
నల్లగొండ :తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నల్లగొండలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఏపీలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని చెప్పారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు కోరుతున్నా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. విధుల్లో చేరకుంటే తొలగిస్తామంటూ హెచ్చరిస్తున్నారని, కానీ కార్మికులు తలచుకుంటే ముఖ్యమంత్రినే తొలగిస్తారని హెచ్చరించారు.