రాజధాని ప్రాంతంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. స్విస్ చాలెంజ్ వి ధానం కింద సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఇచ్చిన జీవో 170కి సవరణ చేస్తూ ఈ ఏడాది జనవరి 2న ప్రభుత్వం జీవో 1ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో 1ను సవాలు చేస్తూ చెన్నైకి చెందిన ‘ఎన్వియన్ ఇం జనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ప్రతినిధి కె.శ్రీధర్ రావు న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశా రు. ఇందులో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. జనవరి 2న జారీ చేసిన జీవో ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ) చట్ట నిబంధనలకు విరుద్ధమని ఎన్వియన్ సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్, టెండర్ ప్రక్రియను రద్దు చేసి, తాజాగా ఓపెన్ బిడ్డింగ్ విధానం ద్వారా టెండర్ల ప్రక్రియను చేపట్టేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరింది.