తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీ వర్గీయులు నడిరోడ్డుపై బాహీబాహీకి దిగిన సంఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. అందులోనూ ఇరు పార్టీలకు చెందిన ఎంపీ, జిల్లా కార్యదర్శి రోడ్డుపై కొట్టుకోవటం తిరుచ్చి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే... తిరుచ్చి జిల్లా పొన్మలైలో బస్టాండ్ షెల్టర్ నిర్మాణం చేపట్టాలంటూ ప్రజలు గత ఐదేళ్లుగా స్థానిక అన్నాడిఎంకె ఎంపీ కుమార్‌ను కోరుతున్నారు.