సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది?.. సీఎం జగన్‌ ట్వీట్‌ | Andhra Pradesh Train Accident: CM YS Jagan Mohan Reddy Questioned Through Tweet Why Signaling System Failed - Sakshi
Sakshi News home page

సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది?.. సీఎం జగన్‌ ట్వీట్‌

Published Mon, Oct 30 2023 6:19 PM | Last Updated on Mon, Oct 30 2023 6:45 PM

Cm Jagan Questioned Through Tweet Why Signaling System Failed - Sakshi

సాక్షి, అమరావతి: సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైందని ట్వీట్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. రైళ్ల కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఎందుకు విఫలమైందని ప్రశ్నించిన సీఎం.. ఉన్నతస్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధానిని, రైల్వే మంత్రిని కోరారు.

‘‘దేశంలోని అన్ని మార్గాల్లోనూ ఆడిట్ జరగాల్సి ఉంది. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడాలి. నిన్న జరిగిన రైలు ప్రమాదం తీవ్రంగా బాధించింది. ప్రమాద ఘటన కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. బ్రేకింగ్, హెచ్చరిక వ్యవస్థలు ఎందుకు పనిచేయలేదు?’’ అంటూ ట్విట్టర్‌లో సీఎం జగన్‌ ప్రశ్నించారు.

విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ట్వీట్‌ చేశారు. ‘‘వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement