మోదీ సర్కారు మరోసారి బడ్జెట్ ఇన్నింగ్స్‌కు సిద్ధమైంది. ఎనిమిది కీలక రాష్ట్రాల ఎన్నికలకుతోడు సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో.. ఈ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో అటు ప్రజాకర్షక మంత్రాన్ని జపిస్తూనే, ఇటు ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీపై పడింది.