
నేడో, రేపో ప్రారంభం కానున్న దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నిరుద్యోగులకు కూడా రాజీవ్ యువ వికాసం పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఆది లేదా సోమవారాల్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. శనివారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈబీసీలకు రాయితీ రుణాలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఇప్పటికే రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజీవ్ వికాసం పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈబీసీ రాయితీ రుణాలకు సంబంధించిన అంశం పెండింగ్‌లో ఉండటంతో మార్గదర్శకాల జారీలో ఆలస్యమైనట్లు సమాచారం.
ఈ పథకం మార్గదర్శకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచాయి. వీటిని ఆమోదించి, ఉత్తర్వులు జారీ చేసిన మరుక్షణమే ఈబీసీల దరఖాస్తులను ఓబీఎంఎంఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రి పొన్నం, ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ కె. రామకృష్ణారావు