RTC JAC
-
నేడు గవర్నర్‌తో ఆర్టీసీ జేఏసీ భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లుపై చర్చించేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో మంగళవారం ఉదయం 8 గంటలకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భేటీ కానుంది. కొద్దిరోజుల క్రితమే సచివాలయం నుంచి బిల్లు రాజ్‌భవన్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవలే గవర్నర్ ప్రకటించారు. అసెంబ్లీ ఆమోదం పొంది నెలపైనే గడిచినందున వీలైనంత తొందరలో బిల్లు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదించి పంపాలని జేఏసీ కోరనుందని జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వంలో విలీనం కంటే ముందే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆర్థిక అంశాలను ప్రభుత్వం పరిష్కరించేలా చూడాలని కూడా వారు కోరనున్నట్టు తెలిసింది. రెండు వేతన సవరణలుసహా మొత్తం 30 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్‌కు సమర్పించనున్నారు. -
ఎన్నికలు వద్దంటూ సంతకాలు చేయించడం సరికాదు
-
సీఎం ఆదేశాలు అమలు కావట్లేదు : అశ్వత్థామ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ప్రజాస్వామ్య దేశంలో డిపోల్లో రెండేళ్ల వరకు ఎన్నికలు వద్దంటూ సంతకాలు చేయించడం సరికాదంటూ అశ్వత్థామ రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ తరపున ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల డ్యూటీల విషయంలో సీఎం ఆదేశాలను అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కొన్ని బస్సులను రద్దు చేస్తున్నారని, సమ్మె కాలంలో కొందరు అధికారులు చేసిన నిధుల దుర్వినియోగంపై ఏసీబీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొందరు అధికారుల కోసమే రిటైర్మెంట్ వయసు పెంచారని, ప్రస్తుతం ఏ ఒక్క కార్మికుడు కూడా తృప్తిగా పని చేయడం లేదన్నారు. లేబర్ కమిషన్ చెప్పినా మా సంఘాలు వద్దని చెబుతున్నారని, ఆర్టీసీలో యూనియన్లను గుర్తించాలని కోరారు. ఎన్నికలు జరిగేవరకు ప్రస్తుత గుర్తింపు సంఘాలను గుర్తించాలి. లేదంటే న్యాయపోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు -
రెండేళ్ల వరకు గుర్తింపు సంఘం ఎన్నికలొద్దు
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల క్రితం... కార్మికులంతా సంఘటితంగా ఉద్యమించి డిమాండ్ల సాధనకు దీక్షగా సమ్మెలో పాల్గొన్నారు. విధుల్లో చేరండంటూ ముఖ్యమంత్రి మూడు సార్లు పిలిచినా స్పందించకుండా కార్మిక సంఘ నేతల సూచనలకే పెద్ద పీట వేశారు. ఇప్పుడు తీరు మారిపోయింది. రెండేళ్ల వరకు తమ కార్మిక సంఘాలకు ఎన్నికలే వద్దంటూ ఇప్పుడు ఆ కార్మికుల సంతకాలతోనే మూకుమ్మడి లేఖలు లేబర్ కమిషనర్‌కు అందుతున్నాయి . గత ఆదివారం సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో, రెండేళ్ల వరకు యూనియన్లే అవసరం లేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిపోల వారీగా ఓ నిర్దేశిత పత్రం సిద్ధం చేసి దానిపై కార్మికుల సంతకాలు తీసుకుని లేబర్ కమిషనర్ కార్యాలయానికి పంపుతున్నారు. దీనిపై మళ్లీ కార్మిక సంఘాల జేఏసీ స్పందించింది. ఇది వేధించటమేనని పేర్కొంటూ నిరసనగా శుక్రవారం డిపోల ఎదుట ధర్నాలకు పిలుపునిచ్చింది. ‘వెల్ఫేర్ కౌన్సిళ్లపై నమ్మకం ఉన్నందునే...’ డిపో స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం వెల్ఫేర్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలని ఆత్మీయ సమ్మేళనంలో సీఎం సూచించారు. ప్రతి డిపో నుంచి ఇద్దరు చొప్పున ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని, ఆ కమిటీలే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాయన్నారు. రెండేళ్ల వరకు ఇక కార్మిక సంఘాలతో పని ఉండదని, అప్పటి వరకు గుర్తింపు సంఘం ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన పనిలేదని ఆయన వివరించారు. రెండేళ్ల తర్వాత యూనియన్లు అవసరమన్న అభిప్రాయం వ్యక్తమైతే అప్పుడు చూద్దామని ముక్తాయించారు. దీనికి అనుగుణంగా అధికారులు చర్య లు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి లేఖల కార్యక్రమం మొదలైంది. కార్మికుల సమస్యను తక్షణం పరిష్కరించేందుకు ‘వెల్ఫేర్ కౌన్సిళ్లు’కృషి చేస్తాయన్న నమ్మకం తమకు ఉందని, రెండేళ్ల వరకు గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు అవసరం లేదని ఏ డిపోకు ఆ డిపోగా ఓ నమూనా సిద్ధం చేసి కార్మికులందరితో సంతకాలు తీసుకుంటున్నారు. జేఏసీ నేతలు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కార్మికులకు ఇష్టం లేకపోయినా, అధికారులు బలవంతంగా వారితో సంతకాలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరోసారి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో మంగళవారం ప్రారంభమైన ఈ సమీక్షా సమావేశంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నివేదికపై ఈ సమీక్షా సమావేశంలో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నివేదికను గురువారం జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రూట్లను ప్రైవేటీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర హైకోర్టు కూడా రూట్ల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీకి సంబంధించిన తాజా పరిణామాలను సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. చదవండి: ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం? అత్యంత సుదీర్ఘంగా 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ సోమవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు, కార్మికుల కోణంలో ఆలోచించి సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రభుత్వం అవునన్నా.. కాదన్నా మంగళవారం నుంచి కార్మికులు విధులకు హాజరుకావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అయితే, కార్మికులు సమ్మె విరమించినా.. విధుల్లోకి తీసుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందంటూ ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే..మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని జేఏసీ చెప్పడాన్ని ప్రకటనలో తప్పుబట్టారు. ఈ క్రమంలో మంగళవారం విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు పెద్దసంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు కార్మికులను అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఆర్టీసీ కార్మికుల పోరాటం.. తీరని విషాదం
సాక్షి, నిజామాబాద్/ సంగారెడ్డి : అత్యంత సుదీర్ఘంగా కొనసాగిన సమ్మెను విరమించినప్పటికీ ప్రభుత్వం విధుల్లోకి చేర్చుకునేందుకు నిరాకరించడంతో తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సమస్యలు పరిష్కరించాలని సమ్మెలోకి వెళ్లినందుకు ఇప్పుడు ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా డిపోల వద్దకు చేరుకున్న కార్మికులు తమను విధుల్లోకి చేర్చుకోవాలని వేడుకుంటున్నారు. ఉద్యోగం కోసం కంటతడి పెడుతూ.. కార్మికులు పలుచోట్ల ప్రభుత్వాన్ని, అధికారులను ప్రాధేయపడుతున్నారు. డిపోల మందు ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేందర్ (55) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమ్మె విరమించినా ప్రభుత్వం తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకపోవడంతో రాజేందర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ఈ క్రమంలో ఇంటివద్ద ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని, గుండెపోటుతో రాజేందర్ మృతి చెందారని కార్మికులు తెలిపారు. రాజేందర్‌ది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్‌పాడ్ గ్రామం. నురగలు కక్కుతూ పడిపోయిన ఆర్టీసీ కార్మికుడు సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్లోనూ విషాద ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న భీమ్లా మంగళవారం ఉదయం తిరిగి విధుల్లోకి చేరేందుకు సంగారెడ్డి డిపోకు వచ్చాడు. అయితే, అతన్ని విధుల్లోకి తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. ఈ క్రమంలో పోలీసులు భీమ్లాను అరెస్టు చేసి.. ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భీమ్లా నురగలు కక్కుతూ ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో ఆయనను తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగం పోతుందన్న ఆందోళనతో భీమ్లాకు గుండెపోటు వచ్చిందని తోటి కార్మికులు తెలిపారు. మేనేజర్ కాళ్ళు మొక్కిన కార్మికులు విధుల్లో చేరేందుకు నిజామాబాద్ డిపో 1కు ఆర్టీసీ కార్మికులు మంగళవారం భారీగా తరలివచ్చారు. తమను విధుల్లో చేర్చుకోవాలని డిపో మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అయితే, వారిని విధుల్లోకి చేర్చుకోలేమని డిపో మేనేజర్ తేల్చి చెప్పారు. దీంతో ఆందోళన చెందిన కార్మికులు మేనేజర్ కాళ్ళు మొక్కి డ్యూటీలో చేర్చుకోవాలని వేడుకున్నారు. -
ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ.. ఆశలన్నీ సీఎంపైనే
సాక్షి, హైదరాబాద్: కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమకు అనుకూలంగా సీఎం నిర్ణయం తీసుకుంటారా? లేక ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి ఉంటారా అనేది ఆసక్తికరంగా మరాంది. రెండు నెలలుగా వేతనాలు లేకుండా సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని జేఏసీ ప్రతిపాదించింది. దీంతో విధుల్లో చేరతామంటూ గురువారం రాష్ట్రంలోని వివిధ డిపోలకు కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి కూడా డిపోల వద్ద ఇదే పరిస్థితి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి తీసుకోవద్దని, విధుల్లో చేరేందుకు సిద్ధమంటూ లేఖలు ఇచ్చినా కూడా తీసుకోవద్దని డిపో మేనేజర్లకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి చేర్చుకోవడం సాధ్యం కాదని మేనేజర్లు వారికి చెప్పి పంపించేస్తున్నారు. మరోవైపు ఆర్టీసిని నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలని, అంత శక్తి ప్రభుత్వ వద్ద లేదని సీఎం చేసిన వ్యాఖ్యలు కార్మికుల్లో కలవరం రేపుతున్నాయి. దీంతో వారి ఆశలన్నీ సీఎం తీసుకునే నిర్ణయంపైనే ఉన్నాయి. మరోవైపు ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తూ ఆర్టీసీ రూట్లను కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ కొనసాగనుంది. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ సందర్భంగా సమ్మె విరమణ ప్రతిపాదనపై చర్చించి తన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, సమ్మెకు సంబంధించిన అంశం కార్మిక న్యాయస్థానంలోనే తేల్చాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో, అది తేలిన తర్వాతే వారిని విధుల్లోకి చేర్చుకునే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని కార్మికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
ఆర్టీసీ సమ్మె విరమణ పేరిట మోసం..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విరమణ విషయంలో కార్మిక సంఘాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటే.. సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ బుధవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జేఏసీ ప్రకటనపై టీజేఎంయూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించినా.. జేఏసీ-1 సమ్మె విరమించేది లేదని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. సమ్మెలో ఇప్పటివరకు 29మంది ఆర్టీసీ కార్మికులు మరణించారని ఆయన తెలిపారు. మరణించిన కుటుంబాలను ఎవరూ ఆదుకోలేదని తెలిపారు. దీనికితోడు సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని పలు డిపోల పరిధిలో కార్మికులపై కేసులు కూడా నమోదయ్యాయని, వాటిపై ఏం మాట్లాడకుండా సమ్మె విరమిస్తున్నామని జేఏసీ చెప్పడం.. కార్మికులను మోసం చేయడమేనని హనుమంతు మండిపడ్డారు. ఇలా విరమించాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడే సమ్మె విరమిస్తే సరిపోయేదని, కార్మికులను బలి పశువులను చేస్తూ జేఏసీ సమ్మె విరమణ ప్రకటన చేసిందని ఆయన అన్నారు. ఆర్టీసీ జేఏసీ కేవలం మూడు కార్మిక సంఘాలను కలుపుకొని మాత్రమే ముందుకు వెళ్తోందన్నారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అసమర్థత వల్లే ఆర్టీసీలో సమస్యలు పేరుకుపోయాయని పేర్కన్నారు. ఆర్టీసీ కార్మికులు చాలావరకు పేద వాళ్ళు అని, ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయకుండా కాపాడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ తమను పిలిచి కార్మికుల సమస్యల గురించి తెలుసుకోవాలని కోరుతున్నామని అన్నారు. -
సాయంత్రం ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ఆర్టీసీపై సమీక్ష జరపనున్నారు. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదన, హైకోర్టులో కేసు, ఇతర అంశాలపై ఆయన చర్చించనున్నారు. కాగా ఎలాంటి షరతులు విధించకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పలు అంశాలపై అక్టోబర్ 4న ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. కాగా న్యాయస్థానంలో కూడా కార్మికులకు ఊరట లభించలేదు. దీంతో విలీన ప్రతిపాదనను పది రోజుల క్రితమే ఆర్టీసీ జేఏసీ పక్కన పెట్టింది. తాజాగా ఎలాంటి షరతులు లేకుండా తమ సూచనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమణకు సిద్ధమని, లేనిపక్షంలో సమ్మె కొనసాగిస్తామని జేఏసీ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ ప్రకటనతో పలుచోట్ల కార్మికుల్లో అయోమయం నెలకొంది. సమ్మె విరమణపై కార్మికులు తర్జనభర్జన పడుతున్నారు. చదవండి: ఆర్టీసీ సమ్మె విరమణ..! సమ్మెపై సాయంత్రానికి స్పష్టత తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ... ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తే ఏం చేయాలనే అంశంపై చర్చించనున్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సి వస్తే ఎలాంటి షరతులు ఉండాలి, భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై చర్చించి, అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లనున్నారు. ఇక సమ్మె విరమిస్తే విధుల్లోకి చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి ఆదేశాల కోసం కార్మికులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఆర్టీసీ సమ్మె విరమణ... ప్రభుత్వ స్పందన?!
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఆర్టీసీ కార్మికులు 47 రోజులపాటు సుదీర్ఘంగా నిర్వహించిన సమ్మె ఎట్టకేలకు ముగిసింది. గత అక్టోబర్ 4వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన సమ్మెలో దాదాపు 50వేలమంది కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం విధుల్లో చేరాలని రెండుసార్లు గడువు విధించినప్పటికీ.. కార్మికులు పెద్దగా చలించలేదు. కొంతమంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. ఆర్టీసీ కార్మికుల్లో ఎక్కువశాతం దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. వారు నెలన్నరకుపైగా తమకు వచ్చే జీతాలను సైతం పణంగా పెట్టి సమ్మె చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం ముందుకు, సమాజం ముందుకు తీసుకురాగలిగారు. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా.. ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, నిత్యావసరాల ఖర్చులు ఇలా అనేక సమస్యలు వెంటాడినా కార్మికులు మూకుమ్మడిగా నిలబడి ఉద్యమం చేశారు. ఈ సమ్మెకాలంలో పలువురు కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోయి.. ఆత్యహత్యలు చేసుకున్నారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో కార్మికులు తమ సమ్మెను విరమణకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, మళ్లీ సమ్మెకు పూర్వం ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం కల్పించాలని, విధుల్లోకి చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. సుదీర్ఘ సమ్మె నేపథ్యంలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమించి.. తిరిగి విధుల్లోకి చేరేందుకు సమ్మతించిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ సమ్మె విషయంలో ఒకింత చురుగ్గా వ్యవహరించారు. పలుమార్లు సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కాపాడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవంటూ ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను అంగీకరించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, వెంటనే విధుల్లోకి చేరాలని సీఎం కేసీఆర్ గతంలో రెండుసార్లు కార్మికులకు డెడ్‌లైన్ విధించారు. ఆ డెడ్లైన్లకు పెద్దగా కార్మికుల నుంచి స్పందన రాలేదు. కానీ, హైకోర్టు ఉత్తర్వులు, మారిన పరిస్థితుల నేపథ్యంలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమణకు ఒప్పుకోవడంతో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందని ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం కోరినట్టు బేషరతుగా విధుల్లోకి చేరేందుకు కార్మికులు ముందుకొచ్చారు. అంతేకాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను సైతం కార్మికులు వదులుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘంగా నిర్వహించిన సమ్మె రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత ఇరకాటంలో నెట్టింది. ప్రజలు కూడా ఇబ్బందుల పాలయ్యారు. ముఖ్యంగా దసరా పండుగ సమయంలో సమ్మె చేపట్టడం.. పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవ్వడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. అయితే, 50వేలమంది కార్మికుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు వారికి విధుల్లో చేరేందుకు గడువు ఇచ్చింది. తాజాగా కూడా ప్రభుత్వం కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కార్మికులను బేషరతుగా ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంటుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. -
ఆర్టీసీ సమ్మె విరమణ..!
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడింది. 47 రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగిన సమ్మెను విరమించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. బేషరతుగా కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని, ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. సమ్మె విరమించి మళ్లీ విధుల్లోకి చేరుతామని ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. విధుల్లో చేరిన కార్మికులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, సమ్మెకు ముందున్న పరిస్థితులను సంస్థలో మళ్లీ కల్పించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎటువంటి ఆంక్షలు, నిబంధనలు లేకుంటేనే కార్మికులు మళ్లీ విధుల్లోకి చేరుతారని, కార్మికులు విధుల్లో చేరితే డ్యూటీ చార్జ్‌ల మీద మాత్రమే సంతకాలు పెడతారని ఆయన తెలిపారు. సమ్మె కొనసాగింపుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు నిన్నటినుంచి తీవ్ర తర్జనభర్జనలకు లోనైన సంగతి తెలిసిందే. సమ్మె అంశాన్ని హైకోర్టు లేబర్ కోర్టుకు నివేదించడంతో.. సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు పునరాలోచనలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ బుధవారం కూడా సమావేశమైంది. సమ్మె విషయమై లేబర్ కమిషన్‌కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సమావేశంలో నేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. మరోవైపు కొనసాగింపు కార్మికుల్లో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. గత 47 రోజులుగా సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా సమ్మె కొనసాగించడం సమంజసం కాదని, ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడటంతో సమ్మె విరమణకే జేఏసీ మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. అయితే, ఉద్యోగ భద్రతపై కార్మికుల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. కార్మికులు సమ్మె విరమణకు ఓకే చెప్పడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
ఆర్టీసీ సమ్మెపై సందిగ్ధం!
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెను కొనసాగించాలా వద్దా అనే అంశంపై విషయంలో కార్మిక సంఘాల జేఏసీ సందిగ్ధంలో పడింది. కేసు కార్మిక న్యాయస్థానానికి చేరడం, డిమాండ్లకు సంబంధించి హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగింపు విషయంలో కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో మంగళవారం జేఏసీ ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయింది. హైకోర్టు నుంచి అందిన తుది ఉత్తర్వు ప్రతిని పూర్తిగా పరిశీలించి బుధవారం న్యాయవాదులతో చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. అప్పటివరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. విడివిడిగా సమావేశాలు... ఒకటిగా సమాలోచనలు.. సమ్మెకు సంబంధించి హైకోర్టులో వాదనలు దాదాపు పూర్తయిన నేపథ్యంలో మంగళవారం కార్మికుల్లో కలకలం మొదలైంది. ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు వస్తాయన్న ఆశతో ఉన్న కార్మికులు... తాజా పరిణామాలతో కొంత ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం మాత్రం సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నందున, ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకొని సమ్మె విషయాన్ని తేలిస్తే బాగుంటుందంటూ జేఏసీ నేతలపై ఒత్తిడి వచ్చింది. దీంతో జేఏసీలోని కార్మిక సంఘాలు విడివిడిగా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. డిపోలవారీగా కమిటీ ప్రతినిధులను ఆహ్వానించి అభిప్రాయ సేకరణ జరిపాయి. టీఎంయూ, ఈయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, సూపర్వైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కార్మికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సమ్మె విషయంపై చర్చిస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలు కొందరు అలా.. మరికొందరు ఇలా 46 రోజులపాటు ఉధృతంగా సమ్మె కొనసాగించినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం, ఇప్పటికే రెండు నెలలపాటు వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన నేపథ్యంలో సమ్మెను విరమించి విధుల్లో చేరడం ఉత్తమమని పెద్ద సంఖ్యలో కార్మికులు అభిప్రాయపడ్డారు. అయితే ఇన్ని రోజులు సమ్మె చేసి ఒక్క డిమాండ్‌కు కూడా ప్రభుత్వం అంగీకరించకపోయినా విధుల్లో చేరితే భవిష్యత్తులో కనీసం ఉద్యోగ భద్రత కూడా ఉండదని, తాడోపేడో తేలేంత వరకు సమ్మె కొనసాగించాల్సిందేనని కూడా ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. సమ్మెను కొనసాగిస్తే ఉద్యోగ భద్రత కరువైందన్న ఆందోళనతో మరికొందరు మరణించే ప్రమాదం ఉన్నందున ఈ విషయాన్ని కూడా పరిగణించాలని కొందరు సూచించారు. సూపర్వైజర్ల సంఘం భేటీలో మాత్రం ఎక్కువ మంది సమ్మెను విరమించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా భిన్న వాదనలు వినిపించడంతో కార్మిక సంఘాలు ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయాయి. అనంతరం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత జేఏసీ భేటీ అయింది. అప్పటివరకు సంఘాలుగా కార్మికుల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ఇందులో చర్చించారు. జేఏసీలో కూడా మళ్లీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం మొండిపట్టుతో ఉన్నందున కార్మికులు కూడా సమ్మెను కొనసాగించాలంటూ ఓ సంఘానికి చెందిన నేతలు పేర్కొన్నారు. సమ్మె విరమించాక ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకుంటే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. సమ్మె విరమించి వస్తే విధుల్లోకి తీసుకుంటామని ప్రభుత్వం నుంచి స్పష్టత కోరి దానిపై నిర్ణయం తీసుకుంటే మంచిదంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం మధ్యవర్తిత్వం నెరపడం సరికాదని మరొకరు పేర్కొన్నారు. వెరసి మరికొంత సమ యం తీసుకొని తుది నిర్ణయానికి రావాలని తీర్మానించారు. ఇందుకు న్యాయవాదులతో కూడా చర్చించాలని నిర్ణయించారు. కోర్టు పేర్కొన్న విషయాలపైనా కూలంకషంగా చర్చించాలని, ఇం దుకు న్యాయవాదులతో మాట్లాడాలని నిర్ణయించి తుది నిర్ణయాన్ని బుధవారానికి వాయిదా వేశారు. జేఏసీ నిర్ణయానికి కార్మికులు కట్టుబడతామన్నారు: అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ జేఏసీ తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డిపోలకు సంబంధించిన కమిటీల ప్రతినిధులు తేల్చిచెప్పారని సమావేశానంతరం అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం న్యాయవాదులతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. ఇప్పటివరకు మరణించిన కార్మికుల కుటుంబాలను కూడా ఆదుకుంటామన్నారు. మరోవైపు బుధవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన జేఏసీ–1, ఎన్ఎంయూ నేతలు తుది నిర్ణయం వెల్లడించనున్నారు. ఆ సంఘాలకు సంబంధించిన కార్మికుల్లో ఎక్కువ మంది సమ్మె కొనసాగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. -
ముగిసిన ఆర్టీసీ జేఏసీ భేటీ.. కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: సమ్మె కొనసాగించాలా? వద్దా? అని దానిపై ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం ముగిసింది. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె కొనసాగింపుపై కార్మికుల అభిప్రాయం తీసుకున్నామని, ఆర్టీసీ జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికుల హామీ ఇచ్చారని వివరించారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు కాపీ ఇంకా తమకు అందలేదని, కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రేపు హైకోర్టు తుది తీర్పు ప్రకటించిన తరువాత సమ్మెపై జేఏసీ నిర్ణయం తీసుకుంటుందని, కోర్టు తీర్పు తరవాత రెండు రోజుల్లో ఆర్టీసీ జేఏసీ నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు. జేఏసీ తుది నిర్ణయం తీసుకునేవరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందన్నారు. ఎల్బీనగర్ హిమగిరి ఫంక్షన్ హాల్లో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. కార్మికుల సమ్మె అంశంతోపాటు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించిన అనంతరం కార్మిక సంఘాల నేతలు కీలక నిర్ణయం వెలువరించే అవకాశముంది. అంతకుముందు కార్మిక సంఘాల నేతలు విడివిడిగా సమావేశమై.. తెలంగాణవ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను డిపోలవారీగా సేకరించారు. ఎల్బీనగర్లోని హిమాగిరి ఫంక్షన్ హాల్లో టీఎంయూ నేతలు, కేకే గార్డెన్‌లోని ఈయూ నేతలు, సీఐటీయూ కార్యాలయంలో ఎస్టీఎఫ్ నేతలు, టీజేఎంయూ కార్యాలయంలో ఆ సంఘం నేతలు సమావేశమై చర్చించారు. జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఉద్యోగ భద్రతపై గ్యారెంటీ ఏది? 46 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం వాదన ఏమిటి, కార్మికుల తరఫున ఏ వాదన వినిపించారు, కోర్టులు ఏం చెప్పాయి అన్నది చర్చించారు. అయితే, సమ్మె విరమణ విషయంలో కార్మికుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేవని, ఇంకా సమ్మె కొనసాగిస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయని, లేబర్ కోర్టులో ఈ అంశం తేలడానికి చాలా సమయం పడుతుందని కొంతమంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. మరికొంతమంది ఎన్ని రోజులైనా ప్రభుత్వం దిగొచ్చేవరకు సమ్మె కొనసాగించాల్సిందేనని పట్టుబట్టినట్టు సమాచారం. ఉన్నపళంగా సమ్మె విరమిస్తే ఉద్యోగ భద్రత ఏమిటని కార్మికులు నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. సమ్మెను విరమిస్తే ప్రభుత్వం ఉద్యోగంలోకి తీసుకుంటుందో లేదా అన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. కనీసం లేబర్ కోర్టులో తేలేవరకైనా సమ్మె కొనసాగించాలని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఈయూ సమావేశంలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం. బ్యాలెట్ పెట్టి కార్మికుల అభిప్రాయం తీసుకోవాలని, ప్రభుత్వం నుంచి ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ పొందిన తర్వాత సమ్మె విరమించాలని పలువురు కార్మికులు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. లేబర్ కమీషన్‌కు హైకోర్టు ఇచ్చిన 15 రోజుల సమయం వరకు వేచిచూద్దామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని కార్మికుల్లో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సమ్మెపై తర్జనభర్జన ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర తర్జనభర్జనలకు లోనవుతున్నారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించడం.. సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు నివేదించడంతో ఇరకాటంలో పడిన కార్మిక సంఘాల నేతలు.. సమ్మె కొనసాగింపుపై పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 46రోజులుగా కొనసాగిస్తున్న ఆర్టీసీ సమ్మెను విరమించే అవకాశముందని సమాచారం. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశమై.. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింపుపై తుది ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. సమ్మె నేపథ్యంలో చోటుచేసుకున్న 24 మంది ఆర్టీసీ కార్మికుల మరణాలపైనా కార్మిక నేతల మధ్య చర్చ జరిగింది. కార్మికులు సమ్మె విరమించి.. బేషరతుగా విధుల్లోకి చేరేందుకు ముందుకొస్తే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కార్మికులు విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం రెండు గడువు విధించింది. ఈ డెడ్లైన్లకు అప్పట్లో పెద్దగా స్పందన రాని విషయం తెలిసిందే. -
హైకోర్టు తీర్పుకాపీ అందేవరకూ ఆందోళనలు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే.. అవి దొందూ దొందే అన్న చందంగా మారాయనే విషయం స్పష్టమవుతోందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ నాయకుడు లింగమూర్తి మూడు రోజులుగా రాంనగర్లో చేస్తున్న నిరాహార దీక్షను సోమవారం రాత్రి అఖిలపక్షం నేతలు ప్రొఫెసర్ కోదండరాం, చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం, వినోద్‌రెడ్డి, మందకృష్ణ మాదిగ, కె.గోవర్ధన్, కె.రమ తదితరులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు సంతృప్తికరంగా లేదన్నారు. గత 45 రోజులుగా ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి కోర్టు అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటికీ సమ్మెను చట్ట వ్యతిరేకంగా గుర్తించడానికి కోర్టు అంగీకరించలేదని, కార్మికులను బిడ్డలుగా చూడాలి తప్ప అణచివేసే ధోరణి మంచిదికాదని మొదటి నుంచీ చెబుతోందని తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీ చూసేవరకు ఆందోళనలు ఆపకుండా యథావిధిగా కొనసాగుతాయని, నేడు తలపెట్టిన సడక్ బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో ప్రధాన డిమాండ్లు సాధ్యమవుతున్నప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో సాధ్యం కాకపోవడానికి కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టాలనే స్వార్థ బుద్ధే అసలు కారణమనే విషయాన్ని తెలంగాణ సమాజం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోందన్నారు. హైకోర్టు సాక్షిగా దాఖలు చేసిన పిటిషన్, కేసీఆర్ మాటలు ఒకేరకంగా ఉన్నాయన్నారు. కార్మికుల సమ్మె పట్ల కేసీఆర్ దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల 45 రోజుల సమ్మె చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకట్, సుధాభాస్కర్, డి.జి. నర్సింగ్‌రావు, న్యూడెమోక్రసీ నాయకులు హన్మేష్, ఎస్.ఎల్. పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మె.. లేబర్ కోర్టే తేలుస్తుంది
సాక్షి, హైదరాబాద్ : ‘ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని తేల్చే అధికారం కన్సిలియేషన్ అధికారి అయిన కార్మిక శాఖ జాయింట్ కమిషనర్‌కు లేదు. సమ్మె చర్చలు విఫలమైనట్లుగా ప్రభుత్వానికి తెలియజేసే అధికారం మాత్రమే కన్సిలియేషన్ అధికారికి ఉంటుంది. సమ్మె చట్టవిరుద్ధమో కాదో తేల్చాల్సిన అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంది. సమ్మె చట్ట విరుద్ధమంటూ అక్టోబర్ 5న కన్సిలియేషన్ అధికారి ఇచ్చిన నివేదికకు అనుగుణంగా కార్మిక శాఖ కమిషనర్ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకం. ఈ విషయాన్ని తేల్చే అధికారం పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంది. మేం జారీ చేస్తున్న ఈ ఉత్తర్వుల ప్రతి అందిన రెండు వారాల్లోగా సమ్మె వ్యవహారంపై కార్మిక శాఖ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకుని లేబర్ కోర్టుకు నివేదించాలి. ఒకవేళ ఏ నిర్ణయాన్ని తీసుకోనట్లయితే అందుకు కారణా లను వివరిస్తూ ఆర్టీసీ సమ్మె కేసులోని వాదప్రతివాదులందరికీ కూడా తెలియజేయాలి. ఈ దశలోనూ కన్సిలియేషన్ అధికారి తీసుకున్న నిర్ణయానికి ఎవరూ ప్రభావితం కారాదు. దానిని పూర్తిగా విస్మరించాలి. సమ్మె చట్టవిరుద్ధమో కాదో తేల్చడం మా పరిధిలో లేదు’అని హైకోర్టు స్పష్టంచేసింది. తాము పనిచేసే చోట మెరుగైన పరిస్థితులు కోసమే కార్మికులు సమ్మెలోకి వెళతారని, సమ్మెలోకి వెళ్లడమంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవడమని భావించడం తప్పు అని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేసింది. ఆర్టీసీ యాజమాన్యం/ప్రభుత్వం అలాంటి ముగింపునకు రావడం న్యాయసమ్మతం కాదని గుర్తుంచుకోవాలని సూచించింది. ‘ఇది ఆర్టీసీ యాజమాన్యానికో లేదా కార్మికులకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు. ఉద్యోగం నుంచి తొలగిస్తే 48 వేల మంది కాకుండా లక్షల్లో ఉండే వారి కుటుంబ» సభ్యులను రోడ్డున పడేసినట్లు అవుతుంది. ఇలాంటి పరిస్థితులు వస్తే ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. లక్షలాది మంది కుటుంబ సభ్యులను అనాథలుగా చేయడం న్యాయమా అనే కోణంలో ప్రభుత్వం/ఆర్టీసీ సంస్థ ఆలోచించుకోవాలి. నిరుద్యోగం రాజ్యమేలుతున్న తరుణంలో ఉద్యోగ అర్హత వయసు మీరిన వాళ్లకు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి. అందుకే ఈ విషయాన్ని ఇటు ప్రభుత్వం అటు ఆర్టీసీ యాజమాన్యానికి వదిలేస్తున్నాం. వారు ఆదర్శనీయంగా వ్యవహరించాలి. విశాల హృదయంతో చర్యలు ఉండాలి. మానవీయతతో స్పందించాలి. అపరిష్కృతంగా ఉన్న సమ్మె వ్యవహారాన్ని సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది’అని పేర్కొంటూ ఆర్టీసీ సమ్మెపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలని, సిబ్బంది డిమాండ్ల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తూ ఓయూ రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు సోమవారం ముగిశాయి. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. సమ్మె చేస్తున్నవారికి జైలుశిక్ష వేయొచ్చు: ఏఏజీ విచారణ సందర్భంగా తొలుత ఆర్టీసీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదిస్తూ.. సమ్మె చట్ట వ్యతిరేకమని, ఈ మేరకు కన్సిలియేషన్ అధికారి కూడా ప్రకటించారని చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సమ్మె చట్టవ్యతిరేకమని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించాల్సిన అవసరం కూడా లేదని, చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తున్న వారికి నెలరోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి వరకు జరిమానా విధించేందుకు చట్టంలో వీలుందని పేర్కొన్నారు. అదే చట్టంలోని 22 (1) సెక్షన్‌లోని ఎ, బి, సి, డి ప్రకారం సమ్మెలోకి వెళ్లినవారిపై చర్యలు తీసుకునే వీలుందని చెప్పారు. ఇక ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల వ్యవహారాన్ని లేబర్ కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన సిండికేట్ బ్యాంక్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించగా.. ధర్మాసనం కల్పించుకుని ఆ తీర్పు ఇక్కడి కేసులో వర్తించదని చెప్పింది. సమ్మె చట్ట వ్యతిరేకమని ఆ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పలేదని.. వాదప్రతివాదనలు, తమ వద్ద ఉన్న పత్రాల ఆధారంగా లేబర్ కోర్టు తేల్చుతుందని పేర్కొంది. తాము ముందు సమ్మె చట్ట వ్యతిరేకమా కాదా, ఈ మేరకు ప్రకటన చేసే అధికారం ఏ అధికారికి ఉంది.. అనే విషయాలనే తేల్చుతామని తెలిపింది. అయినా ఇప్పటి వరకూ ఆర్టీసీ ఈ విషయం గురించి కార్మిక శాఖ కమిషనర్‌కు ఎందుకు నివేదిక ఇవ్వలేదని ప్రశ్నించింది. హైకోర్టులో కేసు ఉన్నందున కోర్టు ధిక్కారం అవుతుందని ఏఏజీ చెప్పగా.. తామేమీ స్టే ఉత్తర్వులు ఇవ్వలేదని ధర్మాసనం గుర్తు చేసింది. హైకోర్టు పట్ల గౌవరంతో కమిషనర్‌కు నివేదించలేదని ఏజీ చెప్పారని తెలిపింది. నిజం ఎక్కడుందో తెలియడంలేదు.. యూనియన్ తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్‌రెడ్డి వాదిస్తూ.. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసే విస్తృతాధికారం సెక్షన్ 89 ప్రకారం హైకోర్టుకు ఉందని చెప్పారు. వాదప్రతివాదుల్లో ఏఒక్కరు కమిటీ ఏర్పాటుకు అంగీకరించినా అందుకు అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వొచ్చునని రామానుజశర్మ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘కమిటీ ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుందని ఆశించాం. ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఈ దశలో మా విస్తృతాధికారాలను వినియోగించి కమిటీ వేసినా ఆ తర్వాత కూడా అదే పరిస్థితులు ఉంటాయనే అనిపించింది. రాజ్యాంగంలోని 226 అధికరణ ప్రకారం మాకు ఆకాశమే హద్దు. అయితే మా ప్రయత్నాలు నిర్ధకం అయ్యాయి. ఇసుక రేణువంత ఆశ ఉన్నా మాకున్న విస్తృతాధికారాల అస్త్రాన్ని సంధించేవాళ్లం’అని నిస్సహాయత వ్యక్తంచేసింది. తిరిగి ప్రకాష్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ, టీఎస్ఆర్టీసీ 2016 అక్టోబర్‌లో ఏర్పడితే అంతకుముందే 2015 డిసెంబర్ 1నే ఆర్టీసీని అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) పరిధిలోకి తెచ్చినట్లుగా సంస్థ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై ధర్మాసనం కల్పించుకుని.. ఈ కేసులో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అఫిడవిట్లను దాఖలు చేశారని, వాళ్ల వాదనల్ని వాళ్లే ఖండించుకున్నారని, నిజం ఎక్కడ దాగి ఉందో తమకు తెలియడం లేదని వ్యాఖ్యానించింది. ఆర్టీసీ అన్ని రంగాల్లోనూ ఉత్పాదకవృద్ధి సాధించడానికి కార్మికుల సేవలే ఎనలేనవని అధికారిక నివేదికలే చెబుతున్నాయని, అయిదేళ్లల్లో డీజిల్ లీటర్ ధర రూ.20 పెరిగితే అందుకు అనుగుణంగా టికెట్ల రేట్ల పెంపునకు సీఎం అనుమతి ఇవ్వలేదని సాక్షాత్తు రవాణా మంత్రి శాసనసభలో చెప్పారని ప్రకాష్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజలపై భారం పడకూడదని భావిస్తే అందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించాలేగానీ ఆర్టీసీ కాదన్నారు. ఆర్టీసీ యాజమాన్యం/ఉద్యోగుల పరస్పర విరుద్ధమైన ఈ వాదనలపై తాము స్పందించబోమని, ఈ విషయాలను లేబర్ కోర్టులో తేల్చుకోవాలని ధర్మాసనం సూచించింది. సమ్మె విరమిస్తామన్నా సర్కారు స్పందించలేదు.. ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నందున అందుకు అనుగుణంగా చర్చలు జరపాల్సిందిగా ఆదేశాలివ్వాలని ప్రకాష్‌రెడ్డి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. బస్సులు పూర్తి స్థాయిలో లేవని, ఉన్న అరకొర సౌకర్యాలను కూడా అనుభవం ఉన్న డ్రైవర్లతో నడపకపోవడంతో ప్రమాదాల శాతం పెరిగిందని, మరమ్మతులకు వచ్చిన వాటిని బాగు చేసే నాథేడే లేడని తెలిపారు. ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేయడమో, భూస్థాపితం చేయాలనే దురుద్ధేశం చాలా స్పష్టంగా కనబడుతోందని ఆరోపించారు. తొలుత విధుల్లోకి చేరాలని గడువు పెట్టి బెదిరించారని, ఇప్పుడు విధుల్లో చేరేందుకు ముందుకు వచ్చినా ఉద్యోగాల్లో చేర్చుకుంటామనే ధీమా ఏమీ లేదని సాక్షాత్తు ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయపార్టీ నేత మాదిరిగా ఆయన అఫిడవిట్ దాఖలు చేశారని, ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. రోజూ 97 లక్షల మంది అంటే రాష్ట్ర జనాభాలో మూడో వంతు మంది ప్రజలు ఆర్టీసీ సమ్మె వల్ల ఇబ్బందులు పడకూడదనే ఉద్ధేశంతో సమ్మె విరమించాలని తాను కూడా యూనియన్‌కు సూచించానని, దీంతో సమ్మె విరమిస్తామని వారు చెప్పినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ప్రకాష్‌రెడ్డి చెప్పారు. అయితే, చర్చలు జరపాలని తాము ఆదేశాలివ్వలేమని, చర్చలు స్వచ్ఛందంగా ఉండాలేగానీ బలవంతంగా ఉండకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. సమ్మె విరమణకు సిద్ధంగా ఉంటే లేబర్ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకునే వరకు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరవచ్చునని సూచించింది. ఆర్టీసీ సిబ్బంది శ్రమశక్తికి సంబంధించిన పీఎఫ్ రూ.900 కోట్లు, ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో దాచుకున్న రూ.500 కోట్లను సంస్థ తీసేసుకుందని, వాటిని చెల్లించాలని కోరితే యూనియన్ డిమాండ్లు అన్యాయమని ఎదురుదాడి చేయడం దారుణమని ప్రకాష్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఉద్యోగాల్లో చేరేందుకు వచ్చినా చేర్చుకునే అవకాశాలు లేవని సునీల్ శర్మ అధికారపార్టీ నాయకుడి మాదిరిగా అఫిడవిట్లో పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఇది వదిలిపెట్టకూడని విషయమని, కోర్టు రికార్డుల్లో ఇలాంటి అఫిడవిట్ దాఖలు చేసిన అధికారి గురించి నమోదు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం కల్పించుకుని, ముస్సోరిలో ఐఏఎస్ అధికారుల శిక్షణ సరిగ్గా లేదని అర్ధం అవుతోందని వ్యాఖ్యానించింది. విధుల్లో చేర్చుకోవాలని చెప్పలేం: ధర్మాసనం ప్రయాణికులు ఇబ్బందులు పడకూదని విధుల్లో చేరేందుకు కార్మికులు వెళితే రేపు విధుల్లోకి తీసుకోకపోతే పరిస్థితి ఏమిటని ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. సమ్మె విరమణకు వారు సిద్ధంగా ఉన్నారని, విధుల్లో చేర్చుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డి స్పందిస్తూ.. ఆ విధంగా అఫిడవిట్లో లేదని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ కల్పించుకుని, సమ్మె విరమించిన వాళ్లను విధుల్లో చేర్చుకోవాలని చేరాలని ఉత్తర్వులు ఇవ్వలేమని.. ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి మాత్రమే చేస్తామని తేల్చి చెప్పారు. తిరిగి ప్రకాష్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. సుప్రీంకోర్టు 1963లో ఇచ్చిన తీర్పు ప్రకారం సమ్మె చట్టబద్ధమో, చట్టవ్యతిరేకమో తేల్చవచ్చుగానీ సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగింపునకు వీల్లేదని నివేదించారు. సంస్థలో మెరుగైన సౌకర్యాల కోసమే సమ్మెలోకి వెళ్లారని, కార్మికులు విధుల్లో చేరాలంటే ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని కోరారు. చివర్లో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ, ఇదే తుది నిర్ణయం కాదని, పారిశ్రామిక వివాదాల చట్టం కింద లేబర్ కోర్టు ఉత్తర్వులు ఇస్తుందని, ఆ తర్వాత తగిన విధంగా అడుగులు ఉంటాయని చెప్పారు. వాదనలు కోర్టు సమయం ముగిసిన తర్వాత కూడా కొనసాగాయి. అనంతరం సమ్మె వ్యవహారంపై కార్మిక శాఖ కమిషనర్ స్పందించాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేస్తూ కేసు విచారణ ముగిసినట్లుగా ప్రకటించింది. స్టే కొనసాగింపు... 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం అమలు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోరాదని గతంలో జారీ చేసిన స్టే ఉత్తర్వులను మంగళవారం వరకు పొడిగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. దీనిపై దాఖలైన వ్యాజ్యంతోపాటు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన మరో పిల్‌పై మంగళవారం విచారణ జరుపుతామని పేర్కొంది. -
సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. మంగళవారం తలపెట్టనున్న సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ రేపటి సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. జడ్జిమెంట్ కాపీ చూసి రేపు సాయంత్రం సమ్మెపై తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కేవలం సడక్ బంద్‌నే వాయిదా వేస్తున్నామని నిరసన దీక్షలు మాత్ర రేపు యధాతదంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. దీక్ష విరమించిన జేఏసీ నేతలు మూడు రోజులుగా ఆర్టీసీ జేఏసీ ముఖ్యనేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చేస్తున్న నిరవదిక నిరాహారదీక్షను సోమవారం సాయంత్రం విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలకు అఖిలపక్ష నాయకులు కోదండరాం, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం,మందకృష్ణ మాదిగలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆస్పత్రిలోనే జేఏసీ నాయకులతో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. -
లేబర్ కోర్టుకు ఆర్టీసీ సమ్మె!
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై సోమవారం తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు జారీ చేసింది. ఈ అంశాన్ని కార్మిక న్యాయస్థానం చూసుకుంటుందని హైకోర్టు తెలిపింది. రెండు వారాల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని కార్మిక శాఖ కమిషనర్‌కు సూచించింది. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె చట్టవిరుద్ధమని ఆదేశించలేమని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. సమ్మె లీగల్, ఇల్లీగల్ అని చెప్పే అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంటుందని అభిప్రాయపడింది. ప్రభుత్వంతో చర్చల కమిటీ వేయాలని ఆర్టీసీ జేఏసీ కోరగా.. కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా కమిటీ వేయాలని ఆర్టీసీ జేఏసీ కోరింది. 45 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ధర్మాసనానికి వివరించారు. జీతాలు లేక కుటుంబ పోషణ భారం అవుతుందన్నారు. ప్రభుత్వం మాత్రం తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపిస్తూ యాక్సిడెంట్లు చేయిస్తుందని హైకోర్టుకు వివరించారు. ఈ విషయం లేబర్ కోర్టు చూసుకుటుందని, తాము ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు అభిప్రాయపడింది. సోమవారం ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ‘పిటిషినర్ కోరిన దాని ప్రకారం.. తమ ముందు రెండు అంశాలు మాత్రమే ఉన్నాయి. మొదటిది సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించడం. రెండోది కార్మికులను చర్చలకు పిలవమని ప్రభుత్వాన్ని ఆదేశించడం. సమ్మె చట్ట విరుద్ధమని చెప్పే అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంటుంది. కార్మికులను చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కోర్టుకు ఉందో లేదో చెప్పమని మొదటి నుంచి అడుగుతున్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో బస్సులు లేకపోయినా మెట్రోలో ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’ అని పేర్కొంది. -
అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష భగ్నం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేవరకు నిరశన కొనసాగిస్తానంటూ స్వీయ గృహనిర్బంధం చేసుకున్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థాహరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. లోపలి నుంచి గడియపెట్టుకుని కొందరు కార్మికులతో కలిసి నిరాహార దీక్ష చేస్తున్న అశ్వత్థారెడ్డిని పోలీసులు ఆదివారం సాయంత్రం చాకచక్యంగా అరెస్టు చేశారు. రెండు రోజుల దీక్షతో ఆయన ఆరోగ్యంగా స్వల్పంగా క్షీణించిందని వైద్యులు ప్రకటించటంతో, ఆయనను వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయన దీక్ష నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆయన ఇంటివద్దకు చేరుకుంటుండటం, ఆరోగ్యం క్షీణిస్తుండటంతో శాంతిభద్రతల పరంగా ఉద్రిక్తతలు నెలకొనే ప్రమాదం ఉండటంతో ఆయన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఆదివారం ఉదయం నుండి ప్రయత్నించారు. కానీ ఆయన తలుపులు గడియ వేసి ఉండటంతో పోలీసులు లోనికి వెళ్లలేకపోయారు. దీక్ష నేపథ్యంలో ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్ వద్దకు పోలీసులు మీడియా ప్రతినిధులను తప్ప వేరేవారిని అనుమతించటం లేదు. కానీ అరెస్టు చేయాలంటే తలుపులు తీయాల్సి ఉండటంతో ఆదివారం సాయంత్రం వారు రూటు మార్చారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, వివేక్లులు వచ్చారు. వారిని అనుమతించటంతో వారు అశ్వత్థామరెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయనను కలిసి బయటకు వచ్చే క్రమంలో పోలీసులు చాకచక్యంగా లోనికి ప్రవేశించారు. దీంతో అశ్వత్థారెడ్డితోపాటు ఉన్న కార్మికులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని వారించి ఆయనను ఆరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ వైద్యులు వచ్చి పరీక్షించి బీపీ, షుగర్‌లెవల్స్ పెరిగాయని ప్రకటించారు. వెంటనే చికిత్స తీసుకోని పక్షంలో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పోలీసులు ఆరెస్టు చేసినా తన దీక్ష కొనసాగుతుందని, ఆసుపత్రిలో కొనసాగిస్తానని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి మానుకుని చర్చలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. అశ్వత్థామరెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా పోలీసులు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేశారని ఆర్టీసీ మహిళా కార్మికులు ఆరోపిస్తున్నారు. 44 రోజులుగా సమ్మె చేస్తున్నామని, తమ పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించిన చర్చలకు పిలవాలని, తమ న్యాయమైన 25 డిమాండ్లను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. తమ ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వంలో ఆర్టీసీలో విలీనం అనే అంశాన్ని కూడా తాత్కాలికంగా పక్కన పెట్టామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్టీసీ కార్మికులు తెలిపారు. కాగా అంతకు ముందు నిరాహారదీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలు వివేక్, జితేందర్ రెడ్డి, రామచంద్రరావు తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులతో వివేక్, జితేందర్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. అశ్వత్థామరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన తమను ఎందుకు లోపలకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. -
రాజిరెడ్డి దీక్ష భగ్నం.. అశ్వత్థామరెడ్డికి వైద్య పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 44వ రోజు కొనసాగుతోంది. ఎల్బీనగర్లోని రెడ్డి కాలనీలో ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి కొనసాగిస్తున్న నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇంటి డోర్ పగలగొట్టి మరి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చే క్రమంలో రాజిరెడ్డి.. ఇంటి డోర్ వేసుకుని దీక్ష కొనసాగించారు. ఇంటి తలుపు పగలగొట్టి రాజిరెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ సమయంలో రెడ్డి కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. శనివారం నుంచి హస్తినాపూర్‌లో తన నివాసంలో అశ్వత్థామరెడ్డి దీక్ష కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గృహ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం, ఆయన ఆరోగ్యం బాగోలేకపోతే పోలీసులు దీక్ష భగ్నం చేసి అరెస్ట్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అశ్వత్థామరెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మందకృష్ణ అరెస్టు.. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మహాదీక్షకు ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందిరాపార్క్ దగ్గర ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఇందిరా పార్క్‌కు వస్తున్న నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ హబ్సిగూడలోని కృష్ణ లాడ్జ్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మందకృష్ణను అరెస్ట్ చేశారు. ఆయనను నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మందకృష్ణ విమర్శించారు. ఎట్టిపరిస్థిలోనూ భవిష్యత్తులో దీక్ష చేసి తీరుతామని అన్నారు. ఎమ్మార్పీఎస్ చేపట్టిన మహాదీక్షలో అసాంఘిక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు బలగాలు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. కొనసాగుతున్న అశ్వత్థామరెడ్డి దీక్ష చదవండి: ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఆర్టీసీ డిపోల వద్ద కార్మికుల ఆందోళన సమ్మెలో భాగంగా కార్మికులు ఆర్టీసీ డిపోల దగ్గర ఆందోళనకు దిగారు. ఖమ్మం డిపో దగ్గర బైఠాయించిన కార్మికులు... బస్సును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాలోనూ డిపోల దగ్గర ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు ఇంటి దగ్గర చీపురులతో ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు ఆర్టీసీ కార్మికులు. మరోవైపు -
నిరశనలు... అరెస్టులు
సాక్షి, హైదరాబాద్/హస్తినాపురం: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె శనివారం స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. సమ్మె కార్యాచరణలో భాగంగా శనివారం బస్ రోకో చేపట్టారు. దీనికి అనుమతి లేదని, బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ముందే హెచ్చరించారు. అయినా కార్మికులు శనివారం ఉదయం నుంచే డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు జేఏసీ రాష్ట్ర నేతలు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టగా వారికి మద్దతుగా అన్ని డిపోల వద్ద కార్మికులు కూడా దీక్షలు నిర్వహించటంతో స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ కార్మికులను అరెస్టు చేశారు. ముఖ్యంగా జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని గృహానిర్బంధం చేయడంతోపాటు, కోకన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తిలు చేపట్టిన దీక్షలను భగ్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికులకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీక్షలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలపటంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. వారిని నిలవరించే క్రమంలో పోలీసులతో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. అశ్వత్థామరెడ్డి గృహ నిర్బంధం... సమ్మె కార్యాచరణలో భాగంగా శనివారం ధర్నా చౌక్ ఇందిరాపార్కు వద్ద నిరశన దీక్ష చేపట్టాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. అయితే దీనికి పోలీసులు అనుమతిత్వలేదు. దీంతో వీఎస్టీ సమీపంలోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఉదయం దీక్ష ఉండటంతో, దానిని భగ్నం చేసే క్రమంలో తెల్లవారుజామునే పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకోవాలని భావించారు. ఈ విషయం ముందుగానే ఊహించిన జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఇళ్ల వద్దకు రావాలంటూ అందుబాటులో ఉన్న కార్మికులకు సమాచారం అందించారు. హస్తినాపురం జయక్రిష్ణ ఎన్‌క్లేవ్‌లోని అశ్వత్థామరెడ్డి, రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రాజిరెడ్డి ఇళ్ల వద్దకు శుక్రవారం అర్ధరాత్రి దాటాక పెద్ద సంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీక్షా శిబిరం వద్దకు బయలుదేరితే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి అశ్వత్థామరెడ్డి బయటకు రాకుండా ఇంట్లోనే తలుపు గడియపెట్టుకుని ఉండిపోయారు. ఆయనతోపాటు పలువురు ఆర్టీసీ కార్మికులు కూడా ఉన్నారు. దీంతో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో ఇంట్లోనే దీక్ష ప్రారంభిస్తున్నట్టు ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆయనతోపాటు మహిళా కార్మికులు కూడా దీక్షలో పాల్గొన్నారు. మహిళా కార్మికులను వెలుపలికి రావాల్సిందిగా పోలీసులు కోరినా వారు తిరస్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. అశ్వత్థామరెడ్డి దీక్ష విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విలేకరులను తప్పించి ఎవరినీ ఆపార్ట్‌మెంట్‌లోని అనుమతించలేదు. దీంతో పోలీసులు దమనకాండ నిర్వహిస్తున్నారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. అక్కడికి వచ్చిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, సంధ్యలను అనుమతించలేదు. ఆగ్రహానికి గురైన మందకృష్ణ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో సంధ్య గేటు దూకి లోనికి వెళ్లేందకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రెడ్డికాలనీలో ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు రాజిరెడ్డి అరెస్టు.. విడుదల.. ఇదే సమయంలో రాజిరెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజిరెడ్డి వద్దకు పోలీసులు వెళ్లకుండా చుట్టూ మహిళా కార్మికులు వలయంగా ఏర్పడ్డారు. అయినా పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని, రాజిరెడ్డిని అరెస్టు చేసి పహడీషరీఫ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడే ఆయన దీక్షను కొనసాగించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రాజిరెడ్డిని విడిచిపెట్టారు. మరో కోకన్వీనర్ లింగమూర్తి సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి బొల్లారం స్టేషన్‌ను తరలించారు. అక్కడ ఆయన దీక్ష కొనసాగించారు. సునీల్‌శర్మకు ఏం తెలుసు..?: అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఆర్టీసీ నష్టాలను పదేపదే చెబుతున్న ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోంది. నష్టాలకు కారణమైన ప్రభుత్వమే సంస్థను నిర్వీర్యం చేసింది. 17 నెలల క్రితం ఎండీగా వచ్చిన సునీల్‌శర్మకు ఆర్టీసీ గురించి ఏం తెలుసు. ఇప్పటివరకు కనీసం ఏడు సార్లు కూడా ఆయన ఆర్టీసీ కార్యాలయానికి రాలేదు. ముఖ్యమంత్రి తయారు చేసిన అఫిడవిట్లపై సునీల్‌శర్మ సంతకాలు పెడుతున్నారు. వాటిని చూస్తే అధికారుల రూపొందించినట్టు లేవు. రాజకీయ పార్టీలు తయారు చేసినట్టే ఉన్నాయి. కోర్టులు చివాట్లు పెట్టినా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవటం లేదు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. సంస్థను మూసివేసేందుకు నష్టాల ముద్ర వేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్‌పై వెనక్కు తగ్గినా ప్రభుత్వం పట్టించుకోకపోవటమే దీనికి నిదర్శనం. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు దిగినా కార్మికులు భయపడలేదు, భయపడరు. సమ్మె కొనసాగుతుంది. మరింత ఉధృతమవుతుంది. ప్రశాంతంగా దీక్ష చేయబోతే, పోలీసులు 144 సెక్షన్‌తో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలతో చేతులు కలిపామన్న ఆరోపణలు అవాస్తవం. తీరు మారకుంటే భవిష్యత్తులో ప్రజా క్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీకి అవమానం తప్పదు. కేరళ ఎంపీ సంఘీభావం.. రాజిరెడ్డి సహా పలువురు కార్మికులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకుని పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న కేరళ సీపీఐ ఎంపీ బినాయ్ విశ్వం కూడా అక్కడికి చేరుకుని సంఘీభావం తెలిపారు. కార్మికులను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించడం సరి కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న వ్యవహారం, ఇక్కడి ప్రభుత్వం తీరును పార్లమెంట్లో ప్రస్తావిస్తానన్నారు. పోలీసు స్టేషన్ వద్ద మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష చేస్తే నాటి ప్రభుత్వం అనుమతించిందని, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల దీక్షకు మాత్రం అనుమతించకపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలన్నారు. ప్రభుత్వ వేధింపుల కారణంగా 27 మంది కార్మికులు చనిపోయారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు జరిపిన సమ్మె కారణంగానే రాష్ట్రం ఏర్పడిందని చెప్పిన కేసీఆర్.. ప్రస్తుతం వారి పట్ల నిరంకుశంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పోలీసులు కూడా మానవత్వంతో ఆలోచించాలన్నారు. -
ఆశ్వత్థామ ఇంటి వద్ద నిరసనకు దిగిన న్యూడెమోక్రసీ నేతలు
-
ఆర్టీసీ సమ్మె: ‘జేఏసీ కీలక నిర్ణయం’
సాక్షి, హైదరాబాద్ : సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. మిగిలిన అంశాలపై తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులను ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయిస్తుందని మండిపడ్డారు. సేవ్ ఆర్టీసీ పేరుతో రేపటి నుంచి డిపోల ముందు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. కార్మికులు ఆత్మస్తైర్యాన్ని కోల్పోయి, ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని సంఘాలు, ప్రజల మద్దతు ఉందన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ నెల 15న గ్రామ గ్రామానికి బైక్ ర్యాలీ నిర్వహించి, 16న తనతో పాటు జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ నిరవధిక దీక్ష చేపట్టబోతున్నామని చెప్పారు. 17,18తేదిలలో ప్రతి డిపో ముందు 50మంది చొప్పున కార్మికులు నిరహారదీక్షకు చేపడుతారన్నారు. 19న సడక్ బంద్ పేరుతో హైదరాబాద్ నుంచి కోదాడ వరకు ర్యాలీ నిర్వహించబోతున్నామని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. -
హైపవర్ కమిటీకి ఒప్పుకోం : తేల్చిచెప్పిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు విచారణ బుధవారం కొనసాగింది. సమ్మె పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామని, దీనిపై తమ అభిప్రాయం చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరగా.. ఈ కమిటీకి తాను ఒప్పుకునేది లేదని ప్రభుత్వం న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని తెలిపారు. ఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సమ్మె చట్టవిరుద్ధమని మీరెలా చెప్తారని ప్రశ్నించింది. సమ్మె పరిష్కారానికి హైపవర్ కమిటీ వేయాల్సిందేనంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది రాపోలు ఆనంద భాస్కర్ వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. ఇప్పటివరకు 27మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని పిటిషనర్లు న్యాయస్థానానికి నివేదించారు. హైపవర్ కమిటీని వేసి సమస్యను పరిష్కరించాలని రాపోలు ఆనంద భాస్కర్ కోర్టును అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను రేపటికి వాయిదా వేసింది. కార్మికుల సమ్మెపై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. చదవండి: హైపవర్ కమిటీపై సర్కార్ నిర్ణయంతో మరో మలుపు! -
తెలంగాణ ఆర్టీసీలో మరో బలిదానం
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో మరో ప్రాణం బలైపోయింది. మహబూబాబాద్ డిపో డ్రైవర్ నరేష్ బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే నరేష్ ప్రాణాలు విడిచాడు. నరేష్‌కు భార్య పోలమ్మ, ఇద్దరు పిల్లలు శ్రీకాంత్, సాయికిరణ్ ఉన్నారు. అతను 2007 నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత ఐదేళ్లుగా నరేష్ భార్య హృద్రోగంతో బాధపడుతోందని, నెలకు రూ. 5వేల మందులు వాడుతున్నారని, మరోవైపు ఇద్దరు పిల్లలు చదువుతుండటంతో నరేష్ ఆర్థికంగా అనేక బాధలు పడుతున్నాడని, ఈ క్రమంలో మొదలైన సమ్మె ఎంతకూ పరిష్కారం కాకపోవడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని తోటి కార్మికులు చెప్తున్నారు. నరేష్ ఆత్మహత్య వార్త తెలియడంతో అఖిలపక్ష నాయకులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇది ప్రభుత్వ హత్యేనని, కోర్టు విచారణ పేరిట కాలయాపన చేయకుండా కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి.. సమస్యను పరిష్కరించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నా చావుకు ముఖ్యమంత్రే కారణం! ఆత్మహత్య చేసుకునే ముందు ఆర్టీసీ డ్రైవర్ నరేష్ సూసైడ్ లెటర్ రాసినట్టు తెలుస్తోంది. ‘నా చావుకు ముఖ్యమంత్రే కారణం. నా వల్ల ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలి. ఆర్టీసీలో నాదే చివరి బలిదానం కావాలని ముఖ్యమంత్రిగారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నా కుటుంబానికి వచ్చిన ఇబ్బంది మరో కుటుంబానికి రాకూడదు. ఇది నేను సొంతంగా రాసిన లేఖ. నా అంత్యక్రియలకు అశ్వత్థామరెడ్డి హాజరుకావాలి. ఆర్టీసీ కార్మికులు బాగుండాలి’ అంటూ ఈ లేఖలో నరేష్ పేర్కొన్నాడు. ఈ లేఖను చూసి ఆర్టీసీ కార్మికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
ఆర్టీసీ పరిరక్షణకు 17న సబ్బండ వర్గాల మహాదీక్ష
పంజగుట్ట: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని అమ్ముకునేందుకు చూస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు దాన్ని కాపాడుకునేందుకు చూస్తున్నారు. అందుకే న్యా య వ్యవస్థతోపాటు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఆర్టీసీ కార్మికులకు లభిస్తోంది’అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. కార్మిక వర్గాలు, పేద వర్గాలను అణగదొక్కేందుకు చూస్తున్న వారికి చెమటలు పట్టించేలా కార్యాచరణ రూపొందించినట్లు ప్రకటించారు. 17న వేలాది మందితో ఇందిరాపార్క్ వద్ద ‘సబ్బండ వర్గాల మహాదీక్ష’, 18న ఆర్టీసీ జేఏసీ సడక్ బంద్‌కు సంపూర్ణ మద్దతు, 20న గవర్నర్‌ను కలసి ఆర్టీసీ ప్రైవేటీకరణతో పేదవర్గాలకు జరిగే నష్టంపై వివ రణ, 30న నాలుగు లక్షల మందితో హైదరాబాద్‌ను దిగ్బంధం చేస్తామని తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల వేదిక ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ రాములు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంద కృష్ణ మాదిగ, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్, సామాజిక వేత్త జేబీ రాజు, మాజీ మంత్రి రవీంద్రనాయక్, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్, రాములు నాయక్ తదితరులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వెంటనే చొరవ తీసుకుని ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
హైకోర్టు నిర్ణయంపై స్పందించిన ఆర్టీసీ జేఏసీ
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, కమిటీ ఏర్పాటుకు తాము అంగీకరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరపాలని ఆయన కోరారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ అనంతరం మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటుతో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: ఆర్టీసీ సమ్మె: హైకోర్టు కీలక నిర్ణయం సమ్మె చేస్తున్న కార్మికులపై ఎస్మా ప్రయోగానికి హైకోర్టు ఒప్పుకోలేదని, సమ్మె చట్ట విరుద్ధమని ఎక్కడ ప్రస్తావించలేదని అశ్వత్థామరెడ్డి గుర్తు చేశారు. కార్మికుల సమ్మె యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మెపై సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని, ఈ విషయమై బుధవారంలోగా తమకు ప్రభుత్వ అభిప్రాయాన్ని చెప్పాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
గవర్నర్ ముందుకు గాయపడ్డ మహిళలు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని డిక్లేర్ చేసేందుకు హైకోర్టు తిరస్కరించడంపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రేపు (మంగళవారం) ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ ఉన్నందున జేఏసీ నేతల నిరాహార దీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. సమ్మెపై వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. చదవండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఛలో ట్యాంక్‌బండ్ సందర్భంగా పోలీసుల లాఠీఛార్జ్‌లో మహిళా కార్మికులు గాయపడ్డారని, గాయపడిన మహిళలను మంగళవారం గవర్నర్ తమిళిసై వద్దకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్టు చెప్పారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగుతుందని హైకోర్టు పేర్కొన్నట్టు తెలిపారు. హైకోర్టు విచారణ అనంతరం రేపు తమ కార్యాచరణపై స్పందిస్తామని చెప్పారు. -
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోమవారం వాదనలను కొనసాగించిన హైకోర్టు.. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమంటూ ఓ పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణయ్య హైకోర్టులో వాదనలు వినిపించారు. ఆర్టీసీని పబ్లిక్ యూటిలిటీ సర్వీస్‌గా ప్రకటించినందున అత్యవసర సేవల (ఎస్మా) పరిధిలోకి వస్తుందని కృష్ణయ్య పేర్కొన్నారు. కాబట్టి ఆర్టీసీ సమ్మెపై ఎస్మా ప్రయోగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే, అత్యవసర సేవలు నిలిచిపోయినప్పుడు మాత్రమే ఎస్మా ప్రయోగించడానికి వీలుంటుందని, ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధంగా చెప్పలేమని హైకోర్టు పేర్కొంది. ప్రజాప్రయోజనాల పేరిట ఆధారాలు లేకుండా విచిత్రమైన ఇష్యూస్‌ను కోర్టు ముందుకు తీసుకొస్తే.. రిలీఫ్ ఇవ్వలేమని, ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని అనేకసార్లు తాము కోరామని గుర్తుచేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయని, ఇలాగే చేయాలని ఆదేశించలేమని పేర్కొన్న హైకోర్టు.. విచారణను రేపట్టికి వాయిదా వేసింది. ఇక, రాష్ట్రంలోని పలు రూట్లను ప్రవైటీకరిస్తూ రాష్ట్ర మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని విచారణ సందర్భంగా ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. -
ఆర్టీసీ సమ్మె : నేడు మంత్రుల ఇళ్ల ముందు నిరసనలు
-
18న సడక్ బంద్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సంఘాలు సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని నిర్వహించాయి. శనివారం చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పోలీసు నిర్బంధాన్ని ఛేదించి వందల సంఖ్యలో కారి్మకులు గమ్యం చేరటంతో వచి్చన ఊపుతో ఉత్సాహంగా ఉన్న సమ్మె కార్యాచరణకు మరింత పదునుపెట్టాయి. ఇందులో భాగంగా ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘సడక్ బంద్’నిర్వహించాలని నిర్ణయించాయి. ఇది దాదాపు రాష్ట్ర బంద్ తరహాలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. మొత్తంగా రాష్ట్ర రహదారులన్నింటిని దిగ్బంధం చేయటం ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది. 37 రోజులు గా సమ్మె చేస్తున్నా, స్వయంగా హైకోర్టు కొన్ని సూచనలు చేసినా ప్రభుత్వం దిగిరాకపోవటాన్ని జేఏసీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే జేఏసీ కనీ్వనర్ అశ్వత్థామరెడ్డి, కో కనీ్వనర్లు రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ నిరవధిక నిరశన ప్రారంభించాలని నిర్ణయించింది. ఆదివారం అఖిలపక్ష నేతలతో సుదీర్ఘంగా భేటీ అయిన జేఏసీ నేతలు అనంతరం కార్యాచరణను ప్రకటించారు. జేఏసీ కోకనీ్వనర్లు రాజిరెడ్డి, సుధ తదితరులతో కలసి కనీ్వనర్ అశ్వత్థామరెడ్డి వివరాలను వెల్లడించారు. నేడు మంత్రుల ఇళ్ల ముందు నిరసనలు పరిస్థితిని సీఎంకు వివరించి ఆయనలో మార్పు తెచ్చేలా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చొరవ తీసుకునేలా కోరా లని జేఏసీ నిర్ణయించింది. సోమవారం వారి ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేసి వారిని కలసి వివ రించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని ఇళ్లు, జిల్లా కేంద్రాల్లో ఉన్న ఇళ్లను ముట్టడించనున్నట్టు జేఏసీ ప్రకటించింది. మంగళవారం జేఏసీ కన్వీనర్, కో కనీ్వనర్లు ఇందిరాపార్కు వద్ద నిరవధిక నిరశనలు ప్రారంభించనున్నారు. ఇందిరాపార్కు వద్ద అనుమతి లభించని పక్షంలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో చేపట్టనున్నట్టు అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు.. ఆర్టీసీ కారి్మకులపై ప్రభుత్వ తీరు, చలో ట్యాంక్‌బండ్‌లో పోలీసుల ప్రవర్తనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. చలో ట్యాంక్‌బండ్‌లో మహిళా కండక్టర్ల పట్ల పోలీసులు తీవ్రంగా వ్యవహరించారని, చాలామంది గాయపడ్డారని, దీనిపై అవసరమైతే జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సమ్మె మొదలైనప్పటి నుంచి చలో ట్యాంక్‌బండ్ వరకు చోటు చేసుకున్న ప్రధాన ఘట్టాలకు సంబంధించిన ఫొటోలను, ఇప్పటివరకు చనిపోయిన కారి్మకులకు సంబంధించిన ఫొటో వివరాలను ప్రదర్శించనున్నారు. ఈనెల 13, 14 తేదీల్లో ఈ రెండు కార్యక్రమాలను నిర్వహించాలని అనుకున్నామని, కార్యక్రమం ఖరారయ్యాక కచి్చతమైన తేదీలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. వీలైతే ఓరోజు హైదరాబాద్‌లో కూడా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. సడక్‌బంద్‌లో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఆ పార్టీ నేత సంపత్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ నేత నరసింహారావు, బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్, సీపీఐ నేత సుధాకర్, ఎమ్మారీ్పఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు తదితరులు పాల్గొన్నారు. అనుమతివ్వకపోగా దమనకాండనా..? ‘సమ్మెను ఇప్పటివరకు శాంతియుతంగానే నిర్వహించాం. అదే పంథాలో ట్యాంక్‌బండ్‌పై గంట సేపు నిరసన వ్యక్తం చేస్తామని కోరినా అనుమతి ఇవ్వలేదు. చలో ట్యాంక్‌బండ్‌కు వచ్చిన కారి్మకులు, మహిళలపై పోలీసులు దమనకాండకు దిగారు. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు యతి్నస్తున్నారు. చలో ట్యాంక్‌బండ్‌లో మావోయిస్టులు చొరబడ్డారన్న ఆరోపణ ను ఖండిస్తున్నాం. రాజ్యమన్నా, రాజ్యాంగమన్నా గౌరవమున్నవారు మాత్రమే ఇందులో పాల్గొన్నారు’అని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. కార్మికులకు తోడుగా విపక్షాల కార్యకర్తలు.. ఇక నుంచి ఆర్టీసీ జేఏసీ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో విపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొనబోతున్నారు. సమ్మె కార్యాచరణకు మద్దతు, సంఘీభావం తెలపటానికే పరిమితం కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని ఆయా పారీ్టలు నిర్ణయించాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ–అఖిలపక్ష నేతల భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. తదుపరి కార్యాచరణలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, అప్పుడు ప్రజల మద్దతు పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. దీనికి అన్ని పారీ్టలు సమ్మతించినట్లు సమాచారం. సోమవారం హైకోర్టులో మళ్లీ వాదనలు ఉన్నందున మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాగా, ఆర్టీసీ సమ్మె అంశాన్ని జాతీయ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఆదివారం నిర్ణయించింది. సోమ లేదా మంగళవారాల్లో జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా హక్కుల కమిషన్‌ను కలసి ఆర్టీసీ కారి్మకులకు న్యాయం చేయాలని కోరనుంది. ఇందుకోసం ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనుంది. -
ఎల్లుండి నుంచి నిరవధిక దీక్ష
-
కార్మికులపై లాఠీ
-
‘చలో ట్యాంక్‌బండ్’ ఉద్రిక్తం
ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల జేఏసీ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ట్యాంక్‌బండ్‌కు వచ్చే అన్ని మార్గాలను మూసేసినా ఆందోళనకారులు ఎలాగోలా అక్కడకు చేరుకున్నారు. జిల్లాల్లోనూ పలుచోట్ల ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు తరలివచ్చారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా ఆందోళనకారులు సైతం పోలీసులపైకి రాళ్లు రువ్వారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు లాఠీలు, తూటాలను లెక్కచేయబోమని ఆందోళనకారులు నినాదాలు చేశారు. దాదాపు 3,800 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. సాక్షి, హైదరాబాద్: సకల జనుల సామూహిక దీక్షను ట్యాంక్‌బండ్‌పై నిర్వహించుకునేందుకు ఆర్టీసీ కారి్మకులకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ట్యాంక్‌బండ్‌పైకి ఎవరినీ రానీయకుండా అష్టదిగ్బంధనం చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద, మారియట్ హోటల్ వద్ద భారీ బారికేడ్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేయడంతోపాటు పారామిలటరీ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. అలాగే లోయర్ ట్యాంక్‌బండ్‌కు వెళ్లే అన్ని మార్గాలను మూసేశారు. ఆంధ్ర మహిళా సభ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్ చౌరస్తా, ఇందిరాపార్క్, కట్టమైసమ్మ దేవాలయం, రాణిగంజ్, బుద్ధభవన్ తదితర ప్రాంతాల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే మారియట్ చౌరస్తా, లిబర్టీ చౌరస్తాల వద్ద ట్యాంక్‌బండ్ వైపునకు వెళ్లే దారులను మూసేశారు. పదుల సంఖ్యలో మఫ్టీలో ఉన్న పోలీసులు ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు నిర్వహించి ప్రయాణికుల్లా తరలివచి్చన కండక్టర్లు, డ్రైవర్లను గుర్తించి అరెస్టు చేశారు. బేగంపేట్, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్తోపాటు అన్ని ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన ఆర్టీసీ కార్మికుడు బందోబస్తును ఛేదించుకొని... చలో ట్యాంక్‌బండ్‌లో పాల్గొనడం కోసం వివిధ పారీ్టల నాయకులు ముందుగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ట్యాంక్‌బండ్ సమీపంలోని తమ పార్టీ కార్యకర్తలు, కారి్మకుల ఇళ్లలో తలదాచుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తొలుత సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. వెంకటేశ్వర్రావు, కె. గోవర్ధన్లతోపాటు 50 మంది కార్యకర్తలు ఇందిరాపార్క్ చౌరస్తాలోకి దూసుకొచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేయగా కాసేపటికే మారియట్ హోటల్ సమీపంలోని కవాడిగూడ చౌరస్తాలో బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, గౌతమ్జీల నేతృత్వంలో వందలాది మంది ట్యాంక్‌బండ్‌పైకి దూసుకురావడానికి ప్రయతి్నంచగా పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు వచ్చారు. అదే సమయంలో పోలీసుల దృష్టి మళ్లించి రాణిగంజ్, హకీంపేట్తోపాటు వివిధ జిల్లాల నుంచి వచి్చన కారి్మకులు పోలీసు బందోబస్తు, బారికేడ్లను ఛేదించుకొని ట్యాంక్‌బండ్‌పైకి వందలాదిగా చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని బతుకమ్మ ఘాట్ వద్ద అడ్డుకొని అరెస్టు చేశారు. చలో ట్యాంక్‌బండ్ నేపథ్యంలో శనివారం ట్యాంక్‌బండ్ పైకి దూసుకొస్తున్న ఆందోళనకారులు అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా రణరంగం ఇదే సమయంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సీపీఎం కార్యాలయం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నున్న నాగేశ్వర్రావు, వెంకట్, మల్లు లక్షి్మ, అరుణోదయ విమలక్క, పీవోడబ్ల్యూ సంధ్యల నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, ఇందిరాపార్క్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుంటూ ట్యాంక్‌బండ్‌వైపు దూసుకువచ్చారు. కట్టమైసమ్మ దేవాలయం వద్ద మరోసారి వారిని అడ్డుకోవడానికి ప్రయతి్నంచినా పోలీసులకు సాధ్యంకాలేదు. అక్కడి నుంచి అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకోగానే వారికి ఎ.వి. కళాశాలలో ఉన్న వందలాది మంది ఆందోళనకారులు జత కలిశారు. ఇదే సమయంలో హిమాయత్‌నగర్, లిబర్టీ దగ్గర నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిల నేతృత్వంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు వారికి తోడయ్యారు. అశోక్‌నగర్‌లోని ఆయన నివాసంలో కె.లక్ష్మణ్ గృహనిర్బంధం ఆర్టీసీ కారి్మకులకు మద్దతుగా సకల జనుల సామూహిక దీక్షలో పాల్గొనేందుకు శుక్రవారమే హైదరాబాద్ చేరుకున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్ వైపు వెళ్లేందుకు యతి్నంచగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రొఫెసర్ కోదండరాంను అంబేడ్కర్ విగ్రహం వద్ద అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తెలుగుతల్లి ఫ్లైఓవర్, బూర్గుల రామకృష్ణారావు భవన్‌వైపు నుంచి ఆర్టీసీ కార్మికులు వందలాది మంది మహిళలు, కారి్మకులు తరలిరావడంతో అంబేడ్కర్ విగ్రహం వద్ద వేలాది మంది చేరారు. అంతా కలసి ట్యాంక్బండ్వైపునకు వెళ్లి బారికేడ్లను తొలగించడానికి ప్రయతి్నంచారు. కొందరు బారికేడ్లను దాటి ట్యాంక్‌బండ్ చేరుకున్నారు. పరిస్థితి చేయి దాటుతోందని భావించిన పోలీసులు... ఉన్నతాధికారుల ఆదేశం మేరకు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆపై లాఠీచార్జి చేశారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి లిబర్టీ, దోమలగూడవైపు ఆందోళనకారులను తరిమారు. ఆగ్రహానికిగురైన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వగా మోత్కూరి శేఖర్ అనే ఎస్ఐకి గాయాలయ్యాయి. చివరకు తమ్మినేని, నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, కోదండరాం సహా వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురికి గాయాలు... పోలీసుల లాఠీచార్జి్జలో పలువురికి గాయాలయ్యా యి. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ శేషమ్మ ముక్కుకు తీవ్ర గాయమవగా ముషీరాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ కారి్మకుడు ఆశయ్యకు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన పీడీఎస్‌యూ నేత అనిల్‌కు కా ళ్లు విరిగాయి. మరోవైపు ఆందోళనకారుల దాడిలో చిక్కడపల్లి ఏసీపీ కిరణ్ సైతం గాయపడ్డారు. ట్యాంక్‌బండ్‌ను చేరుకొని చూపించాం.... పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాదాపు వెయ్యి మంది కారి్మకులం ట్యాంక్‌బండ్ చేరుకొని చూపించామని జేఏసీ నేతలు పేర్కొన్నారు. వేల మంది కారి్మకులు స్వచ్ఛందంగా పాల్గొని చలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేశారన్నారు. సరూర్‌నగర్ సభ విజయవంతంతో చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించిందని దుయ్యబట్టారు. వివిధ పారీ్టల కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసినా తమ కార్యదీక్ష ముందు నిలవలేకపోయారని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కారి్మకుల శక్తిని గుర్తించాలని సూచించారు. ఇందులో గాయపడ్డ కారి్మకులకు ఉచితంగా సేవ చేసేందుకు ముందుకొచి్చన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉద్యమంలో మావోయిస్టులు ఉన్నారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. చలో ట్యాంక్ బండ్ సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుతున్న ఆర్టీసీ మహిళా ఉద్యోగులు మరోసారి బంద్ ఆలోచన? సమ్మెలో భాగంగా చేపట్టిన వివిధ రూపాల నిరసనల కార్యాచరణ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణను సిద్ధం చేసేందుకు కారి్మక సంఘాల జేఏసీ సిద్ధమైంది. ఆదివారం ఉదయం జేఏసీ నేతలు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం నేపథ్యంలో కొందరు జేఏసీ నేతలను పోలీసులు శుక్రవారమే అదుపులోకి తీసుకొన్నారు. జేఏసీ కో–కన్వీనర్ రాజిరెడ్డి సహా మరికొందరిని అదుపులోకి తీసుకోగా జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సహా ఇతర ముఖ్యులను ట్యాంక్‌బండ్ సమీపంలో శనివారం ఉదయం అరెస్టు చేసి రాత్రికి విడుదల చేశారు. దీంతో కొత్త కార్యాచరణ ఖరారుపై జేఏసీ నేతలు భేటీ కాలేకపోయారు. ఆదివారం అఖిలపక్ష నేతలతో జేఏసీ సమావేశమై తదుపరి కార్యాచరణను ఖరారు చేయనుంది. పోలీసులు కార్మికులపట్ల కఠినంగా వ్యవహరించి లాఠీచార్జి జరపడంతో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా మహిళా కారి్మకులు ఎక్కువ మంది గాయపడ్డారు. దీన్ని జేఏసీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతోపాటు స్వయంగా హైకోర్టు సూచించినా, పదుల సంఖ్యలో కారి్మకులు చనిపోయినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం వంటి అంశాలను కారణంగా చూపుతూ మరోసారి రాష్ట్ర బంద్ నిర్వహించాలన్న అభిప్రాయాన్ని కొందరు అఖిలపక్ష నేతలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై ఆదివారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పోలీసుల లాఠీచార్జి, బలప్రయోగానికి నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. నగరంలో జరిగే ధర్నాలో అఖిలపక్ష నేతలు పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల నిర్బంధం ‘చలో ట్యాంక్‌బండ్’కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. టీపీసీసీ కీలక నేతలతోపాటు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను గృహనిర్బంధం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ కుమార్, మండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలను హైదరాబాద్‌లో, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాలను హన్మకొండలో గృహ నిర్బంధం చేశారు. అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని జూబ్లీ చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఉద్వేగం ముందు నిలవలేకపోయారు: చాడ సాక్షి, హైదరాబాద్: ప్రజల ఉద్వేగం ముందు పోలీసులు తట్టుకోలేకపోయారని, మిలీనియం మార్చ్‌ను తలపించే విధంగా చలో ట్యాంక్‌బండ్ విజయవంతమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరవాలని, మరింత ప్రజాగ్రహానికి గురికాక ముందే చర్చల ద్వారా ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల అతి ప్రవర్తనతో యుద్ధ వాతావరణం ఏర్పడిందని, ఈ చర్యలు అప్రకటిత అత్యవసర పరిస్థితికి అద్దం పడుతున్నాయన్నారు. ఇకనైనా మొండి వైఖరి వీడాలి: తమ్మినేని తీవ్ర నిర్బంధాన్ని అధిగమించి చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం జయప్రదమైందని, ఇది కారి్మకులు సాధించిన విజయమని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రజలు, ఆర్టీసీ కారి్మకులు, వామపక్షాలు, రాజకీయ పారీ్టల కార్యకర్తలు కలిసి విజయవంతం చేశారన్నారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరిని విడనాడి కోర్టు సూచనలు పాటించి, చర్చల ద్వారా సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంఘాలు కూడా విలీనంపై పట్టుబట్టే అవకాశం అంతగా లేనందున కారి్మకుల సంక్షేమం కోసం ప్రతిష్టకు పోకుండా ఈ సమస్యకు ఇంతటితో తెరదించాలని సూచించారు. విపక్షాల గొంతు నొక్కుతున్నారు: కృష్ణసాగర్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాల గొంతు నొక్కుతున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, తెలంగాణను పోలీస్ రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను గృహ నిర్బం ధం చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. హేయమైన చర్య: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సాక్షి, హైదరాబాద్: చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులపై బాష్పవాయువు ప్రయోగించడం, మహిళలని కూడా చూడకుండా లాఠీచార్జీ చేయడం హేయమైన చర్య అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులను గృహ నిర్బంధం చేయడం, అక్రమ అరెస్ట్‌లకు పాల్ప డటం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరించడం అత్యంత దుర్మార్గమని ఓ ప్రకట నలో ఆయన విమర్శించారు. గత 36 రోజు లుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా, కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ప్రభుత్వ మొండితనం, మూర్ఖత్వాన్ని తెలియజేస్తోందన్నారు. ఇప్పటికైనా సీఎం బేషజాలకు పోకుండా ఆర్టీసీ జేఏసీని చర్చకు పిలిచి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో ప్రభుత్వం కార్మికులు, రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ ఓ నియంత: పొన్నాల సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నియంత.. ఆయనకు కనీస మానవత్వం కూడా లేదు’అని పీపీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోందని, అయినప్పటికీ రజాకార్లను తలపించిన పోలీసులను తíప్పించుకొని చలో ట్యాంక్ బండ్‌ను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. హన్మకొండలో ని తన నివాసంలో శనివారం సాయం త్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు మానవతా దృక్పథం లేదని, ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులపై నిర్దయతో వ్యవహరించారని, కొండగట్టు బస్ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మరణిస్తే వారి కుటుంబాలను కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. -
నేడు ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్/తార్నాక: ఒకవైపు ఆర్టీసీ కార్మికులు శనివారం నిర్వహించతలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించడం, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ చలో ట్యాంక్‌బండ్ చేపట్టి తీరుతామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించడంతో నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్ వైపునకు వచ్చే అన్ని మార్గాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి అఖిలపక్షాల మద్దతు కూడా ఉండటంతో వివిధ పార్టీలకు చెం దిన కార్యకర్తలు, నాయకులు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ట్యాంక్‌బండ్‌కు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు పెద్దెత్తున ముందస్తు అరెస్టులకు దిగారు. కార్మిక సంఘాలకు చెందిన పలువురు నాయకులతో పాటు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, తెలంగాణ జన సమితి, తదితర పార్టీలకు చెందిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు చేరుకోకుండా నిఘాను ఏర్పాటు చేశారు. అదే సమయంలో చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ గట్టి పట్టుదలతో ఉంది. శుక్రవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించడంతోపాటు ఉస్మాని యా వర్సిటీ విద్యార్థి సంఘాలతోనూ సమావేశమయ్యారు. అన్ని వర్గాల భాగస్వామ్యంతో తమ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. అన్ని జిల్లాలకు చెందిన ఆర్టీసీ కార్మికులు నగరానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయమే జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. మిగతా నేతలు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. చలో ట్యాంక్‌బండ్ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ మోహరించడంతో ఆర్టీసీ కార్మికులు సోషల్ మీడి యా ద్వారా తమ ప్రచారం కొనసాగిస్తున్నారు. విద్యార్థుల అరెస్టులు... చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్న ఉస్మానియా వర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకునేందుకు పోలీ సులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. పలు పోలీస్స్టేషన్లకు తరలించారు. అఖిలపక్ష నేతల భేటీ... చలో ట్యాంక్‌బండ్ సక్సెస్ చేయడం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై శుక్రవారం ముఖ్దూంభవన్‌లో అఖిలపక్షనేతలు సమావేశమయ్యారు. చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, పశ్యపద్మ (సీపీఐ), తమ్మినేని వీరభద్రం, డీజీ నరసింహా రావు (సీపీఎం), ప్రొ. కోదండరాం (టీజేఎస్), ఎల్.రమణ (టీడీపీ) తదితరులు పాల్గొన్నారు. ముందస్తు అరెస్ట్‌లు అప్రజాస్వామికం... పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యానికి ఊపరిపోస్తాయని టీజేఎస్ నేత కోదండరాం చెప్పారు. చట్టాన్ని కాదని ఆర్టీసీని ప్రభుత్వం ఎలా ప్రైవేటీకరిస్తుందని సీపీఎంనేత తమ్మినేని ప్రశ్నించారు. కాగా చలో ట్యాంక్‌బండ్‌లో పాల్గొని సక్సెస్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి లేదు ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి అనుమతి లేదని నగర ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ అనిల్‌కుమార్ శుక్రవారం అన్నారు. అయినప్పటికీ కొంద రు ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని, అలా కాకుండా ఉండేందుకు పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు అప్పర్ ట్యాంక్‌బండ్ పూర్తిగా మూసేస్తున్నామని తెలిపారు. ►సికింద్రాబాద్ వైపు నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనచోదకు లు కర్బాలామైదాన్, కవాడిగూడ చౌరస్తా, సీజీఓ టవర్స్, ముషీరాబాద్ చౌరస్తా మీదుగా వెళ్లాలి. ►ఇందిరాపార్క్ వైపు నుంచి వచ్చే వాహనాలు అశోక్‌నగర్ ఎక్స్ రోడ్స్ మీదుగా ప్రయాణించాలి. ►తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి మీదుగా ప్రయాణించాలి. ►ఇక్బాల్ మినార్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు నెక్లెస్ రోటరీ, నెక్లెస్ రోడ్ మీదుగా వెళ్లాలి. ►హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ నుంచిబషీర్బాగ్ మీదుగా వెళ్లాలి. -
చలో ట్యాంక్‌బండ్ మరో మిలియన్ మార్చ్
సాక్షి, హైదరాబాద్/సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఈనెల 9న నిర్వహించ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని మరో మిలియన్ మార్చ్ తరహాలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల సరూర్‌నగర్‌లో నిర్వహించాలని నిర్ణయించిన బహిరంగసభకు పోలీసులు అనుమతివ్వకున్నా, కోర్టు ద్వారా అనుమతి పొంది సభకు భారీగా జన సమీకరణ జరిపిన నేపథ్యంలో దీనికి కూడా పెద్దసంఖ్యలో జనం హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అఖిలపక్ష నేతలు కూడా దీనికి మద్దతు తెలిపిన నేపథ్యంలో, కారి్మకుల కుటుంబ సభ్యులతోపాటు ఆయా పారీ్టల నుంచి భారీగా కార్యకర్తలు తరలేలా ఇటు జేఏసీ, అటు పారీ్టలు సం యుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించి గురువారం జేఏసీ నేతలు వివిధ పార్టీల నేతలతో సమాలోచనలు జరిపారు. ఉస్మానియా విద్యార్థులు కూడా ఈ సభకు తరలేలా వారితోనూ చర్చిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఉస్మానియా విద్యార్థులతో జేఏసీ నేతలు సమావేశం కానున్నా రు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు ఉధృతంగా సాగాయి. ఇటు ప్రజలకు అటు కోర్టుకు అబద్ధాలు: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆర్టీసీ విషయంలో ఇటు ప్రజలతో పాటు అటు కోర్టుకు కూడా అబద్ధాలు చెప్పి చీవాట్లు పెట్టించుకున్నారని, ఒకదశలో కోర్టుకు క్షమాపణలు చెప్పడానికి కూడా ఐఏఎస్ అధికారులు సిద్ధమయ్యారని ఆర్టీసీ జేఏసీ కనీ్వనర్ అశ్వత్థామరెడ్డి విమర్శించారు. అధికారులకు ఏమాత్రం చీమూనెత్తురున్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురువారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘ఆర్టీసీ కార్మికుల తల్లుల కడుపుకోత’పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. అద్దె బస్సుల వల్లనే నష్టం వస్తోందన్న విషయాన్ని చెప్పకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు కూడా తప్పుడు లెక్కలు చెప్పి చీవాట్లు పెట్టించుకున్నారన్నారు. చర్చలే ప్రజాస్వామ్యానికి పునాది అని.. కారి్మకులను వెంటనే చర్చలకు పిలిచి పరిష్కరించాలన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంత గొప్ప సమ్మె జరగలేదన్నారు. ‘మేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. 9 గంటలు మంత్రులతో చర్చించారు. 9 నిమిషాలు మాతో చర్చిస్తే సమస్య పరిష్కారమయ్యేది కదా.. ఎప్పుడో ఒకప్పుడు ప్రభుత్వంలో విలీనం అవుతుంది. ఈ నెల 9న నిర్వహించే చలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేయాలి.’అని అన్నారు. కార్మికుల చావులు ప్రభుత్వ హత్యలే ఆర్టీసీ కారి్మకుల చావులు ప్రభుత్వ హత్యలేనని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. 11వ తేదీలోపు మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇంకా ఎంతమంది కడుపుకోతలను చూస్తారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడినవారి సమస్యలను పరిష్కరించకుండా ప్రగతిభవన్ మాటున ఉండాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఆ గిరే మీకు ఉరితాడు..: ఎల్.రమణ ఆర్టీసీ ప్రజలతో ముడిపడి ఉన్న రవాణా వ్యవస్థ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి, సురేశ్‌గౌడ్ కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.1 లక్ష చొప్పున మిగతా 20 మంది కార్మిక కుటుంబాలకు రూ.25 వేల చొప్పున అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని చెప్పారు. కార్మికులు బరితెగించి కొట్లాడుతుంటే కేసీఆర్ గిరి గీసుకొని ఉన్నారని, ఆ గిరే మీకు ఉరితాడు అవుతుందని హెచ్చరించారు. 48 వేల కుటుంబాలతో ఆటలు: చాడ కార్మికుల కడుపుకోతకు కేసీఆర్‌దే బాధ్యత అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. 48 వేల కుటుంబాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. కేసీఆర్ నయా నయీంగా మారాడని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఎద్దేవా చేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జేఏసీ నేతలు కె.రాజిరెడ్డి, థామస్‌రెడ్డి, న్యూడెమోక్రసీ నేత కె.గోవర్ధన్, బీజేపీ నేతలు చింతా సాంబమూర్తి, సుధా తదితరులు పాల్గొన్నారు. 6,459 బస్సులు నడిపాం: ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా గురువారం 6,459 బస్సులు నడిపినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 4,531 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,459 మంది తాత్కాలిక కండక్టర్లు విధుల్లో ఉన్నట్టు తెలిపింది. 5,453 బస్సుల్లో టిమ్ యంత్రాలు వినియోగించామని, 386 బస్సుల్లో సంప్రదాయ పద్ధతిలో టికెట్లు జారీ చేశామని అధికారులు చెప్పారు. సీఎం ఉద్యోగం ఊడుతది: కోమటిరెడ్డి ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కారి్మకుల ఉద్యోగాలు తీస్తే.. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉద్యోగం కూడా ఊడుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద మహిళా కారి్మకులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీ భావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంగళ వారం అర్ధరాత్రి వరకు విధుల్లో చేరకుంటే సుమారు 50 వేల మంది కారి్మకుల ఉద్యోగాలు ఊడినట్లేనని కేసీఆర్ హెచ్చరించినా బెదిరింపులకు భయపడకుండా కారి్మకులు ఏకతాటిపై నిలబడి ఐక్యతను చాటుకోవడం అభినందనీయమన్నారు. చలో ట్యాంక్‌బండ్ సక్సెస్ చేయండి: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: గత 35 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈ నెల 9న ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ‘చలో ట్యాంక్‌బండ్’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం ఓ ప్రకటనలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్రం దృష్టి: లక్ష్మణ్ జగిత్యాల: ఆర్టీసీ కారి్మకులు అధైర్య పడొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. జగిత్యాల డిపో ఎదుట గురువారం సమ్మెలో పాల్గొన్న కారి్మకులను కలసి సంఘీభావం తెలిపారు. లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కారి్మకులను రోడ్డు పాలు చేసిందన్నారు. ఉద్యమ సమయంలో ఇచి్చన మాట నిలుపుకోవాలని కోరారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్ర ప్రభుత్వం సైతం దృష్టి పెట్టిందని, ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పోలీసుల తీరుపై స్పీకర్‌కు ఫిర్యాదు సాక్షి, న్యూఢిల్లీ: కరీంనగర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమయాత్రలో పోలీసులు తనతో అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో స్పీకర్‌ను కల సిన సంజయ్ పోలీసుల తీరుకు సంబంధించిన క్లిప్పింగులు, వీడియోలను సమరి్పంచారు. స్పందించిన స్పీకర్ ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సుశీల్‌కుమా ర్ సింగ్‌ను ఆదేశించినట్టు సంజయ్ మీడియాకు తెలిపారు. ఆర్టీసీ కుటుంబాలకు ఎస్వీకేలో ఉచిత వైద్యం సాక్షి, హైదరాబాద్: సమ్మెలో ఉన్న ఆర్టీసీ కారి్మకులు, వారి కుటుంబాలకు ఉచిత వైద్య సౌకర్యం కలి్పంచాలని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్వీకే భవనంలో సాధారణ ప్రజల కోసం నిర్వహిస్తున్న క్లినిక్‌లోనే పని రోజుల్లో ఉదయం 10–12 గంటల మధ్య, సాయంత్రం 6–8 గంటల మధ్య డాక్టర్ అందుబాటులో ఉంటారని ఈ కమిటీ కార్యదర్శి ఎస్.వినయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ ప్రజల నుంచి రూ.30 ఫీజు తీసుకుని వైద్యం చేస్తుండగా, ఆర్టీసీ కారి్మకుల కుటుంబాలకు కన్సల్టేషన్ ఫీజు లేకుండా ఒక కోర్సు మందులను కూడా ఉచితంగా ఇవ్వాలని కమిటీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
ఆర్టీసీ ‘మార్చ్’కు బీజేపీ మద్దతు
సాక్షి, హైదరాబాద్: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ చేస్తున్న సమ్మెలో భాగంగా ఈ నెల 9న తలపెట్టిన మిలియన్ మార్చ్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జేఏసీ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని, వారి పోరాటాలకు మద్దతు ఇస్తూనే బీజేపీ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. మాజీ ఎంపీలు జి.వివేక్, జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డిలతో ఏర్పాటైన ఆ కమిటీ కార్యాచరణను రూపొందిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ మూడు సార్లు డెడ్‌లైన్ విధించినా 300 మంది ఆర్టీసీ కార్మికులు కూడా జాయిన్ కాలేదన్నారు. సీఎం వారి ఆదరణను కోల్పోయారని, నైతికంగా సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రం గమనిస్తోందని, ఏ సందర్భంలో ఏం చేయాలో అదే చేస్తుందని చెప్పారు. ఇక పార్టీ సంస్థాగత ఎన్నికలపై పదాధికారులు, జిల్లాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించామని లక్ష్మణ్ తెలిపారు. నెలాఖరుకి పార్టీ మండల, జిల్లా కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని, డిసెంబర్లో రాష్ట్ర కమిటీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పారన్నారు. కార్యక్రమంలో ఎంపీ దర్మపురి అరవింద్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆర్టీసీకి బకాయిల్లేం..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి బకాయిల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఒకే మాటపై నిలిచాయి. ఆరీ్టసీకి ఏ రకంగానూ బకాయిలు లేమని ప్రభుత్వం చెప్పగా.. సంస్థకు తాము ఇవ్వాల్సిన అవసరమే లేదని జీహెచ్ఎంసీ స్పష్టంచేసింది. ఈ రెండు వాదనలను ఆర్టీసీ ఎండీ సమరి్థంచారు. మొత్తానికి ముగ్గురూ కలసి ఆరీ్టసీకి చెల్లించాల్సింది ఏమీ లేదని హైకోర్టుకు తేల్చి చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్ శర్మలు వేర్వేరుగా ఉన్నత న్యాయస్థానంలో కౌంటర్లు దాఖలు చేశారు. ఆర్టీసీనే ప్రభుత్వానికి బకాయి: – ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించింది. సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానూ బకాయి పడలేదు. ఆర్టీసీనే మోటారు వాహన పన్ను (ఎంవీ ట్యాక్స్) కింద ప్రభుత్వానికి 2017–18 నుంచి రూ.540.16 కోట్లు బకాయి పడింది. ఆరీ్టసీకి రాష్ట్ర ప్రభుత్వం రుణం రూపంలో డబ్బు ఇవ్వడమే తప్ప, ఆ రుణాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించిన చరిత్ర ఆ సంస్థకు లేదు. ఇచి్చన రుణాన్ని తిరిగి చెల్లించాలని ఆరీ్టసీకి ఇన్నేళ్లలో ఏనాడు కూడా ప్రభుత్వం నోటీసు జారీ చేసింది లేదు. తీసుకున్న రుణానికి ఫలానా సమయంలోపు వడ్డీ చెల్లించాలన్న గడువుంటుంది. అయితే ఇప్పటివరకు ఆర్టీసీ విషయంలో అటువంటి గడువేదీ నిర్దేశించలేదు. ఈ రుణాలను రోజువారీ నిర్వహణకు, బస్సుల కొనుగోలుకు, బస్సు షెడ్ల నిర్మాణానికి ఉపయోగించుకునే వెసులుబాటును ఆరీ్టసీకి ఇచ్చారు. వివిధ వర్గాల పౌరులకు ఇచ్చిన రాయితీల తాలూకు డబ్బును ప్రభుత్వం చెల్లించాల్సిన దాని కంటే ఎక్కువే ఇచ్చింది. రాయితీల కింద రూ.1,230.20 కోట్లు, పెట్టుబడుల నిమిత్తం రూ.1,219 కోట్లు, రుణం కింద రూ.1,294.23 కోట్లు, బస్సుల కొనుగోలుకు రూ.160.12 కోట్లు.. ఇలా మొత్తం రూ.3,903.55 కోట్లు చెల్లించింది. ఆరీ్టసీకి జీహెచ్ఎంసీ చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా ప్రభుత్వమే ఇచ్చింది. అందువల్ల జీహెచ్ఎంసీ ఎటువంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరీ్టసీకి జీహెచ్ఎంసీ రూ.1,492 కోట్ల మేర రుణపడి ఉందని నేను చెప్పలేదు. ఆర్టీసీ అంత మొత్తం జీహెచ్ఎంసీ నుంచి కోరుతోందని మాత్రమే చెప్పాను. 2014–15 నుంచి 2017–18 వరకు ఆరీ్టసీకి వివిధ పద్దుల కింద రూ.2,786.16 కోట్లు ఇచ్చాం. 2018–19లో రూ.662.39 కోట్లు, 2019–20లో రూ.455 కోట్లు విడుదల చేశాం. మా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది – జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్టీసీ కోరుతున్నట్లు నష్టాలను భరించే స్థితిలో జీహెచ్ఎంసీ లేదు. 2016 మే వరకు రూ.137.95 కోట్లు చెల్లించాం. అదే ఏడాది మరో రూ.198.45 కోట్లిచ్చాం. 2016 అక్టోబర్ నాటికి జీహెచ్ఎంసీ రూ.562.98 కోట్ల లోటు బడ్జెట్లో ఉంది. ఈ లోటు కొనసాగి 2017–18కు రూ.313.10 కోట్లు, 2018–19కు రూ.768.20 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఆ లోటు కొనసాగుతోంది. 2016–17 సంవత్సరానికి ఆరీ్టసీకి రూ.273.84 కోట్లు విడుదల చేసేలా చూడాలని ప్రభుత్వం జీహెచ్ఎంసీని కోరింది. అయితే ఆర్థిక సమస్యల వల్ల ఆ మొత్తాన్ని చెల్లించే పరిస్థితిలో లేమని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. జీహెచ్ఎంసీ పరిధిలో బస్సులను నడపడం వల్ల వచి్చన నష్టాలను భరించాలని ఆర్టీసీ మమ్మల్ని కోరుతూ వచి్చంది. అయితే మా ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు మాత్రమే డబ్బు చెల్లించగలమని స్పష్టంగా చెప్పాం. అసలు చట్ట ప్రకారం ఆర్టీసీకి మేం ఎటువంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరమే లేదు. ఆర్టీసీకి ప్రభుత్వం అదనపు చెల్లింపులే చేసింది – ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్ శర్మ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీ స్థితిగతులపై రవాణా మంత్రికి 11.9. 2019న అంతర్గత నివేదిక ఇచ్చాం. మంత్రికి ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి గురించి వివరించాం. ఈ సందర్భంగా వివిధ పద్దుల కింద ప్రభుత్వం ఆరీ్టసీకి విడుదల చేసిన నిధుల గురించి వివరించాం. దీని ఫలితంగా 2019–20 సంవత్సరానికి బడ్జెట్లో కేటాయించిన రూ.550 కోట్లకు గాను ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.455 కోట్లు విడుదలయ్యాయి. వాస్తవానికి ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఎటువంటి మొత్తాన్ని రుణపడి లేదు. మం త్రికి చెప్పిన లెక్కలు జీహెచ్ఎంసీ నుంచి ఆరీ్టసీకి రావాల్సినవి కావు. ప్రభుత్వం గ్యారెంటీగా ఉన్న రుణం రూ.345 కోట్ల గురించి కూడా మంత్రికి వివరించాం. రాష్ట్ర విభజనకు ముందు లెక్కలు అందుబాటులో లేవు. వివిధ వర్గాల పౌరులకు వచి్చన రాయితీల మొత్తం రూ.3,006.15కోట్లు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీ అందుకున్నది రూ.3,903.55 కోట్లు. ప్రభుత్వం రూ.897.40 కోట్లు అదనంగా చెల్లించింది. దీనికి తోడు రూ.850 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారెంటీగా ఉంది. ఇచి్చన నిధులను వాడుకునే స్వేచ్ఛను ఆరీ్టసీకి ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం తాను ఇచ్చిన రుణాన్ని తిరిగి చెల్లించాలని కోరడం గానీ, వడ్డీ చెల్లించాలని అడగటం గానీ ఇప్పటివరకు చేయలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చిన నష్టాలకు స్పందించి గతంలో రూ.336.40కోట్లు జీహెచ్ఎంసీ విడుదల చేసింది. 2019 అక్టోబర్ లోనూ ఇలానే అడిగాం. అయితే ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అందువల్ల నష్టాలను భరించే స్థితిలో లేమని జీహెచ్ఎంసీ చెప్పింది. -
ఆర్టీసీ సమ్మె : ‘50 వేల మందికి 360 మందే చేరారు’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ దాటుకుని పరుగులు పెడుతోంది. బుధవారం అన్ని బస్ డిపోల ముందు నిరాహార దీక్షలు చేపట్టాలన్న ఆర్టీసీ జేఏసీ నేతల పిలుపు మేరకు కార్మికులు, వామపక్ష నాయకులు కదం తొక్కారు. ముషీరాబాద్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు పాల్పడకుండా.. చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు. (చదవండి : ప్రైవేట్ బస్సులు నడిస్తే కార్మికుల శవాలపైనే..) ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ పెట్టాడు. బెదిరించాడు. అయినా 50 వేల మంది కార్మికుల్లో కేవలం 360 మంది మాత్రమే విధుల్లో చేరారు. చేరిన వాళ్ళలో కూడా డ్రైవర్లు, కండక్టర్లు లేనేలేరు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్నివర్గాల ప్రజలు అండగా ఉన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. చూస్తూ ఊరుకోలేక రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడ్డాయి. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే... కార్మికుల శవాలపైన మాత్రమే ప్రైవేట్ బస్సులు వెళ్ళాలి. ప్రైవేట్ బస్సులను నడిపితే ఎక్కడికక్కడ కార్మికులు అడ్డుకుంటారు. అవసరమైతే తగులబెడతారు. పక్క రాష్ట్రంలో ప్రభుత్వపరం చేసి చూపించారు. ఇక్కడెందుకు సాధ్యం కాదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలి’అని అన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మెను ఉధృతం చేయడంతో బస్ డిపోల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులకు పాట్లు తప్పడం లేదు. -
ఆగదు ఆగదు ఆగదు.. ఆర్టీసీ సమ్మె ఆగదు..!!
సాక్షి, హైదరాబాద్ : నేటితో 33వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ప్రభుత్వం ఇచ్చిన డెడ్‌లైన్‌ను దాటుకుని ముందుకు సాగుతోంది. ఏదేమైనా డిమాండ్లు సాధిస్తామని కార్మికులు మెట్టు దిగడం లేదు. బుధవారం అన్ని బస్ డిపోల ముందు నిరాహార దీక్షలకు ఆర్టీసీ జేఏసీ పిలుపునివ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. డిపోల ముందు ధర్నాకు దిగి బస్సులను అడ్డుకున్న కార్మికులు, విపక్ష నేతల్ని పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు. సూర్యాపేట బస్‌డిపో ముందు అఖిలపక్ష నాయకులు, కార్మికులు ధర్నాకు దిగారు. బస్సులు బయటకు వెళ్లకుండా గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. నిరసనకారులను పోలీసులు స్టేషన్‌కు తరలించే క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. (చదవండి : ఆర్టీసీ సమ్మె : వెనకడుగు వేయం) ముఖ్యమంత్రి నిర్ణయం ఏమై ఉంటుందో.. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసిన నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఏ నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 5100 బస్ రూట్లను ప్రైవేటుకు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సమ్మెపై కార్మికులు మెట్టుదిగకపోవడంతో మిగిలిన 5 వేల రూట్లపై కేసీఆర్ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రైవేటు బస్సుల పర్మిట్లపై.. ఆర్టీసీ మనుగడపై ప్రభుత్వం సాయంత్రంలోపు ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు సమచారం. రేపు హైకోర్టులో వినిపించాల్సిన వాదనలపై కూడా ప్రభుత్వం చర్చించనుంది. డెడ్‌లైన్ ముగిసిన తర్వాత ఆర్టీసీ ఉండదని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించడం గమనార్హం. డెడ్‌లైన్ లోపల చేరింది 373 మంది.. నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, కరీంనగర్-1, కామారెడ్డి, బాన్సువాడ, ఖమ్మం, మధిర, భద్రాద్రి కొత్తగూడెం, బోధన్, మిర్యాలగూడ, సూర్యాపేట బస్ డిపోల వద్ద నిరసనకు దిగిన కార్మికులు, అఖిలపక్ష పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. బాన్సువాడ అంబెడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. 50 మంది నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇక డెడ్‌లైన్ లోపల రాష్ట్ర వ్యాప్తంగా 373 మంది కార్మికులు విధుల్లో చేరేందుకు రిపోర్టు చేశారు. -
ఆర్టీసీ సమ్మె : వెనకడుగు వేయం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్ విధించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. అయినప్పటికీ తిరిగి డ్యూటీలో చేరే విషయంలో కార్మికులు వెనకడుగు వేయడంలేదు. దాదాపు 300 మంది మినహా మిగిలినవారంతా సమ్మెలోనే కొనసాగాలని నిర్ణయించు కున్నట్టు తెలుస్తోంది. డిపోల్లోనే కాకుండా పోలీసు స్టేషన్లు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, ఆర్టీఓ, ఎస్పీ డీఎస్పీ తదితర కార్యాలయాల్లో కూడా తిరిగి చేరికకు సంబంధించిన లేఖలు ఇవ్వచ్చని అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో కొన్ని చోట్ల కార్మికులు ఆయా కార్యాలయాల్లో అందజేశారు. ఆ వివరా లన్నీ పూర్తిగా క్రోడీకరించాల్సి ఉన్నందున, మంగళవారం అర్ధరాత్రి 12 వరకు ఎంతమంది కార్మికులు లేఖలు ఇచ్చారన్న విషయంలో స్పష్టత రాలేదు. దీంతో రాత్రి వరకు ఆర్టీసీ అధికారికంగా ఆ సంఖ్యను ప్రకటించలేదు. సాయంత్రం 6 గంటల వరకు 150 మంది, రాత్రి తొమ్మిది వరకు 240 మంది, 10 వరకు ఆ సంఖ్య 300కి కాస్త అటూ ఇటూగా చేరుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం కచ్చితమైన సమాచారం తెలుస్తుందని తెలిపారు. కనీసం వేయి మందికిపైగా చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసినా.. అది సాధ్యం కాలేదు. కార్మిక నేతలు రంగంలోకి దిగి.. ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి వరకు విధుల్లో చేరిన కార్మికులనే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని, మిగతావారికి సంస్థతో ఎలాంటి సంబంధం ఉండదని, ఇదే చివరి అవకాశమని సీఎం తేల్చి చెప్పటంతో తొలుత కార్మికుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే రెండు నెలలుగా జీతాలు లేనందున రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది కార్మికులు విధుల్లో చేరే విష యంలో కుటుంబ సభ్యులు, సన్ని హితులతో చర్చించారు. ఎక్కువ మంది చేరేందుకే ఆసక్తి కనబరిచారు. విషయం తెలిసి కార్మిక సంఘాల నేతలు వెంటనే రంగం లోకి దిగారు. సంఘాలుగా విడివిడిగా జిల్లా స్థాయి నేతలను నగరానికి పిలిపించుకుని చర్చలు జరిపారు. న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఇన్ని వేల మంది ఉద్యోగాలు తొలగించే హక్కు ప్రభుత్వానికి లేనందున అది చెల్లుబాటు కాదని, బేషరతుగా చేరాలన్న మెలికపెట్టడంతో భవిష్యత్తులో జీతాలు పొందడం సహా అన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తాయని, ఇన్ని రోజులు పోరాటం చేసి ఇప్పుడు చేతులెత్తేస్తే సంస్థను కాపాడు కోలేమని చెప్పారు. ఇదంతా కార్మికులందరికీ చేరేలా చర్యలు చేసుకున్నారు. దీంతో కార్మికుల్లో చాలామంది విధుల్లో చేర కుండా ఆగిపోయారు. జేఏసీలో భాగంగా ఉన్న సూపర్వైజరీ అసోసియేషన్ పరిధిలో ఉండే ఉద్యోగులు మాత్రం తిరిగి విధుల్లో చేరేందుకే ఆసక్తి కనపడింది. వారిలో కొందరు మంగళవారం రాత్రి వివిధ ప్రాంతాల్లో లేఖలు అందజేశారు. అఖిలపక్ష నేతలతో జేఏసీ భేటీ... ముఖ్యమంత్రి విధించిన గడువు చివరి రోజైన మంగళవారం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు అఖిలపక్ష నేతలతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంపైనే ఎక్కువ సేపు చర్చించారు. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన మీదట, అసలు ఆర్టీసీని ప్రైవేటీకరించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదనే అంశంపై స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 31 శాతం వాటా ఉన్నందున, దాన్ని మూసివేయాలంటే కచ్చితంగా కేంద్రం అనుమతించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను కార్మికులకు తెలియజేసి.. ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. మరోవైపు మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు డిపోల ముందు కార్మికులు నిరసనలు వ్యక్తం చేశారు. విధుల్లో చేరేందుకు వచ్చే కార్మికులను అడ్డుకునేందుకు వారు కాపలా తరహాలో దీక్షలు నిర్వహించారు. అన్ని డిపోల వద్ద వంటావార్పు ఏర్పాటు చేసి భోజనాలు కూడా అక్కడే చేసేలా చూశారు. జిల్లాల్లో పనిచేస్తున్న దాదాపు వందమంది హైదరాబాద్బస్భవన్లో లేఖలివ్వటం విశేషం. కార్మికులు భయపడొద్దు: అశ్వత్థామరెడ్డి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్టీసీని ప్రైవేటీకరించడం సాధ్యం కాదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్‌లో రాజకీయ పక్షాలతో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రకటనలు చూసి భయాందోళనకు గురికావద్దని కార్మికులకు సూచించారు. కోర్టులో సాగుతున్న న్యాయపోరాటాన్ని బలహీన పరచడానికి ముఖ్యమంత్రి వేస్తున్న ఎత్తుగడలనే సంగతి గ్రహించాలని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా జేఏసీతో చర్చలు జరిపి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈనెల 7న నిర్వహించే సడక్‌బంద్‌లో భాగంగా ఉపాధ్యాయ, ఉద్యోగులు పెన్‌డౌన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 9న నిర్వహించే ఛలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు కె.రాజిరెడ్డి, థామస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వివిధ పార్టీల నేతలు జూలకంటి రంగారెడ్డి, డాక్టర్ చెరుకు సుధాకర్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోసారి సీఎం సమీక్ష? ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఎంతమంది విధుల్లో చేరారన్న లెక్కలకు సంబంధించి అందుబాటులో ఉన్న వివరాలను మంగళవారం రాత్రి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అధికారులు అందజేశారు. వాటిని ఆయన సీఎంకు తెలియజేశారు. దీనిపై మరోసారి ముఖ్యమంత్రి స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది. 7న హైకోర్టులో వాదనలు ఉన్నందున, మరోసారి ముఖ్యమంత్రి సమీక్షిస్తారని చెబుతున్నారు. కార్మికుల స్పందన తక్కువగా ఉన్న నేపథ్యంలో, ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు మరిన్ని ఎక్కువగా ఇచ్చే విషయంలో కీలక ప్రకటన ఉండనుందని చెబుతున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 72.46 శాతం బస్సులు నడిచినట్లు ఆర్టీసీ వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 1937 అద్దె బస్సులను కలుపుకొని మొత్తం 6,484 బస్సులు నడిచాయని తెలిపింది. -
తరుముతున్న డెడ్‌లైన్.. కార్మికుల్లో టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: గత 32 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తిరిగి బేషరతుగా విధుల్లో చేరడానికి మంగళవారం అర్ధరాత్రి వరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు డెడ్‌లైన్ పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ విధించిన డెడ్‌లైన్ గడువు మరికాసేపట్లో ముగియబోతుండటంతో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ విధించిన డెడ్‌లైన్‌కు కార్మికులు తలొగ్గుతారా? లేక సమ్మెను కొనసాగిస్తారా? కార్మికులు దిగిరాకపోతే.. కేసీఆర్ అన్నట్టే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటు చేస్తారా? అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆఫర్‌కు కార్మికుల నుంచి ఓ మోస్తరుగా స్పందన వస్తున్నట్టు కనిపిస్తోంది. సీఎం డెడ్‌లైన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 208 మంది ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేరినట్టు సమాచారం. బస్‌భవన్ కేంద్రంగా 100 మందికిపైగా విధుల్లో చేరినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్పీ కార్యాలయాల్లో, ఆర్ఎం కార్యాలయాల్లో నేటి అర్ధరాత్రి వరకు కార్మికులు విధుల్లోకి చేరేందుకు అవకాశం కల్పించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 5100 రూట్లను ప్రైవేటీకరించిన సంగతి తెలిసిందే. డెడ్‌లైన్‌లోపు కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరకపోతే.. పూర్తిగా అన్నీ రూట్లను ప్రైవేట్ చేస్తామంటూ సీఎం కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ విధించినా కార్మికులు విధుల్లో చేరేది లేదని, ఇప్పటివరకు విధుల్లో చేరిన కార్మికులు కూడా తిరిగి వెనక్కి వస్తున్నారని ఆర్టీసీ జేఏసీ తెగేసి చెప్తోంది. కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిందేనని, సమ్మె చేస్తున్న కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేస్తోంది. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ప్రైవేటీకరించలేదని, ఇందుకు కేంద్రం అనుమతి కూడా ఉండాలని అంటున్నారు. ఇప్పటివరకు విధుల్లో చేరిన కార్మికుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. -
విధుల్లో చేరం.. సమ్మె ఆపం
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్టీసీ కార్మికులను బెదిరించే ధోరణి మానేసి ఇప్పటికైనా చర్చలకు సిద్ధం కావాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పేర్కొంది. చర్చలకు ఆహ్వానిస్తే ఏయే డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తుందో, ఏయే డిమాండ్ల విషయంలో జేఏసీ పట్టువిడుపులను ప్రదర్శిస్తుందో స్పష్టమవుతుందని, అది ఆర్టీసీ సమ్మెకు పరిష్కారంగా మారుతుందని పేర్కొంది. ఈ నెల ఐదో తేదీ అర్ధరాత్రిలోపు కార్మికులు విధుల్లోకి రావాలని, రాని వారికి ఇక ఆర్టీసీతో సంబంధం ఉండదన్న ముఖ్య మంత్రి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ డెడ్‌లైన్‌ను కార్మికులు పట్టించుకోరని తేల్చిచెప్పింది. తమ డిమాండ్లకు పరిష్కారం రానంతవరకు సమ్మెను ఆపబోమని స్పష్టం చేసింది. ఆర్టీసీలో 5,100 మార్గాలను ప్రైవేట్‌కు కేటాయిం చటం, ఐదో తేదీ నాటికి విధుల్లో చేరని కార్మికులను ఇక తీసుకోబోమంటూ డెడ్‌లైన్ విధింపు, ఐదు వేల బస్సులకే ఆర్టీసీ పరిమితం... తదితర విషయాలపై శనివారం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో, ఆర్టీసీ జేఏసీ ఆదివారం ఉదయం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో–కన్వీనర్ రాజి రెడ్డి, సుధ తదితరులు మీడియాతో మాట్లాడారు. తాము ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లపై చర్చలకు సిద్ధమై, వాటికి పరిష్కార మార్గాలు చూపనంతవరకు సమ్మెను ఆపబోమని నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న రహస్య ఎజెండాను మనసులో పెట్టుకుని ముఖ్యమంత్రి కార్మికులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం బెదిరింపులకు కార్మికులెవరూ భయపడొద్దని, 49 వేల మంది ఉద్యోగాలు తొలగించే హక్కు ఎవరికీ లేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికే ఖరారు చేసిన సమ్మె కార్యాచరణ అలాగే కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ కార్మికులను బిడ్డలుగా భావిస్తున్నానని అన్నందుకు సీఎంకు ధన్యవాదాలు చెబుతున్నామని, కానీ ఆయన ఒకవైపు బిడ్డలు అంటూనే మరోవైపు కార్మికులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఏదో ఓ కమిటీ వేసి తమ డిమాండ్లపై చర్చించాలని పేర్కొన్నారు. మేం అన్ని డిమాండ్లపై పట్టుపట్టి కూర్చోమని, చర్చల్లో పట్టువిడుపులకు అవకాశం ఉంటుందన్నారు. తమది సీఎం చెబుతున్నట్లుగా చట్ట విరుద్ధ సమ్మె కాదని, చట్టబద్ధమైందేనని పునరుద్ఘాటించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో లీగల్ లేదు ఇల్లీగల్ లేదు, సమ్మె సమ్మెనే అన్న కేసీఆర్, తెలంగాణ వచ్చాక సమ్మె విషయంలో మాటమార్చడం సబబు కాదన్నారు. ఆర్టీసీకి బకాయిలు లేవు అనటం కూడా సరికాదని, దానిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తే నిజాలు వెలుగు చూస్తాయన్నారు. 23 వేల మందికి కూర్చోబెట్టి జీతాలిస్తారా?.. కేవలం 5 వేల బస్సులే ఆర్టీసీలో ఉంటాయన్న ముఖ్యమంత్రి లెక్కల ప్రకారం 28 వేల మంది కార్మికులు సరిపోతారని, మరి మిగిలిన 23 వేల మందికి పని ఉండదని, వారిని కూర్చోబెట్టి జీతాలిస్తారా అని ప్రశ్నించారు. 97 డిపోలకు గాను 48 డిపోలే సరిపోతాయని, మిగిలిన డిపోల డీఎంల పరిస్థితి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా డీఎంల నుంచి ఈడీల వరకు బయటకొచ్చి తమతో కలసి సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రిజర్వేషన్ రోస్టర్ అమలు ఆర్టీసీలో పక్కాగా జరుగుతోందని, సగం రూట్లను ప్రైవేటీకరించాక వచ్చే ప్రైవేటు సంస్థలు వాటిని అమలు చేస్తాయా అని ప్రశ్నించారు. అప్పుడు రిజర్వేషన్ల పద్ధతికే విఘాతం కలుగుతుందన్నారు. యూనియన్ల నుంచి కార్మికులను దూరం చేసేలా ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దాన్ని కార్మికులు గుర్తించాలని కోరారు. ఆర్టీసీలో రూ.650 కోట్ల డిప్రిసియేషన్ ఫండ్ ఉంటుందని, అది ఎక్కడుందో తేల్చి దానితో కొత్త బస్సులు కొనాలని సూచించారు. ఆర్టీసీ నష్టాలు కేంద్రం భరించే అవకాశం ఉండదన్నారు. జీతాలివ్వకుంటే పరిస్థితేంటి?... కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలంటున్నారని, రేపు జీతాలకు డబ్బులేదు ఇవ్వలేమంటే అప్పుడు వారు ఏం చేయాలని ప్రశ్నించారు. నష్టాలొచ్చే రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు ఇస్తామని సీఎం అన్నారని, కానీ నష్టాలొచ్చే రూట్లు తీసుకునేందుకు వారు పిచ్చివాళ్లా అని ప్రశ్నించారు. అందుకే కార్మికులు వాస్తవాలు గుర్తించి సమస్య పరిష్కారమయ్యేవరకు సమ్మెలో ఉండాలని, ఆత్మద్రోహం చేసుకుని పిరికివారిలా పారిపోవద్దని సూచించారు. గతంలో ముఖ్యమంత్రి ఇలాగే డెడ్లైన్లు విధించారని, ఎవరూ చలించలేదని, ఇప్పుడు కూడా ఒకటి రెండు శాతం మంది విధుల్లో చేరినా మిగతావారు సమ్మెలోనే ఉంటారన్నారు. చాలా ప్రాంతాల నుంచి కార్మికులు తమకు ఫోన్ చేసి సమ్మెను కొనసాగించాలని పేర్కొంటున్నారని, ఆపితే ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. రోడ్డు దిగ్బంధం వాయిదా ఐదో తేదీన రోడ్డు దిగ్బంధం కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నామని, ఆ రోజు న్యాయస్థానాలకు సంబంధించిన పోస్టుల భర్తీ పరీక్ష ఉన్నందున, అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. -
కేసీఆర్ ప్రకటనపై స్పందించిన జేఏసీ
సాక్షి, హైదరాబాద్: మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కీలక భేటీ నిర్వహించింది. ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ సమావేశం అనంతరం జేఏసీ కన్వీనర్ ఆశ్వాత్థామరెడ్డి వివరాలను వెల్లడించారు. ఉద్యోగులను తొలగించే అధికారం ఎవరికీ లేదని, డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ శనివారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో తమ సమస్యల పరిష్కారంపై హామీ రాలేదని అన్నారు. సమావేశం అనంతరం జేఏసీ నేతలు మాట్లాడారు. సీఎం డెడ్ లైన్లు పెట్టడం కొత్తకాదని, కోర్టులను సైతం సీఎం డిక్టేట్ చేస్తున్నారని విమర్శించారు. తొలుత చర్చలు జరిపి కార్మికులకు డెడ్ లైన్లుపెట్టాలని అన్నారు. ఉద్యోగాలు తీసే అధికారం సీఎంకు లేదని, డిపో మేనేజర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీలో కూడా రిజర్వేషన్లు అమలు ఉన్నాయని, ప్రైవేటు పరమైతే వెనకబడ్డ కులాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్లకు బుగ్గ కారులో తిరగాలని సోకు లేదని, కార్మికుల డిమాండ్ల కోసమే యూనియన్లు పనిచేస్తున్నామని వివరించారు. ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి సీఎం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్మికులు నా బిడ్డలు అనుకుంటూనే కేసీఆర్ వారిని ఇబ్బంది పెడ్తున్నాడని మండిపడ్డారు. ఎవరో ఇద్దరు ముగ్గురు పిరికివాళ్లు ఉద్యోగంలో చేరుతున్నారని, కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నారని వెల్లడించారు. భేటీ సందర్భంగా జేఏసీ నేతలు భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. -
పోరు ఆగదు
-
5న సడక్ బంద్.. 9న చలో ట్యాంక్‌బండ్
సాక్షి, హైదరాబాద్ (సుందరయ్య విజ్ఞానకేంద్రం): సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టంచేశారు. నాలుగు కోట్ల మంది ప్రజల రవాణాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. శనివారం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి తెలంగాణ ఆర్టీసీ విడిపోలేదని, అందువల్ల సీఎం తీసుకునే అప్రజాస్వామిక నిర్ణయాలు చెల్లవని పేర్కొన్నారు. తమ కార్యాచరణలో భాగంగా ఢిల్లీ వెళ్లి ఈనెల 4, 5వ తేదీల్లో రాష్ట్రపతి కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వినతిపత్రం సమరి్పంచనున్నట్టు వెల్లడించారు. సీఎం మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యలను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు. సీఎం మొండి వైఖరి విడనాడాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సీఎం నిర్ణయాలు చెల్లవు: కోదండరాం ఏపీఎస్ ఆర్టీసీ నుంచి తెలంగాణ ఆర్టీసీ ఇంకా విడిపోనందున ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు చెల్లవని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టంచేశారు. సర్కారు ప్రకటనలకు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. కోర్టును ధిక్కరించే ఇలాంటి ముఖ్యమంత్రిని తాను చూడలేదన్నారు. అసలు సీఎంకు చట్టం గురించి తెలుసా అని ప్రశ్నించారు. సంస్థను ప్రైవేటుపరం చేసే అధికారం ఆయనకు లేదని పేర్కొన్నారు. న్యూడెమోక్రసీ సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. సీఎంకు కారి్మక చట్టాలు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కోర్టుకు సైతం తప్పుడు నివేదికలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి, వాటి ఆస్తులను అమ్ముకునే కుట్రలో భాగంగానే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలేదని ఆరోపించారు. ఇదీ జేఏసీ కార్యాచరణ... మృతిచెందిన కార్మికులకు సంతాపంగా 3న అన్ని డిపోలు, మండలాలు, నియోజకవర్గాల్లో సమావేశాలు 4న రాజకీయ పార్టీలతో కలసి అన్ని డిపోల వద్ద ధర్నాలు 5న సడక్ బంద్‌లో భాగంగా రహదారుల దిగ్బంధనం 6న అన్ని డిపోల వద్ద ఆర్టీసీ కార్మిక కుటుంబాల నిరసన 7న అన్ని ప్రజా సంఘాలతో ప్రదర్శనలు 8న చలో ట్యాంక్‌బండ్ ముందస్తు సన్నాహక కార్యక్రమాలు 9న చలో ట్యాంక్‌బండ్, సామూహిక నిరసనలు -
28వ రోజుకు చేరుకున్న అర్టీసీ సమ్మె
-
27వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె
-
అవసరమైతే మిలియన్ మార్చ్!
