
పోలవరం ప్రాజెక్టు పనులపై బాబు సమీక్ష
పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం చంద్రబాబు మంగళవారం అధికారులతో సమీక్షించారు.
విజయవాడ: పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా జనవరి 7నుంచి డయాఫ్రమ్ వాల్ పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై ఆయన అధికారులతో మంగళవారం సమీక్షించారు.
పెండింగ్ పనులు పూర్తయ్యేలా వేగం పెంచాలని, రాజీపడితే సహించేది లేదని హెచ్చరించారు. కాగా, కాంక్రీట్ పనులకు పరీక్షలు పూర్తి చేసినట్లు ఆ ప్రాజెక్టు అధికారులు సీఎంకి వివరించారు. సమీక్షలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ, పలు విభాగాల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.