సొంతగడ్డపై టీమిండియాపై టెస్టు సిరీస్ విజయం తర్వాత ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. కమిన్స్ ఈ టూర్‌కు దూరం కాగా.. అతడి డిప్యూటీ స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాల గురించి జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ‘‘కమిన్స్‌కు వ్యక్తిగతంగా కాస్త పని ఉంది. అయితే, అతడు జట్టుకు దూరం కావడానికి అదొక్కటే కారణం కాదు.అతడు చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. వచ్చే వారం అతడు స్కానింగ్‌కు వెళ్తాడు. వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే గాయంపై పూర్తి స్పష్టత వస్తుంది’’ అని తెలిపాడు. కాగా కమిన్స్ గాయం గనుక తీవ్రతరమైతే ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే.చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎదురుదెబ్బఎందుకంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ ప్రధాన టోర్నమెంట్ సమీపిస్తోంది. ఫిబ్రవరి 19- మార్చి 9 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. టోర్నీ మొదలయ్యేనాటికి కమిన్స్ పూర్తి ఫిట్‌గా లేనట్లయితే.. ఈ వన్డే వరల్డ్‌కప్-2023 చాంపియన్‌కు కష్టాలు తప్పవు. కాగా భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆటగాడిగా, కెప్టెన్‌గా సత్తా చాటాడు కమిన్స్. ఫైనల్లో టీమిండియాను ఓడించి ఆసీస్‌ను చాంపియన్‌గా నిలిపాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో కలిసి ఆస్ట్రేలియా గ్రూప్-‘బి’లో ఉంది. ఇందులో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్ లాహోర్ వేదికగా ఫిబ్రవరి 22న ఇంగ్లండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా.. పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకోగా.. టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది.శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, ట్రవిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్పీ, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!’ -
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్..
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియా తమ ఆఖరి సిరీస్‌కు సిద్దమవుతోంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న ఆసీస్.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 29 నుంచి ఈ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలో లంకతో సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ టూర్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(Pat cummins) దూరమయ్యాడు. అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో ఈ సిరీస్ నుంచి కమ్మిన్స్ తప్పుకున్నాడు. అతడి స్దానంలో స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith ) ఎంపికయ్యాడు.స్టార్క్‌కు నో రెస్ట్..అదే విధంగా ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడనున్నాడు. తొలుత అతడికి విశ్రాంతి ఇస్తారని వార్తలు వినిపించినప్పటికి, ఆసీస్ సెలక్టర్లు మాత్రం జట్టులో కొనసాగించారు. మరోవైపు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ప్రక్కటెముకుల గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.భారత్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడిన హాజిల్‌వుడ్.. ఇంకా కోలుకోవడానికి నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో రానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. ఈ లంక సిరీస్‌కు ఎంపికైన జట్టులో మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్ ఫ్రంట్‌లైన్ పేసర్లగా ఉన్నారు.యువ సంచలనానికి పిలుపు..ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ కూపర్ కొన్నోలీకి తొలిసారి సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ 16 మంది సభ్యుల జట్టులో కొన్నోలీకి చోటు దక్కింది. దేశీవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. కొన్నోలీ ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్స్కార్చర్స్ తరపున ఆడుతున్నాడు.ఈ 21 ఏళ్ల కొన్నోలీకి బ్యాటింగ్‌తో అద్బుతమైన బౌలింగ్ సిల్క్స్ కూడా ఉన్నాయి. ఇక భారత్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్న స్పిన్నర్లు మాట్ కుహ్నెమాన్, టాడ్ మర్ఫీ తిరిగి జట్టులోకి వచ్చారు. అదేవిధంగా బీజీటీలో అదరగొట్టిన సామ్ కాన్స్టాస్, వెబ్స్టార్లను శ్రీలంక సిరీస్‌కు కూడా ఆసీస్ సెలక్టర్లు కొనసాగించారు.ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్ఫీ , మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్చదవండి: 'రోహిత్ నిర్ణయం సరైనది కాదు.. ఇక టెస్టులకు విడ్కోలు పలికితే బెటర్' -
ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయిన పేసు గుర్రం
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. బుమ్రా డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినీగా ఎంపికయ్యాడు. బుమ్రాతో పాటు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, సౌతాఫ్రికా సీమర్ డేన్ పాటర్సన్ కూడా మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. డిసెంబర్ నెలలో ప్రదర్శనల ఆధారంగా ఐసీసీ ఈ ముగ్గురిని నామినేట్ చేసింది. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ కావడం ఇది వరుసగా రెండో సారి. నవంబర్ నెలలోనూ బుమ్రా ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు. నవంబర్ నెలలో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు.మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ (డిసెంబర్) నామినీస్ విషయానికొస్తే.. ఈ అవార్డుకు పురుషుల నామినీస్ లాగానే భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు చెందిన ఆటగాళ్లు ఎంపికయ్యారు. భారత్ నుంచి స్మృతి మంధన, సౌతాఫ్రికా నుంచి నొన్కులులేకో మ్లాబా, ఆస్ట్రేలియా నుంచి అన్నాబెల్ సదర్‌ల్యాండ్ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. డిసెంబర్ నెలలో ఈ ముగ్గురు అద్భుతంగా రాణించారు.జస్ప్రీత్ బుమ్రా: పేసు గుర్రం బుమ్రా డిసెంబర్ నెలలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ నెలలో అతనాడిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో (ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో) 22 వికెట్లు తీశాడు. ఇదే నెలలో బుమ్రా అత్యధిక రేటింగ్ పాయింట్లు (907) సాధించిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.పాట్ కమిన్స్: ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ డిసెంబర్ నెలలో మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనలు నమోదు చేశాడు. కమిన్స్ ఈ నెలలో 17 వికెట్లు తీయడంతో పాటు అత్యతం కీలకమైన 144 పరుగులు తీశాడు. కమిన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనల కారణంగా డిసెంబర్లో జరిగిన మూడు టెస్ట్‌ల్లో ఆసీస్ భారత్‌ను ఓడించింది.డేన్ పాటర్సన్: ఈ సౌతాఫ్రికన్ పేసర్ తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. డిసెంబర్ నెలలో పాటర్సన్ రెండు టెస్ట్‌ల్లో 13 వికెట్లు తీశాడు. పాటర్సన్ ప్రదర్శనల కారణంగా సౌతాఫ్రికా తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరుకుంది.స్మృతి మంధన: మంధన డిసెంబర్ నెలలో ఆడిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో సూపర్ ఫామ్‌ను కనబర్చి 463 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన వన్డేలో మంధన సూపర్ సెంచరీ చేసింది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో మంధన వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసింది.మ్లాబా: డిసెంబర్ నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో మ్లాబా చెలరేగిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆమె 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ రికార్డు సృష్టించింది. ఇదే నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేల్లోనూ మ్లాబా రాణించింది.అన్నాబెల్ సదర్‌ల్యాండ్: 23 ఏళ్ల ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ డిసెంబర్ నెలలో బంతితో, బ్యాట్‌తో అద్బుతంగా రాణించింది. ఈ నెలలో సదర్‌ల్యాండ్ ఏడు వికెట్లు తీయడంతో పాటు రెండు సెంచరీలు (భారత్, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేల్లో) చేసింది. -
గెలుపు జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్..
టీమిండియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. ఇప్పుడు మరో రెడ్ బాల్ సిరీస్‌కు సిద్దమైంది. ఆసీస్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి డబ్ల్యూటీసీ సైకిల్ 2024-25ను విజయంతో ముగించాలని కంగారులు భావిస్తున్నారు.అయితే ఈ టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదరుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌పేసర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా లంక పర్యటనకు దూరమయ్యాడు. ఇటీవల భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన హాజిల్‌వుడ్ ప్రస్తుతం.. ప్రక్కటెముకుల గాయంతో బాధపడుతున్నాడు.ఈ కారణంతోనే బీజీటీ మధ్యలో తప్పుకున్న హాజిల్‌వుడ్.. ఇప్పుడు శ్రీలంక సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది. ఈ సిరీస్‌కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా దూరం కానున్నాడు.అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో లంక టూర్‌కు దూరంగా ఉండాలని ప్యాట్ నిర్ణయించుకున్నాడు. హాజిల్‌వుడ్ స్ధానంలో జో రిచర్డ్సన్, కమ్మిన్స్ స్ధానంలో మైఖల్ నీసర్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 3-1 తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. జూన్ 11న లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది.కాగా ఈ నామమాత్రపు సిరీస్‌కు వీరిద్దరితో పాటు స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్‌కు విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.అయితే శ్రీలంకను వారి సొంతగడ్డపై ఓడించడం అసీస్‌కు అంతసులువు కాదు. శ్రీలంకలో టర్నింగ్ వికెట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆసీస్‌తో పోలిస్తే లంక జట్టులోనే అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ప్రభాత్ జయసూర్య వంటి స్పిన్నర్‌ను ఆసీస్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.చదవండి: BGT: ఆస్ట్రేలియా నిజంగానే గొప్పగా ఆడిందా?.. బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా? -
కమిన్స్ డబుల్ సెంచరీ.. చరిత్రలో తొలి ప్లేయర్
ఆస్ట్రేలియా సారధి పాట్ కమిన్స్ (Pat Cummins) ఎవరికీ సాధ్యం కానీ మైలురాయిని అందుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో కమిన్స్ ఈ ఫీట్‌ను సాధించాడు. వాషింగ్టన్ సుందర్ డబ్ల్యూటీసీలో కమిన్స్‌కు 200వ వికెట్.డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ తర్వాతి స్థానాల్లో నాథన్ లియోన్ (196 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (195), మిచెల్ స్టార్క్ (165), జస్ప్రీత్ బుమ్రా (156) ఉన్నారు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను ఆస్ట్రేలియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన ఆసీస్.. రెండు, నాలుగు, ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. తాజాగా ముగిసిన ఐదో టెస్ట్‌లో (సిడ్నీ) ఆసీస్ ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ సిరీస్ ఆధ్యాంతం అద్బుతంగా రాణించిన కమిన్స్ 25 వికెట్లు తీసి ఆసీస్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 32 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కమిన్స్ ఈ సిరీస్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 19.88 సగటున 159 పరుగులు చేశాడు.బ్యాటింగ్‌లో హెడ్ టాప్తాజాగా ముగిసిన బీజీటీలో ఆసీస్ చిచ్చరపిడుగు ట్రవిస్ హెడ్ అత్యధిక పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన హెడ్ 56 సగటున 448 పరుగులు చేశాడు. భారత యువ కెరటం యశస్వి జైస్వాల్ 10 ఇన్నింగ్స్‌ల్లో 43.44 సగటున 391 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.బీజీటీ 2024-25లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆటగాళ్లు..ట్రవిస్ హెడ్-448యశస్వి జైస్వాల్-391స్టీవ్ స్మిత్-314నితీశ్ కుమార్ రెడ్డి-298కేఎల్ రాహుల్-276రిషబ్ పంత్-255మార్నస్ లబూషేన్-232అలెక్స్ క్యారీ-216విరాట్ కోహ్లి-190ఉస్మాన్ ఖ్వాజా-184బీజీటీ 2024-25లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు..బుమ్రా-32కమిన్స్-25బోలాండ్-21సిరాజ్-20స్టార్క్-18నాథన్ లియోన్-9జోష్ హాజిల్‌వుడ్-6ప్రసిద్ద్ కృష్ణ-6ఆకాశ్‌దీప్-5నితీశ్ కుమార్ రెడ్డి-5చెలరేగిన బోలాండ్ఐదో టెస్ట్‌లో ఆసీస్ స్పీడ్‌స్టర్ స్కాట్ బోలాండ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో బోలాండ్ 10 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన బోలాండ్, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 10 వికెట్ల ప్రదర్శనకు గానూ బోలాండ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం ఆసీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన బుమ్రాను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది.డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్భారత్పై ఐదో టెస్ట్ గెలుపుతో ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆసీస్ రెండో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడతాయి. 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో ఆస్ట్రేలియా మరో రెండు మ్యాచ్‌లు (శ్రీలంకతో) ఆడాల్సి ఉంది. -
చరిత్ర సృష్టించిన ప్యాట్ కమ్మిన్స్.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా తమ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. చివరగా 2014-15లో మైఖల్ క్లార్క్ ఆసీస్‌కు బీజీటీ టైటిల్‌ను అందించగా.. మళ్లీ ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో కంగారుల కలనేరవేరింది.సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా.. 3-1 తేడాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. బీజీటీతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్‌ను ఆసీస్ ఖారారు చేసుకుంది. కాగా ఈ సిరీస్ విజయంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ది కీలక పాత్ర.సిరీస్ అసాంతం కమ్మిన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 2021లో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కమ్మిన్స్.. తన జట్టును వరుసగా రెండు సార్లు వరల్డ్‌టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేర్చాడు.కమ్మిన్స్ అరుదైన ఘనత..ఈ క్రమంలో ప్యాట్ కమ్మిన్స్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 20 మ్యాచ్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా డబ్లూటీసీ సైకిల్స్(2021-23, 2023-25)లో కమ్మిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 33 మ్యాచ్‌లు ఆడగా 20 గెలిచింది.కమ్మిన్స్ తర్వాతి స్ధానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉన్నాడు. స్టోక్స్ సారథ్యంలో 29 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఆడగా.. 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడో స్ధానంలో 14 విజయాలతో విరాట్ కోహ్లి ఉన్నాడు. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే? స్టార్ ప్లేయర్‌కు ఛాన్స్! -
టీమిండియాతో ఎప్పుడూ సవాలే.. కానీ కలిసికట్టుగా పోరాడం: కమ్మిన్స్
సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా పదేళ్ల తర్వాత తిరిగి బీజీటీని రిటైన్ చేసుకుంది.చివరగా 2014-15లో మైఖల్ క్లార్క్ సారథ్యంలో ఆసీస్ విజేతగా నిలవగా.. మళ్లీ ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీ బీజీటీ టైటిల్‌ను కంగారులు దక్కించుకున్నారు. కాగా ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో సత్తాచాటిన కమ్మిన్స్ సేన.. బ్యాటింగ్‌లో కూడా దుమ్ములేపింది. భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఆస్ట్రేలియా ఖారారు చేసుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు."బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తిరిగి చేజిక్కించుకోవడం ఆనందంగా ఉంది. మా జట్టులో చాలా మంది ఇంతవరకు ఈ ట్రోఫీ నెగ్గలేదు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చ లేకపోయాం. ఆ తర్వాత కలిసికట్టుగా రాణించడం బాగుంది.జట్టులోని ప్లేయర్ల మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ సిరీస్ ద్వారానే అరంగేట్రం చేసిన ముగ్గురు కొత్త ఆటగాళ్లు విభిన్న పరిస్థితుల్లో మెరుగైన ఆటతీరు కనబర్చారు. నా కెరీర్లో ఇది చాలా ఇష్టమైన ట్రోఫీ. సిరీస్ కోసం బాగా సన్నద్ధమయ్యా. భారత్ వంటి ప్రత్యర్ధితో తలపడటం ఎప్పుడూ సవాలే" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
లంక పర్యటనకు కమిన్స్ దూరం
సిడ్నీ: ఆ్రస్టేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ శ్రీలంక పర్యటనకు దూరం కానున్నాడు. అతని భార్య రెండో కాన్పు సమయంలోనే ఆ టూర్ ఉండటంతో ద్వైపాక్షిక సిరీస్ నుంచి తప్పుకునే అవకాశముందని చెప్పాడు. గతేడాది భారత్ పర్యటనలో ఉండగా కమిన్స్ మాతృమూర్తి మృతి చెందడంతో టూర్ మధ్యలోనే అతను తిరుగుముఖం పట్టాడు. అప్పటి నుంచి తన జీవితంలో కుటుంబ ప్రాధామ్యాలు మారాయని కమిన్స్ చెప్పుకొచ్చాడు.కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఈ నెలాఖర్లో లంక పర్యటనకు బయలుదేరనున్న ఆసీస్ అక్కడ రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్ చేరే రెండో జట్టు ఈ సిరీస్ ఫలితంతోనే ఖరారవుతుంది. జనవరి 29 నుంచి తొలి టెస్టు, ఫిబ్రవరి 6 నుంచి రెండో టెస్టు జరగనున్నాయి. కమిన్స్ గైర్హాజరీలోని ఆ్రస్టేలియాకు అనుభవజు్ఞడైన స్టీవ్ స్మిత్ లేదంటే హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్లలో ఒకరు నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. -
ప్యాట్ కమిన్స్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా
మెల్బోర్న్ వేదికగా భారత్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా అద్బుతమైన విజయం సాధించింది. ఆఖరి రోజు వరకు జరిగిన ఈ బాక్సింగ్ డే పోరులో 184 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌కు అడుగు దూరంలో ఆసీస్ నిలిచింది.ఈ విజయంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కమ్మిన్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 90 పరుగులతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేసిన పాట్ కమిన్స్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన కమ్మిన్స్..టెస్ట్ క్రికెట్ చరిత్రలో ప్రత్యర్థి కెప్టెన్‌ను ఎక్కవ సార్లు ఔట్ చేసిన సారథిగా కమిన్స్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో రోహిత్ శర్మను ఇప్పటివరకు కమ్మిన్స్ ఆరు సార్లు ఔట్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిచీ బెనాడ్ పేరిట ఉండేది. రిచీ బెనాడ్ ఇంగ్లండ్ లెజెండరీ కెప్టెన్ టెడ్ డెక్స్టర్ను 5 సార్లు ఔట్ చేశాడు. తాజా మ్యాచ్‌తో రిచీ బెనాడ్ ఆల్‌టైమ్ రికార్డును కమిన్స్ బ్రేక్ చేశాడు.చదవండి: మానసిక వేదన.. అందుకే ఓడిపోయాం.. నితీశ్ రెడ్డి మాత్రం అద్భుతం: రోహిత్ శర్మ -
అద్భుతమైన టెస్టు.. ఆఖరికి మాదే పైచేయి.. వాళ్లిద్దరు సూపర్: కమిన్స్
మెల్బోర్న్ టెస్టు అద్భుతంగా సాగిందని.. ఆఖరికి తామే పైచేయి సాధించడం పట్ల సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) హర్షం వ్యక్తం చేశాడు. బంతితో పాటు బ్యాట్‌తోనూ తాను రాణించడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. ట్రవిస్ హెడ్‌కు బాల్ ఇవ్వడం వెనుక తమ కోచ్ హస్తం ఉందని.. ఈ విషయంలో క్రెడిట్ ఆయనకే ఇస్తానని కమిన్స్ తెలిపాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా సొంతగడ్డపై టీమిండియా(India vs Australia)తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్ మ్యాచ్‌లో ఓడిన కంగారూ జట్టు.. అడిలైడ్ టెస్టుతో విజయాన్ని రుచిచూసింది. అనంతరం బ్రిస్బేన్ టెస్టు వర్షం వల్ల డ్రా కాగా.. ఇరుజట్లు మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నాలుగో టెస్టు జరిగింది.340 పరుగుల లక్ష్యంఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసిన కంగారూలు.. భారత్‌ను 369 పరుగులకు కట్టడి చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌట్ అయిన కమిన్స్ బృందం.. టీమిండియాకు 340 పరుగుల లక్ష్యాన్ని విధించింది.అయితే, సోమవారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా 155 పరుగులకే ఆలౌట్ కావడంతో.. ఆసీస్ 184 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. తద్వారా సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 90(49, 41) పరుగులు చేయడంతో పాటు.. కమిన్స్ ఆరు వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.మాదే పైచేయిఈ క్రమంలో విజయానంతరం కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన టెస్టు మ్యాచ్ ఆడాము. ప్రేక్షకులు కూడా మాకు మద్దతుగా నిలిచారు. వారి నుంచి అద్భుత స్పందన లభించింది. విజయంలో నా పాత్ర కూడా ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను.లబుషేన్(72, 70), స్మిత్(140, 13 ) రాణించడం వల్ల పటిష్ట స్థితిలో నిలిచాం. నిజానికి ఈరోజు తొలి సెషన్లో మాదే పైచేయి. కానీ అనూహ్య రీతిలో వాళ్లు పుంజుకుని.. రెండో సెషన్లో రాణించారు. అయితే, మేము మాత్రం సానుకూల దృక్పథంతోనే ఉన్నాము.ఫీల్డింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక హెడ్‌తో బౌలింగ్ చేయించాలన్నది మా కోచ్ ఆలోచనే. ఆ విషయంలో క్రెడిట్ మొత్తం ఆయనకే ఇస్తాను. జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టులోనూ ఇదే తరహా ఫలితం పునరావృతం చేస్తామని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గా విఫలమైన ట్రవిస్ హెడ్(0, 1) రిషభ్ పంత్(Rishabh Pant-30) రూపంలో కీలక వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో సహాయం చేశాడు.చదవండి: మానసిక వేదన.. అందుకే ఓడిపోయాం.. నితీశ్ రెడ్డి మాత్రం అద్భుతం: రోహిత్ శర్మ -
‘వర్షం వల్లే డ్రా.. లేదంటే గెలుపు మాదే.. ఆ ఇద్దరు అద్భుతం’
టీమిండియాతో మూడో టెస్టు డ్రాగా ముగియడం పట్ల ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. వర్షం అడ్డుపడకపోయి ఉంటే తాము తప్పక గెలిచేవాళ్లమని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలకపోయినా.. తమ జట్టు సమిష్టిగా రాణించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరు గెలుపు కోసం తమ వంతు కృషి చేయడం ఎంతో బాగుందని సహచర ఆటగాళ్లను కొనియాడాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా సొంతగడ్డపై ఆసీస్.. భారత్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ మ్యాచ్‌లో భారత్ గెలుపొందగా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జయభేరి మోగించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.పదే పదే అడ్డుపడ్డ వరుణుడుఅయితే, సిరీస్‌లో ఎంతో కీలకమైన మూడో టెస్టు మాత్రం డ్రాగా ముగిసిపోయింది. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం మొదలైన ఈ టెస్టుకు తొలి రోజు నుంచే వర్షం ఆటంకం కలిగించింది. మరోవైపు.. వెలుతురులేమి వల్ల కూడా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.ఆది నుంచి పటిష్ట స్థితిలోనే ఆసీస్ఈ నేపథ్యంలో బుధవారం నాటి ఐదో రోజు ఆటలో కూడా ఇలాంటి అవాంతరాలు ఎదురుకావడంతో.. అంపైర్ల సూచన మేరకు ఆసీస్- భారత కెప్టెన్లు కమిన్స్, రోహిత్ శర్మ డ్రాకు అంగీకరించారు. నిజానికి గబ్బా టెస్టులో ఆది నుంచి ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలోనే ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్(101) శతకాల కారణంగా పైచేయి సాధించింది.భారత్‌కు ఫాలో ఆన్ గండం తప్పిందిభారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగి 445 పరుగులు మేర భారీ స్కోరు సాధించింది. అయితే, ఆసీస్ బ్యాటర్లు చెలరేగిన చోట.. టీమిండియా మాత్రం తడబడింది. కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(77)తో పాటు ఆఖర్లో జస్ప్రీత్ బుమ్రా(10*), ఆకాశ్ దీప్(31) విలువైన ఇన్నింగ్స్ కారణంగా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 260 పరుగులతో మెరుగైన స్కోరు సాధించింది.ఐదోరోజూ ఆటంకాలుఈ క్రమంలో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఆసీస్.. 89/7 వద్ద స్కోరును డిక్లేర్ చేసింది. తద్వారా భారత్ ముందు 275 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, పదే పదే వర్షం రావడంతో పాటు.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేసి.. ఇరుజట్ల కెప్టెన్లను సంప్రదించారు. భారత్ స్కోరు 8/0 వద్ద ఉండగా.. ఇరువురూ డ్రాకు అంగీకరించారు. నిజానికి ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడపకపోయి ఉంటే ఫలితం వచ్చేదే.2-1తో మేము ఆధిక్యంలో నిలిచేవాళ్లంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘వర్షం పదే పదే అడుడ్డుపడింది. లేదంటే 2-1తో మేము ఆధిక్యంలో నిలిచేవాళ్లం. అయినా, మన చేతుల్లో లేని విషయం గురించి ఆలోచించడం అనవసరం. ఏదేమైనా ఈ టెస్టులో మా జట్టు ప్రదర్శన సంతృప్తినిచ్చింది.మేము భారీ స్కోరు సాధించడంతో పాటు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశాం. స్టార్క్, నేను బాగానే రాణించాం. కానీ దురదృష్టవశాత్తూ మేము జోష్ హాజిల్‌వుడ్ సేవలు కోల్పోయాం. ఇక ఐదో రోజు ఆటలో కూడా వర్షం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి.ఆ ఇద్దరు అద్భుతంకొత్త బంతిని ఎదుర్కోవడం సవాలుగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో హెడ్, స్మిత్ అద్భుతంగా ఆడారు. అలెక్స్ క్యారీ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. నాథన్ లియోన్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. స్టార్క్ వికెట్లు తీశాడు. ఇలా ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు.బాక్సింగ్ డే టెస్టుకు ముందు మాకు ఇలా ఎన్నో సానుకూలాంశాలు ఉండటం సంతోషం’’ అని పేర్కొన్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తదుపరి టెస్టు బరిలో దిగుతామని కమిన్స్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా భారత్- ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 26 నుంచి మెల్బోర్న్లో నాలుగో టెస్టు మొదలుకానుంది.చదవండి: Kohli- Gambhir: వారికి మ్యాచ్ గెలిచినంత సంబరం.. రోహిత్ మాత్రం అలా.. వీడియో -
ట్రావిస్ హెడ్‌కు ప్రమోషన్.. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా!?
భారత్‌తో టెస్టు సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారులు తలపడనున్నారు. అయితే ఈ పర్యటనకు ఆసీస్ రెగ్యూలర్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.ఈ సిరీస్ జనవరి 27 నుంచి ప్రారంభం కానుంది. సరిగ్గా ఇదే సమయంలో కమ్మిన్స్ భార్య బెకీ తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది. ఈ క్రమంలోనే కమ్మిన్స్ శ్రీలంకతో సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.తన కొడుకు అల్బీ పుట్టినప్పుడు పక్కనలేని కమ్మిన్స్.. ఈసారి రెండో బిడ్డ విషయంలో మాత్రం ఫ్యామిలీతోనే ఉండాలని భావిస్తున్నడంట. కమ్మిన్స్ ఇప్పటికే తన నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఆసీస్ కెప్టెన్‌గా ట్రావిస్ హెడ్?ఇక స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో సత్తాచాటుతున్న ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌కు ప్రమోషన్ దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక టూర్‌కు ఒకవేళ కమ్మిన్స్ దూరమైతే, కెప్టెన్సీ బాధ్యతలు హెడ్‌కు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు తెలుస్తోంది.వైస్ కెప్టెన్ స్మిత్ ఉన్నప్పటికి హెడ్ వైపే క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలు మొగ్గు చూపుతున్నారంట. అయితే హెడ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెస్టుల్లో కెప్టెన్సీ చేయలేదు. కానీ వైట్ క్రికెట్లో మాత్రం సారథిగా హెడ్‌కు అనుభవం ఉంది. బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు కెప్టెన్‌గా హెడ్ వహించాడు. కాగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో హెడ్ ఇప్పటికే రెండు సెంచరీలు సాధించాడు. పింక్‌బాల్ టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించడంలో హెడ్ కీలక పాత్ర పోషించాడు. -
WTC: బుమ్రా అరుదైన రికార్డు.. భారత తొలి బౌలర్‌గా
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో మెరిశాడు. బ్రిస్బేన్‌లో పేస్ దళాన్ని ముందుకు నడిపించిన ఈ స్పీడ్‌స్టర్.. ఆదివారం నాటి ఆటలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(21)ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ(9)ని కూడా తానే పెవిలియన్‌కు పంపాడు.ఆ ఇద్దరి సెంచరీలుఈ క్రమంలో బుమ్రా స్ఫూర్తితో యువ పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మార్నస్ లబుషేన్(12) ఆట కట్టించాడు. ఫలితంగా 75 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. దీంతో భారత శిబిరంలో ఉత్సాహం నెలకొంది. అయితే, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.నాలుగో నంబర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు తోడైన ట్రవిస్ హెడ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 115 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో తన తొమ్మిదవ సెంచరీ నమోదు చేసిన అనంతరం హెడ్.. కొరకరాని కొయ్యగా మారాడు. ఈ క్రమంలో.. ఫామ్‌లోలేని స్మిత్ సైతం హెడ్ ఇచ్చిన జోష్‌లో శతక్కొట్టేశాడు.బుమ్రా విడగొట్టేశాడుఈ మిడిలార్డర్ బ్యాటర్లను విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. అయితే, మరోసారి బుమ్రానే తన అనుభవాన్ని ఉపయోగించి స్మిత్(101)ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(5) వికెట్‌ను కూడా బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.అనంతరం.. శతకవీరుడు ట్రవిస్ హెడ్(152)ను కూడా అవుట్ చేశాడు బుమ్రా. దీంతో టీమిండియాలో తిరిగి ఉత్సాహం నిండింది. ఇక హెడ్ రూపంలో ఈ ఇన్నింగ్స్‌లో ఐదో వికెట్ దక్కించుకున్న బుమ్రా. తన కెరీర్లో ఓవరాల్‌గా పన్నెండోసారి(Five Wicket Haul) ఈ ఘనత సాధించాడు.Jasprit Bumrah gets Travis Head to bring up his fifth wicket! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/2QGUazarZP— cricket.com.au (@cricketcomau) December 15, 2024అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో అతడికి ఇది తొమ్మిదో ఫైవ్ వికెట్ హాల్. అంతేకాదు.. ఆస్ట్రేలియా గడ్డ మీద నాలుగోసారి బుమ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ క్రమంలో బుమ్రా రెండు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు.కమిన్స్ సరసన.. భారత తొలి బౌలర్‌గా రికార్డుడబ్ల్యూటీసీలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన క్రికెటర్‌గా ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ కొనసాగుతున్నాడు. అతడు ఇప్పటికి తొమ్మిదిసార్లు ఈ ఘనత సాధించాడు. తాజా టెస్టుతో బుమ్రా కూడా కమిన్స్ సరసన చేరాడు. ఈ జాబితాలో సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడ(7), ఆసీస్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్(6), న్యూజిలాండ్ ఫాస్ట్‌బౌలర్ టిమ్ సౌథీ(6) వీరి తర్వాతి స్థానాలో ఉన్నారు.కుంబ్లే రికార్డును సమం చేసిన బుమ్రాఇక ఆస్ట్రేలియా గడ్డపై నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్‌గా అనిల్ కుంబ్లే కొనసాగుతున్నాడు. బ్రిస్బేన్ టెస్టుతో బుమ్రా కూడా కుంబ్లే రికార్డును సమం చేశాడు. ఇదిలా ఉంటే.. ఓవరాల్‌గా 23సార్లు కపిల్ దేవ్ ఫైవ్ వికెట్ల హాల్ సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఆసీస్‌దే పైచేయిబ్రిస్బేన్లో గబ్బా మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా టీమిండియాపై పైచేయి సాధించింది. ఆదివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. హెడ్, స్మిత్ సెంచరీలకు తోడు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(45 నాటౌట్) రాణించడం వల్ల ఇది సాధ్యమైంది. ఇక భారత బౌలర్లలో బుమ్రా ఐదు, నితీశ్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో పెర్త్ టెస్టులో భారత్, అడిలైడ్ పింక్‌బాల్ టెస్టులో ఆసీస్ విజయం సాధించాయి. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
‘రోహిత్ శర్మ నిర్ణయం తప్పు.. కమిన్స్ సంతోషించి ఉంటాడు’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయాన్ని ఇంగ్లండ్ మాజీ సారథి, కామెంటేటర్ మైకేల్ వాన్ విమర్శించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడాన్ని తప్పుబట్టాడు. రోహిత్ నిర్ణయం ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు సంతోషాన్ని మిగిల్చి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.సిరీస్ 1-1తో సమంగాకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో.. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో 295 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా శనివారం మూడో టెస్టు మొదలైంది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేయడం సులువవుతుందనేఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. వికెట్‌పై కాస్త పచ్చిక ఉన్నట్లు కనిపిస్తోంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. పిచ్ పరిస్థితులు తమకు అనుకూలిస్తాయని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.మ్యాచ్ సాగుతున్న కొద్దీ బ్యాటింగ్ చేయడం సులువవుతుందనే ఉద్దేశంతోనే బౌలింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ శర్మ తెలిపాడు. ఇక ఆసీస్ సారథి కమిన్స్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కమిన్స్దీ అదే మాటతాను కూడా టాస్ గెలిచి ఉంటే.. తొలుత బౌలింగ్ ఎంచుకునే వాడినన్నాడు. అయితే, ఈ ఇద్దరు కెప్టెన్ల వ్యాఖ్యలకు విరుద్ధంగా మైకేల్ వాన్ కామెంట్ చేయడం విశేషం.రోహిత్ శర్మ నిర్ణయం తప్పు‘‘రోహిత్ శర్మ నిర్ణయంతో ప్యాట్ కమిన్స్ మనసులో గంతులేస్తూ ఉంటాడు. తాను టాస్ ఓడిపోయినందుకు సంతోషపడి ఉంటాడు. గత చరిత్ర ఆధారంగా అతడు బ్యాటింగే ఎంచుకుని ఉండేవాడు. ఏదేమైనా రోహిత్ తొలుత బౌలింగ్ ఎంచుకుని తప్పుచేశాడు’’ అని మైకేల్ వాన్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు.కొత్త బంతితో నో మ్యాజిక్!కాగా గబ్బా పిచ్‌పై కొత్త బంతితో భారత పేసర్లు పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయారు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లు కూడా రంగంలోకి దిగారు. బుమ్రా ఆరు ఓవర్ల బౌలింగ్‌లో 8, సిరాజ్ నాలుగు ఓవర్లలో 13, ఆకాశ్ దీప్ 3.2 ఓవర్లలో 2 పరుగులు ఇచ్చారు. ఇక ఆసీస్ ఇన్నింగ్స్ 13.2 ఓవర్ల వద్ద ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. అప్పటికి కంగారూ జట్టు వికెట్ నష్టపోకుండా 28 రన్స్ చేసింది. అయితే, ఆ తర్వాత వర్షం తెరిపినివ్వకపోవడంతో తొలిరోజు ఆటను అంతటితో ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. -
Ind vs Aus 3rd Test: వదలని వర్షం.. ముగిసిపోయిన తొలిరోజు ఆట
Ind vs Aus 3rd Test Day 1 Updates: ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య శనివారం మూడో టెస్టు మొదలైంది. బ్రిస్బేన్లోన గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో తొలిరోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, వర్షం కారణంగా 13.2 ఓవర్ల తర్వాత ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత కూడా ఎడతెరిపి లేకుండా వాన పడటంతో అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారుఆటకు వర్షం ఆటంకంబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య మొదలైన తొలిరోజు ఆటకు వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను ప్రస్తుతానికి నిలిపివేశారు. ఆసీస్ స్కోరు: 28/0 (13.2). ఖవాజా 19, మెక్‌స్వీనీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.పది ఓవర్లలో ఆసీస్ స్కోరు: 26-0ఖవాజా 18, మెక్‌స్వీనీ మూడు పరుగులతో ఆడుతున్నారు.ఆరు ఓవర్లలో ఆసీస్ స్కోరుభారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత బౌలింగ్ అటాక్ ప్రారంభించాడు. ఇక రోహిత్ సేన ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 23 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా 17, నాథన్ మెక్‌స్వీనీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. వాళ్లిద్దరిపై వేటుటాస్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్‌ను తీసుకున్నట్లు తెలిపాడు. ఒక మార్పుతో ఆసీస్మరోవైపు.. ఆస్ట్రేలియా సైతం ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు చేసింది. గాయం నుంచి కోలుకున్న పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తిరిగి రావడంతో.. స్కాట్ బోలాండ్‌పై వేటు పడింది.తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హాజిల్‌వుడ్. -
అవునా.. నాకైతే తెలియదు: కమిన్స్‌కు ఇచ్చిపడేసిన గిల్
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతోంది. బ్రిస్బేన్ వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.చెరో గెలుపుతో సమంగాకాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఇందుకు ధీటుగా బదులిచ్చిన కంగారూ జట్టు అడిలైడ్‌లో భారత్‌ను పది వికెట్ల తేడాతో ఓడించింది. ఇక ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో తాము షార్ట్ బాల్స్‌తో టీమిండియాను కట్టడి చేశామని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు.అవునా.. నాకైతే తెలియదే!అడిలైడ్ ఓవల్ మైదానంలో షార్ట్ బాల్ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి.. టీమిండియా బ్యాటర్ల పనిపట్టామని కమిన్స్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని శుబ్‌మన్ గిల్ దగ్గర విలేకరులు ప్రస్తావించగా.. ‘‘అవునా.. నాకైతే తెలియదే!.. షార్ట్ బాల్‌తో బహుశా వాళ్లు ఒక టెయిలెండర్‌ను లేదంటే లోయర్ ఆర్డర్ బ్యాటర్‌ను మాత్రమే అవుట్ చేశారు.కానీ.. అతడు ఏ షార్ట్‌బాల్‌ను ఉపయోగించి విజయం సాధించామని చెప్తున్నాడో నాకైతే తెలియదు’’ అంటూ కమిన్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా గాయం వల్ల పెర్త్ టెస్టుకు దూరమైన గిల్.. అడిలైడ్‌లో పింక్ బాల్ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు.ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా మిచెల్ స్టార్క్ గిల్‌ను బౌల్డ్ చేశాడు. ఇక మూడో టెస్టు జరుగనున్న బ్రిస్బేన్ స్టేడియంతో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు మధురానుభవం ఉంది.నాడు 91 పరుగులతో చెలరేగిన గిల్2021 నాటి టెస్టులో గిల్ 91 పరుగులు చేసిన గిల్.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా గతంలో మాదిరి ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. మూడో టెస్టునే ఫైనల్ మ్యాచ్‌గా భావించి బరిలోకి దిగుతామన్న గిల్.. గాబాలో గెలిస్తే.. మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడగలమని పేర్కొన్నాడు. కాగా మూడో టెస్టు కోసం ఇప్పటికే బ్రిస్బేన్ చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్లలో తీవ్రంగా శ్రమించింది.చదవండి: IND vs AUS: మూడో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడు వచ్చేశాడుShots fired already? 👀While @patcummins30 claims Australia have succeeded in their short ball ploy, look what @ShubmanGill has to say about it! 😁😅1️⃣ DAY TO GO for #AUSvINDOnStar 3rd Test 👉 SAT 14 DEC, 5.20 AM onwards! #ToughestRivalry pic.twitter.com/vS55v5Qgwz— Star Sports (@StarSportsIndia) December 13, 2024 -
అదే మా కొంపముంచింది.. మరింత బలంగా తిరిగి వస్తాము: ఆసీస్ కెప్టెన్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆతిథ్య ఆస్ట్రేలియా ఓటమితో ఆరంభించింది. పెర్త్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో ఆసీస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 534 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారు జట్టు భారత బౌలర్ల దాటికి 238 పరుగులకు ఆలౌటైంది.భారత బౌలర్లలో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తలా మూడు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బతీశారు. వీరిద్దరితో పాటు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టాడు. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(89) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి కారణమని తెలిపాడు.అదే మా కొంపముంచింది"ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మ్యాచ్ కోసం మేము బాగానే సన్నద్దమయ్యాము. జట్టులోని ప్రతీ ఒక్కరూ పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగారు. కానీ మా ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయాము. కొన్ని మ్యాచ్‌ల్లో మనం ప్లాన్ చేసింది జరగదు. అటువంటి మ్యాచ్‌ల్లో ఇదొకటి. ఇక ఈ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాము. తర్వాతి మ్యాచ్‌లో మేము తిరిగిపుంజుకుంటామన్న నమ్మకం ఉంది. ఈ ఓటమి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నిర్ణయించుకున్నాము.ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెడతాము. ఈ మ్యాచ్‌లో మాకు ఏదీ కలిసిరాలేదు. తొలి రోజు బౌలర్లు ఇచ్చిన ఆరంభాన్ని మేము అందిపుచ్చుకోలేకపోయాం. మొదటి రోజు బ్యాటింగ్ పరంగా మేము రాణించి ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేది. రెండో రోజు నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.ఈ మ్యాచ్‌లో తప్పు ఎక్కడ జరిగిందో చర్చించుకుంటాము. అయితే మా జట్టులో చాలా మంది అనుభవం ఉ న్న ఆటగాళ్లు ఉన్నారు. వారికి బలంగా ఎలా తిరిగి రావాలో బాగా తెలుసు. ఆడిలైడ్ టెస్టు కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తాము. రెండో టెస్టులో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తాం" అని పోస్ట్‌మ్యాచ్ ప్రజేంటేషన్లో కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. -
Ind vs Aus 1st Day 2: అదరగొట్టిన భారత ఓపెనర్లు.. రెండో రోజూ మనదే
Australia vs India, 1st Test Day 2 At Perth Updates: అదరగొట్టిన భారత ఓపెనర్లు.. రెండో రోజు మనదేపెర్త్ టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో కూడా భారత జట్టు అదరగొట్టింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, రాహుల్ అద్బుతంగా ఆడుతున్నారు. జైశ్వాల్(90), రాహుల్(62) ఆజేయంగా నిలిచారు. ప్రస్తుతం టీమిండియా 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ..టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జైశ్వాల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను రాహుల్ ముందుకు నడిపిస్తున్నాడు. క్రీజులో జైశ్వాల్(74), కేఎల్ రాహుల్(56) పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు- 145/0 (37.4). 191 పరుగుల లీడ్.యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీఆసీస్తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో మెరిశాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జైస్వాల్‌కు ఇది తొమ్మిదో ఫిఫ్టీ. మరోవైపు రాహుల్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు- 100/0 (37.4). 146 పరుగుల లీడ్.టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 84/0 (26)జైస్వాల్ 42, రాహుల్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా ఆధిక్యం 130 పరుగులు.20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 75-0రాహుల్ 29, జైస్వాల్ 38 పరుగులతో ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ప్రస్తుతం 121 పరుగుల మెరుగైన ఆధిక్యంలో ఉంది.నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లుటీమిండియా తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ నిలకడగా ఆడుతున్నారు. శనివారం నాటి రెండో రోజు ఆటలో 12 ఓవర్లు ముగిసే సరికి రాహుల్ 29 బంతులు ఎదుర్కొని ఎనిమిది, జైస్వాల్ 43 బంతులు ఎదుర్కొని 16 పరుగులు చేశారు. భారత్ స్కోరు: 30-0(12).ఆస్ట్రేలియా ఆలౌట్.. స్కోరు ఎంతంటే?టీమిండియాతో తొలి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఆటగాళ్లలో టెయిలెండర్ మిచెల్ స్టార్క్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.అయితే, స్టార్క్‌ను అవుట్ చేసేందుకు భారత బౌలర్లు సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు హర్షిత్ రాణా అతడిని పెవిలియన్‌కు పంపడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్లో స్టార్క్‌తో పాటు వాళ్లలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(21) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు.ఇక టీమిండియా బౌలర్లలో ప్రధాన పేసర్ బుమ్రాకు అత్యధికంగా ఐదు వికెట్లు దక్కగా.. హర్షిత్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా తొలి రోజు ఆటలో భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆసీస్హర్షిత్ రాణా బౌలింగ్‌లో నాథన్ లియాన్ థర్డ్ స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆసీస్ తొమ్మిదో వికెట్ కోల్పోగా.. హర్షిత్ ఖాతాలో రెండో వికెట్ జమైంది. జోష్ హాజిల్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. స్టార్క్ 11 పరుగులతో ఉన్నాడు. ఆసీస్ స్కోరు: 79/9 (33.3).ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టు రెండో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియా అదరగొట్టింది. కెప్టెన్ బుమ్రా బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ(21) అవుటయ్యాడు. పంత్‌కు క్యాచ్ ఇచ్చి అతడు పెవిలియన్ చేరాడు. దీంతో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. నాథన్ లియాన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 70-8(29).రెండో రోజు ఆట ఆరంభంఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ఆరంభమైంది. శనివారం 67/7 ఓవర్ నైట్ స్కోరుతో ఆసీస్ తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఆసీస్‌తో శుక్రవారం తొలి టెస్టు మొదలుపెట్టింది. పెర్త్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఆదుకున్న నితీశ్ రెడ్డి, పంత్టాపార్డర్ కుదేలైన వేళ మిడిలార్డర్ బ్యాటర్ రిషభ్ పంత్(37), లోయర్ ఆర్డర్లో ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(41) రాణించారు. ఫలితంగా టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ పేసర్లలో హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. స్టార్క్, కెప్టెన్ కమిన్స్, మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.తొలి రోజు బుమ్రాకు నాలుగు వికెట్లుఈ క్రమంలో తొలిరోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్‌కు భారత పేసర్లు చుక్కలు చూపించారు. బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ రెండు, అరంగేట్ర బౌలర్ హర్షిత్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు కాగా.. తొలి రోజు ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి కేవలం 67 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(8), అరంగేట్ర బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ(10), స్టీవ్ స్మిత్(0), ప్యాట్ కమిన్స్(3) వికెట్లను బుమ్రా పడగొట్టగా.. మార్నస్ లబుషేన్(2), మార్ష్(6)ను సిరాజ్ వెనక్కి పంపాడు. హర్షిత్ రాణా ట్రవిస్ హెడ్‌ను అవుట్ చేసి అంతర్జాతీయ క్రికెట్లో తన వికెట్ల ఖాతా తెరిచాడు.తుదిజట్లుటీమిండియాకేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్ స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్.చదవండి: ఇది నా డ్రీమ్ ఇన్నింగ్స్ కాదు.. అతడే నా ఆరాధ్య దైవం: నితీశ్ రెడ్డి -
77 ఏళ్లలో ఇదే తొలిసారి.. అరుదైన రికార్డుతో చరిత్ర పుటల్లోకి కమిన్స్, బుమ్రా!
ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య పెర్త్ టెస్టు సందర్భంగా ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఇరుజట్ల కెప్టెన్లు ప్యాట్ కమిన్స్- జస్ప్రీత్ బుమ్రా కలిసి తమ పేర్లను చరిత్ర పుటల్లో లిఖించుకున్నారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.రోహిత్ శర్మ దూరంప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో టీమిండియాకు ఈ సిరీస్ ఆఖరిది. ఇక ఇందులో కనీసం నాలుగు టెస్టులు గెలిస్తేనే భారత్ ఈసారీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇంతటి కీలకమైన సిరీస్‌లో తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరంగా ఉన్నాడు.బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా పగ్గాలుఈ క్రమంలో రోహిత్ స్థానంలో భారత జట్టు పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఇక పెర్త్ వేదికగా టీమిండియా- ఆసీస్ మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ సమయంలో కెప్టెన్లు బుమ్రా- కమిన్స్ కరచాలనం చేసుకున్న దృశ్యాలు క్రికెట్ ప్రేమికులను ఆకర్షించాయి.77 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారిఈ నేపథ్యంలోనే భారత్- ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో నమోదైన ఓ అరుదైన ఫీట్ వెలుగులోకి వచ్చింది. ఇలా ఇరుజట్లకు ఫాస్ట్‌బౌలర్లే సారథ్యం వహించడం 77 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా 2021 ద్వితీయార్థంలోనే ఫాస్ట్ బౌలర్ కమిన్స్ ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ అయ్యాడు.మరోవైపు.. భారత పేసర్ బుమ్రా గతంలో ఇంగ్లండ్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించినా.. ఆస్ట్రేలియాలో మాత్రం సారథిగా అతడికి ఇదే తొలి అనుభవం. ఇదిలా ఉంటే.. 1947-48లో భారత్- ఆస్ట్రేలియా మధ్య తొలిసారి టెస్టు సిరీస్ జరిగింది. నాడు వీరి సారథ్యంలోనాడు టీమిండియా ఆసీస్ చేతిలో 4-0తో ఓడిపోయింది. అప్పుడు ఆసీస్ జట్టుకు లెజెండరీ బ్యాటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ కెప్టెన్‌గా ఉండగా.. టీమిండియాకు ఆల్‌రౌండర్ లాలా అమర్నాథ్ నాయకుడు.ఇక 1985-86లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ కూడా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఇంత వరకు బుమ్రాలా పూర్తిస్థాయిలో ఓ ఫాస్ట్ బౌలర్ ఆసీస్‌తో టెస్టుల్లో టీమిండియాకు సారథ్యం వహించలేదు.పేలవంగా మొదలుకాగా పెర్త్ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత్‌కు మాత్రం శుభారంభం లభించలేదు. శుక్రవారం నాటి తొలిరోజు ఆట భోజన విరామ సమయానికి 25 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 51 పరుగులు చేసింది.చదవండి: Ind vs Aus: ఆ ఇద్దరు డకౌట్.. కోహ్లి మరోసారి విఫలం.. మండిపడుతున్న ఫ్యాన్స్టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్🗣️🗣️ 𝙏𝙝𝙚𝙧𝙚'𝙨 𝙣𝙤 𝙜𝙧𝙚𝙖𝙩𝙚𝙧 𝙝𝙤𝙣𝙤𝙪𝙧 𝙩𝙝𝙖𝙣 𝙩𝙝𝙞𝙨.Captain Jasprit Bumrah is charged 🆙 to lead from the front in Perth ⚡️⚡️#TeamIndia | #AUSvIND | @Jaspritbumrah93 pic.twitter.com/0voNU7p014— BCCI (@BCCI) November 21, 2024 -
టాలెంటెడ్ కిడ్.. కానీ.. : నితీశ్ రెడ్డిపై ప్యాట్ కమిన్స్ కామెంట్స్
టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసలు కురిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడితో కలిసి ఆడిన జ్ఞాపకాలు మధురమైనవని.. ఆట పట్ల నితీశ్ అంకితభావం అమోఘమని కొనియాడాడు. ఆసీస్ గడ్డపై కూడా అతడు బంతిని స్వింగ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరుజట్లు ఐదు టెస్టుల్లో తలపడబోతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ గురువారం మీడియాతో మాట్లాడాడు.మాకు ఎంతో కీలకంబోర్డర్- గావస్కర్ ట్రోఫీ తమకు ఎంతో కీలకమైన సిరీస్ అన్న కమిన్స్.. టీమిండియా వంటి పటిష్ట జట్టుతో తలపడటం కఠినమైన సవాలు అని పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై ఆడటం ఎల్లప్పుడూ ఒత్తిడికి గురిచేస్తుందని.. అయితే, తాము అన్ని రకాలుగా ఈ సిరీస్‌కు సిద్ధమయ్యాం కాబట్టి ఆందోళన చెందడం లేదని తెలిపాడు.టాలెంటెడ్ కిడ్ కానీ..ఈ సందర్భంగా నితీశ్ కుమార్ రెడ్డి ప్రస్తావన రాగా.. ‘‘ఎంతో ప్రతిభావంతుడైన కుర్రాడు. కానీ.. సన్‌రైజర్స్ తరఫున అతడికి పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఏదేమైనా అతడు టాలెంటెడ్ కిడ్. తన ఆట తీరుతో నన్ను ఇంప్రెస్ చేశాడు. ఇక్కడ కూడా బంతిని కాస్త స్వింగ్ చేయగలడనే అనుకుంటున్నా’’ అని కమిన్స్ కితాబులిచ్చాడు.సన్‌రైజర్స్ గెలుపులోకాగా ఐపీఎల్-2024లో కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత వైఫల్యాలను మరిపించేలా జట్టును ఏకంగా ఫైనల్స్‌కు చేర్చాడు. ఇక కమిన్స్ కెప్టెన్సీలో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.ఈ ఏడాది రైజర్స్ తరఫున 303 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో ఆస్ట్రేలియాతో టెస్టులకు నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. పెర్త్‌లో అతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.చదవండి: పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వాలి.. విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా -
విరాట్, రోహిత్ వేరు.. నా స్టైల్ వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా
ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపించి విజయపథంలో నిలుపుతానని పేర్కొన్నాడు. పేసర్లు కెప్టెన్సీలో అత్యుత్తమంగా రాణిస్తారన్న బుమ్రా.. అందుకు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ నిదర్శనమని కొనియాడాడు.ఆ పరాభవాన్ని మోసుకురాలేదుఇక న్యూజిలాండ్ చేతిలో పరాభవాన్ని తాము ఆస్ట్రేలియాకు మోసుకురాలేదని.. ఇక్కడ గెలుపే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతామని బుమ్రా పేర్కొన్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పెర్త్ వేదికగా ఈ సిరీస్ మొదలుకానుంది.అయితే, వ్యక్తిగత కారణాల వల్ల టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ బుమ్రా జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో గురువారం మీడియాతో మాట్లాడిన బుమ్రా కెప్టెన్సీ, మొదటి టెస్టులో తొలి టెస్టు కూర్పు తదితర అంశాల గురించి తన మనసులోని భావాలు వెల్లడించాడు.విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు‘‘కెప్టెన్‌గా పనిచేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం. విరాట్, రోహిత్.. భిన్నమైన కెప్టెన్లు. నాకు కూడా నాదైన ప్రత్యేక శైలి ఉంది. నా స్టైల్లో జట్టును ముందుకు నడిపిస్తా. దీనిని నేను భారంగా భావించను. బాధ్యతలు తీసుకోవడం నాకెంతో ఇష్టమైన పని.ఇంతకు ముందు రోహిత్‌తో కూడా మాట్లాడాను. ఇక్కడ ఎలా జట్టును ముందుకు నడిపించాలో నాకు కాస్త స్పష్టత వచ్చింది. పేసర్లను కెప్టెన్లు చేయాలని నేను తరచూ చెబుతూ ఉంటాను. వ్యూహాత్మకంగా వాళ్లెంతో బెటర్. ప్యాట్ సారథిగా అద్భుతంగా రాణిస్తున్నాడు.ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందిగతంలో కపిల్ దేవ్‌తో పాటు చాలా మంది పేసర్లు సూపర్‌గా కెప్టెన్సీ చేశారు. ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందని నేను భావిస్తున్నా’’ అని బుమ్రా పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టుల్లో క్లీన్‌స్వీప్ కావడం ప్రస్తావనకు రాగా.. ‘‘మనం గెలిచినపుడు సున్నా నుంచి మొదలుపెడతాం. మరి ఓడినపుడు కూడా అలాగే చేయాలి కదా!న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. అయితే, అక్కడికీ.. ఇక్కడికీ పిచ్ పరిస్థితులు వేరు. ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. తుదిజట్టు ఖరారైంది.. కానీఇక ఇప్పటికే తాము తొలి టెస్టుకు తుదిజట్టును ఖరారు చేశామని.. శుక్రవారం ఉదయమే ఈ విషయం గురించి అందరికీ తెలుస్తుందంటూ బుమ్రా అభిమానులను ఊరించాడు.చదవండి: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు -
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు
క్రికెట్ ప్రపంచంలో యాషెస్ సిరీస్ తర్వాత అంతే స్థాయిలో అభిమానులను ఆకట్టుకునే రైవలరీ టెస్టు సిరీస్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ). ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకుంటే.. బీజీటీలో టీమిండియాతో తలపడుతుంది. 1996లో మొదలైన ఈ ప్రతిష్టాత్మక సిరీస్.. నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది.బీజీటీలో మనదే పైచేయి.. కానీఇప్పటి వరకు ఈ సిరీస్‌లో టీమిండియాదే పైచేయి. ఇప్పటికి 16 సార్లు జరిగిన బీజీటీలో భారత్ 10 సార్లు ట్రోఫీ కైవసం చేసుకుంది. ఒక్కసారి డ్రాగా ముగియగా.. ఆస్ట్రేలియా ఐదుసార్లు గెలిచింది. ఇక పెర్త్ వేదికగా నవంబరు 22న మరోసారి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ సమరానికి తెరలేవనుంది. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తాడు. మరి ఈ ప్రతిష్టాత్మక సిరీస్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ తదితర విశేషాలు గమనిద్దాం.ఓవరాల్‌గా టెస్టుల్లో టీమిండియా- ఆస్ట్రేలియా ముఖాముఖి రికార్డులుఇప్పటి వరకు తలపడిన 107 మ్యాచ్‌లలో ఇండియా 32, ఆస్ట్రేలియా 45 గెలవగా.. 29 డ్రాగా ముగిశాయి.అత్యధిక పరుగుల, వికెట్ల వీరుడు ఎవరంటే?టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ కొనసాగుతున్నాడు. 39 మ్యాచ్‌లలో అతడు 3630 రన్స్ సాధించాడు. ఇక ఈ భారత్- ఆసీస్ టెస్టు పోరులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నాథన్ లయన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు టీమిండియాతో 27 మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ స్పిన్నర్ 121 వికెట్లు కూల్చాడు.ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా 2024-25షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం👉తొలి టెస్టు👉పెర్త్ స్టేడియం, పెర్త్👉తేదీలు: నవంబర్ 22-26👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ఆరంభం👉రెండో టెస్టు👉ఓవల్ మైదానం, అడిలైడ్(డే, నైట్- పింక్‌బాల్ టెస్టు)👉తేదీలు: డిసెంబరు 6- 10👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు ఆరంభంమూడో టెస్టు👉ది గాబా స్టేడియం, బ్రిస్బేన్👉తేదీలు: డిసెంబరు 14- 18👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5.50 నిమిషాలకు ఆరంభంనాలుగో టెస్టు(బాక్సింగ్ డే టెస్టు)👉మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్👉తేదీలు: డిసెంబరు 26- 30👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆరంభంఐదో టెస్టు👉సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ👉తేదీలు: జనవరి 3- 7👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆరంభంవార్మప్ మ్యాచ్👉నవంబరు 30- డిసెంబరు 1👉ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ వర్సెస్ ఇండియా-‘ఎ’ మధ్య వార్మప్ మ్యాచ్- మనుకా ఓవల్, కాన్బెర్రా.ఎక్కడ వీక్షించవచ్చు?👉టీవీ బ్రాడ్‌కాస్టర్: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్👉లైవ్ స్ట్రీమింగ్: డిస్నీ+హాట్స్టార్జట్లుఆస్ట్రేలియాతో ఐదు టెస్టులకు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్,ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.ట్రావెలింగ్ రిజర్వ్స్: ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్టీమిండియాతో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు గుడ్‌న్యూస్?! -
కోహ్లి, పంత్ కాదు.. అతడితోనే మాకు డేంజర్: ఆసీస్ కెప్టెన్
టీమిండియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. గత రెండు పర్యాయాలు తమ సొంత గడ్డపై భారత్ చేతిలో సిరీస్ కోల్పోయిన ఆసీస్.. ఈసారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఇరు జట్ల మధ్య నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బ్రాడ్‌కాస్టర్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రాకు తనొక బిగ్ ఫ్యాన్ అని కమ్మిన్స్ తెలిపాడు. కాగా బుమ్రాకు ఇది మూడో బీజీటీ ట్రోఫీ కావడం గమనార్హం. ఒకవేళ తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమైతే బుమ్రానే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. బుమ్రాకు ఆసీస్ గడ్డపై టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన జస్ప్రీత్.. 32 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు."నేను జస్ప్రీత్ బుమ్రాకు పెద్ద అభిమానిని. అతడొక అద్భుతమైన బౌలర్. ఈ సిరీస్‌లో భారత జట్టుకు అతడు కీలకం కానున్నాడు. ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం కూడా బుమ్రాకు ఉంది. అతడితో మా బ్యాటర్లకు ముంపు పొంచి ఉన్నది" అని కమ్మిన్స్ పేర్కొన్నాడు.ఇదే విషయంపై పాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ.. "పుజారా, రహానే జట్టులో లేకపోవడం మాకు కలిసిస్తోంది. వారిద్దరూ గతంలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. పుజారాకు బౌలింగ్ చేయడం నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. అతడితో పోటీ అంటే నాకు ఎంతో ఇష్టం. కొన్ని సార్లు గెలిచాను. మరి కొన్ని సార్లు అతడు నాపై పైయి చేయి సాధించాడు. అతడు ఎప్పుడూ ఓటమని అంగీకరించడు" అని చెప్పుకొచ్చాడు.చదవండి: రెండు భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి.. మరో 458 పరుగులు చేస్తే! -
Aus Vs Pak: 5 వికెట్లతో చెలరేగిన పాక్ పేసర్.. కుప్పకూలిన ఆసీస్! ఇమ్రాన్ రికార్డు బ్రేక్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో పాకిస్తాన్ బౌలర్లు అదరగొట్టారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి కంగారూ జట్టును కోలుకోని దెబ్బకొట్టారు. పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్ల వికెట్లు తీసి శుభారంభం అందించగా.. మరో ఫాస్ట్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. షాహిన్, రవూఫ్ దెబ్బకు కమిన్స్ బృందం కనీసం 200 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా మెల్బోర్న్ వేదికగా సోమవారం తొలి వన్డే జరుగగా.. ఆతిథ్య ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ఆసీస్- పాక్ మధ్య శుక్రవారం నాటి రెండో వన్డేకు అడిలైడ్ వేదికగా మారింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ నమ్మకాన్ని నిలబెడుతూ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్లు మాథ్యూ షార్ట్(19), జేక్ ఫ్రేజర్ మెగర్క్(13)లను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.ఐదు కీలక వికెట్లు అతడి సొంతంవన్డౌన్లో వచ్చిన స్టీవ్ స్మిత్(35) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. హస్నైన్ అతడిని అవుట్ చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హ్యారిస్ రవూఫ్ జోస్ ఇంగ్లిస్(18), మార్నస్ లబుషేన్(6), ఆరోన్ హార్డీ(14), గ్లెన్ మాక్స్వెల్(16), ప్యాట్ కమిన్స్(13) రూపంలో ఐదు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. The man of the moment #AUSvPAK pic.twitter.com/t0UJ3iZJLh— cricket.com.au (@cricketcomau) November 8, 2024 మరోవైపు.. టెయిలెండర్లలో మిచెల్ స్టార్క్(1)ను షాహిన్ అవుట్ చేయగా.. ఆడం జంపా (18) కాసేపు పోరాడగా నసీం షా అతడిని బౌల్డ్ చేసి పని పూర్తి చేశాడు.Vintage Smith 👌#AUSvPAK pic.twitter.com/PWKlbk4NgK— cricket.com.au (@cricketcomau) November 8, 2024 ఈ క్రమంలో 35 ఓవర్లకే ఆస్ట్రేలియా కథ ముగిసింది. కేవలం 163 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక ఆసీస్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేదిస్తుందా? లేదంటే తొలి వన్డే మాదిరి ఈసారీ మ్యాచ్‌ను చేజార్చుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్‌తో రెండో వన్డేలో హ్యారిస్ రవూఫ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. షాహిన్ ఆఫ్రిది మూడు, నసీం షా, మహ్మద్ హస్నైన్ ఒక్కో వికెట్ తీశారు.చరిత్ర సృష్టించిన హ్యారిస్ రవూఫ్.. పాక్ తరఫున తొలి పేసర్గాఆసీస్తో రెండో వన్డేలో ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అడిలైడ్‌లో వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మొట్టమొదటి పాకిస్తాన్ పేసర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాక్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రం, ఇమ్రాన్ ఖాన్ పేరిట ఉన్న రికార్డును రవూఫ్ బద్దలు కొట్టాడు.ఇక అడిలైడ్‌లో అంతకు ముందు స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ వన్డేల్లో ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ పాక్ తరఫున ఈ ఘనత నమోదు చేసిన మొదటి బౌలర్‌గా కొనసాగుతున్నాడు.అడిలైడ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన పాక్ బౌలర్లుహ్యారిస్ రవూఫ్- 5/29*సక్లెయిన్ ముస్తాక్- 5/29ఇజాజ్ ఫాకిహ్- 4/43ఇమ్రాన్ ఖాన్-3/19షాహిన్ ఆఫ్రిది- 2/24.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమించింది. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌కు తొలిసారిగా సారథ్య బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. పాక్‌తో మూడో వన్డేకు కూడా ఇంగ్లిస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.కాగా ఆస్ట్రేలియా ప్రస్తుతం స్వదేశంలో పాకిస్తాన్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా నవంబరు 4- నవంబరు 18 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్గాఇక శుక్రవారం(నవంబరు 8) అడిలైడ్ వేదికగా ఆసీస్- పాక్ మధ్య రెండో వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం కీలక ప్రకటన చేసింది. పాక్‌తో ఆఖరి వన్డేతో పాటు.. టీ20 సిరీస్‌కు జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.ప్యాట్ కమిన్స్ అందుకే దూరంకాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే.. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఇరుజట్లకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో పాక్‌తో రెండో వన్డే ముగిసిన తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ తదితరులు జట్టుకు దూరం కానున్నారు.వీరంతా భారత్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధం కానున్నారు. ఇక వీరి గైర్హాజరీ నేపథ్యంలో పేసర్లు స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్, వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ వన్డే జట్టుతో చేరనున్నారు. ఇదిలా ఉంటే.. జోష్ ఇంగ్లిస్‌కు గతంలో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది.వన్డేల్లో 30వ సారథిగాఅయితే, సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కావడం మాత్రమ ఇదే మొదటిసారి. ఇక తాజా నియామకంతో ఆస్ట్రేలియా జట్టుకు వన్డేల్లో 30వ, టీ20లకు పద్నాలుగో కెప్టెన్‌గా ఇంగ్లిస్ చరిత్రకెక్కనున్నాడు. ఇంగ్లిస్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలడనే నమ్మకం తమకు ఉందని ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ పేర్కొన్నాడు. అదే విధంగా.. జట్టులోని సీనియర్లు ఆడం జంపా, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్ నుంచి ఇంగ్లిస్‌కు పూర్తి సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఆసీస్ టీ20 రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ పాక్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.పాకిస్తాన్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్ - మొదటి రెండు మ్యాచ్‌లకు), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్ - మూడవ మ్యాచ్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్ (మూడవ మ్యాచ్ మాత్రమే), కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్ (రెండవ మ్యాచ్ మాత్రమే), స్పెన్సర్ జాన్సన్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మార్నస్ లబుషేన్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే), గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జోష్ ఫిలిప్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే మాత్రమే), మిచెల్ స్టార్క్ (తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే), మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా.పాకిస్తాన్‌తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టుసీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా. -
అదృష్టం వల్లే ఆస్ట్రేలియా గెలిచింది: పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా పర్యటనను పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓటమితో ఆరంభించింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో రెండు వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. పాక్ పేసర్లు అద్భుతంగా పోరాడినప్పటకి విజయం మాత్రం వరించలేదు.తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కేవలం 202 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా, కమ్మిన్స్, జంపా తలా రెండు వికెట్లు సాధించి పాక్‌ను దెబ్బతీశారు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో ఆసీస్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్(44), ఇంగ్లీష్(49) నిలకడగా ఆడటంతో ఆసీస్ సునాయసంగా లక్ష్యాన్ని చేధిస్తుందని అంతా భావించారు.కానీ పాక్ హ్యారీస్ రవూఫ్ మాత్రం మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను కష్టాల్లోకి నెట్టేశాడు. ఒక్కసారిగా పాక్ జట్టు మ్యాచ్‌ను తమవైపు మలుపు తిప్పుకుంది. అయితే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(32 నాటౌట్) ఆఖరివరకు క్రీజులో నిలుచోని తమ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఇక ఈ ఓటమిపై పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందిచాడు. తమ జట్టు పేస్ బౌలర్లపై రిజ్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ ఓటమి మాకు ఎటువంటి నిరాశ కలిగించలేదు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఆఖరి వరకు పోరాడాలని ముందే నిర్ణయించుకున్నాం. ఈ మ్యాచ్‌లో అదే చేశాము. చివర వరకు పోరాడి ఓడిపోయాం. ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. ఈ మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. మేము బ్యాటింగ్‌పై కాస్త దృష్టిపెట్టాలి. హ్యారీస్ రవూఫ్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. మా నలుగురు పేసర్లు కూడా తమ పని తాము చేశారు. తర్వాతి మ్యాచ్‌లో కూడా నలుగురు పేసర్లతోనే ఆడనున్నాం. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు కాస్త ఆదృష్టం కలిసొచ్చింది అని పోస్ట్ మ్యాచ్ప్రేజేంటేషన్లో రిజ్వాన్ పేర్కొన్నాడు. -
Aus vs Pak: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. మెల్బోర్న్ వేదికగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచింది. పాకిస్తాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా.. ఆసీస్ గెలుపు కోసం కష్టపడాల్సి వచ్చింది.చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియాపాక్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని(204) ఛేదించే క్రమంలో 167 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఓవర్ ఓవర్‌కు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకు అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ గెలుపుతో ఆసీస్ చరిత్ర సృష్టించింది.వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్‌తో ఆడిన తక్కువ మ్యాచ్‌లలోనే.. ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు పాక్‌తో 109 మ్యాచ్‌లు ఆడిన కంగారూ జట్టు 71 మ్యాచ్‌లలో జయభేరి మోగించింది. ఇక ఈ జాబితాలో వెస్టిండీస్ రెండోస్థానంలో ఉంది. ఆసీస్‌తో సమానంగా 71సార్లు పాక్‌పై గెలుపొందినప్పటికీ.. మ్యాచ్‌ల పరంగా ఆసీస్ కంటే వెనుకబడింది.రిజ్వాన్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమికాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా సోమవారం(నవంబరు 4) ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. పాక్ వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు ఇదే తొలి మ్యాచ్.ఇక మెల్బోర్న్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ చేసింది. మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో రాణించగా.. కమిన్స్ రెండు, ఆడం జంపా రెండు, లబుషేన్, సీన్ అబాట్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో పాక్ 46.4 ఓవర్లలో కేవలం 203 పరుగులే చేసింది.నసీం షా బ్యాట్ ఝులిపించినాపాక్ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టెయిలెండర్ నసీం షా 40 రన్స్‌తో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ ఆతిథ్య ఆసీస్ కమిన్స్ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడంతో 33.3 ఓవర్లలో పనిపూర్తి చేసింది. పాక్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్లు షఫీక్(12), సయీమ్ ఆయుబ్(1) సహా 19 బంతుల్లోనే 24 రన్స్ చేసిన షాహిన్ ఆఫ్రిదిని అవుట్ చేసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను అతడు దెబ్బకొట్టాడు. పాకిస్తాన్‌పై వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లుఆస్ట్రేలియా- 71 (109 మ్యాచ్‌లు)వెస్టిండీస్- 71 (137 మ్యాచ్‌లు)శ్రీలంక- 59 (157 మ్యాచ్‌లు)ఇంగ్లండ్- 57 (92 మ్యాచ్‌లు)ఇండియా- 57 (135 మ్యాచ్‌లు)ఆసీస్ వర్సెస్ పాక్ తొలి వన్డే - ప్లేయింగ్ ఎలెవన్ఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.పాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, ఆఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.చదవండి: ICC: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలకు భారత్ ఆతిథ్యం -
ఉత్కంఠ పోరులో పాక్‌పై ఆస్ట్రేలియా గెలుపు
మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (నవంబర్ 4) జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ సమరంలో పాక్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (31 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు) ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. కమిన్స్‌కు మిచెల్ స్టార్క్ (2 నాటౌట్) సహకరించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 46.4 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. నసీం షా (39 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (71 బంతుల్లో 44; 2 ఫోర్లు, సిక్స్), బాబర్ ఆజమ్ (44 బంతుల్లో 37; 4 ఫోర్లు), షాహీన్ అఫ్రిది (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), ఇర్ఫాన్ ఖాన్ (35 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. అబ్దుల్లా షఫీక్ (12), సైమ్ అయూబ్ (1), కమ్రాన్ గులామ్ (5), అఘా సల్మాన్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసి 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో మూడు మెయిడిన్లు ఉన్నాయి. కమిన్స్, జంపా, అబాట్, లబూషేన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. ఓ దశలో సునాయాసంగా గెలుపొందేలా కనిపించింది. అయితే పాక్ బౌలర్లు మధ్యలో పుంజుకోవడంతో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయి, ఓటమి దిశగా పయనించింది. ఈ సమయంలో కమిన్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. కమిన్స్‌తో పాటు స్టీవ్ స్మిత్ (44), జోష్ ఇంగ్లిస్ (49) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆసీస్ 33.3 ఓవర్లలో ఎనిమిది కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ 1, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 16, లబూషేన్ 16, ఆరోన్ హార్డీ 10, మ్యాక్స్‌వెల్ 0, సీన్ అబాట్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, షాహీన్ అఫ్రిది 2, నసీం షా, మొహమ్మద్ హస్నైన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. వన్డే సిరీస్‌లోని రెండో మ్యాచ్ నవంబర్ 8న అడిలైడ్ వేదికగా జరుగనుంది. -
IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు?
గత మూడేళ్లుగా పేలవ ఆట తీరుతో వెనుకబడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తన అద్భుత కెప్టెన్సీతో ఈసారి టైటిల్ రేసులో నిలిపాడు ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్‌కప్ అందించిన సారథిగా నీరాజనాలు అందుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఫ్రాంఛైజీ తనకు చెల్లించిన రూ. 20.50 కోట్లకు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.సహచర ఆటగాళ్లతో మమేమకమవుతూ సరైన సమయంలో అవకాశాలు ఇచ్చి జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. తద్వారా ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్‌గా మారిపోయాడు. కానీ.. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈసారి కమిన్స్ అసలు ఐపీఎల్ ఆడతాడా? కెప్టెన్‌గా కొనసాగుతాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, రిటెన్షన్ లిస్టు విడుదల సందర్భంగా సన్‌రైజర్స్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది.మన లీడర్.. మన కెప్టెన్వచ్చే ఏడాది కూడా ప్యాటీనే రైజర్స్‌ను ముందుకు నడిపించబోతున్నాడని..ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ‘‘మన లీడర్.. మన కెప్టెన్... ప్యాటీ కమిన్స్ మిమ్మల్ని ఉప్పల్‌లో మరోసారి కలిసేందుకు సిద్ధంగా ఉన్నాడు’’ అంటూ ఆరెంజ్ ఆర్మీకి శుభవార్త అందించింది. ఇక ఈ ఏడాది పరుగుల విధ్వంసంతో రికార్డులు తిరగరాసిన సన్‌రైజర్స్.. రిటెన్షన్ల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించింది. హార్డ్ హిట్టర్ హెన్రిక్ క్లాసెన్ కోసం ఏకంగా రూ. 23 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్లు వదిలేశాయిఇదిలా ఉంటే.. ఇతర ఫ్రాంఛైజీలలో కోల్‌కతా, ఢిల్లీ, లక్నో, పంజాబ్, బెంగళూరు తమ కెప్టెన్లను వేలంలోకి వదిలివేయగా.. చెన్నై, ముంబై, గుజరాత్, రాజస్తాన్ మాత్రం తమ సారథులను కొనసాగించాయి. దీంతో ఈసారి ఈసారి ఐపీఎల్ వేలం ఆసక్తికరంగా సాగడం ఖాయం.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఈనెల నెలాఖరున జరగనుండగా... రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లు అనూహ్యంగా కోట్లు కొల్లగొట్టగా... మరికొందరు స్టార్ ప్లేయర్లు ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అధిక ధర వీరికేఅందరికంటే అత్యధికంగా దక్షిణాఫ్రికా ‘హార్డ్ హిట్టర్’ హెన్రిచ్ క్లాసెన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 23 కోట్లు కేటాయించగా... విరాట్ కోహ్లీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... నికోలస్ పూరన్‌కు లక్నో సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా... ఇక మీదట కూడా నాయకుడిగా కొనసాగడం ఖాయం కాగా... ముంబై మొత్తంగా ఐదుగురు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అత్యధికంగా రూ. 18 కోట్లు కేటాయించిన ఫ్రాంచైజీ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు చెరో రూ. 16 కోట్ల 35 లక్షలు వెచ్చించింది.ఇక ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకు రూ. 16 కోట్ల 30 లక్షలు కేటాయించింది. హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మకు రూ.8 కోట్లు ఇచ్చి ముంబై తమ వద్దే పెట్టుకుంది. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరంటే?ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక్కో జట్టు రూ.120 కోట్లు ఖర్చు చేసుకునే అవకాశం ఉండగా... అందులో రూ. 75 కోట్లు రిటెన్షన్‌కు కేటాయించారు. తాజా జాబితాను చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు రీటైన్ను సంపూర్ణంగా వాడుకోగా... అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం ఇద్దరు ప్లేయర్లనే అట్టి పెట్టుకుంది. పంజాబ్ మరీ ఇద్దరినేపంజాబ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆ్రస్టేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యూహాల్లో భాగంగా... కేవలం ఇద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లను మాత్రమే రీటైన్ చేసుకున్న పంజాబ్ వద్ద వేలం కోసం అత్యధికంగా రూ. 110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ వేలానికి వదిలేయగా... తొమ్మిదేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగుతున్న రిషబ్ పంత్‌ను ఫ్రాంచైజీ వదిలేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌పై నమ్మకం ఉంచలేదు. రింకూ సింగ్‌కు జాక్‌పాట్.. ధోనీ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సహా మొత్తం ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోగా... రాజస్తాన్ రాయల్స్ కూడా ఆరుగురు ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16 కోట్ల 50 లక్షలు కేటాయించగా... సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌కు కోల్‌కతా రూ.13 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. వెస్టిండీస్ ద్వయం రసెల్, నరైన్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తలా రూ. 12 కోట్లు కేటాయించింది. కోల్‌కతా వదిలేసుకున్న శ్రేయస్ అయ్యర్ కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడటం ఖాయమే కాగా... సారథి కోసం చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పంత్‌పై కన్నేసే అవకాశాలు ఉన్నాయి. బేబీ మలింగకు రూ. 13 కోట్లుజాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐదేళ్లు దాటిపోయిన ధోనీని ఐపీఎల్ నిబంధనల ప్రకారం ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ కోటాలో రీటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ... మాజీ సారథికి రూ.4 కోట్లు కేటాయించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చెరో రూ. 18 కోట్లు వెచ్చించింది. శ్రీలంక పేసర్ పతిరణకు రూ. 13 కోట్లు, పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది. రాజస్తాన్ రైట్రైట్రిటైనింగ్లో మొత్తం ఆరు అవకాశాలను వాడుకున్న రాజస్తాన్ రాయల్స్... సంజూ సామ్సన్, యశస్వి జైస్వాల్‌కు చెరో రూ.18 కోట్లు కేటాయించింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌కు చెరో రూ. 14 కోట్లు వెచ్చించింది.పూరన్ కోసం అంత అవసరమా?కేఎల్ రాహుల్‌ను వేలానికి వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిలకడగా ఆడతాడో లేదో తెలియని వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు కేటాయించింది. గాయాలతో సహవాసం చేసే సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు రూ. 11 కోట్లు కేటాయించిన లక్నో... మొహసిన్ ఖాన్, ఆయుష్ బదోనీలకు చెరో రూ. 4 కోట్లు వెచ్చించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు రూ.18 కోట్లు కేటాయించిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ... కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను రూ. 16 కోట్ల 50 లక్షలకు అట్టిపెట్టుకుంది. వేలానికి రానున్న ప్రధాన ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, షమీ (భారత్). వార్నర్, మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్టొయినిస్ ఆస్ట్రేలియా). బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బట్లర్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్). డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, నోర్జే (దక్షిణాఫ్రికా). కాన్వే, రచిన్ రవీంద్ర, బౌల్ట్ (న్యూజిలాండ్). చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
IPL 2025: ‘కమిన్స్‌ను వదిలేయనున్న సన్‌రైజర్స్! కారణం ఇదే’
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాతను మార్చేశాడు ప్యాట్ కమిన్స్. మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న జట్టును తన కెప్టెన్సీ నైపుణ్యాలతో ఏకంగా ఫైనల్ చేర్చాడు. ఆఖరి మెట్టుపై రైజర్స్ తడబడ్డా.. అక్కడి దాకా జట్టు సాగించిన విధ్వంసకర పరుగుల ప్రయాణం ఐపీఎల్ చరిత్రలోనే ఓ అద్బుతం లాంటిది.నిజానికి ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా వన్డే, టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం సన్‌రైజర్స్ ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేసినపుడు విమర్శలే ఎక్కువగా వచ్చాయి. ఈ ఫాస్ట్ బౌలర్ కోసం భారీ మొత్తం వెచ్చించడం వల్ల ప్రయోజనం ఉండదని చాలా మంది మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు.సంచలన ఆట తీరుతో టైటిల్‌కు చేరువగాఅయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కమిన్స్ సారథ్యంలోని జట్టు సంచలన ఆట తీరుతో టైటిల్‌కు చేరువగా వచ్చింది. ఇక బౌలర్‌గానూ, సారథిగానూ కమిన్స్.. ఫ్రాంఛైజీ తనపై పెట్టిన పెట్టుబడికి పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు. ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్‌గా మారిపోయాడు. వచ్చే ఏడాది కూడా తానే కెప్టెన్‌గా ఉండాలనేంత బలంగా ముద్ర వేశాడు. ఫ్రాంఛైజీ సైతం కమిన్స్‌నే నాయకుడిగా కొనసాగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు. సన్‌రైజర్స్ కమిన్స్‌ను అట్టిపెట్టుకోదని.. వేలానికి ముందు అతడిని టీమ్ నుంచి రిలీజ్ చేస్తుందని జోస్యం చెప్పాడు. తాను ఇలా అనడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు. కంగారూ ఆటగాళ్ల ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి‘‘ప్యాట్ కమిన్స్ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతానో.. లేదోనన్న అంశంపై స్పష్టత లేదని చెప్పాడు. ఆస్ట్రేలియాకు ఉన్న బిజీ షెడ్యూల్ ఇందుకు కారణం. యాషెస్, వరల్డ్‌కప్స్.. ఇలా కంగారూ ఆటగాళ్ల ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి.ఒకవేళ ఆసీస్ షెడ్యూల్‌కు ఐపీఎల్ షెడ్యూల్ అడ్డు రానట్లయితే.. అప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఐపీఎల్లో కొత్త నిబంధనలు వచ్చాయని కూడా కమిన్స్ చెప్పాడు. మరి అతడి నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలియదు.హైదరాబాద్ ఈసారి అతడిని రిటైన్ చేసుకోదువేలంలో తన పేరు నమోదు చేసుకుని.. ఆ తర్వాత తప్పుకొన్న సందర్భాలు లేవని కూడా అతడే చెప్పాడు. గతంలో మిచెల్ స్టార్క్ వంటి ఆసీస్ ఆటగాళ్లు ఇలా చేసిన మాట వాస్తవం. అయితే, కమిన్స్ ఈ విషయంలో క్లారిటీగానే ఉన్నాడు. నా అభిప్రాయం ప్రకారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి అతడిని రిటైన్ చేసుకోదు.ఎందుకంటే.. మొదటి ప్లేయర్‌గా అతడిని తీసుకుంటే 18 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ సీజన్లో కమిన్స్ బౌలర్‌గా.. కెప్టెన్‌గా అద్భుతంగా రాణించినా.. ఫ్రాంఛైజీ మాత్రం అతడిని రిలీజ్ చేస్తుందనే నేను నమ్ముతున్నాను’’ అని ఆకాశ్ చోప్రా విచిత్ర వ్యాఖ్యలు చేశాడు.నిబంధనలు ఇవేకాగా ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ పాలసీని ప్రకటించింది. మొత్తం ఆరుగురి(ఆర్టీఎమ్ కార్డుతో కలిపి)ని తమతో పాటే జట్లు అట్టిపెట్టుకోవచ్చు. ఇందులో ఐదుగురు క్యాప్డ్, కనీసం ఒక్కరు అన్క్యాప్డ్(ఇండియన్ ప్లేయర్స్) ఉండాలి. ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకుంటే మొదటి మూడు రిటెన్షన్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు చెల్లించాలి.మిగతా రెండు రిటెన్షన్లకు రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వేలంలోకి వచ్చి అమ్ముడుపోయి.. సీజన్ ఆరంభానికి ముందు సహేతుక కారణాలు లేకుండా తప్పుకొంటే సదరు ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం విధిస్తారు.చదవండి: T20 WC 2024: పట్టిక తారుమారు.. సెమీస్ బెర్తులు ఖరారు -
కెప్టెన్‌గా అదొక్కటే నేను గెలవలేదు.. ఈసారి: కమిన్స్
ప్యాట్ కమిన్స్.. ఈ ఫాస్ట్‌బౌలర్ 2021లో ఆస్ట్రేలియా క్రికెట్ టెస్టు జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌తో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-23 టైటిల్ గెలిచాడు. ఇక వన్డే ప్రపంచకప్-2023ట్రోఫీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతూ సక్సెస్ఫుల్ సారథిగా తనదైన ముద్ర వేసి ప్రశంసలు అందుకుంటున్నాడు.అయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024 రూపంలో కమిన్స్‌కు కఠిన సవాలు ఎదురుకాబోతోంది. ఆసీస్‌కు ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ఎంత ప్రతిష్టాత్మకమో .. టీమిండియాతో జరిగే ఈ టెస్టు సిరీస్ కూడా అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.కెప్టెన్‌గా అదొక్కటే నేను గెలవలేదుతాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన కమిన్స్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నేను ఇప్పటి వరకు సాధించాలనుకుని.. సాధించలేకపోయింది ఏదైనా ఉందీ అంటే.. అది టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవడమే. కెప్టెన్‌గా నేను ఇప్పటి వరకు భారత్‌ను టెస్టు సిరీస్‌లో ఓడించనేలేదు. అయితే, మా జట్టులోని కొంతమంది ఆటగాళ్లకు మాత్రం ఆ అదృష్టం దక్కింది.సారథిగా మారిన తర్వాత నాలో పెద్దగా మార్పులేమీ రాలేదు. నేను నాలాగే ఉంటూ జట్టును విజయపథంలో ముందుకు నడపడమే లక్ష్యంగా పనిచేస్తున్నా’’ అని తెలిపాడు. నాడు లీడింగ్ వికెట్ టేకర్గాతన కెప్టెన్సీ కెరీర్లో టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవడం ముఖ్యమైనదని కమిన్స్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా కమిన్స్ 2017లో తొలిసారిగా టీమిండియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు. అప్పుడు ఆసీస్ ఓడిపోయింది. అయితే, 2022-21లో భారత్‌తో నాలుగు టెస్టులాడిన ఈ పేసర్.. 21 వికెట్లతో సత్తా చాటాడు.డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రంఇక డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్లో కమిన్స్ బృందం.. టీమిండియాను ఓడించి ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజా సీజన్లోనూ ఈ రెండు జట్లే తుదిపోరుకు అర్హత సాధించే అవకాశం ఉంది. అయితే, రెండింటిలో ఏది ముందు ఫైనల్ చేరుతుందోనన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. రోహిత్ సేన స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఆడనున్న మూడు టెస్టుల్లో గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది.టీమిండియాదే ఆధిపత్యంఅలా అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో ఫలితంతో సంబంధం ఉండదు. ఇదిలా ఉంటే.. భారత్- ఆసీస్ మధ్య నవంబరు నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో గెలిచి.. టైటిల్‌ను నిలబెట్టుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా.. ఆస్ట్రేలియా తమ పరాజయ పరంపరకు బ్రేక్ వేయాలని ఉవ్విళ్లూరుతోంది.ఇక గత నాలుగు సందర్భాల్లోనూ ఆసీస్‌ను ఓడించి భారత్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ సేన అక్టోబరు 16 నుంచి కివీస్‌తో సిరీస్‌తో బిజీ కానుండగా.. కమిన్స్ బృందం నవంబరు 4 నుంచి పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడనుంది.చదవండి: W T20 WC: కథ మళ్లీ మొదటికి... -
ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ వచ్చేశాడు! విధ్వంసకర వీరులు దూరం
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్‌తో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి వన్డేల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. వన్డే ప్రపంచ కప్ 2023 విజయం తర్వాత కమ్మిన్స్ వన్డేల్లో తొలిసారి ఆడనున్నాడు.పాట్ కమిన్స్‌తో పాటు వెటరన్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే ఈ సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా దూరమయ్యాడు. మరోవైపు స్టార్ క్రికెటర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు.గత కొంత కాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్న వీరిద్దరికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. యువ ఆటగాళ్లు జాక్ ఫ్రెసర్ ముక్గర్క్, కూపర్ కొన్నోలీలు పాక్ సిరీస్‌కు ఎంపికయ్యారు. కాగా ఈ సిరీస్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నహాకాల్లో భాగంగా జరగనుంది. నవంబర్ 4న మెల్బోర్న్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండో వన్డే నవంబర్ 8న ఆడిలైడ్‌లో రెండో వన్డే, నవంబర్ 10న పెర్త్‌లో ఆఖరి వన్డే జరగనుంది.ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిష్, జంపా -
మార్క్రమ్కు నో ఛాన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ లిస్ట్ ఇదే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ఖారారు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. మెగా వేలానికి ముందు మొత్తం ఆరుగురు ఆటగాళ్లను అంటిపెట్టుకునే అవకాశాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కల్పించింది.ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. అంతేకాకుండా ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచారు. గతంలో ఈ పర్స్ విలువ రూ.90 కోట్లు ఉండేది. అయిదుగురి కోసం ఓ ఫ్రాంఛైజీ రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు ఫ్రాంఛైజీ చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ఆటగాడిని రిటైన్ చేసుకోవాలనకుంటే తిరిగి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు వెచ్చించాలి. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని మొత్తం 10 ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. ఈ క్రమంలో ఆయా ఫ్రాంచైజీలు ఆయా ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను దాదాపు ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.మార్క్రమ్కు నో ఛాన్స్?ఇక ఐపీఎల్-2024 సీజన్లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తాము అంటిపెట్టుకునే ప్లేయర్ల లిస్ట్‌ను ఖారారు చేసినట్లు సమాచారం. రెండు సీజన్లలో తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రోటీస్ స్టార్ ప్లేయర్ ఐడైన్ మార్క్రమ్ను వేలంలోకి విడిచిపెట్టాలని ఎస్ఆర్హెచ్ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఇక ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(రూ.18 కోట్లు) తొలి ఆటగాటిగా రిటెన్షన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కమ్మిన్స్ ఈ ఏడాది సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కెప్టెన్సీతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలో కూడా ప్యాట్ అదరగొట్టాడు.కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో అతడిని ఏకంగా రూ.20.50 కోట్ల భారీ ధరకు అతడిని ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం ఈ ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ చేశాడు. ఆ తర్వాత స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్(రూ.14 కోట్లు) రెండో ప్లేయర్‌గా, మూడో ఆటగాడిగా అభిషేక్ శర్మ(రూ.11 కోట్లు)లను ఎస్ఆర్హెచ్ అంటిపెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా నాలుగో ఆటగాడిగా విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్(రూ.18 కోట్లు), ఐదో ప్లేయర్‌గా హెన్రిస్ క్లాసెన్(రూ.11 కోట్లు)ను రిటైన్ చేసుకోవాలని ఎస్ఆర్హెచ్ భావిస్తుందంట. ఇక ఆంధ్ర స్టార్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా తీసుకోవాలని కావ్యా మారన్ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
టీమిండియాతో టెస్టులు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
టీమిండియాతో టెస్టులకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరుజట్ల మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2024 ఆరంభ మ్యాచ్‌లకు ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సిరీస్ మొదలయ్యేనాటికి అతడు అందుబాటులోకి వచ్చినా బౌలింగ్ చేసే అవకాశం మాత్రం లేదని ఆస్ట్రేలియా టీమ్ డాక్టర్ పీటర్ బ్రూక్నర్ వ్యాఖ్యల ద్వారా వెల్లడైంది.ఫైనల్‌కు చేరే దారిలోప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌కు చేరుకునే టీమిండియా- ఆస్ట్రేలియా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ప్యాట్ కమిన్స్ బృందం రెండోస్థానంలో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబరులో టెస్టు సిరీస్ మొదలుకానుంది.ఇందులో భాగంగా నవంబరు 22- జనవరి 7 వరకు ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆధిపత్యమే కొనసాగుతున్న వేళ.. సొంతగడ్డపై సత్తా చాటాలని కంగారూ జట్టు పట్టుదలగా ఉంది. అయితే, ఈ కీలక సిరీస్‌కు ముందు కామెరాన్ గ్రీన్ ఫిట్‌నెస్‌లేమి రూపంలో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది.గ్రీన్‌కు వెన్నునొప్పిఇటీవల ఇంగ్లండ్‌తో వన్డేల సందర్భంగా గ్రీన్‌కు వెన్నునొప్పి వచ్చింది. దీంతో సిరీస్ మొత్తానికి అతడు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నా.. టీమిండియాతో సిరీస్‌లో మాత్రం బౌలింగ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయం గురించి ఆసీస్ టీమ్ డాక్టర్ పీటర్ బ్రుక్నర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం గ్రీన్ వెన్నునొప్పి కాస్త తగ్గిందనే చెబుతున్నాడు.బౌలింగ్ చేస్తే మొదటికే మోసంఅయితే, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా గాయం తీవ్రత ఎలా ఉందో అంచనా వేస్తాం. వెన్నుపై ఒత్తిడి ఎక్కువైతే కచ్చితంగా మళ్లీ నొప్పి తిరగబెడుతుంది. ముఖ్యంగా బౌలింగ్ చేస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. అయితే, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయడం వల్ల పెద్దగా ప్రభావం పడకపోవచ్చు’’ అని తెలిపాడు. కాగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ గ్రీన్ సేవల్ని గనుక ఆసీస్ కోల్పోతే.. స్టార్ బౌలర్లు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌తో పాటు మిచెల్ మార్ష్ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! -
Ind vs Ban: అశ్విన్ ఇంకో నాలుగు వికెట్లు తీశాడంటే..
టెస్టు కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటికే భారత్ తరఫున సంప్రదాయ క్రికెట్లో 522 వికెట్లు పూర్తి చేసుకున్న ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా బంగ్లాదేశ్ ఇటీవల జరిగిన తొలి టెస్టులో అశూ అదరగొట్టాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్సొంతమైదానం చెన్నైలోని చెపాక్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి విలువైన శతకం(113) బాదడంతో పాటు.. ఆరు వికెట్లు పడగొట్టాడు. తద్వారా బంగ్లాపై టీమిండియా 280 పరుగుల తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక భారత్- బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు(సెప్టెంబరు 27) కాన్పూర్‌లో మొదలుకానుంది.నాలుగు వికెట్లు తీస్తే..ఈ నేపథ్యంలో అశ్విన్ ఓ అరుదై రికార్డు ముంగిట నిలిచాడు. బంగ్లాతో రెండో టెస్టులో గనుక ఈ దిగ్గజ స్పిన్నర్ నాలుగు వికెట్లు తీస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సాధిస్తాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌ను అధిగమించి మొదటిస్థానానికి చేరుకుంటాడు. ఈ డబ్ట్యూటీసీ తాజా సీజన్లో హాజిల్‌వుడ్ ఇప్పటి వరకు 51 వికెట్లు తీయగా.. అశూ 48 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫైనల్ చేరడమే లక్ష్యంగా వరుస విజయాలతో దూసుకుపోతోంది.డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా)- 51రవిచంద్రన్ అశ్విన్ఇండియా)-48ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 48మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)-48క్రిస్ వోక్స్(ఇంగ్లండ్)-43నాథన్ లియోన్(ఆస్ట్రేలియా)-43.చదవండి: అతడిని కట్టడి చేస్తే టీమిండియాపై గెలుపు మాదే: కమిన్స్ -
అతడిని కట్టడి చేస్తే టీమిండియాపై గెలుపు మాదే: కమిన్స్
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ టెస్టు(బీజీటీ) సిరీస్‌కు సమయం ఆసన్నమవుతోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు రోహిత్ సేన నవంబరులో కంగారూ దేశంలో పర్యటించనుంది. ఈ ఆసక్తికర పోరుకు ఇంకా దాదాపు రెండు నెలల వ్యవధి ఉన్నా.. ఇప్పటి నుంచే గెలుపోటములపై విశ్లేషకులు, అభిమానుల మధ్య చర్చ మొదలైంది.సీనియర్లు లేకుండానేమరోవైపు.. ఆసీస్ స్టార్లు సైతం టీమిండియాతో సిరీస్‌కు తామెంతగానో నిరీక్షిస్తున్నామని.. యాషెస్ మాదిరి మజా అందించే మరో పోరు ఇదేనంటూ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. కాగా గత నాలుగు పర్యాయాలుగా బీజీటీ సిరీస్ భారత్‌దేనన్న విషయం తెలిసిందే.అయితే, ఆఖరిగా కంగారూ గడ్డపై సిరీస్ గెలిచినపుడు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే వంటి వెటరన్ ప్లేయర్లు జట్టుతో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నం. అయితే, రిషభ్ పంత్ గతంలో మాదిరి బ్యాట్ ఝులిపిస్తే మాత్రం ఆసీస్‌కు తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో కమిన్స్ మాట్లాడుతూ.. టీమిండియాను నిలువరించాలంటే పంత్‌ను కట్టడి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.అతడిని కట్టడి చేస్తే టీమిండియాపై గెలుపు మాదే‘‘నాకు తెలిసి భారత ఆటగాళ్లు ఇక్కడా దూకుడుగానే ఆడతారు. ముఖ్యంగా రిషభ్ ఎక్కువగా అద్భుతమైన రివర్స్ స్లాప్ షాట్లు ఆడతాడు. అదే అతడి బలం కూడా! ఈ సిరీస్‌లో అతడు కచ్చితంగా ప్రభావం చూపుతాడు. కాబట్టి పంత్‌ను కట్టడి చేస్తే మా పని సగం పూర్తవుతుంది’’ అని కమిన్స్ పంత్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు.నాడు పంత్ వీరోచిత ఇన్నింగ్స్2020-21 పర్యటన సందర్భంగా సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్ 97 పరుగులతో దుమ్ములేపి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచాడు. ఇక ఆఖరిదైన గాబా టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి.. టీమిండియా 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ఆసీస్ గడ్డపై భారత్ సిరీస్ విజయం సాధించేలా చేశాడు. రీఎంట్రీలో శతక్కొట్టిఇక ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడిన పంత్ 624 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఘోర రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న తర్వాత.. దాదాపు రెండేళ్లకు పంత్ టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని తొలి టెస్టులో శతకం(109)తో కదం తొక్కాడు. పునరాగమనంలో మొత్తంగా 148 పరుగులు సాధించాడు.చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
రెండోసారి తండ్రి కాబోతున్న సన్‌రైజర్స్ కెప్టెన్!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను రెండోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘మా బేబీకి సంబంధించిన శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది!మా జీవితాలను మరింత క్రేజీగా మార్చేందుకు వస్తున్న చిన్నారి కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అని బెకీతో పాటు కమిన్స్ ఇన్‌స్టాలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా భార్య బెకీ, కుమారుడు ఆల్బీ ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో బెకీ బేబీ బంప్‌తో కనిపించగా.. ఆల్బీ తల్లిని ముద్దాడుతున్నాడు.కుమారుడి సమక్షంలో వివాహంకాగా ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ 2020లో బెకీ బోస్టన్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ జంట 2022లో వివాహ బంధంతో ఒక్కటైంది. పెళ్లికి ముందే వీరికి అల్బీ(2021) జన్మించాడు. తాజాగా మరోసారి కమిన్స్- బెకీ తల్లిదండ్రులు కాబోతున్నారు. కాగా కమిన్స్ ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.మూడేళ్లుగా నిరాశాజనక ప్రదర్శనతో డీలా పడ్డ రైజర్స్‌ను ఏకంగా ఫైనల్‌కు చేర్చి ఆరెంజ్ ఆర్మీ హృదయాలు గెలుచుకున్నాడు కమిన్స్. ఐపీఎల్ సమయంలో కమిన్స్‌తో పాటు బెకీ, ఆల్బీ.. ఇతర కుటుంబ సభ్యులు సైతం హైదరాబాద్‌కు విచ్చేశారు.ఎనిమిది వారాల విరామంటీ20 ప్రపంచకప్-2024లో ఆసీస్ సెమీస్‌లోనే నిష్క్రమించగా.. కమిన్స్ అప్పటి నుంచి ఎనిమిది వారాల పాటు విరామం తీసుకున్నాడు. టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ముందు ఈ బ్రేక్ తీసుకున్న కమిన్స్.. ఏ ఆటగాడికైనా విరామం కచ్చితంగా అవసరమని పేర్కొన్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ సైకిల్లో భాగంగా వరుస టెస్టులు ఆడాల్సిన నేపథ్యంలో తాను ఈ మేరకు విశ్రాంతి తీసుకున్నట్లు వెల్లడించాడు. View this post on Instagram A post shared by Rebecca Jane Cummins (@becky_cummins) -
భారత్‌తో సిరీస్.. ఆ ఇద్దరు కీలకం: కమిన్స్
మెల్బోర్న్: ఈ ఏడాది చివర్లో భారత్‌తో స్వదేశంలో జరగనున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో పేస్ ఆల్‌రౌండర్లు కామెరూన్ గ్రీన్, మిషెల్ మార్ష్ కీలకమవుతారని ఆ్రస్టేలియా టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. వీరిద్దరూ అందుబాటులో ఉంటే ప్రధాన పేసర్లపై భారం తగ్గడంతో పాటు... బ్యాటింగ్ లైనప్ బలం పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ‘పేస్ ఆల్‌రౌండర్లు ఉండటం వల్ల అదనపు ప్రయోజనమే. వేసవిలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో గ్రీన్, మార్ష్ కీలకం అవుతారు. గతంలో వారిని పెద్దగా వినియోగించుకోలేదు. కానీ ఈసారి పరిస్థితి భిన్నం. ఎక్కువ ఓవర్లపాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. గ్రీన్ బౌలర్‌గానే కెరీర్ ప్రారంభించాడు. ఇప్పుడు తగినంత అనుభవం కూడా సాధించాడు. వీరిద్దరి వల్ల జట్టు సమతుల్యం పెరుగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. నాథన్ లయన్ వంటి సీనియర్ స్పిన్నర్ ఉండటం మా అదృష్టం’ అని కమిన్స్ పేర్కొన్నాడు. ఆ్రస్టేలియా గడ్డపై జరిగిన గత రెండు బోర్డర్–గవాస్కర్ ట్రోఫీల్లో పరాజయం పాలైన ఆసీస్... ఈసారి సిరీస్ ఎలాగైనా సిరీస్ చేజిక్కించుకోవాలని ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. -
ఆసీస్ ప్లేయర్ల కన్నంతా ఆ సిరీస్‌పైనే.. ఈసారి ఎలాగైనా టీమిండియాను ఓడించాలని..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. ఈ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు గత ఎనిమిది సంవత్సరాలుగా గోతి కాడి నక్కలా కాచుకు కూర్చున్నారు. ఈ విషయం ఆస్ట్రేలియా ఆటగాళ్ల తాజా వ్యాఖ్యల్లో తేటతెల్లమైంది. బీజీటీ 2024-25 నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు ఇప్పటి నుంచే టీమిండియాపై మాటల యుద్ధాన్ని మొదలుపెట్టారు. బీజీటీ తమకు యాషెస్ కంటే ముఖ్యమని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు గాయాల బారిన పడకుండా ఉండేందుకు కొంతకాలం క్రికెట్‌కు సైతం దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నాడు. కమిన్స్ కెప్టెన్సీ కెరీర్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఒక్కటే లోటు. ఆసీస్ కెప్టెన్‌గా అతను సాధించాల్సివన్నీ సాధించాడు. ప్రస్తుత ఆసీస్ జట్టులోనూ చాలామంది ఆటగాళ్లకు బీజీటీ అందని ద్రాక్షాగానే ఉంది. దీంతో ఈసారి ఎలాగైన దాన్ని దక్కించుకుని తీరాలని ఆసీస్ ఆటగాళ్లంతా కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఇందులో భాగంగా కమిన్స్‌తో పాటు హాజిల్‌వుడ్, నాథన్ లయోన్ భారత ఆటగాళ్లతో మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. ఈసారి ఎలాగైనా భారత్‌ను ఓడించి తీరతామని వారు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈసారి బీజీటీ తమ దేశంలోనే జరుగుతుంది కాబట్టి భారత్‌ను సునాయాసంగా మట్టికరిపిస్తామని చెబుకుంటున్నారు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా చివరిసారిగా 2014-15లో కైవసం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా నాలుగు సిరీస్‌ల్లో, ఇంటాబయటా భారతే ఆ ట్రోఫీని చేజిక్కించుకుంది. 2016-17, 2022-23 ఇండియాలో.. 2018-19, 2020-21లో ఆసీస్‌లో టీమిండియా బీజీటీని నెగ్గింది. గతానికి భిన్నంగా ఈసారి బీజీటీ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా సాగనుంది. ఈ సిరీస్ కోసం భారత్ నవంబర్‌లో ఆస్ట్రేలియాకు బయల్దేరనుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ నవంబర్ 22న, రెండో టెస్ట్ డిసెంబర్ 6న, మూడో టెస్ట్ డిసెంబర్ 14న, నాలుగో టెస్ట్ డిసెంబర్ 26న, ఐదో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 3న ప్రారంభం కానున్నాయి. -
భారత్‌తో టెస్టు సిరీస్.. ఆసీస్ కెప్టెన్ కీలక నిర్ణయం!
ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాది ఓసారి జరిగే ఈ సిరిస్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు.యాషెస్ సిరీస్ తర్వాత ఆత్యధిక ఫాలోయింగ్ ఉండే సిరీస్ ఇదే. ఈసారి ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనుండటం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరగా 1991-92లో ఆసీస్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరిగింది. గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంత గడ్డపై ఓడించిన భారత్.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు ఈసారి భారత్‌పై ఎలాగైనా టెస్టు సిరీస్ విజయం సాధించి తమ 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆసీస్ భావిస్తోంది.కమ్మిన్స్ కీలక నిర్ణయం..ఈ క్రమంలో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. స్వదేశంలో టీమిండియాతో టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని కమ్మిన్స్ ఎనిమిది వారాల పాటు బౌలింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు.తొలుత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నద్దమయ్యేందుకు దేశీవాళీ క్రికెట్లో కమ్మిన్స్ ఆడనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతుండడంతో దేశీవాళీ టోర్నీకు దూరంగా ఉండాలని కమ్మిన్స్ భావిస్తున్నాడు."దాదాపుగా 18 నెలల (ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్) నుంచి కంటిన్యూగా బౌలింగ్ చేస్తున్నాను. బాగా ఆలిసిపోయాను. ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏడు నుంచి ఎనిమిది వారాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకున్నాను. తద్వారా నా శరీరానికి పూర్తి విశ్రాంతి లభిస్తుంది. అయితే జిమ్‌లో మాత్రం నా సాధనను నేను కొనసాగిస్తాను. ఇప్పటివరకు నా కెరీర్లో గెలవని ట్రోఫీ ఎదైనా ఉందంటే అది బీజీటీనే. నేనే కాదు జట్టులో చాలా మంది ఆటగాళ్లు కూడా ఈ ట్రోఫీని ముద్దాడలేదని" ఫాక్స్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
ఇంగ్లండ్ టూర్.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా! కెప్టెన్ ఎవరంటే?
ఇంగ్లండ్, స్కాట్లాండ్లతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ప్రకటించింది. ఓవరాల్‌గా యూనైటడ్ కింగడమ్ టూర్‌కు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరమయ్యాడు. అతడికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. కంగారులు యూకే పర్యటనలో భాగంగా తొలుత స్కాట్లాండ్తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 2న ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆసీస్ ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పర్యటన సెప్టెంబర్ 11న ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లతో టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్‌కు ఆసీస్ సెలక్టర్లు రెస్ట్ ఆస. అయితే వీరు ముగ్గురూ వన్డే జట్టులో భాగమయ్యారు.ఈ టూర్లో ఆసీస్ వన్డే, టీ20 జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ మిచిల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. కాగా యువ ఆటగాడు కూపర్ కొన్నోలీకి తొలిసారి ఆసీస్ జట్టులో దక్కింది. అదేవిధంగా యువ సంచలనం ఫ్రెజర్ మెక్‌గర్క్‌కు వన్డే, టీ20 జట్టులో చోటు దక్కింది.స్కాట్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20లకు ఆసీస్ జట్టుమిచిల్ మార్ష్ (కెప్టెన్),. జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ. టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్. కామెరాన్ గ్రీన్. ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.ఇంగ్లండ్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచ్ మార్ష్ (కెప్టెన్). సీన్ అబాట్. అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్. ఆరోన్ హార్డీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్. ట్రావిస్ హెడ్. జోష్ ఇంగ్లిస్. మార్నస్ లాబుస్చాగ్నే. గ్లెన్ మాక్స్వెల్. మాథ్యూ షార్ట్. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. -
ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం.. ఆఫ్ఘన్ల సంబురాలు మామూలుగా లేవుగా..!
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే పెద్దగా జట్టుగా పేరు తెచ్చుకుంటున్న ఆప్ఘనిస్తాన్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024లో సంచలన విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్ లాంటి పటిష్ట జట్టుకు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. సూపర్-8 సమరంలో మాజీ జగజ్జేత ఆస్ట్రేలియాకు జీర్ణించుకోలేని ఓటమిని రుచి చూపించింది. Dwayne Bravo 'Champion' celebrations in Afghanistan team bus. 🇦🇫 pic.twitter.com/PQEmnexV4f— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024సూపర్-8 గ్రూప్-1లో భాగంగా ఇవాళ (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో అండర్ డాగ్ ఆఫ్ఘనిస్తాన్.. పటిష్టమైన ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో ఓడించి పెను సంచనలం సృష్టించింది. ఈ విజయం అనంతరం ఆఫ్ఘన్ ప్లేయర్లు, ఆ జట్టు అభిమానుల సంబురాలు అంతా ఇంతా కాదు. వారి విజయోత్సవాలు మాటల్లో వర్ణించలేని విధంగా ఉన్నాయి. బహుశా వారు స్వాతంత్ర్యం పొందినప్పుడు కూడా ఇంతలా సంబురాలు చేసుకుని ఉండరు. THE DRESSING ROOM CELEBRATION OF AFGHANISTAN. 🥶pic.twitter.com/rzVztmrUTp— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024ఆసీస్‌పై చారిత్రక విజయం అనంతరం ఆఫ్ఘన్ హీరో గుల్బదిన్ నైబ్‌ను సహచర ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకుని డ్రెస్సింగ్ రూమ్‌లోకి మోసుకెళ్లి సంబురాలు చేసుకోగా.. ఆఫ్ఘన్ వీధుల్లో ఆ దేశ పౌరుల సంబురాలు అంబరాన్నంటాయి. ఆ దేశ రాజధాని కాబుల్ వీధుల్లో జనాలు రోడ్లపైకి వచ్చి టపాసులు కాలుస్తూ.. కేరింతలు కొడుతూ సంబురాలు చేసుకున్నారు. ఈ సంబురాలు ఒక్క కాబుల్కే పరిమితం కాలేదు. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఈ విజయాన్ని పండుగలా సెలబ్రేట్ చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలోనే బహుశా ఇంతమంది జనాలు బయటికి వచ్చి సమూహిక సంబురాలు చేసుకుని ఉండరు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నామని ఆఫ్ఘన్లు సంబరపడిపోతున్నారు. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఇది చిరస్మరణీ విజయంగా మిగిలిపోనుంది.Celebrations in Afghanistan. 🇦🇫- A historic victory! pic.twitter.com/wHA1Xl9CgL— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024రాణించిన గుర్బాజ్, జద్రాన్.. వరుసగా రెండో మ్యాచ్‌లో కమిన్స్ హ్యాట్రిక్కింగ్స్టౌన్లోని ఆర్నోస్ వేల్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు.. ఓపెనర్లు గుర్భాజ్ (60), ఇబ్రహీం జద్రాన్ (51) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3, జంపా 2, స్టోయినిస్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. అతనికి ఇది వరుసగా రెండో హ్యాట్రిక్. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ వికెట్లు సాధించలేదు.రెచ్చిపోయిన ఆఫ్ఘన్ బౌలర్లు.. ఆసీస్‌కు ఘోర పరాభవం149 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ఆఫ్ఘన్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 19.2 ఓరవ్లలో 127 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆఫ్ఘన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్ (4-0-24-4) ఆసీస్‌ను దారుణంగా దెబ్బకొట్టగా.. నవీస్ ఉల్ హక్ 3, ఒమర్జాయ్, నబీ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్ (59) ఒంటిరి పోరాటం చేయగా.. మరో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు (మార్ష్ (12), స్టోయినిస్ (11)) చేశారు. ఆసీస్ బ్యాటర్ల ఈ దుస్థితిని క్రికెట్ అభిమానులు ఇప్పటివరకు చూసి ఉండరు. -
చరిత్ర సృష్టించిన కమ్మిన్స్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
ఆస్ట్రేలియా స్టార్ పేసర్, టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా కింగ్స్టౌన్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన కమ్మిన్స్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.తొలుత 18వ ఓవర్ వేసిన కమ్మిన్స్ ఆఖరి బంతికి అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ 20 ఓవర్ వేసిన కమ్మిన్స్.. వరుస బంతుల్లోకరీం జనత్, గుల్బాదిన్ నైబ్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.అంతకముందు ఇదే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కమ్మిన్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. దీంతో వరల్డ్‌కప్ చరిత్రలోనే రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ నిలిచాడు. అదేవిధంగా మరో కొన్ని రికార్డులను కూడా కమ్మిన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.కమ్మిన్స్ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు.అంతర్జాతీయ టీ20ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాతో లసిత్ మలింగ (శ్రీలంక), టిమ్ సౌతీ (న్యూజిలాండ్), మార్క్ పావ్లోవిక్ (సెర్బియా), వసీం అబ్బాస్ (మాల్టా), పాట్ కమ్మిన్స్ (ఆసీస్) ఉన్నారు. -
కమిన్స్ హ్యాట్రిక్, వార్నర్ మెరుపు హాఫ్ సెంచరీ.. ఆసీస్ చేతిలో చిత్తైన బంగ్లాదేశ్
టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (జూన్ 21) ఉదయం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వరుణుడు ఆడ్డు తగలడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆసీస్‌ను విజేతగా ప్రకటించారు. వర్షం మొదలయ్యే సమయానికి ఆసీస్ స్కోర్ 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులుగా ఉండింది.కమిన్స్ హ్యాట్రిక్ఈ మ్యాచ్‌లో కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇది తొలి హ్యాట్రిక్ కాగా.. టీ20 ప్రసంచకప్ టోర్నీల్లో ఆసీస్‌కు ఇది రెండో హ్యాట్రిక్. ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ 2007 ప్రపంచకప్ ఎడిషన్‌లో నమోదైంది. ఆ ఎడిషన్‌లో బ్రెట్ లీ బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ సాధించాడు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్ (4-0-29-3), ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.వార్నర్ మెరుపు అర్ధ శతకం141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మొదలై మ్యాచ్‌కు అంతరాయం కలిగించి, డక్‌వర్త లూయిస్ పద్దతిన ఫలితాన్ని నిర్దారించేలా చేసింది. వర్షం మొదలయ్యే సమయానికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (6 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్.. ట్రవిస్ హెడ్‌తో (31) కలిసి ఆసీస్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి పవర్ ప్లేలో 59 పరుగులు జోడించారు. -
ఆస్ట్రేలియా బౌలర్ హ్యాట్రిక్ తీశాడు.. టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుంది..!
టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో టీమిండియాకు హ్యాట్రిక్ సెంటిమెంట్ కలిసొస్తుందని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8 మ్యాచ్‌ల్లో భాగంగా బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఆసీస్ తరఫున హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు. పొట్టి ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్‌లో (2007) బ్రెట్ లీ ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించాడు. ఆ ఎడిషన్‌లో భారత్ టైటిల్ సాధించింది. ఇప్పుడు రెండో సారి ఆసీస్ బౌలర్ హ్యాట్రిక్ సాధించడంతో సెంటిమెంట్ రిపీట్ అవుతుందని టీమిండియా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. టీమిండియా ఫ్యాన్స్ ఆశలకు మరింత బలం చేకూర్చే విషయం ఏంటంటే.. నాడు బ్రెట్ లీ, ఇప్పుడు పాట్ కమిన్స్ బంగ్లాదేశ్పైనే హ్యాట్రిక్ వికెట్లు సాధించారు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాతో మ్యాచ్‌లో కమిన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదు (మహ్మదుల్లా), ఆరు బంతులకు (మెహిది హసన్).. ఆతర్వాత 20వ ఓవర్ తొలి బంతికి (తౌహిద్ హ్రిదోయ్) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు వేసిన కమిన్స్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్, ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. -
టీ20 వరల్డ్‌కప్ 2024లో తొలి హ్యాట్రిక్ నమోదు
టీ20 వరల్డ్‌కప్ 2024లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ ఈ ఘనత సాధించాడు. సూపర్-8 మ్యాచ్‌ల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కమిన్స్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో ఆస్ట్రేలియన్ బౌలర్‌గా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు. 2007 ఎడిషన్‌లో బ్రెట్ లీ ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించాడు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కమిన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదు (మహ్మదుల్లా), ఆరు బంతులకు (మెహిది హసన్).. ఆతర్వాత 20వ ఓవర్ తొలి బంతికి (తౌహిద్ హ్రిదోయ్) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన కమిన్స్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కమిన్స్‌తో పాటు ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. -
Pat Cummins: ఆమెపై కోపం వచ్చింది.. కానీ!
ఇండియాలో ఉన్నన్ని రోజులు తమ కుటుంబం ఎంతో సంతోషంగా గడిపిందని ఆస్ట్రేలియా సారథి, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఐపీఎల్-2024 నేపథ్యంలో తొలిసారిగా తమ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చిందని.. ఎన్నో అందమైన జ్ఞాపకాలను పోగు చేసుకుందని పేర్కొన్నాడు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023 విజేత అయిన ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం ఏకంగా రూ. 20.50 కోట్లు పెట్టి కొనుక్కున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని కెప్టెన్‌గా నియమించగా.. అనూహ్య రీతిలో జట్టు పుంజుకుంది.గత మూడేళ్ల వైఫల్యాలకు చరమగీతం పాడుతూ ఏకంగా ఫైనల్ చేరుకుంది. అయితే, తుదిపోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. అయినా.. గతం కంటే మెరుగైన ప్రదర్శన కారణంగా అభిమానుల మనసు గెలుచుకుంది కమిన్స్ బృందం.ఇక ఇండియాలో ఉన్నపుడు ఆట నుంచి విరామం దొరికిన సమయంలో ప్యాట్ కమిన్స్ కుటుంబంతో కలిసి వివిధ రకాల హోటళ్లను సందర్శించి భోజనం రుచిచూశాడు. అదే విధంగా బాలీవుడ్ పాటకు స్టెప్పులేస్తూ ఫ్యామిలీ అంతా సరాదాగా గడిపారు.తాజాగా ఈ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ప్యాట్ కమిన్స్.. ఆసకిక్తకర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ సాంగ్‌కు డాన్స్ చేయడం ఎలా అనిపించింది అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నా సోదరి పట్టుబట్టడం వల్లే నేను డాన్స్ చేయాల్సి వచ్చింది.తనే నన్ను బాలీవుడ్ డాన్సింగ్ క్లాసుకు తీసుకువెళ్లింది. ఆ తర్వాత తనే మా డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో నాకు చాలా కోపం వచ్చింది.అయితే, ఇప్పుడు అదెంతో గొప్పగా అనిపిస్తోంది. ఐపీఎల్ కోసం అక్కడ ఉన్నన్ని రోజులు ఎంతో ఎంజాయ్ చేశాం. ఎక్కడికి వెళ్లాలి? ఎలాంటి ఫుడ్ తినాలి? అన్న విషయాల గురించి నా సహచర ఆటగాళ్లు మంచి సలహాలు ఇచ్చారు.తొలిసారి నా ఫ్యామిలీ ఇండియా సందర్శించి.. అందమైన జ్ఞాపకాలు పోగు చేసుకుంది’’ అని ప్యాట్ కమిన్స్ ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు. కాగా కమిన్స్ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024తో బిజీగా ఉన్నాడు. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో జూన్ 5 ఆసీస్ ఒమన్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. Pat Cummins dancing on a Bollywood song wasn't on my Bingo Card 😂😂👏👏👏 pic.twitter.com/OZgP6qtJ8G— aman (@bilateral_bully) May 8, 2024 -
మేజర్ లీగ్ క్రికెట్లో ఆడనున్న సన్‌రైజర్స్ కెప్టెన్..
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగం కానున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2024 సీజన్లో ఆడేందుకు శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ ఫ్రాంచైజీతో కమ్మిన్స్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను రన్నరప్‌గా నిలిపిన కమ్మిన్స్‌కు.. ఈ ఏడాది ఎంఎల్సీ(MLC) సీజన్లో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉంది. గత సీజన్లో శాన్ ఫ్రాన్సిస్కోకు సారథ్యం వహించిన ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ అనంతరం.. ఆ జట్టు కెప్టెన్సీ పదవి ఇంకా ఖాళీగానే ఉంది. ఈ క్రమంలోనే కమ్మిన్స్‌తో శాన్ ఫ్రాన్సిస్కో ఫ్రాంచైజీ కమ్మిన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కమ్మిన్స్‌కు కెప్టెన్‌గా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. తన సారథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియాకు కమ్మిన్స్ వరుసగా డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్‌కప్ టైటిల్స్‌ను అందించాడు. ఈ క్రమంలోనే లీగ్ క్రికెట్లో పలు ఫ్రాంచైజీలు అతడికి పగ్గాలు అప్పగించేందుకు క్యూ కడుతున్నాయి.ఇక ఈ ఏడాది మేజర్ లీగ్ క్రికెట్లో ఇప్పటికే చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదర్చుకున్నారు. ట్రావిస్ హెడ్, మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, తన్వీర్ సంగా, మోసస్ హెన్రిక్స్ , బెన్ డ్వార్షుయిస్, జోష్ ఫిలిప్ లాంటి ఆసీస్ ఆటగాళ్లు వాషింగ్టన్ ఫ్రీడం ఫ్రాంచైజీతో తరపున ఆడనున్నారు. అదే విధంగా ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్‌కు.. టిమ్ డేవిడ్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. జూలై 2 నుంచి ఎంఎల్సీ సెకెండ్ సీజన్ ప్రారంభం కానుంది.చదవండి: టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసేందుకు నేను రెడీ: గంభీర్ -
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
ఐపీఎల్ వేలం మొదలు... స్టేడియంలో తన జట్టును ఉత్సాహపరచడం.. గెలిచినపుడు చిన్న పిల్లలా సంబరాలు చేసుకోవడం.. ఓడినపుడు అంతే బాధగా మనసు చిన్నబుచ్చుకోవడం..అంతలోనే ఆటలో ఇవన్నీ సహజమే కదా అన్నట్లుగా ప్రత్యర్థిని అభినందిస్తూ చప్పట్లు కొట్టడం.. ఇలా ప్రతీ విషయంలోనూ ఆమె ఓ ప్రత్యేక ఆకర్షణ. క్యాష్ రిచ్ లీగ్‌ను ఫాలో అయ్యే వాళ్లలో చాలా మందికి ఆమె కంటే క్రష్.ఆమె మ్యాచ్ వీక్షించడానికి వచ్చిందంటే చాలు.. ఆద్యంతం తను పలికించే హావభావాలు.. స్టాండ్స్‌లో చుట్టుపక్కల వారితో తను మెదిలే విధానం.. ఆనాటి హైలైట్స్‌లో ముఖ్యమైనవిగా నిలుస్తాయనడం అతిశయోక్తి కాదు.తను నవ్వితే అభిమానులూ నవ్వుతారు. తను భావోద్వేగంతో కంటతడి పెడితే తామూ కన్నీటి పర్యంతమవుతారు. ఐపీఎల్-2024 ఫైనల్ సందర్భంగా ఇలాంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఆమె పేరేంటో అర్థమైపోయిందనుకుంటా.. యెస్.. కావ్యా మారన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఓనర్.వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలుదేశంలోనే అతి పెద్ద మీడియా గ్రూపులో ఒకటైన సన్ టీవీ గ్రూప్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్- కావేరీ మారన్ దంపతుల ఏకైక కుమార్తె. వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు.తమిళనాడులోని చెన్నైలో ఆగష్టు 6, 1992లో జన్మించారు కావ్య. అక్కడే స్టెల్లా మేరీ కాలేజీలో బీకామ్ చదివిన ఆమె.. 2016లో ఇంగ్లండ్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు.తల్లిదండ్రులు ఇద్దరూ వ్యాపారవేత్తలే కావడంతో కావ్య కూడా అదే బాటలో పయనిస్తున్నారు. 2018లో సన్‌రైజర్స్ సీఈఓగా ఎంట్రీ ఇచ్చిన కావ్య.. అంతకంటే ముందే సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్ఎం రేడియోలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.తీవ్ర స్థాయిలో విమర్శలుఇక ఐపీఎల్లో వేలం మొదలు కెప్టెన్ నియామకం వరకు అన్ని విషయాల్లోనూ భాగమయ్యే కావ్యా మారన్.. ఈ ఏడాది అనుకున్న ఫలితాలు రాబట్టడంలో సఫలమయ్యారు. కానీ.. సీజన్ ఆరంభంలో మాత్రం తీవ్ర విమర్శల పాలయ్యారు కావ్య.ఆస్ట్రేలియా కెప్టెన్, వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ప్యాట్ కమిన్స్ కోసం ఏకంగా.. రూ. 20.50 కోట్లు ఖర్చు చేయడం.. అతడిని కెప్టెన్‌గా నియమించడం, బ్రియన్ లారా స్థానంలో డానియల్ వెటోరీని కోచ్‌గా తీసుకురావడం వంటి నిర్ణయాలను మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు.ఇప్పటికే ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, గ్లెన్ ఫిలిప్స్ వంటి వాళ్లు జట్టులో ఉండటంతో తుదిజట్టు కూర్పు ఎలా ఉంటుందో అంటూ ఎద్దేవా చేశారు. పేపర్ మీద చూడటానికి జట్టు బాగానే కనిపిస్తున్నా.. మైదానంలో తేలిపోవడం ఖాయమంటూ విమర్శించారు.సంచలన ప్రదర్శనఅయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సన్‌రైజర్స్ ఈసారి అద్భుతాలు చేసింది. గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన హైదరాబాద్ ఈసారి సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరింది.విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా నిలిచి లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులు సృష్టించింది. అయితే, తుదిమెట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.చెన్నై వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం.. కేకేఆర్ ఏకపక్షంగా గెలవడంతో కావ్యా మారన్ కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లు కారుస్తూనే కేకేఆర్‌ను అభినందించారు కూడా!ఈ నేపథ్యంలో కావ్య మంచి మనసును కొనియాడుతూ ఆమె అభిమానులు సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో సన్ నెట్వర్క్ మాజీ ఉద్యోగిగా చెప్పుకొన్న ఓ నెటిజన్ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మాత్రమే!‘‘తన తలిదండ్రుల కంటే కూడా కావ్య ఎంతో గొప్ప వ్యక్తి. మంచి మనసున్న అమ్మాయి. కానీ ఎందుకో తనకు ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండరు. సన్ మ్యూజిక్, ఎస్ఆర్హెచ్ మినహా ఇతర కంపెనీ బాధ్యతలేవీ తల్లిదండ్రులు ఆమెకు అప్పగించరు.ఇది కూడా ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మాత్రమే!ఐపీఎల్ వేలం సమయంలో కావ్య గురించి చాలా మంది జోకులు వేశారు. కానీ క్రికెట్ పట్ల తనకున్న ప్యాషన్ వేరు. వేలం నుంచి ఫైనల్ దాకా ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేయగలిగింది. తను కోరుకున్న ఫలితాలు రాబట్టింది.కావ్య మిలియనీర్ అయినప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్(సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్‌ను బహిరంగంగానే తిట్టడం)లా కాదు. ఫైనల్లో తమ జట్టు ఓటమిపాలైనా కన్నీళ్లు దిగమింగుకుంటూ నవ్వడానికి ప్రయత్నించిన గొప్ప హృదయం ఉన్న వ్యక్తి’’ అని సదరు నెటిజన్ పేర్కొన్నారు.ఒంటరితనమా? ఎందుకు?తన పోస్టులో సదరు నెటిజన్ కావ్య ఒంటరితనం నుంచి విముక్తి పొందడం కోసమే ఈ వ్యాపకాలు అంటూ పేర్కొనడం చర్చనీయాంశమైంది. తోబుట్టువులు, స్నేహితులు(ఎక్కువగా) లేరు కాబట్టి ఇలా అన్నారా?లేదంటే 32 ఏళ్ల కావ్య వ్యక్తిగత జీవితంలో ఏమైనా దెబ్బతిన్నారా? అనే చర్చ జరుగుతోంది. కాగా కావ్య ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నారు. గతంలో.. తమిళ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌తో కావ్య పేరును ముడిపెట్టే ప్రయత్నం చేశారు గాసిప్‌రాయుళ్లు.అయితే, అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది. మరికొన్ని సైట్లు మాత్రం కావ్య ఓ బిజినెస్‌మేన్‌తో గతంలో ప్రేమలో ఉన్నారని కథనాలు ఇచ్చాయి. కానీ.. అవి కూడా రూమర్లే! ప్రస్తుతానికి కావ్య తన కెరీర్, తన తండ్రి వ్యాపారాలను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న విషయాల మీద మాత్రమే దృష్టి సారించారని సమాచారం.సౌతాఫ్రికాలో దుమ్ములేపుతూఅందుకు తగ్గట్లుగానే ఆమె అడుగులు సాగుతున్నాయి. కేవలం ఐపీఎల్‌లోనే కాకుండా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ కావ్య కుటుంబానికి ఫ్రాంఛైజీ ఉంది. సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ పేరిట నెలకొల్పిన ఈ జట్టుకు ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్. 2023 నాటి అరంగేట్ర సీజన్లో, ఈ ఏడాది కూడా సన్‌రైజర్స్‌కు అతడు టైటిల్ అందించాడు. సౌతాఫ్రికాలో వరుసగా రెండుసార్లు ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్.. ఐపీఎల్-2024లో ఆఖరి పోరులో ఓడి టైటిల్ చేజార్చుకుంది. -
డబ్ల్యూపీఎల్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్ అచ్చుగుద్దినట్లు ఒకేలా.. ఇలా ఎలా..!
క్రికెట్ గణాంకాలకు సంబంధించిన ఆట కాబట్టి అప్పుడప్పుడు ఒకే రకమైన గణాంకాలను చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మనం చూడబోయే గణాంకాలు మాత్రం క్రికెట్ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తున్నాయి. ఈ గణాంకాల ముందు యాదృచ్చికం అనే మాట చిన్నబోతుంది. అంతలా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి ఈ గణాంకాలు.వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జరిగిన మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్).. తాజాగా నిన్న ముగిసిన ఐపీఎల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చి 17న జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ (ఆసీస్ కెప్టెన్) టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఆర్సీబీ సైతం తడబడినా మరో మూడు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరగలిగింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా భారతీయ ప్లేయరైన (టీ20 ఫార్మాట్లో భారత కెప్టెన్) స్మృతి మంధన నేతృత్వంలో ఆర్సీబీ తొలి సారి టైటిల్ కైవసం చేసుకుంది.ఐపీఎల్ 2024 ఫైనల్లోనూ అలాగే..నిన్న జరిగిన పురుషుల ఐపీఎల్ ఫైనల్లోనూ కొన్ని విషయాల్లో అచ్చుగుద్దినట్లు ఇలానే జరగడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ (ఆసీస్ కెప్టెన్) పాట్ కమిన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మహిళల ఐపీఎల్‌లోనూ ఇలాగే ఆసీస్ కెప్టెన్ (మెగ్ లాన్నింగ్) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ ఫైనల్లో కమిన్స్ ప్రత్యర్ది భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ఆసీస్ కెప్డెన్ (ఢిల్లీ కెప్టెన్) ప్రత్యర్ది భారత ప్లేయరే (మంధన).2024 WPL Final:- Aussie Captain Vs Indian captain.- Aussie captain took batting.- Team 113/10 in 18.3 overs.- Indian captain's team won by 8 wickets.IPL 2024 Final:- Aussie captain Vs Indian captain.- Aussie captain took batting.- Team 113/10 in 18.3 overs.- Indian… pic.twitter.com/jH07ZzmAEO— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024ఐపీఎల్ 2024 ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ (ఆసీస్ కెప్టెన్) 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ టాస్ గెలిచిన ఢిల్లీ (ఆసీస్ కెప్టెన్) 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ ఫైనల్లో భారత ప్లేయర్ అయిన శ్రేయస్.. ఆసీస్ కెప్టెన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడగొట్టగా.. డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ఆసీస్ కెప్టెన్ లాన్నింగ్ నేతృత్వంలోని ఢిల్లీని భారత ప్లేయర్ సారథ్యంలోని ఆర్సీబీ అదే 8 వికెట్ల తేడాతోనే ఓడగొట్టింది. ఇన్ని విషయాల్లో ఈ ఏడాది డబ్ల్యూపీఎల్, ఐపీఎల్‌కు పోలికలు ఉండటంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
SRH: అందుకే ఓడిపోయాం.. మా వాళ్లు మాత్రం సూపర్: కమిన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముచ్చటగా మూడోసారి ఫైనల్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై వేదికగా జరిగిన తుదిపోరులో పేలవ ప్రదర్శనతో పరాజయం పాలైంది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.గతేడాదితో పోలిస్తే ఈ సీజన్ ఆసాంతం అద్భుతంగా ఆడినా అసలు మ్యాచ్‌లో చేతులెత్తేసింది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిన కమిన్స్ బృందం ఫైనల్లో మాత్రం తుస్సుమనిపించింది.అందుకే ఓడిపోయాంఈ నేపథ్యంలో కేకేఆర్ చేతిలో ఘోర పరాజయంపై సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ విచారం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని కితాబులు ఇచ్చాడు. తమ బ్యాటర్లు సీజన్ ఆరంభం నుంచి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నారని.. అయితే, చెన్నై వికెట్‌ను అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నాడు.‘‘వాళ్లు అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. స్టార్కీ(మిచెల్ స్టార్క్) మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడు. ఈ మ్యాచ్‌లో మా ఆట తీరు అస్సలు బాగాలేదు. బౌండరీలు రాబట్టానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాం. గత వారం అహ్మదాబాద్(క్వాలిఫయర్-1)లోనూ వాళ్ల బౌలర్లు అద్భుతంగా ఆడారు. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం వాళ్లకు ఇవ్వాల్సిందే. ఈ వికెట్ స్వభావాన్ని మేము పసిగట్టలేకపోయాం. కనీసం 160 పరుగులు స్కోరు చేసినా కనీస పోటీ ఉండేది’’ అని కమిన్స్ పేర్కొన్నాడు.మా వాళ్లు మాత్రం సూపర్అదే విధంగా.. ‘‘ఏదేమైనా.. ఈ సీజన్లో మాకు అనేక సానుకూలాంశాలు ఉన్నాయి. మా వాళ్లు సూపర్‌గా బ్యాటింగ్ చేశారు. మూడుసార్లు 250 పరుగుల మేర స్కోరు చేశాం.తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ మ్యాచ్‌ను మాకు అనుకూలంగా మార్చివేశారు. హైదరాబాద్‌లో అభిమానులు మాకు పూర్తి మద్దతుగా నిలిచారు.ఈ సీజన్ మొత్తం అద్భుతంగా సాగింది. ఈసారి చాలా మంది కొత్త ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం వచ్చింది. భువీ, నట్టు, జయదేవ్‌లతో పాటు చాలా మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో మమేకమయ్యాను.సాధారణంగా టీమిండియాతో మ్యాచ్ అంటే మొత్తం నీలిరంగుతో స్టేడియం నిండిపోతుంది. అయితే, ఇప్పుడు ఇక్కడ ప్రేక్షకులు మా(నా)కు మద్దతుగా నిలవడం కొత్త అనుభూతినిచ్చింది’’ అని ప్యాట్ కమిన్స్ తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు.ఐపీఎల్-2024 ఫైనల్: కేకేఆర్ వర్సెస్ సన్‌రైజర్స్👉వేదిక: చెపాక్ స్టేడియం.. చెన్నై👉టాస్: సన్‌రైజర్స్.. బ్యాటింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 113 (18.3)👉కేకేఆర్ స్కోరు: 114/2 (10.3)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసి చాంపియన్‌గా కేకేఆర్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మిచెల్ స్టార్క్👉ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: సునిల్ నరైన్.చదవండి: IPL 2024: ఎస్ఆర్హెచ్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య! వీడియో వైరల్ ICYMI! That special run to glory 💫💜Recap the #Final on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka— IndianPremierLeague (@IPL) May 26, 2024 -
IPL 2024 Final: వార్న్, రోహిత్, హార్దిక్ సరసన కమిన్స్ చేరేనా..?
ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ ఇవాళ (మే 26) రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్.. సన్‌రైజర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో పలు ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి. అందులో తొలి సీజన్లోనే టైటిల్ కైవసం చేసుకున్న కెప్టెన్ల విషయం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కేవలం ముగ్గురు మాత్రమే..16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకే కేవలం ముగ్గురు కెప్టెన్లు మాత్రమే తొలి సీజన్లోనే టైటిల్ గెలిచారు. తొట్ట తొలి సీజన్లో (2008) షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్), 2013 సీజన్లో రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్), 2022 సీజన్లో హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్) ఐపీఎల్ టైటిల్ గెలిచారు. ప్రస్తుత సీజన్ ఫైనల్లో తలపడుతున్న పాట్ కమిన్స్ కూడా కెప్టెన్ ఇదే తొలి సీజన్ కావడంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కెప్టెన్‌గా పాట్ ట్రాక్ రికార్డు చూస్తే వార్న్, రోహిత్, హార్దిక్ సరసన చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మరి నేటి ఫైనల్లో కమిన్స్ ఏం చేస్తాడో వేచి చూడాలి. కేవలం బ్యాటింగ్‌ను నమ్ముకున్న సన్‌రైజర్స్.. అన్ని విభాగాల్లో సత్తా చాటుతున్న కేకేఆర్‌ను ఏమేరకు నిలువరిస్తుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అలా చూస్తే కేకేఆర్‌దే టైటిల్..గత ఆరు సీజన్లలో క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే టైటిల్ గెలుస్తుంది. ఈ సెంటిమెంట్‌నే కేకేఆర్ కొనసాగిస్తుందో లేక సన్‌రైజర్స్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందో చూడాలి. ఈ ఏడాది సన్‌రైజర్స్ మరో టైటిల్ గెలుస్తుందా..?మరోవైపు సన్‌రైజర్స్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ ఫ్రాంచైజీ ఈ ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్ గెలిచి అదే జోరును ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తుంది. ఫైనల్లో హాట్ ఫేవరెట్ కేకేఆరే అయినప్పటికీ.. కమిన్స్ కెప్టెన్సీ సామర్థ్యం, బ్యాటర్ల విధ్వంసంపై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎస్ఆర్హెచ్ అభిమానులు అంచనాలు నిజమైతే ఐపీఎల్ టైటిల్ గెలిచిన నాలుగో ఆసీస్ ఆటగాడిగా కమిన్స్ రికార్డు బుక్కుల్లోకెక్కుతాడు. కేకేఆర్‌కు చెపాక్ స్పెషల్..మరోవైపు చెపాక్ మైదానంతో కేకేఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. 12 ఏళ్ల క్రితం కేకేఆర్ ఇక్కడే తమ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. కేకేఆర్ చెపాక్ సెంటిమెంట్ కూడా తమకు వర్కౌట్ అవుతుందని అశిస్తుంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం తమనే వరించడంపై కూడా కేకేఆర్ ధీమాగా ఉంది. ఫైనల్లో మరోసారి ఎస్ఆర్హెచ్ను మట్టికరిపించి ఈ సీజన్లో హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేస్తామని కేకేఆర్ ధీమాగా ఉంది. -
ఐపీఎల్ ఫైనల్‌కు ముందు ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం..
ఐపీఎల్-2024లో తుది పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ పోరులో ఎలాగైనా గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముందు తమ జట్టు ఆటగాళ్లు ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండడానికి శనివారం తమ ప్రాక్టీస్ సెషన్‌ను ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ రద్దు చేసింది. చెన్నైలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ఎస్ఆర్హెచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిందూస్తాన్ టైమ్స్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే ఎస్ఆర్హెచ్ ఫైనల్ పోరులో కేకేఆర్‌తో అమీతుమీ తెల్చుకోనుంది.కాగా శుక్రవారం చెపాక్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించి.. ఫైనల్ పోరకు అర్హత సాధించింది.చదవండి: T20 World Cup: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. బట్లర్ దూరం! కొత్త కెప్టెన్ ఎవరంటే? -
Kavya Maran: శెభాష్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. వీడియో వైరల్
సన్‌రైజర్స్... ఈ ఏడాది టీ20 లీగ్‌లలో ఈ ఫ్రాంఛైజీకి బాగా కలిసి వస్తోంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్.. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లోనూ దుమ్ములేపుతోంది.గత మూడేళ్ల వైఫల్యాలను మరిపించేలా సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో.. విధ్వంసకర బ్యాటింగ్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అనూహ్య రీతిలో ఆరేళ్ల తర్వాత టైటిల్ రేసులో నిలిచింది.క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్‌ను 36 పరుగులతో ఓడించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. కేకేఆర్ రూపంలో ఇంకొక్క గండం దాటేస్తే ట్రోఫీని ముద్దాడే అవకాశం ముంగిట నిలిచింది.ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ సంబరాలు అంబరాన్నంటాయి. కీలక మ్యాచ్‌లో ఆద్యంతం తన హావభావాలతో హైలైట్‌గా నిలిచారామె. ముఖ్యంగా రాజస్తాన్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను అభిషేక్ శర్మ అవుట్ చేయగానే జట్టు గెలిచినంతగా సెలబ్రేట్ చేసుకున్నారు.Abhishek-ing things up at Chepauk, with the ball 🔥💪#TATAIPLPlayoffs #IPLonJioCinema #SRHvRR #TATAIPL #IPLinTelugu pic.twitter.com/XsOdHkMnir— JioCinema (@JioCinema) May 24, 2024 తండ్రిని ఆలింగనం చేసుకునిఇక రాజస్తాన్‌పై తమ విజయం ఖరారు కాగానే ఆమె ఎగిరి గంతేశారు. తన తండ్రి కళానిధి మారన్‌ను ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. వేలంలో తాను అనుసరించిన వ్యూహాలు ఫలితాలు ఇస్తున్న తీరుకు మురిసిపోతూ చిరునవ్వులు చిందించారు. కరతాళ ధ్వనులతో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లను అభినందిస్తూ పట్టరాని సంతోషంతో ఉద్వేగానికి లోనయ్యారు.Celebrations in the @SunRisers camp 🔥👏#TATAIPLPlayoffs #IPLonJioCinema #SRHvRR #TATAIPL pic.twitter.com/GAJpI7nngY— JioCinema (@JioCinema) May 24, 2024 ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ యాజమాన్యం కీలక మార్పులు చేసింది. బ్రియన్ లారా స్థానంలో న్యూజిలాండ్ స్పిన్ దిగ్గజం డానియల్ వెటోరిని ప్రధాన కోచ్‌గా నియమించింది.ఆటతోనే సమాధానంఅదే విధంగా వన్డే ప్రపంచకప్-2023 విజేత, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు పెట్టింది. అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించి పూర్తి నమ్మకం ఉంచింది. Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 అందుకు తగ్గట్లుగానే ఈ ఆసీస్ పేసర్ జట్టును విజయపథంలో నిలిపాడు. వేలం నాటి నుంచే సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ వ్యూహాలను, కావ్య మారన్ నిర్ణయాలను విమర్శించిన వాళ్లకు అద్భుత ప్రదర్శనతో జట్టును ఫైనల్‌కు చేర్చి సమాధానమిచ్చాడు.సౌతాఫ్రికాలో వరుసగా రెండుసార్లుఇదిలా ఉంటే.. 2023లో మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ పేరిట అడుగుపెట్టింది సన్‌గ్రూప్. ఐడెన్ మార్క్రమ్ను కెప్టెన్‌గా నియమించగా.. అరంగేట్రంలోనే జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన ఫైనల్లోనూ సన్‌రైజర్స్‌ను గెలిపించి ట్రోఫీ అందించాడు.చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు: కమిన్స్ -
SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్: కమిన్స్
ఎనిమిది.. ఎనిమిది.. పది.. గత మూడేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్థానాలు. చెత్త ప్రదర్శనతో గతేడాది అట్టడుగున నిలిచిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి అద్భుత ఆట తీరుతో సంచలనాలు సృష్టించింది.విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తు చేసి.. ఆరేళ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించింది.కొత్త కోచ్ డానియల్ వెటోరి మార్గదర్శనంలో.. నూతన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఊహించని ఫలితాలు సాధిస్తూ టైటిల్ వేటలో నిలిచింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌పై విజయానంతరం ఎస్ఆర్హెచ్ సారథి కమిన్స్ మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.మా బలం అదే‘‘ఈ సీజన్ ఆసాంతం మా వాళ్లు అదరగొట్టారు. ఆరంభం నుంచే ఫైనల్ లక్ష్యంగా ముందుకు సాగాము. ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకున్నాము. మా బలం బ్యాటింగ్ అన్న సంగతి మాకు తెలుసు. అయినప్పటికీ మా బౌలర్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. అనుభవజ్ఞులైన బౌలర్లు మా జట్టులో ఉన్నారు. భువీ, నట్టు, ఉనాద్కట్ నా పని మరింత సులువు చేశారు.ఆ నిర్ణయం నాది కాదుఇక ఈ రోజు షాబాజ్ అహ్మద్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకురావాలన్న నిర్ణయం డాన్ వెటోరీదే. ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ జట్టులో ఎంత మంది వీలైతే అంత మంది లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్లను ఈరోజు ఆడించాలని అనుకున్నాడు.అతడొక సర్ప్రైజ్ఇక అభిషేక్ శర్మ ఈరోజు ఇలా బౌలింగ్(2/24) చేయడం నిజంగా ఓ సర్ప్రైజ్ లాంటిదే. మిడిల్ ఓవర్లలో అతడు ప్రభావం చూపాడు. వాస్తవానికి ఈ పిచ్ మీద 170 పరుగుల టార్గెట్‌ను ఛేదించడం అంత సులువేమీ కాదని తెలుసు.కాస్త మెరుగ్గా ఆడితే గెలిచే అవకాశం ఉంటుందని తెలుసు. అయితే, వికెట్‌ను బట్టి పరిస్థితులను అంచనా వేయడంలో నేనేమీ దిట్ట కాదు. ఎందుకంటే వారం వారం ఇదంతా మారిపోతూ ఉంటుంది.ఇంకొక్కటి మిగిలి ఉందిమేము ఇక్కడిదాకా చేరడం వెనుక ఫ్రాంఛైజీకి చెందిన ప్రతి ఒక్కరి సహకారం ఉంది. దాదాపుగా 60- 70 మంది మనస్ఫూర్తిగా కఠిన శ్రమకోర్చి మమ్మల్ని ఈస్థాయిలో నిలిపారు.ఇంకొక్క అడుగు.. అందులోనూ సఫలమైతే ఇంకా బాగుంటుంది’’ అని కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టిగా రాణించినందు వల్లే తాము ఫైనల్ చేరుకోగలిగామని జట్టులోని ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇచ్చాడు.ఇంపాక్ట్ చూపిన షాబాజ్కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్.. యశస్వి జైస్వాల్(42), రియాన్ పరాగ్(6), రవిచంద్రన్ అశ్విన్(0) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కీలక సమయంలో రాణించి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ కెప్టెన్ సంజూ శాంసన్(10), షిమ్రన్ హెట్మెయిర్(4) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు.క్వాలిఫయర్-2: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్), చెన్నై👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 175/9 (20)👉రాజస్తాన్ స్కోరు: 139/7 (20)👉ఫలితం: రాజస్తాన్‌పై 36 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం.. ఫైనల్‌కు అర్హత👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాబాజ్ అహ్మద్(18 పరుగులు, 3/23).చదవండి: T20 WC: టీ20 వరల్డ్‌కప్-2024కు పాకిస్తాన్ జట్టు ప్రకటన.. Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 -
RR Vs SRH Pics: ఆర్ఆర్ను చిత్తు చేసి.. ఫైనల్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఫొటోలు)
-
అదే మా కొంపముంచింది.. వీలైనంత త్వరగా మర్చిపోవాలి: కమ్మిన్స్
హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎస్ఆర్హెచ్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(32), కమ్మిన్స్(30) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు , రస్సెల్,నరైన్, హర్షిత్ రనా, ఆరోరా తలా వికెట్ సాధించారు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ఊదిపడేసింది. కేకేఆర్ 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 58 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(51 నాటౌట్), గుర్భాజ్(23) పరుగులతో రాణించారు. ఇక క్వాలిఫయర్1లో ఓటమి పాలైన ఎస్ఆర్హెచ్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. మే 24న జరగనున్న క్వాలిఫయర్-2లో ఆర్సీబీ లేదా రాజస్తాన్‌తో తలపడనుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో విఫలమయ్యాని కమ్మిన్స్ తెలిపాడు.మా ఓటమికి కారణమిదే: కమ్మిన్స్"ఈ ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే మాకు ఇంకా ఫైనల్స్‌కు చేరేందుకు ఛాన్స్ ఉంది. సెకెండ్ క్వాలిఫయర్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము.ప్రస్తుత టీ20 క్రికెట్లో ఏ రోజు ఏమి జరుగుతుందో అంచనా వేయలేం. మేము ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో, అనంతరం బౌలింగ్‌లో కూడా రాణించలేకపోయాము. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఉపయోగించాలని నిర్ణయించాం. అందుకే సన్వీర్‌కు ఛాన్ప్ ఇచ్చాం. కానీ మా ప్లాన్ బెడిసి కొట్టింది. కానీ కేకేఆర్ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ప్రారంభంలో పిచ్ బౌలర్లకు కాస్త అనుకూలించింది. కానీ తర్వాత మాత్రం పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించింది. ఇక క్వాలిఫయర్-2 మ్యాచ్ చెన్నైలో ఆడనున్నాం. చెన్నె వికెట్ మాకు సరిగ్గా సరిపోతుందని నేను భావిస్తున్నారు. కాబట్టి ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉందంటూ" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
SRH Vs KKR: ఫైనల్ చేరడమే మిగిలింది: కమిన్స్ పోస్ట్ వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన ఆట తీరుతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) నమోదు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడ్డ దుస్థితి నుంచి.. ఈసారి ఏకంగా ఫైనల్ రేసులో నిలిచే స్థాయికి చేరుకుంది. కనీసం ప్లే ఆఫ్స్ చేరినా చాలంటూ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. విధ్వంసకర ఆట తీరుతో ఏకంగా క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. ఇంకొక్క ఆటంకం దాటితే చాలు.. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా అర్హత సాధించే అవకాశం ముంగిట నిలిచింది. ప్రధాన కారణాలు ఇవేఇక ఈ సీజన్లో సన్‌రైజర్స్ అద్భుత విజయాలకు ప్రధాన కారణం విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యూహాలు, కోచ్ డానియల్ వెటోరీ ప్రణాళికలు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సారథిగా కమిన్స్ జట్టును గెలుపు బాట పట్టించడంలో పూర్తిగా విజయవంతమయ్యాడు.ప్రత్యర్థి జట్ల వ్యూహాలను చిత్తు చేస్తూ మైదానంలో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగి సన్‌రైజర్స్ విన్‌రైజర్స్‌గా మార్చడంలో సఫలమయ్యాడు ఈ పేస్ బౌలర్. ఒత్తిడి నెలకొన్న సమయాల్లోనూ ఏమాత్రం సహనం కోల్పోకుండా ఆటగాళ్లకు అండగా నిలుస్తూ ఫలితాలు రాబడుతున్నాడు. ఫ్రాంఛైజీ తన కోసం ఖర్చు పెట్టిన రూ. 20.50 కోట్లకు పూర్తి న్యాయం చేస్తూ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు.మరో అవకాశం కూడా ఉందిఇక కమిన్స్ సారథ్యంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సన్‌రైజర్స్ క్వాలిఫయర్-1లోనూ ఇదే జోష్ కనబరిస్తే.. టైటిల్‌కు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలుస్తుంది.ఒకవేళ కేకేఆర్‌తో ఈ మ్యాచ్‌లో ఓడినా క్వాలిఫయర్-2 రూపంలో కమిన్స్ బృందానికి మరో అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా ఈసారి సన్‌రైజర్స్‌కు ఫైనల్ చేరేందుకు సానుకూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు.ఫైనల్స్‌లో అడుగుపెట్టడమే తరువాయిఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా సొంతమైదానం ఉప్పల్‌లో సన్‌రైజర్స్ ఆదివారం.. ఈ సీజన్ లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్ ఆడింది. పంజాబ్ కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.అనంతరం కేకేఆర్- రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ రద్దు కావడంతో రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుని క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో కమిన్స్ స్పందిస్తూ.. ‘‘ఉప్పల్‌లో మరో అద్భుతమైన రోజు. మాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. ఇక మనం ఫైనల్స్‌లో అడుగుపెట్టడమే తరువాయి’’ అని అభిమానులను ఉత్సాహపరిచాడు.ఈసారి కచ్చితంగా తుదిపోరుకు అర్హత సాధిస్తామని ఈ సందర్భంగా కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా కేకేఆర్- సన్‌రైజర్స్ మధ్య క్వాలిఫయర్-1కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇదే గడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్ Locked and loaded for Qualifier 1 🔥💪#PlayWithFire #KKRvSRH pic.twitter.com/nkTpipX0I8— SunRisers Hyderabad (@SunRisers) May 21, 2024 -
అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
ఐపీఎల్-2024లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ సునాయసంగా చేధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ రెండో స్ధానంలో నిలిచింది. దీంతో మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఇక పంజాబ్‌పై విజయంపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు."మా హోం గ్రౌండ్లో చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మా జట్టును సపోర్ట్ చేసేందుకు మైదానంకు వచ్చిన అభిమానులందరికి ధన్యవాదాలు. ఇంత ఫ్యాన్ కలిగి ఉన్న టీమ్‌ను ఎక్కడ నేను చూడలేదు. మేము మా సొంత మైదానంలో 7 మ్యాచ్‌ల్లో ఆరింట విజయాలు సాధించాము. ఈ సీజన్లో ఇప్పటివరకు మా కుర్రాళ్లు అద్బుతంగా రాణించారు. ప్రతీ ఒక్కరూ జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఇక అభిషేక్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసానికి ప్రతీ ఒక్క బౌలర్ భయపడాల్సిందే. నేను కూడా అభిషేక్‌కు బౌలింగ్ చేయాలనుకోవడం లేదు. పేసర్లకే కాదు స్పిన్నర్లపై కూడా అతడు స్వేచ్ఛగా ఆడుతాడు. ఇక నితీష్ ఒక యువ సంచలనం. అతడొక ఒక క్లాస్ ప్లేయర్. అతడి తన అనుభవానికి మించి ఆడుతున్నాడు. అతను మా టాప్-ఆర్డర్లో కీలక ఆటగాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో కూడా ఇదే రిథమ్‌ను కొనసాగించడానికి ప్రయత్నిస్తామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
ప్లే ఆఫ్‌కు సన్ రైజర్స్ : థాంక్యూ హైదారబాద్ (ఫొటోలు)
-
SRH: సన్‌రైజర్స్ కెప్టెన్ చేసిన పనికి అభిమానులు ఫిదా
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన పనికి ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘‘నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా.. మా హృదయాలు గెలుచుకున్నావు’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇదంతా కేవలం.. సన్‌రైజర్స్‌ను ప్లే ఆఫ్స్‌నకు చేర్చినందుకు మాత్రమే అనుకుంటే పొరపడినట్లే! ఆరెంజ్ ఆర్మీ ఆఖరిసారిగా 2020లో ప్లే ఆఫ్స్ చేరింది.ఆ తర్వాత గత మూడేళ్లుగా చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీపడింది. అయితే, ఐపీఎల్-2024లో మాత్రం పూర్తిగా సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు టాప్-2 రేసులోనూ సన్‌రైజర్స్‌ముందు వరుసలో ఉంది.టికెట్ కన్ఫామ్‌ఆస్ట్రేలియా సారథి, 2023 వన్డే వరల్డ్‌కప్ విజేత ప్యాట్ కమిన్స్, కొత్త కోచ్ డానియల్ వెటోరి రాకతో ఆరెంజ్ ఆర్మీ ఇలా విజయవంతమైన పంథాలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ బెర్తుపై కన్నేసిన కమిన్స్ బృందం గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ రద్దు కావడంతో టికెట్ కన్ఫామ్ చేసుకుంది.ఈ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ తర్వాత టాప్-4లో అడుగుపెట్టిన మూడో జట్టుగా నిలిచింది. లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఈ ఘనత సాధించింది. ఆ మ్యాచ్‌లోనూ గెలిస్తే టాప్-2కి కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి.ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన కమిన్స్‌ఇదిలా ఉంటే.. రైజర్స్‌ను ప్లే ఆఫ్స్ చేర్చిన ఉత్సాహంలో ఉన్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విరామం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన కెప్టెన్ సాబ్.. అక్కడి పిల్లలతో సరదాగా క్రికెట్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విద్యార్థుల ముఖాల్లో నవ్వులు నింపినందుకు సంతోషంగా ఉందంటూ కమిన్స్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. కాగా ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి దాకా ఆడిన 13 మ్యాచ్‌లలో ఏడు గెలిచింది. ఒకటి రద్దైపోయింది. ఇదిలా ఉంటే.. కమిన్స్ ఈ సీజన్లో ఇప్పటి దాకా 14 వికెట్లు వికెట్లు పడగొట్టాడు. కాగా 2024 వేలంలో సన్‌రైజర్స్ అతడిని రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.Pat Cummins at zphs . You hav my heart champ 😭😭❤️❤️ @patcummins30 #ipl pic.twitter.com/ZReUDCUSYc— SURYA BHAI 🚩 (@Surya_2898AD) May 17, 2024PAT CUMMINS IS WINNING THE HEART OF ALL HYDERABAD. ❤️- Cummins playing cricket with school kids. pic.twitter.com/0Io3X8pN2Y— Johns. (@CricCrazyJohns) May 17, 2024 -
ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్‌రైజర్స్ కెప్టెన్..
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అడుగు దూరంలో నిలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో ఉన్న ఎస్ఆర్హెచ్.. మరో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఎస్ఆర్హెచ్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 16న ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు దాదాపు వారం రోజుల విరామం లభించడంతో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దుబాయ్ వెకేషన్‌కు వెళ్లాడు. లక్నోతో మ్యాచ్ అనంతరం కమ్మిన్స్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కు పయనమయ్యాడు. అక్కడ కమ్మిన్స్ గోల్ఫ్ ఆడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కమ్మిన్స్ జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అతడి సారథ్యంలో ఎస్ఆర్హెచ్ అద్బుతాలు సృష్టిస్తోంది.ఐపీఎల్లో చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్హెచ్ ఏడింట విజయం సాధించింది. వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా కమ్మిన్స్ ఆకట్టుకుంటున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. Pat Cummins enjoying His Vacation in Dubai! pic.twitter.com/xgSbabtyYF— SunRisers OrangeArmy Official (@srhfansofficial) May 10, 2024 -
నేను అతడికి బిగ్ ఫ్యాన్.. అది నా అదృష్టంగా భావిస్తున్నా: అభిషేక్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి ఊచకోత ఫలితంగా సన్‌రైజర్స్ ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ కేవలం 9.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 205 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 401 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సపోర్ట్ కారణంగానే ఈ తరహా ప్రదర్శన చేయగల్గుతున్నానని అభిషేక్ తెలిపాడు. "మా కోచింగ్ స్టాప్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఆటగాళ్లందరకి చాలా సపోర్ట్‌గా ఉంటారు. ఎటువంటి కెప్టెన్‌ను, సపోర్ట్ స్టాప్‌ను ఇప్పటివరకు చూడలేదు. స్వేచ్చగా ఆడి మమ్మల్ని మేము వ్యక్తిపరిచేందుకు ఫుల్ సపోర్ట్ వారి నుంచి మాకు ఉంటుంది. ఇటువంటి వాతావరణం మా జట్టులో ఉండడం చాలా సంతోషం. ఈ తరహా బ్యాటింగ్‌ను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా చేశాను. భారీ షాట్లు ఆడి బౌలర్‌ను ఒత్తడిలోకి నెట్టేందుకు నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. ఇక ట్రావిస్ హెడ్‌కు నేను వీరాభిమానిని. అతడితో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ట్రావిస్ స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొంటాడు. కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో అతడి ఆడిన షాట్లు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే" అని జియోసినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ పేర్కొన్నాడు. -
SRH: వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
IPL 2024 SRH vs LSG: ఉప్పల్ స్టేడియంలో మరోసారి పరుగుల వరద పారింది. మ్యాచ్‌కు వాన గండం పొంచి ఉందంటూ అభిమానులు ఆందోళన పడిన వేళ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి అసలైన టీ20 మజాను అందించారు సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్.తమ బ్యాటింగ్ విధ్వంసంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కళ్లు తేలేసేలా చేసి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించారు. రాహుల్ సేన పరుగులు చేసేందుకు తడబడిన పిచ్‌పై.. 166 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు.కనీవినీ ఎరుగని రీతిలో 62 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్‌ను గెలుపుతీరాలకు చేర్చారు. తమ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఈ విజయాన్ని పుట్టినరోజు కానుకగా అందించారు. న భూతో న భవిష్యతి అన్న చందంగా ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను ఊచకోత కోశారు అభిషేక్, హెడ్.వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారుఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘బహుశా ట్రావిస్, అభిషేక్ కలిసి పిచ్‌ను మార్చేసి ఉంటారు(నవ్వుతూ). వాళ్లు ఏం చేయగలరో మాకు తెలుసు. అందుకే వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.నిజానికి నేనొక బౌలర్‌ను. కాబట్టి ఆ బ్యాటర్లకు పెద్దగా ఇన్పుట్స్ ఇవ్వలేను. ట్రావిస్ హెడ్ విషయానికొస్తే.. అతడు గత రెండేళ్లుగా ఇలాగే ఆడుతున్నాడు.అతడొక అద్భుతంకఠినమైన పిచ్‌లపై కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ.. అతడొక అద్భుతమైన ఆటగాడు. స్పిన్, పేస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడు.పవర్ ప్లేలో వీళ్లిద్దరిని ఎదుర్కోవడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టమే. ఈ సీజన్లో మా వాళ్లు సూపర్‌గా ఆడుతున్నారు. అయితే, పది కంటే తక్కువ ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడం నమ్మలేకపోతున్నాం’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు.10 వికెట్ల తేడాతో గెలుపుకాగా లక్నోతో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ చేసింది. భువనేశ్వర్ కుమార్(2/12)కు తోడు ఫీల్డర్లు అద్భుతంగా రాణించడంతో లక్నోను 165/4 స్కోరుకు కట్టడి చేసింది.ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్.. ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో మరో ముందడుగు వేసింది. WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
IPL 2024: సన్‌రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ నాలుగులో.. లక్నో ఆరో స్థానంలో ఉన్నాయి. నగరంలో నిన్న రాత్రి అతి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో నేటి మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనుమానాలు ఉండేవి. అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే వరుణుడి నుంచి మ్యాచ్‌కు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తుంది. తుది జట్ల విషయానికొస్తే.. ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. లక్నో జట్టుకు సంబంధించి డికాక్ తిరిగి జట్టులోకి రాగా.. మొహిసిన్ ఖాన్ ఔటయ్యాడు. సన్‌రైజర్స్ తరఫున లంక యువ స్పిన్నర్ విజయ్‌కాంత్ వియాస్కాంత్ అరంగేట్రం చేయనుండగా.. మయాంక్ అగర్వాల్ స్థానంలో సన్వీర్ సింగ్ జట్టులోకి వచ్చాడు.హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా.. అన్ని సందర్భాల్లో లక్నోనే విజయం సాధించింది.తుది జట్లు..లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రవిస్ హెడ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్ -
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
మైదానంలో ఉన్నంత సేపు ప్రత్యర్థులు.. ఒక్కసారి ఆట ముగియగానే స్నేహితులు.. దాదాపు క్రీడాకారులంతా ఇలాగే ఉంటారు. ముఖ్యంగా లీగ్ క్రికెట్లో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.ఐపీఎల్-2024లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమైంది. సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో ముచ్చటించాడు.పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని ముచ్చట్లలో మునిగిపోయిన వేళ.. కమిన్స్ తన వేలి గాయం గురించి పాండ్యా, సూర్యలకు చెప్పాడు. తన కుడిచేతి మధ్యవేలు ముందరి భాగం చిన్నప్పుడే విరిగిపోయిందని కమిన్స్ చెప్పగానే వాళ్లిద్దరు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే.. ‘‘అయ్యె అవునా?’’ అన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. సాటి ఫాస్ట్ బౌలర్‌గా కమిన్స్ కష్టాన్ని తెలుసుకుని సానుభూతి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా రైటార్మ్ పేసర్ అయిన ప్యాట్ కమిన్స్ 2011లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా.. ‘‘నాకు నాలుగేళ్ల వయసున్నపుడు.. డోర్ మధ్య వేలు ఇరుక్కోవడంతో పైభాగంలో సెంటీమీటర్ మేర విరిగిపోయింది. అయినా.. నా బౌలింగ్ యాక్షన్‌పై ఎలాంటి ప్రభావం పడలేదు.ఎందుకంటే నా వేళ్లు అన్నీ దాదాపుగా ఒకే లెంగ్త్‌తో ఉంటాయి. ఈ విషయంలో ఇప్పటికీ నా సోదరి బాధపడుతూనే ఉంటుంది. ఎందుకంటే తనే డోర్ వేసింది’’ అని కమిన్స్ తెలిపాడు. అదన్న మాట సంగతి!ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై సన్‌రైజర్స్‌ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ వీరోచిత అజేయ శతకం(51 బంతుల్లో 102)తో రాణించి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ బ్యాట్(17 బంతుల్లో 35)తో రాణించడమే గాక ఒక వికెట్ కూడా తీశాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా మూడు కీలక వికెట్లు తీసి సన్‌రైజర్స్ ఓటమిలో సూర్యతో పాటు తానూ కీలక పాత్ర పోషించాడు.చదవండి: T20 WC: ద్రవిడ్, రోహిత్‌కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!Pat Cummins must be telling about how he lost the top of his middle finger on his dominant right hand when his sister accidentally slammed a door on it. Hardik's reaction 😱 pic.twitter.com/oinHeW99mn— 𝗔𝗱𝗶𝘁𝘆𝗔 (@StarkAditya_) May 7, 2024 -
HBD Pat Cummins: సన్‌రైజర్స్ కెప్టెన్ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
-
Pat Cummins Photos: ఓ రేంజ్లో ఆరెంజ్ ఆర్మీ అంటున్న పాట్ కమ్మిన్స్.. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ (ఫొటోలు)
-
SRH: సన్‌రైజర్స్ గుండెల్లో గుబులు.. మ్యాచ్ గనుక రద్దైతే!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే పదకొండేసి మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్(నెట్ రన్‌రేటు 1.453), రాజస్తాన్ రాయల్స్ రాయల్స్(నెట్ రన్‌రేటు 0.476) ఎనిమిది గెలిచి టాప్-2లో తిష్ట వేశాయి.చెరో పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం మూడో స్థానం కోసం 12 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (-0.065)మధ్య జరుగుతున్న పోటీలో ఇప్పటి వరకు రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న సీఎస్కే(0.700)నే పైచేయి సాధించింది.ప్లే ఆఫ్స్ పోటీలో కీలక మ్యాచ్దీంతో రైజర్స్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. రాజస్తాన్ రాయల్స్‌పై మంగళవారం నాటి విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ సైతం ముందుకు దూసుకువచ్చింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ సైతం 12 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతూ టాప్-4పై కన్నేసింది.ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం నాటి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువెళ్తుంది. అదే సమయంలో ఓడిన జట్టు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.పొంచి ఉన్న వాన గండంఅయితే, సొంతగడ్డపై మ్యాచ్ జరుగనుండటం సన్‌రైజర్స్‌కు సానుకూల అంశమే అయినా.. వర్షం రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు 56 మ్యాచ్‌లు జరిగాయి.కానీ ఒక్క మ్యాచ్ కూడా వరణుడి కారణంగా రద్దు కాలేదు. అయితే, ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన సన్‌రైజర్స్- లక్నో మ్యాచ్‌కు మాత్రం వాన గండం పొంచి ఉంది. హైదరాబాద్‌లో మంగళవారం కుండపోతగా వర్షం కురిసింది.ఈ నేపథ్యంలో స్టేడియం సిబ్బంది మైదానంలోని మధ్య భాగాన్ని కవర్లతో కప్పి ఉంచారు. అయితే, వాతావరణ శాఖ రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం హెచ్చరించడం ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో గుబులు రేపుతోంది.మ్యాచ్ గనుక రద్దు అయితేకాగా తాజా సీజన్లో ఆరంభ మ్యాచ్‌లో తడబడ్డా ప్యాట్ కమిన్స్ బృందం తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. 266.. 277.. 287 స్కోర్లు నమోదు చేసి పరుగుల విధ్వంసానికి మారుపేరుగా నిలిచింది.అయితే, గత కొన్ని మ్యాచ్‌ల నుంచి సన్‌రైజర్స్ పేలవ బ్యాటింగ్‌తో తేలిపోతోంది. ఆఖరిగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక బుధవారం నాటి మ్యాచ్ గనుక రద్దైతే సన్‌రైజర్స్, లక్నోల ఖాతాలో చెరో పాయింట్ చేరుతుంది. అలా కాక మ్యాచ్ సాఫీగా సాగితే గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు వస్తాయి.వాతావరణ శాఖ హెచ్చరికనగరంలో వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.చదవండి: సంజూ శాంసన్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ 𝙇𝙤𝙘𝙠𝙚𝙙 𝙖𝙣𝙙 𝙡𝙤𝙖𝙙𝙚𝙙 👊🔥#PlayWithFire #SRHvLSG pic.twitter.com/En1XXReksW— SunRisers Hyderabad (@SunRisers) May 8, 2024 -
SRH Vs MI: రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న కమ్మిన్స్ 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి(20), జానెసన్(17) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చావ్లా తలా మూడు వికెట్లు సాధించగా.. అన్షుల్ కాంబోజ్, బుమ్రా చెరో వికెట్ సాధించారు. -
MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
ఐపీఎల్లో ఇవాళ మరో భారీ మ్యాచ్ జరుగనుంది. స్టార్లతో నిండిన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై హోం గ్రౌండ్ అయిన వాంఖడేలో రాత్రి 7: 30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ముంబై వరుస చెత్త ప్రదర్శనలు చేస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మహాద్భుతం జరిగే తప్ప ఈ సీజన్లో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట మాత్రమే గెలుపొంది ఆరు పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ముంబై ఈ సీజన్లో మరో మూడు మ్యాచ్‌లు (సన్‌రైజర్స్, కేకేఆర్, లక్నో) ఆడాల్సి ఉంది.సన్‌రైజర్స్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ప్రధాన పోటీదారుగా ఉంది. సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌లు గెలిచి 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇంకా నాలుగు మ్యాచ్‌లు (ముంబై, లక్నో, గుజరాత్, పంజాబ్) ఆడాల్సి ఉంది. ఇతర జట్ల జయాపజయాలతో పని లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే సన్‌రైజర్స్ ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.హెడ్ టు హెడ్ రికార్డ్స్: ఐపీఎల్లో ముంబై, సన్‌రైజర్స్ ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. ముంబై 12, సన్‌రైజర్స్ 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. చివరిసారిగా ఈ రెండు జట్ల మధ్య తలపడిన మ్యాచ్‌లో అతి భారీ స్కోర్లు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 31 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ట్రవిస్ హెడ్ (62), అభిషేక్ శర్మ (63), మార్క్రమ్ (42 నాటౌట్), క్లాసెన్ (80 నాటౌట్) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ సైతం ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేసి సన్‌రైజర్స్ శిబిరంలో దడ పుట్టించింది. ఈ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (34), నమన్ ధిర్ (30), తిలక్ వర్మ (64), హార్దిక్ పాండ్యా (24), టిమ్ డేవిడ్ (42 నాటౌట్), రొమారియో షెపర్డ్ (15 నాటౌట్) తలో చేయి వేసి సన్‌రైజర్స్‌ను భయపెట్టారు.తుది జట్లు (అంచనా)..ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధిర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార [ఇంపాక్ట్ ప్లేయర్: నేహాల్ వధేరా]సన్‌రైజర్స్: ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ [ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్/ఉమ్రాన్ మాలిక్] -
SRH: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్‌రెడ్డి సూపర్: కమిన్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్తాన్ రాయల్స్ మధ్య గురువారం నాటి మ్యాచ్ ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఆఖరి బంతి వరకు సాగిన ఈ ఉత్కంఠ పోరు అసలైన టీ20 మజాను అందించింది.ఈ హోరాహోరీ పోరులో రాయల్స్‌పై సన్‌రైజర్స్ పైచేయి సాధించి సొంతగడ్డపై గెలుపు జెండా ఎగురవేసింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి.ఇక గత రెండు మ్యాచ్‌లలో పరాజయాలు చవిచూసి ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టడంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సైతం హర్షం వ్యక్తం చేశాడు.అసలైన టీ20 క్రికెట్ అంటే ఇదేటేబుల్ టాపర్ రాజస్తాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లపై కమిన్స్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన మ్యాచ్ ఇది.అసలైన టీ20 క్రికెట్ అంటే ఇదే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఆఖరి బంతిని సంధించేపుడు భువీ తన ప్రణాళికను పక్కాగా అమలు చేశాడు.మిడిల్ ఓవర్లలో వీలైనన్ని వికెట్లు తీసేందుకు ప్రయత్నించాం. అదృష్టవశాత్తూ ఆఖరి వరకు పోరాడగలిగాం. ఇక నటరాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. యార్కర్లు సంధించడంలో అతడు దిట్ట.ఉప్పల్‌లో మేము ఇప్పటికే చాలా మ్యాచ్‌లు ఆడాం. కాబట్టి 200 లక్ష్యమనేది ఛేదించగలిగే టార్గెట్ అని తెలుసు. అయితే, విజయం మమ్మల్ని వరించింది.అతడొక అద్భుతం అంతేఈరోజు నితీశ్ రెడ్డి పరిస్థితులను అర్థం చేసుకుని చక్కగా ఆడాడు. అతడొక అద్భుతం అంతే! ఫీల్డింగ్‌లోనూ రాణిస్తున్నాడు. బౌలర్‌గానూ తన వంతు సేవలు అందిస్తున్నాడు’’ అంటూ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి, పేసర్లు భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌ల ఆట తీరును ప్యాట్ కమిన్స్ కొనియాడాడు.కాగా ఉప్పల్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(44 బంతుల్లో 58) శుభారంభం అందించగా.. నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి దుమ్ములేపాడు.42 బంతులు ఎదుర్కొన్న ఈ యువ ఆటగాడు 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్ల పాటు ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక విధ్వంసకర వీరుడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు.కేవలం 19 బంతుల్లోనే 42 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ కేవలం 3 వికెట్ల నష్టపోయి 201 పరుగులు సాధించింది.లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌ను భువీ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ జోస్ బట్లర్(0), వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్(3)ను డకౌట్ చేశాడు.ఇక 40 బంతుల్లో 67 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న యశస్వి జైస్వాల్ వికెట్‌ను నటరాజన్ తన ఖాతాలో వేసుకోగా.. టాప్ స్కోరర్ రియాన్ పరాగ్(77)ను కమిన్స్ పెవిలియన్‌కు పంపాడు.నరాలు తెగే ఉత్కంఠఈ క్రమంలో చివరి 3 ఓవర్లలో రాయల్స్ విజయ సమీకరణం 27 పరుగులుగా మారగా.. అప్పటికి చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయల్స్ సునాయాసంగానే లక్ష్యాన్ని ఛేదిస్తుందని అంతా భావించారు.అయితే, రైజర్స్ పేసర్లు అంతా తలకిందులు చేశారు. 18వ ఓవర్లో నటరాజన్, 19వ ఓవర్లో కమిన్స్ తలా కేవలం ఏడు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. చివరి ఓవర్లో సమీకరణం 13 పరుగులు మారింది.అప్పుడు బంతిని అందుకున్న భువీ బౌలింగ్‌లో తొలి ఐదు బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. చివరి బంతికి 2 పరుగులు అవసరమైన వేళ రోవ్‌మన్ పావెల్‌ను భువీ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది. భువీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.Jumps of Joy in Hyderabad 🥳Terrific turn of events from @SunRisers' bowlers as they pull off a nail-biting win 🧡Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc— IndianPremierLeague (@IPL) May 2, 2024 -
ఉప్పల్‌లో ఉల్లాసంగా SRH,RR ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
SRH Team In Hyderabad: సిటీలో సందడి చేసిన సన్ రైజర్స్ టీమ్ (ఫొటోలు)
-
కమిన్స్‌పై బ్రెట్ లీ విమర్శలు.. మరీ లేట్‌గా వచ్చి
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆలస్యంగా బౌలింగ్‌కు రావటాన్ని విమర్శించాడు.ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అయిన కమిన్స్.. సహచరులకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ఇలాంటి పనులు చేయడం బాగానే ఉన్నప్పటికీ.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా సరికాదని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ సారథిగా అడుగుపెట్టిన కమిన్స్ మంచి ఫలితాలు రాబడుతున్నాడు. అయితే, గత రెండు మ్యాచ్‌లలో వరుస ఓటముల కారణంగా అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైతో చెపాక్ మ్యాచ్‌లో కమిన్స్ కొత్త బంతితో బౌలింగ్ చేయకపోవడాన్ని బ్రెట్ లీ తప్పుబట్టాడు.కాగా సన్‌రైజర్స్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో బౌలింగ్ అటాక్ ఆరంభించిన కమిన్స్.. తదుపరి ఓవర్లో బంతిని ఆల్‌రౌండర్ నితీశ్‌రెడ్డికి చేతికిచ్చాడు. అనంతరం షాబాజ్ అహ్మద్, నటారాజన్, జయదేవ్ ఉనాద్కట్‌తో బౌలింగ్ చేయించాడు. తాను మాత్రం తొమ్మిదో ఓవర్లో బౌలింగ్‌కు దిగాడు.మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 49 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో 212 పరుగులు చేసిన చెన్నై.. లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన సన్‌రైజర్స్‌ను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది.ఈ నేపథ్యంలో బ్రెట్ లీ మాట్లాడుతూ.. ‘‘ప్యాట్ కమిన్స్ చాలా ఆలస్యంగా బరిలోకి వచ్చాడు. నాలుగు ఓవర్లు బౌల్ చేసి 49 పరుగులు ఇచ్చాడు. తను ధారాళంగా పరుగులు ఇచ్చిన మాట వాస్తవమే.నిజానికి తను కొత్త బంతితో అద్భుతంగా రాణించగలడు. కానీ వేరే వాళ్లకు అవకాశం ఇచ్చాడు. కొన్నిసార్లు మరీ మంచి కెప్టెన్‌గా మారిపోతాడు. బౌలింగ్ కెప్టెన్‌గా.. ఇతర బౌలర్లకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిదే.కానీ వరల్డ్ బెస్ట్ బౌలర్ బౌలింగ్ అటాక్ ఆరంభించకపోవడం సరికాదు. స్వార్థంగా ఉండమని నేను చెప్పటం లేదు. ప్యాట్ కమిన్స్.. ప్యాట్ కమిన్సే. కనీసం రెండో ఓవర్లోనైనా అతడు బౌలింగ్‌లోకి దిగాల్సింది’’ అని జియో సినిమా షోలో వ్యాఖ్యానించాడు. -
ఎంత పనిచేశావు కమిన్స్!.. కావ్య రియాక్షన్ వైరల్
పవర్ హిట్టింగ్తో దుమ్ములేపుతూ ఐపీఎల్-2024లో రికార్డులు సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతోంది. బారీ విజయాల తర్వాత తొలుత ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన ప్యాట్ కమిన్స్ బృందం.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తైంది.చెపాక్ వేదికగా 78 పరుగుల తేడాతో ఓడి.. ఐపీఎల్ చరిత్రలోనే తమ భారీ పరాజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ చూస్తున్నంత సేపు అసలు బ్యాటింగ్ చేసేది సన్‌రైజర్స్ జట్టేనా అనేంత మందకొడిగా బ్యాటింగ్ సాగింది. Batting 🤝 Bowling 🤝 Fielding @ChennaiIPL put on a dominant all-round performance & continue their good show at home 🏠 Scorecard ▶️ https://t.co/uZNE6v8QzI#TATAIPL | #CSKvSRH pic.twitter.com/RcFIE9d46K— IndianPremierLeague (@IPL) April 28, 2024 అదే విధంగా.. తొలుత ఫీల్డింగ్ చేసిన సమయలోనూ సన్‌రైజర్స్ ఏమాత్రం ఆకట్టులేకపోయింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ సహ యజమాని కావ్యా మారన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చెపాక్‌లో చెన్నైతో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు స్కోరు చేసింది.ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 98 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే, గైక్వాడ్ 97 పరుగుల వద్ద ఉన్నపుడు రనౌట్ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది.కానీ సన్‌రైజర్స్ ఫీల్డర్ల తప్పిదం వల్ల అతడు బతికిపోయాడు. చెన్నై ఇన్నింగ్స్ పందొమ్మిద ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఉనాద్కట్ బౌలింగ్‌లో నాలుగో బంతిని అవుట్ సైడ్ ఆఫ్ దిశగా.. ఆఫ్ కట్టర్‌గా సంధించగా.. గైక్వాడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.బంతిని అందుకున్న కమిన్స్ వికెట్లకు గిరాటేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో గైక్వాడ్ రెండు పరుగులు తీసుకుని సింగిల్ తీసి రెండో పరుగు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కావ్యా మారన్ స్పందిస్తూ.. ‘‘నో.. దేవుడా ఎంత పనిపోయింది’’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. -
సీఎస్కేతో ఎస్ఆర్హెచ్ పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. కాగా ఈ రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాయి. సీఎస్కే లక్నో సూపర్ జెయింట్స్‌తో చేతిలో పరాజయం పాలవ్వగా.. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీపై ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ మూడో స్ధానంలో కొనసాగుతుండగా.. సీఎస్కే ఆరో స్ధానంలో ఉంది.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ : అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానాసన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ -
హైదరాబాదీ బిర్యానీకి కమిన్స్ ఫిదా.. తొలిసారి ఇలా!
సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాదీ బిర్యానీకి ఫిదా అయ్యాడు. కమ్మని బిర్యానీ రుచితో కడుపు నిండిపోయిందని.. మరో వారం రోజుల పాటు తాము ఇంకేమీ తినాల్సిన పనిలేదంటూ చమత్కరించాడు.తన కుటుంబం తొలిసారి భారత్‌కు వచ్చిందని.. వారితో కలిసి హైదరాబాద్‌లో పర్యటించడం సంతోషంగా ఉందని కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. తమకు రుచికరమైన భోజనం అందించిన హోటల్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.కుటుంబంతో కలిసి అక్కడ దిగిన ఫొటోలను కమిన్స్ ఇన్‌స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్-2024 సీజన్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ తమ సారథిగా ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే, టీ20లలో నాయకుడిగా పెద్దగా అనుభవం లేని ఈ వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్‌ను ఎంపిక చేసి రైజర్స్ రిస్క్ తీసుకుందని చాలా మంది భావించారు. కానీ.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ సన్‌రైజర్స్‌ను విజయపథంలో నడిపిస్తున్నాడు కమిన్స్.ఇప్పటి వరకు ఈ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ ఎనిమిదింట ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏకంగా మూడుసార్లు 250కి పైగా స్కోర్లు నమోదు చేసి రికార్డులు సృష్టించింది. కెప్టెన్‌గా భేష్ అనిపిస్తున్న ఈ పేస్ బౌలర్.. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టాడు.కాగా గురువారం నాటి ఉప్పల్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో సన్‌రైజర్స్ ఓడిపోయింది. తదుపరి ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా కమిన్స్ బృందం తలపడనుంది.చదవండి: రోహిత్, స్కై కాదు!.. వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టేది ఇతడే: యువీ -
SRH Vs RCB: తెలుగులో మాట్లాడిన కమిన్స్.. ఆర్సీబీకి వార్నింగ్!
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం తలపడనుంది. ఇందుకోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.ఈ సీజన్లో ఇప్పటికే ఆర్సీబీని తమ సొంతగడ్డపైనే ఓడించిన సన్‌రైజర్స్ ఉప్పల్‌లోనూ ఆ సీన్‌ను రిపీట్ చేయాలని భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) సాధించిన రైజర్స్... హైదరాబాద్‌లో తమ రికార్డును బ్రేక్ చేయాలని పట్టుదలగా ఉంది.ప్యాట్ కమిన్స్ బృందం జోరు చూస్తుంటే ఇదేమీ అసాధ్యం కాకపోవచ్చనే అనిపిస్తోంది. మరోవైపు.. ఆర్సీబీ సైతం ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ ఖాయమంటూ ఈ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.The crossover we all love to see 🤩 pic.twitter.com/nLlDlUcH7E— SunRisers Hyderabad (@SunRisers) April 24, 2024ఇదిలా ఉంటే.. ఈ కీలక పోరుకు ముందే సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌ను తన మాటలతో ఖుషీ చేశాడు. ‘‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.కమిన్స్ అంటే క్లాస్ అనుకుంటివా? మాస్.. ఊరమాస్.. ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ’’ అంటూ తెలుగులో డైలాగ్స్ చెప్పి దుమ్ములేపాడు. తగ్గేదేలే అంటూ ఆర్సీబీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు స్పందించిన ఆరెంజ్ ఆర్మీ.. ‘‘కెప్టెన్ ఓ రేంజు.. మామ మనోడే.. సూపర్ కమిన్స్’’ అంటూ కామెంట్లతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకతో సన్‌రైజర్స్ తలరాత మారిపోయింది. గత మూడేళ్లుగా వైఫల్యాలతో చతికిల పడ్డ రైజర్స్‌ను తన కెప్టెన్సీతో ఈ సీజన్లో హాట్ ఫేవరెట్‌గా మార్చాడు ఈ పేస్ బౌలర్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లకు తోడు బౌలర్లు కూడా రాణిస్తుండటంతో తన కెప్టెన్సీ వ్యూహాలకు మరింత పదును పెట్టి వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇక ఈ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదు గెలిచి పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ ఎనిమిదింట ఏడు ఓడి అట్టడుగున ఉంది.చదవండి: IPL 2024: అన్ని జట్లు ఓడాయి.. ఒక్క సన్‌రైజర్స్ మాత్రమే..!ఓవైపు కెప్టెన్‌గా #OrangeORangeu అనిపిస్తున్నాడు 💪అది సరిపోదు అన్నట్టు.. ఈ Mass డైలాగ్స్ 💥@patcummins30 మామ.. నువ్వు సూపర్ అంతే! 🤩చూడండి#TATAIPLHyderabad v Bengaluru | రేపు 6 PM నుంచిమీ #StarSportsTelugu లో#IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu pic.twitter.com/wv5IzPZhFe— StarSportsTelugu (@StarSportsTel) April 24, 2024 -
SRH: మాకున్న బలం అదే.. తగ్గేదేలే: కమిన్స్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. సొంతగడ్డపై తమకు ఎదురైన పరాభవానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రైజర్స్పై ప్రతీకారం తీర్చుకుంది. ఉప్పల్ మైదానంలో ప్యాట్ కమిన్స్ బృందాన్ని 35 పరుగుల తేడాతో ఓడించి ఈ సీజన్ లెక్క సరిచేసింది.రాణించిన కోహ్లి, పాటిదార్, గ్రీన్ ఇరుజట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లి (51), రజత్ పాటిదార్(20 బంతుల్లో 50) అర్ధ శతకాలు సాధించగా.. కామెరాన్ గ్రీన్(20 బంతుల్లో 37*) దూకుడుగా ఆడాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన ఆర్సీబీ 206 పరుగులు స్కోరు చేసింది. ఇప్పటికే ఈ సీజన్లో మూడుసార్లు 250 పైచిలుకు పరుగులు సాధించిన రైజర్స్ ఈ లక్ష్యాన్ని తేలికగ్గానే ఛేదిస్తుందని ఆరెంజ్ ఆర్మీ భావించింది.దూకుడుగా ఆరంభించి.. భారీ మూల్యమే చెల్లించికానీ ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు 171 పరుగులకే రైజర్స్ కథ ముగిసిపోయింది. విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్(1) ఆదిలోనే అవుట్ కావడం.. అభిషేక్ శర్మ(13 బంతుల్లో 31) మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడం ప్రభావం చూపింది.అయినప్పటికీ దూకుడును కొనసాగించిన రైజర్స్ బ్యాటర్లు ఐడెన్ మార్క్రమ్(7), నితీశ్ రెడ్డి(13), హెన్రిచ్ క్లాసెన్(7)లను ఆర్సీబీ బౌలర్లు త్వరత్వరగా పెవిలియన్‌కు పంపారు. కాసేపు పోరాడినాఈ క్రమంలో ఆరో స్థానంలో వచ్చిన షాబాజ్ అహ్మద్ (37 బంతుల్లో 40 నాటౌట్) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(15 బంతుల్లో 31) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మిగతా వాళ్ల నుంచి సహకారం అందకపోవడంతో రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ఓటమిని అంగీకరించింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్ రెండేసి వికెట్లు తీయగా.. విల్ జాక్స్, యశ్ దయాళ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఓటమిపై స్పందిస్తూ.. తమ బ్యాటర్లు దూకుడుగా ఆడటాన్ని సమర్థించాడు. ‘‘ఈరోజు మాకు సరైన ముగింపు లభించలేదు. తొలుత పరుగులు కట్టడి చేయలేకపోయాం.ప్రతి మ్యాచ్ గెలవలేంఆ తర్వాత లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోయాం. నిజానికి మేము ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది. ఏదేమైనా మా వాళ్లు చాలా బాగా ఆడారు. టీ20 క్రికెట్లో ప్రతీ మ్యాచ్ గెలవడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ ఓటమినే తలచుకుంటూ కూర్చోము.మాకున్న బలం అదేరిస్క్ ఉన్నా సరే దూకుడుగా బ్యాటింగ్ చేయడమే మాకున్న బలం. అయితే, ప్రతి మ్యాచ్‌లోనూ ఇది వర్కౌట్ అవ్వాలని లేదు. ఒకటీ రెండు మ్యాచ్‌లలో ప్రతికూల ఫలితాలు రావచ్చు. ఈ మ్యాచ్‌లో మేము మెరుగైన స్కోరే చేశాం. ఇక ముందు కూడా మా వాళ్లు ఇంతే దూకుడుగా బ్యాటింగ్ చేయడమే మంచిదని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. చదవండి: #Kavya Maran: అరెరే.. ఏమైందిరా మీకు! కావ్య రియాక్షన్ వైరల్ 📍 Hyderabad VIBE Virat Kohli ☺️ ❤️#TATAIPL | #SRHvRCB | @RCBTweets | @imVkohli pic.twitter.com/llKITaKky3— IndianPremierLeague (@IPL) April 26, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సన్‌రైజర్స్ బ్రేక్..బెంగళూరు గెలుపు (ఫొటోలు)
-
IPL 2024: తిరుగులేని సన్‌రైజర్స్.. అన్ని జట్లు ఓడినా..!
ఐపీఎల్ 2024 సీజన్లో సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ (14 పాయింట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (10), సన్‌రైజర్స్ హైదరాబాద్ (10), లక్నో సూపర్ జెయింట్స్ (10) జట్లు పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. సీఎస్కే (8), గుజరాత్ (8), ముంబై ఇండియన్స్ (6), ఢిల్లీ క్యాపిటల్స్ (6) జట్లు ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ పడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ (4), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2) చివరి రెండు స్థానాల్లో ఉంటూ ప్లే ఆఫ్స్ అశలను దాదాపుగా వదులుకున్నాయి.ప్రస్తుత సీజన్లో 39 మ్యాచ్‌ల అనంతరం ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ మినహా మిగతా తొమ్మిది జట్లు తమతమ సొంత మైదానాల్లో పరాజయాలు ఎదుర్కొన్నాయి. ఒక్క సన్‌రైజర్స్ మాత్రమే హోం గ్రౌండ్లో తిరుగులేని శక్తిగా ఉంది. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న చెన్నై, ఆర్సీబీ, ముంబై జట్లు సైతం సొంత మైదానాల్లో ఓటములు ఎదుర్కొంటే, కమిన్స్ సేన మాత్రం సొంత అభిమానుల మధ్యలో దర్జాగా తలెత్తుకు నిలబడింది.ఈ సీజన్లో సన్‌రైజర్స్ కమిన్స్ నేతృత్వంలో మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. పటిష్టం అంటే అట్లాంటి ఇట్లాంటి పటిష్టం కాదు. ఐపీఎల్ పునాదులు దద్దరిల్లేంత పటిష్టంగా కమిన్స్ సేన ఉంది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ వీరులు విధ్వంసం ధాటికి పొట్టి క్రికెట్ బ్యాటింగ్ రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. వీరి దెబ్బకు ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇప్పటికే మూడు సార్లు 260 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది.మరోవైపు బౌలింగ్‌లోనూ సన్‌రైజర్స్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కమిన్స్ నేతృత్వంలో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగంలో కూడా అదరగొడుతుంది. మొత్తంగా ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ పట్టపగ్లాల్లేకుండా టైటిల్ దిశగా దూసుకెళ్తుంది. రేపు (ఏప్రిల్ 25) జరుగబోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సొంత మైదానంలో ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారి ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కావడం ఖాయమని సన్‌రైజర్స్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.ఇదే సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఏం జరిగిందో అందరం చూశాం. ఆర్సీబీ హోం గ్రౌండ్లో జరిగిన ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు పరుగుల ప్రళయం సృష్టించారు. హెడ్ (102), అభిషేక్ శర్మ (34), క్లాసెన్ (67), మార్క్రమ్ (32 నాటౌట్), అబ్దుల్ సమద్ (37 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ స్కోర్ (287) నమోదు చేసింది. ప్రత్యర్ది హోం గ్రౌండ్‌లోనే సన్‌రైజర్స్ బ్యాటర్లు ఈ తరహాలో రెచ్చిపోతే.. రేపు సొంత మైదానంలో వీరిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. -
నువ్వు చాలా మంచోడివి ప్యాట్: కోహ్లి కామెంట్స్ వైరల్
ఐపీఎల్-2024లో ఏప్రిల్ 15న చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించిన స్కోరు 287/3. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 41 బంతుల్లోనే 102 పరుగులతో చెలరేగగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34, వన్‌డౌన్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులు రాబట్టారు.ఇక నాలుగో స్థానంలో వచ్చిన వచ్చిన ఐడెన్ మార్క్రమ్ 17 బంతుల్లో 32, ఐదో నంబర్లో బ్యాటింగ్ చేసిన అబ్దుల్ సమద్ 10 బంతుల్లోనే 37 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. వీరి అద్భుత ఇన్నింగ్స్ ఫలితమే 287. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఆఖరి వరకు పట్టుదలగా పోరాడింది. కానీ 262 పరుగులకే పరిమితమై ఓటమిని ఆహ్వానించింది. చిన్నస్వామి స్టేడియాన్ని పరుగుల వరదతో ముంచెత్తిన సన్‌రైజర్స్ 25 పరుగుల తేడాతో గెలుపొంది సత్తా చాటింది.ఇప్పుడు మళ్లీ ఏప్రిల్ 25న ఇరు జట్లు మరోసారి ముఖాముఖి తలపడనున్నాయి. ఏడింట ఐదు విజయాలతో మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు(ఎనిమిదికి ఒక్కటే విజయం) నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఆర్సీబీకి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగు పరచుకునేందుకు సన్‌రైజర్స్ మరో విజయానికి గురిపెట్టగా.. ఆర్సీబీ పరువు కోసం పాకులాడుతోంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్- ఆర్సీబీ మధ్య గురువారం నాటి పోరు రసవత్తరంగా మారనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు జట్లు ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ పూర్తి చేసుకోగా.. రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్- ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మధ్య ఈ సందర్భంగా ఆసక్తికర సంభాషణ జరిగింది.కోహ్లి దగ్గరికి వచ్చిన కమిన్స్.. ‘‘వికెట్ ఫ్లాట్‌గా కనిపించేలా చేస్తానని కోచ్ చెప్తున్నాడు. నేనైతే ఆ విషయం విన్నాను మరి’’ అని టీజ్ చేశాడు. ఇందుకు స్పందనగా.. ‘‘నువ్వు చాలా మంచివాడివి ప్యాట్’’ అని కోహ్లి బదులిచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ఆర్సీబీ షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా గత మ్యాచ్‌లో కోహ్లి 20 బంతుల్లో 42 పరుగులు చేయగా.. పేస్ బౌలర్ కమిన్స్ 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. -
SRH: ‘టాలీవుడ్ ప్రిన్స్’తో కమిన్స్.. సూపర్‌స్టార్ రిప్లై.. ఫ్యాన్స్ ఫిదా
Pat Cummins And Mahesh Babu- Crazy Viral: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాక సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో సరికొత్త ఉత్సాహం నింపింది. అతడి సారథ్యంలో ఐపీఎల్-2024లో వరుస విజయాలతో సన్‌రైజర్స్ కాస్తా సన్‘డేంజర్స్’గా మారి ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీశ్‌కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్.. ఇలా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా పరుగుల సునామీ సృష్టిస్తూ సన్‌రైజర్స్‌ను విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మార్చగా.. వీరి సేవలను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన కమిన్స్ తనదైన వ్యూహాలతో విజయాల పరంపరకు తెరతీశాడు. ఈ నేపథ్యంలో.. గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీపడ్డ రైజర్స్ ఇప్పుడు.. ప్లే ఆఫ్స్ రేసులో ముందు వరుసలో ఉంది. ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదు విజయాలతో ప్రస్తుతం పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. కాగా సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్‌తో బెంగళూరుతో తలపడనుంది. హైదారాబాద్ వేదికగా గురువారం ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో సొంతగడ్డపై మరోసారి దుమ్ము రేపేందుకు సిద్ధమైన ప్యాట్ కమిన్స్ బృందం సోమవారం సూపర్‌స్టార్ మహేశ్ బాబును కలిసింది. View this post on Instagram A post shared by Pat Cummins (@patcummins30) ఈ సందర్భంగా మహేశ్ బాబుతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కమిన్స్.. ‘‘ఈరోజు మధ్యాహ్నం.. టాలీవుడ్ ప్రిన్స్‌తో సమయం సంతోషంగా గడిచింది’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇక మహేశ్ బాబు సైతం.. ‘‘మిమ్మల్ని నేరుగా కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. వీరాభిమానిని. మీకు, ఎస్ఆర్హెచ్ జట్టుకు ఆల్ ది బెస్ట్’’ అంటూ విషెస్ తెలిపాడు. వీరిద్దరి పోస్టులు చూసిన ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో అంటూ మురిసిపోతున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) కాగా గతంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్స్‌ను అనుకరిస్తూ అతడు చేసే రీల్స్ నెట్టింట వైరల్ అయిన సందర్భాలు కోకొల్లలు. చదవండి: ఓడినా.. మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థం లేని వాగుడు: సౌతాఫ్రికా స్టార్ పోస్ట్ వైరల్ SunRisers 🤝 Superstar of Telugu cinema, Mahesh Babu 👑🧡 pic.twitter.com/Nd4MQWCfi8 — SunRisers Hyderabad (@SunRisers) April 22, 2024 -
SRH: ‘బాధితులు’ మరింత అసూయ పడేలా..
(43 X 4) + (38 X 6).. మొత్తం 81.. ఇదేంటి లెక్క తప్పు చెప్తున్నారు అనుకుంటున్నారా? కాదండీ.. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో నమోదైన ఫోర్లు, సిక్సర్లూనూ!! చిన్నస్వామి స్టేడియం బౌండరీ చిన్నదే కావొచ్చు.. అయినా.. ఇలా బ్యాట్ తాకించగానే అలా బంతి అవతల పడదు కదా.. ఫోర్స్‌గా కొడితేనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంది. అలా తమ పవర్ హిట్టింగ్తో ప్రేక్షకులకు కనువిందు చేశారు ఇరు జట్ల బ్యాటర్లు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టులో అభిషేక్ శర్మ 2, ట్రావిస్ హెడ్ 8, హెన్రిచ్ క్లాసెన్ 7, ఐడెన్ మార్క్రమ్ 2, అబ్దుల్ సమద్ 3 సిక్స్‌లు బాదారు. The art 🎨 of nailing practice to execution for a record breaking total! 🧡 Travis Head 🤝 Heinrich Klaasen#TATAIPL | #RCBvSRH | @SunRisers pic.twitter.com/gA5HcYGwFM — IndianPremierLeague (@IPL) April 16, 2024 ఇలా ఓవరాల్‌గా ఎస్ఆర్హెచ్ ఖాతాలో 22 సిక్సర్లు నమోదు కాగా.. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా రికార్డులకెక్కింది. మరోవైపు.. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి రెండు, ఫాఫ్ డుప్లెసిస్ 4, దినేశ్ కార్తిక్ 7, మహిపాల్ లామ్రోర్ రెండు సిక్స్‌లు బాదారు. తడిసి ముద్దైన చిన్నస్వామి స్టేడియం మ్యాచ్ ఆద్యంతం ఇలా సిక్సర్ల వర్షంలో చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్దవుతుంటే టీ20 ప్రేమికులంతా కేరింతలు కొట్టారు. న భూతో న భవిష్యతి అన్నట్లుగా బ్యాటర్లు హిట్టింగ్ చేస్తుంటే ఇది కదా పొట్టి ఫార్మాట్ మజా అనుకుంటూ మురిసిపోయారు. బ్యాటర్‌ను అయినా బాగుండు ఫలితం ఎలా ఉన్నా మంచినీళ్ల ప్రాయంలా సన్‌రైజర్స్- ఆర్సీబీ బ్యాటర్లు చితక్కొట్టిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో బాధితులుగా మిగిలిపోయిన బౌలర్లు కూడా తాము కూడా అప్పటికప్పుడు బ్యాటర్ అయి పోయి ఉంటే బాగుండు అనుకునేంతగా అసూయ పడేలా చేశారు. విజయానంతరం సన్‌రైజర్స్ కెప్టెన్, మూడు వికెట్లు తీసిన పేసర్ ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘‘నేను బ్యాటర్‌ను అయినా బాగుండు. సూపర్ మ్యాచ్. అద్భుతమైన దృశ్యాలు. అంతకు మించిన వినోదం. చిన్నస్వామి స్టేడియం పిచ్ ఈరోజు పొడిగా ఉంది. దానిని మేము చక్కగా సద్వినియోగం చేసుకోగలిగాం’’ అని కమిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ సృష్టించిన అరుదైన రికార్డులు ►ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు- 22 ►టీ20 క్రికెట్లో నేపాల్(314) తర్వాత రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు(287). ►ఐపీఎల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు- 287/3. సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►టాస్: ఆర్సీబీ.. బౌలింగ్ ►సన్‌రైజర్స్ స్కోరు: 287/3 (20) ►ఆర్సీబీ స్కోరు: 262/7 (20) ►ఫలితం: ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం చదవండి: #RCBvsSRH: ఏంట్రా ఈ బ్యాటింగ్?.. ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి.. వీడియో వైరల్ -
శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి..
SRH Fans Hails Pat Cummins Captaincy: ఐపీఎల్లో గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్-2023లో పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పట్టికలో అట్టడుగున పదోస్థానంలో నిలిచింది. ఫలితంగా ఇక ఈ జట్టు ఇంతే! ఊరించి ఉసూరుమనిపించడం.. గెలుస్తారనుకున్న మ్యాచ్‌లో కూడా ఓడిపోవడం.. అనే విమర్శలు ఎదుర్కొంది. సరైన కెప్టెన్, ఓపెనింగ్ జోడీ లేకపోవడం.. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ విఫలం కావడం వంటివి తీవ్ర ప్రభావం చూపాయి. భారీ ధరకు కొనుక్కున్న హ్యారీ బ్రూక్ రాణించకపోవడం.. హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్‌ను బరిలోకి దింపినా అప్పటికే ఆలస్యం కావడం గతేడాది ఎస్ఆర్హెచ్ కొంపముంచింది. అయితే, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని.. లోపాలు సరిచేసుకుని ముందు సాగడం కూడా సన్‌రైజర్స్‌కు చేతకాదు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వన్డే వరల్డ్‌కప్-2023 విన్నింగ్ కెప్టెన్ కోసం 20 కోట్లు కానీ.. సన్‌రైజర్స్ యాజమాన్యం వ్యూహాత్మంగా అడుగులు వేసింది. ఐపీఎల్-2024 వేలంలో భాగంగా వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. అతడి కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు వెచ్చించింది. అదే విధంగా వరల్డ్‌కప్ హీరో ట్రావిస్ హెడ్‌ను కూడా రూ. 6.80 కోట్లు పెట్టి కొనుక్కుంది. అయితే.. టీ20లలో అంతగా అనుభవం లేని కమిన్స్‌ను కెప్టెన్ చేయడం సన్‌రైజర్స్ పొరపాటేనని మరోసారి విమర్శలు వచ్చాయి. అతడి కోసం అంత ఖర్చు చేయడం అవసరమా అనే పెదవి విరుపులు కూడా! నమ్మకం నిలబెట్టుకుంటున్న కమిన్స్ కానీ మేనేజ్మెంట్ తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ సన్‌రైజర్స్‌ను విజయపథంలో నడుపుతున్నాడు కమిన్స్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, మార్క్రమ్ వంటి హిట్టర్లకు తోడు నితీశ్ కుమార్‌రెడ్డి, అబ్దుల్ సమద్ సేవలను సరైన సమయంలో సరిగ్గా ఉపయోగించుకుంటూ ఫలితాలు రాబడుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఈ స్టార్ పేసర్ తనతో పాటు భువీ, నటరాజన్, జయదేవ్ ఉనాద్కట్‌లతో పాటు స్పిన్నర్ మయాంక్ మార్కండేను కూడా అవసరమైన సమయంలో రంగంలోకి దించుతున్నాడు. మాస్టర్ మైండ్ ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్‌లో పిచ్‌ను సరిగ్గా రీడ్ చేసిన కమిన్స్ వన్‌డౌన్‌లో క్లాసెన్‌ను దింపి ఫలితం రాబట్టాడు. అందుకు తగ్గట్లే క్లాసెన్(31 బంతుల్లో 67) ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 102)కు సహకారం అందిస్తూనే.. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన్నపుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. ఆఖర్లో మార్క్రమ్(17 బంతుల్లో 32), అబ్దుల్ సమద్(10 బంతుల్లో 37) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) నమోదు చేసిన జట్టుగా ఆల్‌టైమ్ రికార్డు సృష్టించడంలో తమ వంతు పాత్ర పోషించారు. Abdul Samad in the house now 😎 Flurry of sixes at the Chinnaswamy 💥 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #RCBvSRH pic.twitter.com/eWFCtZ5Usq — IndianPremierLeague (@IPL) April 15, 2024 ఇక ఆర్సీబీ లక్ష్య ఛేదనలో ఆరంభంలో దూకుడుగా ఆడినా ప్యాట్ కమిన్స్ ముఖంపై నవ్వులు పూశాయే గానీ.. అతడు ఏమాత్రం తడబడలేదు. ముందుగా పార్ట్‌టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ చేతికి బంతినిచ్చాడు. ఐదో బంతికే క్యాచ్ డ్రాప్ చేయడంతో కోహ్లికి లైఫ్ లభించగా అతడు దూకుడు మరింత పెంచాడు. ఆ తర్వాత భువీని రంగంలోకి దింపాడు. అనంతరం మళ్లీ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్..నటరాజన్ ఇలా ఒక్కో ఓవర్‌కు వైవిధ్యం చూపించాడు. పిచ్ పరిస్థితిని అంచనా వేస్తూ మరో స్పిన్నర్ మయాంక్‌తో బౌలింగ్ చేయించి ఫలితం రాబట్టాడు. ఆర్సీబీని దెబ్బకొట్టడంలో సఫలం మయాంక్ మార్కండే కోహ్లి(42) బౌల్డ్ కావడంతో అప్పటిదాకా ఆర్సీబీ విజయంపై ఆశలు పెట్టుకున్న అభిమానులు ఒక్కసారిగా నీరుగారిపోయారు. అయితే, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 62), దినేశ్ కార్తిక్(35 బంతుల్లో 83) ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. తన వ్యూహాలను పక్కాగా అమలు చేసిన ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయడంతో పాటు కెప్టెన్‌గానూ తానేంటో మరోసారి నిరూపించాడు. మిస్టర్ కూల్ ధోనిలా కూల్‌గా డీల్ చేస్తూ సన్‌రైజర్స్‌ను 25 పరుగుల తేడాతో గెలిపించాడు. తద్వారా రైజర్స్ ఖాతాలో నాలుగో(ఆరింట) విజయం చేరింది. ఇక కమిన్స్ చేరిక జట్టుకు నష్టం చేకూరుస్తుందే తప్ప లాభం ఉండదన్న విమర్శకులకు అద్బుత నైపుణ్యాలతో సమాధానమిస్తున్న ఈ పేస్ బౌలర్.. తొలుత ప్లే ఆఫ్స్‌నకు గురిపెట్టాడు. Nothing but bright smiles and 𝙜𝙤𝙤𝙤𝙤𝙤𝙤𝙙 vibes after a historic night of cricket 😁🔥#PlayWithFire #RCBvSRH pic.twitter.com/RXn6mb5pF1 — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 అంతా సవ్యంగా సాగితే ఈసారి ఫైనల్లోనూ రైజర్స్‌ను చూస్తామంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. డేవిడ్ వార్నర్ తర్వాత తమకు దొరికిన మరో ఆణిముత్యం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అంటూ కొనియాడుతున్నారు. విశ్లేషకులు సైతం కమిన్స్ కెప్టెన్సీకి మంచి మార్కులే వేస్తున్నారు. పనిలో పనిగా రిస్క్ తీసుకున్నా సరే అనుకున్న ఫలితాలు వస్తున్నాయి అంటూ సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! Captain Pat reflects on the game ➕ who clinched the dressing room awards? 👀🏅 Watch as we soak in the post match vibes from our strong win in #RCBvSRH 🧡 pic.twitter.com/Ey7VhksA6B — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 -
పాట్ కమిన్స్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు (ఆస్ట్రేలియా) ప్రతిష్టాత్మక విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను విజ్డెన్ ఈ అవార్డుకు పాట్‌ను ఎంపిక చేసింది. గతేడాది వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా సాధించిన ఘనతలకు గాను పాట్‌ను ఈ అవార్డు వరించింది. కమిన్స్ 2023లో కెప్టెన్‌గా వన్డే వరల్డ్‌కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, యాషెస్ సిరీస్‌లను గెలిచాడు. గతేడాది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సైతం దక్కించుకున్న కమిన్స్.. వ్యక్తిగత ప్రదర్శనల కారణంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్, ఇంగ్లండ్‌తో బాక్సింగ్ డే టెస్ట్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తదితర అవార్డులు అందుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని కూడా విజయవంతంగా ముందుండి నడిపిస్తున్న కమిన్స్.. ఈ సీజన్ వేలంలో 20.5 కోట్ల రికార్డు ధర దక్కించుకున్నాడు. విజ్డెన్.. కమిన్స్‌తో పాటు ఉస్మాన్ ఖ్వాజా, మిచెల్ స్టార్క్, ఆష్లే గార్డ్నర్ (ఆసీస్ మహిళా క్రికెటర్), హ్యారీ బ్రూక్, మార్క్ వుడ్ లాంటి అత్యుత్తమ ప్రతిభావంతులను కూడా సత్కరించింది. 2015 నుంచి విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నవారు.. 2015లో కేన్ విలియమ్సన్ 2016లో విరాట్ కోహ్లి 2017లో విరాట్ కోహ్లి 2018లో విరాట్ కోహ్లి 2019లో బెన్ స్టోక్స్ 2020లో బెన్ స్టోక్స్ 2021లో జో రూట్ 2022లో బెన్ స్టోక్స్ 2023లో పాట్ కమిన్స్ -
IPL2024 RCB vs SRH: హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి..
IPL2024 RCB vs SRH Live Updates: హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి.. ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఆర్సీబీ ఆఖరివరకు పోరాడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాటం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(62), విరాట్ కోహ్లి(42) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కండే రెండు, నటరాజన్ ఒక్క వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ ఆరో వికెట్ డౌన్ 181 పరుగులు వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన మహిపాల్ లామ్రోర్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో దినేష్ కార్తీక్(36), రావత్(5) పరుగులతో ఉన్నారు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి 42 బంతుల్లో 128 పరుగులు కావాలి. క్రీజులో దినేష్ కార్తీక్(16), లామ్రోర్(18) పరుగులతో ఉన్నారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 ఆర్సీబీ వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. 9 ఓవర్ వేసిన మార్కండే బౌలింగ్‌లో పాటిదార్ ఔట్ కాగా.. అనంతరం కమ్మిన్స్ బౌలింగ్‌లో డుప్లెసిస్(62), సౌరవ్ చౌహన్ పెవిలియన్‌కు చేరారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. జాక్స్ ఔట్ 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ఉనద్కట్ బౌలింగ్‌లో విల్ జాక్స్ రనౌటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో ఆర్సీబీ ఫాప్ డుప్లెసిస్(51), పాటిదార్ ఉన్నారు. ఆర్సీబీ తొలి వికెట్ డౌన్.. కోహ్లి ఔట్ 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. చెలరేగి ఆడుతున్న ఆర్సీబీ ఓపెనర్లు.. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి(25), ఫాప్ డుప్లెసిస్(31) పరుగులతో ఉన్నారు. సన్‌రైజర్స్ విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను ఎస్ఆర్హెచ్ సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుమందు ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో తన రికార్డును తానే తిరగరాసింది. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఏకంగా 22 సిక్స్‌లు బాదారు. ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్ 233 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. హెన్రిచ్ క్లాసెన్(31 బంతుల్లో 67, 7 సిక్స్‌లు, 4 ఫోర్లు).. ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 217/2 16 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), మార్క్రమ్(9) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్.. హెడ్ ఔట్ ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హెడ్.. ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 41 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిస్ క్లాసెన్(39), మార్క్రమ్(2) పరుగులతో ఉన్నారు. ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీ.. ట్రావిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లకు హెడ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 38 బంతుల్లో హెడ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 9 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. 102 పరుగులతో హెడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి1 57 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 108 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన ఆభిషేక్ శర్మ.. టాప్లీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(79), క్లాసెన్(1) పరుగులతో ఉన్నారు. దంచి కొడుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు.. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దంచికొడుతున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(33), ట్రావిస్ హెడ్(71) పరుగులతో ఉన్నారు. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ ట్రావిస్ హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, 3సిక్స్‌లతో హెడ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(23), ట్రావిస్ హెడ్(52) పరుగులతో ఉన్నారు. దంచి కొడుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(14), ట్రావిస్ హెడ్(13) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గ్లెన్ మాక్స్వెల్, సిరాజ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. ఆర్సీబీ తుది జట్టులోకి కివీస్ ఫాస్ట్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ వచ్చాడు. సన్‌రైజర్స్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. తుది జట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, విజయ్‌కుమార్ వైషాక్, రీస్ టోప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్ -
అతడొక అద్బుతం.. నాకు మాటలు రావడం లేదు! భువీ కూడా: కమ్మిన్స్
ఐపీఎల్-2024లో భాగంగా ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ సినిమా థ్రిల్లర్‌ను తలిపించింది. ఆఖరి ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. . 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.ఆఖరి ఓవర్లో విజయానికి 29 పరుగులు అవసరం కాగా.. ఏకంగా 27 పరుగులు వచ్చాయి. గత మ్యాచ్ హీరోలు అశుతోష్ శర్మ(33; 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్ సింగ్(46; 25 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్) పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, నటరాజన్, నితీష్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ 64 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ విజయంపై సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించాడు."మరోసారి క్లోజ్ మ్యాచ్‌ను చూడాల్సి వచ్చింది. తొలి 10 ఓవర్లలో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేము మా బోర్డులో 180 పరుగుల స్కోర్‌ను ఉంచడానికి చాలా కష్టపడ్డాము. అనంతరం బౌలింగ్‌లో కూడా మేము మంచి ఆరంభాన్ని పొందాము. భువనేశ్వర్ కొత్త బంతితో అద్బుతం చేశాడు.180 పరుగులు అనేది నా దృష్టిలో మంచి స్కోర్. 150 పైగా పరుగులు చేసి ఓడిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. కానీ 180 ప్లస్ స్కోర్ సాధించి ఓడిపోవడం చాలా తక్కువ సార్లు జరుగుతుంటుంది. కొత్త బంతితో ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయాలనుకున్నాం. భువీ నేను కొత్త బంతితో బౌలింగ్ చేసి వికెట్లు తీయాలన్నదే మా ప్లాన్.మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేశాం. మా జట్టులో లెఫ్ట్ ఆర్మర్లు, రైట్ ఆర్మ్ పేసర్లు చాలా మంది ఉన్నారు. బ్యాటింగ్ పరంగా మేము పటిష్టంగానే ఉన్నాం. కాబట్టి పాజిటివ్ మైండ్‌తో ఆడి విజయాలు సాధించడమే మా లక్ష్యం. ఇక నితీష్ కుమార్ ఒక అద్బుతం. అతడి కోసం ఏమి మాట్లాడాలో కూడా నాకు ఆర్దం కావడం లేదు. సీఎస్కేతో మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్‌ను చూశాం.అందుకే ఈ రోజు మ్యాచ్‌లో అతడికి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి ముందు పంపించాం. మా నమ్మకాన్ని అతడు నిలబెట్టాడు. మేము 180 పైగా పరుగులు సాధించమంటే కారణం అతడే. అదేవిధంగా ఫీల్డ్, బౌలింగ్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడని పోస్ట్‌మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
PBKS vs SRH: ఉత్కంఠపోరులో ఎస్ఆర్హెచ్ గెలుపు..
IPL 2024 PBKS vs SRH Live Updates: పంజాబ్ కింగ్స్‌తో ఆఖరి వరకు జరిగిన ఉత్కంఠపోరులో 2 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఉనద్కట్ వేసిన ఆఖరి ఓవర్లో తమ విజయానికి 29 పరుగులు అవసరమవ్వగా పంజాబ్ బ్యాటర్లు అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ 26 పరుగులు సాధించారు. ఆఖరి వరకు పోరాడనప్పటికి తన జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయారు. పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్(46) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అశుతోష్ శర్మ(15 బంతుల్లో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, నటరాజన్, నితీష్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ 64 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 19 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ 18 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ : 154/6. పంజాబ్ విజయానికి ఆఖరి ఓవర్లో 29 పరుగులు కావాలి. పంజాబ్ ఆరో వికెట్ డౌన్.. జితేష్ శర్మ రూపంలో పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది.19 పరుగులు చేసిన జితేష్.. నితీష్ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 116/6 ఐదో వికెట్ డౌన్.. 91 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన సికిందర్ రజా.. జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 97/5 నాలుగో వికెట్ డౌన్ 58 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శశాంక్ సింగ్ వచ్చాడు. 9 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 58/3 9 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో సామ్ కుర్రాన్(29), సికిందర్ రజా(10) పరుగులతో ఉన్నారు. కష్టాల్లో పంజాబ్.. 20 పరుగులకే 3 వికెట్లు 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శిఖర్ ధావన్ రూపంలో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ధావన్ ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టో డకౌటయ్యాడు. 2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 2/1 పంజాబ్ టార్గెట్ 183 పరుగులు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 37 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అతడితో పాటు అబ్దుల్ సమాద్(25), షాబాజ్ ఆహ్మద్(14) ఆఖరిలో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు సామ్ కుర్రాన్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ డౌన్.. నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 64 పరుగులు చేసిన నితీష్ కుమార్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 156/8 ఎస్ఆర్హెచ్ ఆరో వికెట్ డౌన్.. అబ్దుల్ సమాద్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన అబ్దుల్ సమాద్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16.4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 133/6 నితీష్ కుమార్ ఫిప్టీ.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందున్నాడు. 63 పరుగులతో నితీష్ కుమార్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 15 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 133/5 ఐదో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్ హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన క్లాసెన్.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 111/5. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(41), సమాద్(9) పరుగులతో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్.. త్రిపాఠి ఔట్ 64 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 90/4. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(33), క్లాసెన్(6) పరుగులతో ఉన్నారు. 10 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 61/3 10 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(11), రాహుల్ త్రిపాఠి(10) ఉన్నారు. మూడో వికెట్ డౌన్.. 39 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 40/3 వారెవ్వా అర్ష్‌దీప్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఆర్ష్‌దీప్ సింగ్ బిగ్ షాకిచ్చాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లలో ఎస్ఆర్హెచ్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత ట్రావిస్ హెడ్(21), తర్వాత మార్క్రమ్ డకౌటయ్యాడు. క్రీజులో అభిషేక్ శర్మ నితీష్ శర్మ ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఇటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. తుది జట్లు పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, సికందర్ రజా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ -
SRH: ధోని రావొద్దనే కమిన్స్ ‘కన్నింగ్’ ప్లాన్?!
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కమిన్స్ కెప్టెన్సీని ప్రస్తావిస్తూ.. టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తావా అంటూ ప్రశ్నలు సంధించాడు. ఫలితంగా నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?!... ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్ శుక్రవారం ఉప్పల్ వేదికగా సీఎస్కేతో తలపడింది. సొంతమైదానంలో టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్లో వికెట్ మీద రన్స్ రాబట్టేందుకు సీఎస్కే బ్యాటర్లు ఇబ్బంది పడగా.. పిచ్ పరిస్థితులను రైజర్స్ బౌలర్లు చక్కగా వినియోగించుకున్నారు. సీఎస్కేను 165 పరుగులకే కట్టడి చేయగలిగారు. శివం దూబే ఒక్కడు ధనాధన్ ఇన్నింగ్స్(24 బంతుల్లో 45) ఆడగా.. అతడిని కమిన్స్ తన బౌలింగ్‌లోనే అవుట్ చేశాడు. ఇదిలా ఉంటే.. దూబే స్థానంలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డాడు. ఇక పందొమ్మిదో ఓవర్ నాలుగో బంతికి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో జడ్డూ రనౌట్ కావాల్సింది. అయితే, ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు యత్నించిన జడ్డూ.. ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డు తగిలినట్లుగా కనిపించింది. దీంతో రైజర్స్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్‌కు సిగ్నల్ ఇచ్చాడు. అయితే, కెప్టెన్ కమిన్స్ మాత్రం జడ్డూ విషయంలో అప్పీలు వెనక్కి తీసుకున్నాడు. ఫలితంగా జడ్డూకు లైఫ్ వచ్చింది. ఇక డారిల్ మిచెల్ స్థానంలో మైదానంలోకి వచ్చిన ధోని ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఇదిలా ఉంటే.. జడ్డూ విషయంలో కమిన్స్ వ్యవహారశైలిపై నెట్టింట పెద్ద ఎత్తు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ స్పందిస్తూ.. ‘‘జడేజా అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్ విషయంలో అప్పీలు వెనక్కి తీసుకున్న ప్యాట్ కమిన్స్‌కు రెండు ప్రశ్నలు.. పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్న జడేజాను క్రీజులోనే ఉండనిచ్చి ధోనిని డ్రెసింగ్రూంకే పరిమితం చేసేందుకు పన్నిన వ్యూహమా? ఒకవేళ టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి క్రీజులో ఉన్న సమయంలో కూడా ఇలాగే చేస్తాడా?’’ అని కమిన్స్‌ను ఉద్దేశించి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ధోనిని మైదానంలో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు.. అతడు బ్యాట్ ఝులిపించకుండా ఉండేందుకు ఇలా చేశాడని కైఫ్ పరోక్షంగా కమిన్స్‌ను తప్పుబట్టాడు. అదే సమయంలో.. వరల్డ్‌కప్ లాంటి ఈవెంట్లలో కూడా ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తావా అని ప్రశ్నించాడు. అయితే, కైఫ్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గెలుపు కోసం కెప్టెన్లు తమదైన వ్యూహాలు అమలు చేయడంలో తప్పు లేదు అని కొంతమంది అంటుండగా.. అసలు వరల్డ్‌కప్‌నకు దీనికి సంబంధం ఏమిటని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. Two questions to Pat Cummins on withdrawing the obstructing the field appeal against Jadeja. Was it a tactical call to let a struggling Jadeja be the crease and keep Dhoni indoors? Would he have done the same if it was Virat Kohli at World T20? — Mohammad Kaif (@MohammadKaif) April 5, 2024 మరికొందరేమో.. ‘‘ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కెప్టెన్ మార్ష్. కమిన్స్ కాదు. మీరు కావాలనే విరాట్ కోహ్లి పేరును ప్రస్తావించి హైలైట్ అవ్వాలని చూస్తున్నారు కదా’’అని సెటైర్లు వేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నైపై సన్‌రైజర్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: #Kavya Maran: పట్టపగ్గాల్లేని సంతోషం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి? Obstructing or not? 🤔 Skipper Pat Cummins opts not to appeal 👏👏#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/l85UXQEa4S — JioCinema (@JioCinema) April 5, 2024 Joy for the Orange Army 🧡 as they register their second home win of the season 👌👌@SunRisers climb to number 5⃣ on the Points Table 😎 Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/QWS4n2Ih8D — IndianPremierLeague (@IPL) April 5, 2024 -
#Dhoni: కమిన్స్‌కు ‘షాకిచ్చిన’ ప్రేక్షకులు.. అట్లుంటది ధోనితోని!
IPL 2024- SRH vs CSK- Dhoni Entry Viral Video: మహేంద్ర సింగ్ ధోని.. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. ఒక ఎమోషన్.. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు హైదరాబాద్ ప్రేక్షకులు. తలా మైదానంలో అడుగుపెట్టగానే ఆరెంజ్ ఆర్మీ సైతం ధోని నామస్మరణతో అభిమానం చాటుకుంది. ఇక సీఎస్కే ఫ్యాన్స్ తమ జెండాలు రెపరెపలాడిస్తూ ధోనికి ఘన స్వాగతం పలికారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం ధోని ఆగమనాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- సన్‌రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఈ అందమైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. Overwhelming Yellove! Chaala Thanks, Hyderabad! 🥳💛#SRHvCSK #WhistlePodu 🦁💛 pic.twitter.com/nZIYuBrbdA — Chennai Super Kings (@ChennaiIPL) April 5, 2024 ఇక ధోని క్రేజ్‌ను చూసి సన్‌రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ ఆశ్చర్యపోయాడు. తమ సొంతమైదానంలో సీఎస్కే స్టార్‌కు ప్రేక్షకులు స్వాగతం పలికిన తీరును తాను ముందెన్నడూ చూడలేదన్నాడు. ధోని బ్యాటింగ్‌కు రాగానే.. మైదానం దద్దరిల్లిపోయిందని.. ఇంత వరకూ తాను అంత శబ్దం ఎప్పుడూ వినలేదంటూ ధోని క్రేజ్‌కు ఫిదా అయ్యాడు. కాగా శుక్రవారం ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. సీఎస్కేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్లో వికెట్‌పై పరుగులు తీసేందుకు చెన్నై బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (12), రుతురాజ్ గైక్వాడ్(26) నిరాశపరచగా.. అజింక్య రహానే(35) నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, శివం దూబే మాత్రం(24 బంతుల్లో 45) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఐదో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా(23 బంతుల్లో 31) నాటౌట్‌గా నిలవగా.. ఏడో స్థానంలో డారిల్ మిచెల్(13) దిగడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, నటరాజన్ బౌలింగ్‌లో మిచెల్ అవుట్ కాగానే ధోని ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. From Orange 🧡, To Yellow 💛 For MS Dhoni 🫶🏻 ft. Hyderabad #TATAIPL | #SRHvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/iGYeoxxCvi — IndianPremierLeague (@IPL) April 6, 2024 తలా అలా గ్రౌండ్లో అడుగుపెట్టగానే కేరింతలతో ఉప్పల్ స్టేడియం ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ధోని ఒక్క పరుగు చేసి అజేయంగా నిలిచాడు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సీఎస్కే 165 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఏదేమైనా ధోని ఎంట్రీ ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. వైజాగ్‌లో వింటేజ్ ధోని విధ్వంసం విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్-2024లో ధోని తొలిసారి బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు రాబట్టాడు. There is nothing beyond Thala's reach 🔥💪 #IPLonJioCinema #Dhoni #TATAIPL #DCvCSK pic.twitter.com/SpDWksFDLO — JioCinema (@JioCinema) March 31, 2024 చదవండి: #Kavya Maran: పట్టపగ్గాల్లేని సంతోషం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి? 2024? 2005? 🤔#DCvCSK #WhistlePodu #Yellove🦁💛pic.twitter.com/T6tWdWO5lh — Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వైరల్
IPL 2024- SRH Crush CSK By 6 Wickets: ఐపీఎల్-2024లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి విజయ గర్జన చేసింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించి ఉప్పల్‌లో జయభేరి మోగించింది. హోం గ్రౌండ్లో వరుసగా రెండో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రైజర్స్.. సీఎస్కేను 165 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగి పదకొండు బంతులు మిగిలి ఉండగానే పని పూర్తి చేసింది. ఆరు వికెట్ల తేడాతో సీఎస్కేపై విజయం సాధించింది. Joy for the Orange Army 🧡 as they register their second home win of the season 👌👌@SunRisers climb to number 5⃣ on the Points Table 😎 Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/QWS4n2Ih8D — IndianPremierLeague (@IPL) April 5, 2024 ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ పిచ్‌పై పరుగులు రాబట్టేందుకు సీఎస్కే బ్యాటర్లు కష్టపడుతున్న వేళ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. మొత్తంగా 23 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 31 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. నిజానికి 19వ ఓవర్ నాలుగో బంతికే జడ్డూ అవుట్ కావాల్సింది. సన్‌రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన జడేజా విఫలమయ్యాడు. పరుగు కోసం క్రీజును వీడిన జడ్డూ.. భువీ చేతికి బంతి చిక్కడాన్ని గమనించి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రనౌట్ కాకుండా.. ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డుతగిలినట్లు కనిపించింది. విషయాన్ని గమనించిన సన్‌రైజర్స్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ నిబంధనల ప్రకారం.. ‘‘అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్’’కు సిగ్నల్ ఇచ్చాడు. అంపైర్లు సైతం ఈ విషయం గురించి స్పష్టత కోసం థర్డ్ అంపైర్‌ను సంప్రదించేందుకు సిద్ధమయ్యారు. అయితే, అనూహ్యంగా సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జడేజా విషయంలో అప్పీలును వెనక్కి తీసుకున్నాడు. ఫలితంగా లైఫ్ పొందిన జడ్డూ ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. Obstructing or not? 🤔 Skipper Pat Cummins opts not to appeal 👏👏#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/l85UXQEa4S — JioCinema (@JioCinema) April 5, 2024 ఈ క్రమంలో జడ్డూ ‘అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్’ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్.. ప్యాట్ కమిన్స్ క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాడంటూ ప్రశంసిస్తున్నారు. అయితే, మరికొంత మంది నెటిజన్లు మాత్రం ధోని ముందుగా బ్యాటింగ్‌కు రావడాన్ని అడ్డుకునేందుకే కమిన్స్.. జడ్డూ విషయంలో అప్పీలు వెనక్కి తీసుకున్నాడని అభిప్రాయపడుతున్నారు. అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్? ఫీల్డింగ్ చేస్తున్న జట్టుకు తన మాటలు లేదంటే చర్యల ద్వారా ఒక బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా అడ్డుతగిలితే.. అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్ నిబంధన కింద అతడిని అవుట్‌గా ప్రకటిస్తారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SRH: అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే.. సంతోషంగా ఉంది
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో అద్బుత విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సీఎస్కేను ఆరెంజ్ ఆర్మీ చిత్తు చేసింది. తొలుత బౌలింగ్‌లో అదరగొట్టిన ఎస్ఆర్హెచ్.. అనంతరం బ్యాటింగ్‌లో దుమ్ములేపింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే.. ఎస్ఆర్హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(45) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రహానే(35), జడేజా(31) పరుగులతో రాణించాడు.. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, పాట్ కమ్మిన్స్, జయ్‌దేవ్ ఉనద్కట్, షాబాజ్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 18.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఐడైన్ మార్క్రమ్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(37), ట్రావిస్ హెడ్(31) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. తమ హోం గ్రౌండ్లో మరో విజయం సాధించడం సంతోషంగా ఉందని కమ్మిన్స్ తెలిపాడు. "హోం గ్రౌండ్లో విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా ఖాతాలో రెండు పాయింట్లు వచ్చి చేరాయి. ఈ రోజు పిచ్ కాస్త భిన్నంగా ఉంది. ఆట సాగుతున్న కొద్దీ పిచ్ కొంచెం నెమ్మదించింది. శివమ్ దూబే మాత్రం స్పిన్నర్లను ఎటాక్ చేశాడు. అందుకే స్పిన్నర్లతో తమ ఫుల్ ఓవర్ల కోటా వేయించలేదు. వికెట్ నెమ్మదిగా ఉంది కాబట్టి ఆఫ్కట్టర్లతో ప్రత్యర్ది బ్యాటర్లను కట్టడి చేయాలనుకున్నాం. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేశాము. మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. అదే విధంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మాకు మంచి ఆరంభం ఇచ్చారు. అభిషేక్ కోసం ఎంత చెప్పిన తక్కుదే. ఆ తర్వాత మార్క్రమ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ రోజు స్టేడియం హౌస్ ఫుల్ అయిపోయింది. ఎంఎస్ ధోని బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయిందని" కమ్మిన్స్ పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. Joy for the Orange Army 🧡 as they register their second home win of the season 👌👌@SunRisers climb to number 5⃣ on the Points Table 😎 Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/QWS4n2Ih8D — IndianPremierLeague (@IPL) April 5, 2024 -
అదే మా కొంపముంచింది.. లేదంటేనా మాదే విజయం: కమ్మిన్స్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి చవి చూసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్,బౌలింగ్ రెండింటిలోనూ సన్‌రైజర్స్ విఫలమైంది. 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. ఇది ఎస్ఆర్హెచ్కు రెండో ఓటమి కావడం గమనార్హం. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. బ్యాటింగ్ పరంగా తాము విఫలమయ్యామని కమ్మిన్స్ తెలిపాడు. "ఆటలో గెలుపుటములు సహజం. ఈ మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడాం. మేము తొలుత బ్యాటింగ్‌లో 10 నుంచి 15 పరుగులు అదనంగా చేసి ఉంటే పరిస్ధితి మరో విధంగా ఉండేది. కానీ గుజరాత్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మేము వరుస క్రమంలో వికెట్ల కోల్పోయాం. కనీసంలో మాలో ఎవరో ఒకరైనా ఫిప్టీ ప్లస్ స్కోర్ సాధించింటే బాగుండేది. తొలి రెండు మ్యాచ్‌ల్లో మేము బాగా బ్యాటింగ్ చేశాము. కానీ ఈ మ్యాచ్‌లో మా ప్రణాళిలకను అమలు చేయడంలో విఫలమయ్యాం. ఈ రోజు పిచ్ కూడా బాగానే ఉంది. తొలుత వికెట్ కొంచెం స్లోగా ఉంటుందని భావించాము. కానీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ ఒకేలా ఉంది. మా తర్వాతి మ్యాచ్‌ల్లో తిరిగి పుంజుకుంటామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. ఎస్ఆర్హెచ్ తమ తర్వాతి మ్యాచ్‌లో ఏప్రిల్ 5న హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. -
GT vs SRH: విధ్వంసకర బ్యాటింగ్.. మరోసారి మోత మోగేనా?
IPL 2024 GT vs SRH: సొంత గడ్డపై రికార్డుల మోత మోగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్త ఉత్సాహంతో అహ్మదాబాద్‌లో అడుగుపెట్టింది. ఐపీఎల్-2024లో తమ మూడో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో పోరుకు సిద్ధమైంది. కాగా ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఇప్పటిదాకా సన్‌రైజర్స్- టైటాన్స్ చెరో విజయం నమోదు చేశాయి. తమ ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(277) నమోదు చేసి.. లక్ష్యాన్ని కాపాడుకుంది. ముంబైని 31 పరుగుల తేడాతో ఓడించి తొలి గెలుపు నమోదు చేసింది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచి.. తదుపరి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడింది. ఇప్పుడు సొంతమైదానంలో సన్‌రైజర్స్‌తో మరుసటి మ్యాచ్‌లో తలపడనుంది. ఇక ఇప్పటి వరకు ఇరు జట్ల ముఖాముఖి రికార్డు గమనిస్తే.. ఎదురుపడిన మూడు సందర్భాల్లో సన్‌రైజర్స్ టైటాన్స్ చేతిలో రెండుసార్లు ఓటమిని చవిచూసి.. ఒక్కసారి గెలిచింది. అయితే, ఇప్పుడు ఇరుజట్ల కెప్టెన్లు మారారు. సన్‌రైజర్స్‌కు ప్యాట్ కమిన్స్.. టైటాన్స్‌కు శుబ్‌మన్ గిల్ సారథులుగా వచ్చారు. ఇదిలా ఉంటే.. ముంబైతో మ్యాచ్‌లో దంచికొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అదిరే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. గత రెండు మ్యాచ్‌లలోనూ వీరిద్దరు మెరుపు ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి బౌలర్లను తిప్పలు పెట్టారు. కోల్‌కతాతో మ్యాచ్‌లో అభిషేక్ 19 బంతుల్లో 32, క్లాసెన్ 29 బంతుల్లోనే ఏకంగా 63 పరుగులు సాధించారు. ఇక ముంబై ఆటగాళ్ల బౌలింగ్‌ను ఎలా ఊచకోత కోశారో తెలిసిందే. అభిషేక్ 23 బంతుల్లోనే 63, క్లాసెన్ 34 బంతుల్లోనే 80(నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరికి తోడు టాపార్డర్‌లో ట్రవిస్ హెడ్, ఐడెన్ మార్క్రమ్ కూడా రాణిస్తుండటం సన్‌రైజర్స్‌కు సానుకూలాంశం. ఇక బౌలింగ్ విభాగంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు మరో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా తప్పకుండా ప్రభావం చూపగలడు. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఇంత వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. గత సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన గిల్.. తాజా ఎడిషన్ తొలి మ్యాచ్‌లో 22 బంతుల్లో 31 పరుగులతో పర్వాలేదనిపించినా.. రెండో మ్యాచ్‌లో 8 పరుగులకే పరిమితమై నిరాశపరిచాడు. టాపార్డర్‌లో సాయి సుదర్శన్ తప్ప ఇంకెవరూ ఇప్పటి వరకు బ్యాట్ ఝులిపించలేకపోయారు. ఇక మహ్మద్ షమీ గాయం కారణంగా దూరం కావడం, హార్దిక్ పాండ్యా జట్టును వీడటంతో బౌలింగ్ విభాగం బలహీనమైంది. ఉమేశ్ యాదవ్ రాణిస్తున్నా నిలకడగా ఆడాల్సి ఉంది. రషీద్ ఖాన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్ రాణించడం సానుకూలాంశం. తుదిజట్లు అంచనా గుజరాత్ టైటాన్స్ శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, ఆర్. సాయికిషోర్. ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్ సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, మాథ్యూ వేడ్, షారుఖ్ ఖాన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రవిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్. ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్: టి. నటరాజన్, ట్రవిస్ హెడ్, ఉమ్రాన్ మాలిక్, ఫజల్హక్ ఫారూకీ. చదవండి: #Mayank Yadav: నేను ఆరాధించే ఫాస్ట్ బౌలర్ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్‌గన్’ -
Kavya Maran Photos: సన్‌రైజర్స్ గెలుపు.. ఆనందంతో గంతులేసిన కావ్య పాప (ఫొటోలు)
-
IPL 2024 SRH Vs MI Photos: సొంతగడ్డపై సన్‌రైజర్స్ విజయగర్జన (ఫొటోలు)
-
IPL 2024: సన్‌రైజర్స్ చేతిలో చిత్తైన ముంబై ఇండియన్స్
IPL 2024 SRH VS MI Match Highlights And Updates: బ్యాటర్ల ఊచకోత.. ముంబైను చిత్తు చేసిన సన్‌రైజర్స్ ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు వీరంగం సృష్టించారు. ఫలితంగా ఆరెంజ్ ఆర్మీ 31 పరుగుల తేడాతో ముంబైను చిత్తు చేయడంతో పాటు లీగ్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 80 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై 12 ఓవర్ల వరకు సన్‌రైజర్స్ ధీటుగా బదులిచ్చింది. అయితే ఆ తర్వాత స్కోర్ నెమ్మదించడంతో ముంబై ఓటమి ఖరారైంది. ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్ శర్మ (12 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), నమన్ ధిర్ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్), రొమారియో షెపర్డ్ (6 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సన్‌రైజర్స్ శిబిరంలో కలకలం సృష్టించారు. ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. ముంబై గెలుపుకు 30 బంతుల్లో 93 పరుగులు అవసరం ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే 30 బంతుల్లో 93 పరుగులు చేయాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా (20), టిమ్ డేవిడ్ క్రీజ్‌లో ఉన్నారు. 15 ఓవర్ తొలి బంతికే కమిన్స్ తిలక్ వర్మ (64) ఔట్ చేశాడు. 15 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 185/గా ఉంది. రఫ్ఫాడిస్తున్న తిలక్.. 10 ఓవర్లలో ముంబై స్కోర్ 141/2 తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. షాబాజ్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో తిలక్ 3 సిక్సర్లు బాది 22 పరుగులు పిండుకున్నాడు. తిలక్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 146/2గా ఉంది. తిలక్‌తో (52) పాటు నమన్ ధిర్ (26) క్రీజ్‌లో ఉన్నాడు. 7.3 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన ముంబై ఇండియన్స్ భారీ లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌కు ధీటుగా ముంబై ఇండియన్స్ బదులిస్తుంది. ముంబై 7.3 ఓవర్లలనే 100 పరుగుల మార్కును తాకింది. ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (26) ఉతికి ఆరేసి ఔట్ కాగా.. నమన్ ధిర్ (16), తిలక్ వర్మ (19) క్రీజ్‌లో ఉన్నారు. 8 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 102/గా ఉంది. టార్గెట్ 278.. ధీటుగా బదులిస్తున్న ముంబై 278 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ధీటుగా బదులిస్తుంది. ఆ జట్టు 5 ఓవర్ల అనంతరం 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (26) ఉతికి ఆరేసి ఔట్ కాగా.. నమన్ ధిర్ (2), తిలక్ వర్మ (1) క్రీజ్‌లో ఉన్నారు. సన్‌రైజర్స్ బ్యాటర్ల వీరంగం.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు ముంబై ఇండియన్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు వీరంగం సృష్టించడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు సుడిగాలి అర్దశతకాలు బాదారు. ట్రవిస్ హెడ్ 24 బంతుల్లో 62, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63, హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లో 80 పరుగులు (నాటౌట్) చేశారు. మార్క్రమ్ సైతం తానేమీ తక్కువ కాదని 28 బంతుల్లో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన క్లాసెన్ హెన్రిచ్ క్లాసెన్ కేవలం 23 బంతుల్లో బౌండరీ, 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 18 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 243/3గా ఉంది. క్లాసెన్‌తో పాటు మార్క్రమ్ (40) క్రీజ్‌లో ఉన్నాడు. 14.4 ఓవర్లలోనే 200 పరుగులు పూర్తి చేసిన సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ కేవలం 14.4 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును తాకింది. మార్క్రమ్ (31), క్లాసెన్ (26) క్రీజ్‌లో ఉన్నారు. 12 ఓవర్లలోనే 173 పరుగులు చేసిన సన్‌రైజర్స్ 11వ ఓవర్ ఆఖరి బంతికి అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఔటయ్యాడు. పియూశ్ చావ్లా బౌలింగ్‌లో నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 173/3గా ఉంది. మార్క్రమ్ (21), క్లాసెన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అభిషేక్ (54), మార్క్రమ్ (13) క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ అనంతరం ఔటైన హెడ్.. పెను విధ్వంసం సృష్టించిన అనంతరం హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కొయెట్జీ బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 117/2గా ఉంది. అభిషేక్ (32), మార్క్రమ్ (4) క్రీజ్‌లో ఉన్నాడు. పవర్ ప్లేలో (81/1) సన్‌రైజర్స్‌కు ఇదే అత్యధిక స్కోర్. 7 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ ఆటగాళ్లు శివాలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ట్రవిస్ హెడ్ (22 బంతుల్లో 62 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. హెడ్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో అభిషేక్ శర్మ సైతం చెలరేగిపోయాడు. పియూశ్ చావ్లా వేసిన ఆ ఓవర్లో అభిషేక్ మూడు సిక్సర్లు బాదాడు. తొలి బంతికే వికెట్ తీసిన హార్దిక్ 4.1 ఓవర్: హార్దిక్ పాండ్యా తన స్పెల్ తొలి బంతికే వికెట్ తీశాడు. టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ (11) ఔటయ్యాడు. వీరంగం సృష్టిస్తున్న ట్రవిస్ హెడ్ సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ వీరంగం సృష్టిస్తున్నాడు. కేవలం 10 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. యువ పేసర్ మపాకా వేసిన మూడో ఓవర్లోనే హెడ్ శివాలెత్తిపోయాడు. ఈ ఓవర్లో హెడ్ వరుసగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 22 పరుగులు పిండుకున్నాడు. 4 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. హెడ్ (32),మయాంక్ అగర్వాల్ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 27) సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30య గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో ఇరు జట్లు తమతమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిపాలై బోణీ గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయి. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఓటమిపాలు కాగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయంపాలైంది. తొలి మ్యాచ్‌లో దెబ్బతిన్న ఇరు జట్లు బలాబలాల విషయంలో సమతూకంగా ఉండటంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మాజీ సారధి రోహిత్ శర్మకు ఆ జట్టు తరఫున 200వ మ్యాచ్ కావడం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రవిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, షమ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేన మపాకా ముంబై ఇండియన్స్ సబ్స్: డెవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెపర్డ్, మొహమ్మద్ నబీ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా సన్‌రైజర్స్ హైదరాబాద్ సబ్‌లు: నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, ఉపేంద్ర యాదవ్ -
#SRHvsMI: తొలి గెలుపు కోసం.. కమిన్స్, పాండ్యాకు కఠిన పరీక్ష!
ఐపీఎల్-2024ను ఓటములతో ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ రెండు జట్ల మధ్య పోరుకు ఉప్పల్ వేదిక కానుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం రాత్రి మ్యాచ్ జరుగనుంది. తమ ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓడిన సన్‌రైజర్స్ సొంతమైదానంలో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి చవిచూసిన హార్దిక్ పాండ్యాకు ఇది రెండో మ్యాచ్. గతంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్‌కు మంచి రికార్డు ఉన్న నేపథ్యంలో హార్దిక్‌కు ఉప్పల్ మ్యాచ్ మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. మరి ఎస్ఎఆర్హెచ్- ఎంఐ ముఖాముఖి రికార్డులు, రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇరు జట్ల ట్రాక్ రికార్డు, తుది జట్ల అంచనా తదితర వివరాలు గమనిద్దాం. ముంబైదే పైచేయి ఐపీఎల్లో సన్‌రైజర్స్- ముంబై ఇప్పటివరకు 21 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో 12 సార్లు ముంబై గెలుపొందగా.. హైదరాబాద్ తొమ్మిదిసార్లు విజయం సాధించింది. గత ఐదు మ్యాచ్‌లలో మాత్రం సన్‌రైజర్స్ రికార్డు పేలవంగా ఉంది. ఐదింట కేవలం ఒక్క మ్యాచ్‌లోనే రైజర్స్ ముంబైపై పైచేయి సాధించగలిగింది. రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇలా.. ఇక రాజీవ్ గాంధీ స్టేడియంలో ఎస్ఆర్హెచ్- ఎంఐ ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో చెరో నాలుగు గెలిచి సమంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ ఇప్పటి వరకు 51 మ్యాచ్‌లు ఆడగా.. 30 విజయాలు సాధించి.. ఇరవై మ్యాచ్‌లలో ఓడింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. మరోవైపు.. ముంబై ఇక్కడ ఓవరాల్‌గా ఆడిన 12 మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి.. నాలుగు ఓడిపోయింది. తుదిజట్ల అంచనా: సన్‌రైజర్స్ హైదరాబాద్ మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, తంగరసు నటరాజన్, మయాంక్ మార్కండే. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫక. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే.. సన్‌రైజర్స్- ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్(టీవీ), జియో సినిమా(డిజిటల్)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. చదవండి: #CSKvsGT: శుబ్‌మన్ గిల్‌కు భారీ జరిమానా.. కారణం ఇదే -
SRH: సంతోషంగా ఉంది.. గెలుపు మనదే: కమిన్స్
ఐపీఎల్-2024 ఎడిషన్‌లో తొలిసారి ఆతిథ్యం ఇచ్చేందుకు ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య బుధవారం నాటి మ్యాచ్ కోసం ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఇరు జట్లు ఉప్పల్ మైదానంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. కాగా పదిహేడో సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. THE CRAZE OF ROHIT SHARMA AT HYDERABAD...!!!! - The Hitman is everyone's favourite, The Icon! 🙌 pic.twitter.com/c5rVEwtP9r — CricketMAN2 (@ImTanujSingh) March 26, 2024 ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ బృందం ఆఖరి వరకు పోరాడి కేకేఆర్ చేతిలో ఓటమిపాలైంది. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధైర్యంగా ముందడుగు వేసినా.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో రైజర్స్‌కు పరాజయమే ఎదురైంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన నాటి మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపొంది శుభారంభం చేసింది. ఈ క్రమంలో సొంతగడ్డపై మ్యాచ్‌లోనైనా గెలిచి తిరిగి రేసులో అడుగుపెట్టాలని సన్‌రైజర్స్ పట్టుదలగా ఉంది. తదుపరి ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గెలిచేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘తొలి మ్యాచ్‌లో విజయానికి చాలా చేరువగా వచ్చాం. కానీ అనూహ్యంగా ఓడిపోయాం. అయితే, రేపటి మ్యాచ్‌లో మాత్రం కొత్త వ్యూహాలతో బరిలోకి దిగబోతున్నాం. సొంతమైదానంలో కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది’’ అని ధీమా వ్యక్తం చేశాడు. అదే విధంగా.. తమ జట్టు మొత్తం అభిమానులతో మమేకమైందన్న కమిన్స్.. వారి ప్రేమను పొందడం సంతోషంగా ఉందన్నాడు. తమకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తున్న ఆరెంజ్ ఆర్మీని కలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. కాగా ముంబై ఇండియన్స్ కూడా సీజన్ తొలి మ్యాచ్‌లో ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం నాటి ఉప్పల్ మ్యాచ్ ఇరుజట్లకు కీలకంగా మారింది. ఫలితంగా ఓ హైవోల్టేజీ మ్యాచ్‌కు ఆస్కారం ఉందంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Here’s to a memorable event, #OrangeArmy 🧡🤩 Watch the full SRH Meet & Greet event on our YT channel! 🔗 https://t.co/uT7nG7C5bH 📲#PlayWithFire pic.twitter.com/QYAAi9bHiV — SunRisers Hyderabad (@SunRisers) March 26, 2024 -
SRH Vs KKR: తుదిజట్టులో వీరికే చోటు!.. పైచేయి ఎవరిదంటే?
గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడుతందా అన్నట్లుగా ఉంది సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి. 2016లో టైటిల్ గెలిచిన రైజర్స్ ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రాణించలేకపోయింది. తొలి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్ పుణ్యమా అని 2020లో మూడో స్థానంతో ముగించినా.. ఆ తర్వాత వరుసగా ఎనిమిది, ఎనిమిది, పది స్థానాల్లో నిలిచి విమర్శలు మూటగట్టుకుంది. ఇప్పుడిక ఐపీఎల్-2024 సమరానికి సిద్ధమైంది. కొత్త కోచ్ డేనియల్ వెటోరీ మార్గదర్శనం, కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌తో ఈ సీజన్‌ను ఆరంభించనుంది. మరోవైపు.. ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేయనున్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్, రెండుసార్లు కోల్‌కతాను విజేతగా నిలిపిన గౌతం గంభీర్ కేకేఆర్ మెంటార్ అవతారంలో కనిపించనున్నాడు. మరి ఈ పోరులో ఎవరిది పైచేయి అవుతుందో!? ఇరు జట్ల అంచనా, ముఖాముఖి రికార్డులు గమనిద్దామా?! ముఖాముఖి రికార్డులు ఎస్ఆర్హెచ్- కేకేఆర్ ఇప్పటి వరకు 25సార్లు ఎదురుపడగా.. కేకేఆర్ 16 మ్యాచ్‌లలో గెలవగా.. రైజర్స్ కేవలం తొమ్మిదిసార్లు మాత్రమే విజయం సాధించింది. గత ఏడు మ్యాచ్‌లలో రైజర్స్ కేవలం రెండుసార్లు గెలవగా.. కేకేఆర్ ఐదుసార్లు పైచేయి సాధించింది. ►2023 – 23 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలుపు ►2023 – 5 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం ►2022 – 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ గెలుపు ►2022 – 54 పరుగుల తేడాతో కేకేఆర్ జయభేరి ►2021 – 10 పరుగుల తేడాతో కేకేఆర్ గెలుపు ►2021 – ఆరు వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం ►2020 – ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపు సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు(అంచనా) మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ , హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), ఉపేంద్ర యాదవ్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్, టి.నటరాజన్, భువనేశ్వర్ కుమార్. కోల్‌కతా నైట్ రైడర్స్ తుదిజట్టు(అంచనా) ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, రహ్మనుల్లా గుర్బాజ్. చదవండి: IPL 2024: ఆర్సీబీతో మ్యాచ్ అంటే శివాలెత్తిపోతాడు.. ఇప్పటికీ మేము నాటౌట్! -
SRH: మా జట్టు సూపర్.. దూకుడుగా ముందుకొస్తాం: కమిన్స్
ఐపీఎల్-2024లో దూకుడైన ఆటతో ముందుకు వస్తామంటున్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్. తాజా ఎడిషన్‌ను గెలుపుతో మొదలుపెట్టి శుభారంభంతో ఆరెంజ్ ఆర్మీని ఖుషీ చేస్తామని పేర్కొన్నాడు. గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న ఎస్ఆర్హెచ్ ఈసారి పలు మార్పులతో బరిలోకి దిగనుంది. వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా స్థానంలో న్యూజిలాండ్ దిగ్గజ స్పిన్నర్ డానియెల్ వెటోరిని హెడ్‌కోచ్‌గా నియమించింది. అదే విధంగా సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్ స్థానంలో డబ్ల్యూటీసీ 2021-23, వన్డే వరల్డ్‌కప్-2023 విజేత, ఆసీస్ సారథి కమిన్స్‌కు పగ్గాలు అప్పగించింది. మినీ వేలంలో ఏకంగా రూ. 20. 50 కోట్లు ఖర్చు చేసి మరీ ఈ పేస్ బౌలర్‌ను కొనుగోలు చేసింది. ఇక మార్చి 22న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభం కానుండగా.. మార్చి 23న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘శుభారంభం కోసం ఎదురు చూస్తున్నాం. ఏదేమైనా టీ20 ఫార్మాట్ ఆడటం కాస్త కష్టంగానే ఉంటుంది. కేకేఆర్‌కు మంచి జట్టు ఉంది. అయితే, మేము కూడా తక్కువేమీ కాదు. దూకుడైన ఆటతో తాజా సీజన్‌ను ఆరంభించాలని చూస్తున్నాం. మా జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల సమ్మేళనం. భువీ ఉన్నాడు. గతేడాది మార్క్రమ్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. వీరితో పాటు అభిషేక్, ఉమ్రాన్ మాలిక్ వంటి యంగ్ టాలెంట్‌కు కూడా కొదువలేదు. కొత్త సభ్యులతో కలిసి ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు. కొత్త సీజన్ కోసం అభిమానులు సిద్ధంగా ఉండాలంటూ ఆరెంజ్ ఆర్మీకి కమిన్స్ పిలుపునిచ్చాడు. 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐂𝐮𝐦𝐦𝐢𝐧𝐬’ 𝐟𝐢𝐫𝐬𝐭 𝐝𝐚𝐲 𝐚𝐬 𝐚 𝐑𝐢𝐬𝐞𝐫 🤩🧡 pic.twitter.com/JWSJ40WwsF — SunRisers Hyderabad (@SunRisers) March 21, 2024 -
IPL 2024: కేక పుట్టిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త పాట
ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త పాటను ఇవాళ (మార్చి 20) విడుదల చేసింది. క్యాచీ ట్యూన్ కలిగిన ఈ పాట "సన్‌రైజర్స్ మేము బ్రో పక్కా ఇంకో రేంజ్ బ్రో.." అంటూ సాగుతుంది. ఈ పాటలో సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్, మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్, విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్, కొత్త ఆటగాడు ట్రవిస్ హెడ్, భారత ఆటగాళ్లు భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ అగర్వాల్, జయదేవ్ ఉనద్కత్ తదితర ఆటగాళ్లు కొత్త జెర్సీలు ధరించి బీట్‌కు తగ్గట్టుగా చిందేశారు. సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్న ఈ పాట ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. 𝑺𝒖𝒏𝑹𝒊𝒔𝒆𝒓𝒔 𝒎𝒆𝒎𝒖 𝒃𝒓𝒐, 𝑷𝒂𝒌𝒌𝒂 𝒊𝒏𝒌𝒐 𝒓𝒂𝒏𝒈𝒆 𝒃𝒓𝒐🧡 Our new anthem is here to set your playlist on fire🔥#SRHAnthem2024 #PlayWithFire #OrangeArmy pic.twitter.com/U4xRxhYfGv — SunRisers Hyderabad (@SunRisers) March 20, 2024 కాగా, ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీతో తలపడుతుంది. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ కేకేఆర్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, జయదేవ్ ఉనాద్కట్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్. తొలి విడత షెడ్యూల్లో సన్‌రైజర్స్ ఆడే మ్యాచ్‌ల వివరాలు.. మార్చి 23 (శనివారం): కోల్‌కతాలో కేకేఆర్‌తో (రాత్రి 7:30 గంటలకు) మార్చి 27 (బుధవారం): హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో (రాత్రి 7:30) మార్చి 31 (ఆదివారం): అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో (మధ్యాహ్నం 3:30 గంటలకు) ఏప్రిల్ 5 (శుక్రవారం): హైదరాబాద్‌లో సీఎస్కే (రాత్రి 7:30 గంటలకు) -
SRH: రెండుసార్లు చాంపియన్‌గా నిలబెడితే ఇలా చేస్తారా? షాకయ్యా
SRH- IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్పు నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐడెన్ మార్క్రమ్నే సారథిగా కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇందుకు గల కారణాన్ని కూడా అశూ వెల్లడించాడు. గత మూడు సీజన్లుగా చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీ పడుతోంది సన్‌రైజర్స్. డేవిడ్ వార్నర్ తర్వాత ఎంత మంది కెప్టెన్లను మార్చినా జట్టు తలరాతను మాత్రం మార్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 వేలంలో వ్యూహాత్మకంగా పావులు కదిపింది. రూ. 20. 50 కోట్ల భారీ ధరకు ఆస్ట్రేలియా కెప్టెన్, వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ప్యాట్ కమిన్స్‌ను కొనుగోలు చేసింది. గత ఎడిషన్‌లో రైజర్స్ జట్టును ముందుకు నడిపించిన ఐడెన్ మార్క్రమ్ స్థానంలో సారథిగా నియమించింది. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణయం సరైంది కాదేమోనని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ అరంగేట్ర, తాజా సీజన్లో సన్‌రైజర్స్ ఈస్ట్రర్న్కేప్ను చాంపియన్‌గా నిలబెట్టిన మార్క్రమ్పై వేటు వేయకుండా ఉండాల్సిందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ వరుసగా రెండు టైటిళ్లు గెలిచింది. అత్యద్బుతమైన జట్టుతో ట్రోఫీలు అందుకుంది. కానీ ఇక్కడ మార్క్రమ్ను కాదని వాళ్లు ప్యాట్ కమిన్స్‌ను కెప్టెన్ చేశారు. నిజంగా ఇది షాకింగ్‌గా అనిపించింది. మార్క్రమ్నే సారథిగా కొనసాగిస్తారని ఊహించాను. సౌతాఫ్రికాలో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అత్యద్బుత ప్రదర్శన కనబరిచాడు. కానీ ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. కమిన్స్‌ను కెప్టెన్‌గా ప్రకటించినందు వల్ల తుదిజట్టు కూర్పులో రైజర్స్ కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ట్రవిస్ హెడ్‌ను బ్యాకప్‌గా ఉపయోగించుకున్నా.. మార్క్రమ్, హెన్రిచ్‌క్లాసెన్, వనిందు హసరంగలను ప్రధాన ప్లేయర్లుగా ఆడించాల్సి ఉంటుంది. ఒకవేళ హసరంగ లేకుంటే కొన్ని వేదికల్లో ఫజల్హక్ ఫారూకీ లేదంటే మార్కోజాన్సెన్లను ఆడించే అవకాశం ఉంది. ఏదేమైనా విదేశీ ప్లేయర్లను ఆడించే విషయంలో రైజర్స్‌కు ఇబ్బందులు తప్పవు’’ అని రాజస్తాన్ రాయల్స్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. కాగా మార్చి 23న కేకేఆర్‌తో సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: పేరు మార్చుకున్న ఆర్సీబీ... కన్నడలో మాట్లాడిన కోహ్లి.. వీడియో -
IPL 2024: కొత్త కొత్తగా సన్‌రైజర్స్.. రాత మారేనా?
ఎనిమిది, ఎనిమిది, పది... గత మూడు ఐపీఎల్ సీజన్ల పాయింట్ల పట్టికలో వరుసగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్థానాలు ఇవి! 2023లోనైతే మరీ ఘోరంగా టీమ్ నాలుగే విజయాలు సాధించింది. 2020లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో మూడో స్థానంలో నిలిచిన తర్వాత జట్టు మళ్లీ కోలుకోలేదు. తర్వాతి ఏడాది విభేదాలతో వార్నర్‌ను ఎనిమిది మ్యాచ్‌లకే పరిమితం చేసిన టీమ్ మేనేజ్మెంట్ ఆ తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసినా ఏవీ కలిసి రాలేదు. విదేశీ ఆటగాళ్లు అక్కడక్కడా మెరవడం మినహా భారత క్రికెటర్లు ఎవరూ జట్టును గెలిపించలేకపోతున్నారు. అభిమానుల కోణంలో అయితే వారంతా అపరిచితుల్లా కనిపిస్తున్నారు. లీగ్‌లో ప్రతీ టీమ్ ఏదో ఒక దశలో విధ్వంసక ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షిస్తుండగా సన్‌రైజర్స్ మాత్రం పాతకాలపు ఆటతోనే నడిపిస్తోంది. విదేశీ ఆటగాళ్లు కూడా తమపై ఉన్న అంచనాలు, ఒత్తిడిని అధిగమించి ఏ మేరకు రాణిస్తారనేది చెప్పలేం. ఈ నేపథ్యంలో మరో సీజన్‌కు జట్టు సిద్ధమైంది. వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ కెపె్టన్ కమిన్స్ సారథ్యంలో, కొత్త హెడ్ కోచ్ డానియల్ వెటోరి పర్యవేక్షణలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న సన్‌రైజర్స్ టోర్నీలో ఎంత దూరం వెళుతుందనేది ఆసక్తికరం. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికే చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సౌతాఫ్రికా టి20 టోర్నీలో వరుసగా రెండేళ్లు టైటిల్స్ సాధించింది. ఈ రెండు సార్లూ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ జట్టును విజేతగా నిలిపాడు. అయినా సరే అతడిని కాదంటూ ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్‌ను రైజర్స్ ఈసారి కొత్త కెప్టెన్‌గా నియమించింది. వేలంలో కమిన్స్‌ను రైజర్స్ రూ. 20 కోట్ల 50 లక్షల భారీ ధరకు కొనుక్కుంది. గత ఏడాది కాలంలో నాయకుడిగా ఆసీస్‌కు అసాధారణ విజయాలు అందించిన కమిన్స్ అగ్రశ్రేణి టి20 లీగ్‌లో ఒక జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా కమిన్స్ 2023లో ఐపీఎల్ ఆడలేదు. 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 5 మ్యాచ్‌లే ఆడిన అతను ఏకంగా 10.68 ఎకానమీతో 7 వికెట్లే తీశాడు. అంతకుముందు సీజన్లోనూ 7 మ్యాచ్‌లలో 9 వికెట్లే తీసి భారీగా పరుగులిచ్చాడు. ఓవరాల్‌గా కమిన్స్‌కు టి20ల్లో అంత ఘనమైన రికార్డు ఏమీ లేదు. జట్టులో సమర్థులైన విదేశీ ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నా కూడా కెపె్టన్ హోదాలో కమిన్స్ అన్ని మ్యాచ్‌లు ఆడతాడు. ఇటీవల అతని బౌలింగ్ మెరుగైనా... తీవ్ర ఒత్తిడిలో జట్టుకు మంచి ఫలితాలు అందించడం కీలకం. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌ను ఈనెల 23న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. విదేశీ బృందం ఇలా... కమిన్స్‌ను మినహాయిస్తే మరో ముగ్గురు విదేశీయులకే తుది జట్టులో చాన్స్ ఉంది. ఇలాంటి స్థితిలో రైజర్స్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లలో ఎవరిని ఎంచుకుంటుందో చూడాలి. బ్యాటర్లలో వరల్డ్‌కప్ ‘ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్, గత ఏడాది టీమ్ టాప్ స్కోరర్ హెన్రిచ్ క్లాసెన్, దక్షిణాఫ్రికా టి20 కెప్టెన్ మార్క్రమ్, దూకుడుగా ఆడగల గ్లెన్ ఫిలిప్స్ అందుబాటులో ఉన్నారు. తాజా ఫామ్, గుర్తింపును బట్టి చూస్తే హెడ్, క్లాసెన్‌లు ఖాయంగా కనిపిస్తున్నారు. అప్పుడు బౌలింగ్‌లో అగ్రశ్రేణి లెగ్ స్పిన్నర్, ఐపీఎల్ లో మంచి రికార్డు ఉన్న హసరంగకు తుది జట్టులో చోటు ఖాయం. ఆల్‌రౌండర్‌గా మార్కో జాన్సెన్ కూడా సిద్ధంగా ఉన్నా అతడిని ఆడించడం కష్టంగా మారనుంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కారణంగా హసరంగ లీగ్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అప్పుడు జాన్సెన్కు అవకాశం లభించవచ్చు. మనోళ్లు సత్తా చాటుతారా... బ్యాటింగ్ కోణంలో భారత ఆటగాళ్లంతా అంతంతమాత్రం ప్రదర్శనే కనబరుస్తున్నారు. ఏదో ఒక మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ మినహా నిలకడే లేదు. మయాంక్ అగర్వాల్, అభిõÙక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలలో ఒక్కరు కూడా గత సీజన్లో కనీసం 300 పరుగులైనా చేయలేకపోయారు. సమద్, అన్మోల్ప్రీత్ ప్రభావం చూపలేకపోగా... ఉపేంద్ర, నితీశ్ కుమార్ రెడ్డి, సన్వీర్ ఏమాత్రం ఆడతారో చూడాలి. రెండేళ్ల క్రితమే భారత జట్టుకు దూరమైన భువనేశ్వర్‌పైనే ఇంకా పేస్ బౌలింగ్ భారం ఉంది. ఉమ్రాన్ మాలిక్ తన వేగం మాత్రమే కాక ఇతరత్రా బౌలింగ్ మెరుగుపర్చుకొని ఉంటే ప్రభావం చూపించగలడు. నటరాజన్‌లో నాటి పదును తగ్గిపోగా, సీనియర్ జైదేవ్ ఉనాద్కట్ జట్టులో ఉండటం ఉపయోగపడవచ్చు. జట్టు స్పిన్ బలహీనంగా కనిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్ ఫర్వాలేదనిపించే ఆటగాళ్లే. ఇన్నేళ్లుగా ఆడుతున్నా ఒక్క సీజన్లోనూ వీరిద్దరు ఎనిమిదికి మించి వికెట్లు తీయలేదు. మయాంక్ మార్కండే లెగ్‌స్పిన్ కొంత వరకు ప్రభావం చూపించవచ్చు. జట్టు వివరాలు కమిన్స్ (కెప్టెన్), మార్క్రమ్, ఫిలిప్స్, క్లాసెన్, హెడ్, జాన్సెన్, హసరంగ, ఫజల్ హఖ్ (విదేశీ ఆటగాళ్లు). అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అన్మోల్ప్రీత్, ఉపేంద్ర యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్, వాషింగ్టన్ సుందర్, సనీ్వర్ సింగ్, జాతవేద్ సుబ్రహ్మణ్యం, ఆకాశ్ సింగ్, షహబాజ్ అహ్మద్, భువనేశ్వర్, ఉనాద్కట్, నటరాజన్, ఉమ్రాన్, మయాంక్ మర్కండే (భారత ఆటగాళ్లు). సాక్షి క్రీడా విభాగం -
IPL 2024: సన్‌రైజర్స్ తుదిజట్టు ఇదే.. మార్క్రమ్కు నో ఛాన్స్?
ఐపీఎల్-2024 ఆరంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 22న ఈ మెగా ఈవెంట్‌కు చెపాక్ వేదికగా తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో మరుసటి రోజే అంటే మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కోల్‌కతా వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న సన్‌రైజర్స్ ఈసారి మరో కొత్త కెప్టెన్‌తో ముందుకు రానుంది. ఆస్ట్రేలియా సారథి, వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ప్యాట్ కమిన్స్‌పై కోట్లు కుమ్మరించి తన నాయకుడిగా ప్రకటించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్పై వేటు వేసింది. ఇక జట్టులో వీరిద్దరితో పాటు మరో ఆరుగురు విదేశీ ప్లేయర్లు కూడా ఉన్నారు. నిబంధనల ప్రకారం తుదిజట్టులో కేవలం నలుగురు ఫారిన్ ప్లేయర్లను మాత్రమే ఆడించాలి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుందా అన్న చర్చల నడుమ.. టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన జట్టును ప్రకటించాడు. విదేశీ ప్లేయర్ల కోటాలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు.. ట్రవిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్‌లకు తన టీమ్‌లో చోటిచ్చాడు. ‘‘అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్.. ఇద్దరు లెఫ్టాండర్లతో ఓపెనింగ్ చేయించాలనుకుంటే వీరికి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఇవ్వాలి. లేదంటే అభిషేక్‌ను వన్‌డౌన్‌లో ఆడించి.. మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్‌గా పంపాలి. ఆ తర్వాతి స్థానాల్లో రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్/ఉమ్రాన్ మాలిక్/టి. నటరాజన్‌లను పంపించాలి’’అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఒకవేళ స్పిన్ పిచ్‌లపై ఆడాల్సి వస్తే.. మార్కో జాన్సెన్ స్థానంలో వనిందు హసరంగను తీసుకుంటే బాగుంటుందని ఆకాశ్ చోప్రా సూచించాడు. షాబాజ్ అహ్మద్ రూపంలో మరో స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా ఆకాశ్ చోప్రా తన తుదిజట్టులో ఐడెన్ మార్క్రమ్కు చోటు ఇవ్వకపోవడం గమనార్హం. గత సీజన్లో అతడు 13 ఇన్నింగ్స్ ఆడి సగటు 22.55తో 248 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2024- సన్‌రైజర్స్ హైదరాబాద్- ఆకాశ్ చోప్రా తుదిజట్టు: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్/ఉమ్రాన్ మాలిక్/టి. నటరాజన్. ఐపీఎల్-2024- సన్‌రైజర్స్ జట్టు: అబ్దుల్ సమద్ ఐడెన్ మార్క్రమ్* రాహుల్ త్రిపాఠి గ్లెన్ ఫిలిప్స్* హెన్రిచ్ క్లాసెన్* మయాంక్ అగర్వాల్.. అన్మోల్ ప్రీత్ సింగ్ ఉపేంద్ర సింగ్ యాదవ్ నితీష్ కుమార్ రెడ్డి అభిషేక్ శర్మ మార్కో జాన్సెన్* వాషింగ్టన్ సుందర్ సన్వీర్ సింగ్ భువనేశ్వర్ కుమార్ టి.నటరాజన్ మయాంక్ మార్కండే ఉమ్రాన్ మాలిక్ ఫజల్హక్ ఫరూఖీ* షాబాజ్ అహ్మద్ (ఆర్సీబీ నుంచి ట్రేడింగ్) ట్రావిస్ హెడ్ * (వేలం - 6.80 కోట్లు) వనిందు హసరంగ* (వేలం - 1.50 కోట్లు) ప్యాట్ కమిన్స్* (వేలం - 20.50 కోట్లు) జయదేవ్ ఉనాద్కట్ (వేలం - 1.60 కోట్లు) ఆకాశ్ సింగ్ (వేలం - 20 లక్షలు) ఝతావేద్ సుబ్రమణియన్ (వేలం - 20 లక్షలు) *- విదేశీ ఆటగాళ్లు. చదవండి: హార్దిక్ రిటైర్ అవ్వటమే బెటర్: భారత మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్ -
ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్..?
ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్థానంలో మిచెల్ మార్ష్ ఆసీస్ టీ20 జట్టుకు సారధిగా ఎంపికయ్యే అవకాశం ఉంది. మార్ష్‌కు టీ20 జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జార్జ్ బెయిలీ అధ్యక్షుడిగా ఉన్న సెలెక్షన్ కమిటీలో మెంబర్ కూడా అయిన మెక్ డొనాల్డ్ మార్ష్ ఈ ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ పగ్గాలు చేపట్టాలని బలంగా కోరుకుంటున్నాడు. టీ20 బాధ్యతలు వదులుకునేందుకు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆసీస్ టీ20 జట్టు సారధిగా మార్ష్‌కు ఘనమైన రికార్డే ఉంది. మెక్ డొనాల్డ్ మార్ష్ వైపు మొగ్గు చూపేందుకు ఇది కూడా ఓ కారణంగా తెలుస్తుంది. 32 ఏళ్ల మార్ష్ ఆరోన్ ఫించ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత జరిగిన తొలి సిరీస్‌లోనే ఆస్ట్రేలియాను విజయపథాన నడిపించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2021-23 అనంతరం సౌతాఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మార్ష్ నేతృత్వంలోని ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆ సిరీస్‌లో మార్ష్ బ్యాటర్‌గా కూడా రాణించి (92 నాటౌట్, 79 నాటౌట్) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో విండీస్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరించిన మార్ష్.. ఈ సిరీస్‌లోనూ ఆసీస్‌ను విజయపథాన నడిపించాడు. ఈ సిరీస్‌ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇటీవల న్యూజిలాండ్ గడ్డపై జరిగిన సిరీస్‌లోనూ మార్ష్ కెప్టెన్‌గా, ఆటగాడిగా అత్యుత్తమంగా రాణించాడు. ఈ సిరీస్‌ను సైతం ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మార్ష్‌కు ఉన్న ఈ ట్రాక్ రికార్డే ప్రస్తుతం అతన్ని ఆసీస్ టీ20 జట్టు కెప్టెన్ రేసులో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన మార్ష్.. తన కెరీర్లో 54 టీ20లు ఆడి తొమ్మిది హాఫ్ సెంచరీల సాయంతో 1432 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 17 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 6న ఆడనుంది. దీనికి ముందు ఆసీస్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడటం లేదు. టీ20 వరల్డ్‌కప్ జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. -
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. సిరీస్ క్లీన్ స్వీప్
టెస్టుల్లో ఆస్ట్రేలియా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(98 నాటౌట్), మిచెల్ మార్ష్(80) కీలక పాత్ర పోషించారు. లక్ష్య ఛేదనలో 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో మార్ష్,క్యారీ జట్టును అందుకున్నారు. ఆచతూచి ఆడుతూ జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే ఆఖరిలో మార్ష్ ఔట్ కావడంతో మ్యాచ్ కాస్త కివీస్ వైపు మలుపు తిరిగింది. కానీ క్రీజులో పాతుకుపోయిన క్యారీ, కెప్టెన్ కమ్మిన్స్‌తో కలిసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్ సీర్స్ 4 వికెట్లు, మాట్ హెన్రీ రెండు, టిమ్ సౌథీ తలా వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులు చేసింది. ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 372 పరుగులు చేసిన కివీస్.. ఆసీస్ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చదవండి:IPL 2024: వారెవ్వా సంజూ.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్! వీడియో వైరల్ -
IPL 2024: సమరానికి సిద్ధం అంటున్న సన్‌రైజర్స్
హైదరాబాద్‌లో ఐపీఎల్ ఫీవర్ అప్పుడే మొదలైంది. లీగ్ ప్రారంభానికి రెండు వారాలకు పైగా సమయం ఉండగానే సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు. హోం గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఇవాళ తొలి టీమ్ మీటింగ్ జరిగింది. స్టార్ బౌలర్ టి నటరాజన్, లోకల్ ఆటగాళ్లు కొందరు ఇవాళ జరిగిన ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. First team huddle of the season at Uppal ft. a whole lotta orange 🥹🧡 pic.twitter.com/JV4dvzwicE — SunRisers Hyderabad (@SunRisers) March 5, 2024 ఆటగాళ్లకు చెందిన కొన్ని ఫోటోలను సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఎస్ఆర్హెచ్ టీమ్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 23వ తేదీన ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ లోకల్ టీమ్ కేకేఆర్‌ను ఢీకొంటుంది. తొలి విడతలో విడుదల చేసిన ఫిక్షర్స్లో సన్‌రైజర్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. Nattu's #FlameComing 𝘢𝘯𝘵𝘦 wickets incoming 🤩 Welcome back, @Natarajan_91 🧡 pic.twitter.com/sPyVJAGlVb — SunRisers Hyderabad (@SunRisers) March 4, 2024 మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో, మార్చి 31 గుజరాత్ టైటాన్స్‌తో, ఏప్రిల్ 5 చెన్నై సూపర్‌కింగ్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. వీటిలో ముంబై ఇండియన్స్, సీఎస్కే మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగనుండగా.. గుజరాత్‌తో మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. Mark your dates, #OrangeArmy 😍 We start our 🔥 days against the Knights 🧡💜 And we’ll see you at Uppal on the 27th 😍#IPL2024 #IPLSchedule pic.twitter.com/j9kuIIDyfE — SunRisers Hyderabad (@SunRisers) February 22, 2024 కొద్ది రోజుల కిందటే సన్‌రైజర్స్ యాజమాన్యం పాత కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ను తప్పించి పాట్ కమిన్స్‌ను నూతన కెప్టెన్‌గా ఎంపిక చేసింది. కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ ఈ సీజన్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో సన్‌రైజర్స్ టీమ్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. అన్ని విభాగాల్లో అగ్రశ్రేణి ఆటగాళ్లతో కళకళలాడుతుంది. సన్‌రైజర్స్ జట్టు వివరాలు.. అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు అన్మోల్ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు (కెప్టెన్) భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్ వివరాలు.. హెడ్ కోచ్: డేనియల్ వెటోరీ బ్యాటింగ్ కోచ్: హేమంగ్ బదానీ స్పిన్ బౌలింగ్ మరియు స్ట్రాటజిక్ కోచ్: ముత్తయ్య మురళీథరన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్: జేమ్స్ ఫ్రాంక్లిన్ (తాత్కాలికం) అసిస్టెంట్ కోచ్: సైమన్ హెల్మట్ ఫీల్డింగ్ కోచ్: ర్యాన్ కుక్ -
ఒక్క సీజన్కేనా? ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా కమ్మిన్స్ సరైనోడు కాదు!
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కెప్టెన్సీ మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా స్టార్, వన్డే ప్రపంచకప్ 2023 విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను తమ జట్టు కొత్త కెప్టెన్‌గా ఎస్ఆర్హెచ్ నియమించింది. గతేడాది సీజన్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఎయిడెన్ మార్క్రమ్ను తప్పిస్తూ కమ్మిన్స్‌కు తమ జట్టు పగ్గాలను ఆరెంజ్ ఆర్మీ అప్పగించింది. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో రికార్డు స్థాయిలో కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు సన్‌రైజర్స్ దక్కించుకుంది. అయితే గత మూడేళ్లలో ఎస్ఆర్హెచ్ సారథ్య బాధ్యతలు చేపట్టిన నాలుగో ఆటగాడిగా కమ్మిన్స్ నిలిచాడు. అయితే ఎస్ఆర్హెచ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చేరాడు. "ప్యాట్ కమ్మిన్స్ అద్భుతమైన కెప్టెన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడొక వరల్డ్‌క్లాస్ కెప్టెన్. కమ్మిన్స్ సారథ్యంలోనే ఆస్ట్రేలియా వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. గత రెండేళ్లగా తన వ్యక్తిగత ప్రదర్శనతో కూడా కమ్మిన్స్ అకట్టుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఒక్కటే సమస్య. టెస్టుల్లో, వన్డేల్లో సారథి సఫలమైన కమ్మిన్స్.. టీ20ల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. అదే విధంగా టీ20ల్లో తన వ్యక్తిగత ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. ఐపీఎల్లో కూడా అతడి గణాంకాలు అంత బాగోలేవు. అయితే ఎస్ఆర్హెచ్ ఏ ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుందో నాకు అర్ధం కావడం లేదు. ఇప్పుడు మార్క్రరమ్ పరిస్థితి ఏంటి? అతడికి కేవలం ఒక్క సీజన్లో మాత్రమే కెప్టెన్సీ ఛాన్స్ ఇచ్చారు. మరో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠాన్ పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ జట్టును మార్క్రమ్ వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలబెట్టాడు. అయితే ఐపీఎల్లో మాత్రం సారథిగా ఈ ప్రోటీస్ స్టార్ విఫలమయ్యాడు. చదవండి: WPL 2024: భారీ సిక్సర్ కొట్టిన ఆర్సీబీ బ్యాటర్.. దెబ్బకు కారు అద్దం పగిలిపోయింది! వీడియో -
IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెగా కమిన్స్
హైదరాబాద్: ఐపీఎల్ 17వ సీజన్లో ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బరిలోకి దిగనుంది. హైదరాబాద్ ఫ్రాంచైజీకి గత మూడేళ్లలో మారిన నాలుగో కెప్టె కమిన్స్! ఈ మూడేళ్లలో మార్క్రమ్ (దక్షిణాఫ్రికా), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), డేవిడ్ వార్నర్ (ఆ్రస్టేలియా)లు సన్‌రైజర్స్‌ను నడిపించారు. 30 ఏళ్ల స్పీడ్‌స్టర్ కమిన్స్ నాయకత్వంలో ఆ్రస్టేలియా 2023 వన్డే ప్రపంచకప్, 2023 ప్రపంచ టెస్టు చాంపియన్íÙప్ టైటిల్స్‌ను సాధించింది. 2021 టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా జట్టులోనూ కమిన్స్ సభ్యుడిగా ఉన్నాడు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో కమిన్స్‌పై సన్‌రైజర్స్ రూ. 20 కోట్ల 50 లక్షలు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. తాజాగా మార్క్రమ్ను కెప్టెన్సీ నుంచి తప్పించి కమిన్స్‌కు సన్‌రైజర్స్ పగ్గాలు అప్పగించింది. గతంలో కమిన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు కానీ... కెప్టెన్‌గా మొదటిసారి ఐపీఎల్లో జట్టును నడిపించబోతున్నాడు. గత సీజన్లో మార్క్రమ్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌లు ఆడి నాలుగే మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. -
IPL 2024: సన్‌రైజర్స్ కొత్త బౌలింగ్ కోచ్ అతడే.. కోచింగ్ సిబ్బంది పూర్తి వివరాలు
రానున్న ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం బౌలింగ్ కోచ్‌గా ఉన్న డేల్ స్టెయిన్ వ్యక్తిగత కారణాల చేత 2024 సీజన్ మొత్తానికి దూరంగా ఉండనుండటంతో ఎన్‌ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ ఫ్రాంక్లిన్‌ను ఎంపిక చేసింది. అయితే ఫ్రాంక్లిన్ ఈ విధుల్లో తాత్కాలికంగా మాత్రమే కొనసాగనున్నాడు. స్టెయిన్ తిరిగి రాగానే ఫ్రాంక్లిన్ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు. స్టెయిన్ 2022లో ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. Dale Steyn will not be joining us this season due to personal reasons and James Franklin will be the Pace Bowling Coach for this season. Welcome on board, James! 🙌🧡#IPL2024 pic.twitter.com/CefHEbVSLy — SunRisers Hyderabad (@SunRisers) March 4, 2024 ఫ్రాంక్లిన్ ట్రాక్ రికార్డు విషయానికొస్తే.. బౌలింగ్ కోచ్‌గా ఇవే అతనికి తొలి బాధ్యతలు. గతంలో అతను డర్హమ్ కౌంటీ జట్టుకు, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. ఫ్రాంక్లిన్‌కు బౌలింగ్ కోచ్‌గా అనుభవం లేనప్పటికీ.. అతను ఐపీఎల్‌కు సుపరిచితుడే. 2011, 2012 సీజన్లలో అతను ఆటగాడిగా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఫ్రాంక్లిన్.. సన్‌రైజర్స్ హెడ్ కోచ్ డేనియల్ వెటోరీకి రిపోర్ట్ చేయనున్నాడు. వెటోరీ కూడా న్యూజిలాండ్ దేశస్తుడే. ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్‌గా వెటోరీకి కూడా ఇవే తొలి బాధ్యతలు. గత ఐపీఎల్ సీజన్ ముగిసిన అనంతరం వెటోరీ సన్‌రైజర్స్ హెడ్ కోచ్‌గా నియమించబడ్డాడు. వెటోరీ, ఫ్రాంక్లిన్ గతంలో మిడిల్సెక్స్ కౌంటీకి, హండ్రెడ్ లీగ్‌లో బర్మింగ్హమ్ ఫీనిక్స్కు కలిసి పని చేశారు. ఫ్రాంక్లిన్ కెరీర్ విషయానికొస్తే.. ఇతను 2001-2013 మధ్యలో న్యూజిలాండ్ తరఫున 31 టెస్ట్‌లు, 110 వవ్డేలు, 38 టీ20లు ఆడి 183 వికెట్లు సాధించాడు. ఫ్రాంక్లిన్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 20 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఇవాళ ఉదయమే కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్ పేరును ప్రకటించింది. మార్క్రమ్ నుంచి కమిన్స్ బాధ్యతలు చేపడతాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్ వివరాలు.. హెడ్ కోచ్: డేనియల్ వెటోరీ బ్యాటింగ్ కోచ్: హేమంగ్ బదానీ స్పిన్ బౌలింగ్ మరియు స్ట్రాటజిక్ కోచ్: ముత్తయ్య మురళీథరన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్: జేమ్స్ ఫ్రాంక్లిన్ (తాత్కాలికం) అసిస్టెంట్ కోచ్: సైమన్ హెల్మట్ ఫీల్డింగ్ కోచ్: ర్యాన్ కుక్ సన్‌రైజర్స్ జట్టు వివరాలు.. అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు అన్మోల్ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు (కెప్టెన్) భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు -
పాపం మార్క్రమ్.. ఏంటి కావ్య పాప ఇది? మరీ ఇంత అన్యాయమా?
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ జట్టు కెప్టెన్, సౌతాఫ్రికా స్టార్ ఐడైన్ మార్క్రమ్కు ఊహించని షాకిచ్చింది. మార్క్రమ్ను తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎస్ఆర్హెచ్ తప్పించింది. అతడి స్ధానంలో వన్డే ప్రపంచకప్ 2023 విన్నింగ్ కెప్టెన్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్‌కు జట్టు పగ్గాలను సన్‌రైజర్స్ అప్పగించింది. ఈ మెరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. కాగా మినీ వేలంలో ఫ్రాంచైజీ కమిన్స్‌ను రూ.20.50 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎస్ఆర్హెచ్ తీసుకున్న నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది కమ్మిన్స్‌ను సారథిగా నియమించడాన్ని సమర్ధిస్తుంటే.. మరి కొంత మంది తప్పుబడుతున్నారు. మారక్రమ్ అద్బుతమైన నాయకుడని, అతడికి మరో ఛాన్స్ ఇవ్వాలందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీ ఫ్రాంచైజీని వరుసగా రెండు సార్లు నిలిపిన ఆటగాడికి అన్యాయం చేశారని ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్‌ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ జట్టును మార్క్రమ్ వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలబెట్టాడు. గతేడాది ప్రారంభ సీజన్లోనే జట్టును విజేతగా నిలిపిన అతను.. ఇటీవల రెండో సీజన్లోనూ టైటిల్‌ను అందించాడు. అయితే ఐపీఎల్లో మాత్రం మార్క్రమ్ తన కెప్టెన్సీ మార్క్‌ను చూపించలేకపోయాడు. గత సీజన్లో ఎయిడెన్ మార్క్రమ్ సారథ్యంలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఆడిన 14 మ్యాచుల్లో నాలుగింట్లో మాత్రమే గెలిచింది. పది మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు నిలిచింది. -
IPL 2024: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్.. ప్రకటించిన ఫ్రాంఛైజీ
Big Change In IPL 2024: Sunrisers Hyderabad New Captain: ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త కెప్టెన్ పేరును ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్‌కు ఎస్ఆర్హెచ్ నాయకుడిగా బాధ్యతలు అప్పగించింది. గత సీజన్లో సారథిగా వ్యవహరించిన సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్ స్థానాన్ని కమిన్స్‌తో భర్తీ చేసింది. కాగా 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది సన్‌రైజర్స్. ఆ తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయింది. ఈ క్రమంలో వార్నర్‌పై వేటు వేయగా.. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. కేన్ మామనూ మార్చేసింది వార్నర్ స్థానంలో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా తీసుకువచ్చినప్పటికీ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. ఫలితంగా కేన్ మామకూ బైబై చెప్పింది ఫ్రాంఛైజీ. మార్క్రమ్కూ ఉద్వాసన ఐపీఎల్-2022 ఎడిషన్‌లో పద్నాలుగింట కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితం కావడంతో ఈ మేరకు కేన్ మామపై వేటు వేసింది. అతడి స్థానంలో ఐడెన్ మార్క్రమ్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ రాత మారలేదు సరికదా మరింత పేలవ ప్రదర్శనలతో విమర్శలు మూటగట్టుకుంది. గతేడాది పద్నాలుంగిట కేవలం నాలుగు మాత్రమే గెలిచి అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. రూ. 20 కోట్లు ఖర్చు చేసి మరీ ఈ నేపథ్యంలో సరైన సారథి వేటలో పడిన సన్‌రైజర్స్ ఐపీఎల్-2024 వేలంలో భాగంగా ప్యాట్ కమిన్స్ కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేసింది. వన్డే వరల్డ్‌కప్-2023లో ఆసీస్‌ను చాంపియన్‌గా నిలిపిన ఈ పేస్ బౌలర్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించి.. తాజాగా అతడిని కెప్టెన్‌గా ప్రకటించింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మార్చి 23న జరుగనున్న మ్యాచ్‌తో సన్‌రైజర్స్ తాజా ఎడిషన్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఆ తర్వాత మార్చి 27న హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్‌తో, మార్చి 31న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో, ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. తొలి దఫా షెడ్యూల్లో భాగంగా ఈ మేరకు మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..! #OrangeArmy! Our new skipper Pat Cummins 🧡#IPL2024 pic.twitter.com/ODNY9pdlEf — SunRisers Hyderabad (@SunRisers) March 4, 2024 -
సన్ రైజర్స్ సంచలన నిర్ణయం.. మార్క్రమ్కు బిగ్ షాక్! కొత్త కెప్టెన్ అతడే?
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వేలంలో రూ.20.50 కోట్టు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఆసీస్ స్టార్ ప్యాట్ కమ్మిన్స్‌కు తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న ఐడైన్ మార్క్రమ్ను తప్పించేందుకు ఎస్ఆర్హెచ్ సిద్దమైనట్లు వినికిడి. ఈ విషయంపై ఒకట్రెండు రోజుల్లో ఆరెంజ్ ఆర్మీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. కాగా కెప్టెన్‌గా కమ్మిన్స్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా.. ఎస్ఆర్హెచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కమిన్స్ కెప్టెన్‌గానే కాకుండా ఫ్రంట్ లైన్ బౌలర్‌గా సన్‌రైజర్స్‌కు కీలకం కానున్నాడు. కాగా కమ్మిన్స్ సారథ్యంలోనే వన్డే ప్రపంచకప్-2023ను, వరల్డ్‌టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్‌ను ఆసీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మార్క్రమ్ సైతం దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో వరుసగా రెండు సార్లు ఎస్ఆర్హెచ్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడు. కానీ ఐపీఎల్లో మాత్రం మార్క్రమ్ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. గతేడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ జట్టు పగ్గాలను చేపట్టిన మార్క్రమ్ జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. -
ప్యాట్ కమ్మిన్స్ అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టిన రెండో ఆసీస్ కెప్టెన్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో డారిల్ మిచెల్‌ను ఔట్ చేసిన కమిన్స్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదో కెప్టెన్‌గా కమ్మిన్స్ నిలిచాడు. సారథిగా వందకు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇమ్రాన్ ఖాన్ 71 ఇన్నింగ్స్‌లలో 187 వికెట్లు పడగొట్టారు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(111) సైతం ఉన్నారు. ఈ ఘనత సాధించిన కెప్టెన్లు వీరే ఇమ్రాన్ ఖాన్ (పాక్): 187 వికెట్లు రిచీ బెనాడ్ (ఆసీస్): 138 వికెట్లు గార్ఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్): 117 వికెట్లు డేనియల్ వెట్టోరి (న్యూజిలాండ్): 116 వికెట్లు కపిల్ దేవ్ (భారత్): 111 వికెట్లు వసీం అక్రమ్ (పాక్): 107 వికెట్లు బిషన్ సింగ్ బేడీ (భారత్): 106 వికెట్లు షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా): 103 వికెట్లు జాసన్ హోల్డర్ (వెస్టిండీస్): 100 వికెట్లు పాట్ కమిన్స్ (ఆసీస్): 100 వికెట్లు A century of wickets for Pat Cummins as Australia captain 👏#NZvAUS pic.twitter.com/r7Trg0o6JV — ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2024 -
NZ vs Aus: ఆసీస్ కెప్టెన్ కమిన్స్ షాకింగ్ కామెంట్స్
"I’d doubt that I’ll be captaining..’’...: న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. కివీస్‌తో సిరీస్‌లో స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా కొనసాగుతాడని స్పష్టం చేసింది. ఉస్మాన్ ఖవాజాతో కలిసి అతడు ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని తెలిపింది. ఆల్‌రౌండర్లు కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్ ఇద్దరిని తుదిజట్టులో ఆడిస్తున్నట్లు వెల్లడించింది. ఇక తుదిజట్టును ప్రకటిస్తున్న సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను కెప్టెన్‌గా ఎన్నాళ్లు కొనసాగుతానో తెలియదన్నాడు. వాళ్ల కెప్టెన్సీలో ఆడటం ఆస్వాదిస్తున్నా ముప్పై ఏళ్ల వయసు దాటిన తర్వాత ఫామ్, ఆటకు శరీరం సహకరించే తీరుపైనే తన భవిష్యత్తు ఆధారపడి ఉందని కమిన్స్ పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్లో మాథ్యూ వేడ్, మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని.. వాళ్లిద్దరి కారణంగా తనకు కాస్త విశ్రాంతి లభించిందని హర్షం వ్యక్తం చేశాడు. మొదటి రెండు టెస్టుల మధ్య ఆరేళ్ల గ్యాప్ కాగా ఫాస్ట్ బౌలర్ అయిన ప్యాట్ కమిన్స్ 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత 2017 వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వరుసగా గాయాల బారిన పడిన కారణంగా మొదటి రెండు టెస్టుల మధ్య దాదాపు ఆరేళ్ల గ్యాప్ వచ్చింది. అయితే, ఆ తర్వాత కమిన్స్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గా వరుస విజయాలు అందిస్తూ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్ సాధించాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో కంగారూలను చాంపియన్లుగా నిలిపి సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం టెస్టుల్లో ప్యాట్ కమిన్స్ నంబర్‌వన్ బౌలర్ కావడం విశేషం. న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఎలెవన్: స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్. చదవండి: NZ Vs Aus: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ బ్యాటర్ దూరం -
మీ భార్యను ప్రేమిస్తున్నా.. సర్లే ఆమెకు చెప్తా!
Pat Cummins's response Goes Viral: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ది ప్రేమ వివాహం. ఈ స్టార్ బౌలర్‌కు 2013లో బెకీ బోస్టన్ అనే అమ్మాయితో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. మనసులు కలవడంతో ప్రేమపక్షుల్లా విహరిస్తూ పరస్పరం అభిరుచులు పంచుకున్న ఈ జంట.. 2020లో నిశ్చితార్థం చేసుకుంది. అప్పటికే సహజీవనం చేస్తున్న కమిన్స్- బెకీ 2021లో తాము తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటి ఏడాది అంటే 2022లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. కుమారుడు ఆల్బీతో కలిసి సంతోషంగా జీవితం గడుపుతున్న ఈ జంట ఎప్పుటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేయడంలో ముందుంటారు. గొప్ప తల్లి, భార్య, నా వాలైంటైన్ ఇక వాలంటైన్స్ డే సందర్భంగా భార్య బెకీతో కలిసి ఉన్న ఫొటోను ప్యాట్ కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘‘గొప్ప తల్లి, భార్య, నా వాలైంటైన్. సర్ఫింగ్ చేయడంలోనూ దిట్ట. ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు బెకీ’’ అంటూ సతీమణిపై ప్రేమను కురిపించాడు. మీ భార్యను ప్రేమిస్తున్నా ఇందుకు స్పందించిన ఓ నెటిజన్.. ‘‘నేను భారతీయుడిని.. మీ భార్యను ప్రేమిస్తున్నా’’ అంటూ కామెంట్ చేశాడు. అయితే, ప్యాట్ కమిన్స్ ఇందుకు హుందాగా బదులిస్తూ... ‘‘సరే.. ఈ సందేశాన్ని ఆమెకు చేరవేస్తాను’’ అని పేర్కొనడం వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Pat Cummins (@patcummins30) కాగా గతేడాది ప్యాట్ కమిన్స్ కెరీర్లో అద్భుతంగా గడిచింది. అతడి సారథ్యంలో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23, వన్డే వరల్డ్‌కప్-2023 టైటిల్స్ గెలిచింది. ప్రస్తుతం క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న కమిన్స్ కుటుంబానికి సమయం కేటాయించాడు. rఇక ఐపీఎల్ తాజా సీజన్లో అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలో దిగనున్నాడు. చదవండి: IPL 2024- SRH: తెలివైన నిర్ణయం.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అతడే! Sanjana Ganesan: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్.. పో.. ఇక్కడి నుంచి! -
IPL 2024- SRH: సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అతడే!
ఐపీఎల్ ఎడిషన్లు మారుతున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాత మాత్రం మారడం లేదు. 2016లో తొలిసారి టైటిల్‌ను ముద్దాడిన రైజర్స్.. ఆ తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గత కొన్ని సీజన్లుగా మరీ పేలవంగా ఆడుతూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడుతోంది. జట్టును చాంపియన్‌గా నిలిపిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను తప్పించిన తర్వాత.. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్కు పగ్గాలు అప్పగించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. కేన్ మామకూ ఉద్వాసన పలికి సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అతడి కెప్టెన్సీలో రైజర్స్ ఐపీఎల్-2023 సీజన్లో మరీ దారుణంగా పద్నాలుగింట 4 మాత్రమే గెలిచి అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే కెప్టెన్ వేటలో పడ్డ సన్‌రైజర్స్ యాజమాన్యం మినీ వేలంలో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్‌కప్-2023లో ఆసీస్‌ను జగజ్జేతగా నిలిపిన ఈ పేస్ బౌలర్ కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేసింది. ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో తమ కెప్టెన్‌గా కమిన్స్‌ను నియమించడం ఖాయమని సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ చెప్పకనే చెప్పిందని అభిమానులు భావిస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కూడా ఇదే మాట అంటున్నాడు. ‘‘ప్యాట్ కమిన్స్‌ను కొనుగోలు చేయడం ఎస్ఆర్హెచ్ తెలివైన నిర్ణయం. అయితే, అతడి కోసం కాస్త ఎక్కువగానే ఖర్చుపెట్టిన మాట వాస్తవమే. కానీ.. సన్‌రైజర్స్‌కు నాయకుడి అవసరం ఉంది. గత కొన్నేళ్లుగా ఆ వెలితితో జట్టు సమస్య ఎదుర్కొంటోంది. గత సీజన్లో చెత్త కెప్టెన్సీ కారణంగా భారీ మూల్యమే చెల్లించారు. ఈసారి ప్యాట్ కమిన్స్ రూపంలో వారికి మంచి ఆటగాడు దొరికాడు. కచ్చితంగా అతడినే కెప్టెన్‌గా నియమిస్తారు. సారథిగా తను తప్పక ప్రభావం చూపుతాడు’’ అని సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన! స్టార్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య కివీస్‌తో మూడు టీ20లు, రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్ తలపడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌కు తమ జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. తాజాగా టెస్టు సిరీస్ జట్టును సైతం వెల్లడించింది. ఈ సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్ కోసం పేస్ ఆల్‌రౌండర్ మైఖేల్ నీసర్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. అదే విధంగా కివీస్ సిరీస్‌లో ఆసీస్ జట్టు కెప్టెన్‌గా ప్యాట్ కమ్మిన్స్ వ్యవహరించనుండగా.. పేస్ ద్వయం మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ కూడా చోటు దక్కించుకున్నారు. ఇక డేవిడ్ వార్నర్ స్ధానంలో మాథ్యూ రెన్షా తన స్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. ఫిబ్రవరి 29 నుంచి వెల్లింగ్టన్ వేదికగా ఇరు జట్లు మధ్య ఈ సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఆసీస్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, మైఖేల్ నేజర్, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్ కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా -
AUS vs NZ: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. డేవిడ్ వార్నర్‌కు ఛాన్స్
న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. స్వదేశంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న ఆసీస్ సీనియర్ పేస్ ద్వయం మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ తిరిగి కివీస్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నాడు. మరోవైపు వన్డే, టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ వార్నర్‌కు సైతం ఈ జట్టులో చోటు దక్కింది. టీ20 ప్రపంచకప్-2024 సన్నహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. వెల్లింగ్టన్ వేదికగా ఫిబ్రవరి 21న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక టీ20 సిరీస్ అనంతరం మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కూడా బ్లాక్ క్యాప్స్‌తో కంగారులు ఆడనున్నారు. కాగా ఆసీస్ జట్టు ప్రస్తుతం విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో ఆసీస్ సొంతం చేసుకుంది. కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా చదవండి: IND vs ENG: రెండో టెస్టులో ఓటమి.. దుబాయ్‌కు వెళ్లనున్న ఇంగ్లండ్ జట్టు? ఎందుకంటే? -
ఆసీస్‌తో రెండో టెస్ట్.. విండీస్‌ను ఆదుకున్న లోయర్ ఆర్డర్ బ్యాటర్లు
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక విండీస్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిలార్డర్ బ్యాటర్లు కవెమ్ హాడ్జ్ (71), వికెట్‌కీపర్ జాషువ డసిల్వ (79) విండీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 149 పరుగులు జోడించి విండీస్ పతనాన్ని అడ్డుకున్నారు. ఈ మ్యాచ్‌లోనూ విండీస్ టాపార్డర్ యధాతథంగా తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. కెప్టెన్ బ్రాత్‌వైట్ 4, చంద్రపాల్ 21, మెక్కెంజీ 21, అథనాజ్ 8, జస్టిన్ గ్రీవ్స్ 6 పరుగుల చేసి ఔటయ్యారు. హాడ్జ్, డసిల్వతో పాటు బౌలర్ అల్జరీ జోసఫ్ (32) రాణించి విండీస్ పరువు కాపాడారు. 16 పరుగులతో కెవిన్ సింక్లెయిర్ క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాశించగా.. హాజిల్‌వుడ్ 2, కమిన్స్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. -
యశస్విని వెనక్కినెట్టిన రచిన్: అవార్డులు గెలిచింది వీళ్లే.. పూర్తి జాబితా
ICC Awards 2023: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)- 2023 వార్షిక పురస్కారాల్లో భారత్‌కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవగా.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. కోహ్లి ఏకంగా నాలుగోసారి(వన్డే) ఈ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించగా.. సూర్య వరుసగా రెండోసారి పురస్కారం అందుకుని ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని ఘనత(టీ20) సాధించాడు. కెప్టెన్సీలో అదరగొట్టాడు.. అందుకే గత ఏడాది సూర్య 18 మ్యాచ్‌లు ఆడి 155.95 స్ట్రయిక్‌రేట్‌తో 733 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ‘టి20 ఫార్మాట్లో భారత మిడిలార్డర్ వెన్నెముకగా సూర్య ఉన్నాడు. తన దూకుడైన ఆటతో పలుసార్లు భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్సీ బాధ్యతల్లోనూ అతను ఒత్తిడికి లోనుకాకుండా నిలకడగా రాణించాడు’ అని ఐసీసీ వ్యాఖ్యానించింది. ఇక ఈ టీమిండియా స్టార్లతో పాటు 2023 ఏడాదికి గానూ ఐసీసీ అవార్డులు అందుకున్న జాబితా చూద్దాం. ►మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 విజేత జట్టు కెప్టెన్ ►మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- విరాట్ కోహ్లి(ఇండియా) డబ్ల్యూటీసీ టైటిల్ ►మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా)- 13 మ్యాచ్‌లలో కలిపి 1210 పరుగులు- ఆసీస్ డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర యశస్విని వెనక్కినెట్టి ►మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)- వన్డే వరల్డ్‌కప్‌లో 578 పరుగులు. యశస్వి జైస్వాల్, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షాన్ మధుషాంకలను వెనక్కినెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. డచ్ జట్టు విజయాలకు కారణం ►మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- బాస్ డి లీడే(నెదర్లాండ్స్)- 285 పరుగులు చేసి, 15 వికెట్లు తీసి- వన్డే వరల్డ్‌కప్‌నకు డచ్ జట్టు అర్హత సాధించడంలో కీలక పాత్ర- వన్డే ప్రపంచకప్‌లో 139 పరుగులు- 16 వికెట్లు. మహిళా క్రికెట్లో మహరాణులు ►వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- నాట్ సీవర్ బ్రంట్(ఇంగ్లండ్) ►వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- చమరి ఆటపట్టు(శ్రీలంక)- 8 మ్యాచ్‌లలో కలిపి 415 రన్స్ ►వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హేలీ మాథ్యూస్(వెస్టిండీస్)- స్టెఫానీ టేలర్ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో వెస్టిండియన్ ప్లేయర్- టీ20లలో జట్టుకు అవసరమైన సమయంలో 99 నాటౌట్, ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 132, 79 రన్స్ ►వుమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ఫోబె లిచ్‌ఫీల్డ్(ఆస్ట్రేలియా)- ఆసీస్ టాపార్డర్‌కు వెన్నెముకగా నిలిచినందుకు ►వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- క్వీంటర్ అబెల్(కెన్యా)- అంతర్జాతీయ టీ20లలో 476 పరుగులు, 30 వికెట్లు జింబాబ్వేకే ఆ అవార్డు స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డు- జింబాబ్వే జాతీయ జట్టు(ఓటమి బాధలో ఉన్న వెస్టిండీస్ ఆటగాడు అకీల్ హుసేన్‌ను ఓదార్చినందుకు) అంపైర్ ఆఫ్ ది ఇయర్- రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్. ఐసీసీ టెస్టు జట్టు: ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్. ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: ఫోబె లిచ్‌ఫీల్డ్, చమరి ఆటపట్టు (కెప్టెన్), ఎలిస్ పెర్రీ, అమేలియా కెర్, బెత్ మూనీ (వికెట్ కీపర్), నాట్ సీవర్-బ్రంట్, యాష్ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, నాడిన్ డి క్లెర్క్, లీ తహుహు, నహీదా అక్తర్. ఐసీసీ 2023 వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్, ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్. ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్: చమరి అటపట్టు(కెప్టెన్), బెత్ మూనీ (వికెట్ కీపర్), లారా వోల్వార్డ్, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, ఎల్లిస్ పెర్రీ, యాష్ గార్డెన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, మెగాన్ షట్. ఐసీసీ పురుషుల టీ20 జట్టు: యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, సికందర్ రజా, అల్పేశ్ రాంజాని, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ ఎన్‌గరవ, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు! -
ఐసీసీ టెస్ట్ జట్టు ప్రకటన.. టీమిండియా నుంచి ఇద్దరు!
2023 అత్యుత్తమ టెస్ట్ జట్టును ఐసీసీ ఇవాళ (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఎంపిక కాగా.. టీమిండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు లభించింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా, శ్రీలంక ప్లేయర్ దిముత్ కరుణరత్నే ఎంపిక కాగా.. వన్ డౌన్ బ్యాటర్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, నాలుగో స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, ఐదో ప్లేస్‌లో ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్, వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ, ఆల్‌రౌండర్ల కోటాలో భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఆసీస్ సారధి పాట్ కమిన్స్, స్పెషలిస్ట్ పేసర్లుగా ఇంగ్లండ్ బౌలర్ మిచెల్ స్టార్క్, ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఎంపికయ్యారు. ఈ జట్టులో రిటైర్డ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్‌కు చోటు లభించడం అనూహ్యం. జట్ల వారీగా చూస్తే.. ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా ఐదుగురు ఆటగాళ్లు ఎంపిక కాగా.. ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి ఇద్దరు, శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల నుంచి చెరో ఆటగాడు ఎంపికయ్యాడు. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు ఈ జట్టులో చోటు దక్కకపోవడం ఆసక్తికరం. ఇదిలా ఉంటే, ఐసీసీ గతేడాది అత్యుత్తమ టెస్ట్ జట్టుతో పాటు వన్డే, టీ20 జట్లను కూడా ప్రకటించింది. ఒక్క ఆటగాడికి కూడా మూడు ఫార్మాట్ల జట్లలో చోటు లభించలేదు. 2023 ఐసీసీ టెస్ట్ జట్టు: ఉస్మాన్ ఖ్వాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రవిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్ 2023 ఐసీసీ వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ట్రవిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), మార్కో జన్సెన్, ఆడమ్ జంపా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ 2023 ఐసీసీ టీ20 జట్టు: ఫిలిప్ సాల్ట్, యశస్వి జైస్వాల్, నికోలస్ పూరన్, మార్క్ చాప్మన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సికందర్ రజా, అల్పేష్ రంజనీ, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, రిచర్డ్ నగరవ -
నిప్పులు చెరిగిన కమిన్స్, హాజిల్‌వుడ్.. ఓపెనర్‌గా విఫలమైన స్టీవ్ స్మిత్
AUS VS WI 1st Test: రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఇవాళ (జనవరి 17) తొలి మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఓపెనర్‌గా కొత్త అవతారమెత్తిన స్టీవ్ స్మిత్ 12 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. లబూషేన్ (10) కూడా తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. ఉస్మాన్ ఖ్వాజా (30), కెమరూన్ గ్రీన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. ఆసీస్ పేసర్లు జోష్ హాజిల్‌వుడ్ (4/44), కెప్టెన్ పాట్ కమిన్స్ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ కిర్క్ మెక్కెంజీ (50) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఓపెనర్లు బ్రాత్‌వైట్ (13), తేజ్‌నరైన్ చంద్రపాల్ (6), అలిక్ అథనాజ్ (13), కవెమ్ హాడ్జ్ (12), జస్టిన్ గ్రీవ్స్ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్ (14), మోటీ (1) నిరాశపర్చగా.. 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (35) ఎంతో ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడి విండీస్ పరువు కాపాడాడు. షమార్.. కీమర్ రోచ్‌తో (17 నాటౌట్) కలిసి చివరి వికెట్‌కు 55 పరుగులు జోడించాడు.