
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల పాటు లక్ష్మణ్‌రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. లోకాయుక్త నియామకంతో పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం కానున్నాయి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన లోకాయుక్తకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.