జిల్లా అంతటా భారీ వర్షాలు
అత్యధికంగా కేవీబీపురం మండలంలో 28.3 సెం.మీ వర్షపాతం
లోతట్టు ప్రాంతాలు జలమయం
పెద్దవంక వాగులో ఒకరు, బాహుదా ఏటిలో మరొకరు గల్లంతు
పలమనేరు నియోజకవర్గంలో చెరువులో పడి విద్యార్థి మృతి
ఎస్వీయూలో పీజీ పరీక్షలు వాయిదా
పాఠశాలలకు నేడు సెలవు
పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్
తిరుపతి-గూడూరు మార్గంలో ఆగిన రైళ్ల రాకపోకలు
తిరుపతి: జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా తిరుపతిలో కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని వెయ్యికి పైగా ఇళ్లలోకి నీరు చేరింది. నగరంలోని రోడ్లు సెలయేళ్లను తలపించాయి. డ్రైన్లు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. వర్షపు నీరు వచ్చి చేరుతోంది. నియోజకవర్గంలోని 70 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. స్వర్ణము ఖి నదిపై నిర్మించిన బ్రిడ్జి దెబ్బతినడంతో ఆ మార్గాన్ని మూసివేశారు. 25 వేల ఎకరాల్లో మినుము పంట దెబ్బతింది.
సత్యవేడు నియోజకవర్గంలో అరణియార్ ప్రాజెక్ట్ నిండడంతో నాలుగు గేట్లు ఎత్తేశారు. కాళంగి రిజర్వాయర్‌కు వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది. 18 మినీగేట్లతో పాటు ప్రధాన రెగ్యులేటరీకి ఉన్న మూడుగేట్లను ఎత్తేశారు.చంద్రగిరి నియోజకవర్గంలో కళ్యాణీ డ్యాం నిర్మించాక రెండోసారి గేట్లు ఎత్తివేసే స్థాయికి నీటిమట్టం చేరింది. ప్రస్తుతం 877 అడుగుల నీటిమట్టం ఉంది. మంగళవారం నాటికి ఈ నీటిమట్టం మరిం త పెరిగే అవకాశం ఉంది. తొండవాడ వద్ద స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో తిరుపతి, చంద్రగిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నగరి నియోజకవర్గంలో ఉయ్యాలకాలువ ఉద్ధృతి ఎక్కువ కావడం తో బిఆర్.కండ్రికలో ఇందిరమ్మ ఇళ్లు జలమయ్యాయి. నగరి చెరువు నిండడంతో ఏకాంబరం కుప్పంలోని రాజీవ్‌గాంధీ కాలనీలోకి నీళ్లు వచ్చి చేరాయి. పుత్తూరులో తహశీల్దార్ కార్యాలయం కూలేస్థితిలో ఉన్నందున కార్యాలయాన్ని మార్చాల ని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్ణ యం తీసుకున్నారు. పుత్తూరులోని గంగమాంబాపురం కాలనీ నీట మునిగింది.
పుంగనూరు నియోజకవర్గంలో పులిచెర్ల మండలం కొత్తపేట వద్ద గల పెద్దవాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయా డు. రొంపిచెర్ల మండలంలో తాటిమానుగుంట చెరువు తెగడం, ఏటి చెరువు పొంగడంతో పలు గ్రామాలు జలమయ్యాయి. సోమల మండలంలో వాగు లు పొంగి ప్రవహిస్తుండడంతో పెద్ద ఉప్పరపల్లె, కందూరు, నంజింపేట గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పుంగనూరులో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమల మండలం జాండ్రపేట చెరువు తెగడంతో పోలీసులు అధికారులు జాండ్రపేట గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పీలేరు నియోజకవర్గంలో పీలేరు-సదుం మార్గంలో పింఛానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలి చిపోయాయి. పింఛానదితోపాటు గా ర్గేయ ప్రాజెక్ట్‌లో భారీగా వర్షపు నీరు చేరుతోంది. కేవీపల్లె మండలంలో రెం డు చెరువులకు గండ్లు పడ్డాయి. కలికిరి మండలంలో చీకటిపల్లె - పల్లవోలు గ్రామాల మధ్య ప్రవహిస్తున్న బాహు దా ఏటిలో సోమవారం రాత్రి పాల వ్యాన్(బొలెరో) కొట్టుకుపోయింది. అ మిలేపల్లికి చెందిన వాహన యజమా ని శేఖర్(25) గల్లంతయ్యాడు. ఆ వా హనంలో ఉన్న అదే గ్రామానికి చెంది న చిన్నమస్తాన్ కుమారుడు పఠాన్‌షరీఫ్, వెంకట్రమణ కుమారుడు ప్రకాష్‌ను తాళ్ల సహాయంతో పోలీసులు కాపాడారు.
పలమనేరు నియోజకవర్గంలో 14 ఏళ్లుగా ప్రవహించని కౌండిన్య నది ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పరవళ్లు తొక్కుతోంది. నియోజకవర్గంలో 14 చెరువులకు గండ్లు పడ్డాయి. తమిళనాడు రూరల్ పరిధిలో నక్కలపల్లె వద్ద జాతీయ రహదారికి గండి పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలి గింది. బెరైడ్డిపల్లె మండలంలోని గొల్లచీమలపల్లె సమీపంలోని లక్కన చెరువులో నీటిని చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన 10వ తరగతి చదువుతున్న లీనా ప్రమాదవశాత్తూ చెరువులో పడి చనిపోయింది.
ఎన్టీఆర్ జలాశయానికి భారీగా వర్షపు నీరు చేరడంతో 10 గే ట్లు ఎత్తివేశారు. కార్వేటినగరం మండలంలోని కృష్ణాపురం జలాశయం నిండడంతో 2 గేట్లు ఎత్తేశారు. సిరిపురంవద్ద గుంజనే రు గట్టుకు రెండుచోట్ల భారీగా గండ్లు పడ్డాయి. ఎస్‌ఆర్‌పురం మండలంలో 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంగాధరనెల్లూరులో పూల తోటలకు భారీ నష్టం వాటిల్లింది.
పూతలపట్టులో బీమా నది, గొడ్డు వంకలు ఉద్ధృత స్థాయిలో ప్రవహిస్తుం డడంతో పూతలపట్టు-పోలవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పూతలపట్టు రంగంపేట క్రాస్ మధ్య రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. గార్గేయవాగు, బీరప్పవాగు చెరువు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
మదనపల్లెలో నిమ్మనపల్లె ప్రాజెక్ట్ నిండింది. 14 చెరువులకు గండ్లు పడ్డా యి. నియోజకవర్గంలోని మదనపల్లెతో పాటు చుట్టు పక్కల చెరువులు నిండాయి. 800 ఎకరాల్లో టమాట, వరిపంట దెబ్బతిన్నాయి. చిత్తూరు పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. టమాట, బీన్స్, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. కట్టమంచి చెరువు తెగిపోయింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో కుషావతి నది దాటే ప్రయత్నంలో వరద ఉద్ధృతికి టాటాసుమో బోల్తాపడింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురిని స్థానికులు కాపాడారు. మరొకరు ప్రవాహంలో కొట్టుకుపోతుండగా లక్ష్మీనగర్ వాసులు రక్షించారు.
ఊళ్లనిండా నీళ్లు
Published Tue, Nov 17 2015 2:02 AM | Last Updated on Fri, May 25 2018 3:27 PM
Advertisement
Advertisement