విజయనగరం రైలు ప్రమాదం.. అప్‌డేట్స్‌ | Andhra Train Accident: Vizianagaram Collision Rescue, Relief Operations Live Updates | Sakshi
Sakshi News home page

విజయనగరం ఘోర రైలు ప్రమాదం.. అప్‌డేట్స్‌

Published Mon, Oct 30 2023 6:59 AM | Last Updated on Mon, Oct 30 2023 9:35 PM

Andhra Pradesh Vizianagaram Train Collision Rescue Live Updates - Sakshi

విజయనగరం రైలు ప్రమాద ఘటన.. సహాయక చర్యల అప్‌డేట్స్‌

విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఓ ప్యాసింజర్‌ రైలు.. ఆగి ఉన్న మరో ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది. ఆపై పక్క ట్రాక్‌లోని గూడ్సుపైకీ దూసుకెళ్లి మరింత బీభత్సం చోటు చేసుకుంది. ఈ  ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, 54 మందికి గాయాల అయ్యాయని అధికారులు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతుండగా.. ఈ సాయంత్రం లోపే ట్రాక్‌ పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు.

17:40 PM
సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది?.. ట్వీట్ ద్వారా ప్రశ్నించిన సీఎం జగన్
►రైళ్ల కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఎందుకు విఫలమైంది?
►ఉన్నతస్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధానిని, రైల్వే మంత్రిని కోరిన సీఎం జగన్‌
►దేశంలోని అన్ని మార్గాల్లోనూ ఆడిట్ జరగాల్సి ఉంది
►ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడాలి
►నిన్న జరిగిన రైలు ప్రమాదం తీవ్రంగా బాధించింది
►ప్రమాద ఘటన కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది
►బ్రేకింగ్, హెచ్చరిక వ్యవస్థలు ఎందుకు పనిచేయలేదు?
 

17:24 PM
రైలు ప్రమాద ఘటనపై‌ సీఎం జగన్ ట్వీట్
►విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం.
►వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
►ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను.
►వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది.
►వారికి మంచి వైద్యం అందించాలి
► మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలి

16:06 PM
సీఎం జగన్‌ ఏరియల్‌ వ్యూ
►విజయనగరం: ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీఎం జగన్‌ ఏరియల్‌ వ్యూ
►విజయనగరం నుంచి విశాఖ వెళ్తూ పరిశీలించిన సీఎం జగన్‌

16:05 PM
విజయనగరం ప్రమాదస్థలిలో ట్రాక్‌ టెస్టింగ్‌ సక్సెస్‌
►పునరుద్ధరణ జరిగిన మార్గాల్లో విజయవంతంగా రైళ్లు నడిపిన అధికారులు
►డౌన్‌లైన్‌లో గూడ్స్‌.. అప్‌లైన్‌లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ పరిశీలన పూర్తి


 

14:22 PM
విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం జగన్‌
►ప్రమాద ఘటనకు సంబంధించిన ఫోటోలను పరిశీలించిన సీఎం
►అధికారుల నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం
►ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం
►ప్రమాదంలో గాయపడిన చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్‌
►రెండు వార్డుల్లో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరి దగ్గరకూ వెళ్లి పరామర్శించిన సీఎం
►వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం

14:08 PM
విజయనగరం చేరుకున్న సీఎం జగన్‌
►విజయనగరం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం జగన్‌ 
►విజయనగరం రైల్వే ప్రమాద ఘటన బాధితులకు కాసేపట్లో పరామర్శ
►ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించిన ఫొటోల ప్రదర్శన
►ఘటన గురించి సీఎం జగన్‌కు వివరిస్తున్న అధికారులు
►రైల్వే అధికారుల విజ్ఞప్తితో ఘటనా స్థలికి వెళ్లని సీఎం జగన్‌
►నేరుగా ప్రమాద బాధితుల్ని పరామర్శించనున్న సీఎం జగన్‌

13:23PM
విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్‌
►విశాఖ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న సీఎం జగన్‌
►కాసేపట్లో విజయనగరం ప్రభుత్వాసుపత్రికి
►రైలు ప్రమాదంలో గాయపడిన బాధితులకు పరామర్శ

12:44PM
బాధితుల బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి బొత్స
►రైలు ప్రమాద బాధితులకు ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేవరకు ప్రభుత్వం దే బాధ్యత
►విజయనగరం ప్రమాద ఘటన సహాయక చర్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందన
►బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
►మృతులు కుటుంబాలకు రూ. 10లక్షల ఆర్థికసాయం ఇస్తాం
►తీవ్రంగా గాయపడిన వాళ్లకు రూ. 2లక్షలు
►సాధారణ గాయాలైనవాళ్లకు రూ. 50 వేల సాయం
►ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది
►రైల్వే అధికార్ల సమన్వయంతో పనిచేస్తున్నాం 
►ట్రాక్ పునః నిర్మాణ పనులు కాసేపట్లోనే పూర్తి అవుతాయి

12:30PM
సీఎం జగన్‌ పర్యటనలో మార్పు
►సీఎం జగన్‌ విజయనగరం పర్యటనలో మార్పు
►కంటకాపల్లి ప్రమాద ఘటన స్థలం వద్ద పర్యటన రద్దు
►రైల్వే అధికారుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం 
►ఘటనా స్ధలంలో ప్రమాదానికి గురైన బోగీల్ని తొలగిస్తున్న అధికారులు 
►యుద్ద ప్రాతిపదినక ట్రాక్‌ పునురుద్ధరణ పనులు
►ముఖ్యమంత్రి ఘటనా స్ధలానికి వస్తే... ట్రాక్‌ పునరుద్ధరణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని వెల్లడి
►రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించనున్న సీఎం జగన్‌
►నేరుగా పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో వున్న హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్న సీఎం జగన్‌ 
►ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులకు పరామర్శ
:::జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి

12:18PM
విజయనగరం బయల్దేరిన సీఎం జగన్‌

►విజయనగరం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
►విశాఖకు.. అక్కడి నుంచి విజయనగరం ప్రమాద స్థలికి
►కాసేపట్లో రైలు ప్రమాద ఘటనా స్థలం పరిశీలన 
►గాయపడిన వారిని పరామర్శించనున్న సీఎం జగన్‌

12:05PM
విజయవాడ డివిజన్‌లో హెల్ప్‌లైన్‌ డెస్క్‌
►విజయవాడ రైల్వే జంక్షన్ పై రాయగడ రైలు ప్రమాద ప్రభావం
►విజయవాడ నుండి వెళ్ళే పలు రైళ్లు రద్దు
►విజయవాడ మీదుగా విశాఖ వెళ్లే రత్నాచల్, సింహాద్రి, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-పూరీ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు
►27 రైళ్లు రద్దు, 28రైళ్ళను మళ్లించిన రైల్వే అధికారులు
►విజయవాడ రైల్వే జంక్షన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
►ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్న హెల్ప్ డెస్క్
►ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు
►అనకాపల్లి, తుని, సామర్లకోట, కాకినాడ టౌన్‌, రాజమండ్రి, నిడదవోలు, ఏలూరు, భీమవరం టౌన్‌, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరుకు సంబంధించి నెంబర్లు
►ప్రమాదానికి సంబంధించిన సమాచారం కోసం అయినా సంప్రదించవచ్చొన్న రైల్వే అధికారులు
►ఇప్పటివరకు తమవాళ్లు లేదా రైలు ప్రమాదంలో ఉన్నట్టు తమకి ఒక్క ఫోన్ ఫోన్ రాలేదంటున్న అధికారులు

11:48AM
బాధితులకు మెరుగైన వైద్యం అందుతోంది: సీపీఎం రాఘవులు
►విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి లో రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన సీపీఎం నేత రాఘవులు
►గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందుతోంది.. వైద్యులకు అభినందనలు
►ఒడిశా బాలాసోర్‌ తరహా ఘటన మళ్లీ పునరావృతం అయ్యింది
►రైల్వే శాఖకు శిక్ష వేయాలి
►మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ 50 లక్షలు పరిహారం ఇవ్వాలి
►క్షతగాత్రులకు 25 లక్షలకు పరిహారం ఇవ్వాలి
►ఆదివారం కాకుండా మిగతా పని దినాల్లో అయితే వందల్లో చనిపోయే వారు
►రైల్వే సిగ్నలింగ్ లో లోపాలు వున్నాయి
►సిబ్బంది కొరత వలనే రైల్వే లో ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయి. 

11:29AM
కాసేపట్లో విజయనగరానికి సీఎం జగన్‌

►కాసేపట్లో విజయనగరం పర్యటనకు సీఎం జగన్
►విశాఖకు.. అక్కడి నుంచి కంటకాపల్లికి
►రైలు ప్రమాద ఘటనా స్థలం పరిశీలన
►చికిత్స పొందుతున్న వాళ్లకు పరామర్శ
►నేటి ఎస్.ఐ.పీ.బీ సమావేశం త్వరగా ముగించుకున్న సీఎం జగన్‌
►పలు పెట్టుబడులు, వివిధ పరిశ్రమల ప్రోత్సాహకాలకు ఆమోదం

11:10AM
విజయనగర ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం: ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే అధికారి
►విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలు
►వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు
►కంటకాపల్లి-అలమండ మధ్య నెమ్మదిగా వెళ్తున్న పలాస రైలును ఢీ కొట్టిన రాయగడ రైలు
►విజయనగర రైలు ప్రమాదం మానవ తప్పిదవల్లేనన్న ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ఆఫీసర్‌
►ప్రమాదంపై ఓ మీడియా ఛానెల్‌తోఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌ విశ్వజిత్‌ సాహూ
►రాయగడ ప్యాసింజర్‌ రైలు లోకో పైలట్ వల్లే ప్రమాదం జరిగింది
►రెడ్‌ సిగ్నల్‌ను రాయగడ లోకో పైలట్ పట్టించుకోలేదు
►ఫలితంగానే ఘోర ప్రమాదం సంభవించిందన్న అధికారి సాహూ
►అయితే దర్యాప్తు తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని స్పష్టీకరణ
►ఈ ప్రమాదంలో రాయగడ రైలు లోకో పైలట్ రావు కూడా మృతి

10:26AM
చురుగ్గా రైల్ ట్రాక్ పునఃనిర్మాణ పనులు
►విజయనగరం రైల్వే ప్రమాద ఘటనాస్థలంలో యుద్ధప్రాతిపాదికన చర్యలు
►140 టన్ ల బాహుబలి క్రేన్‌తో ధ్వంసమైన బోగీలు తొలగింపు
►ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
►ట్రాక్ పునఃనిర్మాణ పనులు, బాధితుల సౌకర్యాల పై ఘటనా స్థలం లో సమీక్ష చేసిన ఇంచార్జ్ మంత్రి బూడి ముత్యాల నాయుడు 


ప్రమాదంలో దెబ్బతిన్న విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తున్న రైల్వే ఎలక్ట్రికల్‌ సిబ్బంది

►సహాయక చర్యల పై జిల్లా అధికార యంత్రాంగాన్ని అర్ధరాత్రే అప్రమత్తం చేసిన సీఎం జగన్
►సీఎం ఆదేశాలతో ఘటనా స్థలం వద్ద 40 అంబులెన్సులులు సిద్దం
►గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించిన అధికార్లు
►మృత దేహాలను హుటాహుటిన గుర్తించి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ కి తరలింపు
►ప్రత్యేక వైద్యులను కేటాయించి త్వరితగతిన పోస్టుమార్టం
►బంధువులకు మృతదేహాలు అప్పగించి, వారి గ్రామాలకు ఉచిత రవాణా ఏర్పాటు
►వైద్య సేవలకు సంతృప్తి వ్యక్తం చేస్తున్న బాధితులు
►ఇవాళ మధ్యాన్నం విజయనగరానికి సీఎం జగన్‌ 
►రైలు ప్రమాద ఘటనా స్థలం పరిశీలించి, క్షతగాత్రులకు పరామర్శ 

10:23AM
క్షతగాత్రులకు మెరుగైన చికిత్స
►రైలు ప్రమాదంలో సహాయ చర్యల్లో వెయ్యి మంది రైల్వే సిబ్బంది
►మంచినీరు మందులు... ఆహర పదార్థాలతో నిన్న రాత్రి.. ఈరోజు ఉదయం విశాఖ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు
►ఐదుగురు విశాఖ వాసులకు విజయనగరం జిజిహెచ్ లో చికిత్స
►విశాఖలోని అపోలో ఒకరు.. కింగ్ జార్జ్ ఆసుపత్రలో  మరొకరికి  వైద్యం

10:18AM
నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి
►విజయనగరం రైలు ప్రమాదంపై నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి
►మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన భువనేశ్వరి

10:12AM
రైలు ప్రమాద ఘటనపై రాహుల్‌ గాంధీ స్పందన
►విజయనగరం రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి
►ఫేస్‌బుక్‌లో పోస్ట్‌
►మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం
►క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రాహుల్‌ గాంధీ

09:58AM
విజయనగర ప్రమాదం.. రాజమండ్రి స్టేషన్‌లో హెల్ప్‌డెస్క్‌
►విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదం
►రాజమండ్రి మెయిన్ రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన రైల్వే అధికారులు
►రద్దయిన, మళ్లించిన రైళ్ళ వివరాలపై ప్రయాణికులకు సమాచారం ఇస్తున్న రైల్వే సిబ్బంది
►ప్రమాద ఘటనలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మృతులు గాని గాయపడిన వారిపై సమాచారం లేదని తెలిపిన రైల్వే అధికారులు

09:40AM
విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాదంలో మృతుల పేర్లు
రావు, రాయగడ ప్యాసింజర్ లోకో పైలట్, విశాఖపట్నం
చింతల కృష్ణం నాయుడు
పిల్ల నాగరాజు
​​​​కంచుభరకి రవి (30), గోడికొమ్ము (గ్రామం), జామి (మండలం), విజయనగరం
గిడిజాల లక్ష్మి (35), ఎస్‌పీ రామచంద్రాపురం, జీ సిగడాం మండలం, శ్రీకాకుళం
కరణం అప్పలనాయుడు (45), కాపు సంబాం (గ్రామం), గరివిడి (మండలం), విజయనగరం
చల్లా సతీష్ (32), ప్రదీప్ నగర్, విజయనగరం
శ్రీనివాస్‌
టెంకల సుగుణమ్మ
రెడ్డి ససీతంనాయుడు
మజ్జి రాము
ఎం. శ్రీనివాస్‌ విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు గార్డు 
►మరో మృతదేహాం గుర్తించాల్సి ఉంది
►త్వరగతిన విజయనగరం ప్రభుత్వాసుప్రతిలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం

09:17AM
►విజయనగరం ఘోర రైలు ప్రమాదం.. 13కి చేరిన మృతుల సంఖ్య

09:04AM
బాధితుల్ని తక్షణమే ఆదుకునేలా ఏపీ సర్కార్‌ చర్యలు
►విజయనగరం రైలు ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాల్ని సత్వరమే ఆదుకునేలా ఏపీ ప్రభుత్వం అన్ని రకాలచర్యలు
►క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న ప్రభుత్వం
►మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం ప్రకటన 
►మృతుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం 
►తక్షణమే అందేలా చూడాలని సీఎం జగన్‌ ఆదేశాలు 
►బాధితులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర రైల్వే మంత్రికి ఫోన్‌లో వివరించిన సీఎం జగన్‌

08:54AM
ఘటనాస్థలానికి వెళ్లనున్న సీఎం జగన్‌
►విజయనగరం జిల్లా కంటాకపల్లి వద్ద ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం
►ఘటన గురించి తెలియగానే సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి
►రైల్వే శాఖ మంత్రితోనూ ఫోన్‌లో మాట్లాడిన సీఎం జగన్‌
►సీఎం జగన్‌ ఆదేశాలతో ఘటనాస్థలానికి వెళ్లిన మంత్రి బొత్స.. సహాయక చర్యల పర్యవేక్షణ
►నేడు ఘటనా స్థలానికి వెళ్లనున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
►ప్రత్యేక విమానంలో విశాఖకు.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఘటనాస్థలానికి
►అనంతరం చికిత్స పొందుతున్న క్షతగాత్రులనూ పరామర్శించనున్న సీఎం జగన్‌ 
►క్షతగాత్రుల్లో ఏపీ వాసులే అధికం

