అయ్యర్- కమిన్స్ (PC: KKR/SRH)
గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడుతందా అన్నట్లుగా ఉంది సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి. 2016లో టైటిల్ గెలిచిన రైజర్స్ ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రాణించలేకపోయింది.
తొలి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్ పుణ్యమా అని 2020లో మూడో స్థానంతో ముగించినా.. ఆ తర్వాత వరుసగా ఎనిమిది, ఎనిమిది, పది స్థానాల్లో నిలిచి విమర్శలు మూటగట్టుకుంది. ఇప్పుడిక ఐపీఎల్-2024 సమరానికి సిద్ధమైంది.
కొత్త కోచ్ డేనియల్ వెటోరీ మార్గదర్శనం, కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌తో ఈ సీజన్‌ను ఆరంభించనుంది.
మరోవైపు.. ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేయనున్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్, రెండుసార్లు కోల్‌కతాను విజేతగా నిలిపిన గౌతం గంభీర్ కేకేఆర్ మెంటార్ అవతారంలో కనిపించనున్నాడు. మరి ఈ పోరులో ఎవరిది పైచేయి అవుతుందో!? ఇరు జట్ల అంచనా, ముఖాముఖి రికార్డులు గమనిద్దామా?!
ముఖాముఖి రికార్డులు
ఎస్‌ఆర్‌హెచ్- కేకేఆర్ ఇప్పటి వరకు 25సార్లు ఎదురుపడగా.. కేకేఆర్ 16 మ్యాచ్‌లలో గెలవగా.. రైజర్స్ కేవలం తొమ్మిదిసార్లు మాత్రమే విజయం సాధించింది. గత ఏడు మ్యాచ్‌లలో రైజర్స్ కేవలం రెండుసార్లు గెలవగా.. కేకేఆర్ ఐదుసార్లు పైచేయి సాధించింది.
►2023 – 23 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలుపు
►2023 – 5 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం
►2022 – 7 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ గెలుపు
►2022 – 54 పరుగుల తేడాతో కేకేఆర్ జయభేరి
►2021 – 10 పరుగుల తేడాతో కేకేఆర్ గెలుపు
►2021 – ఆరు వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం
►2020 – ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపు
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు(అంచనా)
మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ , హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), ఉపేంద్ర యాదవ్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్, టి.నటరాజన్, భువనేశ్వర్ కుమార్.
కోల్‌కతా నైట్ రైడర్స్ తుదిజట్టు(అంచనా)
ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, రహ్మనుల్లా గుర్బాజ్.
చదవండి: IPL 2024: ఆర్సీబీతో మ్యాచ్ అంటే శివాలెత్తిపోతాడు.. ఇప్పటికీ మేము నాటౌట్!
Comments
Please login to add a commentAdd a comment