ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పెరుగుతోంది.
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పెరుగుతోంది. గురువారం ఉదయానికి నీటిమట్టం 10.6 అడుగులకు చేరింది. పట్టిసీమ నుంచి 9,598 క్యూసెక్కుల వరద వస్తోంది. కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి 6,081 క్యూసెక్కుల వరద చేరుతోంది. తూర్పు డెల్టాకు 6,165 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5,009 క్యూసెక్కుల నీరును విడుదల చేశారు.