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ పరిరక్షణకు జరుగుతున్న పోరాటంలో కార్మికులు విజయతీరాలకు ఎంతో దూరంలో లేరు. అనుమానమొద్దు.. విజయం మనదే. ప్రగతి భవన్లో కేసీఆర్ ఒంటరయ్యారు. ఆయన వెంట మంత్రుల్లేరు. ఎమ్మెల్యేలు లేరు. కానీ ఆర్టీసీ కార్మికుల వెంట రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, అన్నింటికీ మించి ప్రజలున్నారు. ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసే క్రమంలో అవసరమైతే ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ నిర్వహిద్దాం’అని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. ప్రభుత్వంలో విలీనం అయితే తప్ప ఆర్టీసీ బతకదని, దాన్ని కచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమ్మె కార్యాచరణలో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ‘సకల జనభేరి’సభకు ఆయన అధ్యక్షత వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా కార్మికులు సభకు తరలివచ్చారు. ఇండోర్ స్టేడియంలో మాత్రమే సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో, లోపల స్థలం లేక భారీ సంఖ్యలో కార్మికులు బయటే ఉండిపోయారు. ఇంత భారీ ఉద్యమం శాంతియుతంగా నిర్వహించటం చిన్న విషయం కాదని, ప్రపంచవ్యాప్తంగా అరుదైనదని పేర్కొన్నారు. కార్మికలు తమ జీతాల కోసం సమ్మె చేయట్లేదని, సంస్థను ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నారని చెప్పారు. ఈ తపన ఎంత బలంగా ఉందో.. సకల జనభేరి సభకు 50 వేల మంది రావటమే నిదర్శనమన్నారు. ప్రభుత్వ వైఖరిని హైకోర్టు తప్పుపడుతున్నా ఇప్పటివరకు సీఎంలో చలనం లేదని దుయ్యబట్టారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులే కారణమంటూ సీఎం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ చెబుతున్నట్లు కారి్మకులకు సగటు జీతం రూ.50 వేలు లేనే లేదని, వారివన్నీ తక్కువ జీతాలేనని స్పష్టం చేశారు. చిన్నచిన్న కారణాలకే కారి్మకుల ఇంక్రిమెంట్లు కట్ చేస్తున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన చర్చల సమయంలో కార్మిక సంఘం నేతలను అధికారులు అవమానించారని మండిపడ్డారు. దీన్ని కారి్మక సంఘం నేతలు సమర్థంగా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇప్పటికే 15 మంది కారి్మకులు మృతి చెందారని, ఇంకా ఎంతమందిని సీఎం బలి తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వ హత్యలే: చాడ వెంకటరెడ్డి కేసీఆర్‌కు రాజ్యాంగంపై అవగాహన లేదని, అందుకే ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కేసీఆర్ తీరులో ఇప్పటికే 15 మంది ఆర్టీసీ కారి్మకులు మృతిచెందారని, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్నారు. హైకోర్టు అక్షింతలు వేస్తుంటే.. తప్పుడు లెక్కలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆ విషయం గ్రహించి కోర్టు మొత్తం కూపీ లాగుతోందన్నారు. అంతిమ విజయం కారి్మకులదేనని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ప్రైవేటీకరించటం ఉందా: రేవంత్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం తమ ఎజెండాలో లేదని సీఎం అంటున్నారని, మరి ఆరీ్టసీని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు చేస్తున్న అంశం ఏ ఎజెండాలో ఉందో చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తన వ్యాపారాలకు పనికొచ్చేవే చేస్తున్నారని, అవన్నీ ఎన్నికల మేనెఫెస్టోలో పెట్టే చేస్తున్నారా అని ప్రశ్నించారు. మీరు, మీ కొడుకు, కూతురు, అల్లుడు, బంధువులు సీఎం, మంత్రులు, ఎంపీలు అవుతారని మేనిఫెస్టోలో ప్రకటించారా అని ఎద్దేవా చేశారు. ‘సభాప్రాంగణానికి చేరుకునేందుకు 3 కిలోమీటర్ల దూరం నడిచి రావాల్సిన పరిస్థితి ఏర్పడేలా వేల మంది కార్మికులు వచ్చారు. ఇవి నిరసనలు కాదా.. ధర్నాలు కాదా.. కేసీఆర్‌కు కని్పంచట్లేదా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్‌కు కూతవేటు దూరంలో మిలియన్ మార్చ్ నిర్వహిస్తే సీమాంధ్ర సీఎం అనుమతించారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో కారి్మకులు సభ నిర్వహించుకుంటామంటే అవకాశం లేకుండా చేయటం విడ్డూరమన్నారు. నిజానికి ఆర్టీసీ నష్టాల్లో లేదని, నష్టాల్లోకి నెట్టేశారన్నారు. ధనవంతులు తిరిగే విమాన ఇంధనంపై ఒక శాతం పన్ను వేస్తూ, పేదలు తిరిగే ఆర్టీసీ బస్సుల డీజిల్‌పై 27.5 శాతం పన్ను వేయటం లాంటివాటి వల్ల నష్టాలు వచ్చాయన్నారు. విమాన ఇంధనంపై పన్ను తగ్గించి ప్రైవేటు సంస్థకు రూ.500 కోట్ల లాభం చేకూర్చి, డీజిల్‌పై పన్ను పెంచి ఆర్టీసీపై రూ.700 కోట్ల భారం మోపారన్నారు. వేల మంది పోలీసు పహారా పెట్టినా 21న ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా ‘కోట గోడ’ను కొట్టామని, ప్రజలు తలుచుకుంటే ప్రగతి భవనే ఉండదని హెచ్చరించారు. కోర్టు జోక్యం చేసుకుని చక్కదిద్దుతుంటే కేసీఆర్ గాడిద పండ్లు తోముతడా అని మండిపడ్డారు. బుధవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనుల సమరభేరికి హాజరైన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడెందుకు నష్టాలు: ఎల్.రమణ తాను రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నష్టాల ఆరీ్టసీని లాభాల్లోకి తెచ్చానన్న కేసీఆర్, సీఎం అయ్యాక తీవ్ర నష్టాల్లోకి ఎందుకు వెళ్లిందో చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులను స్వా«దీనం చేసుకునేందుకే దాన్ని ప్రైవేటీకరించే యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆర్టీసీ కారి్మకులు కీలకమవుతారని, సాధారణ ప్రయాణికులకు వాస్తవాలు చెప్పటం ద్వారా కనీసం కోటి మందిని ప్రభావితం చేయగలుగుతారని, అది ఎన్నికల ఫలితాన్ని శాసిస్తుందన్నారు. డిస్మిస్ భయం లేని ఆత్మగౌరవ ఉద్యమం: మందకృష్ణ మాదిగ సెల్ఫ్ డిస్మిస్ అంటూ కేసీఆర్ ఎంత బెదిరించినా ఆర్టీసీ కారి్మకులు ఆత్మ గౌరవంతో ఉద్యమం చేస్తున్నారని ఎమ్మారీ్పఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్ ఓటమి దిశలో ఉన్నారని, ఆర్టీసీ కారి్మకులు గెలుపుబాటలో ఉన్నారని పేర్కొన్నారు. లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రలో ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే, మిగులు బడ్జెట్ రాష్ట్రం తెలంగాణలో ప్రైవేటీకరిస్తారా అని ప్రశ్నించారు. ఈ సభ చూస్తే కేసీఆర్‌కు దడ: జితేందర్‌రెడ్డి సరూర్‌నగర్ సభకు వచి్చన కారి్మక జన ప్రవాహం చూస్తే ప్రగతి భవన్లో కేసీఆర్‌కు దడ ఖాయమని బీజేపీ నేత జితేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ఆర్టీసీ కారి్మకులను ఉద్యమంలో వాడుకుని ఇప్పుడు వారినే డిస్మిస్ పేరుతో బెదిరించటం దారుణమన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కరెంటు సరిగా లేకపోయినా దిక్కుండదని, కేసీఆర్‌కు కావాల్సింది ఓట్లు తప్ప ప్రజల సంక్షేమం కాదన్నారు. ఇప్పటికే ఏ పథకానికీ నిధుల్లేకుండా పోయాయని, ఈ దివాలా ప్రభుత్వం ఎందుకు, కేసీఆర్‌ను దింపేస్తే సరిపోతుంది కదా అని పేర్కొన్నారు. సభలో కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ నేత వివేక్, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఎం నేత నరసింహారావు, చెరుకు సుధాకర్, విమలక్క, జాజుల శ్రీనివాసగౌడ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. గమ్యం చేరి తీరాలి: అశ్వత్థామరెడ్డి కారి్మకులు గెలుపు కోసం పోరాడుతుంటే, ప్రభుత్వం ఓడిపోవొద్దని పోరాడుతోందని, ఏదో సమయంలో కచి్చతంగా ప్రభుత్వం పట్టు సడలి ఓడిపోవటం ఖాయమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. గమ్యాన్ని చేరి తీరాల్సిందేనని, ఇందుకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతామని అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయనుకుంటే ఆరీ్టసీని ప్రైవేటీకరించే తరహా పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని పేర్కొన్నారు. నిర్బంధాన్ని ఛేదించుకుని వేల సంఖ్యలో కారి్మకులు ఈ సభకు తరలి వచ్చారని, ఇదే ఉత్సాహంతో అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగుతారని జేఏసీ కోకనీ్వనర్ రాజిరెడ్డి అన్నారు. ప్రభుత్వంలో ఆరీ్టసీని విలీనం చేస్తే యూనియన్లనే తాము రద్దు చేసుకుంటామన్నారు. నేడు దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా కారి్మకులంతా ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని ఈ సభలో తీర్మానించారు. గురువారం రాత్రి వరకు ఈ దీక్ష కొనసాగనుంది. నిరాహార దీక్ష చేస్తూ ప్రస్తుతం నిమ్స్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే సాంబశివరావు దీక్ష విరమించేలా చేయాలని కూడా తీర్మానించారు. గురువారం ఉదయం 9 గంటలకు నిమ్స్‌కు వెళ్లి ఆయనకు నిమ్మరసం ఇచ్చి విరమింపచేయాలని నిర్ణయించినట్లు జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలు వెల్లడించారు. -
‘మేనిఫెస్టోలో కేసీఆర్ ఆ విషయం చెప్పారా’
-
ఆర్టీసీ సమ్మె : ‘మేనిఫెస్టోలో కేసీఆర్ ఆ విషయం చెప్పారా’
సాక్షి, హైదరాబాద్: గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు బుధవారం సకల జనుల సమరభేరికి పిలుపునిచ్చారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ సభలో ఆర్టీసీ కార్మికులు, విపక్ష పార్టీల నేతలు భారీ ఎత్తున హాజరయ్యారు. సకల జనుల సమరభేరి సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. విలీనం అంశం తమ మేనిఫెస్టోలో లేదని చెప్తున్న కేసీఆర్ డీజిల్ మీద 27.5 శాతం వ్యాట్ ఎందుకు వేస్తున్నారని.. ఇది మేనిఫెస్టోలో ఉందా అని ప్రశ్నించారు. 20 శాతం బస్సులను ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి.. వాటిని మేఘా కృష్ణారెడ్డికి ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పారా అని చురకలంటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘విలీనం అంశం తమ మేనిఫెస్టోలో లేదని.. ఊసరవెళ్లి ఎర్రబెల్లి అంటారు. సీఎం కేసీఆర్ కూడా విలీనం అంశం తమ మేనిఫెస్టోలో లేదు అంటారు.. మరి మీ కొడుకు, కూతురు, అల్లుడుకు మంత్రి పదవులు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పారా. 50 వేల కార్మికుల కుటుంబాలకు మద్దతుగా నాలుగు కోట్ల తెలంగాణ సమాజం మద్దతుగా నిలించింది. ఏ స్వేచ్ఛ కోసం తెలంగాణ ప్రజలు పోరాడారో.. మళ్లీ నేడు అదే స్వేచ్ఛ కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. సకలజనుల సమరభేరికి కోర్టు అనుమతిచ్చి 24 గంటలు గడువకముందే వందల కిలోమీటర్ల నుంచి కార్మిక సోదరులు సరూర్‌నగర్ గ్రౌండ్లో కదం తొక్కారు. ఇది తెలంగాణ ప్రజల స్ఫూర్తి’ అని రేవంత్ అన్నారు. -
అనగనగా ఆర్టీసీ.. తల్లిపై ప్రేమతో
ప్రజారవాణాలో అతి ముఖ్యమైన ఆర్టీసీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. నిజాం రైల్వేస్‌లో భాగంగా ‘రోడ్ ట్రాన్స్‌పోర్టు డివిజన్’ (ఆర్టీడీ) పేరుతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో 1932లో ప్రగతి చక్రం ప్రస్థానం ప్రారంభమైంది. 22 బస్సులు, 166 మంది సిబ్బందితో తొలుత పరుగులు పెట్టింది. ఆ తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. ప్రజా రవాణా రంగంలోనే అతి పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. అయితే ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం వివిధ సందర్భాల్లో సమ్మెకు దిగిన సందర్భాలున్నాయి. కానీ ఈసారి చేస్తున్న సమ్మె... ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్దదిగా మారనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కార్మికులు 27 రోజులు సమ్మె చేయగా... ఇప్పుడు చేపట్టిన సమ్మెకు ఇప్పటికే 25 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీసీ...ఒక సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ప్రజా రవాణా సంస్థ. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న ఆర్టీసీలో కార్మికులు చేపట్టిన సమ్మె 25వ రోజుకు చేరుకుంది. ఇరువై ఐదు రోజులు గడిచినప్పటికీ అనిశ్చితి తొలగిపోవడంలేదు. దీంతో ఇప్పటి వరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెలలో ఇదే అతిపెద్ద సమ్మెగా మారుతోంది. ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన కాలంలో రోడ్డు రవాణా విభాగం (ఆర్టీడీ)గా నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేస్‌లో ఒక విభాగంగా మొదలైంది. అంచెలంచెలుగా ఎదిగింది. ప్రజా రవాణా రంగంలోనే అతి పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. నిజానికి ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ కాలంలోనే రైల్వే రంగానికి బలమైన పునాదులు ఏర్పడ్డాయి. ఉస్మాన్ అలీఖాన్ సమయంలో రవాణా రంగం బాగా విస్తరించుకుంది. రైల్వే, ఆర్టీసీ, విమానయాన సేవలతో నిజాం రవాణా వ్యవస్థ సుసంపన్నమైంది. గౌలిగూడ బస్‌స్టేషన్ ఇదే అతి పెద్ద సమ్మె... ♦ ఆర్టీసీలో తరచుగా సమ్మెలు జరుగుతూనే ఉన్నాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు చివరి అస్త్రంగా సమ్మెను సంధిస్తున్నాయి. జీతాల పెంపు, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ బకాయిల చెల్లింపు, ప్రైవేట్ బస్సుల అక్రమ రవాణాను అరికట్టడం, రన్నింగ్ టైమ్ పెంచడం వంటి డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఇప్పటి వరకు అనేక సార్లు సమ్మెకు దిగారు. ♦ సమస్యల పరిష్కారం కోసం 2000 సంవత్సరంలో కార్మికులు 14 రోజుల పాటు సమ్మె చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమయ్యాయి. అప్పట్లో సమ్మె జనజీవితంపైన ప్రభావం చూపింది. ప్రైవేట్ రవాణా సదుపాయాలు తక్కువగా ఉండడం, ఎక్కువ మంది ప్రయాణికులు ఆర్టీసీపైనే ఆధారపడడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ♦ మోటారు వాహన పన్ను రద్దుతో పాటు, ఆర్టీసీ అభివృద్ధికి నిధుల కేటాయింపు, తదితర డిమాండ్లతో 2003లో మరోసారి కార్మికులు సమ్మెకు దిగారు. అప్పట్లో సమ్మె ఉధృతంగా సాగింది. 24 రోజుల పాటు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల సమ్మెను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నించింది. చివరకు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ♦ ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న రోజుల్లో సకల జనుల సమ్మెలో భాగంగా 2011 అక్టోబర్ నెలలో కార్మికులు 27 రోజుల పాటు సమ్మె చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కార్మికులు ముందంజలో నిలిచారు. సర్వీసులన్నీ స్తంభించాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ♦ కానీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెలలో మాత్రం ప్రస్తుతంకొనసాగుతున్నదే అతి పెద్ద సమ్మెగా నిలిచింది. ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితిలో ఇప్పటికే 25వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన ఈ సమ్మెకు కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదు. ♦ ఈ సమ్మెతో నగరంలో ప్రజారవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రైవేట్ సిబ్బంది సహాయంతో పాక్షికంగా బస్సులు నడుపుతునప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయిలో రవాణా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ♦ మరోవైపు సమ్మె కారణంగా ఆర్టీసీ సైతం కోట్లాది రూపాయల నష్టాన్ని చవి చూస్తోంది. సాధారణ రోజుల్లో 3750 బస్సులతో, 42 వేల ట్రిప్పులు నడిచే సిటీ బస్సుల్లో ప్రతి రోజు 32 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం 1000 నుంచి 1500 బస్సులు మాత్రం రోడ్డెక్కుతున్నాయి. నిజాం కాలం నాటి బస్ టికెట్ ఇదీ చరిత్ర...... బ్రిటీష్ పాలిత ప్రాంతాలకు ధీటుగా హైదరాబాద్ స్టేట్‌లో రవాణా సదుపాయాలు విస్తరించుకున్నాయి. విశాలమైన రహదారుల నిర్మాణం జరిగింది. హైదరాబాద్ నగరంలో అప్పటి వరకు కేవలం సంపన్నవర్గాలకు మాత్రమే పరిమితమైన మోటారు వాహన సదుపాయం క్రమంగా సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్–హైదరాబాద్ నగరాల మధ్య రవాణా సదుపాయాలు పెరిగాయి. ఆ రోజుల్లో ఇదే ప్రధానమైన మార్గం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి హుస్సేన్‌సాగర్ చెరువు కట్ట మీదుగా ఆబిడ్స్, కోఠీ మార్గంలో బస్సులు తిరిగేవి. 1879లో ఆవిర్భవించిన నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే సంస్థ తొలిసారిగా సికింద్రాబాద్ నుంచి వాడి వరకు రైల్వే సేవలను ప్రారంభించింది. ఈ నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేస్‌లో ఒక విభాగంగానే 1932లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ’నిజాం స్టేట్ రైల్వేస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డివిజన్’ను ఏర్పాటు చేశారు.ఇలా హైదరాబాద్ రాజ్యంలో రోడ్డు రవాణా వ్యవస్థ ప్రారంభమైంది. 22 బస్సులు, 166 మంది సిబ్బందితో ఆర్టీసీ ప్రస్థానం మొదలైంది.ఈ బస్సులను స్కాట్లాండ్ ఆటోమొబైల్ సంస్థ అల్బైనో తయారు చేసింది. అప్పటి వరకు ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో ఈ బస్సులను రూపొందించారు. 1932లో తొలిసారి బస్సుల ప్రారంభం... అమ్మ ప్రేమకు గుర్తుగా... నిజాం కాలంలో బస్సు నంబర్ ప్లేట్‌పై హైదరాబాద్ స్టేట్‌ను సూచించేలా హెచ్‌వై తరువాత ’జడ్’ ఉండేది. ఉదాహరణకు ’హెచ్‌వై జడ్ 223.’ అనే నెంబర్‌తో బస్సులు కనిపించేవి. ఉస్మాన్ అలీఖాన్ తన తల్లి మీద ప్రేమతో ఆర్టీసీ బస్సల నెంబర్ప్లేట్లపైన ’జడ్’ అనే అక్షరాన్ని చేర్చారు. మొదట ఆయన తన తల్లి అమాత్ జహరున్నీసా బేగం పేరు మీద రోడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్‌ను ప్రారంభించాలనుకున్నారు. కానీ, ప్రభుత్వ సంస్థకు ఓ వ్యక్తి పేరు పెట్టడం తగదని మంత్రులు సూచించడంతో బస్సు నెంబర్లలో తన తల్లిపేరు కలిసి వచ్చేలా ఆమె పేరులోని ’జడ్’ (జహరున్నీసా) అనే అల్ఫాబెటిక్ను చేర్చారు. ఈ సంప్రదాయం అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్ఆర్టీసీ ప్రారంభమైన 1958 నుంచి కూడా బస్సుల రిజిస్ట్రేషన్లపై ’జడ్’ అనే అక్షరం వచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2014లో ఆర్టీసీ విభజన తర్వాత కూడా ఈ సంప్రదాయం స్థిరంగా ఉంది. ఆర్టీఏలో పోలీసు వాహనాలకు ’ పీ’ సిరీస్‌తో, రవాణా వాహనాలకు ’టీ’ సీరిస్ నెంబర్లతో, ఆర్టీసీ బస్సులకు ’జడ్’ సిరీస్‌తో నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. -
నేడు సకల జనుల సమరభేరి
-
నేడు ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా బుధవారం సకల జనుల సమరభేరి పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభలో విపక్ష పార్టీలన్నీ పాల్గొనబోతున్నాయి. తొలుత ఈ సభను సరూర్‌నగర్ మైదా నంలో భారీ స్థాయిలో నిర్వహించాలని అనుకున్నా.. హైకోర్టు సూచనలతో పరిమితులతో కూడిన సభలాగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సభ జరగనుంది. స్టేడియం సామర్థ్యం ఐదు వేలే... సభను 3 లక్షల మందితో భారీగా నిర్వహించాలని జేఏసీ తొలుత నిర్ణయించింది. వీరిలో దాదాపు లక్షన్నర మంది కార్మికుల కుటుంబీకులే ఉంటారని అంచనా వేసింది. సమ్మెకు విపక్షాలన్నీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుండటంతో, జనసమీకరణకు ఆయా పార్టీలన్నీ హామీ ఇచ్చాయి. సరూర్‌నగర్ మైదానంలో సభకు ప్రణాళిక సిద్ధం చేసుకుని అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు చెప్పడంతో మంగళవారం జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న అనంతరం షరతులతో అనుమతి మంజూరు చేసింది. ఫలితంగా వేదికను ఇండోర్ స్టేడియంలోకి మార్చాల్సి వచి్చంది. స్టేడియం సామర్థ్యం కేవలం 5 వేలే కావడంతో జనసమీకరణ కసరత్తును విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉధృతంగా నిరసనలు.. హైకోర్టు వ్యాఖ్యలతో కార్మికుల్లో ఉత్సాహం పెరిగింది. దీంతో గత రెండు రోజులుగా వారు నిరసనల హోరు పెంచారు. మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, విపక్షాల కార్యకర్తలు నిరసనలు నిర్వహించారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు సమ్మెకు మద్దతుగా నిలిచారు. ఆర్మూర్‌లో కార్మికులు, అఖిలపక్ష నేతలు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి బస్టాండు వద్ద కార్మికులు మోకాళ్లపై మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల పోరాట సహాయ నిధికి తెలంగాణ ఉపాధ్యాయ సంఘం పక్షాన రూ.25 వేలు, కామారెడ్డి కోర్టు సిబ్బంది రూ.5 వేలు అందజేశారు. సమ్మె మొదలయ్యాక మృతి చెందిన ఆర్టీసీ కార్మికులకు బాన్సువాడ, జగిత్యాల, మెట్పల్లి, గోదావరిఖని, హుస్నాబాద్ డిపోల వద్ద నివాళులరి్పంచారు. మంథని వద్ద గోదావరి నదిలో బీజేపీ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. నల్లగొండలో కార్మికుల నిరసనలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మద్దతు ప్రకటించారు. కండక్టర్ నీరజ ఆత్మహత్య నేపథ్యంలో సత్తుపల్లిలో బంద్‌కు పిలుపినివ్వటంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. సీఐటీయూ నేతను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ కార్యకర్తలు, కార్మికులు ఖమ్మం టూటౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సిద్దిపేటలో కార్మికుల దీక్షా శిబిరం వద్ద సీపీఐ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎమ్మారీ్పఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కార్మికులకు సంఘీభావంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. మరోవైపు ఆర్టీసీ పరిరక్షణ, హక్కుల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నది వీరోచిత పోరాటమని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కొనియాడింది. వారి పోరాటానికి ఏపీఎస్‌ఆరీ్టసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మరోవైపు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 73 శాతం బస్సులను తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. ‘కోర్టుకు తప్పుడు వివరాలిస్తోంది’ ప్రభుత్వం కోర్టుకు తప్పుడు వివరాలు అందిస్తోం దని ఆర్టీసీ జేఏసీ ఆరోపించింది. ముఖ్యంగా నిధులకు సంబంధించి తప్పుడు లెక్కలు ఇస్తోందని ఆరోపించింది. మంగళవారం సాయంత్రం జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు తదితరులు మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో 2014 వరకు రూ.1,099 కోట్లు, ఆ తర్వాత 2019 వరకు రూ.1,375 కోట్లు రాయితీ పాస్‌లకు సంబంధించి రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాల్సి ఉందని, జీహెచ్ఎంసీ నుంచి రూ.1,496 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామంటూ ప్రభుత్వం చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. షరతులతో హైకోర్టు అనుమతి ఆర్టీసీ జేఏసీ బుధవారం తలపెట్టిన సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. దీని ప్రకారం సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. సరూర్‌నగర్ స్టేడియంలో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఈనెల 24న పోలీసులకు దరఖాస్తు చేసుకుంది. అయితే, పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ టి.వినోద్‌కుమార్ షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 3 నుంచి 6 గంటల మధ్య సభ నిర్వహించి, 7 గంటల కల్లా ఖాళీ చేయాలని, శాంతియుతంగా నిర్వహిస్తామని పోలీసులకు జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి హామీ ఇవ్వాలని ఆదేశించారు. సభలో ప్రసంగించే వారి సంఖ్యను ఐదుగురికి పరిమితం చేయాలన్నారు. మరో ఒకరిద్దరికి అవకాశం ఇవ్వొచ్చని, ప్రసంగించే వారి పేర్లను పోలీసులకు ఇవ్వాలని సూచించారు. సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని, ఐదువేల మందికి మించి పాల్గొనవద్దని ఆదేశించారు. -
ఆర్టీసీ సమ్మె: ఏపీలో ఉద్యమాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ నేత దామోదర్ మాట్లాడుతూ.. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు అండగా ఉంటామని మద్దతు తెలిపారు. అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామన్నారు. వీరికి మద్దతుగా ఏపీలోనూ ఉద్యమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ‘గతంలో చంద్రబాబుకు పోటీగా ఒకశాతం అదనంగా ఫిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కమిటీ వేశారు. మరి ఆ పని మీరెందుకు చేయడం లేదు’ అని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. కార్మికులు సంస్థ పరిరక్షణ, ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్నారని గుర్తు చేశారు. కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు. ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం నేత వైవీ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కేసీఆర్ వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. ఇక్కడ కార్మికులు పోరాటం ప్రారంభించాక వారికి మద్దతుగా ఏపీలో కూడా జేఏసీగా ఏర్పాటై ఉద్యమాలు చేస్తున్నామన్నారు. ఎక్కడైనా సరే, పోరాటంలో కార్మికులదే అంతిమ విజయమని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ ఫెడరేషన్ కూడా ఆందోళనకు సిద్ధమవుతుందని వెల్లడించారు. త్వరలో అన్ని రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులతో కలిసి ‘చలో తెలంగాణ కార్యక్రమం’ చేపడతామని ప్రకటించారు. (చదవండి: 25వ రోజుకు ఆర్టీసీ సమ్మె: చరిత్రలోనే పెద్దది రికార్డు) సమ్మెకు మద్దతు తెలిపిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ థామస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీని ఆదుకుంటానని హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీసం సంస్థకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదన్న విషయాన్ని కోర్టుకు వివరించామన్నారు. 25 రోజులుగా జరుగుతున్న సమ్మెలో 28 మంది కార్మికులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ విడిపోలేదని.. సంస్థలు, సర్వీసులు కలిసే ఉన్నందున అక్కడ ప్రభుత్వంలో విలీనం చేసినట్టే ఇక్కడా చేయమంటున్నామని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పల్లె వెలుగు నష్టాలు ప్రభుత్వం భరించాలని... నష్టాన్ని భరించలేకపోతే సంస్థకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? పోలీసు రాజ్యమా అని ప్రశ్నించారు. -
25వ రోజుకు ఆర్టీసీ సమ్మె: చరిత్రలోనే పెద్దది రికార్డు
సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధనలో భాగంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారంతో 25వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మె సంస్థ చరిత్రలో ఇదే అతి పెద్దదిగా రికార్డు నమోదు చేసింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా 27 రోజులపాటు సమ్మెలో పాల్గొన్నారు. కానీ కార్మికుల డిమాండ్ల సాధనే లక్ష్యంగా జరిగిన సమ్మెల్లో మాత్రం ఇదే పెద్దది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ పరిరక్షణ- వేతన సవరణ డిమాండ్‌తో 24 రోజులపాటు సమ్మె చేశారు. 1967లో 20 రోజులపాటు సమ్మె జరిగింది. ఇక, సమ్మెలో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను విరమించేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు సమ్మెపై హైకోర్టులో మంగళవారం కీలక విచారణ జరగనుంది. -
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు...
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీకి చట్ట ప్రకారం చెల్లించాల్సిన రూ.4 వేల కోట్ల బకాయిల్లో కనీసం రూ.47 కోట్లయినా ప్రభుత్వం ఇచ్చే స్థితిలో ఉందో లేదో వెంటనే తెలపాలి. సమస్యను యూనియన్, ఇతర అంశాల కోణంలో చూడొద్దు. సామాన్య ప్రజల రవాణా ఇబ్బందుల కోణంలోనే చూడాలి. నెల రోజులు కావొస్తున్నా ఇప్పటికీ 40 శాతమే బస్సులు నడుస్తున్నాయి. ఆదిలాబాద్‌లో ఓ గిరిజన వ్యక్తి తన బిడ్డకు జబ్బు చేస్తే చేతుల్లో పెట్టుకుని వరంగల్ ఆస్పత్రికి తీసుకెళ్లగలడా. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు డెంగీతో బాధపడే రోగిని అంబులెన్స్, ప్రైవేటు వాహనాల్లో తీసుకురాలేని వాళ్లు తన బిడ్డల ప్రాణాలపై ఆశలు వదులుకోవాలా? అలాంటి వాళ్లను చచ్చిపోనిస్తుందా ప్రభుత్వం? ప్రభుత్వం తక్షణమే రూ.47 కోట్లు ఇస్తే.. బిడ్డల ప్రాణాలు నిలుస్తాయి కదా.. ప్రభుత్వం ఆర్థికంగా ఆర్టీసీని ఎలా ఆదుకుని నాలుగు డిమాండ్ల పరిష్కారానికి ఏ నిర్ణయం తీసుకుంటుందో మంగళవారం చెప్పాలి’అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని, అలాగే కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి చిత్తశుద్ధి గల ఉన్నతాధికారి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్, ఇతరులు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాల్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం 2 గంటల పాటు విచారించింది. అన్ని డిమాండ్లపై చర్చించాలి కదా.. తొలుత ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదిస్తూ.. ఈ నెల 26న యూనియన్ ప్రతినిధులతో చర్చలకు ఆహ్వానించామని, అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆంశంపై చర్చిస్తేనే ఇతర అంశాల్లోకి వెళ్తామని యూనియన్ ప్రతినిధులు షరతు విధించారని చెప్పారు. యూనియన్ల తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. విలీనం డిమాండ్ వదులుకున్నామని తాను చెప్పినట్లు ప్రభుత్వ న్యాయవాదే చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. 21 డిమాండ్లనే చర్చించాలని హైకోర్టు చెప్పినట్లు అధికారులు తప్పుగా పేర్కొన్నారని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. 21 డిమాండ్లు ఆర్థికంగా పెద్దగా సంబంధం లేనివని మాత్రమే చెప్పామని, అన్ని డిమాండ్లపైనా చర్చ జరపాలనే 18న ఉత్తర్వులు ఇచ్చామని స్పష్టం చేసింది. ఎక్కడో ఓ చోట నుంచి సమస్య పరిష్కారం చేసే ప్రయత్నాల్లో భాగంగా 21 డిమాండ్లపై చర్చలు జరిపి ఉంటే విశ్వాసం పెరిగేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు తగ్గిందనే భావన వచ్చేదని అభిప్రాయపడింది. అలాంటప్పుడు చర్చలెందుకు..? చర్చలకు ముందే ఫలితాలు ఎలా ఉండాలో ముందే ఓ నిర్ణయానికి వచ్చి ఈడీ కమిటీ నివేదిక రూపొందించినట్లు ఉందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్లోజ్డ్ మైండ్ ఫలితం కూడా అలాగే ఉంటుంది. అలాంటప్పుడు చర్చలు జరపడం ఎందుకు? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. 4 డిమాండ్లు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నాయని తేల్చిన కమిటీ.. మిగిలిన డిమాండ్లను ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. కోర్టు అంటే ఆషామాషీగా తీసుకున్నట్లుగా ఉందని, ప్రధానంగా ఉన్నతాధికారుల వైఖరి దారుణంగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తీవ్ర ఆర్థిక భారమయ్యే డిమాండ్లు రెండే ఉన్నాయని, మిగిలిన డిమాండ్లపై అధికారులు ఎందుకు కసరత్తు చేయలేదని ప్రశ్నించింది. గతంలో కార్మికులకు 44 శాతం వేతనం పెంచామని ఏఏజీ చెప్పగానే, అప్పుడు అంత విశాల హృదయంతో ఉదారంగా ఇవ్వడమెందుకో, ఇప్పుడు ఏమీ ఇవ్వలేమనడం ఎందుకో, అప్పుడు 22 శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండేవి కాదు కదా అని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగుల్ని తొలగించారో చెప్పాలని ధర్మాసనం కోరగా, ఆర్టీసీ ఉద్యోగుల్లో మార్పు వస్తుందనే ఆశతో ఉన్నామని ఏఏజీ బదులిచ్చారు. కార్మికులు కారణం కాదు ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన రాయితీల వల్ల ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు రూ.4 వేల కోట్లకుపైగా ఉన్నాయని, వీటిని ప్రభుత్వం చెల్లించకపోగా అప్పులు చేసి ఆర్టీసీ కార్పొరేషన్‌ను ఆర్థికంగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని చెప్పారు. సిటీ బస్సులకు జీహెచ్ఎంసీ 1,492 కోట్లు, ప్రభుత్వ రాయితీల నిమిత్తం రూ.1,099 కోట్లు, ఉద్యోగుల పీఎఫ్ రూ.454 కోట్లు, ఉద్యోగుల సహకార సంఘం నిధులు రూ.400 కోట్ల వరకు మొత్తం రూ.4 వేలు కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని పేర్కొన్నారు. డిపోలను 95 నుంచి 97కు పెంచారని, ఉద్యోగులు 65,740 నుంచి 49,733కు తగ్గినా సగటు ఉత్పాదక పెరిగిందని, నష్టాలకు ప్రభుత్వ/ఆర్టీసీ సంస్థ యాజమాన్య నిర్వాకమే కారణమని చెప్పారు. తలసరి ఉత్పాదకత 55 కి.మీ. నుంచి 61 కి.మీ.లకు పెరిగిందని, సగటు 326 కి.మీ. నుంచి 342 కి.మీ. నడపుతున్నారని, 91.48 లక్షల నుంచి 97.55 లక్షలకు రోజుకు గమ్యస్థానాలకు చేరవేసే ప్రయాణికుల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఆక్యుపెన్సీ 69 శాతం నుంచి 74.5 శాతానికి పెరిగేందుకు ఆర్టీసీ కార్మికులు శ్రమించారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన రాయితీల బకాయిల్లో రూ.47 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్–226 కింద ప్రతీది న్యాయ సమీక్ష చేసేందుకు హైకోర్టుకు తావులేదని ఏఏజీ అనడాన్ని కోర్టు తప్పపట్టింది. ‘10 వేల బస్సుల్లో 4 వేలు మాత్రమే నెల రోజులుగా నడుస్తున్నాయి. ప్రజా రవాణా కుంటుపడింది. రోగుల ఇక్కట్లు వర్ణనాతీతం. సామాన్య ప్రజల కష్టాలే తమ ముందు ప్రధాన అంశం. పౌరహక్కులు, మానవహక్కుల అంశంతో ముడిపడిన వ్యవహారమిది. మాకు ఆకాశమే హద్దు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం న్యాయ సమీక్ష చేస్తాం’అని ప్రధాన న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఏజీ హాజరుకు ఆదేశం.. చాలా కార్యక్రమాలకు, పథకాలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రజా రవాణా సమస్య పరిష్కారానికి రూ.47 కోట్లు ఇవ్వగలదో లేదో, ఆ విధమైన ఆర్థిక స్థోమత ఉందో లేదో చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. ఆర్టీసీ సొంతగా ఆర్థికాభివృద్ధి సాధించాలని, ఎంతకాలం ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని ఏఏజీ బదులిస్తూ.. ప్రస్తుతం రూ.10 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. దీనికి ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ తాము ప్రభుత్వం నుంచి సమాచారాన్ని తెలుసుకోవాలని నిర్ణయించామని, హైకోర్టు ప్రభుత్వ ప్రతినిధిగా ఏజీని విచారణకు పిలిపించాలని ఆదేశించింది. ఏజీ వచ్చిన వెంటనే ‘ఈడీ కమిటీ నివేదికలో 4 డిమాండ్ల పరిష్కారానికి రూ.47 కోట్లు అవసరం అవుతాయని తేల్చింది. ఆ మొత్తాన్ని వెంటనే ప్రభుత్వం ఇవ్వగలదో లేదో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని సంప్రదించి మంగళవారం చెప్పండి. మిగిలిన డిమాండ్లకు ఆర్థికంగా ఎంత భారం పడుతుందో తెలుసుకోండి. వీటి విషయంలో కసరత్తు చేసినట్లుగా ఈడీల నివేదికలో లేదు’అని ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని ఏజీ కోరితే మంగళవారం ఉదయం బదులు మధ్యాహ్నం విచారిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కీలక వివరణ కోరిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై హైకోర్టు నిలదీసింది. జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన రూ. 1475 కోట్లు, ప్రభుత్వ సబ్సిడీ కింద రావాల్సిన రూ. 1492 కోట్లతోపాటు ప్రభుత్వం నుంచి రూ. 2,300 కోట్ల చెల్లింపులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే రేపటిలోగా (మంగళవారం) వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా.. ఎలుండి వరకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. అందుకు హైకోర్టు అంగీకరించలేదు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఆర్టీసీకి నిధుల బకాయిలపై రేపటిలోగా పూర్తి వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించకపోవడం వల్లే నష్టాలు! ఇక ఆర్టీసీ కార్మిక సంఘాల తరఫున వాదనలు వినిపించిన ప్రకాశ్ రెడ్డి.. కార్మికులు లేవనెత్తిన ప్రతి అంశంమీద చర్చలు జరపాల్సిందేనని హైకోర్టుకు నివేదించారు. కార్మికుల 26 డిమాండ్లను కచ్చితంగా చర్చించాలన్నారు. కార్మికులు లేవనెత్తిన అంశాలు మొత్తం న్యాయపరమైనవేనని, వీటివల్ల ఆర్ధికభారం పడుతుందని ప్రభుత్వం వాయిదావేస్తూ వస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తే.. ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు రాకనే ఆర్టీసీ నష్టాల్లో ఉందని వివరించారు. ఆర్టీసీ కార్పొరేషన్‌కు ఇప్పటివరకు పూర్తిస్థాయి ఎండీని ప్రభుత్వం నియమించలేదని, ఎండీ ఉండి ఉంటే, కార్మికులు తమ సమస్యలను ఆయనకు చెప్పుకునేవారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రెస్మీట్లో మాట్లాడిన అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టుకు తప్పుడు లెక్కలు! ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పిస్తోందని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎంఎన్‌యూ) జాతీయ అధ్యక్షుడు మౌలాలా ఆరోపించారు. ఆర్టీసీకి బకాయిలపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని అన్నారు. సమ్మె చట్టబద్ధమేనని హైకోర్టు చెప్పిందని, కార్మికులు అధైర్యపడవద్దని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. చదవండి: ఆర్టీసీ సమ్మెపై విచారణ: హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఆర్టీసీ సమ్మె: హైకోర్టు ఆగ్రహం.. ఏజీ రావాల్సిందే! -
ఆర్టీసీ సమ్మెపై విచారణ: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చ జరపాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయని కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్లపై చర్చిద్దామంటే వినలేదనీ, చర్చలు జరపకుండానే కార్మిక నేతలు బయటకు వెళ్లిపోయారని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. విలీనం డిమాండ్‌కు పట్టుబట్టకుండా మిగతా డిమాండ్లపై చర్చ జరపవచ్చు కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టి మిగతా వాటిపై చర్చించాలని కార్మిక సంఘాలకు సూచించింది. మొత్తం 45 డిమాండ్లలో ఆర్టీసీ సంస్థపై ఆర్థికభారం పడని డిమాండ్లపై చర్చ జరగాలని, మొదట 21డిమాండ్లపై చర్చ జరిగితే కార్మికుల్లో కొంత ఆత్మస్థైర్యం కలుగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఓవర్ నైట్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎలా సాధ్యమవుతుందని హైకోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టి మిగతా వాటిపై చర్చ జరపాలని, లేకపోతే సమ్మె విషయంలో ప్రతిష్టంభన కొనసాగి.. ఇటు కార్మికులు, అటు ప్రజలు ఇబ్బంది పడతారని న్యాయస్థానం పేర్కొంది. మరోవైపు కార్మిక సంఘాల తరఫు న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చర్చల విషయంలో హైకోర్టు ఆదేశాలను ఆర్టీసీ అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని పేర్కొన్నారు. కేవలం 21 డిమాండ్లపైనే చర్చిస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారని, ఇతర డిమాండ్లపై వారు చర్చించడం లేదని పేర్కొన్నారు. చదవండి: ఆర్టీసీ సమ్మె: హైకోర్టు ఆగ్రహం.. ఏజీ రావాల్సిందే! చదవండి: ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కీలక వివరణ కోరిన హైకోర్టు -
కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మికుల బైఠాయింపు
-
‘రాత్రి వరకు ఆరోగ్యం బాగానే ఉంది.. కావాలనే’
సాక్షి, హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న కూనంనేని సాంబశివరావును సోమవారం ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై రెండు రోజులుగా కూనంనేని సాంబశివరావు కార్మికులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పోలీసులు సాంబశివరావును అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్బంధకాండను కొనసాగిస్తూ అక్రమ అరెస్టులు చేపడుతుందని మండిపడ్డారు. నిన్న రాత్రి వరకు ఆయన దగ్గరే ఉన్నామని.. అప్పటి వరకు ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని రాజిరెడ్డి తెలిపారు. మెడికల్ టెస్టుల పేరిట కావాలనే రాత్రి 2 గంటల సమయంలో పోలీసులను పంపించి అరెస్టు చేయించారని ఆయన విమర్శించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, అధికారుల మధ్య జరిగిన చర్చలు సైతం ప్రభుత్వం నిర్భంధంగా జరిపిందని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఆయనను అరెస్టు చేశారని ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆర్టీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని కేసీఆర్‌కు భయం పట్టిందని, అందుకే అక్రమ అరెస్టులు కొనసాగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. -
ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం.. ఎండీకి లేఖ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో శనివారం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, అధికారుల మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. చర్చలు విఫలం కావడానికి కారణం మీరంటే మీరు అని ఇరు పక్షాలు ఆరోపించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు ఆదివారం సంస్థ ఎండీకి లేఖాస్త్రాన్ని సంధించారు. మొత్తం 45 డిమాండ్లపై చర్చకు సిద్ధమంటూ లేఖలో నేతలు పేర్కొన్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. రేపు కలెక్టరేట్ల ముట్టడి ఆర్టీసీ సమ్మెలో భాగంగా తమ ఉద్యమాన్ని కార్మిక సంఘాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ల ముట్టడికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ పిలుపునకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనను విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. -
చర్చలు విఫలం
-
హోరెత్తిన ధర్నాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలతో హోరెత్తించారు. కుటుంబ సభ్యులతో కలసి డిపోల ఎదుట ధర్నాలు చేపట్టారు. చర్చ లు జరుగుతాయన్న సమాచారం ఉన్నా సమ్మె మాత్రం ఉధృతంగా కొనసాగింది. ఈనెల 30న సరూర్‌నగర్‌లో సకల జనుల సమరభేరి పేరుతో భారీ ఎత్తున సభ నిర్వహించాలని నిర్ణయించినందున అందుకు జనసమీకరణ కసరత్తు కూడా ప్రారంభించారు. సమ్మెలో ఉన్న కార్మికులు కుటుంబసభ్యులతో కలసి ఆ సభకు హాజరు కావాలంటూ ఎవరికివారు ప్రచారం చేస్తున్నారు. స్థానిక విపక్ష నేతలను కలిసి ఆయా పార్టీల కార్యకర్తలు, సాధారణ జనం కూడా సభకు తరలాలని కోరుతున్నారు. ఆదివారం దీపావళి పండుగ కావ టంతో సొంతూళ్లకు వెళ్లేవారితో శనివారం బస్టాండ్లు కిటకిటలాడాయి. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులను తిప్పినా అవి సరి పోక జనం ఇబ్బంది పడాల్సి వచ్చింది. పండుగకు బస్సు కష్టాలు.. దసరా వేళ సొంతూళ్లకు వెళ్లేందుకు నానా తిప్పలు పడ్డ అనుభవంతో కొందరు ప్రయాణాలు మానుకోవటం విశేషం. పండగ రద్దీ నేపథ్యంలో గత 20 రోజుల్లో తొలిసారి శనివారం 75% బస్సులు తిప్పినట్టు అధికారులంటున్నారు. మొత్తం బస్సులు తిప్పినా పండుగ రద్దీ తాకిడికి సరిపోని పరిస్థితి. అలాంటిది ఉన్న బస్సు ల్లో 75% తిప్పటంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ప్రైవేటు వాహనాలకు గిరాకీ పెరిగింది. అధిక చార్జీలు వసూలు చేయటంతో వారి జేబులకు చిల్లు్ల పడింది. దసరా సమయంలో ప్రైవేటు బస్సులు వచ్చినట్టుగానే శనివారం కూడా చాలా బస్టాండ్లలో వీటి హవా కనిపించింది. మెదక్‌లో ఆర్టీసీ కార్మికులు కొందరు హోటళ్లలో పని చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. హుస్నాబాద్, జహీరాబాద్ డిపోల ముందు ధర్నాలు చేశారు. మెదక్ డిపో ఎదుట మహిళా కండక్టర్లు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అరగుండు..అరమీసం.. ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల ఎదుట కార్మికులు పిల్లలతో కలిసి ధర్నాలు చేపట్టారు. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ వారు చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం బస్ డిపో వద్ద కార్మికుల నిరసనకు సంఘీభావంగా అఖిలపక్ష నేతలు చెవిలో పూలతో పాల్గొన్నారు. కార్మి కులకు మద్దతుగా వామపక్ష విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. మెట్పల్లి డిపో వద్ద సమ్మయ్య, జేఆర్‌రావు అనే డ్రైవర్లు అరగుండు, అరమీసంతో నిరసన చేపట్టారు. గోదావరి ఖని డిపో వద్ద నిరసనలు చేపట్టారు.మంథనిలో కార్మికుల కుటుం బీకుల నిరసనలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.శనివారం 4782 ఆర్టీసీ బస్సులు, 1944 అద్దె బస్సులు మొత్తం 6,726 బస్సులు తిప్పినట్టు అధికారులు ప్రకటించారు. 4,782 ప్రైవేటు డ్రైవర్లు, 6,726 మంది కండక్టర్లు విధుల్లో ఉన్నట్టు వెల్లడించారు. 4,961 బస్సుల్లో టికెట్ జారీ యంత్రాలు, 939 బస్సుల్లో సాధార ణంగా టికెట్ల జారీ జరిగిందన్నారు. బస్సుల కోసం 22 వేల దరఖాస్తులు తాజాగా అద్దె బస్సుల కోసం పిలిచిన టెండర్లకు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,248 బస్సుల కోసం టెండర్లు పిలిచారు. టెండరు పత్రాల దాఖలు శనివారం సాయంత్రం వరకు సాగింది. 22,300 దరఖాస్తులు రావటం విశేషం. హైదరాబాద్‌లో 248 బస్సులకు టెండర్లు పిలవగా 332 దరఖాస్తులు అందాయి. జిల్లాల్లో వేయి బస్సులకు గాను 22 వేల దరఖాస్తులు వచ్చాయి. వారం క్రితం వేయి బస్సులకు టెండర్లు పిలవగా జిల్లాల్లో 9,700 దరఖాస్తులు రాగా హైదరాబాద్‌లో మాత్రం 18 వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో బస్సులు సిద్ధంగా ఉన్నవారికి ప్రాధాన్యమిస్తూ అనుమతి ఇవ్వనున్నారు. ఆ తర్వాత 48 గంటల్లోనే బస్సు నడుపుకొనేందుకు అనుమతిస్తారు. కానీ రెడీగా బస్సులు ఉన్న టెండర్లు 90 మాత్రమే అందినట్టు తెలిసింది. బస్సులు లేని వారిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు 90 రోజుల్లో బస్సులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. -
జెండాలో నుంచి గులాబీ రంగు మాయం..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ మరింత ఉధృతమవుతోంది. యాజమాన్యంతో శనివారం జరిగిన ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) కీలక నిర్ణయం తీసుకుంది. టీఎంయూ జెండా రంగు మార్చుకుంది. గులాబీ రంగులో ఉన్న జెండాలు తొలగించి.. తెల్లరంగు జెండాలు వాడాలని టీఎంయూ నిర్ణయించింది. తెల్లరంగు జెండాపై ధనస్సు గుర్తుతో టీఎంయూ జెండా కొత్త రూపు సంతరించుకుంది. రేపు కొత్త జెండాతో టీఎంయూ ఆవిర్భావ దినోత్సవం జరపుకోనుంది. (చదవండి : ఆర్టీసీ చర్చలు : ‘మొబైల్ ఫోన్లు లాక్కున్నారు’) (చదవండి : ఆర్టీసీ సమ్మె : ‘మళ్లీ వస్తామని చెప్పి..ఇప్పటికీ రాలేదు’) -
ఆర్టీసీ సమ్మె : ‘మళ్లీ వస్తామని చెప్పి..ఇప్పటికీ రాలేదు’
-
ఆర్టీసీ సమ్మె : ‘మళ్లీ వస్తామని చెప్పి..ఇప్పటికీ రాలేదు’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని ముందే చెప్పినట్టు ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ తెలిపారు. చర్చలు జరుగుతుండగా మళ్లీ వస్తామని చెప్పి ఆర్టీసీ జేఏసీ నేతలే వెళ్లిపోయారని అన్నారు. వారు మళ్లీ తిరిగి వచ్చినా చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన 21 అంశాలపై చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు. రవాణాశాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా మాట్లాడుతూ.. ‘26 డిమాండ్లపై చర్చించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు అన్నారు. విలీనంపై కూడా చర్చ జరపాలని పట్టుబట్టారు. విలీనంపై చర్చ సాధ్యంకాదు అన్నాం. దాంతో సభ్యులతో చర్చించుకుని వస్తామన్నారు. ఇప్పటివరకు రాలేదు’అని చెప్పారు. కాగా, ఎర్రమంజిల్‌లోని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 22వ రోజుకు చేరింది. (చదవండి : ఆర్టీసీ చర్చలు : ‘మొబైల్ ఫోన్లు లాక్కున్నారు’ -
నిర్బంధంగా చర్చల ప్రక్రియ కొనసాగింది
-
ఆర్టీసీ చర్చలు : ‘అందుకే బయటికి వచ్చేశాం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ నేతలతో యాజమాన్యం చర్చలు విఫలమయ్యాయి. ఎర్రమంజిల్‌లోని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. కోర్టు ఉత్తర్వులు అమలు చేశామని చెప్పడానికే చర్చలు పెట్టారని, సమస్యల పరిష్కారం కోసం కాదని జేఏసీ నేతలు ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ‘నిర్బంధంగా చర్చల ప్రక్రియ కొనసాగింది. మా మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. కేవలం నలుగురిని మాత్రమే చర్చలకు ఆహ్వానించారు. కోర్టు తీర్పును వక్రీకరించి 21 అంశాలపైననే చర్చిస్తామని యాజమన్యం స్పష్టం చేసింది. పూర్తి డిమాండ్లపై చర్చలు జరపాలని మేము పట్టుబట్టాం. 26 డిమాండ్లపై చర్చలు జరపాలని అన్నాం. యాజమాన్యం మా మాటల్ని పట్టించుకోలేదు. అందుకే బయటికి వచ్చేశాం. సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. మా డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా వెళ్తాం’అన్నారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 22వ రోజుకు చేరింది. -
ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలకు టైమ్ ఫిక్స్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఎట్టకేలకు చర్చలకు ప్రభుత్వం సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ కార్యాలయంలో ఈ చర్చలు జరుగుతాయని సమాచారం. అయితే కార్మిక సంఘాల నేతలతో చర్చల్లో ఆర్టీసీ ఈడీలు పాల్గొంటారని తెలిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు దాదాపు 5 గంటల పాటు జరిగిన సమీక్షలో ఎట్టకేలకు చర్చల ప్రక్రియకు సీఎం కేసీఆర్ సమ్మతం తెలిపినట్లు సమాచారం. ఈ నెల 28న హైకోర్టులో సమ్మెపై విచారణ ఉన్న నేపథ్యంలో చర్చలు జరిపి వివరాలు కోర్టుకు సమర్పించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. గడువు ఎక్కువగా లేనందున శనివారమే చర్చలకు ముహూర్తం ఖాయం చేశారు. సమ్మె ప్రారంభం కాకముందు ఐఏఎస్ అధికారుల త్రిసభ్య కమిటీ చర్చలు జరిపిన ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో ఈ చర్చలు ఉంటాయని తెలుస్తోంది. బస్‌భవన్‌లోనే చర్చలు జరపాలని తొలుత భావించినా, అక్కడికి పెద్ద సంఖ్యలో కార్మికులు వచ్చే అవకాశం ఉండటంతో ఎర్రమంజిల్‌లో జరపాలని భావిస్తున్నట్లు తెలిసింది. చర్చల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించకపోవటం విశేషం. శుక్రవారం రాత్రి పొద్దుపోయేవరకు అటు కార్మిక సంఘాల జేఏసీకి కూడా ఎలాంటి సమాచారం అందలేదని తెలిసింది. నివేదికపై సుదీర్ఘ చర్చ.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్ కాకుండా హైకోర్టు సూచించిన 21 డిమాండ్లపై పరిశీలించి నివేదిక సిద్ధం చేయాల్సిందిగా సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. సమ్మె పరిష్కారానికి చర్యలు చేపట్టాలంటూ హైకోర్టు సునీల్‌శర్మను ఆదేశించిన నేపథ్యంలో, కమిటీ ఏర్పాటు బాధ్యతను సునీల్శర్మకే సీఎం అప్పగించారు. మూడు రోజుల కింద జరిగిన సమీక్షలో సీఎం సమక్షంలోనే ఎండీ ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ గురువారమే నివేదికను సిద్ధం చేయగా, అదేరోజు సాయంత్రం ఎండీకి సమర్పించారు. దీనిపై చర్చించిన ఎండీ చేసిన సూచనల మేరకు పలు మార్పులు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మరోసారి కమిటీ సభ్యులు భేటీ అయి తుది నివేదిక సిద్ధం చేసి సాయంత్రం ఎండీకి అందజేశారు. ప్రగతిభవన్‌లో నివేదికపై దాదాపు 5 గంటలపాటు సీఎం సమీక్షించారు. కార్మికులతో చర్చలు జరపాలా వద్దా.. జరిపితే ఏయే అంశాలు ఎజెండాలో ఉండాలి.. సమ్మె పర్యవసానాలు, సమ్మెకు దారితీసిన పరిస్థితులు, తరచూ సమ్మెల వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, ఆర్టీసీ కుప్పకూలే దుస్థితికి చేరుకోవటానికి దారితీసిన పరిస్థితులు.. ఇలా సమగ్ర సమాచారాన్ని కోర్టుకు సమర్పించటం తదితర అంశాలపై చర్చించారు. సమ్మెపై పలుసార్లు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆర్టీసీ ఇన్చార్జి ఎండీకి చేసిన సూచనలు, ఐఏఎస్ అధికారుల కమిటీ తీరుపై చేసిన ఘాటు వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చాయి. అయితే ఆర్థిక అంశాలతో ముడిపడని డిమాండ్లపైనే ఈ చర్చలు ఉంటాయని తెలుస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే ప్రధాన డిమాండుగా జేఏసీ పేర్కొంటున్నా, అసలు దాన్ని పరిగణనలోకే తీసుకోబోమని సీఎం ఇప్పటికే తేల్చిచెప్పారు. దీంతో ఇప్పుడు చర్చల్లో ఆ అంశం ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. కోర్టు సూచించినట్లు మిగతా అంశాల ప్రస్తావనే ఉండనుంది. కాగా, సమావేశానంతరం సీఎంవో నుంచి కానీ, ఆర్టీసీ నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అధికారులు కూడా మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. ప్రభుత్వానికి నివేదిక మూడు రోజుల పాటు కసరత్తు చేసిన అనంతరం ఆర్టీసీ ఉన్నతాధికారుల కమిటీ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీకి పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు ఆర్టీసీ ఎండీ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు కసరత్తు చేసి ఆర్టీసీ ఈడీలు టి.వెంకటేశ్వరరావు, ఎం.వెంకటేశ్వరరావు, వినోద్‌కుమార్, పురుషోత్తంనాయక్, యాదగిరి, ఆర్టీసీ ఆర్థిక సలహాదారు రమేశ్‌లతో కూడిన ఈ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. దాన్ని సీఎం కేసీఆర్‌కు అందజేశారు. అంతా రికార్డు చేయాలి: అశ్వత్థామరెడ్డి చర్చలకు ఆహ్వానిస్తే సంతోషమేనని, అయితే ఆర్టీసీ విలీనం అంశం కూడా చర్చల్లో ఉండాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి శుక్రవారం రాత్రి ‘సాక్షి’తో తేల్చిచెప్పారు. చర్చల ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేయాలని తాము కోరబోతున్నట్లు వెల్లడించారు. వీడియో రికార్డు జరపలేకపోతే చర్చల సారాంశాన్ని నమోదు చేసి తమ సంతకాలు, చర్చల్లో పాల్గొన్న అధికారుల సంతకాలు తీసుకోవాలని కోరనున్నట్లు వెల్లడించారు. -
సర్కారు దిగొచ్చే వరకు..
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ స్పష్టంచేసింది. కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని సూచించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం 20వ రోజుకు చేరుకుంది. అయితే, సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కార్మికుల్లో ఆందోళన రేగింది. దీంతో జేఏసీ నేతలు రంగంలోకి దిగి ఎవరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్న జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అక్కడి కార్మికులతో సమావేశం నిర్వహించి ఆందోళన విరమించుకోవద్దని పేర్కొనగా, హైదరాబాద్‌లో ఉన్న జేఏసీ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కార్మికులకు సూచనలు చేశారు. కార్మికుల రక్షణకు హైకోర్టు జోక్యం చేసుకుంటుందని, కోర్టు ఉన్నాక అన్యాయం జరిగే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలపై జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ వచ్చాక ఆర్టీసీకి రూ.4,250 కోట్లు ఇచ్చినట్టు చెప్పిన మాటల్లో నిజం లేదని, కేవలం రూ.712 కోట్లు మాత్రమే ఇచ్చారని స్పష్టంచేశారు. ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయం.. ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో సమ్మె కార్యాచరణను మరింత ఉధృతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన రాస్తారోకోలను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు పేర్కొన్న జేఏసీ.. దాని బదులు ఆయా ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థలకు వెళ్లి సమ్మెకు దారి తీసిన పరిస్థితులను విద్యార్థులకు వివరించి వారి మద్దతు కూడగట్టుకోవాలని నిర్ణయించింది. మరోవైపు గురువారం కూడా అన్ని డిపోల ఎదుట కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నిరసనలు వ్యక్తం చేశారు. ఉదయం వేళ కొన్ని బస్సులను అడ్డుకున్నా, పోలీసుల జోక్యంతో అవి రోడ్డెక్కాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు తిప్పుతున్నా, హైదరాబాద్‌లో మాత్రం వాటి జాడే కనిపించకపోతుండటం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బస్సుల్లేక సకాలంలో విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఇతర ప్రాంతాలకు చేరుకోలేకపోతున్నామని పేర్కొంటూ ఆందోళనలు చేస్తున్నారు. గురువారం హైదరాబాద్ నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద కొందరు ప్రయాణికులు రోడ్డుపై నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా గురువారం 6,395 బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 4,290 బస్సుల్లో టికెట్ల జారీ యంత్రాలు వినియోగించారని, 1531 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేశారని అధికారులు పేర్కొన్నారు. రేపు ఎండీకి కమిటీ నివేదిక.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో ఆర్టీసీ ఎండీ ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల ఉన్నతాధికారుల కమిటీ రెండు రోజులపాటు చర్చించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా మిగిలిన 21 డిమాండ్లపై సూచనలు సిద్ధం చేసింది. అనంతరం గురువారం సాయంత్రం ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మతో కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా నివేదికలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించింది. శనివారం తుది నివేదికను ఎండీకి అందజేయనుంది. -
బెట్టు వద్దు..మెట్టు దిగండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం ఇరు వర్గాలు పట్టు విడుపుల ధోరణితో వ్యవహరించాలని, ఇద్దరూ ఒక మెట్టు దిగాలని హైకోర్టు సూచించింది. అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వం మెట్టు దిగకపోతే ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం చర్చల ప్రక్రియను పర్యవేక్షించాలని, చర్చల ద్వారానే ఎలాంటి సమస్య అయినా పరిష్కారమవుతుందని పేర్కొంది. ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం ప్రభుత్వం, ఆర్టీసీ ఎండీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలన్న ఈ నెల 18 నాటి హైకోర్టు ఉత్తర్వులు మంగళవారం అధికారికంగా వెలువ డ్డాయి. ఆ ఉత్తర్వుల ప్రతి ప్రభుత్వానికి అందింది. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ (ప్రస్తుతం ఇన్చార్జి ఉన్నారు) చర్చలు జరపాలని ధర్మాసనం ఆదేశించింది. ఈనెల 28న జరిగే తదుపరి విచారణ నాటికి చర్చలు ఫలప్రదమై ఆర్టీసీ సమ్మె విరమణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేసింది. సమ్మెలోకి వెళ్లిన కార్మిక సంఘాలు లేవనెత్తిన పలు డిమాండ్లు ఆర్థిక అంశాలతో ముడిపడినవి కావని, వీటి విషయంలో ప్రభుత్వం చర్చలు జరిపి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం వెలువరించిన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు న్యాయపరిధికి లోబడి ఉంది.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో ఆర్థిక అంశాలను సంబంధం లేనివాటిని ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించింది. వాటిని అమలు చేయడానికి ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడదని వ్యాఖ్యానించింది. ఆర్థిక అంశాలతో ముడిపడిన కొన్ని డిమాండ్లు కూడా ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయబద్ధంగా, చట్టపరంగా చెల్లించాల్సినవేనని పేర్కొంది. ‘‘రాజ్యాంగంలోని 14, 15, 16, 19, 21 అధికరణాల ప్రకారం ఈ డిమాండ్లు ఆమోదించదగ్గవని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఆర్టీసీ చట్టం 1950లోని సెక్షన్ 19(1)(సి), ఇతర సెక్షన్ల ప్రకారం ఆర్టీసీ సిబ్బందికి పని చేసేందుకు ఆరోగ్యకర వాతావరణం, తగిన వేతనాలు, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కార్పొరేషన్‌పై ఉంది. కార్మికుల సంక్షేమాన్ని పర్యవేక్షించే నైతిక బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కోర్టు తన న్యాయ పరిధికి లోబడి ఉంది. అందుకే యూనియన్, జేఏసీల డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్రానికి గానీ కార్పొరేషన్‌కు గానీ ఆదేశాలు ఇవ్వడం లేదు. సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. రాష్ట్రంలోని పురుషులు, మహిళలు, పిల్లలను దృష్టిలో పెట్టుకుని సామరస్యంగా చర్చలు జరపాలని ఆదేశిస్తున్నాం. ఈ నెల 28న జరిగే తదుపరి విచారణ నాటికి చర్చలపై సానుకూల సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాం’’అని హైకోర్టు తన 14 పేజీల మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి..
-
ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి..
సాక్షి, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లదాడికి దిగారు. దీంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడి నుంచి ప్రయాణికులకు తృటిలో తప్పించుకున్నారు. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తున్న బస్సుపై చేవెళ్ల సమీపంలో దుండగులు దాడి చేశారు. వికారాబాద్ డిపో అధికారులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొనసాగుతున్న నిరసనలు ఆర్టీసీ కార్మికుల సమ్మె కార్మిక కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్ జంపన్న డిపో ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు జంపన్నను అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్ మాస్క్‌లు ధరించి ‘సేవ్ ఆర్టీసీ’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చేతులకు సంకెళ్లు వేసుకుని అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ జీడిమెట్ల బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. మహిళా కండక్టర్లంతా కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఈ రోజు ఉదయం బస్సులను ఆపి ప్రైవేట్ డ్రైవర్, కండక్టర్లకు విధుల్లోకి రావద్దంటూ పూలు ఇచ్చి విజ్ఞప్తి చేశారు. విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ డ్రైవర్, కండక్టర్లకు రేపటి నుంచి మీరు విధులకు రావొద్దని, మేము చేసే ఉద్యమానికి మద్దత్తు పలకాలని కోరారు. -
ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉధృతి
-
ఆర్టీసీ సమ్మె: ఆందోళన ఉధృతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత ఉధృత రూపం దాల్చింది. డిమాండ్ల పరిష్కారం కోసం 18 వరోజూ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అఖిల పక్షం వంటా వార్పునకు పిలుపు నిచ్చింది. సికింద్రాబాద్‌లోని జేబీఎస్ వద్ద ఆర్టీసీ జేఏసీ, రాజకీయ జేఏసీ నేతలు, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకోవైపు ఆర్టీసీ సమ్మె విద్యార్థులు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. బస్సుల కొరత కారణంగా వారు నానా పాట్లు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత ఆర్టీసీ కార్మికుల సమ్మె కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. సమ్మెలో భాగంగా కార్మికులు వేకువజామునే కరీంనగర్ బస్ స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. పార్కింగ్ స్థలంలో ఉన్న ఆర్టీసీ అద్దె బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడంతో అద్దం ద్వంసమయింది. సమ్మెకు సహకరించాలని బస్సులు నడిపే తాత్కాలిక డ్రైవర్లను కార్మికులు కోరారు. బస్ స్టేషన్లో ఉన్న బస్సును డిపోలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు బస్సులు బయటికి వెళ్లకుండా నిలిచిపోయాయి. బస్సులను అడ్డుకున్న జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీతాలు లేక న్యాయమైన డిమాండ్ కోసం కార్మికులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని నేతలు విమర్శించారు. -
ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. సోమవారం 17వ రోజు రాష్ట్రవ్యా ప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేశారు. బస్ డిపోల ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడపడానికి చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారు. వేతనాలు లేక ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉందని, తమ ఆవేదన అర్థం చేసుకోవాలంటూ తాత్కాలిక డ్రైవర్లు, కం డెక్టర్లను వేడుకున్నారు. ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ సర్కారుపై మండిపడ్డారు. కరీంనగర్–1 డిపోకు చెందిన డ్రైవర్ జంపన్న ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ, రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల అమలుపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కార్మిక వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. విద్యార్థుల అవస్థలు.. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు సోమవారం తెరుచుకున్నాయి. 24 రోజుల సెలవుల తర్వాత పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. దీంతో ప్రయాణికుల తాకిడికి తగినట్టుగా బస్సులు నడపాలని ప్రభుత్వం ఆరీ్టసీని ఆదేశించింది. ఈ క్రమంలో రోజువారీగా నడిపిన వాటి కంటే ఎక్కువ నడపాల్సి ఉండగా.. అధికారులు మాత్రం విఫలమయ్యారు. తక్కువ బస్సులే రోడ్డెక్కడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ పరిధిలో 2 వేల బస్సులు నడపాలని ఆర్టీసీ భావించింది. అయితే, కేవలం 859 బస్సులు మాత్రమే నడపగలిగారు. అవి కూడా సమయానుకూలంగా నడవలేదు. ఫలితంగా గంటల తరబడి వేచి చూడాల్సి వచి్చంది. విద్యార్థుల బస్ పాస్‌లను అన్ని బస్సుల్లో అనుమతించాలని ఆర్టీసీ ఆదేశించినప్పటికీ చాలాచోట్ల పాసులను అనుమతించలేదు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 6,276 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ తెలిపింది. గవర్నర్‌ను కలిసిన ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, బీఎస్ రావు, సుధ తదితరులు సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని గవర్నర్‌కు వివరించారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదనే అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని, చర్చలు జరిపేలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని కోరారు. సమ్మె జరుగుతున్న సమయంలో అద్దె బస్సులు పెంచేలా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ పరిస్థితిని వివరించారు. తమ వినతిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు వెల్లడించారు. ఎంజీబీఎస్‌లో అఖిలపక్షం ధర్నా.. సమ్మె విషయంలో సర్కారు అనుసరిస్తున్న వైఖ రికి నిరసనగా సోమవారం హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆర్టీసీ జేఏసీ కనీ్వనర్ అశ్వత్థామరెడ్డి, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ నేత వీహెచ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. నూరు శాతం బస్సులు నడపాలి నూరుశాతం బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కండక్టర్లు ప్రయాణికులకు తప్పని సరిగా టికెట్లు జారీ చేయాలని, బస్సు పాసులను అనుమతించాలని స్పష్టంచేశారు. కండక్టర్లకు టిమ్ మెషీన్లు ఇవ్వాలని సూచించారు. అవసరాన్ని బట్టి బస్సు డిపోల్లో కొత్తగా మెకానిక్‌లు, ఎల్రక్టీíÙయన్లను నియమించుకోవాలని ఆదేశించారు. -
సమ్మె: హైకోర్టులో మరో మూడు పిటిషన్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయమై హైకోర్టులో సోమవారం మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. అటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక సంఘాలకు నోటీసులు జారీచేసింది. అన్ని పిటిషన్లపై ఈ నెల 28న వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె నేటితో 17వ రోజుకు చేరుకున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు తమ ఆందోళనను తీవ్రతరం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ రోజు (సోమవారం) సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలువనున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని, దీనిపై జోక్యం చేసుకోవాలని జేఏసీ ప్రతినిధులు గవర్నర్‌ను కోరనున్నట్టు సమాచారం. సమ్మె మరింత ఉధృతం చేస్తాం ఆర్టీసీ సమ్మెలో భాగంగా నగరంలోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) వద్ద ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు తమ కుటుంబసభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన టీజేఎస్ చీఫ్ కోదండరాం ఆర్టీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. ప్రజారవాణా వ్యవస్థను కాపాడుకోవడమే లక్ష్యంగా తమ ఉద్యమం ఉంటుందని, ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి.. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోదండరామ్ కోరారు. -
నేడు కీలక నిర్ణయం వెలువడనుందా?
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీని కాపాడుకుందాం... ప్రజా రవాణా వ్యవస్థను పరిరక్షించుకుందాం..’ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే నినాదం కనిపించింది. వేలమంది ఆర్టీసీ కార్మికులు ఈ నినాదం రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని కూడళ్ల వద్ద నిలబడి సాధారణ ప్రజానీకంతో మాట్లాడి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. శనివారం నాటి బంద్‌కు ప్రజలు కూడా మద్దతు తెలపటంతో వారికి కృతజ్ఞతలు తెలుపుతూనే తదుపరి తమ కార్యాచరణకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. కొన్ని ప్రాంతాల్లో వారి కుటుంబసభ్యులు కూడా నిలబడి ప్రజలకు గులాబీ పూలు ఇచ్చి మరీ మద్దతు కోరటం విశేషం. ఇక యథాప్రకారం డిపోల ముందు నిలబడి బస్సులు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాత్కాలిక డ్రైవర్లు తమ పొట్టకొట్టొద్దని వేడుకునే ప్రయత్నం చేశారు. శాంతియుతంగా కార్యక్రమాలు జరగటంతో రాష్ట్రంలో ఎక్కడా పెద్ద ఉద్రిక్తత నెలకొనలేదు. గత పక్షం రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న సత్తుపల్లికి చెందిన డ్రైవర్ ఖాజామియా ఆదివారం గుండెపోటుతో మృతి చెందటం కార్మికులను కలచివేసింది. ఉద్యోగ భద్రత దిగులుతోనే ఆయన మృతి చెందాడంటూ కార్మికులు ఆరో పించారు. ములుగు జిల్లాలో జాతీయ రహదారిపై ఆదివారం సాయత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన తాత్కాలిక డ్రైవర్ పరారయ్యాడు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 4,502 ఆర్టీసీ బస్సులు, 1,953 అద్దె బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. మొత్తంగా 71.93% సర్వీసులు రోడ్డెక్కినట్టు వెల్లడించింది. నేడు కీలక నిర్ణయం వెలువడనుందా? ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలంటూ 18న హైకోర్టు ఇచ్చిన ఆదేశం తాలూకు ప్రతి సోమ వారం అధికారులకు అందే అవకాశముంది. దీంతో సోమవారం కీలక నిర్ణయం వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రతి అందితే దాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి తదుపరి కార్యాచరణను అధికారులు రూపొందించనున్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు దసరా సెలవుల పొడిగింపు పూర్తి కావటంతో సోమవారం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇప్పటివరకు ఆయా విద్యా సంస్థ ల బస్సులను కూడా ప్రభుత్వం స్టేజీ క్యారియర్లుగా వాడుకుంది. ఇప్పుడు ఆ బస్సులన్నీ తిరిగి విద్యా సంస్థలకు వెళ్లిపోయాయి. విద్యార్థులకు ఇబ్బంది కాకుండా బస్సులు ఏర్పాట్లు చేయాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు ఆదివారం ముందస్తు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇక విద్యార్థుల బస్ పాస్‌లు కేటగిరీతో సంబం ధం లేకుండా అన్ని బస్సుల్లో చెల్లుబాటయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ సమ్మె 16వ రోజు ఉధృతంగానే కొనసాగింది. అన్ని జిల్లాల్లో ఉదయం నుంచే డిపోల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా విపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు ధర్నాల్లో పాల్గొన్నారు. నేడు వీడియో కాన్ఫరెన్సు విద్యాసంస్థలు తెరుచుకోనుండటంతో పరిస్థితిని అంచనా వేసి ఆదేశాలు జారీ చేసేందుకు వీలుగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ఉదయం 11 గంటలకు ఆర్టీసీ, రవాణా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. -
ఆర్టీసీ జేఏసీ మరో కీలక నిర్ణయం
-
సమ్మె: ఆర్టీసీ జేఏసీ మరో కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై పొలిటికల్ జేఏసీతో ఆదివారం ఆర్టీసీ జేఏసీ భేటీ అయింది. ఆర్టీసీ సమ్మె భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం మరోసారి గవర్నర్ తమిళసైని కలువాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. 16వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్‌ను కోరాలని జేఏసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం కూడా ఆర్టీసీ జేఏసీ మరోసారి సమావేశమవుతుందని, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాలన్నదే తమ లక్ష్యమని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోరాదని, విజయం సాధించేవరకు పోరాడుదామని అన్నారు. కార్మికుల ప్రయోజనాలు కాపాడటమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణ ఇదే పొలిటికల్ జేఏసీతో భేటీ అనంతరం ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 21న అన్ని ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు తమ కుటుంబసభ్యులతో కలిసి బైఠాయించనున్నారు. 22న మా పొట్టకొట్టొద్దని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను కార్మికులు విజ్ఞప్తి చేయనున్నారు. 23న ప్రజాప్రతినిధులను కలిసి సమ్మెకు మద్దతు తెలపాలని, సమ్మెలో భాగస్వామ్యం కావాలని కోరనున్నారు. 24న మహిళా కండక్టర్ల దీక్ష, 25న హైవేలు, రహదారులపై రాస్తారోకోలు చేపట్టనున్నారు. 26న ప్రభుత్వం మనసు మారాలని ఆర్టీసీ కార్మికుల పిల్లలతో దీక్ష చేప్టనున్నారు. 27న పండగ సందర్భంగా జీతాలు లేకపోవడంవల్ల నిరసన, 28న సమ్మెపై హైకోర్టు విచారణ సందర్భంగా విరామం. ఇక, ఈ నెల 30న 5లక్షల మందితో సకల జనుల సమర భేరి నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన వేదికను త్వరలో ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. -
16వ రోజుకు సమ్మె: మరో ఆర్టీసీ కార్మికుడు మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరుకుంది. నిరసనల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద ప్లకార్డులతో కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఓ వైపు సమ్మె విరమించి చర్చలకు రావాలని ఆర్టీసీ యాజమాన్యం పిలుపునిస్తుంటే.. డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని కార్మిక సంఘాలు ప్రకటించారు. దీంతో ప్రతిష్టంభన కొనసగుతోంది. చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. యాజమాన్యం పిలిస్తే చర్చలకు సిద్ధమని కార్మిక సంఘాలు తెలిపారు. సమ్మె భవిష్యత్ కార్యచరణ నేపథ్యంలో రాజకీయ జేఏసీతో కార్మిక సంఘాలు నేడు భేటీ కానున్నాయి. మరో కార్మికుడి మృతి ఈ క్రమంలో ఖమ్మంలో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి చెందాడు. సత్తుపల్లి ఆర్టీసీ డిపో డ్రైవర్ ఎస్కే ఖాజామియా గుండెపోటుతో మరణించారు. 15 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మెలో ఖాజామియా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. సమ్మె విషయంలో ప్రభుత్వ మొండి వైఖరి నేపథ్యంలోనే ఖాజామియా మనస్తాపంతో మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఖాజామియా మృతిపట్ల ఆర్టీసీ జేఏసీ, ప్రజాసంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. -
16వ రోజు కొనసాగుతున్న ఆర్టిసీ కార్మికుల సమ్మె
-
సమ్మె విరమిస్తేనే చర్చలు!
సాక్షి, హైదరాబాద్: మూడు రోజుల్లో ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రక్రియ పూర్తి చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కార్మికులతో సంప్రదింపులకు ఆర్టీసీ ఎండీ కసరత్తు చేస్తున్నారు. అయితే, కార్మిక సంఘాలు ముందు భేషరతుగా సమ్మె విరమించుకుంటేనే చర్చలకు అవకాశం ఉంటుందనే సంకేతాలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఓ సారి చర్చ జరిగింది. రెండు రోజుల క్రితం హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై స్పందిస్తూ, కార్మిక సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సమ్మెలో ఉన్న వారు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని, భవిష్యత్తులో వారితో ఎలాంటి చర్చలు ఉండవని సీఎం తేల్చి చెప్పినప్పటికీ, హైకోర్టు మాత్రం కార్మికులతో చర్చించాల్సిందేనని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. తదుపరి వాయిదా ఈనెల 28న ఉన్నందున, అప్పటి వరకు చర్చల సారాంశాన్ని కోర్టుకు విన్నవించాల్సి ఉంది. హైకోర్టు ఎండీని నేరుగా ఆదేశించినందున, చర్చలు చేపట్టకుంటే కోర్టు ధిక్కరణ కిందకు వచ్చే అవకాశం ఉంది. దీంతో కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో శుక్రవారం రాత్రి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ ప్రగతి భవన్‌కు వెళ్లారు. కానీ సీఎం వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో భేటీ సాధ్యం కాలేదు. మరోవైపు, హైకోర్టు ఆదేశానికి సంబంధించిన పూర్తి పాఠం ప్రతి అధికారులకు అందలేదు. దానిని చూసిన తర్వాతనే స్పందించాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, చర్చలు జరపాలంటూ కోర్టు స్పష్టంగా చెప్పినందున ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ మరో పక్క అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బంద్‌కు వివిధ వర్గాల మద్దతు లభించడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. కానీ దీనిని అంగీకరించవద్దని ప్రభు త్వం భావిస్తోంది. విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో.. సమ్మె నేపథ్యంలో పొడిగించిన సెలవులు కూడా ఆదివారంతో పూర్తి అవుతున్నాయి. దీంతో సోమవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా బస్సుల సంఖ్య పెంచాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. -
ఆర్టీసీ సమ్మె : 23న ఓయూలో బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బంద్‌నకు పిలుపునిచ్చి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు శనివారం బంద్‌లో పాల్గొన్నాయి. చాలా చోట్ల నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి ఇతర జేఏసీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజకీయ జేసీతో భేటీ.. రేపు (ఆదివారం) ఉదయం 11 గంటలకు రాజకీయ జేఏసీ నాయకులను కలవాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఎంఐఎం నేతలనూ కలవాలని నిశ్చయించారు. అక్టోబర్ 23న ఉస్మానియా యూనివర్సీటీలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని జేఏసీ తీర్మానించింది. ఇక ధర్నా కార్యక్రమంలో గాయపడ్డ పోటు రంగారావుని ఆర్టీసీ జేఏసీ నేతలు కలిసి పరామర్శించనున్నారు. నేటితో ఆర్టీసీ కార్మికుల సమ్మె 15 వరోజుకు చేరిన సంగతి తెలిసిందే. బంద్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం : అశ్వత్థామ రెడ్డి ‘ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు చేపట్టిన బంద్ సంపూర్ణం అయ్యింది. పోరాటాన్ని ఇలాగే కొనసాగించాలి. బంద్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం. ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో పడింది. కాలయాపన మంచిది కాదు. ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతోంది. తెలంగాణ ఉద్యమం తరువాత జరిగిన ఉద్యమాల్లో ఇదే పెద్ద ఉద్యమం. ఆర్టీసీని రక్షించండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళతాం. మళ్లీ గవర్నర్ ను కలుస్తాం ఎంఐఎం నేతలను కూడా కలుస్తాం. రేపు రాజకీయ జేఏసీతో సమావేశమవుతాం. ఉద్యమ నాయకుల వేళ్లు తీసినా, తలలు నరికినా ఉద్యమం ఆగదు. తెలంగాణ ఉద్యమంలో కూడా పెట్టని కేసులు ఆర్టీసీ సమ్మెలో మా కార్మికుల పై పెడుతున్నారు’ అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి చెప్పారు. డబ్బులన్నీ ఎక్కిడికి పోతున్నాయ్.. రేపు అన్ని చౌరస్తాల్లో పువ్వులు ఇచ్చి ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరతామని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి అన్నారు. రాజకీయ పార్టీ నేతలతో ఆదివారం సమావేశమైన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. 15 రోజుల నుంచి ఆర్టీసీకి వస్తున్న డబ్బులు ఎక్కడకు పోతున్నాయని జేఏసీ కో కన్వీనర్ వీఎస్ రావు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్మికుల వల్లే రూ.155 కోట్లు నష్టమొచ్చిందని.. ఆర్టీసీ దగ్గర కేవలం రూ.8 కోట్లు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం ఎలా చెబుతోందని నిలదీశారు. ప్రభుత్వం కచ్చితంగా తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. -
నేడు తెలంగాణ బంద్
-
చర్చలు చర్చలే.. సమ్మె సమ్మెనే
-
ఆర్టీసీ జేఏసీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
-
ఆర్టీసీ సమ్మెకు అన్ని వర్గాల మద్దతు
-
ఆర్టీసీ సమ్మె: కేసీఆర్‌తో ఎంపీ కేకే కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎంపీ కే కేశవరావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ భేటీ అయ్యారు. ఆర్టీసీ జేఏసీతో చర్చల అంశాన్ని కేకే.. కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి సమ్మతమైతే.. ఆర్టీసీ జేఏసీతో చర్చలకు తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని కేకే కేసీఆర్‌తో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలకు హైకోర్టు విధించిన డెడ్‌లైన్ శుక్రవారంతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో కేకే భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 18వ తేదీ కల్లా చర్చలు ముగించి.. శుభవార్తతో రావాలని అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్టీసీ జేఏసీకి హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. ఇక, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని కేకే సంచలన ప్రకటన చేశారు. సమ్మె వెంటనే విరమించి.. చర్చలకు సిద్ధపడితే.. తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని ఆయన ఒక ప్రతిపాదన చేశారు. ఆయన ప్రతిపాదనపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఒకింత సుముఖత వ్యక్తం చేశాయి. కేకే మధ్యవర్తిత్వంలో చర్చలకు సిద్దమని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చల దిశగా కేసీఆర్-కేకే భేటీలో కీలక ముందడుగు ఏమైనా పడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరికాసేపట్లో కేసీఆర్ హుజూర్నగర్ ఎన్నికల సభలో పాల్గొనేందుకు వెళుతున్నారు. అజయ్ సమీక్ష ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగరంలోని రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ గురువారం సమీక్ష నిర్వహించారు. రవాణా, ఆర్టీసీ అధికారులతో ఆయన చర్చించారు. సమ్మె నేపథ్యంలో తీసుకుంటున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మాట్లాడారు. ఇక, ఆర్టీసీ ఎండీ నియామకంపై ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. -
ప్రైవేటీకరణపై దండెత్తుదాం
సాక్షి, హైదరాబాద్: సమ్మె విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. తాము చర్చలకు సిద్ధమని మరోసారి తేల్చి చెప్పింది. చర్చలు ఎవరితో జరపాలన్న విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టం చేయకపోవటాన్ని తప్పుపట్టింది. హైకోర్టు స్పందన నేపథ్యంలో జేఏసీ ప్రతినిధులు బుధవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయ లేమని ప్రభుత్వం కోర్టుకు కూడా చెప్పడంతో.. ఈ విషయంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ విషయంలో పట్టుపట్టకుండా, ఆర్టీసీ పరిరక్షణ కోణంలో డిమాండ్ చేయాలని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రైవేటీకరణ, అద్దె బస్సుల సంఖ్య పెంపు విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించారు. ఆర్టీసీ విలీనం అంశం విషయంలో పట్టువిడుపులతో వ్యవహరించి, ప్రైవేటీకరణ యోచనపై గట్టిగా వాదించాలని నిర్ణయించారు. అనంతరం మద్దతు కూడగట్టుకునేందుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాజకీయ జేఏసీ సమావేశంలో పాల్గొన్నారు. చర్చలకు ఆహ్వానించాలి.. కోర్టు సూచనల మేరకు చర్చలకు ఆహ్వానించి ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నా రు. అనంతరం మాట్లాడుతూ.. అరెస్ట్ చేసిన ఆర్టీసీ కార్మికులను వెంటనే విడుద చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల 19న జరిగే ఆర్టీసీ కార్మికుల బంద్‌ను విజయవంతం చేయా లని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. అఖిలపక్ష సమావేశం అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. -
ఆర్టీసీ సమ్మె: కేకే మధ్యవర్తిత్వంతో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ప్రభుత్వం తరఫున మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చారు. ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కేకే మధ్యవర్తిత్వాన్ని స్వాగతించాయి. ఈ నేపథ్యంలో సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికుల ముందు కేకే పలు కీలక ప్రతిపాదనలు ఉంచినట్టు తెలుస్తోంది. కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని ఆయన సూచించారు. ఈ విషయమై మంగళవారం కల్లా కార్మిక సంఘాలు తమ అభిప్రాయాన్ని చెప్పనున్నాయి. కార్మిక సంఘాల అభిప్రాయం చెప్తే.. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. చర్చలు జరిపి పరిష్కరిస్తానని కేకే కార్మికులకు హామీ ఇచ్చినట్టు సమాచారం. కేకే ప్రకటనతో ముందడుగు.. కార్మికుల సమ్మె నేపథ్యంలో కేకే సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. పరిస్థితులు చేయిదాటకముందే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించుకొని చర్చలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గతంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పరిష్కరించిందని గుర్తుచేస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆర్టీసీతోపాటు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన లేదని, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే అంశం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కేశవరావు విజ్ఞప్తి చేశారు. కేకే ప్రకటనను కార్మిక సంఘాలు స్వాగతించాయి. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున మధ్యవర్తిత్వం వహించాలని కోరాయి. కేకే మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వానించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరారు. ఇందుకు కేకే సమ్మతించడంతో ఆర్టీసీ సమ్మె పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడినట్టు అయింది. -
సీఎంవోకు ఫోన్‌కాల్.. వైరల్ ఆడియో క్లిప్‌పై ఫిర్యాదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) హెల్ప్‌లైన్‌కు ఎవరో ఫోన్ చేసినట్లు, తమ అభిప్రాయాలు చెప్పినట్లు రెండు రోజులుగా పత్రికలు, చానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులు సోమవారం హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సీఎంవోకు వచ్చిన ఫోన్‌కాల్ అంటూ 2.56 నిమిషాల నిడివి గల ఆ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీవెన్స్ సెల్‌కు కాల్ చేసి ముఖ్యమంత్రి వైఖరిని తప్పు పట్టిన కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు’ అంటూ వాట్సాప్‌లో ఇది చక్కర్లు కొడుతోంది. ఈ నకిలీ ఆడియో ద్వారా సీఎంపై దుష్ఫ్రచారం చేస్తున్న వ్యవహారాన్ని సీఎంవో సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులు సీపీని కోరారు. దీనిపై స్పందించిన ఆయన కేసును సాంకేతికంగా దర్యాప్తు చేయాలని, బాధ్యుల్ని తక్షణం గుర్తించాలని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించారు. -
ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతం
-
మద్దతు కోరనప్పుడు ఎలా ఇస్తాం?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మెకు మద్దతు కావాలని ఉద్యోగ జేఏసీని ఎన్నడూ కోరలేదని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. మద్దతు కావాలని అడగనప్పుడు తాము ఎలా స్పందిస్తామని ప్రశ్నించింది. ఉద్యోగ జేఏసీలో ఆర్టీసీ జేఏసీ భాగం కాదని, వారి ఉద్యోగ నిబంధ నలు కార్మిక చట్టాలకు లోబడి ఉంటాయని, ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలు సీసీఏ నిబంధనల ప్రకారం ఉంటా యని పేర్కొంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏంటో ఉద్యోగ జేఏసీ దృష్టికి తీసుకొస్తే వాటిపై చర్చించిన తర్వాతే మద్దతుపై ప్రకటన చేయనున్నట్లు తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆదివారం ఉద్యోగ జేఏసీ నేతలు టీఎన్జీవో భవన్లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగ జేఏసీ చైర్మన్ కె.రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వి.మమత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కొందరు పనిగట్టుకుని ఉద్యోగ జేఏసీని, టీఎన్జీవో, టీజీవోలను బదనాం చేస్తున్నారని, ఆర్టీసీ జేఏసీ మద్దతు కోసం ఇప్పటివరకు తమను సంప్రదించలేదన్నారు. సమ్మెకు మద్దతు కోరేందుకు ఆదివారం టీఎన్జీవో భవన్‌కు వస్తామని సమా చారం ఇచ్చిందని.. కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నట్లు ఆర్టీసీ జేఏసీ చెప్పిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి 16 అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులు తమను సంప్రదిస్తే వారి సమస్యను 17వ అంశంగా ప్రస్తావిస్తామని, కొందరు ఉద్దేశపూర్వకంగా తమపై బురద జల్లితే సహించేది లేదన్నారు. తప్పుడు ప్రచారం తగదు.. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ తమను ఆహ్వానించారని, భోజన సమయం కావడంతో అందులో తాము పాల్గొన్నామని రవీందర్‌రెడ్డి, మమత పేర్కొన్నారు. దీనిపై తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు చర్చల తోనే పరిష్కారం దొరుకుతుందని, ఇందులో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుని ప్రభుత్వంపై కక్షసాధింపు ధోరణితో సమ్మెను నడిపిస్తున్నాయని ఆరోపించారు. ఉద్యోగ జేఏసీ ఎన్నడూ రాజకీయ పార్టీల మద్దతు కోరదని, ఆర్టీసీ కార్మికులు కూడా రాజకీయ పార్టీలతో కాకుండా జేఏసీ తరఫున ఉద్యమించాలని సూచించారు. తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కార్మికులకు సూచించారు. -
తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఉధృతం
సాక్షి, హైదరాబాద్: సమ్మెను ఆర్టీసీ కార్మికులు మరింత ఉధృతం చేశారు. సమ్మెపై ప్రభుత్వ తీరుకు నిరసనగా రెండు రోజుల క్రితం ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించిన ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందడంతో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు భగ్గుమన్నారు. ఆయన మరణవార్త అధికారికంగా వెలువడగానే పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు. ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, సంతాప ర్యాలీలు నిర్వహించారు. కొన్నిచోట్ల ముందస్తు నిర్ణయం మేరకు వంటా వార్పులో కార్మికులు పాల్గొన్నారు. సోమవారం అన్ని డిపోల వద్ద సంతాప సభలు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రధాన డిపోల వద్ద జరిగే కార్యక్రమాల్లో ప్రతిపక్ష నేతలు పాల్గొననున్నారు. ఇప్పటికే బీజేపీ ప్రత్యక్షంగా ఆర్టీసీ ఆందోళనల్లో పాల్గొంటుండగా మిగతా పార్టీల నేతలు కూడా హజరయ్యేలా ఆర్టీసీ జేఏసీ ఏర్పాట్లు చేస్తోంది. నేడు గవర్నర్‌కు ఫిర్యాదు... రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సోమవారం కలవనున్నారు. ఆర్టీసీ విష యంలో ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేయనున్నారు. వారిది పదవుల వ్యామోహం: ఆర్టీసీ జేఏసీ టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమతపై ఆర్టీసీ జేఏసీ మండిపడింది. ఉద్యోగుల సంక్షేమం కంటే వారికి పదవుల వ్యామోహమే ఎక్కువని, రాజకీయంగా ఎదిగేందుకు వారు లాలూచీ పడు తున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనను సీఎం వద్ద ఉంచారని, అందుకే ఆర్టీసీ కార్మికుల విషయంలో చులకనగా మాట్లాడుతున్నారని జేఏసీ నేత థామస్‌రెడ్డి దుయ్యబట్టారు. కొనసాగుతున్న సామాన్యుల ఇబ్బందులు... రోజుకు 8 వేల కంటే ఎక్కువ బస్సులను తిప్పుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నా గ్రామీణ ప్రాంతాలకు ఆదివారం వరకు కూడా సరిగ్గా బస్సులు తిరగలేదు. ప్రధాన రహదారిలో ఉన్న ప్రాంతాలకే అవి పరిమిత మవుతున్నాయి. తక్కువ సంఖ్యలో ఊళ్లకు బస్సులు తిరుగుతుండటంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. హైదరాబాద్‌లోనూ సిటీ బస్సుల సంఖ్య తక్కువగా ఉంటోంది. బస్సుల సర్వీసింగ్‌కు కూడా సిబ్బంది లేకపోవడంతో రోజువారీ మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు. ఇది బస్సు ఇంజన్లపై ప్రభావం చూపుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే మరో వారం రోజుల్లో చాలా బస్సులు గ్యారేజీకి వెళ్లాల్సి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీల భర్తీకి ఆర్టీసీ ప్రకటన... ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు తిప్పుతున్న ప్రభుత్వం మరిన్ని చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర క్లరికల్ సిబ్బంది, శ్రామిక్‌లు, సాఫ్ట్వేర్ నిపుణులు, ఎలక్ట్రీషియన్లు.. ఇలా అన్ని కేటగిరీలకు చెందిన సిబ్బందిని నియమించుకునేందుకు వీలుగా ఆదివారం ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సాధారణ బస్సులను తాత్కాలిక డ్రైవర్లతో తిప్పుతున్నా ఏసీ బస్సులను మాత్రం తిప్పటం లేదు. వాటిని ప్రత్యేక నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే నడపాల్సి ఉంటుంది. తాత్కాలిక పద్ధతిలో తీసుకుం టున్న డ్రైవర్లలో అలాంటి నైపుణ్యం ఉండదన్న ఉద్దేశం తో వారికి ఏసీ బస్సులు ఇవ్వడం లేదు. ఏసీ బస్సులను నడిపే నైపుణ్యం ఉన్న వారిని కూడా తీసుకోవాలని నిర్ణయించారు. అలాంటి వారి నుంచి కూడా దరఖాస్తు లు కోరుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటనలో పేర్కొంది. సాధారణ బస్సులు నడిపే వారికి రోజుకు రూ. 1,500, వోల్వో లాంటి బస్సులు నడిపేవారికి రూ. 2,000 చెల్లించ నున్నట్లు వెల్లడించింది. ఐటీ నిపుణులకు రూ. 1,500, రిటైర్డ్ సూపర్వైజరీ కేడర్ సిబ్బందికి రూ. 1,500 చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది. సమ్మెలో ఉన్న వారి స్థానంలో కొత్త నియామకాలు పూర్తిచేయనుంది. సగం బస్సులు మాత్రమే ఆర్టీసీవి ఉంటాయని ఇప్పటికే సీఎం వెల్లడించిన మీదట సంస్థకు 24 వేల మంది సిబ్బంది అవసరమవుతారని అధికారులు తేల్చారు. శ్రీనివాస్‌రెడ్డి కన్నుమూత చార్మినార్/సంతోష్‌నగర్: ఆత్మహత్యకు యత్నించి కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ కుమారుడు అభిరాంరెడ్డికి అప్పగించారు. శ్రీనివాస్ రెడ్డి మృతి విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు హుటాహుటిన అపోలో ఆసుపత్రికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వీరంతా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు బైఠాయించిన నాయకులను వివిధ పోలీస్స్టేషన్లకు తరలించి సాయంత్రం విడుదల చేశారు. శ్రీనివాస్‌రెడ్డి మృతి వార్త తెలుసుకుని ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వీహెచ్, జేఏసీ నాయకులు థామస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ రేవంత్‌రెడ్డి, మంద కృష్ణమాదిగ, సీపీఐ నేత నారాయణ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తదితరులు అపోలో ఆసుపత్రికి చేరుకొని శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఖమ్మంలో ఉద్రిక్తత... సాక్షి ప్రతినిధి, ఖమ్మం: శ్రీనివాస్‌రెడ్డి మృతి విషయం కార్మిక వర్గాల్లో, రాజకీయ పక్షాల్లో దావానలంలా వ్యాపించడంతో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, కార్మికుల కోసం ఆత్మ బలిదానం చేసిన శ్రీనివాస్‌రెడ్డి త్యాగం ఊరికే పోనివ్వమని, ప్రభుత్వంపై మరింత పట్టుదలగా పోరాడుతామని ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు, పలు రాజ కీయ పక్షాల నేతలు చెప్పారు. శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాన్ని ఆదివారం భారీ పోలీస్ బందోబస్త్ నడుమ రాపర్తినగర్‌లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. పోరుకు భట్టి, ప్రధాన పక్షాల పిలుపు.. శ్రీనివాస్‌రెడ్డి మృతితో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఆమ్ఆద్మీ పార్టీ, ఎన్డీ చంద్రన్నవర్గం నేతలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌రెడ్డి స్ఫూర్తిగా మరింత పోరు జరపాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క, పలు ప్రధాన రాజకీయ పక్షాల నేతలు సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. -
ఉధృతంగా సమ్మె.. ఖమ్మంలో ఉద్రిక్తత
-
ఉధృతంగా సమ్మె.. ఖమ్మంలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు యత్నించడంతో ఆర్టీసీ సంఘాలు ఆదివారం బస్సుల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం నుంచే ఆర్టీసీ డిపోల దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఖమ్మం, మణుగూరు సహా ఆరు డిపోల్లో బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. కార్మికుల ఆందోళనకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ఇచ్చాయి. హైదరాబాద్‌లో.. హైదరాబాద్ పాతబస్తీలో డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఫలక్‌నుమ, ఫారూఖ్‌నగర్ డిపోల ముందు మౌనప్రదర్శన చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు బీజేపీ, సీఐటీయూలు తమ మద్దతు తెలిపాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విక్రమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హక్కింపేట్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో కలిసి ఆయన ధర్నా చేశారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు లాభాల బాటలో నడిపించేందుకు కృషిచేయాల్సిన ప్రభుత్వం.. ఉద్యోగులున తొలగించి వారి కుటుంబాలను రోడ్డు పడేయడం దుర్మార్గమన్నారు. ఇబ్రహీంపట్నం డిపో వద్ద రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో కార్మికులు.. ఆందోళన కొనసాగిస్తున్నారు. నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. డిపో ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హన్మకొండలో మౌనదీక్ష తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌనదీక్షకు దిగారు. తమ డిమాండ్లు న్యాయమైనవని... తమ పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం ఇలానే నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తే.. సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. జనగామ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు మౌనదీక్ష చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. జనగామ ఆర్టీసీ డిపో నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మౌనప్రదర్శన చేశారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయకపోతే... తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి. నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని భూపాలపల్లిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌనదీక్ష చేశారు. ప్రభుత్వం పంతం వీడి తమ సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా నిజామాబాద్‌లో కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి డిపో వరకు ర్యాలీ చేశారు. అనంతరం ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించేదిలేదని స్పష్టం చేశారు. నల్ల బ్యాడ్జీలతో మౌనప్రదర్శన తమ డిమాండ్ల నెరవేర్చాలంటూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి మౌనప్రదర్శన చేశారు. పట్టనంలో భారీ ర్యాలీ చేశారు. అఖిలపక్షం నాయకులు కార్మికులకు మద్దతుగా మద్దతుగా నిలిచారు. ప్రైవేట్ డ్రైవర్లు, కండెక్టర్లతో బస్సులను నడిపిస్తుంటే... ప్రజలు క్షేమం గాల్లో దీపంలా ఉందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు మౌనప్రదర్శన నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలంటూ డిమాండ్ చేశారు. కార్మికులు సమ్మె చేస్తుంటే... ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు.. నోటికి నల్లబ్యాడ్జీలు ధరించి మౌనప్రదర్శన చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అఖిలపక్షం నేతలు కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ కార్మికుల బతుకులతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. -
ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం
ముషీరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుం దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. వేలాది మంది కార్మికులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు కొనసాగిస్తుంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. దసరా వేడుకలు కూడా లేకుండా ఆందోళన చేస్తున్న కార్మికులను చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుందన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీకి మద్దతుగా శనివారం బస్‌భవన్ వద్ద బీజేపీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ రోడ్డుపైకి వచ్చిందని, ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని కాపాడుకునేందుకే తాము సమ్మె కొనసాస్తున్నామన్నారు. ఈ ధర్నాలో బీజేపీతో పాటు తెలంగాణ జన సమితి, పలు ప్రజా, మహిళా, కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. బస్‌భవన్ ప్రాంగణం అంతా కార్మికులతో కిటకిటలాడింది. మరోవైపు ధర్నా నేపథ్యంలో ఉదయం నుంచే భారీ బందోబస్తు చేపట్టిన పోలీసులు ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి వీఎస్టీ వరకు ప్రధాన రహదారి మొత్తం బారికేడ్లతో మూసివేశారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వాత్థామరెడ్డి, థామస్‌రెడ్డిలతో పాటు వివిధ జిల్లాల బీజేపీ నాయకులతో కలిసి బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణమండపం నుంచి భారీ ర్యాలీగా బస్ భవన్‌కు తరలివచ్చారు. డా.కె.లక్ష్మణ్ బస్ భవన్ ఎదుట రోడ్డుపై భైఠాయించారు. దీంతో పోలీసు బందోబస్తు నడుమ బలవంతంగా అరెస్టు చేశారు. కాగా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో బస్‌భవన్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్వల్పంగా గాయపడ్డారు. దీంతో చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేర్చారు. ఆయనకు అన్ని వైద్య పరీక్షలు పూర్తి అయిన అనంతరం రాత్రి 7.20 ప్రాంతంలో లక్ష్మణ్ డిశ్చార్జ్ అయ్యారు. -
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉధృతం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమంగా ఉధృతమవుతోంది. ఇప్పటివరకు శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తున్న కార్మికులు ఇక వ్యూహాత్మక కార్యాచరణతో సమ్మెను తీవ్రతరం చేస్తున్నారు. వీరికి రాజకీయ పార్టీలు సైతం మద్దతుగా నిలిచి కార్మికుల డిమాండ్ల సాధనకు తోడ్పాటు అందిస్తుండడంతో సమ్మె తీవ్రత బలంగా మారుతోంది. ఇదిలావుండగా ఖమ్మం బస్ డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడం, నగరంలోని ఆస్పత్రికి తరలించడం, శ్రీనివాస్‌రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం... తదితర అంశాలు సమ్మెను మరింత వేడెక్కించాయి. మరోవైపు కార్మికుల చర్యలకు భయపడే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. శని వారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. గడువులోగా విధుల్లో చేరని వారు కార్మికులే కాదని, వారితో చర్చలు జరిపేది లేదని తేల్చిచెప్పారు. మూడ్రోజుల్లోగా నూరుశాతం బస్సులు నడపాలని, కొత్త విధానం ప్రకారం బస్సుల నోటిఫికేషన్లు తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా పట్టు వీడకపోవడం... కార్మికులు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేస్తుండడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఏడు రోజుల కార్యాచరణ విడుదల... సమ్మె పట్ల వెనక్కు తగ్గని కార్మిక సంఘాలు ఏకంగా వారం రోజుల కార్యాచరణను ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రత్యేక కార్యాచరణ ఏదీ లేకుండా రోజు వారీగా నిరసన కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అఖి లపక్ష పార్టీ నేతల సమావేవంలో ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఈనెల 19వ తేదీ వరకు రోజువారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వెల్లడించింది. ఈ నెల 13న అన్ని డిపోల వద్ద వంటా–వార్పు చేపట్టాలి. ఈ నెల 14న బస్ డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మహా ధర్నాలు నిర్వహించాలి. అదేవిధంగా ఇందిరాపార్క్ వద్ద సమ్మెకు మద్దతిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, కార్మిక, కర్షక, మహిళా సంఘాలతో మహా ధర్నా. ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు, చౌరస్తాల వద్ద ఆర్టీసీ కార్మికులతో పాటు రాజకీయ, విద్యార్థి సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, కుల సంఘాలు, సబ్బండ వర్ణాల భాగస్వామ్యం తో రాస్తారోకోలు. 16న విద్యార్థి సంఘాలతో ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై ర్యాలీలు. 18న బైక్ ర్యాలీలు. ఈనెల 19న తెలంగాణ రాష్ట్ర బంద్. జేఏసీ కార్యాచరణ ప్రకటించిన గడువులోగా ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెను మరింత తీవ్రతరం చేయనున్నట్లు జేఏసీ స్పష్టం చేసింది. -
కార్మికుల ఆందోళనలు.. కేసీఆర్ కీలక ఆదేశాలు
-
కార్మికుల ఆందోళనలు.. కేసీఆర్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: సమ్మెను ఉధృతం చేస్తామన్న ఆర్టీసీ కార్మికుల ప్రకటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె పేరుతో బస్టాండ్లు, బస్ డిపోల వద్ద అరాచకం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గూండాగిరి నడవదని, ఇప్పటి వరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉందని, ఇకపై కఠినంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తలెత్తిన పరిస్థితులపై శనివారం ఆయన ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్న కార్మికులను క్షమించే ప్రసక్తే లేదన్నారు. మూడు రోజుల్లోగా వందశాతం బస్సులు నడిపి తీరాల్సిందేనని అధికారులను ఆదేశించారు. (చదవండి : ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం) ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్ లీడర్లుగా చెప్పుకునే కొందరు ప్రకటిస్తున్నారని, సమ్మెను ఉధృతం చేసినా ప్రభుత్వం చలించదని.. బెదిరింపులకు భయపడేది లేదని కేసీఆర్ అన్నారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించదని, సమ్మె చేస్తున్న వారితో చర్చలు కూడా జరపదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బస్టాండ్లు, బస్ డిపోల వద్ద ఎవరైనా బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తును పెంచాలని, అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టాలని, మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించాలని డీజీపీ మహేందర్ రెడ్డికి సమీక్ష సమావేశం నుంచే ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఆదేశించారు. అవసరమైతే ఇంటెలిజెన్స్ పోలీసులనూ ఉపయోగించాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి, కోర్టుకు పంపాలని, ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారు. కాగా, ఖమ్మం జిల్లాలో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలాగే మరో డ్రైవర్ బోయిన వెంకటేశ్వరాచారి పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకోగా తోటి కార్మికులు సకాలంలో స్పందించి ఆర్పివేశారు. ఈ పరిణామాలతో ఖమ్మం బస్ డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
తేల్చే వరకు తెగించి కొట్లాడుడే..
సాక్షి, మంకమ్మతోట(కరీంనగర్)/హుజూరాబాద్ : సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె క్రమంగా ఉధృతమవుతోంది. కార్మికులకు ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు పెరుగుతోంది. ఆర్టీసీ సమ్మె గురువారం ఆరో రోజుకు చేరుకుంది. దసరా పండుగ వరకు వేచి చూసిన కార్మికులు పోరాటాలను క్రమంగా ఉధృతం చేస్తున్నారు. జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు కరీంనగర్ బస్టాండ్ నుంచి తెలంగాణచౌక్ మీదుగా బస్టాండ్వరకు అఖిప పక్షం నాయకులు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల మద్దతుతో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడి నిరసన తెలుపారు. కార్మికులు బస్టాండ్ ఆవరణలోని డిపోల వద్ద ఆందోళన చేశారు. హుజూరాబాద్‌లో ఆర్టీసి డిపో నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్డీవో చెన్నయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, ప్రభుత్వ ఇచ్చే రాయితీలు చెల్లించాలని, అన్ని రకాల ట్యాక్స్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఖండించారు. దసరా పండుగ జరుపుకుని తిరుగి వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ రద్దీగా కనిపించింది. కార్మికులెవరూ విదులకు హాజరు కాలేదు. అ«ధికారులు ఆర్టీసీతోపాటు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులను తరలించే ఏర్పాటు చేశారు. బస్సుల్లో అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపించారు. హుజూరాబాద్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తున్న ఆర్టీసీ కార్మికులు వెనుకడుగు వేయం.. ప్రభుత్వం దిగివచ్చి కార్మికులతో చర్చలు జరిపేంతవరకు సమ్మె విషయంలో వెనుకగుడు వేసేది లేదని, ఆర్టీసీ కార్మికులకు తాము అండగా ఉంటామని అఖిల పక్ష నాయకులు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీని విలీనం చేసి కార్మికులకు బంగారు భవిష్యత్తు కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ సాధించుకుంటే మన రాష్ట్రంలో మన నీళ్లు, మన నిధులతో బంగారు తెలంగాణ చేసుకుందామని చెప్పి పండుగ పూట కార్మికుల కుటుంబాలను పస్తులుంచిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల జీతభత్యాల సవరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన అన్ని బెన్ఫిట్స్ ప్రభుత్వం కల్పించాలని, కార్మికులు సంతోషంగా ఉంటేనే ఏసంస్థ అయినా అభివృద్ధి పథంలో నడుస్తుందనే విషయాన్ని ప్రభుత్వ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. వెంటనే ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు. సంఘీభావ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, నగర అధ్యక్షుతు బేతి మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ముకుందరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శులు కూన శోభారాణి, సృజన్‌కుమార్, ఏఐటీయుసీ నాయకుడు టేకుమల్ల సమ్మయ్య,టీడీపీ నగర అధ్యక్షుడు ఆగయ్య, జేఏసీ నాయకులు జక్కుల మల్లేశం, కె.సురేందర్‌రాజు, గుర్రాల రవీందర్, టీఆర్.రెడ్డి, ఎన్‌కె.రాజు, ఎంపీ.రెడ్డి, కాళిదాసు, ఆర్టీసీ జేఏసీ నాయకులు పీఎల్.రావు, మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్, రమేశ్, జె.రవీందర్, టీఎస్.సింగ్, యాకుబ్‌పాషా, సమ్మిరెడ్డి, సర్దార్, అశోక్‌బాబు, రాజమణి, ఎస్ఎస్.రాణి, విజయలక్ష్మి, శ్రీదేవి, పద్మ, సారయ్య, ఎన్వీ రెడ్డి, యూసఫ్‌అలీ, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్టీసీ 567 బస్సులు ఏర్పాటు.. సమ్మె జరుగుతున్నప్పటికీ తాత్కాళిక డ్రైవర్లు, కండక్టర్లతో గురువారం మొత్తం 642 బస్సులకుగాను 567 బస్సులు నడిపించినట్లు ఆర్ఎం జీవన్‌ప్రసాద్ తెలిపారు. 364 మంది తాత్కాలిక డ్రైవర్లు, 364 మంది కండక్టర్లతో బస్సులు నడిపిస్తున్నారు. 1.03 లక్షల కిలోమీటర్లు బస్సులు నడుపగా రూ.25 లక్షల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. -
ప్రయాణికులకు ఆర్టీసీ సమ్మె పోటు
-
ఉధృతంగా ఆర్టీసీ సమ్మె
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్ల సాధన కోసం ఉధృతంగా ఉద్యమించనున్నట్లు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) తెలిపింది. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, హైకోర్టులో కేసు విచారణకు సంబంధించిన అంశాలపై చర్చించాయి. కార్మికుల సమ్మెకు తమ మద్దతు ఉంటుందని చెప్పాయి. ఉద్యమ కార్యాచరణ రూపొందించి సమ్మెను తీవ్రతరం చేయాల్సిందిగా అభిప్రాయపడ్డాయి. ఆరు రోజులపాటు కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి సమ్మె చేయడం ఐక్యతకు నిదర్శనమని, ఇదే స్ఫూర్తితో డిమాండ్లను సాధించుకోవాలని సూచించాయి.ఆర్టీసీ సమ్మెకు అన్ని వర్గా ల మద్దతు కూడగడితే సమ్మె తీవ్రత పెరుగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. సమ్మెను తీవ్రతరం చేసే క్రమంలో రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంపైనా ఈ భేటీలో చర్చించారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్ నిర్వహించే అంశాన్ని సైతం సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కూడా ఉద్యమంలో కలుపుకొని వెళ్తే బాగుంటుందన్న భావనను అందరూ వ్యక్తం చేయడంతో ఆ దిశగా కార్యాచరణ రూపొందించేందుకు ఆర్టీసీ జేఏసీ సమాలోచనలు చేస్తోంది. సమ్మెకు పూర్తి మద్దతు: పెన్షనర్ల జేఏసీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు పెన్షనర్ల జేఏసీ తెలిపింది. పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. సమ్మెపై సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ‘సంఘాలు మద్దతివ్వాలి’ ఆరు రోజులుగా కార్మికులంతా సమ్మె లో ఉండి పోరాట పటిమ చాటారని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మెను తీవ్రం చేసేందుకు రెండు రోజుల కార్యాచరణను ఖరారు చేశామన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బస్ డిపోల వద్ద అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. శనివారం గాంధీజీ, జయశంకర్ విగ్రహాల వద్ద మౌన దీక్ష చేయనున్నట్లు వివరించారు. కార్మికుల ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ట్రేడ్ యూనియన్లను కోరారు. కార్మికులతోపాటు సమ్మెలో పాల్గొంటున్న సూపర్వైజ ర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
తిరుగు ‘మోత’
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో ఊళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణం దడ పుట్టిస్తోంది. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు గ్రామాలకు వెళ్లకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న వారికి షాక్ కొడుతోంది. సాధారణ బస్సు టికెట్ ధర కంటే ప్రైవేటు వాహనదారులు ఎక్కువ మొత్తంలో వసూళ్లకు తెగబడటంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఆరు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా.. పండుగ నేపథ్యంలో తొలి 4 రోజులు పెద్దగా ఇబ్బందులు కనిపించలేదు. సమ్మె ఉంటుందని ముందే ఊహించడంతో పల్లెలకు వెళ్లాల్సిన వారంతా ముందుగానే గమ్యస్థానాలకు చేరుకున్నారు. సొంతూరుకు వెళ్లిన వారంతా ఇప్పుడిప్పుడే తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పాసులు అనుమతిస్తే నడపలేం.. ప్రయాణికుల నుంచి అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవన్న ప్రభుత్వం హెచ్చరికను ప్రైవే టు వాహనదారులు పట్టించుకోలేదు. గురువారం చాలాచోట్ల అధిక వసూళ్లు చేసినట్లు విమర్శలు వచ్చాయి. బస్‌పాసులు సైతం అనుమతించకపోవడంతో రోజువారీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్‌పాసులు అనుమతిస్తే బస్సులు నడపలేమని ప్రైవేటు బస్సు యాజమాన్యాలు ఆర్టీసీకి స్పష్టం చేశాయి. కొన్ని బస్సులకు పాసులు చెల్లవంటూ స్టిక్టర్లు అంటించి నడిపారు. పాసులు అనుమతించి రోజు వారీ టార్గెట్లు విధిస్తే కష్టమని, అలాగైతే రూటు మార్చుకుంటామని తేల్చి చెప్పా రు. పాసులు అనుమతించడంతో చాలా బస్సు లకు రోజువారీ ఆదాయం పదో వంతుకు పడిపోతోంది. ఈ అంశాన్ని ఆర్టీసీ అధికారులకు వివరిస్తే బస్సులు నడపకుండా ఆపేయాలని సలహా ఇస్తున్నట్లు కొందరు ప్రైవేటు బస్సుల యజమానులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా కొందరు పట్టణ ప్రాంతాలకు బదులు జిల్లా కేంద్రాలు, సర్వీసు రూట్ల వైపు బస్సులు తిప్పారు. దీంతో సిటీ, అర్బన్ ప్రాంతాలకు బస్సులు తగ్గాయి. నోటిఫికేషన్ వస్తే పోరాటం సమ్మెలో పాల్గొన్న కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యా రని ఆర్టీసీ చెబుతున్నా.. కార్మికులకు మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. దీంతో నోటీసులు అందిన తర్వాతే స్పందించాలనే యోచనలో కార్మికులున్నారు. బస్సుల నిర్వహణలోనూ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. 50 శాతం ఆర్టీసీ, 30 శాతం అద్దె ప్రాతిపదికన, 20 శాతం ప్రైవేటుకు ఇవ్వనున్నట్లు చెప్పింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు రాలే దు. వీటికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వస్తే పోరాటానికి అనుకూలంగా ఉంటుందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. సమ్మె నేపథ్యంలో నగరంలో పెరిగిన ఆటోల హడావుడి ర్యాలీలు, నిరసనలు.. ఆర్టీసీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, మానవ హారాలు, ధర్నాలు నిర్వహించారు. ప్రైవేటు వాహనాలను అడ్డగించారు. ఉద్యోగాలపై వేటు పడటంతో వేలాది కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగాలు పోతాయనే భయంతో ఉప్పల్‌లో ఓ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. చెంగిచెర్ల డిపోకు చెందిన కొమురయ్య ఉప్పల్ డిపో వద్ద నిర్వహిస్తున్న ర్యాలీలో ఉండగానే.. గుండెపోటు రావడంతో అక్కడిక్కడే మరణించాడు. అల్వాల్‌లోని హకీంపేట డిపోకు చెందిన కండక్టర్ పద్మ భర్త గుండెపోటుతో చనిపోయాడు. హెచ్‌సీయూ డిపోకు చెందిన డ్రైవర్ ఖలీల్ మియా రామచంద్రాపురం ఈఎస్ఐ వద్ద గుండెపోటుతో చనిపోయాడు. గుండెపోటుతో డ్రైవర్ మృతి రామచంద్రాపురం(పటాన్చెరు): సమ్మె కారణంగా ఉద్యోగం పోయిందన్న బాధతో ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో గురువారం ఈ ఘటన జరిగింది. హెచ్‌సీయూ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్ ఖలీల్ మియా (48) రామచంద్రాపురంలోని బొంబాయి కాలనీలో నివాసిస్తున్నా డు. ఆయన టీజేఎంయూ తర ఫున ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్నాడు. ఉద్యోగం పోయిందనే బాధతో కలత చెందడంతో గుండెపోటు వచ్చింది. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు ఆగిపోయిన విషయం ఆయనను మరింత బాధ పెట్టిందని కుటుంబ సభ్యులు చెప్పారు. మరో ఆసుపత్రికి తరలించగా ఆయన మరణించినట్లు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన జేఏసీ నేతలు ఆర్టీసీ జేఏసీ నేతలు గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ స్పందనతో పాటు కార్మికుల డిమాండ్లు, సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ఆమెకు వివరించారు. సమ్మెకు ముందు ప్రభుత్వానికి, కార్మిక శాఖకు నోటీసులు ఇచ్చిన పరిస్థితులను తెలిపారు. దాదాపు 50 వేల మంది కార్మికులు సమ్మె చేస్తున్నా.. సీఎం కేసీఆర్ స్పందించలేదని, ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని, సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వంతో మాట్లాడాలని జేఏసీ నేతలు కోరారు. ఈ మేరకు జేఏసీ నేతలు ఆమెకు వినతిపత్రాన్ని అందించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఆర్టీసీ జేఏసీ నేతలు రమేశ్ కుమార్, కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, సుధాకర్ తదితరులున్నారు. ఉద్యోగుల జేఏసీతో భేటీ వాయిదా ఉద్యోగుల జేఏసీతో గురువారం జరగాల్సిన ఆర్టీసీ జేఏసీ సమావేశం వాయిదా పడింది. ఉద్యోగుల సంఘం జేఏసీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లడంతో సమావేశం వాయిదా పడింది. వీలైతే శుక్రవారం ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతు కూడగట్టేందుకు అన్ని రాజకీయ, ఉద్యోగ సంఘాలతో ఆర్టీసీ జేఏసీ సమావేశమవుతోన్న విషయం తెలిసిందే. -
ఆరో రోజుకు చేరిన సమ్మె..
-
ఆర్టీసీ సమ్మె: నేడు హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్ దాఖలు చేయాలంటూ గత విచారణలో కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్సుల బంద్ ప్రభావంపై అన్ని డిపోల మేనేజర్లు ఇచ్చిన రిపోర్ట్‌ను ప్రభుత్వం నేడు కోర్టుకు సమర్పించి, పిటిషన్ దాఖలు చేయనుంది. సమ్మె చట్టబద్ధం కాదని అటు ప్రభుత్వం.. తమ డిమాండ్ల సాధనకే సమ్మె అంటూ ఇటు కార్మికులు వాదిస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం ఇచ్చే తీర్పు కీలకంగా మారనుంది. సమ్మె నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 3గంటలకు ఆర్టీసీ జేఏసీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అనంతరం తెలంగాణ బంద్ ప్రకటనపై గవర్నర్‌ను కలవనుంది. ఆరో రోజుకు చేరిన సమ్మె.. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. నేడు రాజకీయ పక్షాలతో కలిసి ఆర్టీసీ కార్మికులు డిపోల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నారు. సమ్మె విషయంలో ఇటు ఆర్టీసీ కార్మికులు, అటు ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవడం లేదు. సమ్మె ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ రోజువారీ కండక్టర్లు, డ్రైవర్లతో బస్సులు నడుపుతుంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా దాదాపు 5 వేల బస్సులును నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఇదిలా ఉండగా సమ్మె నేపథ్యంలో అద్దె బస్సుల్లో బస్సు పాసులను అనుమతించడం లేదు. ఫలితంగా ప్రైవేటు వాహనదారులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా అధిక చార్జీలు వసూలు చేస్తూ.. ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా చర్యలు తప్పవంటూ ప్రభుత్వం హెచ్చరించినప్పటికి దోపిడీ మాత్రం ఆగడం లేదు. -
ఆర్టీసీ ఆపరేషన్ షురూ!
సాక్షి, హైదారాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులను తొలగిస్తూ .. సంస్థలో ఇక మిగిలింది1200 మంది ఉద్యోగులు మాత్రమే అని ప్రకటించి విషయం తెలిసిందే. తాజాగా కొత్త ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలు చేపడతామని ప్రకటించారు. ఈ మేరకు కొత్త నియామకాలకై అధికారులు కసరత్తు ప్రారంభించారు. అన్ని డిపో మేనేజర్లతో రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త అద్దె బస్సులు, నోటిఫికేషన్‌పై చర్చించారు. రేపటి నుంచి మరిన్ని బస్సులను పెంచాలని అధికారులను ఆదేశించారు. బస్‌పాసులను కచ్చితంగా అనుమతి ఇచ్చేలా తాత్కాలిక, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఆదేశాలివ్వాలని సూచించారు. ప్రయాణికుల రద్దికి తగ్గట్టుగా బస్సులను ఏర్పాటు చేసుకోవాలని డిపో మేనేజర్లకు సూచించారు. మరో 10 రోజుల్లో ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇష్టారాజ్యంగా డబ్బు వసూలు ఆర్టీసీ కార్మికుల సమ్మే నేపథ్యంలో ప్రైవేట్ వాహనదారులు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పండగ వేళ గ్రామాల నుంచి పట్టణాలకు తిరుగు ప్రయాణమయ్యే వారికి ఇబ్బంది కాకుండా 5వేలకు పైగా ఆర్టీసీ బస్సులను రోడెక్కించారు. ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్ల ద్వారా ఆర్టీసీ సేవలు అందిస్తున్నారు. అయితే వారు మాత్రం ప్రయాణీకుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. టికెట్లు ఇవ్వకుండానే ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక పండగకు ఊరెళ్లి తిరిగి వస్తున్న నగర వాసులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాల నుంచి ఎలాగోలా జూబ్లీబస్టాండ్ చేరుకున్నా.. అక్కడి నుంచి సీటీలోకి వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రెట్టింపు డబ్బులు ఇచ్చి సిటీలోకి వెళ్తున్నారు. సమ్మె విషయంలో అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో పండగ వేళ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమ్మె విస్తృతం చేస్తామంటున్న కార్మిక జేఏసీ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదో రోజుకు చేరింది. అయినప్పటీకి ప్రభుత్వం దిగిరాకపోవడంతో తమ సమ్మెను విస్తృతం చేసేందుకు ఆర్టీసీ జేఏసీ ప్రణాళిక రచిస్తోంది.వంట వార్పు, తెలంగాణ బంద్, గవర్నర్, కేంద్ర మంత్రులను కలవడం లాంటి కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకుంది. -
‘కర్రు కాల్చి వాత పెడతారు జాగ్రత్త..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఎయిర్‌బస్‌పై ఉన్న ప్రేమ ఎర్రబస్సుపై లేదని విమర్శించారు. ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈస్ట్‌మన్ కలర్ సినిమా చూసిస్తున్నారని మండి పడ్డారు. సీఎం ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 1200 మంది ఉద్యోగులే ఉన్నారన్న కేసీఆర్ ప్రకటన రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ చేస్తే.. కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్తామని.. కర్రు కాల్చి వాత పెట్టే సందర్భం వస్తుందని రావుల హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు: తమ్మినేని ఆర్టీసీ సమ్మెకు సీపీఎం పూర్తి మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష సమావేశానికి హాజరైన తమ్మినేని ఆర్టీసీ కార్మికులు కేసీఆర్‌కు పాలేర్లు కాదని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె నూటికి నూరు శాతం జయప్రదమవుతున్న సమ్మె అని స్పష్టం చేశారు. సమ్మెకు మద్దతు తెలపడానికి టీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి కొందరు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ మాటలు ఆయన అహంకారానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని మండి పడ్డారు. -
పంథా మార్చిన కార్మిక సంఘాలు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ఆర్టీసీని సమూలంగా మార్చేందుకు సీఎం కీలకనిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తుండగా, మరోవైపు పట్టువీడకుండా కార్మికసంఘాలు సమ్మెను ముమ్మరం చేశాయి. సోమవారం మూడోరోజు కూడా ఉద్యోగులు విధుల్లో పాల్గొనకుండా సంపూర్ణ సమ్మెను చేపట్టారు. ఓ వైపు సమ్మె జరుపుతూనే మరోవైపు ముఖ్యమంత్రి నిర్ణయాలపై నిరసనలు వ్యక్తం చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మూడోరోజు సమ్మెతో ప్రయాణికులు పెద్దగా ఇబ్బంది పడనప్పటికీ, చాలాచోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోమవారం సాయం త్రం నాలుగు గంటల వరకు 5,386 బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 48.51% బస్సులు తిప్పినట్టు అధికారులు ప్రకటించారు. రెండు రోజులతో పోలిస్తే సోమవారం ఉదయం నుంచే అన్ని బస్టాండ్లు బస్సులతో నిండిపోయాయి. నగరంలోని ఇమ్లీబన్‌కు ఉదయం పది గంటల వేళ దాదాపు 300 బస్సులు రావటంతో వాటిని నిలిపేస్థలం లేక ప్లాట్‌ఫామ్స్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బస్సులెక్కువ ఉన్నా, ప్రయాణికుల సంఖ్య పలచగా ఉంది. దసరాను జరుపుకొనేందుకు చాలామంది నగరవాసులు ఊళ్లకు చేరిపోవటంతో సోమవారం రద్దీ పెద్దగా కనిపించలేదు. దీన్ని గుర్తించి అధికారులు ప్రైవేటు బస్సులను కొంతమేర తగ్గించారు. 3,063 మంది వంతున తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను వినియోగించారు. గ్రామీణ ప్రాంతాలకు మాత్రం తక్కువసంఖ్యలో బస్సులు నడవటంతో అటు వెళ్లాల్సినవారు ఇబ్బందిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు పెద్దసంఖ్యలోనే నడిచినా, నగరంలో మాత్రం సిటీ బస్సులకు కొరత వచ్చింది. దీంతో ఆటోలు, క్యాబ్‌లు 3 రెట్లు చార్జీ పెంచి దోచుకున్నారు. మారిన పంథా.... : రెండు రోజులు సమ్మెను విజయవంతం చేసేందుకు యత్నించిన కార్మిక సంఘాలు సోమవారం జనం దృష్టిని ఆకర్షించేందుకు యత్నించాయి. ఆదివారం సీఎం కేసీఆర్ ఆర్టీసీ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకోవటంతో కార్మికనేతలు పంథా మార్చారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులందరినీ తొలగిస్తామని, 50% ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేస్తామన్న కీలక నిర్ణయాలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ముందుగా ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. ఆదివారమే దీన్ని ప్రకటించారు. సీఎం సమీక్ష నేపథ్యంలో పోలీసులు ఆ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో కార్మిక సంఘాల నేతలు గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అక్కడే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. వారు ఉదయం వచ్చేసరికే అక్కడ భారీగా పోలీసులను మోహరించి వచ్చినవారిని వచ్చినట్టుగా అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్లకు తరలించారు. నివాళులు కూడా అర్పించనీయకపోవటంతో కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదుపులోకి తీసుకున్నవారిని మధ్యాహ్నం వదిలిపెట్టారు. అనంతరం వారు భేటీ అయి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. గన్‌పార్క్ వద్ద జేఏసీ నేత అశ్వత్థామరెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు కార్మికుల భయాందోళన మరోవైపు సీఎం నిర్ణయంతో కార్మికులు కలవర పడ్డారు. ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనతో వారు కార్మిక నేతలకు ఫోన్లు చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో న్యాయ సలహా తీసుకుందామని, అన్ని వేలమంది ఉద్యోగాలు తొలగించటం సాధ్యం కాదని, దానికీ ఓ విధానం ఉంటుందని, ప్రభుత్వం దాన్ని అనుసరించకుండా పత్రికాప్రకటనగా వెల్లడించటం చెల్లదంటూ వారు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అంతిమంగా కార్మికులదే విజయమని భరోసా ఇచ్చారు. వీరికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.ఆర్టీసీ పరిరక్షణ పోరాటాన్ని కాస్త ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంగా మారుస్తున్నట్టు నేతలు వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 672 బస్సులకుగాను 515 బస్సు లు నడిపించారు. అన్ని ప్రాంతాల్లో ఆదాయం దారుణంగా పడిపోయింది. ఒకరోజు రూ.50 లక్షలకు బదులు రూ.20 లక్షలు కూడా ఈ రీజియన్‌లో రాలేదు. ఇది అన్ని జిల్లాల్లో ఏర్పడ్డ సమస్య. ప్రైవేటు సిబ్బంది వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని ఆర్టీసీకి జమ చేయటం లేదు. కొంతే కడుతున్నారు. టికెట్ల అమ్మకం లేనందున లెక్కలు తెలియటం లేదు. వారు ఎంత ఇస్తే ఆర్టీసీ సిబ్బంది అంత తీసుకోవాల్సి వస్తోంది. అల్లాదుర్గం మండ లం ముస్లాపూర్ శివారులో ఓ బస్సు అద్దాలను ఆగంతకులు ధ్వంసం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 440 బస్సులు తిరిగాయి. టికెట్ ధరలను రెట్టింపు చేయటంతో ప్రైవేటు కండక్టర్లతో ప్రయాణికుల వాగ్వాదం కనిపించింది. ►ఖమ్మం జిల్లాలో... ఖమ్మం జిల్లా పరిధిలోని డిపోల నుంచి బయటకు వచ్చిన బస్సులను కార్మికులు అడ్డుకున్నారు. నాలుగు బస్సులను అడ్డుకుని టైర్ల గాలి తీయడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
‘48,533 మంది కార్మికులు ఆర్టీసీ సిబ్బందే’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక సంఘాలు అస్థిత్వాన్ని కోల్పోయాయనే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్లు అస్తిత్వం కోల్పోలేదని ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీలో యూనియన్లు ఇప్పుడు పుట్టినవి కావని.. ఎప్పటికీ ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల పోరాట చరిత్ర కేసీఆర్‌కు బాగా తెలుసునని అన్నారు. ఆర్టీసీ ఆస్తులను బినామీలకు అప్పగిస్తారా ‘సీఎం బెదిరింపులకు ఇక్కడెవరూ భయపడరు. సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. 20 శాతం ప్రైవేటు బస్సులను స్టేజ్ క్యారేజీలుగా మార్చితే ఎవరు నడుపుతారు. ఆర్టీసీ ఆస్తులన్నీ మీ బినామీలకు అప్పగిస్తారా. ఇక మీ దోపిడీ చెల్లదు. కార్మికులంతా అప్రమత్తంగా ఉండాలి. సూపర్ వైజర్లకు ఆర్టీసీ జేఏసీ అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలపై పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ప్రజలంతా మీతో అమీ-తుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 48,533 మంది కార్మికులు ఎప్పటికీ ఆర్టీసీ సిబ్బందే’అన్నారు. -
ఖమ్మంలో ఉద్రిక్తత..అడ్డుకున్న పోలీసులు
-
ఆర్టీసీ సమ్మె: ఖమ్మంలో ఉద్రిక్తత
సాక్షి, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఖమ్మం రీజియన్ డిపో ఆర్టీసీ కార్మికులు.. మేయర్ కారును అడ్డుకొని.. ఆందోళనకు దిగారు. మేయర్ కారు ముందుకుపోకుండా కార్మికులు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో మేయర్ కారు...ఆర్టీసీ కార్మిక నేత పాదంపైనుంచి వెళ్లడం.. కార్మికులకు ఆగ్రహం తెప్పించిందీ. దీంతో కారుకు అడ్డంగా ఆందోళనకు దిగిన కార్మికులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తప్పించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. మహమూబ్ నగర్లో ప్రశాంతంగా సమ్మె ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడవ రోజు ప్రశాంతంగా కొనసాగుతుంది. మొదటి రోజు 9 డిపోల పరిధిలోని 880 బస్సులను పోలీసుల పహారా మధ్య నడిపించారు. ఆర్టీసీ బస్టాండ్, డిపోల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. -
గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత
-
ఆర్టీసీ సమ్మె: అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : గన్ పార్క్ వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ అరెస్టులపై ఆర్టీసీ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు వస్తే అడ్డుకొని అరెస్ట్ చేయడం దారుణమని, తమను అక్రమంగా అరెస్ట్ చేశారని అశ్వత్థామరెడ్డి తెలిపారు. అరెస్టయిన జేఏసీ నేతలను వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని మహంకాళి పీఎస్‌కు తరలించగా.. జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని సైఫాబాద్ పోలీసు సేష్టన్‌కు తరలించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద నివాళులర్పించేందుకు ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గన్ పార్క్ వద్దకు తరలివస్తున్నఆర్టీసీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. గన్ పార్క్ వద్ద ధర్నా, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం తాము గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివారులర్పించడానికి వచ్చామని, దీనికి అరెస్టు చేయడమేమిటని మండిపడుతున్నారు. మరికాసేపట్లో గన్ పార్క్ వద్దకు ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మిక సంఘాల నేతలు వచ్చే అవకాశముండటంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరాహార దీక్ష చేపట్టాలనుకున్న ఆర్టీసీ జేఏసీ నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తలపెట్టిన ఆర్టీసీ జేఏసీ నిరాహార దీక్షను వాయిదా వేశారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆర్టీసీ జేఏసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు సీఎం కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన మొదలైంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిపో అధికారులు తాత్కాలిక నియామకాలు చేపడుతున్నారు. టీఎస్ ఆర్టీసీలో కొత్త నియామకాల నేపథ్యంలో డ్రైవర్, కండక్టర్ అభ్యర్థులు డిపోల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. -
ఆర్టీసీ సమ్మె: జేఏసీ నేతల కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరాహార దీక్ష చేపట్టాలనుకున్న ఆర్టీసీ జేఏసీ నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తలపెట్టిన ఆర్టీసీ జేఏసీ నిరాహార దీక్షను వాయిదా వేశారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆర్టీసీ జేఏసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. భవిష్యత్తు కార్యచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు సీఎం కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన మొదలైంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిపో అధికారులు తాత్కాలిక నియామకాలు చేపడుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపేది లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. పండగ సమయంలో సమ్మెకు దిగి ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన తప్పిదం చేశారన్నారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లో చేరని ఉద్యోగులను తిరిగి తీసుకోబోమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. మరోవైపు ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని ఆర్టీసీ జేఏసీ స్పష్టంచేసింది. తాము కూడా న్యాయపరంగా ముందుకెళ్తామంటోంది. తాము జీతాల కోసం సమ్మె చేయడం లేదని...ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్నామని అన్నారు. -
మహబూబ్‌నగర్ రీజియన్‌లో 60 శాతం కదిలిన బస్సులు
సాక్షి, మహబూబ్‌నగర్: ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం రెండో రోజు కొనసాగింది. సమ్మెలో మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోలకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు రెండో రోజు కూడా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. పోలీసుల సహకారంతో ఆర్టీఏ, ఆర్టీసీ అధికారులు తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లతో బస్సులు నడిపించారు. ఉదయం నుంచి బస్సులు బస్టాండ్ల నుంచి కదిలాయి. సాయంత్రం 5 గంటల వరకు రీజియన్ పరిధిలో 835 బస్సులకు గాను 507 బస్సులు నడిచాయి. మహబూబ్‌నగర్ డిపోలో 131 బస్సులకు 86, నారాయణపేటలో 112 బస్సులకు 56 బస్సులు నడిచాయి. డిపోలోని మొత్తం బస్సులు 131 రెండోరోజు తిరిగినవి 86 డిపోకే పరిమితమైనవి 45 ప్రైవేట్ వాహనాలకు గిరాకీ... సమ్మెతో ప్రైవేట్ వాహనాలకు గిరాకీ పెరుగుతోంది. ఆర్టీసీ బస్టాండ్ల ఎదుట ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లారు. కాగా సమ్మెతో ప్రైవేట్ వాహనాల్లో రోజువారీ కంటే అధికంగా డబులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, జడ్చర్ల, భూత్పూర్, నారాయణపేట, కల్వకుర్తి రూట్లలో ప్రైవేట్ వాహనాలు ఎక్కువగా నడిచాయి. తగ్గిన ఆర్టీసీ ఆదాయం సాధారణ రోజుల్లో రీజియన్ పరిధిలో రోజుకు రూ.90 లక్షల నుంచి కోటి 10లక్షల వరకు ఆదాయం సమకూరేది. సమ్మె వల్ల ఆదాయం తగ్గుతోంది. రెండో రోజు రీజియన్‌లో దాదాపు 10 నుంచి 15 శాతం ఆదాయం మాత్రమే వస్తోంది. దసరా పండుగ దినాల్లో ఆర్టీసీకి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా సమ్మె నేపథ్యంలో ఆదాయం తగ్గే అవకాశం ఉంది. ఎమ్మార్పీఎస్ మద్దతు మెట్టుగడ్డ: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి. శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు యం.పాపయ్య ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర అధికార ప్రతినిధి యం. శ్రీనివాస్ తెలిపారు. పి. జంబులయ్య, కె. రమేష్, కె. నరేందర్, వెంకటయ్య, రాజు పాల్గొన్నారు. హైదరాబాద్ రూట్లో అధిక బస్సులు.. మహబూబ్‌నగర్ బస్టాండ్ నుంచి హైదరాబాద్ రూట్లో అధిక బస్సులు నడిపించారు. దసరా పండుగ దృష్ట్యా హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్కువ బస్సులను ఏర్పాటు చేశారు. తాండూర్, పరిగి, నారాయణపేట, కోయిలకొండ రూట్లో కూడా బస్సులు నడిచాయి. బస్సులకు సంబంధించి ఎలాంటి అదనపు చార్జీలు తీసుకోవద్దని ఆర్టీసీ అధికారులు ఆదేశాలు ఇచ్చినా తాత్కాలిక కండక్టర్లు కొన్ని రూట్లలో అదనంగా వసూలు చేశారు. ప్రైవేట్ పాఠశాలల బస్సులు కూడా ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేర్చాయి. ఉదయం ప్రయాణికుల తాకిడి అంతగా లేకున్నా మధ్యాహ్నం నుంచి రద్దీ పెరిగింది. దసరా పండుగ దృష్టా నేటి నుంచి ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బస్టాండ్, డిపోల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్ఎం కార్యాలయం ఎదుట నిరసన జిల్లా కేంద్రంలోని ఆర్ఎం కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే నిరసనలకు పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సైతం పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ముందుండి పోరాటం చేశారని, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ కార్యదర్శి ఎన్పీ వెంకటేశ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బెక్కరి అనితతోపాటు ఇతర నేతలు, ప్రజాసంఘాల నాయకులు ప్రసంగించారు. అంతకుముందు ఆ యా ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుంచి ర్యాలీగా వచ్చి కార్మికులకు సం ఘీభావం ప్రకటించారు. అనంతరం ప్రభుత్వం, యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఆర్ఎం కార్యాలయం ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు, కార్మికులు బ తుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ముఖాలకు న ల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన పాటలు పాడారు. సమావేశంలో కిల్లెగోపాల్ (సీపీఎం), కురుమూర్తి (సీఐటీయూ), రాంమోహన్ (ఏఐటీయూసీ). వెంకటేశ్ (ఇఫ్టూ), రాములుయాదవ్ (ఐఎన్టీయూసీ), కృష్ణయ్య (బీఎస్ఎన్ఎల్), సురేష్ (ఏఐయూఎఫ్), కేవీపీఎస్ (కురుమయ్య), గాలెన్న (బీసీడబ్ల్యూ), సాయిరెడ్డి (ఎల్ఐసీ), పద్మ( ఏఐడీడబ్లూఏ)తోపాటు ఆర్టీసీ జేఏసీ నేతలు జీఎల్‌గౌడ్, వీరాంజనేయులు, డీఎస్‌చారి, కొండన్న, కె.రవీందర్‌రెడ్డి, భానుప్రకాశ్‌రెడ్డి, విజయ్‌బాబు, కోడూర్ శ్రీను, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నో
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను విరమింపజేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినందున ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది. దీంతో హైకోర్టు ధర్మాసనం ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖ కమిషనర్, కార్మిక శాఖ కమిషనర్, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శులకు నోటీసులిచ్చింది.ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రతివాదుల్ని ఆదేశించింది. డిపోల వారీగా ఉన్న ఆర్టీసీ బస్సులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన బస్సులు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాల్ని వివరించాలని ప్రభుత్వాన్ని కోరింది. విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చట్ట విరుద్ధంగా ప్రకటించి, సమ్మెను విరమించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఆదివారం ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.ఉస్మానియా విశ్వవిద్యాలయ రీసెర్చ్ స్కాలర్, సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం లక్ష్మీనగర్ గ్రామానికి చెందిన ఆర్.సుబేందర్‌సింగ్ దాఖలు చేసిన పిల్‌ను ఆదివారం స్థానిక కుందన్‌బాగ్‌లోని న్యాయమూర్తి నివాసంలో అత్యవసర హౌస్‌మోషన్ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. హామీ ఇచ్చి 6 ఏళ్లైనా అతీగతీలేదు పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదిస్తూ.. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చట్ట విరుద్ధమని, తక్షణమే విధుల్లో చేరేలా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈవిధంగా 2015లో హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్ని తిరిగి ఇవ్వాలన్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఆదేశాలివ్వాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ ఆరేళ్లైనా అమలు చేయలేదన్నారు. కోర్టు ఉత్తర్వులిస్తే.. సమ్మె విరమించేస్తారు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని, దసరా ఉన్నందున సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఆర్టీసీ యూనియన్లకు విజ్ఞప్తి చేసినా మొండికేశాయని చెప్పారు. సమ్మె చట్ట విరుద్ధం సమ్మె చట్ట వ్యతిరేకమని, విధుల్లో చేరాలని కార్మిక శాఖ తేల్చి చెప్పిందన్నారు. ఆర్టీసీ సమ్మె చట్ట వ్యతిరే కమని చెప్పారు. పిటిషనర్ ఉద్యోగ సంఘాలకు చెం దిన వ్యక్తి అని ఆరోపించారు. సమ్మె చట్ట విరుద్ధమని కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే.. దీన్ని అడ్డుపెట్టుకుని సమ్మె విరమించే యోచనలో కార్మికులు ఉన్నారన్నారు. సమ్మె చట్ట విరుద్ధమో కాదో కార్మిక వివాదాల చట్టం కింద అధీకృత అధికారుల వద్ద తేల్చుకోవాలని, ఇప్పుడు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. -
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
నల్లగొండ :తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నల్లగొండలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఏపీలో సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని చెప్పారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు కోరుతున్నా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. విధుల్లో చేరకుంటే తొలగిస్తామంటూ హెచ్చరిస్తున్నారని, కానీ కార్మికులు తలచుకుంటే ముఖ్యమంత్రినే తొలగిస్తారని హెచ్చరించారు. -
రెండోరోజూ అదేతీరు
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె రెండో రోజు కూడా ప్రయాణికులపై ప్రభావం చూపింది. అయితే, శనివారంతో పోలిస్తే ఆదివారం కొంత మెరుగ్గా ఉన్నా, అన్ని ప్రాంతాలకు చాలినన్ని బస్సుల్లేక జనం ఇబ్బందిపడ్డారు. ప్రధాన రూట్లలో బస్సులు తిరిగినా, ఊళ్లకు మాత్రం సరిగా నడపడంలో విఫలమయ్యారు. ప్రధాన రూట్లలో వెళ్లేం దుకు ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో చాలా బస్సులు ఖాళీగానే వెళ్లాయి. ఆదివారమే సద్దుల బతుకమ్మ కావడంతో ఎక్కువమంది శనివారమే ఊళ్లకు వెళ్లారు. (చదవండి : సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు సర్కారు షాక్) ఇక చార్జీల విషయంలో నియంత్రణ లేకపోవటంతో ఇష్టం వచ్చినట్టు వసూలు చేసి ప్రయాణికుల జేబు గుల్ల చేశారు. దీనిపై ఫిర్యాదులు ఎక్కువ కావటంతో కొన్ని చోట్ల పోలీ సులు దృష్టి సారించారు. చార్జీలు ఎక్కువ వసూలు చేయొ ద్దని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసు సిబ్బంది ప్లకార్డులు ప్రదర్శించారు. ఎక్కడైనా అదనంగా వసూలు చేస్తే 100 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీ నడిపిన ప్రైవేటు వాహనాలు కాకుండా, రోడ్లపై తిరిగే సాధారణ వాహనాల్లో మాత్రం ఆదివారం మరింత రేటు పెంచి వసూళ్లకు పాల్పడ్డారు. వినూత్న నిరసనలు... సమ్మె రెండోరోజు జిల్లాల్లో పరిస్థితి కొంత మెరుగుపడింది. ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఉమ్మడి పాలమూరు రీజియన్లలో బస్సులు బాగానే నడిచాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో వీటిని నడిపించారు. నర్సంపేట నుంచి వరంగల్ రోడ్డులో తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్న బస్సు చెట్టును ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఖమ్మం జిల్లాలోని నాయుడుపేట హనుమాన్ టెంపుల్ వద్ద ఖమ్మం–సూర్యాపేట ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి రాళ్లతో దాడి చేశారు. సమ్మెలో భాగంగా ఆర్టీసీ సిబ్బంది పలుచోట్ల నిరసనలు తెలిపారు. కొన్నిచోట్ల కార్మికులు మహిళల వస్త్రధారణతో బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. మరికొన్ని చోట్ల ముఖాలకు నల్లరిబ్బన్లు కట్టుకొని వినూత్నంగా బతుకమ్మ ఆడారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్‌లో ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్‌టవర్ ఎక్కి హల్చల్ సృష్టించాడు. 11 వేల వాహనాలు తిప్పాం: ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు కలగని రీతిలో పెద్ద సంఖ్యలో బస్సులు, ఇతర వాహనాలను తిప్పినట్టు ఆర్టీసీ పేర్కొంది. సమ్మె తొలిరోజు శనివారం 9వేల వాహనాలు తిప్పగా.. ఆదివారం 11వేలకు వాటిని పెంచినట్టు వెల్లడించింది. ఇందులో 3,327 ఆర్టీసీ బస్సులు ఉండగా.. అద్దె బస్సులు 2,032 ఉన్నాయి. మొత్తం ఆర్టీసీ బస్సుల్లో ఇది 51.23 శాతం కావటం విశేషం. ఇక విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులు, వ్యాన్లు, మ్యాక్సీ క్యాబ్‌లు, ఇతర ప్రైవేటు వాహనాలు మరో 6వేలకు పైగా తిప్పినట్టు తెలిపింది. వీటికి అదనంగా మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సర్వీసులు తిప్పటంతో అవి కూడా సమ్మె ఇబ్బందులను దూరం చేసేందుకు ఉపయోగపడ్డాయని పేర్కొంది. -
సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు సర్కారు షాక్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ ఇచ్చారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సమ్మెకు దిగిన కార్మికులతో ఇకపై ఎలాంటి చర్చలూ జరపబోమని తేల్చి చెప్పారు. సమ్మెకు దిగిన కార్మికులు, ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోబోమని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన నిర్ణయాలు ప్రకటించారు. ‘‘సంవత్సరానికి రూ.1200 కోట్ల నష్టం, రూ.ఐదు వేల కోట్ల రుణభారం, క్రమం తప్పకుండా పెరుగుతున్న డీజిల్ ధరలతో పడుతున్న భారం.. ఇన్ని ఇబ్బందులతో ఆర్టీసీ ఉంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా చట్టవిరుద్ధంగా సమ్మెకు దిగి దసరా సమయంలో జనాన్ని ఇబ్బంది పెట్టినవారితో ఎలాంటి రాజీకి రాబోం. సగటున ఆర్టీసీ సిబ్బందికి నెలకు రూ.50వేల జీతం వస్తున్నా ఇంకా పెంచమని అడగడంలో అర్థంలేదు. ఈ యూనియన్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం తల వంచదు. ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లో చేరని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదు. సమ్మె చేస్తున్నవారు పోను ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం పన్నెండొందలలోపు మాత్రమే ఉన్నారు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. సగం అద్దె బస్సులు.. సగం సొంత బస్సులు.. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తీవ్ర ఆగ్రహంగా ఉన్న కేసీఆర్.. ఏకంగా సమ్మెలో ఉన్నవారిని తొలగించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించుకోనున్నట్టు పేర్కొన్నారు. తాజా సమ్మెను బ్లాక్‌మెయిలింగ్ వ్యవహారంగా అభివర్ణించిన ఆయన.. భవిష్యత్తులో ఆర్టీసీకి ఆ సమస్య రాకుండా చూడాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం కొన్ని కీలక నిర్ణయాలు తప్పవని, ఆ దిశలో ఆర్టీసీని సమూలంగా మార్చనున్నట్టు ప్రకటించారు. ఇక ఆర్టీసీలో సగం సొంత బస్సులు ఉంటే, మిగతా సగం ప్రైవేటు బస్సులుంటాయని వెల్లడించారు. దీనివల్ల సంస్థ పనితీరు బాగుంటుందని, బస్సులు బాగా నడుస్తాయని, రెండు మూడేళ్లలో నష్టాలు పూడ్చుకుని సంస్థ లాభాల్లోకి చేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ఆర్టీసీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నం. సంస్థ మనుగడ ఉండటమే కాదు లాభాల్లోకి వెళ్లాలి. ఇందుకు కొన్ని చర్యలు తప్పవు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు. సమ్మె చేస్తున్నవారితో చర్చించం. భవిష్యత్‌లో కూడా సంస్థలో ఎప్పటికీ క్రమశిక్షణ రాహిత్యం, బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం, తలనొప్పి కలిగించే చర్యలు లేకుండా చేయాలని భావిస్తున్నం. గత నలభై సంవత్సరాలుగా ఆర్టీసీ చుట్టూ అల్లుకున్న వ్యవహారం నిరంతర సమస్యగా పరిణమించింది. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అనేక రంగాల్లో ముందుకు దూసుకుపోతోంది. ఈ తరుణంలో ఆర్టీసీ సమ్మెల్లాంటివి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేలా మారాయి. తాజా సమ్మె చట్టవ్యతిరేకం, బాధ్యతారాహిత్యం. మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఆర్టీసీ లేనే లేదు. బిహార్, ఒడిశా, జమ్మూ, కశ్మీర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో నామమాత్రంగా ఉంది. అలా చూస్తే కర్ణాటక తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా బస్సులు నడుస్తున్నాయి. ప్రభుత్వం ఆర్టీసీని ఇంత మంచిగా చూసుకుంటుంటే వారు సమ్మెకు దిగడం అవసరమా?’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సమతౌల్యం పాటించాలని అభిప్రాయపడ్డారు. ఒకపక్క ప్రైవేటు భాగస్వామ్యం, మరోపక్క ఆర్టీసీ యాజమాన్యం ఉంటే మంచిదని పేర్కొన్నారు. సమ్మె విషయంలో జనం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, సోషల్ మీడియాలో వారి స్పందనే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. సమ్మె వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించినందున వారిని ఎట్టి పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకోబోమన్నారు. గడపదాటితే బయటికే.. మళ్లీ గడపలోకి వచ్చే సమస్యే లేదని కుండబద్దలు కొట్టారు. త్వరలో కొత్త నియామకాలు... సమ్మెలో ఉన్నవారిని తిరిగి తీసుకునే వీలు లేనందున త్వరలోనే వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరబోమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. వారి నియామకం షరతులతో కూడుకుని ఉంటుందని, ప్రొబేషన్ పిరియడ్ కూడా అమలవుతుందని పేర్కొన్నారు. ఏయే కేటగిరీకి చెందిన సిబ్బంది సమ్మెలో ఉన్నారో వారి స్థానాలను ఖాళీలుగా భావించి భర్తీ ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. విలీనంపై వారికి మాట్లాడే హక్కు లేదు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంలో అఖిలపక్ష సమావేశం జరపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, ఆయా పార్టీలకు ఆర్టీసీపై మాట్లాడే హక్కే లేదని సీఎం వ్యాఖ్యానించారు. సీపీఎం అధికారంలో ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్, కేరళల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని ప్రశ్నించారు. బీజేపీ ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా, అక్కడ ఎందుకు చేయలేదని అడిగారు. మరి కాంగ్రెస్ ఏం చేసిందని నిలదీశారు. అందుకే వాళ్లకు విలీనంపై అడిగే హక్కు లేదని అంటున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందరి కళ్ళూ తెరిపించాలని పేర్కొన్నారు. సమ్మె నేపథ్యంలో తక్షణ చర్యగా 2,500 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుని నడపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుబాటులో ఉన్న 4,114 ప్రైవేటు బస్సులను పర్మిట్లతో స్టేజ్ క్యారియర్లుగా మారిస్తే అవి కూడా ఆర్టీసీ పరిధిలోకి వస్తాయన్నారు. ఈ విషయంలో బస్సుల నిర్వాహకులతో ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. ‘‘రాష్ట్రంలో 1,22,58,433 వివిధ రకాల ప్రైవేట్ వాహనాలున్నాయి. ఇవన్నీ ప్రజల రవాణాకు ఉపయోగపడేవే. ఆర్టీసీలో ఉన్న యాజమాన్య నైపుణ్యాన్ని చక్కగా వాడుకోవాలి. ఆర్టీసీ సరుకు రవాణా ద్వారా కూడా లాభాలు రాబట్టాలి. ఈ పోటీ ప్రపంచంలో వినూత్నంగా ఆలోచించి సంస్థను లాభాల్లోకి తీసుకురావాలి. అనేక రంగాలలో ముందున్న తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీలో కూడా ముందుండాలి. తెలంగాణ గొప్ప రాష్ట్రంగా తయారుకావడమే నాకు అన్నింటికంటే అధిక ప్రాధాన్యమైన అంశం. ఒక అద్భుతమైన, గొప్పదైన, సమర్ధమైన లాభాల బాటలో నడిచే సంస్థగా ఆర్టీసీ రూపుదిద్దుకోవాలి. హైదరాబాద్ నగరానికి చెందినంత వరకు నష్టాలను ప్రభుత్వం భరిస్తుంది’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పక్షం రోజుల్లో పూర్వస్థితికి.. సమ్మె నేపథ్యంలో పరిస్థితి అతలాకుతలంగా ఉన్న నేపథ్యంలో కేవలం 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి నివేదిక సమర్పించడానికి రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో రవాణాశాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగనాయక్ ఉన్నారు. సోమవారంనాటికి ఈ కమిటీ నివేదిక అందించాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, రవాణాశాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, అడిషనల్ డీజీపీ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రెండోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌తోపాటు రవాణా, పోలీసు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మెపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించనున్నారు. విధుల్లో చేరే విషయమై ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ శనివారం సాయంత్రంతో ముగిసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు ఆదివారం కొనసాగుతోంది. సమ్మె విషయంలో ఇటు ప్రభుత్వం అటు కార్మికసంఘాలు పట్టువిడవడం లేదు. సమ్మె ఎన్నిరోజులు కొనసాగినా కార్మికులతో చర్చలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా.. మరోవైపు సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని కార్మికులు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ ముగిసినా కార్మికులంతా సమ్మె కొనసాగిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు. -
రెండోరోజుకు చేరిన తెలంగాణ ఆర్టీసీ సమ్మె
-
ఆర్టీసీ సమ్మె శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టాలి
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కంటే శాశ్వత పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని బీజేపీ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ సూచించారు.ఆర్టీసీ కార్మికులకు బీజేపీ పూర్తి సంఘీభావం తెలుపుతోందన్నారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తాం, ఉద్యోగాల నుండి తొలగిస్తాం అంటూ బెదిరించడం సరైంది కాదన్నారు.కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. రాష్ట్రంలో పాలనా యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిన పర్యవసానంగానే ఆర్టీసీ సమ్మె చోటుచేసుకుందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు. డిమాండ్లను పరిష్కరించి సమ్మెకు తెరదించాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తిచేశారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో వేగవంతంగా నిర్ణయాలు తీసుకున్నారని, అదేపద్ధతిలో కేసీఆర్‌కూడా విలీన చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికసంఘాల జేఏసీతో చర్చించి సమ్మె పరిష్కారం ద్వారా ప్రజలు దసరా పండగ జరుపుకునే విధంగా చొరవ తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌చేశారు. -
సమ్మె తీవ్రం.. సర్కారు ‘చక్రం’
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ సరదాగా చేసుకునేందుకు పిల్లాపాపలతో ఊళ్లకు బయలుదేరిన వారికి శనివారం ప్రయాణం నరకప్రాయమే అయింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉదయం వేళ డిపోల నుంచి ఒక్క బస్సు కూడా ప్లాట్ఫారంల పైకి రాలేదు. ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చినా ఆచరణ సాధ్యం కాలేదు. బస్సుల్లేకపోవటాన్ని ఆసరా చేసుకున్న ప్రైవేటు వాహనదారులు ధరలను మూడు, నాలుగు రెట్లు పెంచి జేబులు గుల్లచేశారు. వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్లేందుకు రూ.400 వరకు వసూలు చేశారు. 10 గంటల తర్వాత మార్పు.. ఉదయం 10 గంటల నుంచి పరిస్థితిలో కొంత మార్పు మొదలైంది. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు మెల్లగా అందుబాటులోకి వస్తుండటంతో బస్సులు డిపోల నుంచి బయటకు వచ్చాయి. మధ్యాహ్నం వరకు దాదాపు 45 శాతం బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీ బస్సులు, అద్దె బస్సులతోపాటు జీపులు, వ్యాన్లు, విద్యాసంస్థల బస్సు లు.. ఇలా అన్ని రకాల వాహనాలను అందుబాటు లోకి తేవటంతో ప్రయాణాలు సాధారణంగా సాగిపోయా యి. మహబూబ్‌నగర్, ఖమ్మం లాంటి కొన్ని ప్రాంతాల్లో ఉదయం రద్దీ ఎక్కువగా కనిపించినా, సమ్మె ప్రభావం ఉందని, బస్సుల్లేవన్న సమాచారంతో బస్టాండ్లకు జనం రాక తగ్గిపోయింది. కానీ మధ్యాహ్నం తర్వాత మళ్లీ రద్దీతో బస్సులు కదిలాయి. శనివారం నుంచి సమ్మె ఉం డటంతో పలువురు శుక్రవారమే ఊళ్లకు వెళ్లిపోయారు. ఎక్కువ మంది ఆది, సోమవా రాల్లో ఊళ్లకు వెళ్లే అవకాశముంది. ఈ రెండు రోజులు ప్రత్యామ్నాయ బస్సులు తగ్గితే తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుబాటులో 9 వేల బస్సులు ఉదయం ప్రైవేటు డ్రైవర్లకు ఆర్టీసీ, రవాణ శాఖ అధికా రులు ట్రయల్ రన్ నిర్వహించారు. వారితో ఒక్క రౌండు బస్సు నడిపించి.. వారి డ్రైవింగ్ నైపుణ్యాన్ని అంచనా వేశారు. వారిలో ఉత్తీర్ణులైన వారిని డిపోలకు పంపి, బస్సులు చేతికిచ్చారు. ఈ ప్రక్రియకు నాలుగైదు గంటల సమయం పట్టింది. ఇలా క్రమంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 9 వేల బస్సులను అధికారులు రోడ్డెక్కిం చగలిగారు. ఇందులో సాధారణ ఆర్టీసీ బస్సులు 2,129, ఆర్టీసీలోని అద్దె బస్సులు 1,717 ,ప్రైవేటు వాహనాలు 1,155, విద్యా సంస్థల బస్సులు 1,195, మ్యాక్సీ క్యాబ్ సర్వీసులు 2,778 అందుబాటులోకి తెచ్చారు. ఆదివారం నాటికి ఈ సంఖ్యను మరింత పెంచుతామని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ వెల్లడించారు. ఆదుకున్న ఏపీ బస్సులు శనివారం పెద్ద సంఖ్యలో ఏపీ బస్సులు ఇమ్లీబన్, దిల్సుఖ్నగర్ బస్టాండ్ల నుంచి సేవలందించాయి. దాదాపు 2 వేల మేర బస్సులు అదనంగా వచ్చాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారికి కొంత ఊరట లభించింది. మరో ఐదారు రోజుల పాటు ఏపీ బస్సులు తిరగనున్నాయి. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర అధికారులతో మన అధికారులు మాట్లాడారు. ఆదివారం మరో 2 వేల బస్సులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డిపోల్లో పరిస్థితిని పర్యవేక్షించేందుకు డిపో మేనేజర్లకుతోడు లేకుండా పోయింది. ఆదివారం వరకు రిటైర్డ్ అధికారులను అందుబాటులోకి తేనున్నారు. కాగా, ప్రైవేటు కండక్టర్లతో తిప్పిన బస్సుల్లో టికెట్ల జారీ కనిపించలేదు. కొన్ని బస్సుల్లో సాధారణ టికెట్ ధర వసూలు చేయగా, మరిన్ని బస్సుల్లో అదనపు మొత్తం వసూలు చేశారు. తమకు టికెట్ ట్రేలనే ఇవ్వలేదని కండక్లర్లు చెప్పటం విశేషం. ‘డిస్మిస్’హెచ్చరిక పట్టించుకోని సిబ్బంది శనివారం సాయంత్రం 6 గంటలలోపు విధుల్లోకి రాని సిబ్బంది డిస్మిస్ అయినట్లే భావించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికను కార్మికులు, ఉద్యోగులు పట్టించుకోలేదు. సమ్మెలో ఉన్న వారిలో 165 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. వారిలో ఎక్కువ మంది అధికారుల కార్ల డ్రైవర్లు, ఆఫీసు చిరుద్యోగులే కావటం విశేషం. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 7 డిపోలకు సంబంధించి 3,067మంది కార్మికులు సమ్మెలో ఉన్నారు. యాదాద్రి జిల్లా పరిధిలో 37 ఆర్టీసీ బస్సులు, మరో 15 ప్రైవేటు బస్సులను తాత్కాలిక డ్రైవర్లుతో నడిపించారు. సూర్యాపేట జిల్లాలో 67 ఆర్టీసీ, 40 అద్దె బస్సులను, నల్లగొండలో 118 ఆర్టీసీ, 90 అద్దెబస్సులను నడిపారు. మొత్తంగా 227 ఆర్టీసీ బస్సులు, 145 అద్దెబస్సులను నడిపించారు. యాదగిరిగుట్టలో తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు తీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 8 డిపోల పరిధిలో 672 ఆర్టీసీ బస్సులకు మధ్యాహ్నం తర్వాత 449 బస్సులు రోడ్డెక్కాయి. సిద్దిపేట డిపోకు చెందిన కండక్టర్ గురుచరణ్.. ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో హోర్డింగ్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. హుస్నాబాద్‌లో రెండు ఆర్టీసీ బస్సులు, సంగారెడ్డి జిల్లాలో కందిలో మరో బస్సు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మహబూబాబాద్ డిపోలో 74 బస్సులకు 38 బస్సులు, తొర్రూరులో 88 బస్సులకు 45 బస్సులు నడిచాయి. మహబూబాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ బానోతు లాలు పెట్రోల్ పోసు కుని ఆత్మహత్యాయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. రాజధానిలో ఇలా.. హైదరాబాద్‌లో మూడున్నర వేల సిటీ బస్సులు పరుగులు పెట్టేవి. శనివారం 780 బస్సులను మాత్రమే తిప్పగలిగారు. తాత్కాలిక పర్మిట్లతో 2 వేల వాహనాలను అందుబాటులోకి తెచ్చి దూరప్రాంతాలకు తిప్పడంతో ఇమ్లీబన్, జూబ్లీ బస్టాండ్లలో మధ్యాహ్నం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. మెట్రో రైళ్ల సంఖ్య పెంచాలని మెట్రో కార్పొరేషన్‌ను కోరటంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. మెట్రో రైళ్లలో రోజువారీ 3 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా, శనివారం 4 లక్షలు దాటింది. ఎంఎంటీఎస్ సర్వీసులూ పెంచారు. పరిగిలో వికారాబాద్ వైపు వెళ్తున్న బస్సు అద్దాలను ఆగంతకులు ధ్వంసం చేశారు. అనుభవం లేని డ్రైవర్లు కావటంతో కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పలేదు. బస్ పాసులు చెల్లుతాయి.. బస్ పాసులను ప్రైవేటు డ్రైవర్లు నడిపే ఆర్టీసీ బస్సుల్లో అంగీకరించట్లేదని, టికెట్ డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. కానీ బస్ పాసులపై ఎలాంటి నిషేధం విధించలేదని, యథావిధిగా బస్‌పాసులు చెల్లుతాయని స్పష్టం చేశారు. సమ్మె విరమించే ప్రసక్తే లేదు సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్లు నెరవేరేవరకూ సమ్మెను విరమించేది లేదని ఆర్టీíసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు అశ్వత్ధామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె తొలిరోజు సంపూర్ణ విజయవంతమైందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. కనీసం ఒక్క శాతం మంది కూడా విధుల్లోకి వెళ్లలేదని జేఏసీ నేత రాజిరెడ్డి పేర్కొన్నారు. సమ్మెకు పలు వర్గాల మద్దతు కూడగట్టేందుకు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలను కలసి ఆదివారం లేఖలు అందజేయాలని జేఏసీ నిర్ణయించింది. మధ్యాహ్నం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో కార్మిక సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట బతుకమ్మ ఆడాలని నిర్ణయించారు. సోమవారం ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం వద్ద, జిల్లాల్లో అమరవీరుల స్థూపాలు, గాంధీ విగ్రహాల వద్ద నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు జేఏసీ కన్వీనర్ హనుమంతు తెలిపారు. విలీనంతో కార్మికులకు ఉద్యోగ భద్రత ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే ఎజెండాగా ఆర్టీసీ కార్మికులు ఉద్యమబాట పట్టారు. ఈ మేరకు తమకు కచ్చితమైన హామీ ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు పట్టుబట్టారు. అది కుదరకపోవడంతో సమ్మెబాట పట్టారు. అయితే ఇంతలా కార్మికులకు పట్టెందుకంటే.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం జరిగితే మొదటగా కార్మికులందరికీ ఉద్యోగ భద్రత లభిస్తుంది. -
ఆర్టీసీ సమ్మె: సాయంత్రం 6 లోగా చేరాలి.. లేకపోతే అంతే!
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో తెలంగాణ ప్రభుత్వం కఠినమైన వైఖరిని అవలంబిస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటల్లోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని, ఒకవేళ వారు విధులకు హాజరుకాకపోతే.. వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబోమని మరోసారీ టీఎస్ సర్కారు తేల్చిచెప్పింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. విధుల్లో చేరని కార్మికులను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించబోదని ఆయన తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగనిరీతిలో శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ముఖ్యంగా మూడు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలీస్తున్నదని పువ్వాడ చెప్పారు. మూడు నుంచి నాలుగు వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడపడం, ఆర్టీసీ బస్సులు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సు కలిగిన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఉద్యోగావకాశం కల్పించడం.. వారికి తక్షణం తగు శిక్షణ ఇచ్చి, బస్సులను యధావిధిగా నడపడం తదితర చర్యలను తీసుకోనున్నట్టు ఆయన వివరించారు. సమ్మెను ఎదుర్కోవడంలో భాగంగా ఆరు నుంచి ఏడు వేల ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. శనివారం సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితిని ప్రభుత్వం గమనిస్తోందని, ఆదివారం ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి సమీక్షను ప్రభుత్వం నిర్వహించి.. ఆర్టీసీకి సంబంధించి ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తుందని ఆయన వెల్లడించారు. సమ్మెపై సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. -
ఆర్టీసీ సమ్మె అప్డేట్స్: ముగిసిన డెడ్‌లైన్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల మినహా మొదటిరోజు ప్రశాంతంగా జరిగింది. డిపోల్లో బస్సులు అన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్ డిపోలతోపాటు బస్ స్టేషన్లను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పలు చోట్ల ఆర్టీసీ కార్మికులు బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో కొన్ని మార్గాలలో పోలీసుల భద్రత నడుమ అద్దె బస్సులతో పాటు ప్రయివేట్ వాహనాలు నడిచాయి. ప్రయివేట్ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ తీవ్ర హెచ్చరిక చేసినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన లైవ్ అప్డేట్స్.. ముగిసిన డెడ్‌లైన్.. పట్టించుకోని కార్మికులు తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసింది. శనివారం సాయంత్రం 6 గంటల్లోపు విధులకు రానివారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం 160 మంది మాత్రమే విధులకు హాజరైనట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో సాయంత్రం 6 గంటల వరకు ఒక్క ఉద్యోగి కూడా విధులకు హాజరు కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో రేపు ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు కనబడుతోంది. మరోసారి ప్రభుత్వ హెచ్చరిక శనివారం సాయంత్రం 6 గంటల్లోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని, ఒకవేళ వారు విధులకు హాజరుకాకపోతే.. వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబోమని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. విధుల్లో చేరని కార్మికులను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించబోదని ఆయన తెలిపారు. అయితే ఎంత మందిని తొలగిస్తారో చూస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. తమ డిమాండ్లను ఆమోదించే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని స్పష్టం చేవారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో, బస్టాండ్ల వద్ద 144 సెక్షన్ విధించారు. అయితే డిపో, బస్టాండ్ల వద్ద నిరసనలు, బస్సులను అడ్డుకున్న పలువురు ఆర్టీసీ నేతలు, కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అరెస్టులకు నిరసనగా ఆర్టీసీ నేతలు ధర్నాలు చేపట్టారు. మహబూబ్‌నగర్: ఇప్పటివరకు అరెస్టులు చేసిన ఆర్టీసీ కార్మికులను విడుదల చేయాలంటూ మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కార్మికులు ధర్నా చేపట్టారు. సమ్మెను అణచివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో ‘మెట్రో’కు ప్రయాణికుల తాకిడి అధికమయింది. శనివారం ఉదయం నుంచి బస్సులు లేకపోవడంతో జనాలు ప్రత్నామ్నాయంగా మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సందర్భంగా మెట్రో రైలు సర్వీసులు అర్థరాత్రి 12.30 గంటల వరకూ పొడగించింది. వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం వద్ద బస్సుపై దాడి చేశారు. వికారాబాద్ బస్ డిపోకు చెందిన ఎపి 28జడ్ 3248 బస్సు పరిగి నుంచి వికారాబాద్‌కు వస్తుండగా వికారాబాద్ సమీపంలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం సమీపంలోకి రాగానే గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి రాయితో దాడి చేశారు. బస్సు ముందు వైపు అద్దం పూర్తిగా పగిలిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సు వెంబడి పోలీసుల ఎస్కార్టు వాహనం ఉన్న దుండగులు మెరుపు వేగంతో దాడి చేసి పారిపోయారు. అర్టీసీ ఉద్యోగులే దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మెహదీపట్నం: ఆర్టీసీ ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను విజయవంతం చేసే విధంగా ఈరోజు మెహదీపట్నం బస్ డిపో నుంచి ఒక బస్సు ను కూడా బయటికి వెళ్లకుండా కార్మికులు అడ్డుకున్నారు. డిపోలోని మొత్తం 160 బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్తలు పడుతున్నన్నారు. మెహదీపట్నం నుంచి నగరంలోని పలుచోట్ల కు వెళ్లే బస్సులన్నీ డిపోల్లోనే ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే మెహదీపట్నం జనాలు లేక వెలవెలబోతోంది. జూబ్లీ బస్టాండ్‌లో ఓ మహిళ తమ ప్రాంతానికి వెళ్లే బస్సు రావడంతో తన ఇద్దరి పిల్లలని బస్సు ఎక్కించడానికి తెగ హైరానాపడింది. బస్సు కిటికీలో నుంచి తన ఇద్దరి పిల్లలని లోపలికి పంపించి సీట్లలో కూర్చో బెట్టే ప్రయత్నం చేసింది. ఈ బస్సు తప్పితే మరొక బస్సు వస్తదో రాదో అని భయంతో ఆ మహిళ ఇలా రిస్క్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు నాలుగేళ్ల తరువాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో త్రిసభ్య కమిటీ జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మె వైపే మొగ్గు చూపారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో దూరప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సు డ్రైవర్లు శుక్రవారమే ఉన్న పళంగా విధుల నుంచి వైదొలిగారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే సమ్మె మొదలైనట్లయింది. దీంతో సమ్మె లేదనే శుభవార్త కోసం ఎదురు చూసిన ప్రయాణికులకు నిరాశే ఎదురైంది. ఇక శుక్రవారం అర్దరాత్రి నుంచే బస్సులు ఎక్కడికక్కడా ఆగిపోయాయి. సిటీ బస్సులు శనివారం ఉదయం నుంచే డిపోలకే పరిమితమయ్యాయి. (చదవండి: డ్యూటీలోకి రాకుంటే.. వేటేస్తాం..) శుక్రవారం అర్దరాత్రి నుంచి సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కార్మికుల అన్ని సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఆర్టీసీ ప్రయాణం అంటే ప్రజలు అపార నమ్మకంతో ప్రయాణం చేస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్ : జేబీఎస్: సమ్మె ప్రభావం లేకుండా చేయాలనుకున్న ఆర్టీసీ అధికారుల ప్రయత్నాలు సఫలం కావడం లేదు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే ప్రయివేట్ డ్రైవర్లతో ప్రత్నామ్నాయంగా బస్సులు నడిపించాలనుకున్న అధికారుల ఆలోచన ఇంకా ఆచరణలోకి రాలేదు. దీంతో ప్రయాణికులు బస్టాండ్లలో ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ రద్దీగా ఉండే జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఇప్పటి వరకు కేవలం రెండు బస్సులు మాత్రమే బయటకి వెళ్లాయి. తాత్కాలిక సిబ్బంది కోసం ఆర్టీసీ అధికారుల ఇచ్చిన నోటిపికేషన్‌తో ప్రయివేట్ డ్రైవర్లు జేబీఎస్‌కు చేరుకుంటున్నారు. ఆర్టీఏ అధికారులు వారికి ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత వారికి బస్సులు అప్పగించనున్నారు. పూర్తి సమ్మె ప్రభావం లేకుండా అధికారులు చేస్తున్న ప్రయత్నాల ఫలితం ఈ రోజు సాయంత్రం వరకు కూడా వచ్చేలా లేవు. దీంతో బస్ స్టేషన్లోనే ప్రయాణకులు వేచి చూస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రయివేట్ ట్రావెల్స్, క్యాబ్‌లు అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తున్నాయి. బర్కత్‌పుర: సమ్మె కారణంగా బర్కత్‌పుర బస్సు డిపోల్లోనే నిలిచిపోయిన సిటీ బస్సులు. కార్మికులు డిపో ముందే బైఠాయించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ పెద్ద ఎత్తును నినాదాలు చేశారు. దిల్సుఖ్నగర్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా దిల్సుఖ్ నగర్ డిపోలో 110 సిటీ బస్బులు నిలిచిపోయాయి. ప్రస్తుతం డిపో ముందు కార్మికులు ఎలాంటి ఆందోళనలు చేపట్టలేదు. అయితే డిపో ముందు భారీగా పోలీసులు మోహరించారు. ఆదిలాబాద్: ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మధ్య చర్చలు విఫలం కావడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో జిల్లా వ్తాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. అయితే ప్రత్నామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ఇప్పటివరకు ప్రయివేట్ డ్రైవర్ల సహాయంతో 18 బస్సులను ఆర్టీసీ అధికారులు నడిపించారు. పోలీసులు పూర్తి బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. వరంగల్: వరంగల్ రీజియన్ పరిధిలో తొమ్మిది డిపోలలోని 972 ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాకు చెందిన 4200 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. బస్టాండ్లు, డిపోల ముందు పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మహుబూబాబాద్ బస్టాండ్ ముందు ధర్నా నిర్వహిస్తున్న పది మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు ఆరెస్ట్ చేశారు. నారాయణ పేట: ఆర్టీసీ సమ్మె కారణంగా డిపోల్లోనే బస్సులు నిలిచిపోయాయి. అయితే ఆర్టీసీ అధికారులు ప్రయివేట్ వ్యక్తులతో పాక్షికంగా బస్బులను నడిపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోలు, బస్టాండ్ల వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నిజామాబాద్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో సమ్మె ప్రభావంతో 670 ఆర్టీసీ, 182 అద్దె బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జిల్లాకు చెందిన 3200 మంది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. డిపోలు, బస్టాండ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కార్మికులు సిద్దమవుతున్నారు. కరీంనగర్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమ్మె కారణంగా 10 డిపోలలో 909 ఆర్టీసీ, 209 అద్దె బస్సులు నిలిచిపోయాయి. 3900 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. అయితే ప్రయాణికుల రద్దీని బట్టి ప్రయివేట్, స్కూల్ బస్సులను నడిపేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ హెచ్చరికలతో కొంత మంది కార్మికులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే అలాంటి హెచ్చరికలకు భయపడేది లేదని కార్మిక సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. నాగర్ కర్నూల్: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో నాగర్ కర్నూల్ డిపోల్లోనే బస్సులు నిలిచిపోయాయి. ఉదయం నుంచే డిపోల ముందు కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తి బస్సు డిపో ముందు కార్మికులు బస్సులు కదలకుండా బైఠాయించారు. అయితే పోలీసుల సహకారంతో కొన్ని ప్రయివేట్ సర్వీసులను నడిపించాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. మహబూబ్ నగర్: ఉమ్మడి జిల్లాలోని 9 డిపోల పరిధిలో 880 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం నుంచే డిపోల ముందు కార్మికులు భైఠాయించారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. మెదక్: ఉమ్మడి జిల్లాలో డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. మెదక్ రీజియన్‌లోని 8 డిపోల్లో 672 ఆర్టీసీ, 190 అద్దె బస్సులు నిలిచిపోయాయి. పోలీసుల భారీ బందోబస్తు నడుమ అద్దె బస్సులతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. నల్లగొండ: ఉమ్మడి నల్లగొండలో సమ్మె ప్రభావం భారీగానే ఉంది. కార్మికులు విధులు బహిష్కరించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే అన్ని డిపోల ముందు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డిపో, బస్టాండ్ల ముందు కార్మికులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని పోలీసులు వారిని హెచ్చరించారు. వికారాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వికారాబాద్ ఆర్టీసీ డిపో నుంచి ప్రయివేట్ డ్రైవర్లతో బస్సులు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల భద్రత నడుమ ఇప్పుడిప్పుడే ఆర్టీసీ బస్సులు బయటికి వస్తున్నాయి. దీంతో డిపోకు ఆర్టీసీ కార్మికులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు డిపో ముందు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇక సమ్మె కారణంతో హైదరాబాద్-వికారబాద్ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో కార్మికుల నినాదాలు పోలీసుల పకడ్బందీ మధ్య సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. ఖమ్మం డివిజన్ పరిధిలో మొత్తం 449 ఆర్టీసీ, 183 ప్రయివేట్ బస్సులు సమ్మె కారణంగా డిపోలకే పరిమితమయ్యాయి. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా డిపో, బస్టాండ్ పరిధిలలో 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే తాత్కాలిక సిబ్బందిని నియమించే ప్రయతాన్ని అధికారులు చేపట్టారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు
-
ఆర్టీసీలో కొనసాగుతున్న సమ్మె
సాక్షి, హైదరాబాద్ : కార్మికులు పట్టు వీడలేదు.. ఐఏఎస్ అధికారుల కమిటీ మెట్టు దిగలేదు.. ఫలితంగా నాలుగేళ్ల తర్వాత మరోసారి ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మికులతో త్రిసభ్య కమిటీ శుక్రవారం జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో కార్మికులు సమ్మెకే సై అన్నారు. ముందే ప్రకటించినట్లే శనివారం (5వ తేదీ) ఉదయం 5 గంటల నుంచి సమ్మె ప్రారంభించారు. చర్చలు విఫలమైన వెంటనే సమ్మె మొదలైనట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులను సంఘాలు అప్రమత్తం చేశాయి. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న వారు శుక్రవారం మధ్యాహ్నం ఉన్న పళంగా విధుల నుంచి వైదొలిగారు. దూరప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసుల డ్రైవర్లు విధులు బహిష్కరించారు. దీంతో శుక్రవారమే సమ్మె మొదలైనట్లయింది. శుక్రవారం నాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొలిక్కి రాకపోవటంతో ఈ సర్వీసులు నడిపే పరిస్థితి లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాకపోతే కొన్ని ప్రాంతాలకు ఏపీ బస్సులు రావటంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. (చదవండి : ఆర్టీసీ సమ్మె : కేసీఆర్ కీలక నిర్ణయం) తుదిదశ చర్చలూ విఫలం బుధ, గురువారాల్లో జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనటంతో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన చర్చలపై అందరి దృష్టి నిలిచింది. ఇటు కార్మిక సంఘాలు బెట్టు వీడటమో, అధికారుల కమిటీ మెట్టు దిగటమో జరిగి సమ్మె తప్పుతుందని ప్రయాణికులు ఎదురు చూశారు. ఆదివారం సద్దుల బతుకమ్మ కావడంతో లక్షల మంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో జనం ఊళ్లకు వెళ్లినా, ఉద్యోగులు శనివారమే పయనమవుతున్నారు. సరిగ్గా అదే రోజు సమ్మె మొదలు కానుండటంతో శుక్రవారం టెన్షన్‌తో గడిపారు. సమ్మె లేదనే శుభవార్త కోసం ఎదురు చూశారు. కాగా, నిర్ధారిత సమయంలో హామీలు నెరవేరుస్తామంటూ లిఖిత పూర్వకంగా స్పష్టమైన హామీ ఇస్తే సమ్మె యోచన విరమణపై ఆలోచిస్తామని కార్మిక సంఘాలు గట్టిగా డిమాండ్ చేశాయి. కానీ ఆర్థిక పరమైన అంశంతో ముడిపడ్డ డిమాండ్లపై ఉన్నఫళంగా లిఖిత పూర్వక హామీ సాధ్యం కాదని, దసరా తర్వాత మళ్లీ చర్చలు ప్రారంభిద్దామని, అప్పటి వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని అధికారుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో కమిటీ తమ మాట వినదని, కార్మిక సంఘాల జేఏసీ చర్చలను బహిష్కరించి అక్కడి నుంచి నిష్కమించింది. చర్చల్ని బహిష్కరించి వెళ్లిపోతున్న జేఏసీ నేతలు.. డీఎం ఒక్కరే సమ్మెల సమయంలో డిపోల్లో మేనేజర్లకు అసిస్టెంట్ మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది సాయంగా ఉంటారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వీరిదే కీలక పాత్ర. కానీ ఈసారి కార్మికులతోపాటు సూపర్వైజరీ కేడర్ అధికారుల సంఘం కూడా సమ్మెకు సై అనటంతో వారు అందుబాటులో ఉండరు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోపాటు డిపో మొత్తం పర్యవేక్షణకు ఒక్క డిపో మేనేజర్ మాత్రమే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. ఒక్క వ్యక్తి మొత్తాన్ని పర్యవేక్షించే పరిస్థితి లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఇబ్బందిగా మారాయి. దీంతో ఆగమేఘాల మీద ఉన్నతాధికారులు రిటైర్డ్ ఆర్టీసీ అధికారుల సేవలు పొందేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. శనివారం సాయంత్రానికి వారు కొంతమంది విధుల్లో చేరే అవకాశం ఉంది. ప్రైవేటు డ్రైవర్ల చేతికి స్టీరింగ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డ్రైవర్ల గుర్తింపు బాధ్యతను గురువారమే ఐఏఎస్ అధికారుల కమిటీ రవాణ శాఖకు అప్పగించింది. స్థానిక మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు తమ వద్ద ఉన్న డ్రైవర్ల వివరాల ఆధారంగా వారికి సమాచారం అందించి పిలిపించారు. 18 నెలలు, అంత కంటే ఎక్కువ కాలం క్రితం హెవీ మోటార్ వెహికిల్ లైసెన్సు తీసుకుని ఉన్న వారిని అర్హులుగా పేర్కొన్నారు. వారి డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరిశీలించి, గతంలో యాక్సిడెంట్ కేసులు లేకుంటే వారి పేరును ఆర్టీసీ అధికారులకు సిఫారసు చేస్తున్నారు. అలా వచి్చన డ్రైవర్లు శనివారం ఉదయం 4 గంటల కల్లా డిపోలకు రావాల్సి ఉంది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని కండక్టర్లుగా తీసుకుంటున్నారు. ఈ తాత్కాలిక డ్రైవర్లకు రోజుకు రూ.1,500, కండక్టర్లకు రూ.వెయ్యి చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే వారి చేతికి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సులు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. డీలక్స్ బస్సులపై తర్జనభర్జన పడుతున్నారు. వేగంగా వెళ్లటంతోపాటు ఖరీదు కూడా ఎక్కువ ఉండే సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సులను వారి చేతికి ఇవ్వొద్దని నిర్ణయించారు. ‘ఎస్మా’ఏం చెబుతోంది.. ఎస్సెన్షియల్ సరీ్వసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ఎస్మా) 1971లోని సెక్షన్ 3(1) పరిధిలోకి ఆర్టీసీ సమ్మెలు వస్తాయి. దీని ప్రకారం ప్రస్తుతం సమ్మెను నిషేధిస్తూ గత మే 27న ప్రభుత్వం ఉత్తర్వు నెం.9 వెలువరించింది. ప్రస్తుతం అది అమల్లో ఉంది. మోటార్ ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీ ఇండ్రస్టియల్ డిస్ప్యూట్స్ (ఐడీ) యాక్ట్ ప్రకారం చర్చల ప్రొసీడింగ్స్ గడువు ముగిసే వరకు సమ్మె చేయటం చట్ట వ్యతిరేకం. ఒకవేళ సమ్మె చేస్తే క్రమశిక్షణ ఉల్లంఘనగా భావిస్తూ సమ్మె చేసిన కార్మికులపై చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటే క్లాసిఫికేషన్ కంట్రోల్ అండ్ అప్పీల్ (సీసీఏ) రెగ్యులేషన్ 9(1) ప్రకారం డిస్మిస్ చేసే అధికారం ఉంటుంది. అప్పట్లో ఏం జరిగింది.. 2015మేలో ఆర్టీసీ కార్మికులు ఇలాగే సమ్మెలోకి వెళ్లారు. వేతన సవరణ గడువు దాటినా కొత్తది ప్రకటించలేదన్న ఆగ్రహంతో మూకుమ్మడి సమ్మెకు దిగారు. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను హడావుడిగా తీసుకుని బస్సులు అప్పగించింది. దాదాపు 5 వేల బస్సులు తిప్పగలిగారు. ఆరు రోజులపాటు సమ్మె కొనసాగింది. ఏడో రోజు కార్మికులను ప్రభుత్వం చర్చలకు పిలవటం, వేతన సవరణకు అంగీకరించటంతో సమ్మె ఆగింది. -
ఆర్టీసీ సమ్మె : కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : త్రిసభ్య ఐఏఎస్ అధికారుల కమిటీతో చర్చలు విఫలమైన నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు శనివారం నుంచి సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించాయి. అయితే, ఆర్టీసీ కార్మికుల తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని నగరానికి చేరుకున్న ఆయన ఆర్టీసీ సమ్మెపై ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చించేందుకు వేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు చర్చల వివరాలను కేసీఆర్‌కు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల్లోపు ఆయా డిపోల్లో రిపోర్ట్ చేసిన కార్మికులే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబడతారని స్పష్టం చేశారు. (చదవండి : సమ్మెలో పాల్గొంటే డిస్మిస్) 6 గంటల్లోపు రిపోర్టు చెయ్యకపోతే తమంతట తామే విధులను వదిలిపెట్టి వెళ్లినట్లు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, విధుల్లో చేరని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవద్దన్నది ప్రభుత్వం విధాన నిర్ణయమని వెల్లడించారు. ఇకపై కార్మిక సంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు జరపవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. చర్చల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ రద్దు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఇదిలాఉండగా.. ట్రాన్స్ పోర్టు కమిషనర్‌గా సందీప్ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది. (చదవండి : ఆర్టీసీ కార్మికులతో మరోసారి చర్చలు విఫలం) ఈ సమీక్షా సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పార్లమెంటు సభ్యులు కె.కేశవ రావు, నామా నాగేశ్వర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండా ప్రకాశ్, రంజిత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె..జోషి, డిజిపి మహేందర్ రెడ్డి, అడిషనల్ డిజిపి జితేందర్, సీనియర్ అధికారులు సోమేశ్ కుమార్, సునిల్ శర్మ, రామకృష్ణ రావు, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. -
చర్చలు విఫలం.. ఎల్లుండినుంచి ఆర్టీసీ సమ్మె
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో ఐఏఎస్ అధికారుల కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఎల్లుండి నుంచి ఆర్టీసీ సమ్మె యథాతధంగా జరగనుందని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రజారవాణాను కాపాడటానికి కార్మికులు పోరాడాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని పట్టుబట్టింది. కాగా, అక్టోబర్ 5 నుంచి సమ్మె చేస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెను తప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ ఈ ఉదయంనుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపింది. అధికారులు ఆశించిన మేరకు స్పందించకపోవటంతో ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సై అంది. -
సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్ : సమ్మెను తప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య గురువారం జరిగిన రెండోదఫా చర్చల్లో కూడా ఎలాంటి ఫలితం రాలేదు. టీఎస్ ఆర్టీసీ జేఏసీతో త్రిసభ్య కమిటీ రెండోదఫా చర్చలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఒకవేళ కార్మికులు సమ్మెకు దిగితే.. సమ్మెను ఎదుర్కొనేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్యాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవ్వడం కార్మిక సంఘాలకు ఆగ్రహం తెప్పించింది. ఈ అంశాన్ని లేవనెత్తుతూ గురువారం చర్చల నుంచి కార్మిక సంఘాలు అర్ధంతరంగా వెళ్లిపోయాయి. ఇక, సమ్మె వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ జేఏసీకి త్రిసభ్య కమిటీ మరోసారి సూచించింది. పండుగ సందర్భంగా ఉండే రాకపోకలు, రద్దీని దృష్టిలో పెట్టుకొని సమ్మె వాయిదా వేసుకోవాలని కోరింది. అయితే, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ అమలుపై స్పష్టత ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ పట్టుబట్టింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇస్తేనే.. తమ నిర్ణయం చెబుతామని జేఏసీ నేతలు తేల్చిచెప్తున్నారు. ప్రత్యామ్యాయ ఏర్పాట్లు.. ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రతిపాదన నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేస్తోంది. కార్మికులు సమ్మె చేస్తే.. ఆ ప్రభావం బస్సుల రాకపోకలు, ప్రయాణికులపై పడకుండా రవాణా అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సోమేశ్‌కుమార్ తాజాగా దిశానిర్దేశం చేశారు. ప్రైవేటు స్కూల్ బస్సుల డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడపాలని యాజమాన్యం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకుగాను రోజుకు డ్రైవర్‌కు రూ. 1500, కండక్టర్‌కు రూ. వెయ్యి వేతనంగా ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. -
ఆర్టీసీని కాపాడుదాం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులతో చర్చించి, వారి డిమాండ్లు తెలుసుకునేందుకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీని నియమించింది. ఆర్టీసీ కార్మికులతో బుధవారం ఈ బృందం సమావేశమై చర్చించాలని, వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని, అందుకు అనుగుణంగా ఆర్టీసీ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సుదీర్ఘంగా కేబినెట్ భేటీ జరిగింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన కేబినెట్ సమావేశం రాత్రి 11:20 గంటలకు ముగిసింది. ఏకబిగిన ఏడున్నర గంటలపాటు ఈ భేటీ జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిస్థితులతో పాటు రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ చర్చించింది. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి సీనియర్ ఐఏఎస్ అధికారులు సోమేశ్ కుమార్, రామకృష్ణారావు, సునీల్‌శర్మలతో కమిటీని నియమించింది. కార్మికులు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో వారి డిమాండ్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరింది. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున సమ్మె యోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ సమయంలో సమ్మెకు పోయి సంస్థను నష్టపరచొద్దని సూచించింది. ప్రజలంతా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ఈ సందర్భంలో సమ్మెకు వెళ్లి ప్రజలను ఇబ్బందులకు గురిచేయొవద్దని కార్మికులను కోరింది. డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకొనే అవకాశం ఉందని, ప్రభుత్వం కూడా సంస్థను కాపాడాలనే కృతనిశ్చయంతోఉందని కేబినెట్ స్పష్టం చేసింది. ఉప సంఘాల ఏర్పాటు.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు చేసేందుకు శాశ్వత ప్రాతిపది కన మంత్రివర్గ ఉపసంఘాలను నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఉప సంఘాలు ఆయా శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, ప్రభుత్వానికి సూచనలు చేయనున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల పకడ్బందీ అమలు, పర్యవేక్షణ కోసం వివిధ శాఖలకు సంబంధించి 8 ఉప సంఘాలు ఏర్పాటు చేసింది. సంబంధిత శాఖల మంత్రులు చైర్మన్లుగా ఉండే ఈ కమిటీల్లో కొందరు సభ్యులను నియమించింది. వ్యవసాయ రంగంపై చర్చ రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయరంగ పరిస్థితిని కేబినెట్ సమావేశం విస్తృతంగా చర్చించింది. వర్షా కాలంలో పండిన అన్ని రకాల పంటలను ప్రభుత్వపరంగా కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల సంస్థతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు సన్నద్ధం కావాలని కోరింది. వేసవి కాలం పంటకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను ముందుగానే సమీకరించుకోవాలని, ఇందుకు అవసరమైన విధానం రూపొందించుకోవాలని అధికారులకు సూచించింది. 10న మంత్రులు, కలెక్టర్ల సమావేశం.. గ్రామాల్లో ప్రస్తుతం అమలవుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై చర్చించేందుకు ఈ నెల 10న సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రులు, కలెక్టర్లతో హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయం జరిగింది. ఈ సమావేశానికి డీపీవోలు, డీఎల్పీవోలను కూడా ఆహ్వానించారు. సమావేశంలో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యాన్ని పెంపొందించేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. దీంతోపాటు రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విధానం, పౌల్ట్రీ పాలసీ రూపొందించాలని కేబినెట్ నిర్ణయించింది. -
విలీనం చేసే వరకు సమ్మె
కవాడిగూడ: ప్రభుత్వంలో ఆరీ్టసీని విలీనం చేసే వరకు టీఎస్‌ఆరీ్టసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ ఆశ్వద్థామరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంస్థ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం ఆశ్వద్థామరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వల్లే ఆర్టీసీ నష్టాల్లోకి వచ్చిందని తెలిపారు. బస్ రాయితీల రూపంలో ఆరీ్టసీకి ప్రభుత్వం రూ.కోట్లల్లో బకాయి పడిందని, తక్షణమే వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతన సవరణ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 5 నుంచి జరిగే ఆర్టీసీ సమ్మెకు ప్రతి కారి్మకుడు మానసికంగా సిద్ధం కావాలని పేర్కొన్నారు. యూనియన్లకు అతీతంగా హక్కుల కోసం కారి్మకులు ఏకం కావాలన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కారి్మకులకు ప్రజాసంఘాలు, రాజకీయ పారీ్టలు, యూని యన్లు మద్దతు తెలిపాలని కోరారు. సకల జనుల సమ్మె సమయంలో రావాల్సిన జీత భత్యాల సవరణ చేయాలని అన్నారు. -
పండక్కి బండెక్కలేమా?
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సై అన్నారు. వచ్చే నెల ఐదో తేదీ నుంచి సమ్మె సైరన్ మోగనుంది. ఈ మేరకు కార్మిక సంఘాలు నిర్ణయిం చాయి. ఆరోజు ఉదయం 5గంటల నుంచే బస్సులను నిలిపి వేయనున్నట్టు ప్రకటించాయి. 4న కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలతో రాజీ చర్చలున్న విషయం తెలిసిందే. సమావేశ ఫలితం సానుకూలంగా లేని పక్షంలో సమ్మెకు వెళ్లే తేదీని ప్రకటించాలి. సమావేశం జరిగిన వారం తర్వాత సమ్మె చేసేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. కానీ, ఈసారి ప్రభుత్వంపై ఒత్తిడిని ఒక్కసారిగా పెంచే ఉద్దేశంతో సరిగ్గా దసరా ప్రయాణాలు ఉధృతంగా ఉన్న సమయంలో సమ్మెకు దిగాలని సంఘాలు నిర్ణయించాయి. రాజీ చర్చలతో ప్రమే యం లేకుండా, ఆ సమావేశానికి ముందు గానే సమ్మె తేదీని ప్రకటించటం విశేషం. సమ్మె నోటీస్ గడువు ముగిసినా.. కార్మిక సంఘాలు 20 రోజుల క్రితమే ఒకదాని తర్వాత ఒకటి చొప్పున ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చాయి. సమ్మె నోటీసు గడువు 14 రోజులు ముగిసినా ప్రభుత్వం స్పందించకపోవటం, కార్మిక శాఖ గత సోమవారం నిర్వహించాల్సిన రాజీ చర్చలను వాయిదా వేసి తదుపరి తేదీ ప్రకటించకపోవటంతో కార్మిక సంఘాలు అప్రమత్తమయ్యాయి. 3 రోజుల్లో రాజీ చర్చల తేదీని ప్రక టించకుంటే సమ్మెకు సిద్ధమవుతామంటూ కార్మిక శాఖకు లేఖ రాసినట్టుగా గుర్తింపు కార్మికసంఘం ప్రతినిధి థామస్‌రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో సద్దుల బతుకమ్మకు రెండురోజుల ముందు రాజీ చర్చలుంటాయని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ప్రకటించారు. అంటే, దసరా కోసం జనం సొంతూళ్లకు దాదాపు చేరుకుంటారు. సమావేశం ముగిసిన తర్వాత వారం వరకు సమ్మె చేసే వెసులుబాటులేదని నిబంధనలు చెబుతున్నందున, ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి తమ స్థానాలకు చేరుకుంటారు. దసరా ప్రయాణాల సమయంలో బస్సులు నిలిపేస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రభుత్వం కచ్చితంగా స్పందిస్తుందన్న ఉద్దేశంతో కార్మిక సంఘాలు దసరా సెలవులకు జనం ఊళ్లకు వెళ్లే రోజైన 5న సమ్మెకు సై అన్నాయి. సమ్మెకు ఏర్పాట్లు ఆదివారం చర్చించుకున్న రెండు జేఏసీలు ఈమేరకు తీర్మానించి సమ్మె తేదీని ప్రకటించాయి. గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ఉన్న జేఏసీ, ముందుగా సమ్మె నోటీసు ఇచ్చిన టీజేఎంయూ ఉన్న జేఏసీ–1లు ఆదివారం సాయంత్రం సమ్మె తేదీని వెల్లడించాయి. గుర్తింపు సంఘం సమ్మెకు దిగాలని, దానికి మద్దతు ఇస్తామని ఒత్తిడి చేసిన ఎన్ఎంయూ కూడా మద్దతు ప్రకటించింది. దీంతో అన్ని సంఘాలు సమ్మె ఏర్పాట్లు ప్రారంభించాయి. మరోవైపు గుర్తింపు కార్మిక సంఘంతో కూడిన జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నాచౌక్ వద్ద సామూహిక నిరాహార దీక్షలు, బహిరంగ సభ నిర్వహించబోతోంది. ప్రభుత్వమే కారణం ‘ఆర్టీసీలో సమ్మె రావటానికి ప్రభుత్వ తీరే కారణం. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. సంస్థను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, మా సమస్యలు పరిష్కరించటం లేదు. తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకు వెళ్లాల్సివస్తోంది. ప్రయాణికుల ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’అని జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి అన్నారు. ‘న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ సమ్మెకు కారణమవుతోంది. సంస్థ నష్టాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నా ప్రభుత్వం స్పందించడంలేదు. మా నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి’అని జేఏసీ–1 కన్వీనర్ హనుమంతు తెలిపారు. ‘ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఆర్టీసీని గాలికొదిలేసి దివాలా తీసే పరిస్థితికి కారణమైంది. దాన్ని పరిరక్షించుకునేందుకే మేం సమ్మె చేస్తున్నాం. జేఏసీకి మా సంపూర్ణ మద్దతు ఇస్తున్నం’అని ఎన్ఎంయూ నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. విచ్చిన్నం చేసే కుట్ర చేస్తే సహించేది లేదు సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ‘ఆర్టీసీలో దాదాపు అన్ని సంఘాలు నోటిసులు ఇచ్చినా స్పందించకపోవటం వల్లే సమ్మెకు పూనుకున్నాం. మొత్తం 51 వేల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారు. దసరా పండుగ ఉన్నప్పటికి సమ్మె చేస్తున్నందున ప్రజలు అర్థం చేసుకొని మాకు మద్దతు తెలుపాలి. సమ్మె విచ్ఛిన్నానికి కుట్ర చేస్తే సహించేది లేదు. ఆర్టీసి అధికారులు సైతం సమ్మెకు సంఘీభావం తెలపాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 5 నుంచి నిరవధిక సమ్మెను చేస్తున్నాం’అని టీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఆదివారం బస్ బవన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ కన్వీనర్ ఇ.అశ్వత్థామరెడ్డి, కో–కన్వీనర్లు కె.రాజిరెడ్డి, వి.ఎస్.రావులు మాట్లాడుతూ కార్మిక సంఘాలతో మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయకపోవటం బాధాకరం అన్నారు. కార్యక్రమంలో కో–కన్వీనర్ శ్రీధర్, టీఎంయూ అధ్యక్షుడు థామస్ రెడ్డి, నేతలు రవీందర్‌రెడ్డి, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె విరమించారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రితో జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. సీఎంతో చర్చల అనంతరం జేఏసీ నేతలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ...‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం మా భుజం తట్టారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని తొలి కేబినెట్లో అమలు చేయడం సంతోషం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో ముఖ్యమంత్రి నిర్ణయం వెలుగులు నింపింది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆర్టీసీ ఉద్యోగులు జీవితాంతం రుణపడి ఉంటారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేయడం వల్ల 55వేలమంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఆర్టీసీ రూ.7కోట్లు అప్పుల్లో ఉంది. మా డిమాండ్లను ముఖ్యమంత్రి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు’ అని అన్నారు. కాగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ)ను తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర సర్కారు త్వరలో అధ్యయన కమిటీని నియమించనుంది. గతంలో ఆర్టీసీ ఎండీగా, డీజీపీగా పనిచేసి, పదవీ విరమణ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కమిటీలో కార్మిక సంఘాల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీ నియామకంపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. రెండు నెలల్లో ఈ అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్టీసీ విలీనానికి విధివిధానాలు ఖరారు చేస్తారు. -
ముగిసిన చర్చలు.. సీఎంను కలిసిన అనంతరం ప్రకటన
సాక్షి, అమరావతి : ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుతో జేఏసీ నేతలు మంగళవారం జరిపిన చర్చలు ముగిశాయి. ఈ చర్చలు ఫలప్రదంగా సాగినట్టు తెలుస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మొదటి కేబినెట్ సమావేశంలో ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. సానుకూల వాతావరణం లోనే చర్చలు జరిగాయని, మొత్తం 26 అంశాలపై ఎంవోయూ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పీ. దామోదరరావు తెలిపారు. ఆర్థికపరమైన అంశాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తాము చేసిన 27 డిమాండ్లలో 26 డిమాండ్లకు ఆర్టీసీ యాజమాన్యం సానుకూల స్పందించిందని, ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకునే డిమాండ్ ఒక్కటే మిగిలి ఉందని తెలిపారు. ఈ రోజు తప్పనిసరిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలుస్తామని, ఆయనను కలిసిన అనంతరం సమ్మెపై ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు. ఆర్టీసీ హౌస్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు జేఏసీ నాయకులు ఎండీని కలిసి.. చర్చలు కొనసాగించారు. నిన్న అర్థరాత్రి వరకూ ఎండీ సురేంద్రబాబుతో జరిగిన చర్చలు సమస్యల పరిష్కార దిశగా సాగిన సంగతి తెలిసందే. 90శాతం వరకూ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా ఉందని జేఏసీ నాయకులు తెలిపారు. -
సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు
సాక్షి, విజయవాడ : ఆంధ్రపదేశ్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలు ఎండీ సురేంద్రబాబుకు సమ్మె నోటీసులు అందించారు. గురువారం ఈయూ కార్యాలయంలో సమావేశమై న ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెపై చర్చించారు. ఇప్పటికే 46 డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ మరో 30 డిమాండ్లను కొత్తగా చేర్చి ఎండీ సురేంద్రబాబుకు అందజేశారు. అనంతరం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో, యూనిట్లలో సమ్మె సన్నాహక ధర్నాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 17, 18 తేదిలలో అన్ని స్థాయిల ఉద్యోగులు డిమాండ్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. 22న 13 జిల్లాలలో ఉన్న ఆర్ఎమ్ కార్యాలయాలవద్ద జేఏసీ ఆధ్యర్యంలో మహాధర్నా చేపట్టి అదే రోజు సమ్మెతేదిని ప్రకటిస్తామన్నారు. ఈ నెల 22 తర్వాత ఏ క్షణం నుంచైనా సమ్మే జరిగే అవకాశం ఉందని, తమతో ఎన్‌ఎమ్‌యూ కలిసి రావాలని జేఏసీ నేతలు కోరారు. ఆర్టీసీ జేఏసీ ప్రధాన డిమాండ్లు 2013 కి వేతనాల సవరణకు సంబందించిన పెండింగ్ అరియర్సు వెంటనే చెల్లించాలి. 4000 మంది సిబ్బందిని తగ్గించాలంటూ వీసీ, ఎండీలు చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అద్దెబస్సుల పెంపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి ఆర్టీసీ బస్సులను పెంచాలి. ప్రభుత్వం నుంచి ఆర్టీసికి రావాల్సిన రూ.650 కోట్లు వెంటనే చెల్లించాలి. సీసీఎస్ నుంచి ఆర్టీసి యాజమాన్యం వాడుకున్న రూ.285 కోట్ల కార్మికుల సొమ్మును వెంటనే యాజమాన్యం చెల్లించాలి. గ్రాడ్యుటీ, వీఆర్ఎస్ సర్క్యులర్‌లో ఉన్న లోపాలు సరిచేయాలి. కారుణ్యనియామాకాలు వెంటనే చేపట్టాలి. మిగిలి ఉన్న కాంట్రాక్టు కార్మికులను తీసుకోవాలి. అందరినీ రెగ్యూలర్ చెయాలి. ఆర్టీసి పాలకమండలిలో కార్మిక సంఘాలకు బాగస్వామ్యం కల్పించాలి. చట్ట ప్రకారం కార్మిక సంఘాలకు ఇవ్వాల్సిన సౌకర్యాలలో వీసీ, ఎండీ తొలగించిన సౌకర్యాలను పునరుద్దరించాలి. -
ఆర్టీసీలో సమ్మె సైరన్..
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, కార్మిక సంఘాల నేతల మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో సమ్మెబాట పట్టాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మెకు సై అంటోంది. బుధవారం సమ్మె తేదీని ప్రకటించాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. కార్మికులను రెచ్చగొట్టేలా యాజమాన్యం నిర్ణయాలు తీసుకుంటుందని వారు ఆరోపించారు. 50శాతం ఫిట్మెంట్ డిమాండ్ చేస్తే 20శాతానికి మించి ఇవ్వలేమని ఎండీ తేల్చిచెప్పారని, దానికి తాము అంగీకరించలేదని కార్మికనేతలు వెల్లడించారు. ఇవాళ జేఏసీ సమావేశం నిర్వహించి సమ్మె తేదిని ప్రకటిస్తామని తెలిపారు. -
ప్రభుత్వం దిగిరావడం ఇది మా విజయమే!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో కార్మికుల తలపెట్టిన సమ్మెకు బ్రేక్ పడింది. కార్మికులకు 16 శాతం మధ్యంతర భృతి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె ఆలోచనను విరమించుకుంటున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ జేఏసీ ఒత్తిడి వల్లే కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ దిగి వచ్చారని జేఏసీ నేతలు పేర్కొన్నారు. సీఎం ఇచ్చిన తూతూ మంత్రపు ప్రకటనలకు టీఎంయూ ఒప్పుకోవడం దారుణమన్నారు. ఇంకా ముఖ్యమైన డిమాండ్లు సాధించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు గుర్తింపు సంఘం టీఎంయూ భయపడిందని ఆరోపించారు. టీఎంయూ ఒంటెద్దు పోకడలు పోతోందని మండిపడ్డారు. ప్రభుత్వ గుర్తింపు సంఘమైన టీఎంయూ సమ్మె విరమించడం వల్ల తాము కూడా ప్రస్తుతానికి సమ్మె విరమిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. తాజా డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడం ఆర్టీసీ జేఏసీ విజయమేనని తెలిపారు. నేటి (శనివారం) రాత్రి అన్ని డిపోల దగ్గర ఆర్టీసీ జేఏసీ సమావేశాలు నిర్వహించి.. ప్రభుత్వం కార్మికులను ఎలా మోసం చేసిందో వివరిస్తామని చెప్పారు. -
రెండో రోజూ ‘బస్సు’ బంద్ ఉద్రిక్తత
- తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో రోడ్డెక్కిన బస్సులు - కార్మికుల కన్నెర్ర.. అడ్డుకున్న సిబ్బంది.. - టైర్లలో గాలి తీసివేత.. బస్సు అద్దాలు ధ్వంసం - కానిస్టేబుల్‌కు గాయూలు.. చెదరగొట్టిన పోలీసులు.. - ఆర్టీసీ జేఏసీ భారీ ర్యాలీ.. పోలీసుల అదుపులో కొందరు కార్మికులు హన్మకొండ : ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా రెండోరోజు గురువారం చేపట్టిన బస్సుల బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. పూర్తిస్థారుులో బస్సు సర్వీసులు నిలిచిపోరునప్పటికీ... తాత్కాలిక ఉద్యోగులను తీసుకోవడం, అద్దె బస్సులు నడిపించడంపై కార్మికులు కన్నెర్ర చేశారు. సమ్మెలో భాగంగా హన్మకొండ డిపో నుంచి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం కూడలి, పెట్రోల్ పంప్, హన్మకొండ చౌరస్తా మీదుగా వరంగల్-2 డిపో ముందు నుంచి హన్మకొండ జిల్లా స్టేషన్‌కు ర్యాలీ చేరుకుంది. జిల్లా బస్‌స్టేషన్‌లోకి ర్యాలీగా వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే క్రమంలో వరంగల్-2 డిపోకు చెందిన బస్సు ఇటు వైపు రావడంతోవారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మహిళా కార్మికులు బస్సులకు అడ్డంగా బైఠాయించగా... కొందరు ఆర్టీసీ సిబ్బంది నడుస్తున్న బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో వరంగల్-2 డిపోకు చెందిన ఓ అద్దె బస్సు అద్దాలు పగిలాయి. బందోబస్తులో ఉన్న ఓ కానిస్టేబుల్‌కు రాయి తగలడంతో స్వల్పంగా గాయమైంది. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు చెదరగొట్టారు. రాళ్లు విసిరాడంటూ ఆర్టీసీ కార్మికుడు అలీని పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించేందుకు వాహనంలోకి ఎక్కించడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసు వాహనాన్ని కార్మికులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. ఇదే క్రమంలో జగిత్యాల డిపోకు చెందిన రెండు అద్దె బస్సులు రావడంతో కార్మికులు ఆ బస్సులనూ అడ్డగించారు. మహిళా కార్మికులు బస్సుల ముందు బైఠాయించారు. కొంత మంది బస్సుల టైర్లలో గాలి తీశారు. పోలీసులు అదుపులోకి తీసుకొన్న కార్మికుడిని వదిలేయడంతో కార్మికులు శాంతించారు. అనంతరం బస్‌స్టేషన్ ద్వారం వద్ద కార్మికులు టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. ర్యాలీలో ఆర్టీసీ జేఏసీ నాయకులు ఈఎస్ బాబు, జితేందర్‌రెడ్డి, సిహెచ్ యాకస్వామి, ఈదురు వెంకన్న, మనోహర్, సీహెచ్.రాంచందర్, యాదయ్య, యాదగిరి, ఎండీ.గౌస్. కేడీ.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు రూ.కోటి నష్టం జిల్లాలోని తొమ్మిది డిపోల్లో 965 బస్సులు ఉన్నారు. ఇందులో 758 సంస్థ బస్సులు, 207 అద్దె బస్సులు. ఇందులో సంస్థకు చెందిన 12 ఆర్టీసీ బస్సులను తాత్కాలి డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో బయటకు వెళ్లాయి. 142 అద్దె బస్సులు తిరిగినట్లు అధికారులు తెలిపారు. వరంగల్ రీజియన్‌లో మొత్తం 4539 మంది కార్మికులు, ఉద్యోగులు, సూపర్వైజర్లు, మెకానిక్‌లు సమ్మెలో పాల్గొన్నారు. ఇందులో కండక్టర్లు, డ్రైవర్లు 3605 మంది ఉండగా... మిగతా వారు సూపర్ వైజర్లు, మెకానిక్‌లు, డీసీలు, ఏడీసీలు, ఇతర ఉద్యోగులున్నారు. సమ్మెతో రెండో రోజు దాదాపు రూ.98 లక్షల నుంచి రూ.కోటి వరకు సంస్థ ఆదాయాన్ని కోల్పోయింది. తాత్కాలికంగా హన్మకొండ నుంచి పరకాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, జనగామ, హైదరాబాద్, కరీంనగర్ రూట్లలో నడిపినట్లు ఆర్టీసీ ఆర్ఎం యాదగిరి తెలిపారు. ఫలించని అధికారుల వ్యూహం ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైనప్పటికీ... గురువారం పూర్తిస్థాయిలో బస్సులు నడుపలేకపోయూరు. బుధవారం తాత్కాలిక డ్రైవర్లుగా 30 మందిని ఎంపిక చేసి డిపోలకు కేటాయించినప్పటికీ... గురువారం 12 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. దీంతో మరో 12 మంది తాత్కాలిక కండక్టర్లను విధుల్లోకి తీసుకుని 12 బస్సులు నడిపారు. గురువారం మరో 40 మంది తాత్కాలిక డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించారు. ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సు యజమానులకే పూర్తి స్వేచ్ఛను వదిలేసింది. దీంతో కొంత మంది అద్దె బస్సు యజమానులు బస్సులను తిప్పారు. బస్‌స్టేషన్ ప్రాంతాలకు బస్సులు వెళ్లే ఇబ్బందులు తప్పవని భావించిన అద్దె బస్సు యజమానులు బస్స్టేషన్లకు కొంచెం దూరంలో ప్రధాన కూడళ్లలో ప్రయాణికులను దింపి, ఎక్కించుకొని వెళుతున్నారు. అరుుతే కార్మికులు అడ్డుకుంటారని, నష్టం చేస్తారనే భయంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. సంఘీభావాల వెల్లువ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్ళపల్లి శ్రీనివాస్‌రావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పనాసా ప్రసాద్,నాయకుడు సిరబోయిన కర్ణాకర్ సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని మార్తినేని ధర్మారావు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. కార్మికుల పోరాటానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తక్కళ్ళపల్లి శ్రీనివాస్‌రావు అన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా సమస్యను పరిష్కరించాలన్నారు. -
21న టీ ఆర్టీసీ జేఏసీ ‘చలో అసెంబ్లీ’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని వెంటనే విభజించాలనే డిమాండ్‌తో 21న జరపతలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కార్మికులకు విజ్ఞప్తి చేసింది. ఇదే డిమాండ్‌తో మంగళవారం ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌తోపాటు అన్ని డిపోల్లో భోజన విరామ సమయంలో కార్మికులు ధర్నా జరిపారు. బస్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు మాట్లాడారు. ఆర్టీసీ విభజనతోపాటు కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, సకల జనుల సమ్మె కాలాన్ని వేతనంతో కూడిన సెలవుగా పరిగణించాలని పేర్కొన్నారు. -
కదిలిన జనరథాలు
కంబాలచెరువు (రాజమండ్రి), న్యూస్‌లైన్ :రోడ్లకు మళ్లీ మునుపటి ‘కళ’ వచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమంతో రెండు నెలలుగా కనుమరుగైన ‘జనరథాలు’ మళ్లీ కనిపించాయి. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విరమణతో శనివారం రాజమండ్రి రీజియన్‌లోని 9 డిపోల నుంచీ బస్సులు తిరిగాయి. ఆర్టీసీ జేఏసీ సమ్మెకు నిర్ణయించడంతో ఆగస్టు 13 నుంచి 836 బస్సులు గత 60 రోజులుగా డిపోలకే పరిమితమయ్యాయి. కాగా ప్రభుత్వంతో చర్చలు ఫలించడంతో జిల్లాలోని తొమ్మిది డిపోల పరిధిలో 4,200 మంది విధులకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. శనివా రం మధ్యాహ్నానికి 588 కండక్టర్లకు గాను 442 మంది, 675 మంది డ్రైవర్లకు గాను 442 మంది విధులకు హాజరయ్యారు. మిగతా సిబ్బంది దూరప్రాంత సర్వీసులకు, షిఫ్ట్‌లకు హాజరవుతున్నారు. చర్చల్లో ఆర్టీసీ కార్మికులందరికీ దసరా బోనస్ ప్రకటించి, తొలిరోజు విధులకు హాజరయ్యే వారందరికీ ఇది వర్తిస్తుందని తెలపడంతో జిల్లాలోనున్న కార్మికులంతా విధులకు ఉత్సాహంగా హాజరయ్యారు. దసరా సందర్భంగా దూరప్రాంతాలు వెళ్లే వారు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయనే సమాచారంతో ఉదయం నుంచే బస్టాండ్లకు చేరుకున్నారు. జిల్లా నుంచి ఉదయం హైదరాబాద్‌కు ఎనిమిది ప్రత్యేక బస్సులను నడపగా రాత్రికి మరికొన్ని అదనపు బస్సులను నడిపారు. విజయవాడ, విశాఖపట్నం రూట్లలో అదనంగా బస్సులు నడిపారు. కాగా ఉదయం నుంచి బస్సులు తిరుగుతున్నా ప్యాసింజర్ సర్వీసుల్లో మాత్రం మధ్యాహ్నం నుంచే రద్దీ కనిపించింది. నష్టం రూ.50 కోట్ల పైనే.. సమైక్యాంధ్ర ఉద్యమంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి 12 వరకు దఫదఫాలుగా బస్సులను ఉద్యమకారులు ఆపేశారు. దీంతో రీజియన్‌లో రూ.5 కోట్ల వరకు నష్టం వచ్చింది. అనంతరం ఆగస్టు 13 నుంచి 60 రోజుల పాటు సమ్మె కొనసాగడంతో రూ.45 కోట్లకు పైగా నష్టం వచ్చింది. ఇన్నిరోజులుగా ఆగిపోవడంతో బస్సుల్లో తలెత్తిన లోపాలకు మరి కొంత సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోంది. కాగా ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోవాలాలు, ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రయాణ వాహనాల వారు ఇదే అదనుగా ఇష్టారాజ్యంగా చార్జీలు దండుకుని సొమ్ము చేసుకున్నారు. సమ్మె కాలంలో రైళ్లయితే గాలి చొరబడడానికి సందు లేనంత కిక్కిరిసి కనిపించాయి. ఆర్టీసీ బస్సులు తిరిగి నడవడంతో ప్రయాణికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. -
సమైక్య జ్వాల.. విభజన ఆగాల
సాక్షి, కర్నూలు: సడలని దీక్షతో సమైక్య ఉద్యమాన్ని జిల్లా ప్రజలు ముందుకు తీసుకెళ్తున్నారు. విభజన నిర్ణయంపై యూపీఏ ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు విశ్రమించబోమంటూ ప్రతినబూనారు. ఉద్యోగులను చట్టాల పేరిట బెదిరించే ప్రయత్నం చేస్తున్నా.. వారూ మొక్కవోని దీక్షతో రోడ్డెక్కుతూనే ఉన్నారు. సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు మంగళవారం జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ జేఏసీలు ముట్టడించాయి. దీంతో కర్నూలు, ఆదోని, ఆళ్లగడ్డ, నంద్యాల, నందికొట్కూరు, డోన్, కొలిమిగుండ్ల ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. కర్నూలులో ప్రభుత్వ వైద్యులు కలెక్టరేట్ వద్ద యూపీఏ ప్రభుత్వాన్ని సమాధి చేసి నిరసన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల ఇళ్లు, ఆస్తులకు సమీపంలోని దీక్షా శిబిరాలను తొలగించాలన్న కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు శ్రీకృష్ణదేవరాయ కూడలిలోని దీక్షా శిబిరాలను పోలీసులు తొలగించారు. అయితే 68 రోజులుగా అక్కడే దీక్ష నిర్వహిస్తున్న న్యాయవాదులు ఎండలోనే ఉద్యమాన్ని కొనసాగించారు. టీనోట్‌కు వ్యతిరేకంగా ఆదోనిలో విద్యుత్‌శాఖ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి, పాతబస్టాండ్ సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని రుద్రవరంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. నంద్యాలలో రెవెన్యూ అధికారుల రిలే దీక్ష 35వ రోజుకు చేరుకుంది. పంచాయతీరాజ్ కార్యాలయ ఆవరణలో పీఆర్ ఉద్యోగులు 48వ రోజు దీక్షను కొనసాగించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సంజీవనగర్ గేట్, బస్టాండ్, చామకాల్వ సెంటర్లలో ప్రైవేట్ వాహనాలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఎన్జీఓ కాలనీ ప్రజల ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. తెలంగాణ నోట్ ప్రతులను ప్రభుత్వ వైద్యులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరులో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. పాములపాడులో చౌడేశ్వరి దేవాలయంలో సమైక్యవాదులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందికొట్కూరులో కొత్తబస్టాండ్ నుంచి ర్యాలీ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి పటేల్ విగ్రహం ఎదుట దహనం చేశారు. పత్తికొండలో జేఏసీకి మద్దతుగా వ్యాయామ ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. బనగానపల్లెలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం నిర్వహించారు. బేతంచర్లలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా నిర్వహించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. -
సమైక్యం కోసం అనంతలోకాలకు..
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రకటనపై కలతతో ఆర్టీసీ నెల్లూరు-1 డిపో డ్రైవర్ నూతక్కి రాములు (47) శనివారం ఉదయం నెల్లూరులోని సరస్వతినగర్‌లో తన నివాసంలో మృతి చెందారు. దినపత్రికలో ఉద్యమ వార్తలు చదువుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు.కుటుంబ సభ్యులు తేరుకుని వైద్యులను సంప్రదించారు. రాములును వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. రాములు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎన్జీఓలు, ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. శిబిరం వద్దకు ఊరేగింపుగా.. రాములు మృతదేహాన్ని సరస్వతినగర్‌లోని ఆయన నివాసం నుంచి బస్‌స్టేషన్ ప్రాంగణంలోని శిబిరం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఎన్జీఓలు, ఆర్టీసీ కార్మికులు పెద్దసంఖ్యలో శిబిరం వద్దకు చేరుకుని రాములుకు నివాళులర్పించారు. ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్ సుధాకర్‌రావు మాట్లాడుతూ బట్టా శంకరయ్య, సీహెచ్ సోమశేఖరరావు, సత్యనారాయణ, రాములు ఇలా ఎంత మంది అసువులు బాసిన కేంద్రం కళ్లు తెరవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి త్యాగాన్ని వృథాకానివ్వబోమని ప్రతినబూనారు. మృతదేహాన్ని రాములు సోదరుడి ఇంటికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. కార్యక్రమంలో కె.రమణరాజు, వి.పెంచలరెడ్డి, నారాయణరావు, మహబు, డీబీ శామ్యూల్, సీహెచ్ శ్రీనివాసులు, ఏఎస్ఆర్ కుమార్, శేఖర్, శశి, రమేష్‌రెడ్డి, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖుల నివాళి దీక్షా శిబిరంలో రాములు మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, ఆర్టీసీ ఆర్ఎం చింతా రవికుమార్, డిప్యూటీ సీటీఎం పి.చంద్రశేఖర్, నెల్లూరు -1, 2 డిపో మేనేజర్లు ఎ.సుబ్రహ్మణ్యం, ఎస్కే షమీమ్ సందర్శించి నివాళులర్పించారు. సమైక్యభేరి నుంచి ఇంటికెళుతూ.. సంగం: మండలంలోని ఉడ్‌హౌస్‌పేటకు చెందిన ఉక్కాల రవి(42) వ్యవసాయ కూలీ. ఆయనకు మొదటి నుంచి సామాజిక చైతన్యం ఎక్కువ. విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి సీమాంధ్రుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు నిరసన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించేవాడు. అందులో భాగంగా శుక్రవారం బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించిన సమైక్యభేరి సభకు హాజరయ్యాడు. సమైక్య నినాదాలతో హోరెత్తించాడు. అనంతరం ఇంటికి వెళుతూ తరుణవాయి వద్ద గుండెపోటుతో అపస్మారస్థితికి చేరుకున్నాడు. గ్రామస్తులు ఇంటికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయాడు. రవికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం సంగం తహశీల్దార్ శ్రీకాంత్, చిల్లకూరు ఎంపీడీఓ చిరంజీవి, జేఏసీ నాయకులు సురేంద్రరెడ్డి, ప్రభాకర్ తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతదేహంపై సమైక్యాంధ్ర జెండాను ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఉద్యమానికి ఊపునిచ్చిన ‘స్ఫూర్తి’ నాటిక
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: ఆర్టీసీ కళాకారులు ప్రదర్శించిన ‘స్ఫూర్తి’ నాటిక సమైక్యవాదులను ఉత్తేజపరిచింది. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు బస్టాండ్ ఆవరణలో నాటికను ప్రదర్శించారు. రాష్ట్ర విభజనతో జరిగే అనర్థాలు, సమైక్యాంధ్రతో కలిగే లాభాలను కళాకారులు వివరించారు. నాటికలో భాగంగా సోనియాగాంధీ కొడుకు రాహుల్‌ను ప్రధానిని చేసేందుకే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని కళాకారులు చెప్పడంతో సమైక్యవాదులు ఆగ్రహానికి లోనై సోనియా డౌన్.. డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కళాకారులు ఆంథోని, శ్రీనివాసులు, ఖాదర్, నరసింహులు, శ్రీనివాసులు, రత్నం, రమణ, ప్రదర్శనలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆర్టీసీ ఆర్ఎం జీ వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు తిమ్మప్ప, నరసింహులు, రమణా రెడ్డి, ఆర్టీసీ డెప్యూటీ సీటీఎం మధుసూదన్, పీఓ నరేంద్ర రెడ్డి, చంద్రశేఖర్, నరసింహులు, పీవీ రమణా రెడ్డి, కొండయ్య పాల్గొన్నారు. -
విభజనకు నిరసనగా అర్ధనగ్నంగా ర్యాలీ
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఒక్కసారిగా భగ్గుమంది. సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన సీమాంధ్ర ఉద్యమం తారస్థాయికి చేరుతోంది. సీమాంధ్ర జిల్లాలో అడుగడుగునా నిరనసలు, ధర్నాలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించింది. రాష్ర్టం సమైక్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తాము ఉద్యమంలో పాల్గొంటున్నామని సీమాంధ్ర ప్రజలు వాపోతున్నారు. రాష్ర్టం ముక్కలతై తాము తీవ్రంగా నష్టపోతామని వారు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుసుకోవాలంటూ సీమాంధ్ర ప్రజలు మక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో తమ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని, ఇరుప్రాంతాలకు సమన్యాయం జరిగేలా తక్షణమే చర్చలు జరిపి సానుకూల నిర్ణయాన్ని ప్రకటించాల్సిందిగా సమైక్యవాదులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విజయనగరం కోట జంక్ష-న్లో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. విభజనకు నిరసనగా ఆకులు కట్టుకుని అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించారు. కోట జంక్షన్ నుంచి ర్యాలీ నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగులు.. వీధిపొడువునా భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు న్యాయవాదులు జేఎసి సమైక్యాంధ్రాకు మద్దుతుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కోటజంక్షన్లో కొనసాగుతూనే ఉన్నాయి. -
తిరుమలకు సమైక్య సెగ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ‘సమైక్య’ సెగ తలిగింది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. వెంకన్న హుండీ ఆదాయం సగానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి 24 గంటలపాటు తిరుపతి-తిరుమల మధ్య టాక్సీలను నిలిపి వేయాలని తిరుమల, తిరుపతి ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ జేఏసీ నిర్ణయించింది. ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేయాలని ఆర్టీసీ జేఏసీ యోచిస్తోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఈనెల 13వ తేదీన తిరుమలకు బస్సులు నిలిపివేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి బస్సులు నడపాల్సిందిగా సూచించడంతో కొద్దిపాటి బస్సులను పునరుద్ధరించారు. సాధారణ రోజుల్లో దాదాపు 500 బస్సులు తిరుమలకు తిరుగుతుండగా, ఈనెల 14వ తేదీ నుంచి 107 బస్సు సర్వీసులను మాత్రమే పునరుద్ధరించారు. ఇవి కూడా తిరుపతి బస్టాండ్ నుంచి గాక అలిపిరి బాలాజీ బస్టాండు నుంచి తిరుమలకు నడుపుతున్నారు. మామూలు రోజుల్లో బస్సుల ద్వారా వెళ్లి వచ్చే భక్తుల సంఖ్య లక్షకుపైగా ఉంటుంది. ప్రస్తుతం 107 బస్సుల్లో సగటున 26 వేల మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణిస్తున్నారు. భక్తుల సంఖ్య తగ్గడంతో తిరుమల వెంకన్నకు వచ్చే ఆదాయం కూడా భారీగా పడిపోయింది. రోజూ రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయల వరకూ ఉండే హుండీ ఆదాయం కోటిన్నరకు పడిపోయింది. గదులు కూడా ఖాళీ అయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేటు వాహనాలు నిలిచిపోవడం కూడా తిరుమలపై తీవ్ర ప్రభావాన్నే చూపనుంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 32 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం మొత్తం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 10 గంటల్లోనే దర్శనం లభిస్తోంది. రద్దీ పెరగడంతో రూ.300 టికెట్ల దర్శనం సాయంత్రం 4 గంటలకు నిలిపివేశారు. అలిపిరి, శ్రీవారి వెుట్టు మార్గాల్లో నడిచి వచ్చిన భక్తులు 9 కంపార్మెంట్లలో వేచిఉన్నారు. వీరికి దర్శన సమయం 5 గంటలుగా కేటాయించారు. వెంకన్న సేవలో డీజీపీ దినేష్‌రెడ్డి: రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి శుక్రవారం వేకువజామున తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కుకున్న ఆయన సన్నిధి చేరుకుని అభిషేక సేవలో స్వామిని దర్శించుకున్నారు. వకుళామాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఆలయాధికారులు డీజీపీకి శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. డీజీపీ శ్రీకాళహస్తి చేరుకుని ముక్కంటీశుని, తిరుచానూరులో పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. విభజిస్తే రాజకీ య నిష్ర్కమణ : కోట్ల సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియా చానళ్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారడం ఖాయమని పేర్కొన్నారు.