
పెందుర్తి: విశాఖ అర్బన్ టీడీపీ మాజీ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ శరగడం చినఅప్పలనాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి చినఅప్పలనాయుడును సాదరంగా ఆహ్వానించారు.
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ పాల్గొన్నారు. విశాఖ టీడీపీ అర్బన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న శరగడం.. ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్‌లపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న యూటర్న్‌లు నచ్చక, రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్‌తో జతకట్టడాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీకి శనివారం రాజీనామా చేసినట్లు తెలిపారు.