సమ్మెను ఆర్టీసీ కార్మికులు మరింత ఉధృతం చేశారు. సమ్మెపై ప్రభుత్వ తీరుకు నిరసనగా రెండు రోజుల క్రితం ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించిన ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందడంతో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు భగ్గుమన్నారు. ఆయన మరణవార్త అధికారికంగా వెలువడగానే పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు.