పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం లాంటి చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 70 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 60 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగిపోయింది.
పొగాకు, చెరకు, కూరగాయల పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. రెండు రోజుల్లో పంట నష్టం అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను పంపుతామని ఆయన తెలిపారు.