Vizianagaram
-
Anganwadi Workers: విజయనగరంలో అంగన్వాడీల ధర్నా
-
పుణ్యమూర్తివి నీవమ్మా.. మా ఇంటి కావలి తల్లివి నీవమ్మా
ఆధునిక సమాజంలో మహిళలకు గౌరవం దక్కడం ఇప్పిడిప్పుడే మొదలైంది. స్త్రీ విద్య.. స్త్రీలకు ఉద్యోగాలు.. రాజకీయ పదవులు.. సామాజిక హోదా ఈమధ్యనే పెరుగుతూ వస్తోంది. కానీ, ఈ మారుమూల పల్లెల్లో స్త్రీమూర్తులను సాక్షాత్తుగా దేవతలుగా కొలుస్తారు. తమ ఇంటి ఇలవేల్పులుగా ఆరాధిస్తారు. తమ కుటుంబాలను కాపాడే శక్తిగా.. అమ్మవారిగా పూజిస్తారు.. తమ ఇంట పండిన పంటలో తోలి గంపను ఆమెకు సమర్పిస్తారు.. తమ ఇంట వండిన వంటలు తొలిముద్దను ఆమెకు సమర్పిస్తారు. ఇంట్లో ఏదైనా పండగొచ్చినా పబ్బమొచ్చినా ఇళ్లలో వండుకునే పిండివంటల్లో తొలివాయి ఆమెకే ఇచ్చి.. అమ్మా నీ చలవతోనే మేమంతా చల్లగా ఉన్నాం.. నువ్విచ్చిన ఆస్తిపాస్తులు.. ఆశీస్సులతో ఇలా సాగుతున్నాం.. నువ్వు లేకున్నా నీ జ్ఞాపకాలు చాలు.. ఇదిగో నిన్ను చూస్తూ బతికేస్తాం అంటూ భక్తి.. ప్రేమ నిండిన కళ్ళతో ఆ స్మారకాలవద్ద పవిత్రంగా ప్రమిదలు వెలిగిస్తారు.. ఏదైనా ఇంట్లో ఒక మహిళా పుణ్యస్త్రీగా కన్నుమూస్తే ఆమెను పేరంటాలుగా గౌరవిస్తారు. ఆమె పేరిట ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తారు.. వీటిని గుండాం అంటారు. భర్తకన్నా ముందే తనువు చలించడం ఒక మహిళకు దైవత్వాన్ని తెచ్చిపెడుతోంది. అంటే ఆమె పుణ్యస్త్రీగా ముత్తైదువుగా కన్నుమూసి ఆ ఇంటి వారి పాలిట ఇలవేల్పుగా కొలువైపోతుంది. భారతీయ సమాజంలో విధవగా జీవించడం మహిళ ఒక శాపంలా భావిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో భర్తకన్నా ముందుగానే ప్రాణం విడిచివెళ్లిన స్త్రీ ఏకంగా దైవత్వాన్ని సంతరించుకుని ఆయా కుటుంబాల్లో దేవతలుగా కొలువుదీరుతారు. విజయనగరం జిల్లాలోని రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో వందలాది పల్లెల్లో ఈ ఆచారం ఉంది.పంటపొలాలకు.. పాడిపశువుల నువ్వే అండాదండాఇక్కడ పొలాల్లో, రోడ్లకు ఇరువైపులా కనిపిస్తున్న ఈ చిన్న చిన్న నిర్మాణాలను ఇక్కడి స్థానికులు గుండాలు అని పిలుస్తారు. ఇటువంటి గుండాలు ప్రతీ గ్రామంలో వందల సంఖ్యలో ఉంటాయి. బొమ్మనాయుడువలస, బొద్దూరు, గుళ్ళ సీతారాంపురం, గడ్డి ముడిదాం, ఉణుకూరు, అరసాడ, కాగితాపల్ల వంటి పల్లెల్లో ప్రతి ఇంటికీ ఇలాంటి గుండాలు ఒంటరి.. వారువారు స్థోమతను బట్టి తమ పొలాల్లోను.. కల్లంలోనూ వీటిని నిర్మించి అందులో ఆ మహిళా ఆత్మను ప్రతిష్టించి ఆ గుండంలో ఆమె జీవించి ఉన్నట్లుగా భావిస్తారు. ఆ ఇంట జరిగే శుభ కార్యాల్లో తోలి కబురు ఆమెకే చెబుతారు. గర్భిణీలు.. పెళ్లికూతుళ్ళు కూడా అక్కడకు వెళ్లి దీపం పెట్టి.. నీలాగే గొప్ప ముత్తైదువులా జీవించేలా ఆశీర్వదించాలమ్మా అని ప్రార్థిస్తారు. అంతేకాకుండా పంటపొలాలు.. పాడిపశువులను సైతం ఆ పేరంటాలు కాపాడుతుందని.. వ్యవసాయపనుల సందర్భాల్లో ఎలాంటి ఇబ్బందులు.. ప్రమాదాలు కూడా రాకుండా ఆమె కావలి ఉంటుందని .. ఇంటికి చీడపీడలు.. అనారోగ్యాలు రానివ్వకుండా ఆ పేరంటాలు అడ్డంగా నిలబడుతుందని విశ్వాసంతో ఉంటారు. అందుకే ప్రతి గుండానికి లలితమ్మ పేరంటాలు.. లక్షమ్మ పేరంటాలు.. రాధమ్మ పేరంటాలు అని పేర్లు పెడుతూ మరణించిన తరువాత కూడా తమ భక్తిప్రపత్తులు చాటుకుంటారు. ఈ గ్రామాల్లో వందలాది ఇలాంటి స్మారకాలు ( గుండాలు) కనిపిస్తాయి. వాటికి ఏటా రంగులు వేసి.. చక్కగా ముస్తాబు చేసి అందులో తమ ఇంటి ముత్తైదువను చూసుకుంటారు. ఈరోజుల్లో మహిళలను గౌరవించడం మాట అటుంచి వారికి రక్షణ కూడా లేకుండా పోతున్న పరిస్థితుల్లో ఉండగా వందల ఏళ్ళనుంచీ ఆ పల్లెవాసులు మహిళలకు ఏకంగా దేవతా స్థానం కల్పించి మరణించాక కూడా ఆమెను తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తూ.. ఏటా కొత్తబట్టలు.. పిండి వంటలు.. పళ్ళు ఫలాలు.. సమర్పిస్తారు.. ఇది కదా అసలైన మహిళా సాధికారత.. ఇది కదా మహిళలకు అసలైన గౌరవం..-సిమ్మాదిరప్పన్న. -
విజయనగరం జిల్లాలో టీడీపీ - జనసేన నేతల కొట్లాట
-
విజయనగరం జిల్లా రాజాంలో టీడీపీ గూండాల అరాచకం
-
బతకాలంటే భయమేస్తోందమ్మా.. నన్ను క్షమించు తమ్ముడు ...
నెల్లిమర్ల: తమ కుమారుడు వైద్య వృత్తిలో స్థిరపడతాడని ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయారు. మరికొన్ని రోజుల్లో ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకుని, రోగులతో పాటు తమకు కూడా వైద్యసేవలు అందిస్తాడని ఆశ పడ్డారు. అయితే వారి ఆశలు ఆడియాసలయ్యాయి. చేతికి అందివచ్చిన కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం నుంచి బ్యాక్‌లాగ్స్ ఉండిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు, సహ విద్యార్థులు అందించిన వివరాల ప్రకారం.. నెల్లిమర్ల పట్టణంలో ఉన్న మిమ్స్ వైద్య కళాశాలలో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన అతుకూరి సాయి మణిదీప్(24) ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం కళాశాల ప్రాంగణంలో ఉన్న హాస్టల్ గదిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్లో పురుగుల మందు తెప్పించుకుని, కూల్ డ్రింకులో కలుపుకుని తాగా డు. విషయం తెలుసుకున్న సహ విద్యార్థులు విషయాన్ని మిమ్స్ యాజమాన్యానికి తెలియజేశారు. యాజమాన్య ప్రతినిధులు నెల్లిమర్ల పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ గణేష్ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయి మణిదీప్ బెడ్ కింద పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. చదువు విషయంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సదరు నోట్లో మృతుడు ప్రస్తావించాడు. బ్యాక్ లాగ్స్ ఎక్కువగా ఉండటం, చదువుపై ఏకాగ్రత లేకపోవడంతో చనిపో తున్నట్లు రాసాడు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గణేష్ తెలిపారు. -
తవ్వేస్తాం.. దోచేస్తాం అంటున్న తెలుగు తమ్ముళ్లు!
-
విజయనగరంలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల సందడి (ఫొటోలు)
-
విజయనగరంలో ‘క’ సినీ హీరో కిరణ్ అబ్బవరం సందడి (ఫొటోలు)
-
భోగాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,విజయనగరంజిల్లా: భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం(నవంబర్30) ఘోర ప్రమాదం జరిగింది.శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళుతున్న కారు అదుపుతప్పింది.దీంతో కారు డివైడర్ మీదుగా పల్టీ కొట్టి పక్కరోడ్డుపైకి దూసుకెళ్లింది.అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. -
కూటమి ప్రభుత్వంపై YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్
-
ఇద్దరు చిన్నారులు, వివాహితపై అత్యాచారయత్నం
పూసపాటిరేగ/బేతంచర్ల/సాక్షి టాస్క్‌ఫోర్స్: అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై, వివాహితపై మానవ మృగాలు అత్యాచారానికి యతి్నంచాయి. ఈ ఘటనలు విజయనగరం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం, పతివాడ గ్రామానికి చెందిన మైనపు హరీశ్ (19) గ్రామ పాఠశాల వెనుకభాగంలో సోమవారం పశువులను మేపుతున్నాడు. అటుగా వెళ్తున్న ఇద్దరు బాలికలను పిలిచి మంచినీళ్లు తీసుకురావాలని కోరాడు.వారిద్దరు సమీపంలోని నిందితుడి ఇంటికెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చారు. వారిలో ఓ చిన్నారి (5)ని ఉండమని లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో భయపడిన అతడు, చిన్నారిని ఇంట్లో అప్పగించాడు. విషయాన్ని చిన్నారి తన తల్లికి చెప్పడంతో గ్రామపెద్దల సహాయంతో పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.నంద్యాల జిల్లాలో.. నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గంలోని కొలుములపల్లెకు చెందిన ఏడేళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఆ చిన్నారికి తండ్రి లేడు. తల్లి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈనెల 7న బాలిక స్కూల్‌కు వెళ్లలేదు. ఇంటి దగ్గర ఆడుకుంటుండగా గ్రామానికి చెందిన దండగాల్ల ఎల్లయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలకు చుట్టుపక్కల వారు రావడంతో ఎల్లయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివాహితపై టీడీపీ నేత అత్యాచారయత్నం కర్నూలు జిల్లా, గూడూరు మండలం ఆర్.ఖానాపురం గ్రామంలో మంగళవారం పొలం పనులకు వెళ్లిన ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత బోయ గోపాల్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. అయితే ఆ మహిళ పెద్దగా కేకలు వేస్తూ తప్పించుకుని ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. అనంతరం భర్తతో కలిసి ఆమె గూడూరు ఎస్ఐ తిమ్మయ్యకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతంలోనూ ఇలాంటి దుశ్చర్యలు.. కాగా టీడీపీ నేత గోపాల్ గతంలో కూడా ఇదే గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలపై అత్యాచారాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెప్పారు. వారంతా నిందితుడు గోపాల్‌కు భయపడి కేసులు పెట్టేందుకు ముందుకు రాలేదని పేర్కొన్నారు. గోపాల్ టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ మునిస్వామికి స్వయాన మేనల్లుడు. -
ప్రియాన్షు అజేయ సెంచరీ
సాక్షి, విజయనగరం: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర జట్టుకు నాలుగో మ్యాచ్‌లోనూ మెరుగైన ఆరంభం దక్కలేదు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆంధ్ర జట్టు... ఎలైట్ గ్రూప్ ‘బి’లో అట్టడుగున కొనసాగుతోంది. విజయనగరం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బుధవారం ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఉత్తరాఖండ్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 232 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాన్షు ఖండూరి (272 బంతుల్లో 107 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగగా... మరో ఓపెనర్ అవ్నీశ్ (158 బంతుల్లో 86; 12 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 157 పరుగులు జోడించి ఉత్తరాఖండ్‌కు బలమైన పునాది వేశారు. 29 ఏళ్ల ప్రియాన్షుకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇది రెండో సెంచరీ కాగా... శతకం చేసేలా కనిపించిన అవ్నీశ్ను ఆంధ్ర స్పిన్నర్ లలిత్ మోహన్ అవుట్ చేశాడు.ఆ తర్వాత కెప్టెన్ రవికుమార్ సమర్థ్ (30 బ్యాటింగ్; 2 ఫోర్లు) కూడా సాధికారికంగా ఆడాడు. ఎలాంటి తొందరపాటుకు పోకుండా ఆచితూచి ఆడిన ఉత్తరాఖండ్ ఆటగాళ్లు రోజంతా బ్యాటింగ్ చేసిన 2.66 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఉత్తరాఖండ్‌ను గురువారం ఆంధ్ర బౌలర్లు ఏమాత్రం అడ్డుకుంటారో చూడాలి. స్కోరు వివరాలు ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్: అవ్నీశ్ (సి) షేక్ రషీద్ (బి) లలిత్ మోహన్ 86; ప్రియాన్షు ఖండూరి (బ్యాటింగ్) 107; రవికుమార్ సమర్థ్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (87 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి) 232. వికెట్ల పతనం: 1–157, బౌలింగ్: చీపురుపల్లి స్టీఫెన్ 19–6–42–0; శశికాంత్ 18–8–31–0; సత్యనారాయణ రాజు 15–3–50–0; లలిత్ మోహన్ 26–2–83–1; త్రిపురాణ విజయ్ 6–1–15–0; మారంరెడ్డి హేమంత్ రెడ్డి 3–0–6–0. -
జగన్ మామయ్య ఉన్నప్పుడే బాగుంది
-
ప్రభుత్వం సిగ్గుపడాలి: వైఎస్ జగన్
గుర్ల మండలంలో డయేరియాతో 345 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో అంత కంటే ఎక్కువగా దాదాపు 450 మంది చికిత్స పొందారు. ఇప్పటికీ విజయనగరం జిల్లాలోని గరివిడి, గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో డయేరియా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇంకా 62 మంది చికిత్స పొందుతున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితి ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోగా ఏం చేస్తోంది? ఏదైనా ఇష్యూ జరిగితే దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి.. ఎలా కవరప్ చేయాలి.. అది అసలు జరగనట్లు ఎలా చూపించాలి.. అన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తోంది. అందుకు ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తలదించుకోవాలి. – వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ పాలనలో గ్రామ స్వరాజ్యం సాకారమైతే, కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే పరిస్థితులు ఎంత దారుణంగా మారాయనేదానికి ‘గుర్ల’ డయేరియా ఘటనే నిదర్శనమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. బాధ్యత మరచి దాన్ని కప్పిపుచ్చుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండటం సిగ్గు చేటని మండిపడ్డారు. కనీసం తాగునీటి క్లోరినేషన్ కూడా చేయని ఫలితంగా డయేరియా విజృంభించి విజయనగరం జిల్లా గుర్లలో 14 మంది చనిపోయిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. గురువారం ఆయన మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.మృతికి దారితీసిన పరిస్థితులను, ఇతరత్రా అన్ని వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని అభయమిచ్చారు. ప్రభుత్వం నుంచి పైసా సాయం కూడా అందలేదన్న వారి ఆవేదన విని చలించిపోయారు. వైఎస్సార్సీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. ‘వైఎస్సార్సీపీ పాలనలో గ్రామాల్లో నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్స్ కనిపించేవి. అక్కడే రోజంతా, వారంలో ఏడు రోజుల పాటు అక్కడే నివాసం ఉండే సీహెచ్‌ఓలు కనిపించే వారు. వారికి అనుసంధానంగా ఏఎన్ఎంలు, వారికి రిపోర్ట్ చేస్తూ ఆశ వర్కర్లు కనిపించే వారు. విలేజ్ క్లినిక్స్‌తో పాటు ఒక పటిష్టమైన వ్యవస్థ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నడిచేది. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్స్‌ను అనుసంధానం చేసి, పీహెచ్‌సీల్లో డాక్టర్ల సంఖ్యను పెంచి, ప్రతి గ్రామానికి 15 రోజులకు ఒకసారి డాక్టర్లు వచ్చే వ్యవస్థ ఉండేది. అదే గ్రామంలో నాడు–నేడుతో బాగు పడిన స్కూళ్లలో పిల్లలు నవ్వుతూ కనిపించే వారు. రైతన్నలను చేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రాలు కనిపించేవి. చక్కగా ఈ–క్రాపింగ్ జరిగేది. రైతులకు ఉచిత పంటల బీమా అందేది. సకాలంలో పెట్టుబడి సహాయం అందేది. సచివాలయంలో వెంటనే పనులు చేసిపెట్టే ఉద్యోగులు కనిపించే వారు. ఈ రోజు అవేవీ కనిపించడం లేదు. ఆ గ్రామ స్వరాజ్యం ఎంతో దయనీయంగా తయారైందని చెప్పడానికి గుర్ల గ్రామం ఒక ఉదాహరణ’ అని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. జగన్ ట్వీట్ చేస్తే వెలుగులోకి.. గుర్లలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 14 మంది చనిపోయిన పరిస్థితి. తాగు నీరు బాగోలేక డయేరియా వచ్చి మృతి చెందారు. ఇందుకు సంబంధించి జగన్ అనే వ్యక్తి అక్టోబర్ 19న ట్వీట్ చేస్తే తప్ప ఇక్కడ 14 మంది చనిపోయారని ప్రభుత్వం చెప్పని పరిస్థితి. సెపె్టంబర్ 20వ తేదీన, అంటే 35 రోజుల కిందట ఇదే మండలంలోని పెనుబర్తిలో ఒక వ్యక్తి చనిపోయాడు. అలా తొలి డయేరియా కేసు నమోదైంది. అయినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఎవరూ స్పందించని దుస్థితి. అక్టోబర్ 12 వచ్చే సరికి డయేరియా మరింత విజృంభించింది. గుర్ల, కోట గండ్రేడు, గోషాడ, నాగళ్లవలస గ్రామాల్లో ఉధృతంగా ప్రబలింది. ఏకంగా 14 మంది చనిపోయారు. అక్టోబర్ 19న నేను ట్వీట్ చేస్తే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అయినా ప్రభుత్వం కదిలిందా.. అంటే లేదు. తప్పుడు లెక్కలతో మాయ చేసే ప్రయత్నం గుర్లలో డయేరియాతో కేవలం ఒకరే చనిపోయారని జిల్లా కలెక్టర్ చెబుతారు. మంత్రులు, అధికారులు అదే ప్రయత్నం చేశారు. ఎవరూ డయేరియాతో చనిపోలేదని చెప్పే కార్యక్రమం చేశారు. తీరా అక్టోబర్ 24 వచ్చే సరికి 14 మంది చనిపోయారని తేలింది. ఇష్యూ పెద్దది కావడంతో సీఎం చంద్రబాబు కూడా ఒప్పుకోక తప్పలేదు. ఇక్కడ డయేరియాతో ఎనిమిది మంది చనిపోయారని చెప్పారు. ఇక్కడికి వచ్చిన డిప్యూటీ సీఎం 10 మంది చనిపోయారని చెప్పారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు కనీసం క్షమాపణ చెప్పి జరిగిన తప్పును సరిదిద్ద లేదు. సమీపంలో చంపావతి నది ఉంది. దాంట్లో నీళ్లు దారుణ పరిస్థితిలో ఉన్నాయి. ఈ నది నీటితో నడిచే సమగ్ర సురక్షిత మంచినీటి సరఫరా (సీపీడబ్ల్యూఎస్) పథకానికి సంబంధించి చంద్రబాబు వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ రెన్యూవల్ చేయలేదు. దాని ఫిల్టర్లు మార్చారా.. లేదా? కనీసం క్లోరినేషన్ జరిగిందా.. లేదా? అన్నది కూడా పట్టించుకోలేదు. స్థానికంగా సచివాలయం సిబ్బంది సహాయ, సహకారంతో శానిటేషన్ చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించారు ⇒ ఇక్కడి గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలను బాగు పరచకపోగా, సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసేశారు. వైద్య శాఖలో జీరో వెకెన్సీ పాలసీ మేము తీసుకొస్తే, దాన్నీ రద్దు చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు మార్చి నెల నుంచి కట్టడం లేదు. దాంతో దాదాపు రూ.1,800 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పోలేని పరిస్థితి. ⇒ ఆరోగ్యశ్రీని నీరుగార్చింది. గతంలో కేవలం వెయ్యి ప్రొసీజర్లకు మాత్రమే పథకాన్ని పరిమితం చేస్తే, మా ప్రభుత్వం వచ్చాక 3,300 ప్రొసీజర్లకు తీసుకుపోయాం. రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసే ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీతో పాటు ఆరోగ్య ఆసరానూ çపూర్తిగా నీరుగార్చిన పరిస్థితి కనిపిస్తోంది. ⇒ మెరుగైన వైద్యం అందేలా మా ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టింది. వాటిలో ఐదు కాలేజీలను గత ఏడాది ప్రారంభించాం. మిగిలిన 12 మెడికల్ కాలేజీల్లో పూర్తి చేసి, వాటిని కూడా నడపాల్సిన ప్రభుత్వం.. వాటిలో 5 కాలేజీల్లో సీట్లు మంజూరైతే కూడా, వాటిని నిర్వహించలేమని లేఖ రాసింది. ఆ తర్వాత ఈ 12 మెడికల్ కాలేజీలతో పాటు, గత ఏడాది మొదలైన 5 మెడికల్ కాలేజీలు...మొత్తం 17 మెడికల్ కాలేజీలను తమకు అనుకూలమైన వారికి అమ్మేయడానికి, స్కామ్ వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మేము విపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ తరఫున బాధితులను ఆదుకుంటాం. డయేరియాతో చనిపోయిన 14 మంది కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆరి్థక సాయం చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్న మేమే సాయం చేయడానికి ముందుకు వచ్చాం. అధికారంలో ఉన్న మీకు (చంద్రబాబు) మరింత బాధ్యత ఉంటుంది. మరి మీరు ఎంత ఇవ్వబోతున్నారో చెప్పండని సూటిగా ప్రశి్నస్తున్నాం. – వైఎస్ జగన్జగన్ గుంటూరుకు వస్తున్నాడు.. గుర్లకు వస్తున్నాడు.. అనే సరికి మళ్లీ టాపిక్ డైవర్ట్. మా చెల్లెలు, మా అమ్మ ఫొటోలు పెడతారు. అయ్యా చంద్రబాబూ.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా.. ఈనాడు.. టీవీ5.. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు ఏం లేవా? ఇవన్నీ ఘర్ ఘర్కీ కహానీలు. ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటిని మీ స్వార్థం కోసం పెద్దవి చేసి, నిజాలను వక్రీకరించి చూపడం మానుకుని ప్రజల మీద ధ్యాస పెట్టండి. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని చంద్రబాబుకు చెబుతున్నా. మీడియా ముసుగులో చంద్రబాబును మోస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు దత్తపుత్రుడిని కూడా అడుగుతున్నా. – వైఎస్ జగన్మెరుగైన చికిత్స చేయించ లేదు ⇒ గుర్ల మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం కేవలం 17 కి.మీ దూరంలో ఉంది. మరి ఇక్కడి వారిని ఎందుకు విజయనగరం తీసుకెళ్లలేకపోయారు? ఇక్కడి నుంచి విశాఖపట్నం 80 కి.మీ దూరంలో ఉంది. పది అంబులెన్సులు ఏర్పాటు చేసి డయేరియా బారినపడిన వారిని మెరుగైన చికిత్స కోసం అక్కడికి ఎందుకు తరలించ లేదు? అలా రోగులను తరలించకపోవడంతో గుర్లలో 9 మంది, మండలంలో 14 మంది చనిపోయారు. ⇒ మన ప్రభుత్వంలో నాడు–నేడు మనబడి కార్యక్రమంలో బాగు చేసిన స్కూళ్లలో డయేరియా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేశారు. బెంచీలపై వారిని పడుకోబెట్టారు. అంటే స్కూళ్లలో వైద్యం చేసే పరిస్థితి. ఒకవేళ మా ప్రభుత్వ హయాంలో ఇలా స్కూళ్లు బాగు చేసి ఉండకపోతే పరిస్థితి ఏమిటి? ఇక్కడ మా ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీ (విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ) కూడా వచ్చింది. ⇒ డయేరియా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ఇదే విషయం వారంతా చెప్పారు. సహాయం చేయకపోగా డయేరియాతో చనిపోయారని చెప్పొద్దన్నారు. అలా చెబితే గ్రామంలో భయాందోళన ఏర్పడుతుందని, గుండెపోటుతో చనిపోయారని చెప్పండని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ప్రభుత్వం అలా చెప్పమని చెబుతోంది అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఆలోచించాలని కోరుతున్నా.డైవర్షన్ పాలిటిక్సే చంద్రబాబు రాజకీయం ⇒ ప్రతి అడుగులో ఈ ప్రభుత్వం డైవర్షన్న్పాలిటిక్స్ చేస్తోంది. ఏదైనా ఇష్యూ వస్తే దానిని డైవర్ట్ చేసేలా అడుగులు వేస్తోంది. ఈ ప్రభుత్వం తీరుపై మేము ఢిల్లీలో ధర్నా చేస్తే, ఆ రోజు మదనపల్లెలో ఏదో అగ్ని ప్రమాదం జరిగితే ఏకంగా హెలికాప్టర్లో డీజీపీని, అధికారులను పంపింది. అదే ఇక్కడ (గుర్లలో) 14 మంది చనిపోతే హెలికాప్టర్ కాదు కదా.. కనీసం మంత్రులు వచ్చి బాధిత కుటుంబాలను పలకరించలేదు. ⇒ ఈ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైంది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్.. సెవెన్.. అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి.. చిన్న పిల్లలు కనబడితే నీకు రూ.15 వేలు అని, ఆ పిల్లల తల్లులు కనబడితే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లో పిల్లల పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, ఇంకా ఆ ఇంట్లో 20 ఏళ్ల వయసున్న వారు కనబడితే నీకు రూ.36 వేలు అని, ఆ ఇంట్లో ఎవరైనా కండువా వేసుకున్న రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు అని చెప్పి నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు ప్రజలు ఇవన్నీ నిలదీస్తారని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. తిరుపతి లడ్డూపై దుష్ప్రచారం చేశారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి దాంట్లోనూ డైవర్షన్. అదే చంద్రబాబు రాజకీయం. ⇒ జగన్ గుంటూరుకు వస్తున్నాడు.. గుర్లకు వస్తున్నాడనే సరికి మళ్లీ టాపిక్ డైవర్ట్. మా చెల్లెలు, అమ్మ ఫొటో పెడతారు. అయ్యా చంద్రబాబూ.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా.. ఈనాడు.. టీవీ5.. దత్తపుత్రా.. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు ఏం లేవా? మీ స్వార్థం కోసం నిజాలను వక్రీకరించడం మానుకుని ఇకనైనా ప్రజల మీద ధ్యాస పెట్టండి. ⇒ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్కచెల్లెమ్మల జీవితాలు చెల్లాచెదురవుతున్నాయి. చిన్న పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయి. శాంతి భద్రతలు కుదేలైపోయాయి. ప్రభుత్వం మాది అని చెప్పి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు విచ్చలవిడిగా అక్కచెల్లెమ్మలు, చిన్న పిల్లల మీద దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా బాధితులకు క్షమాపణలు చెప్పి, వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాలి. ఈ ప్రభుత్వానికి ఇకనైనా బుద్ధి రావాలని దేవుడిని ప్రారి్థస్తున్నా. బాధ దిగినట్లు అనిపించింది నా భర్త చింతపల్లి అప్పారావు ఇంటికి చేదోడు వాదోడుగా ఉండేవారు. డయేరియాతో మృతి చెందారు. దుఃఖాన్ని దిగమింగుతూ బాధతో గడుపుతున్నాం. ప్రభుత్వం తరఫున వచ్చిన వారంతా ఏదో చెప్పి వెళ్లిపోయారు. వైఎస్ జగన్ మాత్రం మా దగ్గరకే వచ్చి, ఇక్కడే కూర్చుని నా భర్త మృతికి కారణాలు వివరంగా అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందిందా.. అని ఆరాతీశారు. బాధ పడవద్దని, మా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఆయన మాటతో బాధ దిగినట్లు అనిపించింది. – చింతపల్లి అప్పయ్యమ్మ, గుర్లఎంతో ధైర్యం వచ్చిందిఏం జరిగిందని ప్రతీ విషయాన్ని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి మమ్మల్ని అడిగారు. మా మామయ్య సారిక పెంటయ్య ఎలా చనిపోయాడో జరిగిందంతా చెప్పాను. ఆస్పత్రిలో వైద్యం, ఊర్లో తాగునీటి ఇబ్బందుల గురించి అడిగారు. ఆ సమస్యలన్నీ పరిష్కరించేలా చేస్తామన్నారు. మా కుటుంబానికి భరోసా ఇచ్చారు. అధైర్య పడవద్దన్నారు. కష్టాలు తీర్చే నాయకుడు మా దగ్గరికే రావడం మాకు ఎంతో ధైర్యం ఇచ్చింది. – సారిక హైమావతి, గుర్లనేనున్నానని ధైర్యం చెప్పారు...డయేరియా మా ఇంట్లో ఇద్దరిని పొట్టనబెట్టుకుంది. నా భార్య కలిశెట్టి సీతమ్మ చనిపోయింది. ఆమె అకాల మరణాన్ని తట్టుకోలేక నా పెద్ద కొడుకు రవి మనోవేదనతో రెండు రోజులకే చనిపోయాడు. నాకు దిక్కుతోచని పరిస్థితి. చాలా బాధలో ఉన్న సమయంలో జగన్మోహన్రెడ్డి పరామర్శించడంతో కొంత బాధ తగ్గింది. ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతామని ధైర్యం చెప్పడం ఊరట కలిగించింది. – కలిశెట్టి సత్యారావు, గుర్ల -
నా కుటుంబం గురించి తర్వాత.. ముందు రాష్ట్రాన్ని కాపాడండి
-
గుర్ల గ్రామంలో అడుగుపెట్టిన జగన్..
-
పోలీసులపై జగన్ అసహనం..
