
సాక్షి, విశాఖపట్నం: రేపు(బుధవారం) విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. విశాఖలో అదానీ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లకు సీఎం జగన్, గౌతమ్ అదానీ శంకుస్థాపన చేయనున్నారు. మధురవాడలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ పార్క్ - రూ.14,634 కోట్ల పెట్టుబడితో అదానీ సంస్థ ఏర్పాటు చేయనుంది.
130 ఎకరాల్లో 200 మెగావాట్ల డేటా సెంటర్, ఇంటిగ్రేటేడ్ పార్క్, స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు కానుంది. ప్రాజెక్ట్-1తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 24,990 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి. కాపులుప్పాడలో మరో డేటా సెంటర్, టెక్ పార్క్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కాపులుప్పాడలో రూ.7,210 కోట్లతో ఏర్పాటు కానున్న టెక్‌పార్క్ ద్వారా 20,450 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రెండు ప్రాజెక్టులతో విశాఖకు రూ.22 వేల కోట్ల పెట్టుబడులు సహా 45 వేల మందికి పైగా ఉద్యోగాలు దక్కనున్నాయి.
చదవండి: ‘చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలిసినా కాపులు కలవరు’
Comments
Please login to add a commentAdd a comment