సాక్షి, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఖమ్మం రీజియన్ డిపో ఆర్టీసీ కార్మికులు.. మేయర్ కారును అడ్డుకొని.. ఆందోళనకు దిగారు. మేయర్ కారు ముందుకుపోకుండా కార్మికులు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో మేయర్ కారు...ఆర్టీసీ కార్మిక నేత పాదంపైనుంచి వెళ్లడం.. కార్మికులకు ఆగ్రహం తెప్పించిందీ. దీంతో కారుకు అడ్డంగా ఆందోళనకు దిగిన కార్మికులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తప్పించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
మహమూబ్ నగర్‌లో ప్రశాంతంగా సమ్మె
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడవ రోజు ప్రశాంతంగా కొనసాగుతుంది. మొదటి రోజు 9 డిపోల పరిధిలోని 880 బస్సులను పోలీసుల పహారా మధ్య నడిపించారు. ఆర్టీసీ బస్టాండ్, డిపోల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment