అధికార టీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత కమిటీలను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించనున్నారు. పొలి ట్‌బ్యూరో మినహా పార్టీకి చెందిన అన్ని స్థాయిల కమిటీలను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర స్థాయి కమిటీపై కసరత్తు కొనసాగుతోందని.. దానిని కూడా పూర్తిచేసి తెలంగాణ భవన్‌లో సంస్థాగత కమిటీలను వెల్లడిస్తారని పేర్కొంటున్నాయి. వాస్తవానికి తొలుత జిల్లా కమిటీల అధ్యక్షులను మాత్రమే ప్రకటించి, తర్వాత ఒక్కొక్కటిగా కమిటీలను ప్రకటించాలని భావించారు.