కార్మికులు పట్టు వీడలేదు.. ఐఏఎస్ అధికారుల కమిటీ మెట్టు దిగలేదు.. ఫలితంగా నాలుగేళ్ల తర్వాత మరోసారి ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మికులతో త్రిసభ్య కమిటీ శుక్రవారం జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో కార్మికులు సమ్మెకే సై అన్నారు. ముందే ప్రకటించినట్లే శనివారం (5వ తేదీ) ఉదయం 5 గంటల నుంచి సమ్మె ప్రారంభించారు. చర్చలు విఫలమైన వెంటనే సమ్మె మొదలైనట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులను సంఘాలు అప్రమత్తం చేశాయి.