Train accident Updates
►ఘటనా స్థలానికి చేరుకున్న యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్.. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ
►సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు
►రాయగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేశారు.
►08912746330, 08912744619, 8106053051, 8106053052, 8500041670, 8500041671లకు సంప్రదించవచ్చు.
►ఘటనాస్థలానికి చేరుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ.
►ఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాద స్థలికి విజయనగరం ఎస్పీ బయల్దేరారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
► రైలు ప్రమాదంలో ఒక బోగీలో చిన్నారులు ఇరుక్కుపోయారు. ఆర్తనాదాల మధ్య ప్రయాణికులు చీకటిలో చిక్కుకుపోయారు. ఎలక్ట్రికల్ సిబ్బంది, రైల్వే సహాయక సిబ్బంది, ఉన్నతాధికారులు ప్రత్యేక రైలులో ఘటనా స్థలికి చేరుకున్నారు.
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి రైలు ప్రమాదం జరిగింది. కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద పట్టాలపై ఉన్న విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలును పలాస-విశాఖ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయగడ ప్యాసింజర్ చివరి నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో అరుగురు మృతిచెందగా, పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
కాగా ఓవర్ హెడ్ కేబుల్ తెగడంతో విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలపై నిలిచిపోయింది. ఆగిపోయిన ప్యాసింజర్ రైలును పలాస ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సంఘటనా ప్రాంతం అంధకారంగా మారింది. కరెంట్ లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment