సాక్షి, కడప: వైఎస్‌ఆర్ కడప జిల్లాలో శుక్రవారం ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని కాశినాయన మండలం కోడిగుడ్లపాడుకు చెందిన అశ్విని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈరోజు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
స్థానికులు చూసేసరికి అశ్విని మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పరీక్షల భయంతోనే అశ్విని ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు తెలిపారు.