న్యూఢిల్లీ: పరీక్షల కాలం ముంచుకొస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ‘పరీక్షా పే చర్చా’కు తెరతీశారు. పరీక్షల సమయంలో తలెత్తే ఒత్తిడిని తగ్గించేందుకు విద్యార్థులకు విలువైన సూచనలివ్వనున్నారు. ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియంలో నేడు(సోమవారం) ఆయన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. ఇందులో పాల్గొనేందుకు 2 వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. వ్యాస రచన పోటీలు నిర్వహించి 1,050 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుందని అధికారులు తెలిపారు. ప్రధానిని ప్రశ్నించే విద్యార్థులను వారు రాసిన ఎస్సేల ఆధారంగా ఎంపిక చేశామన్నారు. 2018, 2019 ల్లోనూ పరీక్షా పే చర్చాను నిర్వహించారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థుల నుంచి 2.6 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, ఇది గతేడాది కన్నా 1.2 లక్షలు ఎక్కువని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment