హార్దిక్ పాండ్యా- ప్యాట్ కమిన్స్ (PC: MI/SRH)
ఐపీఎల్-2024ను ఓటములతో ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ రెండు జట్ల మధ్య పోరుకు ఉప్పల్ వేదిక కానుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం రాత్రి మ్యాచ్ జరుగనుంది.
తమ ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓడిన సన్‌రైజర్స్ సొంతమైదానంలో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి చవిచూసిన హార్దిక్ పాండ్యాకు ఇది రెండో మ్యాచ్.
గతంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్‌కు మంచి రికార్డు ఉన్న నేపథ్యంలో హార్దిక్‌కు ఉప్పల్ మ్యాచ్ మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. మరి ఎస్‌ఎఆర్‌హెచ్- ఎంఐ ముఖాముఖి రికార్డులు, రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇరు జట్ల ట్రాక్ రికార్డు, తుది జట్ల అంచనా తదితర వివరాలు గమనిద్దాం.
ముంబైదే పైచేయి
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్- ముంబై ఇప్పటివరకు 21 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో 12 సార్లు ముంబై గెలుపొందగా.. హైదరాబాద్ తొమ్మిదిసార్లు విజయం సాధించింది. గత ఐదు మ్యాచ్‌లలో మాత్రం సన్‌రైజర్స్ రికార్డు పేలవంగా ఉంది. ఐదింట కేవలం ఒక్క మ్యాచ్‌లోనే రైజర్స్ ముంబైపై పైచేయి సాధించగలిగింది.
రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇలా..
ఇక రాజీవ్ గాంధీ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్- ఎంఐ ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో చెరో నాలుగు గెలిచి సమంగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ ఇప్పటి వరకు 51 మ్యాచ్‌లు ఆడగా.. 30 విజయాలు సాధించి.. ఇరవై మ్యాచ్‌లలో ఓడింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. మరోవైపు.. ముంబై ఇక్కడ ఓవరాల్‌గా ఆడిన 12 మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి.. నాలుగు ఓడిపోయింది.
తుదిజట్ల అంచనా:
సన్‌రైజర్స్ హైదరాబాద్
మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, తంగరసు నటరాజన్, మయాంక్ మార్కండే.
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫక.
ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..
సన్‌రైజర్స్- ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్(టీవీ), జియో సినిమా(డిజిటల్)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
చదవండి: #CSKvsGT: శుబ్‌మన్ గిల్‌కు భారీ జరిమానా.. కారణం ఇదే
Comments
Please login to add a commentAdd a comment