
సత్తిబాబు ఇంటి ముందు నిరసన చేపట్టిన మృతుడి బంధువులు
సాలూరురూరల్ : మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు యజమాని ఇంటి ముందు నిరసన చేపట్టిన సంఘటన బుధవారం మామిడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మామిడిపల్లి గ్రామానికి చెందిన కర్రి భాస్కరరావు అదే గ్రామానికి చెందిన చిలుకూరి సత్తిబాబు వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం శివరాంపురంలో దమ్ము చేపడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి భాస్కరరావు అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ బంధువులు మృతదేహంతో కలిసి సత్తిబాబు ఇంటి ముంద నిరసన చేపట్టారు. అయితే సాయంత్రం వరకూ సత్తిబాబు రాలేదు. రూరల్ ఎస్సై గణేష్, స్థానిక పెద్దల సూచనలు మేరకు బంధువులు నిరసన విరమించి భాస్కరరావు అంత్యక్రియలు నిర్వహించారు.