
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ముగిసిన రెండో టెస్టు ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన టెస్టు మ్యాచ్.. అసలు మజా ఎలా ఉంటుందో రుచి చూపించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. అతి తక్కువ మార్జిన్‌తో టెస్టు క్రికెట్‌లో విజయం సాధించిన రెండో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.
ఇంతకముందు 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. తాజాగా 30 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కివీస్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. అతి తక్కువ మార్జిన్‌తో విజయం సాధించిన జాబితాలో విండీస్‌తో సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచింది కివీస్. ఇంతకముందు 2011లో ఆస్ట్రేలియాపై ఏడు పరుగుల తేడాతో, 2018లో పాకిస్తాన్‌పై నాలుగు పరుగుల తేడాతో అతి తక్కువ మార్జిన్ తేడాతో విజయాలు అందుకుంది.
ఇక టెస్టు క్రికెట్‌లో అతి తక్కువ మార్జిన్‌తో విజయాలు సాధించిన జట్ల జాబితా పరిశీలిస్తే...
► 1993లో ఆస్ట్రేలియాపై ఒక్క పరుగు తేడాతో వెస్టిండీస్ విక్టరీ
► 2023లో ఇంగ్లండ్‌పై ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం
► 2005లో ఆస్ట్రేలియాపై రెండు పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం
► 1902లో ఇంగ్లండ్‌పై మూడు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం
► 1982లో ఆస్ట్రేలియాపై మూడు పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం
► 2018లో పాకిస్తాన్‌పై నాలుగు పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం
► 1994లో ఆస్ట్రేలియాపై ఐదు పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం
► 1885లో ఇంగ్లండ్‌పై ఆరు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం
Incredible scenes at the Basin Reserve. A thrilling end to the 2nd Test in Wellington 🏏 #NZvENG pic.twitter.com/tyG7laNtdP
— BLACKCAPS (@BLACKCAPS) February 28, 2023