
నైరుతికి ముందే పలకరింపు
నైరుతి రుతుపవనాలకు ముందే వరుణుడు పలుకరించాడు. ఎండలతో అల్లాడుతున్న తిరుపతిపై కరుణ కురిపించాడు. అటు తిరుమల.. ఇటు తిరుపతిలో సోమవారం సాయంత్రం, రాత్రి వర్షం మోస్తరుగా ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో తర్వాత ఉధృతమైంది. నగర వాసులు చల్లదనంతో సేదతీరారు.