సాక్షి, విజయనగరం: సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమైందని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. విజయనగరం నుంచి రెండోరోజు వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు బూడి ముత్యాల నాయుడు, బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, అలజంగి జోగరావు, సాంబంగి చిన్న అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాస రావు, జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మేయర్ వెంపడపు విజయలక్ష్మి పాల్గొన్నారు.
‘‘విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. విజయనగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అట్టడుగు వర్గాలకు సీఎం జగన్ అండగా నిలిచారు. నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందించారు. జరిగిన అభివృద్ధిని బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళుతున్నాం. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హమీని సీఎం జగన్ నెరవేర్చారు. మేం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నాం. అవినీతికి చోటు లేకుండా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించాం. వెనుకబడిన వర్గాలకు ఆర్థిక చేయూతనందించాం’’ వైఎస్సార్‌సీపీ నేతలు అని పేర్కొన్నారు.
‘‘గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. టీడీపీ చేసిన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళతాం. బీసీ, ఎస్సీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన నాయకుడు సీఎం జగన్. అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్న అంబేడ్కర్ స్ఫూర్తిని జగన్ కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వం బలహీనవర్గాలను నిలువునా మోసం చేసింది. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ చంద్రబాబు హేళన చేశారు. సీఎం జగన్ పాలనలో సామాజిక విప్లవం విరాజిల్లుతోంది.’’ వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు.
జగన్ పాలనలో సామాజిక సమతుల్యత: మంత్రి బొత్స
సామాజిక సాధికార యాత్ర ద్వారా సీఎం జగన్ పాలనలో ఏ విధంగా సామాజిక సమతుల్యత సాధించమో వివరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో సామాజిక సాధికార జరుగుతుంది. చంద్రబాబులా మోసం చేయం. చెప్పిందే చేయడం, చేసిందే చెప్పడం సీఎం జగన్ నైజాం. నూటికి 99 శాతం మేనిఫెస్టో అమలు చేశాం.చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీలు 650 వాగ్దానాలు చేశారు. చంద్రబాబు 2014 జూన్‌లో ప్రమాణ స్వీకారం చేసి, అదే రోజున చేసిన సంతకాలు అమలు కాలేదు. మహిళల రుణమాఫీ, బెల్ట్ షాప్‌ల నియంత్రణ అమలు చేయలేదు. వంచనదారుల మాటలు నమ్మొద్దు. సంక్షేమ పథకాలను అవహేళన చేస్తున్నా వాటిని అమలు చేసి పేదలకు అండగా జగన్ నిలబడ్డారు. నాలుగున్నరేళ్ల లో ఏమేరకు అభివృద్ధి చేశామో ప్రజలు చూడాలని మంత్రి బొత్స కోరారు.
Comments
Please login to add a commentAdd a comment