సాక్షి, విజయవాడ: అటానమస్ కాలేజీల్లో పరీక్ష విధానంలో మార్పులు తీసుకువస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అటానమస్ కాలేజీల్లో సొంతంగా పేపర్లు తయారు చేసుకోవడానికి కుదరదని స్పష్టం చేశారు. వాళ్లకు వారే పరీక్షలు పెట్టుకునే పరిస్థితి ఇక ఉండదన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అటానమస్ కళాశాలపై సమీక్ష జరిపారని చెప్పారు. రాష్ట్రంలో 109 అటానమస్ కాలేజీలు ఉన్నాయని.. అక్కడ అక్రమాలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రతి డిగ్రీ విద్యలోనూ నైపుణ్యం పెంచాలని సీఎం నిర్ణయించారని.. అందుకే డిగ్రీలో అప్రెంటిస్ విధానం తీసుకొస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పూర్తి పారదర్శకత తేవాలని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అడ్మిషన్లలో రిజర్వేషన్లు పాటించడంలేదని.. అందుకే ఆన్‌లైన్‌లో అడ్మిషన్ల విధానం తెచ్చామని వెల్లడించారు.
ప్రతిపక్షాలు, వాటి అనుకూల పత్రికలు చాలా దుష్ప్రచారాలు చేశాయని.. కానీ గత ఏడాది కంటే డిగ్రీ అడ్మిషన్లు పెరిగాయని మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు దక్కాయని పేర్కొన్నారు. అటామనస్ కాలేజీల్లో ఇన్నాళ్లు జరిగిన అక్రమాలకు చెక్ పెట్టామన్నారు. దీనికి ఆటంకం కల్పించాలని ప్రయత్నించినా తాము అధిగమిస్తామన్నారు. నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు యూజీసీతో కూడా దీనిపై సంప్రదిస్తామని తెలిపారు. అన్ని కాలేజీల్లో అకడమిక్ ఆడిటింగ్ కూడా చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
చదవండి:
‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది..’
2900 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు: కన్నబాబు
Comments
Please login to add a commentAdd a comment