
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 2,398 మందికి కోవిడ్–19 వ్యాప్తి చెందినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 7,05,199 మంది కోవిడ్–19 బారిన పడగా, వీరిలో 6,79,471 మంది కోలుకున్నారు. మరో 21,676 మంది చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 4,052కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 68,525 నిర్ధారణ పరీక్షలు చేయగా, 10,118 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉంది. కోవిడ్–19 నిర్ధారణ కోసం రాష్ట్రంలో ఇప్పటివరకు 3.05కోట్ల నమూనాలను పరిశీలించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.