08:50AM
రైలు ప్రమాదం రీత్యా పలు రైళ్ల రాకపోకలు మళ్లింపు
►చెన్నై-సంత్రగచి(22808) ఎక్స్‌ప్రెస్‌
►హైదరాబాద్‌-షాలిమర్‌(18046) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌
►త్రివేండ్రం-షాలిమర్‌(22641) ఎక్స్‌ప్రెస్‌
►ఆగర్తల-బెంగళూరు(12504)ఎక్స్‌ప్రెస్‌
►సంత్రగచీ-తిరుపతి(22855)ఎక్స్‌ప్రెస్‌
►షాలీమర్‌-చెన్నై(12841) కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌
►ధన్‌బాద్‌-అలెప్పీ(13351) బొకరో ఎక్స్‌ప్రెస్‌
►హతియా-బెంగళూరు(12835)ఎక్స్‌ప్రెస్‌
►మంగళూరు-సంత్రగాచీ(22852) ఎక్స్‌ప్రెస్‌
►బెంగళూరు-హౌరా(12246) దురంతో ఎక్స్‌ప్రెస్‌
►బెంగళూరు-జశిద్ది(22305) ఎక్స్‌ప్రెస్‌
►కన్యాకుమారి-హౌరా(22503) ఎక్స్‌ప్రెస్‌
►చెన్నై-హౌరా(12840) ఎక్స్‌ప్రెస్‌
వాస్కోడిగామా-షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌

08:35AM
ఘటనా స్థలంలో ముమ్మురంగా సహాయ చర్యలు
►రైళ్ల రాకపోకల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికంగా కొనసాగుతున్న పనులు
►ప్రమాదానికి గురైన పలాస పాసింజర్ 11 భోగిలను అలమండ రైల్వే స్టేషన్ కు తరలించిన సిబ్బంది
►ప్రమాదానికి గురైన రాయగడ పాసింజర్ 9 బోగీలను కంటకాపల్లి రైల్వే స్టేషన్ కు తరలించిన రైల్వే సిబ్బంది
►వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్ ‍ప్రకటన
►ఘటనా స్థలం నుంచి దూరంగా వెళ్లాలని.. రైల్వే పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగించవద్దని ప్రజలకు అధికారుల విజ్ఞప్తి

08:21AM
కంటకాపల్లి - అలమండ మధ్య జరిగిన జరిగిన రైలు ప్రమాదంతో సోమవారం రద్దైన రైళ్ల వివరాలు
► కోర్బా - విశాఖపట్నం (18517) ఎక్స్‌ప్రెస్‌
►పారాదీప్ - విశాఖపట్నం (22809) ఎక్స్‌ప్రెస్‌
►రాయగడ - విశాఖపట్నం (08503)ప్యాసింజర్ స్పెషల్
► పలాస - విశాఖపట్నం (08531) ప్యాసింజర్ స్పెషల్
► విశాఖపట్నం - గునుపుర్ (08522)ప్యాసింజర్ స్పెషల్
►గునూపుర్ - విశాఖపట్నం (08521) ప్యాసింజర్ స్పెషల్
► విజయనగరం - విశాఖపట్నం (07469) మెము స్పెషల్
► విజయవాడ - విశాఖపట్నం (12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌
► విశాఖపట్నం - విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌
► గుంటూరు - విశాఖపట్నం (12739) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌
► కాకినాడ - విశాఖపట్నం (17267) మెము ఎక్స్‌ప్రెస్‌
► విశాఖపట్నం - కాకినాడ (17268) మెము ఎక్స్‌ప్రెస్‌
► రాజమండ్రి- విశాఖపట్నం (07466) మెము స్పెషల్
►విశాఖపట్నం - రాజమండ్రీ (07467) మెము స్పెషల్
►కోరాపుట్ - విశాఖపట్నం (08545) స్పెషల్
►విశాఖపట్నం - కోరాపుట్ (08546) స్పెషల్
► పలాస - విశాఖపట్నం (08531) స్పెషల్
► చెన్నై - పూరి (22860) ఎక్స్‌ప్రెస్‌
►రాయగడ - గుంటూరు (17244) ఎక్స్‌ప్రెస్‌

08:09AM
ట్రైన్ లోకో పైలట్ ఎం ఎస్ రావులు మృతి
►విజయనగరం రైలు ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన రాయగడ ట్రైన్ ఇంజన్‌
►ఇంజన్‌లో మృతదేహం.. లోకో పైలట్ ఎంఎస్‌ రావుగా గుర్తింపు
►తోటి ఉద్యోగి మరణంతో దిగ్భ్రాంతిలో రైల్వే ఉద్యోగులు

07:59AM
ఆయా స్టేషన్ల నుంచి బయల్దేరి.. దారి మళ్లిన రైళ్ల వివరాలివే..
►29న చెన్నై లో బయల్దేరిన చెన్నై - సంత్రగచి (22808) ఎక్స్‌ప్రెస్‌
►29న హైదరాబాద్ లో బయల్దేరిన హైదరాబాద్ - శాలిమర్ (18046)ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌
►28న త్రివేండ్రం లో బయల్దేరిన త్రివేండ్రం - షాలిమర్ (22641) ఎక్స్‌ప్రెస్‌
►28న అగర్తల లో బయల్దేరిన ఆగర్తల - బెంగళూరు (12504) ఎక్స్‌ప్రెస్‌
►29న శాలిమార్ లో బయల్దేరిన షాలిమర్- హైదరాబాద్ (18045) ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌
►29న సంత్రాగచి లో బయల్దేరిన సంత్రగచీ - తిరుపతి (22855) ఎక్స్‌ప్రెస్‌
►29న షాలిమర్ లో బయల్దేరిన షాలిమర్ - చెన్నై (12841) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌
►29న చెన్నై లో బయల్దేరిన చెన్నై - షాలిమర్ (12842) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌
►29న Dhanbad లో బయల్దేరిన Dhanbad - అలెప్పీ (13351) బొకారో ఎక్స్‌ప్రెస్‌ 
►29న హతియ లో బయల్దేరిన హతియా - బెంగళూరు (12835) ఎక్స్‌ప్రెస్‌
►28న మంగుళూరు లో బయల్దేరిన మంగుళూరు - సంత్రగాచి (22852) ఎక్స్‌ప్రెస్‌
►29న బెంగళూరు లో బయల్దేరిన bengaluru- హౌరా (12246) దురంతో ఎక్స్‌ప్రెస్‌
►29న తిరుపతి లో బయల్దేరిన తిరుపతి - హౌరా (20890) ఎక్స్‌ప్రెస్‌
►29న సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరిన సికింద్రాబాద్‌- హౌరా (12704) ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్‌
►29న బెంగళూరు లో బయల్దేరిన బెంగళూరు - హౌరా (12864) ఎక్స్‌ప్రెస్‌
►29న బెంగళూరు లో బయల్దేరిన బెంగళూరు - జశిద్ది (22305) ఎక్స్‌ప్రెస్‌
►28న కన్యాకుమారి లో బయల్దేరిన కన్యాకుమారి - హౌరా (22503) ఎక్స్‌ప్రెస్‌
►29న చెన్నయ్ లో బయల్దేరిన చెన్నయ్ - హౌరా (12840) మెయిల్
►29 న వాస్కోడగామ లో బయల్దేరిన వాస్కొడగమ - షాలిమార్ (18048) ఎక్స్ప్రెస్ లు వయా Kharagpur - ఝార్సుగుడ - రాయ్ పూర్ - విజయవాడ మీదుగా రాకపోకలు 
ఈ  19 రైళ్లు ఇవాళ (సోమవారం) విశాఖపట్నం మీదుగా నడవవు

07:42AM
►కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందారు
►రైలు ప్రమాదంలో 54 మంది క్షత గాత్రులయ్యారు
►క్షతగాత్రులంతా ఏపీకి చెందినవారే
►క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నాం
►32 మందికి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స
►విశాఖ ఎన్‌.ఆర్‌.ఐ. ఆసుప‌త్రిలో ఒక‌రిని, మెడిక‌వ‌ర్ ఆసుప‌త్రిలో ఇద్ద‌రిని చేర్పించాం
►నలుగురి పరిస్థితి విషమంగా ఉంది 
:::విజయనగరం కలెక్టర్‌ నాగలక్ష్మి

07:40AM
విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు నెంబర్లు
0891 2746330, 08912744619
►ఎయిర్టెల్
81060 53051
8106053052
►బీఎస్‌ఎన్ఎల్ 
8500041670
8500041671

07:32AM
►రైలు ప్రమాదం నేపథ్యంలో విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో హెల్ప్ లైన్
►జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రకటన
►కేజీహెచ్ క్యాజువాలిటీ 8912558494
►కేజీహెచ్ డాక్టర్ హెల్ప్ లైన్ నెంబర్ 8341483151
►కేజీహెచ్ కేసు క్వాలిటీ 8688321986
►ప్రయాణికుల క్షతగాత్రుల వైద్య సహాయం కోసం ఈ ఫోన్లను సంప్రదించాలని సూచన

06:31AM
►ఘటనా స్థలానికి చేరుకున్న బాహుబలి క్రేన్. చెల్లా చెదురు అయిన బోగీలను తొలగించే పనులు మరింత ముమ్మరం

06:02AM
►క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు
►రాత్రంతా కొనసాగుతూనే ఉన్న మూడు లైన్ ల ట్రాక్ పనులు, పునరుద్ధరణ పనులు
►అలమండ ప్రాంతంలో భారీ పోలీస్‌ బందోబస్తు
►మృతుల సంఖ్య, వివరాలని అంచనా వేస్తున్న అధికారులు
►విశాఖ, భువనేశ్వర్ నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్
►పదికి చేరిన మృతుల సంఖ్య
►మృతుల సంఖ్య పెరిగే అవకాశం

నేడు పలు రైళ్ల రద్దు
విజయనగరం రైలు ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు తెలిపారు. కోర్బా-విశాఖపట్నం, పారదీప్‌-విశాఖపట్నం, రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం-గుణుపూర్‌, గుణుపూర్‌-విశాఖపట్నం, విజయనగరం-విశాఖపట్నం రైళ్లు రద్దయ్యాయి.

బాధితుల కోసం సహాయక కేంద్రాలు
విజయనగరం సమీపంలో జరిగిన రైలుప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించేందుకు రైల్వే, విశాఖ జిల్లా అధికారులు సహాయక కేంద్రాలను (కంట్రోల్‌ రూం) ఏర్పాటుచేశారు. విశాఖ కేజీహెచ్‌లో, విమ్స్‌లో వైద్యబృందాలను కలెక్టర్‌ మల్లికార్జున అందుబాటులో ఉంచారు. విశాఖ నుంచి ప్రమాదస్థలికి అంబులెన్సులను పంపారు. బాధితులకు వైద్య సహాయార్థం హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటుచేశారు.

హెల్ప్‌లైన్‌ నంబర్లు

విజయనగరం కలెక్టరేట్‌: 94935 89157
విశాఖ కలెక్టరేట్‌: 90302 26621, 70361 11169, 08912 590102
కేజీహెచ్‌: 89125 58494, 83414 83151

వైద్యుడు (24 గంటలు అందుబాటులో ఉంటారు): 83414 83151

అత్యవసర విభాగం వైద్యుడు: 86883 21986

రైల్వే ఆధ్వర్యంలో..
భువనేశ్వర్‌: 06742301625, 06742301525, 06742303060, 06742303729 (టోల్‌ ఫ్రీ)
వాల్తేరు టెస్ట్‌ రూం: 89780 80805
సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ : 89780 80815
వాల్తేరు డివిజన్‌: 08942286245, 08942286213
అలమండ, కంటకాపల్లి: 89780 81960
విజయనగరం: 08922221206, 08922221202, 89780 80006
శ్రీకాకుళం రోడ్డు: 08942286213, 08922286245
ఏలూరు: 08812232267
సామర్లకోట: 08842327010
రాజమహేంద్రవరం: 08832420541
తుని: 08854252172

విశాఖ రైల్వేస్టేషన్‌లో..: 08912 746330; 08912 744619; 81060 53051; 81060 53052; 85000 41670; 85000 41671.


