IPL 2024 GT vs SRH: సొంత గడ్డపై రికార్డుల మోత మోగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్త ఉత్సాహంతో అహ్మదాబాద్‌లో అడుగుపెట్టింది. ఐపీఎల్-2024లో తమ మూడో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో పోరుకు సిద్ధమైంది.
కాగా ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఇప్పటిదాకా సన్‌రైజర్స్- టైటాన్స్ చెరో విజయం నమోదు చేశాయి. తమ ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది.
ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(277) నమోదు చేసి.. లక్ష్యాన్ని కాపాడుకుంది. ముంబైని 31 పరుగుల తేడాతో ఓడించి తొలి గెలుపు నమోదు చేసింది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచి.. తదుపరి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడింది.
ఇప్పుడు సొంతమైదానంలో సన్‌రైజర్స్‌తో మరుసటి మ్యాచ్‌లో తలపడనుంది. ఇక ఇప్పటి వరకు ఇరు జట్ల ముఖాముఖి రికార్డు గమనిస్తే.. ఎదురుపడిన మూడు సందర్భాల్లో సన్‌రైజర్స్ టైటాన్స్ చేతిలో రెండుసార్లు ఓటమిని చవిచూసి.. ఒక్కసారి గెలిచింది. అయితే, ఇప్పుడు ఇరుజట్ల కెప్టెన్లు మారారు.
సన్‌రైజర్స్‌కు ప్యాట్ కమిన్స్.. టైటాన్స్‌కు శుబ్‌మన్ గిల్ సారథులుగా వచ్చారు. ఇదిలా ఉంటే.. ముంబైతో మ్యాచ్‌లో దంచికొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అదిరే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు.
గత రెండు మ్యాచ్‌లలోనూ వీరిద్దరు మెరుపు ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి బౌలర్లను తిప్పలు పెట్టారు. కోల్‌కతాతో మ్యాచ్లో అభిషేక్ 19 బంతుల్లో 32, క్లాసెన్ 29 బంతుల్లోనే ఏకంగా 63 పరుగులు సాధించారు. ఇక ముంబై ఆటగాళ్ల బౌలింగ్‌ను ఎలా ఊచకోత కోశారో తెలిసిందే. అభిషేక్ 23 బంతుల్లోనే 63, క్లాసెన్ 34 బంతుల్లోనే 80(నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగారు.
వీరికి తోడు టాపార్డర్‌లో ట్రవిస్ హెడ్, ఐడెన్ మార్క్రమ్ కూడా రాణిస్తుండటం సన్‌రైజర్స్‌కు సానుకూలాంశం. ఇక బౌలింగ్ విభాగంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు మరో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా తప్పకుండా ప్రభావం చూపగలడు.
మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఇంత వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. గత సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన గిల్.. తాజా ఎడిషన్ తొలి మ్యాచ్‌లో 22 బంతుల్లో 31 పరుగులతో పర్వాలేదనిపించినా.. రెండో మ్యాచ్‌లో 8 పరుగులకే పరిమితమై నిరాశపరిచాడు. టాపార్డర్‌లో సాయి సుదర్శన్ తప్ప ఇంకెవరూ ఇప్పటి వరకు బ్యాట్ ఝులిపించలేకపోయారు.
ఇక మహ్మద్ షమీ గాయం కారణంగా దూరం కావడం, హార్దిక్ పాండ్యా జట్టును వీడటంతో బౌలింగ్ విభాగం బలహీనమైంది. ఉమేశ్ యాదవ్ రాణిస్తున్నా నిలకడగా ఆడాల్సి ఉంది. రషీద్ ఖాన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్ రాణించడం సానుకూలాంశం.
తుదిజట్లు అంచనా
గుజరాత్ టైటాన్స్
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, ఆర్. సాయికిషోర్.
ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్
సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, మాథ్యూ వేడ్, షారుఖ్ ఖాన్.
సన్‌రైజర్స్ హైదరాబాద్
ట్రవిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్.
ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్:
టి. నటరాజన్, ట్రవిస్ హెడ్, ఉమ్రాన్ మాలిక్, ఫజల్హక్ ఫారూకీ.
చదవండి: #Mayank Yadav: నేను ఆరాధించే ఫాస్ట్ బౌలర్ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్‌గన్’
Comments
Please login to add a commentAdd a comment