-
తమ ఆవేదనను జగన్ తో పంచుకున్న చిన్నారి
-
డయేరియా తీవ్రతను జగన్ కు వివరించిన గుర్ల బాధితులు
-
Watch Live: డయేరియా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
-
Watch Live: కాసేపట్లో విజయనగరం గుర్లకు వైఎస్ జగన్
-
గుర్ల శిబిరంలో సౌకర్యాల లేమిపై ఎక్స్ లో ప్రశ్నించిన YS జగన్
-
కలరాతో 15 మంది చనిపోవడం ఈ జిల్లాలో ఎప్పుడు జరగలేదు
-
డయేరియా కేసులు కారణం ఇదే.. పద్ధతి మార్చుకోవాలి
-
సాక్షి వరుస కథనాలు ఎట్టకేలకు కదిలిన టీడీపీ ప్రభుత్వం
-
అవి సహజ మరణాలు కాదు.. ప్రభుత్వ నిర్లక్ష్యం: బొత్స
సాక్షి, విజయనగరం: జిల్లాలో డయేరియా తీవ్రత తగ్గడం లేదు. ఇవాళ మరో ఇద్దరు డయేరియా బారినపడ్డారు. ఆసుపత్రిలోనే ఇంకా 145 మంది బాధితులు ఉన్నారు. వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. గుర్లలో అప్రకటిత బంద్ కొనసాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలతో గుర్ల వైద్య శిబిరంలో 3 బెడ్లను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరం ఖాళీ చేసి రోగులు లేరంటూ అధికారులు చూపిస్తున్నారు.డయేరియా బాధితులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడూతూ, డయేరియాతో జిల్లాలో 16 మంది మృతి చెందారన్నారు. ఇవి సహజ మరణాలు కాదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఇంత మంది చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదు. కొత్త ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది. గ్రామాల్లో పారిశుధ్యం అధ్వాన్నం గా ఉంది. తాగునీరు సరఫరా బాగులేకే డయేరియా వ్యాప్తి అయింది’’ అని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: సర్కారుకు నిర్లక్ష్యపు సుస్తీ 'ఈ రోగానికి మందేదీ'? -
విజయనగరం జిల్లాలో తగ్గని డయేరియా తీవ్రత
-
విజయనగరంలో డయేరియా కలకలం.. 11కు చేరిన మరణాలు
సాక్షి, విజయనగరం: ఏపీలో డయేరియా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విజయనగరం జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. తాజాగా మరో ఇద్దరు మృతిచెందడంతో మృతుల సంఖ్య 11కు చేరుకుంది.తాజాగా విజయనగరంలోని గుర్ల మండలం నాగళ్లవలసలో డయేరియాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో, జిల్లాలో డయేరియా మృతుల సంఖ్య 11కు చేరింది. ఇక, మరో 200 మందికిపైగా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డయేరియా కారణంగా గుర్ల, గరివిడి, చీపురుపల్లి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం..భారీగా తరలివచ్చిన భక్తజనం (ఫొటోలు)
-
అంబరాన్నంటే సిరిమాను సంబరం... 260 ఏళ్ల చరిత్ర
Sirimanotsavam 2024: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి సిరిమాను సంబరానికి విజయనగరం సిద్ధమవుతోంది. ఊర్లకు ఊర్లే కదిలి వచ్చే ఈ జనజాతరతో విజయనగరం వీధులు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోతాయి. దారులన్నీ జన సెలయేరులై విద్యలనగరివైపు సాగిపోతుంటాయి. కొలిచినవారికి కొంగు బంగారమై.. కోరిన కోర్కెలెల్లా నెరవేర్చే పైడిమాంబ అంటే ఉత్తరాంధ్రులకు అంత నమ్మకం మరి.. 260 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఉత్తరాంధ్రకే పరిమితం కాకుండా రాష్ట్ర పండుగగా వాసికెక్కింది. ఏటా విజయనగరం వీధుల్లో కనులపండువగా జరిగే ఈ జనజాతరకు లక్షలాది మంది తరలివస్తారు. 260 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఉత్సవం నెల రోజుల పాటు జరుగుతుంది. మహిళలు ప్రతి రోజూ ఘటాలు నెత్తిన పెట్టుకుని అమ్మకు నివేదన చేస్తారు. ఆశ్వయుజ మాసంలో విజయదశమి మరుసటి సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం సిరిమానోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ప్రకారం ఈనెల 14వ తేదీన తొలేళ్ల ఉత్సవం, 15వ తేదీన సిరిమానోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.బొబ్బిలి యుద్ధం నేపథ్యంలో... విజయనగరం రాజు పూసపాటి విజయరామగజపతిరాజు సోదరే పైడితల్లి. బొబ్బిలి సంస్థానంతో యుద్ధానికి వెళ్లవద్దని, తన మనసు కీడు శంకిస్తోందని సోదరుడిని వారించిందట. అయినా యుద్ధం ఆగలేదు. 1757 జనవరి 23న జరిగిన బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడు చేతిలో తన అన్న వీరమరణం పొందాడని తెలుసుకున్న పైడితల్లి విజయనగరం పెద్దచెరువులో ఆత్మార్పణ చేసుకుంది. సేవకుడైన పతివాడ అప్పలనాయుడికి కలలో కనిపించి ఆమె చెప్పిన ప్రకారం ఆ చెరువులో జాలర్లతో వెతికిస్తే విగ్రహం దొరికింది. అక్కడే గుడి కట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. విజయనగరం రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న వనంగుడి అదే.రసవత్తరంగా సిరిమానోత్సవం... సిరిమానోత్సవం తిలకించడానికి ఈసారి ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సిరిమాను 55 నుంచి 60 అడుగుల పొడవుంటుంది. దాని చివరిభాగంలో ఇరుసు బిగించి పీట ఏర్పాటు చేస్తారు. ఆ పీటపై ఆలయ ప్రధాన పూజారి కూర్చుంటారు. సిరిమాను వేరొక చివర రథంపై అమర్చుతారు. సిరిమాను ఊరేగింపు మూడులాంతర్లు వద్ద గల పైడితల్లి అమ్మవారి గుడి నుంచి రాజాబజారు మీదుగా కోట వరకూ మూడుసార్లు సాగుతుంది. ఈ సిరిమాను ముందుండే బెస్తవారివల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ ఉత్సవానికి భక్తుల రద్దీ దృష్ట్యా 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.చదవండి: బాబు గారి ‘కొవ్వు’ బాగోతం బట్టబయలు నెల రోజుల పండగ సెపె్టంబర్ 20వ తేదీన పందిరి రాటతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అత్యంత అట్టహాసంగా జరిగే తొలేళ్ల ఉత్సవం, సిరిమానోత్సవం ఇందులో భాగమే. అలాగే ఈ నెల 22వ తేదీన తెప్పోత్సవం, 27న కలశ జ్యోతుల ఊరేగింపు, 29న ఉయ్యాలకంబాల ఉత్సవం, 30న చండీయాగం, పూర్ణాహుతితో పైడితల్లి అమ్మవారి జాతర ముగుస్తుంది. విజయనగరం రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అమ్మవారి వనంగుడి, మూడులాంతర్లు జంక్షన్ వద్ద ఉన్న చదురుగుడిలో విశిష్ట కుంకుమార్చనలు, అభిషేకాలు నెల రోజులు కొనసాగుతాయి. నగరపాలక సంస్థ పరిధిలో 50 వార్డుల్లోని మహిళలు రోజుకొక వార్డు చొప్పున ఘటాలను సమర్పిస్తుంటారు. అమ్మవారికి చీర, రవికె, సారె ఇచ్చి చల్లదనం చేస్తారు. పప్పు బియ్యం, చలివిడి నైవేద్యంగా సమర్పిస్తారు. -
కనుడు కనుడు రామాయణ గాథ
విజయనగరం రూరల్: రామాయణంలోని మానవత్వ విలువలను భావితరాలకు అందించడం కోసం ప్రముఖ వ్యాపారవేత్త నారాయణం నరసింహమూర్తి పన్నెండేళ్ల క్రితం బృహత్ సంకల్పం చేసి శ్రీరామనారాయణం ప్రాంగణం నెలకొల్పారు. నరసింహమూర్తి మొదటినుంచీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. నరసింహమూర్తి మరణాంతరం ఆయన సంకల్పానికి తోడుగా వాల్మికి రామాయణంలోని వివిధ కోణాలపై పరిశోధనల్ని ప్రోత్సహించడంతోపాటు రామాయణాన్ని భావితరాల జీవన మార్గంగా మలిచేందుకు ఆయన కుటుంబ సభ్యులు శ్రీవాల్మికి రామాయణ రీసెర్చ్ సెంటర్‌ను ఇటీవల ప్రారంభించారు. ఇప్పటివరకూ శ్రీరామనారాయణం ఒక ఆధ్యాతి్మక కేంద్రం మాత్రమే. వాల్మికి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో రామాయణంపై పరిశోధనలకు మరో అడుగు ముందుకు పడింది.12 వేల గ్రంథాలు ఏర్పాటు వాల్మికి రామాయణం రీసెర్చ్ కేంద్రంలో రామాయణానికి సంబంధించిన 12 వేల గ్రంథాలను అందుబాటులో ఉంచారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను లక్షకు పైగా పెంచే ఆలోచనతో ఉన్నామని నరసింహమూర్తి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ గ్రంథాలు తెలుగు, హిందీ, సంస్కృతం, ఆంగ్లంతో పాటు ఇతర ప్రముఖ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, యువత, ఆధ్యాతి్మక వేత్తలు, పండితులు, ప్రవచనకర్తలు, గురూజీలు, నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలుగా రీసెర్చ్ కేంద్రంలోనే ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పీహెచ్డీ చేసే వారికి ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని నరసింహమూర్తి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.యువత రావాలి ఈ కేంద్రానికి ప్రధానంగా యువత ముందుకు వచ్చి రీసెర్చ్ చేయాలి. రామాయణం ప్రబోధించే విలువలు, సీతారాముల కథను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంతటి అద్భుతమైన కేంద్రాన్ని ప్రారంభించి సమాజానికి అవకాశం కలి్పంచిన నారాయణం కుటుంబ సభ్యులు అభినందనీయులు. ప్రతి ఒక్కరూ ఈ కేంద్రాన్ని సందర్శించి జీవన మార్గాన్ని సుగమం చేసుకోవాలి. – డాక్టర్ ఎస్.వైష్ణవి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి పూర్వజన్మ సుకృతంమా తండ్రి ఆశయం మేరకు శ్రీరామనారాయణం ప్రాంగణంలో వాల్మీకి రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. దేశంలో పలు మార్గాల్లో ఉన్న ఆధ్యాత్మిక గురువుల సలహాలు, ఆశీస్సులతో ఈ కేంద్రం ఏర్పాటుచేసి సమాజ శ్రేయస్సుకు మా వంతు కృషి చేస్తున్నాం – నారాయణం శ్రీనివాస్, ఫౌండర్, శ్రీరామనారాయణం ప్రాంగణం -
మూడు జిల్లాల నేతలతో వైఎస్ జగన్ భేటీ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నేతలతో తన క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల నుంచి వచ్చిన ముఖ్య నేతలతో ఆయన తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల నియామకాలు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. -
టీడీపీ 100 రోజల పాలనపై ప్రజల రియాక్షన్
-
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న విజయనగరం యాత్రికులు
విజయనగరం క్రైమ్: చార్ధామ్ యాత్రకు వెళ్లి ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్నాథ్ ఆలయం ప్రాంతంలో కొండపై విజయనగరం జిల్లాకు చెందిన భక్తులు చిక్కుకుపోయారు. ఢిల్లీకి చెందిన సదరన్ ట్రావెల్స్ ద్వారా ఇటీవల చార్ధామ్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 30 మంది వెళ్లారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. రెండు రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తుండడం, వాతావరణం అనుకూలించకపోవడంతో భక్తులు కొండలపైనే నిలిచిపోయారు. జిల్లాకు చెందిన నలుగురిలో గొట్టాపు త్రినాథరావు దంపతులు గురువారం హెలికాప్టర్లో కొండ కిందకు వచ్చేశారు. డిప్యూటీ తహసీల్దార్ కొట్నాన శ్రీనివాసరావు, ఆయన భార్య హేమలత ఇంకా కేదార్నాథ్ కొండపైనే ఉన్నారు. కేదార్నాథ్ ఆలయం ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేదని హెలికాప్టర్ ప్రయాణం నిలిపివేశారని, తాము కొండపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు స్థానిక విలేకరులకు వారు శుక్రవారం ఫోన్లో తెలిపారు. భోజన, వసతి లభించక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన అక్కడి అధికారులతో మాట్లాడారు. శుక్రవారం కొంత మేరకు వాతావరణం సహకరించడంతో రెండు హెలికాప్టర్లు మాత్రమే కేదార్నాథ్ ఆలయం వద్దకు వెళ్లగలిగాయని, అయితే వాటిలో ఏపీ వారికి అవకాశం ఇవ్వకపోవడంతో కొండపైనే ఉండిపోయారని తెలిసింది. -
ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల గోల్ మాల్
-
విజయనగరం: నిలిచిపోయిన ఈవీఎంల రీ-వెరిఫికేషన్
Updatesవిజయనగరం ఎంపీ నియోజకవర్గంలోని ఈవీఎంల రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయిందిఈవీఎం బ్యాటరీ అంశంపై డిక్లరేషన్ ఇవ్వలేమన్న జిల్లా కలెక్టర్ఈసీ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ చేస్తామన్న కలెక్టర్మా దరఖాస్తులో మాక్ పోలింగ్ కోరలేదు. కోరకుండా మాక్ పోలింగ్ చేయడం ఏమిటని ప్రశ్నించిన బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పలనర్సయ్య.ఈసీ,జిల్లా అధికారుల తీరుపై మరింత బలపడిన అనుమానాలు.ఎన్నికల ఈవీఎంల అక్రమాలు బయటపడకుండా కుంటిసాకులు చెప్పి దరఖాస్తు చేసిన అభ్యర్ధులను తప్పు దారి పట్టిస్తున్న జిల్లా యంత్రాంగం.కోర్టు లేదా ఈసీ వద్ద తేల్చుకోండని వెరిఫికేషన్ కేంద్రం నుండి వెళ్లిపోయిన జిల్లా కలెక్టర్ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో నిలిచిపోయిన ఈవీఎంల రీ-వెరిఫికేషన్మాక్ పోలింగ్‌కు అంగీకరించని వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్బ్యాటరీ స్టేటస్ మాత్రమే వెరిఫై చేయాలని చంద్రశేఖర్ పట్టుజిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చిన ఆర్డీవో సూర్యకళవెరిఫికేషన్ కేంద్రానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రారంభం అయింది. నెల్లిమర్ల ఈవీఎం గోడౌన్లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం స్థానానికి చెందిన 2 ఈవీఎంలను ఎన్నికల అధికారులు రీ వెరిఫికేషన్ ప్రారంభించారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ హాజరయ్యారు.నెల్లిమర్ల నియోజకవర్గం కొండ గుంపాం, బొబ్బిలి నియోజక వర్గం కోమటపల్లి ఈవీఎంలు అభ్యర్థుల సమక్షంలో వెరిఫికేషన్ చేస్తారు. ఈవీఎం బాటరీ స్టేటస్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. బెల్లాన చంద్రశేఖర్ అభ్యర్థనతో ఈవీఎంల రీ వెరిఫికేషన్‌ను చేస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.ఈవీఎం బ్యాటరీల్లో గోల్ మాల్ఈవీఎం తనిఖీల్లో అడ్డంగా ఈసీ దొరికిపోయింది. గజపతినగరం బూత్ నంబర్ 20 ఈవీఎం తనిఖీల్లో లోగుట్టు బయటపడింది. పోలింగ్ నాడు 50 శాతం.. కౌంటింగ్ నాడు 99 శాతం ఛార్జింగ్ కనిపించింది. 84 రోజుల తరువాత తనిఖీ నాడు కూడా ఈవీఎం బ్యాటరీ 99 శాతం చార్జింగ్ చూపించింది. ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు పెరిగిందో ఈవీఎం తయారీ ఇంజనీర్లు, ఎన్నికల అధికారులు వెల్లడించలేదు.దత్తిరాజేరు మండలంలోని పెదకాడ ఈవీఎంని అధికారులు తనిఖీ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య ఫిర్యాదుతో ఈవీఎం వెరిఫికేషన్ చేశారు. వెరిఫికేషన్ కోసం ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ 9 గంటల పాటు నిర్వహిస్తే ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ 80 శాతానికి తగ్గింది. మరి పోలింగ్ జరిగిన ఈవీఎంలో 99 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా ఉందో అధికారులు చెప్పలేదు. ఈవీఎంలో డేటాను అధికారులు తొలగించారు. ఈవీఎం వీవీ ప్యాట్లను అధికారులు మాయం చేశారు. ఈవీఎంలో ఫ్యాన్, సైకిల్ గుర్తులు లేకుండా అధికారులు మాక్ పోలింగ్ చేపట్టారు. ఈవీఎం భద్రపరచిన తాళాలను అధికారులు పోగొట్టారు. మూడు గంటల తర్వాత స్పేర్ తాళం తెచ్చి తెరిచారు. ఈవీఎం కౌంటింగ్ హాల్ టేబుల్ సీసీ కెమెరా ఫుటేజీని అధికారులు ఇవ్వకపోవటం గమనార్హం. చదవండి: ఈవీఎంలు ఇక్కడ.. తాళాలు ఎక్కడ? -
నెల్లిమర్ల జూట్‌మిల్ మళ్లీ మూత
నెల్లిమర్ల: విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జూట్‌మిల్ మరోసారి మూతపడింది. జూట్ కొరతను కారణంగా చూపి సోమవారం కర్మాగారాన్ని లాకౌట్ చేశారు. ఇటీవల కాలంలో తరచూ మిల్లును లాకౌట్ చేస్తుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మిల్లులో పనిలేక, వేరేపనికి వెళ్లలేక కార్మిక కుటుంబాలు యాతన పడుతున్నారు. జూట్‌మిల్‌లో సుమారు 200 మంది రెగ్యులర్, మరో 1,800 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ముడిసరుకు కొరత పేరిట యాజమాన్యం మిల్‌ను అక్రమంగా మూసివేయడంపై కార్మిక కుటుంబాల ఆవేదన చెందుతున్నాయి. కొన్నేళ్లుగా ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలు చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కార్మికులకు ఎలాంటి సదుపాయాలు అందటం లేదు. 2016 నుంచి గ్రాట్యుటీ బకాయిలు కూడా జూట్ యాజమాన్యం చెల్లించలేదని కార్మికులు చెబుతున్నారు. చెక్కులు ఇచ్చినప్పటికీ ఖాతాలో నగదు లేకపోవడంతో చెల్లకుండాపోతున్నాయని రిటైర్డ్ కార్మికులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మిల్‌ను తెరిపించే ఏర్పాట్లు చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.కార్మికులకు న్యాయం చేయాలిరిటైర్డ్ కార్మికులకు 2016 నుంచి గ్రాట్యుటీ బకాయిలు కూడా జూట్ యాజమాన్యం చెల్లించలేదు. వారికి చెక్కులు ఇచ్చినప్పటికీ ఖాతాలో నగదు లేకపోవడంతో చెక్కులు చెల్లకుండా పోతున్నాయి. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జూట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. కర్మాగారం తెరిపించే ఏర్పాట్లు చేయాలి. – కిల్లంపల్లి రామారావు, సీపీఎం నాయకుడు, నెల్లిమర్ల -
ప్రేమోన్మాది ఘాతుకం.. విజయవాడలో వ్యాపారి దారుణహత్య!
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడ బృందావన కాలనీలోని గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కారణంతో ఓ ఉపాధ్యాయుడు.. యువతి తండ్రిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు విద్యాధరపురానికి చెందిన కంకిపాటి శ్రీరామచంద్రప్రసాద్(56) లబ్బీపేటలోని బృందావన్ కాలనీలో సింధూ భవన్ సమీపంలో కిరాణా షాపు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఉదయం వచ్చి వ్యాపారం నిర్వహించుకుని రాత్రి ఇంటికి వెళ్తుంటాడు. ఆయన కుమార్తె బీ.టెక్ పైనలియర్ చదువుతుంది.గత కొన్ని నెలలుగా ఒక ప్రైవేట్ స్కూల్లో పీటీ మాస్టర్‌గా పనిచేస్తున్న విద్యాధరపురానికి చెందిన మణికంఠ ప్రేమిస్తున్నానని తనను పెళ్లిచేసుకోమని శ్రీరామచంద్రప్రసాద్ కుమారై వెంటపడుతూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం యువతి తల్లిదండ్రులు మణికంఠను మందలించారు. గురువారం సాయంత్రం తండ్రితో పాటు కుమార్తె కూడా షాపునకు వెళ్లింది. రాత్రి 10 గంటల సమయంలో షాపు మూసి ఇద్దరు ఇంటికి బయలుదేరుతున్నారు.ఆ సమయంలో వారిపై కోపం పెంచుకున్న మణికంఠ షాపు వద్దకు చేరుకున్నాడు. అతను తన వెంట తెచ్చుకున్న కత్తితో శ్రీరామచంద్రప్రసాద్‌పై దాడి చేసి నరికి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే వ్యాపారి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మణికంఠను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. -
ప్రాణం తీసిన పరిచయం
-
విజయనగరం టీడీపీలో మంత్రి పదవుల చిచ్చు
ఏపీ నూతన మంత్రివర్గంలో పదవుల పందేరం విజయనగరం జిల్లాలో అసంతృప్తి జ్వాలలకు కారణం అయింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల టీడీపీ వాట్సప్ గ్రూపుల్లో పార్టీ కార్యకర్తలు నాయకత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంత్రి పదవులు దక్కని వారంతా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీరుపై మండిపడుతున్నారు. విజయనగరం రాజు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు?ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ కూర్పుతో విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో మంటలు రేగుతున్నాయి. మంత్రి పదవులు తప్పనిసరిగా దక్కుతాయనుకున్నవారికి పార్టీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. చంద్రబాబు, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చల వరకు మంత్రి పదవులు లిస్ట్ లో చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన పేర్లు ఉన్నాయని స్థానికంగా ప్రచారం జరిగింది.అయితే అనూహ్యంగా గవర్నర్ కు ఇచ్చిన జాబితాలో వీరిద్దరి పేర్లు మాయం అయ్యాయి. సీనియర్లకు బదులుగా ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీలోకి వచ్చి టికెట్ కొట్టేసిన ఎన్.ఆర్.ఐ, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కింది. పార్టీ కోసం ఏనాడు పనిచేయని శ్రీనివాస్ కు మంత్రి పదవి ఎలా ఇస్తారని సీనియర్ లు దుమ్మెత్తి పోస్తున్నారు.విజయనగరం జిల్లా రాజకీయాల్లోకి కళా వెంకట్రావు రాకను అశోక్ గజపతిరాజు తొలినుండి అడ్డుకుంటూనే ఉన్నారు. కళా వెంకటరావు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి వీళ్ల మద్య విభేదాలు ఉన్నాయనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల టికెట్ ఆశించిన కళావెంకటర్రావుని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి పోటీకి దింపారు.ఇక్కడ బొత్స సత్యన్నారాయణపై గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని చంద్రబాబు చెప్పినట్టు అప్పట్లో జిల్లాలో వార్తలు వినిపించాయి. చంద్రబాబు హామీ మేరకు..ఎన్నికల్లో విజయం సాధించిన కళావెంకటరావు మంత్రి పదవి ఆశించారు. విజయనగరం జిల్లా టిడిపిలో కూడా కళాకే మంత్రి పదవి అంటూ హోరెత్తించారు. మరో పక్క బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయనకు కూడా చంద్రబాబు మంత్రి పదవి హామీ ఇచ్చారని ఎన్నికల ప్రచారంలోనే ఆయన చెప్పుకున్నారు.ఇక్కడే జిల్లాలో సీనియర్ నేత, మాజీ కేంద్రం మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. బొబ్బిలి రాజులకు విజయనగరం రాజులకు ఉన్న శతాబ్దాల వైరం కారణంగా.. ఇప్పుడు బొబ్బిలి రాజ వంశస్తుడు అయిన బేబినాయనకి మంత్రి పదవి దక్కకుండా అశోక్గజపతరాజు అడ్డు చక్రం వేశారని సమాచారం. ఇదే విషయం బొబ్బిలి టిడిపి వాట్సప్ గ్రూపుల్లో హల్ చల్ చేసింది. దీనికి బేబినాయన కూడా వాయిస్ మెసేజ్ ద్వారా కేడర్ కు సమాధానం చెప్పుకున్నారు.రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావుకు, అశోక్ గజపతిరాజు, ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడులతో గతంలో ఉన్న విభేదాలే ఆయనకు మంత్రి పదవిని దూరం చేశాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నుండి కళా వెంకటరావును అచ్చెన్నాయుడు తరిమేయగా, విజయనగరం జిల్లాలో బొత్స సత్యన్నారాయణ లాంటి ఉద్దండుడుపై ఓటమి తప్పదనే పోటీకి అవకాశం ఇచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కళా వెంకటరావు గెలిచారు. అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి రాకుండా అశోక్ గజపతి రాజు అడ్డుకున్నారంటూ జిల్లాలో చర్చసాగుతోంది.రాజాం, ఎస్.కోట నియోజకవర్గాల నుండి గెలిచిన కొండ్రు మురళీ మోహన్, కోళ్ల లలిత కుమారి కూడా మంత్రి పదవి ఆశించిన వారిలో ఉన్నారు. సామాజికవర్గం ప్రాధాన్యతల దృష్ట్యా అవకాశం కోసం లాబీయింగ్ చేసుకున్నా వీళ్లకూ అశోక్ గజపతి రాజు ఆశీస్సులు దక్కలేదు. విజయనగరం జల్లాలో మంత్రిపదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ల అసంతృప్తికి అశోక్ గజపతిరాజే కారణం అని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. -
విజయనగరం: ఆ ఆర్టీసీ డ్రైవరన్న టైమింగ్.. దెబ్బకు స్మగ్లర్లు పరార్
విజయనగరం: గుర్తుతెలియని వ్యక్తులు బస్సులో విడిచిపెట్టి వెళ్లిన గంజాయితో కూడిన రెండు బ్యాగులను దత్తిరాజేరు మండలం పెదమానాపురం పోలీస్ స్టేషన్‌కు ఆర్టీసీబస్సు డ్రైవర్ పి.గణపతి సోమ వారం అప్పగించారు. ఎస్ఐ శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు నుంచి వైజాగ్ వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సులో రామభద్రాపురం వద్ద ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. పెదమానాపురం వద్దకు వచ్చేసరికి బస్సులో ఎంత మంది ఉన్నారో ఆర్టీసీ సిబ్బంది లెక్కిస్తున్న సమయంలో వారు టిక్కెట్లు తీయలేదని గమనించి నిలదీశారు. వారు వెంటనే బస్సుదిగి పారిపోయారు. ప్రయాణికులతో కలిసి వారు తెచ్చిన బ్యాగులు తెరిచి చూడగా గంజాయి ఉన్నట్టు గమనించారు. వెంటనే బస్సును స్టేషన్ వద్ద ఆపి గంజాయిని ఆర్టీసీ డ్రైవర్ అప్పగించారు. తహసీల్దార్ సుదర్శన్, వీఆర్వో ఆధ్వర్యంలో బ్యాగులో ఉన్న గంజాయిని తూకంవేసి 14.3 కేజీలు ఉన్నట్టు నిర్ధారించారు. గంజాయిని సీజ్ చేసి పరారైన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
కోట్లు పంచి అగచాట్లు
అంతా భ్రాంతియేనా..జీవితాన వెలుగింతేనా..అని ఓ సినీకవి అన్నట్లు తయారైంది జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన నాయకుల పరిస్థితి. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కోట్ల రూపాయలు ఓటర్లకు పంచినప్పటికీ తమను విజయం వరిస్తుందా? అన్న సందేహం వీడక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. వైఎస్సార్సీపీకి పూర్తి పట్టున్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎలాగైనా ఉనికిని కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఎన్ని అడ్డదారులు తొక్కినప్పటికీ ఫలితం ఎలా ఉంటుందో అంతుబట్టక దిగాలుగా ఉన్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: పోలింగ్ ముగిసి రెండు వారాలైంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మళ్లీ ఎగిరేది వైఎస్సార్సీపీ జెండాయేనని, రానున్న విజయం ఫ్యాన్దేనని రాజకీయ విశ్లేషకుల్లో అధికశాతం మంది ఢంకా భజాయించి చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ ముహూర్తం కూడా చెప్పేశారు. ప్రత్యర్థులైన టీడీపీ, జనసేన నాయకులు మాత్రం ఓట్ల కోసం తాము ఖర్చు చేసిన కోట్ల రూపాయలతో తమకు అనుకూల ఫలితం వస్తుందనే భ్రమలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసిన ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎలాగైనా ఉనికి కాపాడు కోవాలన్నది వారి ఉద్దేశం. ఇందుకోసం తాయిలాలతో పాటు మద్యం ఏరులై పారించారు. కోట్లాది రూపాయలు వెదజల్లారు. ఓటరైతే చాలు వెయ్యి రూపాయలు, ప్రత్యర్థి పార్టీవారైతే రెండు వేల రూపాయల వరకూ పంచడమే వారి అధికార దాహానికి అద్దం పడుతోంది. కరోనా వంటి కష్టకాలంలో తామంతా ముఖం చాటేసినా, కోటల గేట్లు మూసేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఏవిధంగా అండగా నిలబడిందీ, ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పనులు ఏవిధంగా చేసిందీ ప్రజలు గుర్తుంచుకున్నారన్న విషయమే ఇప్పుడు టీడీపీ, జనసేన నాయకులకు నిద్ర పట్టనీయడం లేదు. నోట్లు తీసుకున్నవారంతా ఓట్లేస్తే గట్టెక్కుతామన్న ధీమా వారికి కనబడడం లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసి ఎన్ని పక్కదారులు తొక్కినా ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. దీన్ని కప్పిపుచ్చుకుంటూనే తమ్ముళ్లలో మనోధైర్యం కల్పించడానికి టీడీపీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా పోటీచేసిన వారిని విజయనగరం రప్పిస్తూ, మనమే గెలుస్తున్నామంటూ రోజుకొకరితో ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ఈ ప్రకటనల భ్రమలో తెలుగు తమ్ముళ్లు భారీగా బెట్టింగ్‌లకు దిగుతున్నారు.పదవే పరమావధిగా పందేరంగతంలో ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ప్రజలకు తాయిలాలు ఇవ్వడమెరగని తండ్రి శైలికి భిన్నంగా ఆయన వారసురాలు మాత్రం ఈసారి రూ.కోట్లలో డబ్బులు బయటకు తీసినట్లు సమాచారం. అసెంబ్లీలో అధ్యక్షా అనాలనేదే లక్ష్యంగా విజయనగరం జిల్లాకేంద్రంలో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకూ ఖర్చు చేయడంపై ప్రజలే ఆశ్చర్యపోతున్నారు.👉 టీడీపీ సీనియర్ నాయకులను కంగుతినిపించి మరీ పారిశ్రామిక ప్రాంతంలో టికెట్ తెచ్చుకున్న మాజీ మంత్రి ఒకరు ఈసారి ఎలాగైనా గెలవాలని తనదైన ఎత్తులు జిత్తులన్నీ అమలుచేశారు. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు చోటుచేసుకున్న మారణకాండ మచ్చ నుంచి బయటపడటానికి, ఓటర్లను మభ్యపెట్టడానికి గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా పారించారు. ఓటర్ల లెక్క ప్రకారం ఒక్కో గ్రామానికి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ గుట్టుచప్పుడు గాకుండా మూటలు పంపించారంటేనే పరిస్థితి ఊహించవచ్చు.👉 గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకపోయినా ఈసారి టీడీపీ నాయకులకు ఝలక్ ఇచ్చి మరీ టికెట్ తెచ్చుకున్న కూటమి అభ్యర్థిని అధికార దాహంతో అడ్డదారులన్నీ తొక్కారు. తన విద్యాసంస్థను, తనకున్న స్వదేశీ, విదేశీ కంపెనీలను చూపించి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. ఓట్లేస్తే అందరికీ ఉద్యోగాలిచ్చేస్తానంటూ భ్రమలు కల్పించారు. గ్రామీణ ప్రజలకు మాత్రం అప్పటికే బకెట్లు పంచిన ఆమె పోలింగ్‌కు ముందు డబ్బుల పందేరానికి తెరతీశారు. ఇందుకు తమ సంస్థ ఉద్యోగులనే పావులుగా వాడుకున్నారు.👉 దీర్ఘకాలంగా తాను నమ్ముకున్న నియోజకవర్గం నుంచి కొత్త నియోజకవర్గానికి వలసవచ్చిన టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరతీశారు. చీపురుపల్లి–విజయనగరం ప్రధాన రహదారిని ఆనుకుని ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయమే కేంద్రంగా తాయిలాలు, నగదు పంపిణీ జరిగింది. ఒడిశా నుంచి చీప్ లిక్కర్‌తో పాటు సారా కూడా రప్పించి మరీ గ్రామాల్లో పారించారు.👉 బాబాయ్ సీటుకు ఎసరుపెట్టి ఆఖరి నిమిషంలో టికెట్ తెచ్చుకున్న ఓ టీడీపీ అభ్యర్థి తన తరఫున భారీ ఎత్తున డబ్బు పంపిణీకి ఏకంగా ఎన్నారైలను రంగంలోకి దించారు. అవినీతిలో అన‘కొండ’గా పేరొందిన తన తండ్రికి ఆ బాధ్యతలు అప్పగిస్తే ఎక్కడ తేడా కొడుతుందోనని ఆలోచించినట్లు ఉంది. అన్ని మార్గాల్లో నుంచి చేతికి అందొచ్చిన రూ.30 కోట్ల వరకూ పందేరం చేసినట్లు వినికిడి.👉 తనదే గెలుపు అని రెండేళ్లుగా కత్తి దూసి మరీ సోషల్ మీడియాలో చాటింపు వేయించుకున్న ఓ రాజు ఆఖరి నిమిషంలో తాయిలాల మోత మోగించారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ పంపిణీ చేయించారు. ఇందుకోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి లాడ్జిల్లో మకాం వేసిన బంధువులతో పాటు గతంలో మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించిన సోదరుడి సాయం తీసుకున్నారు. మరోవైపు ఖరీదైన మద్యాన్నే మందుబాబులకు రుచి చూపించారు.👉 గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ఓ నాయకురాలు తాయిలాల పంపిణీలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. తన చేతిలో ఉన్నది ఇదేనంటూ రూ.10 కోట్ల వరకూ ఎంపీ అభ్యర్థి చేతిలో పెట్టి ఊరుకున్నారట. ఇదే అదునుగా ఆ నియోజకవర్గానికి చెందిన కుటుంబంలోని భార్య ఒక పార్టీలో, భర్త ఒక పార్టీలో ఉంటున్న వారు డబ్బు పందేరంలో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. తన విద్యాసంస్థకు చెందిన విద్యార్థులనే పావులుగా వాడుకుంటూ ఎంపీ అభ్యర్థి పంపించిన డబ్బు మూటలు ఎవరికి ఎంతమేర ఇవ్వాలో చెబుతూ ఈ ఆదర్శ దంపతులు రూ.కోట్లలోనే వెనకేసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటుకు రూ.వెయ్యి చొప్పున డబ్బుతో పాటు మద్యం బాగానే ఇక్కడ టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. -
విజయనగరం పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ వద్ద హైడ్రామా
-
విజయనగరం జిల్లాలో 144 సెక్షన్
-
టీడీపీ మేనిఫెస్టోని మోదీయే నమ్మడం లేదు..
-
ఆ కష్టాలు మాకొద్దు ‘రాజా’..!
