
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఉదయం శంషాబాద్ విమానాశ్రయంనుంచి ప్రత్యేక విమానంలో ఈటల రాజేందర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, రమేశ్ రాథోడ్, తుల ఉమతో పాటు ముఖ్యనేతలు మొత్తంగా 20 మంది వరకు పార్టీలో చేరేందుకు ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అపాయింట్‌మెంట్ తీసుకున్నారు.
వీరంతా ఉదయం 11:30 గంటలకు బీజేపీ జాతీయ కార్యాలయంలో నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలోనే ఉండగా, జమ్మూ కశ్మీర్‌లో ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. వీరంతా తిరిగి 15న హైదరాబాద్‌కు చేరుకుంటారు.
చదవండి: కురుక్షేత్ర యుద్ధంలో ఈటల పాత్ర ఏంటో చెప్పాలి?
‘స్వార్థం కోసమే ఈటల రాజీనామా చేశారు’