సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని వెంటనే విభజించాలనే డిమాండ్‌తో 21న జరపతలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కార్మికులకు విజ్ఞప్తి చేసింది. ఇదే డిమాండ్‌తో మంగళవారం ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌తోపాటు అన్ని డిపోల్లో భోజన విరామ సమయంలో కార్మికులు ధర్నా జరిపారు. బస్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు మాట్లాడారు.
ఆర్టీసీ విభజనతోపాటు కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, సకల జనుల సమ్మె కాలాన్ని వేతనంతో కూడిన సెలవుగా పరిగణించాలని పేర్కొన్నారు.