విజయనగరం: విజయనగరం.. చారిత్రక నేపథ్యం కలిగిన నగరం. ఏళ్ల తరబడి రాజుల పాలనలో ఉన్నా అభివృద్ధి శూన్యం. రాజులను నమ్మి జనం అధికారం కట్టబెట్టినా అది అలంకార ప్రాయంగానే చూశారు. ప్రజల కష్టాలు అరణ్యరోదనగానే మిగి లాయి. ఏ నాడూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న ధ్యాస, మంచిచేయాలన్న తపన రాజరిక కుటుంబానికి లేకపోవడమే దీనికి కారణం. ఓ వైపు నగర జనాభా పెరుగుతున్నా... కాలనీలు విస్తరించినా ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు కనీ సం కృషి చేయలేదు. ఆ ఆలోచన కూడా రాలేదు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు కోటదాటి బయటకు వచ్చిన సందర్భాలు అరుదు. జనానికి రాజు మొహం కనిపించిందంటే అదే మహాభాగ్యంగా ఉండేది. ఎన్నికల వేళ జనంలోకి రావడం.. తర్వాత బంగ్లాకు లేదంటే ఢిల్లీకి పరిమితం కావ డమే ఏళ్ల తరబడి సాగుతున్న తంతు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో నగర వాసులు దాహార్తితో అల్లాడినా మంత్రిగా ఉండి కనీసం పట్టించుకోలేదు. గుక్కెడు తాగునీటి కోసం బంగ్లా వద్ద ఆందోళనలు చేసినా కనికరించలేదు. రోడ్ల విస్తరణ పరిస్థితీ అంతే. తవ్వేసి వదిలేశారు. పాడైన రోడ్లపై రాకపోకలకు పట్టణ వాసుల అవస్థలు వర్ణనాతీతం. పదవీ కాలమంతా కోట, పరిసరాలను అందంగా తీర్చిదిద్దేందుకే పరిమితమయ్యారు. అన్ని రంగాల్లో నగర అభివృద్ధిని మసకబారించారన్న అపవాదను అశోక్ మూటగట్టుకున్నారు. కార్పొరేషన్ స్థాయిలో సదుపాయాల కల్పనకు అశోక్ కనీసం ఆలోచన చేయలేదని జనం బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నగరంలోని శివారు కాలనీల పరిస్థితి అయితే ఐదేళ్ల కిందట దుర్భరం. తాగునీరు, డ్రైనేజీలు, రోడ్ల సదుపాయాలు కల్పించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అశోక్ కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు కుమార్తె తరఫున ప్రచారానికి వస్తున్న అశోక్‌ను జనం బహిరంగంగానే నిలదీస్తున్నారు. మీరు పదవులు అనుభవించడమే తప్ప జనానికి ఏ రోజైనా మేలు చేశారా..? కనీసం మా సమస్యలు ఆలకించారా..? మాట్లాడేందుకు అవకాశం కల్పించారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.జనాభా పెరిగినా..విజయనగరంలో 2001 సంవత్సరంలో సుమారు లక్ష వరకు ఓటర్లు ఉండగా... 2005 నాటికి 1.05 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 2.44 లక్షల జనాభా ఉండగా.. 2014 సంవత్సరం నాటికి జనాభా సంఖ్య సుమారు 3 లక్షలు ఉండేది. అప్పట్లో గాజులరేగ, జమ్ము, ధర్మపురి, అయ్యన్నపేట, వేణుగోపాలపురం, కెఎల్‌పురం ప్రాంతాలను విజయనగరం మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పట్టణ విస్తీర్ణం పెరిగింది. వీటి పరిధిలో గుర్తింపు పొందిన మురికివాడలు 80 వరకు ఉండేవి. వీరిలో అర్హులైన వారికి హౌస్‌ఫర్ ఆల్ పథకంలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు స్వీకరించగా.. లబ్ధిదారుల నుంచి టీడీపీకి చెందిన దిగవ స్థాయి నాయకులు లంచాలు వసూలు చేసి చివరికి ఇల్లు అప్పగించకుండా మోసం చేసినట్టు కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 2014–19 మధ్య రూ.279 కోట్లతో రెండువేల పనులు చేపట్టేందుకు అప్పటి టీడీపీ పాలకవర్గం ఆమోదించగా... అందులో రూ.93 కోట్లతో 700 పనులు మాత్రమే పూర్తిచేయగలింది.నాటికి నేటికీ తేడా చూడు..రాజులు కోట, బంగ్లాకే పరిమితమైతే.. నేటి పాలకులు జనం మధ్యనే ఉంటూ.. జనం అవసరాలు తెలుసుకుంటూ అభివృద్ధి పనులు చకచకా పూర్తిచేస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. కేవలం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ 59 నెలల పాలనలో ఇది మన విజయనగరం అని మురిసిపోయేలా.. గర్వంగా చెప్పుకునేలా అన్ని కూడళ్లను అందంగా తీర్చిదిద్దారు. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేలా చెరువు గట్లను పార్కులుగా మలిచారు. మహిళల కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా పార్కును నిర్మించారు. తాగునీటి పథకాలు నిర్మించి నగరవాసులకు శాశ్వతంగా తాగునీటి కష్టాలను దూరం చేశారు. శివారు కాలనీలకు రోడ్లు వేశారు. విద్య, వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. సరస్వతీ నిలయాలకు సొబగులద్దారు. నగరంలో రోడ్ల విస్తరణ పనులు పూర్తిచేశారు. నగరానికి ఏ వైపు నుంచి వచ్చిన వారికై నా ఇది మన విజయనగర వైభవం అని చాటిచెప్పేలాహంగులు కల్పించారు.పాలకుడంటే జనం కష్టాలు తెలిసిన వాడు.. తెలుసుకునేవాడై ఉండాలి.. ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చగలగాలి. ఆపద సమయంలో నేనున్నాంటూ ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలి. ఓ విజన్‌తో నగరాభివృద్ధికి కృషిచేస్తూ.. ప్రతీ ఒక్కరికీ మంచి చేయాలన్న తపనతో ముందుకు సాగాలన్నది జనం మాట. అధికారాన్ని అలంకారంగా భావించి.. కష్ట కాలంలో కోటదాటని పాలకులు.. ఎన్నికల వేళ ప్రజల వద్దకు వస్తుంటే ఛీకొడుతున్నారు. దాహార్తితో అల్లాడుతున్నా పట్టించుకోని రాజులు.. రోడ్ల విస్తరణ పనులు పూర్తిచేయనివారు.. విజయనగర వైభవాన్ని మసకబారించేలా వ్యవహరించే రాజరిక పాలన మాకొద్దంటూ మొహంమీదే చెబుతున్నారు. అనునిత్యం అందుబాటులో ఉంటూ.. కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా విజయనగర అభివృద్ధికి అనునిత్యం పాటుపడే నాయకుడే పాలకుడుగా ఉండాలని సుస్పష్టం చేస్తున్నారు. -
బాబును చీల్చి చెండాడిన మహిళలు
-
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వ్యవసాయాధార ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో ఒకప్పుడు చెరకు సాగు రైతులకు లాభదాయకమైన పంట. ఇందుకు భీమసింగి సహకార చక్కెర కర్మాగారం, లచ్చయ్యపేట వద్దనున్న ప్రభుత్వ చక్కెర కర్మాగారం వల్ల ఎంతో మేలు పొందేవారు. కానీ వాటిని చూసి చంద్రబాబుకు కన్నుకుట్టింది. కమీషన్ల కోసం రైతుల కడుపుకొట్టడానికి వెనుకాడలేదు. ఆ రెండు చక్కెర కర్మాగారాల జీవం తీసేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్ల పాలన వాటికి శాపంగా మారింది. భీమసింగి చక్కెర కర్మాగారాన్ని మొట్ట మొదట మూతవేసింది 2003లోనే. అదే సమయంలోనే సీతానగరం మండలం లచ్చయ్యపేటలోనున్న ప్రభుత్వ చక్కెర కర్మాగారాన్ని అత్యంత చౌకగా ప్రైవేట్‌పరం చేసేశారు. 2004లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భీమసింగి సుగర్ ఫ్యాక్టరీకి జీవం పోశారు. లాభాల బాట పట్టించారు. మళ్లీ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా నష్టాల్లో ముంచారు. ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం రైతుల వంతుగా సేకరించిన రూ.5 కోట్ల సొమ్మును అప్పటి టీడీపీ నాయకులు దుర్వినియోగం చేశారు. చంద్రన్న విషగుళికల్లాంటి అసంజస నిర్ణయాల ఫలితంగా చెరకు రైతులు దారుణంగా నష్టపోయారు.భీమసింగిలో ఇలా...చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా పాలన (1995–2003)లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనున్న 18 ప్రభుత్వ, సహకార చక్కెర కర్మాగారాల్లో 8 ప్రైవేట్‌పరం చేసేశారు. ఆ సమయంలోనే భీమసింగి సుగర్ ఫ్యాక్టరీపై కత్తికట్టారు. 2003–04 సీజన్లో క్రషింగ్ చేయకూడదని ఆదేశాలివ్వడంతో తొలిసారిగా మూతపడింది. పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫ్యాక్టరీని తెరిపించారు. ప్రభుత్వ గ్యారెంటీతో రూ.3.50 కోట్ల రుణం అందించారు. ఫ్యాక్టరీకి గుదిబండగా మారిన అప్పులు రూ.18.04 కోట్లను ప్రభుత్వ షేరు ధనంగా మార్చారు. ఆధునికీకరణకు రూ.36.18 కోట్లు మంజూరు చేశారు. తద్వారా క్రషింగ్ సామర్థ్యాన్ని 1205 మెట్రిక్ టన్నుల నుంచి 2 వేల మెట్రిక్ టన్నులకు పెంచడం, పవర్ ప్లాంట్ ఉత్పత్తి కూడా 1.5 కిలోవాట్ల నుంచి 12 కిలోవాట్లకు పెంచడం లక్ష్యాలుగా నిర్దేశించారు. మిగులు విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా ఫ్యాక్టరీ కొంత లాభపడటం అనేదీ ఇందులో భాగం. మరోవైపు ఫ్యాక్టరీ ఆధునికీకరణకు తమ వంతు సహకారంగా రైతులు నుంచి రూ.3 కోట్ల వరకూ పెట్టుబడి నిధి కూడా సేకరించారు. దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే అది వడ్డీతో రూ.5 కోట్లు అయ్యింది. ఆ నిధికి టీడీపీ నాయకులు గండికొట్టేశారు. 2014 సంవత్సరంలో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం శాపంగా మారింది. రైతులు అడగకపోయినా ఆ డిపాజిట్లను పంచేశారు. అలా ఆధునికీకరణ ప్రతిపాదనను ఉద్దేశపూర్వకంగానే అటకెక్కించేశారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాల ఫలితంగా ఫ్యాక్టరీ సుమారు రూ.47.88 కోట్లు నష్టాల్లోకి వెళ్లింది. ఆప్కాబ్ నుంచి తెచ్చిన రూ.25 కోట్ల రుణంపై ఏటా రూ.3.2 కోట్ల వరకూ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. మరోవైపు యంత్రాలన్నీ పనిచేయకుండాపోయాయి.జగనన్న ప్రభుత్వంలోనే భరోసా.... లచ్చయ్యపేట కర్మాగారం యాజమాన్యం బకాయిపడిన బిల్లులు చెల్లించాలని రైతులు, వేతనాల కోసం కార్మికులు రోడ్డున పడ్డారు. వారికి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తన ప్రజాసంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎనిమిది నెలల వ్యవధిలోనే కర్మాగారం భూములను బహిరంగవేలం ద్వారా విక్రయించి రైతులకు, కార్మికులకు, ఉద్యోగులకు బకాయిలు చెల్లించారు. అలాగే లచ్చయ్యపేట, భీమసింగి ఫ్యాక్టరీలపై ఆధారపడిన చెరకు రైతులకు నష్టం లేకుండా మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ప్రభుత్వంతో చర్చించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఫలితంగా రైతులు గత నాలుగేళ్లుగా రేగిడి మండలం సంకిలి వద్దనున్న ఈఐడీ ప్యారీ సుగర్ ఫ్యాక్టరీకి చెరకును విక్రయిస్తున్నారు.లచ్చయ్యపేటలో అలా... తొలుత పార్వతీపురం డివిజన్లో రైతుల కోసం సీతానగరం, బొబ్బిలి ప్రాంతాల్లో 1936 సంవత్సరంలో శ్రీరామా చక్కెర కర్మాగారాలు ప్రారంభమయ్యాయి. వాటిలో బొబ్బిలి కర్మాగారం 1973లో, సీతానగరం కర్మాగారం 1974లో మూతపడ్డాయి. ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ 1992లో లచ్చయ్యపేట వద్ద కర్మాగారాన్ని నిర్మించడానికి అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దనరెడ్డి శంకుస్థాపన చేశారు. ఇది నిర్మాణం పూర్తయిన సందర్భంలోనే చంద్రబాబు తొలిసారిగా 1995 సెప్టెంబర్‌లో సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కర్మాగారాన్ని ప్రారంభించిందీ ఆయనే. లాభాల్లో సాగుతున్న సమయంలో నష్టాల ముసుగువేసి 2002 సంవత్సరంలో అత్యంత చౌకగా అమ్మకం పెట్టేసిందీ చంద్రబాబే. ఎన్సీఎస్ యాజమాన్యంలో కర్మాగారం పరిస్థితి మరింత దిగజారింది. ఏడాదికేడాది చెరకు రైతులకు బిల్లులు చెల్లించక ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. చెరకు రైతులకు రూ. 24 కోట్లు, కార్మికుల జీతాలు, బ్యాంక్ రుణాలు కలిపి మరో రూ.19 కోట్లు బకాయిలు పెట్టేశారు. దీంతో ఆందోళనకు దిగిన రైతులను, కార్మికులను బుజ్జగించడానికి చంద్రబాబు 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు యాజమాన్యం పరిధిలోఉన్న కర్మాగారం భూములను ఐడీఆర్ చట్టం కింద స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే వాటిని వేలం వేయకుండా 2019 సంవత్సరంలో పదవి దిగిపోయేవరకూ నాన్చుతూ వచ్చారు. -
అడుగడుగునా నీరా‘జనం’
(‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): మరోసారి చరిత్ర సృష్టించేందుకు చారిత్రక విజయనగరం జననేత జగనన్నకు అఖండ స్వాగతం పలికింది. అడుగడుగునా ప్రజలు జననీరాజనాలు పలికారు. ఉత్తరాంధ్ర కళారూపాలైన చెక్క భజనలు, కోలాటాలతో తమ అభిమాన నేతను అక్కున చేర్చుకున్నారు. విశాఖలోని ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద అభిమానుల కోలాహలం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభమైంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో 21వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఎండాడ నుంచి విజయనగరం వరకు సాగింది. దారిలో అడుగడుగునా అభిమానులు వెంటరాగా సీఎం జగన్ బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్ స్టేడియం, పీఎం పాలెం మీదుగా సాగిన యాత్ర జాతీయ రహదారి మొత్తం అభిమానులతో నిండిపోయింది. కొత్తవలస మండలంలోని చీడివలస గ్రామానికి చెందిన చెక్కభజన బృందంలోని అక్కచెల్లెమ్మలు జగన్ కోసం తరలివచ్చారు. ఎండాడ నుంచి కార్‌షెడ్ జంక్షన్, మధురవాడ, కొమ్మాది, పరదేశీపాలెం, గంభీరం, తాళ్లవలస వరకు వెంటనడిచారు. దారిపొడవునా అక్కచెల్లెమ్మల హారతులు, మహిళల కోలాటాలు, యువకుల తీన్మార్ డ్యాన్సులతో వారంతా సీఎం జగన్ యాత్ర వెంట అడుగులు వేశారు. జగన్ సైన్యంతో జాతీయ రహదారి కిటకిట.. ఇక ఉదయం పీఎంపాలెం వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్రలో పాల్గొనేందుకు అప్పటికే ఆయన రాకకోసం పెద్దఎత్తున మహిళలు, పిల్లలతో పాటు ఆటోడ్రైవర్లు తరలివచ్చారు. జగన్ బస్సుపై నుంచి అభివాదం చేయగానే ఆ ప్రాంతమంతా జగన్నినాదాలతో మార్మోగింది. వైఎస్సార్ స్టేడియం నుంచి మొదలైన జనప్రవాహం కొమ్మాది, మారికవలస మీదుగా ఆనందపురం జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ వేచి ఉన్న అక్కచెల్లెమ్మలు జగనన్నకు ఘనస్వాగతం పలికారు. జగన్‌ను దూరం నుంచి చూసిన అపార్ట్మెంట్లలోని మహిళలు, విద్యార్థులు సైతం బాల్కనీల్లో హుషారుగా కేరింతలు కొట్టారు. ‘గత ప్రభుత్వంలో ఏ చిన్న పనికావాలన్నా జన్మభూమి కమిటీల ద్వారా స్థానిక టీడీపీ నేతలను కలవాల్సి వచ్చేది. వారు అడిగింది ముట్టజెప్పినా, ఇష్టం లేకపోతే నెలల తరబడి తిప్పించుకునే వారు’ అని మహిళలు నాటి పీడకలలను గుర్తుచేసుకున్నారు. జగనన్న తీసుకొచ్చిన వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలతో ఇంటికే వచ్చి మీకేం అవసరమో చెప్పాలని అడిగి మరీ చేస్తున్నారని నేటి పరిస్థితులను వివరించారు. ఇది సామాన్యుల ప్రభుత్వమని, తామంతా ఆనందంగా ఉన్నామని జనం ముక్తకంఠంతో చెప్పారు. ఇక యాత్రలో భాగంగా సీఎం జగన్ ఆనందపురం జంక్షన్‌లోని చెన్నాస్ కన్వెన్షన్‌లో సోషల్ మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. అనంతరం.. మోదవలస జంక్షన్ మీదుగా విజయనగరం జిల్లాలో యాత్ర కొనసాగింది. జిల్లా నాయకులు, జగన్ అభిమానులతో మోదవల కూడలి జనసందోహంతో నిండిపోయింది. యువకులు ర్యాలీగా వెంటరాగా, మ.2 గంటలకు జొన్నాడ సమీపంలో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకున్నారు. అనంతరం సా.5 గంటలకు జొన్నాడ నుంచి చెల్లూరు వరకు ర్యాలీగా వచ్చి అక్కడ అశేష జనావాహినితో నిండిపోయిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఈ బహిరంగ సభకు విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగులు సీఎం జగన్‌కు మద్దుతుగా మూడు చక్రాల మోటార్ సైకిళ్లపై పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్ సీఎం అయ్యాకే తమ భవిష్యత్తు బాగుందని ఎంతో సంతోషంతో చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోకి బస్సుయాత్ర.. సభ అనంతరం సీఎం జగన్ చింతలవలస మీదుగా విజయనగరం జిల్లా సరిహద్దు గ్రామం కొప్పెర్ల చేరుకున్నారు. అప్పటికే చీకటి పడినా జగన్ కోసం పెద్దఎత్తున అభిమానులు అక్కడే ఉండి తమ ప్రియతమ నేతకు భారీ పూలదండలతో శ్రీకాకుళం జిల్లాలోకి ఆహ్వానించారు. కిక్కిరిసిన జన సందోహం మధ్య జగన్ అభివాదం చేస్తూ సవరవిల్లి, భోగాపురం మీదుగా రణస్థలం చేరుకున్నారు. అక్కడ ప్రజలు, నాయMý ులు రహదారిపై బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి జన సంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి అక్కివలస సమీపంలోని రాత్రి బసకు జగన్ చేరుకున్నారు. వైఎస్సార్సీపీలోకి బీజేపీ నేతలు ఎండాడ నైట్ క్యాంపులో ఎస్.కోట, గాజువాక, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, భీమిలి నియోజకవర్గ అభ్యర్థులతో పాటు ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్‌ను కలిశారు. వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పార్టీ కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇందులో బీజేపీ గాజువాక నియోజకవర్గం నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాశరావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవిందు, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి,సంపత్‌కుమార్ ఉన్నారు. వీరితోపాటు విశాఖ ఉత్తరం నుంచి జనసేన నాయకురాలు దివ్యలత, బీజేపీ నుంచి హేమాంబర్, వ్యాపారవేత్త షేక్ సలీమ్, షేక్ హుస్సేన్ బాషా తదితరులున్నారు. -
నా తండ్రి లాంటి వారు ఎమోషనల్ అయిన బొత్స
-
వీళ్ళే మన అభ్యర్థులు .. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
చంద్రబాబు అంటే చంద్రముఖి: వైఎస్ జగన్
-
చంద్రబాబు పాలన రక్తాన్ని పీల్చే పాలన.. బాబుపై సీఎం జగన్ సెటైర్లు
-
కూటమికి కొత్త పేరు పెట్టిన సీఎం జగన్..!
-
నారా సైన్యానికి బుద్ధి చెప్పటానికి ప్రజా సైన్యం సిద్ధం..!
-
ప్రజల అండతో సీఎం జగన్.. ఇతర పార్టీల అండతో చంద్రబాబు
-
ర్యాంప్ పై నడుస్తూ ప్రజలకు అభివాదం
-
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ
-
పొలాల్లో దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చు కానీ.. బాబును నమ్మలేం: సీఎం జగన్
సాక్షి, విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు వెనక బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఒకరు ప్రత్యక్షంగా మరొకరు పరోక్షంగా మద్దతిస్తున్నాయని విమర్శించారు. ఒక్క జగన్ మీదకు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఎగబడుతున్నారని మండిపడ్డారు. ఇంత మంది తోడేళ్లు ఏకమై తన మీద యుద్ధానికి వస్తున్నారని తెలిపారు. పెత్తందార్లకు, నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేసిన జగన్‌పై తోడేళ్ల దాడి సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజు మంగళవారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చెల్లూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు. ప్రజలను మోసాలతో వంచించడమే చంద్రబాబు పని అంటూ ధ్వజమెత్తారు. ప్రజలకు మంచి చేసిన జగన్‌పై తోడేళ్లు దాడికి దిగుతున్నాయని దుయ్యబట్టారు. మీ బిడ్డకు తోడుగా దేవుడి దయ, కోట్ల ప్రజల హృదయాలు ఉన్నాయన్నారు. మోసాల బాబుకు బుద్ది చెప్పేందుకు సిద్ధమా? ఎన్నికలప్పుడు కూటమి నమ్మించి మోసం చేస్తుందని మండిపడ్డారు సీఎం జగన్. నమ్మించి మోసం చేసిన కూటమి నేతల్ని 420 అంటారని అన్నారు. చంద్రబాబు వెనక దత్తపుత్రుడు ఉన్నాడని అన్నారు. ఓవైపు జగన్ ఒక్కడే అయితే మరోవైపు తోడేళ్లు ఏకమయ్యాయని విమర్శించారు. మోసాల బాబుకు బుద్ది చెప్పేందుకు మీరంతా సిద్ధమా?..చంద్రబాబుబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమా? అంటూ చెల్లూరు సభకు హాజరైన జనవాహినిని ఉద్ధేశించి సీఎం జగన్ ప్రసంగించారు. సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ. విజయ నగరం జిల్లాలో మహాసముద్రం కనిపిస్తోంది. శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించేందుకు మీరంతా సిద్ధమా? ఈ ఎన్నికలు.. రాబోయే అయిదేళ్ల భవిష్యత్తు. 58 నెలల్లో 130సార్లు బటన్ నొక్కి సంక్షేమం అందించాం. దాదాపు 40 పథకాలను పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందించాం. 2 లక్షల 70 వేల కోట్లు నేరుగా ప్రజలకు అందించాం. నాన్‌డీబీటీ ద్వారా మరో లక్ష కోట్లకు పైగా ఇచ్చాం. మొత్తం రూ. 3 లక్షల 75 వేల కోట్లకు పైగా అందించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాలకు నగదు వేశాం. మీ డ్రీమ్స్‌ను నా స్కీమ్స్‌తో నెరవేర్చాను. పిల్లలను చదివించేందుకు అమ్మఒడి పథకం తీసుకొచ్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. పిల్లల ఉన్నత చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన. డ్రీమ్స్ పేదింటి అమ్మది.. స్కీమ్స్ మీ బిడ్డవి. అక్కాచెల్లెమ్మల సాధికారత కోసం వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ. అక్కాచెల్లెమ్మల కోసం వైఎస్సార్ చేయూత తీసుకొచ్చాం. వైఎస్సార్ కాపునేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. చంద్రబాబుకు ఎప్పుడైనా ఇంతమంచి ఆలోచన వచ్చిందా? పేద ప్రజల గురించి ఏ ఒక్కరోజు కూడా చంద్రబాబు ఆలోచన చేయలేదు. చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి ఆ ఆలోచన రాలేదు. చంద్రబాబు హయాంలో చంద్రముఖి పాలన చూశాం. డ్రీమ్స్ అవ్వాతాతలవి.. స్కీమ్స్ మీ బిడ్డవి అవ్వాతాతల డ్రీమ్స్ నెరవేరుస్తూ ప్రతినెలా రూ.3 వేల పెన్షన్. వాలంటీర్ల ద్వారా ఒకటో తేదీనే ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్. డ్రీమ్స్ యువతది.. స్కీమ్స్ మీ జగనన్నది. దేశంలో ఎప్పుడూ జరగని విధంగా ఉద్యోగాలిచ్చాం. 58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం. 31 లక్ష ఇళ్ల పట్టాలను పేదింటి మహిళలకు ఇచ్చింది మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంత మంచి చేసిన మీ అన్నకు రాఖీ కడతారా?. స్టార్ క్యాంపెయిన్లుగా మీరంతా మీ అన్నకు తోడుగా ఉంటారా? చంద్రబాబు హయాం అంతా.. మోసం,మోసం, మోసం బాబు పాలనలో స్కీంలు ఉండవు.. స్కాంలు మాత్రమే ఉంటాయి. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారు. విజయవాడలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ నడపడం తప్ప చంద్రబాబు చేసింది ఏంటి? ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి. డ్రీమ్స్ రైతులవి.. స్కీమ్స్ మీ జగన్‌వి ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్. పెట్టుబడి సాయంగా రైతు భరోసా రూ. 13,500 ఇచ్చాం. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, రూ. 65 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు. దోచుకోవడం.. పంచుకోవడమే చంద్రబాబు డ్రీమ్. పొలాల్లో పెట్టే దిష్టిబొమ్మనైనా నమొచ్చేమోకానీ చంద్రబాబును నమ్మలేం. ప్రతి ఎన్నికల సమయంలో రంగరంగుల మేనిఫెస్టో తెస్తారు. ఎన్నికల అయిపోయాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడు చంద్రబాబు. నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. గ్రామాల కోసం 7 స్కీమ్‌లు తీసుకొచ్చాం సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్‌క్లినిక్ స్కూళ్ల రూపురేఖలు, మహిళా పోలీస్, డిజిటల్ లైబ్రరీలు 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి మాట ఇస్తే నిలబడే పాలన మీ జగన్‌ది చంద్రబాబు మోసాలను గుర్తు చేసుకోండి ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచన చేయండి -
అడుగడునా ప్రజల కష్టాలు వింటూ ముందుకు సాగుతున్న సీఎం జగన్
-
చెల్లూరు సీఎం జగన్ బహిరంగ సభ భారీ ఏర్పాట్లు..!
-
సీఎం జగన్ బహిరంగ సభ భారీ ఏర్పాట్లు..@చెల్లూరు
-
చంద్రబాబు కుట్ర రాజకీయాలతో... ‘ప్రతిభ’కు దక్కని గౌరవం!
విజయనగరం: కావలి ప్రతిభా భారతి... టీడీపీ సీనియర్ నాయకురాలు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఆమె కీలక నేత. మంత్రిగా, స్పీకర్‌గా ఆమె విశేష సేవలు అందజేశారు. చిత్తశుద్ధి, విలువలతో కూడిన రాజకీయాలకు ఆమె కేరాఫ్‌గా మారారు. అలాంటి నాయకురాలి కుటుంబానికి చంద్రబాబు నాయుడు రాజకీయ సమాధికట్టారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టే ప్రతిభా భారతి కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారని సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కేటాయించకుండా.. డబ్బులకోసం వలసనాయకుడికి టికెట్ అమ్మేశారని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు గెలిచి రాష్ట్రంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభా భారతిని చంద్రబాబు నిలువునా ముంచడంతో ఏమిచేయాలో తోచక.. చంద్రబాబు, కోండ్రుల కుట్ర రాజకీయాలను చూసి ఓర్వలేక.. సొంతగ్రామానికి కూడా రాకుండా విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ఆమె గడుపుతున్నారు. గ్రీష్మకు రిక్తహస్తం.. ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ టీడీపీ కోసం చాలా కష్టపడ్డారు. తల్లికి అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 2014 నుంచి 2019 వరకూ రాజాంలోనే ఉంటూ అనేక కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సొంత సొమ్ము ఖర్చుచేశారు. 2019లో టిక్కెట్ వస్తుందని ఆశపడి భంగపాటుకు గురయ్యారు. తల్లీకూతుళ్ల వద్ద డబ్బులు లేవని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి చెందిన కోండ్రును టీడీపీలోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో 16,800 ఓట్ల తేడాతో కోండ్రు ఓడిపోయారు. అనంతరం దాదాపు మూడున్నరేళ్లు నియోజకవర్గంలో టీడీపీ కేడర్‌ను ఆయన పట్టించుకోలేదు. ఈ సమయంలో గ్రీష్మ పార్టీకి అండగా నిలిచారు. 2022లో ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడు సభలో తొడగొట్టి వైఎస్సార్సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. టికెట్ తనకే వస్తుందని ఆశపడ్డారు. రాజాంలో చంద్రబాబు, లోకేశ్‌ల పర్యటనల విజయవంతానికి కృషిచేశారు. చివరకు తండ్రీకొడుకులిద్దరూ ఆమెకు టికెట్ కేటాయించకుండా పంగనామాలు పెట్టడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని తమ అనుచరుల వద్ద తరచూ ఏకరువు పెడుతూ.. కోండ్రును చిత్తుగా ఓడించేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతున్నట్టు సమాచారం. 25 ఏళ్లుగా ఊరిస్తూ.. మరోవైపు అటు పాలకొండ ఎస్సీ నియోజకవర్గంగా, ఇటు రాజాం నియోజకవర్గం ఏర్పడిన తరువాత పాలకొండ, రాజాం ప్రాంతాల్లో నివసిస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగినికి కూడా చంద్రబాబు నిరాశే చూపించారు. 1994 నుంచి ఓ ప్రభుత్వ ఉద్యోగి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తూ వస్తోంది. టీడీపీ కార్యక్రమాలకు అండగా ఉంటూ ఆర్థిక సాయంచేస్తూ వచ్చింది. పాలకొండ ఎస్సీ రిజర్వేషన్లో ఉన్న సమయంలోనే ఆమెకు టికెట్ ఇస్తామని టీడీపీ ఆశచూపింది. అప్పట్లో పలు పత్రికల్లో కూడా ఆమె పేరు బయటకు వచ్చింది. ఆమెకు టికెట్ కేటాయిస్తామని ఆశచూపిన చంద్రబాబు.. తిరిగి నిరాశే మిగిల్చారు. డబ్బున్నవారికే టీడీపీ టిక్కెట్ ఇస్తామని చేతలతో స్పష్టంచేశారు. రాజాంలో సోమవారం నిర్వహించిన ప్రజాగళం సభకు కూడా టీడీపీ వ్యతిరేక వర్గం హాజరుకాలేదు. ప్రతిభాభారతి అభిమానులు, ఇటు సామాజిక వర్గ నేతలు తమ ప్రతాపాన్ని ఓటు రూపంలో చూపిస్తామని చెబుతున్నారు. కన్నింగ్ నాయకుడికి బుద్ధిచెబుతామని స్పష్టంచేస్తున్నారు. -
చంద్రబాబు కుట్రతో పెన్షన్ దారులకు అష్టకష్టాలు
-
చంద్రబాబు చేసిన పనికి పెన్షన్ కోసం ఇబ్బందులు
-
పాపం.. కళావెంకటరావు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకప్పుడు చక్రం తిప్పింది ఆయనేనా? అనే సందేహం కళా అనుచరులను వెంటాడుతోంది ఇప్పుడు! గ్రామస్థాయి నాయకుడైన నడికుదిటి ఈశ్వరరావు (ఎన్ఈఆర్) టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించి మరీ ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి టికెట్‌ను తన్నుకుపోయారు. అతనికి ఇప్పించేందుకు చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆడిన రాజకీయ వైకుంఠపాళిలో కళా పావుగా మారిపోయారని ‘సాక్షి’ ఇప్పటికే వెలుగులోకి తెచ్చింది. ఆఖరి నిమిషంలో కళా తేరుకొని హైదరాబాద్, విజయవాడ మధ్య చక్కర్లు కొట్టినా వ్యయప్రయాసలు మాత్రమే మిగిలాయి. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఈశ్వరరావు పేరును బీజేపీ బుధవారం ప్రకటించింది. తూర్పు కాపు (బీసీ) సామాజికవర్గ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గంలో ‘కమ్మ’ని వ్యూహం ఫలించింది. టీడీపీలో మరో సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు వద్దు వద్దంటున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కటే కళావెంకటరావు ముందు కనిపిస్తోంది. కుటుంబ హెచ్చరికలను బేఖాతరు చేసి అక్కడికి వెళ్తారా అనేదీ సందేహమే. ఇక మిగిలిన మరో దారి విజయనగరం లోక్‌సభ టిక్కెట్ మాత్రమే. తీరా అక్కడ ఐవీఆర్ఎస్ సర్వేల్లోనూ కళావెంకటరావు వినిపించట్లేదు. దీన్నిబట్టి అక్కడా టికెట్ వచ్చేట్లు కనిపించట్లేదు. పాపం... కళావెంకటరావు! ఆయన పరిస్థితి కరివేపాకు కన్నా అధ్వానంగా అయిపోయిందని ఆయన అనుచరులు చంద్రబాబుపై లోలోనే రగిలిపోతున్నారు. -
విజయనగరం జిల్లా టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
-
లోకేష్ సభలో తన్నుకున్న తమ్ముళ్లు
-
IPL- CSK: ఆడుదాం–ఆంధ్రా నుంచి ఐపీఎల్‌కు..
Adudam Andhra- సాక్షి, విజయనగరం(జామి): వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సంకల్పం నెరవేరుతోంది. గ్రామీణ ప్రాంతం క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఆడుదాం–ఆంధ్రా పోటీల్లో రాణించిన క్రీడాకారులకు ఆఫర్లు వరుసకడుతున్నాయి. క్రికెట్ పోటీల్లో రాణించిన జామి మండలం అలమండకు చెందిన కె.పవన్‌కు ఐపీఎల్లో ఆడే అవకాశం చేరువైంది. పవన్ ప్రతిభను గుర్తించిన సీఎస్కే (చెన్త్నె సూపర్ కింగ్స్) అతడిని దత్తత తీసుకుంది. అతడికి శిక్షణ ఇచ్చి జట్టులో ఆడే అవకాశం కల్పించనుంది. వివరాల్లోకి వెళ్తే.. పవన్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువ. మొదట్లో ఇంటి వెనుక ఉన్న చిన్న గ్రౌండ్లో క్రికెట్ ఆడుకునేవాడు. తరువాత గ్రామంలో హైస్కూల్ గ్రౌండ్లో ఆడేవాడు. తల్లిదండ్రుల మరణంతో క్రికెట్ లో బాగా రాణించేవాడు. అయితే, శిక్షణ తీసుకోవడానికి ఎటువంటి ఆసరా లేదు. చాలా నిరుపేద కుటుంబం. తండ్రి చిన్న వయసులోనే మృతిచెందాడు. తల్లి కూడా మృతిచెందింది. మామయ్య పైడిరాజు వద్ద ఉంటున్నాడు. ఈ సమయంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం–ఆంధ్రా క్రీడపోటీలకు హాజరయ్యాడు. మండల, నియోజకవర్గం, జిల్లాస్థాయి పోటీల్లో అలమండ జట్టు విజయంలో పవన్ ఆల్‌రౌండర్ ప్రతిభ చూపాడు. విశాఖపట్నంలో జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఫీల్డింగ్, బౌలింగ్‌లో ప్రతిభ చూపాడు. పవన్‌లోని క్రీడా నైపుణ్యాన్ని సీఎస్కే గుర్తించి దత్తత తీసుకుంది. అతడి ఆట మరింత మెరుగుపడేలా శిక్షణ ఇవ్వనుంది.కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రీడా యజ్ఞం ఆడుదాం ఆంధ్రా ఈవెంట్‌కు విచ్చేసిన సీఎస్కే టాలెంట్ హంట్‌లో భాగంగా పవన్‌ను ఎంపిక చేసింది. అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కేవీఎం విష్ణు వర్ధినిని కూడా సెలక్ట్ చేసింది. ఆడుదాం–ఆంధ్రాతో నాకు ఈ గుర్తింపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి ఆలోచనతో ఆడుదాం–ఆంధ్రా క్రీడాపోటీలు నిర్వహించారు. దీనివల్ల మా లాంటి గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ చూపేందుకు వేదిక దొరికింది. సీఎస్కే నన్ను దత్తత తీసుకోవడం ఆనందంగా ఉంది. విశాఖలో జరిగిన రాష్ట్రస్ధాయి పోటీల్లో ముఖ్యమంత్రి అభినందించారు. – కె.పవన్, క్రికెట్ క్రీడాకారుడు, అలమండ గ్రామం చదవండి: Adudam Andhra: విజేతల జాబితా ఇదే.. -
ఖుర్దా రోడ్-విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్
సాక్షి, ఢిల్లీ: ఒడిశాలోని ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం వరకు 363 కిలో మీటర్ల దూరం మూడవ రైల్వే లైన్ నిర్మాణంతోపాటు భద్రక్-విజయనగరం సెక్షన్లో నెర్గుడి - బరంగ్ మధ్య 22 కిలో మీటర్ల మేర మూడో రైల్వే లైన్‌ను 4962 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ప్రతిపాదనలకు గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. ప్రధాన మంత్రి గతి శక్తి పథకం కిందపైన పేర్కొన్న రెండు సెక్షన్లలో మూడో రైల్వే నిర్మాణ ప్రాజెక్ట్ ఎప్పటిలోగా పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేమని మంత్రి వివరించారు. రైల్వే ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తి చేయడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన పూర్తి చేయాలి. రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకంగా నిలిచే అడవుల తొలగింపుకు అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయాలి. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి అవసరమయ్యే అనుమతులు లభించాలి. రైల్వే లైన్ నిర్మాణం తలపెట్టే భూమి స్వరూప స్వభావాలపై అధ్యయనం జరగాలి. ప్రాజెక్ట్ సైట్లో శాంత్రి భద్రతలను పటిష్టం చేయాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏడాది కాలంలో ఎన్ని నెలలపాటు ప్రాజెక్ట్ పనులు నిర్విరామంగా కొనసాగుతాయే వంటి పలు అంశాల ఆధారంగా మాత్రమే ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో ఒక అంచనాకు రాగలమని రైల్వే మంత్రి తన జవాబులో వివరించారు. హస్త కళల అభివృద్ధి కోసం ఏపీకి 3911 కోట్లు జాతీయ హస్తకళల అభివృద్ధి కార్యక్రమం, సమగ్ర హస్తకళల క్లస్టర్ అభివృద్ధి పథకం కింద గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3911.25 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ పేర్కొన్నారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ 2018-19 నుంచి 2023-24 వరకు నేషనల్ హాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎన్హెచ్డిపి), సీహెచ్డీసీ పథకాల కింద విడుదల చేసిన మొత్తం నిధుల్లో రూ.2439.8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎన్‌హెచ్‌డీపీ కింద ఐదేళ్లలో రూ.3378.99 కోట్లు విడుదల చేయగా రూ.1907.54 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే కాంప్రహెన్సివ్ హ్యాండిక్రాఫ్ట్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం కింద ఐదేళ్లలో రూ.532.26 కోట్లు నిధులు మంజూరు చేసి విడుదల చేయగా మొత్తం నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. హస్త కళల అభివృద్ధి కోసం ఎన్హెచ్డిపి, సీహెచ్డీసీ పథకాలను వేర్వేరు ఉద్దేశాలతో రూపొందించినట్లు మంత్రి తెలిపారు. హస్త కళాకారులు పదివేల మందికి మించి ఉన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి గొలుసు అభివృద్ధి చేయడం సీహెచ్సీడీ పథకం ఉద్దేశమైతే, హస్త కళాకారులకు వ్యక్తిగతంగా అలాగే 1000 మందికి మించని చిన్న క్లస్టర్లకు మార్కెటింగ్ ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పించడం, నైపుణ్యాలను పెంపొందించడం ఎన్‌హెచ్‌డీపీ ఉద్దేశ్యమని తెలిపారు. ఎన్‌హెచ్‌డీపీ స్కీం కింద మార్కెటింగ్ సదుపాయం, నైపుణ్యాభివృద్ధి, క్లస్టర్ అభివృద్ధి, ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పాటు, హస్తకళాకారులకు డైరెక్ట్ బెనిఫిట్, మౌలిక సదుపాయాలు, సాంకేతిక సహకారం, హస్తకళాకారులకు, క్లస్టర్లకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సహకారం అందించడం ద్వారా వ్యాపార ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించడం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సీహెచ్డీఎస్ కింద రాష్ట్ర స్థాయిలో ప్రాజక్టులు ఏర్పాటు చేయడం, అవి ఆయా రంగాల్లో విశేష అనుభవం కలిగిన కేంద్ర/ రాష్ట్ర హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా క్లస్టర్ ప్రాజక్టు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. -
డబ్బు సంచులు తెచ్చినోళ్ళు ముందుకు రండి!
సీనియర్లు పక్కకు వెళ్ళిపోండి.. డబ్బు సంచులు తెచ్చినోళ్ళు ముందుకు రండి. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న రాజకీయం ఇదే. ఎన్నికలు ముంచుకొస్తుండటంతో చంద్రబాబు వక్రబుద్ధి మరోసారి బయటపెట్టుకుంటున్నారు. జిల్లా ఏదైనా, నియోజకవర్గం ఏదైనా డబ్బుతో వచ్చేవారికే టిక్కెట్ అని తేల్చి చెప్పేస్తున్నారు. పార్టీ పుట్టినప్పటినుంచీ ఉన్నవారిని, వారి వారసుల్ని కాదని కొత్తవారి కోసం వెతుకుతున్నారు. దీంతో ఉత్తరాంధ్రలోని ఓ జిల్లా సీనియర్లంతా చంద్రబాబుపై మండిపడుతున్నారు. ఆ జిల్లా ఏదో.. ఆ నేతలెవరో చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో పచ్చ జెండా ఎగురుతోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత ఫ్యాన్ స్పీడ్‌కు సైకిల్ అడ్రస్ గల్లంతయింది. జిల్లాలోని కొన్ని రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు టీడీపీ పుట్టినప్పటినుంచి ఆ పార్టీ జెండాను మోసాయి. మూడు కుటుంబాలు టీడీపీలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వెలిగారు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా వెనకబడ్డాయి. దీంతో సీనియర్ నేతల కుటుంబాలకు ఈసారి టిక్కెట్లు ఇచ్చేది లేదని పచ్చ పార్టీ బాస్ చంద్రబాబు తెగేసి చెబుతున్నారు. డబ్బు గుమ్మరించే వారిని తీసుకురండి అని చెబుతున్నారు. అటువంటి వారు కనిపిస్తే వారికే టిక్కెట్ అని హామీలిచ్చేస్తున్నారు. ఆక్..పాక్..కరివేపాక్..అంటూ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుతో సీనియర్ నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్.కోట నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత కోళ్ల అప్పలనాయుడు కోడలు లలితకుమారికి ఈసారి టిక్కెట్ లేదని చెప్పేశారు. టీడీపీ ఏర్పడకముందు ఇండిపెండెంట్‌గా గెలిచిన కోళ్ల అప్పలనాయుడు టీడీపీ వచ్చాక ఆ పార్టీ తరపున 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తర్వాత అప్పలనాయుడు కోడలు లలిత కుమారి రెండు సార్లు టిడిపి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎస్.కోట టీడీపీలో ఈ కుటుంబానిది తిరుగులేని నాయకత్వం. కానీ ఈ ఎన్నికల్లో లలిత కుమారికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవలే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన NRI పారిశ్రామిక వేత్త గొంప కృష్ణకు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయ నేపధ్యం లేకపోయినా బాగా డబ్బున్న వ్యక్తి కావడం అనే కారణంతో కోళ్ల కుటుంబాన్ని పక్కన పెట్టి గొంప కృష్ణకు ఎస్.కోట టికెట్ ఇవ్వబోతున్నారనే చర్చ పార్టీలో సాగుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో పతివాడ నారాయణస్వామి 7 సార్లు టిడిపి తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఈయన అనుభవం అపారం. అయితే వృద్దాప్యం కారణంగా వారసులుకి అవకాశం కల్పించాలని ఆయన చంద్రబాబును కోరారు. కానీ ధనికులకే టికెట్ అనే కాన్సెప్ట్ తీసుకువచ్చిన చంద్రబాబు.. పతివాడ నారాయణస్వామి కుటుంబం విన్నపాన్ని విస్మరించారు. ఎయిర్పోర్ట్ వస్తున్న భోగాపురం పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా సంపాదించిన కర్రోతు బంగార్రాజుకు నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా ఇంజనీరింగ్ కాలేజీలు, సాఫ్ట్వేర్ కంపెనీల యజమాని అయిన లోకం మాధవి జనసేన తరపున టికెట్ రేసులోకి వచ్చారు. బంగార్రాజు కంటే ఈమె దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయని తెలియడంతో నెల్లిమర్ల సీటును టీడీపీ తరపున లోకం మాధవికి ఇస్తామని హింట్ ఇచ్చారు. దీంతో రియల్టర్ బంగార్రాజు ఖంగు తిన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో బొబ్బిలి చిరంజీవి మాస్టర్ టిడిపి తరపున మూడు సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయనను పక్కన పెడతారనే ప్రచారం సాగుతోంది. బోనెల విజయచంద్ర అనే వ్యాపారవేత్తను పార్వతీపురం రాజకీయ తెరమీదకు తీసుకుచ్చారు. ఇది ఎస్సీ నియోజకవర్గం అయినా చంద్రబాబు విడిచి పెట్టలేదు. డబ్బు బాగా ఖర్చు పెట్టగలవారికే టికెట్ అని తేల్చి చెప్పేశారు. విజయచంద్రకు రాజకీయ నేపధ్యం లేకపోయినా పార్వతీపురం టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని నియోజకవర్గం టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. బలమైన కేడర్, పార్టీతో లాంగ్ జర్నీ, ఆపద కాలంలో పార్టీని నిలబెట్టారు అనే సెంటిమెంట్, ఎమోషన్ ఏ మాత్రం లేకుండా డబ్బున్నోడు కనబడగానే సీనియర్లను పూచిక పుల్లల్లా తీసి పక్కన పడేస్తున్నారు పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు నైజం తెలుసుకుంటున్న జిల్లా సీనియర్లు ఆయనపై మండిపడుతున్నారు. -
రేపు వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం
-
విజయనగరం జిల్లాలో డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థికసాయం
-
సీనియర్లకు టీడీపీ అధినేత ఝలక్
అవసరానికి వాడుకోవడం.. అవసరం తీరాక మోహంచాటేయడం.. మాట విననివారికి వెన్నుపోటు పొడవడం వంటివి చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య!. ఓటర్లు, నాయకులు, సొంత బంధువులపైనా ఆయనది అదే ధోరణి!. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార దాహంతో రగిలిపోతున్నారు. దీనికోసం పార్టీకి దశాబ్దాల తరబడి సేవలందించిన సీనియర్ నాయకులను కాదని డబ్బున్నోళ్లకే సీట్లు కేటాయించేందుకు రెడీ అవుతుండడంతో ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేగుతోంది. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును కొన్ని వర్గాలవారు బహిరంగంగానే విమర్శిస్తుండగా, మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: వారంతా ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు... సుదీర్ఘ కాలంగా తెలుగుదేశంపార్టీలో విశేషమైన సేవలు అందించినవారు... అందులోనూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా! టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఆ పార్టీను, అధినేత చంద్రబాబును నమ్ముకునే ఇన్నాళ్లూ ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యం చెందినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబును ప్రజలు ఛీదరించుకున్నప్పటికీ ఆయన వెన్నంటే ఉంటూ నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారు. తీరా 2014 ఎన్ని కలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నో దశాబ్దాలుగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వారి కష్టాన్ని గుర్తించకుండా వారి దగ్గర డబ్బు సంచులు లేవనే నెపంతో ఇప్పుడు వారిని పక్కనపెట్టేసి కోట్లకు పడగలెత్తిన ప్రవాస భారతీయులను, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు నాయకులు ఎవరైనా సరే అవసరానికి వాడుకొని కరివేపాకులా పక్కనపడేస్తారన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది. బీసీ జపం చేసే చంద్రబాబు ఆచరణలోకి వచ్చేసరికి గెలుపుగుర్రాల పేరుతో ధనబలం ఉన్న వారివైపే మొగ్గు చూపిస్తున్నారని జిల్లాలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరి నాయకత్వానికి తిలోదకాలు! ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఎస్.కోట, నెల్లిమర్ల, పార్వతీపురం నియోజకవర్గాల్లో టీడీపీ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే నాయకులు కోళ్ల అప్పలనాయుడి కోడలు కోళ్ల లలితకుమారి, పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలి చిరంజీవులు. ఈ ముగ్గురు నాయకులు టీడీపీలో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్నావారే. కానీ ప్రస్తుతం వారి ముగ్గురి పరిస్థితి త్రిశంకుస్వర్గంలా మారింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్ దక్కే అవకాశాలు దాదాపుగా లేవనే చర్చలు సాగుతున్నాయి. ఆ ముగ్గురు సీనియర్ నాయకులు జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గాలైన కొప్పలవెలమ, తూర్పుకాపు, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. 45 ఏళ్ల సీనియార్టీకి చిక్కులు ఎస్.కోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుటుంబానికి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. ఆమె మామ కోళ్ల అప్పలనాయులు ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అందులో ఆరు సార్లు టీడీపీ నుంచే కావడం గమనార్హం. ఒకసారి మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన కోడలు లలిత కుమారి రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఐదేళ్లూ ప్రతిపక్షంలో సైతం టీడీపీ అండగా ఉన్నారు. అయితే, ఆమె దగ్గర ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి రూ.కోట్లలో డబ్బులు లేవని, ఉన్నా ఖర్చు చేయరనే ఒకేఒక్క సందేహంతో చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఆమెను పక్కనపెట్టేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలే రాజకీయ తెరంగేట్రం చేసిన ప్రవాస భారతీయుడు గొంప కృష్ణకు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం అందుకు ఊతమిస్తోంది. వేపాడ మండలానికి చెందిన ఆయనకు రాజకీయ నేపథ్యం లేకున్నా డబ్బులు బాగానే ఉన్నాయని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. పార్టీలో తనకు జరిగిన అవమానంపై లలితకుమారి కొన్నాళ్లుగా అగ్గి మీద గుగ్గిలం మాదిరిగా రగిలిపోయినా చంద్రబాబు ఏమి మంత్రం వేశారో కానీ తర్వాత చల్లబడిపోయారు. లోకేశ్‌తో డీల్... చిరంజీవులుకు ఎసరు! పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టిక్కెట్ బోనెల విజయచంద్రకేనని చంద్రబాబు విస్పష్టంగా చెప్పేశారు. ప్రవాస భారతీయుడైన ఆయనకు ఏమాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా కేవలం ధనబలం ఉందన్న కారణంతోనే టిక్కెట్ ఇస్తున్నారనే విమర్శలు ఆ పార్టీలోనే వస్తున్నాయి. నేరుగా నారా లోకేశ్‌తో డీల్ కుదుర్చుకొని వచ్చి ఇంతవరకు ఆ పార్టీ బాధ్యతలు చూసుకున్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు టిక్కెట్‌కు ఎసరు పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పతివాడకు తీవ్ర పరాభవం... నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ వింత ఆచారానికి తెరతీసింది. నలభై సంవత్సరాలుగా టీడీపీలో ఎనలేని సేవలు అందిస్తూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొందిన పతివాడ నారాయణస్వామినాయుడిది ఒక రికార్డు. ప్రోటెం స్పీకర్‌గా, చక్కెర, వాణిజ్యశాఖా మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం ఆయనను, ఆయన వారసులను కనీసం పట్టించుకోవడం లేదు. వారిని పక్కనబెట్టి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కర్రోతు బంగార్రాజును ఏడాది కిందట టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా చంద్రబాబు నియమించారు. కానీ ఇప్పుడు టీడీపీ–జనసేన పొత్తులో భాగంగా నెల్లిమర్ల టీడీపీ టిక్కెట్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవికి కేటాయించడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో బంగార్రాజు వర్గం కంగుతింది. విజయనగరానికి చెందిన ఆమె, ఆమె భర్త మిరాకిల్ ఇంజినీరింగ్ కాలేజీ, మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలకు అధిపతులు. కోట్లాది రూపాయల సంపద ఉన్న వారి ముందు పతివాడ 40 ఏళ్ల అనుభవం, కర్రోతు బంగార్రాజు సామాజిక బలం చంద్రబాబుకు కనిపించకుండాపోయాయనే చర్చ సాగుతోంది. ఎక్కువ కాలం విదేశాల్లోనే ఉన్న మాధవి జనసేన పార్టీ తరఫున నెల్లిమర్ల టిక్కెట్ తనకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోవైపు గంటా శ్రీనివాసరావు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఐదేళ్లకోసారి నియోజకవర్గం మార్చేసే ఆయన ఈసారి నెల్లిమర్ల నుంచి టీడీపీ టిక్కెట్‌తో బరిలోకి దిగుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. ధన బలం ఉన్న లోకం మాధవి, గంటా శ్రీనివాసరావుల పేరు తప్ప పతివాడ కుటుంబం పేరు ఎక్కడా టీడీపీ–జనసేనలో వినిపించలేదు. కనిపించట్లేదు! -
ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా పాలన: డిప్యూటీ స్పీకర్
-
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో తెరుచుకున్న అంగన్వాడీ కేంద్రాలు
-
నకిలీ రిజిస్ట్రేషన్లు.. టీడీపీ నేతల భూకబ్జా
-
గెలిచేది వైఎస్సార్సీపీ జెండా.. నిలిచేది జగన్ అజెండా
సాక్షి విజయనగరం: జిల్లా బొబ్బిలి గడ్డపై వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర గర్జించింది. అశేష జనవాహిని స్వాగత నినాదాల మద్య వైఎస్సార్ సీపీ సామాజిక సాదికార బస్సు యాత్ర బొబ్బిలిలో అడుగుపెట్టింది. ఈ సందర్బంగా స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. బొబ్బిలి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో వైఎస్ఆర్ సీపీ నేతలు, ప్రజా ప్రతినిదులుముచ్చటించారు. అనంతరం బొబ్బిలి జంక్షన్ వద్ద జరిగిన బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు శంబంగి చిన అప్పలనాయుడు, పుష్పశ్రీ వాణి, బొత్స అప్పలనర్సయ్య తదితరులు హాజరయ్యారు. రుణాల మాపీపై బాబు పంగనామాలు పెట్టాడు, జగన్ టీడీపీ వదిలిన అప్పులు తీర్చారు - డిప్యూటీ సీఎం బూడి ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని గత పాలకులు ఎంతలా విస్మరించారో, యువనేత జగన్ సీఎం అయ్యాక ఎలా ప్రజల కలలను సాకారం చేసారో ప్రజలు గమనిoచాలన్నారు. బొబ్బిలి కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేస్తే, జగన్ అధికారంలోకి రాగానే ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని వివరించారు. ఎస్టీ మహిళ అయిన పుష్ప శ్రీవాణి, ఎస్టీ నేత అయిన పీడిక రాజన్నదొర, బీసీ వర్గానికి చెందిన తాను ఉప ముఖ్యమంత్రులుగా ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చొని పాలన సాగించడమే సామాజిక సాధికారతకు నిదర్శనమన్నారు. 25 మంది కేబినెట్ మంత్రులు ఉండగా, వారిలో 17 మంది బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకే కేటాయించారని గుర్తు చేసారు. గడిచిన ఎన్నికలలో ఎవరు ఏ పార్టీకి ఓటు వేసారనే లెక్క లేకుండా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో చంద్రబాబు పంగనామాలు పెట్టి మోసం చేస్తే, జగన్ సీఎం కాగానే బాబు ఎగ్గొట్టిన అప్పులన్నీ తీరుస్తున్నారన్నారు. వచ్చే జనవరి నుంచి అవ్వా తాతలకు పింఛన్ రూ. 3 వేలు చేయబోతున్నారని, ఎప్పుడూ రెండు వేళ్లు చూపే టీడీపీ నేతలకు పండగ నుంచి మూడు వేలు తీసుకుని వారికి మూడు వేళ్లు చూపాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ స్థాయి సంపన్నుల పిల్లలు ఎలా చదువుకుంటారో, పేదల పిల్లలు కూడా అలానే అభ్యసించాలని ప్రభుత్వ స్కూల్స్ ను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మార్చారని వివరించారు. పేద విద్యార్థుల ఉజ్వల భవిత కోసం జగన్ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసారని, బొబ్బిలి రాజుల పిల్లలే ఆంగ్లంలో చదువుకోవాలా, ఎస్సీ, బీసీ, ఎస్టీ పిల్లలు చదువుకోకూడదా అని జగన్ నాడు - నాడు ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో బొబ్బిలిలో శంబంగి చిన అప్పల నాయుడును, రాష్ట్రంలో జగన్ ను మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ముత్యాల నాయుడు ఉద్గాటించారు. జగన్ ఆశీస్సులతో 11,500 ఎకరాలకు సాగునీరిచ్చాం. బొబ్బిలి రాజులు సొంత ఆస్తులు పెంచుకున్నారు - ఎమ్మెల్యే శంబంగి బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు మాట్లాడుతూ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ, ఇప్పుడు వైఎస్ జగన్ సారథ్యంలో బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతాంగానికి నాలుగున్నరేళ్లలో 11,500 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందించామని, మరో 4,500 ఎకరాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి లేని పాలనను దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అందిస్తున్నారని వివరించారు. మాట తప్పని, మడమ తిప్పని ఖ్యాతి జాతీయ స్థాయిలో జగన్ కు మాత్రమే ఉందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 606 హామీలిచ్చి కనీసం ఆరు హామీలు కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. అర్హతలే ప్రతిపాదికగా తీసుకుని సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుస్తున్నారని, కుల, మతాలకు, రాజకీయాలకు తావు లేకుండా అమలు చేస్తున్నారని వెల్లడించారు. బొబ్బిలి రాజులను నమ్ముకుంటే సొంత డబ్బుతోనైనా ఆదుకుంటారని ప్రచారం చేసుకుంటే, ప్రజల నమ్మి గెలిపిస్తే సొంత ఆస్తులే పెంచుకుని ఓటర్లను వంచించారని విమర్శించారు. గెలిచేది వైఎస్సార్ సీపీ జెండా... నిలిచేది జగన్ అజెండా - కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ, బొబ్బిలి అడ్డా.. జగన్ అన్న అడ్డాగా నిలిపి బొబ్బిలి కోటపై వైఎస్సార్ సీపీ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఎప్పుడూ గెలిచేది వైెఎస్సార్ సీపీ జెండానే అని, ఎన్నడూ నిలిచేది జగన్ అజెండానే అని అభివర్ణించారు. జగన్ ను విమర్శించే టీడీపీ నాయకులకు తాను సవాల్ చేస్తున్నానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యథికంగా మేలు చేసినట్లు చెప్పే ధైర్యం తమకు ఉందని, అలా చెప్పే దమ్ము తెలుగు తమ్ముళ్లకు ఉందా అని సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందో, చంద్రబాబు ప్రభుత్వంలో మేలు జరిగిందో తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరారు. ఇది దళితుల, ఎస్టీల, బీసీల ప్రభుత్వమని, పేదల కోసం పాటుపడుతోందని వివరించారు. ఓట్ల కోసం ఇంటికి వచ్చే టీడీపీ నేతలను గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసారో, ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని నిలదీయాలని పిలుపునిచ్చారు. చెరకు రైతులను టీడీపీ మోసం చేస్తే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. 35 కోట్లు యాజమాన్యం నుంచి వసూలు చేసి చెల్లించింది - జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, బొబ్బిలిలో సామాజిక సాధికార యాత్రకు వచ్చిన ప్రజానీకాన్ని చస్తుంటే జన సునామీని తలపిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా మోసం చేసి ఇప్పుడు మళ్లీ ఓట్లు కోసం వస్తున్నారని, వారిని చెప్పే మాయ మాటలను నమ్మవద్దని హితవు పలికారు. చెరకు రైతులను షుగర్ ఫ్యాక్టరీ నిలువునా ముంచేసి మోసం చేస్తే వైెఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ. 35 కోట్లు యాజమాన్యం నుంచి ముక్కుపిండి వసూలు చేసి రైతులకు అందించామన్నారు. విజయనగరం జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల రూపు రేఖలు మారుస్తున్న ఘనత జగన్ దేనని కొనియాడారు. వెనుకబడిన వర్గాలన్నీ జగన్ సారథ్యంలో అథికారం అనుభవిస్తున్నామని, టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ పనుల కోసం బొబ్బిలి రాజుల గేటు వద్ద కాపలా కాయాలని వివరించారు. తోటపల్లి, మడ్డువలస వంటి ప్రాజెక్టులను తీసుకువచ్చి రైతులను ఆదుకున్నామని, చెరకు రైతుల సమస్యలను పరిష్కరించి వారికి కూడా అండగా ఉంటామన్నారు. విద్య,వైద్యం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు జగన్ కే సాధ్యం - ఎంపీ బెల్లాన విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పేదలకు చేరువ చేస్తున్నారన్నారు. సంక్షేమం ఓ వైపు, అభివృద్ధి మరోవైపున చేస్తూ జగన్ జనరంజక పాలన చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి పాలనను ప్రజల చెంతకు తీసుకువచ్చి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఏకైక నేత ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. -
13 అడుగుల గిరినాగు అలజడి
ఎస్.కోట పట్టణంలోని ఇండియన్ ఆయిల్ బంక్ సమీపంలో రాత్రి 7.30 గంటల సమయంలో సుమారు 13 అడుగుల పొడవు ఉన్న గిరినాగు హల్చల్ చేసింది. దీనిని స్థానికులు గుర్తించి స్నేక్‌క్యాచర్ వానపల్లి రామలింగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. ఆయన చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాటిపూడి రిజర్వాయర్ అటవీప్రాంతంలో పామును విడిచిపెడతానని స్నేక్‌క్యాచర్ తెలిపాడు. -
విజయనగరం: పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ (ఫొటోలు)
-
విజయనగరంలో YSRCP సామాజిక సాధికార బస్సు యాత్ర
-
బాధితులకు సత్వర భరోసా
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ఆరిలోవ (విశాఖ తూర్పు): బాధితులకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనితీరు మరోసారి రుజువైంది. జెట్స్పీడ్తో ఆయన తీసుకున్న నిర్ణయాలు విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో ప్రాణనష్టాన్ని కనిష్టస్థాయికి తీసుకురాగలిగాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును సంఘటన స్థలికి పంపించారు. క్షతగాత్రులను త్వరగా ఆస్పత్రికి తరలించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. మిగతా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా బస్సులు ఏర్పాటు చేయించారు. విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్షతగాత్రుల కోసం రెండు వార్డులను సిద్ధం చేశారు. తీవ్ర రక్తస్రావంతో వచి్చనవారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వెనువెంటనే వైద్యులు తగిన చికిత్స చేశారు. దీంతో కొంతమందికి ప్రాణాపాయం తప్పింది. సోమవారం మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ విజయనగరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 23 మంది క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎక్స్‌గ్రేషియాను ప్రకటించడంలోనూ, రెండురోజుల వ్యవధిలోనే వారి చేతికి చెక్కులను అందించడంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవను విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు. మానవతా దృక్పథంతో ఎక్స్‌గ్రేషియా.. రైల్వే శాఖ ప్రకటించిన నష్టపరిహారంతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా మంజూరుచేశారు. 13 మంది మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున రూ.1.30 కోట్లు, క్షతగాత్రులకు తీవ్రతను బట్టి రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కులను క్షతగాత్రులకు మంగళవారం, బుధవారం ఇచ్చారు. బుధవారం చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని నాలుగు కుటుంబాలకు మంత్రి బొత్స సత్యనారాయణ, శృంగవరపుకోట నియోజకవర్గం పరిధిలో ఒక కుటుంబానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చెక్కు అందజేశారు. మిగతావారికి గురువారం అందించనున్నారు. విశాఖలో రైలు ప్రమాద బాధితులకు పరిహారం విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో మృతిచెందిన రైల్వేగార్డు మరిపి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారాన్ని ప్రజాప్రతినిధులు బుధవారం అందించారు. విశాఖపట్నం ఆరిలోవ బాలాజీనగర్‌లో ఉంటున్న ఆయన కుటుంబసభ్యులకు నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి వైఎస్సార్సీపీ నాయకుడు గొలగాని శ్రీనివాస్, అధికారులతో కలిసి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. హెల్త్‌సిటీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్వతీపురం మన్యం జిల్లా ఇందిరాకాలనీకి చెందిన కోలా నానాజీకి రూ. 5 లక్షల చెక్కు ఇచ్చారు. ఇక, కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నల్లా కుమారికి రూ. 5 లక్షలు, రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బి.తేజేశ్వరరావుకు రూ. 2 లక్షల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే వాసుపల్లి గణే‹Ùకుమార్ అందజేశారు. రైలు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి మహారాణిపేట (విశాఖ దక్షిణ): విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముర్రు లక్ష్మి (40) మృతి చెందారు. గాజువాకకు చెందిన ఆమె బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్‌కుమార్ తెలిపారు. కుటుంబంలో ముగ్గురూ ఒకేచోట.. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయనగరం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ వ్యక్తి పేరు జక్కల వెంకటరమణ. ఆ పక్కనున్న బెడ్‌పై ఉన్నవారు అతని భార్య బంగారుతల్లి, చిన్నారి కుమార్తె కోమలి. విశాఖపట్నం గాజువాకకు చెందిన ఆ కుటుంబం విజయనగరం జిల్లా గరివిడిలోని అత్తారింటికి వస్తూ ఈ ప్రమాదం బారినపడ్డారు. తండ్రి, తల్లి, చిన్నబిడ్డ.. ఇలా ముగ్గురు ఒకేచోట గాయాలతో ఉండటం చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చలించిపోయారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బంగారుతల్లికి రూ.10 లక్షలు, వెంకటరమణకు రూ.5 లక్షలు, కోమలికి రూ.2 లక్షలు.. మొత్తం రూ. 17 లక్షలు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారు. ఆ చెక్కులను మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం అందజేశారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం రైలు ప్రమాదంలో నా భర్త రాము చనిపోయాడని తెలిసి కుప్పకూలిపోయాను. మా కుటుంబానికి ఆ దేవుడే దిక్కు అని కుమిలిపోయాను. అంతటి విషాదంలో ఉన్న మాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా నిలబడటంతో కొండంత ధైర్యం వచ్చింది. రూ. 10 లక్షలు ఇచ్చిన ఆయనకు రుణపడి ఉంటాం. వైఎస్సార్ బీమా కింద మరో రూ. 5 లక్షలు సాయం అందుతుందని చెప్పారు. తక్షణ సాయం కింద రూ. 10 వేలు ఇచ్చారు. – మజ్జి శారద, గదబవలస, గరివిడి మండలం, విజయనగరం జిల్లా చెప్పిన వెంటనే సాయమందించారు నా భర్త పిళ్లా నాగరాజు రైలు ప్రమాదంలో చనిపోయారు. ఎలా బతకాలో తెలియక కుటుంబమంతా రోదిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో మా పట్ల ముఖ్యమంత్రి స్పందించిన తీరు మరచిపోం. ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పిన వెంటనే చెక్కు పంపించారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. – పిళ్లా కళావతి, కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా -
Vizianagaram : అంబరాన్నంటిన పైడితల్లి సిరిమానోత్సవం (ఫొటోలు)
-
అంబరాన్నంటిన పైడితల్లి సిరిమానోత్సవం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత మంగళవారం ఉదయం పైడితల్లి అమ్మవారికి మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వ్రస్తాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకే సిరిమాను హుకుంపేట నుంచి ఆలయానికి చేరుకుంది. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను కట్టడాలు పూర్తి చేసి, పూజలు చేశారు. 4:30 గంటలకు మూడు లాంతర్లు వద్దనున్న చదురుగుడి నుంచి సిరిమాను రథం బయల్దేరింది. మూడుసార్లు ఆలయం నుంచి కోట వరకూ వెళ్లింది. సిరిమానుపై ఆశీనులైన పూజారి రూపంలో ఉన్న అమ్మవారు పైనుంచి అక్షితలను చల్లి భక్తులను ఆశీర్వదించారు. ఉత్సవం సాయంత్రం 5.56 గంటలకు పూర్తయింది. సిరిమాను తిరుగుతున్నంతసేపూ ఆలయంలోని అమ్మవారికి వేదపండితులు లక్ష పుష్పార్చన చేశారు. సుమారు మూడున్నర లక్షల మంది సిరిమాను ఉత్సవాన్ని వీక్షించినట్లు అధికారులు అంచనావేశారు. విజయనగరం కోటపై నుంచి అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, జిల్లా సహకార బ్యాంకు ప్రాంగణంలోనుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సిరిమానును వీక్షించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతర నిఘా పెట్టడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సిరిమానోత్సవాన్ని ఆద్యంతం పర్యవేక్షించారు. సిరిమానోత్సవం సందర్భంగా నిర్వహించిన విజయనగరం సాంస్కృతిక ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు సిరిమానోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచే పలువురు ప్రముఖులు, భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులతో పాటు మంత్రి గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కంబాల జోగులు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, సినీ నటుడు సాయికుమార్ తదితరులు దర్శించుకున్నారు. -
రైలు ప్రమాద ఘటన బాధితులకు ఎక్స్‌గ్రేషియా అందజేత
-
AP: రైలు ప్రమాద బాధితులకు చెక్కుల అందజేత
సాక్షి, విజయనగరం: కంటకాపల్లి రైలు ప్రమాద ఘటన తర్వాత సహాయక చర్యలు, బాధితుల చికిత్స విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. ఘటన గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. మంత్రి బొత్సను పంపించి సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షింపజేశారు. ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ వచ్చారు. విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని నేరుగా వెళ్లి మరీ పరామర్శించారాయన. ఈ క్రమంలో వాళ్ల పేదరికానికి ఆయన చలించిపోయారు. మానవత్వంతో మరింత పరిహారం పెంచి.. అందజేయాలని అధికారుల్ని ఆదేశించారు. తాజాగా ఆ పరిహారం బాధితులకు అందింది. బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే నష్టపరిహారం చెక్‌లు అందజేశారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. 10 మందికి రూ. 5 లక్షలు, ముగ్గురుకి రూ. 10లక్షలు, మిగతా వారికి రూ. 2 లక్షలు చొప్పున.. మొత్తం క్షతగాత్రులకు కోటి 32 లక్షలు అందచేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే.. 13 మంది మృతులకు రూ. 10 లక్షలు చొప్పున.. రూ. 2 కోట్ల 62 లక్షలు అందచేశారు. విజయనగరం రైలు ప్రమాదం జరిగిన వెంటనే ఏపీ ప్రభుత్వం సత్వరమే స్పందించింది. సహాయక చర్యల్లో రైల్వే అధికారులతో సమన్వయం కావాలని ఆదేశిస్తూనే.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబానికి పది లక్షలు, క్షతగాత్రులకు రెండు లక్షలు చొప్పున ప్రకటించారాయన. అయితే.. బాధితుల్లో పేదవాళ్లు ఉండడంతో.. అంగవైకల్యం చెందిన వారికి రూ. 10లక్షలు, కొన్నాళ్ల పాటు మంచానికే పరిమితం అయ్యే వాళ్లకి రూ. 5లక్షలు చొప్పున పరిహారం పెంచి ఇచ్చారు. సంబంధిత వార్త: రైల్వే ప్రమాద బాధితులకు జగనన్న భరోసా -
విజయనగరం రైల్వే ప్రమాదంపై బహిరంగ విచారణ
సాక్షి, విజయనగరం: విజయనగరం కంటకాపల్లి రైల్వే ప్రమాదంపై బహిరంగ విచారణ జరపనున్నారు అధికారులు. బుధవారం, గురువారం విశాఖపట్నం డివిజనల్ మేనేజర్, వాల్తేర్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. ఇప్పటికే అలమండ, కొత్తవలసల మధ్య ప్రత్యక్ష సాక్షుల్ని, అలాగే క్యాబిన్ ఉద్యోగుల్ని ప్రశ్నిస్తున్నారు. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యం కోణంలోనే విచారణ అధికారులు ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. విజయనగరం రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 52 మందిని క్షతగాత్రులుగా గుర్తించింది. వీరిలో ఎక్కువమంది స్వల్ప గాయాలతో బయటపడి ఇళ్లకు వెళ్లిపోయారు. కొందరు అలమండ పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. తలకు బలమైన గాయాలైన వారు, కళ్లు దెబ్బతిన్న వారు, ఎముకలు విరిగిన వారు 29 మంది విజయనగరం సర్వజన ఆసుపత్రిలో చేరారు. సోమవారం సీఎం జగన్ ఆస్పత్రికి వెళ్లి వాళ్లను ఓదార్చారు. నేడు క్షతగాత్రులకు శస్త్ర చికిత్సలు చేయనున్నారు వైద్యులు. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి కంటకాపల్లి-అలమండ మధ్య జరిగిన ఈ దుర్ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. నెమ్మదిగా వెళ్తున్న పలాస-విశాఖ ప్యాసింజర్‌ను.. వెనుక నుంచి వేగంగా వచ్చిన రాయగఢ-విశాఖ ప్యాసింజర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 13 మంది మృతి చెందారు. నిత్యం విశాఖకు రాకపోకలు సాగించే వందలాది మంది నిత్యం ఈ రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ఆదివారం సెలవు నేపథ్యంలో రద్దీ చాలా తక్కువగా ఉంది. లేదంటే... ఎలా ఉండేదోనని ఆ ఘటనను తలచుకొని భయభ్రాంతులకు గురవుతున్నారు. సిగ్నలింగ్ లోపమా? మానవ తప్పిదమా? విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఒకదాని వెనుక మరొకటి ప్రయాణించే సమయంలో ముందు వెళ్లే రైలు పట్టాలు తప్పినా, ఆగిపోయినా వెనుక వచ్చే రైలు ఆగిపోయేలా సిగ్నలింగ్ వ్యవస్థ పని చేయాలి. అలాగే.. రైలు వేగం గంటకు 10, 15 కిలోమీటర్లకు పరిమితం కావాలి. విశాఖపట్నం నుంచి పలాస వెళ్లే ప్యాసింజర్ నెమ్మదిగా వెళ్లినా వెనుక వచ్చిన రాయగడ ప్యాసింజర్ అధిక వేగంతో వచ్చి ఢీకొట్టడంతోనే పెనుప్రమాదం జరిగింది. నేడు కూడా పలు రైళ్ల రద్దు కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో విశాఖ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సాధారణ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. రిజర్వేషన్ చేయించుకున్న పలువురు ఆదివారం రాత్రి నుంచి స్టేషన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే సోమవారం సాయంత్రంలోపే కంటపల్లి వద్ద ట్రాక్ పనులు పూర్తి అయ్యాయి. దీంతో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. కానీ, ఇవాళ కూడా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్ల సమయాల్లో మార్పు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇవాళ(అక్టోబర్ 31న).. హావ్‌డా-సికింద్రాబాద్(12703) ఫలక్‌నుమా, హావ్‌డా-ఎస్ఎంవీ బెంగళూరు(12245) దురంతో, షాలిమార్-హైదరాబాద్(18045) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. అలాగే.. తిరుపతి-పూరి (17480) ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ(08531) పాసింజర్, తిరుపతి-విశాఖ(08584) ప్రత్యేక రైలు, విశాఖ-గుణుపూర్(17240) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించారు. భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 31న రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు భువనేశ్వర్‌లో ఉదయం 5.40గంటలకు బదులు ఉదయం 10గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. -
Vizianagaram: పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవం (ఫొటోలు)
-
రైలు ప్రమాద ఘటన ఫోటోలను పరిశీలించిన సీఎం జగన్
-
ట్రైన్ ప్రయాణాలను నమ్మొచ్చా..
-
విజయనగరం జిల్లా రైలు ప్రమాద బాధితులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఓదార్పు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది?.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైందని ట్వీట్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. రైళ్ల కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఎందుకు విఫలమైందని ప్రశ్నించిన సీఎం.. ఉన్నతస్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధానిని, రైల్వే మంత్రిని కోరారు. ‘‘దేశంలోని అన్ని మార్గాల్లోనూ ఆడిట్ జరగాల్సి ఉంది. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడాలి. నిన్న జరిగిన రైలు ప్రమాదం తీవ్రంగా బాధించింది. ప్రమాద ఘటన కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. బ్రేకింగ్, హెచ్చరిక వ్యవస్థలు ఎందుకు పనిచేయలేదు?’’ అంటూ ట్విట్టర్లో సీఎం జగన్ ప్రశ్నించారు. The devastating train accident that occurred in Vijayanagaram district last night has caused me great pain. A running train collided with another stationed train, both of which were running in the same direction. This horrifying accident gives rise to certain obvious questions:… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2023 విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ట్వీట్ చేశారు. ‘‘వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2023 -
రైలు ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ (ఫోటోలు)
-
బాధితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్
-
రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. కంటాకపల్లి రైలు ప్రమాద బాధితుల్ని సీఎం జగన్ పరామర్శించారు. తొలుత విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను ఆయన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆపై చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. షెడ్యూల్ ప్రకారం ముందుగా ఘటనా స్థలాన్ని పరిశీలించాలని అనుకున్నప్పటికీ.. రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ప్రమాదానికి గురైన బోగీల్ని తొలగిస్తున్న అధికారులు.. ఈ క్రమంలో సీఎం పర్యటనతో పనులు ఆలస్యం కావొచ్చని అధికారులు తెలిపారు. దీంతో ఆయన నేరుగా బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. చదవండి: మరీ ఇంత పిచ్చిగానా?.. ప్రజలు గమనిస్తున్నారు బాబూ.. విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2023 -
బాధితుడి కన్నీళ్లను తుడిచిన సీఎం వైఎస్ జగన్
-
రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం జగన్
-
రైలు ప్రమాద బాధితుల బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: రైలు ప్రమాదంలో బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వ యంత్రాగాన్ని అభినందించారు. ‘‘ఘటన దురదృష్టకరం. బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. వాళ్ల కుటుంబాలకు అండగా ఉంటుంది. ప్రమాదంలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. అలాగే తీవ్రంగా గాయపడిన వాళ్లకు రూ.2 లక్షలు, సాధారణ గాయాలైన వాళ్లకు రూ.50 వేల సాయం అందిస్తాము’’ అని మంత్రి బొత్స తెలిపారు. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిందని, సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొందని అభినందించారు. ఏపీ అధికారులు రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నారని తెలిపారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల పునరుద్ధరణ పనులను కూడా రైల్వే అధికారులు ప్రారంభించారని.. సాయంత్రంలోపే పూర్తవుతాయని మంత్రి బొత్స మీడియాకు వివరించారు. ఆదివారం రాత్రి కంటాకపల్లి వద్ద పలాస-విశాఖ ప్యాసింజర్ రైలును రాయగడ-విశాఖ ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇప్పటిదాకా 13 మంది మృతి చెందగా, 50 మందిదాకా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్.. ఘటనాస్థలానికి వెళ్లాలని, సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి బొత్స సత్యనారాయణను ఆదేశించారు. దీంతో రాత్రి నుంచి ఆయన అక్కడే పరిస్థితిని సమీక్షిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు. -
Live: విజయనగరం రైలు ప్రమాద ఘటనాస్థలానికి సీఎం వైఎస్ జగన్
-
రంగంలోకి బాహుబలి...కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
విజయనగరం ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు రద్దు
-
బోగీల కింద మరికొన్ని మృతదేహాలు..పెరుగుతున్న మృతుల సంఖ్య
-
విజయనగరం ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, గుంటూరు: కంటాకపల్లి రైలు ప్రమాద బాధితుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. తొలుత విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను ఆయన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆపై చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. షెడ్యూల్ ప్రకారం ముందుగా ఘటనా స్థలాన్ని పరిశీలించాలని అనుకున్నప్పటికీ.. రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ప్రమాదానికి గురైన బోగీల్ని తొలగిస్తున్న అధికారులు. ఈ క్రమంలో సీఎం పర్యటనతో పనులు ఆలస్యం కావొచ్చని అధికారులు తెలిపారు. దీంతో ఆయన నేరుగా బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుని.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో వున్న హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆపై విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుల్ని పరామర్శించారు. విజయనగరం జిల్లాలో కంటాకపల్లి వద్ద ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నెమ్మదిగా వెళ్తున్న పలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి వచ్చిన రాయగడ ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సిగ్నల్ లేకపోవడంతో భీమాలి-అలమండ స్టేషన్ల మధ్యలో పలాస ప్యాసింజర్ అత్యంత నెమ్మదిగా వెళ్తోంది. ఆ సమయంలో ఈలోపు వెనుక నుంచి విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ వేగంగా వచ్చి ఢీకొంది. పలాస ప్యాసింజర్‌కు చెందిన గార్డ్ బోగీ ఎగిరి దూరంగా పడింది. దానికి ముందున్న రెండు బోగీలు పక్కకు ఒరిగి, అవతలి ట్రాక్‌పై బొగ్గు లోడ్‌తో ఉన్న గూడ్స్ రైలు ఇంజిన్‌ను ఢీకొని నుజ్జునుజ్జయ్యాయి. రాయగడ ప్యాసింజర్ ఇంజిన్ పూర్తిగా ధ్వంసమైంది. దాని రెండు బోగీలూ పట్టాలు తప్పాయి. ఘటనలో 13 మంది మృతి చెందగా.. 50 మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. అలాగే సీఎం జగన్ సూచనతో మంత్రి బొత్స ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సాయం ప్రకటన కూడా చేశారు సీఎం జగన్. రైలుప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందినవారి కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్ ప్రకటించారు. ఇతర రాష్ట్రాలవారు మరణిస్తే రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు ఘటన నుంచి సీఎం జగన్‌ను ఫోన్ చేసి ఆరా తీసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం.. ఫొటోగ్యాలరీ కోసం క్లిక్ చేయండి -
రైలు ప్రమాదం డ్రోన్ విజువల్స్
-
ప్రమాద స్థలం వద్ద ఇదీ ప్రస్తుత పరిస్థితి
-
Vizianagaram Train Accident: విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం (ఫొటోలు)
-
నుజ్జునుజ్జు అయిన 5 భోగీలు
-
విజయనగరం రైలు ప్రమాదం.. అప్డేట్స్
విజయనగరం రైలు ప్రమాద ఘటన.. సహాయక చర్యల అప్డేట్స్ విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఓ ప్యాసింజర్ రైలు.. ఆగి ఉన్న మరో ప్యాసింజర్ రైలును ఢీ కొట్టింది. ఆపై పక్క ట్రాక్‌లోని గూడ్సుపైకీ దూసుకెళ్లి మరింత బీభత్సం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, 54 మందికి గాయాల అయ్యాయని అధికారులు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతుండగా.. ఈ సాయంత్రం లోపే ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. 17:40 PM సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది?.. ట్వీట్ ద్వారా ప్రశ్నించిన సీఎం జగన్ ►రైళ్ల కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఎందుకు విఫలమైంది? ►ఉన్నతస్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధానిని, రైల్వే మంత్రిని కోరిన సీఎం జగన్ ►దేశంలోని అన్ని మార్గాల్లోనూ ఆడిట్ జరగాల్సి ఉంది ►ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడాలి ►నిన్న జరిగిన రైలు ప్రమాదం తీవ్రంగా బాధించింది ►ప్రమాద ఘటన కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది ►బ్రేకింగ్, హెచ్చరిక వ్యవస్థలు ఎందుకు పనిచేయలేదు? The devastating train accident that occurred in Vijayanagaram district last night has caused me great pain. A running train collided with another stationed train, both of which were running in the same direction. This horrifying accident gives rise to certain obvious questions:… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2023 17:24 PM రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ట్వీట్ ►విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. ►వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ►ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. ►వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. ►వారికి మంచి వైద్యం అందించాలి ► మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలి 16:06 PM సీఎం జగన్ ఏరియల్ వ్యూ ►విజయనగరం: ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ వ్యూ ►విజయనగరం నుంచి విశాఖ వెళ్తూ పరిశీలించిన సీఎం జగన్ 16:05 PM విజయనగరం ప్రమాదస్థలిలో ట్రాక్ టెస్టింగ్ సక్సెస్ ►పునరుద్ధరణ జరిగిన మార్గాల్లో విజయవంతంగా రైళ్లు నడిపిన అధికారులు ►డౌన్‌లైన్‌లో గూడ్స్.. అప్‌లైన్‌లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ పరిశీలన పూర్తి 14:22 PM విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం జగన్ ►ప్రమాద ఘటనకు సంబంధించిన ఫోటోలను పరిశీలించిన సీఎం ►అధికారుల నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం ►ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం ►ప్రమాదంలో గాయపడిన చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్ ►రెండు వార్డుల్లో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరి దగ్గరకూ వెళ్లి పరామర్శించిన సీఎం ►వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం 14:08 PM విజయనగరం చేరుకున్న సీఎం జగన్ ►విజయనగరం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం జగన్ ►విజయనగరం రైల్వే ప్రమాద ఘటన బాధితులకు కాసేపట్లో పరామర్శ ►ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించిన ఫొటోల ప్రదర్శన ►ఘటన గురించి సీఎం జగన్‌కు వివరిస్తున్న అధికారులు ►రైల్వే అధికారుల విజ్ఞప్తితో ఘటనా స్థలికి వెళ్లని సీఎం జగన్ ►నేరుగా ప్రమాద బాధితుల్ని పరామర్శించనున్న సీఎం జగన్ 13:23PM విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ ►విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ ►కాసేపట్లో విజయనగరం ప్రభుత్వాసుపత్రికి ►రైలు ప్రమాదంలో గాయపడిన బాధితులకు పరామర్శ 12:44PM బాధితుల బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి బొత్స ►రైలు ప్రమాద బాధితులకు ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేవరకు ప్రభుత్వం దే బాధ్యత ►విజయనగరం ప్రమాద ఘటన సహాయక చర్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందన ►బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది ►మృతులు కుటుంబాలకు రూ. 10లక్షల ఆర్థికసాయం ఇస్తాం ►తీవ్రంగా గాయపడిన వాళ్లకు రూ. 2లక్షలు ►సాధారణ గాయాలైనవాళ్లకు రూ. 50 వేల సాయం ►ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది ►రైల్వే అధికార్ల సమన్వయంతో పనిచేస్తున్నాం ►ట్రాక్ పునః నిర్మాణ పనులు కాసేపట్లోనే పూర్తి అవుతాయి 12:30PM సీఎం జగన్ పర్యటనలో మార్పు ►సీఎం జగన్ విజయనగరం పర్యటనలో మార్పు ►కంటకాపల్లి ప్రమాద ఘటన స్థలం వద్ద పర్యటన రద్దు ►రైల్వే అధికారుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం ►ఘటనా స్ధలంలో ప్రమాదానికి గురైన బోగీల్ని తొలగిస్తున్న అధికారులు ►యుద్ద ప్రాతిపదినక ట్రాక్ పునురుద్ధరణ పనులు ►ముఖ్యమంత్రి ఘటనా స్ధలానికి వస్తే... ట్రాక్ పునరుద్ధరణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని వెల్లడి ►రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించనున్న సీఎం జగన్ ►నేరుగా పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో వున్న హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్న సీఎం జగన్ ►ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులకు పరామర్శ :::జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి 12:18PM విజయనగరం బయల్దేరిన సీఎం జగన్ ►విజయనగరం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ►విశాఖకు.. అక్కడి నుంచి విజయనగరం ప్రమాద స్థలికి ►కాసేపట్లో రైలు ప్రమాద ఘటనా స్థలం పరిశీలన ►గాయపడిన వారిని పరామర్శించనున్న సీఎం జగన్ 12:05PM విజయవాడ డివిజన్లో హెల్ప్‌లైన్ డెస్క్ ►విజయవాడ రైల్వే జంక్షన్ పై రాయగడ రైలు ప్రమాద ప్రభావం ►విజయవాడ నుండి వెళ్ళే పలు రైళ్లు రద్దు ►విజయవాడ మీదుగా విశాఖ వెళ్లే రత్నాచల్, సింహాద్రి, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-పూరీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు ►27 రైళ్లు రద్దు, 28రైళ్ళను మళ్లించిన రైల్వే అధికారులు ►విజయవాడ రైల్వే జంక్షన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు ►ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్న హెల్ప్ డెస్క్ ►ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు ►అనకాపల్లి, తుని, సామర్లకోట, కాకినాడ టౌన్, రాజమండ్రి, నిడదవోలు, ఏలూరు, భీమవరం టౌన్, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరుకు సంబంధించి నెంబర్లు ►ప్రమాదానికి సంబంధించిన సమాచారం కోసం అయినా సంప్రదించవచ్చొన్న రైల్వే అధికారులు ►ఇప్పటివరకు తమవాళ్లు లేదా రైలు ప్రమాదంలో ఉన్నట్టు తమకి ఒక్క ఫోన్ ఫోన్ రాలేదంటున్న అధికారులు 11:48AM బాధితులకు మెరుగైన వైద్యం అందుతోంది: సీపీఎం రాఘవులు ►విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి లో రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన సీపీఎం నేత రాఘవులు ►గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందుతోంది.. వైద్యులకు అభినందనలు ►ఒడిశా బాలాసోర్ తరహా ఘటన మళ్లీ పునరావృతం అయ్యింది ►రైల్వే శాఖకు శిక్ష వేయాలి ►మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ 50 లక్షలు పరిహారం ఇవ్వాలి ►క్షతగాత్రులకు 25 లక్షలకు పరిహారం ఇవ్వాలి ►ఆదివారం కాకుండా మిగతా పని దినాల్లో అయితే వందల్లో చనిపోయే వారు ►రైల్వే సిగ్నలింగ్ లో లోపాలు వున్నాయి ►సిబ్బంది కొరత వలనే రైల్వే లో ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయి. 11:29AM కాసేపట్లో విజయనగరానికి సీఎం జగన్ ►కాసేపట్లో విజయనగరం పర్యటనకు సీఎం జగన్ ►విశాఖకు.. అక్కడి నుంచి కంటకాపల్లికి ►రైలు ప్రమాద ఘటనా స్థలం పరిశీలన ►చికిత్స పొందుతున్న వాళ్లకు పరామర్శ ►నేటి ఎస్.ఐ.పీ.బీ సమావేశం త్వరగా ముగించుకున్న సీఎం జగన్ ►పలు పెట్టుబడులు, వివిధ పరిశ్రమల ప్రోత్సాహకాలకు ఆమోదం 11:10AM విజయనగర ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం: ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారి ►విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలు ►వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ►కంటకాపల్లి-అలమండ మధ్య నెమ్మదిగా వెళ్తున్న పలాస రైలును ఢీ కొట్టిన రాయగడ రైలు ►విజయనగర రైలు ప్రమాదం మానవ తప్పిదవల్లేనన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆఫీసర్ ►ప్రమాదంపై ఓ మీడియా ఛానెల్తోఈస్ట్ కోస్ట్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ విశ్వజిత్ సాహూ ►రాయగడ ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వల్లే ప్రమాదం జరిగింది ►రెడ్ సిగ్నల్‌ను రాయగడ లోకో పైలట్ పట్టించుకోలేదు ►ఫలితంగానే ఘోర ప్రమాదం సంభవించిందన్న అధికారి సాహూ ►అయితే దర్యాప్తు తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని స్పష్టీకరణ ►ఈ ప్రమాదంలో రాయగడ రైలు లోకో పైలట్ రావు కూడా మృతి 10:26AM చురుగ్గా రైల్ ట్రాక్ పునఃనిర్మాణ పనులు ►విజయనగరం రైల్వే ప్రమాద ఘటనాస్థలంలో యుద్ధప్రాతిపాదికన చర్యలు ►140 టన్ ల బాహుబలి క్రేన్‌తో ధ్వంసమైన బోగీలు తొలగింపు ►ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ►ట్రాక్ పునఃనిర్మాణ పనులు, బాధితుల సౌకర్యాల పై ఘటనా స్థలం లో సమీక్ష చేసిన ఇంచార్జ్ మంత్రి బూడి ముత్యాల నాయుడు ప్రమాదంలో దెబ్బతిన్న విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తున్న రైల్వే ఎలక్ట్రికల్ సిబ్బంది ►సహాయక చర్యల పై జిల్లా అధికార యంత్రాంగాన్ని అర్ధరాత్రే అప్రమత్తం చేసిన సీఎం జగన్ ►సీఎం ఆదేశాలతో ఘటనా స్థలం వద్ద 40 అంబులెన్సులులు సిద్దం ►గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించిన అధికార్లు ►మృత దేహాలను హుటాహుటిన గుర్తించి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ కి తరలింపు ►ప్రత్యేక వైద్యులను కేటాయించి త్వరితగతిన పోస్టుమార్టం ►బంధువులకు మృతదేహాలు అప్పగించి, వారి గ్రామాలకు ఉచిత రవాణా ఏర్పాటు ►వైద్య సేవలకు సంతృప్తి వ్యక్తం చేస్తున్న బాధితులు ►ఇవాళ మధ్యాన్నం విజయనగరానికి సీఎం జగన్ ►రైలు ప్రమాద ఘటనా స్థలం పరిశీలించి, క్షతగాత్రులకు పరామర్శ 10:23AM క్షతగాత్రులకు మెరుగైన చికిత్స ►రైలు ప్రమాదంలో సహాయ చర్యల్లో వెయ్యి మంది రైల్వే సిబ్బంది ►మంచినీరు మందులు... ఆహర పదార్థాలతో నిన్న రాత్రి.. ఈరోజు ఉదయం విశాఖ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు ►ఐదుగురు విశాఖ వాసులకు విజయనగరం జిజిహెచ్ లో చికిత్స ►విశాఖలోని అపోలో ఒకరు.. కింగ్ జార్జ్ ఆసుపత్రలో మరొకరికి వైద్యం 10:18AM నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి ►విజయనగరం రైలు ప్రమాదంపై నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి ►మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన భువనేశ్వరి 10:12AM రైలు ప్రమాద ఘటనపై రాహుల్ గాంధీ స్పందన ►విజయనగరం రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి ►ఫేస్బుక్లో పోస్ట్ ►మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ►క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రాహుల్ గాంధీ 09:58AM విజయనగర ప్రమాదం.. రాజమండ్రి స్టేషన్లో హెల్ప్‌డెస్క్ ►విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదం ►రాజమండ్రి మెయిన్ రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన రైల్వే అధికారులు ►రద్దయిన, మళ్లించిన రైళ్ళ వివరాలపై ప్రయాణికులకు సమాచారం ఇస్తున్న రైల్వే సిబ్బంది ►ప్రమాద ఘటనలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మృతులు గాని గాయపడిన వారిపై సమాచారం లేదని తెలిపిన రైల్వే అధికారులు 09:40AM విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాదంలో మృతుల పేర్లు రావు, రాయగడ ప్యాసింజర్ లోకో పైలట్, విశాఖపట్నం చింతల కృష్ణం నాయుడు పిల్ల నాగరాజు కంచుభరకి రవి (30), గోడికొమ్ము (గ్రామం), జామి (మండలం), విజయనగరం గిడిజాల లక్ష్మి (35), ఎస్పీ రామచంద్రాపురం, జీ సిగడాం మండలం, శ్రీకాకుళం కరణం అప్పలనాయుడు (45), కాపు సంబాం (గ్రామం), గరివిడి (మండలం), విజయనగరం చల్లా సతీష్ (32), ప్రదీప్ నగర్, విజయనగరం శ్రీనివాస్ టెంకల సుగుణమ్మ రెడ్డి ససీతంనాయుడు మజ్జి రాము ఎం. శ్రీనివాస్ విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు గార్డు ►మరో మృతదేహాం గుర్తించాల్సి ఉంది ►త్వరగతిన విజయనగరం ప్రభుత్వాసుప్రతిలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం 09:17AM ►విజయనగరం ఘోర రైలు ప్రమాదం.. 13కి చేరిన మృతుల సంఖ్య 09:04AM బాధితుల్ని తక్షణమే ఆదుకునేలా ఏపీ సర్కార్ చర్యలు ►విజయనగరం రైలు ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాల్ని సత్వరమే ఆదుకునేలా ఏపీ ప్రభుత్వం అన్ని రకాలచర్యలు ►క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ►మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం ప్రకటన ►మృతుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం ►తక్షణమే అందేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు ►బాధితులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర రైల్వే మంత్రికి ఫోన్లో వివరించిన సీఎం జగన్ 08:54AM ఘటనాస్థలానికి వెళ్లనున్న సీఎం జగన్ ►విజయనగరం జిల్లా కంటాకపల్లి వద్ద ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం ►ఘటన గురించి తెలియగానే సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ►రైల్వే శాఖ మంత్రితోనూ ఫోన్లో మాట్లాడిన సీఎం జగన్ ►సీఎం జగన్ ఆదేశాలతో ఘటనాస్థలానికి వెళ్లిన మంత్రి బొత్స.. సహాయక చర్యల పర్యవేక్షణ ►నేడు ఘటనా స్థలానికి వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ►ప్రత్యేక విమానంలో విశాఖకు.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఘటనాస్థలానికి ►అనంతరం చికిత్స పొందుతున్న క్షతగాత్రులనూ పరామర్శించనున్న సీఎం జగన్ ►క్షతగాత్రుల్లో ఏపీ వాసులే అధికం 08:50AM రైలు ప్రమాదం రీత్యా పలు రైళ్ల రాకపోకలు మళ్లింపు ►చెన్నై-సంత్రగచి(22808) ఎక్స్‌ప్రెస్ ►హైదరాబాద్-షాలిమర్(18046) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ►త్రివేండ్రం-షాలిమర్(22641) ఎక్స్‌ప్రెస్ ►ఆగర్తల-బెంగళూరు(12504)ఎక్స్‌ప్రెస్ ►సంత్రగచీ-తిరుపతి(22855)ఎక్స్‌ప్రెస్ ►షాలీమర్-చెన్నై(12841) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ►ధన్‌బాద్-అలెప్పీ(13351) బొకరో ఎక్స్‌ప్రెస్ ►హతియా-బెంగళూరు(12835)ఎక్స్‌ప్రెస్ ►మంగళూరు-సంత్రగాచీ(22852) ఎక్స్‌ప్రెస్ ►బెంగళూరు-హౌరా(12246) దురంతో ఎక్స్‌ప్రెస్ ►బెంగళూరు-జశిద్ది(22305) ఎక్స్‌ప్రెస్ ►కన్యాకుమారి-హౌరా(22503) ఎక్స్‌ప్రెస్ ►చెన్నై-హౌరా(12840) ఎక్స్‌ప్రెస్ వాస్కోడిగామా-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ 08:35AM ఘటనా స్థలంలో ముమ్మురంగా సహాయ చర్యలు ►రైళ్ల రాకపోకల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికంగా కొనసాగుతున్న పనులు ►ప్రమాదానికి గురైన పలాస పాసింజర్ 11 భోగిలను అలమండ రైల్వే స్టేషన్ కు తరలించిన సిబ్బంది ►ప్రమాదానికి గురైన రాయగడ పాసింజర్ 9 బోగీలను కంటకాపల్లి రైల్వే స్టేషన్ కు తరలించిన రైల్వే సిబ్బంది ►వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్ ప్రకటన ►ఘటనా స్థలం నుంచి దూరంగా వెళ్లాలని.. రైల్వే పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగించవద్దని ప్రజలకు అధికారుల విజ్ఞప్తి 08:21AM కంటకాపల్లి - అలమండ మధ్య జరిగిన జరిగిన రైలు ప్రమాదంతో సోమవారం రద్దైన రైళ్ల వివరాలు ► కోర్బా - విశాఖపట్నం (18517) ఎక్స్‌ప్రెస్ ►పారాదీప్ - విశాఖపట్నం (22809) ఎక్స్‌ప్రెస్ ►రాయగడ - విశాఖపట్నం (08503)ప్యాసింజర్ స్పెషల్ ► పలాస - విశాఖపట్నం (08531) ప్యాసింజర్ స్పెషల్ ► విశాఖపట్నం - గునుపుర్ (08522)ప్యాసింజర్ స్పెషల్ ►గునూపుర్ - విశాఖపట్నం (08521) ప్యాసింజర్ స్పెషల్ ► విజయనగరం - విశాఖపట్నం (07469) మెము స్పెషల్ ► విజయవాడ - విశాఖపట్నం (12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం - విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ► గుంటూరు - విశాఖపట్నం (12739) సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ► కాకినాడ - విశాఖపట్నం (17267) మెము ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం - కాకినాడ (17268) మెము ఎక్స్‌ప్రెస్ ► రాజమండ్రి- విశాఖపట్నం (07466) మెము స్పెషల్ ►విశాఖపట్నం - రాజమండ్రీ (07467) మెము స్పెషల్ ►కోరాపుట్ - విశాఖపట్నం (08545) స్పెషల్ ►విశాఖపట్నం - కోరాపుట్ (08546) స్పెషల్ ► పలాస - విశాఖపట్నం (08531) స్పెషల్ ► చెన్నై - పూరి (22860) ఎక్స్‌ప్రెస్ ►రాయగడ - గుంటూరు (17244) ఎక్స్‌ప్రెస్ 08:09AM ట్రైన్ లోకో పైలట్ ఎం ఎస్ రావులు మృతి ►విజయనగరం రైలు ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన రాయగడ ట్రైన్ ఇంజన్ ►ఇంజన్లో మృతదేహం.. లోకో పైలట్ ఎంఎస్ రావుగా గుర్తింపు ►తోటి ఉద్యోగి మరణంతో దిగ్భ్రాంతిలో రైల్వే ఉద్యోగులు 07:59AM ఆయా స్టేషన్ల నుంచి బయల్దేరి.. దారి మళ్లిన రైళ్ల వివరాలివే.. ►29న చెన్నై లో బయల్దేరిన చెన్నై - సంత్రగచి (22808) ఎక్స్‌ప్రెస్ ►29న హైదరాబాద్ లో బయల్దేరిన హైదరాబాద్ - శాలిమర్ (18046)ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ►28న త్రివేండ్రం లో బయల్దేరిన త్రివేండ్రం - షాలిమర్ (22641) ఎక్స్‌ప్రెస్ ►28న అగర్తల లో బయల్దేరిన ఆగర్తల - బెంగళూరు (12504) ఎక్స్‌ప్రెస్ ►29న శాలిమార్ లో బయల్దేరిన షాలిమర్- హైదరాబాద్ (18045) ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ►29న సంత్రాగచి లో బయల్దేరిన సంత్రగచీ - తిరుపతి (22855) ఎక్స్‌ప్రెస్ ►29న షాలిమర్ లో బయల్దేరిన షాలిమర్ - చెన్నై (12841) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ►29న చెన్నై లో బయల్దేరిన చెన్నై - షాలిమర్ (12842) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ►29న Dhanbad లో బయల్దేరిన Dhanbad - అలెప్పీ (13351) బొకారో ఎక్స్‌ప్రెస్ ►29న హతియ లో బయల్దేరిన హతియా - బెంగళూరు (12835) ఎక్స్‌ప్రెస్ ►28న మంగుళూరు లో బయల్దేరిన మంగుళూరు - సంత్రగాచి (22852) ఎక్స్‌ప్రెస్ ►29న బెంగళూరు లో బయల్దేరిన bengaluru- హౌరా (12246) దురంతో ఎక్స్‌ప్రెస్ ►29న తిరుపతి లో బయల్దేరిన తిరుపతి - హౌరా (20890) ఎక్స్‌ప్రెస్ ►29న సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన సికింద్రాబాద్- హౌరా (12704) ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ ►29న బెంగళూరు లో బయల్దేరిన బెంగళూరు - హౌరా (12864) ఎక్స్‌ప్రెస్ ►29న బెంగళూరు లో బయల్దేరిన బెంగళూరు - జశిద్ది (22305) ఎక్స్‌ప్రెస్ ►28న కన్యాకుమారి లో బయల్దేరిన కన్యాకుమారి - హౌరా (22503) ఎక్స్‌ప్రెస్ ►29న చెన్నయ్ లో బయల్దేరిన చెన్నయ్ - హౌరా (12840) మెయిల్ ►29 న వాస్కోడగామ లో బయల్దేరిన వాస్కొడగమ - షాలిమార్ (18048) ఎక్స్‌ప్రెస్ లు వయా Kharagpur - ఝార్సుగుడ - రాయ్ పూర్ - విజయవాడ మీదుగా రాకపోకలు ఈ 19 రైళ్లు ఇవాళ (సోమవారం) విశాఖపట్నం మీదుగా నడవవు 07:42AM ►కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందారు ►రైలు ప్రమాదంలో 54 మంది క్షత గాత్రులయ్యారు ►క్షతగాత్రులంతా ఏపీకి చెందినవారే ►క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నాం ►32 మందికి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స ►విశాఖ ఎన్.ఆర్.ఐ. ఆసుపత్రిలో ఒకరిని, మెడికవర్ ఆసుపత్రిలో ఇద్దరిని చేర్పించాం ►నలుగురి పరిస్థితి విషమంగా ఉంది :::విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి 07:40AM విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు నెంబర్లు 0891 2746330, 08912744619 ►ఎయిర్టెల్ 81060 53051 8106053052 ►బీఎస్ఎన్ఎల్ 8500041670 8500041671 07:32AM ►రైలు ప్రమాదం నేపథ్యంలో విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో హెల్ప్ లైన్ ►జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రకటన ►కేజీహెచ్ క్యాజువాలిటీ 8912558494 ►కేజీహెచ్ డాక్టర్ హెల్ప్ లైన్ నెంబర్ 8341483151 ►కేజీహెచ్ కేసు క్వాలిటీ 8688321986 ►ప్రయాణికుల క్షతగాత్రుల వైద్య సహాయం కోసం ఈ ఫోన్లను సంప్రదించాలని సూచన 06:31AM ►ఘటనా స్థలానికి చేరుకున్న బాహుబలి క్రేన్. చెల్లా చెదురు అయిన బోగీలను తొలగించే పనులు మరింత ముమ్మరం 06:02AM ►క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ►రాత్రంతా కొనసాగుతూనే ఉన్న మూడు లైన్ ల ట్రాక్ పనులు, పునరుద్ధరణ పనులు ►అలమండ ప్రాంతంలో భారీ పోలీస్ బందోబస్తు ►మృతుల సంఖ్య, వివరాలని అంచనా వేస్తున్న అధికారులు ►విశాఖ, భువనేశ్వర్ నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ ►పదికి చేరిన మృతుల సంఖ్య ►మృతుల సంఖ్య పెరిగే అవకాశం నేడు పలు రైళ్ల రద్దు విజయనగరం రైలు ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు తెలిపారు. కోర్బా-విశాఖపట్నం, పారదీప్-విశాఖపట్నం, రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం-గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్నం, విజయనగరం-విశాఖపట్నం రైళ్లు రద్దయ్యాయి. Bulletin 6-: pic.twitter.com/qr2o319M04 — Ministry of Railways (@RailMinIndia) October 29, 2023 బాధితుల కోసం సహాయక కేంద్రాలు విజయనగరం సమీపంలో జరిగిన రైలుప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించేందుకు రైల్వే, విశాఖ జిల్లా అధికారులు సహాయక కేంద్రాలను (కంట్రోల్ రూం) ఏర్పాటుచేశారు. విశాఖ కేజీహెచ్‌లో, విమ్స్‌లో వైద్యబృందాలను కలెక్టర్ మల్లికార్జున అందుబాటులో ఉంచారు. విశాఖ నుంచి ప్రమాదస్థలికి అంబులెన్సులను పంపారు. బాధితులకు వైద్య సహాయార్థం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటుచేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు విజయనగరం కలెక్టరేట్: 94935 89157 విశాఖ కలెక్టరేట్: 90302 26621, 70361 11169, 08912 590102 కేజీహెచ్: 89125 58494, 83414 83151 వైద్యుడు (24 గంటలు అందుబాటులో ఉంటారు): 83414 83151 అత్యవసర విభాగం వైద్యుడు: 86883 21986 రైల్వే ఆధ్వర్యంలో.. భువనేశ్వర్: 06742301625, 06742301525, 06742303060, 06742303729 (టోల్ ఫ్రీ) వాల్తేరు టెస్ట్ రూం: 89780 80805 సీనియర్ సెక్షన్ ఇంజినీర్ : 89780 80815 వాల్తేరు డివిజన్: 08942286245, 08942286213 అలమండ, కంటకాపల్లి: 89780 81960 విజయనగరం: 08922221206, 08922221202, 89780 80006 శ్రీకాకుళం రోడ్డు: 08942286213, 08922286245 ఏలూరు: 08812232267 సామర్లకోట: 08842327010 రాజమహేంద్రవరం: 08832420541 తుని: 08854252172 విశాఖ రైల్వేస్టేషన్లో..: 08912 746330; 08912 744619; 81060 53051; 81060 53052; 85000 41670; 85000 41671. ప్రమాదం ఎందుకు జరిగింది? విజయనగరం ఘోర ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్‌పై వెనుకనే విశాఖ నుంచి రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరింది. గంట వ్యవధిలోనే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య ఎదురవ్వడంతోనే కంటకాపల్లి నుంచి చాలా నెమ్మదిగా రైలు ట్రాక్‌పై వెళ్లిందని అందులోని ప్రయాణికులు చెబుతున్నారు. ఈలోగా వెనుకనుంచి వచ్చిన రైలు ఢీకొన్నట్లు వివరిస్తున్నారు. కారుచీకట్లు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రమాదం తరువాత సహాయక చర్యలు చేపట్టిన యంత్రాంగం.. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బొగ్గు రవాణా రైలు, ట్యాంకరు రైలును ఆ ప్రాంతం నుంచి తరలించారు. అలాగే పలాస రైలులో ప్రమాదానికి గురైన బోగీలు మినహాయించి మిగిలిన బోగీలను తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను కంటకాపల్లిలో నిలిపివేశారు. ఆయా రైళ్లలో ప్రయాణికులను రోడ్డు మార్గంలో తరలించారు. ప్రమాదానికి సిగ్నల్ సమస్య కారణమా? లేదంటే మానవ తప్పిదమా? అనేది తేలాల్సి ఉంది. ఏం జరిగింది.. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రాయగడ రైల్లోని బోగీలు నుజ్జునుజ్జు కాగా, మరికొన్ని పట్టాలు తప్పాయి. ప్రమాద ధాటికి రైలు ఇంజన్ సహా ఐదు బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. అక్కడే మరో ట్రాక్‌పైనున్న గూడ్సు రైలు బోగీలపైకి అవి దూసుకెళ్లాయి. దీంతో ఇక్కడ భీతావహం నెలకొంది. బాలేశ్వర్ తరహాలోనే.. ఈ ఏడాది జూన్‌లో జరిగిన బాలేశ్వర్ రైలు ప్రమాద సంఘటన మాదిరిగానే ఈ ప్యాసింజర్ రైళ్ల ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. పలాస గార్డు బోగీని రాయగడ ఇంజిను ఢీకొట్టడంతో ఆ రెండు నుజ్జయ్యాయి. ఈ వేగానికి రాయగడ బోగీలు ఏకంగా అదే రైలు ఇంజినుపైకి దూసుకెళ్లాయి. అదే సమయంలో పక్కన గూడ్సు రైలు వెళుతోంది. ప్రమాదం జరిగినప్పుడు రాయగడ రైలుకు చెందిన కొన్ని బోగీలు గూడ్సు రైలును ఢీకొన్నాయి. రెండు ప్యాసింజర్, గూడ్సు రైళ్లలో కలిపి ఐదు బోగీలు నుజ్జయ్యాయి. మృతుల కుటుంబాలకు ప్రధాని సాయం రూ.2 లక్షలు విజయనగర రైలు ప్రమాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from the PMNRF for the next of kin of each deceased due to the train derailment between Alamanda and Kantakapalle section. The injured would be given Rs. 50,000. https://t.co/K9c2cRsePG — PMO India (@PMOIndia) October 29, 2023 ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులందరినీ తరలించినట్లు అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితోనూ ప్రధాని మాట్లాడారని, రైల్వే బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. All injured shifted to hospitals. Ex-gratia compensation disbursement started - ₹10 Lakh in case of death, ₹2.5 Lakh towards grievous and ₹50,000 for minor injuries. — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 29, 2023 సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి విజయనగరం రైలు ప్రమాదంపై సీఎం జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.రైలుప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందినవారి కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్ ప్రకటించారు. ఇతర రాష్ట్రాలవారు మరణిస్తే రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ఘటన గురించి రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌తో ఆదివారం రాత్రి ఆయన ఫోన్లో మాట్లాడారు. ఘటనాస్థలికి మంత్రి బొత్స సత్యనారాయణను పంపామని, ప్రమాద విషయం తెలియగానే సహాయకబృందాలు అక్కడకు చేరుకున్నాయని వివరించారు. సహాయక చర్యల్ని స్థానిక కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారని, క్షతగాత్రుల్ని వివిధ ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు. -
విజయనగరం: కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం, ఆరుగురు మృతి
Train accident Updates ►ఘటనా స్థలానికి చేరుకున్న యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్.. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ ►సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ►రాయగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేశారు. ►08912746330, 08912744619, 8106053051, 8106053052, 8500041670, 8500041671లకు సంప్రదించవచ్చు. ►ఘటనాస్థలానికి చేరుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ. ►ఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాద స్థలికి విజయనగరం ఎస్పీ బయల్దేరారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ► రైలు ప్రమాదంలో ఒక బోగీలో చిన్నారులు ఇరుక్కుపోయారు. ఆర్తనాదాల మధ్య ప్రయాణికులు చీకటిలో చిక్కుకుపోయారు. ఎలక్ట్రికల్ సిబ్బంది, రైల్వే సహాయక సిబ్బంది, ఉన్నతాధికారులు ప్రత్యేక రైలులో ఘటనా స్థలికి చేరుకున్నారు. సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి రైలు ప్రమాదం జరిగింది. కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద పట్టాలపై ఉన్న విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలును పలాస-విశాఖ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయగడ ప్యాసింజర్ చివరి నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో అరుగురు మృతిచెందగా, పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా ఓవర్ హెడ్ కేబుల్ తెగడంతో విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలపై నిలిచిపోయింది. ఆగిపోయిన ప్యాసింజర్ రైలును పలాస ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సంఘటనా ప్రాంతం అంధకారంగా మారింది. కరెంట్ లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. -
‘సీఎం జగన్ పాలనలోనే సామాజిక విప్లవం’
సాక్షి, విజయనగరం: సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమైందని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. విజయనగరం నుంచి రెండోరోజు వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు బూడి ముత్యాల నాయుడు, బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, అలజంగి జోగరావు, సాంబంగి చిన్న అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాస రావు, జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మేయర్ వెంపడపు విజయలక్ష్మి పాల్గొన్నారు. ‘‘విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. విజయనగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అట్టడుగు వర్గాలకు సీఎం జగన్ అండగా నిలిచారు. నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందించారు. జరిగిన అభివృద్ధిని బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళుతున్నాం. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హమీని సీఎం జగన్ నెరవేర్చారు. మేం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నాం. అవినీతికి చోటు లేకుండా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించాం. వెనుకబడిన వర్గాలకు ఆర్థిక చేయూతనందించాం’’ వైఎస్సార్సీపీ నేతలు అని పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. టీడీపీ చేసిన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళతాం. బీసీ, ఎస్సీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన నాయకుడు సీఎం జగన్. అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్న అంబేడ్కర్ స్ఫూర్తిని జగన్ కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వం బలహీనవర్గాలను నిలువునా మోసం చేసింది. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ చంద్రబాబు హేళన చేశారు. సీఎం జగన్ పాలనలో సామాజిక విప్లవం విరాజిల్లుతోంది.’’ వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. జగన్ పాలనలో సామాజిక సమతుల్యత: మంత్రి బొత్స సామాజిక సాధికార యాత్ర ద్వారా సీఎం జగన్ పాలనలో ఏ విధంగా సామాజిక సమతుల్యత సాధించమో వివరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో సామాజిక సాధికార జరుగుతుంది. చంద్రబాబులా మోసం చేయం. చెప్పిందే చేయడం, చేసిందే చెప్పడం సీఎం జగన్ నైజాం. నూటికి 99 శాతం మేనిఫెస్టో అమలు చేశాం.చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీలు 650 వాగ్దానాలు చేశారు. చంద్రబాబు 2014 జూన్‌లో ప్రమాణ స్వీకారం చేసి, అదే రోజున చేసిన సంతకాలు అమలు కాలేదు. మహిళల రుణమాఫీ, బెల్ట్ షాప్‌ల నియంత్రణ అమలు చేయలేదు. వంచనదారుల మాటలు నమ్మొద్దు. సంక్షేమ పథకాలను అవహేళన చేస్తున్నా వాటిని అమలు చేసి పేదలకు అండగా జగన్ నిలబడ్డారు. నాలుగున్నరేళ్ల లో ఏమేరకు అభివృద్ధి చేశామో ప్రజలు చూడాలని మంత్రి బొత్స కోరారు. చదవండి: APPSC: ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. -
విజయనగరం జిల్లా ఎంత మారిందో చూడండి..!
-
థాంక్యూ జగనన్న.. జీవితాంతం మేం మీకు రుణపడి ఉంటాం
సాక్షి, విజయనగరం: ఏపీ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించారు. తద్వారా వైద్య విద్యలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలను సీఎం జగన్ ప్రారంభించారు. విజయనగరం గాజులరేగలో 70 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ ప్రారంభించి.. ఆ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా మిగతా నాలుగు మెడికల్ కాలేజీలను ప్రారంభించారాయన. వరల్డ్‌క్లాస్ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి రావడంతో వైద్య విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యార్ధులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే.. మాది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం సీఎం సార్, మన రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో ఇన్ని మెడికల్ కాలేజీలు నిర్మించడంపై మేం మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నేను ఆర్ధికంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చాను, మా కుటుంబంలో నేను మొదటి డాక్టర్‌ను, మీ ప్రభుత్వంలో నేను డాక్టర్ అవడం గొప్పగా ఫీలవుతున్నాను, ఇది నా అభిప్రాయమే కాదు నాతోటి విద్యార్ధులందరి అభిప్రాయం. ఇన్ని మౌలిక సదుపాయాలతో అధునాతనమైన వైద్య విద్య మాకు అందుతుంది, చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా ఇన్ని సౌకర్యాలు ఉండవు, మంచి అనుభవమున్న టీచింగ్ స్టాఫ్‌ని కూడా మాకు ఇచ్చారు, చక్కటి హాస్టల్ కూడా ఉంది, మంచి వాతావరణం కూడా ఉంది, మీరు మా విద్యార్ధులకు మార్గదర్శకంగా ఉన్నారు, నేను మీకు మాట ఇస్తున్నాను, మీ సంకల్పం వల్లే నా కల నెరవేరింది, ఈ విజయానికి మీరే కారణం, మీలా ప్రజాసేవ చేయాలని, మీ అంత గొప్పగా అయ్యేలా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు, ధ్యాంక్యూ సార్. -ప్రసూన, వైద్య విద్యార్ధిని, విజయనగరం మెడికల్ కాలేజ్ మా జగనన్న వల్ల ఇన్ని మార్పులు ఊహించలేదు గుడ్ మార్నింగ్ అన్నా, నేను విజయనగరం జిల్లాకు చెందిన అమ్మాయిని, మేం ఎస్టీలం, మా నాన్న దినసరి కూలీ, అమ్మ గృహిణి, నేను చిన్నప్పటి నుంచి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నాను, నీకు ఎంబీబీఎస్ ఎందుకు, రాదని చాలామంది చెప్పారు, కానీ మా జగనన్న వల్ల వైద్య విద్యలో ఇన్ని మార్పులు జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. ప్రభుత్వ కాలేజ్ అంటే ముందు భయపడ్డా కానీ తర్వాత చూస్తే చాలా ఆశ్చర్యపోయా, అంతా డిజిటలైజేషన్, స్కిల్ ల్యాబ్స్ ఉన్నాయి, మాలాంటి పేద, మధ్యతరగతి పిల్లలు వైద్య విద్య చదువుతున్నారంటే మీరే కారణం, మా కుటుంబంలోనే కాదు మా ఊరిలోనే మొదటి డాక్టర్‌ను, నేను ప్రజలకు మంచి సేవలు అందిస్తానని మీకు మాట ఇస్తున్నాను, నవరత్నాల వల్ల కూడా చాలా లబ్ధి జరిగింది మాకు, మీరు వచ్చిన తర్వాత స్కూల్స్ చాలా మారిపోయాయి, మా అమ్మకు క్యాన్సర్, క్రిటికల్ స్టేజ్ అన్నారు, చాలా ఖర్చవుతుందనుకున్నాం, నమ్మకం కోల్పోయాం, కానీ ఆరోగ్యశ్రీ వల్ల మేం రూపాయి ఖర్చు లేకుండా చికిత్స చేయించాం, మా అమ్మ నన్ను చూస్తుందంటే మీరే కారణం, మా కుటుంబం మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది, మిమ్మల్ని స్పూర్తిగా తీసుకుని కులం, మతం, ప్రాంతం చూడకుండా నేను సేవలు అందిస్తాను, మీరు సీఎంగా ఉంటారు, నేను డాక్టర్‌గా ఉంటాను, ఇద్దరం ప్రజలకు సేవ చేద్దాం అన్నా, ధ్యాంక్యూ అన్నా. -గగనశ్రీ, వైద్య విద్యార్ధిని, రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీకు రుణపడి ఉంటాం సార్ మాది దిగువ మధ్యతరగతి కుటుంబం, మా నాన్న చిన్న వ్యవసాయ కూలీ, మా అమ్మ టైలర్, వాళ్ళ రెక్కల కష్టంతో ఇక్కడ వరకు తీసుకొచ్చారు, నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలన్న కోరిక ఉండేది, కానీ పేరెంట్స్ ఆర్ధిక పరిస్ధితులతో భయపడ్డారు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, కొత్త కాలేజ్‌లో నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, మా ఫ్యామిలీలో నేను మొదటి డాక్టర్‌ను, మా కుటుంబం డాక్టర్ కుటుంబంగా మారుతుంది. జీవితాంతం మేం మీకు రుణపడి ఉంటాం, ధ్యాంక్యూ సార్. -కోటేశ్వరి, కంభంపాడు, వైద్య విద్యార్ధిని, ఏలూరు మమ్మల్ని ప్రగతి వైపు అడుగులు వేసేలా చేస్తున్నారు సార్, మాది అనంతపురం జిల్లా, నేను రెండేళ్ళ వెటర్నరీ సైన్స్ చదివిన తర్వాత మూడోసారి నీట్లో ఎంబీబీఎస్ వచ్చింది, ఈ కాలేజ్ లేకపోతే నాకు ప్రైవేట్ కాలేజ్‌లో సీట్ వచ్చేది, కాలేజ్ చాలా బావుంది, ఇంత మంచి కాలేజ్ చూడలేదు, హాస్టల్ బావుంది, క్లీన్ గా ఉంచుతున్నారు, ప్రేవేట్ మెడికల్ కాలేజ్‌ను తలపిస్తుంది, స్కిల్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు, మాకు మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, మంచి ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు, పెద్ద లైబ్రరీ ఉంది, డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు, క్వాలిటీ చక్కగా ఉంది, సెక్యూరిటీ బావుంది, మీరు మంచి వైద్యవిద్య అందిస్తున్నారు, మీరు మమ్మల్ని ప్రగతి వైపు అడుగులు వేసేలా చేస్తున్నారు, ధన్యవాదాలు. మేం రాబోయే రోజుల్లో మంచి డాక్టర్లగా సేవలందిస్తాం, మా రాయలసీమకు ఒక వెలుగు వచ్చింది, మా కల సాకారం అయింది, ధ్యాంక్యూ సార్. -జలదుర్గం త్రిభువని, మెడికల్ స్టూడెంట్, నంద్యాల ఇంత మంచి కాలేజ్‌లో చదువుకోవడం గర్వంగా భావిస్తున్నా సీఎం సార్ నేను ఇక్కడ చదువుకోవడం సంతోషంగా ఫీలవుతున్నాను, ఇది మంచి అవకాశం, మా కుటుంబ నేపధ్యం కూడా అంతంతమాత్రమే, ఇన్ని సౌకర్యాలతో ఇంత మంచి కాలేజ్‌లో చదువుకోవడం గర్వంగా భావిస్తున్నాను. మెడికల్ స్టూడెంట్స్‌కు అవసరమైన ప్రతిది ఇక్కడ ఏర్పాటు చేశారు, క్యాంపస్ చాలా బావుంది. థాంక్యూ సార్. -సచిన్ దాండియా , మెడికల్ స్టూడెంట్, ఆల్ ఇండియా కోటా, రాజస్ధాన్, మచిలీపట్నం మెడికల్ కాలేజ్ మీరు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు సార్, నేను చిన్నప్పటి నుంచి ఇష్టంగా చదువుకుని వైద్యరంగంలోకి వచ్చాను, నేను గుంటూరు మెడికల్ కాలేజ్‌లో చదువుకున్నాను, నేను పీజీ కూడా ఇక్కడే చేస్తున్నాను. వైద్య విద్యలో మీరు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు, మా జీఎంసీ ఏర్పాటై 76 సంవత్సరాలు అయింది, ఈ నాలుగేళ్ళలో మాకు 80కు పైగా పీజీ సీట్లు పెరిగాయి, గతంలో సీట్లు రాక నిరుత్సాహంతో ఉండేవారు కానీ మీరు వచ్చిన తర్వాత మనసు పెట్టి చదివితే సీట్లు వస్తున్నాయి, మీకు రుణపడి ఉంటాం, రిక్రూట్మెంట్ త్వరగా జరుగుతుంది, జీరో వేకెన్సీ పాలసీ, మా ప్రొఫెసర్స్ కూడా సంతోషంగా ఉన్నారు, మా జీఎంసీలో మంచి ఎక్విప్మెంట్ ఏర్పాటుచేశారు, కోవిడ్ సమయంలో ఎంతో మంది ప్రాణాలు నిలిచాయంటే ఈ ఎక్విప్‌మెంటే కారణం, కార్పొరేట్ ఆసుపత్రులకు పోటీగా జీఎంసీ ఉంది, అధునాతనమైన సౌకర్యాలు వచ్చాయి, క్యాన్సర్ విభాగంలో రేడియో థెరపీ ఏర్పాటు చేశారు, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రాసెస్‌లో ఉంది, ఓపీ టైం కూడా పెంచడం వల్ల పేదలకు అన్నీ అందుతున్నాయి, రోజుకు 3500, 4000 ఓపీ కేసులు చూస్తున్నాం, క్యాజువాల్టీలు కూడా పెరిగాయి, ఇది మంచి అనుభవం, రేపటి మా భవిష్యత్ కోసం మీరు ఈ రోజు వేసే ఈ ఆరోగ్య పునాది మీకు ఉన్న ఆరోగ్యాంధ్రప్రదేశ్ కలకు నిదర్శనం, మీరు ఈ బీజాన్ని వేయడానికి కష్టపడుతుంటే అర్ధం కాదేమో ఎవరికీ, కానీ అది మహా వృక్షమై మాకు ఉద్యోగ ఫలాలు, ప్రజలకు ఆరోగ్య ఫలితాలు ఇస్తుంటే తెలుస్తుంది, సామాన్యులకు మీ విజన్ ఏంటో మీ మిషన్ ఏంటో, చిరునవ్వుతో పెను మార్పులు చేయచ్చు అని తెలుసుకున్నాం మిమ్మల్ని చూసి, ఏపీని హెల్తీ అండ్ హ్యపీ స్టేట్‌గా చూస్తున్నాం, ధ్యాంక్యూ. -డాక్టర్ అలేఖ్య, పీజీ స్టూడెంట్, గుంటూరు మెడికల్ కాలేజ్ ఏపీని మీరు మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు సార్, మాది కేరళ, ఆల్ ఇండియా కోటాలో ఇక్కడ చదువుతున్నాను, మీ నాన్నగారు, మీరు వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు, ఏపీని మీరు మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు, పీజీ సీట్లు కూడా పెంచారు, మీకు ధన్యవాదాలు, నేను ఏపీని ఎంచుకోవడానికి కారణం, ఇక్కడ మంచి వాతావరణం, మంచి విద్య అందుతుందనే కారణం, ప్రతి మెడికల్ కాలేజీలో అనేక అసౌకర్యాలు ఉంటాయి కానీ ఇక్కడ అన్నీ ఏర్పాటు చేశారు, నాడు నేడు కింద అన్ని మౌలిక సదుపాయాలు, అధునాతన టెక్నాలజీ ఏర్పాటు చేయడం వల్ల మా పీజీ విద్యార్ధులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు, ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనకు మీరు చేస్తున్న ప్రయత్నంలో మేం భాగస్వామ్యులవుతాం, విలేజ్ హెల్త్ క్లీనిక్‌లు, జగనన్న ఆరోగ్య సురక్ష చక్కటి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ పథకం పేదలకు చాలా ఉపయోగపడుతుంది, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ చాలా బావుంది, మీరు ఏపీ ప్రజల దేవుడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, మీ ఆరోగ్యాంధ్రప్రదేశ్ కలను సాకారం చేస్తామని మాట ఇస్తున్నాం, థ్యాంక్యూ సార్. డాక్టర్ ఐశ్వర్య, పీజీ స్టూడెంట్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, తిరుపతి ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌లకు ధీటుగా గవర్నమెంట్ కాలేజ్‌లు సార్ మాకు మెడికల్ కాలేజీలలో మంచి విద్య, సౌకర్యాలు అందుతున్నాయి, దీని వల్ల మంచి అనుభవం వస్తుంది, ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌లకు ధీటుగా గవర్నమెంట్ కాలేజ్ ఏర్పాటు చేశారు, టీచింగ్ ఫ్యాకల్టీ బావుంది, నేను మంచి డాక్టర్‌గా సేవలందిస్తానని మీకు మాట ఇస్తున్నాను. -డాక్టర్ అనంత్, పీజీ స్టూడెంట్, విజయనగరం మెడికల్ కాలేజ్ చదవండి: వెనుకబడిన ప్రాంతాల్లోనూ మెడికల్ కాలేజీలు: సీఎం జగన్ -
ఈ స్టూడెంట్ మాటలకి సీఎం జగన్ రియాక్షన్
-
వచ్చే ఏడాది మరో 5 కాలేజీలను ప్రారంభిస్తాం: సీఎం జగన్
-
సీఎం జగన్‌ను సత్కరించిన మంత్రి విడదల రజిని
-
ఆరోగ్యశ్రీ సేవలు 3,255 ప్రొసీజర్స్‌కు విస్తరించాం
-
వెనుకబడిన ప్రాంతాల్లోనూ మెడికల్ కాలేజీలు
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి ఐదు మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం విజయనగరం గాజులరేగలో 70 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ ప్రారంభించి.. ఆ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా మిగతా నాలుగు మెడికల్ కాలేజీలను ప్రారంభించారాయన. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘దేవుడి దయతో మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తుండడం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మీరంతా గొప్ప డాక్టర్లు కావాలి. మీరంతా అత్యున్నత స్థాయికి చేరుకోవాలి అని విద్యార్థులను ఉద్దేశించి ఆకాంక్షించారు సీఎం జగన్. స్వతంత్రం వచ్చాక ఏపీలో కేవలం 11 మెడికల్ కాలేజీలే ఉన్నాయి. అందుకే ఈ 11 మెడికల్ కాలేజీలకు మరో 17 మెడికల్ కాలేజీలను చేర్చి 28 మెడికల్ కాలేజీల దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓ మెడికల్ కాలేజీ ఉండబోతోంది. ఇవాళ ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నాం. వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తాం. ఆ మరుసటి ఏడాది మరో ఏడు కాలేజీలు ప్రారంభిస్తాం. ఈ 17 మెడికల్ కాలేజీలు కట్టడం కోసం దాదాపు రూ.8,480 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ కాలేజీల వల్ల కొత్తగా 2,250 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో.. మొత్తంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4,735 సీట్లకు చేరుతుంది. ఈ ఒక్క ఏడాదే 609 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మంచి డాక్టర్లు అయ్యి.. ప్రజలకు ఉపయోగపడాలి. ఇదే నేను మీ నుంచి కోరుకుంటున్నా. అందుకే ఖర్చు ఎంతైనా వెనకాడడం లేదని తెలిపారాయన. రాబోయే రోజుల్లో.. వెనకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయి. గిరిజన ప్రాంతాలతో పాటు వైద్యసదుపాయాలకు దూరంగా మారుమూల ప్రాంతాల్లోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటు ఉండనుందని సీఎం జగన్ తెలిపారు. ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. హెల్త్ సెక్టార్లో 53 వేలమందిని రిక్రూట్ చేశాం. కొత్తగా 18 నర్సింగ్ కాలేజీలను తీసుకొస్తున్నాం. ప్రస్తుత కాలేజీల్లో మౌలిక సదుపాయాల్ని మెరుగుపరుస్తాం. వైద్య రంగంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నాం అని సీఎం జగన్ వివరించారు. ఇంకా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఈరోజు 5 మెడికల్ కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రారంభించాం. ఐదు చోట్ల ఫస్టియర్ అడ్మిషన్లకు కూడా ఈరోజు పిల్లలను తీసుకొనే పరిస్థితిలోకి అడుగులు వేగంగా ముందుకు వేయగలుగుతున్నాం. ► ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేయడమే కాకుండా ప్రతి పార్లమెంటు స్థాయిలో ఒక మెడికల్ కాలేజీ పెట్టే కార్యక్రమం ఇనీషియేట్ చేస్తున్నాం. దీని వల్ల ఏం జరుగుతుందంటే.. టెరిషరీ కేర్ అన్నది ప్రతి పార్లమెంటు స్థాయిలోకి మనం తీసుకొని పోగలుగుతాం. ► ఎప్పుడైతే మెడికల్ కాలేజీ అవైలబుల్గా ఉంటుందో అప్పుడు ఆ మెడికల్ కాలేజీతో పాటు ప్రొఫెసర్లుగానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లుగానీ వీళ్లందరూ అవైలబుల్గా ఉండటం కూడా ఒక గొప్ప మార్పు టెరిషరీ కేర్‌లో జరుగుతుంది. ► టెరిషరీ కేర్ పెరగడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ► ఇది ఒక ఎత్తయితే వేల మంది పిల్లలను మంచి డాక్టర్లుగా తయారు చేసే గొప్ప ఇన్స్టిట్యూషన్స్ను కూడా రాష్ట్రంలో క్రియేట్ చేయగలుగుతున్నాం. ► ఈరోజు ప్రారంభం అవుతున్న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 మెడికల్ కాలేజీల్లో దాదాపు 750 ఎంబీబీఎస్ సీట్లతో పిల్లలు డాక్టర్లు కాబోతున్నారు. ►ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలన్నింటిలోనూ సదుపాయాలన్నీ అప్‌గ్రేడ్ చేయగలిగాం. ► ఆల్ ది పెండింగ్ వేకెన్సీస్, విత్ ఎ జీరో వ్యాకెన్సీ పాలసీ తీసుకుని రావడం వల్ల దాదాపు ఈ ఒక్క సంవత్సరంలోనే 609 కొత్త పీజీ సీట్లు అందుబాటులోకి రాగలిగాయి. ► భవిష్యత్‌లో మరో 2,737 పీజీ సీట్లు కూడా వీటి ద్వారా రానున్న రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. ► ఈరోజు ప్రారంభం అవుతున్న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 మెడికల్ కాలేజీల్లో దాదాపు 750 ఎంబీబీఎస్ సీట్లతో పిల్లలు డాక్టర్లు కాబోతున్నారు. ► రేపు సంవత్సరం పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, ఇలాంటి బ్యాక్వర్డ్ ఏరియాల్లో కూడా మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ► ఈ ఎంబీబీఎస్, పీజీ మెడికల్‌కాలేజీల్లో సీట్లు మాత్రమే కాకుండా గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలను డెవలప్ చేస్తున్నాం. ► ఇప్పటి వరకు దాదాపు 1090 నర్సింగ్సీట్లు ఉంటే మరో 18 నర్సింగ్ కాలేజీలను తీసుకొస్తున్నాం. ► వీటి ద్వారా మరో 1200 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ► ఉన్న 11 మెడికల్ కాలేజీల్లోనూ ప్రతి కాలేజీలోనూ ఎన్ఏబీహెచ్, ఎన్ఎఫ్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా కాలేజీలను నాడు–నేడు ద్వారా అన్నింటినీ అప్‌గ్రేడ్ చేస్తున్నాం. ► నాడు–నేడు కార్యక్రమాలు అన్నింటి మీద దాదాపు రూ.3,820 కోట్లు వెచ్చిస్తున్నాం. ► ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామ స్థాయిలో నుంచి మార్పులు తీసుకొస్తున్నాం. ► ఒకపక్క క్యూరేటివ్ క్యూర్ ఎంత అవసరమో, ప్రివెంటివ్ కేర్ కూడా అంతే అవసరం. ► దేశానికే మార్గదర్శకంగా నిలబడే విధంగా అడుగులు పడటం జరిగింది. ► ప్రివెంటివ్ కేర్‌లో ఎప్పుడూ చూడని అడుగులుపడ్డాయి. 10,032 విలేజ్ క్లినిక్స్ ఏర్పాటయ్యాయి. ► ఆ విలేజ్ క్లినిక్స్‌లో సీహెచ్‌వో, ఏఎన్ఎం, ఆశా వర్కర్ ఉంటారు. ► గ్రామస్థాయిలో 105 రకాల మందులు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. 14 రకాల డయోగ్నస్టిక్ టెస్టులు చేస్తారు. ► మరో 542కు సంబంధించిన అర్బన్ క్లినిక్ష్ తీసుకొచ్చాం. ► ఈ విలేజ్ క్లినిక్స్‌ను ప్రివెంటివ్ కేర్ దిశగా అడుగులు వేయిస్తున్నాం. ► ప్రతి మండలానికీ కనీసం 2 పీహెచ్‌సీలు ఉండేట్లుగా చేస్తున్నాం. ఇద్దరు డాక్టర్లు ఉండేట్లు చేస్తున్నాం. ► ప్రతి పీహెచ్‌సీలోనూ నలుగురు డాక్టర్లు, ఒక 104 వాహనం ఉండేట్లు చేస్తున్నాం. ► ప్రతి నెలా గ్రామానికి 2 సార్లు వెళ్లేటట్లు చేస్తున్నాం. ► దీని వల్ల 6 నెలల్లో ఎవరికి ఏ రోగముంది, ఎవరికి బీపీ, షుగర్, ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయని పూర్తిగా చెప్పే ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. ► గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మందులు తీసుకుంటే నయం కాదు అని చాలా మంది అనుకుంటారు. ► ఈరోజు అన్ని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో జీఎంపీ మందులు మాత్రమే ఆంధ్రరాష్ట్రంలో ఉన్నాయి. ► ఆరోగ్యశ్రీ సేవలు మనం రాకముందు నామమాత్రంగా ఉండేవి. ► 1050 ప్రొసీజర్లు ఉంటే, ఈరోజు 30255 ప్రసీజర్లకు విస్తరించాయి. ► క్యాన్సర్ దగ్గర నుంచి కాక్లియర్ ఇంప్లాంట్‌దాకా కవర్ అవుతున్నాయి. ► వైద్యం ఖర్చు రూ.1000 దాటితే అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలని తపన, తాపత్రయంతో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తున్నాం. ► గతంలో ఆరోగ్యశ్రీ ఎంపానెల్ 900 హాస్పిటల్స్ ఉంటే, ఈరోజు 2285కు విస్తరించాయి. ► గతంలో ఆరోగ్యశ్రీ బడ్జెట్ రూ.1100 కోట్లు కూడా లేని పరిస్థితి ఉంటే, ఈరోజు రూ.3,600 కోట్లకు అందుతోంది. ► ప్రతి మండలానికి 108, రెండు 104 వాహనాలు ఉండేట్లుగా 1514 కొత్త వాహనాలు కొనుగోలు చేశాం. ► తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ కలుపుకుంటే 2,204 అంబులెన్స్ వాహనాలు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. ఇలా ఏ రాష్ట్రంలోనూ తిరగడం లేదు. ► రాష్ట్రంలో ఈ నాలుగు సంవత్సరా కాలంలో మనం రిక్రూట్ చేసిన హెల్త్ డిపార్ట్ మెంట్స్టాఫ్ 53,126 మంది. ► నేషనల్ యావరేజ్ స్పెషలిస్ట్డాక్టర్లకు సంబంధించి 61 శాతం అవైలబుల్ ఉంటే, స్టేట్యావరేజ్ కేవలం 3.96 శాతం మాత్రమే. ► స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ పెట్టి, ప్రత్యేక బోర్డు పెట్టి వెంట పడుతున్నాం. ► జాతీయ స్థాయిలో నర్సుల పోస్టులు ప్రభుత్వాస్పత్రుల్లో వేకెన్సీ 27 శాతం. రాష్ట్ర యావరేజ్ జీరో. ► జాతీయ స్థాయిలో ల్యాబ్ టెక్నీషియన్ల వేకెన్సీలు గవర్నమెంట్ ఆస్పత్రుల్లో 33 శాతం. స్టేట్ యావరేజ్ జీరో. ► ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఇక్కడ నుంచి మంచి డాక్టర్లు రావాలి. ► మంచి పీజీ స్టూడెంట్లు రావాలి. మంచి మనసు రావాలి, మీరు కూడా పేదవాళ్లకు ఉపయోగపడే పరిస్థితి రావాలి. ► ఇప్పటి వరకు బటన్ నొక్కితే నేరుగా డీబీటీ పద్ధతిలో 2.35 లక్షల కోట్లు పేద ప్రజల ఖాతాల్లోకి నేరుగా లంచాలు, వివక్షకు చోటు లేకుండా చేయగలిగాం. ► ఇంటి తలుపు తట్టి పెన్షన్‌ను ప్రతి గడపకూ తీసుకొని పోగలిగాం. ► ఇంటి తలుపుతట్టి రేషన్ కార్డు, రేషన్ బియ్యం, ప్రతి గడప ముంగిటకు చేర్చగలిగాం. ► ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి ఇంటి స్థలం లేని వారు ఉన్నారా అని వెతికి, అప్లికేషన్‌పెట్టించి 30 లక్షల ఇంటి స్థలాలను పేదవాళ్లకు ఇవ్వగలిగాం. ► 22 లక్షల ఇళ్లు వేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ► ఎవరికి ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఇంటింటికీ వెళ్లి జల్లెడ పట్టి అవసరాలు తీరుస్తున్నాం. ► జగనన్న సురక్షలో 98 లక్షల సర్టిఫికెట్లు అందజేశాం. ► ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు ఇంకో మంచి కార్యక్రమం చేస్తున్నాం. ► జగనన్న ఆరోగ్య సురక్ష అని ఈరోజు ప్రారంభించాం. ► ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడ పట్టి ఆ ఇంట్లో ఎవరికి ఏరకమైన సమస్య ఉన్నా 7 రకాల టెస్టులు, 5 దశల్లో యాక్టివిటీ మొదలు పెట్టాం. ► 4వ ఫేజ్ హెల్త్ క్యాంపు, సెప్టెంబర్ 30న మొదటి హెల్త్ క్యాంపు, తర్వాతి 45 రోజులు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ హెల్త్‌క్యాంపులు విస్తరించి పూర్తవుతాయి. ► గ్రామం మొత్తం మ్యాపింగ్ అవుతుంది. ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా వాళ్లకు ఫ్రీగా టెస్టులు చేస్తాం. మందులు ఇవ్వబోతున్నాం. ► తర్వాత హ్యాండ్ హోల్డింగ్ చేయబోతున్నాం. ► ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా అడుగులు వేయబోతున్నాం. ► మీ అందరి సహాయ సహకారాలు రావాలి, కావాలి అని మనస్పూర్తిగా అడుగుతున్నా. ► కొన్ని మాటలు ఎప్పుడూ కూడా నా మనసుకు తడుతుంటాయి. ► నాట్ ఆల్ ఏంజిల్స్ హావ్ వింగ్స్. సమ్ హ్యావ్ స్టెతస్కోప్స్. కీప్ దిస్ ఇన్‌మైండ్. ► ఇది ఇక్కడే రాసి సంతకం కూడా పెట్టా. ► ప్రజలకు మీరు చేయబోయే కార్యక్రమం, మంచి పోస్టు గ్రాడ్యుయేట్లు, మంచి డాక్టర్లుగా అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్. -
సీఎం వైఎస్ జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ విజువల్స్
-
Live: విజయనగరం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం
-
Live Updates: మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం జగన్
Updates.. ► విజయనగరం పర్యటన ముగించుకొని విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిన సీఎం జగన్. సీఎం జగన్ కామెంట్స్ ఇవే.. ► సీఎం జగన్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చాక ఏపీ కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరో 17 మెడికల్ కాలజీల కోసం రూ.8480 కోట్లు వెచ్చిస్తున్నాం. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఉండాలి. ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తుండటం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో వీరంతా గొప్ప డాక్టర్లు కావాలి. మీరంతా అత్యున్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తున్నాను. ► వచ్చే ఏడాది మరో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తాం. ఆ మరుసటి ఏడాది మరో 7 కాలేజీలు ప్రారంభిస్తాం. ఇప్పటి వరకు 2185 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త కాలేజీల రాకతో సీట్ల సంఖ్య 4735కు చేరింది. ఈ ఒక్క ఏడాదే 609 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లోనూ కాలేజీలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో మరో 2737 పీజీ సీట్లు అందుబాటులోకి వస్తాయి. వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయి. మరో 18 నర్సింగ్ కాలేజీలు అందుబాటులోకి తెస్తాం. వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. 10,032 విలేజ్ క్లీనిక్స ఏర్పాటు చేశాం. గ్రామస్థాయిలో ఆశావర్కర్లతో సేవలు అందిస్తున్నాం. ► ప్రతీ మండలానికి ఒక పీహెచ్సీ. ఊరిలోనే ఉచిత వైద్యం అందించేలా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన మందులు అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ సేవలు 3,255 ప్రొసీజర్స్‌కు విస్తరించాం. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేశాం. గతంతో పోలిస్తే వైద్యానికి భారీగా బడ్జెట్ పెంచాం. 108, 104 వాహనాల సంఖ్యను పెంచాం. వైద్యరంగంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నాం. మీరంతా పేదవారికి సేవ చేయాలి. హెల్త్ సెక్టార్ కోసం 53,126 మందిని రిక్రూట్ చేశాం. 2.35 లక్షల కోట్ల డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించాం. పెన్షన్‌ను నేరుగా ఇంటి తలుపు తట్టి అందిస్తున్నాం. ► ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదవారికి మంచి జరగాలన్నదే మా ఆలోచన. ఏ చదువైనా పేదవారికి అందుబాటులో ఉండాలి అని అన్నారు. ► ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఈ స్థాయిలో సదుపాయాలతో కాలేజీ నిర్మాణం అద్భుతం. మెడిసిన్ చదవాలనుకున్న మా కల సాకారమవుతోంది. సీఎం జగన్‌కు మా కృతజ్ఞతలు. ► ట్రీట్మెంట్కు సంబంధించిన వివరాలను వైద్యులు.. సీఎం జగన్‌కు వివరించారు. ► సీఎం జగన్‌తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజినీ, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు ఉన్నారు. ► మెడికల్ కాలేజీలో ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన సీఎం జగన్. ► విజయనగరంలో సీఎం జగన్ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. ► మెడికల్ కాలేజీ ప్రాంగణానికి బయలుదేరిన సీఎం జగన్ ► సీఎం జగన్ విజయనగరం చేరుకున్నారు. ► సీఎం జగన్‌కు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం రాజన్న దొర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ► విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్. ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ►మెడికల్ కాలేజీలో ప్రారంభోత్సవం కోసం సీఎం జగన్ విజయనగరం బయలుదేరారు. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించి అనంతరం.. వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కాలేజీలను ప్రారంభించనున్నారు. ► ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రాంగణానికి చేరుకుంటారు. ► అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణ, తర్వాత నూతన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం, ల్యాబ్‌ల పరిశీలన, మిగిలిన 4 మెడికల్ కాలేజీల వర్చువల్ ప్రారంభోత్సవం తర్వాత సీఎం జగన్ ప్రసంగిస్తారు. ► అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు. ► ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ. 8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం. ► ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా వేగంగా జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ► వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాదికి మిగతా ఏడు కాలేజీలలో అకడమిక్ తరగతులు ప్రారంభించనున్న జగనన్న ప్రభుత్వం. ► రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏకకాలంలో 5 మెడికల్ కాలేజీల్లో అకడమిక్ తరగతుల ప్రారంభం. ► స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటు. ► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు. ఇప్పటికే ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి. మెడికల్ పీజీ సీట్ల సంఖ్య నాలుగేళ్లలో 966 నుంచి 1,767 కు పెంచిన జగనన్న ప్రభుత్వం. ► వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల టోల్ ఫ్రీ నెంబర్ 104 లేదా 1902 ► మల్టీ, సూపర్ స్పెషాలిటీ, అధునాతన వైద్యసేవలను ఉచితంగా అందుబాటులోకి.. ► దేశానికే దిక్సూచిగా వైద్య ఆరోగ్య రంగంలో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు. ► 2024-25లో ప్రారంభించే 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె ► 2025-26లో ప్రారంభించే 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు, అమలాపురం, బాపట్ల, పిడుగురాళ్ళ, పెనుకొండ ► గిరిజన ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురం, బుట్టాయిగూడెం, దోర్నాల ► 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కిడ్నీ రిసెర్చ్ సెంటర్, పలాస శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, తిరుపతి మానసిక ఆరోగ్య కేంద్రం, కడప -
సీఎం జగన్ విజయనగరం టూర్ షెడ్యూల్
-
సాకారమైన విజయనగరం వాసుల కల
-
రేపు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 15వ తేదీ (శుక్రవారం) విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీ (విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల)లను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణ, తర్వాత నూతన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం, ల్యాబ్‌ల పరిశీలన, మిగిలిన 4 మెడికల్ కాలేజీల వర్చువల్ ప్రారంభోత్సవం తర్వాత సీఎం ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు. -
15న ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా సుమారు రూ.8,500 కోట్లతో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తలపెట్టారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. తొలి విడతలో నిర్మాణం పూర్తయిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ ఈ నెల 15వ తేదీన ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి సీఎం జగన్ వస్తారని, ఇక్కడి నుంచే రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభిస్తారని వివరించారు. వచ్చే సంవత్సరం మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత సంవత్సరానికి మిగతా ఏడు కాలేజీలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం పర్యటనకు ఏర్పాట్లను ఆమె శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి రజిని తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
గిరిపుత్రుల కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చాం : సీఎం జగన్
సాక్షి, విజయనగరం: సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం మరడాంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు. గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారు. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగినవారు. తరతరాలుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. నాలుగేళ్ల పాలనలో మీ బిడ్డ విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. దోపిడీ నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశాం. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం. సీఎం జగన్ కామెంట్స్ చిక్కటి చిరునవ్వుల మధ్య, చెరగని ఆప్యాయతల మధ్య ఈరోజు దేవుడి ఆశీస్సులతో మరో మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి జరుగుతోంది. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఈ వేదికపై నుంచి అభినందనలు తెలియజేస్తున్నా. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న నా గిరిజన జాతికి మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా మీ జగన్ ఎప్పటికీ రుణపడి ఉంటాడు. ఈ సభకు వచ్చిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, ప్రతిస్నేహితుడికీ, నిండు మనసుతో రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ► ఈరోజు ఇక్కడ ఈ గిరిజన ప్రాంతంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ శాశ్వత భవనాలకు పునాదులు వేస్తున్నాం. దాదాపు 830 కోట్ల ప్రాజెక్టు. మరో మూడు సంవత్సరాలకు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోయే గొప్ప ప్రాజెక్టు. మంజూరు చేసినందుకు ఈ వేదికపై నుంచి మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం ఇక్కడ శంకుస్థాపన చేసిన ఈ కార్యక్రమం 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మనకు వచ్చిన విశ్వవిద్యాలయం ఇది. మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ గిరి పుత్రుల జిల్లాలో వారి జీవితాల్లో ఉన్నత విద్యా కాంతులు నింపడానికి ఈ యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ► రాబోయే రోజుల్లో మన గిరిజనులు ప్రపంచంతో పోటీ పడే గొప్ప అడుగు ఇక్కడి నుంచి బీజం పడబోతోంది. మామూలుగా కూడా నా మనసులో ఎప్పుడూ ఉండేది. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగిన వారు. కల్మషం లేని మనసులు కలిగిన వారు. తరతరాలుగా వారిని వెంటాడుతున్న పేదరికం.. ఇప్పటికీ మిగతా ప్రపంచంతో సమం కాని వారి జీవన ప్రమాణాలు. ప్రత్యేకించి వారి జీవితాలను మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఇప్పటికీ కూడా ఇంకా భావి ప్రపంచంతో అడుగులు వేసే క్రమంలో వెనకాలే ఉన్నారు. ఈనాలుగు సంవత్సరాల పరిపాలనలో విద్యా పరంగా కానీ, వైద్య పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, జెండర్ పరంగా కానీ గిరిజనులను గుండెల్లో పెట్టుకొని అడుగులు వేశామని గర్వంగా చెప్పలగుతా. ప్రపంచంలో వారిని నిలబెట్టే విద్యను వారికి అందించాలి. ► తరతరలాలుగా నిర్లక్షానికి గురైన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ సోదరుల కోసం ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు అన్ని దశల్లోనూ విప్లవాత్మక మార్పులతో అడుగులు ముందుకు వేశాం. ఈరోజు గిరిపుత్రులకు అభివృద్ధిపట్ల మనందరి ప్రభుత్వం బాధ్యతగా, దూరదృష్టితో వ్యవహరిస్తోందో నాలుగు మాటల్లో పంచుకుంటా. విద్య, సాధికారత కోసం, ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి రావాలని, మన పిల్లలు గెలవాలని, వారు చదువుకొనే మీడియంలో మార్పులు తీసుకొచ్చాం. గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేసే పరిస్థితి ఉందని మన రాష్ట్రంలో ఉందని గర్వంగా చెబుతున్నా. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ అమలవుతోంది. నాడు-నేడుతో వారు చదువుతున్న స్కూళ్ల రూపురేఖలు మార్చబడుతూ కనిపిస్తున్నాయి. ► విద్యాకానుకతో బడి పిల్లల రూపాన్ని బైలింగువల్ టెక్స్ట్ బుక్కులతో మార్చగలుగుతున్నాం. ప్రతి గవర్నమెంట్ బడిలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము డిజిటలైజ్ తెస్తూ, ఐఎఫ్పీలను ఏర్పాటు చేస్తున్నాం. గవర్నమెంట్ బడుల్లో చదువుతున్న పిల్లలు 8వ తరగతికి వస్తే ఆ పిల్లలందరికీ వారి చేతిలో ట్యాబ్స్ ఉంచే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది. చదువులను ప్రోత్సహిస్తూ కల్యాణమస్తు, షాదీ తోఫా అనే కార్యక్రమాలను తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన తెచ్చాం. మెరుగైన చదువులు, కరిక్యులమ్ లో మార్పులు తెచ్చి పిల్లలకు అందుబాటులోకి తెచ్చిన చరిత్ర ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే. ► ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి మంచి చేస్తూ 3 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉంది. పాడేరులో మరో మెడికల్ కాలేజీ, పార్వతీపురంలో మూడో మెడికల్ కాలేజీ కట్టబడుతోంది. ట్రైబల్ యూనివర్సిటీకి దగ్గర నుంచి కాస్త దూరం కురుపాంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ కట్టబడుతోంది. ఈ ప్రాంతానికి ఎంత మంచి జరుగుతోందో చెప్పడానికి ఆలోచన చేయమని కోరుతున్నా. ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలో కడుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కనిపిస్తుంది. అక్కడ నుంచి కాస్త దూరంలో పాడేరులో మెడికల్ కాలేజీ కడుతున్నది మన కళ్ల ఎదుట కనిపిస్తోంది. ► మరికాస్త దూరంలో సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాం. మరో నాలుగు అడుగులు ముందుకు వెళ్లి చూస్తే కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ మనకు కనిపిస్తోంది. ఒక్క గిరిజన ప్రాంతలోనే రెండు మెడికల్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, నాడు-నేడుతో మొదలు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు గిరిజనులకు కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. మనందరి ప్రభుత్వం 50 నెలల పాలనలో గిరిజనులకు ఏం చేసిందో మీ అందరితో నాలుగు మాటలు పంచుకుంటా. నా ఎస్టీలు అనే పదానికి అర్థం చెబుతూ రాజకీయంగా పదవుల్లో వారికి గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా గిరిజనులకు నా పక్కనే పెట్టుకున్నా. ఏ నామినేటెడ్ పదవి, కాంట్రాక్టు తీసుకున్నా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలకు కచ్చితంగా 50 శాతం కేటాయించేట్లుగా ఏకంగా చట్టం చేసి కార్యరూపం చేస్తున్నాం. ఇంకా ఏమన్నారంటే.. ► మొట్ట మొదట గిరిజన చెల్లెమ్మకు, నా గిరిజన అన్నకు కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా నా పక్కన కూర్చోబెట్టుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగ బద్ధంగా ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని నియమించిన చరిత్ర మీ బిడ్డ ప్రభుత్వంలోనే. నా ఎస్టీల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన మనిషిగా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క హామీ కూడా మనసా, వాచా, కర్మణా, త్రికరణశుద్ధిగా అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చాం. 2019 జూలై నుంచి 4.58 లక్షల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తున్నాం. ఇందుకోసం 410 కోట్లు ఖర్చు చేశామని సవినయంగా తెలియజేస్తున్నా. గిరిజనులకు ప్రత్యేక జిల్లా, ప్రత్యేక యూనివర్సిటీ, వైద్య, ఇంజనీరింగ్ కాలేజీ ఇస్తామని హామీ ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకుంటూ ఒక జిల్లా కాదు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తున్నాం. ► రూ.1000 కోట్లతో అల్లూరి జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ కడుతున్నాం. మన్యం జిల్లాలో పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజీ వేగంగా నిర్మాణం అవుతోంది. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తాం అని చెబితే మన కళ్ల ఎదుటే నిర్మాణం కనిపిస్తోంది. గిరిజన తండాల జనాభా 500 ఉంటే పంచాయతీలుగా మార్పు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ 165 గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. ప్రతి ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ నిర్మాస్తామని మాట ఇచ్చాం. మన్యం జిల్లా సీతంపేట, పార్వతీపురంలో, అల్లూరి జిల్లా రంపచోడవం, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, ప్రకారం జిల్లా దోర్నాలలో 250 కోట్లు ఖర్చు చేస్తూ మల్టీ స్పెషాల్టీ హాస్పిటళ్లు నిర్మాణంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం అందడం లేదన్న పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తూ ప్రతి గిరిజన గ్రామంలో విలేజ్ క్లినిక్ లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లు కనిపించే కార్యక్రమం జరుగుతోంది. ► ఎస్సీ, ఎస్టీల నుంచి సేకరించిన భూములకు, ఇతర పట్టా భూముల కంటే 10 శాతం ఎక్కువ పరిహారం ఇస్తామని మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకుంటూ 2021 మే 19న జీవో 109 జారీ చేశామని తెలియజేస్తున్నా. ఐదుగురు సభ్యులుండే ప్రత్యేక ఎస్సీ కమిషన్ ను తీసుకొచ్చింది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే. గిరిజనుల కోసం ఇంతగా తపించిన ప్రభుత్వం ఏదీ లేదు. వారి బాగోగుల కోసం 153820 గిరిజన కుటుంబాలకు మేలు చేస్తూ, 322538 ఎకరాలను ఆర్వోఎఫ్ ఆర్ డీకేటీ పట్టాలు వారి చేతికి అందించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే.పెట్టుబడి ఖర్చుల కోసం రైతు భరోసా సొమ్ము కూడా ఇస్తోంది మీ బిడ్డ ప్రభుత్వమే. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో మన పిల్లలు 1.30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా కనిపిస్తున్నారు. ఇందులో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాల వారు ఏకంగా 84 శాతం ఉద్యోగాలు వాళ్లే చేస్తూ అక్కడే కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 497 గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న 100 శాతం ఉద్యోగులు నా గిరిజన తమ్ములు, చెల్లెమ్మలే అని చెప్పడానికి గర్వ పడుతున్నా. నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ నా గిరిజనులకు వర్తింపజేసేలా అడుగులు వేశాం. ► అవినీతి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నాం. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. గిరిజనుల వరకు మాత్రమే చూస్తే 50 నెలల పాలనలో 36.12 లక్షల గిరిజన కుటుంబాలకు 11548 కోట్లు డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పోతోంది. నాన్ డీబీటీ కూడా కలుపుకుంటే 22.26 లక్షల కుటుంబాలకు రూ.5,257 కోట్లు మేలు కలిగింది. మొత్తంగా డీబీటీ, నాన్ డీబీటీ కలుపుకుంటే అక్షరాలా 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు రూ.16,805 కోట్లు నేరుగా వాళ్లకు వెళ్లాయి. ఈ ప్రాంతంలో మీకు జరిగిన మార్పును మీకు తెలియజేసేందుకు ఇవన్నీ చెబుతున్నా. ఈ యూనివర్సిటీ వల్ల గొప్పమార్పు జరగబోతోంది. రాబోయే రోజుల్లో తరతరాలు గుర్తుండిపోయేలా ఉండిపోతుందని తెలియజేస్తున్నా. దేవుడి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ పట్ల, ఈ ప్రభుత్వం పట్ల ఉండాలని, కేంద్ర ప్రభుత్వ సహకారం మరింతగా రావాలని ఆకాంక్షిస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం: సీఎం జగన్
Updates.. ►ఈ సందర్భంగా మరడాం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు. గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారు. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగినవారు. తరతరాలుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. ► నాలుగేళ్ల పాలనలో మీ బిద్ద విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. దోపిడీ నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశాం. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం. ► మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు చేస్తున్నాం. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందిస్తున్నాం. చదువులను ప్రొత్సహిస్తూ కళ్యాణమస్తు, షాదీతోఫా కార్యక్రమాలు తీసుకువచ్చాం. పూర్తి ఫీజు రీయింజర్స్‌మెంట్‌తో విద్యాదీవెన, వసతిదీవెనను తీసుకువచ్చాం. ► కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ రాబోతోంది. పాడేరులో మెడికల్ కాలేజీ రాబోతోంది. బోగాపురంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటవుతోంది. సాలూరులో గిరిజన వర్సిటీ వచ్చేస్తోంది. గిరిజన విద్య, సాధికారతకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. ► రాజకీయ పదవుల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. గిరిజన ఎమ్మెల్యేను డిప్యూటీ సీఎంను చేశాం. 4లక్షల 58వేల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాం. గిరిజనులకు అల్లూరి, మన్యం జిల్లాలు ఏర్పాటు చేశాం. గిరిజన ప్రాంతంలో మల్లీ సెష్పాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాం. ► కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం జగన్ చొరవతో గిరిజన వర్సిటీ సాధ్యమైంది. రూ. 2వేల కోట్లతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతోంది. గిరిజన ప్రాంతంలోనే వర్సిటీ పెట్టాలని సీఎం జగన్ తలచారు. రాయ్‌పూర్ నుంచి విశాఖ వరకు ఆరులైన్ల రోడ్డు ఏర్పాటవుతోంది. పేదల గృహాల కోసం కేంద్రం రూ.లక్షా 20వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మా పార్టీలు వేరైనా అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తున్నాం. మాతృ భాషలకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఏపీలో ద్విభాషా పాఠ్యపుస్తకాలు తీసుకురావడం అభినందనీయం. అల్లూరి సీతారామరాజు నడిచిన పవిత్ర నేల ఇది. ఏపీ ప్రభుత్వం ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. గిరిజన వర్సిటీతో పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు. ఏపీలో అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఇక్కడ అంతర్జాతీయ కోర్సులు ప్రవేశపెడతాం. ► కేంద్ర గిరిజన వర్సిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ► ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు. ► మన్యం జిల్లా చినమేడపల్లి చేరుకున్న సీఎం జగన్ ► కాసేపట్లో కేంద్ర గిరిజన వర్సిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ► గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్నం బయల్దేరిన సీఎం జగన్. ► రాష్ట్రంలోని గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ► విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. ► విభజన హామీల్లో ఒకటైన ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటును గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతంలోనే యూనివర్సిటీ గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేటు భూమి సేకరించారు. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులకు రూ.29.97 కోట్ల పరిహారం చెల్లించారు. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు ఖర్చు చేశారు. అందించే కోర్సులు ఈ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, బి.కామ్‌లో ఒకేషనల్ తదితర 14 కోర్సులను అందిస్తారు. ► వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఒకేషనల్, జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులను కూడా అందిస్తారు. గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సహిస్తారు. ఇప్పటికే విజయనగరం జిల్లా కొండకరకంలోని ఆంధ్రా యూనివర్సిటీ పాత పీజీ క్యాంపస్ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీ తరగతుల్లో 385 మంది విద్యార్థులున్నారు. -
మరడాంలో రేపు సీఎం జగన్ బహిరంగ సభ
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(ఆగష్టు 25) విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం(సీటీయూఏపీ) భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని.. ఆ తర్వాత మరడాం వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇప్పటికే సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత మంత్రులు, అధికారులు పర్యవేక్షించారు. జగన్ సర్కార్ అడుగుతో.. ఆహ్లాదకరమైన వాతావరణంలో, సువిశాల భవనాల్లో ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సాకారం కానుంది. భవన శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరుకానున్నారు. షెడ్యూల్ ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. తొలుత విజయనగరం జిల్లా మెంటాడ మండలం చినమేడపల్లికి చేరుకుంటారు. అక్కడ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్ధాపన కార్యక్రమంలో కేంద్రమంత్రితో కలిసి పాల్గొంటారు. ఆపై బయలుదేరి దత్తిరాజేరు మండలంలోని మరడాం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి బయల్దేరతారు. -
25న విజయనగరంలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, గుంటూరు: విద్యా రంగం కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తొమ్మిదేళ్ల విజయనగరం కల తీర్చనున్నారు. ఆగష్టు 25వ తేదీన విజయనగరం జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్ధాపన కార్యక్రమం జరగనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 25వ తేదీన మెంటాడలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన జరగనుంది. ఇక విభజన హామీ మేరకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి.. త్వరగతిన నిర్మాణాలు పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. విజయనగరం యూనివర్సిటీలో 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న కోర్సులతో పాటు పరిశోధనల కోసం కూడా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత అధికారలు తెలిపారు. -
విజయనగరం : వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
-
సూపర్ వాస్మోల్ తాగి మహిళ.. నితిన్ మాట వినడంలేదని...
పార్వతీపురం: కన్న కుమారుడు చెప్పిన మాట వినడంలేదని మనస్తాపం చెందిన ఓతల్లి సూపర్ వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సోమవారం జరిగిన సంఘటనపై పార్వతీపురం అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొమరాడ మండలం గుమడ గ్రామానికి చెందిన మామిడి నాగినికి 16 ఏళ్ల కుమారుడు నితిన్ ఉన్నాడు. నితిన్ వీధిలో ఉన్న ఇతర స్నేహితులతో కలిసి హైదరాబాద్, చెన్నై వెళ్లిపోతానని అంటున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు వెళ్లిపోతే ఎలా అని తల్లి నాగిని మనస్తాపానికి గురై సోమవారం రాత్రి తలకు రాసుకునే సూపర్ వాస్మోల్ తాగేసింది. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు 108 ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
ఐదు నెలల కిందటే పెళ్లి.. కేదార్నాథ్ యాత్రకు వెళ్లి నవ వరుడి మృతి
ఐదు నెలల క్రితం జరిగిన వివాహానంతరం కోటి ఆశలతో కొత్తజీవితంలోకి అడుగుపెట్టిన ఓ నవజంట భవిష్యత్తు గురించి ఎన్నో కలల కంటూ సంతోషంగా గడుపుతున్నారు. ఇంతలోనే విధికి కన్నుకుట్టడంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన ప్రమాదంలో నవ వరుడి ప్రాణాలు గాలిలో కలిసిపోగా నవవధువు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద వార్తతో రాజాం మండల పరిధిలోని బొద్దాం గ్రామస్తులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సాక్షి, విజయనగరం: రాజాం సిటీ మండల పరిధి బొద్దాం గ్రామానికి చెందిన జరజాన రవిరావుకు, పట్టణ పరిధిలోని సారథికి చెందిన కల్యాణితో ఫిబ్రవరి 12న వివాహమైంది. రవిరావు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ భార్య కల్యాణితో జీవనం సాగిస్తున్నాడు. ఈ నవజంట వారం రోజుల క్రితం కేథారినాథ్ యాత్రకు హైదరాబాద్ నుంచి బయల్దేరింది. యాత్ర జాలీగా సాగుతున్న సమయంలో శనివారం రాత్రి (తెల్లవారితే ఆదివారం) అక్కడ భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలో ప్రయాణికులంతా గల్లంతయ్యారని తొలుత భావించారు. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూటీం బాధితులను రక్షించే క్రమంలో కల్యాణితోపాటు మరికొంతమందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ముమ్మరగాలింపు చర్యలు చేపట్టిన తరువాత రవిరావు (29) మృతిచెందినట్లు గ్రామస్తులకు సమాచారం అందడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా మృతుని కుటుంబ సభ్యులంతా తగరపువలసలో జరుగుతున్న బాలసారె కార్యక్రమంలో ఉన్నారు. రవిరావు మృతి విషయం తెలుసుకున్న వీరంతా విషాదంలో మునిగిపోయారు. చదవండి: పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ అధికారుల ఆరా.. గ్రామానికి చెందిన రవిరావు దంపతులు తీర్థయాత్రకు వెళ్లి ప్రమాదం బారిన పడిన విషయంపై తహసీల్దార్ ఎస్కే రాజు, ఆర్ఐ విద్యాసాగర్‌లు గ్రామానికి వచ్చి ఆరా తీశారు. రవిరావు మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చేందుకు కృషిచేయాలని ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లను కోరినట్లు గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ నక్క వర్షిణి, సర్పంచ్ నక్క తవిటమ్మతో పాటు గ్రామస్తులు తెలిపారు. -
ఎవరి పంచాయితీ ఎవరి ప్రాణాల మీదకు? పాపం రాము!
రాజాం సిటీ/రేగిడి: రాజాం వారపుసంతలో జరిగిన చిన్నపాటి ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య దళారీ సొమ్ము విషయంలో చెలరేగిన గొడవను విడిపించేందుకు వెళ్లిన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. ఈ ఘటనపై సీఐ రవికుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజాంలో ప్రతి గురువారం జరిగే వారపు సంతకు పశువుల వ్యాపారం నిమిత్తం రేగిడి మండలంలోని అంబకండికి చెందిన మండల రామినాయుడు (రాము)(45), ఆయన బావ పప్పల శ్రీహరినాయుడు, సాకేటి లక్ష్మణ, మండల చక్రధరరావు ఎప్పటిలాగానే వచ్చారు. పదేళ్లుగా ఆవుల క్రయవిక్రయాలు చేస్తూ వచ్చే కొద్దిపాటి లాభంతో జీవనం సాగిస్తున్నారు. సాకేటి లక్ష్మణకు చెందిన ఆవును మండల చక్రధరరావు రూ.50 వేలకు జామి మండలంలోని అలమండ సంత ప్రాంతానికి చెందిన శ్రీనురాజుకు విక్రయించాడు. శ్రీనురాజు వెంటనే అదే సంత ప్రాంతానికి చెందిన జన్నెల ఈశ్వరరావుకు రూ.53 వేలకు ఆవును విక్రయించాడు. అందులో రూ.50 వేలు చక్రధరరావుకు ఇచ్చాడు. ఆ డబ్బుల్లో దళారీగా చక్రధరరావు రూ.1000 ఉంచుకుని, రూ.49 వేలను సాకేటి లక్ష్మణకు ఇచ్చాడు. దీనికి అంగీకరించని లక్ష్మణరావు చక్రధరరావుతో గొడవపడ్డాడు. ఇంతలో అలమండ సంత ప్రాంతానికి చెందిన జన్నేల ఈశ్వరరావు కలుగజేసుకుని, ఎప్పుడూ దళారీలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేందుకు ఇబ్బంది పెడతావు ఎందుకని లక్ష్మణరావుతో గొడవపడ్డాడు. మండల రామినాయుడుతో పాటు కందుకూరి సత్యనారాయణ, గండ్రేటి చక్రధర్, కెంబూరు అప్పలనాయుడు గొడవను విడిపించే ప్రయత్నం చేశారు. నన్నే తోస్తావా అంటూ రామినాయుడిపై ఈశ్వరరావు దాడికి పాల్పడ్డాడు. ఇది గమనించిన ఈశ్వరరావు కొడుకు కిశోర్ కూడా రామినాయుడు గుండెలపై పిడుగుద్దులు గుద్దడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని, భోరున విలపించారు. మృతుడి బావ పప్పల శ్రీహరినాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు.. ప్లాన్ ప్రకారం ప్రియుడు రాక.. అక్కడే ట్విస్ట్!
విజయనగరం క్రైమ్: వివాహేతర సంబంధం మోజులో ఉన్న భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. దీంతో భర్త నిద్రలోకి వెళ్లిన తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పిలిపించి నైలాన్‌తాడు మెడకు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో భర్తకు తెలివివచ్చి కేకలు వేయడంతో అందరూ పారిపోయారు. బాధితుడు తేరుకుని టూటౌన్ పోలీసులకు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు టూటౌన్ సీఐ సీహెచ్.లక్ష్మణరావు గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక కుమ్మరివీధికి చెందిన కోటరాజు, భార్య శ్రీదేవి, పిల్లలు బుధవారం రాత్రి ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. శ్రీదేవికి చిన గోకవీధికి చెందిన గంధవరపు రఘుతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తప్పించాలనే ఉద్దేశంతో మట్టుబెట్టాలని ప్రణాళిక వేసింది. తన భర్తను చంపేయమని రఘుకు చెప్పింది. వెంటనే రఘు ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నుంచి నిద్రమాత్రలు కొని శ్రీదేవికి ఇచ్చాడు. అవి తీసుకుని శ్రీదేవి భర్త రాజుకు బుధవారం రాత్రి మటన్ బిర్యానీలో కలిపి తినిపించింది. వివరాలు వెల్లడిస్తున్న టూటౌన్ సీఐ సీహెచ్.లక్ష్మణరావు (వెనుక ముసుగులో నిందితులు) రాజు నిద్రలోకి జారుకున్న తర్వాత రఘుకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలవగా వరుసకు బావమరిది అయిన బొగ్గులదిబ్బకు చెందిన కేత శ్రీను సహాయం కోరి రూ. 20వేలకు ఒప్పందం కుదుర్చుకుని ఇద్దరూ వచ్చారు. వారు తెచ్చుకున్న నైలాన్ తాడును రాజు మెడకు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించగా మెలకువ వచ్చిన రాజు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఇద్దరూ పారిపోయా రు. ఈ మేరకు విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో రఘు, శ్రీను, శ్రీదేవిలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్సై షేక్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
విజయనగరంలో ఘనంగా ఒలంపిక్ డే రన్
-
డిప్యూటీ మేయర్‌గా ముచ్చు లయయాదవ్
విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్–1గా వైఎస్సార్ సీపీకి చెందిన 1వ డివిజన్ కార్పొరేటర్ ముచ్చు లయయాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సభ్యులంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేసీ మయూర్ అశోక్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ పీవీడీ ప్రసాదరావు ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు డిప్యూటీ మేయర్‌గా వ్యవహరించిన ఇసరపు రేవతీదేవి రాజీనామా చేయడంతో ఎన్నిక ప్రక్రియ నిర్వహించినట్టు తెలిపారు. ముచ్చు లయయాదవ్ పేరును 13వ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు రేవతీదేవి ప్రతిపాదించగా 40వ డివిజన్‌కు చెందిన బోనెల ధనలక్ష్మి బలపరిచారు. ఒక్కరి పేరునే ప్రతిపాదించడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు జేసీ ప్రకటించారు. ఎన్నిక పత్రాన్ని అందజేశారు. మొత్తం ఎన్నిక ప్రక్రియ 16 నిమిషాల్లోనే ముగిసింది. ఎన్నిక ప్రక్రియలో 50 మంది కార్పొరేటర్లకు 44 మంది హాజరయ్యారు. అభినందనల వెల్లువ డిప్యూటీ మేయర్–1గా ఎన్నికై న లయయాదవ్కు అభినందనలు వెల్లువెత్తాయి. నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఫ్లోర్ లీడర్ ఎస్వీవీ రాజు, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణుతో పాటు తోటి కార్పొరేటర్లు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ విజయనగరం కార్పొరేషన్‌గా రూపాంతరం చెందిన తరువాత జరిగిన మొదటి ఎన్నికలో డిప్యూటీ మేయర్–1గా ముచ్చు నాగలక్ష్మి ఎన్నికయ్యారని, ఆమె మరణంతో అదే సామాజిక వర్గానికి చెందిన 13వ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు రేవతీదేవి ఎన్నికయ్యారన్నారు. ఆమె వ్యక్తిగత కారణాలవల్ల పదవికి రాజీనామా చేయడంతో లయ యాదవ్‌ను ఎన్నుకున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఆశీస్సులతో నూతన బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని లయ యాదవ్ పేర్కొన్నారు. నగర అభివృద్ధికి తన వంతు సహకరిస్తానన్నారు. -
విజయనగరం : అట్టహాసంగా మహిళా పార్కు ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
సీఎం జగన్ పర్యటనకు అపూర్వ స్పందన.. కిక్కిరిసిన సభా ప్రాంగణం
సాక్షి, విజయనగరం: సీఎం జగన్ విజయనగరం, విశాఖపట్నం పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. సీఎం సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆయన రాకతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. రోడ్లన్నీ కిటకిటలాడాయి. సీఎం జగన్ కోసం వర్షంలో కూడా తడుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు భోగాపురం మండలం సవరవిల్లి వద్ద నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. రూ.4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విమానాశ్రయ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. రూ.194.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తారకరామతీర్దసాగరం ప్రాజెక్టు పనులతో పాటు చింతపల్లి వద్ద రూ.23.73 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ పనులకు సీఎం శంకుస్ధాపన చేశారు. భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చదవండి: ‘మార్గదర్శి’ జూమ్ మీటింగ్‌లో ఏం జరిగింది?.. బ్లాక్ మనీ వైట్‌గా ఎలా మారుతోంది? అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ అన్నారు. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ సాగర ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నాం. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్‌గా మారనుందని ఆయన అన్నారు. చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
రేపు విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన..
సాక్షి, విశాఖపట్నం: రేపు(బుధవారం) విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. విశాఖలో అదానీ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లకు సీఎం జగన్, గౌతమ్ అదానీ శంకుస్థాపన చేయనున్నారు. మధురవాడలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ పార్క్ - రూ.14,634 కోట్ల పెట్టుబడితో అదానీ సంస్థ ఏర్పాటు చేయనుంది. 130 ఎకరాల్లో 200 మెగావాట్ల డేటా సెంటర్, ఇంటిగ్రేటేడ్ పార్క్, స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు కానుంది. ప్రాజెక్ట్-1తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 24,990 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి. కాపులుప్పాడలో మరో డేటా సెంటర్, టెక్ పార్క్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కాపులుప్పాడలో రూ.7,210 కోట్లతో ఏర్పాటు కానున్న టెక్‌పార్క్ ద్వారా 20,450 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రెండు ప్రాజెక్టులతో విశాఖకు రూ.22 వేల కోట్ల పెట్టుబడులు సహా 45 వేల మందికి పైగా ఉద్యోగాలు దక్కనున్నాయి. చదవండి: ‘చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలిసినా కాపులు కలవరు’ -
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో 4600 కోట్ల పెట్టుబడి: కరికాల వలవన్
సాక్షి, విజయవాడ: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో 4600 కోట్ల పెట్టుబడి రాబోతుందని పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ మాట్లాడుతూ విశాఖలో ఆర్థిక వృద్ధికి భోగాపురం ఎయిర్ పోర్ట్ దోహదపడుతుందన్నారు. నాలుగేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎయిర్పోర్ట్ కోసం పరిష్కరించామని, భూ సేకరణ కేసులు, పర్యావరణ కేసులు పరిష్కరించామని ఆయన పేర్కొన్నారు. ‘‘కేంద్రం నుండి ఎయిర్‌పోర్ట్‌కి ఎన్వోసీ తెచ్చాం. రేపు భోగాపురం ఎయిర్పోర్ట్, ఆదాని డేటా సెంటర్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. ఆదాని డేటా సెంటర్‌తో రూ.20 వేల కోట్ల పెట్టుబడి రాబోతుంది. ఐటీ పార్క్ కూడా ఆదాని సంస్థ అభివృద్ధి చేస్తుంది. 45 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి. సీఎం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వృద్ధి చెయ్యడానికి పోర్టులు, ఎయిర్ పోర్టులు, మౌలిక వసతులు కల్పిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ మౌలిక వసతులు పై దృష్టి పెట్టారని కరికాల వలవన్ పేర్కొన్నారు. చదవండి: ‘రైతులను అడ్డంపెట్టుకుని రామోజీ గలీజు రాతలు’ -
సీఎం జగన్ విజయనగరం, విశాఖ జిల్లాల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెల 3న విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్ధాపన, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖపట్నం-మధురవాడలో వైజాగ్ ఐటీ టెక్ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారు. విజయనగరం జిల్లా షెడ్యూల్ ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు భోగాపురం మండలం ఎ.రావివలస గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.25 గంటలకు జీఎంఆర్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌కు చేరుకుంటారు. ఆ సెంటర్‌ను సందర్శిస్తారు. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్ధాపన చేస్తారు. చదవండి: ఇంటింటా ‘నమ్మకం’.. జగనన్నే మా భవిష్యత్తు.. 1.1 కోట్ల మిస్డ్ కాల్స్ 10.30 గంటలకు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు సంబంధించిన శిలా ఫలకాలను ఆవిష్కరిస్తారు. 10.55 గంటలకు సవరవిల్లి వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. సభ అనంతరం 1.20 గంటలకు అక్కడి నుంచి విశాఖ పర్యటనకు బయలుదేరుతారు. విశాఖపట్నం పర్యటన మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్ నెంబర్ 3 వద్ద గల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో బయలుదేరి ఐటీ హిల్స్ నెంబర్ 4లో గల వేదిక వద్దకు 2 గంటలకు చేరుకుంటారు. 2.30–3.00 వైజాగ్ ఐటీ టెక్ పార్క్ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శిస్తారు, అనంతరం పారిశ్రామికవేత్తలతో నిర్వహించే కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తారు. తర్వాత 3.50 గంటలకు అక్కడినుంచి బయలుదేరి రుషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుంటారు. అక్కడ ఇటీవల వివాహం చేసుకున్న ఎంపీ కుమారుడు దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మధురవాడ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి, 5.20 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 6.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: జగజ్జనని చిట్ ఫండ్స్.. ఆదిరెడ్డి అప్పారావు, వాసు అరెస్ట్ -
మందు గుండు సామాగ్రి కంపెనీలో పేలుడు.. ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, విజయనగరం: గుర్ల మండలం దేవుని కనపాక పంచాయతీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గవిపేట సమీపంలోని మందు గుండు సామాగ్రి కంపెనీలో పేలుడు సంభవించింది. కంపెనీలోని ఆరు గోడౌన్లకు నిప్పు అంటుకోవడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మంటల్లో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం.కీలోమీటరు దూరం వరకు మంటలు వ్యాపించినట్లు కనిపిస్తున్నాయి. అగ్నికీలలు, పేలుడు ధాటికి పరిసర గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. -
Bhogapuram Airport: సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన
సాక్షి, విజయనగరం: వచ్చే నెల(మే) 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయనున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లపై బుధవారం మంత్రి బొత్స.. విజయనగరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులతో పాటు చింతపల్లి వద్ద ఫ్లోటింగ్ జెట్టి కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే 2,203 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మాణానికి భూ సేకరణ జరిగింది. ఈ సమీక్షలో మంత్రి బొత్సతో పాటు ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
విజయనగరంలో మిల్కీబ్యూటీ సందడి (ఫొటోలు)
-
విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతులు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య రంగాల్లో మరో మైలురాయి చేరుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి విడదల రజిని పేర్కొన్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ ప్రారంభించేందుకు జాతీయ వైద్య మండలి(నేషనల్ మెడికల్ కౌన్సిల్) అనుమతులు లభించినట్లు మంగళవారం ఆమె వెల్లడించారు. ‘‘ఈ నెల మూడో తేదీన ఎన్ఎంసీ బృందం.. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించి తనిఖీలు నిర్వహించింది. ఆ టైంలో.. అక్కడి నిర్మాణాలు, బోధనా, బోధనేతర సిబ్బంది, వసతులు, ఏర్పాటు చేసిన ల్యాబ్‌లు, లైబ్రరీ, హాస్టళ్లు, ఆస్పత్రి, బోధనా సిబ్బంది అనుభవం, వారి పబ్లికేషన్లు, అందుబాటులో ఉన్న నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది.. ఇలా అన్నిఅంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఏపీ ప్రభుత్వం సమకూర్చిన వసతులు, సిబ్బంది నియామకాలతో సహా అన్ని అంశాలపై సంతృప్తి చెంది.. ఈ ఏడాది నుంచే తరగుతులు నిర్వహించుకోవడానికి అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం ఎన్ఎంసీ నుంచి ఉత్తర్వులు ప్రభుత్వానికి అందినట్లు ఆమె తెలిపారు. విజయనగరం మెడికల్ కళాశాలకు మొత్తం 150 సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ అనుమతులు మంజూరు చేసిందన్నారామె. ఇక.. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మంత్రి రజిని పేర్కొన్నారు. అందులో భాగంగానే.. విజయనగరంలో ఈ ఏడాది నుంచి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించేందుకు అనుమతులు లభించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం రూ.8,500 కోట్లతో.. మొత్తం 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని జగనన్న చేపట్టారని, ఉత్తరాంధ్రకు చెందిన విజయనగరం కళాశాలకు తొలి అనుమతులు రావడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. మరో నాలుగు కళాశాలలకు కూడా.. ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో మరో నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూడా ప్రారంభించాలనే దృఢ నిశ్చయంతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని పేర్కొన్నారు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని. మచిలీపట్నం, ఏలూరు, విజయనగరం, నంద్యాల, రాజమండ్రిల్లోనూ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యేలా ఇప్పటికే అన్ని వసతులు సమకూర్చుతున్నామన్నారు. ఇందుకోసం అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయా కళాశాలలకు అనుమతులు మంజూరయ్యేలా సిబ్బంది నియామకాలు ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. నూతన కళాశాలలకు సంబంధించి లైబ్రరీల నిర్మాణం, కావాల్సిన ఫర్నిచర్, పుస్తకాలు, వైద్య పరికరాల కొనుగోలు... ఇలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే.. పీజీ సీట్లను రాష్ట్రంలో గణనీయంగా పెంచుకునే విషయంలోనూ సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం విజయం సాధించిందని మంత్రి తెలిపారు. 2019లో రాష్ట్రంలో మొత్తం 911 పీజీ సీట్లు ఉండేవని, ఇప్పుడు ఈ సీట్ల సంఖ్య ఏకంగా 1,249 కు పెంచుకోగలిగామని పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగానే ఇది సాధ్యమైందని వెల్లడించారు. ఈ ఏడాది కూడా మరో 637 సీట్ల పెంపుదలకు ప్రయత్నిస్తున్నామని, ఆ ప్రయత్నంలో ఇప్పటివరకు 90 సీట్లను అదనంగా సాధించగలిగామని వివరించారామె. -
విజయనగరం: ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
సాక్షి,విజయనగరం: విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. జాతీయ మెడికల్ కమిషన్ బృందం ఫిబ్రవరి 3న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాలను పరిశీలించింది. అనంతరం 150 సీట్లతో ఎం.బి.బి.ఎస్. ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభానికి ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం 2023-24 నుంచి వైద్య కళాశాలలో తరగతులు నిర్వహించేందుకు అనుమతి మంజూరు అయినట్లు జిల్లా కలెక్టర్ ఏ. సూర్యకుమారి వెల్లడించారు. ఇప్పటికే రూ.500 కోట్ల వ్యయంతో వైద్య ఆరోగ్య మౌళిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో శరవేగంగా వైద్య కళాశాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. చదవండి AP: ‘బొమ్మ’ అదిరింది..రాష్ట్రంలో బొమ్మల తయారీకి సర్కారు ప్రోత్సాహం -
చీటికి మాటికీ యాంటీ బయాటిక్స్ వాడితే ఈ దుష్ప్రభావాలు తప్పవు! కిడ్నీ, లివర్..
యాంటీ బయాటిక్స్ మందుల వాడకం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే తప్పదంటే తప్ప వీటిని డాక్టర్లు ప్రిస్కెప్షన్గా రాయరు. కానీ వైద్యులతో సంబంధం లేకుండా ప్రజలే ఏ చిన్న ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా యాంటీ బయాటిక్స్‌ను మందుల దుకాణాల్లో కొనుగోలు చేసి మింగేస్తున్నారు. ఈ వాడకం కొత్త రకం సమస్యలకు దారి తీస్తోంది. విజయనగరం ఫోర్ట్ : యాంటీ బయాటిక్స్ మందులను జనం తెగ మింగేస్తున్నారు. జిల్లాలో వీటి వినియోగం బాగా పెరిగింది. చిన్నపాటి జలుబు, దగ్గు వంటి వాటికి కూడా ప్రజలు యాంటీ బయాటిక్స్ వాడుతున్నారు. కొంతమంది ఆర్ఎంపీలు చీటికి మాటికీ యాంటీ బయాటిక్స్ ఇవ్వడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు కిడ్నీ, లివర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. యాంటీ బయాటిక్స్ అధిక మోతాదులో వాడడం వల్ల ప్రస్తుతం కొత్త చిక్కు వచ్చి పడింది. బాక్టీరియా లు సైతం యాంటీ బయాటిక్స్ మందులకు అలవా టు పడడంతో జ్వరాలు కూడా తగ్గక రోగులు రోజు ల తరబడి మంచాన పడి మూలుగుతున్నారు. వీటి వల్ల శరీరంలో సహజ సిద్ధంగా ఉండే వ్యాధి నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రమాదకర స్థాయికి యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగిపోవడం వల్ల ఇప్పటికైనా నియంత్రణ చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్న రోగాలకు కూడా.. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా యాంటీ బయాటిక్స్ మందులు అ«ధికంగా వినియోగిస్తున్నారు. కొంత మంది ఆర్ఎంపీలు వద్ద తీసుకోగా, మరి కొంతమంది మందుల దుకాణాల వద్ద నేరుగా తెచ్చుకుని వాడుతున్నారు. జలుబు చేసినా.. దగ్గు వచ్చినా.. జ్వరం వచ్చినా.. తలనొప్పి, నడుం నొప్పి, చర్మ వ్యాధులు ఇలా ఏ జబ్బుకు అయినా యాంటీ బయా టిక్స్ తప్పనిసరిగా వాడేస్తున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి యాంటి బయాటిక్స్ వాడాల్సి ఉంది. కానీ చాలా మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. యాంటీ బయాటిక్స్ మందులు ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీ, కాలేయ వ్యాధుల బారిన పడి మంచాన పడుతున్నారు. జిల్లాలో 1200 మందుల దుకాణాలు జిల్లాలో 1200 మందుల దుకాణాలు ఉన్నాయి. ఏడాదికి సుమారు 50 లక్షలకు పైగా యాంటీ బయా టిక్స్ మాత్రలు జనం వాడుతున్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండానే మందుల దుకాణాల్లో విచ్చల విడిగా యాంటి బయాటిక్స్ మందులు విక్రయిస్తు న్నారు. కొంత మంది నేరుగా మందుల దుకాణానికి వెళ్లి అడగగానే వీటిని ఇచ్చేస్తున్నారు. రైతులు, కూలీలు, ఒళ్లు నొప్పులు వచ్చిన వారు ప్రతీ సారి డైక్లోఫినాక్ ఇంజిక్షన్గాని లేదా యాంటీ బయాటిక్ మాత్రలుగాని మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి వాడేస్తున్నారు. వాటి వల అనర్ధాలు తెలియక తాత్కాలిక ఉపశమనం కల్గడంతో వాటినే ఆశ్రయిస్తున్నారు. ప్రిస్కప్షన్ లేకుండా మందులు అమ్మ కూడదన్న నిబంధన ఉన్నప్పటికి అమలు కావడం లేదు. ప్రమాదమే... నొప్పి నివారణ మందులు ఎక్కువగా వాడితే ప్రమాదమే. ప్లారోసిస్ వలన నొప్పులు ఎక్కువ గా ఉంటాయి. నొప్పి నివారణకు వాడే మందు లు వల్ల కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది. కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. కొన్ని రకాల ఇంజక్షన్లు కిడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వైద్యుని సలహా లేకుండా ఎటువంటి యాంటీ బయాటిక్స్ వాడకూడదు. – డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
విజయనగరంలోని రామక్షేత్రంలో శివనామస్మరణ
-
టీడీపీ నేత కుమార్తెకు ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’
సాక్షి, విజయనగరం: ప్రభుత్వ పథకం ఏదైనా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ అందాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. అందుకు అనుగుణంగానే రాష్ట్రవ్యాప్తంగా విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. తాజాగా ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద టీడీపీ నేత కుమార్తెకు లబ్ధి చేకూరడం ఇందుకు నిదర్శనం. విజయనగరం జిల్లా వంగర మండలం సంగాం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచి బొడ్రోతు శ్రీనివాసరావు, వేణమ్మల కుమార్తె శైలజ ఈ పథకానికి ఎంపికైంది. తొలి విడతగా శుక్రవారం ఆమె ఖాతాకు రూ.13,99,154 ప్రభుత్వం జమ చేసింది. నమూనా చెక్కును శైలజ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, వేణమ్మలకు కలెక్టర్ ఎ.సూర్యకుమారి శుక్రవారం అందజేశారు. రెండేళ్లలో విద్యార్థిని చదువుకు ప్రభుత్వం సుమారు రూ. 84 లక్షలు అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. సీఎం జగన్ పార్టీలకు అతీతంగా సుపరిపాలన అందిస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం అర్హతే ప్రామాణికంగా విద్యార్థులను గుర్తించి సాయం అందిస్తున్నారని బొడ్రోతు శ్రీనివాసరావు హర్షం వ్యక్తంచేశారు. -
వాల్తేర్ డివిజన్‌కు రూ.2857.85 కోట్లు కేటాయింపు
విజయనగరం టౌన్: ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్‌కు 2023–24 బడ్జెట్లో రూ. 2857.85 కోట్లు కేటాయించినట్టు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో విజయనగరం–సంబల్ పూర్ (టిట్లాఘర్) మూడోలైన్ (264.60 కిలోమీటర్లు) నిర్మాణానికి 920 కోట్లు, కొత్తవలస–కోరాపుట్ (189.278 కిలోమీటర్లకు) రూ. 410 కోట్లు కేటాయింపులు జరిగాయన్నారు. గోపాలపట్నం–విజయనగరం వరకూ ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ, బైపాస్లైన్లు ఏర్పాటుకు రూ. 32.78 కోట్లు, రోడ్డు సేఫ్టీ వర్క్స్, అండర్ బ్రిడ్జిలకు సంబంధించి గుమడ–పార్వతీపురం ఆర్ఓబీకి రూ.60 లక్షలు, పలాస–పూండి లైన్‌కు రూ.2.05 కోట్లు, పొందూరు–సిగడం రోడ్డు ఓవర్ బ్రిడ్జికి రూ.1.50 కోట్లు, కోమటిపల్లి–గజపతినగరం ఆర్ఓబీ లెవెల్ క్రాసింగ్ రూ. 2లక్షలు, పలాస–పూండి, నౌపడలలో లిమిటెడ్ హైట్ సబ్వేస్కు రూ.3.71 కోట్లు, కోటబొమ్మాళి–తిలారు, పలాస–పూండి,కోట బొమ్మాళి యార్డ్‌లలో లిమిటెడ్ హైట్ సబ్వేస్కు రూ.3.2కోట్లు, కొత్తవలస– కిరండాల్ సబ్వేస్ లెవెల్ క్రాసింగ్లకు రూ.78 లక్షలు, నౌపాడ–కోట బొమ్మాళి ఆర్ఓబీ సబ్‌వేకు రూ.2 కోట్లు, ఉర్లాం–శ్రీకాకుళం ఆర్ఓబీకి రూ.2 కోట్లు కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. రైల్వే ట్రాక్‌ల ఆధునికీరణకు సంబంధించి పలాస–విశాఖ–దువ్వాడకు రూ.40 కోట్లు, కోరాపుట్ –సింగపూర్ లైన్‌కు రూ.20.01 కోట్లు, సింగపూర్ –విజయనగరం రోడ్డుకు రూ.25 కోట్లు కేటాయించారన్నారు. రైల్వే అధికారులు, సిబ్బంది క్వార్టర్స్ ఆధునికీకరణ, రిపేర్లకు సంబంధించి రూ.15 లక్షలు కేటాయింపులు జరిగాయన్నారు. వీటితో పాటు సిగ్నల్ అండ్ టెలికమ్, వర్క్‌షాప్ ప్రొడక్షన్ యూనిట్స్, కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు, రీమోడలింగ్స్, కొన్ని ప్రత్యేక గుర్తింపు పొందిన పనులకు నిధులు కేటాయించారన్నారు.