అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద నివాళులర్పించేందుకు ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గన్ పార్క్ వద్దకు తరలివస్తున్నఆర్టీసీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. గన్ పార్క్ వద్ద ధర్నా, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం తాము గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివారులర్పించడానికి వచ్చామని, దీనికి అరెస్టు చేయడమేమిటని మండిపడుతున్నారు. మరికాసేపట్లో గన్ పార్క్ వద్దకు ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మిక సంఘాల నేతలు వచ్చే అవకాశముండటంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది.