examinations
-
ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్.. పేపర్ లీకేజీలపై రాహుల్ ట్వీట్
ఢిల్లీ: ప్రశ్నాపత్రాల లీకేజీలను వ్యవస్థాగత వైఫల్యంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా.. లీక్‌ల కారణంగా కష్టపడి చదివే ఎంతో మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని.. దీనిపై పోరాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విభేదాలు పక్కన పెట్టి కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు.‘ప్రశ్నాపత్రాల లీకులతో ఆరు రాష్ట్రాల్లోని 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్న రాహుల్.. వీటి కారణంగా కష్టపడి చదివే విద్యార్థులతో పాటు వారి కుటుంబాలు కూడా ఒత్తిడికి గురవుతున్నాయన్నారు. వారి కష్టానికి తగిన ఫలితం అందడం లేదన్నారు. దీంతో కష్టపడి పనిచేయడం కంటే నిజాయితీగా లేకపోవడమే మంచిదనే తప్పుడు సంకేతాలు భవిష్యత్ తరాలకు వెళ్తుందంటూ అభిప్రాయవ్యక్తం చేసిన రాహుల్.. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు.‘‘ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం లీకులను అడ్డుకోలేకపోయింది. ఇది వారి వైఫల్యానికి నిదర్శనం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విభేదాలు పక్కనబెట్టి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే వీటిని అరికట్టగలం. ఈ పరీక్షలు మన పిల్లల హక్కు. దాన్ని ఎలాగైనా రక్షించాలి’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.6 राज्यों में 85 लाख बच्चों का भविष्य ख़तरे में - पेपर लीक हमारे युवाओं के लिए सबसे ख़तरनाक "पद्मव्यूह" बन गया है।पेपर लीक मेहनती छात्रों और उनके परिवारों को अनिश्चितता और तनाव में धकेल देता है, उनके परिश्रम का फल उनसे छीन लेता है। साथ ही यह अगली पीढ़ी को गलत संदेश देता है कि… pic.twitter.com/nWHeswvMOC— Rahul Gandhi (@RahulGandhi) March 13, 2025 -
పిల్లల పరీక్షలు, పెద్దోళ్లకు అగ్నిపరీక్ష! ఈ విషయాలు గుర్తుంచుకోండి!
చెన్నైలో CBSE పరీక్షల సమయంలో స్కూల్ గోడ ఎక్కి, తమ పిల్లల కోసం తల్లిదండ్రులు చూస్తున్న ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని చూసి మనమందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది.ఇలాంటి ఘటనలు ఏ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి?🔹మన విద్యా వ్యవస్థ పిల్లలపై ఎంత ఒత్తిడిని పెడుతోంది?🔹తల్లిదండ్రుల ఆందోళన పిల్లల మనసుపై ఎలా ప్రభావం చూపుతోంది?🔹తల్లిదండ్రుల ప్రేమ వారికి బలాన్ని ఇస్తుందా, భయాన్ని పెంచుతుందా?ప్రతీ సంవత్సరం పరీక్షల సీజన్ వచ్చినప్పుడల్లా విద్యార్థుల కన్నా ఎక్కువగా ఒత్తిడిలో ఉంటున్న వారు తల్లిదండ్రులే. "తప్పక పాస్ అవ్వాలి!", "అగ్రశ్రేణి మార్కులు రావాలి!", "లేకపోతే భవిష్యత్తు అంధకారం!" – ఇవీ తల్లిదండ్రులలో నిండిపోయిన భయాలు. ర్యాంక్ కోసమే మన ప్రేమ అని పిల్లలకు అనిపించకూడదు.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి తల్లిదండ్రులు చేయకూడనిది...❌ హెలికాప్టర్ పేరెంటింగ్:ప్రతీ చిన్న విషయాన్ని తల్లిదండ్రులు గమని…పిల్లలను ఎలా ప్రోత్సహించాలి?✅ పరీక్ష ఫలితాలు ఆశించినంత రాలేదనుకోండి. పిల్లలు దిగులుగా ఉన్నప్పుడు, "నీ ప్రయత్నం గొప్పది, మార్కులు మాత్రమే జీవితానికి అద్దం కాదు" అని చెప్పండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచండి.✅ పిల్లలకు చదువు అంటే భయం కాకుండా ఆసక్తిగా ఉండేలా చేయండి. "ఏ విషయం నచ్చింది? ఏ ప్రశ్న ఆసక్తికరంగా అనిపించింది?" అని అడిగితే, పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా, నేర్చుకునే ప్రక్రియగా భావిస్తారు.✅ "నీ ఫ్రెండ్ అజయ్ టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, నీవు ఎందుకు సాధించలేకపోతున్నావు?" అనే మాటలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దిగజార్చతాయి. ప్రతి ఒక్కరికీ తన ప్రయాణం ఉంటుంది. అందుకే పోల్చడం మానండి.✅ తప్పిదాలను సహజంగా అంగీకరించండి. "ఈసారి ఏమి తప్పైంది? తర్వాత ఎలా మెరుగుపరచుకోవచ్చు?" అనే విధంగా ప్రశ్నించడం ద్వారా పిల్లలు సమస్యలను అర్థం చేసుకొని, మెరుగుపడటాన్ని నేర్చుకుంటారు.గుర్తుంచుకోవాల్సిన విషయాలు📌 పరీక్షలు జీవితాన్ని నిర్ణయించవు. అవి ఒక చిన్న అంచనా మాత్రమే.📌 పిల్లలకు భయం పోగొట్టండి. పరీక్షలు అంటే భయపడేలా కాకుండా, కొత్త విషయాలు నేర్చుకునే అనుభవంగా చూడమని ప్రేరేపించండి.📌 పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఒత్తిడితో విజయం సాధించడమే కాదు, ఆనందంగా ఎదగాలి.📌 గోడలు ఎక్కే తల్లిదండ్రులు కాకుండా, పిల్లలకు మార్గదర్శకంగా ఉండండి.పరీక్షల సమయం పిల్లలకు ఒత్తిడిగా కాకుండా, నేర్చుకునే మంచి అవకాశంగా మార్చే బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల భవిష్యత్తును భయంతో నింపకుండా, ధైర్యంగా ముందుకు నడిపిద్దాం!మీకేమైనా కౌన్సెలింగ్ సహాయం కావాలంటే నన్ను సంప్రదించండి.-సైకాలజిస్ట్ విశేష్ -
బాలలకు నవోదయం
మదనపల్లె సిటీ: గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థుల జీవితానికి జవహర్ నవోదయ విద్యాలయం విజ్ఞాన వారధిగా నిలుస్తోంది. విలువలతో కూడిన విద్య, నైపుణ్యాలు, దేశభక్తి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖనం, ఎన్సీసీ ఇలా అన్నింటికి నవోదయ విద్యాలయం ప్రసిద్ధి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సామాన్య, బడుగు, బలహీనవర్గాల పేద విద్యార్థులకు విద్యనందిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె సమీపంలోని వలసపల్లెలోని నవోదయ విద్యాలయం, ఉమ్మడి వైఎస్సార్ జిల్లా పరిధిలోని రాజంపేట నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి ఈనెల 18న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో ఇందులో సీటు సాధించేందుకు మెలకువలను అక్కడి ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు. ఒకే బుక్‌లెట్‌లో (ప్రశ్నపత్రం) మూడు భాగాలుంటాయి.అంకగణితం పరీక్ష ప్రవేశ పరీక్షలో అంకగణితంలోని 23 చాçప్టర్ల నుంచి ఒక లెక్క వస్తుంది. సరాసరి, సంఖ్యల మీద మూల ప్రక్రియ, దశాంశాలను భిన్నంకాలుగా మార్చడం, భిన్నాంకాలను దశాంశాలుగా మార్చడం, వివిధ రకాల కొలతలు, పొడవులు, శక్తి, కాలం, ధనం మొదలైన వాటితో సంఖ్యతో వినియోగం, చిన్న సంఖ్యలు భిన్నంతో కూడిక, తీసివేత, గుణకారం,శాతాన్ని లెక్కించడం, లాభం, నష్టం (శాతం లెక్కింపు లాభం, నష్టం అంశం నుంచి వినహాయింపు) చుట్టుకొలత, ప్రాంతం–బహుభుజి, దీర్ఘచతురస్రం, త్రిభుజాలు వస్తాయి. వీటిపై ఎక్కువ సాధన చేయాలి. కోణం రకాలు, బార్ రేఖాచిత్రం తప్పకుండా వస్తుంది. –చలపతినాయుడు, గణిత ఉపాధ్యాయుడు, మదనపల్లెవిద్యార్థి సామర్థ్యం అంచనావిద్యార్థి పఠనాశక్తిని అంచనా వేయడానికి పరీక్ష ఉంటుంది. సొంతంగా గద్యభాగం ఇస్తారు. ప్రతి అంశానికి ఐదు ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చదివి ప్రశ్నలకు జవాబులను సమాధానపత్రంలో గుర్తించాలి. కింద ఒక గద్యాంశం, దానికి కొన్ని ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థి దీనిని ఒక నమునాగా గ్రహించాలి. గద్యభాగం అర్థం, తెలుగుకు సంబంధించిన గద్యభాగాలను ఎక్కువగా ఇస్తారు. చిన్న పిల్లలకు ఇచ్చే పుస్తకాల్లో ఏదైనా ఒక కథ అంశాన్ని ఎంచుకుని ఇస్తారు. తెలుగు వాచకంలో ఎక్కడ ఉండవు. వీటికి మంచి మార్కులు తెచ్చుకుంటే సీటు సాధింవచ్చు. –క్రిష్ణయ్య, ఉపాధ్యాయుడు, మదనపల్లెపరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశాంఉమ్మడి చిత్తూరు జిల్లాలో పరీక్షలు రాసే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేశాం. 26 కేంద్రాలకు సిబ్బంది,ప్రత్యేక స్క్వాడ్, ఫ్లయింగ్ స్వా్కడ్ ఉంటారు. ప్రవేశపరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి నేరుగా సీట్లు కేటాయిస్తాం. ఇక్కడ సీటు వస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అన్ని వసతులు ఉంటాయి. ఒత్తిడి చేయడం, ప్రయోగ పూర్వకంగా బోధిస్తాం. ప్రతి రోజూ ఆయా తరతగతుల ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉంటుంది. –వేలాయుధన్, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ, మదనపల్లెప్రవేశ పరీక్ష తేదీ: 18–1–2025 ప్రవేశం: 6వ తరగతి పరీక్షా కేంద్రాలు: 26సమయం: ఉదయం 11.30 నుంచిమధ్యాహ్నం 1.30 గంటల వరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు: 5058సీట్లు: రాజంపేటలో 80, మదనపల్లెలో 80 -
ఉన్నత విద్య ఎంట్రన్స్లకే ఎన్టీఏ పరిమితం
న్యూఢిల్లీ: 2025 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఉద్యోగ ఎంపిక పరీక్షల నిర్వహణ బాధ్య తల నుంచి తప్పిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కేవలం ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలను మాత్రమే ఎన్టీఏ ఇకపై నిర్వహిస్తుందన్నారు. వచ్చే ఏడాదిలో ఈ మేరకు ఎన్టీఏను పునర్వ్యవస్థీకరించి, అవసరమైన కొత్త పోస్టులను సృష్టిస్తామని చెప్పారు. అంతేకాకుండా, నీట్‌ను సంప్రదాయ పెన్, పేపర్ విధానం బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)గా చేపట్టేందుకు ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి ప్రధాన్ మంగళవారం మీడియాకు చెప్పారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ సహా పలు పరీక్షా పత్రాల లీకేజీలు, రద్దు వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా పునర్వ్యవస్థీకరణకు పలు చర్యలు తీసుకుంటోంది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (క్యూయెట్– యూజీ)ను ఇకపైనా ఏడాదిలో ఒక్క పర్యాయం మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఎన్టీఏను ప్రవేశ పరీక్షల బాధ్యతలను మాత్రమే అప్పగించాలి. దాని సామర్థాన్ని పెంచిన తర్వాత ఇతర పరీక్షల బాధ్యతలను అప్పగించే విషయం ఆలోచించాలి’అని ఇస్రో మాజీ చీఫ్ ఆర్. రాధాకృష్ణన్ సారథ్యంలోని కమిటీ సిఫారసు చేసింది. సంబంధిత కోర్సులో జాయినయ్యే విద్యార్థి మాత్రమే ఆన్లైన్ పరీక్ష రాసేలా డిజి–యాత్ర మాదిరిగానే డిజి–ఎగ్జామ్ విధానాన్ని తీసుకురావాలని కమిటీ పేర్కొంది. ఇందుకోసం, ఆధార్, బయో మెట్రిక్‌తోపాటు ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్‌ను వినియోగించుకోవాలని సూచించింది. పరీక్షల నిర్వహణ, భద్రత, నిఘా, సాంకేతికత వంటి అంశాలకు సంబంధించి డైరెక్టర్ స్థాయిలో 10 సిఫారసులను చేసిందిఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధర తగ్గింపు2025 నుంచి ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధరలను తగ్గించనున్నట్లు మంత్రి ప్రధాన్ వివరించారు. ప్రస్తుతం ఏడాదికి 5 కోట్ల టెక్ట్స్ బుక్స్‌ను మాత్రమే ప్రచురిస్తున్నారన్నారు. 2025 నుంచి ముద్రణ సామర్థ్యాన్ని 15 కోట్లకు పెంచుతామని, నాణ్యమైన పుస్తకాలను అందిస్తామని ప్రక టించారు. పాఠ్య పుస్తకాల ధరలను పెంచి, విద్యా ర్థుల తల్లిదండ్రులపై భారం పెంచబోమన్నారు. మారిన సిలబస్ ప్రకారం 2026–27 నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. -
తెలంగాణలో ప్రారంభమైన గ్రూప్-3 పరీక్షలు
-
మొదలైన గ్రూప్-1 పరీక్ష
-
భారీ భదత్ర నడుమ.. తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్
-
పరీక్షలను రీషెడ్యూల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగాల కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నష్టం కలిగేలా రూపొందిన జీవో 29ను వెంటనే ఉపసంహరించుకోవాలని, గ్రూప్–1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెల్లవారితే పరీక్ష అని తెలిసి కూడా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారంటే.. వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని లేఖలో కోరారు. నిరుద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి, వారి డిమాండ్ మేరకు మార్పులు చేయాలన్నారు.జీవో 29 వల్ల 5,003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హులయ్యారని.. 563 పోస్టులకు గుండుగుత్తగా 1ః50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం అన్యాయమని సంజయ్ పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో అర్హత సాధించిన రిజర్వ్డ్ అభ్యర్థులను.. రిజర్వ్ కేటగిరీలో చేర్చడం అన్యాయమని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. పరీక్షలను రీషెడ్యూల్ చేయని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తుండటాన్ని గుర్తించాలని లేఖలో కోరారు. అసలు రిజర్వేషన్లనే రద్దు చేస్తున్నారన్న చర్చకు ఈ జీవో దారితీసిందని పేర్కొన్నారు. -
7, 10 తరగతులకు ‘ఎడ్యుకేషనల్ ఎపిఫని’ ప్రతిభా పరీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2024–2025 విద్యాసంవత్సరంలో 7,10 తరగతుల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించేందుకు ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ ఏటా నిర్వహించే ప్రతిభా పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం మంగళగిరిలోని పాఠశాల విద్య రాష్ట్ర కార్యాలయంలో డైరెక్టర్ విజయ రామరాజు వివరాలను విడుదల చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో విజేతలైన వారికి రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు.ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ అధ్యక్షుడు డాక్టర్ తవనం వెంకటరావు మాట్లాడుతూ 12 ఏళ్లుగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. 26 జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 7, 10 తరగతులు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రెండు దశల్లో జరిగే ఈ పరీక్షలో ప్రిలిమ్స్ డిసెంబర్ 29న, మెయిన్స్ జనవరి 19న నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర అకడమిక్ కేలండర్‌ను అనుసరించి డిసెంబర్ 2024 వరకు గల గణితం, సైన్స్, సోషల్ సిలబస్‌పై 80 శాతం ప్రశ్నలు, జీకే, ఐక్యూపై 20 శాతం ప్రశ్నలు ఉంటాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వచ్చే నెల 14 వరకు https://educationalepiphany.org/eemt2025/ registrations2025.php లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి సమాచారం కోసం www. educationalepiphany.org లేదా 9573139996/ 9666747996/ 6303293502లో సంప్రదించాలన్నారు. -
తెలంగాణ సివిల్ జడ్జీల ప్రధాన పరీక్ష రాసేందుకు ఆ 11 మందికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సివిల్ జడ్జీల ప్రధాన పరీక్ష రాయడానికి ఏపీకి చెందిన 11 మందికి సుప్రీంకోర్టు అనుమతి ఇచి్చంది. ఏపీకి చెందిన విందేల గీతాభార్గవి, సయ్యద్ సూఫియా, గంటా లావణ్య, రావూరి నాగలలిత శ్రీరమ్య ప్రభ, గుడిపల్లి దినేష్, పులి నాగవర్ధన్‌బాబు, షేక్ ఖమర్ సుల్తానా, మీనిగ హేమలత, మధునిక విశ్వనాథం, టి.రవికుమార్, బి.ప్రశాంత్‌బాబు తెలంగాణ సివిల్ జడ్జీల ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అయితే తెలంగాణ బార్ అసోసియేషన్ నుంచి ఎన్రోల్మెంట్ సరి్టఫికెట్లు లేకపోవడంతో ప్రధాన పరీక్షకు సంబంధించి ఆ పత్రాలు సమర్పించలేకపోయారు.తెలంగాణ బార్ అసోసియేషన్ నమోదు తప్పనిసరి అని నోటిఫికేషన్లో నిబంధన పేర్కొనడం వల్ల వీరంతా ప్రధాన పరీక్షకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో, ఈ నిబంధన ఏకపక్షంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర న్యాయ(సరీ్వస్, కేడర్)రూల్స్, 2023కు విరుద్ధంగా ఉందంటూ వారంతా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవై.చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం, రిజిస్ట్రార్ (జ్యుడీషియల్–1)లకు నోటీసులు జారీ చేసింది.బుధవారం ఆదేశాలు వెబ్సైట్లో అప్డేట్ చేసింది. అయితే, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకే సమయం ఉందని, మధ్యంతర ఉపశమనం కల్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది రితు భరద్వాజ్, అమోల్ చిత్రవంశి, రజత్‌గౌర్‌లు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం ఏప్రిల్ 10, 2024న జారీ చేసిన నోటిఫికేషన్‌తో ప్రారంభమైన రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాల్గొనడానికి పిటిషనర్లకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది. అయితే, కోర్టు తుది ఉత్తర్వులు వచ్చే వరకూ పిటిషనర్ల ఫలితాలు ప్రకటించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 23కు వాయిదా వేసింది. -
నాని గాయాలన్నీ ‘కట్టు’ కథలే
తిరుపతి రూరల్ (తిరుపతి జిల్లా) : చేతులకు కట్లు, కాళ్లకు బ్యాండేజీలు, మూతికి మాస్్కతో తాను తీవ్రంగా గాయపడ్డానని పులివర్తి నాని చేసిన హడావుడి అంతా ఒట్టి నాటకమని తేలిపోయింది. నాని తల, శరీరం, చేయి, కాలు.. ఇతరత్రా ఆయన శరీరంలో ఎక్కడా చిన్న దెబ్బ కూడా లేదని తేటతెల్లమైంది. స్విమ్స్ వేదికగా ఆయన సాగించిన హంగామా అంతా ఉత్తుత్తి నటనేనని అదే స్విమ్స్‌లో ఆయనకు తీసిన ఎక్స్‌రే, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్.. తదితర వైద్య పరీక్షలు స్పష్టం చేస్తున్నాయి. నాని ‘కట్టు’ కథలతో 37 మంది జైలు పాలయ్యారు. పలువురు ఉద్యోగులు బదిలీకి గురయ్యారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. పోలింగ్ అనంతరం మే 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ వద్ద గొడవ జరిగింది. టీడీపీ అభ్యర్థి అయిన నాని ఆ తర్వాత రెండు గంటలపాటు వర్సిటీ పరిసరాల్లోనే హుషారుగా తిరిగారు. అనుచరులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. స్వయంగా ధర్నాలో నేలపై కూర్చుని ఆందోళనలు చేశారు. నాడు ఆ వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. అనంతరం గొడవ సద్దుమణిగాక ఇంటికి వెళ్లిపోయారు. ఇంట్లో కాసేపు సేద తీరాక ఒక వ్యూహం రూపొందించుకుని హుటాహుటిన స్విమ్స్‌కు బయలుదేరారు. అక్కడ వాహనం నుంచి దిగగానే.. నడవ లేనట్లు.. శరీరం అంతా నొప్పులున్నట్లు అక్కడి వైద్యులకు చెప్పారు. వారు ఆయన తలకు, శరీరానికి, చేతికి, భుజాలకు, పొట్టకు, కాలికి.. ఇలా అన్ని రకాల వైద్య పరీక్షలు, ఎక్స్‌రేలు, సీటీ స్కానింగ్, ఎంఆర్ఐ సైతం చేశారు. ఆ గొడవలో తాను తీవ్రంగా గాయపడినట్టు పబ్లిసిటి ఇచ్చుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత నానిపై దాడి జరిగిందని, ఆయనకు ఏమో అయిపోయిందని ఎన్నికల కమిషన్ అనేక మంది పోలీసులు, ఉద్యోగులను సస్పెండ్ చేసింది. అమాయకులైన 37 మందిపై పోలీసులు కేసులు పెట్టి, జైలుపాలు చేశారు. వారు ఇప్పటికీ జైలులో మగ్గుతున్నారు. ఒక్క గాయం లేదని వైద్య నివేదికలు వెల్లడి పులివర్తి నాని స్విమ్స్‌లో చేయించుకున్న వైద్య పరీక్షల నివేదికలు ఇటీవల వెలుగు చూశాయి. నాని తలకు, శరీరానికి, చేతికి, భుజానికి, పొట్టకు, కాలికి ఎక్కడా ఎలాంటి గాయాలు లేవని ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్స్‌రేలు, ఎంఆర్ఐ, సీటీ స్కానింగ్.. ఇతరత్రా వైద్య పరీక్షలు అన్నిటిలోనూ నానికి ఎలాంటి గాయాలు లేవని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో నాని స్వార్థంతో ఆడిన నాటకం వల్ల ఇబ్బంది పడిన వారంతా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య నివేదికలను ముఖ్యమంత్రికి, హైకోర్టు, గవర్నర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతికి పంపించేందుకు సిద్ధం అవుతున్నారు. తమ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన వారు అనవసరంగా నెలల తరబడి జైలులో మగ్గుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. సస్పెండ్ అయి జీతాలు రాక, ఎన్నికల కమిషన్ చేసిన సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియక పలువురు ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాని తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. నాని నాటకం బట్టబయలు రాజకీయ స్వార్థంతోనే నాని గాయపడినట్లు నాటకాలు ఆడారు. గాయం కాని ఘటనలో అమాయకులు 37 మందిపై కేసులు నమోదు చేయించి వేధించారు. దాడి చేయడానికి 37 మంది వస్తే ఏ చిన్న గాయం కాకుండా బయటకు వస్తారా? సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటారా? ప్రజలు, ప్రభుత్వం, అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచించాలి. నాని అద్భుత నటనతో ఉద్యోగులు, పోలీసులను బలిపశువులు చేశాడు. 37 మందిని జైలుకు పంపించాడు. ఆ కుటుంబాల శాపం ఆయనకు తగిలి తీరుతుంది. దేవుడు, ప్రకృతి చాలా గొప్పవి. – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, చంద్రగిరి -
తెలంగాణలో డీఎస్సీ ఎగ్జామ్స్ షురూ
-
Dharmendra Pradhan: రెండు రోజుల్లో నీట్–పీజీ పరీక్ష షెడ్యూల్
న్యూఢిల్లీ: నీట్–పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) ఒకటి రెండ్రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నీట్–పీజీ పరీక్ష ప్రశ్నపత్నం డార్క్‌నెట్‌లో లీకైందని, టెలిగ్రామ్ యాప్‌లో షేర్ చేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. కీలకమైన పోటీ పరీక్షల్లో పేపర్ లీకవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గతవారం జరగాల్సిన నీట్–పీజీ పరీక్షను ముందు జాగ్రత్తగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే జూన్ 18న జరిగిన యూజీసీ–నెట్ పరీక్ష సైతం రద్దయ్యింది. -
ఏపీ, తెలంగాణాలో తెలుగులోనే నీట్ ఎగ్జామ్
-
పేపర్ లీక్ కట్టడికి యూపీ సర్కారు సరికొత్త ప్రణాళిక
దేశవ్యాప్తంగా పేపర్ లీక్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో జరిగే పరీక్షల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు పలు చర్యలు ప్రారంభించాయి. వాటిలో ఉత్తరప్రదేశ్ ఒకటి.ఉత్తరప్రదేశ్ జనాభాలో 56 శాతం మంది యువతే ఉన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టాలని ఇక్కడి యువత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటుంది. తాజాగా యూపీలోని యోగి సర్కారు పేపర్ లీకేజీలను అరికట్టేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్రంలో జరిగే ఏ పరీక్షకైనా వాటి నిర్వహణ బాధ్యతను నాలుగు ఏజెన్సీలకు అప్పగిస్తారు.ప్రింటింగ్ ప్రెస్ ఎంపికలో గోప్యత ఉండటంతోపాటు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఆ ప్రింటింగ్ ప్రెస్‌ను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. ప్రింటింగ్ ప్రెస్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తారు. బయటి వ్యక్తులెవరూ ప్రెస్‌లోకి ప్రవేశించడానికి అనుమతించరు. ప్రింటింగ్ ప్రెస్‌లోనికి స్మార్ట్ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లడాన్ని నిషేధిస్తారు.రాష్ట్రంలో జరిగే ఏదైనా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య నాలుగు లక్షలు దాటితే, ఆ పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రతి షిఫ్ట్‌లో తప్పనిసరిగా రెండు లేదా అంతకంటే ఎక్కువ పేపర్ సెట్లు అందుబాటులో ఉంచుతారు. ఒక్కో సెట్ ప్రశ్నాపత్రాల ముద్రణ వివిధ ఏజెన్సీల ద్వారా జరుగుతుంది. అలాగే ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పలు చర్యలు చేపట్టనున్నారు. -
అలా చేస్తే నీట్–యూజీ గౌరవం దెబ్బతింటుంది
సాక్షి, న్యూఢిల్లీ: పేపర్ లీకేజీ, పరీక్ష నిర్వహణలో లోపాలు పేరిట మళ్లీ నీట్–యూజీ పరీక్ష నిర్వహిస్తే ఈ పరీక్షకున్న గౌరవం దెబ్బతింటుందని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం వ్యాఖ్యానించింది. పేపర్ లీకేజీ ఆరోపణలు వెల్లువెత్తడంతో మీ స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఆదేశించింది.వైద్యవిద్య ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్–యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ అయిందని, పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని విపక్షాలు ఆరోపించడంతోపాటు పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ పిటిషన్‌ను కోర్టు మంగళవారం విచారించింది.మళ్లీ అడిగితే పిటిషన్‌ను కొట్టేస్తాంఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సుల అడ్మిషన్లను నిలిపేయాలంటూ చేసిన పిటిషనర్ల తరఫున న్యాయవాది మ్యాథ్యూస్ జె.నెడుమ్‌పారా చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ‘‘ ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యాయి. ముందే ప్రశ్నపత్రం సంపాదించి పరీక్షలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు. లక్ష సీట్లు ఉంటే 23 లక్షల మంది పరీక్ష రాశారు. అత్యంత కఠినమైన ఈ పరీక్షలో ఏకంగా 67 మంది విద్యార్థులు 720 మార్కులకుగాను సరిగ్గా 720 మార్కులు సాధించారు.ఢిల్లీలోని భారతీయ విద్యాభవన్ మెహతా విద్యాలయలో ప్రశ్నలకు సమాధానాలు వెతికే ముఠాతో ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులుసహా నలుగురిని ఇప్పటికే అరెస్ట్‌చేశారు’’ అని లాయర్ వాదించారు. ‘‘కౌన్సిలింగ్‌ను ఆపేది లేదు. అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. ఆపాలని మీరు ఇలాగే వాదనలు కొనసాగిస్తే మీ పిటిషన్‌ను కొట్టేస్తాం’ అని లాయర్‌ను ధర్మాసనం హెచ్చరించింది. ‘‘ మళ్లీ ఎగ్జామ్ నిర్వహించడమంటే ఆ పరీక్ష పవిత్రతను భంగపరచడమే.ఆరోపణలపై మాకు సరైన సమాధానాలు కావాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏలతోపాటు పరీక్షకేంద్రంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలున్న బిహార్ ప్రభుత్వానికీ కోర్టు నోటీసులు పంపించింది. శివాంగి మిశ్రా, మరో 9 మంది ఎంబీబీఎస్ ఆశావహులు పెట్టుకున్న పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో దీనిపై స్పందన తెలపాలని ఎన్టీఏను కోర్టు ఆదేశించింది. కోర్టు వేసవికాల సెలవులు ముగిసే జూలై 8వ తేదీన ఈ కేసు తదుపరి విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది. -
గ్రూప్–1 పరీక్ష రాసి వస్తుండగా విషాదం
ధారూరు: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన జూనియర్ పంచాయతీ కార్యదర్శి తిరుగుప్రయాణంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మండల పరిధిలోని తాండూరు–హైదరాబాద్ ప్రధాన మార్గంలో గట్టెపల్లి బస్‌స్టేజీ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ధారూరు ఎస్ఐ వేణుగోపాల్‌గౌడ్ తెలిపిన ప్రకారం.. బొంరాస్‌పేట మండలం బొట్లోనితండా పంచాయతీ పరిధిలోని దేవులానాయక్ తండాకు చెందిన బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నెహ్రూనాయక్‌కు, దుద్యాల మండలం ఈర్లపల్లి తండాకు చెందిన సుమిత్రాబాయి(29) తో మూడేళ్ల క్రితం వివాహమైంది. సుమిత్రాబాయి యాలాల మండలం అచ్యుతాపూర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తోంది. వీరిద్దరూ ప్రిలిమినరీ పరీక్ష రాసి తండాకు తిరిగి వెళ్తున్నారు. ధారూరు మండలం గట్టెపల్లి సమీపంలో వర్షం కురుస్తుండడంతో సుమిత్రబాయి గొడుగు తెరిచి పట్టుకుంది. ఈ క్రమంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో గొడుగు గాలికి ఉల్టా అవ్వడంతో బైక్ అదుపుతప్పింది. సుమిత్రాబాయి కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను వెంటనే తాండూరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దీన్నే పిచ్చి అంటారండి ! మహిళా టీచర్ క్రేజీ రీల్ వైరల్
సోషల్‌మీడియాలో పాపులర్ అవ్వడం కోసం, లైక్‌ల కోసం యూజర్లు చేస్తున్న పనులకు హద్దు లేకుండా పోతోంది. తాజాగా ఒక ఉపాధ్యాయురాలు పేపర్లు దిద్దుతూ కూడా రీల్ చేసింది. దీన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీనిపై చాలామంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.. కట్ చేస్తే...బిహార్‌లోని పాటలీ పుత్ర యూనివర్శిటీ (పీపీయూ) చెందిన టీచర్ పరీక్ష పేపర్ కరెక్షన్స్ చేస్తోంది. దీన్ని ఏకంగా ఇన్స్టాగ్రామ్ రీల్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విచిత్ర విచిత్రమైన ఫన్నీ కామెంట్స్ చేశారు. पीपीयू एग्जाम का कॉपी जांचने का रील्स इंस्टाग्राम पर वायरल, मैडम पर FIR दर्ज। pic.twitter.com/GlnZhH4Yuk— छपरा जिला 🇮🇳 (@ChapraZila) May 26, 2024 హే మేడమ్, కొత్తగా పెళ్లైన పెళ్లికూతురులా కనిపిస్తోంది' అని ఒకరంటే, దీన్నే పిచ్చి అంటారండి అంటూ మరొకరు ఫన్నీగా వ్యాఖ్యానించారు. ఒక టీచర్‌గా మీరు చేయాల్సిన పని ఇదేనా అంటూచాలామంది మండి పడ్డారు. ఇలాంటివాళ్లు సిగ్గుతో చచ్చిపోవాలి.. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదైనాయి అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. చివరికి ఇది ఉన్నతాధికారులదాకా చేరడంతో టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. -
పరీక్షల్లో మ్యాజిక్ చేసిన ట్విన్స్ : ఇలా కూడా ఉంటారా?
కర్ణాటకలోని హాసన్ ప్రాంతానికి చెందిన కవల అక్కాచెల్లెళ్లు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. రెండు నిమిషాల తేడాతో పుట్టిన ట్విన్స్ చుక్కి, ఇబ్బని ఒకే పోలికలతో ఉంటారు. అంతేకాదు పరీక్షా ఫలితాల్లో కూడా ఒకేలా మార్కులు తెచ్చుకోవడం విశేషంగా నిలిచింది. కర్ణాటకలో విడుదలైన 12వ తరగతి పరీక్షలలో ఇద్దరికీ సమానంగా మార్కులు వచ్చాయి. 600 మార్కులకు గాను ఇద్దరూ 571 మార్కులు సాధించారు. అంతే కాదు గతంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఇలాంటి మ్యాజిక్కే జరిగింది.ఇద్దరూ 625 మార్కులకు 620 మార్కులు తెచ్చు కున్నారు. దీంతే భలే అదృష్టం అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. సాధారణంగా కవలలు ఒకేలాగా ఆలోచించడం, ఒకేసారి శారీరక సమస్యలు రావడం చూస్తాం. కానీ పరీక్షల్లో కూడా ఒకేలా మార్కులు రావడం అదృష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఇద్దరికీ 97 శాతం మార్కులొస్తాయని ఆశించాం. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించ లేదని పెద్ద అమ్మాయి అయినా చుక్కి సంతోషం ప్రకటించింది. తమకూ ఇది ఆశ్చర్యకరంగా ఉందని తెలిపింది. రెండేళ్ల క్రితం పదో తరగతిలో కూడా ఇలానే సమాన మార్కులు సాధించా మని చెప్పుకొచ్చింది. చుక్కి, ఇబ్బని కర్ణాటకలోని హసన్ నగరంలో ఎన్డిఆర్కె పియు కాలేజీలో 12వ తరగతిపూర్తి చేశారు. ప్రస్తుతం నీట్‌కోసం సిద్ధమవుతున్నారు. నీట్ పరీక్షలో వచ్చిన ఫలితాన్ని ఇంజనీరింగ్, మెడిసిన్ అనేది నిర్ణయించుకుంటారట. మీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడు తున్నారా..? అని ప్రశ్నించగా నా కంటే అక్క ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నేను ఎలా సంతోషిస్తానో అక్క కూడా అంతే.. ఇద్దరికీ పోటీ ఏమీ లేదు అని చెప్పింది. కేవలం చదువులు మాత్రమే కాకుండా సంగీతం, నృత్యం, అలాగే ఆటల్లో కూడా ముందుంటాం అని చెప్పారు. ఇద్దరిదీ ఒకే ఆశయమట. అటు తండ్రి వినోద్ చంద్ర తన బిడ్డలు సాధించిన ఘనతపై ఆశ్చర్యాన్ని ప్రటకించారు. ఇది తనకు గర్వకారణమని చెప్పారు ఇబ్బానీ తన సోదరి కంటే భాషలలో మెరుగ్గా స్కోర్ చేసిందనీ, సైన్స్, మిగిలిన సబ్జెక్టులలో ఒకటి నుండి రెండు మార్కులే తేడా అని చెప్పారు. వాళ్ళు కలిసే పనులు చేసుకుంటారు స్నేహంగా ఉంటారు. కలిసే చదువుకుంటారు. ఒకవిధంగా చెప్పాలంటే ఇద్దరూ పుస్తకాల పురుగులు అని తెలిపారు చంద్ర ఒకింత గర్వంగా. -
పరీక్షల పద్ధతిని ప్రవేశ పెటిందెవరో మీకు తెలుసా..!
'విద్యార్థులు వారి జీవితంలో ఎన్నో చిక్కులను ఎదుర్కుంటూ ఉంటారు. తమాషాగా చెప్పాలనుకుంటే.. వారి జీవితంలో పరీక్షలు కూడా ఒక పెద్ద చిక్కులాగా భావిస్తూంటారు. ఈ పరీక్షలు వారి జీవితాలను మలుపు తిప్పుతాయనీ.., వారి జీవిత పాఠాలను(చదువు) ఎంత నేర్చుకున్నారో వారికే గుర్తుచేస్తాయనే విషయం వారు గ్రహించకపోవడంలో అతిశయోక్తి లేదనే చెప్పవచ్చు. మరి ఇలాంటి పరీక్షలను రాయాలని మొదటగా కనుగొన్న వ్యక్తి ఎవరో తెలిస్తే.. 'అబ్బో' అంటూ నోరెళ్లబెట్టక తప్పదు. ఇక ఎవరో చూద్దాం..' స్కూల్లో చేరింది మొదలు పిల్లలకు రకరకాల పరీక్షలు తప్పవు. మొట్టమొదటి సారిగా ఈ పరీక్షల పద్ధతిని అమెరికాలో స్థిరపడ్డ జర్మన్ ప్రొఫెసర్ హెన్రీ ఫిషెల్ ప్రవేశపెట్టాడు. ఇండియానా యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఈ ఘనకార్యానికి ఒడిగట్టాడు. ఇవి చదవండి: కార్టూన్ సిరీస్‌లతో జర జాగ్రత్త..! ఎందుకంటే? -
ఇంగ్లిష్ 'పది'లం
మా లాంటి పేదలకు అండగా సీఎం గిరిజన ప్రాంతంలో జన్మించిన నేను ప్రారంభంలో తెలుగు మీడియంలోనే చదువుకున్నా. జగన్ మావయ్య ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నా. ప్రస్తుతం జీకే వీధి ఇంగ్లిష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. జగన్ మావయ్య మాలాంటి పేద విద్యార్థులకు అండగా నిలిచారు. ఉన్నత చదువులు చదివి మావయ్య ఆశయాన్ని సాధిస్తా. మా అమ్మ కిల్లో జమున, నాన్న కిల్లో నవకుమార్ పోడు వ్యవసాయం చేస్తారు. ఆ ఆదాయంతో నన్ను చదివించేవారు. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఉచితంగా వసతి కల్పిస్తున్నారు. టీచర్లు బాగా బోధిస్తున్నారు. – కె.ధారామణి, ఇంగ్లిష్ మీడియం గిరిజన ఆశ్రమ పాఠశాల, జీకే వీధి, అల్లూరి జిల్లా సాక్షి, అమరావతి: విద్యా రంగంలో సమూల సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్ల క్రితం తలపెట్టిన చదువుల యజ్ఞం సత్ఫలితాలనిస్తోంది. మన విద్యార్థులు అంతర్జాతీయంగా సత్తా చాటుకునేలా దూరదృష్టితో ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన ఇంగ్లిష్ మీడియం చదువులకు ఆదరణ పెరుగుతోంది. ఇన్నాళ్లూ మాతృభాష ముసుగులో పేద బిడ్డల ఇంగ్లిష్ చదువులకు అడ్డుపడుతూ కొందరు పెత్తందార్లు కార్పొరేట్ విద్యా సంస్థల కొమ్ము కాశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో పేద విద్యార్థుల కోసం ఇంగ్లీషు మీడియం తీసుకొస్తే తెలుగును అణగదొక్కుతున్నారంటూ విష ప్రచారం చేశారు. అందరూ ఆంగ్లంలోనే చదివితే తమ పరిస్థితి ఏం కావాలని కార్పొరేట్ విద్యా సంస్థలు బెంబేలెత్తాయి. ఇవన్నీ అధిగమిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలు మంచి ఫలితాలను నమోదు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియంలో టెన్త్ పరీక్షలు రాసే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సర్కారీ స్కూళ్లలో గత ఐదేళ్లలో దాదాపు 25 శాతం మంది విద్యార్థులు తెలుగు నుంచి ఇంగ్లీషు మీడియంలోకి మారిపోయి పదో తరగతి పరీక్షలకు హాజరైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఇంగ్లీషు మీడియం చదువులను ముఖ్యమంత్రి జగన్ అందిస్తుండటం తెలిసిందే. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో అత్యధిక విద్యార్థులు తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి మారారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తదితరాలతో కిట్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. విద్యార్ధులు సులభంగా అర్ధం చేసుకోవడానికి వీలుగా బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలను సమకూరుస్తోంది. ఇప్పటివరకు జగనన్న విద్యా కానుక కింద రూ.3,366.53 కోట్లను వ్యయం చేయగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యా కానుక నిధులను సిద్ధం చేస్తూ రూ.1,042.51 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేసింది. ► వచ్చే నెలలో టెన్త్ పరీక్షలు రాయనున్న మొత్తం విద్యార్ధులు 6.23 లక్షల మంది ఉండగా ఏకంగా 4.51 లక్షల మందికిపైగా ఇంగ్లీషు మీడియంలోనే పరీక్షలు రాయనుండటం గమనార్హం. వీరిలో ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న వారు ఏకంగా 3.97 లక్షల మంది ఉన్నారు. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న వారి సంఖ్య 2.25 లక్షల వరకు ఉంది. ఇంగ్లీషు మీడియంలో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య త్వరలోనే వంద శాతానికి చేరుతుందంని విద్యావేత్తలు, నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాలకు పదును పెడుతూ టోఫెల్ శిక్షణ సైతం అందుబాటులోకి తెచ్చిందని ఉదహరిస్తున్నారు. ► చంద్రబాబు హయాంతో పోలిస్తే ఐదేళ్లలో పరిస్థితి తిరగబడింది. సీఎం జగన్ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు ఆంగ్ల మాధ్యమంలో రాయనున్న విద్యార్ధులు 72.54 శాతానికి పెరిగారు. ఈసారి తెలుగు మీడియంలో టెన్త్ పరీక్షలు రాసే విద్యార్ధులు 26.74 శాతం మంది మాత్రమే ఉన్నారు. మిగతా అతి స్వల్ప శాతం విద్యార్థులు ఉర్దూ, కన్నడ, తమిళం, ఒడియా భాషల్లో చదువుతున్న వారున్నారు. ► టీడీపీ హయాంలో ఇంగ్లీషు మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య 2.88 లక్షలు కాగా ఇప్పుడు ఏకంగా 4.51 లక్షలకు పెరిగింది. గత సర్కారు హయాం కంటే ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో పరీక్షలు రాసే వారి సంఖ్య 1.63 లక్షలు పెరగడం గమనార్హం. వీరంతా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంలో చదివిన విద్యార్థులే కావడం మరో విశేషం. పరీక్షలపై సీఎస్ సమీక్ష వచ్చే నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, ఇతర భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్లు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లును సమీక్షించాలని ఆదేశించారు. మంచినీటి సౌకర్యంతో పాటు బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్ సౌకర్యాలుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ పోలీస్ స్క్వాడ్లను నియమించాలని ఎస్పీలను ఆదేశించారు. జగన్ మావయ్య ఆశయాన్ని సాధిస్తా గిరిజన ప్రాంతంలో జన్మించిన నేను ప్రారంభంలో తెలుగు మీడియంలోనే చదువుకున్నా. జగన్ మావయ్య ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా. ప్రస్తుతం జీకే వీధి ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. జగన్ మావయ్య ఇంగ్లీష్ మీడియం పెట్టి మాలాంటి పేద విద్యార్థులకు అండగా నిలిచారు. ఉన్నత చదువులు చదివి మావయ్య ఆశయాన్ని సాధిస్తా. మా అమ్మ కిల్లో జమున, నాన్న కిళ్లో నవకుమార్ పోడు వ్యవసాయం చేస్తారు. వాటి నుంచి వచ్చే ఆదాయంతో నన్ను చదివించేవారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉచితంగా మాకు వసతి కల్పిస్తున్నారు. స్కూల్లో టీచర్లు చాలా బాగా బోధిస్తున్నారు. – కె.ధారామణి, ఇంగ్లీష్ మీడియం గిరిజన ఆశ్రమ పాఠశాల, జీకే వీధి, అల్లూరి జిల్లా. కోరిక నెరవేరింది మా ఊరి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివా. ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్నది నా చిన్ననాటి కోరిక. పేదరికం కారణంగా నా ఆశ నెరవేరదేమో అనుకున్నా. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో నా కోరిక నెరవేరింది. ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో ఆరో తరగతి చదువుతున్నా. జగన్ మామకు మేమంతా రుణపడి ఉంటాం. మా అమ్మ చిలకమ్మ నన్ను కాన్వెంట్లో ఇంగ్లీషు మీడియంలో చదివించాలని బలంగా కోరుకునేది. దళితులమైనందున పేదరికంతో కాన్వెంట్లో చదివించలేకపోయింది. ప్రభుత్వ స్కూళ్లలో జగనన్న ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో మా అమ్మ కోరిక నెరవేరింది. –సామాబత్తుల లక్ష్మి, కాకినాడ జిల్లా, సంపర ప్రాధమిక పాఠశాల మా అదృష్టం.. కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పడం మా అదృష్టం. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవడానికి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడటానికి ఇంగ్లీష్ మీడియం పునాదిగా ఉపయోగపడుతుంది. మా తల్లిదండ్రులు నాగరాజు, పద్మావతి బేల్దారి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మాలాంటి పేదలకు ఇంగ్లీష్ మీడియం అందించిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. –తలారి శ్వేత, అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం -
Public Exam Bill 2024: పేపర్ లీకేజీలు, రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలపై కేంద్రం కొరడా
న్యూఢిల్లీ: ఉద్యోగాల భర్తీ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీ ఉదంతాలతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో పరీక్షల అక్రమార్కులపై కేంద్రం కఠిన చర్యల కొరడా ఝులిపించింది. పేపర్ లీకేజీలు, నకిలీ వెబ్సైట్లుసహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు–2024’ను తీసుకొచ్చింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం, దాని ఏజెన్సీలు నిర్వహించే పబ్లిక్ ఎగ్జామ్స్‌లో అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు ఇన్నాళ్లూ ప్రత్యేకంగా ఎలాంటి చట్టం లేకపోవడంతో దీనిని తీసుకొచ్చారు. బిల్లులో ఏముంది? ► ప్రశ్నపత్రం, ప్రశ్నపత్రం కీ లీకేజీకి పాల్పడి నా, కంప్యూటర్ నెట్వర్క్/ రీసోర్స్/ సిస్టమ్‌ను ట్యాంపర్ చేసిన వ్యక్తులు/సంస్థలను కఠినంగా శిక్షిస్తారు ► నకిలీ వెబ్సైట్లు నిర్వహించడం, నకిలీ ఉద్యోగ/ప్రవేశ పరీక్షలు చేపట్టడం, నకిలీ అడ్మిట్ కార్డులు, ఆఫర్ లెటర్లు ఇవ్వడం, ఒకరి బదులు ఇంకొకరితో ఎగ్జామ్ రాయించడం వంటి అవకతవకలు చేసి నగదు వసూళ్లకు పాల్పడితే గరిష్టంగా ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. ► వీటితో ప్రమేయమున్న వ్యక్తులు/సంస్థలు/ఏజెన్సీలు/వ్యాపారసంస్థలు/ సబ్‌కాంట్రాక్టర్‌కు రూ.1 కోటి జరిమానా విధిస్తారు. ఇంకోసారి ప్రభుత్వం నుంచి సంబంధిత పనులు చేపట్టకుండా నాలుగేళ్లపాటు నిషేధం విధిస్తారు. ► యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వంటి సంస్థలు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్స్‌లో కలగజేసుకున్న అక్రమార్కులను సంబంధిత నియమాల కింద శిక్షిస్తారు. నీట్, జేఈఈ, సీయూఈటీ పరీక్షలకూ ఈ బిల్లులోని నియమాలు వర్తిస్తాయి. ► ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బాధ్యతలు చూసే కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల సిబ్బంది మొత్తం ఈ చట్టపరిధిలోకి వస్తారు. -
TSPSC విషయంలో వీడని సందిగ్ధం
-
ఏపీలో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు
-
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..ఇంకా ఇతర అప్డేట్స్
-
కర్ణాటక కీలక నిర్ణయం: పరీక్షల్లో తలను కవర్ చేయడం నిషేధం..కానీ..!
కర్ణాటక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. నియామక పరీక్షల సమయంలో తలపై ధరించే అన్ని రకాల దుస్తులను నిషేధించింది. దీనికి సంబంధించి కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ బోర్డు (KEA) కీలక అదేశాలు జారీ చేసింది. కానీ కొన్ని సంస్థల ఆందోళన నేపథ్యంలో మంగళసూత్రాలు (వివాహిత హిందూ మహిళలు ధరించే నల్ల పూసల నెక్లెస్‌లు) మెట్టెలకు అనుమతి ఉంటుందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ బోర్డులు, కార్పొరేషన్లు నియామక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. బ్లూటూత్ డివైసెస్ ద్వారా అభ్యర్థుల మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రకాల హెడ్ కవర్లపై నిషేధం విధిస్తున్నట్టు కేఈఏ ప్రకటించింది. తల, నోరు లేదా చెవులను కప్పి ఉంచే ఏదైనా వస్త్రం లేదా టోపీ ధరించినవారికి పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదని కేఈఏ స్పష్టం చేసింది. అలాగే పరీక్ష హాల్ లోపల ఫోన్లు ,బ్లూటూత్ ఇయర్ఫోన్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు అనుమతి ఉండదు. దీంతోపాటు మెటల్ ఆభరణాలపై నిషేధం ఉంటుందని తెలిపింది. అయితే వివాహతులైన హిందూ మహిళలు, మంగళ సూత్రాలు, నల్ల పూసలు,మెట్టెలు ధరించవచ్చని ప్రకటించింది. డ్రెస్ కోడ్ నిషేధిత వస్తువుల జాబితాలో హిజాబ్‌ను స్పష్టంగా పేర్కొననప్పటికీ తాజా ఆదేశాలు వివాదాస్పదంగా మారనున్నాయి. ఇది ఇలా ఉంటే అక్టోబర్‌లో జరిగిన రిక్రూట్మెంట్ పరీక్షల సందర్భంగా కేఈఏ హిజాబ్‌లను అనుమతించిన సంగతి గమనార్హం. అయితే బ్లూటూత్ పరికరాల వినియోగంపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. 2023 అక్టోబర్‌లో KEA నిర్వహించిన పరీక్షల్లో కల్బుర్గి, యాద్గిర్ పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు బ్లూటూత్ ఉపయోగించారన్న ఆరోపణలపై ప్రభుత్వం నవంబర్ 11న CID విచారణకు ఆదేశించింది. అంతకుముందు 2022లో, రాష్ట్రంలోని తరగతి గదుల్లో హిజాబ్‌ను నిషేధించడంపెద్ద దుమారాన్ని రేపింది. అయితే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఈ ఉత్తర్వును 10, 12వ తరగతి వంటి ఇతర బోర్డు పరీక్షలతో పాటు KEA నిర్వహించే సాధారణ ప్రవేశ పరీక్షలకు కూడా పొడిగించిన సంగతి తెలిసిందే. -
పరీక్షలపై పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణలో మార్పులుండే అవకాశం కనిపిస్తోంది. పరీక్షల నిర్వహణపై అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 2024 మార్చి, ఏప్రిల్‌లలో ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఏప్రిల్‌లో టెన్త్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే అనేక కారణాల వల్ల టెన్త్, ఇంటర్ సిలబస్ అనుకున్న మేర పూర్తి కాలేదు. గత మూడు వారాలుగా ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికలపై దృష్టి పెట్టింది. పోలింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ అధికారులకు శిక్షణ అందించింది. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన వారు క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో బోధన కుంటుపడుతోంది. నవంబర్ నెలాఖరు వరకూ పోలింగ్ విధుల్లోనే అధికారులు ఉండనున్నారు. బోధన, బోధనేతర సిబ్బంది సైతం ఇదే పనిలో నిమగ్నం కానున్నారు. దీంతో డిసెంబర్ మొదటి వారం వరకు విద్యాసంస్థల్లో బోధన పూర్తిస్థాయిలో సాగే అవకాశం కనిపించట్లేదని ఇంటర్ బోర్డు, టెన్త్ పరీక్షల విభాగం భావించాయి. సిలబస్ కాకుండా టెన్త్ పరీక్షలెలా? టెన్త్ పబ్లిక్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో 2 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు 40 శాతం సిలబస్ కూడా పూర్తికాలేదు. పుస్తకాల సరఫరాలో జాప్యం, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశం కొంతకాలం కొనసాగడం వల్ల బోధనకు ఆటంకం ఏర్పడింది. దీనికితోడు దసరా తర్వాత నుంచి ఎన్నికల కోలాహలమే నెలకొంది. వాస్తవానికి జనవరి నాటికి టెన్త్ సిలబస్ పూర్తవ్వాలి. జనవరి రెండో వారంలో పునశ్చరణ చేపట్టాలి. కానీ ప్రస్తుతం డిసెంబర్ మధ్య వరకు బోధనే కొనసాగకపోతే సిలబస్ ఎలా పూర్తవుతుందని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. సిలబస్ పూర్తికాకుండా పరీక్షలు పెడితే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్షలను మరో నెలపాటు వాయిదా వేసే అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఇంటర్‌లోనూ అదే జాప్యం... ఇంటర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నవంబర్ మొదటి వారం వరకు ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. ఆలస్యంగా చేరిన వారికి ఇప్పటికీ పుస్తకాలు అందలేదు. చాలా చోట్ల ఒక్కో సబ్జెక్టులో కనీసం ఒక్క చాప్టర్ కూడా బోధించలేదని అధ్యాపకులు అంటున్నారు. ఈ ఏడాది ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించాలని భావించారు. కానీ ఇప్పటికీ ఈ ప్రక్రియపై అధ్యాపకులకే శిక్షణ నిర్వహించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు రాస్తే ప్రైవేటు కాలేజీల విద్యార్థులతో పోటీ పడలేరని ప్రభుత్వ కాలేజీల లెక్చరర్లు అంటున్నారు. ఈ అంశాలపై ఇంటర్ బోర్డు అధికారులు తర్జనభర్జనపడుతున్నారు. పరీక్షల తేదీలను పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రశ్నపత్రాల తయారీలోనూ ఆలస్యం... అక్టోబర్, నవంబర్‌లలోనే ప్రశ్నపత్రాల కూర్పుపై ఇంటర్, టెన్త్ పరీక్షల విభాగాలు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టు నుంచి 12 మంది నిపుణులను ఎంపిక చేసుకొని గోప్యంగా ప్రశ్నపత్రాలు తయారు చేయించి వాటిల్లోంచి మూడు సెట్లను ఉన్నతాధికారులు ఎంపిక చేస్తే ఆ తర్వాత అవి ప్రింటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ పరీక్షలకు సంబంధించి మార్కుల క్రోడీకరణకు సాంకేతిక ఏర్పాట్లు కూడా డిసెంబర్ నాటికి చేపట్టాలి. కానీ ప్రస్తుతం సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండడంతో ప్రశ్నపత్రాలపై ఇప్పటికీ దృష్టి పెట్టలేదని అధికార వర్గాలు అంటున్నాయి. -
‘చెంచు’ చిచ్చరపిడుగు
పది లక్షల మందిలో ప్రథముడు ఊహ తెలియకముందే అమ్మ ప్రేమకు దూరమయ్యాడు.. నాలుగేళ్లకే మంటలంటుకొని కాళ్లు, చేతులు, శరీరం కాలిపోయింది.. 60 శాతం గాయాలతో ఆస్పత్రికి తీసుకెళితే..బతకడమే కష్టమని డాక్టర్లు అన్నారు.. ఆరేళ్ల ప్రాయంలోనే 3 మేజర్ సర్జరీలు జరిగాయి. ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లోకి రాలేదు... ఈ పరిచయమంతా ఓ నల్లమల కుర్రాడి గురించి... లోకం పోకడనే తెలియని.. ఇప్పటికీ నాగరికతకు దూరంగా ఉండే చెంచుల నుంచి ఓ చిచ్చర పిడుగు జాతీయస్థాయిలో ప్రతిభ చాటాడు. పదిలక్షల మంది విద్యార్థులు పోటీ పడగా, అందరికంటే ముందువరుసలో నిలిచాడు.. అతడే ’మిలియనీర్ ’దినేశ్. సాక్షి, ప్రత్యేకప్రతినిధి/నాగర్‌కర్నూల్ : వ్యక్తిగత పరిశుభ్రతపై దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో నల్లమలకు చెందిన విద్యార్థి ప్రతిభ చాటాడు. అపోలో హాస్పిటల్, డెటాల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన టోటల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతపై పరీక్ష జరగ్గా, ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న దినేష్ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచాడు. దినేష్ బతకడమే కష్టమన్నారు... నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరుకు చెందిన దినేష్ తండ్రి కరమ్‌చంద్ కొన్నాళ్లు కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేశాడు. ఈయన భార్య మహేశ్వరి దినేష్‌కు ఊహ తెలియకముందే కన్నుమూసింది. తల్లి ప్రేమకు దూరమై పెరిగిన దినేష్ నాలుగేళ్ల వయసులో ఇంట్లో స్టవ్ దగ్గర ఆడుకుంటుండగా ప్రమాదం జరిగింది. ముఖం, కాళ్లు, చేతులు 60 శాతం కాలిపోయాయి. చికిత్స చేసే ముందే డాక్టర్లు దినేష్ బతకడమే కష్టమన్నారు. ఐదేళ్లకు ఒక ఆపరేషన్, ఆరేళ్ల వయసులో దినేష్‌కు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. తర్వాత కొంతవరకు శరీరం సాధారణ స్థితికి వచ్చింది. ఇప్పటికీ ముఖం, చేతులు మామూలు స్థితికి చేరుకోలేదు. కాళ్లు పూర్తి స్థాయిలో పనిచేయడానికి మరో శస్త్రచికిత్స చేయాలని డాక్డర్లు చెప్పారు. ఐదో తరగతి నుంచి ‘ట్రైబల్ వేల్ఫేర్’లోకి మన్ననూర్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో దినేష్ ఐదోతరగతిలో చేరాడు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. క్లాస్‌లో తనే టాపర్. ఆంగ్లంపై ఉన్న మక్కువ, పట్టు గుర్తించిన టీచర్లు ఉదయ్‌కుమార్, ఆంజనేయులు దినేష్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అతడి పరిజ్ఞానాన్ని పెంచుతున్నారు. ఫలితంగా ట్రైబల్ సొసైటీ సారథ్యంలో జరిగిన పలు డిబేట్లు, ఇగ్నైట్ ఫెస్ల్లో అనేక బహుమతులు పొందాడు. 2500 పాఠశాలలు...పదిలక్షల మంది విద్యార్థులు డెటాల్ సంస్థ అపోలో ఫౌండేషన్‌తో కలిసి బాలబాలికల్లో స్వీయ, పరిసరాల పరిశుభ్రతతో పాటు కాలుష్య నియంత్రణపై అవగాహనకు ప్రతి ఏటా హైజిన్ ఒలింపియాడ్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 4–15 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరిగింది. ఒకటి నుంచి పదోతరగతి వరకు ప్రతి రెండు తరగతులను ఒక కేటగిరిగా చేసి మొత్తంగా ఐదు కేటగరిలో పరీక్ష నిర్వహిస్తారు. 9–10 తరగతుల కేటగిరిలో దేశ వ్యాప్తంగా 2500 పాఠశాలల నుంచి పది లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 50 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష జరిగింది. దినేష్ పూర్తి మార్కులతో పాటు చేతిరాత, పరీక్ష రాసిన విధానం ఆధారంగా అదనపు మార్కులతో కలిపి 51 మార్కులు సాధించాడు. దీంతో జాతీయస్థాయిలో దినేష్‌కు ప్రథమస్థానం వచ్చినట్లు డెటాల్ సంస్థ ప్రకటించింది. అక్టోబర్ 2న ముంబైలో జరిగే కార్యక్రమంలో దినేష్ రూ. లక్ష నగదుతోపాటు పురస్కారం అందుకోనున్నాడు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యార్థి దినేష్‌ను నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్‌కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మన్ననూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి, ఉపాధ్యాయులు ఆంజనేయులు, చంద్రశేఖర్, గణేష్, విద్యార్థి తండ్రి కరంచంద్ పాల్గొన్నారు. నిక్ వుజిసిక్ నాకు స్ఫూర్తి తన అంగవైకల్యాన్ని అధిగమించి ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్‌గా మారిన నిక్ వుజిసిక్ నాలో స్ఫూర్తి నింపారు. అవకాశాలు అనేవి అందరికీ సమానమే. వాటిని అందిపుచ్చుకోవడమే మనవంతు అని నేర్చుకున్నా. అదే స్ఫూర్తితో ముందుకు వెళుతున్నా. చదువుతోపాటు క్రికెట్ నా హాబీ. బెస్ట్ కీపర్‌గా నా మార్కు చూపిస్తున్నా. సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించాలని అనుకుంటున్నా. – దినేష్ -
15 తర్వాతే సమగ్ర నోటిఫికేషన్!
ప్రశ్నపత్రాల కూర్పు ఎవరికి? టీఆర్టీ పరీక్ష నిర్వహణ పబ్లిక్ సర్విస్ కమిషన్‌కు ఇవ్వడమా? ఎస్సీఈఆర్టీకి ఇవ్వడమా? అనే అంశంపై అధికారులు చర్చించారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తే పబ్లిక్ సర్విస్ కమిషన్ పరిధిలోకి తెచ్చే వీలుందని, ఆఫ్‌లైన్ విధానమైతే ఎస్సీఈఆర్టీకి అప్పగించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఎస్సీఈఆర్టీకి ఇవ్వడమే సరైన నిర్ణయమని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) విధివిధానాల రూపకల్పనపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సమక్షంలో ఉన్నతాధికారులు సోమవారం ఈ అంశంపై చర్చించారు. ఒకటీ రెండు రోజుల్లో వీటిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. ప్రతి జిల్లాలోనూ డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఏర్పాటు, వాటికి ఇవ్వాల్సిన అధికారాలపై అధికారులు చర్చించినప్పటికీ ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. టీఆర్టీని రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో డీఎస్సీలకు పరిమిత అధికారాలు మాత్రమే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమన్వయం దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు పరీక్ష నిర్వహణ ప్రక్రియ మొత్తం రాష్ట్రస్థాయిలోనే కేంద్రీకృత వ్యవస్థలో నిర్వహించే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. అవసరమైతే రాష్ట్రస్థాయి పరీక్ష నిర్వహణకు ప్రత్యేక సమన్వయ కర్తలను నియమించాలని భావిస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో టీఆర్టీ పరీక్షకు చట్టపరమైన అడ్డంకులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం సూచించింది. దీంతో విధివిధానాల తయారీలో న్యాయ కోవిదుల సలహాలు కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ సెపె్టంబర్ 15 తర్వాతే వెలువడే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆన్‌లైనా? ఆఫ్‌లైనా? పరీక్ష నిర్వహణ మొదలుకొని, నియామక ప్రక్రియ వరకూ ఎవరి బాధ్యత ఏమిటనే దానిపై తొలుత వెలువడే ప్రభుత్వ జీవోలోనే స్పష్టత ఇవ్వాలని వాకాటి కరుణ అధికారులకు సూచించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పరీక్షల్లో ఏది ప్రయోజనం అనే అంశాన్నీ చర్చించారు. ఆన్లైన్ విధానంలో కొన్ని సమస్యలు వచ్చే వీలుందని అధికారులు భావిస్తున్నారు. టీఆర్టీ పరీక్ష భాషా పండితులకు, సబ్జెక్టు టీచర్లకు, ఎస్టీజీటీలకు విడివిడిగా నిర్వహిస్తారు. టీఆర్టీకి దరఖాస్తు చేసే వారి సంఖ్య దాదాపు 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ పరీక్ష విధానంలో ప్రశ్నపత్రం కూర్పు సమస్యలకు తావిస్తుందనే సందేహాలున్నాయి. ఒకేరోజు 4 లక్షల మందికి కంప్యూటర్ బేస్డ్గా పరీక్ష నిర్వహణ కష్టమని.ఒక్కో జిల్లాకు రెండు సెషన్స్ పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. అదే ఆఫ్‌లైన్‌లో అయితే రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు పరీక్ష నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అయితే దీనివల్ల ఫలితాల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పోస్టులు, వెయిటేజీపై ఇంకా అస్పష్టత సమగ్ర నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 తర్వాతే వెలువడే వీలుందని అధికారులు అంటున్నారు. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి? సబ్జెక్టుల వారీగా ఎన్ని ఉన్నాయి? రిజర్వేషన్ల వారీగా పోస్టుల విభజన, బ్యాక్లాగ్ పోస్టుల సంఖ్యపై ముందుగా స్పష్టత రావాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎస్జీటీలకు, ఎస్‌ఏలకు ఉండే అర్హతలపైనా అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు టెట్ అర్హులకు ఇవ్వాల్సిన వెయిటేజీ పైనా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమగ్ర నోటిఫికేషన్ వెలువడేందుకు మరికొంత సమయం పట్టే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. -
సచివాలయాల్లోనూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు
సాక్షి, అమరావతి: చదువు పట్ల ఆసక్తి ఉండి.. బడికి వెళ్లి చదువుకోలేనివారి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ల్లో చేరే అవకాశాన్ని అందిస్తోంది. అలాగే పరీక్ష ఫీజులను కూడా వీటిలోనే చెల్లించే ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే వారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇక నుంచి ఎవరైనా.. ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు తమ పేర్లు నమోదు చేసుకోవడంతోపాటు వాటికి సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపులు వంటి సేవలను తమ దగ్గరలో ఉండే గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పొందొచ్చు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ)ల మధ్య ఇప్పటికే అవగాహన కుదిరింది. ఈ సేవల టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తయిందని.. వచ్చే వారంలో రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అధికారికంగా మొదలవుతాయని అధికారులు వెల్లడించారు. తప్పనున్న ఇబ్బందులు.. కాగా, ఓపెన్ స్కూల్ ద్వారా ప్రవేశాలు పొందాలంటే ఇప్పటివరకు అధికారిక వెబ్సైట్ మాత్రమే అందుబాటులో ఉంది. సొంతంగా ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్, వెబ్ వినియోగంలో అవగాహన ఉన్నవారు ఇంట్లో నుంచే ప్రవేశాలు పొందేవారు. నెట్ సదుపాయం, అవగాహన లేకపోతే తమ ప్రాంతంలో లేదంటే, సమీప çపట్టణంలో నెట్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు ప్రవేశపెడుతుండటంతో ఈ ఇబ్బందులు తప్పనున్నాయి. మరోవైపు.. 14 ఏళ్ల లోపు బడి ఈడు పిల్లలు ఎవరైనా పాఠశాలలకు వెళ్లని పరిస్థితి ఉంటే.. అలాంటి వారందరినీ ఆయా ప్రాంత గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోంది. వారందరినీ వంద శాతం బడుల్లో చేర్పించేలా ఇప్పటికే చర్యలు చేపట్టింది. అలాగే వివిధ కారణాలతో బడి వయసు ఉన్నవారు, బడులకు వెళ్లలేని వారితోపాటు 17 ఏళ్లు దాటిన వయోజనులు ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతి, ఇంటర్ చదువుకునే అవకాశాన్ని సచివాలయాల ద్వారా అందిస్తోంది. ఏటా నవంబర్‌నెలాఖరు దాకా అడ్మిషన్లు.. ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ఏటా నవంబరు నెలాఖరు వరకు కొనసాగుతోందని ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి “సాక్షి’కి తెలిపారు. ప్రవేశాలకు పేర్ల నమోదు సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ నెలాఖరు వరకు ఎక్కువగా చేసుకుంటారని వెల్లడించారు. ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ చదివే వారి కోసం ఈ ఏడాది నుంచి అధికారిక వెబ్సైట్లో ఆయా తరగతుల ఆన్లైన్ పాఠాల బోధన వీడియోలను ఉంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సార్వత్రిక విద్య అంటే.. మన దేశంలో కనీసం ఇంటర్‌గా గుర్తించిన నేపథ్యంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఎంత మంది ఇంటర్‌లోపు చదువుకున్న వారు ఉన్నారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇంటర్‌లోపు చదివిన వారందరినీ ఓపెన్ స్కూల్ ద్వారానైనా చదువుకునేలా ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుందన్నారు. -
ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు
న్యూఢిల్లీ: జాతీయ విద్యావిధానంలో భాగంగా పరీక్షల విధానంలో కేంద్రం కొత్త మార్పులకు సిద్ధమైంది. ఇకపై ఇంటర్లో ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని, భారతీయ భాషలు తప్పనిసరిగా చదవాలని నూతన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్సీఎఫ్) ప్రతిపాదనలు చేసింది. అలాగే, 9–12 తరగతుల విద్యార్థులకు కనీస సబ్జెక్టుల సంఖ్యను పెంచాలని చెప్పింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్సీఎఫ్ నివేదికను బుధవారం జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలికి అందించారు. ఏటా రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు ఏ పరీక్షలో అయితే ఉత్తమ మార్కులు సాధిస్తారో వాటినే ఎంచుకునే అవకాశం ఉంటుందని కేంద్ర విద్యాశాఖ చెప్పింది. ఏటా రెండుసార్లు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని పేర్కొంది. క్రమక్రమంగా అన్ని బోర్డులు కూడా సెమిస్టర్ లేదా టర్మ్ బేస్డ్ వ్యవస్థకు మారతాయని కేంద్ర విద్యాశాఖ స్పష్టంచేసింది. దీనివల్ల విద్యార్థులు ఒక సబ్జెక్టును పూర్తిచేయగానే అతడు పరీక్ష రాయొచ్చని, ఇలా ఒక పరీక్ష పూర్తయినా విద్యార్థిపై కంటెంట్ భారం తగ్గుతుందని చెప్పింది. ఎన్‌సీఎఫ్‌ను ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ నేతృత్వంలోని జాతీయ స్టీరింగ్ కమిటీ రూపొందించింది. బోర్డు పరీక్షల్లో ఇలాంటి సంస్కరణలు తొలిసారి కాదు. 2009లో పదో తరగతిలో ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)’ విధానాన్ని ప్రవేశపెట్టగా, 2017లో రద్దుచేసి తిరిగి వార్షిక పరీక్షల విధానాన్ని తెచ్చారు. 9, 10 తరగతుల విద్యార్థులు ఇకపై కచ్చితంగా మూడు లాంగ్వేజ్ సబ్జెక్టులు చదవడం తప్పనిసరని ఎన్సీఎఫ్ సిఫార్సు చేసింది. వీరు మూడు లాంగ్వేజ్‌లతోపాటు మ్యాథ్స్, కంప్యూటేషనల్ థింకింగ్, సోషల్ సైన్స్, సైన్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వెల్–బియింగ్, వొకేషనల్ ఎడ్యుకేషన్ లాంటి వాటి నుంచి ఏడు సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. -
స్టాఫ్ నర్స్ పరీక్షకు కఠిన నిబంధనలు.. చెప్పులు మాత్రమే వేసుకోవాలి!
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల రెండో తేదీన నిర్వహిస్తోన్న స్టాఫ్ నర్స్ పోస్టుల పరీక్షకు కఠిన నిబంధనలు విధించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 40,936 మందికి 40 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో 24, ఖమ్మంలో 6, నిజామాబాద్‌లో 2, వరంగల్‌లో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కంప్యూటర్ ఆధారిత టెస్ట్ కాబట్టి ఆన్లైన్ సెంటర్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే రోజు మూడు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం సెషన్ పరీక్ష 9 గంటలకు ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు 7.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 8.45 గంటలకు గేట్ మూసేస్తారు. రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 11 గంటలకే చేరుకోవాలి. 12.15 గంటలకు గేట్ మూసేస్తారు. ఇక మూడో సెషన్ పరీక్ష సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్రానికి చేరుకోవాలి. 3.45 గంటలకు గేట్ మూసేస్తారు. అభ్యర్థుల సమాచారాన్ని బయోమెట్రిక్ పద్ధతిలో సేకరిస్తారు. కాబట్టి ముందస్తుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులకు సూచనలు అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌ను ఏ–4 సైజు పేపర్‌పై ప్రింటవుట్ తీసుకోవాలి. అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా ఉంటేనే హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుంది. హాల్ టికెట్, ఫొటో లేకుండా లేదా సంతకం లేకుండా ఉంటే అభ్యర్థి 3 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను తప్పనిసరిగా గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన ఒక హామీతో పాటు తీసుకురావాలి. పరీక్ష హాల్లోని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. లేని పక్షంలో అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు. అభ్యర్థులు పాస్‌పోర్ట్/పాన్ కార్డ్/ఓటర్ ఐడీ/ఆధార్ కార్డ్/ ప్రభుత్వ ఉద్యోగి ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదో ఒక చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలి. రిజిస్ట్రేషన్ వద్ద అభ్యర్థుల బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరిస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, ఇంక్, టాటూలు వంటివి వేయించుకోవద్దు. గేట్ మూసివేసే సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రం, సెషన్లో మాత్రమే పరీక్ష రాయాలి. పరీక్షా కేంద్రం, సెషన్ మార్పు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అభ్యర్థి పరీక్షా కేంద్రం లోపలకు హాల్ టికెట్, నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకెళ్లాలి. పారదర్శకమైన వాటర్ బాటిల్ తీసుకురావచ్చు. పరీక్ష హాలులో రఫ్ షీట్లను ఇన్విజిలేటర్ అందజేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే పోలీస్ కేసు అభ్యర్థులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యతిరేకిస్తే, అనర్హత వేటు వేయడమే కాకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తారు. అభ్యర్థులు కాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, టాబ్స్, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, లాగ్ టేబుల్స్, వాలెట్, హ్యాండ్ బ్యాగ్‌లు, రైటింగ్ ప్యాడ్లు, నోట్స్, చార్ట్‌లు, లూజ్ షీట్లు లేదా మరే ఇతర గాడ్జెట్లను తీసుకురావడానికి అనుమతి లేదు. అలాగే ఇతర రికార్డింగ్ సాధనాలను అనుమతించరు. అభ్యర్థి చెప్పులు మాత్రమే ధరించి పరీక్షా కేంద్రానికి రావాలి. బూట్లు ధరించకూడదు. నిరీ్ణత సమయానికి ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపడానికి అనుమతించరు. ఖమ్మంలో ఓ పరీక్ష కేంద్రం మార్పు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మం పట్టణంలో ఒక్క పరీక్షా కేంద్రాన్ని మార్పు చేశారు. ప్రియదర్శిని మహిళా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్ష నిర్వహించే స్థితిలో లేదు. కాబట్టి దానికి బదులుగా స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఖమ్మం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లలో పరీక్షలు జరుగుతాయి. హాల్ టికెట్ నంబర్లు అలాగే ఉంటాయి. పరీక్షా కేంద్రం మార్పును సూచించే సవరించిన హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలి. -
10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 51 ఏళ్ల మహిళ
అన్నానగర్(చెన్నై): కరూర్‌లో 41 ఏళ్ల మహిళ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. వివరాలు.. కరూర్ జిల్లా కృష్ణరాయపురం ప్రాంతానికి చెందిన రహీలా భాను (51). ఈమె పూవంబాడి పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్లో వంటపని చేస్తోంది. 1989లో 9వ తరగతి పూర్తి చేసిన ఈమె కుటుంబ పరిస్థితుల కారణంగా పాఠశాలకు వెళ్లలేదు. ఈ క్రమంలో 10వ తరగతి ఉత్తీర్ణులైతేనే న్యూట్రిషన్ ఆర్గనైజర్ పోస్టుకు అర్హత సాధించే అవకాశం ఉన్నందున 10వ తరగతి పరీక్షలు హాజరు కావాలని నిర్ణయించుకుని గత ఏప్రిల్‌లో జరిగిన 10వ తరగతి సాధారణ పరీక్షలకు ప్రత్యేక అభ్యర్థిగా దరఖాస్తు చేసుకుంది. ఈమె ఇంగ్లీషు, సోషల్‌సైన్స్‌లో ఉత్తీర్ణత సాధించింది. ఆపై తాను ఉత్తీర్ణత సాధించని తమిళం, గణితం, సైన్స్ సబ్జెక్టులకు జూన్‌లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు చేసిపరీక్ష రాసింది. ఈ క్రమంలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇందులో రహీలా భాను తమిళం, గణితం, సైన్స్ సబ్టెక్టుల్లో ఉత్తీర్ణులయ్యారు. చదవండి Cockroach Found In IRCTC Meals: వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఆహారంలో స్పెషల్ ఐటెం.. -
వానలు తగ్గేదాకా..పరీక్షలన్నీ వాయిదా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, విద్యా సంస్థలకు వరుసగా సెలవులు ప్రకటించడం పరీక్షల నిర్వహణపై ప్రభావం చూపుతోంది. వర్షాలు తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అన్నిరకాల పరీక్షలను వాయిదా వేయాలని ఉన్నతాధికారులు యూని వర్సిటీలు, విద్యా సంస్థలకు సూచించారు. దీంతో ఇప్పటికే డిగ్రీ, ఇంజనీరింగ్‌లో ఇంటర్నల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. డిగ్రీ ప్రవేశాల తేదీల్లోనూ మార్పులు చేశారు. ఇంజనీరింగ్ సీట్లలో తొలివిడత చేరికలకు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలను పొడిగించారు. మలి విడత ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఈ నెల 27తో ఆప్షన్లు ఇచ్చే గడువు ముగుస్తుండటంతో.. ఈ గడువునూ మరికొంత పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు. బడుల్లో అంతర్గత పరీక్షలకు తిప్పలు పాఠశాలల్లోని విద్యార్థులకు జూలైలో జరగాల్సి ఉన్న ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1) పరీక్షలను వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారు. వర్షాల మూలంగా వారం రోజులుగా సెలవులు ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇటీవలి వరకు పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందలేదు. ఇప్పుడీ వర్షా లతో మళ్లీ అంతరాయం రావడంతో నిర్ణీత సిలబస్ పూర్తవలేదని.. ఎఫ్ఏ–1 పరీక్షలను వాయిదా వేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇంటర్ ప్రవేశాల తేదీ పొడిగింపు భారీ వర్షాలతో వరుస సెలవులు, ఇంటర్నెట్, ఇతర ఇబ్బందుల నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఈ నెల 25 నుంచి నెలాఖరు వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఇంకా లక్ష మందికిపైగా ఇంటర్లో చేరాల్సి ఉందని.. వానలు ఇలాగే కొనసాగితే గడువు పొడి గించాలని బోర్డ్ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. వర్సిటీల్లో పరీక్షలు వాయిదా.. దోస్త్ గడువు పెంపు ఉస్మానియా, జేఎన్టీయూహెచ్ సహా పలు యూని వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో అంతర్గత పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని ఈ నెలాఖరులో నిర్వ హించాలని భావించినా.. వానలు తగ్గే అవకాశం లేకపోవడంతో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు ఆలస్యం కాను న్నాయి. డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ కౌన్సెలింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీని ఈ నెల 28 వరకూ పొడిగించారు. ఇక ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్‌కు ఆప్షన్ల గడువు 27తో ముగియనుంది. ఈ నెల 31న సీట్ల కేటాయింపు ఉంటుందని సాంకేతిక విద్య కమిషనరేట్ తెలిపింది. వర్షాలు తగ్గకపోతే రెండో విడత చేరికల తేదీని పొడిగించే వీలుందని అధికారులు అంటున్నారు. -
నేడు టీఎస్ పీఎస్ సీ గ్రూప్-4 ఎగ్జామ్
-
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు రెడీ
-
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు రెడీ
-
బై బై టీబీ.. కోవిడ్ తరహాలో క్షయ వ్యాధి నియంత్రణ
సాక్షి, అమరావతి: ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదకర వ్యాధి క్షయ(టీబీ)ను మరింత సమర్థవంతంగా నియంత్రించడానికి వైద్య శాఖ ప్రణాళిక రూపొందించింది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన ట్రేసింగ్–టెస్టింగ్–ట్రీట్మెంట్ విధానాన్ని టీబీ నియంత్రణలోనూ పాటించనుంది. కరోనా పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే ప్రతి లక్ష మంది జనాభాకు 1,522 మందికి పరీక్షలు చేస్తూ దేశంలోనే తొలి మూడు స్థానాల్లో ఏపీ ఒకటిగా ఉంది. ఇకపై మరింత ఎక్కువ మందికి పరీక్షలు చేసి, వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని నిర్ణయించింది. గ్రామ స్థాయిలోనే ఇప్పటివరకు రెండు వారాలైనా తగ్గని దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, కఫంలో రక్తం పడుతున్న వారికి ట్రూ నాట్ ల్యాబ్ సౌకర్యం ఉన్న ఆస్పత్రుల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నూతన విధానంలో గ్రామ స్థాయిలోనే వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో టీబీ లక్షణాలున్న వారి నుంచి నమూనాలు సేకరించనున్నారు. టీబీ రోగుల కుటుంబ సభ్యులు, సుగర్ బాధితులు, ధూమపానం చేసే వారు, ఎయిడ్స్ రోగులు ఇతర హైరిస్క్ వర్గాల వారికి విలేజ్ క్లినిక్‌లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు స్క్రీనింగ్ చేస్తారు. వీరిలో ఎవరికైనా టీబీ లక్షణాలుంటే అక్కడే కఫం నమూనా సేకరిస్తారు. వాటిని ఓ ఏజెన్సీ ద్వారా ట్రూ నాట్ ల్యాబ్‌కు పంపుతారు. దీనివ్లల వీలైనంత ఎక్కువ మందిని పరీక్షించే అవకాశం ఉంటుంది. ప్రాథమిక స్థాయిలోనే వ్యాధి బయటపడుతుంది. ప్రజలు కూడా వ్యయప్రయాసలకోర్చి లేబొరేటరీ వరకు వెళ్లే అవసరం ఉండదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి తగ్గుతుంది. త్వరలో పైలెట్‌గా ప్రకాశం జిల్లాలో నూతన విధానాన్ని త్వరలో ప్రకాశం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. విలేజ్ క్లినిక్‌ల నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించడానికి ఊబర్, ఓలా, ర్యాపిడో తరహా ఏజెన్సీ ఎంపికకు ఏపీఎంఎస్ఐడీసీ టెండర్లను పిలవనుంది. ఈ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టులో గమనించిన లోటుపాట్లను సరిచేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. 93 శాతం సక్సెస్ రేటు దేశంలోనే సమర్థవంతంగా క్షయ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న టాప్–3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉంటోంది. 2020 నుంచి రాష్ట్రంలో సక్సెస్ రేటు 90 శాతం నమోదవుతోంది. 2021లో ఉత్తమ పనితీరుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య శాఖకు అవార్డు అందించింది. గత ఏడాది క్షయ రోగులకు చేసిన వైద్య చికిత్సలో 93 శాతం సక్సెస్ రేటు నమోదైంది. 2022లో రాష్ట్రవ్యాప్తంగా 8,52,414 మందికి టీబీ పరీక్షలు నిర్వహించగా 92,129 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. వీరిలో 90,862 మందికి వైద్య సేవలు అందించారు. 84,501 మంది చికిత్స పూర్తి చేసుకుని వ్యాధి నుంచి బయటపడ్డారు. త్వరలో బీసీజీ వ్యాక్సినేషన్ కూడా పెద్దల్లో క్షయ వ్యాధిని నిరోధించడానికి ఉపయోగపడే బాసిల్లస్ కాల్మెట్ గురిన్ (బీసీజీ) టీకాను రాష్ట్రంలో పంపిణీకి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు సమ్మతిని ఇచ్చాం. త్వరలో 50 శాతం జిల్లాల్లో టీకా పంపిణీ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే టీబీతో బాధపడుతున్న వారి కుటుంబ సభ్యులు, ఇతర హైరిస్క్ వర్గాల వారికి టీకా ఇస్తారు. కేంద్ర వైద్య శాఖ 2025 నాటికి దేశంలో టీబీ నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకుంది. అంతకన్నా ముందే మన రాష్ట్రంలో టీబీని నిర్మూలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
అమ్మ పరీక్షలు బాగా రాయాలని చెప్పేది
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఏడేళ్ల క్రితం నాన్న చనిపోయాడు.. పదోతరగతి పరీక్షలకు నాలుగు రోజుల ముందే అమ్మ రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. అమ్మానాన్నను కోల్పోయిన బాధను దిగమింగుకొని, పరీక్షలకు సిద్ధమయ్యాడు కరీంనగర్ అలకాపురి కాలనీకి చెందిన ప్రజ్ఞాంత్ రెడ్డి. గత బుధవారం విడుదలైన ఫలితాల్లో 9.5 జీపీఏ సాధించాడు. మార్చి 31న కరీంనగర్ పద్మనగర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదంలో ఆ విద్యార్థి తల్లి రజిత మృతి చెందిన విషయం తెలిసిందే. అతను నగరంలోని సిద్దార్థ పాఠశాలలో చదివాడు. అమ్మ బతికున్న రోజుల్లో పదోతరగతి పరీక్షలు బాగా రాయాలని చెప్పేదని, ఆ మాటలే నన్ను ప్రభావితం చేసి, 9.5 జీపీఏ తెచ్చుకునేందుకు కారణమయ్యాయని తెలిపాడు. తాను ఐఐటీలో చదవాలనేది అమ్మ కోరిక అని, అందులో సీటు సాధించడమే లక్ష్యమని పేర్కొన్నాడు. -
Parenting: ఓడినప్పుడు అండగా నిలవండి
పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. అందరూ గెలవరు. కొందరు ఓడుతారు. గెలవడానికి ఎన్ని కారణాలో ఓడటానికి అన్ని కారణాలు. తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు ఒక క్షణం పిల్లలు తెచ్చిన ఫలితాలతో డిస్ట్రబ్ అయినా దండించే సందర్భం ఇది కాదు. పిల్లల ఓటమిని అర్థం చేసుకోవడమే ఇప్పుడు అవసరం. వారిని గమనించి తిరిగి ముందుకు నడపడమే అవసరం. ఓడిన పిల్లలకు అండగా నిలవండి. కొందరు లెక్కలేని పిల్లలు ఉంటారు. వీరు ఎగ్జామ్స్ బాగానే రాసినా రిజల్ట్స్ తేడాగా వస్తే పట్టించుకోరు. ఫెయిల్ అయితే మరీ కొంపలు మునిగినట్టుగా కూచోరు. నెక్ట్స్ టైమ్ చూసుకుందాం అన్నట్టు ఉంటారు. ఈజీగా ఉంటారు. కాని కొందరు పిల్లలు పరీక్షలు ఎలా రాశారో ఇంట్లో కచ్చిత అంచనాతో చెప్పరు. ఫెయిల్ అవుతామేమోనని భయపడుతూ ఉంటారు. ఫెయిల్ అయితే ఇక పూర్తిగా ముడుచుకుపోతారు. తల్లిదండ్రుల ముందుకు రారు. బంధువుల్లో పరువుపోయిందని బాగా బెంబేలు పడతారు. ఎవరితోనూ కలవరు. ఇక భవిష్యత్తు ముగిసినట్టే భావిస్తారు. వీరితోనే సమస్య. వీరు ఏ క్షణమైనా పేలే బుడగలాంటివారు. ఇలాంటి వారితో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. స్నేహితుల్ని, బంధువుల్ని అప్రమత్తం చేయాలి. ఈ దశ నుంచి వారిని సక్రమంగా బయటపడేయాలి. ఫెయిల్ ఎందుకు? ఈ ప్రశ్న పిల్లల్ని అడిగే ముందు పెద్దలే ప్రశ్నించుకోవాలి. పిల్లల్ని సరైన బడి/కాలేజ్‌లోనే చేర్చారా? అక్కడ పాఠాలు సరిగా జరిగాయా? సిలబస్ పూర్తి చేశారా? నోట్స్ సరిగా ఇచ్చారా? స్టూడెంట్ ఆ సబ్జెక్ట్స్ ఎలా ఫాలో అవుతున్నాడో ఎందులో వీక్ ఉన్నాడో టీచర్లు ఇంటికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారా? పిల్లలకు ట్యూషన్ అవసరమైతే సరైన ట్యూషన్ పెట్టించారా? పిల్లలు చదివే వాతావరణం ఇంట్లో ఉందా? వారు చదువుకునే వీలు లేకుండా అస్తమానం పనులు చెప్తూ, టీవీ మోగిస్తూ, ఇంట్లో నాన్ సీరియస్ వాతావరణం పెట్టారా? పరీక్షల సమయంలో సిలబస్‌ను సరిగా విభజించుకుని చదవగలిగాడా? ఎగ్జామ్‌లో ఇచ్చిన ప్రశ్నలకు టైమ్ మేనేజ్మెంట్ చేయగలిగాడా? ఎగ్జామ్ భయంతో ఏమీ రాయలేకపోయాడా?... ఇవన్నీ ఫెయిల్ అవడానికి కారణాలు. టెన్త్ వరకూ అందరికీ తప్పదు కాని ఇంటర్ విషయానికి వచ్చేసరికి ఇష్టమైన కోర్సులో చేర్చారా? చదవే ఆసక్తి, శక్తి ఉన్న సబ్జెక్ట్స్లోనే చేర్చారా?... ఇవీ ముఖ్యమైన విషయాలే. ఏం చేయకూడదు? పిల్లలు ఫెయిల్ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. కొంతమంది తల్లిదండ్రులు ఏడ్చి, నెత్తి బాదుకుని భయభ్రాంతం చేస్తారు. ఏమాత్రం కూడదు. ఆడపిల్లైతే ‘పెళ్లి చేసి పారేస్తాం’ అని మగపిల్లలైతే ‘నాలుగు గేదెలు కొనిస్తాం. మేపుకో’ అని అనడం చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏం చేయాలి? ‘మరో అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మరేం పర్వాలేదు’ అని చెప్పాలి. ‘నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? ఈ పరీక్షలు పాస్ కావడంలో నీకు ఎదురైన సమస్య ఏమిటి?’ అని తెలుసుకోవాలి. ఒకవేళ పిల్లవాడు బాగా రాశాననే నమ్మకం ఉంటే రీవాల్యుయేషన్‌కు వెళ్లాలి. ప్రతి స్టూడెంట్‌కు ఎవరో ఒక టీచర్/లెక్చరర్ మీద గురి ఉంటుంది. కొంత చనువు ఉంటుంది. అలాంటి వారి దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేయించాలి. ఇది తాత్కాలిక అడ్డంకి అని దీనిని దాటి ముందుకు పోవచ్చని భరోసా ఇవ్వాలి. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధిస్తావ్ అని చెప్పాలి. స్నేహితులతో కూడా ఇవే మాటలు చెప్పించాలి. ఆరోగ్యం, ఆయుష్షు ఉంటే జీవితంలో చాలా సాధించవచ్చని ఆశ కల్పించాలి. ఈ సమయంలో వారిని ఒంటరిగా వదలకూడదు. చదువు ముఖ్యమే కాని చదువు కంటే జీవితం ముఖ్యమనే విషయం బోధపరచాలి. తల్లిదండ్రులు కూడా అదేసంగతి తెలుసుకోవాలి. ‘తక్కువ మార్కులతో పాసైన వారు ఎక్కువ మార్కులతో పాసైనవారిని భవిష్యత్తులో జీతానికి పెట్టుకోవచ్చు’. చెప్పలేం కదా. పిల్లలు ఫెయిల్ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. -
ఆంగ్లంతో పాటు తెలుగులోనూ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక విభాగపు పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలను ఆంగ్లంతో పాటు తెలుగులోనూ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్ణయించింది. దీనివల్ల అభ్యర్థులందరికీ మేలు జరుగుతోందని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్ కుమార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సాంకేతిక, ప్రత్యేక అర్హతలతో కూడిన పోస్టుల నియామకాలకు ఏపీపీఎస్సీ ఇప్పటివరకు ఆంగ్లంలోనే పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. వీటిని తెలుగు మాధ్యమంలో కూడా నిర్వహించాలని గత కొంతకాలంగా గ్రామీణ, తెలుగు మాధ్యమం అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఈ పరీక్షలకు సంబంధించిన పేపర్–1ను ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. పేపర్–1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలుంటాయి. ఆంగ్లం ప్రశ్నలను తెలుగులో అనువదించి ఇస్తారు. అయితే ఈ రెండు మాధ్యమాల్లో ఆంగ్లంలోని ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇక పేపర్–2లో సబ్జెక్టు పేపర్లను మాత్రం ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించనున్నారు. (చదవండి: డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్ అమ్మకం ధరలు తగ్గింపు!) -
పక్కాగా ‘పోలీస్’ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీసెస్ కొలువుల భర్తీలో కీలకమైన తుది రాత పరీక్షల నిర్వహణకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. అవకతవకలకు తావులేకుండా పూర్తిస్థాయిలో సాంకేతికతను వినియోగిస్తోంది. పోలీస్ శాఖతోపాటు ఎక్సైజ్, రవాణా శాఖల్లోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,516 పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షను నిర్వహిస్తున్నారు. అన్ని పోస్టులకు కలిపి దేహదారుఢ్య పరీక్షలకు 2,07,106 మంది అభ్యర్థులు హాజరుకాగా, వీరిలో 1,11,209 మంది తుది రాత పరీక్షలకు ఎంపికయ్యారు. మార్చి 11న తుది రాత పరీక్షలు మొదలుకానున్నాయి. ఆ రోజు ఐటీ, కమ్యూనికేషన్స్ ఎస్ఐ, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ పోస్టులకు పరీక్ష జరగనుండగా, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మార్చి 26న పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సై తుది రాత పరీక్ష, ఏప్రిల్ 2న కానిస్టేబుల్ మెకానిక్, డ్రైవర్ పోస్టులకు, ఏప్రిల్ 8, 9 తేదీల్లో సివిల్ ఎస్సై పోస్టులకు, ఏప్రిల్ 30న సివిల్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు తుది రాత పరీక్షలు జరగనున్నాయి. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ.. అభ్యర్థుల సంఖ్య ఆధారంగా రాత పరీక్షలకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ ఏఎస్సై, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సై, కానిస్టేబుల్, మెకానిక్‌వంటి పోస్టుల అభ్యర్థులకు హైదరాబాద్‌లోనే కేంద్రాలు ఏర్పాటు చేశారు. సివిల్ ఎస్సైలకు హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో నిర్వహించనున్నారు. పెద్దసంఖ్యలో అభ్యర్థులు పాల్గొనే కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు హైదరాబాద్‌తోపాటు పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. -
పరీక్షల్లో మార్పులు ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో పరీక్షల విధానాన్ని, మూల్యాంకన పద్ధతిని సమూలంగా మార్చబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలులోకి తెచ్చేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఉన్నత విద్యామండలి ఇప్పటికే ఈ దిశగా అధ్యయనానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కి ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ ప్రక్రియలో భాగంగా సోమవారం జరిగే సమావేశం కీలకమైందిగా అధికారులు చెబుతున్నారు. కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సహా అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లు ఈ భేటీకి హాజరవుతున్నారు. మరో ఆరు ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపల్స్‌ను సమావేశానికి ఆహ్వానించారు. విశ్వవిద్యాలయాల పరీక్షల విభాగం కంట్రోలర్స్ ఇప్పటి వరకూ జరుగుతున్న పరీక్షలకు సంబంధించిన డేటాను ఐఎస్బీకి అందజేయబోతున్నారు. ఈ సమావేశం అనంతరం ఐఎస్బీ బృందాలు దాదాపు వంద కాలేజీల నుంచి సమగ్ర సమాచారం సేకరిస్తాయి. వివిధ దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న పరీక్షల విధానంపై స్టడీ చేస్తాయి. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని తెలంగాణ ఉన్నత విద్య కోర్సుల్లో అనుసరించాల్సిన సరికొత్త పరీక్షల ప్రక్రియపై ఐఎస్బీ నివేదిక ఇస్తుంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత దీన్ని అమలులోకి తెస్తామని ఉన్నత విద్య మండలి తెలిపింది. విభిన్న తరహా విశ్లేషణ డిగ్రీ, ఇంజనీరింగ్ సహా ఉన్నత విద్య పరిధిలోని అన్ని కోర్సుల్లో పరీక్షల విధానం ఎలా ఉంది? మార్కులు వేసే పద్ధతి ఏంటి? ఏ తరహా విద్యార్థికి ఎన్ని మార్కులొస్తున్నాయి? ఉన్నత విద్య తర్వాత విద్యార్థికి లభించే ఉపాధి ఏమిటి? అసలు విద్యార్థులు ఏం ఆశిస్తున్నారు? పరీక్షలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఈ తరహా డేటాను పరీక్షల విభాగం కంట్రోలర్స్ ఇప్పటికే సేకరించారు. వీటినే ఐఎస్బీ ప్రామాణికంగా తీసుకుంటుంది. ఉన్నత విద్యలో అత్యధిక మార్కులు పొందినప్పటికీ, మార్కెట్ అవసరాలకు తగ్గట్టు వారిలో నైపుణ్యం ఉండటం లేదని అఖిల భారత సాంకేతిక విద్య మండలి అధ్యయనంలో వెల్లడైంది. కేవలం మార్కుల కోణంలోనే మూల్యాంకన విధానం ఉందని, విద్యార్థి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే తరహా అవసరమని భావించింది. వేగంగా విస్తరిస్తున్న బహుళజాతి సంస్థల్లో చేరేందుకు ఈ విధానం అవరోధంగా ఉందని గుర్తించారు. డిగ్రీ చేతికొచ్చిన విద్యార్థి ఉద్యోగ వేటలో ఎదురయ్యే పరీక్షల తంతును అందిపుచ్చుకునే తరహాలో శిక్షణ, పరీక్షలు, బోధన విధానం ఉండాలన్నదే సంస్కరణల ప్రధానోద్దేశ్యమని మండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. ఈ కోణంలోనే ఐఎస్బీ చేత అధ్యయనం చేయిస్తున్నట్టు చెప్పారు. ఇది అత్యంత సాంకేతికంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుందని ఐఎస్బీ నిపుణుడు శ్రీధర్ తెలిపారు. -
ట్రిపుల్ ఐటీలో ఇంటర్ తరహా పరీక్షలు
బాసర (ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో ఈ విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ పరీక్షలకు బదులు ఇంటర్మీడియట్ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఇన్చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఇదే అంశంపై ‘సాక్షి’ పత్రిక గతంలోనే కథనాలను ప్రచురించింది. తాజాగా ఆ విషయాన్నే ఇన్చార్జి వీసీ ప్రకటించారు. మొదటి రెండు సంవత్సరాల పీయూసీ–1, 2 చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రిపుల్ ఐటీ ఆధునీకరణకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి శనివారం వర్సిటీ సందర్శనకు వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేస్తారని వివరించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వీసీలు కూడా త్వరలో ట్రిపుల్ ఐటీని సందర్శిస్తారన్నారు. డిసెంబర్లో స్నాతకోత్సవం బాసర ట్రిపుల్ ఐటీలో స్నాతకోత్సవ కార్యక్రమాన్ని డిసెంబర్లో నిర్వహిస్తామని ఇన్చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఈ1, ఈ2 విద్యకు అవసరమయ్యే 2,200 ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు సమకూర్చినట్లు వెల్లడించారు. యూనిఫామ్‌కు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, విద్యార్థులకు అవసరమయ్యే బూట్లను తెలంగాణ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీ సంస్థ సరఫరా చేస్తుందని చెప్పారు. ట్రిపుల్ ఐటీ అవసరాల దృష్ట్యా మరో 24 తరగతి గదులను ప్రస్తుత భవనాలపై నిర్మిస్తామని వెల్లడించారు. కాగా, కళాశాలలోని 27 ఎకరాలలో ఎకో పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీశ్‌కుమార్ తెలిపారు. రూ.3 కోట్లతో యూనివర్సిటీలో స్పోర్ట్స్ స్టేడియాన్ని నిర్మించన్నుట్లు ఆయన చెప్పారు. కళాశాలలో తల్లిదండ్రులు విద్యార్థులను కలిసేందుకు విజిటింగ్ అవర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఇన్చార్జి వీసీ.. ఆర్జీయూకేటీ వెబ్సైట్లో వీసీ డాష్ బోర్డు, విద్యార్థుల ఈ–ప్రొఫైల్ పోర్టల్‌ను ప్రారంభించారు. -
కొలువులొచ్చేలా ‘పరీక్షలు’.. డిగ్రీ పరీక్షల విధానంపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్య పరీక్షల విధానంపై క్షేత్రస్థాయి అధ్యయనానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి సారథ్యంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) పరిశీలనకు ఉపక్రమించింది. ఐఎస్బీ ప్రతినిధి బృందం సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రితో సమావేశమై అధ్యయన విధివిధానాలపై చర్చించింది. త్వరలోనే అన్ని వర్సిటీల ఉప కులపతులు, అధికారులతో చర్చించాలని ఈ భేటీలో నిర్ణయించారు. డిగ్రీలో పరీక్ష విధానంపై సమగ్ర అధ్యయనం చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం ఐఎస్బీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. క్షేత్రస్థాయి అధ్యయనం తర్వాత వాస్తవ పరి స్థితి, డిగ్రీ పరీక్షల్లో తేవాల్సిన మార్పులపై ఐఎస్బీ నివేదిక సమర్పించనుంది. ఈ పరిశీలన 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నివేదిక ఆధారంగా వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. తేడా ఎక్కడ?: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 4.60 లక్షల సీట్లుండగా అందులో ఏటా సగటున 2 లక్షల మంది చదువుతున్నారు. అయితే డిగ్రీ ఉత్తీర్ణుల్లో కనీసం 10 శాతం మంది కూడా నైపుణ్య ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. మొత్తంమీద 40 శాతం మంది మాత్రమే ఏదో ఒక ఉద్యోగంలో చేరుతున్నారు. మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వారిలో నైపుణ్యం ఉండటం లేదని, పారిశ్రామిక అవసరాలు, వృత్తి నిపుణులకు మధ్య అంతరం ఉందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. డిగ్రీ పరీక్ష విధానంలోనే మార్పులు తేవాల్సిన అవసరం ఉందని సూచించాయి. ఈ నేపథ్యంలోనే ఐఎస్బీ ఉన్నత విద్యలో పరీక్ష విధానాన్ని పరిశీలించనుంది. అధ్యయనం సాగేది ఇలా... ► తొలి దశలో ఐఎస్బీ సర్వే బృందాలు ఆరు డిగ్రీ కాలేజీలపై అధ్యయనం చేస్తాయి. ► ఇందులో రెండు అటానమస్, రెండు ఎయిడెడ్, ఇంకో రెండు ప్రైవేటు కాలేజీలుంటాయి. ► ప్రతి విభాగంలోనూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలను ఎంచుకుంటాయి. ► ఆ తర్వాత 100 కాలేజీలకు 500 ప్రశ్నలతో కూడిన సర్వే పత్రాలు పంపుతాయి. ► డిగ్రీ తర్వాత ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు? విద్యా ర్థులు ఏ తరహా పరీక్ష విధానం ఆశిస్తున్నారు. ఇప్పుడున్న పరీక్షల తీరును ఎలా అభివృద్ధి చేయాలి? వంటి ప్రశ్నలకు విద్యార్థుల నుంచి సమాధానాలు కోరుతాయి. ► పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాల గురించి కూడా సర్వే బృందాలు తెలుసుకోనున్నాయి. ► ఈ ప్రక్రియ ఆధారంగా ప్రభుత్వానికి సూచనలు చేస్తాయి. ఇదో కొత్త ప్రయోగం.. డిగ్రీలో దశాబ్దాలుగా అనుసరిస్తున్న పరీక్ష విధానం నేటి అవస రాలకు సరిపోవట్లేదు. డిగ్రీ పూర్తి చేసే విద్యార్థిలో సామాజిక నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, సమస్యలను అధిగమించే శక్తిని గుర్తించాల్సి ఉంది. విద్యార్థుల శక్తి సామర్థ్యాలు ఉపాధి కల్పించేలా ఉండాలనే ప్రభుత్వ సరికొత్త ప్రయోగానికి అనుగుణంగానే అధ్యయనం మొదలు పెడుతున్నాం. – చంద్రశేఖర్ శ్రీపాద, ఐఎస్బీ ప్రొఫెసర్–మానవ వనరులు నాణ్యత పెరుగుతుంది.. ఇంతకాలం విద్యార్థి జ్ఞాపకశక్తినే మన పరీక్షల విధా నం శోధి స్తోంది. నైపుణ్యం, ఇతర లక్షణాలు వెలికి తీసే పరీక్ష విధానం ఉండాలి. ఇలా పరీక్షించినప్పుడు విద్యా వ్యవస్థలోనూ సమూల మార్పులు సాధ్యమవుతాయి. దీంతో ఉన్నత విద్యలో నాణ్యత పెరుగుతుంది. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఏమిటి ఈ పరీక్ష? ఎందుకు?
పరీక్ష... లేదా పరీక్షలు అనే మాట విద్యారంగంలో తరచూ వినిపిస్తూ ఉంటుంది. చెప్పిన పాఠాలు విద్యార్థి ఎంత శ్రద్ధగా విన్నాడు, ఎంత జ్ఞానాన్ని పొందాడు, దాని సారమెంత అన్నది ఉపాధ్యాయులు అంచనా వేయాలి. అలా వేసే అంచనానే పరీక్షంటే. పరీక్ష అతణ్ణి పైతరగతులకు పంపే ఒక పక్రియ లేదా సాధనం. అయితే పరీక్ష అనేది విద్యార్థులకు మాత్రమే పరిమితం కాదు. చదువున్నా లేకపోయినా, జీవితంలో ప్రతి ఒక్కరూ పరీక్షకు గురి అయిన వారే. తమను తాము పరీక్ష చేసుకునేవారే. ఇంతకీ పరీక్ష అంటే ఏమిటి, ఎందుకో తెలుసుకుందాం. మన మాట తీరు, ఇతరులతో మన సంబంధాలు, వారితో మన వర్తన, విలువలు, నీతి, నిజాయితీ, తోటి మానవుల పట్ల మన భావన, ప్రేమ ఇటువంటి అనేకమైన వాటిని అంచనా వేసుకునేందుకు కూడా పరీక్ష అవసరం. మన జీవిత ప్రవాహ సారాన్ని అర్ధం చేసుకుని దాన్ని ఎప్పటికప్పుడు మదింపు చేసుకోవాలి. అంటే మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. దాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే ఈ పరీక్ష అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇతర జీవులకు, మనకు ఉండే జనన మరణాల సారూప్యతకు భిన్నంగా, గొప్పగా మన జీవనవిధానాన్ని గమనిస్తూ జీవితాన్ని మార్పు చేసుకోగలమా? అలా మన తెలివితేటలకు, ఆధిక్యతకు ఒక విశిష్టత, అర్థం చూపగలమా? ఆ ఆలోచన వచ్చిన వారెవరైనా తమ శల్య పరీక్షకు సంసిద్ధులైతే జీవితాన్ని చక్కగా మలచు కోవటం కష్టం కానే కాదు. అది మనోవికాసానికి, గొప్ప ఆలోచనలకు దారి తీసి మానవాళికి ఉపయుక్తం అయ్యే అనేక ఆవిష్కరణలకు దారితీస్తుంది.‘శోధించని జీవిత జీవనయోగ్యం కాదు’ అన్నాడు సోక్రటీస్. ఈ పరీక్షకు విద్యార్థి, పరీక్షాధికారి ఎవరికి వారే. విద్యార్థి సంవత్సరకాలంలో పుస్తకాలలోని తను పొందిన జ్ఞానాన్ని ఎలా జ్ఞప్తికి తెచ్చుకుంటాడో అలా ప్రతి వ్యక్తి తను గడిపిన, గడుపుతున్న జీవితాన్ని నెమరు వేసుకోవాలి. వివిధ సందర్భాలలో తన మాటలు, ప్రవర్తన అనుబంధాలకు, ఆప్యాయతలకు ఎంత విలువనిచ్చాయి, వాటిని తను ఎంత నిలబెట్టుకున్నాడో స్ఫురణకు తెచ్చుకోవాలి. తన వర్తన ఇతరుల మనస్సులనేమైనా అకారణంగా గాయపరిచిందేమో తరచి చూసుకోవాలి. వృత్తి జీవితంలోనూ ఒక ఉద్యోగి, రచయిత, కళాకారుడు తమ కృషి లేదా పని తీరును సమీక్షించు కోవడమూ పరీక్షే. జీవితాన్ని ఎంత నిశితంగా పరీక్షలకు గురి చేస్తే అంతగా మన వ్యక్తిత్వం సార్థక మవుతుంది. ఇక్కడ పరీక్ష పత్రం తయారు చేసేది, సమాధానాలు రాసేది మనమే. దీనితో విద్యార్థి పాత్ర ఉపాధ్యాయుని పాత్రగా మారుతుంది. ఇప్పుడు పరీక్షాధికారిగా వీటి మంచి చెడులను విశ్లేషించాలి. మంచికి మురిసిపోతూ మనల్ని మనమే ప్రశంసించుకో కూడదు. మంచిని చూసినంత బాగా, నిశితంగా లోపాలను చూడాలి. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించగలగాలి. ఆ ఫలితాలను లోతుగా చూసి, ఒక నిజమైన, ఖచ్చితమైన మదింపు వేసుకోవాలి. అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునే వివేచన కావాలి. ఇక్కడ బేషజాన్ని, ఆహాన్ని విడిచి తప్పులను దిద్దుకునే సంస్కారం అలవరుచుకోవాలి. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. విద్యార్థి తన విద్యాభ్యాసకాలంలో రాసే పరీక్షలు కొన్నే ఉంటాయి. కాని మనం జీవితాంతం మన జీవితాన్ని పరీక్షకు గురి చేయాల్సిందే. సరిదిద్దుకుంటూ ముందుకు సాగాల్సిందే. సోక్రటీస్ చెప్పిన మాటల సారమిదే. తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్యలు ఉపాధ్యాయులు ఈ శోధన తత్వాన్ని పిల్లలు అలవాటు చేసుకునేలా చెయ్యాలి.ఈ శోధన మనిషి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది. కొందరు వ్యక్తులకు ఈ శోధన చిన్నతనం నుండే సహజంగా ఉంటుంది. ఆ శోధనా దృష్టి కొందరిలో అతి చిన్న వయస్సులోనే ఏర్పడి చక్కని రూపు దాల్చి ఉన్నత పథంలో పయనం చేసి మొత్తం మనవాళికి దాని ఫలితాలను అందిస్తుంది. వారు చిర స్మరణీయులవుతారు. ఈ శోధనాతత్వం ప్రతి ఒక్కరికీ అవసరం. ముఖ్యంగా ఉపాధ్యాయులకు, శాస్రవేత్తలకు, నాయకులకు చాలా అవసరం. ఎప్పటికప్పుడు తాము చేసిన పనిని, దానిలోని తప్పుల్ని తెలుసుకుని తమను తాము నూతనంగా ఆవిష్కరించుకుంటారు. సోక్రటీస్ అన్న మాటలలో పరిశీలన, తార్కికత, ఉత్సహం, ఆధ్యాత్మికత పెనవేసుకున్నాయి. ప్రశ్నించే, శోధించే గుణాలు ఉన్నాయి. వృత్తి జీవితంలోనూ ఒక ఉద్యోగి, రచయిత, కళాకారుడు తమ కృషి లేదా పని తీరును సమీక్షించు కోవడమూ పరీక్షే. జీవితాన్ని ఎంత నిశితంగా పరీక్షలకు గురి చేస్తే అంతగా మన వ్యక్తిత్వం సార్థకమవుతుంది. – లలితా వాసంతి -
న్యాయమైన ఆశయం
పెద్దవాళ్లు, చుట్టుపక్కల వాళ్లు చేసేది చూసి పిల్లలు అనుకరిస్తుంటారు. కొంతమంది అనుకరణతో ఆగిపోకుండా వాళ్లలాగే తామూ ఎదగాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తుంటారు. ఈ కోవకు చెందిన అమ్మాయే 23 ఏళ్ల కార్తీక గెహ్లాట్. తండ్రి ఉద్యోగరీత్యా డ్రైవర్. న్యాయమూర్తులను కోర్టుకు తీసుకెళ్లడం ఆయన పని. చిన్నప్పటి నుంచి నాన్న నడిపే కారులో ఎంతో హుందాగా ఉండే న్యాయమూర్తులను దగ్గర నుంచి చూసిన కార్తీక తను కూడా జడ్జీ కావాలనుకుంది. నేను పెద్దయ్యాక నల్లకోటు ఆఫీసర్ అవుతాను అని అనుకరించి చూపిస్తూండేది. అది చూసిన వారంతా చిన్నపిల్ల చేష్టలనుకునేవారు. కానీ నేడు కార్తీక జుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో మంచి మార్కులతో 66 ర్యాంకు సాధించి పిల్లచేష్టలు కాదు, మరికొన్నేళ్లలో జడ్జి్జని కాబోతున్నానని చెప్పకనే చెబుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జోద్‌పూర్‌కు చెందిన రాజేంద్ర గెహ్లాట్ ముద్దుల కూతురే కార్తీక గెహ్లాట్. 31ఏళ్లుగా ప్రధాన న్యాయమూర్తులెందరికో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు రాజేంద్ర. రాజస్థాన్ హైకోర్టులో పనిచేస్తున్న ఎంతోమంది జడ్జీలను, లాయర్లను చూస్తూ పెరిగిన కార్తీక తాను కూడా పెద్దయ్యాక జడ్జి కావాలనుకునేది. ఆరోతరగతిలో ఉండగా నల్లకోటు వేసుకుని న్యాయస్థానంలో పనిచేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఆదిశగా అడుగులు వేస్తూ... జో«ద్‌పూర్‌లోని సెయింట్ ఆస్టిన్ సీనియర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్య పూర్తిచేసింది. ఇంటర్మీడియట్ తరువాత జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీలో ఐదేళ్ల బిబిఏ.ఎల్ఎల్.బి. పూర్తిచేసింది. ఈ ఏడాదే డిగ్రీ పూర్తిచేసినప్పటికీ జడ్జీ అయ్యేందుకు 2019 నుంచి సన్నద్ధమవడం ప్రారంభించింది. ఒక పక్క సెమిస్టర్ పరీక్షల కోసం చదువుతూనే, మరోపక్క పిలిమినరీ, మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యేది. కరోనా సమయంలో ఆఫ్‌లైన్ క్లాసులు అందుబాటులో లేకపోవడంతో, ఆన్లైన్ తరగతులకు హాజరవుతూ సిలబస్ పూర్తిచేసింది. ఇదే సమయంలో అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గోవింద్ మాథూర్, జిల్లా సెషన్స్ జడ్జి మండల్ ప్రసాద్ బోహ్రాల వద్ద లా గైడెన్స్, అడ్వకేట్ ధర్మేంద్ర వద్ద ఏడాదిన్నరపాటు టెక్నికల్ గైడెన్స్, మాజీ ఐఏఎస్ అధికారి, తన మాజీ స్కూలు ప్రిన్సిపాల్ వంటివారందరి సలహాలు సూచనలతో రోజుకి నాలుగు గంటలు కష్టపడి చదివేది. పరీక్ష తేది ప్రకటించిన తరువాత ప్రిపరేషన్‌ను పది నుంచి పన్నెండు గంటలకు పెంచింది. సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అన్నింటికీ దూరంగా ఉండి తన లక్ష్యంపై దృష్టిపెట్టి రాజస్థాన్ జుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో 66వ ర్యాంకు సాధించింది. దీంతో తన చిన్ననాటి కల జడ్జీ కావడానికి మొదటి అడుగు వేసింది. నేను న్యాయమూర్తులను కోర్టుకు తీసుకెళ్లడాన్ని అప్పుడప్పుడు కార్తీక చూసేది. అలా చూస్తూ పెరిగిన ఆమె 12 ఏళ్ల వయసులో ఒకరోజు నేను కూడా త్వరలో నల్లకోటు వేసుకుని జడ్జిని అవుతానని చెప్పింది. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కార్తీక మాత్రం అప్పటి నుంచి జడ్జిఅవ్వాలన్న కలను నిజం చేసుకునేందుకు కష్టపడుతూనే ఉంది. వాళ్ల అమ్మకూడా∙తనని అన్ని విధాల సాయపడుతూ అండగా ఉండడంతో ఈ రోజు తన కలను సాకారం చేసుకుంది. ఏళ్లుగా ఎంతోమంది జడ్జీలను వెనుకసీట్లోకూర్చోపెట్టి తిప్పాను. భవిష్యత్‌లో నా కూతురు కూడా వారిలా వెనుకసీట్లో కూర్చోబోతున్నందుకు సంతోషంగా ఉంది. – కార్తీక తండ్రి రాజేంద్ర గెహ్లాట్ పెళ్లికాదని భయపడుతున్నారు చాలామంది తల్లిదండ్రులు తమ కూతుర్లు లా చదువుతామంటే ఇష్టపడరు. లా చదివిన అమ్మాయిలకు పెళ్లిళ్లు కావు అని భయపడతారు. ఇలాంటి అపోహలు పోవాలంటే ప్రతి ఒక్కరికి చట్టం గురించిన ప్రాథమిక అవగాహన ఉండాలి. అప్పుడు తమ హక్కుల గురించి ధైర్యంగా పోరాడగలుగుతారు. నలుగురు సంతానంలో నేను ఒకదాన్ని. ప్రారంభంలో నా నిర్ణయాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. తర్వాత కష్టపడి చదవడం చూసి ప్రోత్సహించారు. వారి సహకారంతో ఈ రోజు ఇంతమంచి ర్యాంకును సాధించగలిగాను. నన్ను ప్రేరణగా తీసుకుని నా తోబుట్టువులు సైతం లా చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నా ప్రిపరేషన్లో ఆన్లైన్ యాప్స్‌తో పాటు, ఏకాగ్రతతో చదవడానికి సంగీతం చాలా బాగా ఉపయోగపడ్డాయి. – కార్తీక -
తెలంగాణ వ్యాప్తంగా కానిస్టేబుల్ రాతపరీక్ష
-
కానిస్టేబుల్ రాతపరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నేడు (ఆదివారం) పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖ కానిస్టేబుల్ ఎంపిక ప్రాథమిక రాతపరీక్ష జరగనుంది. దీనికి సంబంధించి హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని మరో 35 పట్టణాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. సివిల్ కానిస్టేబుల్ కోటాలోని 15,644, రవాణా శాఖ 63, అబ్కారీ 614 పోస్టులకు 6.61 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని, గంట ముందే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని బోర్డు పేర్కొంది. పరీక్షాకేంద్రానికి నిర్ణీత సమయంకన్నా ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని స్పష్టం చేసింది. డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై నిర్దేశించిన ప్రాంతంలో పాస్‌పోర్టు సైజు ఫొటో అంటించుకొని రావాలని, అలాచేయని పక్షంలో లోపలికి అనుమతించబోమని తెలిపింది. పరీక్షాకేంద్రంలోకి బ్యాగులు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమని వెల్లడించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థి హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయనున్నామని పేర్కొంది. 200 మార్కులతో కూడిన ప్రశ్నాపత్రం ఉంటుందని, తప్పుడు సమాధానానికి 0.2 నెగెటివ్ మార్కు ఉంటుందని స్పష్టం చేసింది. -
ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం
-
National Education Policy–2020: సీబీఎస్ఈ పరీక్షల తీరులో సంస్కరణలు
న్యూఢిల్లీ: విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేసే పద్ధతిలో నూతన సంస్కరణలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. విద్యార్థులు ఆర్జించిన నైపుణ్యాలు, సామర్థ్యాల ఆధారంగా వారి ప్రతిభను పూర్తిస్థాయిలో మదింపు(అసెస్మెంట్) చేసేలా కొత్త మార్పులు తీసుకొస్తున్నట్లు సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటించింది. జాతీయ విద్యా విధానం–2020ను ప్రాతిపదికగా తీసుకొని ఈ మార్పులు ఉంటాయని పేర్కొంది. విద్యార్థుల ప్రతిభను మదింపు చేసే సంస్కరణలను కొన్ని స్కూళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అందుకే అన్ని స్కూళ్లలో అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి చెప్పారు. కొత్త మార్పులు ఏమిటంటే.. విద్యార్థుల నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేయడానికి వీలుగా ప్రాక్టికల్ పరీక్షలు లేని సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్ల అభిప్రాయాల ఆధారంగా 20 శాతం మార్కులు కేటాయిస్తారు. అంటే అన్ని సబ్జెక్టుల్లో ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో ప్రశ్నల సంఖ్యను మరో 33 శాతం పెంచుతారు. వాటిలో తగిన ప్రశ్నలను ఎంచుకొని, సమాధానాలు రాసే అవకాశాన్ని కల్పిస్తారు. సమర్థత, నైపుణ్యాలను నిశితంగా పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. పుస్తకాల్లో లేని ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉంది. విద్యార్థులు విశ్లేషణాత్మకంగా ఆలోచించి, సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 3, 5, 8 తరగతుల పిల్లలకు సామర్థ్య సర్వే పరీక్షలు నిర్వహిస్తారు. ఇవి మార్కుల ఆధారంగా ఉండవు. విద్యార్థుల అభ్యసన స్థాయి, గతంలో పోలిస్తే ప్రతిభను ఎంతవరకు మెరుగుపర్చుకున్నారో వీటిద్వారా తెలుస్తుంది. విద్యార్థుల టాలెంట్‌ను అన్ని కోణాల్లో అంచనా వేసేలా ప్రత్యేక ప్రోగ్రెస్ కార్డ్‌ను సీబీఎస్ఈ జారీ చేస్తుంది. -
తెలంగాణలో కష్టాల టెట్.. అభ్యర్థులకు తిప్పలు, పరీక్ష రాసేదెలా?
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12న జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నా, అభ్యర్థులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. పరీక్ష కేంద్రాల్లో తికమక, హాల్ టికెట్లలో ఫొటో ఉంటే సంతకం ఉండటం లేదని, సంతకం ఉంటే ఫొటో కనిపించడం లేదని పలువురు అభ్య ర్థులు చెబుతున్నారు. సమస్య పరిష్కారం కోసం జిల్లా విద్యాశాఖాధికారుల చుట్టూ తిరిగినా వాళ్లు అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరి నిమిషంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సొంత ప్రాంతంలో కాకుండా, పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రం కేటాయించారు. అయితే, హాల్టికెట్లలో ఫలానా కాలేజీ అని మాత్రమే పేర్కొ న్నారు. ఒకే పేరుతో జిల్లా కేంద్రంలో రెండు మూడు కాలేజీలున్నాయి. దీంతో ఏ కాలేజీలో పరీక్ష రాయాలో తెలియని గందరగోళంలో అభ్యర్థులు న్నారు. పరీక్ష కేంద్రం ఫోన్ నంబర్లు అందు బాటులో ఉంచామని అధికారులు చెబుతున్నా, ఆ నంబర్లకు ఫోన్ చేస్తే స్పందన ఉండటం లేదని, ఎక్కువ సేపు ఎంగేజ్లో ఉంటోందని పలువురు అభ్యర్థులు తెలిపారు. పరీక్షకు ఇంకా రెండు రోజులే సమయం ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగు తోంది. రాష్ట్రవ్యాప్తంగా టెట్ కోసం మొత్తం 6,29,352 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తప్పుల సవరణకు అవకాశమేది? టెట్ పరీక్ష నిర్వహణపై అధికారులు మొదటినుంచీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో చాలా రోజులు సంబంధిత వెబ్సైట్ ఓపెన్ కాలేదు. దరఖాస్తు సమయంలో సంతకం, ఫొటోలు సరిగా అప్లోడ్ అవలేదని అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. దరఖాస్తులు అప్లోడ్ చేసిన తర్వాత తప్పుల సవరణకు ప్రత్యేకంగా అవకాశం కల్పించాలనే డిమాండ్ వచ్చింది. అయితే టెట్ నిర్వహణ అధికారులు ఇవేవీ పట్టించుకోలేదని అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తంచేశారు. హాల్ టికెట్ల డౌన్లోడ్ తర్వాత ఫొటోలు, సంతకాలు లేకపోతే డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ఫొటో అంటించి, సంతకాలు చేసి, గెజిటెడ్ ధ్రువీకరణ తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఆ తర్వాత స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారిని కలిస్తే పరిశీ లించి న్యాయం చేస్తారని వెసులుబాటు కల్పించారు. అయితే, డీఈవోలు ఇతర అధికార పనుల్లో ఉండటం, సవరణల కోసం వచ్చే అభ్యర్థులు ఎక్కు వగా ఉండటంతో సవరణలు పరిశీలించే అవకాశం ఉండటం లేదని అభ్యర్థులు అంటున్నారు. కింది స్థాయి అధికారులకు ఈ బాధ్యత అప్పగించినా, రోజుల తరబడి తిరిగితే తప్ప పనిజరగడం లేదని చెబుతున్నారు. స్పష్టత లేక గందరగోళం.. ►ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆలస్యంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులకు పక్క జిల్లాల్లో పరీక్ష కేం ద్రాలు కేటాయించారు. వరంగల్ పట్టణంలో ఒకే పేరుతో 3 కాలేజీలు (బ్రాంచీలు) ఉన్నాయి. కాలేజీ పేరు ఇచ్చి.. వరంగల్ అంటూ హాల్ టికెట్లో పేర్కొన్నారు. అయితే ఏ బ్రాంచ్ అనేది స్పష్టం చేయలేదు. హాల్ టికెట్లో ఇచ్చిన ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తే స్పందన కన్పిం చలేదు. ►ఖమ్మంకు చెందిన ఓ అభ్యర్థి హాల్ టికెట్‌పై తన సంతకం పడలేదు. మళ్లీ ఫొటో, సంతకం అం టించి, గెజిటెడ్ అధికారి చుట్టూ తిరిగి ధ్రువీ కరణ చేయించారు. డీఈవో కార్యాలయంలో అధికారులు రెండు రోజులైనా స్పందించలేదని ఆ అభ్యర్థి తెలిపారు. సంతకం కోసం రెండు రోజులా? టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) హాల్ టికెట్ డౌన్ లోడ్ చేశాక చూసుకుంటే ఫొటో పక్కన ఉండాల్సిన సంతకం లేదు. దీంతో రెండు రోజుల పాటు హనుమకొండలోని డీఈఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరికి డీఈఓ కార్యాలయం ఏడీ పర్మిట్ చేస్తూ హాల్ టికెట్‌పై సంతకం చేశారు. –ఎండీ ఖరీముల్లా, టెట్ అభ్యర్థి, హనుమకొండ -
తొలిరోజు కోదాడలో గడబిడ
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. తొలిరోజున అన్నిచోట్లా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని టెన్త్ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ప్రకటించారు. ఎస్సెస్సీ పరీక్షలకు మొత్తం 5,08,143 మంది దరఖాస్తు చేసుకోగా.. సోమవారం జరిగిన మొదటి భాష పరీక్షను 5,03,041 (99 శాతం) మంది రాశారని, 5,102 మంది గైర్హాజరయ్యారని ఎస్సెస్సీ బోర్డ్ తెలిపింది. ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ కేసులు నమోదు కాలేదని ప్రకటించింది. పూర్తి నిఘా నీడలో పరీక్ష జరిగిందని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా పరీక్షలు రాశారని పేర్కొంది. అంతటా కోవిడ్ నిబంధనలు అమలు చేశామని తెలిపింది. వేసవి తీవ్రత తగ్గడంతో ఎక్కడా అసౌకర్యం కలగలేదని, అన్ని కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించింది. జనరల్ తెలుగుకు బదులు... కాంపోజిట్ తెలుగు సూర్యాపేట జిల్లా కోదాడలో మాత్రం పరీక్షల్లో గందరగోళం నెలకొంది. కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు జనరల్ తెలుగు (1టి, 2టి)కు బదులు కాంపోజిట్ తెలుగు (3టి, 4ఎస్) ప్రశ్నపత్రాలు ఇచ్చారు. ఇది చూసి కంగుతిన్న విద్యార్థులు.. పరీక్షా కేంద్రం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తాము చదివినది తెలుగు భాష సబ్జెక్టు అని.. వేరే పేపర్లు వచ్చాయని చెప్పారు. దీనితో అధికారులు సదరు విద్యార్థుల నుంచి డిక్లరేషన్ తీసుకుని వారికి జనరల్ తెలుగు ప్రశ్నపత్రాలను ఇచ్చారు. ప్రైవేటు స్కూళ్ల నిర్వాకంతో.. కోదాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పరిమితికి మించి విద్యార్థులు ఉండటంతో వారిని పట్టణంలోని మరో కార్పొరేట్ స్కూల్ తరఫున పరీక్ష రాయించినట్టు తెలిసింది. సదరు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు జనరల్ తెలుగు సబ్జెక్టు చదవగా.. కార్పొరేట్ స్కూల్ విద్యార్థులు కాంపోజిట్ తెలుగు సబ్జెక్టు చదివారు. పరీక్ష ఫీజు కట్టే సమయంలో కార్పొరేట్ స్కూల్ అందరు విద్యార్థుల సబ్జెక్టును కాంపోజిట్ తెలుగుగా నమోదు చేసిందని.. దీనిప్రకారమే విద్యార్థులకు కాంపోజిట్ తెలుగు పేపర్లను ఇచ్చారని తెలిసింది. పరీక్ష కేంద్రంలో పాము కలకలం ఖమ్మం జిల్లా ముత్తగూడెం పరీక్షా కేంద్రంలోని 7వ నంబర్ గదిలో పాము కలకలం రేపింది. ఆ గదిలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా పాము వచ్చి దూరింది. విద్యార్థులు భయంతో బయటికి పరుగెత్తేందుకు ప్రయత్నించగా.. ఇన్విజిలేటర్ వారికి సర్దిచెప్పి బెంచీలపై నిల్చోబెట్టారు. ఓ విద్యార్థి ధైర్యం చేసి కర్రతో పామును చంపడంతో అంతా ప్రశాంతంగా పరీక్ష రాశారు. పుట్టెడు దుఃఖంలోనూ నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చింతకుంట్లకు చెందిన ఇడికోజు లలిత కొండమల్లేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. లలిత తండ్రి పురుషోత్తమాచారి అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. లలిత పుట్టెడు దుఃఖంలోనూ బంధువులు, స్నేహితుల సాయంతో పరీక్షకు హాజరైంది. -
NEET PG Exam 2022: నీట్ పీజీ వాయిదా కుదరదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నీట్ పీజీ–22 పరీక్ష వాయిదా కుదరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను కొట్టే సింది. ఇలా వాయిదా వేసుకుంటూ పోతే వైద్యులు అందుబాటులోకి రాక ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుందని వ్యాఖ్యానించింది. ‘‘పరీక్ష వాయిదా 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం గాడిలో పెడుతోంది. ఇలాంటప్పుడు పరీక్ష వాయిదా కుదరదు’’ అని పేర్కొంది. పరీక్ష ఈ నెల 21న జరగనుంది. అప్పుడే నీట్–పీజీ–2021 కౌన్సెలింగ్ ఉండటంతో పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు వైద్యులు కోర్టుకెక్కారు. -
ఇక పరీక్షలన్నీ సకాలంలోనే..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశం పొందేందుకు రాష్ట్ర విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పరీక్షలు పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అలాగే రాష్ట్ర యూనివర్సిటీల్లో జాతీయ, అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాన్ని పెంచే చర్యలు చేపట్టనుంది. ఆరు యూనివర్సిటీల ఉపకులపతులతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చర్చించిన అంశాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన కౌన్సెలింగ్ ఆగస్టులోనే నిర్వహిస్తుండగా ఇందులో సీటు పొందాలనుకొనే విద్యార్థులకు రాష్ట్రంలో సకాలంలో తుది సెమిస్టర్ పూర్తికాక అవకాశం కోల్పోతున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జూన్ చివరి నాటికే డిగ్రీ కోర్సుల తుది సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేయాలని తీర్మానించామన్నారు. ఇందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిపారు. మేలో పీజీ నోటిఫికేషన్.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని, ఈ బాధ్యతను ఓయూ తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. పీజీ సెట్‌కు మేలో నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాలతో ఉన్నత విద్యామండలి సమన్వయం చేసుకుంటుందని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అఖిల భారత సర్వే కోసం అవసరమైన డేటాను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేయాలని వీసీలకు సూచించారు. ‘న్యాక్’ స్పీడ్ పెంచాలి.. రాష్ట్రంలో ఎక్కువ విద్యాసంస్థలు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకొనేలా ప్రోత్సహించాలని, దీని కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని వీసీల సమావేశంలో నిర్ణయించారు. అలాగే గుర్తింపు కాలపరిమితి తీరిన కాలేజీలను తిరిగి దరఖాస్తు చేయించడం, గుర్తింపు ఉన్న కాలేజీల స్థాయి పెంపునకు చర్యలు చేపట్టాలని తీర్మానించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వి. వెంకటరమణ, వర్సిటీల వీసీలు రవీందర్, రవీంద్రగుప్తా, గోపాల్‌రెడ్డి, రమేశ్, రాథోడ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
అంచనాలకు మించి టెట్ దరఖాస్తులు...పరీక్ష కేంద్రాలు బ్లాక్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కోసం పరీక్ష కేంద్రాల ఎంపికకు అవకాశం నిలిచిపోయింది. దరఖాస్తులు సమర్పించేందుకు మరో రెండురోజులు గడువు ఉండగానే హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం లేకుండా బ్లాక్ అయింది. నగరం నుంచి అంచనాలకు మించి దరఖాస్తులు వస్తుండటంతో పరీక్ష కేంద్రాల జాబితా నుంచి గ్రేటర్ జిల్లాలు తొలగింపునకు గురయ్యాయి. వాస్తవంగా టెట్ పరీక్ష ఎంత మంది రాస్తారన్న అంశంపై సంబంధిత అధికారులు సరిగా అంచనా వేయలేకపోయారు. ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు సంఖ్య అభ్యర్థులను ఇబ్బందుల్లో పడేసింది. టెట్ పరీక్ష కోసం గత నెల 26 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా.. ఈ నెల 12తో గడువు ముగియనుంది. ఫీజు చెల్లింపునకు మాత్రం నేటితో (సోమవారం) ఆఖరిరోజు. పరీక్షకు హజరయ్యేందుకు ఆ¯న్లైన్లో టెట్ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉండగా, సర్వర్ సమస్య, నెట్ సెంటర్లలో రద్దీ తదితర కారణాలతో ఆఖరులో దరఖాస్తు చేసుకోవచ్చని భావించిన వారితో పాటు ఇప్పటికే ఫీజు చెల్లించి అప్లికేషన్ పూర్తి చేయని వారికి సైతం షాక్ తగిలినట్లయింది. లక్ష మందికి పైగా.. మహానగర పరిధిలో సుమారు లక్ష మందికి పైగా బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన, పూర్తి చేస్తున్న అభ్యర్థులు ఉన్నట్లు అంచనా. దీంతో కొత్త, పాత వారితో కలిపి దరఖాస్తులు సంఖ్య ఎగబాగుతున్నట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షలకు నగరంలో కోచింగ్ తీసుకుంటున్న అభ్య ర్థులు సైతం టెట్ పరీక్ష కోసం ఇక్కడి కేంద్రాలను ఎంపిక చేసుకోవడంతో ఊహించిన దానికంటే అధికంగా దరఖాస్తులు నమోదవుతున్నాయి. వాస్తవంగా టీచర్ల పోస్టుల కోసం అయిదేళ్లుగా నోటిఫికేషన్ లేకుండాపోయింది. 2017లో టీఆర్టీ నిర్వహించగా.. ఇప్పటివరకు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడంతో.. ప్రభుత్వం ఎలాగైనా టీచర్ పోస్టులను భర్తీ చేస్తుందనే నమ్మకంతో ఏటా బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 47 ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కాలేజీలుండగా అందులో ప్రతి ఏటా 5,640 మంది విద్యార్థులు బీఈడీ కోర్సు పూర్తిచేస్తూ వస్తున్నారు. 12 డీఈడీ కళాశాలల్లో ఏటా 480 మంది కోర్సులను పూర్తిచేస్తున్నారు. బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసి టెట్ కోసం ఎదురుచూస్తున్న వారితోపాటు పాత అభ్యర్థులు సైతం ఈసారి దరఖాస్తు చేసుకుంటుండంతో సంఖ్య మరింత ఎగబాగుతోంది. సొంత జిల్లాలో చాన్స్ మిస్.. టెట్ పరీక్ష కేంద్రాల జాబితాను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు బ్లాక్ కావడంతో అభ్యర్థులు సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళా అభ్యర్ధులైన గర్భిణులు, చిన్నపిల్లల తల్లులతో పాటు వికలాంగులకు ఇతర ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాయడం మరో పరీక్షగా తయారైంది. ఈసారి బీఈడీ అభ్యర్థులకు రెండు పేపర్లకు చా¯న్స్ ఉండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అవకాశం ఉన్నా.. మహానగర పరిధిలో మరిన్ని పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉన్నా.. జాబితా నుంచి నగర జిల్లాలు తొలగించడం విస్మయానికి గురిచేస్తోంది. నగరం చుట్టూ ఇంజినీరింగ్, ఇతర కాలేజీలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలోనే సగానికిపైగా అభ్యర్థులు నగర పరిధిలోనే పరీక్షలు రాసేవారు. ఈసారి మాత్రం పరీక్ష కేంద్రాలు పరిమితి సంఖ్యలో కేటాయించి బ్లాక్ చేయడం పట్ల అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది. మరోవైపు టెట్ అప్లికేషన్ల సందర్భంలో, ఇతర సమాచారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు కూడా పనిచేయడం లేదు. టెట్ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం లేకుండా పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అప్లికేషన్లలో టెక్నికల్, టైప్ ఎర్రర్స్‌తో పాటు ఫొటోలూ సరిగా రాలేదు. వాటిని సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ లేక అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. (చదవండి: చదివింపుల్లేవ్.. విదిలింపులే!) -
ఏపీ, టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా
బంజారాహిల్స్: కరోనా విజృంభణతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పలు యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేశాయి. కొన్ని పరీక్షలను రద్దు చేశాయి. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఏవీఎన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామన్నారు. పూర్తి వివరాలను విశ్వ విద్యాలయ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. జేఎన్టీయూ పరిధిలో... కేపీహెచ్‌బీ కాలనీ: జేఏన్‌టీయూహెచ్‌లో జరగనున్న అన్ని పరీక్షలను ఈ నెల 30వరకు వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ యం. మంజూర్ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ వార్షిక పరీక్షలు (థియరీ, ప్రాక్టికల్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు), మధ్యస్థ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షల రీషెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఓయూలో పరీక్షలు రద్దు.. ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పరీక్షలను రద్దు చేసినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సోమవారం పేర్కొన్నారు. వివిధ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా రెగ్యులర్, దూరవిద్య కోర్సుల సెమిస్టర్ పరీక్షలతో పాటు ఇంటర్నల్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. -
730 పోస్ట్‌ల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. ఏం చదవాలి.. ఎలా చదవాలి..?
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. ఒకేసారి ఏడు వందలకు పైగా పోస్ట్‌లతో నోటిఫికేషన్లు వెలువరించడంతో.. ఉద్యోగార్థులకు సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లయింది. గత కొంత కాలంగా క్రమం తప్పకుండా పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మరో రెండు నోటిఫికేషన్లతో అభ్యర్థుల ముందుకొచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌లు, దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 పోస్ట్‌లకు.. ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో..ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. ఏపీపీఎస్సీ ఇటీవల 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు.. అభ్యర్థులు ఇప్పటి నుంచే కృషి చేయాలి. ఇందుకోసం ఆయా నోటిఫికేషన్లలో పేర్కొన్న సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్ సాగిస్తే.. విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. రెండు శాఖలు, 730 పోస్ట్‌లు ►ఏపీపీఎస్సీ రెండు శాఖల్లో మొత్తం 730 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. అవి.. ►ఏపీ రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు–670. ►దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3–పోస్టులు– 60. ►అభ్యర్థులు ఈ రెండు నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ►బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా పేర్కొన్న ఈ రెండు రకాల పోస్ట్‌ల భర్తీకి ఏపీపీఎస్సీ వేర్వేరుగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. రాత పరీక్షలో మెరిట్ ఏపీపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే ఈ పోస్టుల భర్తీ చేపడతారు. ఈ రెండు పోస్ట్‌లకు సంబంధించిన రాత పరీక్షలో ఒక పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. రెండో పేపర్ మాత్రం జూనియర్ అసిస్టెంట్స్ పోస్ట్‌లకు,ఎండోమెంట్ ఆఫీసర్ పోస్ట్‌లకు వేర్వేరుగా ఉంటుంది. దీంతో..బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు సమయ పాలన, నిర్దిష్ట వ్యూహంతో..ప్రిపరేషన్ సాగిస్తే.. ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధమై.. రెండు పోస్ట్‌లకు పోటీ పడే అవకాశం ఉంది. దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ►ఒక్కో పోస్ట్‌కు దరఖాస్తుల సంఖ్య 200 దాటితే.. ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారిని తదుపరి దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ►ఒక్కో పోస్ట్‌కు నిర్దిష్ట నిష్పత్తిలో మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొంది. మెయిన్ పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేయనున్నారు. స్క్రీనింగ్ టెస్ట్‌లు ఇలా ►రెవెన్యూ శాఖలోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, దేవాదాయ శాఖలోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్‌లకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష విధానాలు.. ►జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్: ఈ పరీక్ష రెండు విభాగాలుగా రెండు సబ్జెక్ట్‌లలో 150 మార్కులకు జరగనుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 స్క్రీనింగ్ టెస్ట్: ►ఈ పరీక్ష కూడా రెండు విభాగాలుగా 150 మార్కులకు జరుగనుంది. వివరాలు.. ►రెండు పోస్ట్‌లకు నిర్వహించే స్క్రీనింగ్ పరీక్ష పూర్తిగా పెన్ పేపర్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌పై సమాధానాలు నింపాలి. ►నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3 మార్కులు తగ్గిస్తారు. ►రెవెన్యూ డిపార్ట్మెంట్లోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్‌లకు నిర్వహించే పార్ట్–బి పేపర్లో.. జనరల్ ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ తెలుగు నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. మెయిన్ పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్‌లో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన వారికి తదుపరి దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్(ఆన్లైన్) టెస్ట్‌గా ఉంటుంది. ►జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మెయిన్: ఈ పరీక్ష రెండు పేపర్లుగా మొత్తం 300 మార్కులకు జరగనుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. వివరాలు.. ►పేపర్–2లో జనరల్ ఇంగ్లిష్ నుంచి 75 ప్రశ్నలు, జనరల్ తెలుగు నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు. ►ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 (ఎండోమెంట్ సబ్ సర్వీస్) మెయిన్: ఈ పరీక్ష కూడా రెండు పేపర్లుగా 300 మార్కులకు జరగనుంది. వివరాలు.. ►ఈ పరీక్ష కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ►ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు. నిర్దిష్ట ప్రణాళికతో.. విజయం దిశగా ►రెండు శాఖల్లోని పోస్టులకు కూడా స్క్రీనింగ్ టెస్ట్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌లనే మెయిన్ పరీక్షలోనూ పేర్కొన్నారు. ►స్క్రీనింగ్, మెయిన్లకు ఒకే సిలబస్ అంశాలను పేపర్లుగా నిర్దేశించినా.. మెయిన్‌లో అడిగే ప్రశ్నలు లోతుగా ఉండే అవకాశం ఉంది. ►కాబట్టి మొదటి నుంచే మెయిన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ సాగించాలి. తద్వారా స్క్రీనింగ్ టెస్ట్‌లో సులభంగా విజయం సాధించి మెయిన్‌కు అర్హత పొందొచ్చు. ►అభ్యర్థులు ప్రిపరేషన్‌కు ముందే ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్‌లను ఆమూలాగ్రం పరిశీలించాలి. స్క్రీనింగ్, మెయిన్ పరీక్షల సిలబస్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి. ►భిన్నంగా ఉన్న అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకొని.. వాటి ప్రిపరేషన్‌కు ప్రత్యేక సమయం కేటాయించాలి. ►దేవాదాయ శాఖలోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్‌లకు స్క్రీనింగ్, మెయిన్‌లో ఉన్న హిందూతత్వం, దేవాలయ వ్యవస్థ పేపర్‌కు సంబంధించి ప్రత్యేకంగా అధ్యయనం కొనసాగించాలి. ►పురాణాలు, ఇతిహాసాలు, వేద సంస్కృతి, కళలు, ఉపనిషత్తులు, కుటుంబ వ్యవస్థ, దేవాలయాలకు వచ్చే ఆదాయ మార్గాలు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధులు, ఎండోమెంట్ భూములకు సంబంధించిన చట్టాలు, భూ రికార్డులపై అవగాహన పెంచుకోవాలి. ►జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి.. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు; భారతదేశ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆర్థికాభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, పునర్విభజన సమస్యల గురించి అధ్యయనం చేయాలి. ►ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, బడ్జెట్ కేటాయింపుల గురించి తెలుసుకోవాలి. ►మెంటల్ ఎబిలిటీ విభాగంలో.. రాణించేందుకు టాబ్యులేషన్, డేటా సమీకరణ, డేటా విశ్లేషణలపై అవగాహన పెంచుకోవాలి. ►రెవెన్యూ డిపార్ట్మెంట్లోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్‌లకు పేర్కొన్న జనరల్ ఇంగ్లిష్, జనరల్ తెలుగు పేపర్ కోసం ఈ రెండు భాషలకు సంబంధించి బేసిక్ గ్రామర్ అంశాలు, యాంటానిమ్స్, సినానిమ్స్, ఫ్రేజెస్‌లపై పట్టు సాధించాలి. ఒకే సమయంలో రెండు పోస్ట్‌లకు ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్లను పరిశీలిస్తే.. ఒకే సమయంలో రెండు శాఖల్లోని పోస్ట్‌లకు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. రెండు శాఖల్లోని పోస్ట్‌లకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పేపర్ ఉంది. ఈ పేపర్‌కు ఉమ్మడి ప్రిపరేషన్ సాగిస్తూ.. రెండో పేపర్‌కు ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి. ఫలితంగా ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత లభిస్తుంది. ఇలా సిలబస్ పరిశీలన నుంచి ప్రిపరేషన్ వరకు ప్రత్యేక వ్యూహంతో.. అడుగులు వేస్తే విజయం సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 (ఏపీ ఎండోమెంట్స్ సబ్ సర్వీస్) ►మొత్తం పోస్టుల సంఖ్య: 60 ►వేతన శ్రేణి: రూ.16,400 – రూ.49,870 ►అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి ►వయో పరిమితి: జూలై 1, 2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది. ►దరఖాస్తులకు చివరి తేదీ: 19.01.2022 ►వెబ్సైట్: https://psc.ap.gov.in జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్(రెవెన్యూ శాఖ) (గ్రూప్–4 సర్వీసెస్) ►మొత్తం పోస్టుల సంఖ్య: 670 ►ప్రారంభ వేతన శ్రేణి: రూ.16,400 –రూ.49,870. ►అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. తుది ఎంపికకు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ►వయో పరిమితి: జూలై 1, 2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది. ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ►దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022 ►వెబ్సైట్: https://psc.ap.gov.in -
ఇంటర్ పరీక్షల ఫీజు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్‌లో జరిగే ఇంటర్ మొదటి, రెండో ఏడాది పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలను ఇంటర్ బోర్డ్ గురువారం ప్రకటించింది. ఫస్టియర్ అన్ని గ్రూపులకు, సెకండియర్ ఆర్ట్స్ గ్రూపుల విద్యార్థులు రూ.490, సెకండియర్ సైన్స్ గ్రూపు విద్యార్థులు (ప్రాక్టికల్స్ కలిపి) రూ.690 చెల్లించాలని పేర్కొంది. ఒకేషనల్ సైన్స్ గ్రూపు విద్యార్థులు రూ.690, బ్రిడ్జి కోర్సు సహా ఒకేషనల్ రాసేవారు రూ.840, సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులు రూ.690, బ్రిడ్జి కోర్సు అయితే రూ.840 చెల్లించాలని పేర్కొంది. ప్రైవేటు విద్యార్థులు ప్రతి సంవత్సరానికి రూ.490 చెల్లించాలని తెలిపింది. ఫస్టియర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే అసలు ఫీజు రూ.490తో పాటు, ప్రతి సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలని తెలిపింది. -
హైబ్రీడ్ మోడ్ కుదరదు: సుప్రీం
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో హైబ్రీడ్ విధానం(ఆన్లైన్, ఆఫ్‌లైన్) కుదరని, విద్యార్థులు ప్రత్యక్షంగా పరీక్షలకు హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. విద్యా వ్యవస్థను గందరగోళానికి గురి చేయవద్దని పేర్కొంది. సీబీఎస్ఈ టర్న్–1 బోర్డు పరీక్షలు నవంబర్ 16 నుంచి ప్రారంభమయ్యాయని, సీఐఎస్సీఈ సెమిస్టర్–1 పరీక్షలు 22 నుంచి ప్రారంభం కాబోతున్నాయని గుర్తుచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం పరీక్షల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను కేవలం ఆఫ్‌లైన్‌లో కాకుండా హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించేలా సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈకి ఆదేశాలివ్వాలని కోరుతూ ఆరుగురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎం.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. సీబీఎస్ఈ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కోవిడ్–19 నియంత్రణ నిబంధనలను పాటిస్తూ బోర్డు పరీక్షలను ప్రత్యక్ష విధానంలో(ఆఫ్‌లైన్ మోడ్) నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాలను 6,500 నుంచి 15,000కు పెంచామని తెలిపారు. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే హాజరయ్యారు. ఇప్పటికే ఆలస్యం జరిగిందని, ఈ దశలో పరీక్షలను రీషెడ్యూల్ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనకు తెలియజేసింది. విద్యా వ్యవస్థతో ఆటలు వద్దని, అధికారులను వారి పని వారిని చేసుకోనివ్వాలని హితవు పలికింది. -
అ ఆ లు ప్రతి ఇంటికీ రావాలి
104 ఏళ్ల కేరళ కుట్టియమ్మ పరీక్షలు రాసి పాసవడం చూశాం. ఆమెకేనా ఆ అదృష్టం? ఐదారు దశాబ్దాల క్రితం పుట్టిన చాలా మంది స్త్రీలు చదువుకు నోచకనే జీవితంలో పడ్డారు. ఇప్పుడు అమ్మమ్మలు నానమ్మలుగా ఉన్న వారంతా కుట్టియమ్మకు మల్లే చదువుకోవాలని అనుకోవచ్చు. కేరళలో ఇలాంటి స్త్రీల కోసం ఇంటికి వచ్చి చదువు చెప్పే ప్రభుత్వ వాలంటీర్లు ఉన్నారు. కుట్టియమ్మ అలా ఇంట్లోనే చదివింది. దేశమంతా ఇలా అఆలు ఇళ్ల తలుపు తట్టాల్సి ఉంది. వెలుతురు నవ్వు చూడాల్సి ఉంది. ‘అ’ అంటే అమ్మ అని పుస్తకాల్లో చదువుకుంటాం. ఇక మీదట ‘అ’ అంటే ‘అవ్వ’ అని చదవాలమో. కుట్టియమ్మ అనే అవ్వ ఇప్పుడు ఆ మేరకు వార్తలు సృష్టిస్తోంది. దానికి కారణం ఆమె వయసు 104. ఆమె పరీక్షల్లో సాధించిన మార్కులు 100కు 89. మొన్నటి నవంబర్ 10న ఆమె ఈ పరీక్షలో కూచుంది. ఇంకేంటి. ఆమె పేరు మారుమోగదా? కేరళలోని కొట్టాయం జిల్లాలోని ‘అయర్ కున్నమ్’ అనే పంచాయతీకి చెందిన కుట్టియమ్మను చూడటానికి ఇప్పుడు ఆ ఊరికి కార్లు వస్తున్నాయి. అందులో నాయకులు వస్తున్నారు. కేరళ విద్యా శాఖ మంత్రి వి.శివన్ కుట్టి ఆమెను సత్కరించి ‘అక్షర ప్రపంచంలోకి స్వాగతం’ అన్నాడు. ఆమె ఇలా చదువుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి అన్నాడు. ఇంతకు మించిన స్ఫూర్తి ఏముంటుంది ఏ వయసులో అయినా చదువుకోవడానికి. రెండు నెలల్లో చదివి కుట్టియమ్మ కథ దేశంలోని లక్షల మంది స్త్రీల కథే. ఆమెకు చదువుకునే వీలు కలగలేదు. 15 ఏళ్లకే పెళ్లి అయ్యింది. ఇప్పటికి ఆమె తన వంశంలో ఏడు తరాలను చూసింది. కాని ఆమెకు చదువుకోవాలని ఉండేది. అక్షరాలను గుణించుకుని న్యూస్‌పేపర్ చదివే ప్రయత్నం చేసేది. కాని ఆమె పెన్ను పట్టుకుని రాయలేదు. కేరళ ప్రభుత్వం ‘సాక్షరతా మిషన్’లో భాగంగా ‘సాక్షరతా ప్రేరకులు’ పేరుతో వాలంటీర్లను నియమించి ఇలాంటి మహిళల కోసం ఇంటింటికి వెళ్లి చదువు చెప్పే ఏర్పాటు చేసింది. అలా ఫెహరా జాన్ అనే వాలంటీర్ ఆమె ఇంటికి వచ్చి చదువు చెప్పింది. ‘టీచర్‌ను చూసి ఆమె చిన్నపిల్లలా ఉత్సాహపడింది’ అని కుట్టియమ్మ కుటుంబ సభ్యులు చెప్పారు. పరీక్ష రాస్తున్న కుట్టియమ్మ ‘ఆమె షరతు ఒక్కటే. పెద్దగా పాఠం చెప్పమని. ఎందుకంటే ఆమెకు సరిగా వినపడదు. నేను అరిచి చెప్పేదాన్ని. సాక్షరతా మిషన్‌లో భాగంగా కేరళలోని ప్రతి పంచాయితీలో ప్రాథమిక పరీక్షను నిర్వహిస్తారు. ఆ పరీక్షలో పాసైతే 4వ తరగతి స్థాయి పరీక్ష రాయవచ్చు. ప్రాథమిక పరీక్షలో మలయాళం, లెక్కలు, జనరల్ నాలెడ్జ్ ఉంటాయి. పరీక్షకు కేవలం రెండు నెలల ముందే ఆమెకు చదువు మొదలయ్యింది. రెండు నెలల్లోనే ఆమె బాగా పాఠాలు నేర్చుకుంది. అంతే కాదు పెన్ను పట్టి అక్షరాలు రాయడం మొదలెట్టి మార్కులు కూడా తెచ్చుకుంది’ అంది ఫెహరా జాన్. ‘ఆమె గుచ్చి గుచ్చి అడిగి మరీ తెలుసుకునేది. నస పెట్టడం అంటారు చూడండి. అలా’ అని నవ్వుతుంది ఆ పెద్ద వయసు స్టూడెంట్ కలిగిన చిన్న వయసు టీచర్. కర్ర పెండలం, చేపలు కుట్టియమ్మకు 104 సంవత్సరాలు ఉన్నా ఇంకా చురుగ్గా ఉంది. బి.పి, షుగర్ లేవు. కళ్లద్దాలు కూడా లేవు. రాత్రి పూట చూపు ఆనదు. వినపడదు. అంతే. ‘ఆమె ఉదయం పూట టిఫిన్ రాత్రి భోజనం తప్ప మధ్యలో ఏమీ తినదు. అవి కూడా కొంచెం కొంచెమే తింటుంది. మధ్యాహ్నం ఆమెకు పడుకునే అలవాటు లేదు. ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు చేపలు, కర్రపెండలం ఇష్టం.’ అని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ వయసులో చదువుకోవడం వల్ల ఇప్పుడు ఆమెకు మాత్రమే కాక ఆమె ఇంటికి కూడా గుర్తింపు వచ్చింది. ఇతరుల సంగతి ఏమిటి? ఏ మనిషికైనా తన పేరు తాను రాసుకోగలగడం, తన పేరును తాను చదువుకోగలడం ప్రాథమిక అవసరం. దేశంలో సంపూర్ణ అక్షరాసత్య కార్యక్రమాలు మొదలయ్యి ఇన్నాళ్లవుతున్నా అందరినీ అక్షరాస్యులు చేసే పని అంత సజావుగా సాగడం లేదు. కేరళలో మాత్రం 1989లోనే ‘కొట్టాయం’ జిల్లా సంపూర్ణ సాక్షరతను సాధించిన జిల్లాగా పేరు పొందింది. సాక్షరతా సూచిలో తమ రాష్ట్రం ముందుండేలా ఆ రాష్ట్రం నిరంతరం శ్రద్ధ పెడుతూనే ఉంది. ఇలా ప్రతి రాష్ట్రంలో చదువు, జ్ఞానం పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఏ వయసులోనైనా ఉంది. స్త్రీలు ఎన్నో దశాబ్దాలుగా అక్షరానికి దూరమై ఉన్నారు. వారి కోసం కొంత కాలం ప్రభుత్వాలు రాత్రి బడులు నిర్వహించాయి. ఇప్పుడు అలాంటి పని జరగడం లేదు. కేరళ వంటి చోట చదువే అలాంటి వారి ముంగిట్లోకి వస్తోంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. ఆ వెలుగు ఇంటింటికి చేరాల్సి ఉంది. కుట్టియమ్మ చూపిన పట్టుదల చదువుకు నోచుకోని ప్రతి మహిళా చూపితే, అందుకు వ్యవస్థలు మద్దతుగా నిలిస్తే దేశం నిజమైన వికాసంలోకి అడుగు పెడుతుంది. ఇంట్లో తన టీచర్ దగ్గర చదువుతూ... జ్ఞానం పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఏ వయసులోనైనా ఉంది. స్త్రీలు ఎన్నో దశాబ్దాలుగా అక్షరానికి దూరమై ఉన్నారు. కేరళ వంటి చోట చదువే అలాంటి వారి ముంగిట్లోకి వస్తోంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. ఆ వెలుగు ఇంటింటికి చేరాల్సి ఉంది. -
నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
-
ప్రత్యక్ష విధానంలో ఐసీఎస్ఈ పరీక్షలు
న్యూఢిల్లీ: 10, 12వ తరగతుల మొదటి టర్మ్ పరీక్షలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (ఐసీఎస్ఈ) శనివారం ప్రకటించింది. ఈ పరీక్షలకు సవరించిన తేదీలను కూడా వెల్లడించింది. ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 16 వరకు, 12వ తరగతి(ఐఎస్సీ) పరీక్షలు నవంబర్ 12వ తేదీన మొదలై డిసెంబర్ 20వ తేదీతో ముగుస్తాయని తెలిపింది. ప్రత్యక్ష విధానంలో సంబంధిత స్కూళ్లలోనే నిర్వహించే ఈ పరీక్షలను మార్గదర్శకాలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. నవంబర్ 15, 16వ తేదీల్లో ఆన్లైన్లో ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షలను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు బోర్డ్ గత వారం ప్రకటించింది. ఆన్లైన్ పరీక్షలకు కావాల్సిన కంప్యూటర్లు, విద్యుత్, బ్యాండ్ విడ్త్ కొరత వంటి వాటిపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన వినతుల మేరకు వాయిదా వేసినట్లు తెలిపింది. -
Inter First Year: సిలబస్ తక్కువ.. చాయిస్ ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పరీక్షలు సరళతరంగానే ఉంటాయని ఇంటర్ బోర్డ్ అధికారులు చెబుతున్నారు. అన్నివైపుల నుంచి వస్తున్న ఒత్తిడి, విద్యార్థుల ఆందోళనను పరిగణనలోనికి తీసుకుని కొంత మానవీయకోణంలోనే వెళ్తున్నామని అంటున్నారు. ఐచ్ఛిక(మల్టీపుల్ చాయిస్) ఎక్కువ, సిలబస్ 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రం రూపొందించినట్టు ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. కొద్దోగొప్పో ఇంటర్ సబ్జెక్టులు అవగాహన చేసుకున్నవారికి ఈ పరీక్ష ఎంతమాత్రం కఠినం కాబోదన్నారు. సైన్స్ విద్యార్థుల ప్రాక్టికల్స్ విషయంలోనూ కొంత సానుకూల ధోరణితోనే ఉండే వీలుందని అధికార వర్గాల సమాచారం. ప్రాక్టికల్స్ నిర్వహించే కాలేజీల్లో కోవిడ్ మూలంగా ప్రయోగశాలలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని బోర్డు గుర్తించింది. ఈ కారణంగా మౌఖిక ప్రశ్నలతో విద్యార్థుల సృజనాత్మకతను రాబట్టే ప్రయత్నం చేయాలని క్షేత్రస్థాయిలో అంతర్గత ఆదేశాలు ఇచ్చినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతేడాది ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థులకు కోవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. దాదాపు 4.75 లక్షల మందిని ఉత్తీర్ణులుగా గుర్తించి, ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేశారు. కానీ, రెండో ఏడాదీ పరీక్షలు నిర్వహించని పరిస్థితి తలెత్తితే అది సమస్యగా అవుతుందని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఈ నెల 25 నుంచి పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించని పక్షంలో మొదటి ఏడాది మార్కులనే కొలమానంగా తీసుకోవచ్చని భావిస్తున్నారు. సిలబస్ సింపుల్.. ఫస్టియర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు బోర్డ్ ఇప్పటికే మోడల్ ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచింది. 70 శాతం సిలబస్‌లోని పాఠాల్లో తేలికైన, విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా అర్థమైన వాటినే గుర్తించారు. వీటిని ఎంపిక చేయడం కోసం నిపుణులైన అధ్యాపకుల సలహాలు కూడా తీసుకున్నారు. మెజారిటీ విద్యార్థులు తేలికగా సమాధానం ఇవ్వగల పాఠ్యాంశాలను ప్రశ్నపత్రం కూర్పుకు తీసుకునేలా ఏర్పాటు చేసినట్టు బోర్డ్ పరీక్షల నిర్వహణ విభాగం అధికారి ఒకరు చెప్పారు. ఇందులో కూడా మల్టిపుల్ చాయిస్‌ను ఈసారి ఎక్కువగా పెడుతున్నారు. ఒక ప్రశ్న కష్టమనుకుంటే, తేలికైన మరో ప్రశ్నకు జవాబు ఇచ్చే వెసులుబాటు 90 శాతం విద్యార్థులకు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సైన్స్ విద్యార్థులకు ఈ విధానం సులభతరమవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్, మేథమెటిక్స్ విద్యార్థులకు ప్రయోజనకరమని అధ్యాపకవర్గాలు చెబతున్నాయి. ఎకనమిక్స్‌లోనూ ఛాయస్ ఉండటం వల్ల తేలికగా పరీక్ష పాసయ్యే వీలుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,800 కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. పరీక్ష మొదలుకొని, మూల్యాంకనం పూర్తయ్యే వరకూ కాలేజీ అధ్యాపకులే కీలకపాత్ర పోషిస్తారు. అధ్యాపకుల కొరత వల్ల ప్రస్తుతం ఫస్టియర్‌లో ఉన్నవాళ్లే కాకుండా, సెకండియర్ చదువుతున్న పరీక్షార్థులు కూడా ఇబ్బందిపడవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ద్వితీయ సంవత్సరం మధ్యలో ఉన్న విద్యార్థులు మరోవైపు జాతీయ, రాష్ట్రీయ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత యథావిధిగా ఇంటర్ క్లాసులు జరుగుతాయని, ఫస్టియర్ రాసే విద్యార్థులు పరీక్షల అనంతరం ఎప్పటిలాగే క్లాసులకు హాజరవ్వొచ్చని చెబుతున్నారు. మూల్యాంకనం చేసే అధ్యాపకులు కూడా వారి సబ్జెక్టులను విధిగా బోధించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పక్కా ప్రణాళికతోనే ఇంటర్ బోర్డు ముందుకెళ్తోందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చదవండి: Telangana: ధరణి పోర్టల్‌ను దారికి తేవడంపై నిపుణుల సూచనలు -
NEET: బయాలజీ చాలా సులువు.. కెమిస్ట్రీ కఠినం
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ పరీక్ష తెలంగాణలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. గతేడాదితో పోలిస్తే ఈసారి పరీక్ష మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని వైద్య విద్య నిపుణులు వెల్లడించారు. అందరికీ మార్కులు తగ్గే అవకాశముందన్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది పరీక్ష సులువుగా ఉండగా, అప్పట్లో 720 మార్కులకుగాను, 700కుపైగా మార్కులు సాధించినవారు చాలామంది ఉన్నారు. ఈసారి ఆ సంఖ్య చాలావరకు తగ్గే అవకాశముంది. గతేడాది నీట్ ఆలిండియాస్థాయిలో 625 మార్కులకు 10వేల ర్యాంకు రాగా, 2019లో 560 మార్కులకు, 2018లో 540 మార్కులకు ఈ ర్యాంకు వచ్చింది. తెలంగాణలో గతేడాది జనరల్ కేటగిరీలో 497 మార్కులు వచ్చినవారికి ఎంబీబీఎస్‌లో సీటు వచ్చింది. ఈసారి 470 నుంచి 480 మార్కులకు వచ్చే అవకాశముంది. 130 మార్కులొస్తే అర్హత! ఇక బయాలజీ పేపర్ చాలా సులువుగా ఉంది. అన్ని ప్రశ్నలూ సులువుగానే ఉన్నాయి. కెమిస్ట్రీ ప్రశ్నపత్రం కొంచెం కఠినంగానే ఉంది. ప్రశ్నతోపాటు అన్ని జవాబులను కూడా జాగ్రత్తగా చదివి సమాధానం రాయాల్సినవి ఎక్కువగా ఉన్నాయి. ఇక ఫిజిక్స్ పేపర్లో ఇచ్చిన ప్రశ్నలన్నీ కఠినంగానే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి క్యాలిక్యులేషన్స్ సుదీర్ఘంగా ఉన్నాయి. 45 ప్రశ్నల్లో 30 నుంచి 35 వరకు ఎక్కువమంది చేయగలిగేలా ఉన్నాయి. 10 నుంచి 15 ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్థులకు సమయం సరిపోలేదు. టాప్ 10 ర్యాంకులు సాధించగలిగే విద్యార్థులు మాత్రమే మొత్తం ప్రశ్నలకు సమాధానం రాసి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది జనరల్ కేటగిరీలో నీట్ అర్హత మార్కు 147 కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో 113 అర్హత మార్కుగా ఉంది. 2019లో జనరల్ కేటగిరీలో నీట్ అర్హత మార్కు 134గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో ఇది 107గా ఉంది. ఈసారి జనరల్ కేటగిరీలో 130 మార్కులొస్తే అర్హత సాధించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 105 మార్కులు ఉండే అవకాశముంది. 112 కేంద్రాల్లో పరీక్ష నీట్ పరీక్షను రాష్ట్రంలో పలు నగరాల్లోని 112 కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 55 వేల మంది దరఖాస్తు చేయగా, 97 శాతం మంది హాజరైనట్లు చెప్పారు. కరోనా జాగ్రత్తలు, పరీక్ష నిబంధనల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడినా ప్రశాంతంగానే జరిగినట్లు చెబుతున్నారు. జేఈఈ మెయిన్స్‌లో అక్రమాలు జరిగిన నేపథ్యంలో నీట్ పరీక్షపై నిఘా పెట్టారు. పలు జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సీసీటీవీల ద్వారా నిఘా ఉంచారు. కాగా, ‘నీట్’కు దేశవ్యాప్తంగా 16.14 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, వీరిలో 95 శాతానికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈసారి దుబాయ్, కువైట్‌లోనూ ఈ పరీక్ష నిర్వహించారు. ఫిజిక్స్ కఠినం బాటనీ, జువాలజీ సులువుగా ఉన్నా, కొన్ని ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకున్నాయి. జువాలజీలోని ఒక ప్రశ్న మినహా అన్ని ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచే ఉన్నాయి. చాలా ప్రశ్నలు మెమరీ ఆధారంగా ఉన్నాయి. కాన్సెప్ట్ ప్రశ్నలు చాలా తక్కువగా ఉన్నాయి. కెమిస్ట్రీ ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. అన్ని ప్రశ్నలూ ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచే వచ్చాయి. కొన్ని ప్రశ్నలకు అత్యంత సమీపంగా ఆప్షన్లు ఇచ్చారు. ఐదు నుంచి పది ప్రశ్నల వరకు కఠినంగా ఉన్నాయి. మూడు ప్రశ్నలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఫిజిక్స్ పేపర్ కఠినంగా, సుదీర్ఘంగా ఉంది. సాధారణ విద్యార్థులకు సమయం సరిపోలేదు. – శంకర్రావు, డీన్, శ్రీచైతన్య కాలేజీ, కూకట్పల్లి మధ్యస్థంగా ప్రశ్నలు కెమిస్ట్రీ, ఫిజిక్స్ పేపర్లలో ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. బయాలజీ సులువుగా ఉంది. మొత్తంగా నీట్ పరీక్ష ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. నాకు 650 నుంచి 670 మార్కులు వచ్చే అవకాశముంది. – రోహన్ కృష్ణ వడ్లమూడి, విద్యార్థి, హైదరాబాద్ -
నీట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు
-
చెప్పిందొకటి.. ఇచ్చిందొకటి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ పరిధిలోని ఆస్పత్రుల్లో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో నిర్దేశిత అంశాల నుంచి కాకుండా ఇతర ప్రశ్నలు ఇచ్చారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మెరిట్ జాబితాపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థ 84 జూనియర్ స్టాఫ్ నర్స్ ‘డి’గ్రేడ్ పోస్టుల భర్తీకి భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా కొత్తగూడెం, పాల్వంచల్లోని 18 కేంద్రాల్లో ఆదివారం రాత పరీక్షను నిర్వహించింది. అయితే, హాల్‌టికెట్‌లో పేర్కొన్నట్లుగా నర్స్ ఉద్యోగ ప్రశ్న లు కాకుండా 90% ల్యాబ్ టెక్నీషియన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాల్‌టికెట్, ప్రశ్నపత్రం అభ్యర్థులకు ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. ఇదిలాఉంటే ప్రశ్నపత్రంలో 150 ప్రశ్నలు ఇచ్చి, ఓఎంఆర్ షీట్లో మాత్రం సమాధానాలు ఇవ్వడానికి 200 గడులు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది. అనర్హత ఎలా?: రాత పరీక్షకు 11,133 మంది దరఖాస్తు చేసుకోగా 7,666 మంది హాజరయ్యారు. వీరిలో పది శాతం మందిని సంస్థ అనర్హులుగా ప్రకటించింది. అయితే 25.33 మార్కులు వచ్చిన ఓ అభ్యర్థిని అనర్హుడిగా పేర్కొన్న సంస్థ అవే మార్కు లు వచ్చిన మరికొందరి పేర్లను మెరిట్ జాబితాలో పొందుపరిచింది. దీనిపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్నుంచీ సింగరేణిలో నియామకాలపై విమర్శలు వస్తుండగా, తాజా పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. కాగా, ఈ విషయంపై సంస్థ జీఎం పర్సనల్(రిక్రూట్మెంట్ సెల్) అందెల ఆనందరావును ‘సాక్షి’వివరణ కోరగా ప్రశ్నపత్రాన్ని నిపుణులతోనే సిద్ధం చేయించామని తెలిపారు. ప్రశ్నపేపర్ అభ్యర్థులకు ఇచ్చే విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తామని వెల్లడించారు. -
ఆంధ్ర ప్రదేశ్ లో నేటినుంచి ఏ పీ ఈ ఏ పీ సెట్
-
సరూర్ నగర్ లో హైటెక్ తరహాలో మాస్ కాపీయింగ్
-
మంత్రి సబితా ఇంటిని ముట్టడించిన విద్యార్థులు
-
నేటి నుంచి డీఎడ్ సెమిస్టర్ పరీక్షలు
యడ్లపాడు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (2019–21) విద్యార్థులకు మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 5, 6, 7, 8వ తేదీలలో జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ జి.మాణిక్యాంబ తెలిపారు. రోజూ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో వసతులు కల్పించింనట్టు వెల్లడించారు. విద్యార్థులు మాస్కు ధరించాలని, శానిటైజర్లను వెంట తెచ్చుకోవడంతోపాటు భౌతిక దూరం పాటించాలని కోరారు. 601 మంది పరీక్షలకు హాజరు నాలుగు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 601 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గుంటూరు పరీక్ష కేంద్రంలో 188 మంది, బాపట్లలో 115 మంది, నరసరావుపేటలో 172 మంది, యడ్లపాడు మండలం బోయపాలెంలోని జిల్లా ప్రభుత్వ డైట్ కళాశాలలో 126 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అధికారులు వివరించారు. బోయపాలెంలో 144 సెక్షన్ బోయపాలెం ప్రభుత్వ డైట్ కళాశాలలో సోమవారం నుంచి ఫస్టియర్ రెండోసెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నందున పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తహసీల్దార్ జె.శ్రీనివాసరావు తెలిపారు. డైట్ కళాశాల సమీపంలో, బోయపాలెం గ్రామంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులను పరీక్ష జరిగే సమయంలో మూసివేయాలని ఆదేశించారు. ఈనెల 8 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు. -
పరీక్షలంటే లోకేశ్ కు అర్థం తెలుసా : పండుల రవీంద్రబాబు
-
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు: మంత్రి సబితా
►సబ్జెక్టుల వారీగా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చాయో.. అవే మార్కులను సెకండియర్‌లోనూ కేటాయించే అవకాశం ఉంది.విద్యార్థులు రాసిన ►రికార్డ్ బుక్‌ల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులను ఇవ్వాలని అధికారుల ఆలోచన. ►బైపీసీ విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో గరిష్టంగా 30 మార్కుల చొప్పున నాలుగు సబ్జెక్టులకు 120 మార్కులు, ఎంపీసీ విద్యార్థులకు రెండు సబ్జెక్టులకు కలిపి 60 మార్కులను కేటాయించే యోచన. ►ఫస్టియర్‌లో ఫెయిలైనవారికి ఆయా సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు ఇవ్వాలని.. పైచదువులకు వెళ్లేవారికి కనీస మార్కుల నిబంధన సమస్య రాకుండా చూడాలనే ప్రతిపాదన! ►మార్కులపై ఏం చేయాలన్న దానిపై కమిటీ. ఆ కమిటీ సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ప్రకటించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు చదవడమే ఓ పరీక్షగా మారిందని.. దానికితోడు పరీక్షల నిర్వహణ సమస్య తలెత్తిందని ఆమె చెప్పారు. ‘‘సీఎం కేసీఆర్ ఇంతకు ముందే.. విద్యార్థుల ఆరోగ్యం, తల్లిదండ్రుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, ఇంటర్నల్స్ ఆధారంగా మార్కులు కేటాయించాలని ఆదేశించారు. తర్వాత ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను కూడా రద్దుచేసి, విద్యార్థులను సెకండియర్‌కు ప్రమోట్ చేశారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు ప్రతిపాదించినా.. విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం వద్దని సీఎం సూచించారు. తల్లిదండుల ఆందోళన, విద్యార్థుల ఆవేదనను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు రద్దు చేయాలన్నారు.ఈ మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నాం..’’ అని సబిత ప్రకటించారు. విధి విధానాలపై కమిటీ.. విద్యార్థులను ఎలా పాస్ చేయాలన్న దానిపై విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకోసం కమిటీ వేశామని, రెండు మూడు రోజుల్లో కమిటీ నివేదిక వస్తుందని, త్వరలోనే ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. విద్యార్థుల ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్‌లో మార్కులు వేసి ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ఇప్పుడు ఇచ్చే మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాయాలనుకుంటే పరిస్థితులు చక్కబడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కాగా.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షలను ఇటీవల రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల రద్దు వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. కనీస మార్కుల సమస్య రాకుండా.. గత ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో దాదాపు 1.99 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. అందులో కొందరు ఒక సబ్జెక్టు ఫెయిల్ కాగా.. మరికొందరు ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు. ప్రస్తుతం వారంతా సెకండియర్ పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు కూడా పరీక్షలు నిర్వహించని నేపథ్యంలో.. ఫస్టియర్ ఫెయిలైన సబ్జెక్టుల్లో కనీస మార్కులను కేటాయించేలా ఇంటర్ బోర్డు చర్యలు చేపడుతోంది. వారికి ఆయా సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు వేసి పాస్ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అంతేగాకుండా సెకండియర్‌లోనూ 45 శాతం మార్కులు వేయాలని.. పైచదువులకు వెళ్లినపుడు కనీస అర్హత మార్కుల నిబంధనతో ఇబ్బంది రాకుండా చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. జూలై మధ్యలో నిర్వహించాలనుకున్నా.. వాస్తవానికి జూలై మధ్యలో ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రం ప్రభుత్వం కూడా దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. జూలై మధ్యలో పరీక్షలు నిర్వహించి ఆగస్టులో ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది. పరీక్ష సమయాన్ని 90 నిమిషాలకు కుదిస్తామని, సగం ప్రశ్నలకే జవాబులు రాసేలా చర్యలు చేపడతామని పేర్కొంది. అయితే కేంద్రం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయడం, కరోనా పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడం, థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో పరీక్షల రద్దుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపింది. అధికారుల కమిటీ ఇచ్చే విధివిధానాల మేరకు ఇంటర్ బోర్డు మార్కులను కేటాయించి ఫలితాలను వెల్లడించనుంది. చదవండి: తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంపు లాక్డౌన్: హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు -
ఏపీ: టీసీసీ పరీక్షలు 26కు వాయిదా
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పరీక్షల విభాగ ఆధ్వర్యంలో బుధవారం నుంచి జరగాల్సిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ (టీసీసీ) పరీక్షలు ఈనెల 26వ తేదీకి వాయిదా పడ్డాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కారణంగా పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టరేట్ సవరించిన టైం టేబుల్‌ను సోమవారం విడుదల చేసింది. నూతన టైం టేబుల్ ప్రకారం.. ►డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈనెల 26 నుంచి 29 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా మొత్తం 8 పేపర్లతో జరగనున్నాయి. ►26, 27 తేదీల్లో హ్యాండ్లూమ్ వీవింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలను నిర్వహించనున్నారు. ►అలాగే, 26న టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్.. 27, 28 తేదీల్లో హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరగనున్నాయి. ►హ్యాండ్లూమ్ వీవింగ్ ప్రాక్టికల్స్ ఈనెల 27 నుంచి మే ఆరో తేదీ వరకు జరుగుతాయి. కాగా, గుంటూరు నగరంలోని హిందూ కాలేజ్ హైస్కూల్, స్టాల్ బాలికోన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాల పరిధిలో జిల్లా వ్యాప్తంగా 530 మంది హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణలో ప్రణాళికా లోపం.. కాగా, టీసీసీ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ పరీక్షల విభాగ ప్రణాళికా లోపం స్పష్టంగా కనబడుతోంది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 17–24 వరకు నిర్వహించాల్సిన పరీక్షలను ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఏప్రిల్ ఏడో తేదీకి వాయిదా వేశారు. తీరా ఈ నెల ఏడో తేదీ నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసిన అధికారులు హాల్ టిక్కెట్లను సైతం వెబ్సైట్లో పొందుపర్చారు. పరీక్షలకు హాజరుకావాల్సిన అభ్యర్థులు హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకుని ఎదురుచూస్తున్న సమయంలో మరోసారి పరీక్షలను వాయిదా వేశారు. ఈ విధంగా మొత్తం 40 రోజుల పాటు వాయిదా వేశారు. టీసీసీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మే ఒకటో తేదీ నుంచి 40 రోజుల పాటు సమ్మర్ ట్రైనింగ్ కోర్సు నిర్వహించాల్సి ఉంది. ఈ విధంగా పరీక్షల నిర్వహణలో దాదాపు 40 రోజుల పాటు జాప్యం నెలకొనడంతో సమ్మర్ ట్రైనింగ్ కోర్సు నిర్వహణపై స్పష్టత కొరవడింది. చదవండి: మద్యం మత్తులో ఏఎస్పీ హల్చల్ జనసేన, టీడీపీ చెట్టాపట్టాల్.. -
‘అటానమస్’ అక్రమాలకు చెక్: మంత్రి సురేష్
సాక్షి, విజయవాడ: అటానమస్ కాలేజీల్లో పరీక్ష విధానంలో మార్పులు తీసుకువస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అటానమస్ కాలేజీల్లో సొంతంగా పేపర్లు తయారు చేసుకోవడానికి కుదరదని స్పష్టం చేశారు. వాళ్లకు వారే పరీక్షలు పెట్టుకునే పరిస్థితి ఇక ఉండదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అటానమస్ కళాశాలపై సమీక్ష జరిపారని చెప్పారు. రాష్ట్రంలో 109 అటానమస్ కాలేజీలు ఉన్నాయని.. అక్కడ అక్రమాలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రతి డిగ్రీ విద్యలోనూ నైపుణ్యం పెంచాలని సీఎం నిర్ణయించారని.. అందుకే డిగ్రీలో అప్రెంటిస్ విధానం తీసుకొస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పూర్తి పారదర్శకత తేవాలని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అడ్మిషన్లలో రిజర్వేషన్లు పాటించడంలేదని.. అందుకే ఆన్లైన్లో అడ్మిషన్ల విధానం తెచ్చామని వెల్లడించారు. ప్రతిపక్షాలు, వాటి అనుకూల పత్రికలు చాలా దుష్ప్రచారాలు చేశాయని.. కానీ గత ఏడాది కంటే డిగ్రీ అడ్మిషన్లు పెరిగాయని మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు దక్కాయని పేర్కొన్నారు. అటామనస్ కాలేజీల్లో ఇన్నాళ్లు జరిగిన అక్రమాలకు చెక్ పెట్టామన్నారు. దీనికి ఆటంకం కల్పించాలని ప్రయత్నించినా తాము అధిగమిస్తామన్నారు. నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు యూజీసీతో కూడా దీనిపై సంప్రదిస్తామని తెలిపారు. అన్ని కాలేజీల్లో అకడమిక్ ఆడిటింగ్ కూడా చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. చదవండి: ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది..’ 2900 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు: కన్నబాబు -
పరీక్షల బాధ్యత ప్రభుత్వ వర్సిటీలదే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని అటానమస్ (స్వయం ప్రతిపత్తి), నాన్ అటానమస్ కాలేజీలలో ఇక నుంచి ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల బాధ్యత పూర్తిగా ప్రభుత్వ యూనివర్సిటీలదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అటానమస్ కాలేజీలే సొంతంగా ప్రశ్న పత్రాలు తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేసి, అన్ని కాలేజీలకూ ప్రభుత్వ యూనివర్సిటీలు తయారు చేసిన ప్రశ్న పత్రాలతోనే పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అటానమస్ కాలేజీల్లో పరీక్ష విధానం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన ప్రతిభతో కూడిన విద్యను అందించడంతో పాటు పరీక్షల్లో అక్రమాలు నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో భాగంగా అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో సమూల మార్పులు తీసుకు రావాలన్నారు. డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి. అన్ని కాలేజీలకు ఒకే విధానం ► ఇప్పటి వరకు ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులున్న నాన్ అటానమస్ కాలేజీలకు జేఎన్టీయూ (కాకినాడ), జేఎన్టీయూ (అనంతపురం)లు పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తుండగా అటానమస్ కాలేజీల యాజమాన్యాలే ప్రశ్నపత్రాలు రూపొందించుకుని పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ► బీఏ, బీఎస్సీ, బీకాం తదితర నాన్ ప్రొఫెషనల్ కోర్సుల నాన్ అటానమస్ డిగ్రీ కాలేజీలకు ఆయా ఇతర యూనివర్సిటీలు పరీక్షలు పెడుతుండగా, అటానమస్ కాలేజీలు తమ పరీక్షలు తామే పెట్టుకుంటున్నాయి. ► ఇకపై అక్రమాలకు తావు లేకుండా అన్ని కాలేజీల్లో ఒకే రకమైన పరీక్షల విధానం అమలు చేయాలి. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు, బీఏ, బీఎస్సీ, బీకాం తదితర నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల కాలేజీలన్నిటికీ ఈ విధానం వర్తిస్తుంది. ఈ ఏడాది భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధం చేయాలి ► ఈ సంవత్సరం భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఉగాది రోజున క్యాలెండర్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది 6 వేల మంది పోలీసుల నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ► ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్సిహెచ్ఈ) చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవెన, 27న వసతి దీవెన ► ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్, ఏప్రిల్ 27న వసతి దీవెన కింద హాస్టల్, భోజన ఖర్చుల విడుదలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ► జగనన్న విద్యా దీవెన కింద దాదాపు 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లలో 50 వేల వరకు పెరుగుదల ఉందని, విద్యా దీవెన ద్వారా పిల్లల చదువులకు ఇబ్బంది రాదనే భరోసా తల్లిదండ్రుల్లో వచ్చిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. అందుకే గత ఏడాదితో పోలిస్తే డిగ్రీ అడ్మిషన్లు 2.2 లక్షల నుంచి 2.7 లక్షలకు పెరిగాయని చెప్పారు. ► ఎన్నికల నోటిఫికేషన్ల కారణంగా ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధుల విడుదలలో ఆలస్యమైంది. ► అటానమస్ కాలేజీల్లో యూనివర్సిటీలతో సంబంధం లేకుండా పరీక్షల నిర్వహణ అనేక అక్రమాలకు దారితీస్తోంది. ఈ దృష్ట్యా ఉన్నత ప్రమాణాలు ఏర్పడేలా అటానమస్ అయినా, నాన్ అటానమస్ అయినా అందరికీ ఒకే విధానంలో పరీక్షలు, ఫలితాలుండాలి. ఈ మేరకు ప్రభుత్వ యూనివర్సిటీలకు అధికారం కల్పించాలి. ► విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలి. కొత్త కొత్త సబ్జెక్టులను వారికి అందుబాటులో ఉంచాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విద్యా విధానాన్ని పరిశీలించాలి. విశాఖపట్నంలో మంచి డిగ్రీ కాలేజీ తీసుకురావడంతో పాటు ఆర్ట్స్‌లో మంచి సబ్జెక్టులను ప్రవేశ పెట్టాలి. -
ప్రారంభమైన జేఈఈ మెయిన్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీలు), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ మెయిన్ తొలివిడత పరీక్షలు మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 26 వరకు రోజుకు రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఏటా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలలో నాలుగు సెషన్లలో పరీక్షల నిర్వహణకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. నాలుగు సెషన్లలో ఒక్కటి లేదా నాలుగు దఫాల్లోనూ విద్యార్థులు పరీక్షకు హాజరుకావచ్చు. నాలుగింటిలో ఎందులో ఎక్కువ స్కోర్ సాధిస్తే దాన్నే జేఈఈ ర్యాంకులకు పరిగణనలోకి తీసుకోనున్నారు. నాలుగు దఫాలు కలిపి పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 21.75 లక్షలు కాగా అత్యధికులు ఫిబ్రవరి సెషన్‌కే మొగ్గు చూపారు. మొదటి దశ (ఫిబ్రవరి) 6,61,761, రెండో దశ (మార్చి) 5,04,540, మూడో దశ (ఏప్రిల్) 4,98,910, నాలుగో దశ (మే)కు 5,09,972 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తొలివిడత పరీక్షకు 87,797 మంది హాజరైనట్లు తెలుస్తోంది. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష రాసే అవకాశం ఈసారి జేఈఈ మెయిన్‌ను ఆంగ్లం, హిందీతోపాటు మరో 11 ప్రాంతీయ భాషల్లో రాయడానికి ఎన్టీఏ అవకాశం కల్పించింది. తెలుగు, తమిళం, కన్నడం, మళయాలం, మరాఠీ, ఒడియా, పంజాబీ, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీలోనూ పరీక్షలు రాయొచ్చు. అయితే అత్యధిక శాతం మంది ఆంగ్లంలో రాసేందుకు మొగ్గుచూపుతుండడం విశేషం. హిందీ, గుజరాతీ, బెంగాలీ తప్ప తక్కిన ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసేందుకు చాలా తక్కువమంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 371 మంది మాత్రమే తెలుగు మాధ్యమంలో పరీక్ష హాజరైనట్లు తెలుస్తోంది. మొత్తం 13 మాధ్యమాలకు కలిపి 384 ప్రశ్నపత్రాలు ఎన్టీఏ విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. నాలుగు సెషన్లకు కలిపి నాలుగు లక్షలకుపైగా ప్రశ్నల బ్యాంకును సిద్ధం చేశారు. పరీక్ష విధానంలో మార్పు ఈసారి జేఈఈ సిలబస్, పరీక్ష విధానంలో కూడా ఎన్టీఏ మార్పులు చేశారు. పేపర్–1లో మొత్తం 90 ప్రశ్నల్లో 75 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. మొత్తం ప్రశ్నల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 30 చొప్పున ప్రశ్నలున్నాయి. ఒక్కోదాన్లో 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు, 10 న్యూమరికల్ ప్రశ్నలు ఇచ్చారు. న్యూమరికల్ ప్రశ్నల్లో 5 ప్రశ్నలకు చాయిస్ ఇవ్వగా. 5 ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు లేవు. నిపుణులు ఏమంటున్నారంటే.. ఈసారి ఇంటర్ బోర్డు పరీక్షల్లో 30 శాతం సిలబస్‌ను తొలగించినా జేఈఈలో సిలబస్‌ను తగ్గించకుండా 25 శాతం వరకు చాయిస్ ఇవ్వడం విద్యార్థులకు మంచి అవకాశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా నాలుగు సెషన్లలో పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఆందోళన తప్పుతుందని చెబుతున్నారు. ‘2019–20 ప్రశ్నపత్రాలు కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఉండి డిఫికల్టీ లెవల్ తగ్గింది. ఈసారి డిఫికల్టీ స్థాయి మరింత తగ్గుతుంది. ఇంటర్మీడియెట్ సిలబస్ పూర్తి అయినందున ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్ రాసే విద్యార్థులు 99 పర్సంటైల్ స్కోర్ చేసే అవకాశముంటుంది. గత మూడేళ్ల మెయిన్ పర్సంటైల్ గమనిస్తే ఫిజిక్స్‌లో 70 శాతం మార్కులు స్కోర్ చేస్తే 99 పర్సంటైల్ వచ్చింది. ఈసారి 50 శాతం మార్కులు సాధించినా 99 పర్సంటైల్ రావచ్చని పేర్కొంటున్నారు. నిర్ణీత సమయానికి 2 గంటల ముందే చేరుకోవాలి.. – విద్యార్థులందరూ తప్పనిసరిగా నిర్ణీత సమయానికి 2 గంటలు ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఏన్టీఏ సూచించింది. – పరీక్షలు ఉదయం సెషన్లో 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్లో 3 నుంచి 6 గంటల వరకు జరుగుతాయి. – పారదర్శకంగా ఉండే బాల్‌పెన్నును మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. – రఫ్ వర్క్ కోసం ఖాళీ పేపర్ షీట్లను పరీక్ష హాలులో అందిస్తారు. – పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లే ముందు విద్యార్థులు తమ పేరు, రోల్ నంబర్‌ను షీట్ పై భాగంలో రాసి ఇన్విజిలేటర్‌కు తప్పనిసరిగా అందించాలి. – మధుమేహం ఉన్న విద్యార్థులు తమతోపాటు పరీక్ష కేంద్రంలోకి పండ్లు, షుగర్ టాబ్లెట్లు తీసుకెళ్లొచ్చు. -
ఎక్కడి వారికి అక్కడే ప్రాక్టికల్స్!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలతోపాటు ప్రాక్టికల్స్‌ను తమ సమీపంలోని కాలేజీల్లో చేసుకునేలా వెసులుబాటు కల్పించేందుకు జేఎన్టీయూ కసరత్తు చేస్తోంది. కరోనా అదుపులోకి రాకపోవడం, కాలేజీలు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేలా ఏర్పాట్లపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆన్లైన్ తరగతులకు పట్టణ ప్రాంతాల్లో 90 శాతం వరకు, గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం వరకు విద్యార్థుల హాజరు ఉంటోందని గుర్తించింది. గత మూడు రోజులుగా యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశంపైన చర్చించింది. ఆన్లైన్ తరగతుల హాజరు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంత ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు ప్రత్యామ్నాయ తరగతులను నిర్వహించాలని యాజమాన్యాలను ఆదేశించింది. అప్పుడు సెమిస్టర్ పరీ క్షలు నిర్వహించడం సాధ్యం అవుతుందన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా యాజమాన్యాల సంసిద్ధతపైనా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించింది. జేఎన్టీయూ పరిధిలోని 180కి పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్కో సెమిస్టర్లో 50 వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం, ప్రథమ సెమిస్టర్లో ప్రవేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రథమ సెమిస్టర్ విద్యార్థులు మినహా మిగతా ఐదు సెమిస్టర్ల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. అయితే వారంతా ప్రస్తుతం తాము చదువుతున్న కాలేజీలున్న ప్రాంతాల్లో ఉండటం లేదు. కరోనా కారణంగా తమ తమ జిల్లాలు, గ్రామాల్లోనే ఉంటున్నారు. అక్కడే ఉండి ఆన్లైన్ తరగతులను వింటున్నారు. వారందరికీ వచ్చే ఒకటీ రెండు నెలల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో పాఠ్యాంశాల బోధన ఏ మేరకు పూర్తయిందన్న దానిపైనా యాజమాన్యాలతో సమీక్షించింది. ఇందులో పట్టణ ప్రాంతాల్లోని కాలేజీల్లో సిలబస్ బాగానే అయినా, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో సగమే అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో అదనపు తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని యాజమాన్యాలను ఆదేశించింది. ఇక విద్యార్థులు తమ కాలేజీలకు వెళ్లి పరీక్షలు రాయడం, ప్రాక్టికల్స్ చేయడం వంటివి లేకుండా, వారికి సమీపంలో ఉన్న కాలేజీల్లోనే పరీక్షలు రాసేలా, ప్రాక్టికల్స్ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమైన షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. షెడ్యూలు జారీ చేసిన వెంటనే విద్యార్థులు తమకు సమీపంలోని కాలేజీ వివరాలతో దరఖాస్తు చేసుకుంటే వారికి ఆయా కాలేజీల్లో సెమిస్టర్ పరీక్షలు రాసేలా, ప్రాక్టికల్స్ చేసేలా ఏర్పాట్లు చేయనుంది. -
దసరా వరకు పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న, జరగాల్సిన అన్ని రకాల పరీక్షలను దసరా వరకు వాయిదా వేసినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్సిటీలను ఆదేశించామని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు యూని వర్సిటీలు కూడా ఈనెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా వేస్తు న్నట్లు ప్రకటించాయి. దసరా తర్వాత పరీక్షలు యథావిధిగా ఉంటాయని వెల్లడించాయి. 27వ తేదీ పరీక్షలు యథావిధిగా జరుగు తాయని జేఎన్టీయూ వెల్లడించింది. -
‘ఇంజనీరింగ్ పరీక్షలను రద్దు చేయండి’
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జవహార్‌లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) వద్ద విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇంజనీరింగ్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.. యూనివర్సిటీ గేటు దాటి విద్యార్థులంతా మూకుమ్మడిగా లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. పలువురు విద్యార్థును అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
‘పరీక్షా’ సమయం!
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో కరోనా కారణంగా వాయిదాపడిన అన్ని కోర్సుల పరీక్షలను నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు గురువారం నుంచి ఓయూ పరీక్షలు ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. కరోనా కారణంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిబంధనల ప్రకారం వారి కాలేజీల్లోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్, బీఈడీ, బీపీఈడీ, బీసీఏ, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు 17వ తేదీ నుంచి వచ్చేనెల 14 వరకు జరుగుతాయి. ఎంబీఏ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి 12 వరకు, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ ఇతర డిగ్రీ కోర్సుల పరీక్షలు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 13 వరకు జరుగుతాయని కంట్రోలర్ వివరించారు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు పరీక్షలకు రెండు రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, పరీక్షల టైంటేబుల్, ఇతర వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవడంతో రాబోయే మూడు నెలలు వరుసగా పరీక్షలు నిర్వహిస్తున్నామని కంట్రోలర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. -
21 నుంచి పద్మావతి వర్సిటీ పీజీ, బీటెక్ పరీక్షలు
సాక్షి, యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పీజీ, బీటెక్ చివరి సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 21 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.జమున మంగళవారం తెలిపారు. ఇందుకోసం వర్సిటీ దూరవిద్యా అధ్యయన కేంద్రాలతో పాటు మరికొన్ని ఇతర కేంద్రాలు వినియోగించనున్నట్లు చెప్పారు. చిత్తూరు, తిరుపతి, కర్నూలు, కడప, నెల్లూరు, ఒంగోలు, అనంతపురం, విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, విశాఖ, శ్రీకాకుళం నగరాల్లో ప్రతిరోజూ ఉ.10 నుంచి 1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్ తెచ్చుకోవాలని సూచించారు. ఎస్వీయూ సెట్ దరఖాస్తు గడువు పెంపు: ఎస్వీయూలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడవును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు డైరెక్టరేట్ ఆప్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో దరఖాస్తు చేసే అవకాశం కల్పించామన్నారు. -
ప్రాణం పోయాక వెలుగు చూసిన దారుణం
ఇండోర్: మధ్యప్రదేశ్, ఇండోర్‌లో చోటుచేసుకున్న విషాద ఘటన వెనుక అసలు రహస్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో తప్పుతానేమోననే భయంతో ఉసురు తీసుకుందనుకున్న తమ బిడ్డ అత్యధిక మార్కులు సాధించడంతో విస్తుపోయిన కుటుంబ సభ్యులు అసలు విషయాన్నిఆరా తీశారు. పొరుగున ఉండే ఇద్దరు వ్యక్తుల వేధింపుల కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని తెలిసి బావురుమన్నారు. ఇండోర్‌కు చెందిన ఒక యువతి (19) రెండు రోజుల క్రితం (సోమవారం ఉదయం) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్నభయంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఆ తరువాత ప్రకటించిన (సోమవారం మధ్యాహ్నం)12 వ తరగతి పరీక్షా ఫలితాల్లో 74 శాతం మార్కులు సాధించింది. దీంతో అనుమానం వచ్చిన బాధిత యువతి సోదరుడు చుట్టుపక్కల విచారించగా అసలు సంగతి బైటపడింది. తన సోదరిని పొరుగున ఉండే ఇద్దరు యువకులు వేధింపులకు గురి చేయడంతోనే చనిపోయిందని యువతి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను చాలాకాలంగా వేధిస్తున్నారని తెలిపారు. అంతేకాదు దీనికి ఒప్పుకోకపోతే కుటుంబాన్ని చంపేస్తామని బెదరించారని ఆరోపించారు. చివరికి తన సోదరి చనిపోయే ముందు రోజుకూడా ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంబంధిత వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి, పెళ్లికి ఒప్పుకోకపోతే భయంకర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించడంతోనే ఆమె ప్రాణాలు తీసుకుందని వాపోయారు. నిందితులకు నేర చరిత్ర కూడా ఉందని పోలీసులకు వివరించారు. మరోవైపు బాలిక సోదరుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనీ, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసు అధికారి యోగేశ్ తోమర్ బుధవారం వెల్లడించారు. -
వర్సిటీల్లో పరీక్షలు రద్దు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో జూలైలో జరగాల్సిన ఫైనల్ ఇయర్ పరీక్షలన్నీ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని అక్టోబర్ వరకు వాయిదా వేయనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇంటర్మీడియెట్, టెర్మినల్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను తిరిగి రూపొందించి, కొత్త విద్యా సంవత్సరం కేలండర్‌ను తయారు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గతంలో ఆదేశించారు. కొత్త మార్గదర్శకాలను రూపొందించడానికి హరియాణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఆర్సీ కుహాద్ ఆధ్వర్యంలో యూజీసీ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. కొత్త ఎకడమిక్ కేలండర్పై కసరత్తు చేస్తున్న ఈ ప్యానెల్ మరో వారం రోజుల్లో కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తుందని హెచ్ఆర్డీ అధికారులు తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాన్ని రూపొందిస్తారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులు పూర్వ ప్రతిభ ఆధారంగా మార్కులు నిర్ణయించేలా కసరత్తు జరుగుతోంది. అయితే ఆ మార్కుల పట్ల విద్యార్థులెవరైనా అసంతృప్తిగా ఉంటే, కోవిడ్ తగ్గుముఖం పట్టాక జరిగే పరీక్షల్లో పాల్గొనే అవకాశం ఇస్తారని అధికారులు వివరించారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రారంభం కావల్సి ఉన్న విద్యా సంవత్సరాన్ని అక్టోబర్ వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయి. ఎన్సీఈఆర్టీకి కొత్త మార్గదర్శకాలు 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 1–5 క్లాస్‌ల వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి వీలుగా ఇన్ఫోగ్రాఫిక్స్, పోస్టర్ ప్రజెంటేషన్స్ వంటివి అక్టోబర్ నాటికల్లా రూపొందించాలి. 6–12తరగతుల వారికి మార్చికల్లా సిద్ధంచేయాలి. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనేలా టీచర్లకు శిక్షణతరగతుల్ని డిసెంబర్‌నాటికి పూర్తి చేయాలి. 6–12తరగతుల విద్యార్థులకి ఆన్లైన్ బోధనకు టీచర్లకు శిక్షణ వచ్చే ఏడాది జూన్ నాటికల్లా పూర్తి కావాలి. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనే సదుపాయాలు లేని విద్యార్థులకు చదువు చెప్పడానికి సిలబస్‌ను, పుస్తకాల తయారీ పని డిసెంబర్‌కల్లా పూర్తి కావాలని కేంద్రం స్పష్టం చేసింది. -
యూజీ, పీజీ పరీక్షలపై మంత్రి సురేష్ స్పష్టత
సాక్షి, అమరావతి : పదో తరగతి పరీక్షల మాదిరి యూజీ, పీజీ పరీక్షలు రద్దయ్యే అవకాశం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నామే తప్ప రద్దన్న ప్రశ్న ఉత్పన్నమే కాలేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల పరీక్షల నిర్వహణ, రాబోయే విద్యా సంవత్సరంలో చేయాల్సిన పనులపై రాష్ట్రంలో ఉన్న 16 యూనివర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితులపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో సమీక్షించారు. అనంతరం మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో సీఎం జగన్ నాయకత్వంలో కరోనా నియంత్రణపై స్పష్టమైన జాగ్రత్తలతో ముందుకు వెళ్తున్నామన్నారు. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదురావుతాయనే ముందుగానే తొమ్మిదో తరగతి లోవు పరీక్షలు రద్దు చేశామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించాలనుకున్నా కేసులు పెరుగుతున్నందున రద్దు చేశామన్నారు. (చదవండి : కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డ్ ) యూజీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు పరిస్థితులపై అవగాహన ఉంటుందని.. ఒక్కో యూనివర్సిటీలో ఒక్కొక్క రకమైన పరిస్థితి ఉందన్నారు. పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఎలా చేయాలి.. రద్దు చేయాల్సి వస్తే ఏమి చేయాలి అని పూర్తిగా కసరత్తు చేశామని మంత్రి తెలిపారు. ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి గురువారం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకూ పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రకటించలేదని.. ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం అకాడమిక్ క్యాలెండర్‌ను రూపొందిస్తామని మంత్రి సురేష్ తెలిపారు. -
విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇస్తున్నాం
ముంబై: 10, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతకు సంబంధించి దేశ, విదేశాల్లోని విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇస్తున్నట్లు ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (ఐఎస్‌సీఈ)బోర్డు తెలిపింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో ఐఎస్ఈసీ 10, 12వ తరగతి పరీక్షలు జరపాలని నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ముంబై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఐఎస్ఈసీ.. లాక్డౌన్ సమయానికి రాయగా మిగిలిన సబ్జెక్టులకు జూలైలో పరీక్షలు రాయడం లేదా ప్రి–బోర్డు పరీక్షలు/ అంతర్గత అంచనా ద్వారా మార్కులు వేసే విధానానికి అంగీకరించడం.. ఈ రెండింటిలో తమకు నచ్చిన విధానాన్ని ఎంపిక చేసుకునే వీలుంటుందని తెలిపింది. ఈ విషయాన్ని స్కూళ్లకు తెలిపామని, విద్యార్థుల నుంచి ఆప్షన్లు అందాక ఆ మేరకు 22వ తేదీ కల్లా ఒక అంచనాకు వస్తామని పేర్కొంది. విద్యార్థుల ప్రి–బోర్డు పరీక్షల ఫలితాలు/అంతర్గత అంచనా మార్కులను ఇప్పటికే పాఠశాలల నుంచి తెప్పించుకున్నట్లు వెల్లడించింది. లాక్డౌన్ విధించడంతో 10, 12వ తరగతి ఫైనల్ పరీక్షలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో మిగిలిన పరీక్షలను జూలైలో జరిపేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. -
జేఎన్టీయూలో డిటెన్షన్ రద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మ్–డిలో డిటెన్షన్‌ను జేఎన్టీయూ రద్దు చేసింది. వివిధ సెమిస్టర్లలో విద్యార్థులు పాస్, ఫెయిల్‌తో సంబంధం లేకుండా (గతంలో డిటెయిన్ అయిన వారిని కూడా) తర్వాతి సెమిస్టర్‌కు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), రాష్ట్ర ఉన్నత విద్యామండలి జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ మార్గదర్శకాలను జేఎన్టీయూ గురువారం జారీ చేసింది. అందులోని ప్రధాన అంశాలివే.. 2020–21 విద్యా సంవత్సరంలో డిటెన్షన్ విధానం ఉండదు. నిర్దేశిత సబ్జెక్టులు పాస్ కాకున్నా విద్యార్థులంతా తర్వాతి సెమిస్టర్‌కు అనుమతి. ముందుగా ఫైనల్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ. ప్రతి సబ్జెక్టు పరీక్ష 2 గంటలే. గరిష్ట మార్కుల్లో తేడా ఉండదు. పరీక్షల్లో 8 ప్రశ్నలకు 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. తప్పనిసరి పార్ట్ అనేది లేదు. ప్రతి ప్రశ్నకు 20 నిమిషాల సమయం ఉంటుంది. లాక్డౌన్ కాలమంతా విద్యార్థులు కాలేజీలకు హాజరైన ట్లుగానే పరిగణనలోకి. అయితే హాజరు తక్కువగా ఉన్న వారి వివరాలు వెబ్సైట్లో నమోదు. ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు సంబంధిత కాలేజీలోనే నిర్వహణ. కాలేజీల మార్పు ఉండదు. కాలేజీల మూసివేతకు దరఖాస్తు చేసిన కాలేజీల విద్యార్థులకు సమీప కాలేజీలో పరీక్షలు. బీటెక్ నాలుగో సంవత్సరం, రెండో సెమిస్టర్, బీపార్మసీ రెండో సెమిస్టర్ పరీక్షలు, ఎంబీఏ, ఎంసీఏ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి మొదలు. రవాణా సదుపాయం లేక పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులు 45 రోజుల్లో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. బీటెక్ ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్ రెండో సెమిస్టర్ పరీక్షలు, ఫార్మ్–డి రెండో, మూడో, నాలుగో, 5వ సంవత్సరం, పార్మ్–డి (పీబీ) సెకండియర్ పరీక్షలు జూలై 16 నుంచి ప్రారంభం. ఆగస్టు 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. ప్రథమ బీటెక్, బీపార్మసీ ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్, నాలుగో సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు 3వ తేదీ నుంచే ఉంటాయి. ఎంబీఏ, ఎంసీఏ ఫస్టియర్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్, ఎంసీఏ సప్లిమెంటరీ ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు, ఎంటెక్, ఎంఫార్మసీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్, ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫార్మ్–డి ఫస్టియర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలూ అప్పుడే ఉంటాయి. జూలై 1 నుంచి 15 వరకు కాంటాక్టు తరగతులు, ల్యాబ్ ఎక్స్పరిమెంట్స్, ల్యాబ్ పరీక్షల నిర్వహణ. బీటెక్, బీఫార్మసీ సెకండ్ సెమిస్టర్ (రెగ్యులర్), ఫస్ట్ సెమిస్టర్ (సప్లిమెంటరీ) పరీక్షలకు ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు (రిజిస్ట్రేషన్) ఈనెల 6లోగా పూర్తి చేయాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తదితర ఫీజులను విద్యార్థులు కాలేజీకి రాకుండా ఆన్లైన్లో చెల్లించే ఏర్పాట్లు చేయాలి. ఫీజుల చెల్లింపు, ఫలితాల వివరాలను విద్యార్థులకు తెలియజేసేందకు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయాలి. కరోనా జాగ్రత్తలు తప్పనిసరి... ► విద్యార్థులు, సిబ్బంది క్యాంపస్‌లో ఉన్నప్పుడు మాస్క్‌లు కచ్చితంగా ధరించాలి. మాస్క్‌లు ధరించిన వారినే సెక్యూరిటీ సిబ్బంది అనుమతించాలి. ► ప్రతి భవనం వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు, సిబ్బంది వాటిని ఉపయోగించేలా చూడాలి. ► తరగతి గదులు, పరీక్ష హాళ్లు, ల్యాబ్‌లలో భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. ► థర్మల్ స్కానింగ్ తప్పనిసరిగా అమలు చేయాలి. తరగతి గదులు, ప్రయోగశాలలను, కాలేజీ బస్సులను ప్రతిరోజూ శానిటైజ్ చేయాలి. ► ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఐసోలేట్ చేసి చికిత్స అందించాలి. ► పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రతి బెంచ్‌కు ఒకరే.. అదీ జిగ్‌జాగ్‌లో కూర్చోబెట్టాలి. -
జులై 1 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : పెండింగ్‌లో ఉన్న పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) జులైలో నిర్వహిస్తుందని వెల్లడించింది. ఈ తరగతులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సబ్జెక్టుల పరీక్షలను సీబీఎస్ఈ జులై 1 నుంచి 15 వరకూ నిర్వహిస్తుందని మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా అంతకుమందు విద్యార్ధులతో లైవ్‌లో ముచ్చటించిన హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పది, పన్నెండో తరగతి పరీక్షలపై సీబీఎస్ఈ ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇదే సమావేశంలో జేఈఈ మెయిన్, నీట్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి ప్రకటించారు. ఈ ఎంట్రన్స్ పరీక్షలు జులై ద్వితీయార్ధంలో జరుగుతాయని తెలిపారు. కాగా పెండింగ్‌లో ఉన్న పది, పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేయలేదని, వాటిని నిర్వహిస్తామని సీబీఎస్ఈ ఇటీవల వివరణ ఇచ్చింది. పరీక్షల నిర్వహణకు ముందు విద్యార్ధులకు ప్రిపరేషన్ కోసం తగినంత సమయం ఇస్తామని స్పష్టం చేసింది. చదవండి : పెండింగ్‌లో ఉన్న పరీక్షలు నిర్వహిస్తాం -
పరీక్షల రద్దుపై సీబీఎస్ఈ వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : పదో తరగతి పెండింగ్ సబ్జెక్టు పరీక్షలపై నెలకొన్న గందరగోళానికి సీబీఎస్ఈ తెరదించింది. పది, పన్నెండో తరగతి పెండింగ్‌లో ఉన్న పరీక్షలు నిర్వహించనందున ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్ధులను ప్రమోట్ చేయాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కోరుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని పేర్కొనడంతో అసలు ఈ పరీక్షలు రద్దయ్యాయా లేదా అనే గందరగోళం ఏర్పడింది. మరోవైపు పెండింగ్‌లో ఉన్న పదవ తరగతి మైనర్ సబ్జెక్టుల పరీక్షలు రద్దవుతాయని సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి పేర్కొన్నారు. రద్దు చేసినా విద్యార్థుల కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపని మైనర్ సబ్జెక్టుల పరీక్షలనే రద్దు చేసినట్టు సీబీఎస్ఈ బుధవారం జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇక పెండింగ్‌లో ఉన్న పదో తరగతి ప్రధాన సబ్జెక్టుల పరీక్షలను బోర్డు నిర్వహిస్తుందని స్పష్టం చేసింది. బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏప్రిల్ 1న జారీ చేసిన ప్రకటనలో ఎలాంటి మార్పూ లేదని సీబీఎస్ఈ పేర్కొంది. ఢిల్లీ అల్లర్లతో అక్కడ వాయిదా పడిన ప్రధాన పేపర్ల పరీక్షలను లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షలు ప్రారంభమయ్యే పది రోజుల ముందుగానే అందరకి పరీక్షల వివరాలను తెలియచేస్తామని పేర్కొంది. కాగా పన్నెండో తరగతి పెండింగ్ పరీక్షల గురించి బోర్డు ప్రస్తావించకపోవడం గమనార్హం. చదవండి : సీబీఎస్ఈ సిలబస్ హేతుబద్ధీకరణ -
పరీక్షలు లేకుండానే పాస్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 9వ తరగతి వరకున్న విద్యార్థులకు ఈసారి పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కోవిడ్ విజృంభన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు సెలవులను ప్రకటించింది. అయితే కేంద్రం వచ్చే నెల 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో ఇక పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి ఏప్రిల్ 7 నుంచి ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు ప్రకటించింది. మరోవైపు ఈ విద్యా సంవత్సరం ఈ నెల 23తో ముగియనుంది. దీంతో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్ మరో వారం పొడిగిస్తే కనుక అసలు సాధ్యమే కాదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులను పైతరగతికి ప్రమోట్ చేయాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. 9వ తరగతి వరకు విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పాస్ చేసేలా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. -
కేంద్ర ఉద్యోగులకూ వర్క్ ఫ్రమ్ హోం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడే లక్ష్యంగా భారత ప్రభుత్వ సంస్థలు, వేర్వేరు మంత్రిత్వ శాఖలు మరిన్ని చర్యలకు శ్రీకారం చుట్టాయి. ప్రజలు గుమికూడేందుకు ఉన్న అన్ని అవకాశాలను వీలైనంత వరకూ తగ్గించే దిశగా పలు చర్యలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పని చేయవచ్చునని ఆదేశించడం మాత్రమే కాకుండా... రైలు ప్రయాణాలను తగ్గించేందుకు రైల్వే శాఖ రోగులకు మినహా మిగిలిన వారందరికీ రాయితీలు తొలగించగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని రకాల పరీక్షలను ఈ నెలాఖరు వరకూ వాయిదా వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వైరస్ తీవ్రత దృష్ట్యా పదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి ఐసీఎస్ఈ బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ‘ద కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్’ప్రకటించింది. సగం మంది ఇంటి నుంచే.. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఆదేశించగా కేంద్ర ప్రభుత్వం గురువారం నుంచి సగం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయవచ్చునని ప్రకటించింది. మిగిలిన సగం మంది మాత్రం ఆఫీసులకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఉద్యోగులకు వేర్వేరు పనిగంటలను కేటాయించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. సిబ్బంది మంత్రిత్వ శాఖ విభాగాధిపతులకు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆఫీసుల్లో కనీసం యాభై శాతం మంది గ్రూప్ బీ, సీ ఉద్యోగులు కచ్చితంగా ఉండాలి. మిగిలిన వారు ఇంటి నుంచి పనిచేయవచ్చు. ఈ రెండు వర్గాల ఉద్యోగులు వారానికి ఒకసారి ఎక్కడి నుంచి పనిచేస్తారన్నది మార్చుకుంటారు. తొలి వారం ఎవరు ఆఫీసుకు రావాలన్న అంశంలో ఆఫీసుకు దగ్గరగా ఉన్న వారు...సొంత వాహనాలు వాడేవారికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఉద్యోగులందరినీ మూడు వర్గాలుగా విభజించి ఒకరికి 9 – 5 గంటలు, ఇంకొకరికి 9.30 –5.30, మరొకరికి 10 – 6 గంటల పనివేళలు నిర్ణయించాలని కూడా సూచించారు. ఇళ్ల నుంచి పనిచేసే ఉద్యోగులు టెలిఫోన్ ద్వారా, ఎలక్ట్రానిక్ పద్ధతుల్లోనూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైల్వే రాయితీలు కట్ రైళ్లలో జనసమ్మర్ధాన్ని నివారించే ఉద్దేశంతో కేంద్ర రైల్వే శాఖ ఇస్తున్న పలు రాయితీలను నిలిపివేస్తూ గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. రోగులు, విద్యార్థులు, దివ్యాంగుల కేటగిరీలో కొందరికి మాత్రం మినహాయింపు ఉంటుంది. మార్చి 20వ తేదీ అర్ధరాత్రి నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ ఆదేశాలు కొనసాగుతాయి. ఇప్పటివరకూ దాదాపు 53 వర్గాల వారికి రాయితీలు లభిస్తూండగా ఇక ఇవి 15కు మాత్రమే పరిమితమవుతాయి. వయోవృద్ధులు అనవసర ప్రయాణాలను నివారించేందుకు ఈ ఆదేశాలు ఉపయోగపడ తాయని అంచనా. ఈ నెల 20వ తేదీ ఆ తరువాత బుక్ చేసుకున్న టికెట్లకు ఈ షరతులు వర్తిస్తాయి. ఇప్పటికే బుక్ చేసుకున్న రాయితీ టికెట్లను ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే వారి నుంచి క్యాన్సలేషన్ ఛార్జీలు వసూలు చేయమని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఐసీఎస్ఈ పరీక్షలువాయిదా ఐసీఎస్ఈ సిలబస్‌లో 10, 12వ తరగతుల పరీక్షలను వాయిదావేస్తూ కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ నెలాఖరు వరకూ పరీక్షలను వాయిదా వేసుకోవాలని మానవ వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పరీక్షలను యూజీసీ వాయిదావేసింది. స్టాఫ్ సెలక్షన్ పరీక్షలు సైతం కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగ నియామక పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిటీ (ఎస్ఎస్సీ)గురువారం ప్రకటించింది. వాయిదా వేసిన పరీక్షల్లో మార్చి 20న జరగాల్సిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్‌తోపాటు మార్చి 30న జరగాల్సిన జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ కాంట్రాక్ట్) పరీక్షలు ఉన్నాయి. వృద్ధులు, పిల్లలు ఇళ్లకే పరిమితం వైరస్ విస్తృతి నేపథ్యంలో దేశంలో 65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, పదేళ్ల లోపు వయసున్న వారు ఇళ్లకే పరిమితం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ సలహా ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యనిపుణులకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఉంటుందని విదేశీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ రవి తెలిపారు. మాస్కులు, శానిటైజర్ల వంటివాటిని అధిక ధరలకు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్, వినియోగదారుల శాఖలను కోరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో వైరస్ సామూహికంగా వ్యాప్తి చెందడం లేదని ఆరోగ్యశాఖ తెలిపింది. పంజాబ్‌లో మరణించిన వ్యక్తి వృద్ధుడే కాకుండా మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్న వారని తెలిపారు. మార్చి 22వ తేదీ నుంచి మార్చి 29 వరకూ అన్ని అంతర్జాతీయ విమానాలు భారత్‌లో అడుగుపెట్టకుండా నిషేధం విధించినట్లు భారత్ ప్రకటించింది. -
జేఈఈ, సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 10, 12 తరగతులకు జరుగుతున్న బోర్డు పరీక్షలను సీబీఎస్ఈ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) మార్చి 31 వరకు వాయిదావేసింది. ‘భారత్‌లో, విదేశాల్లో జరుగుతున్న క్లాస్ 10, క్లాస్ 12 పరీక్షలను మార్చి 31 వరకు వాయిదా వేస్తున్నాం. ఆ పరీక్షలను తదుపరి ఎప్పుడు నిర్వహించేదీ.. పరిస్థితులను సమీక్షించి, త్వరలో ప్రకటిస్తాం’ అని సీబీఎస్ఈ బుధవారం వెల్లడించింది. పరీక్ష పత్రాల మూల్యాంకన విధులను కూడా మార్చి 31 వరకు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, తమ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేయలేదని ఐసీఎస్సీ(ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ప్రకటించింది. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఐఐటీ ఇతర ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ(జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష ఏప్రిల్ 5 నుంచి 11 వరకు జరగాల్సి ఉండగా, వాయిదా వేసినట్లు హెచ్చార్డీ శాఖకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత ముఖ్యమని, అందువల్ల అన్ని పరీక్షలను వాయిదా వేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ సీబీఎస్సీ, ఇతర విద్యాసంస్థలను ఆదేశించిన నేపథ్యంలో సీబీఎస్సీ పై నిర్ణయం ప్రకటించింది. -
ఏపీలో టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో మార్పు చోటు చేసుకుంది. ప్రభుత్వం శనివారం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకూ టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కొత్త షెడ్యూల్ మార్చి 31-ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 ఏప్రిల్ 1-ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 ఏప్రిల్ 3- సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఏప్రిల్ 4- ఇంగ్లీష్ పేపర్-1 ఏప్రిల్ 6-ఇంగ్లీష్ పేపర్-2 ఏప్రిల్ 7-మ్యాథమేటిక్స్ పేపర్-1 ఏప్రిల్ 8-మ్యాథమేటిక్స్ పేపర్-2 ఏప్రిల్ 9-జనరల్ సైన్స్ పేపర్-1 ఏప్రిల్ 11-జనరల్ సైన్స్ పేపర్-2 ఏప్రిల్ 13-సోషల్ స్టడీస్ పేపర్-1 ఏప్రిల్ 15- సోషల్ స్టడీస్ పేపర్-2 ఏప్రిల్ 16- ఓఎస్ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్ పేపర్-2 ఏప్రిల్ 17-SSC ఒకేషనల్ కోర్స్ థియరీ -
నీకు తోడుగా నాన్న ఉన్నాడమ్మా!
సాక్షి, ఆదిలాబాద్ : ఆడపిల్లలు భారమనుకుంటున్న ఈ రోజుల్లో ఓ తండ్రి అంగవైకల్యం గల తన కూతురును పరీక్ష కేంద్రానికి స్వయంగా తీసుకొచ్చి పరీక్ష రాయించాడు. పట్టణంలోని కోలిపుర కాలనీకి చెందిన మందుల్వార్ బావురావుకు అంగ వైకల్యం ఉన్న కూతురు వికిత ఉంది. అయితే ఆమె బంగారు భవిష్యత్తు కోసం బావురావు తన కూతురును ఓపెన్‌లో డిగ్రీ చదివిస్తున్నాడు. అయితే సోమవారం పరీక్షలు రాయడానికి ప్రభుత్వ డిగ్రీ బాలుర కళాశాల పరీక్ష కేంద్రానికి ఆమెను తీసుకొచ్చి ‘నీకు తోడుగా నాన్న ఉన్నాడమ్మా’ అంటూ ధైర్యాన్నిచ్చాడు. కాగా వికితకు సహాయంగా పదవ తరగతి విద్యార్థి పరీక్ష రాశాడు. -
ఢిల్లీ అల్లర్లు : సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : అల్లర్లతో దేశ రాజధాని అట్టుడుకుతున్న క్రమంలో ఈనెల 28, 29 తేదీల్లో ఈశాన్య ఢిల్లీలో జరగాల్సిన పది, పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్టు సీబీఎస్ఈ గురువారం వెల్లడించింది. ఈ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత నిర్వహిస్తామని సీబీఎస్ఈ ట్వీట్ చేసింది. ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్ధితి సజావుగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం సైతం పరీక్షలను వాయిదా వేయాలని సీబీఎస్ఈని కోరింది. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో బోర్డు ఎగ్జామ్స్ కోసం సమగ్ర కార్యాచరణ ప్రకటించాలని ఢిల్లీ హైకోర్టు సీబీఎస్ఈని ఆదేశించింది. ఇక ఈశాన్య ఢిల్లీలోని 80 పరీక్షా కేంద్రాల్లో నేడు జరగాల్సిన పన్నెండో తరగతి బోర్డు పరీక్షను వాయిదా వేసినట్టు సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటించింది. -
మార్కులే సర్వస్వం కాదు..
న్యూఢిల్లీ: విద్యార్థులకు పరీక్షలే ప్రధానం కాదనీ, తమ ఆసక్తులను బట్టి విద్యార్థులు ఎదగాలనీ, సాంకేతికతకు బానిసలు కారాదనీ ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమంలో ప్రధాని మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా హాజరైన విద్యార్థులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. తాత్కాలికంగా ఎదురయ్యే అవరోధాలను చూసి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని ప్రధాని పిల్లలకు హితవు పలికారు. పరీక్షల సమయంలో ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో, పరీక్షల్లో సమయపాలనకు ఏం చేయాలో కొన్ని చిట్కాలు చెప్పారు. క్రికెట్ నుంచి మొదలుకొని, చంద్రయాన్ –2 ప్రయోగం వరకు స్వీయ అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలను ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలనీ, అయితే అది మన జీవితాలను శాసించే స్థాయికి చేరకుండా జాగ్రత్తపడాలన్నారు. ‘అత్యంత వేగంగా సాంకేతికాభివృద్ధిలో మార్పులు సంభవిస్తున్నాయి. సాంకేతికతను చూసి భయపడాల్సిన పనిలేదు. శాస్త్ర సాంకేతిక విజ్ఙానం మన స్నేహితుల్లాంటిది. దాన్ని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ∙కేవలం ఆ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ఒక్కటే సరిపోదు, దాన్ని అన్వయించడమే ప్రధానమైన విషయం. దాన్ని మనం అధీనంలో ఉంచుకోవాలి తప్ప దాని అధీనంలోకి మనం వెళ్లి సమయాన్ని వృథా చేసుకోరాదు’అంటూ విద్యార్థులకు హితబోధ చేశారు. నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి జయాపజయాలతో నిమిత్తం లేకుండా నిత్యం ప్రయత్నించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ ఆయన.. ‘చంద్రయాన్–2 ఆవిష్కరణ విజయవంతమవుతుందన్న గ్యారెంటీ లేకపోయినప్పటికీ లాంచింగ్ సమయంలో ఇస్రోలో ఉండాలనుకున్నా. ఆ అనుభవాన్ని ఎన్నటికీ మరిచిపోలేను’అని ఉదహరించారు. ఎలాంటి అననుకూల పరిస్థితుల్లోనైనా రాణించాలని సూచించారు. 2001లో భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఏం చేశారు? అని ప్రశ్నించారు. మొత్తం మ్యాచ్‌నే మలుపుతిప్పిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. పరీక్షల్లో మంచి మార్కులు రావడమొక్కటే సర్వస్వం కాదని గుర్తుంచుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పిల్లల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని సూచించారు. పరీక్ష హాలులోకి ప్రవేశించేటప్పుడు ఒత్తిడిని విడనాడాలనీ, ఆత్మ విశ్వాసంతో ఉండి నేర్చుకున్న విషయాలపై దృష్టిసారించాలని ఉద్బోధించారు. దాదాపు 2,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నేడు పీఎంతో ‘పరీక్షా పే చర్చా’
న్యూఢిల్లీ: పరీక్షల కాలం ముంచుకొస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ‘పరీక్షా పే చర్చా’కు తెరతీశారు. పరీక్షల సమయంలో తలెత్తే ఒత్తిడిని తగ్గించేందుకు విద్యార్థులకు విలువైన సూచనలివ్వనున్నారు. ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియంలో నేడు(సోమవారం) ఆయన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. ఇందులో పాల్గొనేందుకు 2 వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. వ్యాస రచన పోటీలు నిర్వహించి 1,050 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుందని అధికారులు తెలిపారు. ప్రధానిని ప్రశ్నించే విద్యార్థులను వారు రాసిన ఎస్సేల ఆధారంగా ఎంపిక చేశామన్నారు. 2018, 2019 ల్లోనూ పరీక్షా పే చర్చాను నిర్వహించారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థుల నుంచి 2.6 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, ఇది గతేడాది కన్నా 1.2 లక్షలు ఎక్కువని వెల్లడించారు. -
నిర్భయ దోషులు : పలు సంచలన విషయాలు
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక హత్యాకాండలో శిక్ష అనుభవించబోతున్న దోషులకు సంబంధించి సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దోషులు అక్షయ్ ఠాకూర్ సింగ్, ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు జనవరి 22 న ఉదయం 7 గంటలకు ఉరి తీయనున్నట్లు ఢిల్లీ కోర్టు ఈ నెల ప్రారంభంలో డెత్ వారెంట్ జారీ చేసింది. అటు మరణశిక్షకు వ్యతిరేకంగా ముగ్గురు దోషులు దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించింది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో వీరికి మరణశిక్ష అమలు కానుంది. గత ఏడు సంవత్సరాలుగా ఢిల్లీ తీహార్ జైలులో ఉన్న వీరు అనేకసార్లు జైలు నిబంధనలు ఉల్లంఘించారు. అంతేకాదు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 2012 డిసెంబర్ 16 న యువ వైద్య విద్యార్థిని (నిర్భయ)ను అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ డిసెంబరు 29న నిర్భయ కన్నుమూయడంతో ఆందోళన ఉరింత ఉధృతమైంది. ఈ కేసులో సుమారు ఏడేళ్ల సుదీర్ఘ విచారణ తరువాత నలుగురు దోషులు, అక్షయ్, ముకేష్, పవన్, వినయ్ శర్మలకు మరణ శిక్ష అమలు కానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తీహార్ జైల్లో ఈ నలుగురు 23 సార్లు జైలు నిబంధనలను ఉల్లంఘించారని వర్గాలు తెలిపాయి. జైల్లో వీరి సంపాదన మొత్తం దాదాపు రూ .1,37,000. గత ఏడు సంవత్సరాల సమయంలో జైలు నియమాలను ఉల్లంఘించినందుకు వినయ్ 11 సార్లు, అక్షయ్ ఒకసారి శిక్ష అనుభవించాడు. ముకేశ్ మూడుసార్లు, పవన్ ఎనిమిది సార్లు నిబంధనలను అతిక్రమించారు. ముకేశ్ ఎలాంటి పని చేయకూడదని నిర్ణయించుకోగా అక్షయ్ రూ .69 వేలు సంపాదించగా, పవన్ రూ .29 వేలు, వినయ్ రూ .39 వేలు సంపాదించాడు. 2016లో ముగ్గురు దోషులు - ముకేష్, పవన్, అక్షయ్ - 10 వ తరగతికి అర్హత సంపాదించి పరీక్షలకు హాజరయ్యారు కానీ ఉత్తీర్ణత సాధించలేకపోయారు. వినయ్, 2015 లో, బ్యాచిలర్ డిగ్రీ కోసం ఎంట్రన్స్ పాస్ అయినా కాని అతను దానిని పూర్తి చేయలేకపోయాడు. ఉరిశిక్ష అమలుకు ముందు దోషులందరి కుటుంబానికి కలవడానికి రెండుసార్లు అనుమతించారు అధికారులు. దీంతో వినయ్‌ను తండ్రి మంగళవారం కలిశారు. కాగా ఈ నలుగురిని ఉరి తీసే ఏర్పాట్లు గత నెలలో ప్రారంభమయ్యాయి. దోషులను సీసీటీవీ పర్యవేక్షణలో వేర్వేరు గదుల్లో ఉంచారు. అటు ఉరితీత సన్నాహకాల్లో భాగంగా జైలు అధికారులు ట్రయల్ కూడా నిర్వహించారు. మీరట్‌కు చెందిన పవన్ జల్లాద్ ఈ నలుగురిని ఉరి తీయనున్నారు. మరోవైపు ముకేష్ దేశాధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్‌కు మంగళవారం మెర్సీ పిటిషన్ పెట్టుకున్నసంగతి విదితమే. చదవండి : నిర్భయ: ఇసుక బస్తాలతో డమ్మీ ఉరికి సన్నాహాలు నిర్భయ దోషులకు సుప్రీంలో షాక్! -
జూనియర్ కాలేజీల్లో కౌన్సెలర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు చర్యలు చేపడుతోంది. చదువులో వెనుకబడి పోతున్నామన్న ఆందోళనతో ఆత్మన్యూనతా భావానికి గురయ్యే విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు కసరత్తు చేస్తోంది. విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయిం చేలా, వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించేలా కౌన్సెలింగ్ ఇప్పించేందుకు చర్యలు చేపడు తోంది. ఇందుకోసం విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కౌన్సెలర్లను నియమిం చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బయట నుంచి కాకుండా కాలేజీల్లో బోధించే లెక్చరర్లలో ఒకరిని కౌన్సెలర్‌గా నియమించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 404 మంది లెక్చరర్లకు త్వరలోనే సైకాలజిస్టులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సైకాలజిస్టుల ఆధ్వర్యంలో శిక్షణ పొందిన లెక్చరర్లు నిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గేలా కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. ముందుగా ప్రభుత్వ కాలేజీల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ తరువాత ప్రైవేటు జూనియర్ కాలేజీల్లోనూ అమలు చేసేలా చూడాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. సైకాలజిస్టుల ఆధ్వర్యంలో శిక్షణ పొందే లెక్చరర్లు కౌన్సెలర్లుగా నియమితులయ్యాక విద్యార్థులు ఒత్తిడి తట్టుకోవడం ఎలా అనే అంశాలతోపాటు పరీక్షల సూచనలు, సబ్జెక్టులను ఎలా గుర్తుపెట్టుకోవాలన్న దానిపై మెమరీ టిప్స్ కూడా నేర్పించనున్నారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ విషయంలో వీడియో లెక్చర్స్‌ను విద్యార్థులకు చూపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కాలేజీల్లో కలివిడిగా ఉండని విద్యార్థులను గుర్తించి వారు చదువులో ఎలా ఉన్నారన్న అంశాలను తొలుత పరిశీలించనున్నారు. వారు కలివిడిగా ఉండకపోవడానికి కారణాలను గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆ తరువాత విద్యార్థులందరికీ స్ట్రెస్ మేనేజ్మెంట్పై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల్లో పరీక్షల భయం పోగొట్టి బాగా చదువుకునేలా అవగాహన కల్పించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు.. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. సెకండియర్ విద్యార్థులు ఎవరైనా ఒకవేళ ఫస్టియర్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయితే ఆయా సబ్జెక్టుల్లో కోచింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు బాగా చదివే విద్యార్థులు ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ వంటి పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ శిక్షణను నవంబర్ 8 లేదా 9న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా ప్రారంభించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బోర్డు ప్రతి సబ్జెక్ట్‌లో స్పెషల్ కంటెంట్‌ను తయారు చేయించి వాటిని సీడీల్లో భద్రపరించింది. వాటిని త్వరలోనే అన్ని కాలేజీలకు పంపించనుంది. మరోవైపు ఆన్లైన్ పాఠాలను కూడా అందించే ఏర్పాట్లు చేస్తోంది. అన్ని కాలేజీల్లోని విద్యార్థులు ఒకేసారి పాఠాలు వినేలా చర్యలు చేపడుతోంది. -
అవాస్తవాలు రాస్తే.. ప్రజలే బుద్ధి చెబుతారు
సాక్షి, అనంతపురం: ఆంధ్రజ్యోతి, చంద్రబాబు కుమ్మక్కై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక సచివాలయం ఉద్యోగ పరీక్షల్లో అవినీతి జరిగిందని కట్టుకథలు అల్లారని ఎల్లోమీడియాపై మండిపడ్డారు. అవాస్తమని తేలడంతో గప్చిప్ అయ్యారన్నారు. ఇకనైనా వాస్తవాలు ప్రచురించాలని.. లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. -
అసత్య కథనాలపై భగ్గుమన్న యువత
సాక్షి, గుంటూరు: గ్రామ సచివాలయ పరీక్షలపై అవాస్తవాలు ప్రచారం పట్ల నిరుద్యోగులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శనివారం గుంటూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల ప్రశ్నపత్రం లీకైందంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలను ఖండించారు. తప్పుడు వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి పత్రిక కాపీలను తగలబెట్టారు. వంద రోజుల్లో 4 లక్షల ఉద్యోగాల కల్పనపై యువత హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి, పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం, రమేష్ గాంధీ, విద్యార్థి నేతలు సలాం, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజు గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు నేడు రెండో రోజు రాష్ట్ర్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరుకు గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సర్వేయర్ల పోస్టులకు పరీక్షలు జరుగుతాయి. 2,880 వీఆర్వో, 11,158 సర్వేయర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరుకు 13,540 ఏఎన్ఎం, వార్డు హెల్త్ సెక్రటరీ పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 72,581 అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి... పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. సెల్ఫోన్లు, ఇతర వస్తువులు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబడవని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ 500 బస్సులను ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. బస్టాండ్, రైల్వేస్టేషన్లో అభ్యర్థుల కోసం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల అవస్థలు.. విశాఖపట్నం: అరకు పాసింజర్ ఆలస్యంతో..సచివాలయం రాత పరీక్షకు ముందుగా బయలుదేరిన గిరిజన యువత ఇబ్బందులు పడ్డారు. ఉత్తరసింహాచలంలో అర్ధరాత్రి 12 గంటల వరుకు పాసింజర్ నిలిచిపోయింది. చంటి పిల్లల తల్లులు నరకయాతన పడ్డారు. -
సెల్ఫోన్లు,ఎలక్రానిక్ వస్తువులు తీసుకురావద్దు
-
సచివాలయ పరీక్షలకు సై..
సాక్షి, విజయనగరం గంటస్తంభం: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. ఇందులో భాగంగా గాంధీజీ కలలు సాకారం చేసేందుకు అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి వ్యవస్థను పటిష్టపరిచేందుకు సచివాలయ ఉద్యోగుల నియామకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు తేదీలు ఖరారు చేసింది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 8వ తేదీవరకు నిర్వహించే పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎస్పీ, జాయింట్ కలెక్టర్ వారిని వైస్ చైర్మన్‌గా, జెడ్పీ సీఈవో మెంబర్ కన్వీనర్‌గా, జాయింట్ కలెక్టర్ –2, మరో 13 మంది జిల్లా అధికారులను సభ్యులుగా కమిటీ వేశారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను కమిటీ పర్యవేక్షిస్తోంది. విజయనగరం జిల్లాలో భర్తీ చేసే పోస్టులు: 5,915 -దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు: 1,00,783 మంది -జిల్లాలో పరీక్షా కేంద్రాలు: 198 -పరీక్షలను నిర్వహించేందుకు రూటు ఆఫీసర్లు: 61మంది -ఫ్లయింగ్ స్క్వాడ్లు: 20 బృందాలు -చీఫ్ సూపరింటెండెంట్లు: 272 మంది, -అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు: 128 మంది -సెంటర్ స్పెషల్ ఆఫీసర్లు: 198 మంది -హాల్ సూపరింటెండెట్లు : 1082 మంది -వెన్యూ కో– ఆర్డినేటర్లు: 97 మంది -ఇన్విజిలేటర్లు: 3,042 మంది -పోలీసు బందోబస్తు: 600 మంది రేపటి నుంచి పరీక్షలు.. విజయనగరం జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 14 పరీక్షల్లో 10 పరీక్షలు ఇంగ్లిష్, తెలుగు భాషల్లోను, 4 పరీక్షలు కేవలం ఇంగ్లిష్‌లో జరుగుతాయి. -సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం 198 పరీక్ష కేంద్రాల్లో 58,812 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. ఆ రోజు మధ్యాహ్నం విజయనగరం జిల్లా కేంద్రంలో 22 పరీక్ష కేంద్రాల్లోను, పార్వతీపురంలో 12 పరీక్ష కేంద్రాలను కలిపి 34 కేంద్రాల్లో 11,139 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. -సెప్టెంబర్ 3 నుంచి 8వ తేదీ వరకు విజయనగరం జిల్లా కేంద్రంలో మాత్రమే పరీక్షలు జరుగుతాయి. విజయనగరానికి సంబంధించి 47 కేంద్రాల మ్యాపులను తయారుచేసి హెల్ప్‌డెస్క్‌ల ద్వారా ఆటో డ్రైవర్లకు పంపిణీ చేశారు. అభ్యర్థులను సమయానికి పరీక్ష కేంద్రాలకు తరలించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. - సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 19 పరీక్ష కేంద్రాలలో 6,655 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 10 పరీక్ష కేంద్రాల్లో 4,383 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. -సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 3 పరీక్ష కేంద్రాల్లో 1336 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 2 పరీక్ష కేంద్రాల్లో 739 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. - సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం రెండు పరీక్ష కేంద్రాల్లో 1178 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం ఒక పరీక్ష కేంద్రంలో 560 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. -సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 13 పరీక్ష కేంద్రాల్లో 6,858 మంది అభ్యర్థులు మధ్యాహ్నం ఒక పరీక్ష కేంద్రంలో 134 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. -సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 3 పరీక్ష కేంద్రాలలో 2,574 మంది అభ్యర్థులు మధ్యాహ్నం 16 పరీక్ష కేంద్రాలలో 6,424 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి.. పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 198 పరీక్ష కేంద్రాల్లో 13 పరీక్ష కేంద్రాలలో దివ్యాంగులు పరీక్షలకు హాజరవుతున్నట్లు గుర్తించారు. వారిక పరీక్ష కేంద్రం నుంచి వారి స్థానం వరకు గ్రామ వలంటీర్ల సహాయంతో తీసుకుని వెళ్లేందుకు వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరవుతున్న అంధులైన అభ్యర్థులకు పదవ తరగతి విద్యార్థులను సహాయకులుగా నియమించారు. విజయనగరంలో 47 కేంద్రాలు గూగుల్ మ్యాప్, కేంద్రాల జాబితా డీటీసీతో ఆటో యూనియన్ల వారికి, పత్రిక విలేకరులకు అందించేందుకు ఏర్పాటు చేశారు. మండల కేంద్రాల్లోని బస్టాండులో రైల్వేస్టేషన్లు, కలెక్టరేట్ సర్కిల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలీసు శాఖ భద్రతతో పాటు అంగన్వాడీ, ఆశ వర్కర్లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. పరీక్ష పత్రాలు ఇప్పటికే మండల పరిషత్ కార్యాలయాల్లో స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరుకున్నాయి. అక్కడ పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. నియమనిబంధనలు ఇలా... -పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ఉదయం 10గంటలు, మధ్యాహ్నం 2.30 గంటల లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. -ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుతించబడవు. -పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఐడెంటిటీ కార్డుతో హాజరుకావాలి. -రాష్త్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నందున అభ్యర్థులు ఎటువంటి ప్రలోభాలకు లోనుకావద్దని, మధ్యవర్తుల మాటలు నమ్మవద్దని, ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, అధికారులు ఇప్పటికే ప్రకటించారు. -ప్రతి పరీక్ష కేంద్రంలో పరీక్ష జరుగుతున్న విధానాన్ని కెమేరాల ద్వారా పర్యవేక్షిస్తారు. పార్వతీపురం, సాలూరు, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్.కోట, విజయనగరం క్లస్టర్లుగా విభజించి అన్ని విభాగాలను సమన్వయ పరిచి అధికారులు పర్యవేక్షిస్తారు. బస్సు సర్వీసులు ఇలా... విజయనగరం అర్బన్: వరుస సెలవులు, మరోవైపు సచివాలయ పరీక్షలతో జిల్లాలో వారం రోజుల పాటు ప్రయాణికుల రద్దీ పెరగనుంది. ఆర్టీసీకి పండగ వాతావరణం వచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలో నిర్వహిస్తున్న సచివాలయ కార్యదర్శి పోస్టులకు జిల్లాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పోస్టులు భారీగా ఉండడంతో అభ్యర్థులు అధికమంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు వీలుగా జిల్లా వ్యాప్తంగా 140 బస్సులను ఆర్టీసీ ప్రత్యేకంగా కేటాయించింది. ఈ మేరకు ప్రత్యేక సర్వీసుల వివరాలను ఆర్టీసీ నార్త్ ఈస్ట్ కోస్ట్ ఆర్ఎం ఎ.అప్పలరాజు విడుదల చేశారు. -గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి ప్రాంతాలకు 5 బస్సులు -కురుపాం, పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి ప్రాంతాలకు 5 బస్సులు -గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి ప్రాంతాలకు 6 బస్సులు -కొమరాడ, పార్వతీపురం, సీతానగరం బొబ్బిలి ప్రాంతాలకు 5 బస్సులు -గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం బొబ్బిలి ప్రాంతాలకు 5 బస్సులు -పార్వతీపురం, బొబ్బిలి, బలిజిపేట ప్రాంతాలకు 3 బస్సులు -పార్వతీపురం, బొబ్బిలి, రామభద్రపురం, గజపతినగరం, బొండపల్లి, విజయనగరం ప్రాంతాలకు 10 బస్సులు -సాలూరు, మక్కువ, సీతానగరం, పార్వతీపురం ప్రాంతాలకు 3 బస్సులు -సాలూరు– మక్కువల మధ్య రెండు, సాలూరు–పాచిపెంటల మధ్య మూడు, సాలూరు–విజయనగరం మధ్య 6 ప్రత్యేక సర్వీసులు -సాలూరు, రామభద్రపురం, బలిజిపేట మధ్య 2 బస్సులు -సాలూరు, రామభద్రపురం, బాడంగి, తెర్లాం ప్రాంతాలకు 4 సర్వీసులు -సాలూరు, రామభద్రపురం, పార్వతీపురం ప్రాంతాలకు 3 సర్వీసులు -సాలూరు, బాడంగి, ఉత్తరావిల్లి, గరివిడి, నెల్లిమర్ల, విజయనగరం, భోగాపురం ప్రాంతాలకు కలిపేందుకు 2 బస్సులు -సాలూరు, బాడంగి, ఉత్తరావిల్లి, గరివిడి, నెల్లిమర్ల, విజయనగరం, పూసపాటిరేగ ప్రాంతాలకు రెండు బస్సులు -సాలూరు, తెర్లాం, ఉత్తరావిల్లి, గరివిడి, నెల్లిమర్ల, విజయనగరం, భోగాపురం ప్రాంతాలకు 6 సర్వీసులు -సాలూరు, తెర్లాం, ఉత్తరావిల్లి, గరివిడి, నెల్లిమర్ల, విజయనగరం, పూసపాటిరేగ ప్రాంతాలకు 6 బస్సులు -భోగాపురం, డెంకాడ, విజయనగరం, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, చీపురుపల్లి 5 బస్సులు, అలాగే పూసపాటిరేగ, డెంకాడ, విజయనగరం, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, చీపురుపల్లి వైపుగా 5 బస్సులు వేశారు. -దత్తిరాజేరు, గజపతినగరం, విజయనగరం కలిపేందుకు 6, విజయనగరం, గజపతినగరం, మెంటాడ మధ్య 5, ఎస్.కోట, జామి, విజయనగరం మధ్య 6, విజయనగరం, జామి, ఎస్.కోట మద్య రెండు బçస్సులు నడపనున్నారు. -విజయనగరం, చీపురుపల్లి, విజయనగరం, డెంకాడ మద్య 6, విజయనగరం, భోగాపురం మధ్య 5, విజయనగరం, పూసపాటిరేగ మధ్య 5 బస్సులు వేశారు. -కొత్తవలస, విజయనగరం మధ్య రెండు, ఎస్.కోట, ఎల్.కోట, కొత్తవలస మధ్య 4 బస్సులు వేశారు. అలాగే, వేపాడ, ఎస్.కోట, జామి, విజయనగరం మధ్య నాలుగు, ఎస్.కోట, గంట్యాడ మధ్య 6 బస్సులు వేశారు. -ఇవి కాకుండా మండల అభివృద్ధి అధికారుల అత్యవసర అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందుబాటులో మరిన్ని ఉంచామని ఆర్ఎం అప్పలరాజు తెలిపారు. -
కొలువుల జాతర
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. వెలుగులీనుతూ ప్రత్యక్షమవుతోంది. ఉపాధి కోసం తపిస్తున్న ప్రతి హృదయం.. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. మాయ మాటలతో మభ్యపెట్టడమే గానీ చెప్పింది ఒక్కటీ చేయని చంద్రబాబు ప్రభుత్వంలో చేదు అనుభవాలు చవి చూసిన ప్రజలకు.. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ప్రగతి ఫలాలు దక్కడం కొత్త ఊపిరినిస్తోంది. ముఖ్యంగా యువత ‘బాబు పోయె.. జాబు వచ్చే ఢాం ఢాం ఢాం’ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. వేలాది ఉద్యోగావకాశాలు కల్పిస్తూ గ్రామ/వార్డు సచివాలయాల కోసం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పరీక్షలు వారిలో కోటి ఆశలు చిగురింపజేశాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. సాక్షి, అరసవల్లి: గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఆదివారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 835 గ్రామ సచివాలయాలు, 94 వార్డు సచివాలయాల్లో మొత్తంగా 7,884 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలను సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో నిర్వహిస్తోంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం దాదాపుగా సన్నాహాలు పూర్తి చేసింది. రాష్ట్రంలో పారదర్శక పాలన అందించాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ మేరకు భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చేపట్టింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే చేపడుతున్న తొలి భారీ నోటిఫికేషన్ కావడంతో సచివాలయ పోస్టుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావి స్తోంది. ఈమేరకు పరీక్షల నిర్వహణలో ఎక్కడా లోపాలు లేకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ జె.నివాస్ పర్యవేక్షణలో జెడ్పీ సీఈఓ బి.చక్రధరరావు, డెప్యూటీ సీఈఓ ప్రభావతి తదితర అధికార బృందమంతా ఈ పరీక్షలను పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో సెప్టెంబర్ 1న నిర్వహించనున్న తొలి రోజున అత్యధికంగా 83,448 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. దీంతో జిల్లాలో అత్యధిక ప్రాంతాల్లో తొలిరోజున పరీక్షలు నిర్వహించేందుకు అధి కారులు ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాలకు సులువుగా చేరుకునేలా ఆర్టీసీ ఆధ్వర్యంలో రవాణా సౌకర్యం, వైద్యం, ఇతర సదుపాయాలను అధికారులు కల్పించారు. అలాగే 135 మంది దివ్యాంగులకు సహాయకులను కేటాయించేందుకు నిర్ణయించారు. తొలి రోజునే 306 పరీక్ష కేంద్రాల్లో... జిల్లాలో ఈ పరీక్షలకు మొత్తం 306 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అదనంగా మరో 5 పరీక్ష కేంద్రాలను రిజర్వ్‌లో ఉంచారు. రేపు ఉదయాన మొత్తం 306 పరీక్ష కేంద్రాల్లో 70,588 మంది, మధ్యాహ్నం కేవలం 53 కేంద్రాల్లోనే 12,860 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. అలాగే 3, 4, 6, 7, 8 తేదీల్లో కేటగిరి–2, కేటగిరి–3 కింద మొత్తం 14 విభాగాల పోస్టులకు మొత్తం 31,286 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, జిల్లా కేంద్రంలోని 40 పరీక్ష కేంద్రంలోనే ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఎక్కువమంది హాజరు కానుండడంతో తొలిరోజు పరీక్షలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రేపు ఉదయం సుమారు 5542 మంది సిబ్బందిని, మధ్యాహ్నం 995 మందిని విధుల్లో ఉంచనున్నారు. పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, కోఆర్డినేటర్లు, హాల్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతోపాటు నాలుగైదు కేంద్రాలకు ఒక్కో రూట్ ఆఫీసర్ చొప్పున నియమించారు. పూర్తి నిఘా నీడలోనే పరీక్షలు: జిల్లాలో సచివాలయంలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పరీక్షలను పూర్తి స్థాయి నిఘా నీడలో జరిపించనున్నారు. రాజకీయ ప్రోద్బ లాలు, తాయిలాలు తదితర లాబీయింగ్‌కు దూరంగా ఈ పరీక్షలు, నియామకాలు జరగాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించడంతోపాటు నిత్యం పరిస్థితులను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ వీడియో రికార్డింగ్‌ను చేయించనున్నారు. పకడ్బందీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. కాగా పరీక్షలకు సంబంధించి సామగ్రి, ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నాపత్రాలు తదితర సామగ్రి అంతా స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే పరీక్షల్లో ఎక్కడా అవకతవకలకు తావు లేకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. మాల్ ప్రాక్టీస్ తదితర అక్రమాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. రూరల్ ప్రాంతాల్లో ఉన్న పరీక్ష కేంద్ర చిరునామా అభ్యర్థులకు తెలిసేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పరీక్ష కేంద్రాలకు సంబంధించి ఆయా బాధ్యులను నోడల్ అధికారులుగా నియమించారు. పరీక్ష గదిలోకి... ఇలా... -పరీక్ష సమయానికి అరగంట ముందే చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయమైతే 9.30కి, మధ్యాహ్నమైతే 2 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి -అభ్యర్థికి చెందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఓటర్ కార్డు, ఆధార్, పాన్, పాస్‌పోర్టు ఇతరత్రా..) వెంట తీసుకురావాలి. -ఆన్లైన్లో డౌన్లోడ్ చేసిన హాల్ టిక్కెట్టు తప్పనిసరి -ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ కోసం బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను తప్పనిసరి -మరే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్, కాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ వాచీలు తదితర వస్తువులను అనుమతించరు. పరీక్షల టైం టేబుల్: (ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు – మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు) సెప్టెంబర్ 1వ తేదీ: ఉదయం – కేటగిరి 1– పోస్టులు 2378, అభ్యర్థులు 70588 మంది 1. పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్–5) 2. మహిళా పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ 3. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 4. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మధ్యాహ్నం– కేటగిరి 3 –పోస్టులు 835, అభ్యర్థులు 12860 మంది 5. డిజిటల్ అసిస్టెంట్ (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6) సెప్టెంబర్3వతేదీ: ఉదయం– కేటగిరి 2–గ్రూ ప్బి–పోస్టులు 1020, అభ్యర్థులు 7447 మంది 6. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్–2) 7. విలేజ్ సర్వేయర్ (గ్రేడ్–3) మధ్యాహ్నం – కేటగిరి 3 – పోస్టులు 648, అభ్యర్థులు 3714 మంది 8. ఏఎన్ఎం / వార్డు హెల్త్ సెక్రటరీ (గ్రేడ్–3) (స్త్రీలకు) సెప్టెంబర్ 4వ తేదీ: ఉదయం – కేటగిరి 3– పోస్టులు 676, అభ్యర్థులు 1302 మంది 9. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్–2) మధ్యాహ్నం – కేటగిరి 3– పోస్టులు 155, అభ్యర్థులు 912 మంది 10. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ సెప్టెంబర్ 6 వ తేదీ: ఉదయం – కేటగిరి 3 –పోస్టులు 67, అభ్యర్థులు 1417 మంది 11. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ మధ్యాహ్నం – కేటగిరి 3, పోస్టులు792, అభ్యర్థులు 416 మంది 12. పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ సెప్టెంబర్ 7వ తేదీ: ఉదయం –కేటగిరి 2–గ్రూప్ ఎ– పోస్టులు 930, అభ్యర్థులు 6515 మంది 13. ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్–2) 14. వార్డు ఎమినిటీస్ సెక్రటరీ (గ్రేడ్–2) మధ్యాహ్నం– కేటగిరి 3– పోస్టులు 04, అభ్యర్థులు 111 మంది 15. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ సెప్టెంబర్ 8వ తేదీ: ఉదయం – కేటగిరి 3, పోస్టులు 190, అభ్యర్థులు 2429 మంది 16.వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్–2) 17. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మధ్యాహ్నం – కేటగిరి 3, పోస్టులు 189, అభ్యర్థులు 7021 మంది 18. వార్డు ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ 19. వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ (గ్రేడ్–2) -
‘పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాల పరీక్షలను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించేందుకు తాడేపల్లిలో నిర్వహించిన రాష్ట్ర్రస్థాయి వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. రేపు సాయంత్రానికి అన్ని జిల్లాల్లో స్టాంగ్ రూమ్‌లు సిద్ధం చేయాలన్నారు. ఈ సారి 1.26 లక్షల ఉద్యోగాలకు 22 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. పరీక్ష నిర్వహణలో ఎక్కడా చిన్నపాటి నిర్లక్ష్యానికి కూడా తావుండకూడదన్నారు. ప్రణాళికబద్ధంగా పరీక్షలను నిర్వహించాలని చెప్పారు. అధికారులంతా బాధ్యతగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇంటి దొంగల పనే..!
సాక్షి, జేఎన్టీయూ : రమేష్ అనే విద్యార్థి ఇటీవల సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. ఎలాగైనా బీటెక్ ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ఓ మధ్యవర్తిని కలిశాడు. ఆయన నేరుగా పరీక్షల విభాగంలోని ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగితో సంప్రదింపులు జరిపాడు. ఆ సబ్జెక్టుకు సంబంధించి ఎలా ఉత్తీర్ణుడిని చేయించాలనే అంశంపై ప్రణాళికను వివరించాడు. కోడింగ్ సెక్షన్లో నిబద్ధతగా పనిచేసే అధికారి ఉండటంతో నిర్ధేశించిన జవాబుపత్రాన్ని మూల్యాంకనం (వాల్యుయేషన్)లో పసిగట్టడం చాలా కష్టం. దీంతో జవాబుపత్రంలో ఒక సింబల్‌ను హైలైట్ చేసి పరీక్ష రాయమని సూచించాడు. ఆ మేరకు రమేష్ ఓ సింబల్‌ను హైలైట్ చేసి పరీక్ష రాశాడు. ఇదే జవాబు పత్రాన్ని తనకు అనుకూలమైన ఎగ్జామినర్ వద్దకు మూల్యాంకనానికి పంపాడు. కచ్చితంగా రమేష్ ఉత్తీర్ణుడయ్యాడు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేస్తున్న అక్రమాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. జయసింహ అనే అధ్యాపకుడు ప్రైవేట్ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నాడు. అక్కడ ఇచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ. అదే మూల్యాంకనం(వాల్యుయేషన్) డ్యూటీకి వెళ్తే మంచి రెమ్యునరేషన్ వస్తుంది. ఆన్‌డ్యూటీ మీద కళాశాల జీతం కూడా చెల్లిస్తుంది. అయితే ఏడాదిలో రెండు సెమిస్టర్ల పరీక్షలు జరిగితే.. ఐదు దఫాలు పైగానే వాల్యుయేషన్ డ్యూటీ వేశారు. ఈ లెక్కన తరచూ వాల్యుయేషన్ డ్యూటీ వేయడానికి రెమ్యునరేషన్లో కొంత నజరానా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ దందాను ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నడిపిస్తున్నాడు. ఇలా నిత్యం వాల్యుయేషన్‌కు అనుకూలమైన అధ్యాపకులను వేయిస్తూ.. ప్రతి రోజూ రూ.20వేలకు పైగా సంపాదన ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కోడింగ్ ముగిసిన వెంటనే విద్యార్థి జవాబు పత్రంలో ముందస్తుగా నిర్ధేశించిన విధంగా ఏదో ఒక సింబల్‌ను హైలైట్ చేసి ఉంటారు. వేలల్లో జవాబు పత్రాలు ఉంటాయి. కానీ ఆ జవాబుపత్రాన్ని గుర్తుపట్టడానికి ఓ అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న అటెండర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆ అటెండర్ నేరుగా వాల్యుయేషన్ హాలులో ప్రాతినిధ్యం వహిస్తున్న అవుట్సోర్సింగ్ బాస్ అయిన ఉద్యోగికి ఇస్తాడు. సదరు ఉద్యోగి ముందే నిర్ధారించుకున్న ఎగ్జామినర్‌కు ఆ జవాబుపత్రాన్ని ఇచ్చి విశాలహృదయంతో మార్కులు వేయిస్తాడు. జేఎన్టీయూ అనంతపురం పరీక్షల విభాగంలో ముగ్గురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమిష్టిగా అక్రమాలకు తెరతీస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదు సంవత్సరాల సర్వీసు లేకుండానే మూల్యాంకనం జేఎన్టీయూ అనంతపురంలో పరీక్షల విభాగం వర్సిటీకి హృదయం లాంటిది. చాలా నిబద్ధతగా పనిచేసే రెగ్యులర్ అధికారులు కోడింగ్ సెక్షన్లో, కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్నారు. ఏదైనా ఒక చిన్న పొరుపాటు జరిగితే వర్సిటీ పరువు పోతుందని అంకితభావంతో పనిచేసే ఉద్యోగులు కూడా ఉన్నారు. అలాంటి వారు ఉండటంతోనే జేఎన్టీయూ అనంతపురం పరీక్షల విభాగం విశ్వసనీయతను నిలుపుకుంటోంది. అయితే రెగ్యులర్ ఉద్యోగాలు కాకపోవడంతో, కేవలం అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు కావడంతో .. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే రీతిలో అక్రమాలకు తెరతీస్తున్నారు. ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి కాకుండనే అధ్యాపకులకు మూల్యాంకనం అవకాశం కల్పిస్తున్నారు. అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలు పంపించే డేటా ఆధారంగా మూల్యాంకనం విధులకు వేస్తున్నారు. అయితే పదేపదే వారినే మూల్యాంకనానికి వేస్తుండటంతోనే అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోంది. రోస్టర్ వారీగా అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులందరికీ మూల్యాంకనం విధులకు కేటాయించాలి. కానీ అలా జరగలేదు. ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎవరైతే అక్రమాలకు దన్నుగా నిలుస్తున్నారో అలాంటి అధ్యాపకులనే విధులకు వేస్తుండటం అక్రమాలకు తావిస్తోంది. కళాశాల ఉద్యోగులే మధ్యవర్తులు అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రత్యేకంగా పరీక్షల విభాగం పేరుతో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఉద్యోగులు పరీక్షల విభాగంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నిత్యం ఫోన్లో సంభాషణలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షల విభాగంలో పనిచేసే ఉద్యోగి నుంచి ఒక రోజులోనే ఈ ముగ్గురి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 30 దఫాల కాల్స్ వెళ్లాయి. అధికారికంగా వారితో ఎలాంటి లావాదేవీలు జరపకూడదు. ఏదైనా పని ఉంటే పరీక్షల విభాగం ఉన్నతాధికారులతోనే ఉంటుంది. కానీ ఈ ముగ్గురు ఉద్యోగులు దందా నడుపుతున్నట్లు స్పష్టమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చర్యలు తీసుకుంటాం అధ్యాపకులను వాల్యుయేషన్‌కు కేటాయించే విధానంపై అక్రమాలకు పాల్బడి ఉంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ముగ్గురు ఉద్యోగుల తీరుపై అనుమానాలు ఉన్నాయి. ఉన్నతాధికారులకు ఇది వరకే విన్నవించాం. – ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్, జేఎన్టీయూ అనంతపురం -
పేరెంట్స్కూ పరీక్షే!
బుర్రలో చాలా కెమికల్స్ ఉంటాయి. నిజానికి అదో కెమిస్ట్రీ ల్యాబ్! సరైన కెమికల్ రియాక్షన్లకి సరైన టెంపరేచర్ అవసరం. అలాగే... పరీక్షల సమయంలో పిల్లల బ్రెయిన్ లేబొరేటరీలో సరైన రిజల్ట్స్ కోసం సరైన పేరెంటింగ్ అంతే అవసరం. ఒత్తిడి పెట్టకుండా పిల్లలను పరీక్షలకు ఎలా తయారు చేయవచ్చో అవగాహన కలిగించేందుకే ఈ ప్రత్యేక కథనం. ముందుగా పెద్దలు తెలుసుకోవాల్సిన కథ ఒకటి ఉంది. అంతగా చదువుకోని అండర్గ్రాడ్యుయేట్కు ఒక కొడుకు ఉన్నాడు. అతడి పేరు రమేశ్. ఆ ఇంటికి కాస్త దూరంలోనే మరో అబ్బాయి కూడా చదువుతున్నాడు. ఈ కుర్రాడి పేరు శీతల్. శీతల్ వాళ్ల నాన్న పోస్ట్ గ్రాడ్యుయేట్. రమేశ్‌తో పోలిస్తే శీతల్ వాళ్లది కాస్తంత కలిగిన కుటుంబం. ఒకే స్కూల్ కాదుగానీ... రమేశ్, శీతల్ ఇద్దరూ పదో తరగతి చదువుతున్నారు. పైగా రమేశ్‌తో పోలిస్తే శీతలే చదువులో చురుకు. మంచి క్లవర్ స్టూడెంట్ అని పేరు. మున్ముందే కెరియర్ ప్లానింగ్లూ గట్రా తెలియని రమేశ్ వాళ్ల నాన్న అతడికి ఎప్పుడూ భరోసా ఇచ్చాడు. రమేశ్‌కు తనపై తనకు నమ్మకం కలిగేలా మాట్లాడుతుండేవాడు. కానీ శీతల్ వాళ్ల నాన్న కెరియర్ ప్లానింగ్ గురించీ, భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి, సాధించాల్సిన గోల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుండేవాడు. అందరూ ఊహించిన దానికి భిన్నంగా పదో తరగతి పరీక్షల్లో శీతల్‌తో పోలిస్తే రమేశ్ గ్రేడ్స్ బాగా వచ్చాయి. దీనికో కారణం ఉంది. ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో చాలా బాగా స్కోర్స్ సాధిస్తారనుకున్న పిల్లల్లోని మూడింట రెండు వంతుల మంది పిల్లలు అనుకున్న దానికంటే తక్కువ స్కోర్ సాధించారు. వారి స్కోర్ అలా తగ్గడానికి కారణం ఆ పిల్లలు కాదు. కేవలం వాళ్ల తల్లిదండ్రులే. భరించగలిగే ఒత్తిడి అంటే... ఒత్తిడి ఎప్పుడూ చెడ్డదేనా? కాదు... ఓ మోతాదుకు మించనంతవరకు ఒత్తిడి చాలా మంచిది. చిన్నారులపై కాస్తంత ఒత్తిడి కూడా లేదనుకోండి. అప్పుడు పిల్లలు ఎగ్జామ్‌ను లైట్ తీసుకుంటారు. చదవాల్సిన పోర్షన్‌ను చదవనే చదవరు. ఇది ఎంతమాత్రమూ తగదు. ఇలాంటి పిల్లలపై పేరెంట్స్ కాస్త ఒత్తిడి పెంచాల్సిందే. ఒకింత శ్రద్ధతో తమంతట తామే చదువుపై శ్రద్ధ చూపే పిల్లలుంటారు. వారి గుణం, వారు చదువు పట్ల చూపే శ్రద్ధాసక్తులు వంటివి తల్లిదండ్రులకు తెలిసే ఉంటాయి. ఇలాంటి పిల్లల విషయంలో మాత్రం తల్లిదండ్రులు అతిగా ఒత్తిడి పెంచేలా చేయకూడదు. చేస్తే ఏమవుతుందో చూద్దాం. అసలే తమకు ఉన్న శ్రద్ధతో తాము చదువుకునే దానికి తోడు... తమ కెరియర్ తల్లిదండ్రులు చూపుతున్న అతి శ్రద్ధను చూస్తున్న కొద్దీ ఆ పిల్లల్లో మరింత ఒత్తిడి పెరుగుతుంది. అది యాంగై్జటీకి దారితీస్తుంది. దీన్నే వైద్యపరిభాషలో ‘పెర్ఫార్మెన్స్ యాంగై్జటీ’ అంటారు. దీన్నే మరోలా చెప్పుకుందాం. ఎలాంటి ఒత్తిడి లేని సాధారణ పరిస్థితుల్లో వారు పుస్తకంలోని దాదాపు ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానం రాయగలరు. కానీ పెర్ఫార్మెన్స్ యాంగై్జటీకి గురైనప్పుడు మాత్రం వారిలో ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో తాము రాస్తున్నదంతా కరెక్టేనా, ప్రదర్శించాల్సినంత ప్రతిభను తాము ప్రదర్శిస్తున్నామా లేదా అనే సందేహాలు మొలకెత్తుతాయి. అలా మొలకెత్తిన సందేహాలు ఊడలమర్రిలా పెరిగి అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పరీక్షలకు చదువుతున్న పిల్లల విషయంలో తల్లిదండ్రుల శ్రద్ధ పిల్లల్లో అనుకూల ధోరణి పెంపొందేలా, ఆత్మవిశ్వాసం నింపేలా ఉండాలి. అంతేతప్ప పెర్ఫార్మెన్స్ యాంగై్జటీ కలిగించేలా ఉండకూడదు. ఒకటే మెదడు.. రెండు రకాల చర్యలు అందరిలో ఉండేదీ మెదడే. కానీ అదే మెదడు మనం వాడుకునే తీరును బట్టి రెండు రకాల ఫలితాలు ఇస్తుంది. మొదటిది చిన్నారికి మీరిచ్చే భరోసా, సాంత్వన, ఆత్మవిశ్వాసం నింపేలా మాట్లాడే మాటలు. ఇది అనుకూల ఫలితాలు ఇస్తుంది. కానీ అదే మరొక తండ్రి... తన కొడుకు/కూతురి కెరియర్ పట్ల ప్రదర్శించే అతి శ్రద్ధ, అతి జాగ్రత్త ఆ చిన్నారిలో పెర్ఫార్మెన్స్ యాంగై్జటీని పెంచితే అదే మెదడు ప్రతికూల ఫలితాలిచ్చేలా చేస్తుంది. పిల్లలిద్దరిలోనూ ఒకే లాంటి మెదడు... కాని అదిలా రెండు రకాలుగా ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం. భరోసాలో జరిగే ప్రక్రియ ఇదే... మీ అమ్మాయి పరీక్షల కోసం తయారవుతున్నదనుకుందాం. ఆమె స్వతహాగానే బాగా చదువుతుంది. శ్రద్ధ ఎక్కువే. అలాంటప్పుడు మీరు అమ్మాయిపై అదనంగా భారం వేయకండి. జస్ట్ భరోసా నింపండి చాలు. అదెలా? అమ్మాయి పరీక్షకు ప్రిపేర్ అవుతుంటుంది. ఎనిమిదింటికి భోజనం చేసి, తొమ్మిదిగంటలకల్లా పడుకునేది కాస్తా... రాత్రి పది దాటినా చదువుతోంది. తల్లి పాల గ్లాసుతో వెళ్లింది. ‘మరికాసేపు చదువుతావా? అలాగైతే ఈ పాలు తాగు’ అంది. ఇక్కడ ఆ తల్లి ధోరణీ, మాటలూ ఎలా ఉండాలంటే... ‘నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు. మేం హాయిగా ఏ టీవీ చూసుకుంటూనో ఎలా ఉండగలం. హాయిగా మా మానాన మేమెలా నిద్రపోగలం. కాబట్టి మావంతుగా నీకు తోడుగా ఉంటున్నాం’ అంటూ అమ్మాయిలో సాంత్వన నింపేలా ఉండాలి. అంతే తప్ప... ‘మరికాసేపు చదవడం కోసం టీ తాగు... అప్పుడు నిద్రరాకుండా ఉంటుంది’ అనో... లేదా ‘ఉండాలనుకున్న దాని కంటే మరో అరగంట ఎక్కువగా మేలుకొని చదువుకో’ అనేలాగో ఆ మాటలు ఉండకూడదు. ఇలాంటి మాటలు పెర్ఫార్మెన్స్ యాంగై్జటీని కలిగిస్తాయి. అలాగే మర్నాడు అమ్మాయిని తండ్రి ఎగ్జామినేషన్ సెంటర్‌కు తీసుకెళ్లే సమయంలో, ‘నువ్వెలాగూ ఈమాత్రం దూరం రాలేవని కాదు... కాకపోతే నేను నీకు తోడుగా వస్తే నీపై కాస్త ఒత్తిడి తగ్గడం కోసం వెంట వచ్చా’ లాంటి మాటలు వినిపించాలి. వెళ్లేప్పుడు ‘జాగ్రత్తగా రాయి... టెన్షన్ పడకు’ లాంటి మాటలను అనునయంగా చెప్పండి. ఆ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న పాడుచేశాననీ, పది మార్కులు తగ్గవచ్చని అమ్మాయి అందనుకోండి. వెంటనే... ‘అలా జరగదేమోలే. చూద్దాం. నువ్వు అనుకున్నంత సంతృప్తి పడకపోవడం వల్ల నీలో అలాంటి ఫీలింగ్ ఉందేమోలే’ అనండి. అంతే తప్ప... ‘పది మార్కులంటే మాటలా... మరో పేపర్లో కనీసం 20 అయినా ఎక్కువ సంపాదించేలా చూడు. అప్పుడే ఆ నష్టం కాంపెన్సేట్ అవుతుంది’ లాంటి మాటలు మాట్లాడకండి. సాంత్వన మాటలతో ఏం జరుగుతుంది? మనందరి మెదడులో మాట్లాడేలా చేసే స్పీచ్ సెంటర్, చూసిందేమిటో చెప్పే విజువల్ సెంటర్ లాగే మరో ప్రత్యేక ప్రాంతమూ ఉంటుంది. దాని పేరు రివార్డ్ సెంటర్. ఉదాహరణకు మీరో ఎగ్జామ్‌లో క్లాస్ ఫస్ట్ వచ్చారు. మీ టీచర్ మిమ్మల్ని ‘గుడ్’ అని మెచ్చుకుంది. అప్పుడు మీ మెదడులో ఎండార్ఫిన్ అనే సంతోషం కలిగించే ఒక జీవరసాయనం విడుదల అవుతుంది. టీచర్ ఇచ్చిన ఆ అభినందన రివార్డ్‌తో కలిగిన సంతోషాన్ని పదే పదే పొందడం కోసం మళ్లీ మళ్లీ మీరు క్లాస్ ఫస్ట్ వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. అంటే ఆ రివార్డు సెంటర్ ఇచ్చే ప్లెజర్ కోసం ప్రయత్నిస్తుంటారన్నమాట. అలా ప్లెజర్ ఇస్తుంది కాబట్టే దాన్నే ప్లెజర్ సెంటర్ అని కూడా అంటారు. ఇక అలాగే తల్లి తాను నిద్రపోకుండా తన కోసం మేల్కొని ఉండి పాల గ్లాసు తెచ్చి ఇచ్చిందనే భావన కూడా అమ్మాయిలో ఒక కృతజ్ఞతను పెంపొందిస్తుంది. ఎదుటి వాళ్ల చర్య తమకు సంతోషం కలిగించిన భావన అనేది ‘ఫినైల్ ఇథలమైన్’ అనే మెదడులోని రసాయనం వల్ల కలుగుతుంది. అలాగే మర్నాడు ఉదయం ఎగ్జామ్ సెంటర్ దగ్గర తండ్రి మాటలూ, తండ్రి ఇచ్చే నమ్మకం, భరోసా అన్నవి అమ్మాయి మెదడులోని డోపమైన్ లాంటి హుషారు కలిగించే రసాయనాలను విడుదల చేస్తాయి. మన ఆరోగ్యకరమైన ఉద్వేగాలకు మూలం డోపమైన్. ఈ రసాయనం లోపిస్తే మన దృష్టి కేంద్రీకరణ శక్తి (కాన్సంట్రేషన్) తగ్గుతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. ఇది తగ్గడం వల్ల ప్రేమరాహిత్యంతో బాధపడుతున్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అందుకే తండ్రి భరోసా డోపమైన్‌ను స్రవించేలా చేస్తుంది. కాస్త అటు ఇటు ప్రవర్తించినా మా నాన్న నన్ను అర్థం చేసుకుంటాడనే భావనను పెంచి ఆరోగ్యకరమైన ఉద్వేగాలకు కారణమవుతుంది. అలాగే ఎండార్ఫిన్ అనే మెదడులోని రసాయనం మనలో యాంగై్జటీని తొలగిస్తుంది. ఉదాహరణకు అమ్మాయి ఆ రోజు ఎగ్జామ్ బాగా రాసిందనుకుందాం. అప్పుడు స్రవించిన ఎండార్ఫిన్ అమ్మాయిలో ‘ఫీల్ గుడ్’ భావన పెంచుతుంది. అదే ఫీలింగ్‌ను మర్నాడు కూడా పొందడం కోసం ఇంకా బాగా చదువుతుంది. అంతే తప్ప... కేవలం తల్లిదండ్రుల ఒత్తిడి మేరకే పిల్లలు విజయాలు సాధిస్తారన్న మాట పూర్తిగా నిజం కాదు. ఇక ఆమె పరీక్షలు బాగా రాస్తున్న కొద్దీ తన మెదడులో ఇంకెన్నో రకాల సంతోష రసాయనాలు స్రవిస్తూ మరింత బాగా పెర్ఫార్మ్ చేసేలా ఆమెను ప్రోత్సహిస్తుంటాయి. వాటిలో ఎన్. ఆరాకిడోనోయల్ డోపమైన్ (ఎన్ఏడీఏ), నలడోయిన్, అరాకిడోనోయల్ గ్లెసెరాల్, వైరోడమైన్ వంటివి చాలానే ఉంటాయి. మరి పైన పేర్కొన్న దానికి ప్రతికూలంగా జరిగేదేమిటి? తల్లిదండ్రులు కేవలం పిల్లల్లో పరీక్షల ఒత్తిడిని మరింతగా పెంచే పనులే చేస్తున్నారనుకుందాం. అంటే ఉదాహరణకు... ‘బాగా చదువు. ఇప్పుడు చదవకపోతే భవిష్యత్తులో మట్టితట్టలు మోయడానికి తప్ప దేనికీ పనికిరావు. ర్యాంకులు రాకుండా కేవలం ఫస్ట్ క్లాస్ వస్తే... ఇప్పటి కాంపిటీషన్లో దిక్కూదివాణం ఉండదు. మీ మేనమామగారి అమ్మాయిలా నువ్వూ యూఎస్ వెళ్లాలి. మినిమమ్ ఐఐటీకి ప్రిపేర్ అయితేగానీ మామూలు బీటెక్ కూడా దక్కని రోజులివి’ లాంటి మాటలు పిల్లల్లో ఒత్తిడి పెంచేస్తాయి. ఓ మోస్తరుగా 70%, 80% పొందేవాళ్లు కూడా 60% లు లేదా ఏ సెకండ్ గ్రేడ్కో తగ్గినా తగ్గవచ్చు. ఇలాంటి మాటలతో మెదడులో ఏం జరుగుతుంది? ఒత్తిడిని పెంచి పెర్ఫార్మెన్స్ యాంగై్జటీ కలిగించే సందర్భంలో అమ్మాయిలో ఏం జరుగుతుందో చూద్దాం. మెదడులో ‘అమిగ్దలా’ అనే ఒక అవయవం ఉంటుంది. బాదాం షేపులో ఉండే ఈ అవయవం మనలో భయం, ఆందోళనా వంటి భావనలు ఉన్నప్పుడు కలిగే ఫీలింగ్స్‌ను వెదికి పట్టుకుంటుంది. అంతేకాదు... ఆ ఫీలింగ్స్ కలిగిన వెంటనే పక్కనే ఉండే హైపోథెలామస్ అనే అవయవానికి సిగ్నల్స్ ఇస్తుంది. అప్పుడది ఎదుట ఉన్న ఆ ప్రమాదాన్నీ, ముప్పునూ ఎదుర్కొనేందుకు అవసరమైన హార్మోన్లను విడుదల చేయమంటూ శరీరాన్ని ఆదేశిస్తుంది. అంతే... పెద్దపొత్తంలో హార్మోన్లూ, జీవరసాయనాలూ ఒంట్లో వెలువడుతాయి. ఉదాహరణకు పిల్లలు తీవ్రమైన ఉద్విగ్నతకు లోనైనప్పుడు పరిస్థితిని తప్పించుకునేందుకు ఎడ్రినల్ గ్రంథి నుంచి కార్టిసాల్స్, అడ్రినాలిన్, నార్–అడ్రినాలిన్ అనే హార్మోన్లు స్రవించాల్సిందిగా హైపోథెలామస్ అనే మెదడు భాగం... శరీరాన్ని ఆదేశిస్తుంది. దాంతో ఆమెలో రక్తపోటు పెరుగుతుంది. కాలేయం నుంచి చక్కెరలు వేగంగా విడుదలవుతాయి. ఒంటికి హాని చేసే కార్టిజోల్స్ అనే హానికర రసాయనాలు వెలువడుతాయి. ఇవి ఎముకల్ని బలహీనపరుస్తాయి. అయితే ఇలా రసాయనాలు వెలువడటం అన్నది ఏ కొద్దిసమయం పాటో జరిగితే పర్లేదు. కానీ పరీక్షలు కనీసం 20 రోజుల పాటు కొనసాగుతుంటాయి. ఇది పిల్లల ఒంటికీ, మెదడుకూ, భవిష్యత్తులో వాళ్ల కెరియర్‌కే హాని చేయవచ్చు. అందుకే పరీక్షల సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన సాంత్వననిస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, తనపై తనకు నమ్మకం కలిగేలా ఉండాలి తప్ప... అతి ప్రవర్తనతో వాళ్లలో పలాయనభావాన్నీ, తల్లిదండ్రుల పట్ల ఏవగింపునూ కలిగించేలా ఉండకూడదు. పిల్లల్లో ఒత్తిడి పెరిగిన లక్షణాలు కనిపించినప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు మరింత చేయూతనిస్తూ, ఆసరాగా నిలవాలి. అప్పుడే పిల్లల విజయాలనూ చవిచూడవచ్చు. వాళ్లలో ఆత్మహత్యల్లాంటి భావనలూ విజయవంతంగా నిరోధించవచ్చు. కేర్ అండ్ శ్రద్ధ అవసరమే... పై కథ చదివాక ‘పిల్లలపై శ్రద్ధ చూపకపోతే ఎలా?’ అనేది సగటు తల్లిదండ్రుల ప్రశ్న. మరీ ముఖ్యంగా పరీక్షల సమయంలో వారి పట్ల అదనపు శ్రద్ధ అవసరమే. కానీ అది పాయసంలో చక్కెర లేదా బెల్లం అంత మోతాదులో కావాలి. పాయసం రుచిగా ఉండాలంటే... అందులో మిగతా పదార్థాల రుచి కూడా తెలిసేలా... ఉండాల్సినంత తియ్యగానే ఉండాలి. చక్కెర అతిగా పడితే విపరీతమైన తీపి పెరిగి, పదార్థంపై మొహంమొత్తుతుంది. ఇదే ఉదాహరణ పెద్దలు తమ పిల్లల పట్ల ప్రదర్శించాల్సిన శ్రద్ధకూ వర్తిస్తుంది. ఇక్కడ పిల్లలపై తామెంత ఒత్తిడిని కలిగిస్తున్నారు, అది వారు భరించే స్థాయిలో ఉందా లేదా అన్నది తెలుసుకోగలగడమే మంచి పేరెంట్ తాలూకు విజ్ఞత. పిల్లల్లో ఒత్తిడి పెరుగుతోందని గ్రహించడం ఎలా? పరీక్షల కారణంగా పిల్లల్లో ఒత్తిడి పెరుగుతుందని గ్రహించడానికి వీలుగా వాళ్ల శరీరం కూడా తల్లిదండ్రులకు కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంది. ఉదాహరణకు... ∙పిల్లల్లో నిర్ణయం తీసుకునే శక్తి తగ్గుతుండటం ∙ఏదైనా అంశం పట్ల దృష్టికేంద్రీకరణ/ఏకాగ్రత తగ్గడం ∙గోళ్లు కొరుక్కుంటూ టెన్షన్‌గా కనిపించడం ∙త్వరగా విసుగు, నిర్లిప్తత, కోపం వంటి భావనలకు లోనుకావడం వంటి ప్రవర్తనాపూర్వకమైన లక్షణాలు కనిపించవచ్చు. అలాగే శారీరక లక్షణాల్లో భాగంగా కనిపించేవి... ∙వికారం, వాంతి వచ్చినట్లుగా ఉండటం ∙మాటిమాటికీ చెమటలు పడుతూ ఉండటం ∙ఛాతీ పట్టేసినట్లు ఉండటం ∙వేగంగా శ్వాసతీసుకుంటూ ఉండటం వంటివీ కనిపించవచ్చు. ∙పిల్లల్లో మైగ్రేన్ తలనొప్పుల వంటివి కనిపిస్తే... ఈ సీజన్లోనైతే దానికి కారణం పరీక్షల ఒత్తిడే కావచ్చని ఊహించడం తేలికే. అలాగే మరికొందరిలో తీవ్రమైన ఒత్తిడి ఆస్తమాకూ దారితీయవచ్చు. ∙ఇక బాలికల్లో అయితే వారి మెదడులోని హైపోథెలామస్ గ్రంథి ఆదేశాల మేరకు గొనాడోట్రాఫిన్ వంటి హార్మోన్లు స్రవించడం వల్ల రుతుస్రావం క్రమం తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తూ, వాళ్ల హార్మోన్లలో అసమతౌల్యత ఏర్పడినట్లు స్పష్టంగా తెలియజేస్తుంది. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
‘ప్రాక్టికల్’ ప్రాబ్లమ్స్
పాపన్నపేట(మెదక్): పాపన్నపేట జూనియర్ కళాశాలలో రూ.22 వేల విద్యుత్ బిల్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో వారం రోజుల క్రితమే కళాశాలలో కరెంట్ తొలగించారు. ఇక ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగాల్సి ఉంది. పరీక్షలు నిర్వహించాలంటే కరెంట్, నీటి వసతి తప్పనిసరి. అలాగే ప్రాక్టికల్ ప్రశ్నా పత్రాలు ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటేనే పరీక్షలు ప్రారంభమవుతాయి. కానీ ఇక్కడ కరెంట్ లేకపోవడంతో ప్రశ్నా పత్రాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులు అదే రోజు ఆన్లైన్ చేయాలన్నా విద్యుత్ సౌకర్యం తప్పనిసరి. జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల్లో కరెంట్, నీటి సమస్యలతోపాటు సరిపడా ల్యాబ్ గదులు, ఫర్నిచర్ లేక ప్రాక్టికల్స్ అయిపోయాయనిపిస్తున్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో సాధించే మార్కులు విద్యార్థుల మెరిట్‌కు దోహదపడతాయి. ప్రయోగాలు.. పరిశోధనకు మూలాలు. శాస్త్రీయ విజ్ఞాన అభివృద్ధితోనే వైజ్ఞానిక విప్లవం సాధించవచ్చు. ప్రపంచ పరిణామాలను మార్చవచ్చు. అందుకే విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే ప్రయోగాత్మక విద్య అందిస్తున్నారు. కానీ కళాశాలల్లో నెలకొన్న సమస్యలతో ప్రయోగాలు నామమాత్రంగా మారుతున్నాయి. పరిపూర్ణత లేని ప్రయోగాలతో ఉత్తమ ఫలితాలు ఎలా సాధించాలంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఫిబ్రవరి 1నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ విద్యార్థులకు నాలుగు విడతల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి 12గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2నుంచి 5గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో బ్యాచ్‌కు 20మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షల్లో పాల్గొంటారు. దీనికనుగుణంగా మెదక్ జిల్లా 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో జనరల్ విద్యార్థులు–2651, ఒకేషనల్ విద్యార్థులు–1121 మంది పరీక్షలు రాయనున్నారు. మొత్తం 16 ప్రభుత్వ కళాశాలలు, 7 ఆదర్శ కళాశాలలు, 2 టీఎస్‌ఆర్‌జేఎస్, 2 సోషల్ వెల్ఫేర్, 2 ట్రైబల్ వెల్ఫేర్, 3 కస్తూర్బా, 23 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ప్రతీ రోజు పరీక్షకు అరగంట ముందు ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి పరీక్ష పత్రాలు డౌన్లోడ్ చేసుకోవాలి. వన్‌టైమ్ పాస్వర్డ్ ద్వారా ప్రశ్నా పత్రాన్ని ఎగ్జామినర్ మాత్రమే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని నోడల్ అధికారి సూర్యప్రకాశ్‌రావు తెలిపారు. అలాగే విద్యార్థులు సాధించిన మార్కులు ఇంటర్ బోర్డుకు ఆన్లైన్లో పంపించాల్సి ఉంటుంది. సమస్యల ఒడిలో ప్రాక్టికల్ పరీక్షలు.. జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల్లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సరిపడా ల్యాబ్ గదులు లేక ఆరుబయట వరండాల్లో ప్రయోగాలు అయిపోయానిపిస్తున్నారన్న విమర్శలున్నాయి. పాపన్నపేట జూనియర్ కళాశాలలో కరెంట్ బిల్ బకాయి పడటంతో కనెక్షన్ తొలగించారు. దీంతో పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రం డౌన్లోడ్ చేసుకోవడం, మార్కులను పంపించడం ఎలా అంటూ లెక్చరర్లు ఆందోళన చెందుతున్నారు. అలాగే కెమిస్ట్రీ ల్యాబ్‌కు నీటి సౌకర్యం తప్పనిసరి. కానీ కరెంట్ లేకపోవడంతో నీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ నాలుగు ప్రాక్టికల్ గదులు లేక మూడింటిలోనే నాలుగు ల్యాబ్‌లు నడిపిస్తున్నారు. అల్లాదుర్గంలో జూనియర్ కళాశాలకు ప్రత్యేక భవనం లేక హైస్కూల్లోనే షిఫ్టింగ్ పద్ధలో కొనసాగిస్తున్నారు. దీంతో మొక్కుబడి ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. రెండేళ్లవుతున్నా సొంత భవన నిర్మాణం పూర్తి కావడం లేదు. అలాగే మెదక్ బాలికల జూనియర్ కళాశాలలో సైతం హైస్కూల్, ఇంటర్మీడియెట్ తరగతులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా అ దే పరిస్థితి నెలకొంది. ఇలా పలు కళాశాలల్లో ల్యా బ్‌లకు సరిపడా ఫర్నిచర్, సౌకర్యాలు లేక సైన్స్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటి నిర్వహణకోసం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఎగ్జామినర్లను నియమించాం. పర్యవేక్షణకు ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ముగ్గురు జిల్లా పరీక్షల సభ్యులు ఉంటారు. పాపన్నపేటలో విద్యు™త్ సౌకర్యం లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. – సూర్యప్రకాశ్, నోడల్ అధికారి కరెంట్ లేకుంటే పరీక్షలు ఎలా? మా కళాశాలలో వారం రోజలు క్రితమే కరెంట్ తొలగించారు. దీంతో కళాశాలలో బోరు నడవక తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కెమిస్ట్రీ ల్యాబ్‌లో నీరు తప్పనిసరి. అలాగే ఫ్యాన్లు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఇక్కడ ఒకే గదిలో రెండు సబ్జెక్టులకు సంబంధించిన ప్రాక్టికల్స్ నడిపిస్తున్నారు. దీంతో సౌకర్యంగా లేదు. ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తే పరీక్షలు మంచి వాతావరణంలో రాయగలుగుతాం. – ఆసీఫ్బాబా, ఇంటర్ ద్వితీయ సంవత్సరం -
ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
నల్లగొండ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నాలుగు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే కలెక్టర్, ఆర్డీఓలతో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా పూర్తయింది. పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లను ఏవిధంగా చేయాలనేది ఇంటర్ బోర్డు సూచనలు చేయడంతో ఆ మేరకు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఎగ్జామినేషన్ కమిటీతో కలిసి ఏర్పాట్లను చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఉన్న కళాశాలలతోపాటు ప్రైవేట్ కళాశాలలు మొత్తం 119 ఉన్నాయి. ఇందులో మొదటి సంవత్సరంలో 36,362 మంది విద్యార్థులు ఉండగా, రెండో సంవత్సరంలో 19,539 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరానికి సంబంధించి నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు మాత్రమే ఉంటాయి. ఇవి కూడా థియరీనే. నైతికత, మానవ విలువలు పరీక్ష పూర్తి కాగా, పర్యావరణ విద్య పరీక్షను పంచాయతీ ఎన్నికల కారణంగా 31 వాయిదా వేశారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 19,539 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరు కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ తదితర ప్రాక్టికల్స్ చేయనున్నారు. నాలుగు విడతలుగా ప్రాక్టికల్స్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. ఒక్కో విడతలో 18 కళాశాలల చొప్పున కొనసాగించనున్నారు. నాలుగు విడతల్లో అన్ని కళాశాలల్లో పరీక్షలు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 27 నుంచి థియరీ పరీక్షలు ఫిబ్రవరి 27వ తేదీనుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులతోపాటు ఒకేషనల్ కళాశాల విద్యార్థులకు కూడా థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 27వ తేదీన ఉదయం 9గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 13 వరకు జరగనున్నాయి. ఎగ్జామినేషన్ కమిటీ ఏర్పాటు ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఎగ్జామినేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి, సీనియర్ ప్రిన్సిపా ల్, జూనియర్ లెక్చరర్లతో కలిపి ఎగ్జామినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీనే పరీక్షల నిర్వహణ చేస్తుంది. కలెక్టర్, ఎస్పీలతో హైపవర్ కమిటీ హైపవర్ కమిటీలో కలెక్టర్, ఎస్పీ, బాలు ర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, ఒక సబ్జెక్ట్ లెక్చరర్, మరో ఎక్స్పర్ట్ జూనియర్ లెక్చరర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. వీరంతా ఎక్కడ సమస్య ఉన్నా, ఏమైనా ఆరోపణలు వచ్చినా వెంటనే పర్యవేక్షిస్తారు. థియరీకి 46 కేంద్రాలు థియరీ పరీక్షలకు 46 కేంద్రాలను ఏర్పా టు చేశారు. 12 ప్రభుత్వ, ఒకటి ఎయిడెడ్, రెండు మోడల్ స్కూల్, 2 రెసిడెన్షి యల్ కళాశాలలతోపాటు మరో 29 ప్రైవే ట్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు మొత్తం 46 చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 46 డీఓలు, 8మంది కస్టోడియన్స్, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు, 4 సిట్టింగ్ స్క్వాడ్ టీములను ఏర్పా టు చేయనున్నారు. 14 పోలీస్స్టేషన్లలో ప్రశ్నపత్రాల భద్రత పరీక్షలకు సంబంధించి 14 పోలీస్స్టేషన్లలో ప్రశ్న, సమాధానపత్రాలను భద్రపర్చనున్నారు. 7 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ గట్టి బందోబస్తు ఏ ర్పాట్లు చేయనున్నారు. ప్రశ్నపత్రాల రవా ణాకు సంబంధించి ఆర్టీసీ అధికారులు 19 రూట్లను ఎంపిక చేశారు. పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా పోస్టులో వచ్చే పత్రాలను తీసుకొచ్చేందుకు తగు చర్యలు తీసుకోనుంది. ఇన్విజిలేటర్లను మాత్రం పరీక్ష సమయంలోనే అధికారులు ఆయా కళాశాలల్లో ఏర్పాటు చేసుకోనున్నారు. అన్ని కార్యక్రమాలు, స్ట్రాంగ్ రూంలు, డీఆర్డీసీ వెన్యూ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఏర్పాటు చేశారు. -
ఎస్ఎస్సీ ఫలితాలు నిలిపివేత
న్యూఢిల్లీ: పలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియామకాల కోసం నిర్వహించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) 2017 పరీక్షల ఫలితాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక పరిశీలనలో తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్), కంబైన్డ్ హయ్యర్ సెకెండరీ లెవెల్ (సీహెచ్ఎస్ఎల్) పరీక్షల కుంభకోణంతో అభ్యర్థులు లబ్ధి పొందేందుకు అంగీకరించబోమని, వారు సర్వీసులోకి వెళ్లనివ్వబోమని స్పష్టం చేసింది. ‘2018 జూలై 25, ఆగస్టు 30న సీబీఐ ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్‌లను చూస్తే సీజీఎల్–2017, సీహెచ్ఎస్ఎల్–2017 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తెలుస్తోంది. మేం తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా ఫలితాలు వెల్లడించకుండా ఎస్ఎస్ఎస్కి ఆదేశాలు జారీ చేస్తాం’ అని ధర్మాసనం తెలిపింది. విరుద్ధంగా వాదిస్తారా? సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) విక్రమ్‌జిత్ బెనర్జీ స్టేటస్ రిపోర్డులో ఉన్నదానికి విరుద్ధంగా వాదించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు కేంద్రం తరఫున వాదించడం ఆపండి. సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన మీరు సీబీఐ నివేదికకు విరుద్ధంగా, నిందితులకు రక్షణగా ఎలా మాట్లాడుతారు? వాస్తవానికి మీరు సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా పరీక్షను రద్దు చేయాలని మీరే అడగాలి’ అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఏఎస్జీ బెనర్జీ.. సీబీఐ సమర్పించిన రెండో స్టేటస్ రిపోర్డును పిటిషనర్ తరఫు న్యాయవాదికి ఇవ్వవద్దని, అందులో సున్నితమైన అంశాలు ఉన్నాయని కోరారు. బెనర్జీ వాదనలతో విభేదించిన ధర్మాసనం సీబీఐ నివేదికలో రహస్యమైన, సున్నితమైన అంశాలేవీ లేవని స్పష్టం చేసింది. ఎస్ఎస్సీ కళంకితమైంది.. ఈ సమయంలో పిటిషనర్ శాంతను కుమార్ తరఫున కోర్టుకు హాజరైన అడ్వొకేట్లు ప్రశాంత్ భూషణ్, గోవింద్ వాదనలు వినిపిస్తూ.. ‘సీబీఐ మాకు రిపోర్టు ఇస్తుందా, లేదా అనేది ఇక్కడ విషయం కాదు. పరీక్ష ప్రశ్న పత్రం కస్టోడియన్ అయిన సిఫీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సంత్ ప్రసాద్ గుప్తా పేపర్‌ను లీక్ చేసినట్లు సీబీఐ తన తొలి స్టేటస్ రిపోర్టులో పేర్కొంది. అతడిని విచారిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఎస్ఎస్సీ ఫలితాలు విడుదలయ్యే వీలుంది. వాటిని నిలిపివేయండి’ అని కోరారు. ‘ఎస్ఎస్సీ వ్యవస్థ, మొత్తం పరీక్షల ప్రక్రియ కళంకితమయ్యాయని ప్రాథమికంగా తెలుస్తోంది. పరీక్ష ప్రశ్న పత్రాన్ని కస్టోడియనే లీక్ చేయడాన్ని మేం నమ్మలేకపోతున్నాం’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ప్రభుత్వ విభాగాల్లోని సీ, డీ కేటగిరీ ఉద్యోగ సర్వీసుల్లో చేరతారు. ‘ఆర్టికల్ 35ఏ’పై విచారణ వాయిదా జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, అధికారాలను కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ రాజ్యాంగబద్ధతను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో పాటు శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందని కేంద్రం విజ్ఞప్తి చేయడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ప్రజలకు ప్రత్యేక అధికారాలను, హక్కులను కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ ను 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. దీనిప్రకారం ఇతర రాష్ట్రాల ప్రజలు కశ్మీర్లో స్థిరాస్తులు కొనడం కుదరదు. అంతేకాకుండా మిగతా భారతీయులను కశ్మీరీ మహిళలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారు తమ ఆస్తిపై హక్కును కోల్పోతారు. తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు ప్రజాప్రకటనల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌పై బీజేపీ, కేంద్రం సహా 6 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ ప్రకటనలను నాయకుల వ్యక్తిగత ప్రచారానికి వాడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు నోటీసులిచ్చింది. 4వారాల్లోగా నోటీసులపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. కేంద్రం సహా తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లకు నోటీసులిచ్చింది. ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఈ పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత ప్రచారం కోసం ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారంటూ ఝా తన పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలను గుర్తుచేస్తూ.. బీజేపీ పార్టీ, కేంద్రం సహా ఆయా రాష్ట్రాలు ఏవిధంగా ఉల్లంఘనలకు పాల్పడ్డాయో పిటిషన్లో వివరించారు. ఉల్లంఘనలకు పాల్పడినందుకు వీరిపై చర్యలు తీసుకోవాలని, ప్రకటనలకోసం ఖర్చుపెట్టిన మొత్తాన్ని తిరిగి రాబట్టాలన్నారు. ప్రజా ప్రకటనలపై నియంత్రణ విషయంలో ముగ్గురు సభ్యుల (నిష్కళంకమైన చరిత్ర ఉన్నవారితో) కమిటీని ఏర్పాటు చేయాలని 2015, మే 13న కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. కేంద్ర మంత్రులు, సీఎంలు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ ప్రకటనల్లో కనిపించవచ్చని 2016లో సూచించింది. -
విజయవంతంగా ప్రాజెక్టుల నిర్మాణం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నామని భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను మంత్రి సందర్శించారు. ప్రాజెక్ట్‌లోని నీటిమట్టంతోపాటు ప్రాజెక్ట్ తాజా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు కూడా తాజా నివేదికను మంత్రికి అందించారు. మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రాజెక్ట్‌లను పూర్తిచేసి సాగు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపరిచామని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ భూసేకరణకోసం రూ.600 కోట్లు కేటాయించి పునరావాస పరిహారాన్ని నిర్వాసితులకు అందించామని తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం కాగా సీఎం కేసీఆర్ ఒక లక్ష్యంతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని పేర్కొనడం కాంగ్రెస్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో గ్రామాలు ముంపునకు గురికాకుండా రూపకల్పన చేసి నిర్మించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీని 16 టీఎంసీల నీటి సామర్థ్యంతో 85 గేట్లతో నిర్మిస్తుండగా, అన్నారం వద్ద బ్యారేజీని 11 టీఎంసీల నీటిసామర్థంతో 66 గేట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. సుందిళ్ల వద్ద నిర్మిస్తున్న బ్యారేజీ కూడా 9 టీఎంసీల నీటితో మొత్తం 74 గేట్లతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో 100 కిలోమీటర్ల భూగర్భజలాలు పెరుగుతాయని తెలిపారు. మంత్రి వెంట ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సీఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈ విజయ్‌కుమార్, ఈఈ సత్యరాజ్‌చంద్ర, డీఈ రాజమల్లు, ఏఈఈ శివసాగర్ ఉన్నారు. -
రెండున్నర గంటల్లోనే వర్సిటీ పరీక్షల ఫలితాలు
బెంగళూరు : యూనివర్సిటీ పరీక్షల ఫలితాలు రావాలంటే సాధారణంగా పది లేదా పదిహేను రోజులు పడతాయి. కొన్ని యూనివర్సిటీలు మరికొంత ఆలస్యం చేస్తాయి. కానీ తక్కువ సమయంలో ఫలితాలు మాత్రం ప్రకటించవు. ఈ కోవకు చెందినదే బెంగళూరు యూనివర్సిటీ కూడా. ఫలితాల ప్రకటనలో ఈ యూనివర్సిటీ చేసినంత జాప్యం మరొక యూనివర్సిటీ చేయదు. కానీ ఈసారి బెంగళూరు యూనివర్సిటీ సోమవారం అరుదైన రికార్డును సాధించింది. తనకున్న పేరును తిరగ రాసుకుంది. మొట్టమొదటిసారి పరీక్షలు అయిపోయిన రెండున్నర గంటల వ్యవధిలోనే బీఈ(సివిల్ ఇంజనీరింగ్) ఏడు, ఎనిమిది సెమిస్టర్ల ఫలితాలను ప్రకటించింది. బెంగళూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఒకే ఒక్క ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ ‘ది యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్’. దీని ఫలితాల ప్రకటనలోనే బెంగళూరు యూనివర్సిటీ ఈ ఘనత సాధించింది. ప్రతి సబ్జెట్ సమాధాన పత్రాలను, పరీక్ష అయిపోయిన వెంటనే మూల్యాంకనం చేసే వాళ్లమని బెంగళూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీ శివరాజు చెప్పారు. దీంతో గత 10 రోజులుగా జరుగుతున్న అన్ని సబ్జెట్ పరీక్ష పేపర్లను వెంటనే మూల్యాంకనం చేయడం ముగించామని తెలిపారు. 139 మంది విద్యార్థులు ఈ సారి పరీక్షలకు హాజరయ్యారని, ఇంత తక్కువ సమయంలో ఫలితాలను ప్రకటించడం బెంగళూరు యూనివర్సిటీ చరిత్రలోనే ఇది మొదటిసారని పేర్కొన్నారు. లేదంటే ఎనిమిది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందన్నారు. మూల్యాంకన ప్రక్రియను మెరుగుపరిచినందుకు తాము చాల సంతోషంగా ఉన్నామని ఇంజనీరింగ్ విద్యార్థి సురేష్ పీ తెలిపాడు. వెనువెంటనే ఫలితాలతో ఉన్నత విద్యకు వెళ్లడానికి లేదా ఉద్యోగం వెతుకుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నాడు. సోమవారం రోజు తాము ఆఖరి పేపరు పరీక్ష రాశామని, అది మధ్యాహ్నం రెండు గంటలకు అయిపోతే, సాయంత్రం నాలుగున్నర వరకు మొత్తం ఫలితాల ప్రకటన వచ్చేసిందని చెప్పాడు. కాలేజీ స్టాఫ్‌కు, బెంగళూరు యూనివర్సిటీ మూల్యాంకన వింగ్‌కు యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ మాజీ ప్రిన్సిపాల్, బెంగళూరు యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ కేఆర్ వేణుగోపాల్ కృతజ్ఞతలు చెప్పారు. -
ఫలితాల కోసం నిరీక్షణ
జనగామ అర్బన్: నవోదయ, గురుకుల విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించినా ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. ఒక వైపు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రైవేట్ పాఠశాలల్లో సిలబస్ శరవేగంగా దూసుకెళ్తోంది. దీంతో అడ్మిషన్ టెస్ట్ రాసిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవోదయ ప్రవేశ పరీక్షను నిర్వహించి దాదాపు రెండు నెలలు, గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కొరకు పదిహేను రోజుల క్రితం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఫలితాలు విడుదల చేయడంలో అధికారులు తాత్సారం చేస్తుండడంతో విద్యార్థులు కలవరపాటుకు గురవుతున్నారు. మరోవైపు గతంలో చదివిన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల నుంచి అడ్మిషనతోపాటు బుక్స్, యూనిఫామ్స్ కొనుగోలు చేయాలని ఒత్తిడి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. నాణ్యమైన విద్య అందుతుందనే ఉద్దేశంతో నవోదయ, గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు కోసం తమ పిల్లలతో పరీక్ష రాయించిన తల్లిదండ్రులు ఫలితాలు రాకపోవడంతో ఏమి చేయాలో తోచక దిక్కులు చూస్తున్నారు. నవోదయకు 9700 మంది హాజరు.. 2018-19 విద్యా సంవత్సరానికి గాను నవోదయ పాఠశాలలో ఆరో తరగతిలోని 80 సీట్లకు నోటిఫికేషన్ వేయగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యాప్తంగా 12,079 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు మొత్తం 54 కేంద్రాలలో ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహించగా 9700 విద్యార్థులు హాజరయ్యారు. గురుకుల ప్రవేశ పరీక్షకు 6144 మంది.. జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల్లో ఉన్న ఖాళీ సీట్ల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది సెంటర్లలో అడ్మిషన్ టెస్ట్ నిర్వహించారు. వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాలోని ఐదు కేంద్రాల్లో 4087 మంది, జయశంకర్, జనగామ, మహబుబాబాద్ జిల్లాల్లోని నాలుగు కేంద్రాల్లో 2057 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. నవోదయ, గురుకుల పాఠశాల రెండింటిలో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థులు సైతం కొందరు ఉన్నారు. -
పరీక్ష ఫలితాలు వెల్లడించాలని ధర్నా
హైదరాబాద్ : వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని, ఫలితాల వెల్లడికి అడ్డుగా ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని పశు సంవర్థక పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు అభ్యర్థుల ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి.గణేష్ రెడ్డి ప్రసంగించారు. వెటర్నరీ అసిస్టెంట్ నియామకాల పరీక్ష రాసి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఫలితాల ప్రస్తావన లేకుండా పోయిందని ఆరోపించారు. కోర్సులు పూర్తి చేసుకుని నోటిఫికేషన్ కోసం పదేళ్లుగా వేచి చూశామని అన్నారు. అలాంటి సందర్భంగా కొత్త రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో నోటిఫికేషన్ వచ్చిందని అన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు చేసుకుని పరీక్షలు రాసిన అభ్యర్థులందరూ అయోమయంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు టి.ప్రణయ్ భరత్, దివాకర్, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీను, పి.మహేందర్, అనిల్, ఎం.చక్రవర్తి, తెలంగాణ డాక్టర్ల సంఘం అధ్యక్షులు కె.శ్రీధర్ పాల్గొన్నారు. -
జవాబు పత్రాల దగ్ధంపై విద్యార్థుల్లో ఆందోళన
-
నాలుగు సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు?
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా దగ్ధమైన జవాబు పత్రాలకు సంబంధించిన సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని వర్సిటీ పాలక వ ర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. బీఎస్సీ సెకండ్ ఇయర్ జువాలజీ, మ్యాథమెటిక్స్ సహా మరో 2 సబ్జెక్టుల జవాబు పత్రాలు దగ్ధమైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు ప్రొ.శివరాజ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన బృందం బుధవారం షార్ట్‌సర్క్యూట్ జరిగిన గదిని పరిశీలించింది. అగ్నికి దగ్ధమైన పేపర్ల, ఫైర్ ఇంజన్ వదిలిన నీటి ద్వారానే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు గుర్తించింది. కాలిపోయిన వాటిలో బీఎస్సీ సెకండియర్ సెమిస్టర్ జవాబు పత్రాలే ఉండటం అధికారులకు ఊరట కలిగించే అంశమే అయినా.. ఇప్పటికే ఒకసారి పరీక్ష రాసినవారు మరోసారి రాయాల్సి రావడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆరా తీసి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏళ్లుగా కేబుళ్లు మార్చకపోవడంతోనే.. ఓయూ పరిపాలనా భవనం సహా కాలేజీ, హాస్టల్ భవనాలన్నీ ఏళ్ల క్రితం నిర్మించినవే. ఆయా భవనాల్లో అప్పటి అవసరాలకు అనుగుణంగా విద్యుత్లైన్లను ఏర్పాటు చేశా రు. ఫ్యాన్లు, లైట్ల సామర్థ్యానికి సరిపడే కేబు ళ్లు మాత్రమే వేశారు. ఆ తర్వాత కూలర్లు, ఏసీలు, కంప్యూటర్లు వచ్చి చేరాయి. పెరిగిన విద్యుత్ వినియోగానికి తగ్గట్టు కేబుళ్ల సామర్థ్యం పెంచాల్సి ఉన్నా.. చర్యలు చేపట్టలేదు. దీంతో షార్ట్సర్క్యూట్లు చోటుచేసు కుంటున్నాయి. శతాబ్ది ఉత్సవాల సమయం లో ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. వీటిని భవనాల పునరుద్ధరణకు కాకుండా ఇతర అవసరాలకు వాడారు. కమిటీ రిపోర్టు మేరకే నిర్ణయం ఈ అగ్నిప్రమాదంపై కమిటీ విచారణ చేపట్టింది. గురువారం కల్లా నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఏఏ సబ్జెక్టుల జవాబు పత్రాలు కాలిపోయాయి? ఎన్ని కాలిపోయాయి? వంటి వివరాలు తెలుస్తాయి. కమిటీ ఇచ్చే రిపోర్టు మేరకు మళ్లీ పరీక్షలు నిర్వహించే అంశాన్ని ఆలోచిస్తాం. – వీసీ, ప్రొఫెసర్ రామచంద్రం -
విద్యార్థులకు ‘హింగ్లీష్’ భాషలో పరీక్షలు..
భోపాల్ : మీరు పరీక్షలు ఏ భాషలో రాస్తారు? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? అవును మీరు పరీక్షలను ఏ భాషలో రాస్తారు. సాధారణంగా స్థానిక భాషలో లేదా ఆంగ్లంలో పరీక్షలకు హాజరవుతాం. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ విశ్వవిద్యాలయం మాత్రం విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. స్థానిక భాష అయిన హిందీతో పాటు ఇంగ్లీష్‌ను కలిపి పరీక్షలో రాయొచ్చని ప్రకటించింది. హిందీ, ఇంగ్లీష్ భాషలను కలిపి ‘హింగ్లీష్’లో పరీక్ష రాసేందుకు మధ్యప్రదేశ్ మెడికల్ సైన్స్ యూనివర్సిటీ మే 26న ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మౌఖిక పరీక్షల్లో సైతం హింగ్లీష్‌లో సమాధానాలు చెప్పవచ్చని పేర్కొంది. దీనిపై యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆర్ఎస్ శర్మ స్పందిస్తూ.. తమ నిర్ణయం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఉదాహరణకు ‘హార్ట్ అటాక్’ అనే పదానికి బదులు పరీక్షలో ‘హార్ట్ కా దౌరా’ అని రాయవచ్చని వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. చాలా మంది విద్యార్థులకు సరైన సమాధానం తెలిసినప్పటికీ వ్యక్తికరించలేకపోతున్నారని ఇది వారికి మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. యూనివర్సిటీ పరిధిలోని 312 కాలేజీల్లో ఈ నిబంధన వర్తించనున్నట్టు ఆయన వెల్లడించారు. -
సీబీఎస్ఈ ‘12’ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షా ఫలితాలను శనివారం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మేఘన శ్రీవాస్తవ ఈ పరీక్షలో 99.8 శాతం(500 మార్కులకు గానూ 499) మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 83.01 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది అబ్బాయిల కంటే అమ్మాయిలు మెరుగైన ఫలితాలు సాధించినట్లు సీబీఎస్ఈ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ పరీక్షలో అబ్బాయిలు 78.99 శాతం, అమ్మాయిలు 88.31 శాతం ఉత్తీర్ణత పొందారు. ఇక యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన అనౌష్కా చంద్ర 498 మార్కులతో రెండోస్థానంలో నిలవగా, 497 మార్కులతో మరో ఏడుగురు విద్యార్థులు మూడోస్థానంలో నిలిచారన్నారు. కాగా, జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత షాబిర్ షా కుమార్తె సమా షాబిర్ ఈ పరీక్షల్లో 97.8 శాతం మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే విదేశాల్లోని పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 94.94 శాతానికి చేరుకుందన్నారు. కొన్నిరోజుల క్రితం 12వ తరగతి అర్థశాస్త్రం ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన సీబీఎస్ఈని కుదిపేసినప్పటికీ నిర్ణీత గడువులోగానే ఫలితాలను ప్రకటించడం గమనార్హం. కాగా పరీక్షా ఫలితాల అనంతరం టాపర్ మేఘన మీడియాతో మాట్లాడుతూ.. ‘టాపర్‌గా నిలుస్తానని అస్సలు ఊహించలేదు. ఏడాదంతా నిరంతరం కష్టపడి చదవడం వల్లే ఇది సాధ్యమైంది’ అని చెప్పారు. మరోవైపు విద్యార్థులు పరీక్షా ఫలితాల అనంతరం ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వీలుగా 1800–11–8004 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు సీబీఎస్ఈ ప్రజా సంబంధాల అధికారి రమా శర్మ తెలిపారు. ఇందులో భాగంగా 69 మంది కౌన్సెలర్లు, నిపుణులు(49 మంది భారత్‌లో, మిగతావారు విదేశాల్లో) ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు మార్గనిర్దేశనం చేస్తారని వెల్లడించారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకూ నిపుణులు అందుబాటులో ఉంటారని రమా శర్మ చెప్పారు. మేఘన శ్రీవాస్తవ -
వివాదంగా టీఎస్పీఎస్ గురుకుల ప్రిసిపాల్ పరీక్ష
-
గ్రూప్ 2కు తండ్రీ కొడుకులు సెలక్ట్
ప్రకాశం, త్రిపురాంతకం: తండ్రీ కొడుకులు ఒకేసారి గ్రూప్ 2కు సెలక్టయ్యారు. ఒకరు ముందు, ఆ తర్వాత మరొకరు గ్రూప్–2 పరీక్షలు రాశారు. అయితే ఇద్దరికీ ఒకే సారి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో సంతోషంలో మునిగిపోయారు. కష్టపడితే సాధించలేనిది ఏమిలేదంటున్నారు ఈ తండ్రీ కొడుకులు. త్రిపురాంతకం మండలం దూపాడు పంచాయతీ పరిధిలోని దీవెపల్లి గ్రామానికి చెందిన కటికి సుబ్బారావు కుమారుడు శ్రీనివాసులు ఈ ఘనత సాధించారు. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివారు. సుబ్బారావు 1999లో గ్రూప్ 2కు సెలక్ట్ అయ్యారు. అయితే కొందరు కోర్టును ఆశ్రయించడంతో కాలయాపన జరిగింది. ప్రస్తుతం సుబ్బారావు ఏఈఓగా సెలక్ట్ అయ్యారు. ఈయన జెడ్పీ హైస్కూల్ దొనకొండలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. గత పదిహేను సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఇతని కుమారుడు శ్రీనివాసులు 2016 గ్రూప్2 ఫలితాల్లో ఏఎస్ఓ సెక్రెటరియేట్‌గా ఎంపికయ్యారు. అంతంత మాత్రం వసతులున్న స్థానిక ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్య, దూపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్య అభ్యసించారు. గ్రామస్తులు, పలువురు ప్రముఖులు అభినందించారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకుసాగితే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు శ్రీనివాసులు. -
వెయిటింగ్ లిస్ట్‌ను వెల్లడించాల్సిందే
న్యూఢిల్లీ: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు(డీఎస్ఎస్ఎస్బీ) పరీక్షలో ఎంపికై వెయిటింగ్ లిస్టులో ఉన్న అభ్యర్ధుల పేర్లను బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. ఈ జాబితాను వారం రోజుల్లో ఆన్లైన్లో ఉంచాలని సీఐసీ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్ సెలెక్షన్ బోర్డును కోరారు. డీఎస్ఎస్ఎస్బీ గత ఏడాది 34 టీచర్ పోస్టుల భర్తీకి గాను పరీక్షలు నిర్వహించింది. ఎంపికైన వారితో 33 పోస్టులను భర్తీ చేసింది. అయితే, వెయిటింగ్ లిస్ట్, కటాఫ్ మార్కులు, ర్యాంకుల వివరాలు తెలపాలని రేఖారాణి అనే అభ్యర్థిని కోరగా డీఎస్ఎస్ఎస్బీ తిరస్కరించింది. దీనిపై ఆమె సీఐసీని ఆశ్రయించారు. వెయిటింగ్ లిస్ట్‌ను రహస్యంగా ఉంచడం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని సీఐసీ పేర్కొంది. అర్జీదారుకు వివరాలు తెలుసుకునే హక్కు ఉందంటూ, ఈ పరీక్ష వెయిటింగ్ లిస్ట్‌ను రెండు వారాల్లోగా ఆన్లైన్లో ఉంచాలంది. -
4 నుంచి ఓయూసెట్ ప్రవేశ పరీక్షలు
హైదరాబాద్: ఓయూసెట్–2018 ప్రవేశ పరీక్షలను జూన్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ బుధవారం తెలిపారు. ఓయూతో పాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో వివిధ పీజీ, డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఓయూసెట్–2018ను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు, డిగ్రీ ఫైనలియర్ పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేందుకు ఈ నెల 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 26 వరకు, రూ.1000 అపరాధ రుసుముతో జూన్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఓయూసెట్ ప్రవేశ పరీక్షల్ని తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. 13న మాక్ ఐసెట్ సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ ఆన్లైన్ పరీక్షకు సంబంధించి విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఈ నెల 13న మాక్ ఐసెట్ నిర్వహించనున్నట్లు ఆర్జీ కేడియా కాలేజీ ఆఫ్ కామర్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం (10వ తేదీ) నుంచి 13వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామంది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు పరీక్ష ఉంటుందని తెలిపింది. మాక్ ఐసెట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామని పేర్కొంది. వివరాలకు 040–24738939, 040–65889309 నంబర్లను సంప్రదించాలని కాలేజీ డైరెక్టర్ డీవీజీ కృష్ణ వెల్లడించారు. ‘టెన్త్ రీ–వెరిఫికేషన్‌కు రేపటితో ఆఖరు’ సాక్షి, హైదరాబాద్: పదోతరగతి పరీక్షల జవాబు పత్రాల రీ–వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు శుక్రవారంలోగా నిర్ణీత చలానాతో కూడిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బి.ప్రభాకర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను పోస్టు చేయాలనుకునే విద్యార్థులు ఈ నెల 15లోపు చేరేలా పంపాలన్నారు. గడువు తేదీ తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణించమని ఆయన స్పష్టం చేశారు. జూన్ 4–19 వరకు టెన్త్ సప్లిమెంటరీ సాక్షి, హైదరాబాద్: పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 4 నుంచి 19 వరకు జరుగుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫెయిలైన విద్యార్థుల రోల్స్ డాటా వివరాలను www.bse. telagana.gov.in వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. 12,13 తేదీల్లో పీడీ, లైబ్రేరియన్ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లైబ్రేరియన్ పోస్టులకు ఈ నెల 12, 13 తేదీలలో రాత పరీక్షలు నిర్వహించనున్నామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి హాల్‌టికెట్లు సంస్థ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు. -
సీబీఎస్ఈతో గూగుల్ ఒప్పందం
న్యూఢిల్లీ: గూగుల్ సెర్చ్‌లో నేరుగా విద్యార్థులు పరీక్ష ఫలితాలు చూసుకునేందుకు వీలుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. తాజాగా విడుదలైన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు సహా పరీక్షాసంబంధ సమాచారాన్ని ‘గూగుల్ సెర్చ్ పేజీ’లో చూడొచ్చు. దీంతో స్మార్ట్‌ఫోన్, డెస్క్‌టాప్‌లలో చాలా త్వరగా, భద్రమైన సమాచారాన్ని పొందొచ్చని గూగుల్ పేర్కొంది. గేట్, ఎస్ఎస్సీ సీజీఎల్, క్యాట్ వంటి పరీక్షలకు సంబంధించిన పరీక్ష నిర్వహణ, రిజిస్ట్రేషన్ తేదీలు, ముఖ్యమైన లింక్లుసహా ఇతర కీలకమైన సమాచారాన్ని గూగుల్ సెర్చ్ పేజీలో పొందవచ్చు. -
విషమ‘పరీక్ష’
కర్నూలు(హాస్పిటల్): పాలకుల మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగులను తొలగించేలా వ్యవహరిస్తుండటమే ఇందుకు ఉదాహరణ. ఎన్టీఆర్ వైద్యసేవ పథకం నిర్వహణలో కీలకంగా ఉన్న వైద్యమిత్రలపై వేటు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జీవో నెం.28తో తొలగించాలని చూసినా హైకోర్టు, సుప్రీంకోర్టులు అడ్డుకున్నాయి. అయితే సుప్రీం కోర్టు ఇ చ్చిన తీర్పులో ఉన్న ఒక లైన్ ఆధారంగా ఇప్పుడు ఆన్లైన్ పరీక్ష నిర్వహించబోతోంది. ఇందులో 65 శాతం మార్కులు తెచ్చుకుంటేనే ఉద్యోగంలో కొనసాగిస్తామని చెబుతోంది. ప్రభుత్వ తీరుతో మిత్రల్లో ఆందోళన నెలకొంది. విధుల్లోకి చేరిన పదేళ్ల తర్వాత పరీక్ష రాయాలనడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు. 2008లో నియామకం.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణకు గానూ జిల్లాలో 2008లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నెట్వర్క్ ఆసుపత్రుల్లో నెట్వర్క్ మిత్రలు 50 మంది, పీహెచ్సీలలో పీహెచ్సీ మిత్రలు 83మందిని నియమించారు. వీరితో పాటు నలుగురు టీం లీడర్లు, ఒక జిల్లా మేనేజర్‌ను ఇలా వీరందరని ఔట్సోర్సింగ్ ద్వారా నియమించారు. పీహెచ్సీ వైద్యమిత్రలకు రూ.5,900లు, నెట్వర్క్ వైద్యమిత్రలకు రూ.7,288 ప్రకారం చెల్లిస్తున్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ పరీక్షా! ఉద్యోగంలో చేరిన పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వైద్యమిత్రలకు మే 13న ఇంగ్లిష్‌లో ఆన్లైన్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల కో ఆర్డినేటర్లకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. తాము 2008లోనే పరీక్ష రాసి విధుల్లో చేరామని, తిరిగి ఇప్పుడు పరీక్ష పెట్టడమేమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు వచ్చాక జాబు ఊడుతోంది.. బాబు వస్తే జాబు వస్తుందనే ప్రచారంతో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులే లక్ష్యంగా విద్య, డ్వామా, వెలుగు, సంక్షేమ శాఖ, వైద్యశాఖల్లో ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది. ప్రస్తుతం వైద్యమిత్రల వంతు వచ్చింది. వైఎస్సార్ హయాంలో చేరిన వారిని తొలగించి తమ కార్యకర్తలను నియమించుకోవాలనే ఎత్తుగడలో భాగంగా జీవో నెం.28 విడుదల చేసింది. దీనిపై వైద్యమిత్రలు హైకోర్టును ఆశ్రయించగా మిత్రలకు అనుకూలంగా తీర్పు రావంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. అయితే అవసరమైతే పరీక్ష నిర్వహించుకోవచ్చని సుప్రీం కోర్టు సూచించింది. దీని ఆధారంగా ప్రభుత్వం ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తోంది. పొమ్మనకుండా పొగబెడుతున్నారు పదేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాం. జీతం తక్కువగా ఇస్తున్నా ఎప్పటికైనా రెగ్యులరైజ్ చేయకపోతారా అనే ఆశతో కొనసాగుతున్నాం. ప్రస్తుతం ప్రభుత్వం పొమ్మనలేక పొగబెడుతోంది. ఇందులో భాగంగానే ఆన్లైన్ పరీక్ష పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న వారిలో అధిక శాతం 40 ఏళ్లు పైబడిన వారే. వారంతా మళ్లీ పరీక్షకు సిద్ధం కావాలంటే ఇబ్బందే. –నాగరాజు, వైద్యమిత్ర ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు న్యాయపోరాటం చేస్తాం తమను తొలగించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తోంది. హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నా తమను ఇబ్బందులకు గురిచేయాలని ప్రభుత్వం వ్యవహరి స్తోంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. – రాజశేఖరరెడ్డి, వైద్యమిత్రల సంఘం జిల్లా కార్యదర్శి -
'ఓపెన్'చిట్టీలతో చిక్కులు
కర్నూలు సిటీ: ఈ నెల 19 నుంచి నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర పరీక్షలను చిట్టీల వ్యవహారం అధికమైంది. ఇందులో చాలా కొందరు ఉపాధ్యాయుల ప్రమేయం ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లాకు సంబంధించి నాలుగు డివిజన్లలో 29 కేంద్రాల్లో ఈ నెల 30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పదవ తరగతి పరీక్షలకు 3005 మంది, ఇంటర్ పరీక్షలకు 3213 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షల పర్యవేక్షణకు విద్యాశాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లా అబ్జర్వర్‌గా ప్రభుత్వ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపాల్ రాఘవరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణ ఎలా ఉన్నా ఆదోని, డోన్ డివిజన్లలోని కేంద్రాల్లో కొందరు ఉపాధ్యాయులే పరీక్షలు రాసే వారి నుంచి డబ్బులు వసూలు చేసి పాస్‌కు గ్యారంటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సదరు ఉపాధ్యాయులు చిట్టీల వ్యవహారానికి తెరలేపినట్లు ఆరోపణలున్నాయి. డోన్ డివిజన్లోని ఓ బాలికోన్నత పాఠశాలలో ఈ నెల 24న పరీక్ష కేంద్రంలో ఓ టీచర్ తాను ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్న గదిలో కాకుండా పక్క గదిలో విద్యార్థికి చిట్టీలు ఇస్తూ సిట్టింగ్ స్క్వాడ్‌కు పట్టుబడ్డారు. జిల్లా అబ్జర్వర్ విచారించి సదరు టీచర్‌పై చర్యల నిమిత్తం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి నివేదించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి డీఈఓ తాహెరా సుల్తానాను వివరణ కోరగా మంగళవారం డోన్ హైస్కూల్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఇన్విజిలేటర్‌ను తప్పించామన్నారు. డిప్యూటీ ఈఓతో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పేపర్లు దిద్దడం..మార్కులు వేయడం..అంతా విద్యార్థులే!
ఉలవపాడు : ఓ వైపు విద్యాశాఖ తాము వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని గొప్పలు చెబుతుంది...తీరా పరిస్థితి చూస్తే వాస్తవానికి విరుద్ధం. వివరాలలోకి వెళితే పకడ్బందీ అంటూ పేపర్లు ఇచ్చేటప్పుడు పోలీస్‌స్టేషన్‌కు పంపి అక్కడ నుంచి పాఠశాలకు చేర్చి అనంతరం పరీక్షలు నిర్వహించారు. కానీ పరీక్షలు జరిపారు. ఆ తరువాత విద్యార్థులు రాసిన పేపర్లను బహిర్గతం కాకుండా దిద్ది నిజమైన మార్కులు అందచేయాలి. కానీ ఉలవపాడు ఉన్నత పాఠశాలలో పరిస్థితి చాలా దారుణం. సోమవారం ఉలవపాడు ఉన్నత పాఠశాలలో పాత రూంలలో ఏడో తరగతి విద్యార్థులే తాము రాసిన పేపర్లను రుద్దుకుంటున్నారు. తమకు నచ్చిన విధంగా మార్కులు వేసుకునే పరిస్థితి. ఉపాధ్యాయులు పరీక్ష రాసిన తరువాత రహస్యంగా జరగాల్సిన కార్యక్రమం కాస్తా బహిర్గతం చేయడం అదీ పరీక్షలు రాసిన విద్యార్థుల చేతే వారి పేపర్లు రుద్దిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వారి పేపర్లు కాకుండా పక్క క్లాసు పేపర్లు కూడా దిద్దుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానోపాధ్యాయురాలి అండతోనే ఈ కార్యక్రమం జరుగుతుందని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రధానోపాధ్యాయురాలు కొండపి ఎమ్మెల్యే స్వామి అక్క కావడంతో విద్యాశాఖ నుంచి తమను ఎవరూ పట్టించుకోరు అని ఉపాధ్యాయులు బాహాటంగా చెబుతున్నారు. కానీ ఏడాది కాలంగా వివాదాల మధ్య నడుస్తున్న ఈ పాఠశాలలో ఇలా పేపర్లు విద్యార్థులు దిద్దడం చూసిన తరువాత ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలంటే వెనుక్కు తగ్గే పరిస్థితిని ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కల్పించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
హాల్ టికెట్లు ఇవ్వలేదని
మొయినాబాద్(చేవెళ్ల): పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్లు ఇవ్వడంలేదంటూ ఇద్దరు విద్యార్థులు కళాశాల భవనం పైనుంచి దూకేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న గ్లోబల్ ఫార్మసీ కళాశాలలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్లోబల్ ఫార్మసీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న 23 మంది విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు కళాశాల యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వలేదు. సోమవారం నుంచే పరీక్షలు ప్రారంభం కావడంతో అంతకు ముందే పలుమార్లు విద్యార్థులు హాల్ టికెట్ల కోసం ప్రిన్సిపల్‌ను అడిగారు. చివరి నిమిషం వరకు హాల్ టికెట్లు వస్తాయని చెప్పిన ప్రిన్సిపల్ పరీక్షలు ప్రారంభమైన రోజున హాజరు సరిగా లేనందున మీరంతా డిటెండ్ అయ్యారని చెప్పారు. దీంతో మంగళవారం నాడు విద్యార్థులు కళాశాలలోనే ఆందోళన నిర్వహించి విద్యార్థి సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చారు. బుధవారం ఎన్ఎస్టీడబ్ల్యూఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు కళాశాలకు వచ్చి యాజమాన్యంతో మాట్లాడారు. జేఎన్టీయూ నుంచే 23 మంది విద్యార్థులను డిటెండ్ చేశారంటూ చెప్పడంతో అందులోని ఇద్దరు విద్యార్థులు మహ్మద్ ఆసిఫ్, అయూబ్‌లో కళాశాల భవనం పైకి ఎక్కి దూకేందుకు ప్రయత్నించారు. అప్పటికే కళాశాల వద్దకు చేరుకున్న పోలీసులు వారిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. -
పరీక్ష కేంద్రం మార్పుతో గందరగోళం
అనంతపురం ఎడ్యుకేషన్ : ముందస్తు సమాచారం లేకుండా గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశాలకు ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం మార్పు చేయడం గందరగోళానికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే... గురుకుల పాఠశాలల్లో 2018–19 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాలకు ఆదివారం పరీక్షలు నిర్వహించారు. అనంతపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, కదిరి తదితర ప్రాంతాలకు చెందిన 200 మంది విద్యార్థులను గుడిబండ బీసీ గురుకుల బాలికల పాఠశాల కేంద్రంలో పరీక్ష రాసేందుకు హాల్‌టికెట్లను జారీ చేశారు. దీంతో విద్యార్థులు ఆదివారం ఉదయం గుడిబండకు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అక్కడ గురుకుల పాఠశాల లేదనే విషయం తెలుసుకున్న వారంతా గందరగోళానికి గురయ్యారు. గత ఏడాది ఇక్కడి గురుకుల పాఠశాలను మడకశిరకు మార్చినా.. అధికారులు పాత చిరునామాతోనే హాల్‌టికెట్లు జారీచేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పిల్లలతో మడకశిరకు చేరుకున్నారు. అప్పటికే 11.15 గంటలుకాగా, పరీక్ష రాసేందుకు సిబ్బంది నిరాకరించారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహంతో తిరగబడ్డారు. దీంతో ఆలస్యంగా విద్యార్థులను పరీక్షలకు అనుమతించారు. -
జీమ్యాట్ ఇకపై మూడున్నర గంటలే
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(జీమ్యాట్) పరీక్షా సమయాన్ని 4 గంటల నుంచి మూడున్నర గంటలకు తగ్గించారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి రానుందని జీమ్యాట్‌ను నిర్వహించే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సెల్ (జీమ్యాక్) సీనియర్ డైరెక్టర్ వినీత్ ఛబ్రా తెలిపారు. తాజా విధానంలో జీమ్యాట్ ప్రశ్నల స్థాయి, స్కోరింగ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. క్వాంటిటేటివ్, వెర్బల్ రీజనింగ్ విభాగాల్లో అన్‌స్కోర్డ్, రీసెర్చ్ ప్రశ్నలను తగ్గించినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలో ట్యుటోరియల్ స్క్రీన్లను తొలగించినట్లు తెలిపారు. జీమ్యాట్ పరీక్షలో అనలిటికల్ రైటింగ్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ విభాగాల్లో ఎలాంటి మార్పు జరగలేదన్నారు. పరీక్షా విధానాన్ని మరింత మెరుగుపర్చడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతేడాది జీమ్యాట్ పరీక్షలకు ప్రపంచవ్యాప్తంగా 2.50 లక్షల మంది హాజరైతే.. అందులో భారతీయులు 32,514 మంది ఉన్నారని తెలిపారు. ప్రతి 16 పని దినాలకు ఓసారి, మొత్తంగా ఏడాదికి ఐదు సార్లకు మించకుండా విద్యార్థులు జీమ్యాట్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ఓ అభ్యర్థి తన జీవితకాలంలో గరిష్టంగా 8 సార్లు మాత్రమే జీమ్యాట్ రాయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా 2,300 బిజినెస్ స్కూళ్లు, ఏడు వేలకుపైగా కోర్సుల్లో జీమ్యాట్ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. -
పరీక్షల నిర్వహణపై కమిటీ
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణ, లోపాలపై సమీక్షించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. లీక్ తదితర లోపాల్లేకుండా సాంకేతికత సాయంతో భద్రమైన పద్ధతిలో పరీక్షలు నిర్వహించేందుకు ఈ కమిటీ తగు సూచనలు చేయనుంది. బుధవారం ఏర్పాటుచేసిన ఈ ఏడుగురు సభ్యుల కమిటీకి హెచ్చార్డీ మాజీ కార్యదర్శి వినయ్‌శీల్ ఒబెరాయ్ నేతృత్వం వహిస్తారు. మే 31కల్లా ఈ కమిటీ కేంద్రానికి నివేదిక అందజేస్తుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ వెల్లడించారు. సీబీఎస్ఈ వ్యవస్థలో భద్రతాపరమైన లోపాలను ఈ కమిటీ సమీక్షిస్తుందని, ట్యాంపరింగ్ లేకుండా ప్రశ్నపత్రాలు నేరుగా పరీక్షాకేంద్రాలకు చేరటంపైనా సూచనలు చేస్తుందన్నారు. పునఃపరీక్ష బోర్డు విచక్షణాధికారమే ప్రశ్నపత్రం లీక్ అయిన 12వ తరగతి ఎకనమిక్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న సీబీఎస్ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ఐదు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. పునఃపరీక్ష నిర్వహించటం సీబీఎస్ఈ విచక్షణ పరిధిలోకి వస్తుందని.. దీన్ని కోర్టు ప్రశ్నించలేదని జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ఏ బాబ్డేల ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఏప్రిల్ 27 నుంచి దూరవిద్య డీఎడ్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సు మొదటి సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు 3 రోజులు జరుగుతాయని ఎన్ఐఓఎస్ రీజనల్ డైరెక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు. ఫీజు చెల్లించినా స్టడీ సెంటర్లు కేటాయిం చని వారు, 75% హాజరు లేని వారు జిల్లా విద్యాశాఖ అధికారులను సం ప్రదించి వారికి కేటాయించిన స్టడీ సెంటర్లలో రిపోర్టు చేయాలన్నారు. -
టెన్త్‌లో ఉత్తీర్ణత శాతం ముఖ్యం కాదు
పొదలకూరు: జిల్లాలో టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ముఖ్యం కాదని, ప్రతిభకలిగిన విద్యార్థులను తయారు చేయడమే ముఖ్యమని డీఈఓ కేశామ్యూల్ పేర్కొన్నారు. పొదలకూరు డీఎన్నార్ జెడ్పీ బాలబాలికల హైస్కూల్లోని టెన్త్ పరీక్ష కేంద్రాలను డీఈఓ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ విలేకరులతో మాట్లాడుతూ పరీక్షలు పగడ్బందీగా జరుగుతున్నట్టు తెలిపారు. పొదలకూరు పరీక్ష కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాల జాబితాలో ఉన్నాయన్నారు. అయితే ఇక్కడ ప్రశాంతంగా పరీక్షలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఫలితాల కంటే ప్రతిభ ముఖ్యమని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టెన్త్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్లో కూడా రాణించాలన్నారు. టెన్త్‌లో ప్రతిభ లేకుండా ఉత్తీర్ణత సాధించే విద్యార్థులు ఇంటర్లో పాఠ్యాంశాలను అందుకోలేక ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షల కోసం 45 సిట్టింగ్, 10 ఫ్లయింగ్, 20 స్పెషల్ స్క్వాడ్లను నియమించినట్టు ఆయన పేర్కొన్నారు. -
జోరుగా మాస్ కాపీయింగ్
నెల్లూరు(టౌన్): గత ఏడాది మార్చి 15వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరిగాయి. నారాయణ, శ్రీచైతన్య పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో 21వ తేదీ స్థానిక ధనలక్ష్మీపురంలోని నారాయణ పాఠశాలలో ఫిజిక్స్ పేపర్ లీకైంది. ఈ లీక్ వ్యవహారంలో శ్రీచైతన్య పాఠశాల నిర్వాహకులు కూడా ఉన్నట్లు అప్పటి విద్యాశాఖాధికారులు తేల్చారు. అయితే నేటి వరకు ఆ పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మళ్లీ ఈ ఏడాది నారాయణ, శ్రీచైతన్య పాఠశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాకపోతే గత ఏడాది పేపరు ‘పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకూడదు.. ఉత్తీర్ణత శాతం తగ్గినా ఫర్వాలేదు.. పిల్లలకు స్వచ్ఛందంగా తెచ్చుకున్న మార్కులనే తల్లిదండ్రులు, కలెక్టర్‌కు చెబుతాం.. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే ఇన్విజిలేటర్లదే బాధ్యత. విద్యార్థులను డిబార్ చేయడంతో పాటు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తాం’ ఇది డీఈఓ కె.శామ్యూల్ చెప్పిన మాటలు. అయితే ఈ ఆదేశాలు చాలా ప్రాంతాల్లో అమలు కావడం లేదు. మెజార్టీ పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరిగిపోతుంది. చీఫ్ సూపరింటెండ్లు, ఇన్విజిలేటర్లు కార్పొరేట్ ప్రలోభాలకు తలొగ్గి పనిచేస్తున్నారు. చాలా కేంద్రాల్లో పరీక్షలు ప్రైవే టు పాఠశాలల యాజమాన్యం కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఈ కేంద్రాల్లో ఇన్వి జిలేటర్లే బిట్ పేపరకు జవాబులు చెబు తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నా యి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యా జమాన్యాల లక్ష్యం ఒక్కటే 10కి10 పాయింట్లు తెచ్చుకోవడమే. జి ల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఎన్ని ఆదేశాలు వచ్చినా, సంబంధిత ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినా మా స్ కాపీయింగ్ ఆగడం లేదు. మాస్ కాపీయింగ్‌ను ప్రో త్సహించే వారిని కాకుం డా తమను బలి పశువును చేస్తున్నారంటూ కొందరు ఉపాధ్యాయులు వా పోతున్నారు. ప్రైవేటు ´ ఠశాలల ప్రవేశంతో చూచిరాతలు సాగుతున్నాయి. నలుగురు విద్యార్థుల డీబార్, ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్ ఇప్పటి వరకు జరిగిన పది పరీక్షల్లో నలుగుగురు విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా అధికారులు డిబారు చేశారు. సీతారాంపురంలోని ఏపీ మోడల్ హైస్కూల్లో ఈనెల 17న మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థినులను డిబారు చేశారు. వీరితో పాటు ఇద్దరు ఉపాధ్యాయలును సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఈ నెల 21న ఆత్మకూరులోని జెడ్పీ హైస్కూల్ కేంద్రాంలో మరో ఇద్దరు విద్యార్థులను డిబార్ చేశారు. ఉపాధ్యాయుల సస్పెన్షన్‌పై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడం, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రిపోర్టులో బాధ్యులుగా లేకపోవడంతో ప్రస్తుతం సస్పెండ్ చేయకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రైవేటు పాఠశాలలే కీలకం జిల్లాలో 32 ప్రైవేటు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. నారాయణ, శ్రీచైతన్య, కేకేఆర్, ఎస్ఆర్కే తదితర పాఠశాలలు ఉన్నాయి. గతంలో పదో తరగతికి మార్కులు ఉండేవి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం కొందరను లక్ష్యంగా చేసుకుని ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ప్రణాళికలు రచించే వారు. గత ఏడాది నుంచి గ్రేడు విధానాన్ని ప్రవేశపెట్టారు. పాఠశాలలో ఎక్కువ మందికి 10కి10 పాయింట్లు తెచ్చుకోవడమే వారి లక్ష్యం. నెల్లూరురూరల్ ప్రాంతంతో పాటు రాజుపాళెం, గూడూరు, నాయుడుపేట, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి ప్రాంతాలో ఎక్కువ మాస్ కాపీయింగ్ జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. సీ కేంద్రాలుగా ప్రకటించిన 28సెంటర్లల్లో సీసీ కెమెరాలను బిగిస్తామని చెప్పిన అధికారులు ఆ జోలికే పోలేదు. తమకు కావాల్సిన ఇన్విజిలేటర్లను నియమించుకోవడంతో పాటు తమకు నచ్చిన వారని చీఫ్సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులను నియమించుకుంటున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఏడాది ఒక్కొ ఇన్విజిలేటరు నాలుగు పరీక్ష కేంద్రాలకు మార్చుతామని చెప్పినా అక్రమాలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిట్ పేపరుకు జవాబులు జిల్లాలోని అన్ని కేంద్రాల్లో బిట్ పేపరుకు ఇన్విజిలేటర్లే జవాబులు చెబుతున్నారనే ఆరోపణలున్నాయి. చాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పరీక్షల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చీఫ్ సూపరింటెండెంట్లు ద్వారా ప్రశ్నపత్రం ఉదయం 10 గంటలకు బయటకు వస్తుందనే ఆరోపణలున్నాయి. కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవు పది పరీక్షల్లో ఎవరు మాస్ కాపీయింగ్ పాల్పడ్డా చర్యలు తప్పవు. మాస్ కాపీయింగ్‌లో ఉపాధ్యాయుని పాత్ర ఉన్నట్లయితే వారిని కూడా సస్పెండ్ చేస్తాం. పరీక్షలు చాల పకడ్బందీగా జరుగుతున్నాయి. ఇప్పటికే నలుగురు విద్యార్థులను డిబార్ చేశాం ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశాం. –కె.శామ్యూల్, డీఈఓ -
‘టెట్’ ర్యాంకుల్లో గందరగోళం!
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్ష ర్యాంకుల్లో గందరగోళం నెలకొంది. పేపర్–1, పేపర్–2, పేపర్–3 పరీక్షల్లో మీడియంల వారీగా అత్యధిక మార్కులను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా పేపర్–3 ఇంగ్లిష్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 122 మార్కులే టాప్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని మంగళవారం పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. కాగా అనంతపురం నగరంలోని తేజ కోచింగ్ సెంటర్ విద్యార్థి అంకే వెంకటేష్ పేపర్–3 ఇంగ్లిష్‌లో 125 మార్కులు సాధించాడు. ప్రభుత్వం మాత్రం ఈ పరీక్షలో 122 మార్కులే అధికమని ప్రకటించిందని, తాను 125 మార్కులు సాధించానని వెంకటేష్ పేర్కొన్నారు. టెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచీ ప్రతి అంశంలోనూ గందరగోళమేనని అభ్యర్థులు వాపోయారు. చివరకు ఫలితాలు వచ్చిన తర్వాత మార్కుల ప్రకటించడంలోనూ అదే గందరగోళం నెలకొందని అభ్యర్థులు మండిపడుతున్నారు. -
దేవుడా..ఓ మంచి దేవుడా..
కర్నూలు(సిటీ): పదో తరగతి పరీక్షలు అసౌకర్యాల మధ్య గురువారం ప్రారంభమయ్యాయి. అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పినా దాదాపు అన్ని కేంద్రాల్లోనూ సమస్యలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ప్రభుత్వం అన్ని వసతులు కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించినప్పటికీ ప్రభుత్వ స్కూళ్లు కేంద్రాలుగా ఉన్నచోట విద్యార్థులు పాత బెంచీల మీదే పరీక్షలు రాశారు. కొన్ని చోట్ల పక్క స్కూళ్ల బెంచీలను ఏర్పాటు చేసి పరీక్షలు రాయించారు. ఫ్యాన్లు లేకపోవడంతో ఎండల తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ఆర్టీసీ బస్సులను తిప్పాలని డీఈఓ తహెరా సుల్తానా కోరినా ఎక్కడా ప్రత్యేక బస్సులు అగుపించలేదు. దీంతో చాలా మంది విద్యార్థులు ప్రైవేటు వాహనాల్లోనే కేంద్రాలకు చేరుకున్నారు. మొదటిరోజు కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులతో కలసి అర గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో అక్కడక్కడా 5, 10 నిముషాలు ఆలస్యంగా వచ్చినా అధికారులు అనుమతించారు. పరీక్ష ప్రారంభానికి ముందే చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో సమావేశమై పరీక్ష నిర్వహణపై పలు సూచనలిచ్చారు. కాగా కొలిమిగుండ్ల జెడ్పీ హైస్కూల్ సెంటర్లో కొంతమంది మోడల్ స్కూల్ టీచర్లు ప్రశ్నపత్రాన్ని సెల్‌ఫోన్‌తో ఫొటో తీసుకొని చిట్టీలు చించి విద్యార్థులకు అందజేసినట్లు, అదే సెంటర్ వద్ద ఓ విద్యార్థి తండ్రి చిట్టీలు వేసినట్లు సమాచారం. పరీక్షల అబ్జర్వర్ రాఘవరెడ్డి మాత్రం కాపీయింగ్‌కు అవకాశమే లేదని పేర్కొన్నారు. 173మంది విద్యార్థులు గైర్హాజరు జిల్లాలో 226 కేంద్రాల్లో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలకు మొదటిరోజున 49,932 మంది విద్యార్థులకు గాను 49,759 మంది విద్యార్థులు హాజరు కాగా, 173 మంది గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కేంద్రాల్లో వాటర్ బాయ్‌ని ఏర్పాటు చేసుకోవడంలో కొంత ఉపాధ్యాయులు, సీఎస్ల మధ్య తాము చెప్పిన వారినే ఏర్పాటు చేసుకోవాలని వాదనలు జరిగాయి. కృష్ణగిరి మండలంలోని అమకతాడు, కోయిలకొండ గ్రామాల విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఆటోల్లో వచ్చారు. అలాగే జిల్లాలో రవాణా సౌకర్యం లేని సుమారు 600లకుపైగా గ్రామాలకు చెందిన విద్యార్థులు, రోడ్లు ఉన్నా బస్సు సౌకర్యం లేని మరో 70 గ్రామాల విద్యార్థులు అవస్థలు పడ్డారు. -
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
-
పరీక్షలు సరే.. ఫలితాలు మరి..!
సాధారణ పరీక్షలకు విద్యాశాఖ రూ. 22 కోట్లు ఖర్చుచేసినా ఫలితాల వెల్లడిలో జరుగుతున్న జాప్యం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రమాణాల పెంపుపై బాహాటంగా వ్యక్తం అవుతున్న విమర్శలతో ఫలితాలు వెల్లడించామని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో వివరాలు ఉంచామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. తీరా అందులో పరిశీలిస్తే కొద్ది పాఠశాలల ఫలితాలే కనిపిస్తున్నాయి. అందులోను ఏ1 మొదలు బి2 వరకు ఒకే గ్రేడు కేటాయించారు. వ్యక్తిగత మార్కులు మాత్రం లభ్యం కాకపోతుండడం, మరో వైపు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రావీణ్యాన్ని అంచనా వేసుకునేందుకు మార్కుల గురించి పాఠశాలల ఉపాధ్యాయులను, యాజమాన్యాలను అడిగినా ప్రయోజనం ఉండటం లేదు. ఒంగోలు: సాధారణ పరీక్షలకు సంబంధించి అక్టోబరులో జరగాల్సిన సమ్మేటివ్ 1 (గతంలో క్వార్టర్లీ పరీక్షలు) పరీక్షల ప్రశ్నాపత్రాలు యూట్యూబ్‌లో ప్రత్యక్షం కావడంతో పాఠశాల విద్యాశాఖ జరిగిన పరీక్షలను సైతం రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గతంలో ఈ పరీక్షలను ఏ జిల్లాకు ఆ జిల్లా నిర్వహించుకునేది. జిల్లాస్థాయిలో ఉన్న ఉమ్మడి పరీక్షల బోర్డు ఈ ప్రశ్నాపత్రాల రూపకల్పన చేయించేది. కానీ ప్రస్తుతం ఈ పరీక్షలను సైతం రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ప్రశ్నాపత్రం అంటూ తెరమీదకు తీసుకువచ్చారు. ఇది ఖర్చు పెరుగుతుందని భావించినా విద్యార్థుల ప్రమాణాల పెంపునకు ఉపయుక్తం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ఉమ్మడి ప్రశ్నాపత్రాలు పలు జిల్లాల్లో లీక్ కావడంతో పరీక్షలను రద్దుచేసిన అధికారులు అందుకు బాధ్యులైన వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టారనేది మాత్రం బయటకు రావడంలేదు. ఈ నేపథ్యంలో ఆబ్జెక్టివ్ తరహా విధానం అంటూ నూతన పంథాను తెరమీదకు తెచ్చారు. దీనికి సంబంధించి పరీక్షల నిర్వహణపైన కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. కొన్ని పరీక్షలకు ఒక్కో బిట్‌కు ఒక మార్కు కేటాయించగా పలు పరీక్షలకు మాత్రం బిట్‌కు అరమార్కు మాత్రమే కేటాయించారు. అంతే కాకుండా ఓఎంఆర్ జవాబు పత్రాలను దీనికోసం కేటాయించారు. మొత్తంగా 2017 డిసెంబర్ 12 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలకు రూ. 22 కోట్లు కేటాయించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలను ముద్రించి విమానాల్లో రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రత్యేక ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో జిల్లాలకు తరలించారు. అయితే ఇంత ఖర్చుచేసినా ఫలితాలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. సగానికిపైగా కనిపించని ఫలితాలు జిల్లాలో 8వ తరగతి తెలుగు మీడియం విద్యార్థులు 19373 మంది, 27452 మంది ఆంగ్ల మా«ధ్యమం విద్యార్థులు మొత్తం 46825 మంది పరీక్షలకు హాజరయ్యారు. 9వ తరగతికి సంబంధించి 17975 మంది తెలుగుమీడియం, 25250 మంది ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు మొత్తం 43225 మంది పరీక్షలు రాశారు. అయితే ఇటీవల విద్యాశాఖ మీద ఫలితాల ఒత్తిడి పెరుగుతుండడంతో హడావుడిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెబ్సైట్లో ఫలితాలు ఉంచారు. 8వ తరగతిలో 13087 మంది విద్యార్థులు తెలుగుమీడియం, 2039 మంది ఆంగ్ల మా«ధ్యమ వివరాలను పాఠశాలల వారీగా అందుబాటులో ఉంచారు. ఇంకా 31699 మంది ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. అలాగే 9వ తరగతిలో 43225 మందిలో 14553 మంది విద్యార్థుల ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. 8, 9 తరగతుల విద్యార్థులు కలిపి మొత్తం 46252 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే అవి ఎప్పుడు వెల్లడవుతాయనేది మాత్రం తెలియని పరిస్థితి నెలకొంది. బేజారెత్తిస్తున్న ఫలితాలు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నాపత్రాల రూపకల్పన విద్యార్థుల సామర్థ్యాలకు మించి ఇచ్చారన్న విమర్శలు పరీక్షల సమయంలోనే బాహాటంగా వినిపించాయి. అందులో భాగంగా వెలువడిన పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే 8వ తరగతికి సి2 గ్రేడు లభించగా 9వ తరగతికి సి1 గ్రేడు లభించాయి. గణితంలో అయితే ఏకంగా 8, 9 తరగతులు రెండింటిలోనూ డీ1 గ్రేడులు రావడం పడిపోతున్న గణిత సామర్థ్యాలకు ప్రతీకగా భావించాలా లేక గణిత ప్రశ్నాపత్రం విద్యార్థుల సామర్థ్యానికి మించి రూపొందించారా అనే దానిపై కూలంకష చర్చ జరగాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. -
హాల్‌టికెట్ చూపిస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
సాక్షి, మచిలీపట్నం: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 268 కేంద్రాల్లో ఈ నెల 15 నుంచి పరీక్షలు జరగనున్నాయి. 57,127 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో రెగ్యులర్ 56,035 మందికాగా, ప్రైవేట్ 1092 మంది ఉన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు జరగనున్నాయి. మాస్‌కాపీయింగ్‌కు తావులేండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 268 కేంద్రాలకు 268 చీప్ సూపరింటెండెంట్ అధికారులను నియమించారు. 268 డిపార్ట్మెంటర్ అధికారులు, 62 మంది కస్టోడియన్, 62 మంది చీఫ్ కస్టోడియన్, 2950 మంది ఇన్విజిలేటర్లు, 14 ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు పరీక్షలను పర్యవేక్షిస్తారు. 62 పోలీస్ స్టేషన్లలో ప్రశ్నపత్రాలు భద్ర పరిచారు. జిల్లాలోని ఐదు సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఈవో తెలిపారు. జిల్లాలోని ఘంటసాల మండలం శ్రీకాకుళం జిల్లా పరిషత్ హైస్కూల్, బంటుమిల్లి గరŠల్స్ హైస్కూల్‌తో పాటు జగ్గయ్యపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, పెనుగంచిప్రోలు బాలికల ఉన్నత పాఠశాల, ఆగిరిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిబంధనలు ఇవీ.. ♦ జంబ్లింగ్ పద్ధతిలో ఇన్విజిలేర్లను కేటాయిస్తారు. ♦ ఇన్విజిలేటర్లు, ఉపాధ్యాయేతర సిబ్బందికి పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు అనుమతించరు. ♦ విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, స్టడీ మెటీరియల్, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు తీసుకురాకూడదు. ♦ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8.45 గంటలలోపు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలి. ♦ విద్యార్థినులకు తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా మహిళా ఇన్విజిలేటర్లు నియమించారు. ♦ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు వుంటే వాటిని పరీక్ష నిర్వహించే సమయం వరకు మ్యూట్‌లో ఉంచాలి. ♦ పరీక్షా కేంద్రంలో ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉంటే.. పరీక్ష కేంద్రం వద్ద ప్రైవేటు పాఠశాలల సిబ్బంది ఉండకూడదు. ♦ విద్యార్థులను నేలమీద పరీక్ష రాయిస్తే చర్యలు తప్పవని, బెంచీల మీద, సౌకర్యాలున్న గదుల్లోనే పరీక్షలు రాయించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి సెంటర్ నిర్వాహకులకు ఆదేశాలందాయి. పటిష్ట బందోబస్తు :జిల్లా ఎస్పీసర్వశ్రేష్ట్ర త్రిపాఠి కోనేరుసెంటర్: పదో తరగతి పరీక్షలను పురస్కరించుకుని జిల్లాలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట్రతిపాఠి తెలిపారు. విద్య, వైద్య, ఆర్టీసీ అధికారుల సమన్వయంతో పోలీసులు పని చేసేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ట్రాఫిక్‌పరంగా సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సమీపంలోని పోలీసు సేవలను ఉపయోగించుకోవచ్చని సూచించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల గుంపులుగా కనిపిస్తే పోలీసు చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్, మీసేవా సెంటర్లను మూసివేయిస్తామని పేర్కొన్నారు. -
విద్యార్థికి విషమ ‘పరీక్ష’
అయితే రేకుల షెడ్డు... లేదా పెచ్చులూడే పైకప్పు.. ఫ్యాన్ అనే వస్తువే కనిపించని కేంద్రాలు.. బెంచీలకూ దిక్కులేని పాఠశాలలు...ఇలా కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పాఠశాలలను విద్యాశాఖ అధికారులు ‘పది’ పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసేశారు. ఈ ఏడాదీ పదో తరగతి విద్యార్థులువిషమ పరీక్ష ఎదుర్కోనున్నారు. అనంతపురం ఎడ్యుకేషన్: ఓ పాఠశాలను పదో తరగతి పరీక్ష కేంద్రంగా ఏర్పాటు చేయాలంటే అందులో అన్నీ సదుపాయాలు ఉండి విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలి. ముఖ్యంగా ఫర్నీచర్, వెలుతురు, మరుగుదొడ్లు, తాగునీరు తదితర ఇబ్బందులు లేని స్కూళ్లు, కళాశాలలను కేంద్రాలుగా వేయాలి. ముఖ్యంగా అధికారులు పరిశీలించి అనుకూలంగా ఉన్నట్లు ధ్రువీకరించుకన్న తర్వాతే కేంద్రాలుగా సిఫార్సు చేయాల్సి ఉంది. అయితే విద్యార్థులు సౌకర్యమేమో తెలీదుకాని కొందరు ప్రైవేట్ స్కూళ్ల యాజమానులు, అధికారులకు సౌకర్యవంతంగా ఉండేలా కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనంతపురం నగరం రుద్రంపేట సమీపంలోని ఓ కేంద్రాన్ని పరిశీలిస్తే అధికారులు ఏస్థాయిలో లాలూచీ పడ్డారనేది స్పష్టమవుతోంది. ఈ కేంద్రంలో గదులన్నీ రేకులషెడ్డులే. అసలే ఎండాకాలం. వేసవి తాపానికి విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడతారో ఊహించుకుంటేనే భయమేస్తోంది. ఇదొక్కటే కాదు జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి. గుణ‘పాఠం’ నేర్చుకోని వైనం పదో తరగతి పరీక్షల నిర్వహణలో గత అనుభవాలతో అధికారులు గుణపాఠాలు నేర్చుకోలేదు. ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 189 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 50,989 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు విద్యార్థులను వెక్కిరించనున్నాయి. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అనంతపురం నగరంలోనే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో బల్లలను సమకూర్చలేని పరిస్థితి. దీనికితోడు రేకుల షెడ్లు, ఇరుకిరుకు గదులున్న పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తుండడంతో విద్యార్థులకు ఉక్కపోత కష్టాలు తప్పేలా లేవు. మరికొన్ని కేంద్రాల్లో పిల్లలకు వెలుతురు సమస్యా వెంటాడుతోంది. సదుపాయాలు ఉన్నా... విస్మరించారు కొన్ని స్కూళ్లు పరీక్షల నిర్వహణకు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. అలాంటి వాటిని పక్కనపెట్టి ఏమాత్రం సదుపాయాలు లేని కేంద్రాల పట్ల అధికారులు ఆసక్తి చూపడంలో మతలబేమిటో. అన్ని శాఖల ముఖ్య అధికార యంత్రాంగం ఉండే జిల్లా కేంద్రంలోనే ఈ రకంగా ఉంటే ఇక రూరల్ ప్రాంతాల్లో కేంద్రాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల్లో బల్లల కొరత నగరంలో నగరపాలక ఉన్నత పాఠశాల్లో తప్ప ఫర్నీచర్ మిగతా ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నీచర్ అరకొరగా ఉంది. కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో 260 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో సగానికి సరిపడే ఫర్నీచర్ కూడా లేదు. అలాగే పాతూరు నంబర్–2 స్కూల్లోనూ ఇదే పరిస్థితి. ఈ కేంద్రంలో 300 మంది విద్యార్థులను కేటాయించారు. ఫర్నీచరు వందమందికి కూడా సరిపడేలా లేదు. ఇలాగే కొన్ని ప్రైవేట్ స్కూళ్ల సెంటర్లదీ ఇదే పరిస్థితి. ఫర్నీచరు అద్దెకు తెచ్చుకునేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించినా అది కేంద్రాల వరకు చేరడం లేదు. అధికారుల ఆదేశాలతో ఆయా కేంద్రాల నిర్వాహకులు చేతి నుంచి పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మొత్తం 189 పరీక్షా కేంద్రాలకు గాను 96 కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఫర్నీచర్ ఉంది. 14 కేంద్రాల్లో అరకొర, 79 కేంద్రాల్లో అసలే లేదు. సమస్యలు అధిగమిస్తాం పదోతరగతి పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. రెవెన్యూ, పోలీసు, రవాణా, విద్యాశాఖ అధికారులంతా సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఇక నీటివసతి, ఫర్నీచర్ తదితర సౌకర్యాల కోసం చర్యలు తీసుకుంటాం. – జనార్దనాచార్యులు, డీఈఓ -
‘13న యథావిధిగా ఇంటర్ పరీక్షలు’
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల 13వ తేదీన ఎమ్మార్పీఎస్ బంద్‌కు పిలుపునిచ్చిన దృష్ట్యా ఆరోజు జరగనున్న ఇంటర్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న 1,294 కేంద్రాల్లో కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పరీక్షలను వాయిదా వేస్తే ఆ ప్రభావం నీట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలపై పడుతుందని వివరించింది. పరీక్షల నిర్వహణకు అందరూ సహకరించాలని బోర్డు కోరింది. -
యంగ్ ఫ్రెండ్స్.. బెస్ట్ ఆఫ్ లక్
సాక్షి, న్యూఢిల్లీ: పరీక్షల కాలం మొదలైంది. ఏడాది పాటు పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాలు.. వాటి ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని ప్రదర్శించేందుకు, మంచి మార్కులు సొంతం చేసుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. వారిలో ధైర్యం, ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. టెన్త్ క్లాస్, 12 వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు 'బెస్ట్ ఆఫ్ లక్' చెబుతూ సోమవారం మోదీ ట్వీట్ చేశారు. చిరునవ్వు, విశ్వాసంతో పరీక్షలు రాయాలని ఆయన ట్విటర్లో సూచించారు. Best of luck to all my young friends appearing for the CBSE Class XII and Class X examinations! Write these exams with a smile and lots of confidence. — Narendra Modi (@narendramodi) March 5, 2018 -
కంప్యూటర్‌తో పరీక్షలు
న్యూఢిల్లీ: 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో దివ్యాంగ విద్యార్థులు (ప్రత్యేక అవసరాలున్నవారు) కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వాడుకోవడానికి సీబీఎస్ఈ అనుమతించింది. ఈ ఏడాది నుంచే ఈ వెసులుబాటు అమల్లోకి రానున్నట్లు ఒక అధికారిక ప్రకటన వెలువడింది.పరీక్షా కేంద్రంలో సదరు విద్యార్థి కంప్యూటర్ వినియోగించుకోవచ్చని సిఫార్సు చేస్తూ అర్హుడైన వైద్యుడు సర్టిఫికేట్ జారీచేయాల్సి ఉంటుంది. అలా సిఫార్సు చేయడానికి తగిన కారణాలను అందులో పేర్కొనాలి. విద్యార్థి ఈ సర్టిఫికేట్‌ను పరీక్షా సమయంలో సమర్పించాలి. సమాధానాలు టైప్ చేయడానికి, ప్రశ్నలను వినడానికి, వాటిని పెద్ద అక్షరాల్లో చూడటానికి మాత్రమే కంప్యూటర్ వినియోగాన్ని పరిమితం చేయాలని సీబీఎస్ఈ పేర్కొంది. విద్యార్థి ఫార్మాట్ చేసిన కంప్యూటర్/ల్యాప్‌టాప్‌ను తానే సొంతం గా వెంట తెచ్చుకోవాలని వెల్లడించింది. కంప్యూటర్ టీచర్ ఆ కంప్యూటర్ను పరీక్షించిన తరువాతే పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ దాన్ని అనుమతించాలని తెలిపింది. ఆ కంప్యూటర్‌కు ఇంటర్నెట్ ఉండొద్దని షరతు విధించింది. పరీక్ష రాసే సహాయకుడి బదులు ప్రశ్నా పత్రం చదివి వినిపించే రీడర్ కావాలన్నా తీసుకునే ప్రతిపాదనకూ సీబీఎస్ఈ అంగీకరించింది. -
ఏపీలో ఇంటర్ పరీక్షలు
-
తెలంగాణలో నేటి నుండి ఇంటర్ పరీక్షలు
-
ఎగ్జామ్స్ గైడ్
పరీక్షలొచ్చేస్తున్నాయి. పరీక్షలకు సిద్ధపడే పిల్లలకే కాదు, వారి తల్లిదండ్రులకూ పరీక్షలంటే ఎంతో కొంత ఆందోళన సహజం. ఏడాది పాటు నేర్చుకున్న పాఠాలను, వాటి ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని ప్రదర్శించి, మంచి మార్కులు సాధించడానికి పరీక్షలు ఒక అవకాశం. కొందరు విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా సిలబస్ పూర్తి చేసి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధపడితే, చాలామంది విద్యార్థులు పాఠాలు చదువుకున్నా, పరీక్షల్లో సరిగా రాయగలమో లేదోననే ఆందోళనతో సతమతమవుతుంటారు. తరగతి గదుల్లో బాగా రాణించే విద్యార్థులు సైతం ఆందోళన కారణంగా పరీక్షల్లో ఆశించిన ఫలితాలను సాధించలేక పోతుంటారు. పరీక్షల గురించి ఆందోళన చెందడం వల్ల ఫలితం చెడుతుందే తప్ప ప్రయోజనం ఉండదు గానీ, కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఒత్తిడి నుంచి బయటపడి పరీక్షల్లో ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. సమయం శరణం గచ్ఛామి పరీక్షల్లో ఒత్తిడిని అధిగమించడానికి, సత్ఫలితాలు సాధించడానికి కీలకమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే ఉంటుందని విద్యారంగ నిపుణులు, మానసిక శాస్త్ర నిపుణులు ముక్తకంఠంతో చెబుతున్న మాట. పరీక్షలకు సంసిద్ధమయ్యేటప్పుడు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై వారు చేస్తున్న సూచనలు కొన్ని... ∙చదవాల్సిన అంశాలను వాయిదా వేయడం తగదు. ముందుగా సిద్ధం చేసుకున్న నోట్సును శ్రద్ధగా పునశ్చరణ చేసుకోవడం ద్వారా పరీక్షల సమయంలో ఒత్తిడి చెందకుండా జాగ్రత్త పడాలి. ∙మిత్రులతో బాతాఖానీ, టీవీ చూస్తూ కూర్చోవడం, సోషల్ మీడియా చాటింగ్, సినిమాలు, షికార్లు, వీడియోగేమ్స్ వంటి కాలాన్ని హరించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ∙సిలబస్ కొండలా కనిపించినా నిర్ణీత టైమ్‌టేబుల్‌ను కచ్చితంగా అమలు చేస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలను ఇట్టే రాయవచ్చు. ∙రోజూ నిర్ణీత సమయం ప్రకారం చదవాలి. ఏకధాటిగా గంటల తరబడి చదవడం వల్ల అలసట అనిపించవచ్చు. అలాంటప్పుడు కొద్దిసేపు మనసుకు నచ్చిన పనులు చేస్తూ రిఫ్రెష్ అయి మళ్లీ చదవడం మొదలుపెట్టాలి. ∙నిద్ర, కాలకృత్యాలు, ఆహారం తీసుకోవడం, స్వల్ప విరామం వంటివన్నీ పోయినా, రోజుకు కనీసం పది గంటల సమయం ఉంటుంది. విద్యార్థులు ఆ పదిగంటల సమయాన్నీ గరిష్టంగా చదువు కోసమే వినియోగించుకునేలా చూసుకోవాలి. ∙ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు వంటి గాడ్జెట్స్‌కు దూరంగా ఉండటం క్షేమం. వీటి వల్ల సమయం వృథా కావడమే కాకుండా, చదువుపై ఏకాగ్రత దెబ్బతింటుంది. ∙రిలాక్సేషన్ కోసం కొద్దిసేపు ఆటలు ఆడటం, డ్యాన్స్, స్విమ్మింగ్ వంటివి చేయడం మంచిది. వీటి వల్ల చురుకుదనం పెరుగుతుంది. అనుకూల వాతావరణం చుట్టూ అనుకూల వాతావరణం ఉన్నప్పుడే ఎవరైనా పనులు సజావుగా చేయగలరు. విద్యార్థులు కూడా అంతే. ఒకే చోట కూర్చుని గంటల తరబడి చదువుకోవాలంటే ఎవరికైనా కష్టమే. పిల్లలు చదువుకునే గదిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. గదిలోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉంటే చదువుపై ఉత్సాహం పెరుగుతుంది. పుస్తకాల ర్యాక్‌లో పాఠ్యపుస్తకాలతో పాటు మానసిక ఉత్తేజాన్ని ఇచ్చే మంచి సాహిత్యం, మెదడుకు పదునుపెట్టే పజిల్స్‌కు సంబంధించిన పుస్తకాలు, పదసంపదను పెంపొందించే నిఘంటువులు వంటివి కూడా ఉండేలా చూసుకోవాలి. ప్రణాళికతో కూడిన సాధనే కీలకం పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి ప్రణాళికతో కూడిన సాధనే కీలకం. విద్యా ప్రమాణాలను గుర్తించి భిన్న కోణాల్లో ఆలోచించి రాసే జవాబులను వాక్య పరిమితిని పాటిస్తూ నోట్స్ తయారు చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రతి సబ్జెక్టులోనూ ప్రతి పాఠ్యాంశమూ ఫలితాల సాధనలో కీలకమైనవే. చాలామంది విద్యార్థులు ఏయే చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి? ఏవి ముఖ్యమైనవి? అని అడుగుతూ ఉంటారు. పాఠ్యాంశాల్లో కీలకమైనవి, ప్రాధాన్యం లేనివి అంటూ ఏవీ ఉండవు. అన్నీ కీలకమైనవే. ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందే. గతంలో అడిగిన ప్రశ్నలను గుర్తుచేసుకుని, వాటిని ఇంకా ఎన్ని విధాలుగా అడిగే అవకాశాలు ఉన్నాయో అవగాహన చేసుకోవాలి. పాఠ్యాంశాల్లో ఉన్న చిత్రాలు, గ్రాఫ్‌లు, పట్టికల్లో ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా చదివి పూర్తి చేయాలి. కీలకమైన పదాల అభ్యసనాన్ని మెరుగు పరచుకోవాలి. కఠిన పదాలు ఎదురైనప్పుడు ఉపాధ్యాయులను లేదా పెద్దలను అడిగి తెలుసుకోవాలి. లేకుంటే డిక్షనరీలు తిరగేయడం ద్వారా వాటి అర్థాలను తెలుసుకోవాలి. తరగతిలో జరిగే చర్చల్లో పాల్గొనడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా పరీక్షల్లో సులువుగా జవాబులను రాయవచ్చు. పరీక్షలకు ముందుగానే తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుని, దానికి పూర్తిగా కట్టుబడి చదువు సాగించేటట్లయితే చివరి నిమిషంలో ఆందోళన చెందాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉంటుంది. ఇలా ప్రణాళిక వేసుకోవాలి పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు మంచి ఫలితాలను సాధించడానికి అందుకు తగిన ప్రణాళికను ఎలా వేసుకోవాలనే దానిపై విద్యారంగ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైన సూచనలు... ∙మీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో, పరీక్షలు మొదలవడానికి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయో చూసుకోవాలి. ∙ఒక్కొక్క సబ్జెక్టుకు ఎన్ని రోజులు కేటాయించడం సాధ్యమవుతుందో లెక్క వేసుకోవాలి. చేతిలో ఉన్న డబ్బును ఖర్చు చేయడానికి బడ్జెట్ వేసుకున్నట్లే పరీక్షల కోసం కచ్చితమైన టైమ్ టేబుల్ వేసుకోవాలి. ∙కొన్ని సబ్జెక్టులు సులభంగా అనిపిస్తాయి. కొన్ని సబ్జెక్టులు కష్టంగా అనిపిస్తాయి. అలాంటప్పుడు సులభంగా పూర్తి చేయగలమనుకునే సబ్జెక్టులకు సిద్ధపడాల్సిన రోజులు తగ్గించుకుని, కష్టంగా అనిపించే సబ్జెక్టులకు ఎక్కువ రోజులు కేటాయించుకోవాలి. ∙రోజుకు ఎన్ని గంటలు చదవడానికి కేటాయించగలమనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. సబ్జెక్టుల కోసం కేటాయించే వ్యవధిని సహేతుకంగా లెక్క వేసుకుని, వీలైనంత వరకు దానికి కట్టుబడి ఉండాలి. ∙చదువుకునే సమయాన్ని, రిలాక్స్ అయ్యే సమయాన్ని, రివిజన్ చేసుకునే సమయాన్ని, నిద్రకు కేటాయించే సమయాన్ని హేతుబద్ధంగా విభజించుకుని, ఆ టైమ్ టేబుల్‌కు కట్టుబడి పరీక్షలకు సమాయత్తం కావాలి. పాజిటివ్‌గా ఆలోచించాలి పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులు ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతోనే ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా వారిని పాజిటివ్ దృక్పథంతోనే ప్రోత్సహించాలి. ‘అమ్మో! ఇంత సిలబస్ ఉంది. ఎప్పుడు చదవాలి? ఎలా పూర్తి చేయాలి? ఇదంతా గుర్తు పెట్టుకోగలనా?’ అని బెంబేలెత్తిపోకుండా, ‘ఇదంతా నేను చక్కగా చదివి అర్థం చేసుకోగలను. బాగా జ్ఞాపకం ఉంచుకోగలను’ అనే భావనను పెంపొందించుకోవాలి. ఈ భావన కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. పరీక్షల సమయంలో పిల్లలు బాగా ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు వారిని మరింత ఒత్తిడికి లోను చేయకుండా ఉండాలి. ‘ఈ పాఠం ఎప్పుడు పూర్తి చేస్తావు? ఇంతసేపు చదివినా ఆ పోయెమ్ రాదు. ఇక ఎగ్జామ్ ఎలా రాస్తావు?’ అంటూ వారిలో మరింతగా భయాందోళనలను సృష్టించరాదు. తల్లిదండ్రులే సంయమనాన్ని కోల్పోయి పిల్లలను ఒత్తిడికి గురిచేస్తే వారిలో నెగెటివ్ ఆలోచనలు పెరుగుతాయి. ఈ పరీక్షలు రాయడం తన వల్ల కాదనుకునే పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి పరిస్థితి తలెత్తితే వారు తమకు వచ్చిన అంశాలను కూడా కంగారులో మర్చిపోతారు. ఇక పిల్లలు చదువుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు టీవీలు చూస్తూ , కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం వంటి పనులకు దూరంగా ఉండాలి. ఇలాంటి పనుల వల్ల పిల్లల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఒత్తిడిని ఇలా జయించండి పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని జయించడానికి పలువురు మానసిక శాస్త్ర నిపుణులు, యోగా నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఈ సూచనలను పాటించినట్లయితే ఒత్తిడి, ఆందోళన లేకుండా పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించవచ్చని వారు చెబుతున్నారు. ∙ఉపాధ్యాయులైనా, తల్లిదండ్రులైనా ‘పరీక్షలంటే యుద్ధం’ అనే భావనను పిల్లల్లో రేకెత్తించరాదు. వారి సామర్థ్యాన్ని గుర్తించి, వారి వెన్నంటే ఉండి, సామర్థ్యానికి తగిన ఫలితాలను రాబట్టేలా పిల్లలను ప్రోత్సహించడం కొనసాగించాలి. ∙ఒత్తిడి అనిపించినప్పుడు పిల్లలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుని, ఐదు నుంచి పది అంకెల వరకు లెక్కపెట్టిన తర్వాత శ్వాసను వదలడం ద్వారా ఒత్తిడి నుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. ∙కొందరు పిల్లలు పరీక్ష హాలుకు వెళ్లేంత వరకు చదువుతూనే ఉంటారు. చివరి నిమిషం వరకు చదివితే బాగా రాసేస్తారని అనుకోవడం సరికాదు. చివరి నిమిషం ఒత్తిడిలో ఉన్నప్పుడు చదవడం వల్ల వచ్చిన విషయాలను కూడా మర్చిపోతారు. పరీక్ష హాలుకు వెళ్లడానికి కనీసం రెండు గంటల ముందు నుంచి చదవడం మానేస్తే మంచిది. ∙కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ వంటి పానీయాలకు దూరంగా ఉండటమే మంచిది. ఇలాంటివి తాగడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందనుకోవడం ఉత్త భ్రమ మాత్రమే. కెఫీన్ మోతాదు పెరిగితే ఆలోచనల్లోని స్పష్టత లోపించే ప్రమాదం ఉంది. ∙పరీక్షల కోసం సిద్ధపడే విద్యార్థులు చదువు సాగించేటప్పుడు ప్రతి గంటకు పది నిమిషాలు విరామం తీసుకోవడం మంచిది. విరామ సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడటం, టీవీ చూడటం వంటి పనుల ద్వారా రిలాక్సేషన్ పొంది మళ్లీ చదువు కొనసాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ∙చదువు సాగించేటప్పుడు విజువలైజేషన్ టెక్నిక్ బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కళ్లు మూసుకుని పరీక్ష హాలులోనే ఉన్నట్లు ఊహించుకోండి. ప్రశ్నపత్రం తీసుకున్నట్లు, అన్నీ మీకు తెలిసిన ప్రశ్నలే వచ్చినట్లు ఊహించుకోండి. ఇలా చేయడం వల్ల మీలో పాజిటివ్ దృక్పథం దానంతట అదే పెరుగుతుంది. పాజిటివ్ ఆలోచనలు మీరు మంచి ఫలితాలను సాధించడానికి దోహదపడతాయి. ప్రశాంతంగా నిద్రించండి పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే చాలామంది విద్యార్థులు అర్ధరాత్రి దాటేంత వరకు చదువుతూ జాగారాలు చేస్తుంటారు. ఇలా జాగారాలు ఉండటం కంటే రోజూ కనీసం ఆరేడు గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. నిద్రలోనే మెదడుకు మంచి విశ్రాంతి లభిస్తుంది. నిద్రించేటప్పుడు ‘సెరటోనిన్’ ఎంజైమ్ చురుగ్గా స్రవిస్తుంది. దీనివల్ల అభ్యసన సామర్థ్యం, జ్ఞాపకశక్తి దానంతట అదే పెరుగుతుంది. తగినంత విశ్రాంతి తర్వాత చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని, కంటి నిండా నిద్రపోయే వారే ఎక్కువ పదాలను గుర్తుంచుకోగలరని పలు పరిశోధనల్లో ఇప్పటికే రుజువైంది. అందువల్ల పరీక్షల సమయంలో విద్యార్థులు రోజూ కనీసం ఆరేడు గంటల సేపు ప్రశాంతంగా నిద్రపోవాలి. ‘బట్టీ’ విక్రమార్కులు కావద్దు పాఠాలను కేవలం బట్టీ పట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇదివరకటి పద్ధతిలో ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను బట్టీ పట్టేస్తే పరీక్షలు గట్టెక్కేసే అవకాశాలు ఉండేవి. ప్రస్తుత విధానంలో అన్ని పాఠాలను విధిగా చదివి అవగాహన చేసుకోక తప్పదు. పాఠ్య పుస్తకంలోని ప్రతి అంశాన్నీ, ప్రతి భావనను సమగ్రంగా అవగాహన చేసుకుని సమాధానాలను రాయాలి. ప్రశ్నలకు సూటిగా సమాధానాలు రాయడానికి బదులు బహుళ సమాధానాలు వచ్చేలా ప్రశ్నల స్వభావం ఉంటుంది. ఒకసారి పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు తదుపరి సంవత్సరాల్లో జరిగే పరీక్షల్లో పునరావృతమయ్యే అవకాశాలు దాదాపు ఉండవు. అందువల్ల బట్టీ విధానం కంటే, పాఠాలను అర్థం చేసుకుంటూ అధ్యయనం సాగించడమే మేలు. ఎగ్జామ్స్ మేడిన్ చైనా... పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏదో ఒక దశలో ‘ఈ పరీక్షలు ఎవడు కనిపెట్టాడ్రా బాబూ! అనుకోకుండా ఉండరు. పరీక్షలు కనిపెట్టిన మహానుభావుడు ఎవరో ఇదమిత్థంగా తెలియకపోయినా, అతగాడిని నోరారా తిట్టుకుంటూ ఉంటారు. ఇటీవల కొందరు ఔత్సాహికులు హెన్రీ ఫిషెల్ అమెరికన్ అనే తత్వవేత్త ఫొటో సామాజిక మాధ్యమాల్లో పెట్టి, విద్యార్థులను వేధించడానికి పరీక్షలు కనిపెట్టిన కఠినాత్ముడు, క్రూరాత్ముడు ఇతగాడేనంటూ ప్రచారం సాగిస్తున్నారు. జర్మనీలో పుట్టి, అమెరికాలో స్థిరపడ్డ హెన్రీ ఫిషెల్ ఈ విషయంలో ఎలాంటి పాపమూ ఎరుగడు. ఈ పెద్దమనిషి ఇరవయ్యో శతాబ్దికి చెందిన తత్వవేత్త. పరీక్షల విధానం అంతకు చాలా పూర్వం నుంచే వాడుకలో ఉండేది. మొట్టమొదటగా చైనాలోని సుయి వంశీకుల పాలనలో క్రీస్తుశకం 605 సంవత్సరంలో పరీక్షల విధానం అమలులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల ఎంపిక కోసం ఈ పద్ధతి వాడుకలోకి వచ్చింది. కింగ్ వంశీకులు ఈ పద్ధతిని 1905లో రద్దు చేశారు. అయితే, క్రీస్తుశకం 1806లో బ్రిటిష్ పాలకులు పరీక్షల పద్ధతిని తొలిసారిగా యూరోప్‌లో ప్రవేశపెట్టారు. సివిల్ సర్వీస్ అభ్యర్థుల ఎంపిక కోసం ప్రవేశపెట్టిన ఈ పరీక్షల పద్ధతి శరవేగంగా ఇతర దేశాలకూ వ్యాపించింది. ఉద్యోగాలకు తగిన అభ్యర్థుల ఎంపిక కోసమే కాకుండా, పాఠశాలలు మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు తరగతుల్లో ఉత్తీర్ణులను నిర్ధారించడానికి సైతం పరీక్షలు నిర్వహించడం వాడుకలోకి వచ్చింది. రియలిస్టిక్ ప్లాన్ ఉండాలి! పరీక్షలనగానే పిల్లలకు కాస్తంత భయం, ఒత్తిడి ఉండడం ఆరోగ్యకరమైన విషయమే! అసలు ఏమాత్రం భయం లేకున్నా పరీక్షలంటే సీరియస్‌నెస్ పోతుంది. అయితే ఇది స్థాయి దాటి ఎక్కువ ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తేనే ప్రమాదం. ఒత్తిడి ఎక్కువ అవ్వడం అన్నది సాధారణంగా అందరిలోనూ చూస్తూంటాం. ఇది ముఖ్యంగా పరీక్షలు దగ్గరవుతున్న కొద్దీ ఎక్కువవుతూ ఉంటుంది. పరీక్ష రోజు, ఆ ముందు రోజే కాకుండా ముందు నుంచే చదవడం మొదలుపెడితే పరీక్షల సమయంలో ఒత్తిడిని తప్పించుకోవచ్చు. అలాగే పరీక్షల సమయంలో ‘రోజుకు ఇన్ని గంటలు చదివేస్తా. అన్ని చాప్టర్లూ ఫినిష్ చేసేస్తా..’ లాంటివి పెట్టుకోకుండా, రియలిస్టిక్ ప్లాన్ ఉంటే మంచిది. నిద్ర, ఆహారాలు మాని చదవడం ప్రమాదకరం. నిజానికి పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించడానికి ఇంకాస్త ఎక్కువ నిద్రే అవసరం. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదవమని ఒత్తిడి పెంచొద్దు. ఫిజికల్ ఎక్సర్సైజ్ పరీక్షల సమయంలో కొందరు స్కిప్ చేస్తుంటారు. కానీ దానివల్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది. పాజిటివ్ ఆటిట్యూడ్‌ను ఎప్పటికీ వదులుకోవద్దు. – డా. పద్మ పాల్వాయి, చైల్డ్ సైకియాట్రిస్ట్ టైమ్ టేబుల్ వేస్కొని చదువుతున్నా! పరీక్షలు దగ్గరైపోయాయి. ఇప్పటికే ఏయే సబ్జెక్ట్స్ ఎలా ఎలా చదవాలో టైమ్ టేబుల్ వేస్కున్నా. మ్యాథ్స్ కొంచెం టఫ్ సబ్జెక్ట్. ఫ్రెండ్స్ కూడా అదే అంటారు. ఏది కష్టమో ఆ సబ్జెక్ట్‌కు ఎక్కువ టైమ్ ఇచ్చి చదువుతున్నా. కొంచెం భయమైతే ఉంది కానీ, ఇంట్లో, స్కూల్లో అందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అమ్మ వాళ్లైతే ఇప్పుడు ఏ పనీ చెప్పడం లేదు కూడా. బాగా రాస్తానన్న నమ్మకం ఉంది. అందరికీ ఆల్ ది బెస్ట్. – దేవర ఉదయ్‌కిరణ్, పదో తరగతి విద్యార్థి టెక్ట్స్ బుక్స్ బాగా చదవాలి! పరీక్షల సమయంలో పిల్లలు బాగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. బాగా చదివిన విద్యార్థులు కూడా ‘చదివినవన్నీ గుర్తుంటాయా?’ అని ఆందోళన పడుతూంటారు. అందుకే రోజూ ధ్యానం చేస్తే ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి. ముఖ్యంగా పరీక్ష రోజు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతబాగా పరీక్ష రాయగలరని తెలుసుకోవాలి. ఆహారం, నిద్ర విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రోజ్ మిల్క్, ఆయిల్ తక్కువగా ఉండే వంటకాలు, పండ్లు, కూరగాయలను పిల్లల డైట్లో చేరిస్తే బాగుంటుంది. పిల్లలు బట్టీ పట్టకుండా కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుంటూ వెళితే మంచి ఫలితాలు సాధిస్తారు. టెక్స్›్టబుక్స్ బాగా చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు. – లక్ష్మీ శారద, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు -
నేటి నుంచి టీఆర్టీ పరీక్షలు
-
టెట్ రాస్తున్నారా..
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)–2018కు హాజరయ్యే అభ్యర్థులు పూర్తిగా సన్నద్ధంకావాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లాలో 18 కేంద్రాల్లో బుధవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. కంప్యూటర్ బేస్డ్గా నిర్వహించే ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కొన్ని సూచనలు పాటించాలని సూచించారు. ♦ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలి. ♦ హాల్ టిక్కెట్‌పై ఉన్న పరీక్ష కేంద్రం, తేదీ, సమయం, రిజిస్టర్ నంబరు సరిచూసుకోవాలి.. ♦ అడ్మిట్ కార్డుపై ఉన్న పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ‘లాగిన్’ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కంప్యూటర్లో ఉన్న వివరాలు సరిచూడాలి. అన్నీ సరిగా ఉంటే ‘కన్ఫర్మ్’ అని, లేకుంటే ‘ఐ డెనీ’ అని క్లిక్ చేయాలి. ♦ కంప్యూటర్ బాగా పనిచేస్తుందని, వివరాలు అందుబాటులో ఉన్నాయని క్లిక్ చేయాలి. ♦ అనంతరం నేను ప్రారంభించుటకు సిద్ధంగా ఉన్నాను అని క్లిక్ చేయాలి. ♦ ఇచ్చిన నాలుగు జవాబుల నుంచి సరైన దాన్ని ఎన్నుకొని క్లిక్ చేయాలి. ♦ పరీక్ష రాస్తున్నప్పుడు మిగిలిన సమయం కంప్యూటర్లో పరిశీలించవచ్చు. ♦ జవాబు రాయని ప్రశ్నలు ఎరుపు, ప్రయత్నించని ప్రశ్నలు తెలుపు, ప్రయత్నించిన ప్రశ్నలు ఆకుపచ్చ, పునఃపరిశీలనకు గుర్తించిన ప్రశ్నలు, జవాబు ఇచ్చిన ప్రశ్నలు ఊదా రంగులలో కనిపిస్తాయి. ♦ ప్రశ్నకు జవాబు రాసిన అనంతరం ‘సేవ్’ తర్వాత ‘నెక్స్›్ట’ బటన్ నొక్కాలి. ♦ కుడివైపు సెక్స్న్ బటన్ నొక్కడం వల్ల జవాబు ఇచ్చిన, ఇవ్వని, పునఃపరిశీలన ప్రశ్నలు కనిపిస్తాయి. ♦ కంప్యూటర్లో ఇచ్చిన అక్షరాల సైజు కనిపించకపోతే వెంటనే ఇన్విజిలేటరు దృష్టికి తీసుకెళ్లాలి. ♦ పరీక్ష సమయం 2.30 గంటలు పూర్తి కాగానే ‘సబ్మిట్’ అని బటన్ యాక్టివేట్ చేయాలి. ♦ దృష్టి లోపం ఉన్నవారికి, అంగవికలాంగులకు అదనంగా 50 నిమిషాలు సమయం ఇవ్వనున్నారు. -
రాత్రి పెళ్లి.. ఉదయం ఇంటర్ పరీక్ష!
ఆగ్రా : పెళ్లి కాగానే చాలామంది మహిళలు చదువును పక్కనపెట్టేస్తారు. ఇక పెళ్లి జరుగుతున్న సమయంలో అసలు చదువు ఆలోచనే రాదు. ఒకవేళ వచ్చినా కుటుంబసభ్యులు అందుకు అంగీకరించే సందర్భాలు అరుదు. సుదీర్ఘంగా సాగే పెళ్లితంతు మధ్య చదువు అటకెక్కడం ఖాయం. పెళ్లి సమయంలో పరీక్షలు ఉన్నా.. వాటిని పక్కనపెట్టాల్సిందే. పెళ్లికూతురిని చేయడం, మెహిందీ పెట్టడం.. పూజలు చేయడం.. తెల్లవార్లూ ఈ తంతు కొనసాగుతూనే ఉంటుంది. ఇంతటి సందడి మధ్య కూడా ఓ యువతి చదువును నిర్లక్ష్యం చేయలేదు. పరీక్షలేం రాస్తామని పక్కన పెట్టలేదు. ఏడాది పొడవునా చదివిన చదువును గౌరవిస్తూ.. పెళ్లయిన తెల్లారే.. పరీక్ష కేంద్రానికి వెళ్లింది. చక్కగా పన్నెండో తరగతి పరీక్షలు రాసింది. ఈ ఘటన ఆగ్రాలో జరిగింది. మంగళవారం రాత్రి వివాహం చేసుకున్న యువతి బుధవారం ఉదయమే పరీక్షా కేంద్రం వద్ద కనిపించడం అక్కడివారిని ఆశ్చర్యపరిచింది. పెళ్లి హడావిడిలోనూ పరీక్షలు మరిచిపోకుండా ధైర్యంగా ఎగ్జామ్‌కు హాజరైన ఆ యువతిని తోటి విద్యార్థులు, టీచర్లు అభినందించారు.