కశ్మీర్లో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్కు దీటైన సమాధానం చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పాకిస్తాన్ చాలా పెద్ద తప్పు చేసిందని, దాడికి పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పుల్వామాలో ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోతోందని తెలిపారు.