విశాఖలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. భార్యాభర్తల సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖ : విశాఖలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. బీచ్ రోడ్డు అఫిషియల్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో వన్ టౌన్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. భార్యాభర్తల సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన ఇద్దరు బాలికలను రక్షించి.. చైల్డ్ హోమ్‌కు తరలించారు. ఇక నిర్వాహకుడు వీకె రెడ్డి, బ్రోకర్ జిలానీలు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారైనవారి కోసం గాలిస్తున్నారు.