సాక్షి, అమరావతి: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, కార్మిక సంఘాల నేతల మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో సమ్మెబాట పట్టాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మెకు సై అంటోంది. బుధవారం సమ్మె తేదీని ప్రకటించాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. కార్మికులను రెచ్చగొట్టేలా యాజమాన్యం నిర్ణయాలు తీసుకుంటుందని వారు ఆరోపించారు. 50శాతం ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తే 20శాతానికి మించి ఇవ్వలేమని ఎండీ తేల్చిచెప్పారని, దానికి తాము అంగీకరించలేదని కార్మికనేతలు వెల్లడించారు. ఇవాళ జేఏసీ సమావేశం నిర్వహించి సమ్మె తేదిని ప్రకటిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment