అనంతపురం: కళాశాల లెక్చరర్లు ఒత్తిడి పెట్టడంతో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన అనంతపురం పట్టణంలో బుధవారం జరిగింది. భరత్‌కుమార్ అనే విద్యార్థి అనంతపురంలోని నారాయణ కాలేజ్ లో జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. చదువుకోసం లెక్చరర్లు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక బుధవారం ఉదయం తన ఇంటిలో ఆత్మహత్యాయత్నం చేశాడు. సకాలంలో తల్లిదండ్రులు గుర్తించి అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.