ప్రమాదం ఎందుకు జరిగింది?
విజయనగరం ఘోర ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్‌పై వెనుకనే విశాఖ నుంచి రాయగడ ప్యాసింజర్‌ 6 గంటలకు బయలుదేరింది. గంట వ్యవధిలోనే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్లిన పలాస రైలుకు సిగ్నల్‌ సమస్య ఎదురవ్వడంతోనే కంటకాపల్లి నుంచి చాలా నెమ్మదిగా రైలు ట్రాక్‌పై వెళ్లిందని అందులోని ప్రయాణికులు చెబుతున్నారు. ఈలోగా వెనుకనుంచి వచ్చిన రైలు ఢీకొన్నట్లు వివరిస్తున్నారు. 

కారుచీకట్లు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రమాదం తరువాత సహాయక చర్యలు చేపట్టిన యంత్రాంగం.. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బొగ్గు రవాణా రైలు, ట్యాంకరు రైలును ఆ ప్రాంతం నుంచి తరలించారు. అలాగే పలాస రైలులో ప్రమాదానికి గురైన బోగీలు మినహాయించి మిగిలిన బోగీలను తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వస్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను కంటకాపల్లిలో నిలిపివేశారు. ఆయా రైళ్లలో  ప్రయాణికులను రోడ్డు మార్గంలో తరలించారు. ప్రమాదానికి సిగ్నల్‌ సమస్య కారణమా? లేదంటే మానవ తప్పిదమా? అనేది తేలాల్సి ఉంది. 

ఏం జరిగింది.. 
విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రాయగడ రైల్లోని బోగీలు నుజ్జునుజ్జు కాగా, మరికొన్ని పట్టాలు తప్పాయి.   ప్రమాద ధాటికి రైలు ఇంజన్‌ సహా ఐదు బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి.  అక్కడే మరో ట్రాక్‌పైనున్న గూడ్సు రైలు బోగీలపైకి అవి దూసుకెళ్లాయి. దీంతో ఇక్కడ భీతావహం నెలకొంది. 

బాలేశ్వర్‌ తరహాలోనే.. 
ఈ ఏడాది జూన్‌లో జరిగిన బాలేశ్వర్‌ రైలు ప్రమాద సంఘటన మాదిరిగానే ఈ ప్యాసింజర్‌ రైళ్ల ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. పలాస గార్డు బోగీని రాయగడ ఇంజిను ఢీకొట్టడంతో ఆ రెండు నుజ్జయ్యాయి. ఈ వేగానికి రాయగడ బోగీలు ఏకంగా అదే రైలు ఇంజినుపైకి దూసుకెళ్లాయి. అదే సమయంలో పక్కన గూడ్సు రైలు వెళుతోంది. ప్రమాదం జరిగినప్పుడు రాయగడ రైలుకు చెందిన కొన్ని బోగీలు గూడ్సు రైలును ఢీకొన్నాయి. రెండు ప్యాసింజర్‌, గూడ్సు రైళ్లలో కలిపి ఐదు బోగీలు నుజ్జయ్యాయి. 

మృతుల కుటుంబాలకు ప్రధాని సాయం రూ.2 లక్షలు
విజయనగర రైలు ప్రమాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులందరినీ తరలించినట్లు అశ్వినీ వైష్ణవ్‌ ‘ఎక్స్‌’లో తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితోనూ ప్రధాని మాట్లాడారని, రైల్వే బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన వివరించారు.

సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి
విజయనగరం రైలు ప్రమాదంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.రైలుప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందినవారి కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇతర రాష్ట్రాలవారు మరణిస్తే రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ఘటన గురించి రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌తో ఆదివారం రాత్రి ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఘటనాస్థలికి మంత్రి బొత్స సత్యనారాయణను పంపామని, ప్రమాద విషయం తెలియగానే సహాయకబృందాలు అక్కడకు చేరుకున్నాయని వివరించారు. సహాయక చర్యల్ని స్థానిక కలెక్టర్‌, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారని, క్షతగాత్రుల్ని వివిధ ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement