ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త పాటను ఇవాళ (మార్చి 20) విడుదల చేసింది. క్యాచీ ట్యూన్ కలిగిన ఈ పాట "సన్‌రైజర్స్ మేము బ్రో పక్కా ఇంకో రేంజ్ బ్రో.." అంటూ సాగుతుంది. ఈ పాటలో సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్, మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్, విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్, కొత్త ఆటగాడు ట్రవిస్ హెడ్, భారత ఆటగాళ్లు భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ అగర్వాల్, జయదేవ్ ఉనద్కత్ తదితర ఆటగాళ్లు కొత్త జెర్సీలు ధరించి బీట్‌కు తగ్గట్టుగా చిందేశారు. సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్న ఈ పాట ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
𝑺𝒖𝒏𝑹𝒊𝒔𝒆𝒓𝒔 𝒎𝒆𝒎𝒖 𝒃𝒓𝒐,
— SunRisers Hyderabad (@SunRisers) March 20, 2024
𝑷𝒂𝒌𝒌𝒂 𝒊𝒏𝒌𝒐 𝒓𝒂𝒏𝒈𝒆 𝒃𝒓𝒐🧡
Our new anthem is here to set your playlist on fire🔥#SRHAnthem2024 #PlayWithFire #OrangeArmy pic.twitter.com/U4xRxhYfGv
కాగా, ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీతో తలపడుతుంది. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ కేకేఆర్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, జయదేవ్ ఉనాద్కట్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్.
తొలి విడత షెడ్యూల్‌లో సన్‌రైజర్స్ ఆడే మ్యాచ్‌ల వివరాలు..
- మార్చి 23 (శనివారం): కోల్‌కతాలో కేకేఆర్‌తో (రాత్రి 7:30 గంటలకు)
- మార్చి 27 (బుధవారం): హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో (రాత్రి 7:30)
- మార్చి 31 (ఆదివారం): అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో (మధ్యాహ్నం 3:30 గంటలకు)
- ఏప్రిల్ 5 (శుక్రవారం): హైదరాబాద్‌లో సీఎస్‌కే (రాత్రి 7:30 గంటలకు)
Comments
Please login to add a commentAdd a comment