
సాక్షి, యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పీజీ, బీటెక్ చివరి సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 21 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.జమున మంగళవారం తెలిపారు. ఇందుకోసం వర్సిటీ దూరవిద్యా అధ్యయన కేంద్రాలతో పాటు మరికొన్ని ఇతర కేంద్రాలు వినియోగించనున్నట్లు చెప్పారు. చిత్తూరు, తిరుపతి, కర్నూలు, కడప, నెల్లూరు, ఒంగోలు, అనంతపురం, విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, విశాఖ, శ్రీకాకుళం నగరాల్లో ప్రతిరోజూ ఉ.10 నుంచి 1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్ తెచ్చుకోవాలని సూచించారు. ఎస్వీయూ సెట్ దరఖాస్తు గడువు పెంపు: ఎస్వీయూలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడవును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు డైరెక్టరేట్ ఆప్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో దరఖాస్తు చేసే అవకాశం కల్పించామన్నారు.